రైతుల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం
భువనగిరి: రైతుల సంక్షేమమే లక్ష్యంగా కేంద్రం ప్రభుత్వం పనిచేస్తోందని బీజేపీ జిల్లా అద్యక్షుడు పాశం భాస్కర్ అన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు అందిస్తున్న పెట్టుబడి సహాయం పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గురువారం బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో భువనగిరి మండలంని హన్మాపురం గ్రామంలో నరేంద్రమోదీ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్ గుప్తా, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్‌రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు సాదినేని ఉపేందర్, మండల ప్రధాన కార్యదర్శి మాటూరి అనిల్‌గౌడ్, కిసాన్‌మోర్చా మండల అధ్యక్షుడు మాణిక్యంరెడ్డి రాములు, మణికంఠ, శ్రీనివాస్, వెంకటేష్, నాగరాజు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment