సమగ్ర శిక్షణ ఉద్యోగుల మానవహారం | - | Sakshi
Sakshi News home page

సమగ్ర శిక్షణ ఉద్యోగుల మానవహారం

Published Fri, Jan 3 2025 2:15 AM | Last Updated on Fri, Jan 3 2025 2:15 AM

సమగ్ర శిక్షణ ఉద్యోగుల మానవహారం

సమగ్ర శిక్షణ ఉద్యోగుల మానవహారం

భువనగిరి టౌన్‌: తమను రెగ్యులరైజ్‌ చేయాలని కోరుతూ విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు భువనగిరి కలెక్టరేట్‌ ఎదుట నిర్వహిస్తున్న సమ్మె 24వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా గురువారం భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుంచి ప్రధాన రహదారి గుండా అంబేద్కర్‌ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం చౌరస్తాలో మానవహారం నిర్వహించి అంబేద్కర్‌ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మంగ పాండరి, దుర్గ, రమేశ్‌ వెంకటేశం పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement