కడప కోటిరెడ్డిసర్కిల్ : రాయలసీమలో ఏర్పాటైన వివిధ సంస్థలను అమరావతికి తరలించాలని చూస్తే సీమలోని అన్ని పార్టీల, ప్రజాసంఘాల ప్రతినిధులను ఐక్యం చేసి ప్రత్యక్షంగా ఉద్యమి స్తామని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర హెచ్చరించారు. మంగళవారం స్థానిక వైఎస్సార్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. అరకొర పరిశ్రమలు, సంస్థలను రాయలసీమలో నెలకొల్పితే, కూటమి ప్రభుత్వం వాటిని అమరావతికి తరలించుకుపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కడప శివార్లలోని కొప్పర్తి పారిశ్రామికవాడలోని ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ను అమరావతికి తరలించడానికి జీఓ తీసుకు వచ్చారని, కర్నూలు లో మానవ హక్కుల, లోకాయుక్త కార్యాలయం, సీబీఐ కోర్టు, బ్యాంకుల విలీనం పేరుతో కడపలోని ఆంధ్ర గ్రామీణ ప్రగతి బ్యాంక్ అమరావతికి తరలించాలని చూస్తున్నారని వారు మండిపడ్డారు. స్వాతంత్య్రం వచ్చిన కాలం నుంచి ఒక నంద్యాల రైలు మార్గం తప్ప మరొక రైలు మార్గం అంటే తెలియని స్థితిలో సీమ వాసులు ఉన్నారన్నారు.
పాలకులకు సీమ నీటి ప్రాజెక్టుల మాటే పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌సీపీ నగర కార్యదర్శి మగ్బూల్‌బాష, లోక్‌సత్తా, జనతాదళ్ నాయకులు ప్రతాప్ రెడ్డి, కృష్ణయ్య, విద్యుత్ రిటైర్డ్ నాయకులు గుర్రప్ప, దళిత గిరిజన హక్కుల పోరాట సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు వెంకటేష్, మడగలం ప్రసాద్, రమేష్, ఓబులేసు పాల్గొన్నారు.
సీపీఐ, ఆర్‌సీపీ నేతల హెచ్చరిక
Comments
Please login to add a commentAdd a comment