అంగన్వాడీ కేంద్రాలలో మరుగుదొడ్ల నిర్మాణాలు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని బోర్డ్ మీటింగ్ హాల్‌లో అంగవ్వాడి కేంద్రాలలో మరుగుదొడ్ల నిర్మాణం, నీటి వసతి ల పై ఐసీడీఎస్, ఆర్డబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్ శాఖల అధికారులతో సమావేశం జరిగింది. ఈ సంధర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలలో మరుగుదొడ్ల నిర్మా ణాలు డిసెంబర్ 31 లోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ శ్రీలక్ష్మి, ఆర్‌డబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment