ఆధిక్యంలో ఆంధ్రా జట్టు | - | Sakshi
Sakshi News home page

ఆధిక్యంలో ఆంధ్రా జట్టు

Published Mon, Jan 27 2025 8:11 AM | Last Updated on Mon, Jan 27 2025 8:11 AM

ఆధిక్

ఆధిక్యంలో ఆంధ్రా జట్టు

కడప ఎడ్యుకేషన్‌ : కడప నగరంలోని వైఎస్‌ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్‌ మైదానంలో నిర్వహిస్తున్న కల్నల్‌ సీకే నాయుడు అండర్‌–23 మల్టీడేస్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో ఆంధ్రా బౌలర్లు రాణించారు. ఆదివారం బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ జట్టు 45.1 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్‌ అయింది. జట్టులోని సలీల్‌ అరోరా 29, క్రిష్‌భగత్‌ 21 పరుగులు చేశారు. ఆంధ్రా బౌలర్లు సాకేత్‌రామ్‌ 4, కె.ఎస్‌.రాజు 4 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆంధ్రా జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 27 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. జట్టులోని ఎస్‌.డి.ఎన్‌.వి. ప్రసాద్‌ 36, వెంకటరాహుల్‌ 21 పరుగులు చేశారు. పంజాబ్‌ బౌలర్లు ఆయుష గోయల్‌ 3, క్రిష్‌భగత్‌ 2 వికెట్లు తీశారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్రా జట్టు 177 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

రాణించిన బౌలర్లు

No comments yet. Be the first to comment!
Add a comment
ఆధిక్యంలో ఆంధ్రా జట్టు1
1/2

ఆధిక్యంలో ఆంధ్రా జట్టు

ఆధిక్యంలో ఆంధ్రా జట్టు2
2/2

ఆధిక్యంలో ఆంధ్రా జట్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement