తలనీలాల కోసం 4న వేలంపాట
సిద్దవటం: మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా నిత్యపూజ స్వామికి భక్తులు సమర్పించుకునే తలనీలాల పోగు హక్కు కోసం ఈనెల 4న బహిరంగ వేలం పాట నిర్వహించనున్నారు. సిద్దవటంలోని రంగనాయక స్వామి ఆలయంలో మంగళవారం ఉద యం 11 గంటలకు వేలంపాట జరుగుతుందని ఆలయ ఈఓ మోహన్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిత్యపూజ స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు జరగుతాయన్నారు. వేలం పాటలో పాల్గొనే వారు ధరావత్తు కింద లక్ష రూపాయలు చెల్లించాలన్నారు. మిగిలిన షరతులను వేలం పాట సమయంలో తెలియజేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment