42ఏళ్ల తరువాత అపూర్వ కలయిక
తుంగతుర్తి: మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన 1980 –81, 1981–82 టెన్త్ బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వివిధ గ్రామాలకు చెందిన వారంతా 42 ఏళ్ల తరువాత ఒక్కచోట చేరి తమ చిన్ననాటి జ్ఙాపకాలు నెమరువేసుకున్నారు. ఒకరినొకరు తమ, తమ క్షేమాలను తెలుసుకున్నారు. అనంతరం తమకు బోధించిన ఉపాధ్యాయులను మండల కేంద్రంలోని రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, ఆకారపు రామయ్య, పూర్వ విద్యార్థులు సంకినేని రవీందర్‌రావు, వర్థెల్లి శ్రీహరి, గుండగాని శ్రీహరి, రాథకృష్ణ, మేనేని వేణు, నిరంజన్‌రెడ్డి, సుమతీ, విష్ణు, కోదాటి వెంకన్న, బుద్ద వీరయ్య, దాసు, బుద్ద సోమయ్య, కర్ణాకర్, కాంతయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment