గండికోట లోగో, ట్యాగ్‌లైన్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

గండికోట లోగో, ట్యాగ్‌లైన్‌ ఆవిష్కరణ

Published Tue, Oct 22 2024 1:56 AM | Last Updated on Tue, Oct 22 2024 1:56 AM

గండికోట లోగో, ట్యాగ్‌లైన్‌ ఆవిష్కరణ

గండికోట లోగో, ట్యాగ్‌లైన్‌ ఆవిష్కరణ

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : గండికోట వారసత్వం, సంస్కృతి ప్రతిబింబించే విధంగా సృజనాత్మకమైన లోగో, ట్యాగ్‌లైన్‌నుజిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ అదితిసింగ్‌, వైఎస్సార్‌జిల్లా పర్యాటక సాంస్కృతిక శాఖ అధికారి సురేష్‌కుమార్‌ అధికారికంగా ప్రకటించారు. లోగో డిజైన్‌ పోటీలో గెలుపొందిన తుషార్‌ సివాంకర్‌ను అభినందించారు. గండికోటలో పర్యాటకం పెంచడమే కాకుండా గండికోట అందించే ప్రత్యేక అనుభవాలను హైలెట్‌ చేయడం కోసం రూపొందించారని సురేష్‌కుమార్‌ తెలిపారు.

ఇన్‌చార్జి కలెక్టర్‌తో ఎయిర్‌ఫోర్స్‌ అధికారుల భేటీ

కడప సెవెన్‌రోడ్స్‌ : ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు సోమవారం ఇన్‌ఛార్జి కలెక్టర్‌ అదితిసింగ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగ అవకాశాలకు యువతకు ఆహ్వాన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తాము జిల్లాకు వచ్చామని నాన్‌ కమిషన్డ్‌ అధికారులు ఎన్‌.సందీప్‌, సురేంద్రసింగ్‌లు తెలిపారు. ఈ సందర్భంగా ఐఏఎఫ్‌ కిట్‌ను ఇన్‌ఛార్జి కలెక్టర్‌కు అందజేసి ఆమె చేతుల మీదుగా పోస్టర్‌ను ఆవిష్కరింపజేశారు. ఆ తర్వాత అన్నమయ్య ఇంజనీరింగ్‌ కళాశాల, ఎస్‌కేఆర్‌ అండ్‌ ఎస్‌కేఆర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఐఏఎఫ్‌ అధికారులు యువతకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వీరితోపాటు జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్‌కుమార్‌, నెహ్రూ యువ కేంద్ర జిల్లా అధికారి శ్రీమణికంఠ, స్టెప్‌ అధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement