జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిద్దాం
కలెక్టర్ శ్రీధర్
కడప సెవెన్‌రోడ్స్: ఆకాంక్ష జిల్లాల (ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్) ఆశయాలకు అనుగుణంగా అధికారులు జిల్లాను ప్రగతి పథంలో నడిపించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ బోర్డు రూమ్ హాలు నుంచి కలెక్టర్ అధ్యక్షతన ‘ఆకాంక్ష జిల్లాల ఆశయసాధనలో భాగంగా జిల్లాలో కార్యాచరణ, ప్రగతి‘పై సంబందిత శాఖల జిల్లా అధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ‘నీతి ఆయోగ్‘ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కొన్ని ఆకాంక్ష జిల్లాలను ఎంపిక చేసిందన్నారు. ఇందులో మన జిల్లా కూడా ఉందన్నారు. అందులో భాగంగా ఆయా జిల్లాల్లో సామాజిక స్థాయిని(అభివృద్ధి) ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకురావడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. అందుకోసం సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. సంతృప్త స్థాయిలో నిర్దేశిత లక్ష్యం మేరకు సాధించిన ప్రగతి ఆధారంగా ప్రోత్సాహకాలను కూడా భారీ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఆ మేరకు ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అన్ని శాఖల పరిధిలో కొరత ఉన్న సౌకర్యాలు, సదుపాయాలు, అవసరాలను ఎప్పటికప్పుడు సంపూర్తి చేయాలన్నారు.
● ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నాగరాజు, డిఆర్డీఏ పీడీ ఆనంద్ నాయక్,ఐసిడిఎస్ అధికారిని శ్రీలక్ష్మి, సీపీఓ వెంకటరావు, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజరు జనార్ధన్, ఏపీఎంఐపి పీడీ వెంకటేశ్వర రెడ్డి,తదితర అనుబంధ శాఖల అధికారులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment