‘ఉపాధి’ కింద రహదారుల నిర్మాణం
● పంచాయతీరాజ్ ఎస్‌ఈ శ్రీనివాసులురెడ్డి
కడప సెవెన్‌రోడ్స్: ఉపాధి హామీ పథకం కింద గ్రామీ ణ ప్రాంతాల్లో సిమెంటురోడ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజనీరు జీవీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో రాయచోటి, రాజంపేట, కోడూరు, కమలాపురం, మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాలకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఏఈలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఏపీ ఆర్‌ఆర్‌పీ అబ్జర్వర్లు కె.ప్రభాకర్‌రెడ్డి, వై.నరసింహారావు నాణ్యతా ప్రమాణాలతో రహదారుల నిర్మాణం ఎలా చేపట్టాలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ మైదుకూరు నియోజకవర్గంలో 205 రోడ్డు పనులను రూ. 1235.28 లక్షలతో చేపడుతున్నామన్నారు. కమలాపురం నియోజకవర్గంలో 282 రోడ్డు పనులను రూ.1630 లక్షలతో చేపడుతున్నామని వెల్లడించారు. బద్వేలు నియోజకవర్గంలో 213 పనులను రూ. 1406 లక్షలతో, పులివెందుల నియోజకవర్గంలో 91 రోడ్లను రూ. 525.04 లక్షలతో, జమ్మలమడుగు నియోజకవర్గంలో 130 రోడ్లను రూ.1934.35 లక్షలతో, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 77 పనులను రూ. 850.04 లక్షలతో చేపడతామన్నారు. గ్రామసభల ద్వారా వెండార్స్‌ను ఎంపిక చేసి పనులను అప్పగించనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment