కొందరికే ఆత్మీయ భరోసా!
రామన్నపేట : భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీలకోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం జిల్లాలో కొందరికే వర్తించే అవకాశం ఉంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకా రం చాలా కుటుంబాలకు ఆర్థిక సాయం అందే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలోని 421 పంచాయతీల్లో 1,38,856 కుటుంబాలు ఉపాధిహామీ పథకంలో జాబ్‌కార్డులు కలిగి ఉ న్నాయి. మొత్తం కూలీలు 2,63,368 మంది ఉన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో 54,365 కుటుంబాల వారు 20 రోజుల పనిదినాలు చేసి ఉన్నారు. వారిలో 16,927 కుటుంబాలకు మాత్రమే భూ మి లేదు. మొత్తం జాబ్‌కార్డులు కలిగిన కుటుంబాల్లో భూమి లేని వారు 12శాతం మాత్రమే. అధికారులు ఇప్పటికే గ్రామాల వారీగా సిద్ధం చేసిన జాబితా ప్రకారం ఆధార్, బ్యాంక్ అకౌంట్ నంబర్లను లింక్ చేస్తున్నారు.
ఇవీ కారణాలు
జాబితాలోని కుటుంబాలకు సంబంధించి తాతలు, తల్లితండ్రుల పేరిట భూమి ఉండి వారసత్వంగా భూమి సంక్రమించే వారి వివరాలు, మైనర్ల పేరిట భూములు ఉన్నాయా? అనే వివరాలు సేకరిస్తున్నారు. గ్రామాల వారీగా సిద్ధం చేసిన జాబితాలో అటువంటి వారు ఎవరైనా ఉంటే గ్రామసభల్లో తెలియపరచి తొలగించే అవకాశం ఉన్నది. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్సన్ పొందుతున్న రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన కుటుంబాల వివరాలను సేకరిస్తున్నారు. ఇదిలా ఉండగా గతంలో ప్రభుత్వం వివిధ రూపాల్లో ఇచ్చిన భూముల్లో చాలా వరకు సాగుకు యోగ్యం కానివే ఉన్నాయి.
ఫ అడ్డంకిగా ప్రభుత్వ మార్గదర్శకాలు
ఫ 20 రోజులు పని దినాలున్న
కుటుంబాలు 54,365
ఫ 16,927 కుటుంబాలకే
సాయం అందే అవకాశం
లబ్ధిదారులను తగ్గించే ప్రయత్నం తగదు
నిబంధనల పేరుతో ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపథకం లబ్ధిదారులను తగ్గించే ప్రయత్నం చేయడం తగదు. చాలా గ్రామాల్లో ప్రభుత్వం ఇచ్చిన భూములు సాగుకు యోగ్యంగా లేవు. జాబ్‌కార్డు కలిగిన ప్రతీ కుటుంబానికి, భూమిలేని పేదలకు, సాగుకు యోగ్యంకాని భూములు కలిగిన వారందరికీ ఆత్మీయ భరోసాను అందజేయాలి. కనీస పనిదినాల నిబంధన తొలగించాలి.లేనిపక్షంలో చాలామంది ఆత్మీయ భరోసా కోల్పోతారు.
– కొండమడుగు నర్సింహ, జిల్లా ప్రధాన
కార్యదర్శి, వ్యవసాయ కార్మిక సంఘం
Comments
Please login to add a commentAdd a comment