శిశువుల దత్తత.. సులువైన మార్గం
భువనగిరిటౌన్ : శిశువుల దత్తతకు ప్రభుత్వం సులువైన మార్గం తీసుకువచ్చిందని, పిల్లలు లేని దంపతులు చట్టబద్ధత ప్రకారం శిశువులను దత్తత తీసుకోవాలని అదనపు కలెక్టర్ గంగాధర్ పేర్కొన్నారు. దత్తత కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న తమిళనాడుకు చెందిన పిల్లలు లేని దంపతులకు ప్రైవేట్ చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూషన్‌లో రక్షణ పొందుతున్న పదేళ్ల వయస్సు గల బాలికను సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం వారికి అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడు తూ.. సంతానం లేని దంపతులు శిశువుల దత్తత కోసం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి నర్సింహారావు, చైల్డ్‌కేర్ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment