భూదాన్‌పోచంపల్లి : పట్టణంలోని నేతాజీ చౌరస్తా నుంచి బీబీనగర్ వెళ్లే రహదారిపై ఇదీ పరిస్థితి. ఎదురెదురుగా వాహనాలు వస్తే ముందుకు కదల్లేని దుస్థితి. గంటల తరబడి ట్రాఫిక్‌జామ్. మూడేళ్ల క్రితం రోడ్డు విస్తరించినా ఎప్పటిలాగే ఉంది. దుకాణదారులు రోడ్డును ఆక్రమించడంతో పాటు ఇరువైపులా ద్విచక్రవాహనాలు, ఆటోలు నిలుపుతుండడంతో ట్రాఫిక్ సమస్య జఠిలమవుతోంది. ఉదయం, సాయంత్రం వేళ చుక్కలు చూడాల్సిందే. వారాంతపు సంత రోజు అడుగుతీసి అడుగుపెట్టలేని విధంగా ఉంటుంది. ఎస్‌బీఐ, కెనరా బ్యాంకు, వైన్స్‌ల ఎదుటా అదే సీన్. కోట్ల రూపాయలతో రోడ్డును డబుల్ లేన్‌గా విస్తరించినా ఫలితం లేకపోవడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment