‘మీ టికెట్‌’లో మన ప్రాంతం | - | Sakshi
Sakshi News home page

‘మీ టికెట్‌’లో మన ప్రాంతం

Published Mon, Jan 20 2025 1:42 AM | Last Updated on Mon, Jan 20 2025 1:43 AM

‘మీ ట

‘మీ టికెట్‌’లో మన ప్రాంతం

ఉమ్మడి జిల్లాలో

చోటు కల్పించిన ప్రదేశాలు..

ఫ బోటింగ్‌ విభాగంలో నాగార్జునసాగర్‌లో బోట్ల ప్రయాణాలకు సంబంధించి నాగార్జునకొండకు వెళ్లేందుకు, జాలీట్రిప్స్‌కు పిల్లలకు పెద్దలకు టికెట్‌ రేట్ల వివరాలు, మిర్యాలగూడలోని చెరువులో బోటింగ్‌ రేట్ల వివరాలను మీటికెట్‌ యాప్‌లో ఉంచారు.

ఫ నాగార్జునసాగర్‌లో బుద్ధవనంలో పార్కింగ్‌ ఫీజు, ప్రవేశ రుసుం (పిల్లలకు పెద్దలకు) వివరాల ఉన్నాయి.

నాగార్జునసాగర్‌ : రాష్ట్రంలోని దేవాలయాల్లో దైవదర్శనాలు, విహారయాత్రల విశేషాలను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘మీ టికెట్‌’ యాప్‌ తీసుకొచ్చింది. ప్రముఖ దేవాలయాల్లో దర్శనం, పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, పర్యాటక స్థలాల్లో ఎంట్రీ ఫీజు, బోట్లలో ప్రయాణ రుసుం ఇలాంటి వివరాలను యాప్‌ ద్వారా ఎక్కడినుంచైనా తెలుసుకోవచ్చు. ఈ యాప్‌లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పలు ప్రదేశాలను కూడా చేర్చారు.

యాప్‌ను ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

తెలంగాణ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ సర్వీసెస్‌ డెలివరీ వారు రూపొందించిన ‘మీ టికెట్‌’ యాప్‌ను ముందుగా ఫ్లేస్టోర్‌ నుంచి డౌన్లోడ్‌ చేసుకోవాలి. అనంతరం ఫోన్‌ నంబర్‌ నమోదు చేసి అకౌంట్‌లో పిన్‌ నంబర్‌ జనరేట్‌ చేసుకోవాలి. మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని నమోదు చేసిన ఫోన్‌ నంబర్‌, పిన్‌ నంబర్‌ కొట్టి లాగిన్‌ కాగానే అన్ని అంశాలు మనకు కనిపిస్తాయి.

యాప్‌లో ఏముంటాయంటే..

మీ టికెట్‌ యాప్‌ ద్వారా అన్ని రకాల టికెట్లను ఒకే ప్లాట్‌ఫాం పైకి తెచ్చారు. తెలంగాణలోని 15 ప్ర ముఖ దేవాలయాలు, 129 పార్కులు, 54 బోటింగ్‌ ప్రదేశాలు, జంతు ప్రదర్శనశాలలు, మెట్రో, ఆర్టీసీ, మ్యూజియాలు, ఫ్లే అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ జోన్స్‌కు సంబంధించి టికెట్లు తీసుకునే వెసులుబాటు కల్పించారు.

యాప్‌లో చేర్చాల్సినవి..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం మీటికెట్‌ యాప్‌లో యాదగిరిగుట్ల నృసింహుడి ఆలయాన్ని మాత్రమే ఉంచారు. ఇంకా చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయాలు, దర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. వాటిని కూడా ఈ యాప్‌లో చేర్చాల్సి ఉంది. నల్లగొండలోని ఛాయా, పచ్చల సోమేశ్వరాలయాలు, వాడపల్లి, నాగార్జునసాగర్‌, మట్టపల్లి, ఉండ్రుగొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాలు, పిల్లలమర్రి శివాలయాలు, చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయంతోపాటు.. నాగార్జునసాగర్‌ నుంచి శ్రీశైలం వెళ్లే లాంచీ వివరాలు, నాగార్జునసాగర్‌లోని విజయవిహార్‌ వివరాలను యాప్‌లో నమోదు చేస్తే ఎంతోమందికి ఉపయోగంగా ఉంటుంది.

ఫ ఆలయాలు, విహారయాత్రల వివరాలు తెలిపేలా ప్రత్యేక యాప్‌

ఫ వాటి విశేషాలు, టికెట్ల రుసుం

తెలుసుకునే అవకాశం

ఫ యాప్‌లో నాగార్జునసాగర్‌,

యాదగిరిగుట్ట, మిర్యాలగూడకు చోటు

No comments yet. Be the first to comment!
Add a comment
‘మీ టికెట్‌’లో మన ప్రాంతం 1
1/2

‘మీ టికెట్‌’లో మన ప్రాంతం

‘మీ టికెట్‌’లో మన ప్రాంతం 2
2/2

‘మీ టికెట్‌’లో మన ప్రాంతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement