జనవరిలో రాష్ట్రస్థాయి భజన కీర్తన పోటీలు
భూదాన్‌పోచంపల్లి : పట్టణంలోని శ్రీ పాండురంగస్వామి భజనమండలి ఏర్పాటై 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జనవరి 4,5 తేదీల్లో భూదాన్‌పోచంపల్లిలో రాష్ట్రస్థాయి భజన కీర్తన పోటీలు నిర్వహించనున్నట్లు భజనమండలి అధ్యక్షుడు చక్రాల నర్సింహ తెలిపారు. భజనమండలి స్వర్ణోత్సవాల కరపత్రాలను శుక్రవారం భజనమండలి సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భజనమండలి స్థాపించినప్పటి నుంచి అనేక అధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పద్మశ్రీ గరికెపాటి నర్సింహారావు, చాగంటి కోటేశ్వర్‌రావు పాల్గొని ప్రవచనాలు వినిపిస్తారని పేర్కొన్నారు. జనవరి 6న శ్రీరుక్మిణి సమేత, పాండురంగస్వామి కల్యాణమహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. భజన కీర్తన పోటీల విజేతలకు ప్రథమ బహుమతి రూ.25వేలు, ద్వితీయ రూ.15వేలు, తృతీయ రూ.11వేలు, నాలుగో బహుమతి రూ.6వేలు, కన్సోలేషన్ బహుమతి రూ.5వేల చొప్పున అందజేస్తామన్నారు. పోటీల్లో పాల్గొనే వారు 9848836254, 9440579494, 9848799323 నంబర్లను సంప్రదించి డిసెంబర్ 25లోపు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భజనమండలి ఉపాధ్యక్షుడు భారత వెంకటేశ్, ప్రధాకార్యదర్శి పుప్పాల నాగేశ్వర్, సహాయ కార్యదర్శి దోర్నాల శ్రీనాథ్, కోశాధికారి కొంగరి పండరీనాథ్, సభ్యులు సీత సత్యనారాయణ, నోముల అశోక్, కటకం తుకారాం, దేవరకొండ అశోక్, చిట్టిపోలు గోవర్థన్, గుర్రం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment