Beauty
-
మృదువైన చేతులు... ముచ్చటేసే ముఖం కోసం...!
చలికాలంలో సౌందర్య రక్షణ కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. శీతగాలుల వల్ల చర్మం పొడిబారినట్టు అవుతుంది. ముఖంలో కాంతి తగ్గిపోతుంది. అందుకే ఇంట్లో దొరికే వస్తువులతో కొన్ని టిప్స్ పాటిస్తే, మృదువైన చేతులు, చందమామ లాంటి మోము సొంతం అవుతుంది. వీటితో పాటు సమతుల ఆహారం, చక్కటి వ్యాయామం, తగినన్ని నీళ్లు తాగడం, మంచి నిద్ర వీటిని మాత్రం అస్సలు మర్చిపోకూడదు! బ్యూటీ టిప్స్స్పూన్ గ్లిజరిన్, స్పూన్ ఆలివ్ ఆయిల్, స్పూన్ నిమ్మరసం తీసుకుని వాటిని బాగా కలిపి చేతులకి రాసుకుంటే చేతులు మృదువుగా ఉంటాయి.రాత్రి పడుకోబోయే ముందు పెట్రోలియమ్ జెల్లీలో కొద్దిగా కార్బాలిక్ యాసిడ్ కలిపి ఆ మిశ్రమాన్ని చేతులకి మర్దనా చేస్తూ ఉంటే క్రమేపీ చేతులు తెల్లగా... మృదువుగా మారతాయి.కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత కడిగేసు కోవాలి. తర్వాత శెనగపిండితో గానీ, నలుగుపిండితో గానీ ముఖం రుద్దుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే కొద్దిరోజుల్లోనే ముఖ చర్మం మృదువుగా అవుతుంది.కొత్తిమీర, పుదీనా మెత్తగా నూరి చర్మానికి రాస్తే నల్లమచ్చలు తొలగి పోతాయి. రోజూ రాత్రి పడుకునే ముందు తేనె, నిమ్మరసం కలిపి రాస్తే చర్మంపై మచ్చలు తగ్గిపోతాయి.ఓట్మీల్ పౌడర్ టీ స్పూన్ తీసుకుని అందులో ఆరెంజ్ జ్యూస్ కలిపి ముఖం, చేతులు, మెడకు ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత కొద్దిగా నీళ్లు చల్లి వలయాకారంగా మర్దన చేసి ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ఇలా వారానికోసారి చేస్తుంటే చర్మం కాంతివంతంగా ఉంటుంది.బాగా పండిన అరటిపండు గుజ్జు టేబుల్ స్పూన్ తీసుకుని అందులో ఐదారు చుక్కల తేనె కల పాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు రాసి వలయాకారంగా మర్దన చేయాలి. మిశ్రమంలోని తేమ ఇంకే వరకు మర్దన చేసి, ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ఇది పొడి చర్మానికి ఈ కాలంలో మంచి ఫలితాన్నిస్తుంది. క్రమం తప్పకుండా కొన్ని రోజుల పాటు చిటికెడు పసుపు, మీగడ కలిపి ముఖానికి రాసుకుని అరగంట తర్వాత స్నానం చేయాలి ఇలా చేస్తుంటే మచ్చలు, చారల్లాంటివి తొలగి ముఖం మృదువుగా నిగనిగలాడుతుంటుంది. -
ప్రసవానంతర చర్మ సంరక్షణ కోసం..!
డిజైనర్, నటి మసాబా గుప్తా ఎప్పటికప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలను నెటిజన్లతో షేర్ చేసుకుంటుంటారు. అలానే తాజాగా ప్రసవానంతర చర్మ సంరక్షణకు సంబంధించి.. కొన్ని ఆసక్తికర చిట్కాలను షేర్ చేశారు. నిజానికి ప్రసవానతరం చర్మం వదులుగా అయిపోయి..అందవిహీనంగా ఉంటుంది. మెడ వంటి బాగాల్లో ట్యాన్ పేరుకుపోయి ఒకవిధమైన గరుకుదనంతో ఉంటుంది. అలాంటప్పుడు నటి మసాబా చెప్పే ఈ చిట్కాలను పాటిస్తే సులభంగా కాంతివంతమైన మెరిసే చర్మాన్ని పొందొచ్చు. అదెలాగో చూద్దామా..!.ప్రసవానంతరం జీవితం అందంగా సాగిపోవాలంటే ఈ బ్యూటీఫుట్ చిట్కాలను తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు మసాబా. అవిసె గింజలు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా మంచిదని చెబుతోంది. ముఖ్యంగా ఈ అవిసె గింజలు, పెరుగు, తేనెతో కూడిన ఫేస్ ప్యాక్‌తో కాంతివంతమైన చర్మాన్ని ఈజీగా పొందొచ్చని అంటోంది. ఈ మూడే ఎందుకు..?అవిసె గింజల పొడి: దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ సమృద్ధిగా ఉంటుంది. ఇది ముఖంపై ఉండే ఎరుపు ర్యాష్‌లను తగ్గించడం తోపాటు ఫ్రీ రాడికల్స్‌తో కూడా పోరాడుతోంది. ఇందులో ఉండే ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ చర్మాన్ని హైడ్రేటెడ్‌గా చేసి, బొద్దుగా ఉండేలా చేస్తుంది. అలాగే మలినాలను తొలగించి చర్మా ఆకృతిని మెరుగుపరుస్తుంది. అందువల్లే దీన్ని ఎక్స్‌ఫోలియేటింగ్ ఏజెంట్ అని కూడా పిలుస్తారు. తేనె: ఇది తేమను లాక్ చేస్తుంది. చర్మం మృదువుగా చేసి, మొటిమలను నివారిస్తుంది. ముఖంపై ఉండే ఒక విధమైన చికాకుని తగ్గించేలా యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ముఖ్యంగా నిస్తేజమైన చర్మానికి పోషణనిచ్చి పునురుజ్జీవంప చేసి సహజమైన కాంతిని అందిస్తుంది. పెరుగు: ఇది లాక్టిక్ యాసిడ్‌తో నిండి ఉంటుంది. ముఖంపై ఉండే సున్నితమైన ఎక్స్ఫోలియంట్, మృతకణాలను తొలగించి చర్మానికి అద్భుతమైన మెరుపుని అందిస్తుంది. దీని ప్రోబయోటిక్స్ చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. పోడి లేదా సున్నితమైన చర్మానికి ఇది బెస్ట్. ఈ ఫేస్ ప్యాక్ తయారీ..అవిసె గింజల పొడి: 1 టేబుల్ స్పూన్పెరుగు: 1 టేబుల్ స్పూన్ తేనె : 1 టేబుల్ స్పూన్ఈ మూడింటిని ఒక బౌల్లోకి తీసుకుని చక్కగా కలిపి ముఖం, మెడ భాగాల్లో సమానంగా అప్లై చేయాలి. ఇలా సుమారు 15 నుంచి 20 నిమషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో కడగండి. ఇక్కడ అవిసెగింజల పొడిని తాజాదనం కోల్పోకుండా మంచి డబ్బాలో నిల్వ చేసుకోవడం మంచిది. View this post on Instagram A post shared by Masaba 🤎 (@masabagupta)(చదవండి: శిఖర్ ధావన్ ఫిట్నెస్ సీక్రెట్ తెలిస్తే కంగుతినాల్సిందే..!) -
పెదవులు బొద్దుగా కనిపించాలంటే..!
ఇంట్లో దొరికే వాటినే సౌందర్య సాధనాలుగా ఉపయోగించుకుని అందాన్ని సంరక్షించుకోవడం చూశాం. వాటిల్లో ఎక్కువగా సెనగపిండి, బియ్య పిండి, మొక్కల ఆధారితమైనవే. ఇక్కడొక ఇన్ఫ్లుయెన్సర్ ఏకంగా పచ్చిమిర్చి కూడా అందానికి ఉపయోగపడుతుందంటూ ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఢిల్లీకి చెందిన శుభంగి ఆనంద్ అనే ఇన్ఫ్లుయెన్సర్ వివాదాస్పదమైన బ్యూటీ టిప్‌ని షేర్ చేసింది. అందులో పచ్చిమిరపకాయలతో లిప్‌స్టిక్ వేసుకున్నట్లు చూపించింది. సహజమైన బొద్దు పెదవుల కోసం ఇది ప్రయత్నించమంటూ తన అనుభవాన్ని షేర్ చేసుకుంది. అయితే ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. View this post on Instagram A post shared by SHUBHANGI ANAND 🧿👑 (@shubhangi_anand__) View this post on Instagram A post shared by SHUBHANGI ANAND 🧿👑 (@shubhangi_anand__)strong> ఘాటుతో ఉండే పచ్చిమిర్చి వంటివి చర్మానికి హాని కలిగించేవని. ఇలాంటి పిచ్చిపిచ్చి టిప్స్ షేర్ చేయొద్దని తిట్టిపోశారు. పెద్దాలు బొద్దుగా ఉండటం అటుంచితే..అవి కాలిన గాయాల వలే వాచిపోయి అసహ్యంగా మారతాయని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. అయినా అందానికి సంబంధించినవి సమంజసంగా హానికరం కానివి పెట్టాలి. ఏదో సోషల్ మీడియా క్రేజ్ కోసం ఇలా చేస్తే..వ్యూస్ రావడం మాట దేవుడెరగు అస్సలు ఆ అకౌంట్‌కి సంబంధించిన వీడియోలను అసహ్యించుకునే ప్రమాదం లేకపోలేదు.(చదవండి: నడవలేనంత అనారోగ్య సమస్యలతో వినోద్ కాంబ్లీ: ఆ వ్యాధే కారణమా..?) -
ఏఐ బ్యూటీషియన్ రంగాన్ని కూడా శాసించగలదా..?
ఏఐ సాంకేతికత ప్రపంచాన్నే మారుస్తోంది. ప్రస్తుతం ఏఐ విద్యా, వైద్య, మార్కెటింగ్,సేల్స్, ఫైనాన్స్ , కంటెంట్ క్రియేషన్ వంటి పలు రంగాలను ప్రభావితం చేసింది. దీంతో ఇక భవిష్యత్తులో ఉద్యోగాలు ఉంటాయా? అనే భయాన్ని రేకెత్తించేలా శరవేగంగా దూసుకుపోతుంది. ఇక మిగిలింది సౌందర్యానికి సంబంధించిన బ్యూటిషయన్ రంగం ఒక్కటే మిగిలి ఉంది. ఇందులో కూడా ఆ సాంకేతికత హవా కొనసాగుతుందా అంటే..సందేహాస్పదంగా సమాధానాలు వస్తున్నాయి నిపుణుల నుంచి. ఎందుకంటే చాలా వరకు మానవ స్పర్శకు సంబంధించిన రంగం. ఇంతకీ ఈ సాంకేతికత ప్రభావితం చేయగలదా? అలాగే ఈ రంగంలో ఏఐ హవాను తట్టకునేలా ఏం చెయ్యొచ్చు.. బ్యూటీషియన్ రంగంలో ఐఏ సాంకేతిక వస్తే.. సరికొత్త ఇన్నోవేషన్‌తో.. వర్చువల్ టూల్స్‌ని మెరుగుపర్చగలదు. అంటే ఎలాంటి మేకప్‌లు సరిపడతాయి, చర్మ నాణ్యత తదితర విషయాల్లో సలహాలు, సూచనలు ఇవ్వగలదు. మానవునిలా ప్రభావవితం చేయలేదు. ఎందుకంటే ఇది సృజనాత్మకత, భావోద్వేగం, టచ్‌తో కూడిన కళ. 2020లో మహమ్మారి సమయంలో ఈసాంకేతికత ప్రభంజనంలా దూసుకుపోయిందే తప్ప మరేంకాదని కొట్టేపడేస్తున్నారు నిపుణులు. అయితే బ్యూటీషియన్ రంగంలోని మేకప్ పరిశ్రమను ప్రభావితం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఇక్కడ కస్టమర్ మనోగతం ఆధారంగా అందమైన రూపు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ నేపథ్యంలో ఏఐ సరైన మేకప్‌ని కస్టమర్లకు ఇవ్వడం అన్నది సాధ్యం కానీ విషయం. ఓ మోస్తారుగా ఇలాంటి మేకప్ ఇస్తే ఇలా ఉంటుందని వర్చువల్ ఐడియానే అందివ్వగలదే తప్ప కస్లమర్కి నచ్చినట్టుగా క్రియేటివిటీతో కూడిన మేకప్ ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు. అలాగే క్లయింట్లకు ఎలాంటి బ్యూటీప్రొడక్ట్లు వాడితే బెటర్ అనేది, చర్శ తత్వం తదితరాలకు మాత్రమే ఐఏ ఉపయోగపడవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఐఏ అందానికి సంబంధివచి ప్రభావితం చేయాలేని కీలక అంశాలు గురించి కూడా చెప్పారు. అవేంటంటే..కళాత్మక క్రియేటివిటీ : బ్యూటీషియన్ నిపుణులే మూఖాకృతి తీరుకి సరైన మేకప్‌తో ఒక మంచి రూపాన్ని ఇవ్వగలరు. ఇది నిశితమైన అంతర్దృష్టికి సంబంధించిన క్రియేటివిటీ. ఎమోషనల్ కనెక్షన్: కస్టమర్ల సౌందర్య సంప్రదింపుల్లో ఇది అత్యంత కీలకమైంది. క్లయింట్ వ్యక్తిగతంగా ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నారనేది అర్థం చేసుకుని సలహాలు, సూచనలివ్వాల్సి ఉంటుంది. స్పర్శ సేవ: షేషియల్, మసాజ్ వంటి సౌందర్య చికిత్సలలో టచ్ అనేది కీలకం. బ్యూటీషియన్ అనుభవం ఆధారంగా కస్టమర్లకు దొరికే మంచి అనుభూతిగా చెప్పొచ్చు. ఒక వేళ ఏఐ సౌందర్య రంగాన్ని ప్రభావితం చేసినా..బ్యూటీషియన్లు ఈ సవాలుని స్వీకరించేందుకు సిద్ధపడాలి. అలాగే కస్టమర్లకు మెరగైన సేవను అందించి సాంకేతికత కంటే..మనుషుల చేసేదే బెటర్ అనే నమ్మకాన్ని సంపాదించుకునే యత్నం చేయాలి. బ్యూటీషియన్లంతా ఈ రంగంలో అచంచలంగా దూసుకునిపోయేలా ఏఐని స్నేహితుడిగా మలుచుకుంటే మరిన్న ఫలితాలను సాధించే అవకాశం ఉంటుంది. అలాంటి వారే ఎలాంటి సాంకేతిక ఆటను ఈజీగా కట్టడి చేయగలరు అని నమ్మకంగా చెబుతున్నారు విశ్లేషకులు. (చదవండి: 40 ఏళ్ల నాటి గౌనులో యువరాణి అన్నే..!) -
చలికాలంలో మేకప్, ఈ జాగ్రత్తలు తప్పదు.. లేదంటే!
చలికాలం ఉక్కపోత ఉండదు, మేకప్ చెదిరిపోదు, బాగుంటుంది అనుకుంటారు. అయితే, ప్రతి సీజన్‌కి బ్యూటీ చాలెంజెస్ ఉంటాయి. చలికాలంలో చేయించుకోదగిన ఫేషియల్స్, మేకప్, ఫుడ్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వివాహ వేడుకలకు మేకప్ చేయించుకునేవారు ఈ జాగ్రత్తలు పాటిస్తే, సరైన ప్రయోజనాలను పొందుతారు. పొడిగా ఉన్నా, జిడ్డుగా ఉన్నా చలి కాలం మేకప్ చేసేముందు హైడ్రేటెడ్ మాయిశ్చరైజర్ ఉపయోగించాలి. లేదంటే, మేకప్ కూడా డ్రైగా కనిపిస్తుంది. అవసరాన్ని బట్టి ప్రైమరీ లోషన్ వాడుకోవచ్చు.మెరిసే చర్మానికి..చర్మం మెరుస్తున్నట్టుగా ఆరోగ్యంగా కనిపించాలంటే నూనె శాతం ఎక్కువ ఉండే మాయిశ్చరైజర్ ఉపయోగించాలి. హైలురానిక్ యాసిడ్స్ ఉన్న సీరమ్‌ని ముందు ఉపయోగిస్తే మాయిశ్చరైజర్‌ని స్కిన్ మీద పట్టి ఉంచుతుంది. దీని వల్ల మేకప్ డ్రైగా కనిపించదు. బడ్జెట్‌ని బట్టి సీరమ్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. వాటిలో చర్మానికి అవసరమయ్యే గుణాలు ఏవి ఉన్నాయో అవి చెక్ చేసుకోవాలి. సాధారణంగా చర్మం సహజ ఆయిల్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. కానీ, వయసు పెరుగుతున్నకొద్దీ సహజ నూనెల ఉత్పత్తి ఆగి΄ోతుంది. దాంతో చర్మం ΄÷డిబారుతుంది. చలికాలం పెళ్లిళ్లు ఉన్న బ్రైడల్స్ అయితే కనీసం నెల ముందు నుంచి స్కిన్ కేర్ తీసుకోవాలి.హెల్తీ స్కిన్‌కి పోషకాహారంస్కిన్ కేర్ తీసుకోకుండా పెళ్లిరోజు మేకప్ చేయించుకుంటే హెల్తీగా కనిపించదు. నెల రోజుల ముందు నుంచి హైలురానిక్ యాసిడ్స్ ఉన్న సీరమ్స్ ఉపయోగించాలి. ΄ోషకాహారం, ΄ానీయాల మీద దృష్టి పెట్టాలి. జంక్ ఫుడ్, మాంసాహారం కాకుండా పండ్లు, కూరగాయలు, జ్యూసులను ఆహారంలో ఎక్కువ చేర్చుకోవాలి. దీని వల్ల చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది.మేకప్‌కి ముందుమేకప్కి ముందు ఎంజైమ్ స్క్రబ్ ఉపయోగిస్తారు. తర్వాత సీరమ్స్, అవసరమైతే షీట్ మాస్క్‌లు, అండర్ ఐ ప్యాచెస్ వాడుతారు. దీని వల్ల మేకప్ ప్యాచ్‌లుగా కనిపించదు.మేకప్ తీయడానికి తప్పనిసరిరిమూవర్స్ ఉపయోగించుకోవచ్చు. లేదంటే కొబ్బరినూనె, బాదం నూనె, బేబీ ఆయిల్ ను ఉపయోగించి మేకప్‌ను పూర్తిగా తీసేయాలి. తర్వాత ఫేస్‌వాష్‌తో శుభ్రపరుచుకొని, మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అలసి΄ోయామనో, మరుసటి రోజు చూడచ్చులే అనో మేకప్ తీసేయకుండా అలాగే పడుకుంటే స్కిన్ బాగా దెబ్బతింటుంది. చర్మం ఇంకా పొడిబారడం, యాక్నె వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు. మేలైన ఫేషియల్స్చలికాలంలో రొటీన్ ఫేషియల్స్ కాకుండా హైడ్రా ఫేషియల్ చేయించుకోవడం మంచిది. దీని వల్ల చర్మం నిగారింపు కోల్పోదు. వీటితో పాటు కొన్ని కెమికల్ పీల్స్ ఉంటాయి. అయితే, వీటిని పెళ్లికి పది రోజుల ముందు చేయించుకోవాలి. కెమికల్ పీల్ని బ్యూటీపార్లర్‌లో కాకుండా చర్మనిపుణుల సమక్షంలో చేయించుకోవడం మంచిది. – విమలారెడ్డి పొన్నాల, సెలబ్రిటీ అండ్ బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్ -
చలికాలంలో మీ స్కిన్ మృదువుగా ఉండాలంటే.!
చలికాలం చర్మం పొడిబారి, జీవం కోల్పోయినట్టు కనపడుతుంది. ఇలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కలిగి ఉండాలి. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అందుకు సంబంధించి కొన్ని టిప్స్ మీకోసం. టీ స్పూన్ బాదం నూనె, అర టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి, చేతులకు, పాదాలకు రాసి మసాజ్ చేయాలి. స్నానం చేసేముందు నాలుగు చుక్కల బాదం నూనె బకెట్ నీటిలో కలపాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. అరటిపండు గుజ్జు, కప్పు పెరుగు, టేబుల్ స్పూన్ తేనె, టేబుల్ స్పూన్ ఓట్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మేనికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. దీంతో చర్మానికి జీవకళ వస్తుంది. స్నానం చేయడానికి అరగంట ముందు కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె మేనికి రాసుకోవాలి. మృదువుగా మర్దనా చేసి, గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి చలికాలం నూనె శాతం అధికంగా ఉన్న మాయిశ్చరైజర్లు వాడాలి. ఆలివ్ ఆయిల్, అలొవెరా జెల్ సమపాళ్లలో తీసుకొని అందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని చలికాలం మాయిశ్చరైజర్‌గా ఉపయోగించవచ్చు. టీ స్పూన్ శనగపిండిలో అర టీ స్పూన్ తేనె, పచ్చిపాలు కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే పొడిబారిన ముఖ చర్మం ముడతలు తగ్గుతాయి. చర్మం పొడిబారకుండా ఉండాలంటే మృతకణాలను తొలగిస్తూ ఉండాలి. అలాగని చర్మాన్ని మరీ రబ్ చేయకూడదు. కార్న్‌ఫ్లేక్స్‌ని పొడి చేసి, అందులో తేనె, పాలు కలిపి చర్మానికి పట్టించి, మర్దనా చేయాలి. మృతకణాలు తొలగి పోయి చర్మం మృదువుగా మారుతుంది. -
నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో సత్తా చాటిన తెలుగమ్మాయి హన్సిక
హన్సిక నసనల్లి అచ్చమైన తెలుగమ్మాయి. తెలుగు జాతి కీర్తి పతాకాన్ని అమెరికాలో ఎగుర వేశారు. నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో విజేతగా నిలిచారు. జూనియర్ టీన్ కేటగిరీల్లో జరిగిన ఈ పోటీల్లో అమెరికాలోని 50 స్టేట్స్ నుంచి 118 మంది పోటీ పడ్డారు. ఈ పోటీల్లో ఆమె నేషనల్ అమెరికన్ మిస్ జూనియర్ టీన్ విజేతగా నిలిచారు.ఇవే కాకుండా హన్సిక గత రెండు సంవత్సరాలుగా యూఎస్ఏ నేషనల్ లెవెల్ యాక్ట్రెస్ పోటీల్లో గెలిచారు. అకడమిక్ అచీవ్మెంట్ విన్నర్ అవార్డుని కూడా కైవసం చేసుకున్నారు. క్యాజువల్ వేర్ మోడల్ విన్నర్ కిరీటాన్ని కూడా సొంతం చేసుకున్నారు. అతి చిన్న వయసులోనే భరతనాట్యాన్ని నేర్చుకుని అరంగేట్రం చేసి అందరినీ ఆకట్టుకున్నారు.ఆరేళ్ల నుంచి ఈ పోటీల్లో పాల్గొంటూ గత నాలుగు సార్లు విజేతగా నిలిచారు. నేషనల్ అమెరికన్ మిస్, ఇంటర్నేషనల్ జూనియర్ మిస్, ఇంటర్నేషనల్ యూనైటెడ్ మిస్, యూఎస్ఏ ఇండియన్ మిస్ పెజంట్ పోటీల్లో గెలిచి సత్తా చాటారు. హన్సిక స్వస్థలం వనపర్తి. తండ్రి శేఖర్. తల్లి ప్రశాంతిని ప్రముఖ భరత నాట్య కళాకారిణి, నటి. కన్నడ, తెలుగులో నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రమోదిని అక్క కూతురు హన్సిక.మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ కిరీటాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా తన ప్రయాణాన్ని సాగిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. చదువులో ఉన్నతస్థాయిలో రాణిస్తూ బ్రౌన్ యూనివర్సీటీ లేదా హార్వార్డ్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో మెడిసిన్ చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. View this post on Instagram A post shared by Hansika Nasanally (@hansika_pageant) (చదవండి: 12th ఫెయిల్ హీరో విక్రాంత్ షాకింగ్ నిర్ణయం.. సరైనదే అంటున్న నిపుణులు!) -
వింటర్ వేర్ : గ్రాండ్ వెల్వెట్, ట్రెండీ వెల్వెట్
వింటర్ టైమ్ బ్రైట్‌గా వెలిగిపోవాలన్నాప్రిన్సెస్లా హుందాగా మెరిసిపోవాలన్నావణికించే చలి నుంచి నైస్‌గా తప్పించుకోవాలన్నాఈ సీజన్‌కి బెస్ట్ ఎంపికగా వెల్వెట్ డిజైనరీ డ్రెస్సులు గ్రాండ్‌గా మదిని దోచేస్తున్నాయి. వెల్వెట్నే మనం మఖ్మల్ క్లాత్ అని కూడా అంటాం. మందంగా, మృదువైన పట్టులా ఉండే ఈ క్లాత్ నేత పని, వాడే మిశ్రమాల వల్ల చాలా ఖరీదైనదిగా కూడా పేరుంది. సంపన్నులు ధరించే వస్త్రంగా పేరొందిన వెల్వెట్కు ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది. ఇప్పుడు ఈ క్లాత్ తయారీలో ఎన్నో మార్పులు చోటు చేసుకొని, అందరికీ అందుబాటులోకి వచ్చింది. ధరలను బట్టి క్లాత్ నాణ్యతలో మార్పులు ఉంటున్నాయి. దాదాపు డిజైనర్లందరూ వెల్వెట్‌తో డ్రెస్ డిజైనింగ్‌లో ప్రయోగాలు చేస్తుంటారు. లాంగ్ అండ్ షార్ట్ గౌన్లు, కుర్తీలు, లాంగ్ ఓవర్‌కోట్స్, శారీస్, బ్లౌజ్‌లను డిజైన్ చేయించుకోవచ్చు. ప్లెయిన్ వెల్వెట్ డ్రెస్‌లో వెస్ట్రన్ ఔట్‌ఫిట్స్‌ను డిజైన్ చేస్తుంటారు. ఇవి, వింటర్ సీజన్లో ఈవెనింగ్ పార్టీలకు స్పెషల్‌గా రెడీ అవుతున్నాయి. వీటిలో షార్ట్ గౌన్స్, ఓవర్ కోట్స్ ఎక్కువ.ఎంబ్రాయిడరీ వెల్వెట్ క్లాత్‌పైన మరింత అందంగా కనిపిస్తుంది. దీనివల్ల డ్రెస్‌కి అదనపు ఆకర్షణ చేకూరుతుంది. సంప్రదాయ వేడుకల్లోనూ డిజైనర్ శారీతో హుందాగా ఆకట్టుకుంటుంది. లెహంగా, చోలీ డిజైన్లలో గ్రాండ్‌గా వెలిగిపోతుంది. వెల్వెట్ అనేది వంకాయ రంగులోనే కాదు పచ్చ, పసుపు, పింక్.. వివిధ రంగులలో షిమ్మర్‌తో మెరిసిపోయేవీ ఉన్నాయి. -
మాయిశ్చరైజర్లు వాడుతున్నారా..!
చలికాలంలో చర్మం పొడిబారే సమస్య దాదాపుగా అందరూ ఎదుర్కొనేదే. ఎన్ని క్రీములు రాసినా ఏమాత్రం ఉపయోగం లేదని చాలామంది వాపోతుంటారు. ఈ సమస్యలకు పరిష్కారం కావాలంటే ముందు మన చర్మ తత్త్వాన్ని తెలుసుకోవాలి. కొందరికి ఆయిల్ స్కిన్ ఉంటుంది. వీరికి సమస్య పెద్దగా ఉండకపోవచ్చు. కానీ, ఈ కాలంలో పొడి చర్మం గల వారికి పెద్ద సమస్యగా ఉంటుంది. వారి చర్మతత్వాన్ని బట్టి మాయిశ్చరైజర్లు రాసుకోవాలి. గోరువెచ్చని నీళ్లుఫుల్క్రీమ్ లేదా అయిల్ బేస్డ్ మాయిశ్చరైజర్లు వాడాలి. స్నానం చేశాక కనీసం పది నిమిషాల్లోపు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. చలిని తట్టుకోవడానికి చాలామంది వేడినీళ్లతో స్నానం చేస్తుంటారు. దీనివల్ల చర్మంపై సహజ నూనెలను కోల్పోతాం. అందుకని, స్నానానికి గోరువెచ్చని నీళ్లు వాడాలి. నిమ్మ, చందనంతో తయారైనవి కాకుండా గ్లిజరిన్, అలోవెరా, ఓట్‌మిల్క్ బేస్డ్ సోప్స్ స్నానానికి ఎంచుకోవాలి. వింటర్లోనూ సన్‌స్క్రీన్‌ను ఉపయోగించాలి.రుద్దకూడదు..డ్రై స్కిన్ ఉన్నవాళ్లు క్లెన్సింగ్ మిల్క్‌ని రోజుకు ఒకసారైనా ఉపయోగించాలి. స్క్రబ్స్ వంటివి ఎక్కువ ఉపయోగించకూడదు. కొందరు స్నానానికి మైత్తటి కాయిర్‌ను వాడుతుంటారు. ఈ కాలం దానిని వాడక΄ోవడం ఉత్తమం. పాదాలను రాత్రివేళ శుభ్రపరుచుకొని, ఫుట్ క్రీమ్ లేదా పెట్రోలియమ్ జెల్లీ రాసుకోవాలి. కాలి పగుళ్ల సమస్య ఉన్నవారు సాక్సులు వేసుకోవాలి. కొందరు సీరమ్స్ వాడుతుంటారు. వీటిలో యాసిడ్ కంటెంట్ చాలా తక్కువగా ఉన్నవి ఎంచుకోవాలి.ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్లు జెల్ లేదా లోషన్ బేస్డ్ మాయిశ్చరైజర్లు ఉపయోగించుకోవాలి. సోరియాసిస్, వంటి చర్మ సమస్యలు ఉన్నవారు ముందుగానే వైద్యులను సంప్రదించి మందులు తీసుకోవాలి.మేకప్‌కి ముందు మాయిశ్చరైజర్ మేకప్ చే సుకోవడానికి ముందు క్లెన్సింగ్ మిల్క్ ఉపయోగించి, తర్వాత మాయిశ్చరైజర్ వాడాలి. మేకప్ తీసేసాక మళ్లీ క్లెన్సింగ్ మిల్క్‌ను ఉపయోగించాలి. డ్రైస్కిన్ వాళ్లు ఆయిల్ బేస్డ్ ఫౌండేషన్స్ వాడాలి. సూప్‌లు, జ్యూస్‌లు..ఆకుకూరలు, కూరగాయలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. నట్స్, నువ్వులు వంటివి ఈ కాలంలో ఆహారంలో చేర్చుకోవడం, ఉపయోగించడం మంచిది. సాధారణంగా చలికాలంలో చాలామంది తక్కువ నీళ్లు తాగుతారు. కానీ, మన శరీరానికి 3–4 లీటర్ల నీళ్లు అవసరం. నీళ్లు తాగలేక΄ోయినా సూప్‌లు, జ్యూస్‌ల రూపంగా తీసుకోవచ్చు. – డా. స్వప్నప్రియ, డెర్మటాలజిస్ట్ -
శిల్పంలాంటి ముఖాకృతి కోసం..!
సినీ తారలు, సెలబ్రిటీల ముఖాలు చాలా ప్రకాశవంతంగా రిఫ్రెష్‌గా కనిపిస్తాయి. వాళ్ల ముఖాల్లో ఇంత గ్లో ఎలా సాధ్యమవుతోంది?. అందరికి వ్యక్తిగతంగా ఏవేవో టెన్షన్లు, ఒత్తిడులు కామన్‌గానే ఉంటాయి. అయినా అవేమీ వాళ్ల ముఖాల్లో కనిపించకుండా భలే ప్రశాంతంగా నిర్మలంగా కనిపిస్తాయి. అందుకు బ్యూటీ పార్లర్లు, ఫేస్ క్రీంలు మాత్రం కాదని అంటున్నారు నిపుణులు. సినీస్టార్లు ప్రముఖులు, వర్కౌట్లు, వ్యాయామాల తోపాటు ఫేస్ యోగా కూడా చేస్తారని, అది వారి దైనందిన జీవితంలో భాగమమని చెబుతున్నారు. అదే వారి అందమైన ముఖాకృతి రహస్యం అని చెబుతున్నారు. అసలేంటి ఫేస్ యోగా?. ఎలా చేస్తారంటే..?ప్రస్తుత రోజుల్లో ఫేస్ యోగా చాలామంది సెలబ్రిటీలకు ఇష్టమైన వర్కౌట్‌గా మారింది. ఇది ప్రకాశవంతంగా కనిపించేలా చేయడమే గాక చెక్కిన శిల్పంలా ముఖాకృతి ఉంటుంది. ముఖ్యంగా వృద్ధాప్య లక్షణాలను కనిపించనివ్వదు, అలాగే ముడతలను నివారిస్తుంది. ఈ ఫేస్ యోగా ముఖం, మెడలోని మొత్తం 57 కండరాలను బలోపేతం చేస్తుంది. అంతేగాదు రక్తప్రసరణ మెరుగ్గా ఉంచి చర్మ ఆరోగ్యాన్ని పెంపొదిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ముఖానికి మంచి మసాజ్‌లా ఉండి సెలబ్రిటీల మాదిరి ముఖాకృతిని పొందేలా చేస్తుందన్నారు. ఎలా చేయాలంటే.. ఫిష్ ఫేస్:ముఖాన్ని చేప మాదిరిగా.. రెండు బుగ్గలను లోపలకు గట్టిగా లాగాలి. ఇది బుగ్గలు, దవడలలోని కండరాలను బలోపేతం చేస్తుంది. ముఖం ఉబ్బడాన్ని తగ్గిస్తుంది. ఈ భంగిమలో ఐదు నుంచి పది సెకన్లు ఉంటే చాలు.'O' మాదిరిగా నోరు తెరవడం..మధ్య ముఖ ప్రాంతాన్ని ఎత్తి చేస్తాం. అంటే ఆంగ్ల అక్షరం 'o' అని పెద్దగా నోరు తెరిచి ఉంచాలి. ఇలా పది నుంచి 15 నిమిషాలు చేయాలి. ఇది ముఖం కుంగిపోకుండా నివారిస్తుంది.ముఖంపై సున్నితంగా టచ్ చేయడం..నుదిటి కండరాల నుంచి ఒత్తిడిని విడుదల చేయడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి తోడ్పడుతుంది. అలాగే కోపాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. రెండు చేతులను నుదిటిపై నుంచి మెడ వరకు సుతి మెత్తంగా టచ్ చేస్తూ పోవాలి.ది ఐ ఓపెనర్కళ్లకు సంబంధించిన వ్యాయామం. కళ్లను పెద్దవిగా చేసి అటు ఇటూ తిప్పడం. అలాగే కొద్దిసేపు గుండ్రంగా తిప్పడం వంటివి చేయాలి. కళ్ల చుట్టూ ఉన్న కండరాలను బలపరుస్తుంది. కనురెప్పలు కుంగిపోకుండా చేస్తుంది. కిస్సింగ్ అండ్ స్మైలింగ్ పోస్ముఖాన్ని ఇంటి పైకపు చూస్తున్నట్లుగా పైకెత్తాలి. ఈ భంగిమలో పైకి చూస్తూ..కాసేపు నవ్వడం, కిస్ చేస్తున్నట్లుగా గడ్డం పైకెత్తడం వంటివి చేయాలి.ప్రయోజనాలు..వృద్ధాప్య సమస్యలకు చక్కటి సహజసిద్ధమైన పరిష్కారంచర్మపు స్థితిస్థాపకతను పెంచుతుందిముడతలను తగ్గిస్తుందిధృడమైన యవ్వన రూపాన్ని అందిస్తుంది. ముఖ ఉద్రిక్తతను తగ్గించి, ఉబ్బడాన్ని నివారిస్తుంది.చెంప ఎముకలను చక్కటి ఆకృతిలో ఉండేలా చేస్తుందికను రెప్పలు వంగిపోకుండా నివారిస్తుందిఅలాగే ముఖాకృతిని మెరుగుపరుస్తుంది -
ఇదేం మేకప్ సామీ..కన్నీళ్లు పెట్టించేస్తున్నారుగా!
అందానికి సంబంధించి.. సోషల్ మీడియాలో లెక్కలేనన్ని వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. పాదాల దగ్గర నుంచి హెయిర్ వరకు ప్రతిదాని సంరక్షణ కోసం విచిత్రమైన చిట్కాలతో వీడియోలు పోస్ట్ చేసేస్తున్నారు. ఇక మేకప్ విషయానికి వస్తే వామ్మో..! ఆ పదం ఎత్తాలంటేనే భయంగొలిపేలా పిచ్చి పిచ్చి మేకప్‌లతో జనాలను చంపేస్తున్నారనే చెప్పొచ్చు. ఏవేవో వింత వింత మేకప్‌ల వీడియోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. వాటిని చూసి జనాలు ఇవేం అందం పోకడలు అని నోరెళ్లబెడుతున్నారు. ఇప్పుడు తాజగా అదే మాదిరిగా ఓ మేకప్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అది చూస్తే.. ఇందుకోసం కూడా మేకప్ అవసరమా అని తలపట్టుకుంటారు. ఇంతకీ ఏంటా మేకప్ అంటే..జపాన్ టిక్‌టాక్ బ్యూటీ క్రియేటర్ వెనెస్సా ఫ్యూన్స్ ఈ వీడియోని పోస్ట్ చేసింది. అందులో ఆమె హాట్ గ్లూగన్ అనే సరికొత్త మేకప్ గురించి వివరించింది. వేడివేడి జిగురుని ఉపయోగించి "3D టియర్‌డ్రాప్ మేకప్" వేస్తారు. ఇందులో ఏంటి స్పెషాల్టీ అంటే..మేకప్ ప్రక్రియలో భాగంగా ముఖంపై ప్లాస్టిక్ షీట్ వంటిదాన్ని పరిచి దాని మీద వేడి వేడి వెంట్రుకుల జిగురుని వేయడం జరుగుతుంది. అతి ముఖానికి అతుక్కుపోయిన వెంటనే..ఒలిస్తే కన్నీటి బిందువు ఆకారంలా ముఖంపై రావడం జరుగుతుంది. దీన్ని భావోద్వేగ భరితం లేదా దుఃఖ పూరితంగా కననిపించేలా చేసేందుకు ఈ మేకప్‌ని ఉపయోగిస్తారట. అంతేగాదు అనుకోని పరిస్థితుల్లో సానుభూతిని సంపాదించుకునేందుకు కూడా ఈ మేకప్ ఉపయోగపడుతుందట. ఆఖరికి ఏడుపుని కూడా మేకప్‌తో మాయ చేస్తారా అంటూ నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఈ బ్యూటీ ట్రెండ్ చూస్తే.. ఇక రాను రాను కన్నీళ్లకు కూడా విలువ ఉండదేమోకదూ. అయితే నిపుణులు మాత్రం ఇలా చర్మంపై వేడి వేడి జిగురుని వేయడం అనేది మంచిది కాదని, ఇది చర్మ ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. (చదవండి: శీతాకాలం చర్మం పొడిబారకుండా ఉండాలంటే..?) -
కనురెప్పలకూ చుండ్రు, నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే!
