గత సర్వసభ్య సమావేశం జరిగినప్పుడు ప్రతి ఒక్కరి గుర్తింపు కార్డులు ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసి లోపలికి అనుమతించిన పోలీసులు...అధికార పార్టీ నాయకులు, కార్యకర్తల పట్ల కొంత ఉదాసీనత ప్రదర్శించినట్లు తెలుస్తోంది. అందువల్లే చాలామంది కౌన్సిల్ సమావేశం ఎదురుగా ఉన్న మరో సమావేశ మందిరంలో ఉండి నినాదాలు చేశారు. మరికొందరు సమావేశ మందిరం లోపలికి సైతం చొరబడ్డారు. వీరికితోడు వందల సంఖ్యలో టీడీపీ నాయకులు కింద గేటు వద్ద ఆందోళన చేసి ఘర్షణ వాతావరణం సృష్టించారు. ఈసారి ఆ తరహా పొరపాట్లకు తావివ్వకుండా కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు, మీడియా ప్రతినిధులను మాత్రమే అనుమతించేలా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.
నేడు కార్పొరేషన్ వద్ద 144 సెక్షన్ అమలు
కడప అర్బన్: కడప కార్పొరేషన్ వద్ద సోమవారం జనరల్ బాడీ సమావేశం జరగనున్న నేపథ్యంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని కడప వన్‌టౌన్ సీఐ రామకృష్ణ తెలిపారు. కడప నగరంలో ఇప్పటికే పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉందని తెలిపారు. కార్పొరేషన్ ఎదుట నలుగరి కంటే ఎక్కువ మంది ఉంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment