అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పేద చిన్నారులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు నాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అంగన్వాడీ కేంద్రాలపై దృష్టి సారించారు. అలాగే వాటి అభివృద్ధి కోసం ప్రీ ప్రైమరీ–1, ప్రీ ప్రైమరీ–2 కిట్లను అందించారు. వీటిని ఆకర్షణీయమైన బొమ్మలతో చిన్నారులకు పుస్తకాలపై ఇష్టం కలిగి చదువుకునేందుకు శ్రద్ధ కనబరిచేలా తయారు చేయించారు. అలాగే ప్రైవేటు పాఠశాలల తరహాలో చదువు చెప్పించడంతోపాటు ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించే విధంగా ఏర్పాట్లు చేయించారు. 3, 4 సంవత్సరాల చిన్నారులకు ఇంగ్లీషు, లెక్కలు, స్పోకెన్ ఇంగ్లీషు, యాక్టివిటీ, డ్రాయింగ్‌కు సంబంధించిన ఐదు పుస్తకాలతో కూడిన ప్రీ ప్రైమరీ–1 కిట్లను అందించారు. అలాగే 4, 5 సంవత్సరాల వయస్సు కలిగిన చిన్నారులకు ఇవే ఐదు పుస్తకాలతో కూడిన ప్రీ ప్రైమరీ –2 కిట్లను అందించి, అలాగే ఆ పుస్తకాలపై కార్యకర్తలకు శిక్షణ కూడా ఇచ్చారు. ఈ విధంగా నాటి ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలపై ప్రత్యేక దృిష్టి సారించింది.
Comments
Please login to add a commentAdd a comment