గత సంవత్సరం (2024) ప్రారంభం రోజున యువత తీసుకున్న నిర్ణయాలు ఎంతో ఘనంగా ఉన్నా.. వాటిని అమలు చేయడంలో మాత్రం వెనుబడి పోయింది. ప్రత్యేకంగా లక్ష్యాలను నిర్దేశించుకోలేదని.. అనుకున్న వాటిలో కొంతమేర సాధించామని వెల్లడించారు. ఇక ఈ నూతన సంవత్సరంలో మాత్రం ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడాలని.. ప్రభుత్వ, ప్రైవేట్ ఏదైనా ఫర్వాలేదని చెప్పుకొచ్చారు. ఉద్యోగం సాధించలేని పక్షంలో స్వయం ఉపాధి చూసుకుంటామని దృఢంగా చెప్పడం ఆసక్తి కలిగించింది. కానీ.. సామాజిక సేవ చేయడానికి మాత్రం యువత పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇక మొబైల్‌తో గడిపే సమయం గతం (2023) కంటే ఎక్కువైందని పలువురు మొహమాటపడుతూ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment