పట్టణాలకు కొత్త రూపు
భారీగా వ్యాపార సముదాయాలు
పట్టణాల్లో కార్పొరేట్ స్థాయి ఆస్పత్రులు, మల్టీపర్పస్ షాపింగ్ మాల్స్, వస్త్ర దుకాణా లు, హోటళ్లు, ఫుడ్ కోర్టులు, సూపర్ మార్కె ట్లు, రకరకాల మార్ట్‌లు వెలుస్తున్నాయి. దీంతో నగర కల్చర్ సంతరించుకోవడంతో ప్రజల జీవనశైలిలో మార్పులు వస్తున్నాయి. ఆయా దుకాణాల్లో వస్తువుల కొనుగోళ్లకు వెనకాడటం లేదు. ప్రధానంగా భువనగిరి, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, ఆలేరు పట్టణాల్లో వ్యా పార లావాదేవీలు రోజూ రూ.కోట్లలో జరుగుతుండడం పట్టణీకరణకు అద్దం పడుతోంది.
భువనగిరి పట్టణ వ్యూ
భువనగిరి : పట్టణాల దశదిశ మారుతోంది. జీవనశైలి, ఆర్థిక, సామాజిక, విద్య, ఉద్యోగ, ఉపాధి, వ్యాపారపరంగా చోటు చేసుకుంటున్న మార్పులతో జనం పట్టణబాట పడుతున్నారు. దీంతో ఏటేటా జనాభాతో పాటు పట్టణ విస్తీర్ణం పెరుగుతోంది. భౌగోళిక స్వరూపం సైతం మారుతోంది.
ఆరు మున్సిపాలిటీలు
పునర్విభజనకు ముందు జిల్లాలో భువనగిరి మున్సిపాలిటీ మాత్రమే ఉండేది. 2016లో జిల్లాల పునర్విభజన జరిగింది. అనంతరం 2018లో కొత్తగా చౌటుప్పల్, యాదగిరిగుట్ట, ఆలేరు, మోత్కూరు, భూదాన్‌పోచంపల్లి మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం యాదాద్రి జిల్లాలో 7.12 లక్షల జనాభా ఉండగా.. ప్రస్తుతం 8 లక్షలకు పైగా చేరింది. మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసిన పట్టణాల్లో 2011 జనాభా లెక్కల ప్రకారం 1.46 లక్షల జనాభా ఉండగా.. ప్రస్తుతం 2.17లక్షలకు పైగా ఉంది. మొత్తం జనాభాలో సుమారు 20 శాతం జనాభా పట్టణ ప్రాంతాల్లోనే ఉంది.
పల్లె నుంచి పట్టణానికి
పిల్లల చదువులు, ఉపాధి,ఉద్యోగ, వ్యాపార రీత్యా జనం ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉండటానికి ఇష్టపడుతున్నారు. పట్టణాల్లో ప్లాట్లు కోనుగోలు చేసి అక్కడే గృహాలు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. వ్యవసాయం ఉన్నవారు అక్కడి నుంచే బావుల వద్దకు వెళ్లి తిరిగి సాయంత్రానికి పట్టణాలకు చేరుకుంటున్నారు. మరికొందరు ఉద్యోగ రీత్యా పట్టణాల్లో ఉంటూ పనిచేసే ప్రాంతాలకు రోజూ వెళ్లి వస్తున్నారు. వీరితో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు బతుకుదెరువు నిమిత్తం ఇక్కడికి వస్తున్నారు. రానున్న ఐదేళ్లలో జిల్లాలోని పట్టణాల జనాభా 30 శాతం దాటే అవకాశం లేకపోలేదు.
గుట్టలో సదుపాయాలు పెరిగాయి
యాదగిరిగుట్ట పట్టణం మున్సిపాలిటీగా ఏర్పడిన అనంతరం వివిధ ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వచ్చి స్థిరపడుతున్నారు. ప్లాట్లు కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకుంటున్నారు. దీంతో జనాభాతో పాటు పట్టణ విస్తీర్ణం పెరి గింది. మౌలిక వసతులు పెద్దఎత్తున సమకూరుతున్నాయి. – కళ్లెం కృష్ణ, యాదగిరిగుట్ట
పోచంపల్లిలో ఎంతో మార్పు వచ్చింది
పోచంపల్లి పట్టణం మున్సిపాలిటీగా ఏర్పడి ఐదేళ్లవుతోంది. అప్పటికి ఇప్పటికి ఎంతో మార్పు వచ్చింది. పట్టణ విస్తీర్ణం పెరిగింది. రోడ్ల వెడల్పు చేశారు. డ్రెయినేజీ, నీటి సదుపాయాలు రెట్టింపయ్యాయి.
– చింతకింది కిరణ్, భూదాన్‌పోచంపల్లి
జనాభా వివరాలు ఇలా..
మున్సిపాలిటీ 2011 లెక్కల ప్రస్తుత
ప్రకారం జనాభా జనాభా
భువనగిరి 59,844 70,542
చౌటుప్పల్ 31,202 58,611
యాదగిరిగుట్ట 12,874 24,546
ఆలేరు 17,120 25,245
పోచంపల్లి 9,549 17.548
మోత్కూర్ 15,512 20,612
వేగంగా పట్టణీకరణ
జీవనశైలి, ఆర్థిక, సామాజిక,
విద్య, ఉపాధిలో మార్పులు
పట్టణాల్లో నివసించడానికి
ఆసక్తి చూపుతున్న జనం
ఏటేటా పెరుగుతున్న విస్తీర్ణం,
మారుతున్న భౌగోళిక స్వరూపం
భువనగిరిలో నగరం తరహా కల్చర్
భువనగిరి పట్టణంలో హైదరాబాద్ తరహాలో అపార్టుమెంట్లు, నివాసగృహాలు వెలుస్తున్నాయి. వ్యా పార సముదాయాలు పెద్ద ఎత్తున ఏర్పాటయ్యాయి. ప్రజల అభిరుచి మేరకు అన్ని రకాల వస్తువులు లభిస్తున్నాయి. పిల్లల చదువులు, ఉద్యోగం, వ్యాపార నిమిత్తం పల్లెల నుంచి ప్రజలు పట్ట ణా నికి వస్తున్నారు. – దిడ్డి బాలాజీ, భువనగిరి
Comments
Please login to add a commentAdd a comment