పంటల బీమా చెల్లింపు ప్రక్రియ ప్రారంభం
కడప అగ్రికల్చర్ : జిల్లాలో పంటల బీమా పథకం రబీ 2024–25 సంవత్సరానికి పంటల వారిగా ప్రీమియం చెల్లింపు నమోదు ప్రక్రియ ప్రారంభమైందని జిల్లా వ్యవసాయ అధికారి అయితా నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రీమియం చెల్లింపునకు పంట రుణ గ్రహీతలు నేరుగా బ్యాంకు ద్వారా మాత్రమే చెల్లింపు జరపాలన్నారు. రబీలో బ్యాంకు ద్వారా పంట రుణాలు పొందని రైతులు కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా నేరుగా ప్రీమియం చెల్లించాలన్నారు. నేరుగా ప్రీమియం చెల్లించు రైతులు ఆధార్, బ్యాంకు పాస్‌బుక్, పట్టదారు పాసుపుస్తకం, పంట ఽధ్రువీకరణ పత్రం, ఆధార్ అనుసంధానమైన మొబైల్ నంబర్ వివరాలను జతపరుస్తూ కామన్ సర్వీస్ సెంటర్‌లో నమోదు చేసుకోవాలన్నారు. లేదంటే రైతులే స్వయంగా ఎన్‌సిఐపి పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ప్రీమియం డిసెంబర్ 15వ తేదీలోపు చెల్లించాలని ఆయన సూచించారు.
డిసెంబర్ 15వ తేదీ వరకు గడువు
జిల్లా వ్యవసాయ అధికారి
అయితా నాగేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment