Hollywood
-
బిడ్డకు జన్మనిచ్చిన నటి.. ఏకంగా 53 ఏళ్లకు!
ప్రముఖ హాలీవుడ్ నటి, మోడల్ నవోమి కాంప్‌బెల్ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. దాదాపు 53 ఏళ్ల వయసులో మరోసారి తల్లయ్యారు. ఈ విషయాన్ని నవోమి తన ఇన్‌స్టా ద్వారా పంచుకున్నారు. ఇప్పటికే మే 2021లో నవోమి తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. మళ్లీ రెండేళ్ల వ్యవధిలోనే మరో రెండో బిడ్డను స్వాగతించారు. తల్లి కావడానికి వయసుతో సంబంధం లేదని నవోమి నిరూపించింది. ఆమె శిశువును తన చేతుల్లో పట్టుకొని ఉన్న ఫోటోను అభిమానులతో పంచుకుంది. (ఇది చదవండి: రాకేశ్ మాస్టర్ ఇచ్చిన ఆస్తి పేపర్లు చించేశాడు.. ఎందుకో తెలిస్తే ) నవోమి తన ఇన్‌స్టాలో రాస్తూ..' మై లిటిల్ డార్లింగ్! నీ రాకతో మాకు మరింత సంతోషాన్ని తీసుకొచ్చావు. మా ప్రేమ నీకు ఎల్లప్పుడు అండగా ఉంటుంది. నువ్వు దేవుడిచ్చిన బహుమతి. వెల్కమ్ టూ బేబీబాయ్.' క్యాప్షన్ పెట్టింది. ఇది చూసిన ఆమె అభిమానులు, సన్నిహితులు అభినందనలు తెలిపారు. పిల్లలను కనేందుకు వయసుతో పనిలేదని రుజువు చేసిందంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. (ఇది చదవండి: దిల్ రాజు కుమారుడి బర్త్‌డే పార్టీలో సెలబ్రిటీల సందడి) View this post on Instagram A post shared by Dr Naomi Campbell (@naomi) -
ఆస్కార్‌లో కొత్త రూల్.. ఈ అర్హతలు ఉంటేనే ఎంట్రీ
ప్రతి ఏడాది ఆస్కార్ సభ్యత్వ నమోదు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆస్కార్ అవార్డు విజేతల నిర్ణయానికి ఈ సభ్యుల ఓటింగ్ కీలకంగా నిలుస్తుంది. 96వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 14న జరగనుంది. కాగా ‘క్లాస్ ఆఫ్ 2023’లో భాగంగా 398 మంది కొత్త సభ్యులకు ఆస్కార్ సభ్యత్వ ఆహ్వానాన్ని పంపినట్లు ఆస్కార్ కమిటీ సీఈవో బిల్ క్రామెర్, అధ్యక్షుడు జానెట్ యాంగ్ వెల్లడించారు. ఈ జాబితాలో మన దేశం నుంచి దాదాపు 15 మందికి ఆహ్వానం అందడం విశేషం. తెలుగు నుంచి ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌లో ఆరుగురు, తమిళం నుంచి మణిరత్నం, బాలీవుడ్‌నుంచి దర్శక–నిర్మాత కరణ్ జోహార్ వంటివారు ఉన్నారు. వృత్తిపరమైన అర్హతలు, ప్రపంచవ్యాప్త గుర్తింపు వంటి అంశాల ఆధారంగా ఈ ‘క్లాస్ ఆఫ్ 2023’ జాబితాను తయారు చేసినట్లు అకాడమీ పేర్కొంది. ఈ 398 మందిలో 51 దేశాలకు చెందినవారు ఉండగా, వీరిలో 40 శాతం మంది మహిళలు, 52 శాతం మంది యూఎస్‌కు చెందనివారు ఉన్నట్లుగా ఆస్కార్ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. ఇక ఈ కొత్త సభ్యులతో కలిసి ఆస్కార్ మెంబర్‌షిప్‌లు కలిగి ఉన్నవారి సంఖ్య 10, 817కు చేరినట్లు హాలీవుడ్ అంటోంది. ఆర్ఆర్ఆర్ నుంచి ... ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాటకుగాను ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఆస్కార్ అవార్డు అందుకున్న మ్యూజిక్ డైరెక్టర్ యంయం కీరవాణి, పాట రచయిత చంద్రబోస్‌లకు అకాడమీ ఆహ్వానాలు అందాయి. అలాగే ఈ చిత్రం హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్‌లు కూడా ఆస్కార్ అకాడమీ సభ్యులు కానున్నారు. దర్శకులు మణిరత్నం, షౌనక్ సేన్ (95వ ఆస్కార్ అవార్డ్స్‌లో డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఇండియా తరఫున నామినేట్ అయిన ‘ఆల్ దట్ బ్రీత్స్’ దర్శకుడు), నిర్మాతలు కరణ్ జోహర్, సిద్ధార్థ్ రాయ్ కపూర్ (95వ ఆస్కార్ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఇండియా తరఫున అఫీషియల్ ఎంట్రీగా పంపబడిన గుజరాతీ ఫిల్మ్ ‘ది ఛెల్లో షో’ నిర్మాత), చైతన్య తమ్హానే (మరాఠీ), ప్రొడక్షన్ అండ్ టెక్నాలజీకి చెందిన గిరీష్ బాలకృష్ణన్, క్రాంతి శర్మ, విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్‌లు హరేష్ హింగో రాణి, పీసీ సనత్, ఫిల్మ్ ఎగ్జిక్యూ టివ్‌లు శివానీ రావత్, శివానీ పాండ్యా మల్హోత్రా వంటివారు ఉన్నారు. గర్వంగా ఉంది – రాజమౌళి ‘‘ఆస్కార్ అకాడమీ సభ్యత్వ నమోదు కోసం ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ నుంచి ఆరుగురికి ఇన్విటేషన్స్ రావడం గర్వంగా ఉంది. వీరితో పాటు భారతదేశం తరఫున ఆస్కార్ ఆహ్వానం అందుకున్నవారికి కూడా నా శుభాకాంక్షలు’’ అని ట్వీట్ చేశారు రాజమౌళి. కొత్త రూల్ ఓ సినిమాను ఆస్కార్ ఎంట్రీకి పంపాలంటే కొన్ని నియమ, నిబంధనలు ఉన్నాయి. యూఎస్‌లోని ఆరు ప్రధాన నగరాల్లో (న్యూయార్క్, లాస్ ఏంజెల్స్, చికాగో, మియామి, అట్లాంటా, శాన్ ఫ్రాన్సిస్కో) ఆ సినిమా కనీసం ఏడు రోజులు ప్రదర్శితం కావాలి. వీటిలో ఒక షో సాయంత్రం ప్రైమ్ టైమ్‌లో ఉండాలి, థియేటర్స్‌లో కనీస సీటింగ్ సామర్థ్యం ఉండాలి. తాజాగా బెస్ట్ పిక్చర్, ఫారిన్ బెస్ట్ ఫిల్మ్ విభాగాలకు సంబంధించి కొత్త రూల్ పెట్టనున్నారట. ఇకపై ఆస్కార్‌కు ఓ సినిమాను పంపాలంటే యూఎస్‌లోని పాతికకు పైగా మూవీ మార్కెట్స్ ఉన్నచోట సినిమాలు ప్రదర్శించబడాలట. అది కూడా రెండువారాలకు పైగా. అయితే ఇది ఖర్చుతో కూడుకున్న పని అని కొందరు పెదవి విరుస్తున్నారు. ఈ కొత్త రూల్‌ను 97వ ఆస్కార్ అవార్డ్స్ ప్రదానోత్సవం (2025) నుంచి అమలులోకి తేవాలని అవార్డ్ కమిటీ ప్లాన్ చేస్తోందన్నది హాలీవుడ్ టాక్. ఆ నలుగురికీ గౌరవం ‘‘ఈ నలుగురూ చలన చిత్రపరి శ్రమలో మంచి మార్పుకు నాంది అయ్యారు. తర్వాతి తరం ఫిల్మ్ మేకర్స్‌కి, ఫ్యాన్స్‌కి స్ఫూర్తిగా నిలిచారు. వీరిని సత్కరించడం ‘బోర్డ్ ఆఫ్ గవర్నర్స్’కి థ్రిల్‌గా ఉంది’’ అని ఆస్కార్ అకాడమీ అవార్డ్ అధ్యక్షుడు జానెట్ యాంగ్ అన్నారు. సినిమా రంగానికి విశిష్ట సేవలందించిన ప్రముఖులకు ‘గవర్నర్ అవార్డ్స్’లో భాగంగా హానరరీ ఆస్కార్ అవార్డ్‌ను అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది ఈ గౌరవ ఆస్కార్‌ను అందుకోనున్న నలుగురిలో ముగ్గురు మహిళలు ఉండటం విశేషం. నటి ఏంజెలా బాసెట్, రచ యిత–దర్శకుడు–నటుడు–గేయ రచయిత మెల్ బ్రూక్స్, ఫిల్మ్ ఎడిటర్ కరోల్ లిటిల్టన్లతో పాటు సన్డాన్స్ ఇన్స్టిట్యూట్కు చెందిన మిచెల్ సాటర్‌లకు అవార్డును అందజేయనున్నారు. నవంబర్ 18న లాస్ ఏంజెల్స్‌లోని ఫెయిర్మాంట్ సెంచరీ ప్లాజాలో జరిగే వేడుకలో ఈ నలుగురూ గౌరవ పురస్కారాలు అందుకుంటారు. -
విషాదం.. క్యాన్సర్‌తో ‘టైటానిక్’ నటుడు మృతి
చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తమదైన నటనతో ఎంతో కాలంగా ప్రేక్షకులను అలరించిన దిగ్గజ నటులు ఒక్కొక్కరు ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నారు. తాజాగా 'టైటానిక్' నటుడు లేవ్ పాల్టర్(94) కన్నుమూశారు.గత కొంత కాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధ పడుతున్న పాల్టర్ మే 21, 2023న 94న లాస్ ఏంజిల్స్ ఇంట్లో మరణించాడు. అయితే ఈ విషయం ఆలస్యంగా బయటి ప్రపంచానికి తెలిసింది. దాదాపు నెల రోజుల తర్వాత ఈ విషయాన్ని పాల్టర్ కూతురు కేథరీన్ పాల్టర్ మీడియాతో వెల్లడించింది. లేవ్ పాల్టర్ పూర్తి పేరు లియోన్ లూయిస్ పాల్టర్.నవంబర్ 3, 1928న న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో జన్మించాడు. రంగస్థలం నటుడిగా కెరీర్ ప్రారంభించి సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. టెలివిజన్ రంగంలోనూ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. జేమ్స్ కేమెరూన్ తెరకెక్కించిన ‘టైటానిక్’ మూవీతో పాల్టర్కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ చిత్రంలో డిపార్ట్మెంట్ స్టోర్ మాగ్నెట్ ఇసిడోర్ స్ట్రాస్ పాత్రను పోషించాడు.పాల్టర్ మరణ వార్త తెలియగానే టైటానిక్ టీమ్‌తో పాటు ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. ‘Titanic’ actor Lew Palter dead at 94 Lew Palter, the actor best known to audiences as Macy’s co-owner Isidor Straus in the 1997 classic “Titanic,” died last month, it was revealed Monday. He was 94. Palter succumbed to lung cancer on May 21, his daughter Catherine told The… pic.twitter.com/mq5Oi7N7ON — Dr.LyndaBarnes (@MrsBarnesII) June 27, 2023 -
వామ్మో టైటానిక్ దగ్గరకా? నాకు అలాంటి అనుభవమే: జేమ్స్ కామెరూన్
టైటానిక్ షిప్ శకలాలని చూసేందుకు వెళ్లిన టైటాన్ అనే జలాంతర్గామి కథ విషాదాంతమైంది. నీటి అడుగున పీడన తీవ్రత పెరగడం వల్ల ఈ టైటాన్ పేలిపోయి, అందులోని ఐదుగురు మరణించారని అమెరికా కోస్ట్ గార్డ్ తాజాగా ప్రకటించింది. రిమోట్ కంట్రోల్డ్ వెహికల్ సాయంతో మినీ జలాంతర్గామి శకలాలని గుర్తించారు. ఇప్పుడు ఈ విషయమై టైటానిక్ సినిమా డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ స్పందించాడు. (ఇదీ చదవండి: టైటాన్ ఆశలు జల సమాధి) 'ఈ విషయం(సబ్ మెరైన్ పేలిపోవడం) జీర్ణించుకోవడానికే నాకు చాలా కష్టంగా ఉంది. ఇంతకుముందే సదరు ఓషియన్ గేట్ కంపెనీకి చాలామంది ఇంజినీర్లు లెటర్స్ రాశారు. మీరు చేస్తున్నది చాలా విపరీతమైన ప్రయోగం అని ఆయా లేఖల్లో పేర్కొన్నారు' అని జేమ్స్ కామెరూన్ చెప్పుకొచ్చారు. 'టైటాన్ సబ్ మెరైన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 33 సార్లు ఆ ప్రాంతానికి వెళ్లొచ్చాను. అక్కడ 13వేల అడుగుల లోతు ఉంటుంది. సబ్ మెరైన్ పై చాలా ఒత్తిడి పడుతుంది. ఏ మాత్రం కంట్రోల్ తప్పినా ఆచూకీ దొరకడం అసాధ్యం. ఇది సాహసంతో కూడిన ప్రయాణం. టైటానికి షిప్ దగ్గర్లో ఏదో తెలియని శక్తి ఉంది. అక్కడ మిస్ అయితే దొరకడం కష్టమని నేను ముందే ఊహించాను. ఎందుకంటే నాక్కూడా గతంలో ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి' అని జేమ్స్ కామెరూన్ చెప్పుకొచ్చాడు. James Cameron believes OceanGate Titan imploded before reaching Titanic. #OceanGate #OceansGate #Titan #Titans📷 #submarino #Submarine #Submersible #implosion #imploded #Titanic #TitanicRescue #titanicsubmarine #sousmarin pic.twitter.com/wGtWvXR0V7 — Ak Cheema (@AkCheema777) June 23, 2023 (ఇదీ చదవండి: సాగర గర్భంలో కలిసిన సాహస వీరులు) -
అనుమానాస్పద స్థితిలో సింగర్ మృతి.., హత్యా? ఆత్మహత్యా?
దక్షిణ కొరియా యూత్‌లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న స్టార్ సింగర్ చోయ్ సంగ్ బాంగ్(33) అనుమానాస్పద స్థితిలో మరణించాడు. దక్షిణ సియోల్‌లోని తన నివాసంలో విగతజీవిగా పడున్నట్లు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు..మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. అనంతరం అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన దర్యాప్తును ప్రారంభించారు. చోయ్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా ఎవరైన హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రాథమిక విచారణలో మాత్రం చోయ్ ఆత్మహత్య చేసుకున్నాడనే తేలిందట. చనిపోవడానికి కొన్ని గంటల ముందు తన యూట్యూబ్ చానెల్లో ఓ లేఖను అప్లోడ్ చేసిన ఆయన.. తన వల్ల ఇబ్బంది పడినవారందరికి క్షమాపణలు చెప్పారు. 2011లో రియాలిటీ సింగింగ్ పోటీ ‘కొరియాస్ గాట్ టాలెంట్’లో రెండో స్థానం పొందిన తర్వాత చోయ్ మరింత ఫేమస్ అయ్యాడు. చిన్న వయసులోనే స్టార్ సింగర్‌గా ఎదిగిన ఆయనకు..అదే స్థాయిలో వివాదాలు కూడా చుటుటముట్టాయి. ముఖ్యంగా తాను క్యాన్సర్ బారిన పడ్డానని, చికిత్స కోసం డబ్బులు కావాలంటూ విరాళాలు వసూలు చేయడంతో ఆయనపై విమర్శలు వచ్చాయి. డబ్బు కోసమే క్యాన్సర్ బారిన పడినట్లు అబద్దం చెప్పినట్లు స్వయంగా ఆయనే ఒప్పుకున్నారు. తనకు వచ్చిన విరాళాలు కూడా తిరిగి ఇచ్చేస్తానని హామీ ఇచ్చాడు. అయితే కొన్నాళ్లుగా ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఒంటరిగా ఉంటున్న చోయ్..ఇప్పుడు విగతజీవిగా మారడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. -
స్టార్ సింగర్ మెడలో డైమండ్ వాచ్.. ఎన్ని కోట్లో తెలుసా?
మీరు వాచీ ఎక్కడ కట్టుకుంటారు? అని అడగ్గానే ఇదేం పిచ్చి ప్రశ్న అని కిందనుంచి పైవరకు చూసి.. చేతికి కట్టుకుంటాం అని చెబుతారు. కానీ కొన్ని గడియారాలు ఉంటాయి. వాటిని బాడీలో ఎక్కడపడితే అక్కడ కట్టుకోవచ్చు! ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. ఓ ప్రముఖ పాప్ సింగర్ తన మెడకు ఓ డైమండ్ వాచ్ ధరించి కనిపించింది. ఇప్పుడు ఆ వాచ్, దాని ధర సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. (ఇదీ చదవండి: శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 28 సినిమాలు!) మన దగ్గర పెద్దగా ఉండదు కానీ పాశ్చాత్య దేశాల్లో పాప్ కల్చర్ చాలా ఎక్కువ. పాప్ సాంగ్స్ పాడే సింగర్స్ ని పిచ్చిపిచ్చిగా అభిమానిస్తారు. అలా ఫేమస్ అయింది రిహానా. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెన్సీతో ఉంది. తాజాగా తన భాయ్ ఫ్రెండ్ రాకీతో కలిసి ఓ చోట కనిపించింది. అయితే ఇందులో పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు కానీ ఆమె మెడకు వాచ్ ఉండటం కాస్త వింతగా అనిపించింది. అది వజ్రాలతో పొదిగిన గడియారం కావడం మరింత ఎట్రాక్షన్ గా నిలిచింది. ఈ వాచ్ ధర గురించి మాట్లాడుకుంటే రూ.5.7 కోట్లు రూపాయలని తెలుస్తోంది. జాకబ్ & కో కంపెనీ.. పాప్ సింగర్ రిహానా కోసం ప్రత్యేకంగా ఈ వజ్రాల గడియారాన్ని డిజైన్ చేశారు. మెడపై ఓ వాచ్ ధరించడం ఇదే తొలిసారి అని చెప్పుకొచ్చింది. తమ కంపెనీ ఇన్ స్టా పేజీలో రిహానా వాచ్ తో ఉన్న ఫొటోని పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ వాచ్, దాని కాస్ట్ చూసిన నెటిజన్స్ నోరెళ్లబెడుతున్నారు. View this post on Instagram A post shared by JACOB & CO. (@jacobandco) (ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌హిట్ 'గురక సినిమా'.. అస్సలు మిస్సవ్వొద్దు!) -
విలన్‌గా ఆలియా భట్.. ఆ హాలీవుడ్ మూవీలో ఏకంగా
బాలీవుడ్ లో చాలామంది స్టార్స్ తో పోలిస్తే ఆలియా భట్ స్పెషల్. ఎందుకంటే టీనేజ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ కొట్టింది. అందరిలానే ఈమెని కూడా నెపోటిజం కిడ్ అని ట్రోల్స్ చేశారు. కానీ అవేవీ ఈమె సక్సెస్ ని ఆపలేకపోయాయి. దీంతో ఇండియాలోనే టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ లోనూ అదరగొట్టేందుకు రెడీ అయిపోయింది. ఆలియా హాలీవుడ్ ఎంట్రీ ఇప్పటివరకు 20కి పైగా హిందీ సినిమాల్లో నటించిన ఆలియా.. రాజమౌళి తీసిన 'ఆర్ఆర్ఆర్'లోనూ హీరోయిన్ గా నటించింది. అలా తెలుగు ప్రేక్షకులకు ఈమె పరిచయమే. హాలీవుడ్ లో 'హార్ట్ ఆఫ్ స్టోన్' అనే మూవీ చేస్తోంది. అక్కడ ఆలియాకు ఇదే ఫస్ట్ మూవీ. చానాళ్ల క్రితమే షూటింగ్ పూర్తి చేసిన ఈ సినిమాని ఆగస్టు 11న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా తెలుగు ట్రైలర్ ని విడుదల చేశారు. (ఇదీ చదవండి: కోర్టులో లొంగిపోయిన హీరోయిన్ అమీషా పటేల్!) క్యూటెస్ట్ విలన్ గా ఆలియా! మన దగ్గర హీరోయిన్ గా అలరించిన ఆలియా.. హాలీవుడ్ ఎంట్రీ మాత్రం క్యూటెస్ట్ విలన్ గా ఇచ్చింది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ లో ఈమె సీన్స్ సమ్ థింగ్ ఇంట్రెస్టింగ్ అనేలా ఉన్నాయి. యాక్షన్ సీన్స్, డైలాగ్స్ తో వావ్ అనిపించింది. ఈ మూవీ ఆలియాకు చాలా స్పెషల్. ఎందుకంటే ప్రెగ్నెన్సీతో ఉన్న టైంలోనే షూటింగ్ లో పాల్గొని, సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసింది. 'హార్ట్ ఆఫ్ స్టోన్' స్టోరీ ఏంటి? దేశాన్ని ప్రమాదాల బారినుంచి రక్షించేందుకు 'చార్టర్' అనే ఓ సీక్రెట్ టీమ్ పనిచేస్తుంటుంది. దీనికి రాచెల్ స్టోన్(గాల్ గాటోడ్) లీడర్. దేశానికి ఇబ్బందికర పరిస్థితి తలెత్తినప్పుడు ఈ టీమ్ దాన్ని సరిచేస్తుంటారు. 'ది హార్ట్' అని పిలిచే ఓ మాక్ గఫిన్ కోసం వీరు వెతుకుతూ ఉంటారు. మరో టీమ్ కూడా దీనికోసమే సెర్చ్ చేస్తూ ఉంటుంది. 'ది హార్ట్' కోసం రెండు టీమ్స్ పోటీ పడుతుంటే.. ఆలియా భట్ రోల్ కూడా ఎంట్రీ ఇస్తుంది. చివరకు ఏమైందనేదే ఈ మూవీ స్టోరీ. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' మూవీ.. ప్రభాస్ అందుకే సైలెంట్‌గా ఉన్నాడా?) -
ఎనిమిదేళ్ల తర్వాత అవతార్ 5
ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన హాలీవుడ్ ‘అవతార్’, సూపర్ హీరోని చూపించిన మార్వెల్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అందుకే ఇటు ‘అవతార్’ సీక్వెల్స్ అటు ‘మార్వెల్’ ఫ్రాంచైజీల కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటారు. ఈ రెండు భారీ ్ర΄ాజెక్ట్స్ని హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ రాజీపడకుండా నిర్మిస్తుం టుంది. దర్శకుడు జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి ‘అవతార్’ తొలి భాగం 2009లో రాగా, రెండో భాగం రావడానికి పదమూడేళ్లు పట్టింది. గత ఏడాది ‘అవతార్ 2’ విడుదలైంది. మూడు, నాలుగు, ఐదో భాగం కూడా ఉంటాయని చిత్ర యూనిట్ ప్రకటించి, విడుదల తేదీలను కూడా ప్రకటించింది. అయితే తేదీలు వాయిదా పడ్డాయి. ఇక ‘మార్వెల్’ ఫ్రాంచైజీలను ఒకే దర్శకుడు కాకుండా వేరు వేరు డైరెక్టర్లు తెరకెక్కించే విషయం తెలిసిందే. ఈ చిత్రాల విడుదల తేదీలు కూడా వాయిదా పడ్డాయి. 2031లో ఫైనల్ అవతార్ తొలుత ‘అవతార్’ మూడో భాగాన్ని 2024లో, నాలుగో భాగాన్ని 2025లో, ఐదో భాగాన్ని 2028లో విడుదలకు మేకర్స్ ΄్లాన్ చేశారు. అయితే వాయిదా వేశారు. ఈ విషయాన్ని వాల్ట్ డిస్నీ సంస్థ బుధవారం ప్రకటించింది. మూడో భాగాన్ని 2025 డిసెంబర్ 19న, నాలుగో భాగాన్ని 2029 డిసెంబర్ 21న, ఐదో భాగాన్ని.. అంటే ఫైనల్ ‘అవతార్’ని 2031 డిసెంబర్ 19న విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. ‘‘ఒక్కో ‘అవతార్’ సినిమా ఒక్కో అద్భుతం. ఆ అద్భుతాన్ని ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు ఇవ్వడానికి ఫిలిం మేకర్స్‌గా మేం తగినంత కృషి చేస్తున్నాం. నాణ్యత విషయంలో రాజీపడేది లేదు. 2025లో థియేటర్స్‌లో పండోరా ప్రపంచాన్ని చూపించడానికి యూనిట్ హార్డ్‌వర్క్ చేస్తోంది’’ అని చిత్ర నిర్మాతల్లో ఒకరైన జాన్ లాండవ్ అన్నారు. ఏడాదికి రెండు మార్వెల్ చిత్రాలు వాల్ట్ డిస్నీ ఓ నిర్మాణ సంస్థగా వ్యవహరిస్తున్న మార్వెల్ చిత్రాలు చాలా ఫేమస్. ఇప్పటికి దాదాపు 30 చిత్రాలు రాగా, మార్వెల్ ఫ్రాంచైజీలో మరో 10 చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. కాగా... ఇప్పటికే విడుదల తేదీ ప్రకటించిన చిత్రాల కొత్త విడుదల తేదీలను నిర్మాణ సంస్థ ప్రకటించింది. మార్వెల్ ఫ్రాంచైజీలో వచ్చే ఏడాది మే 3న ‘డెడ్ పూల్ 3’ విడుదల కానుండగా అదే తేదీన విడుదలకు షెడ్యూల్ అయిన ‘కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్’ జూలై 24కి వాయిదా పడింది. కాగా, ‘థండర్ బోల్ట్స్’ని జూలై 24న విడుదల చేయాలనుకున్నారు కానీ, డిసెంబర్ 20కి వాయిదా వేశారు. వచ్చే ఏడాది ఆరు నెలల గ్యాప్‌లో ఈ రెండు చిత్రాలు వస్తాయి. ఇక 2025లో కూడా రెండు మార్వెల్ చిత్రాలు రానున్నాయి. ‘బ్లేడ్’ని 2025 ఫిబ్రవరి 14న, అదే ఏడాది మే 2న ‘ఫెంటాస్టిక్ ఫోర్’ని, ‘ఎవెంజర్స్: ది కాంగ్ డైనాస్టీ’ని 2026 మే 1న, ‘ఎవెంజర్స్: సీక్రెట్ వార్స్’ని 2027 మే 7న విడుదల చేయనున్నారు. -
కమెడియన్ మృతి.. అతనికి గుండెపోటు కాదు!
'బ్రేకింగ్ బ్యాడ్' సిరీస్‌లో కీలక పాత్రలో నటించిన హాస్యనటుడు మైక్ బటాయే జూన్ 1న మరణించిన సంగతి తెలిసిందే. అతను మొదట గుండెపోటుతో చనిపోయాడని కుటుంబసభ్యులు వెల్లడించారు. కానీ తాజాగా వైద్యాధికారులు ఇచ్చిన నివేదికలో అతను ఉరి వేసుకోవడం వల్ల మరణించాడని వెల్లడైంది. గతంలో కూడా ఆయన కుటుంబంలో ఎవరికీ కూడా గుండె జబ్బులు ఉన్నట్లు ఎలాంటి చరిత్ర లేదని తెలిసింది. కాగా.. జూన్ 1న మిచిగాన్‌లోని ఆయన ఇంట్లో విగతజీవిగా కనిపించారు. నటుడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలుసుకున్న హాలీవుడ్ ప్రముఖులు షాక్‌కు గురవుతున్నారు. (ఇది చదవండి: స్మగ్లింగ్ వివాదంపై స్పందించిన 'జబర్దస్త్' హరి) మైక్ బటాయే కెరీర్ మైక్ బటాయే సూపర్‌హిట్ సిరీస్ బ్రేకింగ్ బ్యాడ్లో మూడు ఎపిసోడ్లలో డెన్నిస్ మార్కోవ్స్కీగా కనిపించాడు. అంతేకాకుండా 'ఇట్స్ ఆల్వేస్ సన్నీ ఇన్ ఫిలడెల్ఫియా,' 'స్లీపర్ సెల్,' 'ది బెర్నీ మాక్ షో,' 'బాయ్ మీట్స్ వరల్డ్,' 'ఎవ్రీబడీ లవ్స్ రేమండ్' వంటి షోలలో కూడా నటించాడు. వీటితో మైక్ బటాయే న్యూయార్క్ గోతం, లాస్ ఏంజిల్స్ లాఫ్ ఫ్యాక్టరీ, కామెడీ స్టోర్, ది ఇంప్రూవ్, ఐస్‌హౌస్ వంటి ప్రముఖ కామెడీ క్లబ్‌లలో కూడా ప్రదర్శన ఇచ్చాడు. (ఇది చదవండి: 'సీతారామం' బ్యూటీకి బంపరాఫర్.. ఈసారి ఏకంగా!) -
షూటింగ్ సెట్లో భారీ అగ్ని ప్రమాదం.. సిబ్బందికి తీవ్రగాయాలు!
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసే చిత్రాల్లో గ్లాడియేటర్ సిరీస్ ఒకటి. గతంలో విడుదలైన గ్లాడియేటర్-1 సినీ ప్రేక్షకులను కట్టిపడేసింది. భారీ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ మూవీ సీక్వెల్‌గా గ్లాడియేటర్-2 తెరకెక్కిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా సెట్లో ఊహించని విధంగా అగ్ని ప్రమాదం జరిగింది. ( ఇది చదవండి: తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు.. ఆదిపురుష్ హీరోయిన్) ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మొరాకోలో జరుగుతోంది. ఈ ప్రమాదం వల్ల పలువురు సిబ్బంది గాయపడినట్లు చిత్ర నిర్మాణ సంస్థ పారామౌంట్ పిక్చర్స్ ప్రతినిధి వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ..'ఈ ప్రమాదంలో ఆనుగురు సిబ్బందికి గాయాలయ్యాయి. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నాం. ఇప్పటికే ఆరుగురు సిబ్బందిలో మరో నలుగురికి చికిత్స కొనసాగుతోంది. ఇంతటి భారీ అగ్నిప్రమాదం ఎప్పుడూ చూడలేదు. షూటింగ్ సెట్లో భద్రతా పరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం.' అని తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో నటీనటులకు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఆయన వెల్లడించారు. కాగా.. 2000 సంవత్సరంలో వచ్చిన ‘గ్లాడియేటర్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. సర్ రిడ్లీ స్కాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించడమే కాదు ఏకంగా 5 ఆస్కార్ అవార్డులు సొంతం చేసుకుంది. 23 ఏళ్ల తర్వాత ఈ సినిమా సీక్వెల్‌ను రూపొందిస్తున్నారు. ఈ మూవీ నవంబర్ 2024లో విడుదల కానుంది. ( ఇది చదవండి: కొత్తింట్లోకి అడుగు పెట్టిన హిమజ, ఫోటో వైరల్) -
థియేటర్లోకి వచ్చేసిన ‘ట్రాన్స్ఫార్మర్స్’
హాలీవుడ్ నుంచి ‘ట్రాన్స్ఫార్మర్స్’ సిరీస్ సినిమాలు తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాయి. అద్భుతమైన యాక్షన్ సీన్లతో ఇప్పటి వరకు వచ్చిన 6 సిరీస్‌లు సూపర్ హిట్ అందుకున్నాయి. తాజాగా 7వ సిరీస్ ట్రాన్స్ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ది బీస్ట్స్ నేడు (జూన్8) విడుదలైంది. హాలీవుడ్ నుంచి సెన్సేషనల్ ఫ్రాంచైజ్‌లలో ‘ట్రాన్స్ఫార్మర్స్’కు అత్యంత అధరణ ఉంది. ఈ సినిమా సిరీస్ లవర్స్ ఈ పర్టిక్యులర్ పార్ట్‌కు బాగా ఎగ్జైట్ అవుతారని తెలుస్తోంది. ప్రధానంగా గత సిరీస్‌ల కంటే కొత్తగా కథాంశం ఉన్నట్లు మేకర్స్ తెలిపారు. (ఇదీ చదవండి: పట్టాలెక్కనున్న మరో రామాయణం.. అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా!) ఆటోబాట్స్ పై వచ్చే సీక్వెన్స్ మంచి ట్రీట్ ఇస్తాయి. అలాగే ఈ సిరీస్‌లో భారీ యాక్షన్ సీన్స్, యూనిక్ వే ప్రెజెంటేషన్ కోసం వెళ్లే వాళ్లు కూడా చాలా మంది ఉంటారు. వారిని ఏ మాత్రం నిరుత్సాహం చెందేలా మూవీ ఉండదని ట్రైలర్‌తోనే తెలుస్తోంది. ఇందులో ఆంథోనీ రామోస్, డొమినిక్ ఫిష్బ్యాక్ నటీనటులుగా ఉన్నారు. దర్శకుడు స్టీవెన్ కాపెల్ జూనియర్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. వయాకామ్ 18 స్టూడియోస్ ద్వారా ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు 2D, 3D, 4D, IMAXలో వచ్చేసింది. (ఇదీ చదవండి: నిర్మాతపై కోపంతో ఆ పెళ్లి చేసుకున్న: ప్రముఖ నటి) -
ఓటీటీలోకి వచ్చేసిన అవతార్-2.. ఇక నుంచి ఉచితంగానే!
హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ 'అవతార్-2: ది వే ఆఫ్ వాటర్'. గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా 160 భాషల్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమా డిసెంబర్16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ఓటీటీలో అవతార్-2.. ఇక నుంచి ఫ్రీగా చూసేయొచ్చు!) అయితే ఇప్పటికే ఈ సినిమా రెంటల్ పద్ధతిలో ఓటీటీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు నుంచి ఇండియాలో ఫ్రీగా చూసేందుకు అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ కన్నడ, మళయాళ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికి వరకు ఈ విజువల్ వండర్‌ను చూడడం మిస్సయిన వారు చూసేయండి. (ఇది చదవండి: రెండో పెళ్లిపై దారుణ ట్రోల్స్.. స్పందించిన ఆశిష్ విద్యార్థి) -
ఒంటిపై నూలు పోగు లేకుండా నటి.. మద్దతు తెలిపిన ఫ్యాన్స్
అమెరికన్ టెలివిజన్ హోస్ట్, ప్రఖ్యాత నటి రికీ లేక్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె తరుచుగా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి అనేక స్పూర్తిదాయకమైన పోస్ట్‌లను షేర్ చేస్తుంది. గత సంవత్సరం రికీ లేక్.. త్రోబాక్ వీడియోతో ఆండ్రోజెనిక్ అలోపేసియా (హెయిర్ లాస్)పై తన 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం గురించి చెప్పుకొచ్చింది. జుట్టు రాలే సమస్యతో చాలా సంవత్సరాలు రహస్యంగా పోరాడినట్లు తెలిపిన ఆమె తాజాగా స్ఫూర్తిదాయకమైన పోస్ట్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. (ఇదీ చదవండి: తంగలాన్ షూటింగ్లో గాయాలు.. కోలుకున్న విక్రమ్) అయితే ఇందులో ఆమె ఒంటిపై దుస్తులు లేకుండా ఫోటో షేర్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఆ ఫోటోలో రికీ లేక్ బాత్‌టబ్‌లో కూర్చుని, సూర్యకాంతిలో తడిసి, ప్రశాంతమైన చిరునవ్వుతో మెరుస్తూ, తన చేతులతో శరీర పైభాగాన్ని కప్పివేసింది. 'ఈ రోజులు నా జీవితంలో అత్యుత్తమమైనవి. 54 సంవత్సరాల వయసులో కూడా యవ్వనంగా కనిపిస్తున్నా.. ఆండ్రోజెనిక్ అలోపేసియాను ధైర్యంగా ఎదుర్కొన్నాను. ఇప్పుడు నా జుట్టు పదిలంగా ఉంది. ఈ ప్రదేశం ఎంతో ప్రశాంతమైనదే కాదు ప్రేమ పంచే అభిమానులు ఉన్న దేశం' అంటూ దీనికి క్యాప్షన్ జోడించింది. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన జుట్టు రాలడానికి కారణమైన ఆండ్రోజెనిక్ అలోపేసియా అనే వ్యాధితో తన 30 ఏళ్ల పోరాటం గురించి చెబుతూ చేసిన ఈ పోస్ట్‌కు ఆమె అభిమానుల నుంచి అపారమైన స్పందన లభిస్తోంది. రికీ షేర్ చేసిన ఫోటోను ఆమె భర్త రాస్ బర్నింగ్హామ్ క్లిక్‌మనిపించారు. గతేడాది జనవరిలో బర్నింగ్‌ను మూడో పెళ్లి చేసుకుంది రికీ లేక్. ( ఇదీ చదవండి: జీవితం చాలా చిన్నది..ఆ రోజు ఎప్పుడొస్తుందో తెలియదు: అనుపమ) -
ప్రేయసితో సహజీవనం.. ఆమె ప్రెగ్నెన్సీపై డౌట్ పడ్డ నటుడు!
ప్రముఖ హాలీవుడ్ స్టార్, గాడ్ ఫాదర్ ఫేమ్ అల్ పాసినో 83 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న విషయం తెలిసిందే! అయితే ఈ వయసులో తను తండ్రిగా ప్రమోషన్ పొందడాన్ని నమ్మలేకపోయాడట. తనకు పిల్లలు పుట్టే సామర్థ్యం ఉందా? అని ఆలోచనలో పడ్డాడట! ఈ క్రమంలో తన ప్రియురాలు నూర్ అల్ఫల్లా గర్భం దాల్చడంపై అనుమానం వ్యక్తం చేశాడట. తన కడుపులో ఉన్న బిడ్డకు డీఎన్ఏ డెస్ట్ చేయాల్సిందేనని పట్టుబట్టాడట! దీంతో నూర్ కడుపులో ఉన్న బిడ్డకు డీఎన్ఏ పరీక్షలు చేయించగా.. ఈ రిపోర్టులో అల్ పాసినోయే తండ్రి అని వెల్లడైనట్లు తెలుస్తోంది. అంటే ఈ హాలీవుడ్ స్టార్ 83 ఏళ్ల వయసులో నాలుగో బిడ్డకు తండ్రి కాబోతున్నారు. కానీ అతడి ప్రియురాలు నూర్ అల్ఫల్లా మాత్రం మొదటిసారి తల్లి కాబోతోంది. కాగా అల్ పాసినో గతంలో మీటల్ దోహన్, జాన్ టరంట్, బెవెర్లీ డీఆంగెలోతో రిలేషన్స్ కొనసాగించాడు. ఈ క్రమంలో జాన్ టరంట్కు జూలీ మేరీ అనే కుమార్తె, బెవెర్లీ డీఆంగెలె కవలలకు జన్మనిచ్చింది. అయితే వీరిద్దరికీ బ్రేకప్ చెప్పిన తర్వాత అల్ పాసినో కోవిడ్ సమయంలో నూర్ అల్ఫల్లాతో లవ్‌లో పడ్డాడు. అప్పటినుంచి వీరు సహజీవనం చేస్తున్నారు. అల్ఫల్లా కూడా గతంలో రోలింగ్ స్టోన్స్ సింగర్ మిక్ జాగర్‌తో డేటింగ్ చేయగా 2018లో బ్రేకప్ చెప్పింది. చదవండి: హీరోయిన్‌తో లవ్.. ముద్దు ఫోటో షేర్ చేసిన నటుడు -
అమ్మాయిలపై అత్యాచారం.. నటుడికి 30 ఏళ్ల జైలు శిక్ష
అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దట్ సెవంటీస్ షో నటుడు డానీ మాస్టర్‌సన్‌ను న్యాయస్థానం నిందితుడిగా తేల్చింది. యువతులపై అత్యాచారానికి పాల్పడినందుకుగానూ అతడికి 30 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. కాగా డానీ మాస్టర్సన్ 2001లో 23 ఏళ్ల యువతిపై, 2003లో 28 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడగా, 2003 చివర్లో 23 ఏళ్ల మరో యువతిని ఇంటికి పిలిచి మరీ అత్యాచారం చేసినట్లు కేసులు నమోదయ్యాయి. దీనిపై 2020 జూన్‌లో విచారణ జరిపిన న్యాయస్థానం ఆయనకు జైలు శిక్ష విధించగా.. 3.3 మిలియన్ డాలర్లు చెల్లించి అదే రోజు జైలు నుంచి విడుదలయ్యాడు. తాజాగా మరోమారు విచారణ జరగ్గా డానీ మాస్టర్‌సన్‌ను నిందితుడిగా తేల్చిన న్యాయస్థానం 30 ఏళ్ల జైలు శిక్షను విధించింది. అయితే 2001, 2003లో అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలు రుజువు కాగా 2003 ఏడాది చివర్లో ఓ యువతిని హాలీవుడ్ హిల్స్‌లోని తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడన్న ఆరోపణలో మాత్రం ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలుస్తోంది. న్యాయస్థానం తీర్పు ప్రకటించిన సమయంలో డానీ మౌనంగా ఉండిపోగా ఆయన భార్య, నటి బిజు ఫిలిప్స్ మాత్రం కోర్టులోనే బోరుమని ఏడ్చేసింది. ఇకపోతే లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా నెట్‌ఫ్లిక్స్ 2017లో ద రాంచ్ అనే కామెడీ షో నుంచి డానీ మాస్టర్‌సన్‌ను తొలగించింది చదవండి: ఆలియా భట్ ఇంట విషాదం.. నువ్వే నా హీరో అంటూ పోస్ట్ -
83 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న హీరో
హాలీవుడ్ సీనియర్ హీరో, ‘గాడ్‌ఫాదర్’ ఫేమ్ అల్ పాసినో 83 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్నాడు. 29 ఏళ్ల యువతి, నిర్మాత నూర్ అల్పల్లాతో ఈ సీనియర్ హీరో ప్రేమాయణం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా వీరిద్దరు సహజీవనం చేస్తున్నారు. ప్రస్తుతం అల్పల్లా గర్భం దాల్చింది. ఈ విషయాన్ని అల్ పాసినో ప్రతినిధి ఓ మ్యాగజైన్‌కు వెల్లడించారు. (చదవండి: పెళ్లి ఎప్పుడు.. మాధవీలత స్ట్రాంగ్ కౌంటర్!) కోవిడ్ సమయంలో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి రిలేషన్షిప్లో కొనసాగుతున్నారు. మాజీ ప్రియురాలు మీటల్ దోహన్‌తో బ్రేకప్ తర్వాత పాసినో.. అల్పల్లాతో డేటింగ్ ప్రారంభించాడు. అల్పల్లా కూడా అంతకు ముందు రోలింగ్ స్టోన్స్ సింగర్ మిక్ జాగర్‌తో డేటింగ్ చేసింది. 2018లో వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత పాసినోతో సహజీవనం కొనసాగించింది. అల్పల్లాకు ఇది మొదటి సంతానం కాగా, పాసినోకు నాలుగో సంతానం. అంతకు ముందు నటన శిక్షకురాలు జాన్ టరంట్‌తో కుమార్తె జూలీ మేరీ (33), మాజీ ప్రియురాలు బెవెర్లీ డీఆంగెలోతో 22 ఏళ్ల కవలలు ఉన్నారు. -
మూడోసారి సహజీవనం, 83 ఏళ్ల వయసులో నాలుగోసారి..
హాలీవుడ్ స్టార్, రెండుసార్లు ఆస్కార్ అందుకున్న హీరో రాబర్ట్ డి నిరో 79 ఏళ్ల వయసులో ఏడోసారి తండ్రైన విషయం తెలిసిందే కదా! తాజాగా ఇదే వయసులో ఉన్న మరో హాలీవుడ్ హీరో కూడా తండ్రి కాబోతున్నాడు. 83 ఏళ్ల వయసులో నాలుగోసారి డాడ్ అని పిలిపించుకోబోతున్నాడు. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ నోరెళ్లబెడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. అల్ పచినో 29 ఏళ్ల వయసున్న నూర్ అల్ఫల్లాతో కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో గతేడాది ఆమె గర్భం దాల్చగా ప్రస్తుతం ఆమెకు ఎనిమిది నెలలు నిండినట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ సమయంలో అల్ పచినో తండ్రి కాబోతున్నాడన్న వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇకపోతే అల్ పచినో ఏప్రిల్‌లో 83వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నాడు. మూడు రిలేషన్స్- ముగ్గురు పిల్లలు పెళ్లి అంటే ముఖం చాటేసే అల్ పచినో గతంలో ఇద్దరితో ప్రేమాయణాలు నడిపాడు. మొదటగా యాక్టింగ్ కోచ్ జన్ తరంత్తో డేటింగ్ చేయగా వీరికి 1989లో జూలీ పుట్టింది. ఆ తర్వాత నటి బెవర్లీ డియాంగిలోతో సహజీవనం చేయగా వీరికి ఆంటన్, ఒలీవియా కవలలు జన్మించారు. అయితే వీరి రిలేషన్ కూడా ఎంతో కాలం సాగలేదు. 1997-2003 మధ్యకాలంలోనే కలిసి ఉన్నారు, తర్వాత బ్రేకప్ చెప్పుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. అనంతరం అల్.. నూర్ అల్ఫల్లాతో లవ్‌లో పడ్డాడు. అప్పటికే ఆమె మిక్ జాగర్, నికోలక్ బెరగ్రూన్లతో ప్రేమలో పడటం, బ్రేకప్ చెప్పడం కూడా అయిపోయింది. అంటే ఇద్దరికీ ఇది మూడో డేటింగే! ఎప్పుడూ ప్రేమ, సహజీవనం వరకే వచ్చి ఆగిపోయిన అల్ పచినో పెళ్లికి మాత్రం మొగ్గచూపలేదు. మరి ఈసారైనా తన గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకుంటాడేమో చూడాలి! సినిమాల విషయానికి వస్తే.. అల్ పచినో ప్రస్తుతం 'డేవిడ్ మామెట్స్ అసాసినేషన్' సినిమా చేస్తున్నాడు. యూఎస్ మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్య ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. షియా లేబఫ్, రెబెకా పిడ్జియాన్, కోర్ట్నీ లవ్ ముఖ్య పాత్రలు పోషించనున్నారు. సెప్టెంబర్‌లో ఈ సినిమా ప్రారంభం కానుంది. చదవండి: కోపంతో నయనతారను రావద్దని చెప్పా: పార్థిబన్ -
ప్రముఖ సింగర్ కన్నుమూత
ప్రముఖ సింగర్ టీనా టర్నర్ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న 83 ఏళ్ల గాయని స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ సమీపంలోని కుస్నాచ్ట్లోని తన ఇంటిలో బుధవారం మరణించారు. ఈ వార్త విన్న హాలీవుడ్ ప్రముఖులు ఆమెకు సంతాపం ప్రకటిస్తున్నారు. ఆమెను క్వీన్ ఆఫ్ రాక్ అండ్ రోల్ అని కూడా పిలుస్తారు. (ఇది చదవండి: మళ్లీ పెళ్లి ఆపాలంటూ కోర్టును ఆశ్రయించిన నరేశ్ మూడో భార్య) టీనా టర్నర్ ఎవరు? నవంబర్ 26, 1939న అన్నా మే బుల్లక్లో టీనా టర్నర్ జన్మించారు. ఆమె 1960-70 మధ్యకాలంలో ఆమె భర్త ఐకే టర్నర్‌తో కలిసి ఫేమస్ అయింది. ఆమె తన వాయిస్, ప్రదర్శనలతో రాక్, సోల్ సంగీతంలో పేరు సంపాదించారు. అయితే ఆ తర్వాత భర్తతో విడిపోయిన టీనా సోలోగా కెరీర్‌ను ప్రారంభించింది. 1980లలో ఆమె "ప్రైవేట్ డ్యాన్సర్" ఆల్బమ్ విడుదల చేసింది. ఆ తర్వాత "వాట్స్ లవ్ గాట్ టు డూ విత్ ఇట్", "ప్రైవేట్ డ్యాన్సర్" వంటి హిట్ పాటలు అందించింది. తన కెరీర్లో టీనా టర్నర్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల రికార్డులు సృష్టించింది. (ఇది చదవండి: భర్తకు విడాకులిచ్చిన బుల్లితెర నటి? ఫోటోతో క్లారిటీ!) ఆమె సంగీతంతో పాటు నటనలోకి ప్రవేశించింది. టామీ, మ్యాడ్ మాక్స్ బియాండ్ థండర్‌డోమ్, వాట్స్ లవ్ గాట్ టు డూ విత్ ఇట్ వంటి చిత్రాలలో ముఖ్య పాత్రలు చేసింది. టీనా సంగీతానికి గ్రామీ అవార్డులు, రాక్ అండ్ రోల్ హాల్ ఆఫ్ ఫేమ్, కెన్నెడీ సెంటర్ ఆనర్స్, హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు. -
రెండున్నరేళ్లుగా క్యాన్సర్‌తో పోరాటం.. నటి కన్నుమూత
హాలీవుడ్ నటి సమంత(28) చిన్నవయసులోనే కన్నుమూసింది. రెండున్నరేళ్లుగా అండాశయ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచింది. మే 14న ఆమె మరణించగా ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. నటి మరణంపై హాలీవుడ్ సెలబ్రిటీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సమంత ఇక లేదన్న విషాదాన్ని ఆమె తండ్రి జీర్ణించుకోలేకపోతున్నాడు. 'తను ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటుంది. తనతో కాసేపు కలిసి మాట్లాడితే చాటు ఆ పాజిటివ్ వైబ్స్ వస్తాయని చాలామంది చెప్తూ ఉంటారు' అంటూ కూతుర్ని తలుచుకుని కన్నీటిపర్యంతమయ్యాడు. సమంత మా అందరి జీవితాలను మార్చివేసిందంటూ ఆమె తల్లి భావోద్వేగానికి లోనైంది. 10 ఏళ్లకే నటనను కెరీర్‌గా ఎంచుకుంది సమంత. 2005లో బిగ్ గర్ల్‌లో జోసెఫిన్ పాత్రను పోషించింది. పలు చిత్రాల్లో నటించి మెప్పించిన సమంత 2022 అక్టోబర్‌లో మైఖేల్ నుట్సన్‌ను పెళ్లాడింది. మే 1న అతడితో కలిసి హనీమూన్‌కు వెళ్లిన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో నటి తన భర్తతో కలిసి చిరునవ్వులు చిందించింది. అయితే అదే ఆమె ఆఖరి పోస్టు కావడం గమనార్హం. View this post on Instagram A post shared by Samantha Weinstein (@samsationalw) View this post on Instagram A post shared by Samantha Weinstein (@samsationalw) చదవండి: ప్రేయసిని పెళ్లాడిన నటుడు, ఫోటోలు వైరల్ -
‘అవతార్’కి మరో మూడు సీక్వెల్స్
వరల్డ్ ఫేమస్ డెరైక్టర్ జేమ్స్ కేమరూన్ సినిమా అంటేనే ఓ అద్భుతం. ఆయన ప్రతి సినిమా ఓ క్లాసిక్కే. ‘టైటానిక్’ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాగే ఇతర చిత్రాలు టెర్మినేటర్, ఏలియన్స్, లేటెస్ట్ ‘అవతార్’ కూడా సెన్సేషనల్ మూవీసే. ప్రస్తుతం ఈ సంచలనాత్మక దర్శకుడు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘అవతార్’కి సీక్వెల్స్ రూపొందించాలన్నదే ఆ నిర్ణయం. అవతార్ 2, 3, 4 చిత్రాలను ప్రేక్షకులకు అందించే పనిలో ఉన్నారాయన. 2016లో ఒకటి, 2017లో మరొకటి, 2018లో మరో సీక్వెల్ రానున్నాయట. ‘అవతార్’ ఓ అద్భుతం అయితే, దాన్ని మించేలా ఈ సీక్వెల్స్ ఉండాలనే పట్టుదలతో ఉన్నారట కేమరూన్. ఉన్నత సాంకేతిక విలువలతో, ఊహకందని మలుపులతో ఈ సీక్వెల్స్ ఉంటాయని కేమరూన్ పేర్కొన్నారు. ‘అవతార్’ చిత్రం క్లయిమాక్స్ వరకు ఏయే పాత్రలు బతికి ఉన్నాయో ఈ కొనసాగింపు చిత్రాల్లో ఆ పాత్రలన్నీ ఉంటాయట. మూడేళ్ల క్రితం విడుదలైన ‘అవతార్’ని ఇంకా ప్రేక్షకులు మర్చిపోలేదు. ఈలోపు ఈ సీక్వెల్స్ ప్రకటన కామరూన్ సినిమాల అభిమానులను ఆనందానికి గురి చేస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.