డైట్ బిల్లులు అందకపోవడంతో ఇబ్బందులు
హెచ్‌డబ్ల్యూఓ (హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్)కు సక్రమంగా డైట్ బిల్లులు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం డైట్ బిల్లులను సక్రమంగా అందించాలి. ప్రస్తుతం సరుకుల ధరలు పెరిగినందున అందుకు అనుగుణంగా డైట్ చార్జీలు పెంచాలి. టెండర్ల ద్వారా సరుకులను సరఫరా చేస్తే బాగుంటుంది.
– రామలింగారెడ్డి, అధ్యక్షుడు,
జిల్లా బీసీ హెచ్‌డబ్ల్యూఓ అసోసియేషన్
హాస్టళ్లను గాలికొదిలేసిన ప్రభుత్వం
ప్రభుత్వ ఎస్సీ, బీసీ, ఎస్టీ హాస్టళ్లలో సమస్యలు అధికంగా ఉన్నాయి. బీసీ, ఎస్సీ హాస్టళ్లు చాలా వరకు కాలపరిమితి దాటిన అద్దె భవనాల్లో సాగుతున్నాయి. డైట్ బిల్లులను పెంచాలి. హాస్టల్ విద్యార్థుల కంటే ఖైదీలకు ఇచ్చే డైట్ బిల్లులు మెరుగ్గా ఉన్నాయి. ప్రభుత్వ హస్టళ్ల పరిరక్షణను పాలకులు గాలికొదిలేశారు.
– గుజ్జుల వలరాజు, జిల్లా కార్యదర్శి, ఏఐఎస్‌ఎఫ్.
ఎస్సీ విద్యార్థుల అభ్యున్నతికి కృషి
ఎస్సీ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తున్నాం. విజయరామరాజు కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఎస్సీ హాస్టళ్లలో రూ.6 కోట్లతో మరమ్మతు పనులు చేపట్టాం. ఆయన హయాంలోనే సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. విద్యార్థుల విద్యాభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం. – కె.సరస్వతి, డిప్యూటీ డైరెక్టర్,
జిల్లా సాంఘిక సంక్షేమశాఖ
Comments
Please login to add a commentAdd a comment