అర్హులందరికీ రేషన్ కార్డులు
భువనగిరి టౌన్ : అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌కార్డులు ఇప్పిస్తానని, ఆ బాధ్యత తానే తీసుకుంటానని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వదంతులను నమ్మవద్దని, నిజమైన లబ్ధిదారులను గుర్తించి న్యాయం చేస్తామన్నారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను సైతం పరిగణలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అర్హతలు కలిగి పేర్లు రాని వారుంటే అధికారులను కలిసి తెలియజేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26నుంచి కొత్తగా నాలుగు పథకాలు అమలు చేయనుందని, అర్హులను గుర్తించేందుకు సర్వే ముమ్మరంగా కొనసాగుతుందన్నారు. ప్రజలంతా సర్వే సిబ్బందికి సహకరించాలని కోరారు.
నేడు ప్రజావాణి రద్దు
భువనగిరి : కలెక్టరేట్‌లో సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ హనుమంతరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో యంత్రాంగం నిమగ్నమై ఉన్నందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు గమనించాలని కోరారు.
ముగ్దుంపల్లి టీచర్‌కు ఉత్తమ అవార్డు
బీబీనగర్ : మండలంలోని ముగ్దుంపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఇంగ్లిస్ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న నిర్మల సౌత్ ఇండియా ఉమెన్ ఇన్సిఫరేషన్ ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు స్వీకరించారు. శారద ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అమెకు అవార్డు ప్రదానం చేశారు. విద్యారంగంలో విశిష్ట సేవలు అందించినందుకు గుర్తింపుగా ఆమెను అవార్డుకు ఎంపిక చేశారు.
వైద్యసిబ్బందిని పెంచాలి
బీబీనగర్ : బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రిలో వైద్యసిబ్బందిని పెంచాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ కోరారు. ఆదివారం బీబీనగర్ మండల కేంద్రంలో నిర్వహించిన సీపీఎం నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఎయిమ్స్‌లో సరిపడా వైద్యసిబ్బంది లేకపోవడంతో రోగులకు పూర్తిస్థాయిలో సేవలు అందడంలేదన్నారు.పూర్తిస్థాయిలో వైద్యసిబ్బందిని నియమిస్తేనే లక్ష్యం నెరవేరుతుందన్నారు. సమావేశంలో నాయకులు చంద్రారెడ్డి, గాడి శ్రీనివాస్, దేవేందర్‌రెడ్డి, ఉమర్, సత్తీష్, యాదమ్మ, రామచంద్రారెడ్డి, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
నృసింహుడికి ఆరాధనలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున సుప్రఽభాత సేవ చేపట్టిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూలకు నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్ర హ్మోత్సవం, అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం జోడు సేవను భక్తుల మధ్య ఊరేగించారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయాన్ని ద్వార బంధనం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment