●దుర్భర పరిస్ధితులు...
● జిల్లా కేంద్రమైన కడప ప్రకాశ్‌నగర్‌లోని బీసీ కళాశాల హాస్టల్‌లో ఇంటర్మీడియేట్, ఆపైన చదివే విద్యార్థులు దాదాపు 130 మందికి పైగా ఉన్నారు. ఇక్కడ సరిపడా మరుగుదొడ్లు లేవు. అదే సందర్భంలో ఉన్న వాటికి తలుపులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతు న్నారు. అలాగే ఆ ప్రాంతమంతా దుర్వాసన వెదజల్లుతోంది. కాగా, పట్ట పగలే హస్టల్‌లోని గదు లు కారుచీకట్లు కమ్ముకున్న విధంగా ఉన్నాయి. కొన్నిమార్లు భోజనం సక్రమంగా ఉండదనే అభిప్రాయాన్ని పలువురు విద్యార్థులు వ్యక్తం చేశారు. టీటీడీ కల్యాణ మండపం వద్ద ఉన్న ఎస్సీ నెంబరు–3 బాలుర హాస్టల్‌లో సరిపడ స్నానపు గదులు లేకపోవడంతో విద్యార్థులు ఆరుబయట స్నానం చేస్తున్నారు.
● జమ్మలమడుగు బీసీ బాలికల హాస్టల్‌లో కిటికీలు లేకపోవడంతో వాటికి కర్టెన్లుగా బట్టలు కప్పారు. చెదలు కారణంగా కిటికీలు దెబ్బతినడంతో వాటిని అధికారులు పట్టించుకోలేదు. కనీసం బాలికలు అన్న స్పృహ కూడా లేకపోవడం శోచనీయం. అలాగే బీసీ కళాశాల హాస్టల్ ప్రైవేటు భవనంలో నడుస్తోంది. ఎర్రగుంట్లలో హాస్టల్ లేకపోవడంతో పేద విద్యార్థులు వసతి కోసం ఇబ్బందులు పడుతున్నారు.
● బద్వేలులో 40 ఏళ్ల కిందట నిర్మించిన బీసీ హాస్టల్ శిథిలావస్థకు చేరింది. ఇందులో చాలా గదులు మూతపడ్డాయి. ఇక్కడున్న 97 మంది బాలురు అసౌకర్యానికి గురవుతున్నారు. ఇక్కడే ఉన్న మరో ఎస్సీ బాలుర, బీసీ బాలికల కళాశాల హాస్టళ్లు అద్దె భవనాల్లో అరకొర సౌకర్యాల మధ్య విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అట్లూరు బీసీ హాస్టల్‌లో రిజిస్టర్‌లో 58 మంది ఉంటే, అక్కడ 21 మంది ఉన్నారు. సోమవారం రాత్రి విద్యార్థులకు ఆహారంలో గుడ్డును ఇవ్వ లేదు. పోరుమామిళ్ల ఎస్సీ బాలుర హాస్టల్‌లో 100 మంది విద్యార్థులు ఉంటున్నారు. ఈ భవనం శిథిలావస్థకు చేరింది. బి.కోడూరులోని బీసీ బాలుర హాస్టల్ అద్దె భవనంలో నడుస్తోంది. ఇక్కడ సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు బహిర్భూమికి ఆరుబయటకి వెళుతున్నారు. కాశినాయన మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర హాస్టల్ ప్రైవేటు భవనంలో నడుస్తోంది. ఇందులో 100 మంది విద్యార్థులు ఉంటే ఒక మరుగుదొడ్డి, ఒక బాత్‌రూము మాత్రమే ఉంది. ప్రొద్దుటూరులోని పొట్టిపాడు రోడ్డులోగల ఎస్సీ బాయిస్ హాస్టల్‌లోనే కళాశాల హాస్టల్ కూడా నడుస్తోంది. ఇక్కడ నీటి కొరత సమస్యగా ఉంది. మోడెంపల్లె ఎస్సీ బాలుర హాస్టల్‌లో ప్రహారీ పడగొట్టడంతో రక్షణ లేకుండా పోయింది.
● పులివెందులలోని నల్లపురెడ్డిపల్లె బీసీ బాలుర హాస్టల్‌లో మరుగుదొడ్ల సమస్య ఉంది. మైదుకూరు పరిధికి సంబంధించి ఖాజీపేటలోని ఎస్సీ, బీసీ బాలుర హాస్టళ్లలో మరుగుదొడ్ల సమస్య అధికంగా ఉంది. అలాగే కమలాపురానికి సంబంధించి బీసీ బాలుర కళాశాల హాస్టల్ అద్దె భవనంలో నడుస్తోంది. ఇక్కడ కూడా కనీస సౌకర్యాలు లేవు.
Comments
Please login to add a commentAdd a comment