చుండ్రు ఇబ్బందికరంగా ఉంటుంది, ప్రత్యేకించి శీతాకాలంలో. చుండ్రు అనగానే తలలో మాత్రమే వస్తుందని అనుకుంటాం. కానీ కనురెప్పలు, కనుబొమ్మలపై సైతం చుండ్రు ఏర్పడుతుంది ఇది సాధారణంగా శీతాకాలం లేదా సీజన్ మార్పుల సమయంలో కనిపిస్తుందని నిపుణులు అంటున్నారు. ఇది సాధారణమే అయినా..చికిత్స చేయకుండా వదిలివేస్తే ప్రమాదకరం అని కూడా సూచిస్తున్నారు. ఇది ఎందుకు వస్తుంది, లక్షణాలు, నివారణ మార్గాలు చూద్దాం రండి!కనురెప్పలతోపాటు మీసాలు , ముక్కు మీద కూడా చుండ్రు కనిపిస్తుంది! ఇతర ప్రాంతాల మాదిరిగా కాకుండా, కనురెప్పల చుండ్రును చికిత్స చేయకుండా వదిలేస్తే కొన్ని తీవ్రమైన ప్రమాదాలొచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా లెన్స్ ధరించేవారు, ఇన్ఫెక్షన్లను నివారించడానికి కనురెప్పల చుండ్రు పట్ల జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఐలైనర్, మస్కరాతో నిద్రించే అలవాటు ఉండే వారు కూడా అప్రమత్తంగా ఉండాలి. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ (స్టెఫిలోకాకస్) కనురెప్పల ద్వారా ఉత్పత్తి అయ్యే నూనెలలో తగ్గుదల, డెర్మటైటిస్,సెబోరిహెక్ డెర్మటైటిస్ మూలంగా కనుబొమ్మలు, కనురెప్పలపై చుండ్రు సమస్య తలెత్తుతుంటుంది. బ్లెఫారిటస్ డెర్మటైటిస్ వల్ల కనురెప్పల అంచుల్లోవాపు, మంట, ఇరిటేషన్ లాంటివి వస్తాయి. సెబోరిహెక్ డెర్మటైటిస్ లో క్రానిక్ ఇన్ఫ్లమేటరీ స్కిన్ కండిషన్ ఎదుర్కొంటాం. లక్షణాలుకనురెప్పల చుండ్రు బైటికి పెద్దగా కనిపించకపోయినప్పటికీ, కనురెప్పల దురద, కనురెప్పలు ఎర్రగా మారడం, కళ్లలో మంట లేదా కనురెప్పల అడుగుభాగంలో పొలుసుల చుండ్రు , కళ్ల వెంబడి నీళ్లు, వెలుగు చూడలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వెంట్రుకలపై చుండ్రు ఉండటం కేవలం సౌందర్య సమస్య కాదు, కంటి ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుంది.కళ్లు ఎప్పుడూ చికాకు పెట్టడం, ఎర్రబడటం, కను బొమ్మలు ఊడిపోవడం పొడిబారడం, కార్నియల్ దెబ్బతినడం స్టైస్ లాంటి సమస్యలొస్తాయి. చికిత్స చేయకుండా వదిలేస్తే, కండ్లకలక లేదా కెరాటిటిస్ (కార్నియా వాపు) వంటి దీర్ఘకాలిక కంటి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇరిటేషన్ వల్ల కళ్లను ఎక్కువగా రుద్దడం వల్ల కార్నియాలు బలహీనపడతాయి, ఇది కెరాటోకోనస్ (కార్నియా సన్నబడటానికి, కోన్ ఆకారంలోకి ఉబ్బడానికి కారణమయ్యే కంటి వ్యాధి) వంటి పరిస్థితులకు దారితీయవచ్చు.చిట్కాలు: రాత్రి పడుకోబోయే ముందు టేబుల్ స్పూను బాదం ఆయిల్ తీసుకుని దాన్ని వేడి చేసి, గోరువెచ్చగా ఉన్నపుడు కనుబొమ్మలు, కనురెప్పల మీద సున్నితంగా మసాజ్ చేయాలి. ఉదయం లేచిన తర్వాత చల్లటి నీళ్లతో కనురెప్పలు, కనుబొమ్మలు శుభ్రంగా కడుక్కోవాలి.కల్లీలేని కొబ్బరి నూనె, అలోవెరా జెల్ కలిపి, దురదగా ఉన్న చోట్ల మృదువుగా అప్లయ్ చేయాలి .ఫంగస్ కారణంగా కనుబొమ్మలు, కనురెప్పలపై ఏర్పడే చుండ్రు పోగొట్టడానికి టీ ట్రీ ఆయిల్ ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీఫంగల్ సుగుణాలు చాలా ఉన్నాయి. టేబల్ స్పూను టీట్రీ ఆయిల్ తీసుకుని దాన్ని మైక్రోవేవ్ లో కొన్ని సెకన్ల పాటు వేడిచేయాలి. ఈ నూనెను కాటన్ బాల్ సాయంతో కనుబొమ్మలపై, కనురెప్పలపై సున్నితంగా రాసి పది నిమిషాలు అలాగే ఉంచి, తరువాత శుభ్రంగా కడగాలి. నోట్ : ఇది అవగాహనకోసం అందించిన సమాచారం మాత్రమే. సమస్య తీవ్రతను గుర్తించి సమస్య మరీ ముదరకుండా వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. -
పెసర పిండితో బ్యూటీ ప్యాక్స్ : మెరిసే మోము
శీతాకాలంలో చర్మం, ముఖం సౌందర్య పట్ల మరింత జాగ్రత్త తీసుకోవాలి. రసాయనాలులేని సహజ పదార్థాలతోనే చర్మ సౌందర్యాన్నిమెరుగు పర్చు కోవడానికి ప్రయత్నించాలి. చర్మాన్ని మృదువుగా చేయడంలోనూ, చర్మానికి మెరుపును ఇవ్వడంలోనూ, చక్కటి రంగు తేలేలా చేయడంలోనూ పెసలు చక్కగా పని చేస్తాయి. ఈ నేపథ్యంలో పెసర పిండితో కొన్ని చిట్కాలను ఇపుడు చూద్దాం! టీ స్పూన్ పెసరపిండిలో పచ్చిపాలు కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి. దీనిని ముఖానికి మాస్క్‌లా వేయాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పొడిచర్మాన్ని ఈ మాస్క్ మృదువుగా మారుస్తుంది.పెసరపిండిలో కొద్దిగా పెరుగు, కొబ్బరి నూనె కలిపి చేతులకు రాయాలి. సున్నితంగా రబ్ చేసి, పది నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పెసరపిండి, పెరుగు, కొబ్బరి నూనె చర్మాన్ని మరింత మృదువుగా మారుస్తాయి.టేబుల్ స్పూన్ పెసర్లు, ఐదు బాదంపప్పులు రాత్రి నీళ్లలో నానబెట్టాలి. ఉదయాన్నే వీటిని పేస్ట్ చేసి, ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే చర్మం పొడిబారడం సమస్యే దరిచేరదు. -
శీతాకాలం చర్మం పొడిబారకుండా ఉండాలంటే..?
శీతాకాలం అనంగానే అందరికి ఎందురయ్యే ప్రధాన సమస్య చర్య పొడిబారడం. దీని వల్ల దద్దుర్లు, ఒక విధమైన దురద మంట వస్తాయి. అలాగే చర్మం కూడా అసహ్యంగా మారిపోతుంది. తాకినప్పుడుల్లా గరుకుదనంతో మంటగా ఉంటుంది. అలాంటి సమస్యకు ఇంట్లో దొరికే వాటితో ఈజీగా చెక్ పెట్టొచ్చు . అదెలాగో చూద్దామా..!.టీ స్పూన్ పెసరపిండిలో పచ్చిపాలు కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి. దీనిని ముఖానికి మాస్క్‌లా వేయాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పొడిచర్మాన్ని ఈ మాస్క్ మృదువుగా మారుస్తుంది.పెసరపిండిలో కొద్దిగా పెరుగు, కొబ్బరి నూనె కలిపి చేతులకు రాయాలి. సున్నితంగా రబ్ చేసి, పది నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పెసరపిండి, పెరుగు, కొబ్బరి నూనె చర్మాన్ని మరింత మృదువుగా మారుస్తాయి.టేబుల్ స్పూన్ పెసర్లు, ఐదు బాదంపప్పులు రాత్రి నీళ్లలో నానబెట్టాలి. ఉదయాన్నే వీటిని పేస్ట్ చేసి, ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే చర్మం పొడిబారడం సమస్యే దరిచేరదు. (చదవండి: పెదవులు గులాబీ రంగులో మెరవాలంటే ఆపిల్, అరటిపండ్లతో ఇలా చేయండి..!) -
పెదవులు గులాబీ రంగులో మెరవాలంటే ..!
చలికాలంలో పెదాలు పొడిబారినట్లుగా అయిపోయవడమే గాక ముఖం, చర్మం కాంతి విహీనంగా మారుతుంది. ఓపక్క పని ఒత్తిడి వల్ల కళ్లకింద నలుపు, ముఖంంపై ముడతలతో అందవిహీనంగా కనిపిస్తుంది. ఇలాంటి వాటిని ఆరోగ్యం కోసం తినే ఫ్రూట్స్‌తో చెక్‌పెడదాం. అదెలాగో చూద్దామా..కీరదోసకాయని చక్రాల్లా కోసుకుని కళ్ళమీద పెట్టుకుంటే కంటి అలసట తగ్గుతుంది. రెండు స్పూన్ల చల్లని పాలలో కాటన్ బాల్స్‌ని ముంచి కళ్ళ చుట్టూ వలయాకారంగా మర్ధించి 20 నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే కంటి కింద నలుపు తగ్గి అందంగా ఉంటాయి. మెడ మురికి పట్టేసినట్లు నల్లగా ఉంటే... నాలుగు టీ స్పూన్ల పుల్లటి పెరుగులో రెండు స్పూన్ల బియ్యప్పిండి కలిపి మెడకు పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మానికి పట్టిన నలుపుతోనాటు ముడతలుపోతాయి.టీ స్పూన్ అరటిపండు గుజ్జులో టీస్పూన్ తేనె కలిపిన మిశ్రమాన్ని పెదవులకు రాసి మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే నల్లని పెదవులు గులాబీ రంగులోకి మారతాయి.టీస్పూన్ పాల మీగడ, అయిదారు గులాబి రేకులు తీసుకుని పేస్ట్ చేసిన మిశ్రమాన్ని పెదవులకు రాసుకుంటే పెదవులు పొడిబారకుండా మృదువుగా ఉంటాయి. చలికాలంలో లిప్‌స్టిక్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది. లిప్ గార్డ్, మీగడ, వెన్న, నెయ్యి వంటివి రాసుకుంటూ ఉంటే పెదవులు పొడిబారకుండా అందంగా ఉంటాయి. టీ స్పూన్ ఆపిల్ గుజ్జులో టీ స్పూన్ అరటిపండు గుజ్జు, అయిదారు చుక్కల తేనె వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ఫేస్ మాస్క్‌లా వేసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖంపై ఏర్పడ్డ ముడతలు, జిడ్డు తగ్గి ముఖం మెరుస్తూ కాంతివంతంగా ఉంటుంది. (చదవండి: ఐపీఎల్ ఆటగాళ్ల ‘వేలం'లో మెరిసిన ఆ చిన్నది ఎవరు?) -
ఇంట్లోనే ఈజీగా కర్లీ హెయిర్..!
కొందరికి గిరజాల జుట్టు అంటే ఇష్టంగా ఉంటుంది. నిజానికి వేసుకున్న డ్రెస్‌కు తగినట్లుగా హెయిర్ స్టైల్‌ని మార్చేవాళ్లకు చిత్రంలోని ఈ హెడ్ బ్యాండ్ భలే చక్కగా పని చేస్తుంది. అందుకే చాలామంది కేశాలంకరణ ప్రియులు, హెయిర్ స్ట్రెయిటనర్తో పాటు హెయిర్ కర్లర్ వాడుతూ ఉంటారు. ఈ కర్లర్ హీట్‌లెస్ బ్యాండ్‌ను వెంట ఉంచుకుంటే, ఎలక్ట్రిక్ కర్లర్‌తో పని ఉండదు. దాంతో జుట్టు పాడవదు. పైగా ఈ రోలర్ టూల్‌ను ఉపయోగిస్తే చక్కటి హెయిర్ స్టైల్‌తో అందంగా మెరిసిపోవచ్చు.ఈ బ్యాండ్స్ చాలా రకాలు, చాలా రంగుల్లో లభిస్తున్నాయి. ఆయా బ్యాండ్స్‌ని ఆయా పద్ధతుల్లోనే తలకు అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం జుట్టును కొన్ని చిన్నచిన్న పాయలుగా విడదీసుకుని, బ్యాండ్ కిందకు వేలాడుతున్న లేసులకు ఆ పాయలను బిగించి చుట్టి, 2 లేదా 3 గంటల పాటు అలా ఉంచుకోవాలి. అనంతరం లేసుల నుంచి జుట్టును పాయలు పాయలుగా విడదీసేస్తే, జుట్టు మొత్తం కర్లీగా మారిపోతుంది. ఈ టూల్‌ని చిత్రంలో చూపిన విధంగా తల వెంట్రుకలకు బిగించుకుని ఇంటిపనులు, వంటపనులు చేసుకోవచ్చు, లేదా చక్కగా నిద్రపోవచ్చు. ఈ ఉంగరాలు తిరిగిన జుట్టు ఎక్కువ సమయం ఉండాలన్నా, ఎక్కువ రింగులు తిరగాలన్నా రాత్రి పూట తలకు ఈ బ్యాండ్ పెట్టుకుని పడుకుంటే, ఉదయం లేచేసరికి అందమైన హెయిర్ స్టైల్ మీ సొంతమవుతుంది. ఈ ప్రీమియం కర్లింగ్ మెటీరియల్ 100% సహజమైన, నాణ్యత కలిగిన స్పాంజ్‌తో రూపొందింది. ఇది ఎలాంటి ప్లాస్టిక్ వాసన రాదు. హానికరం కాదు. పైగా ఇది వాడుకోడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ బ్యాండ్ కేవలం రూ.500 కంటే తక్కువ ధరలోనే ఆన్లైన్లో అందుబాటులో ఉంది. నచ్చినవాళ్లకు ఈ టూల్‌ని బహుమతిగా కూడా ఇవ్వవచ్చు. (చదవండి: నోటిలో నాటే ఇంప్లాంట్స్...) -
అందం అర్థం మారుతోంది..!
‘మిస్ యూనివర్స్’ పోటీలు ఎప్పుడూ ఆసక్తికరమే. అయితే తాజాగా మెక్సికోలో జరిగిన ‘మిస్ యూనివర్స్–2024’కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ పోటీ నేపథ్యంలో కేవలం విజేత గురించి మాత్రమే కాదు ఈ పోటీలోపాల్గొన్న ఎంతోమంది గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. అందానికి సంబం«ధించిన సంప్రదాయ కొలమానాలను సవాలు చేసి వేదిక మీద నిలిచిన వారి మొదలు గృహహింస, లైంగిక హింస బాధితులుగా చీకట్లో మగ్గి ఆ చీకటి నుంచి బయటికి వచ్చి ప్రపంచ వేదికపై వెలిగిపోయిన వారు ఉన్నారు.నలభైలలో...40 ఏళ్ల వయసులో మిస్ యూనివర్స్ పోటీలోపాల్గొన్న మహిళగా బియాట్రిస్ నజోయా తన ప్రత్యేకతను చాటుకుంది. ఎన్నో అడ్డంకులను అధిగమించిన ‘మిస్ యూనివర్స్ మాల్టా’ నజోయా ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తోంది. నజోయా ముగ్గురు పిల్లలకు తల్లి. సింగిల్ మదర్.‘శారీరకంగా, మానసికంగా ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నాను. హీనమైన పరిస్థితులను చూశాను. మనకు తప్ప మన సంతోషానికి తెర వేసే శక్తి ఎవరికీ లేదని నిరూపించాలనుకున్నాను. ఆత్మగౌరవంతో ముందుకు వెళ్లాను. మనం బయటికి ఎలా కనిపించినా లోపల అందంగా ఉంటాం. ఆ అందాన్ని చూడగలగాలి’ అంటుంది నజోయా. ‘నిజానికి ఆమె ఎప్పటికీ విజేత. కంటికి కనిపించని కిరీటం ఆమె తలపై కనిపిస్తుంది’ అంటారు నజోయా అభిమానులు. ఎత్తు ఎంతైనా... అంతెత్తున!ష్యానే మెకింతోష్ అందాల పోటీలో పోటీపడిన వారిలో ఎత్తు తక్కువగా ఉన్న కంటెస్టెంట్‌గా చరిత్ర సృష్టించింది. ఆమె ఎత్తు 5 అడుగుల 1 అంగుళం. ‘మిస్ యూనివర్స్ జిబ్రాల్టర్’ ఫైనల్లో మెకింతోష్ ఇచ్చిన సమాధానం న్యాయ నిర్ణేతల హృదయాలను గెలుచుకుంది. ‘నేను చిన్నగా కనిపించవచ్చు... కానీ ఆత్మవిశ్వాసంతో అంతెత్తున కనిపిస్తాను’ ‘మిస్ యూనివర్స్ జిబ్రాల్టర్ 2024’ అందాల కిరీటాన్ని గెల్చుకున్న విజేతగా అందరి దృష్టిని ఆకర్షించింది ష్యానే మెకింతోష్. 34 ఏళ్ల తరువాత ‘మిస్ యూనివర్స్’ పోటీలో జిబ్రాల్టర్కుప్రాతినిధ్యం వహించిన తొలి మహిళగా రికార్డ్ సృష్టించింది. హిజాబ్‌తో...‘మిస్ యూనివర్స్’ పోటీలోపాల్గొన్న తొలి హిజాబీ (ముస్లిం సంప్రదాయ వస్త్రం హిజాబ్‌తో) మహిళగా ఖదీజా ఒమర్ చరిత్ర సృష్టించింది. 23 సంవత్సరాల ఖదీజా సోమాలియ నుంచి ‘మిస్ యూనివర్స్’ పోటీలోపాల్గొన్న తొలి మహిళ.కెన్యాలోని శరణార్థి శిబిరంలో జన్మించింది. యార్క్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేట్ అయిన ఖదీజా కమ్యూనిటీ బిల్డింగ్, బ్రాండ్ డెవలప్మెంట్లోప్రావీణ్యం సాధించింది. బ్యూటీ ఇన్ఫ్లూయెన్సర్, మోడల్, ఫొటోగ్రాఫర్‌గా రాణిస్తోంది. స్ఫూర్తిదాయకమైన కథలను చెప్పడంలో నేర్పరి. ‘మిస్ వరల్డ్ 2021’ కిరీటాన్ని గెలుచుకున్న మొదటి హిజాబీగా చరిత్ర సృష్టించింది. బార్బీ బొమ్మకు అందాల కిరీటం!‘ఈసారి విశ్వసుందరి కిరీటాన్ని బార్బీ బొమ్మ గెలుచుకుంది’ అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ‘బార్బీ బొమ్మకు అందాల కిరీటం ఏమిటీ?!’ అనే ఆశ్చర్యంలో ఉండగానే అసలు విషయం తెలిసిపోయింది. ‘మిస్ యూనివర్స్–2024’ అందాల కిరీటాన్ని గెలుచుకున్న 21 సంవత్సరాల విక్టోరియా కెజార్ ముద్దు పేరు... బార్బీ డాల్. కెజార్ అచ్చం ‘బార్బీ’లా ఉంటుందని ఆలా పిలుస్తారు. బ్యూటీ స్పాట్...ఈసారి విశ్వసుందరి పోటీ విజేత కంటే ఎక్కువమంది దృష్టిని ఆకర్షించింది ఈజిప్ట్‌కు చెందిన లోగినా సలాహ్. చర్మంపై తెల్లటి మచ్చలు (బొల్లి) వల్ల ఎనిమిది సంవత్సరాల వయసు నుంచే ఎన్నో రకాల అవమానాలు ఎదుర్కొంది. సలాహ్ మిస్ యూనివర్స్ పోటీలోకి అడుగుపెట్టడం అనేది ఊహకు కూడా అందని విషయం. సంప్రదాయ సౌందర్య ప్రమాణాలను బ్రేక్ చేసిన వ్యక్తిగా ఎందరికో స్ఫూర్తినిచ్చే చారిత్రక సందర్భం కూడా. బ్లాగర్, ఇన్ఫ్లూయెన్సర్, మోడల్, మేకప్–ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న సలాహ్‌కు సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు.‘స్కిన్పాజిటివిటీ’ని ప్రచార అంశంగా తన ప్రయాణాన్నిప్రారంభించి ఎంతోమంది యువతుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపింది సలాహ్. సలాహ్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమన్ మాత్రమే కాదు సానుకూల మార్పు, ఆత్మవిశ్వాసం... మొదలైన అంశాలలో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి గొప్ప వక్తగా పేరు తెచ్చుకుంది. న్యూయార్క్‌లోని బెవర్లీ హిల్స్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్ నుంచి లైసెన్స్ పొందిన సలాహ్ తన సోషల్ మీడియా ΄్లాట్ఫామ్లలో క్రియేటివ్ లుక్స్‌పై ట్యుటోరియల్స్‌ను నిర్వహించేది. 2023లో దుబాయ్ ఫ్యాషన్ వీక్లోపాల్గొనడం ద్వారా గ్లామర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.‘బియాండ్ ది సర్ఫేస్ మూమెంట్’ వేదిక ద్వారా బాలికలు, యువతులలో సామాజిక స్పృహ కలిగిస్తోంది. దుబాయ్‌లో నివసిస్తున్న 34 సంవత్సరాల సలాహ్ ఒక బిడ్డకు తల్లి. సింగిల్ మదర్.‘మిస్ యూనివర్స్ 2024’లో లోగినా సలాహ్ టాప్ 30లో చోటు సాధించింది. బంగారు పక్షి‘మిస్ యూనివర్స్’ కిరీటం మిస్ అయిపోయినా ‘గోల్డెన్ బర్డ్’ కాస్ట్యూమ్‌తో ఎంతోమంది హృదయాలను గెల్చుకుంది రియా సింఘా. ‘మిస్ యూనివర్స్’కు మన దేశం నుంచిప్రాతినిధ్యం వహించిన రియా సింఘా ధరించిన ‘ది గోల్టెన్ బర్డ్’ దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఏడాదిప్రారంభంలో ‘మిస్ యూనివర్స్ ఇండియా’ కిరీటాన్ని గెల్చుకున్న సింఘా సింబాలిక్ దుస్తుల్లో రన్‌వేపై నడుస్తూ ప్రేక్షకులను మంత్రముగ్థుల్ని చేసింది. శ్రేయస్సు, సంపదకు బంగారు పక్షి చిహ్నం. ఈ డ్రెస్‌ను వియత్నాం డిజైనర్ గుయెన్ ఎన్లోక్ డిజైన్ చేశారు. -
ఈ యూజర్ ఫ్రెండ్లీ మిషన్‌తో అవాంఛిత రోమాలకు చెక్..!
చాలామంది తమ అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి ఎక్కువగా రేజర్‌ను వాడుతుంటారు. దాని వల్ల చర్మం మొద్దుబారడం, వెంట్రుకలు బిరుసెక్కడం, మరింత దట్టంగా పెరగడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే చిత్రంలోని మెషిన్ ఇలాంటి సమస్యలకు ఇట్టే చెక్ పెడుతుంది.ఈ హైపవర్ హెయిర్ రిమూవల్ డివైస్ ఎల్ఈడీ లైట్ థెరపీని కూడా అందిస్తుంది. ఈ ఎపిలేటర్ మెషిన్ మృదువుగా, నొప్పి తెలియకుండా ట్రీట్మెంట్ అందిస్తుంది. వెంట్రుకలను తొలగించే సమయంలో చల్లదనాన్ని అందిస్తుంది. వెంట్రుకలు తొలగిన తర్వాత దురద పుట్టడం, మంట కలగడం వంటి ఇబ్బందులను రానివ్వదు. ఫ్లాష్, మోడ్, లెవల్స్ వంటి ఆప్షన్స్ అన్నీ డివైస్‌కి ముందువైపు ఉంటాయి. చిత్రంలో చూపిన విధంగా చర్మానికి ఆనించి, వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఈ మెషిన్ సాయంతో వెంట్రుకలు తొలగించుకుంటే గీతలు, మచ్చలు, ముడతలు తగ్గుతాయి. కాళ్లు, చేతులు, నడుము, పొట్ట, అండర్ ఆర్మ్స్, బికినీలైన్ ఇలా చర్మంపై పలుభాగాల్లో వెంట్రుకలను సులభంగా తొలగించుకోవచ్చు. దీని వాడకంతో అవాంఛిత రోమాలున్న చర్మం కాలక్రమేణా మృదువుగా మారుతుంది. రోలర్ అటాచ్మెంట్, ఎల్ఈడీ అటాచ్మెంట్, స్పాట్ అటాచ్మెంట్, ఏసీ అడాప్టర్‌తో ఈ మెషిన్ లభిస్తుంది. దాంతో ఇది యూజర్ ఫ్రెండ్లీగా పని చేస్తుంది. దీన్ని సులభంగా వెంట తీసుకుని వెళ్లొచ్చు. (చదవండి: ప్రపంచంలోనే అతి పెద్ద ఆటబొమ్మల దుకాణం..!) -
అందాల రాణి ఐశ్వర్య రాయ్ బ్యూటీ సీక్రెట్ ఇదే..!
బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ అందానికే ఐకానిక్‌గా ఉండే సౌందర్యం ఆమె సొంతం. ఎంతమంది అందగత్తలైన ఆమెకు సాటి రారు. అలాంటి అద్భుతమైన అందం ఆమెది. ఐదుపదుల వయసులో కూడా అంతే గ్లామర్‌గా ఉండటం విశేషం. ఎక్కడ ఐశ్వర్యరాయ కనిపించినా..అందాల రాణి వస్తుందని ఆత్రంగా చూస్తారు. అంతటి ఆకర్షణీయమైన అందాన్ని మెయింటైన్ చేసేందుకు ఐశ్వర్య ఏంచేస్తుందో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు కూడా. అంతేగాదు ప్రతి మహిళ చర్మ సంరక్షణ కోసం ఏం చేయాలో కూడా చెప్పారామె. ఇంతకీ అవేంటో చూద్దామా..!.మాజీ మిస్ ఇండియా ఐశ్వర్య రాయ్ ఇప్పటికి అంతే ఫిట్‌గా అందంగా కనిపిస్తారు. ఎక్కడ మచ్చ్చుకైనా..వృద్ధాప్య ఛాయలు కానరావు. అంతలా మేని ఛాయ మెరుస్తూ ఉండేందుకు ఐశ్వర్య ఎంతో కేర్ తీసుకుంటానని చెప్పారు. ఆరోగ్యం కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో అలాగే చర్మ సంరక్షణ కూడా అంతే ముఖ్యమని అంటోంది ఐశ్వర్య రాయ్. తాను కూడా ప్రతి భారతీయ మహిళ ఎలా ఉంటుందో తాను అలానే ఉంటానన్నారు. "అయితే ఆత్మగౌరవంతో, సరైన వ్యక్తిత్వంతో బతకాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రతి స్త్రీ తన ఆత్మగౌరవాన్ని చంపుకుని జీవించాల్సిన పనిలేదు. అదీగాక మహిళలు నిద్ర లేచిన దగ్గర నుంచి గడియారంలోని ముల్లుకంటే వేగంగా ఆగకుండా పనిచేస్తూనే ఉంటారని అన్నారు. అందువల్ల కనీసం కొద్దిసేపైనా మీ కోసం సమయం కేటాయించడం అత్యంత ముఖ్యం. హైడ్రేటెడ్‌గా పరిశుభ్రంగా ఉండేందుకు ప్రయత్నించండి. మీ గౌరవాన్ని ఇనుమడింప చేసే అందంపై దృష్టి పెట్టండి. అందులో ఎలాంటి తప్పు లేదు. తప్పసరిగా మొటిమలు, అలెర్జీలు వంటి బారిన పడకుండా స్కిన్కేర్లు వాడలన్నారు. తప్పనసరిగా మాయిశ్చరైజర్లను వాడమని సూచించింది. వంటపనులతో సతమతమయ్యే మహిళలు తమ చర్మ ఆరోగ్యం కోసం మాయిశ్చరైజర్లు వాడాలని అన్నారు." ఐశ్వర్యరాయ్.(చదవండి: 'తుప్పా దోస విత్ చమ్మంతి పొడి' గురించి విన్నారా?) -
చలి పులి వచ్చేస్తోంది నెమ్మదిగా...ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!
నెమ్మదిగా చలి ముదురుతోంది. వెచ్చని దుప్పట్టు, చలిమంటలు కాస్త ఊరటనిచ్చినా ఇంకా అనేక సమస్యలు మనల్ని వేధిస్తుంటాయి. ముఖ్యంగా శీతగాలులకు శ్వాసకోశ వ్యాధులు, చర్మ సమస్యలు బాగా కనిపిస్తాయి. మరి ఈ సీజన్లో చర్మం పొడిబారకుండా, పగలకుండా ఉండాలంటే ఏం చేయాలి. ఇదిగో మీ కోసం ఈ చిట్కాలు.పొడి బారే చర్మానికి మాయిశ్చరైజర్లు పదే పదే రాయాల్సి వస్తుంది. ఆ అవసరం లేకుండా, చర్మం మృదుత్వం కోల్పోకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి.పాల మీగడలో తేనె కలిపి ముఖానికి, చేతులకు పట్టించి, మృదువుగా మసాజ్ చేయాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.చలికాలం రోజూ ఈ విధంగా చేస్తుంటే చర్మకాంతి కూడా పెరుగుతుంది. చర్మానికి సరైన పోషణ లేక లేకపోతే జీవ కళ కోల్పోతుంది. పాలు, బాగా మగ్గిన అరటిపండు గుజ్జు కలిపి మిశ్రమం తయారుచేసుకొని ప్యాక్ వేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి. జిడ్డుచర్మం గలవారు పాలు–రోజ్‌వాటర్ కలిపి రాసుకోవచ్చు. తర్వాత వెచ్చని నీటితో కడిగేయాలి. చర్మంపై ఎక్కువ మృతకణాలు కనిపిస్తే కలబంద రసంలో పది చుక్కల బాదం నూనె, నువ్వుల నూనె కలిపి ముఖానికి, చేతులకు రాయాలి. వృత్తాకారంలో రాస్తూ మర్దన చేయాలి.రాత్రంతా అలాగే వదిలేసి, మరుసటి రోజు ఉదయం వెచ్చని నీటితో కడిగేయాలి.శీతాకాలంలో శరీరాన్ని తేమగా ఉంచుకోవాలి. చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకుంటేనే మెరుస్తూ ఉంటుంది. అలా ఉండాలంటే తగినన్ని నీళ్లు తాగాలి. (నో జిమ్.. నో డైటింగ్ : ఏకంగా 20 కిలోల బరువు తగ్గింది!)ఫ్యాటీఫుడ్స్కు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. తాజా ఆకుకూరలు, సీ విటమిన్ లభించే పండ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒత్తిడికి దూరంగా ఉంటూ సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి. రోజూ వాకింగ్, యోగా లాంటి వ్యాయామం చేస్తే శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో మన ముఖంలో చర్మకాంతిలో చక్కటి గ్లో వస్తుంది. -
దీపికా పదుకొణె బ్యూటీ రహస్యం..! ఇలా చేస్తే జస్ట్ మూడు నెలల్లో..
బాలీవుడ్ ప్రసిద్ధ నటి దీపికా పదుకొణె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయంతో వేలాది అభిమానులను సంపాదించుకుంది. ఆమె ఇటీవలే పండటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక గ్లామర్ పరంగా దీపికాకి సాటిలేరు అనడంలో అతిశయోక్తి లేదు. ఆమె మేని ఛాయ, కురులు కాంతిలీనుతూ ఉంటాయి. చూడగానే ముచ్చటగొలిపే తీరైన శరీరాకృతి చూస్తే..ఇంతలా ఎలా మెయింటెయిన్ చేస్తుందా? అనిపిస్తుంది కదూ. ఇంతకీ ఆమె బ్యూటీ రహస్యం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అంతేగాదు దీన్ని రెగ్యులర్‌గా పాటిస్తే జస్ట్ మూడునెలల్లో దీపికాలాంటి మెరిసే చర్మం, జుట్టుని సొంతం చేసుకోవచ్చట. అదేంటో చూద్దామా..!.మనం తీసుకునే ఆహరమే చర్మం, జుట్టు ఆరోగ్యంలో కీలకపాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతుంటారు. అందుకే తాజా పండ్లు, కూరగాయాలకు ప్రాధాన్యత ఇవ్వండని పదేపదే సూచిస్తుంటారు. అయితే ఇటీవల ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ పూజ అనే మహిళ జ్యూస్ రెసిపీతో కూడిన వీడియో పోస్ట్ చేసింది. అందులో ఇది బాలీవుడ్ నటి దీపికా పదుకొణెకు మూడు నెలల్లో మెరిసే చర్మం, మెరిసే జుట్టుని పొందడంలో సహయపడిందని పేర్కొనడంతో ఈ విషయం నెట్టింట తెగ వైరల్‌గా మారింది. నిజానికి ఆ జ్యూస్ రెసిపీలో ఉపయోగించిన పదార్థాలన్నీ ఆరోగ్యకరమైనవే. పైగా శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ ఉన్నాయి. ఆ జ్యూస్ ఏంటంటే..వేప, కరివేపాకు, బీట్రూట్, పుదీనాలతో చేసిన జ్యూస్. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, బయోస్కావెంజర్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉపయోగించినవన్నీ మంచి చర్మాన్ని, బలమైన జుట్టుని పొందడంలో ఉపయోగపడేవే. ప్రయోజనాలు..వేప ఆకులు: ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. కాబట్టి వేప ఆకులు శరీర నిర్విషీకరణకు దోహదం చేస్తాయి. ఇది మొటిమలను నియంత్రించి చర్మ కాంతివంతంగా ఉండేలా చేయడంలో సహాయపడుతుంది. బీట్రూట్: ఇందులో ఐరన్, ఫోలేట్, విటమిన్ సీలు ఉన్నాయి. ఇవి రక్త ప్రసరణకు, శరీరంలో కొత్త కణాలు ఏర్పడటానికి ముఖ్యమైనవి. ఇది చర్మాన్ని మృదువుగానూ, ఆర్యోకరమైన రంగుని అందిస్తుంది. అలాగే జుట్టు స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కొత్తిమీర ఆకులు: దీనిలో విటమిన్ ఏ, సీ కేలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్దీ చేసి మేని ఛాయను మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే ఇది జీర్ణవ్యవస్థను మెరుగ్గా ఉంచడమే గాక హైడ్రేటెడ్‌గా ఉండేలా చేస్తుంది.పుదీనా ఆకులు: పుదీనా యాంటీఆక్సిడెంట్ లక్షణాల తోపాటు శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది వేడిని తగ్గించి శరీరాన్ని లోపలి నుంచి పునరుజ్జీవింపజేపసి మొటిమలను నివారిస్తుంది. తయారీ విధానం..కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు, కరివేపాకు, వేపాకులు, కొత్తిమీర, పుదీనా వంటి పదార్థాలన్ని మిక్కీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. పిప్పితో సహా తాగడం కష్టంగా ఉంటే..వడకట్టుకుని తాగినా మంచి ఫలితం ఉంటుంది. దీన్ని ఉదయాన్నే తాజాగా తీసుకోవాలి. ఇలా క్రమంతప్పకుండా కనీసం మూడు నెలలు ఈ జ్యూస్‌ని తీసుకుంటే కాంతివంతమైన మేని ఛాయ, ఒత్తైన జుట్టు మీ సొంతం.(చదవండి: అమెరికాలో ... శాస్త్రీయ నృత్య రూపకంగా దుర్యోధనుడు) -
ఏళ్లు గడుస్తున్నా యంగ్‌గానే..!
వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంలో పలు మార్పులు చోటు చేసుకుంటాయి. అది యవ్వనంలో ఉండే మెరుపును, బిగుతును కోల్పోతుంది. చర్మంలోని బిగుతూ, మిసమిస పది కాలాల పాటు ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం...చర్మంపై వయసు ప్రభావం కనపడనివ్వకుండా చేసుకోడానికి అన్నిరకాల పోషకాలు ఉండే సమతుల ఆహారాన్ని తీసుకోండి. అందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఆకుకూరలు, పండ్లు, బాదం వంటి డ్రై ఫ్రూట్స్‌లో ఈ పోషకాలు ఎక్కువ. ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండటంతో పాటు శరీరంలోని లవణాలను కోల్పోకుండా చూసుకోండి. దీనివల్ల హైడ్రేటెడ్‌గా ఉంటారు. ఫలితంగా చర్మం ఆరోగ్యకరమైన మేని మెరుపు తో నిగారిస్తూ ఉంటుంది. గోరువెచ్చని నీళ్లతో... తక్కువ గాఢత ఉన్న మైల్డ్ సోప్‌లు వాడటమే మంచిది. మంచి మాయిశ్చరైజేషన్ లోషన్స్‌తో చర్మాన్ని పొడిబారకుండా చూసుకోవాలి. రోజూ ఎండకు వెళ్లే వారు మంచి సస్‌స్క్రీన్ లోషన్స్ ఉపయోగించాలి. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా సౌకర్యవంతమైన దుస్తులు ధరించాలి. చర్మంపై వచ్చే ఇన్ఫెక్షన్స్ను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకోవాలి. ఈ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే వయసు పెరుగుతున్నప్పటికీ చర్మం ఏజింగ్ ప్రభావానికి గురికాకుండా ఉంటుంది. (చదవండి: గంటలకొద్ది కూర్చొని పనిచేసే వాళ్లకు ది బెస్ట్ వర్కట్లివే..!)