హుదూద్ పెను తుపాను ప్రభావంతో అపార నష్టం బారిన పడ్డ ప్రజలకు తగిన సహాయ సహకారాలు అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ప్రజలు కష్టాల్లో ఉన్నారని.. ఈ సమయంలో అందరూ సహకారం అందించాలన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. లోతట్టు ప్రాంతాల ఇళ్లలోని నీళ్లను జనరేటర్లు పెట్టి తొలగిస్తున్నామన్నారు. ఈ సాయంత్రానికి తుపాను బాధితులకు 25 కిలోల బియ్యం, 5 లీటర్ల కిరోసిన, కిలో చక్కెర చొప్పున అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
Published Mon, Oct 13 2014 4:10 PM | Last Updated on Fri, Mar 22 2024 11:21 AM
Advertisement
Advertisement
Advertisement