గ్రామసభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక
భూదాన్‌పోచంపల్లి, సంస్థాన్‌నారాయణపురం, చౌటుప్పల్ రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26నుంచి అమలు చేయనున్న నాలుగు పథకాలకు గ్రామ, వార్డు సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు సభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భూదాన్‌పోచంపల్లి మండలం దేశ్ముఖిలో కొనసాగుతున్న సర్వేను ఆదివారం ఆయన తనిఖీ చేశారు. 160 సర్వే నంబర్లో ప్రభుత్వం భూమి, వెంచర్లు, గుట్టలు, సాగుకు యోగ్యంకాని భూములను పరిశీలించారు. తప్పులకు తావివ్వకుండా నిర్ణీత గడువులో సర్వే పూర్తిచేయాలని సిబ్బందికి సూచించారు. అదే విధంగా సంస్థాన్‌నారాయణపురం మండలం కోతులాపురం, చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారంలో తనిఖీ చేసి సిబ్బందికి సలహాలు, సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిణి వనజాత, తహసీల్దార్లు నాగేశ్వర్రావు, కృష్ణ, హరికృష్ణ, ఎంపీడీఓలు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు
Comments
Please login to add a commentAdd a comment