యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం సంప్రదాయ పూజలు వైభవంగా నిర్వహించారు. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన వంటి పూజలు చేపట్టారు. ఆ తర్వాత ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలు నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు భక్తులచే జరిపించారు. సాయంత్రం వేళ వెండి జోడు సేవలను మాఢవీధిలో ఊరేగించారు.
4న జిల్లా స్థాయి సోషల్ స్టడీస్ టాలెంట్ టెస్ట్
భువనగిరి: ఈ నెల 4న జిల్లా స్థాయి సోషల్ స్టడీస్ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సోషల్ స్టడీస్ టీచర్స్ ఫోరం జిల్లా అధ్యక్షుడు అధ్యక్ష, కార్యదర్శులు ఉక్కుర్తి లక్ష్మణ్, గంటెపాక యాదగిరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భువనగిరిలోని బీచ్‌మహల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాల, చౌటుప్పల్ మండలం తంగడపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో ఉదయం 10 గంటలకు తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో పరీక్ష నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీహెచ్‌ఎస్, కేజీబీవీ, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు ఈ పరీక్షకు హాజరు కావచ్చని తెలిపారు. విజేతలకు ప్రథమ బహుమతి కింద రూ.1,116, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన ఇద్దరికి ఒక్కొక్కరికీ రూ.516 చొప్పున నగదు బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఉపాధ్యాయులకు, విద్యార్థులకు భోజన వసతి ఏర్పాటు చేశామని, పూర్తి వివరాలకు సెల్ :9505509688, 9912351879 నంబర్‌లను సంప్రదించాలని కోరారు.
స్టాఫ్‌నర్సు పోస్టులకు
దరఖాస్తుల ఆహ్వానం
నల్లగొండ టౌన్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని నేషనల్ హెల్త్ మిషన్ పాలియేటివ్ కేర్ విభాగంలో ఖాళీగా ఉన్న నాలుగు స్టాఫ్ నర్స్ పోస్టులకు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేయడానికి ఎంఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 3 నుంచి 7వ తేదీ వరకు సాయంత్రం 5 గంటలలోగా డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో రూ.200 రుసుముతో దరఖాస్తులు అందజేయాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఎండీ.యూసూఫ్ ఫోన్ నంబర్ (9052813786)ను సంప్రదించాలని సూచించారు.
హమాలీ కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలి
భువనగిరి: సివిల్ సప్లయ్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న హమాలీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చి వారికి న్యాయం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు కోరారు. హమాలీల కూలిరెట్ల పెంపు జీఓను విడుదల చేయాలని కోరుతూ గురువారం భువనగిరి పట్టణంలోని సివిల్ సప్లయ్ గోడౌన్ వద్ద సివిల్ సప్లయ్ హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టి రెండో రోజు సమ్మెకు ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు. సివిల్ సప్లయ్ హమాలీ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. నిత్యావసర ధరల పెరుగుదలకు అనుగుణంగా హమాలీల కూలి రెట్లను పెంచాలన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కారయ్యే వరకు సీపీఐ అండగా ఉంటుందన్నారు. సమ్మెలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ.ఇమ్రాన్, జిల్లా కార్యవర్గ సభ్యుడు సామల శోభన్‌బాబు, సివిల్ సప్లయ్ హమాలీ యూనియన్ భువనగిరి పాయింట్ అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు బస్వయ్య, జగన్, స్వామి, సత్యనారాయణ, గణేష్, చంద్రయ్య, పాండరి, కిష్టయ్య, రాజు, పరశురాములు, స్వామి, నరేస్, శాంతమ్మ, అంజమ్మ, శారద, శోభ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment