Intelligence department
-
సీఎం ముఖ్యకార్యదర్శిగా వి.శేషాద్రి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి వి. శేషాద్రి, రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం అధిపతిగా బి. శివధర్‌రెడ్డి నియమితుల య్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సొంత జట్టు కూర్పుపై దృష్టి సారించిన రేవంత్‌రెడ్డి తన తొలి ఎంపికగా ఇద్దరు సమర్థులైన అధికారులనే నియమించుకున్నారు. ఇద్దరు అధికారులూ ఆయా పదవుల్లో విశేష అనుభవం కలిగి ఉన్నారు. 1999 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన వి.శేషాద్రి సమర్థుడైన అధికారిగా పేరుతెచ్చుకున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఆయనకు రెవెన్యూ వ్యవహారాలు, భూ చట్టాలపై పట్టు ఉంది. 2013 ఆగస్టు 22 నుంచి 2020 ఆగస్టు 22 వరకు ప్రధానమంత్రి కార్యాలయంలోని సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)లో డైరెక్టర్, జాయింట్ సెక్రటరీల హోదాల్లో ఆయన డిప్యుటేషన్‌పై పనిచేశారు. 2020 సెప్టెంబర్ నుంచి 2022 మే వరకు నాటి సీఎం కేసీఆర్‌కు ముఖ్యకార్యదర్శిగా వ్యవహరించారు. ఈ సమయంలో భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా చేపట్టిన ధరణి ప్రాజెక్టు అమలులో కీలకంగా వ్యవహరించారు. 2022 మే నుంచి సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్యకార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. 2009–12 మధ్య చిత్తూరు, రంగారెడ్డి, విశాఖపట్నం కలెక్టర్‌గా పనిచేశారు. మరోవైపు ఇంటెలిజెన్స్ విభాగం అధిపతిగా నియమితులైన శివధర్‌రెడ్డి ప్రస్తుతం రైల్వే, రోడ్డు భద్రతా విభాగం అదనపు డీజీగా వ్యవహరిస్తున్నారు. 1994 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన శివధర్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ఇంటెలిజెన్స్ విభాగంలో అత్యంత కీలకంగా పనిచేశారు. అంతకుముందు ఆయన ఎస్ఐబీలో డీఐజీగా, నల్లగొండ, నెల్లూరు, గుంటూరులో ఎస్పీగా పలు కీలక పోస్టింగ్‌లలో పనిచేశారు. సమర్థుడైన అధికారిగా పోలీస్‌శాఖలో శివధర్‌రెడ్డికి పేరు ఉంది. ఆయనకు రేవంత్‌రెడ్డి సర్కార్ నిఘా విభాగాధిపతిగా కీలక బాధ్యతలు అప్పగించింది. -
తిరుమల: శ్రీవారి నడకదారిలో గుండెపోటుతో డీఎస్పీ మృతి
సాక్షి, తిరుమల: శ్రీవారి మెట్టు మార్గంలో ఇంటెలిజెన్స్ డీఎస్పీ కృపాకర్ గుండెపోటుతో మృతి చెందారు. 1,805వ మెట్టు వద్ద గుండెపోటుతో ఆయన కుప్పకూలారు. తిరుపతి రూయా ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారు. ఆయన స్వస్థలం విజయవాడ సమీపంలోని పోరంకి కాగా, ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి భద్రతా విధుల నిమిత్తం కృపాకర్ తిరుమలకు వచ్చారు. ఈ ఘటనపై ఆయన కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. చదవండి: ఇన్‌స్టా రీల్‌కు చెత్త కామెంట్లు.. ఆర్టిస్టు ఆత్మహత్య -
‘నా చావుకు ఇంటెలిజెన్స్ సీఐ కారణం.. కుటుంబానికి ప్రాణహాని’
సాక్షి, కరీంనగర్: ఇంటెలిజెన్స్ సీఐ వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటం కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతోంది. చొప్పదండి మండలంలోని భూపాలపట్నం గ్రామంలో బొడిగె శ్యామ్ అలియాస్ శంభయ్య అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే తన చవుకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సీఐ గోపాలకృష్ణ కారణమని, తన వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆరోపించాడు. ఈ మేరకు సుసైడ్ నోట్ రాశాడు. ఓ భూమి విషయంలో సీఐ బెదిరించినట్లు లేఖలో పేర్కొన్నాడు. సీఐ గోపాలకృష్ణ 30 లక్షలతో భూమి కొనుగోలు చేసి.. 8 నెలల్లో రెట్టింపు కోసం టార్చర్ పెట్టినట్లు వెల్లడించాడు. అసభ్య పదజాలంతో తిట్టినట్లు వాపోయాడు. గోపాలకృష్ణ వేధింపులు భరించలేక మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తెలిపాడు. సీఐ నుంచి తన కుటుంబానికి కూడా ప్రాణహాని ఉందని, ఈ లేఖను జిల్లా కలెక్టర్, ఎస్పీకి అందజేయాలని చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి సూసైడ్ నోటును స్వాదీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం శంభయ్య మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శంభయ్య సుసైడ్ లేఖ ఆధారంగా పోలేసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శంభయ్య మృతితో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: విధి చిన్న చూపు: కూతురు అల్లరి చూసి ఆ తల్లి మురిసిపోయింది.. అంతలోనే -
‘గల్ఫ్’ వలసలపై ఆరా!
మోర్తాడ్ (బాల్కొండ): గల్ఫ్ దేశాలకు కార్మికుల వలసలపై రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం వివరాలు సేకరిస్తోంది. 2018 నుంచి ఇప్పటివరకు ఏ సంవత్సరం ఎంతమంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్లారనే వివరాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్న తరుణంలో ఈ ప్రక్రియ చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి అధికంగా గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో, పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల గెలుపు ఓటములపై గల్ఫ్ వలసలు ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. వలస కార్మికుల సంక్షేమానికి ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం ప్రత్యేక పథకాలను అమలు చేసింది. ఆయన మరణం తర్వాత గల్ఫ్ వలస కార్మికుల గురించి పట్టించుకున్నవారు లేరని విమర్శలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం సమయంలోనూ గల్ఫ్ వలస కార్మికుల అంశం ప్రత్యేకంగా చర్చకు వచ్చింది. ఉద్యమంలో కార్మికుల కుటుంబాలు చురుగ్గా పాల్గొన్నాయి. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా గల్ఫ్ వలస కార్మికులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరకపోవడంతో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కేరళ తరహాలో ప్రవాసీ విధానాన్ని మన రాష్ట్రంలో అమలు చేయాలని లేదా గల్ఫ్ బోర్డును ఏర్పాటు చేయాలన్న డిమాండ్ మొదటి నుంచీ వినిపిస్తోంది. కాగా 2019 అక్టోబర్‌లో కూడా పంచాయతీరాజ్ శాఖ ఇదే అంశంపై వివరాలను నమోదు చేసింది. కానీ అప్పట్లో ఆ ప్రక్రియ అర్ధంతరంగా ఆగిపోయింది. త్వరలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో మరో సారి వలస కార్మికుల లెక్కల విషయంలో సర్కారు దృష్టి సారించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం వలస కార్మికుల వివరాలు సేకరిస్తున్న విషయం తమ దృష్టికి కూడా వచ్చిందని గల్ఫ్ వ్యవహారాల విశ్లేషకుడు మంద భీంరెడ్డి తెలిపారు. ప్రభుత్వం వద్ద కచ్చితమైన లెక్కలు ఉంటే వలస కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమానికి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
రాజకీయ విమర్శలు-ఎబి వెంకటేశ్వరరావు చేసిన తప్పేమిటి!
ఆంద్ర ప్రదేశ్ సీనియర్ పోలీసు అధికారి, గత టిడిపి ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ విభాగం డిజిగా ఉన్న ఎబి వెంకటేశ్వరరావు తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకటన మాదిరిగానే ఉన్నాయి. ఆయనను ఇప్పటికే రెండోసారి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ సస్పెన్షన్ అన్యాయమైనదని ఆయన వాదించవచ్చు. అంతవరకు తప్పు లేదు. కాని మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పైన, ఇతర సీనియర్ అధికారులపైన ఆయన అనుచితంగా మాట్లాడినట్లు అనిపిస్తోంది. మీడియాతో మాట్లాడడానికి ముందు ఆయన ప్రభుత్వ అనుమతి తీసుకున్నారా? తన సస్పెన్షన్ సరికాదని ఛీఫ్ సెక్రటరికి వాదన తెలియచేయకుండా ఇలా మాట్లాడవచ్చా? బహుశా ఆయన కూడా ప్రస్టేషన్ కు లోనవుతుండవచ్చు. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదని ఆయన అనుభవపూర్వకంగా చెబుతుండవచ్చు. ఇజ్రాయిల్ నుంచి ఫోన్ టాపింగ్ పరికరాలు తెప్పించడానికి , ఆయన కుమారుడి కంపెనీకి సంబంధిత కాంట్రాక్టు అప్పగించడానికి ప్రయత్నించారన్నది అభియోగం. ఆయన వాటిలో అవినీతి జరగలేదని అంటున్నారు. కాని అసలు ఆ పరికరాలు కొనవలసిన అవసరం ఏమి వచ్చింది. నిజంగానే తీవ్రవాదులపై నిఘా కోసమే అయితే వైసిపి నేత సజ్జల రామకృష్ణారెడ్డి తో సహా పలువురు నేతల ఫోన్ లు టాప్ చేయించారన్న అభియోగాలు ఎందుకు వచ్చాయి? ఆయనపై విచారణ కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆదేశాలు ఇచ్చింది? వీటన్నిటికి ఆయన వివరణ పరిమితం అయి ఉంటే బాగుండేది. నిజానికి చంద్రబాబు ప్రభుత్వంలో కీలక పోస్టింగ్ లోకి వచ్చేంతవరకు ఎబి వెంకటేశ్వరరావు పెద్దగా వివాదాస్పదుడు అయినట్లు వార్తలు రాలేదు. కాని చంద్రబాబు జత పట్టగానే ఎందుకు ఇలా అయ్యారో తెలియదు. ఆయనపై పలు రాజకీయ ఆరోపణలు కూడా వచ్చేవి. గతంలో అనేక మంది ఇంటెలెజెన్స్ డిజిలు పనిచేసినా ఒకరిద్దరు తప్ప ఎవరూ వివాదాలలో లేరు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీనియర్ అధికారి అరవిందరావు నిఘా విభాగం అధిపతిగా ఉండేవారు. ఆయన ఎప్పుడూ రాజకీయ జోక్యం చేసుకున్నట్లు విమర్శలు రాలేదు. ఆ తర్వాత కూడా పలువురు ఇంటెలిజెన్స్ లో పనిచేసినా అసలు ప్రజలకు తెలిసేవారే కారు. అంతదాకా ఎందుకు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నిఘా విభాగం అధినేతలు ఎవరైనా పబ్లిక్ లో కనిపించారా? వారెవరో ప్రజలకు తెలుసా? వారు తమ పనిని సైలెంట్ గా చేసుకుపోతుంటారు. అలా అని పోలీసు ఉన్నతాధికారులంతా రాజకీయాలకు అతీతంగా ఉంటారన్న గ్యారంటీ లేదు. గతంలో ఎమ్.వి.భాస్కరరావు డిజిపి గా ఉన్నప్పుడు ఆయన తమ్ముడికి కాంగ్రెస్ టిక్కెట్ కోసం గాంధీ భవన్ కు వెళ్లారన్న విమర్శలు వచ్చాయి. ఐఎఎస్, ఐపిఎస్ వంటి అఖిలభారత సర్వీసులో ఉన్నవారు సాధ్యమైనంతవరకు వివాదాలకు దూరంగా ఉండాలి. వారిది కూడా కత్తిమీద సామె. ప్రభుత్వంలో ఉన్నవారు ఎవరైనా తమకు సానుకూలంగా ఉండే అధికారులనే ఆయా బాధ్యతలలో నియమిస్తారు.అదేమీ కొత్త విషయం కాదు. మరో ఉదాహరణ కూడా చెప్పాలి. సీనియర్ ఐఎఎస్ అధికారిగా పనిచేసిన ఎవిఎస్ రెడ్డికి టిడిపి హయాంలో ప్రభుత్వంతో విబేధాలు వచ్చాయి. దాంతో ఆయన అసంతృప్తికి గురై భరతసేన అనే పేరుతో కొంతకాలం ఒక సంస్థను నడిపారు. చదవండి👉రాష్ట్రపతి ఎన్నికలు.. బాబును పట్టించుకోని ప్రధాని మోదీ తదుపరి కొంతకాలానికి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆయన తిరిగి ప్రభుత్వంలో చేరిపోయారు. హర్యానాలో నిబంధనల ప్రకారమే విధులు నిర్వహిస్తారన్న పేరు ఉన్న అశోక్ ఖేమ్కే అనే అధికారి డెబ్బై సార్లకు పైగా బదిలీ అయ్యారని గతంలో వార్తలు వచ్చాయి. దాదాపు అన్ని రాష్ట్రాలలో అఖిలభారత సర్వీసుల వారు కొందరు వివాదాస్పదులవడం, మరికొందరు ప్రభుత్వంలోని రాజకీయ పెద్దల ఆగ్రహానికి గురి కావడం వంటివి జరుగుతూనే ఉంటాయి. కొందరు ఐఎఎస్ , ఐపిఎస్ అధికారులు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ కోసం కాండిడేట్లను కూడా సిఫారస్ చేస్తుంటారని చెబుతారు. ఇంకో విషయం గుర్తు చేసుకోవాలి. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ లో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చే యత్నంలో ఓటుకు నోటు కేసులో చిక్కుకున్నారు. ఆ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం పెట్టిన నిఘా విషయం పసికట్టలేకపోయారని అప్పటి ఎపి నిఘా విభాగం అదికారిని బదిలీ చేశారన్నది వాస్తవం కాదా? ఆ తర్వాత ఎబి వెంకటేశ్వరరావును ఆ పదవిలోకి తీసుకు వచ్చారు. దురదృష్టవశాత్తు ఎబి వెంకటేశ్వరరావు టిడిపి ప్రభుత్వ హయాంలో ఏదో రూపంలో నిత్యం వార్తలలో ఉండేవారు. దాని ఫలితమే ఇప్పుడు ఆయన ఈ చిక్కులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వానికి ఎవరు సలహా ఇచ్చారో అంటూ చేసిన వ్యాఖ్యలు ఆయనకూ వర్తిస్తాయి. ఎవరి సలహా మేర ఎబి ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి జగన్ పైన రాజకీయ విమర్శలు చేశారో తెలియదు. ఇవి పూర్తిగా అనుచితం అవుతాయి. సీనియర్ అధికారిగా ఉన్న ఆయనకు ఈ విషయం తెలియదా? తెలిసినా, ఇంతకన్నా పోయేది ఏముందని మాట్లాడారా? తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శలనే ఆయన చేసినట్లుగా ఉందన్న భావానికి ఆస్కారం ఇవ్వకుండా ఉండాల్సింది. అన్నిటికి మించి కోడికత్తి కేసు అంటూ , గతంలో వైఎస్ జగన్ పై జరిగిన దాడి ఘటనలో రాష్ట్రాన్ని తగులబెట్టాలని చూశారని, తాను అడ్డుకున్నానని ఆయన అంటున్నారు. ఇది చాలా తీవ్రమైన ఆరోపణ. ఆ ఘటన జరిగినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు కాని, టిడిపి నేతలు కాని ఇలాంటి ఆరోపణ చేయలేదు. కాని ఇప్పుడు ఎబి చేస్తున్నారంటే దాని మతలబు ఏమిటి? అది నిజమే అయితే ఆయన తన బాధ్యతను సరిగా నిర్వహించి సంబంధిత వ్యక్తులపై కేసులు పెట్టి ఉండాల్సింది కదా? ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించారన్నదానికి జవాబు చెప్పవలసి ఉంటుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సిబిఐ , ఈడి చార్జీషీట్లు ఉన్నాయని ఆయన అన్నారు. ఇది ఎబి కొత్తగా కనిపెట్టిన విషయం కాదు. ఆ కేసులు ఎలా వచ్చాయో అందరికి తెలిసిందే. కేసుల పేరుతో ఆయనను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఆ తరువాత ఆయన ప్రజాక్షేత్రంలోకి వచ్చి, ప్రజానీకాన్ని ఒప్పించి ముఖ్యమంత్రి అయ్యారు. ఎబి కూడా అలాగే ప్రజల వద్దకు వస్తారేమో తెలియదు. ప్రభుత్వాన్ని పగడొడతానంటూ తానేమీ కామెంట్ చేయలేదని చెబుతున్న ఆయన టిడిపి హయాంలో 23 మంది వైసిపి ఎమ్మెల్యేల కొనుగోలు లావాదేవీలలో ప్రమేయం కలిగి ఉన్నారని వైసిపి పలుమార్లు ఆరోపించింది. కొందరు ఎమ్మెల్యేలు కూడా ఆ విషయాన్ని బహిరంగంగానే చెప్పారు. తనకు సంబందం లేదని ఆయన చెబుతుండవచ్చు. చదవండి👉‘కుప్పంలో సత్తా చూపిస్తాం.. రాజీనామా చెయ్యి’.. చంద్రబాబుకు మంత్రి నాగార్జున సవాల్ వాస్తవం ఏమిటో ప్రజలకు తెలుసు. ఆయన అంతరాత్మకు తెలియకుండా ఉంటుందా? దుర్మార్గుడైన రాజు పాలనలో పనిచేయడం కన్నా అడవిలో వ్యవసాయం చేసుకోవడం మంచిదన్న కవి మాటలను ఆయన అసందర్భంగా చెప్పినట్లు అనిపిస్తుంది. వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఆయనకు కోపం ఉండవచ్చు. కాని ద్వేషపూరితంగా మాట్లాడకూడదు. నిజంగానే అలా వ్యవసాయం చేయదలిస్తే షంషేర్ గా చేసుకోవచ్చు. అలాకాకుండా తన ఉద్యోగం కోసమే ఆయన ఎందుకు పాకులాడుతున్నట్లు? ఎన్నో వెధవ పనులు అడ్డుకోవడం వల్లే తాను టార్గెట్ అయ్యానని ఆయన చెప్పారు. మంచిదే. మరి తుని రైలు దగ్దం ఘటనను, టిడిపి లో చేరిన అప్పటి వైసిపి ఎమ్మెల్యే , అలాగే మాజీ ఎమ్మెల్యే లు నక్సల్స్ చేతిలో హత్యకు గురికాకుండా అడ్డుకోగలిగి ఉంటే మంచి పేరు వచ్చేదికదా? ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు రాజమండ్రి వద్ద పుష్కర ఘాట్ లో స్నానం చేస్తున్న సందర్భంలో తొక్కిసలాట జరిగి 29 మంది మరణించిన ఘటనను ఎబి ముందుగా నివారించగలిగి ఉంటే చాలా మంది ప్రాణాలు నిలబడేవి కదా? తిరుపతిలో ఇరవై మంది ఎన్ కౌంటర్ కాకుండా వారిని చట్టపరంగా శిక్షించేలా ఎబి ప్రయత్నించి ఉంటే అప్పుడు ఏ వెధవ పనులనైనా అడ్డుకున్నారన్న మంచి పేరు వచ్చేది కదా? తెలుగుదేశం యువత అధ్యక్ష పదవికి సంబంధించి ఎబి తో సంప్రదించినట్లు టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చెప్పినట్లు వచ్చిన వీడియో సంగతి ఏమిటి? తనపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా తప్పని నిరూపిస్తానని ఆయన అనవచ్చు. అలా చేయగలిగితే ఆయనకు గుర్తింపు కూడా వస్తుంది. కాని ఆ పని మీద ఉండకుండా రాజకీయంగా మాట్లాడడంలోని ఆంతర్యం ఏమిటన్నదానిపై ఎవరికి వారు ఊహించుకోవచ్చు. -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
Raghurama Krishnam Raju: ఎంపీ రఘురామపై క్రిమినల్ కేసు
సాక్షి, అమరావతి/గచ్చిబౌలి (హైదరాబాద్): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా భద్రత విధుల్లో ఉన్న ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ బాషాను కిడ్నాప్ చేసి, తీవ్రంగా హింసించిన కేసులో నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు, ఆయన కుమారుడు భరత్‌పై తెలంగాణ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడిగా (ఎ1గా) ఎంపీ రఘురామకృష్ణరాజు, ఏ 2గా ఆయన కుమారుడు భరత్, ఏ 3 గా సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఎన్.సందీప్ సాధు, ఏ 4 గా సీఆర్పీఎఫ్ ఏఎస్సై కె. గంగారామ్, ఏ 5గా ఎంపీ పీఏ శాస్త్రి, మరికొందరిపై హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసులు మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ 365, 332, 384, 323, 324, 342, 504, 506, 294(బి) రెడ్ విత్ 34, 109 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ షేక్ ఫరూక్ బాషా విధులకు ఆటంకం కలిగించడం, కిడ్నాప్ చేసి నిర్బంధించడం, దాడి చేసి బెదిరించడం వంటి ఆరోపణలపై ఈ కేసు నమోదు చేశారు. ఇందులో రఘురామ వద్ద భద్రత విధులు నిర్వర్తిస్తున్న నలుగురు సీఆర్పీఎఫ్ సిబ్బందినీ నిందితులుగా చేర్చారు. పోలీసుల కథనం ప్రకారం.. ప్రధాన మంత్రి పర్యటన సందర్భంగా ఆందోళనలు చేసేందుకు కొన్ని పార్టీలు, సంఘాలు నిర్ణయించాయని ఏపీ ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. ఏపీ నుంచి కూడా కొందరు హైదరాబాద్ వెళ్లినట్టు గుర్తించారు. దాంతో భద్రత ఏర్పాట్లలో భాగంగా ఇంటెలిజెన్స్ అధికారులు తమ సిబ్బందిని హైదరాబాద్ పంపించారు. అందులో భాగంగా సోమవారం ఐఎస్బీ గేటు వద్ద స్పాటర్‌గా నియమించారు. అనుమానిత వ్యక్తులు, వారి కదలికల్ని గుర్తించడం ఇతడి విధి. విధి నిర్వహణలో ఉన్న ఫరూక్ బాషాపై ఎంపీ రఘురామ కుటుంబసభ్యులు, ఆయన భద్రతకు నియమితులైన సీఆర్పీఎఫ్ సిబ్బంది కొందరు దాడిచేశారు. నడిరోడ్డుపైనే దాడి చేయ డం, సెల్‌ఫోన్, పర్సు, ఐడీ కార్డు లాక్కోవడం, కారులో కిడ్నాప్ చేయడం తదితరాలన్నీ సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ సమయంలో అక్కడున్నవారు కూడా ఈ దృశ్యాల ను సెల్ఫోన్లలో రికార్డు చేశారు. ఫరూక్ తమపై నిఘాకు వచ్చినట్లుగా ఎంపీ వర్గీయులు ఆరోపిస్తు న్నారు. అది అవాస్తవమని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఫరూక్ విధులు నిర్వర్తిస్తున్న ఐఎస్బీ గేట్ ప్రాంతానికి, ఎంపీ రఘురామ ఇంటికి సంబం ధం లేదు. రఘురామ ఇల్లు అక్కడికి 1.3 కిలోమీ టర్ల దూరంలోని బౌల్డర్ హిల్స్‌లో ఉంది. ఫరూక్‌ను నడిరోడ్డుపై కొట్టుకుంటూ బౌల్డర్ హిల్స్‌లోని ఎంపీ విల్లా ఎ–74కు తీసుకువెళ్లారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు ఎంపీ ఇంట్లో చిత్ర హింసలకు గురిచేశారు. ఎంపీ రఘురామకృష్ణరాజు, ఆయన కుమారుడు భరత్ కూడా ఫరూక్‌పై దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ముందుగా భరత్, శాస్త్రి, సీఆర్పీఎఫ్ ఏఎస్సై కె.గంగారామ్, కానిస్టేబుల్ సందీప్‌తోపాటు మరికొందరు సీఆర్పీఎఫ్ సిబ్బం ది ఫరూక్‌పై దాడిచేశారు. సీఆర్పీఎఫ్ ఏఎస్సై, కానిస్టేబుల్ సందీప్ ఆయన కాళ్లు, చేతులపై లాఠీలతో కొట్టారు. భరత్, శాస్త్రి కానిస్టేబుల్ ఫరూక్ మెడ, కడుపుపై పిడిగుద్దులు కురిపించారు. కాళ్లూ చేతులు విరగ్గొట్టండి.. షాక్ ఇవ్వండి అంతవరకు ఇంటి లోపల ఉన్న ఎంపీ రఘురామరాజు బయటకు వచ్చి ఫరూక్‌ను చూడగానే ఆగ్రహంతో ఊగిపోయారు. ‘నీ కాళ్లు చేతులు విరగ్గొట్టిస్తా’ అంటూ బూతులు తిడుతూ విరుచుకుపడ్డా రు. సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సందీప్ వద్ద ఫైబర్ లాఠీ తీసుకుని స్వయంగా ఫరూక్ బాషాపై దాడి చేశారు. జుట్టుపట్టుకుని గోడకేసి తోసివేశారు. అ నంతరం భరత్, శాస్త్రి, సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సందీప్‌లను ఉద్దేశిస్తూ ‘నేను ఢిల్లీ వెళ్తున్నా. వీడికి కరెంట్‌షాక్ ఇవ్వండి’ అని చెప్పారు. ఐడీ కార్డు, ప ర్స్, బంగారు ఉంగరం తీసుకోండి అని చెప్పారు. సీఆర్పీఎఫ్ ఏఎస్సై, కానిస్టేబుల్ సస్పెన్షన్ విధి నిర్వహణలో ఉన్న ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్‌పై దాడిని సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. దాడిలో పాల్గొన్న సీఆర్పీఎఫ్ ఏఎస్సై కె.గంగారామ్, కానిస్టేబుల్ ఎన్.సందీప్ సాధును సస్పెండ్ చేస్తూ సీఆర్పీఎఫ్ కమాండెంట్ మహేశ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. మరో ఇద్దరు సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లపై కూడా ఉన్నతాధికారులు విచారి స్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇంకా ఎందరు నిందితులున్నారో తెలియాల్సి ఉంద ని గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ సురేష్ తెలిపారు. -
వాట్సాప్.. నిఘా హ్యాండ్సప్!
సాక్షి, హైదరాబాద్: రాజకీయ రంగంలో అయినా, నేర సామ్రాజ్యంలో అయినా, సామాజిక అంశాల్లో అయినా చీమ చిటుక్కుమన్నా ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాలి. కానీ, ఇప్పుడు ఆ వ్యవస్థ నిద్రమత్తులో జోగుతోందన్న విమర్శలు వెల్లువెత్తు న్నాయి. శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ స్టేషన్లో జరిగిన ఆందోళనలు, విధ్వంసాలను పసిగట్టడంలో రాష్ట్ర, కేంద్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థల వైఫల్యం కొట్టిచ్చినట్టు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన పలు వరుస ఘటనలపై ముందే సమాచారాన్ని సేకరించడంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ విఫలమైనట్టు విమర్శలు వినవస్తున్నాయి. కాంగ్రెస్ చలో రాజ్‌భవన్‌లో... రాహుల్‌గాంధీకి ఈడీ నోటీసులిచ్చిన నేపథ్యంలో ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలపై, ఏఐసీసీ కార్యాలయంపై పోలీసులు జరిపిన దాడికి నిరసనగా టీపీసీసీ చలో రాజ్‌భవన్ చేపట్టింది. ఈ ఆందోళన విధ్వంసానికి దారితీసింది. కాంగ్రెస్ గతంలో గల్లీలో ధర్నా చేసేందుకు యత్నించినా, ఆందోళనలకు పిలుపునిచ్చినా పోలీసులు ప్రతీ నాయకుడిని ముందస్తుగానే హౌస్అరెస్ట్తోపాటు అదుపులోకి తీసుకునేది. కానీ, చలో రాజ్‌భవన్ ముట్టడిలో ఎందుకు అప్రమత్తత కాలేకపోయిందనే విమర్శలు వస్తున్నాయి. ఇంటెలిజెన్స్ చెప్పినా సిటీ పోలీసులు పట్టించుకోలేదా లేదంటే ఇంటెలిజెన్స్, హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ వ్యవస్థ అప్రమత్తత చేయలేదా అన్నదానిపై అనుమానాలు కలుగుతున్నాయి. అవి ఎందుకు ఇంతటి మొద్దునిద్రలో ఉందని బీజేపీ నేతలు ఒకవైపు ఆరోపిస్తున్నా ఇప్పటి వరకు అధికార వ్యవస్థ ఖండించకపోవడం లేదా స్పష్టత ఇవ్వకపోవ డంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటిని పట్టించుకోలేదు కేంద్రం అగ్నిపథ్‌ను ప్రకటించిన నాటి నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఉద్యోగార్థులు దీన్ని వ్యతిరేకిస్తూ గళమెత్తారు. కొన్నేళ్లుగా ఆర్మీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారు.. దీనిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగానే రైల్వేస్టేషన్ల వద్ద నిరసనలు, విధ్వంసాలు జరిగాయి. ఈ నేపథ్యంలో అయినా రాష్ట్ర పరిస్థితులను నిఘావర్గాలు గుర్తించాలి. రైల్వేస్టేషన్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాల్సిందిగా అప్రమత్తం చేయాలి. నిఘావ్యవస్థ నిద్రావస్థకు చేరుకోవడంతోనే ఉద్యోగార్థులు ఆందోళన చేయనున్నారనే విషయం పసిగట్టలేకపోయింది. ఇంటెలిజెన్స్ వర్గాల కళ్లలో పడని సందేశాలు ఆర్మీ ఉద్యోగార్థులు ఏర్పాటు చేసుకున్న వాట్సాప్ గ్రూపుల ద్వారానే శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే జంక్షన్ వద్ద నిరసన చేపట్టాలనే సందేశం సర్క్యులేట్ అ యింది. 8 వాట్సాప్ గ్రూపుల్లో మొదలైన ఈ సందేశం వేలమందికి చేరింది. అయినప్పటికీ నిఘా వర్గాల సాంకేతికత, ఇంటెలిజెన్స్ కళ్లలో పడకపోవడం గమనార్హం. సికింద్రాబాద్ స్టేషన్ వద్ద నిరసన తెలపడానికి తెలుగు రాష్ట్రాలకు చెందినవారూ అనేక మంది గురువారమే హైదరాబాద్ చేరుకున్నారు. పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థులమంటూ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల, ఇతర ప్రాంతాల్లో ఉన్న లాడ్జిల్లో బస చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర, నగర నిఘా వర్గాలు గుర్తించలేదు. వరంగల్, ఆదిలాబాద్ వైపు నుంచి వచ్చే రైళ్లల్లో ఉదయం అనేకమంది ఆందోళనకారులు నగరానికి వచ్చారు. ఈ అంశమూ నిఘావర్గాలు పసిగట్టలేకపోయాయి. -
రష్యా జనరల్స్ హతం.. ఉక్రెయిన్ ప్లాన్ వెనుక వారి హ్యాండ్!
ఉక్రెయిన్‌లో రెండు నెలలకుపైగా జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్‌తో రష్యాకు తీవ్ర నష్టం వాటిల్లింది. బాంబులు, మిస్సైల్స్ దాడుల్లో ఉక్రెయిన్ పౌరులు, సైనికులు, రష్యా బలగాలు వేల సంఖ్యలో మృత్యువాతపడ్డారు. ఇదిలా ఉండగా, యుద్దభూమిలో సుమారు 12 మంది రష్యన్ జనరల్స్ మరణించినట్టు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. కాగా, ఈ వ్యాఖ్యలను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ ఓ సంచలన కథనాన్ని వెలువరించింది. ఈ కథనం పుతిన్‌కు బిగ్ షాకిచ్చింది. న్యూయర్క్ టైమ్స్ కథనం ప్రకారం.. ఉక్రెయిన్‌తో యుద్దంలో రష్యన్ జనరల్స్‌ను చంపడానికి ఉక్రేనియన్ దళాలకు అమెరికా ఇంటెలిజెన్స్ సహాయం అందించిందని పేర్కొంది. దీని కోసం అమెరికాకు చెందిన సీనియర్ అధికారులు సైతం సాయం అందించినట్టు తెలిపింది. ఉక్రెయిన్‌లో రష్యా బలగాల కదలికలు, రష్యా మొబైల్ సైనిక ప్రధాన కార్యాలయం స్థావరం, ఇతర విషయాలపై ఇంటెలిజెన్స్ సాయం చేసినట్టు స్పష్టం చేసింది. కాగా, ఈ కథనంపై పెంటగాన్, వైట్ హౌట్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం. అయితే, ఉక్రెయిన్‌కు సాయం విషయంతో రష్యా ఇప్పటికే అమెరికాను త్రీవంగా హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: ఉక్రెయిన్ విచిత్ర పరిస్థితులు.. అమ్మాయిలనే కాదు అబ్బాయిలను కూడా.. -
ఎవరున్నారో తేల్చాలి..
సాక్షి, అమరావతి: గతంలో ఎప్పుడూ లేని రీతిలో.. ఇప్పుడే రాష్ట్రంలోని ఆలయాల్లో వరుసగా ఎందుకు ఉపద్రవాలు జరుగుతున్నాయో? వీటి వెనుక ఎవరున్నారో నిగ్గుతేల్చాల్సిన అవసరముందని త్రిదండి చిన జీయర్ స్వామి అన్నారు. ఇంటెలిజెన్స్ విభాగం పెద్దలతో కమిటీని నియమించి.. వారికి పూర్తి అధికారాలిచ్చి విచారణ జరిపిస్తే.. బాధ్యులెవరో తప్పకుండా తెలుస్తుందన్నారు. గుంటూరు జిల్లా సీతానగరం విజయకీలాద్రి కొండపై స్వామి మంగళవారం మీడియాతో మాట్లాడారు. వ్యక్తులకు ఉండే ద్వేషాలను ఇలా చూపించడం సరికాదని హితవు పలికారు. ఆలయాలకు రక్షణ కొరవడిందనే విషయం స్పష్టంగా కనబడుతోందన్నారు. ఆలయాలకు సంబంధించి రాష్ట్రంలో 50కి పైగా ఘటనలు జరిగినట్టు తెలుస్తోందన్నారు. 17వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆలయాలను సందర్శించి స్థానికుల అభిప్రాయాలు తీసుకుంటానన్నారు. అలాగే సాధువులను కలిసి.. వారందరి మార్గదర్శనంతో తదుపరి కార్యక్రమాలపై కూడా నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రజల్ని ఉద్రేకపర్చొద్దు: చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు విజయవాడలో పెద్ద సంఖ్యలో గుళ్లను కూల్చిన ఘటనలపై మీడియా ప్రశ్నించగా.. ఆ గుడులను మళ్లీ నిర్మిస్తామని చెప్పడంతో తాను జోక్యం చేసుకోలేదన్నారు. తిరుమలలో వెయ్యి కాళ్ల మండపం కూల్చివేసినప్పుడు కూడా తాను యాత్ర చేస్తానన్నానని.. కానీ అప్పుడు హైకోర్టు జడ్జి ఒకరు పునరాలోచించుకుంటే బాగుంటుందని సూచించడంతో దాన్ని వాయిదా వేసుకున్నట్లు వివరించారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను సెన్సేషన్ చేసి ప్రజల్ని ఉద్రేకపరచకూడదన్నారు. మతపరమైన విషయాలతో రాజకీయాలను ముడివేయొద్దని సూచించారు. -
61 మంది డీఎస్పీల బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 61 మంది డీఎస్పీలు బదిలీ కానున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తు సోమవారం పూర్తయ్యింది. ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. వీరిలో 53 మంది సబ్ డివిజన్లు, పట్టణాల్లోని ప్రధాన ప్రాంతాలకు బదిలీ కాగా.. మరో 8 మంది ఇంటెలిజెన్స్ విభాగానికి బదిలీ అయ్యారు. వివరాలిలా ఉన్నాయి. -
ట్యాపింగ్ శుద్ధ అబద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రముఖుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారన్న ఆరోపణలను సెల్‌ఫోన్ ఆపరేటర్లు నిర్ద్వందంగా తోసిపుచ్చారు. ప్రముఖుల నంబర్లను ట్యాపింగ్ చేయాలని కోరుతూ ఇంటెలిజన్స్ అధికారుల నుంచి ఏడాది కాలంగా తమకు ఎలాంటి అభ్యర్థన రాలేదని స్పష్టం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ అంటే చెప్పినంతసులభం కాదని, ఎన్నో నిబంధనలు ఉంటాయని కమ్యూనికేషన్ విభాగానికి చెందిన అధికారులు వ్యాఖ్యానించారు. ► ఇంటర్సెప్ట్ కోసం గతంలో సీబీఐ, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), రాష్ట్రస్థాయిలో ఇంటెలిజెన్స్ విభాగం సెల్‌ఫోన్ ఆపరేటర్లకు నంబర్లు అందచేసేవి. 2016 తరువాత నిబంధనలు కఠినతరమయ్యాయి. ► కొత్త నిబంధనల ప్రకారం ఇంటర్సెప్ట్ కోసం కేంద్ర హోంశాఖ కార్యదర్శి లేదా రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి నుంచి 1885 టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 5(2) ప్రకారం లిఖితపూర్వక అనుమతి తప్పనిసరి. అత్యవసర సందర్భాల్లో ప్రభుత్వం నియమించిన అధీకృత అధికారి కూడా అనుమతి ఇవ్వవచ్చు. ప్రముఖుల నంబర్లు ఉంటే తిరస్కృతి.. ► ఇంటర్సెప్ట్ చేసే నంబర్లను అనుమతి పత్రంలోపొందుపరచాలి. హోంశాఖ కార్యదర్శి లిఖితపూర్వక అనుమతి ఇచ్చిన తరువాత ఆ నెంబర్లను డీవోటీకి సమర్పించాలి. డీవోటీ ఆ వివరాలను సెంట్రల్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ఆయా సెల్‌ఫోన్ ఆపరేటర్లకు పంపుతుంది. సీఎంఎస్ ద్వారా వచ్చిన అభ్యర్థనను మాత్రమే సెల్‌ఫోన్ ఆపరేటర్లు ఆమోదిస్తారు. హోంశాఖ కార్యదర్శి అనుమతి లేకుండా వచ్చే ఏ అభ్యర్థననూ సెల్‌ఫోన్ ఆపరేటర్లు స్వీకరించరు.ఒకవేళ ఇందులో ప్రముఖుల నంబర్లు ఉంటే తిరస్కరిస్తారు. ఏడాదిగా ఎలాంటి అభ్యర్థన రాలేదు.. ► గత ఏడాది కాలంగా ఇంటర్సెప్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి అభ్యర్థనా రాలేదని అతి పెద్ద సెల్‌ఫోన్ ఆపరేటర్లలో ఒకటైన ’బీఎస్ఎన్ఎల్’కు చెందిన ఓ అధికారి ధృవీకరించారు. అధికారులు, మంత్రులు, న్యాయమూర్తులు తదితర ప్రముఖులు తమ కంపెనీ సిమ్‌లనే ఉపయోగిస్తారని, వారి నెంబర్లు ఇంటర్సెప్ట్ కోసం వస్తే వెంటనే గుర్తించి తిరస్కరిస్తామన్నారు. గడువు మేరకే.. ► అత్యంత విపత్కర పరిస్థితుల్లో, విస్తృత ప్రజా ప్రయోజనాలు ఉన్నప్పుడు మాత్రమే నిబంధనలను కొద్దిగా సడలించడం జరుగుతుందని మరో సంస్థకు చెందిన అధికారి తెలిపారు. ఢిల్లీ మర్కజ్ యాత్రికుల వివరాలు దీనికి ఉదాహరణగా పేర్కొన్నారు. ’ఇంటర్సెప్ట్‌అభ్యర్థన గడువు కేవలం 60 రోజులు మాత్రమే. ఆ తరువాత మరో అభ్యర్థన తప్పనిసరి. ఇలా 180 రోజుల వరకు మాత్రమే అవకాశం ఉంది’ అని పేర్కొన్నారు. -
ఏబీవీ సస్పెన్షన్‌కు ఆధారాలున్నాయ్
సాక్షి, హైదరాబాద్/సాక్షి, అమరావతి: డ్రోన్ల కొనుగోలు కుంభకోణంలో సస్పెన్షన్‌కు గురైన సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ విభాగం మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో(క్యాట్) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని క్యాట్ తేల్చిచెప్పింది. ఏబీవీని సస్పెండ్ చేయడానికి కచ్చితమైన ప్రాథమిక ఆధారాలున్నాయని స్పష్టంచేసింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేయాలని ఏబీవీ దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం క్యాట్ కొట్టివేసింది. ఈ మేరకు క్యాట్ చైర్మన్ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి, సభ్యుడు బీవీ సుధాకర్‌రావుతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. సస్పెండ్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గం ఉన్నప్పటికీ క్యాట్‌లో ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్ దాఖలు చేయడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. అఖిల భారత సర్వీసు నిబంధన 16 ప్రకారం.. సస్పెన్షన్‌పై కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించకుండా క్యాట్‌లో కేసు దాఖలు చేయడం చెల్లదని తీర్పులో స్పష్టం చేసింది. నిబంధన 3 ప్రకారం.. క్రమశిక్షణా చర్యలు ఎదుర్కొంటున్న అధికారిని సస్పెండ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తేల్చి చెప్పింది. నిబంధన 3 (1) ప్రకారం.. సస్పెన్షన్ చేసిన నెల రోజుల్లోగా క్రమశిక్షణా చర్యలు చేపట్టకపోయినా.. సస్పెన్షన్‌ను కేంద్రం ఖరారు చేయకపోయినా రాష్ట్రం తీసుకున్న సస్పెన్షన్ ఉత్తర్వులు చెల్లవని చెప్పింది. అందుబాటులో ఉన్న ఆధారాలను పరిగణనలోకి తీసుకుని తాము న్యాయసమీక్ష చేశామని వివరించింది. సస్పెన్షన్‌కు కారణమైన అక్రమాలు, పక్షపాతం, వంటి ఆరోపణల్లో పిటిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు పాత్ర ఉందో లేదో తేలాలంటే పూర్తిస్థాయిలో విచారణ జరగాల్సిందేనని పేర్కొంది. ఏబీవీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డగోలుగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు(ఏబీవీ) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయన అవినీతి, అక్రమాలపై లోతైన విచారణ జరిగితే చివరకు అవన్నీ చంద్రబాబు మెడకే చుట్టుకుంటాయని సీనియర్ పోలీసు అధికారులు చెబుతున్నారు. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారంటూ ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఫిబ్రవరి 8న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. జాతీయ దర్యాప్తు సంస్థలతో విచారణ! క్యాట్ నిర్ణయం వెలువడిన నేపథ్యంలో ఏబీవీ అవినీతి, అక్రమాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టింది. ఇప్పటికే ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు అత్యంత రహస్యంగా లోతైన విచారణ సాగించారు. స్వామికార్యం, స్వకార్యం అన్నట్లుగా చంద్రబాబు కోసం పనిచేసిన ఏబీవీ పలు అవకతవకలకు పాల్పడినట్లు ముగ్గురు ఐపీఎస్ అధికారుల బృందం గుర్తించింది. దేశ భద్రతకు తూట్లు్ల పొడిచేలా తన కుమారుడి కంపెనీ పేరుతో ఇజ్రాయెల్ తదితర దేశాల నుంచి నిఘా పరికరాల కొనుగోళ్లలో ఆయన నిబంధనలు అతిక్రమించారని తేల్చింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. అక్రమాస్తులను కూడబెట్టినట్టు ఏబీవీపై ఆరోపణలు రావడంతో అవినీతి నిరోధక శాఖ విచారణ చేపట్టనున్నట్టు సమాచారం. ఏబీవీపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీతోపాటు దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా వ్యవహరించినందుకు సీబీఐ, ఎన్ఐఏ వంటి జాతీయ దర్యాప్తు సంస్థలతోనూ విచారణ జరిపించే అవకాశం ఉంది. -
ఏబీ వెంకటేశ్వరరావుకు చుక్కెదురు
-
ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్‌లో చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రవర్తనా నియమాల ఉల్లంఘనకు సంబంధించి సస్పెన్షన్‌కు గురైన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్‌లో చుక్కెదురైంది. తన సస్పెన్షన్‌ను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) మంగళవారం కొట్టేసింది. ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. ఇక ఇదే వ్యవహారంలో కేంద్ర హోంశాఖ కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్థించిన విషయం తెలిసిందే. (చదవండి: ఏబీవీని విచారించండి) కాగా, ప్రవర్తనా నియమాల్ని ఉల్లంఘించినందుకు ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి 8న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆల్ ఇండియా సర్వీసెస్ (క్రమశిక్షణ, అప్పీల్) నిబంధనల నియమం 3 (1) కింద సస్పెండ్ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఏబీ వెంకటేశ్వరరావు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా ఉండగా భద్రతా పరికరాల కొనుగోలు టెండర్లలో అవకతవకలకు పాల్పడినట్లు తేలటంతో సస్పెండ్ చేసినట్లు జీవో నంబర్ 18లో స్పష్టం చేసింది. పోలీస్ ఇంటెలిజెన్స్ ప్రొటోకాల్స్ విధానాలను సైతం ఆయన ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు ప్రభుత్వం గుర్తించింది. (చదవండి: ‘ఏబీవీ’ బినామీ భూ బాగోతం) -
‘ఆయన దేశం విడిచి వెళ్లే అవకాశం ఉంది’
-
‘ఆయన దేశం విడిచి వెళ్లే అవకాశం ఉంది’
సాక్షి, తిరుపతి : ప్రజలను, దేశ భద్రతను కాపాడాల్సిన ఒక ఐపీఎస్ అధికారి దారుణంగా వ్యవహరించారని ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ విభాగం డీజీగా ఉండి ఏబీ వెంకటేశ్వరరావు సంఘ విద్రోహ చర్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు. త్వరలోనే ఏబీ వెంకటేశ్వరరావు అవినీతి అక్రమాలు మరికొన్ని బయట పెడతానని అన్నారు. సోమవారం చెవిరెడ్డి మాట్లాడుతూ.. ఏబీ వెంకటేశ్వరరావు అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారాడని.. ఆ సొమ్ముతో తెలంగాణలో విచ్చల విడిగా భూములు కొనుగోలు చేశారని చెప్పారు. తెలంగాణలో కొన్న భూములకు రైతుబంధు పథకం ద్వారా రూ. 67 లక్షలు తీసుకున్నారని తెలిపారు. ఏబీ వెంకటేశ్వరరావు అవినీతి తిమింగలం అని.. ఆయన విషయాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆయనపై సంఘ విద్రోహం కింద కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఘట్టమనేని శ్రీనివాస్ అనే వ్యక్తి ఏబీ వెంకటేశ్వరరావు బినామీ అని చెప్పారు. ఆయన అవినీతి అక్రమాలు మిగతా ఐపీఎస్ అధికారులకు కూడా తెలుసని అన్నారు. విజయవాడ జంట హత్యల కేసులో కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు కాజేశాడని విమర్శించారు. ఆయన దేశం విడిచిపెట్టి పోయే ప్రమాదం ఉందని.. కేంద్రం వెంటనే లుకౌట్ నోటీసులు విడుదల చేయాలని కోరారు. ఆయనపై తనకు వ్యక్తిగత కక్ష లేదని.. దేశ భద్రత కోసమే మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. ఇలాంటి వ్యక్తులను ఎవరు మద్దతుగా నిలవకూడదని.. ప్రభుత్వ చర్యలను ప్రతి ఒక్కరు సమర్ధించాలని పిలుపునిచ్చారు. చదవండి : వామ్మో.. ఏబీవీ! -
దేశ భద్రతకు ముప్పు కలిగిస్తూ..
-
ఏబీవీ అసలు రంగు బయట పెట్టిన కేశినేని
సాక్షి, అమరావతి : ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు అసలు రంగును విజయవాడ ఎంపీ కేశినేని నాని బయటపెట్టారు. టీడీపీ హయాంలో ఆయన చేసిన అక్రమాలు నిజమేనని పరోక్షంగా అంగీకరిస్తూ ఆయన ట్వీట్ చేశారు. దీనిపై వెంకటేశ్వరరావు వెంటనే స్పందించి రీట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. వారి గుట్టును వారే బయట పెట్టుకున్నట్లయిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. దేశ భద్రతా రహస్యాలను బయట పెట్టారనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేశినేని నాని.. ‘మీరు ముఖ్యమంత్రి అవడానికి, మీ పార్టీ అధికారంలోకి రావడానికి తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి ప్రధాన భూమిక పోషించిన వ్యక్తిని సన్మానిస్తారనుకుంటే సస్పెండ్ చేశారేంటి జగన్మోహన్రెడ్డి గారూ’ అని ఆదివారం ట్వీట్ చేశారు. దీనిపై వెంకటేశ్వరరావు వెంటనే స్పందిస్తూ.. ‘మీరూ, మీరూ పార్లమెంట్లో కలిసి మెలిసే ఉంటారుగా.. అందరూ కలిసి ఒక అభిప్రాయానికి రండి. నేను వృత్తి ధర్మం నిర్వర్తించానో లేక ఇంకేమైనా చేశానో.. నాక్కూడా ఒక క్లారిటీ వస్తుంది’ అని కామెంట్ చేశారు. ‘ఏమిటోనండీ ఎంపీ గారూ.. మీరేమో ఇలా అంటారు.. మరి నంద్యాల ఉప ఎన్నికల్లో గెలవడానికి నేనే కారణమని అంబటి రాంబాబు గారు అప్పట్లో కడుపుబ్బా నవ్వించారు’ అని మరో ట్వీట్ చేశారు. మొత్తానికి వీరిద్దరి ట్వీట్లు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వారి ఘన కార్యాలను బయట పెట్టాయి. -
వామ్మో.. ఏబీవీ!: సర్వత్రా విస్మయం
సాక్షి, అమరావతి: ఇంటెలిజెన్స్ విభాగం మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారంలో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఆయన అవినీతి దందా దేశ రక్షణకే ముప్పు తెచ్చిపెట్టడంతో కేంద్ర ప్రభుత్వ వర్గాలే అవాక్కవుతున్నాయి. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలను కాపాడటం.. మరోవైపు స్వకార్యం.. అంటే కుమారుడి కంపెనీకి అడ్డగోలుగా కీలక కాంట్రాక్టును కట్టబెట్టడం ద్వారా భారీ అవినీతికి పాల్పడటం నివ్వెర పరుస్తోంది. ఇలా ఏబీ వెంకటేశ్వరరావు ఏకంగా దేశ రక్షణ చట్టాలకే తూట్లు పొడవడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం గా మారింది. ఇంటెలిజెన్స్ తరఫున అప్పట్లో ఆయన ఇజ్రాయెల్ నుంచి క్రిటికల్ ఇంటెలిజెన్స్, సర్వైలన్స్ పరికరాలను కొనుగోలు చేశారు. రక్షణ, హోం, విమాన యాన శాఖల నుంచి లైసెన్స్ లేని కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టడం, దేశ రక్షణ ప్రొటోకాల్, ప్రోసీజర్స్‌కు విరుద్ధంగా విదేశీ ప్రైవేట్ కంపెనీకి చేరవేయడం కేంద్ర వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశ భద్రతకు ముప్పు కలిగిస్తూ.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు పని చేశారన్నది బహిరంగ రహస్యం. 2019 ఎన్నికల్లో అక్రమాల కు పాల్పడేందుకు అప్పటి ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ముఖ్య నేతల ఫోన్ కాల్స్‌ను ట్యాపింగ్ చేయడానికి చంద్రబాబు, ఏబీ వెంకటేశ్వరరావు 2017 లోనే ఓ పన్నాగం పన్నారు. ఇలా ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ పరికరాలను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. క్రిటికల్ ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్ పరికరాలకు భారీ నిధులను వెచ్చిస్తూ ఇజ్రాయెల్‌లోని రక్షణ ఉత్పత్తుల ప్రైవేటు కంపెనీ ‘ఆర్టీ ఇన్‌ఫ్లేటబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్’నుంచి కొనుగోలుకు ప్రతిపాదించారు. రక్షణ ఉత్ప త్తులను విదేశీ కంపెనీల నుంచి కొనుగోలు చేయాలంటే కేంద్ర రక్షణ శాఖ అనుమతి తీసుకోవాలి.అవేవీ పాటిం చలేదు. చంద్రబాబు ప్రభుత్వం నిబంధనలను పట్టించుకోకుండా ఇజ్రాయెల్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. దాంతో దేశ రక్షణకు సంబంధించిన కీలకమైన ఇంటెలిజెన్స్ ప్రొటోకాల్, ప్రోసీజర్స్‌ను విదేశీ కంపెనీలను లీక్ చేసినట్టయ్యిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కొడుకు కంపెనీకి ఫ్రాంచైజీతో అడ్డగోలు దోపిడీ చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్ పరికరాల కొనుగోలు కాంట్రాక్టును తన కుమారుడి కంపెనీకి కట్టబెట్టేలా ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారం సాగించారు. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ కంపెనీకి భారతదేశంలో ఫ్రాంచైజీగా ‘ఆకాశం అడ్వాన్డ్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’అనే కంపెనీని ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ ఏబీ వెంకటేశ్వరరావు కుమారుడు చేతన్ సాయి కృష్ణకు చెందినది. సాయి కృష్ణే ఈ కంపెనీ సీఈవో. విజయవాడ క్రీస్తురాజపురం ఫిల్మ్‌కాలనీలో ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్ అడ్రస్‌తో ఈ కంపెనీని నెలకొల్పారు. ఇది ఆ కాంట్రాక్టును కట్టబెట్టేందుకు సృష్టించిన షెల్ కంపెనీ అని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ కంపెనీ పేరిట కాంట్రాక్టు కట్టబెట్టడంలోనూ కేంద్ర నిబంధనలను ఉల్లంఘించారు. ఈ కాంట్రాక్టుకు ఉద్దేశించిన ‘పర్చేజ్ ఆర్డర్’ను రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం నుంచి ఉద్దేశ పూర్వకంగా మాయం చేయడం విస్మయపరుస్తోంది. దీంతో ఏబీ వెంకటేశ్వరరావును రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేయడం సమంజసమేనని కేంద్ర హోం శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నాయి. బినామీల పేరిట 171.39 ఎకరాల కొనుగోలు యథేచ్చగా అవినీతికి పాల్పడిన ఏబీ వెంకటేశ్వరరావు బినామీల పేరిట భారీగా అక్రమ ఆస్తులు కొనుగోలు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో 171.39 ఎకరాలు కొనుగోలు చేసినట్టు ఇప్పటికే గుర్తించారు. నారాయణ్‌పేట్ జిల్లా మక్తల్ మండలం పస్పూల్ గ్రామంలో 57.19 ఎకరాలు, చిట్యాలలో 64.20 ఎకరాలు బినామీల పేరిట కొనుగోలు చేశారు. వీటిరి రైతు బంధు కింద ప్రయోజనం కూడా పొందారు. గత ఖరీఫ్‌లో దాదాపు రూ.55 లక్షల ఆదాయం ఆర్జించినట్టు సమాచారం. జడ్చెర్ల వద్ద 50 ఎకరాలు బినామీల పేరుతో కొనుగోలు చేసి అందులో ఓ అధునాత గెస్ట్ హౌస్‌ను నిర్మించారని ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి. -
విశాఖలో ‘ఆపరేషన్ డాల్ఫిన్ నోస్’
సాక్షి, వైజాగ్: విశాఖ కేంద్రంగా తీరప్రాంతానికి సంబంధించిన రహస్యాలను పాకిస్తాన్‌కు చేరవేస్తున్న ఏడుగురు నేవీ అధికారులను సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. కేంద్ర నిఘా వర్గాలు, ఏపీ ఇంటెలిజెన్స్ అధికారుల ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ డాల్ఫిన్ నోస్’ నిర్వహించారు. ఓ హవాలా బ్రోకర్‌ను కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వీరందరినీ వేర్వేరు ప్రాంతాల్లో అరెస్ట్ చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేసి విజయవాడ ఎన్ఐఏ కోర్టులో హాజరు పరిచారు. వీరికి న్యాయస్థానం జనవరి 3వ తేదీవరకూ రిమాండ్ విధించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గుల్జార్‌ది ఓ విచిత్రమైన ప్రేమ కథ..
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఇండియా నుంచి పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రం సియాల్ కోట్కు 4–5 నెలలుగా తరచూ ఫోన్లు వెళుతున్నాయి. దీనిపై కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు దృష్టి సారించారు. ఫోన్లు ఎక్కడి నుంచి వెళుతున్నాయని ఆరా తీయగా.. కర్నూలు నుంచి అని తేలింది. సెల్ టవర్ సిగ్నల్స్ ఆధారంగా గడివేముల వాసి షేక్ గుల్జార్ ఖాన్.. పాక్‌కు ఫోన్ చేస్తున్నట్టు గుర్తించారు. అతను నెల కిందటే పాస్‌పోర్టు తీసుకోవడం, పది రోజులుగా మరీ ఎక్కువగా పాక్‌కు ఫోన్ చేస్తుండటంతో ఆయన కదలికలపై నిఘా పెట్టారు. ఈ నెల ఒకటిన ఆయన గడివేములను ఖాళీ చేసి.. కుటుంబ సభ్యులతో హైదరాబాద్ వెళ్లాడు. దీంతో రెండో తేదీన గుల్జార్‌తో పాటు అతని భార్య, పిల్లలను కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పోలీసులకు గుల్జార్‌ది ఓ విచిత్రమైన ప్రేమ కథ అని తేలింది.. రాంగ్ నంబర్.. రియల్ లవ్! గుల్జార్‌ది పాకిస్థాన్‌లోని సియాల్కోట్. పేద కుటుంబం.. ఉపాధి కోసం 12 ఏళ్ల కిందట సౌదీ అరేబియా వెళ్లాడు. ఏడాది పాటు అక్కడే పనిచేశాడు. ఓ సారి పొరపాటున రాంగ్ నంబర్ డయల్ చేయడంతో గడివేములలోని దౌలత్‌బీ పరిచయమైంది. ఆమెకు అప్పటికే భర్త చనిపోయాడు. ఓ కుమారుడున్నాడు. తరచూ ఫోన్లో మాట్లాడుకున్న వీరి మధ్య ప్రేమ చిగురించింది. దీంతో గుల్జార్ సౌదీ నుంచి పాక్ వెళ్లకుండా ఇండియా వచ్చారు. పాకిస్థాన్ పాసుపోర్టుతో అయితే వీసా తీసుకోవాలి. వీసా గడువు ముగియగానే తిరిగి పాక్ వెళ్లిపోవాలి. కానీ గుల్జార్ ఇండియాలోనే స్థిరపడాలనే యోచనతో వచ్చాడు. ఇందుకోసం తాను ఇండియన్ అని, పాస్‌పోర్టు పోయిందని సౌదీ పోలీసులకు ఫిర్యాదు చేసి.. వారిని నమ్మించి ఈసీ (ఎమర్జెన్సీ సర్టిఫికెట్) ద్వారా ఇండియా వచ్చినట్టు తెలుస్తోంది. నేరుగా గడివేములకు వెళ్లి దౌలత్‌ను వివాహం చేసుకున్నాడు. వీరి పదేళ్ల సంసారంలో నలుగురు ఆడ పిల్లలు జన్మించారు. పెయింటింగ్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 4–5 నెలలుగా తిరిగి పాక్‌లోని తన కుటుంబ సభ్యులతో మాట్లాడటం మొదలెట్టాడు. వివాహం, పిల్లల విషయాలు చెప్పేశాడు. దీంతో వారు తిరిగి పాక్‌కు రావాలంటూ విలపించారు. దీంతో నెల కిందట గుల్జార్, దౌలత్‌తో పాటు పిల్లలకూ పాస్‌పోర్టులు తీసుకుని.. పాక్‌లోని కుటుంబ సభ్యులతో మరింతగా మాట్లాడటం మొదలెట్టాడు. నేరస్తుడు కాదు.. ప్రేమికుడు! పోలీసుల విచారణలో అతడు నేరస్తుడు కాదని.. కేవలం ప్రేమించిన మహిళను పెళ్లి చేసుకుని స్థిరపడాలనే వచ్చినట్టు తేలింది. అతనిని రిమాండ్‌కు పంపినట్టు తెలుస్తోంది. దౌలత్‌ఖాన్, వారి పిల్లలను కర్నూలుకు పంపారు. ఇప్పుడు గుల్జార్‌ను పాక్‌కు పంపితే.. దౌలత్, ఆమె పిల్లలు నిరాశ్రయులవుతారు. దౌలత్‌ను కూడా పాకిస్థాన్‌కు పంపితే.. అక్కడ ఆమెకు పౌరసత్వ సమస్య ఉత్పన్నమవుతుంది. గుల్జార్ పాక్ వాసి అని తేలిపోయింది కాబట్టి ఇప్పుడు ఇండియాలో నివాసముండాలంటే ఇక్కడ పౌరసత్వ సమస్య ఏర్పడినట్టే. ఈ క్రమంలో పోలీసులు, భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. -
ఐఎంఎస్ స్కాం.. రంగంలోకి ఇంటెలిజెన్స్
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐలోని ఇన్సూరెన్స్ మెడికల్ సరీ్వసెస్ (ఐఎంఎస్) కుంభకోణంలో రోజుకో సంచలనం వెలుగు చూస్తోంది. ‘ఎవరా ఐఏఎస్ అధికారి?’అంటూ ఆదివారం ‘సాక్షి’ప్రచురించిన కథనానికి సీఎంవో నుంచి స్పందన వచి్చంది. ఈ కేసులో ఇప్పటికే ఆధారాల కోసం అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) గాలిస్తుండగానే.. ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఐఏఎస్ నుంచి అటెండర్ దాకా అందరిపైనా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ వ్యవహారంపై ఇటీవల సీఎం కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కానీ, కోట్ల రూపాయల కుంభకోణంలో సాక్షాత్తూ సీఎం ఇంటిపేరును వాడుకోవడం చర్చనీయాంశమైంది. ‘శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు’అన్నట్లుగా వారు చేసే అక్రమాలకు జాయింట్ డైరెక్టర్ కల్వకుంట్ల పద్మ తనకు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బంధువు అని పలువురిని బెదిరించడం గమనార్హం. సీఎం ఇంటిపేరు వాడుకున్న విషయంపై ముఖ్యమంత్రి కార్యాలయం కూడా అధికారులను ఆరాతీసినట్లు సమాచారం. తనిఖీల రోజు ఎవరెవరు లీవ్? విజిలెన్స్ తనిఖీలు జరిగిన తేదీల్లో ఈ కుంభకోణంతో సంబంధమున్న ఉద్యోగుల్లో ఎవరెవరు సెలవుపై వెళ్లారన్న వివరాలను ఇంటెలిజెన్స్ అధికారులు సేకరిస్తున్నారు. నిందితుల ఆస్తులు, బ్యాంకు ఖాతాలపైనా రహస్యంగా ఆరా తీస్తున్నారు. బిల్లులు మంజూరైన తేదీల్లో ఎవరెవరి ఖాతాల్లో డబ్బులు అధికంగా వచ్చి చేరాయి? విదేశాలకు ఏమైనా డబ్బులు తరలించారా? మెడికల్ కంపెనీలు సమరి్పంచిన చిరునామాల్లో సదరు కంపెనీలు ఉన్నాయా? లేవా? అనే విషయాలపైనా కూపీ లాగుతున్నారని సమాచారం. మందుల సరఫరాలో ఎవరెవరు కీలకంగా వ్యవహరించారు? నగదు విషయాలు ఎవరు చూసుకునేవారు? వాటాలు ఎలా పంచేవారు? అనే విషయాలపై కీలక సమాచారం సేకరించారని తెలుస్తోంది. కాగా, ఈవ్యవహారం కార్మికసంస్థ సోమవారం గోల్కొండ క్రాస్రోడ్స్లోలోని సీపీఎం కార్యాల యంలో ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేయనుంది. -
రైతులను ముంచడమే లక్ష్యంగా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విత్తన దళారులు రైతులను దోచుకుంటున్నారు. అనేకచోట్ల నాసిరకపు విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. లేబుల్స్ లేకుండా విత్తన విక్రయాలు జరుపుతున్నారు. మరికొన్నిచోట్ల విత్తన ధ్రువీకరణ సంస్థ ద్వారా అంద జేసే లేబుళ్లనూ కొందరు అధికారులతో కుమ్మక్కై సంపాదిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా రైతులను మోసం చేసే పనిలో దళారులు, కొందరు ఏజెంట్లు నిమగ్నమయ్యారు. పైగా రాష్ట్రంలో విత్తన దుకా ణాల్లో సరైన రికార్డులు నిర్వహించడం లేదు. విత్తన ప్యాకెట్లకు అసలు లేబుల్స్ లేకుండా నేరుగానే రైతులకు అంటగడుతున్నారు. ఏ విత్తనం ఎక్కడిది.. ఎవరికి విక్రయిస్తున్నారు.. రోజువారీగా ఎంత అమ్ముతున్నారన్నది స్పష్టత లేదు. ప్యాకింగ్ లేని.. అనుమతి లేని పత్తి విత్తనాలు, నకిలీ విత్తనాలు యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఇటీవల జరిపిన నిఘా బృందాల తనిఖీలో బట్టబయలైంది. రూ.7.20 కోట్ల విలువైన పత్తి విత్తనాల సీజ్ వివిధ జిల్లాల్లో నిఘా బృందాలు విత్తన విక్రయ కేంద్రాలు, జిన్నింగ్ మిల్లులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వీటిలో ఒక్కరోజే రూ.7.20 కోట్ల విలువ చేసే 16,499 కిలోల పత్తి విత్తనాలను స్వా ధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిషేధిత గ్లైఫోసేట్ పురుగుమందు కూడా సీజ్ చేశారు. అనేక చోట్ల విత్తన దుకాణాల నిర్వహణ సరిగా లేకపోవడంతో పాటు నకిలీ, నాసిరకం విత్తనాలను రైతులకు అంటగడుతున్నట్లు తేలింది. ఖరీఫ్ దగ్గర పడుతుండటం తో దళారులు రైతులను మోసం చేస్తున్నారు. విత్తన చట్టాల్లోని లోపాలను ఆసరా చేసుకొని దళారులు, కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఖరీఫ్‌లో 1.29 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లు... వచ్చే ఖరీఫ్‌లో 1.29 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లు సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. 90 కంపెనీల ద్వారా వీటిని రైతులకు సరఫరా చేయనుంది. జిల్లాల నుంచి వివిధ రకాల విత్తనాలకు ఇండెంట్ తెప్పించుకున్న ప్రకారం 7.50 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేయనున్నారు. ఇందులో వరి విత్తనాలు 3 లక్షల క్వింటాళ్లు సరఫరా చేయనున్నారు. హైబ్రిడ్ రకం, ఆర్ఎన్ఆర్–15064, కేఎన్ఎం–118, జేజీఎల్–18047 రకం విత్తనాలను సరఫరా చేస్తారు. వీటితోపాటు బీపీటీ–5204 రకం విత్తనాలనూ సరఫరా చేయాలని నిర్ణయించారు. 1.70 లక్షల క్వింటాళ్ల సోయాబీన్ విత్తనాలనూ సరఫరా చేయడంతోపాటు 20 వేల క్వింటాళ్ల కంది విత్తనాలను సరఫరా చేస్తారు. పెసర, మినుములు, జొన్న, మొక్కజొన్న, జీలుగ, పిల్లిపెసర, పొద్దు తిరుగుడు, ఆముదం విత్తనాలను ఖరీఫ్ కోసం అందజేస్తారు. లక్ష క్వింటాళ్ల జీలుగ విత్తనాలు, 80 వేల క్విం టాళ్ల మొక్కజొన్న విత్తనాలు సరఫరా చేస్తారు. -
ఉగ్రవాద అస్త్రం
అధికారంలోకొచ్చిన దగ్గరనుంచి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ చిరకాల వాంఛల్ని ఈడేర్చడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. ఇరాన్‌తో అమెరికాకు ఉన్న అణు ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేశారు. అమెరికా రాయబార కార్యాలయాన్ని జెరుసలేంకు తరలిం చారు. గోలన్‌హైట్స్ ఇజ్రాయెల్‌దేనన్నారు. వీటన్నిటికీ పరాకాష్టగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ)దళాలను ఉగ్రవాద బృందంగా పరిగణిస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై ఇరాన్ కూడా తీవ్రంగానే స్పందించింది. పశ్చిమాసియాలో ఉన్న అమెరికా సైనికుల్ని ఉగ్రవాదులుగా పరి గణిస్తూ ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తీర్మానం ఆమోదించింది. కేవలం పశ్చి మాసియాలో ఉన్నవారిని మాత్రమే కాదు...మొత్తం అమెరికా సైన్యాన్ని ఉగ్రవాదులుగా లెక్కే యాలని కొందరు సభ్యులు తీవ్రంగా వాదించారని వార్త. ట్రంప్ నిర్ణయం పశ్చిమాసియాను మాత్ర మే కాదు...అమెరికాను కూడా ప్రమాదంలో పడేసింది. ఇజ్రాయెల్‌లో పోలింగ్ జరగడానికి సరిగ్గా 24 గంటల ముందు ట్రంప్ ఇరాన్‌పై ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణముంది. ఆ ఎన్నికల్లో ప్రధాని నెతన్యాహూ గెలవడం దాదాపు అసాధ్యమని సర్వేలన్నీ తేల్చిచెప్పాయి. ట్రంప్ ప్రకటన పర్యవసానమో, మరే కారణమోగానీ నెతన్యాహూ స్వల్ప ఆధిక్యతతో ఆ ఎన్నికల్లో విజయం సాధిం చారు. ఇలా ఇజ్రాయెల్ కోసం పనిచేస్తూ దేశ ప్రయోజనాలకు ట్రంప్ ఎగనామం పెడుతున్నారని స్వదేశంలో విమర్శలు వస్తున్నా ఆయన ఖాతరు చేయడం లేదు. ఇరాన్‌పై కఠిన చర్యలు తీసుకోవడానికి ట్రంప్ రెండేళ్లుగా తహతహలాడుతున్నారు. అణు బాంబు తయారీకి ఇరాన్ ప్రయత్నిస్తున్నదంటూ ఆయన ఊదరగొడుతున్న సమయంలో అందులో నిజం లేదని ఇంటెలిజెన్స్ విభాగం నివేదించింది. 2015లో కుదిరిన అణు ఒప్పందంలోని అంశా లను ఇరాన్ తుచ తప్పకుండా పాటిస్తున్నదని కితాబునిచ్చింది. ఇది ట్రంప్‌కు ఆగ్రహం తెప్పిం చింది. ‘మీరు కొన్నాళ్లు ఉద్యోగాలకు సెలవుపెట్టి మళ్లీ శిక్షణ తీసుకోండి’ అని వారినుద్దేశించి కటువుగా వ్యాఖ్యానించారు. ఇరాక్, సిరియాల్లో ఏర్పడ్డ సంక్షోభాలు ఇప్పుడిప్పుడే ఒక కొలిక్కి వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయని, ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) కార్యకలాపాలను అణిచే యగలిగామని...ఈ దశలో ఇరాన్‌తో వైరం మంచిదికాదని సీఐఏ భావన. ఒబామా హయాంలో ఇరాన్‌తో అమెరికా, మరి అయిదు దేశాలు కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి నిరుడు మే నెలలో ఏకపక్షంగా అమెరికా బయటికొచ్చింది. కొత్త ఒప్పందానికి సిద్ధపడకపోతే ఆంక్షలు విధిస్తా మని బెదిరించింది. దీన్ని ఇరాన్ ఖాతరు చేయకపోవడంతో ఆర్నెల్ల తర్వాత ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు ఐఆర్జీసీని ఉగ్రవాద బృందంగా ప్రకటించింది. ఇరాన్‌ను ఎలాగైనా అంతర్జాతీయంగా ఏకాకిని చేయాలని ట్రంప్ శక్తివంచన లేకుండా ప్రయ త్నిస్తున్నారు. మొన్న ఫిబ్రవరిలో పోలాండ్లోని వార్సాలో అమెరికా ఆధ్వర్యంలో పశ్చిమాసియా భద్రతా సదస్సు కూడా ఏర్పాటైంది. అయితే అణు ఒప్పందంపై ట్రంప్ వైఖరితో విభేదించి ఆ ఒప్పందంలో తాము భాగస్వాములుగా ఉంటామని ప్రకటించిన జర్మనీ, ఫ్రాన్స్ ఈ భద్రతా సద స్సుకు దూరంగా ఉన్నాయి. యూరప్‌కు చెందిన ఇతర దేశాలు కొన్ని, అరబ్ దేశాలు మాత్రమే ఇందులో పాల్గొన్నాయి. ఆ దేశాలనుంచి కూడా ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రమే వచ్చారు. ఫలి తంగా ఇరాన్‌ను ఏకాకి చేద్దామనుకున్న అమెరికాయే ఒంటరైంది. వాస్తవానికి నిరుడు అక్టోబర్‌లోనే ఐఆర్జీసీ ని ట్రంప్ ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తున్నట్టు చెప్పారు. అయితే అమెరికా ఆర్థిక విభాగం నిబంధనలకింద ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు విదేశాంగ శాఖ ఆ పని చేసింది. తాజా నిర్ణ యం వల్ల ఐఆర్‌జీసీతో వాణిజ్యపరమైన సంబంధాలు పెట్టుకున్నవారిని నేరస్తులుగా ముద్రేసి అరె స్టు చేయడానికి అమెరికాకు అధికారం లభిస్తుంది. సరిగ్గా ఈ కారణం వల్లనే అటు రక్షణ విభాగం పెంటగాన్, గూఢచార విభాగం సీఐఏ అధికారులు ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అమెరికా నిర్ణయాన్ని సాకుగా చూపి ఇరాన్‌కు చెందిన ఛాందసవాద బృందాలు విదేశాల్లోని అమెరికా భద్రతా విభాగం అధికారులపైనా, పారామిలిటరీ దళాలపైనా దాడులకు దిగే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నాయి. ఇదంతా చివరకు ఇరాన్‌తో యుద్ధాన్ని తీసుకొస్తుందన్నది వారి వాదన. యుద్ధమే వస్తే ఇరాక్‌లో ఉన్న అమెరికా సైన్యం పెను ముప్పును ఎదుర్కొనవలసి వస్తుంది. ఇరాక్‌లో ఐఎస్ సంస్థ 60 శాతం భూభాగాన్ని ఆక్రమించుకుని ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నప్పుడు దాన్ని ఎదుర్కొన్నది అమెరికా సైన్యం కాదు. దాన్ని అణచడం అసాధ్యమని అది ఎప్పుడో చేతులెత్తేసింది. అప్పుడు పొరుగునున్న ఇరాన్ రంగంలోకి దిగి ఐఆర్‌జీసీద్వారా ఇరాక్‌లోని షియా పౌర సైన్యానికి అండగా నిలబడింది. ప్రస్తుతం ఇరాక్‌లో ఉన్న 5,200మంది అమెరికా సైన్యానికి వీరే రక్షణ కల్పిస్తున్నారు. ఇరాన్ అమెరికా సేనల్ని ఉగ్రవాదులుగా పరిగణించడం మొదలుపెట్టినా లేక వారికి సహకరించడం మానుకున్నా కష్టాలు తప్పవు. ఏకకాలంలో అమెరికా సేనలు ఇరాక్‌లో, ఇరాన్లో దాడులు ఎదుర్కొనవలసివస్తుంది. ఇప్పుడిప్పుడే కొడిగడుతున్న ఐఎస్ సైతం మళ్లీ కోరలు చాస్తుంది. అదే జరిగితే అమెరికా, ఇరాన్‌లతోపాటు పశ్చిమాసియా దేశాలన్నీ సంక్షోభంలో పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా విదేశాంగ శాఖ ఇంతవరకూ అల్ కాయిదా, ఐఎస్, కొన్ని పాలస్తీనా సంస్థలను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించింది. కానీ ఒక దేశ సైన్యంలో భాగంగా ఉంటున్న విభాగాన్ని ఉగ్రవాద సంస్థగా పరిగణించడం ఇదే ప్రథమం. పర్యవసానంగా ఇరాన్‌తో దౌత్య సంబంధాలున్న ఏ దేశమైనా ఐఆర్‌జీసీతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే అది అమెరికా దృష్టిలో నేరం అవుతుంది. ఇందువల్ల ఆ దేశాలకు మాత్రమే కాదు...వాటితో వ్యవహరించవలసి రావడం అమెరికాకు కూడా సమస్యే అవుతుంది. కనుక ట్రంప్ చర్యను అడ్డుకుని, సమస్య ముదరకుండా చూడాల్సిన బాధ్యత అమెరికా ప్రజానీకానిది, ప్రత్యేకించి అమెరికా ప్రతినిధుల సభది. -
పోలింగ్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బలగాలు తక్కువగానే వచ్చినప్పటికీ బందోబస్తు ఏర్పాట్లు పక్కాగానే చేసినట్టు ఎన్నికల అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో ఎన్నికల బందోబస్తు కోసం 296 కంపెనీల ప్రత్యేక బలగాలు కావాలని ఎన్నికల అధికారులు ప్రతిపాదించారు. అయితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి దశలోనే ఎన్నికలు జరుగుతున్నందున ఏపీకి 197 కంపెనీల కేంద్ర బలగాలను మాత్రమే కేటాయించారు. 2014లో తొలివిడత ఎన్నికలు తెలంగాణలో పూర్తయిన తరువాత 27 వేల మంది పోలీస్ సిబ్బందిని ఏపీకి తరలించడంతో అప్పట్లో పెద్దగా ఇబ్బందులు రాలేదని పోలీసు అధికారులు చెబుతున్నారు. కానీ, ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల్లో ఒకేరోజు ఎన్నికలు జరుగుతుండడంతో రాష్ట్రానికి సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ నుంచి 197 కంపెనీల కేంద్ర బలగాలతో పాటు, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు నుంచి ప్రత్యేక బలగాలు వచ్చాయి. అంతేకాక.. ఏపీలోని పోలీసు బలగాలు, ఏపీఎస్పీ బెటాలియన్స్‌తోపాటు మాజీ సైనికులు, యూనిఫారం సిబ్బంది, ఎన్సీసీ వంటి వారి సేవలను కూడా ఈసారి ఎన్నికల నిర్వహణకు ఉపయోగించుకుంటున్నారు. ప్రత్యేకంగా 1200 బాడీవోర్న్ కెమెరాలు, 67 డ్రోన్ కెమెరాలను కూడా వినియోగిస్తున్నారు. ఎన్నికల విధుల్లో వినియోగించే 2,684 వాహనాలకు జీపీఎస్‌ను ఏర్పాటుచేశారు. తక్షణ స్పందన కోసం డయల్ 100, 1050, 1090 సేవలను వినియోగిస్తున్నారు. వీటికి ఇప్పటివరకు 1,01,133 కాల్స్ రాగా వాటిలో 65,750 కాల్స్ నిజమైనవిగా నిర్ధారించారు. కాగా, మంగళవారం వరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై 4501 కేసులు నమోదయ్యాయి. మావోయిస్టు ప్రాంతాల్లో హైఅలర్ట్.. ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టులు పిలుపునివ్వడంతో ఆయా ప్రాంతాల్లో పోలింగ్ రోజున ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. రెండ్రోజుల క్రితం ఛత్తీస్‌గడ్‌లో బీజేపీ ఎమ్మెల్యే ప్రయాణీస్తున్న కారును మందుపాతరతో మావోయిస్టులు పేల్చివేసిన ఘటన తెల్సిందే. ఈ ఘటనలో ఎమ్మెల్యేతోపాటు నలుగురు మృతి చెందారు. దీనికితోడు ఇటీవల అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమాలను మావోలు కాల్చి చంపిన సంగతి తెల్సిందే. దీంతో రాష్ట్ర సరిహద్దున ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. 520 పోలింగ్ ప్రాంతాల్లో సెంట్రల్ పారా మిలటరీ బలగాలు, గ్రేహౌండ్స్ బలగాలు, డ్రోన్ కెమెరాలతో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. కాగా, ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని మద్యం షాపులతో పాటు సరిహద్దుల్లోని పొరుగు రాష్ట్రాల్లోని ఐదు కిలోమీటర్ల మేర మద్యం షాపులు మూసివేసేల చర్యలు తీసుకున్నారు. వాహన తనిఖీలనూ ముమ్మరం చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలపై అప్రమత్తం రాష్ట్రంలో ఈసారి అలజడులు జరుగుతాయంటూ రెండ్రోజులుగా చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఉ.7 గంటల నుంచి 11 గంటల వరకు తమకు అనుకూలంగా ఉన్న వారితో ఓట్లు వేయించుకుని ఆ తరువాత అలజడులు సృష్టించే అవకాశం ఉందంటూ నిఘా వర్గాలకు సమాచారం అందింది. కొన్ని ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకుని కొందరు ఉద్దేశ్యపూర్వకంగానే ఇలా అలజడులు రేపి వ్యతిరేక ఓటింగ్ జరగకుండా నిలువరించే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అప్పటికే వేయించుకున్న అనుకూల ఓట్లతో గట్టెక్కడమా? లేదంటే అక్కడి రీ పోలింగ్ జరిగే పరిస్థితులు కల్పించడమా? అనే విషయంలో కొందరు వ్యూహాలు పన్నుతున్నట్లు కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాల దృష్టికి వచ్చింది. దీంతో ఇప్పటికే గుర్తించిన 8,514 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లపై ప్రత్యేక దృష్టి సారించారు. చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలో అలజడులు జరిగే ప్రమాదం ఉన్న ప్రాంతాలపై పోలీసు, ఎన్నికల అధికారులు ఓ కన్నేశారు. -
సీఈసీకి వివరణ ఇచ్చుకున్న ఆర్పీ ఠాకూర్..!
న్యూఢిల్లీ : ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. సీఈసీ కమిషనర్లు అశోక్ లావాస, సుళీల్ చంద్రతో భేటీ అయ్యారు. ఇంటలిజెన్స్ డీజీగా బాధ్యతల నుంచి తప్పించినప్పటికీ ఏబీ వెంకటేశ్వరరావు అనధికారికంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఠాకూర్‌ను ఈసీ వివరణ అడిగినట్టు తెలిసింది. ఎన్నికల విధుల్లో పక్షపాతంగా వ్యవహిరిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఠాకూర్‌ను ఏసీబీ డీజీ పదవి నుంచి తప్పించి గట్టి హెచ్చరికలు పంపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏసీబీ ఏడీజీగా ఉన్న శంకబ్రత బాగ్చీకి పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తమ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని మరోసారి స్పష్టం చేసినట్టు తెలిసింది. (చదవండి : ఏసీబీ బాధ్యతల నుంచి ఠాకూర్ తొలగింపు) -
ఈసీ ఆదేశాలనే ధిక్కరిస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఏబీ వెంకటేశ్వరరావును తప్పించాలని, ఆయనకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించరాదని తాము జారీచేసిన ఉత్తర్వులను ఉల్లంఘించి ఆయనను తిరిగి అదే పదవిలో నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అనిల్‌చంద్ర పునేత జీవో జారీ చేయడంపై కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిషన్ ఆదేశాల మేరకు వెంకటేశ్వరరావును తప్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 716ను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది? తిరిగి ఆయననే డీజీ ఇంటెలిజెన్స్‌గా నియమిస్తూ జీవో 720 ఎందుకు జారీ చేశారు? ఎన్నికల కమిషన్ ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటించాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే ఉల్లంఘించడాన్ని ఎలా పరిగణించాలి? అని ఈసీ ప్రశ్నించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అనిల్‌చంద్ర పునేతను ఈసీ వివరణ కోరింది. దీంతో అనిల్‌చంద్ర పునేత సోమవారం ఢిల్లీలో ఈసీని కలిసి వివరణ ఇచ్చారు. ‘కమిషన్ ఆదేశాలు వచ్చిన తక్షణమే ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం, వైఎస్సార్ కడప జిల్లాల ఎస్పీలు వెంకటరత్నం, రాహూల్ దేవ్ శర్మను బదిలీ చేస్తూ జీవో నంబరు 716 జారీ చేశాం. తర్వాత ఇంటెలిజెన్స్ డీజీ ఎన్నికల కమిషన్ పరిధిలోకి రారంటూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) పంపిన నోట్ ఫైల్ మేరకే జీవో 721 జారీ చేశాం. దీని ప్రకారమే ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు బదిలీని రద్దు చేసి మిగిలిన ఇద్దరు ఎస్పీల బదిలీలను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు జీవో నంబరు 720 జారీ చేశాం ’ అని సీఎస్ అనిల్‌చంద్ర పునేత వివరణ ఇచ్చినట్లు తెలిసింది. డీజీపీ నోట్ ఫైల్ పంపితే ఆ విషయం మా (ఈసీ) దృష్టికి తీసుకొచ్చి అనుమతి తీసుకోకుండా బదిలీ ఉత్తర్వులను ఎలా రద్దు చేస్తారు? డీజీపీగానీ, మరొకరుగానీ ఏది చెబితే అది చేసేస్తారా? ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో ఎలా సవాల్ చేస్తుంది? అని ఈసీ నిలదీసినట్లు తెలిసింది. ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోకుండా జీవో ఇవ్వడం తొందరపాటు చర్యేనని, ఇకమీదట ఇలా జరగనీయబోమంటూ సీఎస్ సంజాయిషీ ఇచ్చినట్లు సమాచారం. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వెంకటేశ్వరరావును బదిలీచేసిన ప్రభుత్వం 24 గంటలు గడవకముందే ఆయనను తిరిగి అదే స్థానంలో నియమించడం, కమిషన్ నిర్ణయాన్ని సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వమే హైకోర్టులో సవాల్ చేయడం ఈసీకి ఆగ్రహం తెప్పించింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించడమే కాకుండా ఈసీ ఉత్తర్వులను యథాతథంగా అమలు చేయాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం మళ్లీ వెంకటేశ్వరరావును ఇంటెలిజెన్స్ డీజీ పోస్టు నుంచి తప్పించి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ జీవో ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీరును తప్పుబడుతూ వివరణ అడగడంతోపాటు ఇందుకు దారితీసిన పరిణామాలు, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను కమిషన్ అధికారులు వాకబు చేసినట్లు సమాచారం. -
కోర్టుకెళ్లి తప్పు చేశాం..!
-
ఎంత చెప్పినా సీఎం వినలేదు.. కోర్టుకెళ్లి తప్పు చేశాం..!
సాక్షి, అమరావతి: కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) ఆదేశాలను సవాల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం తలబొప్పికట్టేలా చేసింది. దీంతో యూటర్న్ తీసుకుని రాష్ట్ర నిఘా విభాగం అధిపతి (ఇంటెలిజెన్స్ డీజీ) ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిఘా విధులను పక్కనపెట్టి టీడీపీ సేవలో తరిస్తున్న ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఆదేశాలను పాటించాల్సింది పోయి కోర్టులో సవాల్ చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ పరువు పోయిందనే అంశం ఉన్నతస్థాయి అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సీఎం చంద్రబాబు రాజకీయ స్వార్థం కోసం తమను బదనాం చేశారని ఉన్నతాధికారులు మథనపడుతున్నారు. ముగ్గురు పోలీసు అధికారులను బదిలీచేస్తూ సీఈసీ ఇచ్చిన ఆదేశాలు, తదనంతర పరిణామాలు ఇందుకు ప్రత్యక్ష నిదర్శనాలని అధికారులు ఎత్తి చూపుతున్నారు. ‘ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం, వైఎస్సార్ జిల్లాల ఎస్పీలు ఎ.వెంకటరత్నం, రాహుల్‌దేవ్ శర్మను బదిలీచేస్తూ ఎన్నికల కమిషన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిని ఎన్నికలకు సంబంధించిన విధులకు వీరిని దూరంగా పెట్టాలని కూడా ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ వీరి ముగ్గురినీ బదిలీచేస్తూ మంగళవారం రాత్రి జీవో 716 జారీ చేశారు. అయితే ఏబీ వెంకటేశ్వరరావు బదిలీని జీర్ణించుకోలేకపోయిన సీఎం ఎలాగైనా దీనిని ఆపించాలని ప్రయత్నించారు. ఇందులో భాగంగానే జీవోను రద్దుచేసి శ్రీకాకుళం, వైఎస్సార్ జిల్లాల ఎస్పీలను మాత్రమే బదిలీ చేయాలని తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి రెండు జీవోలు ఇప్పించారు. అలాగే సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ పేరుతో ప్రభుత్వం తరఫున ఏబీ వెంకటేశ్వరరావు బదిలీని నిలిపివేయాలంటూ కోర్టులో కేసు వేయించారు. అసలు ఒక అధికారిని ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ బదిలీ చేస్తే దానికి విరుద్ధంగా ఆయన కోర్టుకెళ్లవచ్చు. ఇందుకు భిన్నంగా ఎన్నికల కమిషన్‌ను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎలా కోర్టుకు వెళుతుంది? దీని వెనుక ఆంతర్యం ఏమిటి? అనే సందేహాలు సాధారణంగానే అందరికీ కలిగేలా సీఎం చేశారు. జీవో ఎందుకు ఇచ్చారు? ఎందుకు రద్దు చేశారన్న జడ్జి ప్రశ్నలకు ఏజీ సమాధానమే ఇవ్వలేని పరిస్థితి. దీంతో అటు కోర్టులోనూ, ఇటు ఎన్నికల కమిషన్ వద్దా ప్రభుత్వ పరువును మంటలో కలిపినట్లయింది’ అని ఇద్దరు అఖిల భారత సర్వీసు అధికారులు ‘సాక్షి’తో అన్నారు. ఇంతా చేసి సాధించిందేమిటి? దేశ చరిత్రలో ఎన్నడూ ఈసీ బదిలీలను ఏ రాష్ట్ర ప్రభుత్వమూ కోర్టులో సవాల్ చేసిన దాఖలాలు లేవు. మొట్టమొదటిసారి బాబు సర్కారు ఇలా సవాల్‌చేసి కోర్టులో సైతం అక్షింతలు వేయించుకోవాల్సి వచ్చింది. ఇంతా చేసి సాధించింది ఏమిటయ్యా అంటే రెండు చోట్లా పరువు పోగొట్టుకోవడమే. ఇది చాలదన్నట్లు తమను ఎందుకు బదిలీ చేశారో, తాము చేసిన తప్పు ఏమిటో చెప్పాలంటూ శ్రీకాకుళం, వైఎస్సార్ కడప ఎస్పీలు ఎన్నికల కమిషన్‌కు లేఖలు రాయడంపై మరో దుమారం రేగుతోంది. ఈ లేఖలను వారు ఇష్టపూర్వకంగా రాయలేదు. సీఎం ఒత్తిడి తెచ్చి రాయించారనేది ప్రస్తుతం ఉన్నతస్థాయి అధికారుల్లో చర్చనీయాంశమైంది. ఈసీ వివరణ అడిగిన దాఖలాలు ఎన్నడూ లేవు ఎన్నికల కమిషన్ ఎవరినైనా అధికారులను విధుల నుంచి తప్పించేప్పుడు వారి వివరణ కోరిన దాఖలాలు ఎన్నడూ లేవు. సర్కారు కూడా బదిలీ చేసేప్పుడు వివరణ తీసుకోదు. కేవలం క్రమశిక్షణ చర్యలు తీసుకునేటప్పుడు మాత్రమే సంజాయిషీ తీసుకునే ఆనవాయితీ ఉంది. ఇంటెలిజెన్స్ అనేది ఎలా చూసినా పోలీసింగ్‌లో భాగమే. చంద్రబాబుకు అనుకూలంగా ఈసీ నిర్ణయాలు లేకపోతే ఏకపక్షమని, ఆయనకు అనుకూలంగా ఉంటే అద్భుతమని అనుకోవడం సరికాదు. – ఐవైఆర్ కృష్ణారావు, మాజీ సీఎస్ -
సాక్షి ఫొటోగ్రాఫర్‌పై పోలీసుల నిర్బంధకాండ
సాక్షి, అమరావతి: విధి నిర్వహణలో ఉన్న సాక్షి ఫొటో జర్నలిస్టుపై పోలీసులు నిర్బంధకాండకు పాల్పడ్డారు. తాను సాక్షి ఫొటోగ్రాఫర్‌నని చెప్పినా.. అందుకు సంబంధించిన గుర్తింపు కార్డులు చూపినా పోలీసులు వినిపించుకోలేదు. ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఆదేశాలతో శుక్రవారం మాచవరం పోలీస్‌స్టేషన్‌కు తరలించి గంటల తరబడి అక్రమంగా నిర్బంధించారు. విషయం తెలుసుకున్న జర్నలిస్టులు పోలీసుస్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగడంతో పోలీసులు దిగివచ్చారు. సాక్షి ఫొటోగ్రాఫర్ విజయకృష్ణను విడుదల చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల్ని అమలు చేయాలని శుక్రవారం హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు విధుల నుంచి రిలీవ్ కావాల్సి ఉంది. అదే సమయంలో ఇంటెలిజెన్స్ పోలీసుల వాహనాల్లో టీడీపీ అభ్యర్థులకు భారీఎత్తున డబ్బుల సంచులు చేరవేస్తున్నారనే సమాచారం రావడంతో అక్కడ సాక్షి ఫొటోగ్రాఫర్ విజయకృష్ణ కెమేరాతో వేచి ఉన్నారు. అతన్ని గమనించిన ఇంటెలిజెన్స్ సిబ్బంది కెమేరా లాక్కొని కార్యాలయంలోనికి తీసుకెళ్లి నిర్బంధించారు. కెమేరాలోని ఫొటోలన్నీ డిలీట్ చేయాలని ఒత్తిడి తెచ్చారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఫొటోలతోపాటు మరికొన్ని ముఖ్యమైన ఫొటోలున్నాయని ఫొటోగ్రాఫర్ బదులిచ్చారు. అయినా బెదిరించిన ఇంటెలిజెన్స్ సిబ్బంది కెమేరా లాక్కొని వారి సొంత ఫొటోగ్రాఫర్‌తో చిప్ ఫార్మెట్(ఫొటోలు డిలీట్) చేయించారు. అక్కడితో ఆగకుండా ఫొటోగ్రాఫర్ నుంచి గుర్తింపు కార్డులను, సెల్‌ఫోన్‌ను లాక్కున్నారు. లోకల్ పోలీసులకు అప్పగించాం.. విషయం తెలుసుకున్న సాక్షి స్టేట్బ్యూరో ఇన్చార్జి ఎన్.వెంకటరెడ్డి ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావుతో ఫోన్లో మాట్లాడారు. సాక్షి ఫొటోగ్రాఫర్‌ను ఇంటెలిజెన్స్ ఆఫీసు వద్ద పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారని, ఎందుకు తీసుకున్నారో చెప్పాలంటూ మాట్లాడుతుండగానే.. మేము లోకల్ పోలీసులకు అప్పగించాం. అక్కడ మాట్లాడుకోండంటూ ఫోన్ కట్ చేశారు. అనంతరం విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావును ఫోన్లో సంప్రదించగా తనకు సమాచారం లేదని, తెలుసుకుంటానని జవాబిచ్చారు. బాస్‌ల డైరెక్షన్.. పోలీసుల యాక్షన్.. మాచవరం పోలీసులు ఇంటెలిజెన్స్ పోలీస్ బాస్ డైరెక్షన్లో ఓవరాక్షన్ చేశారు. గుర్తింపు కార్డులు పరిశీలించిన తర్వాత కూడా ఉద్దేశపూర్వకంగానే నిర్బంధించారు. విషయం తెలిసి మాచవరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన పలువురు జర్నలిస్టులు ఫొటోగ్రాఫర్‌ను నిర్బంధించడాన్ని తప్పుబట్టారు. ఫొటోగ్రాఫర్‌ను వదిలిపెట్టడానికి పోలీసులు నిరాకరిస్తూ.. తమ బాస్‌ల నుంచి ఆదేశాలు రావాల్సి ఉందన్నారు. జర్నలిస్టులు సీఐ వచ్చాక మాట్లాడగా.. అక్కడకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో లెటర్ రాసిస్తే విడిచిపెడతామని ఆయన మెలికపెట్టారు. ఏ తప్పూ లేనప్పుడు ఎందుకు లెటర్ రాసివ్వాలని ప్రశ్నించిన జర్నలిస్టులు అక్రమ నిర్బంధానికి నిరసనగా మాచవరం పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఫొటోగ్రాఫర్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన ఉధృతం కావడంతో సీఐ శ్రీనివాస్ యాదవ్.. పోలీస్ కమిషనర్, ఇతర పోలీస్ బాస్‌లతో మాట్లాడి ఫొటోగ్రాఫర్‌ను విడిచిపెట్టారు. ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి... ఇలాంటి చర్యలు పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడమే అవుతుందని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(ఏపీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకట్రావు తప్పుబట్టారు. మాచవరం పోలీస్‌స్టేషన్ ఎదుట జరిగిన ఆందోళన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న ఫొటో జర్నలిస్టును కావాలనే నిర్బంధించారని, తాను జర్నలిస్టునని గుర్తింపుకార్డు చూపాక కూడా దౌర్జన్యానికి పాల్పడటం సరైంది కాదని అన్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శాంతిశ్రీ,, సాక్షి స్టేట్ బ్యూరో ఇన్చార్జి ఎన్.వెంకటరెడ్డి, సాక్షి ఫొటో ఎడిటర్ కె.రవికాంత్‌రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు సి.మాణిక్యాలరావు, మల్లు విశ్వనాథరెడ్డి, ఆకుల అమరయ్య, సీహెచ్ శ్రీనివాసరావు, జీపీ వెంకటేశ్వర్లు, వనం దుర్గాప్రసాద్, డొక్కా రాజగోపాల్లతోపాటు పలువురు జర్నలిస్టులు, ఫొటో జర్నలిస్టులు, స్థానిక విలేకరులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. -
ఎందుకు బెంబేలు?
-
జాబితాలో పేరు ఇచ్చి.. మాట మారుస్తారా..!
సాక్షి, అమరావతి : ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును తప్పించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) ఇచ్చిన ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుంగలో తొక్కిన సంగతి తెలిసిందే. ఇంటెలిజెన్స్ డీజీ ఎన్నికల కమిషన్ పరిధిలోకి రారని రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబరు 721లో చెప్పింది. ఈ వ్యవహారంపై ఏపీ హైకోర్టులో గురువారం వాదనలు మొదలయ్యాయి. ఇంటెలిజెన్స్ డీజీ ఎన్నికల విధుల్లో లేరంటూ వాదనలు వినిపించిన రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు ప్రమాణపత్రం సమర్పించింది. కేంద్ర ఎన్నికల సంఘం తరపున సీనియర్ న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే సదరు అధికారుల బదిలీకి నోటీసులు ఇచ్చామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇంటలిజెన్స్ చీఫ్ లేకుండా పోలీస్ శాఖ ఎలా ఉంటుందని, వారి నివేదికల ద్వారానే పోలీస్‌శాఖ నడుస్తుంది కదా అని స్పష్టం చేశారు. ఎన్నికల భద్రతా, పోలింగ్ పర్యవేక్షణ ఇంటలిజెన్స్ నిఘా లేకుండా ఎలా ఉంటుందని వాదించారు. సెక్షన్ 28-ఏ పరిధిలోకి వచ్చే అధికారుల జాబితాలో ఏపీ ప్రభుత్వం ఇంటలిజెన్స్ డీజీ పేరును కూడా ఇచ్చిందని కోర్టుకు విన్నవించారు. కాగా, దీనిపై ఏపీ ప్రభుత్వం వివరణ ఇస్తూ.. పొరపాటుగా ఇంటలిజెన్స్ పేరు ఇచ్చామని సమర్ధించుకుంది. 716 జీవో ప్రకారం ఇద్దరు ఎస్పీలను, ఇంటలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేసిన ప్రభుత్వం.. జీవో నెం. 720 జారీ చేసి ఇంటలిజెన్స్ డీజీ బదిలీని పక్కన పెట్టడంలో ఉద్దేశమేమిటని అన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. (చదండి : ఇంటెలిజెన్స్..పోలీస్ వ్యవస్థలో భాగమే) (చదండి : సీఈసీ ఆదేశాలు బేఖాతరు) -
ఇంటెలిజెన్స్..పోలీస్ వ్యవస్థలో భాగమే
సాక్షి, అమరావతి: ఎన్నికల సంఘం పరిధి నుంచి ఇంటెలిజెన్స్ వ్యవస్థను తప్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం హడావిడిగా జారీ చేసిన జీవోపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రపంచంలో ఎక్కడైనా ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేకుండా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా? అంటూ ఘాటుగా ప్రశ్నించింది. రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా సాగేందుకు తీసుకున్న నిర్ణయాలను సవాల్ చేస్తూ కొత్త జీవోల ద్వారా ఇంటెలిజెన్స్ వ్యవస్థను రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధి నుంచి తప్పించడమే కాకుండా, ఆ విభాగం డీజీ ఏబీ వెంకటేశ్వరరావు బదిలీని నిలిపివేయడాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాల కృష్ణ దివ్వేది తీవ్రంగా తప్పు పట్టారు. మంగళవారం సచివాలయంలో విలేకరులతో ద్వివేది మాట్లాడుతూ ఐపీఎస్ అధికారుల బదిలీలపై రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్ర ఎన్నికల సంఘం నిశితంగా గమనిస్తోందన్నారు. దీనిపై ఇప్పటికే చీఫ్ సెక్రటరీ, హోం మంత్రిత్వ శాఖ, డీజీపీ నుంచి వివరణ కోరామని, ఈ సమాచారాన్ని అంతా ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తున్నట్లు తెలిపారు. కేవలం అధికారులు ఇచ్చే సమాచారమే కాకుండా సొంత మార్గాల ద్వారా వాస్తవ సమాచారాన్ని సేకరించి నివేదించనున్నట్లు చెప్పారు. ఎన్నికల సంఘం అనేది స్వతంత్ర సంస్థ అని, ఈ సంస్థ తీసుకున్న నిర్ణయాలపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే కోర్టులను ఆశ్రయించవచ్చని ద్వివేది స్పష్టం చేశారు. ఇంటెలిజెన్స్ లేకుండా ఎన్నికల నిర్వహణ ఎలా? ఎన్నికల సంఘం విధులకు ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధం లేదంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై దివ్వేది తీవ్రంగా స్పందించారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ నుంచి ముందస్తు సమాచారం లేకుండా మావోయిస్టులు, ఫ్యాక్షనిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంత్రాల్లో శాంతి భద్రతల పరంగా ఏ విధంగా ఎన్నికల ఏర్పాట్లు చేస్తామంటూ ఆయన ప్రశ్నించారు. పోలీసు విధి నిర్వహణలో ఇంటెలిజెన్స్ ఒక భాగమని, శాంతిభద్రతలతో ముడి పడి ఉన్న ఏ అంశమైనా ఇంటెలిజెన్స్‌తోనే ముడిపడి ఉంటుందని స్పష్టం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య పరిణామంతో ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధం ఉండదా? ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్యతో సంబంధం ఉండదా అని ఆయన ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్ నుంచి ముందస్తు సమాచారం లేకుండా సరైన అంచనా, నిఘా ఏర్పాట్లు ఎలా సాధ్యమవుతాయన్నారు. -
దారితప్పిన నిఘా
సాక్షి, అమరావతి: ఇంటెలిజెన్స్.. పోలీసు వ్యవస్థలో అత్యంత కీలకమైనది నిఘా వ్యవస్థ. శాంతిభద్రతలకు భంగం కలిగించే సంఘ విద్రోహశక్తుల కదలికలను, మావోయిస్టు, తీవ్రవాద కార్యకలాపాల్ని నిశితంగా కనిపెడుతూ పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ఈ వ్యవస్థది. ఇప్పుడీ యంత్రాంగం పూర్తిగా దారితప్పింది. ‘పచ్చ’ సేవలో తరిస్తోంది. సీఎం చంద్రబాబు ఇంటెలిజెన్స్ వ్యవస్థను తన జేబు వ్యవస్థగా మార్చేశారు. ఫలితంగా రాష్ట్ర పౌరుల భద్రతను గాలికొదిలేసిన ఇంటెలిజెన్స్.. ఎల్లో నెట్‌వర్క్‌గా మారిపోయిందనే విమర్శలను మూటగట్టుకుంది. ప్రస్తుత ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు పూర్తిగా పచ్చచొక్కా తొడుక్కుని పనిచేస్తున్నట్టు ఆరోపణలు ముంచెత్తుతున్నాయి. జిల్లాల్లో ఇంటెలిజెన్స్ డీఎస్పీల నుంచి రాష్ట్ర ప్రధాన కార్యాలయంలోని ఓఎస్డీ వరకు సీఎం సొంత సామాజికవర్గానికి చెందినవారితో నింపేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఇప్పుడీ నిఘా వ్యవస్థ దారితప్పిందని, చేయాల్సిన పని వదిలేసి.. పూర్తిగా టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తోందనే తీవ్రమైన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చివరకు టీడీపీ అభ్యర్థుల ఎంపికలోనూ కీలకపాత్ర పోషిస్తోందని, అదే సమయంలో వైఎస్సార్సీపీ అభ్యర్థుల్ని నీడలా వెంటాడుతూ ఎప్పటికప్పుడు వారి సమాచారాన్ని పొలిటికల్ బాస్‌కు చేరవేయడం ద్వారా టీడీపీకి రాజకీయంగా తోడ్పడడంలో నిమగ్నమైనట్టు చర్చ నడుస్తోంది. టీడీపీ సేవలోనే ఇంటెలిజెన్స్ సిబ్బంది.. రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో ఇంటెలిజెన్స్ డీఎస్పీ పర్యవేక్షణలో అసెంబ్లీ నియోజకవర్గానికో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌ను కేటాయించారు. అదే పట్టణ ప్రాంతాల్లో ఇద్దరు, ముగ్గురు సిబ్బందిని నియమించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 256 మంది ఇంటెలిజెన్స్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తూ రోజువారీ సమాచారం ఇస్తుంటారు. ఆ సమాచారాన్ని రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో 150 మంది క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిస్తుంటారు. వీరందరినీ రాజకీయ కోణంలోనే పనిచేయిస్తుండడం గమనార్హం. దీంతో అసలు విధులను మరిచి అధికార టీడీపీకి ఏజెన్సీగా వ్యవహరిస్తున్నట్టు విమర్శలు రేగుతున్నాయి. అంతేగాక ప్రతిపక్షాన్ని ఇబ్బందిపెట్టి పాలకపక్షానికి కొమ్ముకాసేలా వ్యవహరిస్తోందనే చర్చ కూడా సాగుతోంది. చేయాల్సిన పని వదిలేసి అధికారపార్టీ సేవలో నిఘా వ్యవస్థ తరిస్తోందని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఒకరు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కారణంగా చంద్రబాబు అధికారం చేపట్టాక రాష్ట్రంలో చోటుచేసుకున్న పలు ఘటనలతో ఇంటెలిజెన్స్ విభాగం తీవ్ర అభాసుపాలైందని వ్యాఖ్యానించారు. అంతా తానై వ్యవహరిస్తున్న ఏబీవీ.. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఆయన పూర్తిగా పచ్చచొక్కా తొడుక్కుని పనిచేస్తున్నారని, పోలీసు శాఖలో బదిలీలు, పోస్టింగుల్లో సొంత సామాజికవర్గానికి పెద్దపీట వేస్తున్నారని పోలీసు అధికారులు, సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు అధికారం చేపట్టిన తొలినాళ్లలో ఏఆర్ అనురాధను ఇంటెలిజెన్స్ ఏడీజీగా నియమించారు. ఓటుకు కోట్లు స్కామ్‌లో చంద్రబాబు అడ్డంగా దొరికిపోవడంతో అనురాధపై వేటుపడింది. తర్వాత విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావుకు ఇంటెలిజెన్స్ చీఫ్ పోస్టు కట్టబెట్టారు. అప్పట్నుంచీ ఆయన పూర్తిగా చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలకోసమే పనిచేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల్ని టీడీపీలోకి తీసుకొచ్చేందుకు జరిగిన బేరసారాల్లో ఆయనే కీలకపాత్ర వహించినట్టు ఆరోపణలున్నాయి. భూమా నాగిరెడ్డి ఆకస్మిక మృతితో జరిగిన నంద్యాల ఉప ఎన్నికలో ఇంటెలిజెన్స్‌ను పూర్తిగా టీడీపీకోసమే ఉపయోగించారనే ఆరోపణలొచ్చాయి. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లోనూ టీడీపీ సేవకు ఇంటెలిజెన్స్‌లోని సొంత సామాజికవర్గం వారిని ఏబీవీ రంగంలోకి దించినట్టు పోలీసు అధికారి ఒకరు చెప్పారు. నిఘా వైఫల్యానికి మూల్యం.. అసలు విధులను మరిచి టీడీపీ సేవలో ఇంటెలిజెన్స్ తరిస్తున్నందునే రాష్ట్రంలో పలుమార్లు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని పోలీసు శాఖలోని పలువురు సీనియర్ అధికారులు సైతం చర్చించుకుంటున్నారు. ఇందుకుగాను వారు కొన్ని ఘటనలను ఉదహరిస్తున్నారు. - గతేడాది విశాఖపట్నం జిల్లా అరకులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే సివేరి సోమాలను మావోయిస్టులు హత్య చేసిన ఘటనకు నిఘా వ్యవస్థ వైఫల్యమే ప్రధాన కారణమంటున్నారు. ఆ ఘటనపై ఆగ్రహించిన గిరిజనులు అక్కడి పోలీస్‌స్టేషన్‌పై దాడిచేసి ధ్వంసం చేసిన విషయాన్ని నిఘా వర్గాలు ముందుగా పసిగట్టలేకపోయాయని గుర్తు చేస్తున్నారు. - రాజధాని కేంద్రంలో సంచలనం రేపిన కాల్‌మనీ సెక్స్ రాకెట్లో సొంత మనుషులను కాపాడుకునేందుకు మంత్రి, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి ఇంటెలిజెన్స్ సాయంతో ఈ అంశాన్ని పక్కదారి పట్టించారని విమర్శలున్నాయి. - ఇసుక దందా, నీరు–మట్టి, బెట్టింగ్ మాఫియా, కృష్ణాజిల్లా ఫెర్రీ వద్ద బోటు బోల్తా వంటి అనేక ప్రధాన ఘటనల్లో ముందస్తుగా అప్రమత్తమై ప్రభుత్వ యంత్రాంగానికి సమాచారమిచ్చి ఉంటే నష్ట నివారణ జరిగేదని పోలీసు శాఖలోనే పలువురు చర్చించుకుంటున్నారు. నిఘా వ్యవస్థలో ఓఎస్డీలా? సొంత సామాజికవర్గానికి పెద్దపీట వేయడంలో నిఘా వ్యవస్థ అతీతం కాదని చంద్రబాబు నిరూపించారని ఇంటెలిజెన్స్‌లోని ఓ అధికారి వ్యాఖ్యానించారు. రిటైర్డ్ పోలీసు అధికారులైన యోగానంద్, మాధవరావులను ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డి)లుగా నియమించడాన్ని ప్రస్తావించారు. యోగానంద్ అత్యంత వివాదాస్పద చరిత్రను మూటగట్టుకున్నారని ఆ విభాగంలోని సిబ్బందే చర్చించుకుంటున్నారు. 2014లో చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లను యోగానంద్ డీఐజీ హోదాలో అన్నీ తానై పర్యవేక్షించారు. అనంతరం ఇంటెలిజెన్స్‌కు వచ్చిన ఆయన సీఎంకు సన్నిహితంగా మెలుగుతూ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న అనురాధను సైతం బేఖాతరు చేసేవారని అక్కడి సిబ్బంది ఇప్పటికీ చెబుతుంటారు. పోలీసు శాఖలో అసలు కులాలవారీ లెక్కలు తీసింది యోగానందేనని, అందుకే ఆయన్ను సిబ్బంది కులానంద్ అని పిలుస్తారని పోలీసు అధికారి ఒకరు చెప్పడం గమనార్హం. యావత్ రాష్ట్రాన్ని నివ్వెరపరిచిన విశాఖ భూకుంభకోణం సమయంలో అక్కడే పనిచేసిన యోగానంద్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. -
సభలను అడ్డుకుంటే కేసులే!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయపార్టీల బహిరంగసభలను అడ్డుకునేవారిపై, ఆటంకాలు సృష్టించేవారిపై చట్టరీత్యా కఠినచర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులు, జీహెచ్ఎంసీ కమిషనర్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ ఆదేశించారు. ఎన్నికల సభలను అడ్డుకునే వ్యక్తులపై ప్రజాప్రాతినిధ్య చట్టం(ఆర్పీఏ)లోని సెక్షన్ 127 కింద కేసులు నమోదు చేయాలని మంగళవారం ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. బహిరంగ సభలను అడ్డుకుని ఆటంకం కలిగిస్తున్నారని రాజకీయ పార్టీల నుంచి ఇటీవల కాలంలో ఫిర్యాదులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నేరం రుజువైతే నిందితులకు గరిష్టంగా 6 నెలల వరకు జైలు శిక్ష లేదా రూ.2 వేల జరిమానా లేదా రెండూ విధించవచ్చు.’’అని రజత్‌కుమార్ హెచ్చరించారు. ఎన్నికల ఏర్పాట్లపై మంగళవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాజకీయ వైరుధ్యం, వ్యక్తిగత కక్షల ఆధారంగా అమాయకులపై కేసులు పెట్టి సెక్షన్ 127ను దుర్వినియోగం చేస్తే బాధ్యులైన అధికారులపై తీవ్ర చర్యలు తీసుకుంటామన్నారు. లక్షన్నర మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల్లో భాగంగా డిసెంబర్ 7న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గం. వరకు పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచనలు అందాయని రజత్‌కుమార్ తెలిపారు. ఒక్కో పోలింగ్ బూత్‌లో నలుగురు సిబ్బంది చొప్పున రాష్ట్రంలోని 32,542 పోలింగ్ కేంద్రాల్లో 1,30,168 మందితో పాటు అదనంగా 20 శాతం రిజర్వ్ సిబ్బందితో కలిపి 1.50 లక్షల మం దిని నియమిస్తామన్నారు. ఉద్యోగుల స్థానికత, పనిచేసే నియోజకవర్గంలో కాకుండా ఇతర ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో సిబ్బందిని నియమిస్తామని, సాఫ్ట్వేర్ ద్వారా ర్యాండమైజేషన్(లాటరీ తరహా) జరిపి పోలింగ్ కేంద్రాలకు కేటాయిస్తామన్నారు. అదనంగా 217 పోలింగ్ స్టేషన్లు... గ్రామాల్లో ఒక్కో పోలింగ్ స్టేషన్లో ఓటర్ల గరిష్ట పరిమితిని 1,200 నుంచి 1,400 మందికి పెంచాలని కలెక్టర్ల నుంచి వచ్చిన సూచనల మేరకు అదనంగా 217 కొత్త పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయిం చినట్లు తెలిపారు. ప్రతి తండాలో పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని వచ్చిన అభ్యర్థనను పరిశీలించామన్నారు. అయితే తండాల్లో కొత్త పోలింగ్స్టేషన్లు ఏర్పాటు చేస్తే భద్రత సమస్యలు రావచ్చని కలెక్టర్లు అభిప్రాయపడటంతో ఈ ఆలోచనను విరమించుకు న్నామన్నారు. కాగా, టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి హాజరైన మహిళలకు డబ్బులను పంపిణీ చేస్తున్న ఆ పార్టీ నేత వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంపై స్పందిస్తూ సంబంధిత వ్యక్తిని గుర్తించి అతడిపై సెక్షన్ 171బీ కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. వామపక్ష తీవ్రవాదుల కోసమే: ఏపీ, తెలంగాణ డీజీపీలు వామపక్ష తీవ్రవాదుల కదలికలపై నిఘా పెట్టడంలో భాగంగా తమ రాష్ట్ర ఇంటలిజెన్స్ విభాగం కానిస్టేబుళ్లు తెలంగాణలో రహస్యంగా పనిచేస్తున్నారని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ వివరణ ఇచ్చారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల మనోగతంపై సర్వే నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై జగిత్యాల జిల్లా ధర్మపురిలో పట్టుబడిన ఏపీ కానిస్టేబుళ్ల వ్యవహారంపై వివరణ కోరుతూ సీఈవో రజత్ కుమార్ జారీ చేసిన నోటీసులకు ఏపీ డీజీపీ మంగళవారం బదులిచ్చారు. ఈ వ్యవహారంపై తెలంగాణ డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి సైతం ఏపీ డీజీపీ వివరణతో ఏకీభవిస్తూ సీఈవోకు లేఖ రాశారు. 2 రాష్ట్రాల డీజీపీల నుంచి వచ్చిన వివరణలతో సీఈవో సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రగతిభవన్‌తోపాటు మంత్రుల క్వార్టర్లలో టీఆర్ఎస్ పార్టీ సమావేశాల నిర్వహణపై ఆ పార్టీ సంజాయిషీ కోరుతూ జారీ చేసిన నోటీసులకు ఇంకా జవాబు రాలేదని రజత్‌కుమార్ తెలిపారు. శాసనసభ ఎన్నికల్లో గులాబీ రంగు బ్యాలెట్లను వినియోగించే సంప్రదాయం 1950 నుంచి కొనసాగుతోందని, దీనిపై కాంగ్రెస్ చేసిన ఫిర్యాదును ఈసీ పరిశీలనకు పంపామమన్నారు. -
దారి తప్పిన నిఘా!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ దారి తప్పిందనే విమర్శలకు తాజా పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారం చేపట్టిన అనంతరం జరిగిన పలు ఘటనలతో నిఘా విభాగం అభాసుపాలవుతోంది. నాలుగేళ్లుగా చెలరేగిపో తున్న ఇసుక మాఫియా దగ్గర్నుంచి మన్యంలో మావోయిస్టులు పంజా విసిరే వరకు చోటు చేసుకున్న పరిణామాలను గమనిస్తే ఇది ప్రస్ఫుటమవుతోంది. ప్రతి ఘటనను రాజకీయ ప్రయోజనాలతో ముడిపెట్టడంతో నిఘావర్గాల నివేదికలు నిజాయితీని కోల్పోతున్నాయని రిటైర్డ్ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. కీలక ఘటనలకు సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో ఇంటెలిజెన్స్ నివేదికలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక దందా, బెట్టింగ్ మాఫియా, కాల్‌మనీ సెక్స్ రాకెట్, ఫెర్రీ వద్ద బోటు బోల్తా లాంటి ఘటనల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం, ఇంటెలిజెన్సీ తీరు ఒకే మాదిరిగా ఉన్నాయనే విమర్శలున్నాయి. ఇసుక మాఫియాపై చర్యలు లేవు.. పలు జిల్లాల్లో టీడీపీ ప్రజాప్రతినిధులు ఇసుక దందాతో అక్రమార్జనకు పాల్పడ్డారు. దీన్నిఅరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం కాగా అక్రమాలపై నివేదికలు ఇవ్వడంలో ఇంటెలిజెన్స్‌పై ఒత్తిళ్లు పనిచేశాయి. నీరు–మట్టి కార్యక్రమం పేరుతో పెద్దఎత్తున అక్రమాలు జరిగినా నిఘా పట్టించుకోలేదని, సర్కారు చర్యలు తీసుకోలేదనే విమర్శలున్నాయి. క్రికెట్ బెట్టింగ్‌లో పెద్దలను కాపాడేలా.. రాష్ట్రంలో క్రికెట్ బెట్టింగ్ మాఫియాను అరికట్టడంలో ప్రభుత్వం అలసత్వం వహించగా పోలీసుల ప్రమేయంపై ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదిక చర్చనీయాంశమైంది. ఇటీవల పోలీసులకు చిక్కిన అంతర్జాయ క్రికెట్ బుకీ కృష్ణసింగ్ వెల్లడించిన విషయాలు అందరినీ కంగు తినిపించాయి. ఐపీఎస్‌ల నుంచి ఎస్సైల వరకు సుమారు రూ.100 కోట్లకు పైగా మామూళ్లు ఇచ్చినట్టు విచారణాలో వెల్లడైందనే ప్రచారం జరుగుతోంది. క్రికెట్ బుకీల నుంచి మామూళ్లు తీసుకున్న వారిలో ఏకంగా 10 మంది ఐపీఎస్‌లు ఉన్నట్లు చెబుతుండడంతో ఇంటెలిజెన్స్ నివేదికల్లో వాస్తవాలు ప్రస్తావించకుండా వారిని తప్పించారనే ఆరోపణలున్నాయి. మంత్రి కనుసన్నల్లో కాల్‌మనీ సెక్స్‌రాకెట్ ఓ కీలక మంత్రి కనుసన్నల్లో మెలిగే కొందరు కాల్‌మనీ సెక్స్‌రాకెట్ నిర్వహిస్తూ అడ్డంగా దొరికిపోవడంతో అరకొర చర్యలతో సరిపెట్టి టీడీపీ ప్రజాప్రతినిధులు, పలువురు పోలీసులను కాపాడారనే విమర్శలున్నాయి. ఇంటెలిజెన్స్ నివేదికల నేపథ్యంలో టీడీపీ ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు లేకుండా వడ్డీ వ్యాపారులపై దాడులు చేయించి ప్రభుత్వం అసలు విషయాన్ని తప్పుదోవ పట్టించిందనే ఆరోపణలు వచ్చాయి. బోటు బోల్తా పాపంలో... క్షేత్రస్థాయిలో లోపాలను నిఘా వ్యవస్థలు నివేదించడం, ప్రభుత్వం వాటిని సరిచేయడం జరగాలి. కానీ ఇవి రెండూ రాష్ట్రంలో సక్రమంగా జరగలేదనే విషయం ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద కృష్ణా నదిలో జరిగిన బోటు బోల్తా ఘటన అద్దం పడుతోంది. అనుమతి లేని ప్రైవేట్ బోట్లు ఇష్టానుసారంగా నదిలో తిరుగుతున్నట్లు గుర్తించినా మంత్రుల ప్రమేయం ఉండటంతో అడ్డుకట్ట పడలేదు. పోలీస్ బదిలీల్లోనూ ‘నిఘా’ ప్రమేయం! ఎన్నికలు సజావుగా, శాంతియుతంగా నిర్వహించడంలో కీలకపాత్ర పోషించాల్సిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ అధికార పార్టీకి కొమ్ము కాసిందనే విమర్శలున్నాయి. నంద్యాల ఉపఎన్నికల సమయంలో అక్కడ మకాం వేసిన ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పోలింగ్ బూత్‌లవారీగా సీఐ స్థాయి అధికారిని ఇన్చార్జిగా నియమించి ఎస్పీ పర్యవేక్షణలో పూర్తి సమాచారం సేకరించి టీడీపీకి ఓటు బ్యాంకులా మలిచేలా కృషి చేసినట్లు పరిశీలకులు పేర్కొంటున్నారు. ప్రతిపక్ష పార్టీ నేతల కదలికలు, తటస్తులు, ప్రతిపక్షానికి అనుకూలురైన ఓటర్లపై దృష్టి పెట్టి ఇంటెలిజెన్స్ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించినట్లు పోలీస్‌శాఖలో బహిరంగ చర్చ జరిగింది. నంద్యాలలో టీడీపీకి వీరవిధేయులుగా పనిచేసిన డీఎస్పీలకు తాజాగా జరిగిన బదిలీల్లో అనుకూల ప్రాంతాల్లో పోస్టింగ్ ఇవ్వడం పోలీస్ శాఖలో హాట్ టాపిక్‌గా మారింది. పోలీసు బదిలీల్లోనూ ఇంటెలిజెన్స్ చీఫ్ చక్రం తిప్పుతుండటంతో ఐపీఎస్‌లు సైతం ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ఓ సీనియర్ పోలీస్ అధికారి పేర్కొన్నారు. పోలీసు స్టేషన్లపై దాడుల వరకు.. పోలీస్ స్టేషన్లపై బాధితులు దాడి చేసేవరకు పరిస్థితులు చేయిదాటిపోయినా అప్రమత్తం చేయడంలో ఇంటెలిజెన్స్ వైఫల్యం కనిపిస్తోంది. నిఘా వైఫల్యంతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు పోలీస్‌స్టేషన్‌పై బాధితులు దాడులకు దిగారు. ఠాణాలవారీగా పోలీసు అధికారుల తీరును సైతం ఒక కంట కనిపెట్టాల్సిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ తునిలో రైలు దగ్ధం, పోలీస్ స్టేషన్లకు నిప్పు పెట్టిన ఘటనలపై ముందుగా అప్రమత్తం చేయలేకపోయింది. రాష్ట్రంలో శాంతిభద్రతలను సవాలు చేసే ఇలాంటి ఘటనలు కోకొల్లలు. ఆశ్రమంపై జేసీ అనుచరుల దాడి.. అనంతపురం జిల్లా తాడిపత్రి వద్ద ప్రబోధానంద ఆశ్రమంపై టీడీపీ ఎంపీ జేసీ అనుచరులు దాడికి దిగిన ఘటనలో ఇద్దరు చనిపోగా పలువురు గాయాల పాలయ్యారు. ఈ ఘటన రెండు సామాజికవర్గాల మధ్య వివాదంగా మారిన వ్యవహారంలోనూ ఇంటెలిజెన్స్ వైఫల్యం ప్రస్పుటమైంది. మన్యంలో మాటేసినా... మావోయిస్టుల కదలికలను గుర్తించి అప్రమత్తం చేయాల్సిన ఇంటెలిజెన్స్ పొరుగు రాష్ట్రం రాజకీయాల్లో తలమునకలు కావడంతో మన్యంలో తాజాగా ఇద్దరు ప్రజాప్రతినిధులు బలయ్యారు. ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లే ఏపీలో మావోయిస్టుల కదలికలు లేవనే ధీమా పోలీసులు, ప్రభుత్వంలో నెలకొంది. ఆంధ్రా–ఒడిశా బోర్డర్(ఏవోబీ) సరిహద్దుల్లో మాటేసిన మావోయిస్టులు వారోత్సవాలకు సిద్ధమైనా, బృందాలుగా సంచరిస్తున్నా పసిగట్టడంలో నిఘా విఫలం కావడంతో మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఇంటెలిజెన్స్ మాన్యువల్ ఏం చెబుతోంది? స్టేట్ ఇంటెలిజెన్స్ పరిధిలోని కౌంటర్ ఇంటెలిజెన్సీ (సీఐ), స్పెషల్ ఇంటెలిజెన్సీ బ్రాంచి(ఎస్ఐబీ) విభాగాల నిరంతర అప్రమత్తతే శాంతిభద్రతల్లో కీలకపాత్ర పోషిస్తుంది. రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలపై నిరంతరం నిఘా పెట్టి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎస్ఐబీ అప్రమత్తం చేయాల్సి ఉంటుంది. ఉగ్రవాద కార్యకలాపాలు, మతపరమైన తీవ్రవాదం, వామపక్ష తీవ్రవాద ప్రమాదాలను పసిగట్టి ప్రభుత్వానికి కౌంటర్ ఇంటెలిజెన్స్ సమాచారం అందిస్తుంది. ఇంటెలిజెన్స్ విభాగం ప్రజాక్షేత్రంలో ప్రధాన భూమిక పోషించాల్సి ఉంటుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉంటుంది. ప్రజలకు అవి ఏమేరకు చేరువ అవుతున్నాయి? లోపాలు ఏమిటి? నిజమైన లబ్ధిదారులకు చేరకుండా అక్రమాలకు పాల్పడుతున్న వారెవరు? అనే కోణాల్లో పరిశీలించి సర్కారుకు నివేదించి లోపాలు చక్కదిద్దడంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ కీలకం. మోసాలు, అక్రమాలు, సంఘ వ్యతిరేక శక్తుల కదలికలను అనుక్షణం గమనిస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తుంది. -
ముల్లును ముల్లుతోనే తీయడమంటే ఇదే!
న్యూఢిల్లీ: ముల్లును ముల్లుతోనే తీయడమంటే ఇదే. ఢిల్లీలో దాడి చేయడానికి వచ్చిన ఐఎస్ ఉగ్రవాదిని నిఘా వర్గాలు ఉచ్చు పన్ని మరీ పట్టుకున్నాయి. సుమారు 18 నెలల పాటు సాగిన ఈ ఆపరేషన్ హాలివుడ్ సినిమాకు ఏ మాత్రం తక్కువ కాదంటే అతిశయోక్తి కాదు. ఆ ఉగ్రవాదిని నమ్మించడానికి మనోడిని ఉగ్రవాదిగా అతనికి పరిచయం చేయడం దగ్గర నుంచి, పట్టుబడిన ఉగ్రవాది వెల్లడించిన సమాచారం వరకు ఇదో మంచి సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. గత సెప్టెంబర్‌లోనే ఐఎస్ ఉగ్రవాదిని అరెస్ట్ చేయగా, అధికారులు ఆ వివరాలను తాజాగా వెల్లడించారు. పాకిస్తాన్లో ఉగ్రశిక్షణ పొందిన 12 మంది ఐఎస్ ఉగ్రవాదుల బృందం భారత్‌తో పాటు ఇతర దేశాల్లో బాంబుదాడులకు తెగపడనున్నట్టు నిఘావర్గాలకు (రిసెర్చీ అనాలిసిస్ వింగ్–రా) సమాచారం అందింది. ఐఎస్ కార్యకలాపాల నిమిత్తం దుబాయ్ నుంచి కొందరు వ్యక్తులు అఫ్గానిస్తాన్‌కు సుమారు రూ.34 లక్షలు పంపినట్లు అమెరికా నిఘా అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి అనేక టెలిఫోన్‌కాల్స్‌ను ట్యాప్ చేసిన తరువాత అఫ్గానిస్తాన్ సంపన్న కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి ఢిల్లీలో ఆత్మాహుతికి పాల్పడేందుకు వస్తున్నట్టు తెలిసింది. కీలక సమాచారం లభ్యం.. ఇంజనీరింగ్ విద్యార్ధిగా భారత్‌కు వచ్చిన ఉగ్రవాదితో స్నేహం పెంచుకునేందుకు కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం ఐఎస్ ఏజెంట్ అవతారంలో ఓ వ్యక్తిని పంపింది. అతని ద్వారానే ఉగ్రవాదికి లజ్‌పత్‌నగర్‌లో వసతితో పాటు, పేలుడుపదార్థాలు సమకూర్చారు. ఢిల్లీలో ఐఎస్ ఉగ్రవాది కదలికలపై నిఘా పెట్టేందుకు నెలరోజుల నిరంతరం 80 మంది సిబ్బంది పనిచేశారు. ఆత్మాహుతి దాడుల కోసం ఢిల్లీ విమానాశ్రయం, అన్సల్ ప్లాజా మాల్, వసంత్‌కుంజ్ మాల్, సౌత్ ఎక్స్టెన్షన్ మార్కెట్లలో ఉగ్రవాది రెక్కీ నిర్వహించాడు. వీటన్నింటిని కనిపెట్టిన భద్రతా అధికారులు సమయం చూసుకుని అతన్ని అరెస్ట్ చేసి అఫ్గానిస్తాన్‌లోని అమెరికా దళాలకు అప్పగించారు. పట్టుబడిన ఉగ్రవాది ద్వారా 11 మంది సహచరుల కదలికలు కనుక్కోవడంతో పాటు, అతడిచ్చిన సమాచారంతో అనేక ఐఎస్ స్థావరాలపై అమెరికా దళాలు దాడులు చేశాయి. ఇటీవల అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లపై అమెరికా దళాలు పై చేయి సాధించేందుకు అవసరమైన సమాచారాన్ని అతడి వద్దే సేకరించారు. 2017 మే 22న బ్రిటన్‌లో 23 మందిని బలిగొన్న మాంచెస్టర్ దాడి అతడి సహచరుల్లోని ఒకరి పనేనని తేలింది. ఆ దాడిలో ఏయే పేలుడు పదార్థాలు వాడారో, అలాంటి వాటినే ఢిల్లీ పేలుళ్లలో వాడాలని అతడు కోరుకున్నట్లు తెలిసింది. -
భద్రతా సిబ్బంది కాదు.. బందిపోట్లు!
సాక్షి, హైదరాబాద్: వారంతా ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ సిబ్బంది. ముఖ్యమంత్రితో సహా మంత్రులకు, వీవీఐపీలకు భద్రత కల్పిస్తుంటారు. ప్రతీక్షణం వెన్నంటే ఉంటూ రక్షణ విధులు నిర్వర్తిస్తుంటారు. అయితే ఇలాంటి కీలకమైన యూనిట్లో పనిచేస్తూ ఓ సీనియర్ మంత్రి దగ్గర విధులు నిర్వర్తిస్తున్న ఐఎస్‌డబ్ల్యూ సిబ్బంది అవినీతికి గడ్డికరిచినట్టు ఇప్పుడు పోలీస్ శాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది. వారం రోజుల క్రితం సీనియర్ మంత్రి నిజామాబాద్ పర్యటనకు వెళ్లి పలు ప్రారంభోత్సవాలు చేసి బహిరంగ సభలో పాల్గొన్నారు. అయితే సదరు మంత్రి సెక్యూరిటీ సిబ్బంది స్థానిక ఎమ్మెల్యే నుంచి డబ్బులు డిమాండ్ చేయడం సంచలనం సృష్టించింది. ఉండటానికి హోటల్ బుక్ చేసి, అన్ని రకాల భోజనాలు ఏర్పాటు చేసిన సదరు ఎమ్మెల్యేకు ఐఎస్‌డబ్ల్యూ సెక్యూరిటీ సిబ్బంది రూ.30 వేలు డిమాండ్ చేయడం షాక్‌కు గురిచేసింది. ఈ విషయం మంత్రికి చెప్పాలా వద్దా అని భావించిన ఎమ్మెల్యే రూ.10 వేలతో సరిపెట్టే ప్రయత్నం చేయగా.. సెక్యూరిటీ సిబ్బంది వినకపోవడంతో విషయం మంత్రి వరకు చేరింది. మంత్రి తీవ్ర ఆగ్రహం ఎమ్మెల్యే తనకు ఎదురైన చేదు అనుభవాన్ని చెప్పడంతో మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్యూరిటీ సిబ్బంది ఇలాంటి వ్యవహారాలకు పాల్పడటంపై సదరు మంత్రి నేరుగా ఇంటెలిజెన్స్ ఐజీకి ఫోన్ చేసి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీంతో ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు మంత్రి నిజామాబాద్ కార్యక్రమం సమయంలో ఉన్న సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్టు ఐఎస్‌డబ్ల్యూ వర్గాలు స్పష్టం చేశాయి. బెటాలియన్ నుంచి డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఆరుగురు భద్రతా సిబ్బందిని హుటాహుటిన తిరిగి బెటాలియన్‌కు పంపించినట్టు తెలిసింది. మంత్రులకు జిల్లా గార్డ్స్ సాధారణంగా మంత్రుల భద్రతా సిబ్బంది నియామకాల విషయంలో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ నుంచి ఇద్దరు, మంత్రి సొంత జిల్లా పోలీస్ ఆర్మ్డ్ హెడ్‌క్వార్టర్స్ నుంచి ఇద్దరు ఏఆర్ గార్డులను నియమిస్తారు. అంటే ప్రతీ షిప్ట్‌కు నలుగురు ఉండేలా ఏర్పాట్లు చేస్తారు. పైగా పైలటింగ్, ఎస్కార్ట్ కూడా సంబంధిత జిల్లా ఏఆర్ విభాగం నుంచి నియమిస్తారు. రెండు నెలల కిందటి వరకు పలువురు మంత్రులకు ఇదే రీతిలో భద్రతా సిబ్బంది కేటాయింపులు జరిగాయి. కానీ ఇటీవలె ఏఆర్ గార్డ్స్‌ను పూర్తిగా తొలగించి మొత్తం ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ సిబ్బందిని నియమించడం చర్చనీయాంశంగా మారింది. తీరా సీనియర్ మంత్రి వద్దే పనిచేస్తూ ఇలాంటి అమ్యామ్యాలకు పాల్పడటం ఇటు రాజకీయ వర్గాలతో పాటు పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సీనియర్ మంత్రికి ఎదురైన పరిస్థితే మిగతా మంత్రులు, కేబినెట్ హోదాలో ఉన్న వారికి కూడా అనేకసార్లు ఎదురయ్యాయి. కానీ కక్కలేక మింగలేక మంత్రులున్నట్టు ఇంటెలిజెన్స్ విభాగంలోనే చర్చ జరుగుతోంది. -
ఎమ్మెల్యేలకు ‘సన్’ స్ట్రోక్!
సాక్షి, హైదరాబాద్: తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని నియోజకవర్గాల్లో అధికారం చెలాయిస్తున్న ఎమ్మెల్యేల కుమారుల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. చేతిలో అధికారం, అడ్డుచెప్పే వారు లేకపోవడంతో అధికార పార్టీలోని కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల కుమారులు రెచ్చిపోతున్నారు. నియోజకవర్గంలోని అన్ని దందాల్లో జోక్యం చేసుకుంటూ తండ్రులు సీటు కోల్పోయే పరిస్థితులు తీసుకొచ్చినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికలో బయటపడింది. రాష్ట్ర వ్యాప్తంగా అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల కుమారుల దం దాలు, ప్రభుత్వానికి నష్టం చేకూర్చేలా వ్యవ హరిస్తున్న వారిపై ఇంటెలిజెన్స్ విభాగం నివేదిక రూపొందించినట్లు చర్చ జరుగుతోంది. బదిలీల నుంచి భారీ సెటిల్మెంట్ల దాకా.. మంత్రి వర్గంలోని అమాత్యుల కుమారులు పైరవీలు, సెటిల్మెంట్లే బిజినెస్‌గా మార్చు కొని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. కేబినెట్ హోదాలో ఉన్న సీనియర్ ఎమ్మెల్యేల సుపుత్రులూ అదే దారిలో నడుస్తున్నట్లు తేలింది. ఉత్తర తెలంగాణలోని కొందరు మంత్రుల కుమారులు, ఓ కేబినెట్ హోదాలో ఉన్న సీనియర్ ఎమ్మెల్యేతో పాటు అత్యున్నత పదవిలో ఉన్న మరో ఎమ్మెల్యే కుమారులు ప్రతి పనికి రేటు ఫిక్స్ చేసి దందా చేస్తున్నారు. ఇసుక దందాలో ప్రతినెలా తమకు రావాల్సిన వాటాలు ఫిక్స్ చేసి దండుకున్నట్లు ప్రగతి భవన్‌కు వెళ్లిన రిపోర్టులో ఇంటెలిజెన్స్ స్పష్టంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. దక్షిణ తెలంగాణలోని కీలక ప్రాంతం నుంచి మంత్రి వర్గంలో ఉన్న మరో ఇద్దరు సీనియర్ నేతల కుమారులు ఏకంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్న ట్లు బహిరంగంగానే ప్రకటించుకుంటున్నారు. వాళ్లదే ఫైనల్.. కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే కుమారుడు ఉద్యోగం వదిలేసి తండ్రి అధికార వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నాడు. పోలీస్, రెవెన్యూ పోస్టింగులు తదితరాల్లో తండ్రికి సంబంధం లేకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇటీవల జరిగిన ఎస్సై, ఇన్స్పెక్టర్ పోస్టింగుల్లో రూ.60 లక్షలు వసూలు చేసినట్లు ఇంటెలిజెన్స్ రిపోర్టులో పేర్కొన్నట్లు సమాచారం. ఆదిలాబాద్‌కు చెందిన మరో సీనియర్ ఎమ్మెల్యే కుమారుడు స్మగ్లింగ్ వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కోవడం సంచలనంగా మారింది. తనకు తెలియకుండా అనుమతులు, బిల్లులు జారీ చేయొద్దని అధికారులను బెదిరించే స్థాయికి వెళ్లిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కాంట్రాక్టర్లు కూడా సదరు ఎమ్మెల్యే కుమారుడితో డీల్ కుదిరాకే పనులు ప్రారంభిస్తున్నారని సమాచారం. తండ్రి స్థానంలో సమీక్షలు! వరంగల్‌కు చెందిన ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు, అత్యున్నత పదవుల్లో ఉన్న వీరి పుత్రర త్నాల వ్యవహారాలు గతంలో సీఎంకే ఆగ్రహం తెప్పించాయి. హెచ్చరికలతో కొన్నాళ్ల పాటు స్తబ్దుగా ఉండి ఇప్పుడు మళ్లీ దందాలు ప్రారంభించారు. తండ్రి మంత్రి అయినా సమీక్షలు మొత్తం కొడుకులు చేసే పరిస్థితుల్లో ఓ సీనియర్ మంత్రి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఇతర జిల్లాల్లోని నియోజకవర్గాల వ్యవహారాల్లోనూ మంత్రి కుమారుడు కలుగజేసుకోవడం గతంలో సీఎం ఆఫీస్ వరకు వెళ్లింది. దీంతో ఎమ్మెల్యేలకు ఆ మంత్రి నచ్చజెప్పుకోవడంతో వివాదం సద్దుమణిగింది. గాడితప్పినా పట్టింపు లేదు.. తమ పుత్రరత్నాలు చేస్తున్న వ్యవహారాలు పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందని తెలిసినా మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు పట్టించుకోకుండా వ్యవహరించడం పార్టీ అధిష్టానానికి ఆగ్రహం తెప్పిస్తోంది. ఇటీవల నిర్వహించిన మూడు సర్వేల్లో ఎమ్మెల్యేల పుత్రరత్నాల వ్యవహారం వల్లే ఆయా నియోజకవర్గాల్లో అధికార పార్టీ గ్రాఫ్ పడిపోయినట్లు ఇంటెలిజెన్స్ సర్వేలో బయటపడిందని సమాచారం. మొత్తంగా 14 నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల కుమారుల ఆగడాల వల్ల పార్టీకి, ప్రభుత్వానికి గడ్డు పరిస్థితులు ఏర్పడినట్లు అంచనా. ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే వరంగల్‌లో ఇద్దరు నేతల కుమారులు, ఆదిలాబాద్‌లో నలుగురు, నిజామాబాద్‌లో ఇద్దరు, మహబూబ్‌నగర్‌లో ఒకరు, హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలో నలుగురు, కరీంనగర్లో ఒక ఎమ్మెల్యే కుమారుడు ఇంటెలిజెన్స్ జాబితాలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. -
గుంటూరులో గజదొంగ!
పేరుమోసిన గజదొంగ గుంటూరు నగరంలో రెక్కీ నిర్వహించాడన్న సమాచారంతో జిల్లా పోలీసులు ఉలిక్కి పడ్డారు. ఆ దొంగ ఉత్తర భారత్‌కు చెందిన ప్రమాదకర నేరస్తుడని ఇంటెలిజెన్స్ నుంచి హెచ్చరికలు రావడంతో అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్తగా గుంటూరుతోపాటు, పట్టణాల్లోని లాడ్జీలు, హోటళ్లలో పోలీసులు రహస్యంగా తనిఖీలు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సాక్షి, గుంటూరు: రాజధానిగా అభివృద్ధి చెందుతున్న గుంటూరులో గజదొంగ సంచరించా డంటూ వచ్చిన ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో జిల్లా పోలీసు యంత్రాంతం ఒక్కసారిగా ఉలికి పాటుకు గురైంది. అత్యంత ప్రమాదకరమైన ఈ దొంగ ముందస్తుగా రెక్కీ నిర్వహించి ఉంటాడని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. జిల్లాలో కొద్దిరోజుల క్రితం ఉత్తర భారతదేశానికి చెందిన వాడిగా భావిస్తున్న గజదొంగ కదలికలు గుంటూరు నగరంలో కనిపిం చాయని నిఘా వర్గాలు హెచ్చరించడంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అనుమానాస్పద ప్రాంతాల్లో ప్రత్యేక గాలింపు చేపట్టింది. గుంటూరు రూరల్ జిల్లా పరిధిలోని పట్టణ ప్రాంతాలతోపాటు, గుంటూరు నగరంలో కూడా హోటళ్లు, లాడ్జీల్లో రహస్యంగా తనిఖీలు చేపట్టి, ఆయా గదుల్లో ఉన్న వారి వివరాలను తెలుసుకున్నారు. సీసీ కెమెరాల పుటేజీలు, లాడ్జీ ల్లోని రికార్డులను పరిశీలించారు. అనుమానాస్పదంగా గుర్తించిన వ్యక్తుల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఇదంతా రహస్యంగా కొనసాగిస్తుండటంతో విషయాలు బయటకు పొక్కడం లేదు. నగర పరిధిలోని సీసీ కెమెరాల పుటేజీలను కూడా పోలీసు కంట్రోల్ రూము ద్వారా పరిశీలించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో.. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో జిల్లాలోని కౌంటర్ ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆ గజదొంగ వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఒక రోజంతా గుంటూరు నగరంలో, ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లాడ్జీలో ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారని తెలిసింది. అయితే అతను ఏ పేరు, చిరునామా ఇచ్చాడనే విషయాలను పోలీసులు రహస్యంగా ఉంచుతున్నారు. రాత్రి వేళల్లో అనుమానాస్పద ప్రాంతాల్లో వాహనాల తనిఖీ, డ్రంకెన్ డ్రైవ్ కొనసాగిస్తున్నారు. తెలంగాణలో భారీ చోరీ మూడు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో బంగారు దుకాణంలో అంతరాష్ట్ర దొంగలు చోరీకి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు జిల్లా ఎస్పీలను మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా నైట్ బీట్లను పటిష్టం చేయడంతోపాటు, ప్రధాన కూడళ్ల వద్ద ప్రత్యేక నిఘా కొనసాగించడంలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఆ దొంగ రోజంతా నగరంలో ఉండటంతోపాటు, జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో కూడా సంచరించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏదేమైనా నేరాలు, దొంగతనాలకు పాల్పడే ముఠా కన్ను జిల్లాపై పడిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు కొనసాగించాలంటూ ఎస్పీలు అధికారులను ఆదేశించినట్లు సమాచారం. -
బీజేపీపై నిఘా నీడ..!
-
కేజీబీ టు క్రెమ్లిన్
రష్యా నేత పుతిన్ అధ్యక్ష ఎన్నికల్లో సాధించిన ఘన విజయం 2024 వరకూ ఆయన పదవిలో కొనసాగడానికి అవకాశమిచ్చింది. రష్యా రాజ్యాం గం ప్రకారం వరుసగా రెండు సార్లు మించి ఏ నేతా అధ్యక్ష పదవి చేపట్టకూడదు. దాని ప్రకారం 2024 ఎన్నికలు వదిలేసి 2030లో ఆయన అధ్యక్ష పదవికి పోటీచేయొచ్చు. వ్యూహ రచనలో దిట్ట! నిఘా సంస్థ కేజీబీలో ఓ అధికారి స్థాయి నుంచి రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ సెనెట్ వరకూ సాగిన పుతిన్ ప్రయాణం అసామాన్యం. పుతిన్ అధ్యక్షుడిగా ఉన్న మొదటి ఎనిమిదేళ్లలో (2000–2008) రష్యా ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టింది. ఆ రోజుల్లో భారీగా పెరిగిన ముడి చమురు, సహజ వాయువు ధరల ఫలితంగా సంపన్నులు సహా రష్యన్ల ఆదాయాలు గణనీయంగా పెరిగాయి. దీంతో ఆయన తన అధికారం సుస్థిరం చేసుకోగలిగారు. ప్రభుత్వంపై తిరుగులేని పట్టు సంపాదించారు.మొదట రాజకీయ పలుకుబడి ఉన్న బడా పారిశ్రామికవేత్తలను, తర్వాత ప్రతిపక్ష నేతలను నిరాధార ఆరోపణలతో దెబ్బతీశారు. వారిలో కొందరిని దేశం నుంచి బహిష్కరించారు. రష్యాలో రాజకీయాలు లేని ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటుకు పుతిన్ చేసిన ప్రయత్నం ఫలించింది. ‘ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తా. మీరు రాజకీయాలకు దూరంగా ఉండండి’ అన్న పుతిన్ మాటలను సామాన్య ప్రజానీకం, కార్మికవర్గం నమ్మడంతో పుతిన్ అధికారానికి అడ్డంకులు లేకుండా పోయాయి. అయితే, గత ఆరేళ్లలో పాశ్చాత్యదేశాల ఆంక్షల ఫలితంగా రష్యా ఆర్థిక సమస్యలు తీవ్రమయ్యాయి. అయినప్పటికీ సిరియా అంతర్యుద్ధంలో జోక్యం, క్రిమియా ఆక్రమణ ద్వారా దేశాన్ని పుతిన్ అగ్రరాజ్యం దిశగానే నడిపిస్తున్నారని రష్యన్లు విశ్వసిస్తున్నారు. కాగా, పుతిన్‌కు తొలినాళ్లలో ప్రజాదరణ ఉన్నప్పటికీ ఇప్పుడు జరిగే ప్రతీ ఎన్నికల్లోనూ రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని ప్రతిపక్షాలు, పరిశీలకులు ఆరోపిస్తున్నారు. అణచివేయడంలో ఘటికుడు ప్రధాన ప్రత్యర్థులను అణచివేయడం, అక్రమంగా జైలుకు పంపడం, ఎన్నికల్లో పోటీచేయకుండా అనర్హులను చేయడం పుతిన్‌కు కొట్టిన పిండి. 1952లో లెనిన్గ్రాడ్లో జన్మించిన పుతిన్ సెయింట్ పీటర్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదువుకున్నారు. 1975లో కేజీబీలో ఇంటెలిజెన్స్ అధికారిగా ఉద్యోగంలో చేరి వేగంగా లెఫ్టినెంట్ కల్నల్ స్థాయికి ఎదిగారు. రాజకీయాలపై ఆసక్తితో 1991లో ఉద్యోగానికి రాజీనామా చేసి మకాం రాజధాని మాస్కోకు మార్చారు. యునైటెడ్ రష్యా పార్టీ నేత అయిన పుతిన్‌కు ప్రధానిగా తొలి అవకాశం అధ్యక్షుడు బోరిస్ ఎలిత్సిన్ ఇచ్చారు. 1999లో అప్పటి ప్రధాని సెర్జీ స్టెపాషిన్ను బర్తరఫ్ చేసి పుతిన్‌ను ప్రధానమంత్రిగా ప్రమోట్ చేశారు. అదే ఏడాది డిసెంబర్లో రాజీనామా చేసిన ఎలిత్సిన్ తాత్కాలిక అధ్యక్షునిగా పుతిన్‌ను నియమించారు. 2000 అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ తన సమీప కమ్యూనిస్ట్ ప్రత్యర్థి గెనడీ జ్యుగనోవ్పై విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో 72 శాతం ఓట్లు సాధించి రెండోసారి అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. 2008లో ప్రధానిగా నియమితులయ్యారు. 2011లో అధ్యక్ష పదవీకాలా న్ని నాలుగు నుంచి ఆరేళ్లకు పెంచారు. ఈ చట్ట సవరణ చేశాక 2012లో పుతిన్ మూడోసారి అధ్యక్షపదవికి పోటీచేసి 64 శాతం ఓట్లతో గెలిచారు. తాజా విజయంతో పుతిన్ నియంత జోసెఫ్ స్టాలిన్ తర్వాత రష్యాను ఎక్కువ కాలం పాలించిన నేతగా చరిత్రలో స్థానం సంపాదించుకున్నారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
సినీ ఫక్కీలో సిద్ధాంతి కిడ్నాప్
సాక్షి, నిడదవోలు (పశ్చిమ గోదావరి) : ఇంటిలిజెన్స్ ఆఫీసర్ తీసుకురమ్మంటున్నారని సివిల్ డ్రెస్‌లో వచ్చిన నలుగురు ప్రముఖ సిద్ధాంతిని కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. నిడదవోలుకు చెందిన ప్రముఖ సిద్ధాంతి వీరభద్ర శాస్త్రిని గుర్తు తెలియని నలుగురు ఉదయం 8గంటల సమయంలో విజయవాడ నుంచి ఇంటిలిజెన్స్ ఆఫీసర్ తీసుకురమ్మంటున్నారని చెప్పి కిడ్నాప్ చేశారు. ముందుగా సిద్ధాంతి చేతిలోని సెల్ ఫోన్ లాక్కున్న కిడ్నాపర్లు కారులో ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు అతని భార్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తన భర్త ఎక్కడికి వెళ్లాడో తెలియక ఆమె కన్నీళ్ల పర్యంతమయ్యింది. కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొవ్వూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. -
ఆ సమాచారం ఎవరిచ్చారో చెప్పండి
సాక్షి, అమరావతి: ‘మీడియాకు ఎవరు సమాచారమిచ్చారో చెప్పాలి. లేదంటే మాదగ్గర ఇంటెలిజెన్స్ అధికారులున్నారు. వారి ద్వారా ఎవరు సమాచారమిచ్చారో తెలుసుకోగలం’అని ముఖ్యమంత్రి పేషీ అధికారులు ఫాతిమా విద్యార్థులను మళ్లీ బెదిరించారు. బుధవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘మర్యాదగా కోచింగ్‌లో చేరండి’ శీర్షికతో వార్త ప్రచురితమైంది. దీనిపై సీఎం పేషీ అధికారులు ఫాతిమా విద్యార్థులపై భగ్గుమంటున్నారు. కోచింగ్‌లో చేరండి అంటే మీరు మీడియాకు ఎందుకు సమాచారమిచ్చారంటూ పలువురు అభ్యర్థులకు ఫోన్లు చేసి బెదిరించారు. సీఎం పేషీలో ఉన్నతాధికారి గిరిజాశంకర్ వ్యక్తిగత కార్యదర్శి సత్యనారాయణ నుంచి ఫోన్లు వచ్చాయని, ఎవరు సమాచారం ఇచ్చారో చెప్పాలని, లేదంటే మీ నెంబర్లన్నీ మా ఇంటెలిజెన్స్ అధికారుల ద్వారా విచారించి తెలుసుకోగలమని హెచ్చరించినట్లు బాధిత విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి ఫాతిమా విద్యార్థులతో మాట్లాడేందుకు సీఎం పేషీ ఉన్నతాధికారి గిరిజాశంకర్ బుధవారం అపాయిం ట్మెంట్ ఇచ్చారు. కానీ సాక్షిలో వార్త ప్రచురితమయ్యాక తాను ఫాతిమా విద్యార్థులతో మాట్లాడేది లేదని తెగేసి చెప్పినట్టు విద్యార్థులు తెలిపారు. -
ఇంటికి పిలిచి..చెంపచెళ్లు..!
సాక్షి ప్రతినిధి, వరంగల్: క్రషర్ యజమానులు, కాంట్రాక్టర్ల సమస్య పరిష్కారం అంశం ఎమ్మెల్యే ఒకరిపై దాడి చేసే వరకు వెళ్లింది. పలువురు కాంట్రాక్టర్ల ఎదుటే అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే.. ఓ గుత్తేదారుపై చేయిచేసుకున్నాడు. మాట్లాడుతున్న క్రమంలో జరిగిన దాడితో సదరు కాంట్రాక్టర్ నిర్ఘాంతపోయాడు. అయితే బాధిత కాంట్రాక్టర్ కుటుంబానికి రాజకీయాలతో సంబంధాలు ఉండడం వల్ల ఇరువర్గాల మధ్య వివాదం పెద్దదిగా మారింది. చివరికి ఇంటెలిజినెన్స్ వర్గాలు సమాచారం సేకరించి నివేదిక సైతం తయారు చేశాయి. స్టోన్ క్రషర్ల విషయంలో వివాదం.. స్టోన్ క్రషర్ల విషయంలో తలెత్తిన వివాదం కాంట్రాక్టర్‌పై దాడికి కారణమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఉన్న స్టోన్‌క్రషర్లు, హాట్‌మిక్స్, రెడిమిక్స్ ప్లాంట్ల నిర్వహణతో వాతావరణ కాలుష్యం ఏర్పడుతోందంటూ కొంద రు ఇటీవల న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇదే సమయంలో క్రషర్ల నిర్వహణలో నిబంధనలు పాటించడం లేదని సంబంధిత ప్రభుత్వ శాఖలకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న స్టోన్‌క్రషర్ కార్యకలా పాలు నిలిపేయాలంటూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. కాలుష్య నియం త్రణ, ఇతర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏర్పాట్లు చేసే వరకూ ఇదే పరిస్థితి కొనసాగించాలంటూ తీర్పు వెలువరించడంతో స్టోన్‌క్రషర్లు మూతపడ్డాయి. దాదాపు నెలరోజులుగా ఈ పరిస్థితి కొసాగుతుండగా.. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేకు సంబంధించిన క్రషర్ నడుస్తుండడంతో ఇతర యజమానులు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ ఇద్దరు యజమానులు ఫోన్లో మాట్లాడుకున్న సందర్భంలో ఎమ్మెల్యేకు చెందిన క్రషర్ విషయం ప్రస్తావనకు వచ్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఓ క్రషర్ యజమాని, మరో క్రషర్ యజమాని (ప్రతిపక్ష పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సోదరుడు)తో ఫోన్లో ఆవేదన వ్యక్తం చేస్తూ అధికార ఎమ్మెల్యే క్రషర్ విషయాన్ని ప్రస్తావించారు. ‘ఎమ్మెల్యేకు సంబంధించిన క్రషర్ ఏ ఇబ్బంది లేకుండా నడుస్తుంటే మనకు ఈ ఇబ్బందు లేంటి. మనల్ని వాడు ఎందుకు పట్టించుకోవడం లేదు. ఆయన పని చల్లగా చేసుకుంటున్నాడు. ఇదేం పద్ధతి. మనం మాత్రం ఏ పాపం చేశాం’ అంటూ ఓ క్రషర్ యాజమాని వ్యాఖ్యానించాడు. ఫోన్లో జరిగిన ఈ సంభాషణను మాజీ ఎమ్మెల్యే సోదరుడు ప్రస్తుత ఎమ్మెల్యే దృష్టి కి తీసుకువెళ్లి అందరం ఇబ్బందిపడుతున్నామని వివరిస్తూనే ఫోన్ సంభాషణను వినిపించాడు. దీంతో ఎమ్మెల్యేకు కోపమొచ్చి ఆయన్ను తీసుకురా అని చెప్పాడు. మెరుపుదాడి.. ఎమ్మెల్యేపై వ్యాఖ్యలు చేసిన సదరు కాంట్రాక్టర్‌కు రాజకీయ నేపథ్యం ఉంది. అతడి కుటుంబ సభ్యులు గత ప్రభుత్వంలో కీలక పదవులు నిర్వహించారు. దీంతో ఇరువురి మధ్య కాంప్రమైజ్ కోసం ఎమ్మెల్యే ఇంట్లో ఇటీవల సమావేశం ఏర్పాటు చేశారు. పలువురు యజ మానులు, కాంట్రాక్టర్లతో కలిసి మాజీ ఎమ్మెల్యే సోదరుడు, ఫోన్లో మాట్లాడిన క్రషర్ యజమానిని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. తనపైనే వాఖ్యలు చేస్తావా, వాడు.. వీడు అంటావా అని క్రషర్ యజమానిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సందర్భంలో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే ఒక్క ఉదుటన లేచి కాంట్రాక్టర్‌పై చేయి చేసుకున్నట్లు సమాచారం. ఊహించని విధంగా జరిగిన ఈ సంఘటనతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఆర్థిక, అంగబలం పుష్కలంగా ఉన్న తనపై ఎమ్మెల్యే దాడి చేయడాన్ని ఆ నాయకుడు జీర్ణించుకోలేకపోతున్నాడు. సమస్య పరిష్కరించేందుకు సమావేశం ఏర్పాటు చేస్తే కొత్త సమస్య ఎదురుకావడంతో క్రషర్ యజమానులు ఆందోళనలో ఉన్నారు. ఈ విషయం చినికిచినికి గాలివానలా మారడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేతో దాడికి గురైన వ్యక్తికి ప్రస్తుత ప్రభుత్వంలోని ముఖ్యలతోనూ దగ్గరి పరిచయాలు ఉండడంతో విషయం హైదరాబాద్‌కు వరకు చేరింది. అసలు ఏం జరిగిందో తెలియజేయాలంటూ అక్కడి నుంచి ఇంటలిజెన్స్ వర్గాలకు ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. చివరికి ఈ అంశానికి ముగింపు ఎలా ఉంటుందనేది రాజకీయ, కాంట్రాక్టర్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. -
ఇంటెలిజెన్స్ ‘రిపోర్టర్’
కోవెలకుంట్ల: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం కర్నూలు జిల్లా జర్నలిస్టులతో బేతంచెర్ల సమీపంలో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఇంటెలిజెన్స్ పోలీసు నాగేంద్ర.. ఈ కార్యక్రమానికి హాజరై ప్రతి విషయాన్నీ నమోదు చేసుకున్నారు. ఆ వివరాలను పాదయాత్ర నేపథ్యంలో ఇంటెలిజెన్స్ విభాగం ఏర్పాటు చేసుకున్న వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని గమనించిన జర్నలిస్టులు సదరు పోలీసును ప్రశ్నించడంతో అక్కడి నుంచి జారుకున్నారు. -
గంజాయి దందా
⇒ జిల్లాలో గుట్టుగా రాకెట్ ⇒ యువత, కూలీలే టార్గెట్ ⇒ స్లమ్ ఏరియాల్లోని చిన్నచిన్న దుకాణాల్లో విక్రయాలు ⇒ ఆదిలాబాద్ కేంద్రంగా మహారాష్ట్ర, ఢిల్లీకి రవాణా ⇒ అటవీ ప్రాంతాల్లో అంతర పంటగా సాగు ⇒ నిఘా పెట్టిన ఎక్సైజ్ అధికారులు ఆదిలాబాద్: జిల్లాలో గంజాయి స్మగ్లింగ్ జోరుగా సాగుతోంది. ఇప్పటివరకు జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో అంతరపంటగా గంజాయి సాగు చేస్తారని అందరికీ తెలిసిన విషయమే.. కానీ ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు రవాణా చేయడం, ఇక్కడి నుంచి పక్క రాష్ట్రాలకు సరఫరా అవుతున్నట్లు బయటపడడం జిల్లాలో కలకలం రేపుతోంది. శుక్రవారం ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంట్ అధికారులు దాడులు నిర్వహించగా గంజాయి రాకెట్ గుట్టు వెలుగులోకి వచ్చింది. ఆదిలాబాద్ పట్టణం ప్రధాన కేంద్రంగా చేసుకొని మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలకు గంజాయి సరఫరా స్మగ్లింగ్ సాగడం సంచలనం కలిగిస్తోంది. ఈ ఏడాది గంజాయి సరఫరాలో రెండు కేసులు నమోదు చేశారు. జిల్లాలో అడవులు ఎక్కువగా ఉండడంతో దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఎవరికీ అనుమానం రాకుండా పొలాల్లో ఇతర పంటల మధ్యలో గంజాయి మొక్కలు పెంచుతున్నారు. జిల్లాతోపాటు మహారాష్ట్రకు అక్రమ రవాణా చేస్తున్నారు. అమాయక రైతులను – మిగతా కొందరు వ్యాపారులు వారి స్వార్థం కోసం డబ్బులు ఆశ చూపించి గంజాయి సాగు చేయిస్తున్నారు. దీంతో ఎక్సైజ్‌శాఖ అధికారులు, పోలీసులు చేస్తున్న దాడుల్లో అమాయకులు పట్టుబడుతున్నారు. యువత, కూలీలే లక్ష్యం.. ఆదిలాబాద్ పట్టణం ప్రధాన కేంద్రంగా సాగుతున్న గంజాయి దందాకు యువత, కూలీలే బానిసలు అవుతున్నట్లు అధికారుల నిఘాలో తేలింది. ముఖ్యంగా ఆదిలాబాద్ పట్టణంలోని మురికి వాడలైన పిట్టల్‌వాడ, ఖానాపూర్, మహాలక్ష్మీవాడ, ఖుర్షిద్‌నగర్, అంబేద్కర్‌నగర్ కాలనీల్లో చిన్నచిన్న దుకాణాల్లో గంజాయిని ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. 5 గ్రాముల ప్యాకెట్‌ను రూ.20 నుంచి రూ.30 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇందులో ఆయా కాలనీల యువకులు, కూలీలు ఎక్కువగా గంజాయిని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా గతంలో ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంట్ అధికారులు పలుచోట్ల దాడులు నిర్వహించినప్పటికీ పరిస్థితిలో మార్పు రావడం లేదు. గతేడాది ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఎక్సైజ్‌శాఖ అధికారులు, పోలీసులు చేసిన దాడుల్లో మొత్తం 38 కేసులు నమోదుకాగా 56 మందిని అరెస్టు చేశారు. 5 క్వింటాళ్ల 30 కిలోల పొడి గంజాయిని స్వాధీనం చేసుకోగా, సుమారు 6 వేల గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. ఆదిలాబాద్ కేంద్రంగా.. జిల్లాలో చాలామంది గంజాయి తరలింపును జీవనోపాధిగా ఎంచుకున్నారు. గంజాయి వ్యాపారులు అమాయక మహిళలు.. పేదలకు డబ్బు ఆశచూపి గంజాయిని తాము సరఫరా చేసే ప్రాంతాలకు తరలించేలా చూస్తున్నారు. జిల్లా నుంచి మహారాష్ట్రలోని నాందెడ్, అమరావతి, యావత్మాల్, ఛత్తీ‹స్ఘడ్, ఢిల్లీ వంటి ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి గంజాయి స్మగ్లర్లు జిల్లా కేంద్రానికి వచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. ఇక్కడ ఉన్న గంజాయి ముఠా మహారాష్ట్ర, ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేందుకు ఆయా ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి స్మగ్లర్లను రప్పించి దందా నడిపిస్తున్నారు. జిల్లా కేంద్రంలో మట్కా, పేకాట జోరుగా సాగుతుందనుకుంటే, అంతకు మించి గంజాయి దందా సాగిస్తున్నట్లు అధికారుల నిఘాలో తెలిసింది. జిల్లా కేంద్రానికి వచ్చిన గంజాయిని రైలు మార్గం, బస్సుల్లో, కారుల్లో మహారాష్ట్రకు తరలిస్తున్నారు. గంజాయికి మహారాష్ట్రలో పెద్ద ఎత్తున ధర ఉంటుంది. ఇక్కడ గంజాయి సాగు చేసిన వారికి కిలో రూ.3 వేల నుంచి 5 వేలు చెల్లిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి వ్యాపారం చేయడం గమనార్హం. జిల్లాలో అంతరపంటగా సాగు.. జిల్లాలో గంజాయి జోరుగా సాగవుతోంది. గంజాయిని అటవీ ప్రాంతాల్లో అంతరపంటగా సాగు చేస్తున్నారు. మహారాష్ట్ర వ్యాపారులు ఇక్కడి గిరిజన అమాయకులను మచ్చిక చేసుకుని వారి పంటపొలాల్లో అంతర్‌పంట సాగు చేసేందుకు గంజాయి విత్తనాలు అందిస్తున్నారు. జిల్లాలో అటవీ ప్రాంతాల్లో పత్తి, కంది, పసుపు తదితర పంటలు వేసి అందులో గంజాయి మొక్కలు పెట్టి సాగు చేస్తుండగా ఎక్సైజ్ శాఖ అధికారుల దాడుల్లో అవి బయటపడుతున్నాయి. జిల్లాలో ఆదిలాబాద్, తలమడుగు మండలం నందిగామ, బజార్హత్నూర్ మండలం భూతాయి, గాదిగూడ, నార్నూర్, ఉట్నూర్, ఇంద్రవెల్లి ప్రాంతాల్లో గంజాయి పెద్ద ఎత్తున సాగవుతోంది. పక్క జిల్లాలైన నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భైంసా, ఖానాపూర్ తదితర ప్రాంతాల్లో కూడా గంజాయి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఎక్కువ మొత్తంలో మహారాష్ట్రకు తరలిస్తుండగా, మన జిల్లాలోని పల్లెలు, తండాల్లో వీటిని పొడి గంజాయిగా చేసి విక్రయిస్తున్నారు. 20 కిలోల గంజాయి పట్టివేత ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గంజాయి గుట్టు రట్టయింది. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు శుక్రవారం 20 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వివరాలను సీఐలు సుంకరి రమేష్, వెంకట్ వెల్లడించారు. విశాఖపట్నం జిల్లా గూడెం కొత్తవీధి మండలం పీలేరు గ్రామానికి చెందిన భాషా, విజయ్భరత్లు 20 కిలోల గంజాయితో ఆదిలాబాద్‌కు చేరుకున్నారు. స్థానిక అంబేద్కర్‌నగర్ కాలనీకి చెందిన కైసర్, ప్రీతమ్‌లను కలుసుకుని.. ఢిల్లీ నుంచి వచ్చిన స్మగ్లర్ తారీఫ్‌కు ఇచ్చేందుకు ఇక్కడే మకాం వేశారు. ఐదుగురూ కలిసి ప్రీతమ్ ఇంటి నుంచి ఆటోడ్రైవర్ హుస్సేన్ ఆటోలో బయల్దేరగా.. అప్పటి నిఘా వేసి ఉంచిన ఎౖక్సైజ్ శాఖ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆదిలాబాద్‌కు చెందిన ప్రీతమ్, కైసర్ పారిపోయారు. నిందితుల నుంచి రూ.2లక్షలు విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐలు వివరించారు. ప్రధాన నిందితులైన కైసర్, ప్రీతమ్ ఇతర జిల్లాల నుంచి గంజాయి తీసుకొచ్చి చిన్న చిన్న దుకాణాల్లో ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తున్నారని తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సిబ్బంది నరేష్, విఠల్, నరేందర్, ప్రకాశ్, కార్తీక్, మహ్మద్ పాల్గొన్నారు. -
లాఠీకి పొలిటికల్ డ్యూటీ!
♦ ఇంటెలిజెన్స్ సిబ్బందితో ఇంటింటి సర్వే ♦ కులాల వారీగా ఓటర్ల వివరాల సేకరణ ♦ ప్రభుత్వ ఆదేశాల మేరకు గుట్టుగా సాగుతున్న సర్వే ♦ రాజకీయ లబ్ధి కోసం పోలీసు శాఖను వినియోగిస్తున్న సర్కారు ♦ అధికార దుర్వినియోగంపై సిబ్బంది ఆగ్రహం ఎన్నికలకు మరో రెండేళ్లు గడువు ఉంది. ప్రభుత్వంపై రోజురోజుకూ ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ఈ క్రమంలో అడ్డగోలుగా మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటి నుంచే అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ఎన్నడూ లేనివిధంగా పోలీసు శాఖ ద్వారా కులాల వారీగా ఓటర్ల సర్వే చేయిస్తోంది. తద్వారా తమకు బలం లేని ప్రాంతంపై పట్టు కోసం ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. టీడీపీ కార్యకర్తల తరహాలో ఇంటెలిజెన్స్ సిబ్బందిని వాడుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, అమరావతిబ్యూరో : ‘మీ ఇంట్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు... మీది ఏ కులం.. అందులో ఏ ఉపకులం...’ ఇదీ వారం రోజులుగా కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో ఇంటెలిజెన్స్ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చాపకింద నీరులా వివరాలు సేకరిస్తున్న తీరు. ఈ సర్వే ప్రభుత్వ గణాంకాల కోసం... పథకాలు వర్తింపజేసేందుకు కాదు... టీడీపీ ప్రభుత్వం తమ రాజకీయ ఎత్తుగడల కోసం చేయిస్తోంది. ప్రజలకు భద్రత కల్పించాల్సిన పోలీసు యంత్రాంగాన్ని, చంద్రబాబు ప్రభుత్వం తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడంలో కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ క్రమంలో తమను పార్టీ కార్యకర్తల కన్నా హీనంగా వాడుకుంటున్నారని పోలీసులు వాపోతున్నారు. మా రాజకీయమే.. మీ కర్తవ్యం.. అన్నట్లుగా... రాజకీయ అవసరాల కోసం కులాలవారీగా ఓటర్ల వివరాలు సేకరించాలని టీడీపీ భావించింది. సాధారణంగా ప్రభుత్వం వద్ద ఎస్సీ, ఎస్టీ ఓటర్ల వివరాలు మినహా మిగిలిన ఓటర్ల వివరాలు కులాల వారీగా అధికారికంగా ఉండవు. ఇటీవల నిర్వహించిన ప్రభుత్వ సాధికారిక సర్వే కూడా పకడ్బందీగా చేయకపోవడంతో సమగ్ర వివరాలు లేవని టీడీపీ అధిష్టానం భావించింది. దీంతో కులాలవారీగా ఓటర్ల వివరాలు సేకరించాలని నిర్ణయించింది. అందుకు ఆ పార్టీ యంత్రాంగాన్ని నియోగిస్తే ఎవ్వరూ తప్పుపట్టరు. కానీ, కీలకమైన పోలీసు శాఖకు ఆ బాధ్యతలు అప్పగించడం విస్మయపరుస్తోంది. పోలీసు శాఖ ఆ విధులను ఇంటెలిజెన్స్ విభాగానికి కేటాయించింది. శాంతిభద్రతలు, సున్నితమైన రాజకీయ అంశాలను ఇంటెలిజెన్స్ విభాగం తరచూ సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తుంటుంది. ఎన్నడూ ఇలా పోలీంగ్ బూత్‌లు, డివిజన్ల వారీగా వివిధ కులాల ఆధారంగా ఓటర్ల వివరాలను సేకరించేందుకు ఇంటెలిజెన్స్ విభాగాన్ని రంగంలోకి దించలేదు. అయితే, రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా ప్రభుత్వం అన్ని సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చేసింది. తమకు అమరావతి జిల్లాల పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల వివరాలు కులాలవారీగా కావాలని ఇంటెలిజెన్స్ విభాగానికి మౌఖికంగా ఆదేశాలు జారీ చేసింది. వారం రోజులుగా సర్వే..! ప్రభుత్వ ఆదేశాల మేరకు వారంరోజుల కిందట ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు ఓ సమావేశం నిర్వహించి కానిస్టేబుళ్లకు కర్తవ్యబోధ చేశారు. వారికి నియోజకవర్గాలు, డివిజన్లు, మండలాలు పోలింగ్ బూత్‌లవారీగా జాబితా ఇచ్చారు. ఎవరు ఏ డోర్ నంబర్ నుంచి ఏ డోర్ నంబర్ వరకు ఎవరు సర్వే చేయాలో కూడా నిర్దేశించారు. మొదట డివిజన్ కార్పొరేటర్లు, టీడీపీ డివిజన్ అధ్యక్షుల వద్దకు వెళ్లి వివరాలు సేకరించాలని చెప్పారు. అనంతరం ప్రతి ఇంటికి కూడా వెళ్లి ఓటర్ల వివరాలు కులాల వారీగా సేకరించాలని ఆదేశించారు. ఉప కులాల పేర్లతో సహా రాసుకుని రావాలని చెప్పారు. ఈ మేరకు కానిస్టేబుళ్లు వారం రోజులుగా రోడ్లపై పడ్డారు. అయితే, కార్పొరేటర్లు, టీడీపీ డివిజన్ అధ్యక్షులు వద్ద కూడా కులాలు, ఉప కులాల వారీగా ఓటర్ల వివరాలు సమగ్రంగా లేవు. ప్రస్తుతం ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. తమను పార్టీ కార్యకర్తల కంటే దారుణంగా వాడుకుంటున్నారని పలువురు ఇంటెలిజెన్స్ సిబ్బంది వాపోతున్నారు. అయినా వారి గోడును ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. అనుకూల మార్పుల కోసమేనా...! జూలై ఒకటో తేదీ నుంచి కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఎక్కడైనా తమకు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయనిపిస్తే... మిగిలిన మూడు వారాల్లో తమ సానుభూతిపరులు, కార్యకర్తలను ఆయా పోలింగ్ బూత్‌లలో ఓటర్లుగా చేర్పించాలని భావిస్తున్నట్లు సమచారం. -
జిల్లాలో ‘మావో’ల బంద్ ప్రభావం ఉండదు
ఇన్ చార్జి ఎస్పీ సన్ ప్రీత్‌సింగ్ ఆదిలాబాద్ :మావోయిస్టులు సోమవారం ఇ చ్చిన బంద్ పిలుపుతో ఆదిలాబాద్ జిల్లాలో ఎలాంటి ప్రభావం ఉండదని ఇన్ చార్జి ఎస్పీ, కుమురం భీం ఎస్పీ సన్ ప్రీత్‌సింగ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంప్ కార్యాలయం నుంచి రెండు జిల్లాల పోలీసు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మావోయిస్టు బంద్ నేపథ్యంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల పోలీస్స్టేషన్ల పరిధిలో పోలీస్ అధికారులు అలర్ట్‌గా ఉండాలని సూచించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగించాలన్నారు. ప్రత్యేక సమాచార నిఘా వర్గాలు సూచించిన మేరకు రెండు జిల్లాల్లో భారీ పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేయాలని డీఎస్పీలను ఆదేశించారు. సరిహద్దు ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు నిర్వహించాలన్నారు. పోలీస్‌స్టేపోలీస్‌స్టేషన్ల పరిధిలోని ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించాలన్నారు. సీఐలు, ఎస్సై లు పోలీస్స్టేషన్లలో పూర్తిస్థాయి సిబ్బందితో అప్రమత్తంగా ఉం డాలన్నారు. మావోయిస్టులు జిల్లాలో చొరబాటుకు ప్రయత్నించినా, ఇతర చర్యలకు పాల్పడినా భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఇరు జిల్లాల్లో గట్టి పోలీస్ సమాచార వ్యవస్థ పనిచేస్తోందన్నారు. జిల్లా ప్రజలు మావోయిస్టులను పూర్తిగా మరిచిపోయారని, వారిని దరిచేరనీయకుండా నియంత్రించాలని పేర్కొన్నారు. మావోయిస్టులను అభివృద్ధి నిరోధకులుగా ప్రజలు గుర్తించారని తెలిపారు. చిన్న జిల్లాలు ఏర్పడడంతో గ్రామాల్లో నూతనపోలీస్‌స్టేషన్ల ఆవిర్భవించడంతో పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం, భరోసా కలిగిందన్నారు. ప్రస్తుతం మావోయిస్టులు ఉనికిని చాటుకోవడానికి జిల్లాలో ఎలాంటి అవకాశం లేదని పేర్కొన్నారు. స్వచ్ఛందంగా లొంగి పోయి ప్రజల మధ్య ఉండి పోరాడడం మినహా మరోమార్గం లేదని స్పష్టం చేశారు. మావోయిస్టుల బంద్ కు ప్రజలు ఎలాంటి మద్దతు తెలుపవద్దని, గ్రామాలను సందర్శించే ప్రజాప్రతినిధులు ముందస్తుగా తె లియజేసి పోలీస్ రక్షణ తీసుకోవాలని సూచించారు. అదనపు ఎస్పీ టి.పనసారెడ్డి, డీఎస్పీలు, సీఐలు, స్పె షల్ బ్రాంచ్ ఎస్సైలు అన్వర్‌ఉల్‌హఖ్, జి.రామన్న, కుమురం భీం స్పెషల్‌బ్రాంచ్ ఎస్సై శివకుమార్, పోలీ స్ టెలికాన్ఫరెన్స్ నిర్వహణాధికారి సింగజ్‌వార్ సంజీ వ్‌కుమార్, ఎస్పీ సీసీ పోతరాజు తదితరులున్నారు. -
ఐఎస్ఐఎస్ గురి!
► దాడులకు కుట్ర ► నిఘావర్గాలకు సమాచారం ► అప్రమత్తం సాక్షి, చెన్నై : తమిళనాడును గురి పెట్టి దాడులకు ఐఎస్ఐఎస్ వ్యూహ రచన చేసినట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది. జాతీయ నేర పరిశోధన సంస్థ(ఎన్ఐఏ) వర్గాలకు చిక్కిన తీవ్రవాది ఇచ్చిన సమాచారంతో రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని నిఘావర్గాలు హెచ్చరించాయి. దీంతో భద్రతను అప్రమత్తం చేశారు. రాష్ట్రంలోని చెన్నై, మదురై నగరాలు తీవ్రవాదుల హిట్‌లిస్ట్‌లో ఉన్నట్టు గతంలో కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఎప్పటికప్పుడు కేంద్రం నుంచి వచ్చే సమాచారాలు, హెచ్చరికలతో అప్రమత్తంగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. అప్పుడప్పుడు రాష్ట్రంలో నక్కి ఉన్నతీవ్ర వాదుల్ని ఎన్ ఐఏ గుర్తించి పట్టుకెళ్తుండడం, ఇక్కడి భద్రతను ప్రశ్నార్థకం చేసింది. తాజాగా, రాష్ట్రంలో ఐఎస్ఐఎస్ తీవ్ర వాదులు తిష్ట వేసి ఉండడం ఇటీవల వెలుగులోకి వచ్చింది. జాతీయ నేర పరిశోధనా సంస్థ (ఎన్ ఐఏ)కు కేరళలో చిక్కిన ఐఎస్ఐఎస్ మద్దతుదారుల వద్ద జరిపిన విచారణతో తిరునల్వేలి జిల్లా కడయనల్లూరులో ఒకర్ని, చెన్నైలో ఒకర్ని, కోయంబత్తూరులో మరొకర్ని అదుపులోకి తీసుకున్నారు. వీరి వలలో పడి, ఐఎస్ఐఎస్కు మద్దతుగా వ్యవహరించే వాళ్లు మరెవ్వరైనా రాష్ట్రంలో తిష్ట వేసి ఉన్నారా అన్న ఆందోళన బయలు దేరడంతో, ఆ దిశగా విచారణ సాగుతూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీలో పట్టుబడ్డ ఐఎస్ఐఎస్ తీవ్రవాది వద్ద ఎన్ ఐఏ వర్గాలు జరిపిన విచారణలో కేరళ, తమిళనాడును గురిపెట్టి దాడులకు వ్యూహ రచన జరిగిన ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో ఐఎస్ఐఎస్ కదలికలు ఇటీవల కాలంగా పెరగడం, తాజాగా కేంద్రం హెచ్చరికలతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ ఉత్కంఠ నెలకొని ఉండడంతో, ఇదే అదనుగా చాపకింద నీరులా ఐఎస్ఐఎస్ తీవ్ర వాదులు ఏదేని వ్యూహాలు రచించారా అన్న ఉత్కంఠ తప్పడం లేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, జన సంచారం అత్యధికంగాఉండే ప్రాంతాల్లో భద్రతను ఐదంచెలకు పెంచారు. -
రేపు పోలీస్ జాగిలాల పాసింగ్ పరేడ్
ముఖ్య అతిథిగా హాజరుకానున్న సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: మొయినాబాద్‌లోని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అకాడమీలో శనివారం పోలీస్ జాగిలాల పాసింగ్ పరేడ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై, జాగిలాల డ్రిల్స్‌ను వీక్షిస్తారని పోలీస్ శాఖ తెలిపింది. -
రష్యా అధ్యక్షుడిపై ట్రంప్ ప్రశంసలు!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని, ప్రభుత్వానికి సంబంధించి ఎన్నో అధికారిక మెయిల్స్ ను హ్యాకింగ్ చేసిందని పలు ఆరోపణలున్నాయి. తమ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఓటమికి పరోక్షంగానే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పరోక్షంగా కారణమిని డెమొక్రటిక్ పార్టీ కీలకనేతలు, ప్రస్తుత అధ్యక్షడు బరాక్ ఒబామా భావిస్తున్నారు. మరోవైపు అమెరికా తరహాలో తాను ఎలాంటి చర్యలు తీసుకోనని పుతిన్ ఇలా అన్నారో లేదో అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ రష్యా అగ్రనేతను తెగ పొగిడేశారు. 35 మంది రష్యా అధికారులను ఒబామా గత గురువారం తొలగించారు. కానీ, పుతిన్ అలాంటి పని చేయరని ఎందుకుంటే ఎప్పటి నుంచో ఆయన టూ స్మార్ట్ అని సోషల్ మీడియాలో ట్రంప్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మరికొద్ది రోజుల్లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్.. రష్యాతో తన అనుబంధాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు. రష్యా నేత తెలివిగా వ్యవహరిస్తారని మన దేశ అధికారులకు ఏ విధంగానూ అక్కడి నుంచి సమస్యలు రావని నిశ్చింతగా ఉండొచ్చునని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే మేరీలాండ్, న్యూయార్క్ లలో షెల్టర్ తీసుకుని రష్యా నిఘా అధికారులు తమకు ద్రోహం చేస్తున్నారని అమెరికా భావిస్తుంది. అమెరికా చేసినట్లుగా తాను ఆ దేశ ఇంటెలిజెన్స్ అధికారులను తప్పించే ప్రసక్తేలేదన్నారు. అమెరికా అధికారులకు తాను తలనొప్పిగా మారనని, రష్యా-అమెరికా మైత్రిని తాను కోరుకుంటున్నట్లు స్పష్టంచేశారు. కొన్ని రోజుల తర్వాత ఇరుదేశాల మధ్య పలు ఒప్పందాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
అహోబిలేసుని సేవలో ఇంటలిజెన్స్ డీఎస్పీ
అహోబిలం (ఆళ్లగడ్డ): ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ఇంటలిజెన్స్ డీఎస్పీ వంశీధర్‌గౌడ్ దర్శించుకున్నారు. ఆదివారం క్షేత్రానికి చేరుకున్న ఆయన ఎగువ, దిగువ అహోబిలంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదల్లో భాగంగా అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈయన వెంట ఐదుగురు ఇంటలిజెన్స్ ఎస్ఐలు ఉన్నారు. -
ఇంటెలిజెన్స్ చేతులెత్తేసింది!
మీరేమైనా ట్రై చేస్తారా? మిస్టరీని ఛేదిస్తారా? ఈ ఫొటోలను చూడండి. ఫొటోల్లోని ప్రముఖులను చూడండి. వాళ్లేం చేస్తున్నారో, ఏం చెయ్యబోతున్నారో, ఎందుకలా ఫీలింగ్స్ పెట్టారో కనిపెట్టండి. విజయం సాధించారా.. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కన్నా కూడా మీరు ఇంటెలిజెంట్! బెస్ట్ ఆఫ్ లక్. చెక్ దెమ్ ఔట్. రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారు?! రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఎందుకిలా బిగుసుకుపోయారు? ఎస్.ఎం.కృష్ణ కుర్తాలో ఏం దాచుకున్నారు? కరణ్ జోహార్ తన ముక్కుతో పెన్సిల్ని ఏం చేస్తున్నారు? -
వీటికి నకిలీ నోట్ల తయారీ అసాధ్యం
పాత 500, 1000 రూపాయల నోట్లను రద్దుచేసి, కొత్తగా 500, 2000 రూపాయల నోట్లను తయారుచేయించడం వెనక కేవలం నల్ల ధనాన్ని అరికట్టడమే కాదు, నకిలీ నోట్లు అన్నవి లేకుండా చేయడం కూడా ప్రధాన ఉద్దేశం. కానీ, కొత్త నో్ట్లు మార్కెట్లోకి వచ్చిన తర్వాత అతి తక్కువ సమయంలోనే అత్యాధునిక టెక్నాలజీ సాయంతో కొత్త వాటికి కూడా నకిలీ నోట్లు తయారుచేసేస్తారు కదా అన్న అనుమానాలు సామాన్యలుకు ఉన్నాయి. వాటిని నిఘా సంస్థలు కొట్టి పారేస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన నోట్లకు నకిలీ తయారుచేయడం దాదాపు అసాధ్యమేనని చెబుతున్నాయి. ముఖ్యంగా పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థలు, బంగ్లాదేశ్‌లో నకిలీ నోట్లు తయారుచేసేవాళ్లు వీటిని కాపీ చేయడం కుదరని పని అని తేల్చి చెబుతున్నారు. గత ఆరు నెలలుగా అత్యంత పటిష్ఠమైన భద్రతతో కూడిన ఈ కొత్త నోట్లు ప్రింట్ అవుతున్నా, ఆ విషయం అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. వీటిమీద పైకి చెబుతున్నవే కాకుండా ఇంకా చాలా సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయని రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా), ఇంటెలిజెన్స్ బ్యూరో, డీఆర్ఐ తదితర సంస్థలు చెబుతున్నాయి. పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ప్రత్యేకంగా భారతీయ కరెన్సీ నోట్లకు నకిలీలు ప్రింట్ చేయడానికే ఒక ప్రెస్ కూడా ఉందని నిఘావర్గాలు ఇంతకుముందే ప్రభుత్వానికి, ఆర్బీఐకి తెలిపాయి. ఈ ప్రెస్ ఐఎస్ఐ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇక్కడ ప్రింట్ చేసిన నకిలీ నోట్లను దావూద్ ఇబ్రహీంకు చెందిన 'డి' కంపెనీ, లష్కరే తాయిబా, ఇతర అంతర్జాతీయ నేర గ్యాంగులతో భారతదేశంలోకి పంపుతుంది. నూటికి నూరుశాతం కచ్చితత్వంతో తాము భారతీయ నోట్లను ప్రింట్ చేశామని పాకిస్థాన్ వాళ్లు దాదాపు ఏడాది క్రితం ఒకసారి చెప్పారు. ప్రతియేటా భారతదేశంలోకి దాదాపు రూ. 70 కోట్ల విలువైన నకిలీ నోట్లను పంపుతుంటారు. అయితే కొత్త నోట్లలో ఉన్న అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లను కాపీ కొట్టడానికి వాళ్ల దగ్గర ఉన్న పరిజ్ఞానం సరిపోదని, అసలు దాన్ని ఏ ఒక్కరూ కాపీ కొట్టలేరని నిఘావర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పాకిస్థాన్ తన నకిలీ నోట్ల ప్రెస్‌ను ఇక మూసుకోవాల్సిందేనిన హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. మరోవైపు.. 500, 1000 రూపాయల నోట్లను రద్దుచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పలుచోట్ల కోర్టులలో సవాలు చేస్తున్నారు. ఈ కేసును సుమోటోగా విచారణకు తీసుకోవాలని ఇద్దరు న్యాయవాదులు బాంబే హైకోర్టును కోరారు. ఈ నిర్ణయం చట్టపరంగా చెల్లుబాటు కాదని జమ్షెడ్ మిస్త్రీ, జబ్బర్ షేక్ అనే న్యాయవాదులు అన్నారు. ఇంతకుముందు 1978 సంవత్సరంలో పెద్ద నోట్లను రద్దుచేసినప్పుడు ముందుగా ఒక ఆర్డినెన్సు, తర్వాత చట్టం చేశారని, ఇప్పుడు మాత్రం అదేమీ లేకుండా నేరుగా ప్రకటించేశారని చెప్పారు. -
వీఐపీలకు భద్రత కట్టుదిట్టం
- ఆరు రాష్ట్రాలకు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు హైదరబాద్: ఏఓబీలో జరిగిన భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టులు ప్రతీకారదాడులకు దిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, బీహార్ రాష్ట్రాలను కేంద్ర నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. ఆంధ్రా-ఒడిస్సా సరిహద్దుల్లో ఎన్కౌంటర్ చోటుచేసుకోవడంతో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పలువురువీఐపీలతో పాటు టార్గెట్‌లో ఉన్న రాజకీయ నేతల భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రముఖుల్ని లక్ష్యంగా చేసుకుని ప్రతీకార దాడులు నిర్వహించాలని మావోయిస్టు పార్టీ పథకరచన చేస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. రాజకీయ నేతలు, పోలీసు ఉన్నతాధికారులపై దాడులు నిర్వహించేందుకు మావోయిస్టు నేత నంబాల కేశవరావు అలియాస్ ఆశన్న నేతృత్వంలో యాక్షన్ టీమ్‌లు రంగంలోకి దిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రధానంగా చత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాల్లో వీఐపీల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా అన్ని జిల్లాల ఎస్పీలనూ తెలుగు రాష్ట్రాల డీజీపీలు ఎన్.సాంబశివరావు, అనురాగ్ శర్మ ఆదేశాలు జారీచేశారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిపై శాంతి భద్రతల విభాగం అదనపు డీజీలు, నిఘా చీఫ్‌లు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మారుమూల ప్రాంతాల పర్యటనలకు వెళ్లరాదని మంత్రులు, ప్రజాప్రతినిధులకు జిల్లా ఎస్పీల ద్వారా సమాచారం పంపారని తెలిసింది. దండకారణ్య సరిహద్దులోని ఖమ్మం, వరంగల్, కరీంనగర్ పరిధుల్లోని ప్రాంతాలతో పాటు ఏవోబీ పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాల్లో అదనపు గ్రేహౌండ్స్ బలగాలను రంగంలోకి దింపారు. విస్తృతస్థాయిలో గాలింపు, కూంబింగ్ ఆపరేషన్లు జరుపుతున్నారు. దండకారణ్యం, కేకేడబ్ల్యూ జోన్ల నుంచి తెలుగు రాష్ట్రాల్లోకి చొరబాట్లు లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మైదాన ప్రాంతాల్లో కూడా మావోయిస్టులు దాడులకు దిగే అవకాశం ఉందని నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని కీలక/అనుమానిత ప్రాంతాల్లో విస్తృతస్థాయిలో తనిఖీలు నిర్వహించాల్సిందిగా ఉన్నతాధికారుల నుంచి పోలీసులకు ఆదేశాలు అందాయి. -
లెక్చరర్ మృతిపై పోలీసులకు ఫిర్యాదు
వరంగల్: లెక్చరర్ ప్రవీణ్‌కుమార్ అనుమానాస్పద మృతి నేపథ్యంలో అతని కుటుంబసభ్యులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లోని ఎంఎస్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్ రెండు రోజుల క్రితం వరంగల్ లో అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం విదితమే. అయితే, అంతకుముందే తను పనిచేస్తున్న కళాశాలలో ఐఎస్ తీవ్ర వాద శిక్షణ కొనసాగుతోందని, తన ప్రాణాలుకు ముప్పు ఉందని ప్రవీణ్ ఫేస్బుక్ లో పోస్టులు పెట్టాడు. దీంతో కళాశాల నిర్వాహకులే అతడిని వేధించి మరణానికి కారణ మయ్యారని ఆరోపిస్తూ అతని కుబుంబసభ్యులు వరంగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా వారు వెంటనే హైదరాబాద్ రానున్నారు. ఇక్కడి పోలీసు అధికారుల సహకారంతో కేసు దర్యాప్తును వేగవంతం చేయనున్నారు. -
హైదరాబాద్‌లో ఐసిస్?
-
హైదరాబాద్‌లో ఐసిస్?
తమ కాలేజీలో ఉగ్రశిక్షణ అంటూ ఓ లెక్చరర్ ఆరోపణ * అడ్డుచెప్పినందుకు తనను బెదిరించారంటూ ఫేస్బుక్లో పోస్టులు.. కొద్ది గంటల్లోనే మృతి * ఈ ఘటనలపై సోషల్ మీడియాలో కలకలం * రంగంలోకి దిగిన నిఘా వర్గాలు, పోలీసులు సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఉగ్రవాద సంస్థ ఐసిస్ హైదరాబాద్‌లో వేళ్లూనిందా? కాలేజీల్లో విద్యార్థులను చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందా? నగరంలో గత రెండు రోజుల్లో జరిగిన ఘటనలు ఈ సందేహాన్ని రేకెత్తిస్తున్నాయి. ఓ లెక్చరర్ తమ కాలేజీలో ఐసిస్ ఉగ్రవాద శిక్షణ జరుగుతోందని.. దాన్ని ప్రశ్నించినందుకు తనకు బెదిరింపులు వచ్చాయని ఫేస్బుక్లో పోస్టులు చేశారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం కలకలం రేపింది. దీంతో నిఘా వర్గాలు, పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ఈ ఆరోపణలను సదరు కాలేజీ యాజమాన్యం ఖండిస్తోంది. ఫేస్బుక్లో వరుసగా 30 పోస్టులు మెదక్ జిల్లా బండారుపల్లి మండలం తొగుటకు చెందిన ప్రవీణ్‌కుమార్ (28) కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. ఇక్కడి అక్బర్‌బాగ్ డివిజన్ పరిధిలోని నల్లగొండ చౌరస్తాలో ఉన్న ఎంఎస్ జూనియర్ కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఆయన తన పేరు మీదే ఫేస్బుక్లో ఓ పేజీని నిర్వహిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున 4.41 గంటల నుంచి 5.53 గంటల మధ్య ఆ పేజీలో దాదాపు 30 పోస్టులు పెట్టారు. తమ కాలేజీలో ఐసిస్ ఉగ్రవాద శిక్షణ జరుగుతోందని, అడ్డు చెప్పినందుకు ఉగ్రవాదులు, కళాశాల యాజమాన్యం తనను బెదిరించారని ఆ పోస్టుల్లో పేర్కొన్నారు. గతేడాది తనను హత్య చేయడానికి కూడా కుట్రపన్నారని పోస్ట్ చేశారు. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే.. బుధవారం రాత్రి వరంగల్ జిల్లా కేంద్రం లోని ఎంజీఎం సెంటర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రవీణ్‌కుమార్ మరణించారు. ప్రవీణ్ స్నేహితులుగా చెప్పుకొంటున్న కొందరు.. ఆయన ఫేస్బుక్ పోస్టులను, ప్రమాదంలో మరణించడాన్ని పేర్కొంటూ ‘అలర్ట్’ పేరిట ఓ సందేశాన్ని తయారుచేశారు. ప్రవీణ్ మరణంపై లోతుగా విచారణ జరగాలంటూ.. వాట్సప్, ట్వీటర్ల ద్వారా పలువురికి సందేశం పంపారు. ఇది మీడియాకు చేరడంతో కలకలం రేగింది. ఆరా తీస్తున్న పోలీసులు.. ప్రవీణ్‌కుమార్ ఉదంతంపై పోలీసులతోపాటు నిఘా వర్గాలు, సైబర్ నిపుణులు రంగంలోకి దిగారు. ఆ కాలేజీ వ్యవహారాలు, ఫేస్బుక్ పోస్టుల్లోని అంశాలను పరిశీలిస్తున్నారు. ప్రవీణ్ ఎక్కడి నుంచి ఆ పోస్టులు చేశారు, ప్రవీణ్ వ్యక్తిగత వివరాలేమిటనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇక వరంగల్‌లో జరిగిన ప్రమాదంలో ప్రవీణ్ మృతిపై ఆయన సోదరుడి ఫిర్యాదు మేరకు మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. లారీ ఢీకొనడంతో మరణించినట్లు అందులో పేర్కొన్నారు. అయితే పోలీసులకు గురువారం సాయంత్రం సోషల్ మీడియా పోస్టుల సమాచారం అందడంతో ‘ఉగ్ర’కోణంలో దర్యా ప్తు ప్రారంభించారు. ప్రవీణ్‌ను ఎవరైనా కావాలని చంపారా అనేది తేల్చేందుకు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఆరోపణలను ఖండించిన కళాశాల ప్రవీణ్‌కుమార్ ఫేస్బుక్ పోస్టులపై కళాశాల యాజమాన్యాన్ని వివరణ కోరగా.. అదంతా అవాస్తవమని కళాశాల ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. మంగళవారం విధులకు హాజరైన ప్రవీణ్‌కుమార్ బుధవారం కళాశాలకు రాలేదని.. లీవ్ లెటర్ ఇవ్వలేదని, రాలేనని సమాచారం కూడా ఇవ్వలేదని చెప్పారు. ప్రవీణ్ మరణానికి, కాలేజీకి సంబంధం లేదన్నారు. ఇక ప్రవీణ్ మరణానికి సంతాపం తెలుపుతూ కాలేజీ యాజమాన్యం గురువారం నోటీసు బోర్డులో సందేశాన్ని పెట్టింది. కాగా ప్రవీణ్‌కుమార్ ఉదంతంపై తమకు ఎటువంటి సమాచారం గానీ, ఫిర్యాదు గానీ అందలేదని చాదర్‌ఘాట్ ఇన్స్పెక్టర్ సత్తయ్య వెల్లడించారు. -
న్యూ లుక్‌లో టాలీవుడ్ ప్రిన్స్
చెన్నై : టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు న్యూ లుక్‌లో ఫ్యాన్స్‌ను అలరించబోతున్నారట. పోకిరి, దూకుడు వంటి సినిమాల్లో పోలీసు గెటప్‌తో ప్రేక్షకులను అలరించిన మహేష్ ఏఆర్. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న తమిళ-తెలుగు ద్విభాషా ప్రాజెక్టులో నటించనున్నారట. అయితే ఈ ప్రాజెక్టులో అలాంటి ఇలాంటి రెగ్యులర్ పోలీస్‌గా కాకుండా ఇంటిలిజెన్స్ ఆఫీసర్‌గా మహేష్ కనిపించనున్నారట. ప్రస్తుతం ఈ షూటింగ్లో మహేష్ బిజీగా ఉన్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తాడని, ఇప్పటికే పోలీసు గెటప్‌తో ప్రేక్షకులకు సుపరిచితమైన మహేష్‌ను విభిన్న అవతారంలో మురుగదాస్ చిత్రీకరించబోతున్నారని చిత్ర యూనిట్ పేర్కొంటోంది. అయితే మురుగదాస్, మహేష్ కాంబినేషన్లో వస్తున్న మొదటి ఫిల్మ్ ఇదే కావడం విశేషం. ప్రస్తుతం చెన్నైలోని ఈవీపీ వరల్డ్ పార్క్‌లో ఈ ప్రాజెక్టు షూటింగ్ జరుగుతోందని చిత్ర యూనిట్ వెల్లడిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుకు టైటిల్‌ను మాత్రం ఇంకా నిర్ణయించలేదు. ఈ సినిమాలో రకుల్ ప్రీతీ సింగ్, ఎస్.జే సూర్య నటిస్తున్నారని తెలుస్తోంది. -
మీ వల్లే ఇబ్బందులు పడుతున్నా
-
మీ వల్లే ఇబ్బందులు పడుతున్నా
నిఘా అధికారులపై సీఎం ఆగ్రహం సాక్షి, అమరావతి: ‘ఓటుకు కోట్లు’ కేసు ముఖ్యమంత్రి చంద్రబాబును ముచ్చెమటలు పట్టిస్తోంది. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న సీఎం బుధవారం ఉదయం ఇదే అంశంపై అక్కడి నుంచే ముఖ్య నేతలు, అధికారులతో విస్తృతంగా చర్చలు జరిపారు. ఫోన్లో మంతనాలు సాగించారు. మరోవైపు ఓటుకు కోట్లు కేసు పర్యవసనాలను ముందస్తుగా కనిపెట్టడంలో విఫలమయ్యారని దాని వల్ల తాను ఇబ్బందులు పడుతున్నానని నిఘా విభాగం అధికారులపై సీఎం చిందులు వేసినట్లు అధికారుల్లో ప్రచారం జరుగుతోంది. ఏసీబీ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువడిన రోజు రాత్రి నిఘా విభాగం చీఫ్‌తో పాటు ఇతర ఉన్న తాధికారులను పిలిపించుకున్న బాబు వారిపై విరుచుకుపడినట్లు తెలుస్తోంది. ‘‘రాష్ర్టంలో ఉన్న 175 మంది ఎమ్మెల్యేల కదలికలను కూడా తెలుసుకోలేకపోతున్నారు.అధికార పక్షంవారిని విడిస్తే, విపక్షంలో ఉన్నవారిలో 20 మంది మన పార్టీలోనే చేరారు, మిగిలిన 45 మంది కదలికలనూ తెలుసుకోలేకపోతున్నారా?. రాజధానికి పక్కనే ఉండే ఎమ్మెల్యే నాకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించి ఉత్తర్వులు తెచ్చుకునే వరకూ మీకు తెలియదంటే మీ పనితీరు ఎలా ఉందో అర్ధం అవుతోంది’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. -
ఇంటెలిజెన్స్‌లో ఇంటి దొంగ!
ఓ వివాదాస్పద ఎమ్మెల్యేకు అండ సమాచారాన్ని లీకుచేస్తున్న ఓ అధికారి ప్రభుత్వానికి పంపకుండా తొక్కిపెడుతూ.. సర్కారుకు మాత్రం తప్పుడు నివేదికలు అసమ్మతిపై అప్రమత్తంగా ఉండాలని సూచనలు అసలే.. ఆ ఎమ్మెల్యేకు తలబిరుసు.. పైగా అనేక అవినీతి ఆరోపణలు.. వెరసి వివాదాస్పద ఎమ్మెల్యే అన్న ముద్ర.. అటువంటి ప్రజాప్రతినిధికి ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన ఓ అధికారి సొంత వేగులా మారాడు.. సొంతిల్లులాంటి తన విభాగానికి వచ్చే సమాచారాన్ని సదరు ప్రజాప్రతినిధికి లీక్ చేస్తూ తొత్తులా వ్యవహరిస్తున్నాడు. ప్రభుత్వం గురించి ప్రజలేమనుకుంటున్నారు.. అది అమలు చేస్తున్నామని చెబుతున్న పథకాలపై జనస్పందన ఏమిటి.. ప్రజాప్రతినిధుల వ్యవహారశైలి ఎలా ఉంది.. ప్రధాన ప్రతిపక్షం ఏ మేరకు బలం పుంజుకుంటోంది.. ప్రజాసంఘాల ఉద్యమాల ప్రభావం ఏమేరకు ఉంది.. వర్తమాన రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి... మొత్తంగా జననాడి ఎలా ఉందో పసిగట్టి ప్రభుత్వానికి నివేదించడమే పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగం ప్రధాన కర్తవ్యం. కానీ ప్రభుత్వానికి కళ్లు, చెవుల్లాంటి ఆ విభాగానికి చెందిన సదరు అధికారి మాత్రం ఇందుకు విరుద్ధంగా తిన్న ఇంటి వాసాలు లెక్కపెడుతున్నాడు. అధికార టీడీపీకి చెందిన వివాదాస్పద ఎమ్మెల్యేకు రహస్య సమాచారం చేరవేస్తున్నాడు. అక్కడితో ఆగకుండా ఆరోపణలు, వివాదాల్లో నిండా మునిగిన ఆ ప్రజాప్రతినిధికి వ్యతిరేకంగా అందిన సమాచారాన్ని ప్రభుత్వానికి పంపకుండా తొక్కిపెడుతున్నాడు. విశాఖపట్నం: జిల్లాలో ఇటీవలి కాలంలో లెక్కకు మించిన అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయి వివాదాస్పద ఎమ్మెల్యేగా ముద్రపడ్డ తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధికి నిఘా(ఇంటెలిజెన్స్) విభాగంలోని ఓ అధికారి కొమ్ముకాస్తున్నాడని తెలుస్తోంది. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన నివేదికలను ఎప్పటికప్పుడు చేరవేస్తూ సదరు నేత సేవలో తరిస్తున్నాడని అంటున్నారు. వాస్తవానికి ఆ ఎమ్మెల్యేపై ఇటీవలి కాలంలో ప్రజల్లోనే కాకుండా సొంత పార్టీ శ్రేణుల్లోనూ తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ మధ్యే పుట్టిన రోజు చేసుకున్న ఆ ప్రజాప్రతినిధి వేడుకల పేరిట భారీస్థాయిలో కలెక్షన్లు చేశారు. చివరికి అంగన్వాడీ కార్యకర్తలను కూడా వదలకుండా చేసిన వసూళ్ల వేడుకలు ప్రజల్లో ఆ నేతను మరింత అభాసుపాల్జేశాయి. అంతే.. వెంటనే రంగంలోకి దిగిన ఇంటెలిజెన్స్ అధికారి ఆ నేతను అప్రమత్తం చేశారు. ఫోన్ చేసి.. ‘పుట్టినరోజు సంబరాలు మిమ్మల్ని బాగా పలుచన చేశాయి.. జాగ్రత్తగా ఉండండి.. ఈ విషయమై నేను ప్రభుత్వానికి ఎటువంటి నివేదిక ఇవ్వను.. కానీ కొద్దిరోజులు మీరు హడావుడి చేయకుండా తెరవెనక్కి వెళ్లిపోండి’.. అని సూచనలు చేశారు. దీంతో ఆ నేత నియోజకవర్గం దాటి వెళ్లిపోయి.. అంతా సద్దుమణిగిన పదిరోజుల తర్వాత తిరిగి వచ్చారు. సర్వేనూ తొక్కిపెట్టేశారట? టీడీపీ అధినేత, సీఏం చంద్రబాబునాయుడు ఇటీవలి కాలంలో వేగుల ద్వారా ప్రజాప్రతినిధుల పనితీరుపై పక్కాగా సర్వే చేయించారు. ప్రతి ఆర్నెల్లకోసారి చేస్తున్న సర్వే మాదిరి కాకుండా ఈసారి కేవలం ప్రజాప్రతినిధుల పనితీరుపైనే సర్వే చేశారు. టీడీపీ రెండేళ్ల పాలన, జిల్లావ్యాప్తంగా ఆ పార్టీ ప్రజాప్రతినిధులందరిపైనా వ్యతిరేకత వెల్లువెత్తింది. ప్రత్యేకించి విపరీతమైన అవినీతి ఆరోపణలతో అంటకాగుతున్న ఆ నేతపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఇదే విషయాన్ని ఆ ఇంటెలిజెన్స్ అధికారి సదరు నేతకు చేరవేశారు. జిల్లాలో మీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది.. కోలుకోలేని విధంగా ఉంది.. అని ఉప్పందించారు. ఇలా ప్రజాప్రతినిధులకు ఇంటెలిజెన్స్ అధికారులు లోపాయికారీగా ఉప్పందించడం సాధారణమే అయినా.. ఈ అధికారి ఓ అడుగు ముందుకేసి.. మీపై నెగటివ్ రిపోర్టులేమీ ప్రభుత్వానికి ఇవ్వకుండా తొక్కిపెట్టేస్తున్నానని భరోసా ఇవ్వడమే వివాదాస్పదమవుతోంది. ఆ అధికారి ఉండగా.. ఏం కాదట! ఇక ఇంటెలిజెన్స్ అధికారి ప్రతి విషయాన్ని తనకు చేరవేస్తున్నారని ఆ నేత బహిరంగంగానే పార్టీ నేతలకు, కార్యకర్తలకు చెప్పుకోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలో ఇటీవల వెలుగుచూసిన భూదందాలు, సెటిల్మెంట్ల విషయమై ఆ నేత క్యాడర్‌తో మాట్లాడుతూ.. ఇంటెలిజెన్స్‌లో మనోళ్లు ఉన్నారు.. మన కేం ప్రాబ్లమ్ లేదు.. నెగటివ్ రిపోర్టులేమీ ప్రభుత్వానికి పంపించరు.. పత్రికల్లో ఏమొచ్చినా క్లిప్పింగ్‌లు వెళ్లవు.. అన్నీ ఇక్కడే ఆగిపోతాయి.. విజయవాడ, హైదరాబాద్ ఉన్నతాధికారుల వద్దకు వెళ్లే పరిస్థితి లేదు.. ఏమైనా వెళ్లినా.. మన గురించి పాజిటివ్ రిపోర్టులే వెళ్తాయి.. అని ధీమాగా చెప్పుకొచ్చారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అసలు.. ఎందుకు ఆ అధికారి సదరు ప్రజాప్రతినిధికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నారు.. ఏం ఆశించి ఆ విధంగా వ్యవహరిస్తున్నారు.. సామాజికవర్గ కోణమా.. వ్యక్తిగత అభిమానమా.. అనేది ఇంటెలిజెన్స్ వర్గాల్లోనే చర్చకు తెరలేపింది. -
కశ్మీర్ లో పాక్ జెండా ఎగరనుందా..
పాకిస్తాన్ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి కశ్మీర్ వ్యాలీలో రంగం సిద్ధమవుతోందని ఇంటిలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. మునుపెన్నడూ లేని విధంగా గ్రామీణ కశ్మీర్ లో పాక్ జెండాలు ఎగురవేయడానికి వేర్పాటువాదులు, స్థానిక మిలిటెంట్లు వ్యూహాలు రచించినట్లు సమాచారం. ఇంటిలిజెన్స్ ఇన్ పుట్స్ నేపథ్యంలో పాక్ డే సంబరాలను అడ్డుకునేందుకు అధికారులు పావులు కదుపుతున్నారు. ప్రజలను సంబరాల్లో పాల్గొనకుండా చేయడం వల్ల పౌరులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని కూడా ఇంటిలిజెన్స్ అధికారులను హెచ్చరించింది. సపోర్ నుంచి వాట్లాబ్, బందిపొర వరకూ దాదాపు 25 ప్రదేశాల్లో ఇనుప పైపులు, కర్రలతో జెండాను ఎగురవేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇంటిలిజెన్స్ తెలిపింది. సపోర్-దొవాబ్గాహ్-రఫియాబాద్ మార్గంలో 20 ప్రదేశాల్లో, పుల్వామా, సపోర్, అనంతనాగ్ లలో మరికొన్ని చోట్ల పాక్ జెండాలను ఎగురవేసేందుకు పక్కాప్రణాళిక రూపొందిందని తన రిపోర్టులో పేర్కొంది. రూరల్ కశ్మీర్ లో ప్రొ-పాకిస్తానీ ర్యాలీలు భారత్ కు తలనొప్పిగా మారాయి. శాంతియుతంగా నిరసనలు తెలిపే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆదేశాలు జారీ చేశారు. -
నయీమ్‌కు మాజీ మంత్రి అండదండలు
-
నయీమ్‌కు మాజీ మంత్రి అండదండలు
రాజకీయ శత్రువుల అంతానికి నయీమ్‌ను వాడుకున్న మంత్రి అనుమానిస్తున్న ఇంటెలిజెన్స్ వర్గాలు వివరాలన్నీ సీఎం దృష్టికి.. హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ టీడీపీ హయాంలోనే తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించినట్టు రూఢీ అయింది. నయీమ్ రాసుకున్న డైరీ, దొరికిన ఫోన్లు, కాల్ డేటాను విశ్లేషించిన ఇంటెలిజెన్స్ వర్గాలు.. టీడీపీ హయాంలో నయీమ్‌కు ప్రభుత్వ అండదండలు లభించినట్లు అనుమానిస్తున్నాయి. ఇప్పటికే దీనిపై కొన్ని ఆధారాలు సేకరించాయి. టీడీపీ హయాంలో ఓ మంత్రి నయీమ్‌కు సహకరించారని.. రాజ కీయ, అజ్ఞాత శత్రువులను అంతం చేసేందుకు నయీమ్‌ను ఆయుధంగా వాడుకున్నారని విచారణ బృందం గుర్తించింది. టీడీపీకి చెందిన ఆ మాజీ మంత్రితో ఇప్పటికీ నయీమ్‌కు మంచి సంబంధాలున్నాయని, తరచుగా ఫోన్లలో మాట్లాడినట్లుగా కాల్ డేటాను సేకరించారు. ఆ మాజీ మంత్రి అనుచరులే చాలా కాలం నుంచి నయీమ్ అనుచరులుగా చెలామణిలో ఉన్నట్లు పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి సహకారాన్ని, టీడీపీ ప్రభుత్వంలో నయీమ్‌కు ఉన్న అండదండల వివరాలన్నీ ఇంటెలిజెన్స్ వర్గాలు బుధవారం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో నయీం గుట్టు రట్టు చేసే క్రమంలో ఈ కేసులో మాజీ మంత్రిని సైతం చేరుస్తారా అన్నది హాట్ టాపిక్‌గా మారింది. -
తెరవెనుక తమ్ముళ్లెవరు?
అమలాపురం భూ బాగోతంపై ఇంటిలిజెన్స్ ఆరా నక్కపల్లి : అమలాపురంలో ఇటీవల కాలంలో జరిగిన భూ బాగోతాలపై ఇంటిలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. సుమారు రూ.12 కోట్లు విలువైన 90 ఎకరాల ప్రభుత్వభూమికి రికార్డులు తారు మారు చేసి ఆన్లైన్ చేయడం తెలిసిందే. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్కారిడార్ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా భూసేకరణ చేస్తోంది. దీనిలో భాగంగా జిరాయితీతోపాటు, డీఫారం పట్టాభూములను కూడా స్వాధీనం చేసుకుని పరిహారం చెల్లించడానికి ప్రభుత్వం అంగీకరించింది. దీనిని అవకాశంగా తీసుకున్న కొంతమంది తెలుగు తమ్ముళ్లు రెవెన్యూ సిబ్బందితో కుమ్మక్కయి రికార్డులు తారుమారు చేశారు. ఎటువంటి పట్టాలు జారీ కాకుండానే ఒన్బీలోను, ఆన్లైన్ (వెబ్‌ల్యాండ్)లో 39 మంది సాగుదారులను చేర్చి నమోదు చేశారు. ఈ విషయాన్ని సాక్షి వెలుగులోకి తీసుకురావడంతో స్పందించిన ప్రభుత్వం ఇంటిలిజెన్స్ వర్గాలతో ఆరా తీయిస్తోంది. ఈ వ్యవహారంలో టీడీపీ నాయకుల ప్రమేయం ఉంది. రికార్డుల్లో వారి పేర్లు నమోదవడంతో పార్టీ అధిష్టానం సీరియస్‌గా పరిగణించినట్టు సమాచారం. ఈ బాగోతాన్ని వైఎస్సార్సీపీ నాయకులు రాష్ట్ర స్థాయికి, అవసరమైతే ప్రతిపక్షనేత జగన్ దృష్టికి తీసుకెళ్తామని ప్రకటించడం అధికారపార్టీ నేతలకు మింగుడుపడటంలేదు. -
టెక్నాలజీతోనే ఉగ్ర కుట్రకు ప్లాన్
- నిఘాకు చిక్కకుండా సాంకేతికత వినియోగం - లోతుగా ఆరా తీస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో పేలుళ్లకు కుట్ర పన్నిన ‘ఉగ్ర మూకలు’ వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని చూసి జాతీయ దర్యా ప్తు బృందం(ఎన్ఐఏ) అధికారులు ఆశ్చర్యపోతున్నారు. నిఘాకు చిక్కకుండా ఉండేందుకు ఐపీ అడ్రస్‌లను హ్యాక్ చేయడం, ‘అండర్‌గ్రౌండ’ వెబ్ ద్వారా బృందంగా ఏర్పడటాన్ని చూసి అధికారులు విస్తుపోయారు. ఉగ్ర అనుమానితుల కస్టడీలో భాగంగా దాడి కుట్రకు దారి తీసిన విధానంపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు. పేలుళ్ల కోసం వారు ఎక్కువగా సాంకేతికతను వాడటంపై విచారిస్తున్నారు. ఫేస్బుక్ ద్వారా చాటింగ్, ఈ-మెయిల్స్ నేరుగా పంపితే నిఘా అధికారులు గుర్తించే అవకాశం ఉండటంతో ఉగ్రమూకలు వ్యూహా త్మకంగా వ్యవహరించాయి.వీడియో కాలింగ్, చాటింగ్ కోసం కొన్ని సందర్భాల్లో ఇతరుల ఐపీ అడ్రస్‌లను తస్కరించి ఉపయోగించాయి. హ్యాకింగ్ టూల్స్‌కు చిక్కకుండా ఉండేం దుకు ‘అండర్‌గ్రౌండ్’ వెబ్ ద్వారా బృందం గా ఏర్పడి దాడులకు కుట్రపన్నాయి. ఇందుకోసం టెయిల్స్‌గా పిలిచే ప్రత్యేక ఆపరేటింగ్ సిస్టంను పీసీల్లో ఇన్స్టాల్ చేసుకున్నాయి. అలాగే సోషల్ మీడియా పనిచేయడానికి ఏదో ఒక సర్వర్ హోస్ట్ చేయాల్సి ఉండగా నిఘా వర్గాలకు సర్వర్ అడ్రస్, ఇతర వివరాలు చిక్కకుండా ఉండేందుకు వారు డార్క్ నెట్‌ను ఉపయోగించారు. దీనివల్ల ‘అండర్‌గ్రౌండ్’ నెట్‌కు సంబంధించిన సర్వర్లు, వాటి చిరునామాలతోపాటు వాటిని నిర్వహిస్తున్న వారి వివరాలు తెలిసే అవకాశాలు చాలా కష్టమవుతుంది. కేంద్రం అధీనంలోని నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్టీఆర్వో) ద్వారా ఉగ్ర వ్యూహానికి ఎన్ఐఏ చెక్ పెట్టింది. పరిజ్ఞానం అందించిందెవరు..? ఉగ్ర అనుమానితులకు భారీ స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎవరు అందించారనే దానిపై ఎన్ఐఏ దృష్టిసారించింది. పట్టుబడిన వారందరూ కూడా అంతగా నైపుణ్యం కలిగిన వారు కాకపోవడంతో వారికి సహకారం అందించిన వారెవరనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తోంది. ముఖ్యంగా వాట్సప్‌లోని ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా పెద్ద ఎత్తున సమాచారం మార్పిడి జరిగినట్లు కూడా అధికారులు అనుమానిస్తున్నారు. పూర్తిగా కోడింగ్ విధానం ద్వారా గత కొంత కాలంగా సిరియాలోని ఐఎస్ కీలక నేత షఫీ ఆర్మర్ తరచూ చాటింగ్ చేసినట్లు సమాచారం. ఈ చాటింగ్ సమాచారాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ అధికారులు వాటిని ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులతో కలసి అధ్యయనం చేస్తున్నారు. -
అంతు చిక్కని ‘అనంత’ టూర్!
► రెండు నెలల క్రితం అనంతపురం వెళ్లి వచ్చిన ఇద్దరు ముష్కరులు ► ఓ లాడ్జిలో ఐదు రోజుల పాటు అక్కడే మకాం ► ద్విచక్రవాహనంపై నాందేడ్ వెళ్లి తుపాకుల కొనుగోలు ► హవాలా మార్గం ద్వారా అజ్మీర్‌కు నగదు ► రంగంలోకి దిగిన ఏపీ అధికారులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో విధ్వం సానికి కుట్ర పన్నిన ఏయూటీ ముష్కరులు ఏపీకి వెళ్లడం మిస్టరీగా మారింది. ఈ ఉగ్రవాదుల్లో ఇద్దరు అనంతపురం వెళ్లి వచ్చారని తేలినా.. ఎందుకు వెళ్లారన్నది అంతు చిక్కట్లేదని నిఘా వర్గాలు చెబుతున్నాయి. మాడ్యుల్ చీఫ్ ఇబ్రహీం యజ్దానీ ఆదేశాల మేరకు ఇద్దరు ముష్కరులు 2 నెలల క్రితం అనంతపురం వెళ్లి అక్కడ ఓ లాడ్జిలో 5రోజులు బసచేసి వచ్చారు. ఆన్లైన్ ద్వారా తనను సంప్రదించిన షఫీ ఆర్మర్ ఇద్దరు వ్యక్తుల్ని అనంతపురం పంపాలని, తదుపరి విషయం మళ్లీ చెప్తానని స్పష్టం చేసినట్లు ఇబ్రహీం విచారణలో బయటపెట్టాడు. అతడు చెప్పిన ప్రకారం ఇద్దర్నీ పంపానని, ఐదు రోజుల తర్వాత మళ్లీ తనను ఆన్లైన్లోనే సంప్రదించిన ఆర్మర్ వారిని వెనక్కు పిలవాల్సిందిగా ఆదేశించడంతో అలా చేశానని చెప్పుకొచ్చాడు. అనంతపురంలో దాగి ఉన్న రహస్యం కేవలం ఆర్మర్‌కు మాత్రమే తెలుసని ఎన్ఐఏ అధికారులకు చెప్పాడు. ద్విచక్ర వాహనంపై వెళ్లి.. ఈ ముఠాకు చెందిన ముష్కరులు రెండు కంట్రీమేడ్ సెమీ ఆటోమేటిక్ పిస్టల్స్, తూటాలను మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి కొనుగోలు చేశారు. ఇందుకు ఫహద్‌తో పాటు మరో ఉగ్రవాది హైదరాబాద్ నుంచి దాదాపు 280 కి.మీ. దూరంలో ఉన్న నాందేడ్‌కు ద్విచక్ర వాహనంపై వెళ్లారు. తుపాకులు, తూటాలు తీసుకుని ద్విచక్ర వాహనం పైనే తిరిగి వచ్చారు. మరోవైపు ఇబ్రహీం ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న రూ.15 లక్షల్ని షఫీ ఆర్మర్.. దుబాయ్‌లో ఉన్న యూసుఫ్ లేదా మరో సానుభూతిపరుడి ద్వారా హవాలా మార్గంలో పంపాడని ఎన్ఐఏ అనుమానిస్తోంది. ఈ మాడ్యూల్‌కు చెందిన ఓ ముష్కరుడు గతనెలలో రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు వెళ్లి వచ్చినట్లు సాంకేతిక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో అక్కడి హవాలా ఏజెంట్ ద్వారా ఈ నగదు అందినట్లు ఎన్ఐఏ అంచనా వేస్తోంది. ముష్కరుల్ని కస్టడీలోకి తీసుకున్న తర్వాత అనంతపురం టూర్‌తో పాటు అజ్మీర్ అంశాలను ఖరారు చేసుకోవడంతో పాటు నాందేడ్‌లో ఆయుధాలు విక్రయించిన వ్యక్తిని గుర్తించడానికి వారికి ఆయా ప్రాంతాలకు తీసుకువెళ్లాలని అధికారులు నిర్ణయించారు. పేలుడు పదార్థాలు అందించడానికేనా? ఈ ముష్కరుల్ని ఆర్మర్ అనంతపురం పంపిం చింది పేలుడు పదార్థాలు అందించడానికా? అనే అనుమానాన్ని నిఘా వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్‌లో 2007, 2013ల్లో పేలుళ్లకు పాల్పడిన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ముష్కరులకు... పేలుడు పదార్థం అమ్మోనియం నైట్రేట్ కర్ణాటకలోని మంగుళూరు నుంచే అందింది. ఏయూటీ చీఫ్ షఫీ ఆర్మర్‌కు ఐఎం క్యాడర్‌తో సంబంధాలు ఉండ టం, అతడిదీ కర్ణాటకలోని భత్కల్ ప్రాంతం కావడంతో పేలుడు పదార్థాల ‘మార్పిడి’ కోసమే అనంతపురాన్ని ఎంచుకున్నట్లు అనుమానిస్తున్నారు. అక్కడకు కర్ణాకటకు చెందిన వ్యక్తి ద్వారా ఎక్స్‌ప్లోజివ్స్ పంపాలని భావించి ఉంటాడని, అయితే చివరి నిమిషంలో అది విరమించుకుని ఉంటాడని విశ్లేషిస్తున్నారు. రంగంలోకి ఏపీ టీమ్స్ ఏయూటీ మాడ్యుల్ అనంతపురంలో బస చేసిన విషయం తెలిసిన ఆంధ్రప్రదేశ్ నిఘా వర్గాలు ఉలిక్కిపడ్డాయి. పూర్వాపరాలు పరిశీలించేందుకు రంగంలోకి దిగాయి. గడిచిన ఏడాది కాలంలో ఉగ్రవాదులు అనంతపురం ప్రాంతాన్ని డెన్‌గా వినియోగించుకున్నట్లు బయటపడటం ఇది రెండోసారి కావడంతో ఆ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గత ఏడాది ఏప్రిల్‌లో సూర్యాపేట సమీపంలోని జానకీపురంలో జరిగిన ఎన్కౌంటర్లో సిమికి చెందిన అస్లం, ఎజాజ్ మరణించారు. ఇదే మాడ్యుల్‌కు చెందిన అంజద్, మహబూబ్, సాలఖ్, జకీర్‌లను ఒడిశా పోలీసులు రెండు నెలల క్రితం అరెస్టు చేశారు. వీరి విచారణలోనూ అనంతపురం కోణం వెలుగులోకి వచ్చింది. తాము ఆ పట్టణంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివసించామని చెప్పారు. ఇప్పుడు ఏయూటీ హైదరాబాద్ మాడ్యూల్ సైతం అనంతపురం వెళ్లి వచ్చినట్లు బయటపడటంతో ఏపీ నిఘా వర్గాలు అప్రతమత్తమయ్యాయ. ముష్కరులకు ఎవరైనా స్థానిక సానుభూతిపరులు ఉన్నారా? అనే కోణంలో ఆరా తీస్తున్నాయి. -
చిక్కుల్లో యూపీ సర్కారు
మథుర: మథురలోని జవహర్ బాగ్ లో జరిగిన అల్లర్లలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం చిక్కుల్లో పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆందోళన కారుల దగ్గర భారీ ఎత్తున ఆయుధాలు ఉన్నాయని ప్రభుత్వానికి ఇంటలీజెన్స్ వర్గాలు 40 నివేదికలు సమర్సించాయని, వాటిని బుట్టదాఖలు చేసిన ఫలితమే 29 మంది మృతికి కారణమైందని తెలుస్తోంది. ఆక్రమణదారులను కాలీ చేయించడానికి వెళ్లిన పోలీసులకు అదనపు బలగాలను సైతం కేటాయించలేదు.ఆందోళన కారుల దగ్గర ఆయుధాలు ఉన్నట్టు, వారు ఆయుధ శిక్షణనను ఇస్తున్నవిషయాన్ని నిఘా వర్గాలు ఫోటోలు,వీడియోలతో సహా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈహెచ్చరికల్ని ప్రభుత్వం తేలికగా తీసుకున్న ఫలితమే ఇద్దరు పోలీసులతో సహా 29 మంది మృతికి కారణ మని సమాచారం. కాగా జవహరబాగ్ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ డిమాండ్ చేశారు. -
భూముల స్వాహాపై ప్రజాగ్రహం
తీవ్ర కలకలం సృష్టించిన ‘సాక్షి’ కథనం సాక్షి, విజయవాడ: సదావర్తి సత్రం భూముల దోపిడీపై రాష్ట్ర ప్రజానీకం భగ్గుమన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సత్రం ఆస్తులను కొల్లగొట్టడం దారుణమని టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రూ.1,000 కోట్ల విలువైన భూములను వేలంపాట పేరిట రూ.22.44 కోట్లకే కాజేయడంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ‘అమరావతి సదావర్తి సత్రంలో వెయ్యి కోట్లు లూటీ’ శీర్షికతో శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం కలకలం సృష్టించింది. టీడీపీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ పక్కా స్కెచ్‌తో సాగించిన అడ్డగోలు భూదోపిడీపై వివిధ రాజకీయ పక్షాలు, ధార్మిక సంస్థలు, బ్రాహ్మణ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మరోవైపు ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. దీనిపై రహస్యంగా విచారణ జరుపుతున్నారు. రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడి వారసుడు, సదావర్తి సత్రం చైర్మన్ రాజా వాసిరెడ్డి సుధాస్వరూప్ ‘సాక్షి’ కథనంపై స్పందించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దాతలు మంచి ఉద్దేశంతో ఇచ్చిన దేవస్థానం భూములను స్వాహా చేయడం దారుణమనీ, ఇది హిందూ మతానికి ద్రోహం చేయడమేననీ అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య ముఖ్య సలహాదరాఉ కోటా శంకర శర్మ అన్నారు. సదావర్తి సత్రం భూముల దోపిడీపై విచారణ జరిపించాలని కోరారు. ఆ భూములను అమరావతి దేవస్థానానికి తిరిగి అప్పగించేవరకూ పోరాటం చేస్తామన్నారు. -
12 మంది 'ఉగ్ర' అనుమానితుల అరెస్ట్
ఢిల్లీ: 12 మంది ఉగ్ర అనుమానితులను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి జైషే ఈ మొహమ్మద్ తీవ్రవాద గ్రూపుతో సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటలీజెన్స్ సమాచారం రావడంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు రంగంలోకి దిగారు. ఢిల్లీ వెలుపల, నైరుతి ఢిల్లీలో జరిపిన ఈ దాడుల్లో మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరి దగ్గర నుంచి బాంబు తయారు చేసే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. -
తిరుమల కొండకు ఇనుప కంచె
పూర్తయిన ఔటర్ సెక్యూరిటీ కార్డన్ తొలిదశ పనులు సాక్షి, తిరుమల: తిరుమల భద్రత కోసం శేషాచలం అడవి నుంచి శ్రీవారి కొండకు వచ్చే మార్గాలను కలుపుతూ టీటీడీ ఇనుప కంచె నిర్మించింది. ఔటర్ సెక్యూరిటీ కార్డన్ (ఇనుప కంచెతో రక్షణ గోడలా ఏర్పాటు)లో భాగంగా ఇనుప కంచె నిర్మాణం చేపట్టింది. తిరుమలకు ఉగ్రవాదుల ముప్పు ఉందని దశాబ్ద కాలం ముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిఘా వర్గాల హెచ్చరికలున్నాయి. ఆ మేరకు భద్రతాపరమైన సిఫారసుతో ఆలయం చుట్టూ ఉండే అటవీప్రాంతాలను కలుపుతూ ఇనుప కంచె నిర్మించాలని నిర్ణయించింది. టీటీడీ ధర్మకర్తల మండలి కూడా మూడేళ్ల క్రితం ఆమోద ముద్రవేసింది. ఇందులో భాగంగా మొత్తం 12 కిలోమీటర్ల మేర ఇనుప కంచె నిర్మాణం పనులు 2014లో పారంభమయ్యాయి. తొలిదశ పనుల్లో భాగంగా టీటీడీ అధికారులు తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే దారిలో 57 మలుపు వద్ద నుంచి ఉత్తర దిశలోని గోగర్భం డ్యాం వరకు మొత్తం 4.8 కిలోమీటర్ల మేర ఇనుప కంచె నిర్మాణం పనులు మొదలుపెట్టారు. ఆ మేరకు తిరుమలలో స్థానికులు నివాసం ఉండే బాలాజీనగర్ దిగువ భాగం వరకు పనులు పూర్తయ్యాయి. 2.8 కిలోమీటర్ల మేర రెండో దశ ఇనుపకంచె నిర్మాణానికి టీటీడీ ధర్మకర్తల మండలి అంగీకారం తెలిపింది. ఆ మేరకు తిరుమలలోని పాచికాల్వ గంగమ్మగుడి మీదుగా గోగర్భం డ్యాం ఎగువన ఉండే రోడ్డుమార్గం వరకు కంచె నిర్మించనున్నారు. కంచెవల్ల ఉపయోగాలు... ► తిరుమల చుట్టూ పటిష్టమైన ఇనుప కంచె నిర్మాణం పూర్తయితే చెక్‌పోస్టులనుంచి మినహా లోనికి వచ్చే అవకాశాలు తక్కువ. ► పూర్తిస్థాయిలో కంచె నిర్మిస్తే క్రూరమృగాల బారినుంచి భక్తులకు రక్షణ కల్పించే అవకాశం ఉంది. ► శ్రీగంధం, ఎర్రచందనం, ఇతర ఔషధాల మొక్కల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయవచ్చు. ► కంచెకు సీసీ కెమెరాలు అమర్చితే అన్ని విధాలుగా భద్రతను పర్యవేక్షించే వ్యవస్థ పెరుగుతుంది. ► ఇనుప కంచె నిర్మాణం అనంతరం కంచె వెంబడి వాహన పెట్రోలింగ్ ట్రాక్ కూడా నిర్మించాలనే ప్రతిపాదన కూడా ఉంది. వాహన పెట్రోలింగ్‌తో మరింత భద్రత పెరుగుతుంది. -
టీడీపీకి చుక్కెదురు
►కార్పొరేషన్ ఎన్నికల నాడిపై సర్వే ► 36 వార్డుల్లో నిఘా బృందాల పరిశీలన ► వైఎస్సార్సీపీకే అనుకూలం ► ప్రభుత్వానికి సర్వే తొలి నివేదిక ► కొనసాగుతున్న మలి సర్వే ఇప్పటికిప్పుడు నగరపాలక సంస్థ ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఆధిక్యం వస్తుంది? ఈ ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో జరుగుతాయా? పరోక్ష పద్ధతిలో నిర్వహిస్తారా? ఎవరికి ప్రాతినిధ్యం వెళ్తుంది? ఏఏ వార్డుల్లో ఎవరి హవా ఉంది? అధికార తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలు ఎలా ఉన్నారు? ప్రతిపక్ష పార్టీ సభ్యులు ప్రజల తరఫున పోరాడే పరిస్థితిలో ఉన్నారా? ఈ అంశాలపై నిఘా బృందాలు సర్వే చేపట్టాయి. హైదరాబాద్‌లోని అదనపు డీజీపీ ఆదేశాల మేరకు శ్రీకాకుళం నగరంలో పరిస్థితిపై ఆరా తీస్తున్నాయి. ఇప్పటికే తొలి నివేదిక ప్రభుత్వానికి అందజేసిన సిబ్బంది రెండో దశ సర్వేకు సిద్ధమయ్యారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : రానున్న ఎన్నికల్ని ప్రభుత్వం ప్రత్యక్ష పద్ధతిలో జరుపుతుందా. పరోక్ష పద్ధతి వైపే మొగ్గు చూపుతుందా? యువత ఏం కోరుకుంటోంది. మహిళలు ఏం అంటున్నారు, పింఛన్‌దారులు ఏం చెబుతున్నారు, సామాజికవర్గాల విశ్లేషణ ఎలా ఉందన్న అంశాలతో ఇంటెలిజెన్స్ విభాగం ఆరా తీస్తోంది. ఇప్పుడున్న 36 వార్డుల్లోనే ఎన్నికలు జరిపిస్తారా? మునిసిపాలిటీ కార్పొరేట్‌గా రూపాంతరం చెందిన నేపథ్యంలో డివిజన్ల సంఖ్య పెంచి ఎన్నికలు నిర్వహిస్తారా అన్న కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. రెండు నెలల క్రితం వార్డుల వారీ జరిపిన సర్వే ఆధారంగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన అధికారులు, సిబ్బంది బృందం, తాజా గా రెండో నివేదిక సిద్ధంచేసి ప్రభుత్వానికి పంపించే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిసింది. తొలి సర్వే టీడీపీకే కాస్త అనుకూలంగా ఉన్నప్పటికీ మారుతున్న పరిస్థితులు వైఎస్సార్సీపీకే పూర్తి మెజార్టీతెచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రభుత్వం తీరు పట్ల నిర్వేదంలో ఉన్న జనం ప్రతిపక్ష వైఎస్సార్సీపీకే మొగ్గుచూపిస్తున్నారు. ఇసుకలో భారీగా సొమ్ములు వెనకేసుకున్న టీడీపీ తమ్ముళ్లపై జనం గుర్రుగా ఉన్నారు. టీడీపీ అధికారం చేపట్టి రెండేళ్లవుతున్నా ఇప్పటికీ ఒక్క ఇల్లూ ఇవ్వలేకపోయింది. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన అధికారులు అధికార పార్టీ ఒత్తిళ్లతో పనిచేస్తున్నారు. వృద్ధుల్ని ఇబ్బంది పెడుతున్నారు. తమ వారికే సంక్షేమ ఫలాల్ని అందిస్తున్నారు. నగరంలో 36వార్డులదీ అదే పరిస్థితి. కేసీఆర్ వ్యూహంతోనే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి వ్యూహాత్వకంగా వ్యవహరించి, సర్వే ఫలితాల్ని ముందే తెప్పించుకుని ఎన్నికలకు వెళ్లింది. జనం భావాల్ని అర్థం చేసుకుని దూసుకుపోయి మేయర్ పీఠం దక్కించుకుంది. అదే వ్యూహాన్ని కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో వ్యవహరించి ఫలితాలు తెచ్చుకునేందుకు టీడీపీ ఆరాటపడుతున్నట్టు తెలిసింది. దీంతో సర్వే చేయాలంటూ పోలీసుశాఖ ద్వారా వివరాలు రప్పించుకుంటున్నట్టు సమాచారం. ఓటర్ల మనోభావాలు ఏ రోజుకారోజు మారిపోతున్నాయి. టీడీపీ పట్ల జనం పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. ఎవరూ సంక్షేమ ఫలాల్ని అందుకోలేకపోతున్నారు. ఇదే విషయాలపై నిఘా బృందాలు ఆరా తీస్తే వైఎస్సార్సీపీకే మెజార్టీ ఇచ్చేందుకు ఓటర్లు సిద్ధమయ్యారని తేలింది. వార్డుల్లో ఇదీ పరిస్థితి నగరంలో బీజేపీ, కాంగ్రెస్‌లకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మెజార్టీ లభించే అవకాశాల్లేవని నిఘా బృందాలు తేల్చాయి. టీడీపీ పట్ల కేవలం 17వార్డులకే ప్రజలు మొగ్గు చూప్తున్నారని, మిగతా 19వార్డులూ వైఎస్సార్సీపీయే కైవసం చేసుకోవడంతో పాటు మేయర్ ఫీఠం దక్కించుకుంటుందని వెల్లడైంది. ఎన్నికలు సమీపిస్తున్న కొలదీ వైఎస్సార్సీపీకి మరింత మెజార్టీ వస్తుందని, టీడీపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలే వైఎస్సార్సీపీకి దగ్గర చేస్తుందని నిఘా బృందాలు తేల్చినట్టు తెలిసింది. వార్డుల్లో 1, 2, 4, 7, 9, 11, 12, 14, 16, 21, 22, 24, 25, 26, 27 వార్డుల్లో దాదాపు వైఎస్సార్సీపీనే ఖరారు చేసేసింది. రిజర్వేషన్ల ప్రతిపాదిక, అభ్యర్థుల గుర్తింపు వంటి అంశాల్ని వైఎస్సార్సీపీ గుర్తిస్తే మిగతా వార్డుల్లోనూ సునాయాసంగా విజయం సాధిస్తుందని నివేదికలో పొందుపర్చినట్టు సమాచారం. -
నక్సల్స్ ప్రభావిత జిల్లాలకు కేంద్ర నిధులు
♦ రహదారుల అభివృద్ధి కోసం రూ.1200 కోట్లు విడుదల ♦ నాలుగు జిల్లాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నక్సల్ ప్రభావిత జిల్లాల్లో రోడ్ల నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించింది. మావోయి స్టు ప్రభావిత జిల్లాల్లోని మారుమూల ప్రాం తాల్లో రోడ్ల విస్తరణకు రూ.1290 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి శనివారం సమాచారం అందింది. కేంద్ర నిధుల ద్వారా సుమారు 1000 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఖమ్మం, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలో కేంద్ర నిధుల ద్వారా నిర్మించాలని యోచిస్తోంది. అంతర్గత భద్రతపై కేంద్రం దృష్టి దేశ అంతర్గత భద్రతపై కేంద్రం ప్రత్యేక శ్రద్ధ సారించింది. ముఖ్యంగా వామపక్ష తీవ్రవాద ఉద్యమ జాడలున్న ప్రాంతాల్లో భారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను నివేదికలు కోరింది. తెలంగాణలో నాలుగు జిల్లాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇటీవల ఖమ్మం, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లో వామపక్ష తీవ్రవాద ఉద్యమ జాడలు ఉన్నాయని నివేదికలు అందించాయి. కొన్ని చోట్ల కొత్తగా రిక్రూట్మెంట్లు జరుగుతున్నట్లు సమాచారం అందింది. దీంతో వాటిని నిలువరించేందుకు భారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. అటవీ ప్రాంతాల సమీపంలో ఉండే గ్రామాలను దగ్గర్లోని పట్టణ ప్రాంతాలతో అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. మారుమూల ప్రాంతాల్లో సుమారు 1,800 కిలోమీటర్ల రోడ్ల విస్తరణకు రూ.2,700 కోట్ల ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రానికి పంపింది. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ఉపరితల రవాణా శాఖ రూ.1290 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధుల్లో దాదాపు రూ.250 కోట్ల ను బ్రిడ్జీలు, కల్వర్టుల నిర్మాణానికి వినియోగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. -
త్రీస్టార్ ఎవరిదో..?
జిల్లాలో సర్కిల్ ఇన్స్పెక్టర్ల వ్యవహార శైలిపై ఉన్నతాధికారులు నిఘా పెట్టారా? వారి దిన చర్య, కదలికలపై ఎప్పుటికప్పుడు ఆరా తీస్తున్నారా? కొందరు సీఐలు అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారి పోలీస్ స్టేషన్లను రచ్చబండల్లా మార్చేశారా? వారి వల్లే సీఐలకు చెడ్డపేరు వస్తోందా? దీనిపై ఇంటలిజెన్స్ వర్గాలు లోతుగా దర్యాప్తు చేసి, సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపారా అంటే అవుననే సమాధానం వస్తోంది. జిల్లాలో సీఐల భారీ బదిలీలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆదాయం తెచ్చిపెట్టే సర్కిళ్లలో పోస్టింగ్ కోసం కొందరు సీఐలు అధికార పార్టీ నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారనే సమాచారం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. - అనంతపురం క్రైం జిల్లాలో భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీలకు రంగం సిద్ధం ♦ సీఐల పని తీరుపై ఉన్నతాధికారుల ప్రత్యేక దృష్టి ♦ సీఐల వ్యవహార శైలిపై ప్రభుత్వానికి నివేదించిన ఇంటలిజెన్స్ విభాగం ♦ అధికార పార్టీ ప్రజాప్రతినిధుల చుట్టూ సీఐల ప్రదక్షిణలు ♦ ఆదాయ సర్కిళ్లలో స్థానం కోసం ప్రయత్నాలు జిల్లాలో ఏ పోలీస్ సర్కిల్ గానీ, ఏ పోలీస్ స్టేషన్లో చూ సినా ఇప్పుడు ఒకటే చర్చ. మన సీఐకి బదిలీ తప్పదం టా అంటూ. అయ్యపై అనేక ఫిర్యాదులు ఉన్నాయం ట.. ఆయనపై బదిలీ వేటు పడుతుందంట.. కొత్త సీఐ ఎవరొస్తారో ఏమో?నంటూ ఏ ఇద్దరు ఖాకీలు కలిసినా ఒకటే ఇదే అంశంపై మాట్లాడుతున్నారు. జిల్లా వ్యాప్తం గా 35 మంది సీఐలపై బదిలీ జాబితా సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే పలు కేసుల్లో పంచాయితీలు నిర్వహిస్తున్నట్లు వచ్చిన ఆరోపణల ఆధారంగా వీరిపై బదిలీ వేటు పడనుందని తెలుస్తోంది. కొందరు సీఐలు తాము బదిలీ కాకుండా ఉన్న చోటే కొనసాగేలా హైదరాబాద్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సీఐల దినచర్యపై నిఘా సీఐలు కొందరు ఇప్పటికే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారి దిన చర్యపై శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. బదిలీలు కాస్త ఆలస్యమైనా భారీ స్థాయిలో బదిలీలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ ప్రజాప్రతినిధులు తమ పరిధిలోని సీఐలను వాడుకుంటూ పోలీస్ స్టేషన్లను పంచాయితీలకు అడ్డాగా మార్చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇప్పటికే అనంతపురం సహా జిల్లాలోని పలువురు సీఐలపై పూర్తి స్థాయి నివేదికను ఇంటలిజెన్స్ విభాగం ప్రభుత్వానికి నివేదించినట్లు తెలుస్తోంది. కొందరు సీఐల ప్రవర్తనతో పోలీసు ఉన్నతాధికారులకు చెడ్డపేరు రాగా, అటువంటి వారిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చర్చ సాగుతోంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కొందరు సీఐలను పూర్తిగా తమ గుప్పెట్లో పెట్టుకొని పోలీస్ వ్యవస్థకే మచ్చ తీసుకురావడాన్ని పోలీస్ ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించినట్లు తెలిసింది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మెప్పుకోసం.. వారి ఆశీస్సుల కోసం.. కొందరు సీఐలు తమ పరిధి దాటి పని చేసినట్లు ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. నివేదికలో మార్పులు ఇప్పటికే సీఐల బదిలీల జాబితా సిద్ధమైపోగా, కొందరు సీఐలు నేతల చుట్టూ ప్రదక్షిణలు చేయడంతో నివేదికలో కొంత మార్పు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి మొదటి వారంలో సీఐల బదిలీలు ఉంటాయని బాగా చర్చ జరిగినా, కొన్ని కారణాలతో ఈ నెలాఖరులో గానీ, లేదా మార్చి మొదటి వారంలో గానీ బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. -
ఇంటెలిజెన్స్ పోలీసులకు సర్కారు కానుక
25 శాతం అదనపు అలవెన్స్ ఇవ్వాలని ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం మరో కానుక ప్రకటించింది. ఇంటెలిజెన్స్‌లో పనిచేసే పోలీసులు, నేర విచారణ విభాగం (సీఐడీ)లో పనిచేసే సిబ్బందికి మూలవేతనంతో పాటు 25 శాతం అదనపు అలవెన్స్‌ను ప్రకటించింది. ఈ మేరకు హోం శాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేది గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఎస్ఐబీలో పనిచేసే వారికి 50 శాతం అదనపు అలవెన్స్, సీఎస్ఎల్, అక్టోపస్లలో పనిచేసే వారికి 60 శాతం, ఏసీబీలో పనిచేసే వారికి 30 శాతం అదనపు అలవెన్స్ ఇస్తున్నారు. ఇక నుంచి ఇంటెలిజెన్స్, సీఐడీలలో పనిచేసే వారికీ అదనపు అలవెన్స్ లభించనుంది. -
ఐసిస్‌లో మరో నలుగురు రాష్ట్రవాసులు!
సాక్షి, హైదరాబాద్: ఐసిస్ అనుబంధ సంస్థ జునూద్ అల్ ఖలీఫా ఏ హింద్ సభ్యులనే ఆరోపణలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అరెస్టు చేసిన నలుగురు నగరవాసుల విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. శుక్ర, శనివారాల్లో పట్టుబడిన నఫీజ్ ఖాన్, ఒబేదుల్లా ఖాన్, మహ్మద్ షరీఫ్ మొహియుద్దీన్, అబు అన్స్‌లను ఢిల్లీ ఎన్ఐఏ అధికారులు కోర్టు అనుమతితో మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురితో సన్నిహిత సంబంధాలు కలిగి నట్లు అనుమానిస్తున్న మరో ఇద్దరు హైదరాబాదీలు ఫయాజ్, అర్ఫాన్ ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. వీరిద్దరూ జపాన్ మీదుగా సిరియా వెళ్లేందుకు వీసాలు సైతం తీసుకున్నారని అధికారులు అంటున్నారు. ఆ దేశ కాన్సులేట్‌తో పాటు పాస్‌పోర్ట్ కార్యాలయం నుంచి వివరాలు సేకరిస్తున్న అధికారులు వీరి కోసం వేట ముమ్మరం చేశారు. మరోపక్క తెలంగాణకు చెందిన నలుగురు ఇప్పటికే సిరియా చేరుకున్నట్లు ‘ఆ నలుగురూ’ వెల్లడించారు. అర్షద్ అలీ అనే యువకుడు 4 నెలల క్రితం సింగపూర్‌కు వెళ్లాడని, అక్కడ నుంచి అక్రమంగా సిరియా చేరుకున్నట్లు స్పష్టం చేశారు. దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్న ఖాదిర్ అనే యువకుడూ రెండు నెలల క్రితం సిరియాకు వెళ్లిపోయినట్లు బయటపెట్టారు. ఆన్లైన్, సోషల్‌మీడియా ద్వారా వీరు తమతో సంప్రదింపులు జరిపేవారని నఫీజ్ అంగీకరించినట్లు తెలిసింది. మరో ఇద్దరు నగరవాసులు కూడా సిరియాకు చేరుకున్నట్లు తమకు తెలుసని ‘ఆ నలుగురు’ నిందితులు వెల్లడించడంతో వారి వివరాలు ఆరా తీయడంపై నిఘా, పోలీసు వర్గాలు దృష్టి పెట్టాయి. -
హైదరాబాద్‌లో మరో ఐసిస్ సానుభూతిపరుడు అరెస్ట్
రేపు ఎన్ఐఏకు అప్పగించే అవకాశం హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మంగళవారం మరో ఐసిస్ సానుభూతిపరుడు అరెస్ట్ అయ్యాడు. గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే) వేడుకలను లక్ష్యంగా చేసుకుని కుట్రలు చేస్తున్న ఐసిస్ సానుభూతిపరుల ప్రయత్నాలపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో ఐసిస్ సానుభూతిపరుడుని అదుపులోకి తీసుకుని కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు విచారిస్తున్నారు. అతడి పేరును అధికారులు వెల్లడించలేదు. రేపు(బుధవారం) ఎన్ఐఏ అధికారులకు ఐసిస్ సానుభూతిపరుడిని అప్పగించే అవకాశం ఉంది. అయితే తమకు ఎలాంటి సమాచారం లేదని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో గత శుక్రవారం నలుగురు ఐసిస్ సానుభూతిపరులను ఎన్ఐఏ అధికారులు తమ అధీనంలోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా, దేశవ్యాప్తంగా మొత్తం 14 మంది ఐసిస్ సానుభూతిపరులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రిపబ్లిక్ డే వేడుకలను లక్ష్యంగా చేసుకొని కుట్రలు చేస్తున్న వీరి ప్రయత్నాలను పోలీసులు భగ్నం చేశారు. -
మరో ఐదుగురు ‘ఐసిస్’ సానుభూతిపరులు!
వేట ముమ్మరం చేసిన పోలీసు, ఇంటెలిజెన్స్ విభాగాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) సానుభూతిపరుల కోసం వేట కొనసాగుతోంది. హైదరాబాద్‌లో నాలుగు రోజుల క్రితం జునూద్-అల్-ఖలీఫా-ఏ-హింద్ సంస్థకు చెందిన నలుగురిని జాతీయ దర్యాప్తు బృందం(ఎన్ఐఏ) అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. పీటీ వారెంట్ మీద తీసుకెళ్లిన నలుగురు ఉగ్ర సానుభూతిపరులైన మహ్మద్ నఫీస్ ఖాన్, షరీఫ్ మొయినుద్దీన్, మహ్మద్ ఒబేదుల్లాఖాన్, అబు అన్స్‌లను ఎన్ఐఏ అధికారులు విచారించగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. నగరంలో ఐసిస్ సానుభూతిపరులు ఐదుగురు ఉన్నట్టు విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు సిరియా వెళ్లిపోయారనీ వీరు బయటపెట్టారు. జునూద్ అధినేత మునబిర్ ముస్తాఖ్ ఆదేశాల మేరకు నగరంలోని పలు ప్రాంతాల్లో విధ్వంసానికి ప్రణాళికలు రచించినట్లు అధికారులు గుర్తించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పేలుళ్లు జరపడానికి పలు ప్రాంతాల్లో రెక్కీ సైతం నిర్వహించారు. అయితే ఎన్ఐఏ దాడులతో వారి కుట్ర భగ్నమైంది. అయితే తప్పించుకుని తిరుగుతున్న మిగతా వారిని అదుపులోకి తీసుకోవడానికి నిఘా బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. కేంద్ర నిఘా వర్గాల నుంచి రాష్ట్ర నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు సమాచారం అందుకుంటున్నాయి. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అనుమానిత ప్రాంతాలపై గట్టి నిఘా ఉంచాయి. ఉగ్ర సానుభూతిపరుల కదలికలను కనిపెట్టేందుకు కౌంటర్ ఇంటెలిజెన్స్, క్విక్ రెస్పాన్స్ టీంలు 24 గంటలూ దృష్టిసారించాయి. ఉగ్ర చర్యలన్నీ సోషల్‌మీడియా, పలు వెబ్సైట్ల ద్వారా విస్తృతమవుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అందుకు అనుగుణంగా ఐసిస్ సానుభూతిపరమైన వెబ్సైట్లను నియంత్రిస్తున్నాయి. తాజాగా దేశంలో 94 వెబ్సైట్లను బ్లాక్ చేసినట్లు మహారాష్ట్ర ఏటీఎస్ ప్రకటించింది. హైదరాబాద్‌లో కూడా ఐసిస్ సానుభూతిపరులు విస్తృతంగా బయటపడుతుండటంతో కౌంటర్ ఇంటెలిజెన్స్, సైబర్ పోలీసులు గట్టి నిఘా ఉంచారు. -
వెస్ట్...టైర్ర'రెస్ట్'
* వీఐపీ జోన్లోనే టై డెన్స్ * సంచలనాలకూ కేరాఫ్ అడ్రస్ * కలిసి వస్తున్న అనేక అంశాలు * అప్రమత్తమైన నిఘా విభాగం సాక్షి, సిటీబ్యూరో: విజయవాడకు చెందిన చలసాని పండు హత్య, అనంతపురానికి చెందిన మద్దెలచెర్వు సూరి మర్డర్, పల్లంరాజు కేంద్ర మంత్రిగా ఉండగా ఆయన సమీప బంధువు హత్య... ఇవన్నీ నగరంలోని వెస్ట్‌జోన్ పరి ధిలోనే జరిగాయి. కేవలం ఈ తరహా సంచలనాలు మాత్రమే కాదు... ఉగ్రవాదులకు ఈ జోన్ ఓ డెన్‌గా మారిపోయింది. నగరంలోని తొలి సంచలనాత్మక టై ఉదంతమైన అదనపు ఎస్పీ కృష్ణప్రసాద్ హత్య నుంచి శుక్రవారం చిక్కిన నలుగురు ఐసిస్ అనుబంధ సంస్థ జుందుల్-అల్-ఖలీఫా-అల్-హింద్ ఉగ్రవాదుల అరెస్టు వరకు పరిశిలిస్తే ఇక్కడ ‘రెస్ట్’, ‘హోస్ట్’ చేసిన ఉగ్రవాదులు ఎందరో ఉన్నారు. పశ్చిమ మండలం ఈ రకంగా మారడానికి ఎన్నో కారణాలున్నాయి. తాజాగా శుక్రవారం టోలిచౌకి, మాదాపూర్ ప్రాంతాల్లో నఫీజ్ ఖాన్, ఒబేదుల్లా ఖాన్, షరీఫ్ మొయినుద్దీన్ ఖాన్, అబు అనాజ్ అరెస్టులతో అప్రమత్తమైన నిఘా, పోలీసు విభాగాలు ఈ మండలంపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. కలిసి వస్తున్న అంశాలెన్నో... నగర కమిషనరేట్ పరిధిలో ఉన్న ఐదు జోన్లలో పశ్చిమ మండలానిది ప్రత్యేక స్థానం. రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా నగర వ్యాప్తంగా ఉన్న వీఐపీల్లో 80 శాతం దీని పరిధిలోనే ఉంటారు. మరోపక్క నగరంలో ఉన్న లెసైన్డ్స్ ఆయుధాల్లో మూడోంతులు ఇక్కడే ఉన్నా యి. ఇలాంటి వీఐపీ జోన్లో ముష్కరులు తలదాచుకోవడానికీ ఉపకరించే అనేక అంశాలున్నాయి. ఖరీదైన ప్రాంతాలతో పాటు మధ్య తరగతి ప్రజలు నివసించే కాల నీలు, సామాన్యులు ఉండే బస్తీలు సైతం ఈ మండలంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏ తరహాకు చెందిన వారైనా ఇక్కడ తేలిగ్గా ఆశ్రయం పొందే అవకాశం ఉంటోం ది. దీన్ని ఆసరాగా చేసుకున్న ముష్కరులు ‘రెస్ట్’, ‘హోస్ట్’ కోసం ఈ మండలాన్ని వాడుతున్నారు. విద్య, ఉద్యోగ కారణాలు చూపిస్తూ... పశ్చిమ మండల పరిధిలో విద్యాకేంద్రాలు సైతం ఉంటున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో సాఫ్ట్వేర్ సంబంధిత వ్యాపార, ఉద్యోగ సంస్థలు ఎన్నో ఉన్నాయి. వీటికితోడు అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్ తదితర ప్రాంతా లు విద్యా సంస్థలకు పెట్టింది పేరు. అకడమిక్ విద్యతో పాటు సాంకేతిక విద్యనూ బోధించే చిన్నాపెద్ద సంస్థలు అనేకం ఇక్క డ ఉన్నాయి. ఐటీ హబ్‌గా ఉన్న మాదాపూర్ ఆ చుట్టుపక్కల ప్రాంతాలున్న సైబరాబాద్ సైతం దీనికి సరిహద్దుగా ఉండటం మరో అనుకూలాంశం. వీటికీ తమకు అనుకూలంగా మార్చుకుంటున్న ముష్కరులు ఆయా సంస్థల్లో విద్యనభ్యసించడం, ఉద్యోగాలు చేయడం వంటి అంశాలతో పాటు ఆ ముసుగులోనూ తలదాచుకుంటున్నారు. వెస్ట్‌జోన్ పరిధిలో దాదాపు అన్ని రాష్ట్రాలకూ చెందిన ప్రజలు వసలవచ్చి నివసిస్తుం డటంతో ఏ ప్రాంతానికి చెందిన వారైనా ఇక్కడ జీవనం సాగించడం తేలికగా మారిపోయింది. మచ్చుకు కొన్ని ... * టోలిచౌకిలోని బృందావన్‌కాలనీలో తలదాచుకున్న ముజీబ్ మాడ్యుల్‌ను పట్టుకోవడానికి వెళ్లిన అదనపు ఎస్పీ కృష్ణప్రసాద్, ఆయన గన్మెన్లు 1992లో హత్యకు గురయ్యారు. * ఐసిస్‌తో లింకులున్నాయనే ఆరోపణలపై గతనెలలో డిపోర్టేషన్‌కు గురైన కెన్యా యువతి అమీనా నివసించింది టోలిచౌకి ప్రాంతంలోనే. * 2007లో గోకుల్‌చాట్, లుంబినీ పార్క్‌ల్లో జంట పేలుళ్లకు పాల్పడిన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు అమీర్‌పేటలోని ఓ సంస్థలో విద్యార్థులుగా ‘ముసుగు’ వేసుకున్నారు. * ఇదే ఉగ్రవాద సంస్థకు చెందిన మన్సూర్ అస్ఘర్ పీర్భాయ్, ఎజాజ్ షేక్‌లు బంజారాహిల్స్‌లోని సాఫ్ట్వేర్ సంస్థలో ట్రైనింగ్ తీసుకుని, ఆ ప్రాంతంలోనే నివసించారు. * గుజరాత్ పోలీసులకు మోస్ట్‌వాంటెడ్ అయిన గులాం జాఫర్ గులాం హుస్సేన్ ఫేక్ సుదీర్ఘకాలం హకీంపేటలోకి ఐఏఎన్ కాలనీలో టైలర్‌గా ‘అజ్ఞాతవాసం’ చేస్తూ గతేడాది చిక్కాడు. * ఐసిస్‌లో చేరేందుకు వెళ్తూ గతేడాది శంషాబాద్ విమానాశ్రయంలో చిక్కిన సల్మాన్ మొహియుద్దీన్ హబీబ్‌నగర్‌లోని బజార్‌ఘాట్‌కు చెందిన వాడు. * గతేడాది చిక్కిన ‘ఐసిస్ త్రయం’లో ఒకడైన మాజ్ హసన్ హుమాయున్‌నగర్‌కు చెందినవాడు. -
పాలమూరు పరిహారంలో.. ‘తోడేళ్ల ’ ఫలహారం!
* పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు భూపరిహారంలో భారీగా అక్రమాలు * భూమి రకం గుర్తింపు, విలువ మదింపులో రెవెన్యూ అధికారులు, దళారుల హస్తలాఘవం * రెండేసి పంటలు పండుతున్నట్లు నకిలీ రికార్డులు * రక్షిత కౌలుదారు రికార్డులను దాచి కోట్లు దండుకుంటున్న అక్రమార్కులు * అక్రమాలపై ఇంటలిజెన్స్ నిఘా సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూపరిహారం చెల్లింపులో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభం కాకముందే భూపరిహారం మదింపు, చెల్లింపులో కోట్ల రూపాయలు పక్కదారి పడుతున్నాయి. ముంపు గ్రామాల్లో ఇష్టారీతిన భూముల వర్గీకరణతో అధికారులు అడ్డగోలుగా దండుకుంటున్నారు. దళారుల అవతారమెత్తిన స్థానిక నేతలు రెవెన్యూ అధికారులతో చేతులు కలిపి... బీడు భూముల్లో రెండేసి పంటలు పండుతున్నట్లు, అసలు బోరుబావి కనెక్షనే లేనిచోట్ల పదుల ఎకరాల్లో నీరు పారుతున్నట్లు, పది అడుగులు కూడా లేని గుంతలను బోరు బావులుగా చూపిస్తూ తప్పుడు రికార్డులు సృష్టించి కోట్లు మింగేస్తున్నారు. అసలు రక్షిత కౌలుదారు చట్టం రికార్డులను దాచిపెట్టి మరీ అర్హులకు అందాల్సిన పరిహారాన్ని స్వాహా చేస్తున్నారు. ఇలా ఒక్క కర్వెన రిజర్వాయర్ ముంపు గ్రామాల్లోనే రూ. 50 కోట్లకు పైగా అక్రమాలు చోటు చేసుకున్నట్లు అంచనా. ఈ అవకతవకలను వెలుగులోకి తెచ్చేందుకు పోలీసు ఇంటెలిజెన్స్ విభా గం రంగంలోకి దిగి వివరాలను సేకరించింది. ఇప్పటికే రూ.300 కోట్ల పరిహారం చెల్లింపు పాలమూరు ప్రాజెక్టులో భాగంగా అనంతగిరి, వీరాంజనేయ, వెంకటాద్రి, కురుమూర్తిరాయ(కర్వెన), ఉద్దండాపూర్, కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్లు నిర్మించాలని ప్రతిపాదించారు. కేపీ లక్ష్మీదేవునిపల్లి మినహా మిగతా ఐదు రిజర్వాయర్ల పరిధిలో 20,884.86 ఎకరాల భూమి సేకరించాలని అధికారులు గుర్తించారు. అందులో 15,889.99 ఎకరాలు పట్టా భూమికాగా.. మిగతాది ప్రభుత్వ భూమి. పట్టాభూముల్లో ఇప్పటికే 15 వేల ఎకరాల వరకు ఇచ్చేందుకు రైతులు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన జీవో 123 ప్రకారం ఈ ప్రాజెక్టు కింద భూసేకరణ జరుగుతోంది. ఏటా రెండు పంటలు పండే భూములకు ఎకరాకు రూ. 5.5 లక్షలు, ఒక పంట పండే భూమికి రూ. 4.5 లక్షలు, బీడు భూములకు రూ. 3.5 లక్షలు చెల్లించాలని నిర్ణయించారు. ఇక చెట్లు, స్థలాలు, వ్యవసాయ బావులు ఇతర నిర్మాణాలు వంటివేమున్నా వాటికి ప్రభుత్వం నిర్ధారించిన రేట్లతో పరి హారం చెల్లిస్తారు. భూములకు పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం ఇప్పటికే రూ. 390 కోట్లు విడుదల చేయగా... అందులో రూ. 300.26 కోట్ల వరకు పరిహారం చెల్లించినట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే భూముల రకాన్ని మదింపు చేసే విషయంలో, బోరు బావులు, బోర్లను గుర్తించి వాటికి రేటు నిర్ధారణ చేయడంలో అక్రమాలు జరుగుతున్నాయి. నీళ్లు రాని బోర్లకూ పరిహారం కర్వెన రిజర్వాయర్ పరిధిలో భూత్పూర్ మండల పరిధిలోని కర్వెన, తాటిపర్తి, కొత్తూరు, ఎల్కిచర్ల గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ నాలుగింటిలో కలిపి 3,561 ఎకరాల ముంపు భూమి ఉండగా, అందులో పట్టా భూములు 3,285.5 ఎకరాలు. ఒక్కో గ్రామ పరిధికి సంబంధించి భూమిని మూడు విడతలుగా కలెక్టర్ ఆమోదానికి పంపుతున్నారు. ఇందులో కర్వెన గ్రామానికి సంబంధించి తొలి విడతలో 275 ఎకరాలను పంపగా... అందులో 80 ఎకరాలు రెండు పంటలు, 43 ఎకరాలు ఒక పంట భూములను చూపారు. రెండో విడతలో 152 ఎకరాల బీడు భూములను చూపారు. మూడో విడతలో 133 ఎకరాల వివరాలు పంపగా... అందులో 40 ఎకరాలు రెండు పంటల భూమి, 35 ఎకరాలు ఒక పంట భూమి, 59 ఎకరాలు బీడుగా చూపించారు. ఇక్కడ బీడు భూములు, ఒక పంట పండే భూములను రెండేసి పంటలు పండే భూములుగా చూపి లెక్కలు కట్టారు. ఇలా లెక్క కట్టేందుకు రెవెన్యూ అధికారులు దళారుల సహాయంతో లబ్ధిదారుల వద్ద ఎకరాకు రూ. 50వేల చొప్పున వసూలు చేసినట్లు తెలుస్తోంది. రెండు పంటల భూమిగా అర్హత ఉండాలంటే ఒక బోరు కింద మూడెకరాలు మాత్రమే ఉండాలి. కానీ కర్వెన గ్రామంలో టీఆర్ఎస్ నాయకుడికి చెందిన సర్వే నంబర్లుగా భావిస్తున్న 144, 145, 133, 156, 235, 244ల కింద మొత్తంగా 40 ఎకరాలను రెండు పంటల భూమిగా చూపారు. కానీ ఈ భూముల్లో ఒక పంట మాత్రమే ఉంటుందని తెలుస్తోంది. సర్వే నంబర్లు 169, 170, 190, 191, 192, 193లలో మొత్తంగా 70 ఎకరాల వరకు భూమి ఉండగా... ఇక్కడ 13 బోర్లు, 3 బోరుబావులు ఉన్నాయని రెవెన్యూ అధికారులు రికార్డుల్లో పేర్కొన్నారు. అయితే ఇక్కడ విద్యుత్ శాఖ రికార్డుల ప్రకారం మూడు బోరుబావులు మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వ లెక్కల ఆధారంగా చూసినా... బోరుకు 3 ఎకరాల చొప్పున 39 ఎకరాలకు మించి సాగు ఉండదు. అయినా ఈ 70 ఎకరాలనూ రెండు పంటల భూమిగా లెక్కించారు. వాస్తవానికి ఇక్కడ బోర్లకు విద్యుత్ కనెక్షన్లు లేకుండానే, అసలు బోరు వేయకుండానే నడుస్తున్నట్లుగా అధికారులు లెక్కగట్టారు. గతంలో బోర్లు వేసి నీరుపడని వాటిల్లో కూడా ఒక పైపు మాత్రం ఏర్పాటు చేసి.. బోర్లు ఉన్నట్లుగా నిర్ధారించి పరిహారం లెక్కించారు. ఇంకొన్ని చోట్ల అసలు బోరే లేకున్నా... 10 అడుగుల మేర తవ్వి అందులో పైపులు దించి బోరు ఉందన్నట్లుగా సృష్టించారు. అక్రమాలకు పరాకాష్ట కర్వెనలో సర్వే నంబర్ 246లో ఎకరా 2 గుంటల భూమి, 247లో రెండెకరాల 20 గుంటలు, 248లో రెండెకరాల ఆరు గుంటల భూమి ఉంది. ఇదంతా టీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకుడిదే. ఇందులో సర్వే నంబర్ 246లోని భూమిలో 22 గుంటలు, 247లోని రెండెకరాల 20 గుంటలు, 248లోని రెండెకరాల 3 గుంటల భూమిని దళితులకు భూపంపిణీ పథకం కోసం ఆ నాయకుడు ఎస్సీ కార్పొరేషన్‌కు అమ్మేశారు. ఈ మేరకు ఎస్సీ కార్పొరేషన్ డబ్బు చెల్లిస్తూ గెజిట్‌ను సైతం విడుదల చేసింది. ఆ భూమిని స్వాధీనం చేసుకుని.. అదే గ్రామంలోని దళితులకు పంపిణీ చేసి పాస్‌బుక్‌లు సైతం అందజేసింది. కానీ సదరు నాయకుడు పంపిణీ చేసిన ఈ భూమిపై తిరిగి పాస్‌బుక్కులు సృష్టించి, రూ. 9.88 లక్షలు పరిహారం కింద పొందారు. ఇక ఎల్కిచర్ల పరిధిలోని సర్వే నంబర్ 378లో ఎనిమిది ఎకరాలను 2 పంటల భూమిగా లెక్కించారు. ఇక్కడ ఇంటలిజెన్స్ విచారణ చేయగా... కేవలం రెండెకరాల్లో ఉల్లి సాగు చేశారని, మిగతాది బీడు భూమి అని తేలింది. ఇక సర్వే నంబర్ 373లో 11 ఎకరాలు 2 పంటల భూమిగా చూపగా... అక్కడ అసలు పంటలే లేవు. ఇలా ఇష్టారీతిన మదింపు చేస్తూ అధికారులు భూత్పూర్ మండల పరిధిలోనే సుమారు రూ. 50 కోట్ల మేర అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. భూత్పూర్ మండల పరిధిలో ఇంకా చాలానే అవకతవకలు జరిగినట్లుగా సమాచారం. -
ఢిల్లీలో జైషే ఉగ్రవాదులు!
♦ భారీ దాడులకు కుట్ర ♦ అప్రమత్తమైన పోలీసులు న్యూఢిల్లీ: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంలోకి చొరబడి దాడులకు పాల్పడిన పాకిస్తాన్‌కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు.. దేశ రాజధాని ఢిల్లీనీ లక్ష్యంగా ఎంచుకున్నారు. జైషే మొహమ్మద్‌కు చెందిన ఇద్దరు మిలిటెంట్లు ఢిల్లీలోకి చొరబడ్డారని, వీరు భారీ దాడులకు, వీఐపీలను బందీలుగా పట్టుకునేందుకు కుట్ర పన్నారని నిఘా విభాగం ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించింది. దీంతో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలంటే పౌరులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులుగానీ, వస్తువులు గానీ కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కమిషనర్ బీఎస్ బస్సీ కోరారు. నిఘా సమాచారం నేపథ్యంలో బస్సీ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటుచేశారని, మరిన్ని కేంద్ర బలగాల సహకారం కోరారని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఇద్దరు జైషే మొహమ్మద్ కీలక సభ్యులు చొరబడినట్లు సమాచారమొచ్చిందన్నారు. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లతోపాటు ఇతర ముఖ్యప్రాంతాల్లో భద్రతను పెంచారు. ఢిల్లీలోని ముఖ్యమైన మార్కెట్లు, వీఐపీలుండే లూటెన్స్ ఢిల్లీలోనూ నిఘా తీవ్రం చేశారు. శతాబ్ది రైలుకు బాంబు బెదిరింపు.. ఢిల్లీ-కాన్పూర్ మధ్య తిరిగే రైళ్లలో బాంబు పెట్టినట్లు సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘజియాబాద్ వద్ద ఆదివారం ఉదయం ఢిల్లీ-లక్నో శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను ఆపి సోదాలు చేశారు. బాంబు లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. గంటన్నరపాటు రైలును నిలిపివేయడంతో ఆ మార్గంలోని రైళ్ల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. శతాబ్ది, దురంతో, రాజధాని, వైశాలి, నీలాంచల్ ఎక్స్‌ప్రెస్‌లకు బాంబు బెదిరింపు వచ్చిందని ఢిల్లీ డివిజనల్ రైల్వే మేనేజర్ అరుణ్ ఆరోరా చెప్పారు. నగరంలోని అన్ని రైల్వేస్టేషన్లలోనూ, ఢిల్లీ-కాన్పూర్ మార్గంలో వెళ్లే అన్ని రైళ్లలోనూ సోదాలు చేశారు. -
డేంజరస్ ‘డార్క్ నెట్’
* ఉగ్రమూకలు ఎక్కువగా వినియోగిస్తున్నట్లు ఆధారాలు * ‘తమ వారికి’ మాత్రమే కనిపించేలా ఆన్లైన్లో మరో ప్రపంచం * దీని ద్వారానే సాంకేతిక నిపుణులు, విద్యావంతులకు వల * దీటుగా ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతున్న నిఘా వర్గాలు * అత్యాధునిక హ్యాకింగ్ టూల్స్ కొనుగోలుకు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఈ-మెయిల్, ఫేస్బుక్, ట్విటర్.. ఇవన్నీ ఇంటర్నెట్లో మనందరికీ కనిపించేవే. కంప్యూటర్లలో సాధారణంగా వినియోగించే విండోస్ ఆపరేటింగ్ సిస్టం, వివిధ చిరునామాలతో ఇంటర్నెట్లో ఉండే వెబ్సైట్లు, సోషల్ మీడియా అందరికీ తెలిసినవే. ఉగ్ర మూకలు వీటి ద్వారా సమాచార మార్పిడి చేసినా, సంప్రదింపులు జరిపినా నిఘా వర్గాలు గుర్తించి కుట్రలు భగ్నం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముష్కర మూకలు మరో అడుగు ముందుకేస్తున్నాయి. బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు పూర్తి స్థాయిలో పట్టులేని ‘డార్క్ నెట్’లో విస్తరిస్తున్నాయి. దీంతో ఎలాంటి నిఘాకూ చిక్కకుండా, ‘తమ వారికి’ మినహా మిగిలిన వారికి కనిపించకుండా ఉగ్రమూకలు ఆన్లైన్లో మరో ప్రపంచాన్ని వినియోగిస్తున్నాయి. దీన్నే సాంకేతికంగా ‘డీప్ వెబ్’, ‘అండర్‌గ్రౌండ్ వెబ్’, ‘డార్క్ నెట్’, ‘డార్క్ వెబ్’ అని పిలుస్తారు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారిని, విద్యాధికుల్నీ తమ వైపు ఆకర్షిస్తున్న ఇస్లామిక్ స్టేట్(ఐఎస్ఐఎస్) తరహా ఉగ్రవాద సంస్థలు ఈ నెట్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు కొన్ని ఆధారాలు సేకరించాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర పోలీసు విభాగం రూ. 1.5 కోట్లతో అత్యాధునిక హ్యాకింగ్ టూల్స్ కొనుగోలు చేసేందుకు నిర్ణయించింది. వీటితో డార్క్ నెట్‌కు చెక్ పెట్టవచ్చని అధికారులు చెప్తున్నారు. టెయిల్స్ ఆపరేషన్ సిస్టంతో.. ఏ వినియోగదారుడైనా విండోస్ ఆపరేటింగ్ సిస్టంతో ఈ డీప్ వెబ్‌లోకి చొరబడటం సాధ్యం కాదు. అందులో వెబ్సైట్లను చూడటం, యాక్సెస్ చేయడం కుదరదు. ఈ జగత్తులో అడుగు పెట్టాలంటే టెయిల్స్‌గా పిలిచే ప్రత్యేక ఆపరేటింగ్ సిస్టంను పీసీల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. దీంతో పాటే టోర్స్ అనే ఆపరేటింగ్ సిస్టం సైతం ఇన్స్టాల్ అవుతుంది. వీటిని తమ కంప్యూటర్లలో ఏర్పాటు చేసుకుంటున్న ముష్కర మూకలు యథేచ్ఛగా సమాచార మార్పిడి చేసుకుంటున్నాయన్నది నిఘా వర్గాలు గుర్తించిన అంశం. సాధారణ వెబ్సైట్లతో పాటు సోషల్ మీడియా పనిచేయడానికి వాటికి ఇంటర్నెట్లో ఏదో ఒక సర్వర్ హోస్ట్ చేయాలి. అయితే నిఘా వర్గాలు ఈ సర్వర్ అడ్రస్ ఏమిటి? అవి ఎక్కడ ఉన్నాయి? నిర్వహిస్తున్నది ఎవరు? తదితరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ‘డీప్ వెబ్’కు సంబంధించిన సర్వర్లు, వాటి చిరునామాలతో పాటు నిర్వహిస్తున్న వారి వివరాలు బయటకు తెలిసే అవకాశాలు లేకపోవడం అసాంఘిక శక్తులకు కలసి వస్తున్న అంశం. ఫలితాలిస్తున్న ‘చక్రవ్యూహ్’.. ఆన్లైన్ కేంద్రంగా యువతను ఆకర్షిస్తూ భారీ రిక్రూట్మెంట్, భావజాల ప్రచారం చేస్తున్న ఐఎస్, అల్ కాయిదా వంటి ఉగ్ర సంస్థల్ని అడ్డుకోవడానికి కేంద్రం ఆధీనంలోని నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఎన్టీఆర్వో) ‘ఆపరేషన్ చక్రవ్యూహ్’ పేరుతో సాంకేతిక నిఘాను చేపట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న ఐఎస్ సానుభూతిపరులు, భారత్‌ను వదిలి సిరియా వెళ్లాలని యత్నించిన వ్యక్తుల్ని గుర్తించి, అదుపు చేయడంలో ఇది కీలకపాత్ర పోషిస్తోంది. దేశవ్యాప్తంగా అనేక సర్వర్లు, సామాజిక మాధ్యమాల్లోని అకౌంట్లపై అనునిత్యం కన్నేసి ఉంచుతున్న ఎన్టీఆర్వో ఆయా పోలీసు, నిఘా వర్గాలకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తోంది. ఈ ఆపరేషన్‌లో ఇంటెలిజెన్స్ బ్యూరోకు చెందిన ఓ స్పెషల్ టీమ్ ఎన్టీఆర్వోతో కలసి పనిచేస్తోందని తెలిసింది. ఇటీవల దేశవ్యాప్తంగా పట్టుబడిన ఐఎస్ సానుభూతిపరులు, ఇతర ఉగ్రవాదులను గుర్తించడంతో ‘చక్రవ్యూహ్’ పాత్ర కీలకమని రాష్ట్ర నిఘా వర్గాలకు చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు. -
కాల్‌మనీ ఉపాధ్యాయుడికి పోలీసు అండ..?
ఆ అధికారి సొమ్ముతోనే వ్యాపారం ఒక చీటర్‌తో సంబంధాలు భయపడుతున్న బాధితులు విజయవాడ : కాల్‌మనీ వ్యాపారం చేస్తున్న ఉపాధ్యాయుడికి ఓ పోలీస్ అధికారి అండ పుష్కలంగా ఉన్నట్లు సమాచారం. విజయవాడలోని మురళీనగర్‌లో ఉంటూ తోట్లవలూరు మండలం భద్రిరాజుపాలెంలోని జెడ్పీ స్కూల్లో ఉపాధ్యాయుడుగా చేస్తున్నారు. గతంలో పటమటలో ఉన్న ఉపాధ్యాయుడు, ఆయన భార్య మహిళలకు మాత్రమే రుణాలు ఇస్తారని, నూటికి రూ.20 వడ్డీ వసూలు చేసేవారని తెలిసింది. ఈ ఉపాధ్యాయుడు వెనుక ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పోలీసు అధికారివ్యక్తి హస్తం ఉన్నట్లు తెలిసింది. ఆయన డబ్బునే ఇక్కడ ఉపాధ్యాయుడు కాల్‌మనీకి తిప్పుతున్నారని బాధితులు చెబుతున్నారు. గతంలో ఒక చీటర్‌తో సంబంధాలు..... తెనాలి వెళ్లే మార్గ మధ్యంలో తన కారు కాలువలో పడిపోయినట్లు నటించిన చీటర్ నార్ల వంశీతో ఈ ఉపాధ్యాయుడు, పోలీసు అధికారికి సంబంధాలు ఉన్నట్లు సమాచారం. వంశీ వద్ద పోలీసు అధికారి రూ.కోట్లు గుంజి ఉపాధ్యాయుడికి ఇచ్చారని వారి గురించి తెలిసిన వారు చెబుతున్నారు. ఆ డబ్బునే కాల్‌మనీగా తిప్పుతున్నారు. కాల్‌మనీ ముఠాకు అధికార పార్టీ నాయకుల అండదండలుండటంతో తన సొమ్మును కూడా ఈ ముఠాకు ఇచ్చి వారితో చక్కటి సంబంధాలు నడుపుతూ ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నారు. సిండికేట్‌గా ఉండటంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కూడా ధైర్యం చేయడం లేదు. ఇంటెలిజెన్స్ విభాగం విచారణతో సరి.. ఉపాధ్యాయుడు గురించి ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ చేశారే తప్ప కేసును ముందుకు తీసుకువెళ్లలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీసు, న్యాయశాఖకు చెందిన ప్రముఖులతో ఉపాధ్యాయుడుకు సంబంధాలు ఉండటమే అందుకు కారణమని అంటున్నారు. పోలీసు కమిషనర్ ఇటువంటి కేసులపై దృష్టి పెట్టాలని బాధితులు కోరుతున్నారు. -
నిలువు దోపిడీ
ఇళ్లు, స్థలాలు మంజూరు చేస్తామంటూ టీడీపీ నేతల వసూళ్ల దందా నేతల జేబుల్లోకి రూ. 60 కోట్లు సర్కార్‌కు ఇంటెలిజెన్స్ వర్గాల నివేదిక ఇళ్ల కోసం 63,470 మంది దరఖాస్తు విశాఖపట్నం: అందినంత దండుకోవడమే పనిగా పెట్టుకున్నారు అధికార పార్టీ నేతలు. వీరు ఏ అవకాశాన్ని వదలడం లేదు. పార్టీ కార్యకర్తలను ఏజెంట్లుగా పెట్టుకుని ప్రజల బలహీనతలను ఆసరాగా తీసుకుని నిలువు దోపిడీ సాగిస్తున్నారు. ఇప్పటికే రూ.60 కోట్ల వరకూ జేబుల్లోకి వెళ్లినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు సర్కార్‌కు నివేదిక ఇచ్చినట్టు సమాచారం. హౌసింగ్ ఫర్ ఆల్తో కాసుల పంట హౌసింగ్ ఫర్ ఆల్ పథకం అధికార పార్టీ నేతలకు కాసుల పంట కురిపిస్తోంది. జీవీఎంసీ పరిధిలో మంజూరు చేసిన 20,030 ఇళ్లలో సగానికిపైగా ఇళ్లను గ్రూప్ హౌసింగ్‌గా, మిగిలినవి సొంతస్థలం ఉండి ఇల్లు నిర్మించుకునేందుకు ఆసక్తిచూపే అర్హులకు మంజూరుచేయనున్నారు. ఈ నెల 12 నుంచి ప్రారంభించిన దరఖాస్తుల స్వీకరణను 31 వరకు పొడిగించారు. ఇప్పటి వరకు 75,000 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 59,485 మంది ఆధార్, రేషన్ కార్డులు సమర్పించగా, మిగిలిన వారు ఆధార్ కార్డులు మాత్రమే సమర్పించారు. అత్యధికంగా ఐదో డివిజన్ పరిధిలో 2,978 మంది దరఖాస్తు చేయగా, అత్యల్పంగా 54వ డివిజన్ పరిధిలో కేవలం 14మంది మాత్రమే దరఖాస్తు చేశారు. అనకాపల్లి పట్టణంలో 1950 మంది, భీమిలి పట్టణంలో 1635 మంది దరఖాస్తు చేశారు. వీటిలో 20 శాతం వరకు ఇళ్ల స్థలాలుండి గృహ రుణం కోసం అందినవి కాగా, మిగిలినవి వ్యక్తిగత, గ్రూప్ హౌసింగ్ దరఖాస్తులు ఉన్నాయి. చురుగ్గా వడపోత... 2004 నుంచి జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఇళ్ల స్థలం, ఇంటిరుణం మంజూరైన వారి జాబితాలతో పాటు జీవీఎంసీ, ఇతర మున్సిపాల్టీల పరిధిలో గ్రూప్‌హౌసింగ్ లబ్ధిదారుల జాబితాలను ఇప్పటికే యూసీడీకి అందజేశారు. నగర పరిధిలోని రెవెన్యూ, కొండవాలు ప్రాంతాలతో పాటు సింహాచలం దేవస్థానం, గాజువాకలో ప్రభుత్వ, ఇనాం భూముల్లో ఆక్రమణదారుల జాబితాలను కూడా యూసీడీకి అందజేశారు. ఈ జాబితాలకు వచ్చిన ప్రతీ దరఖాస్తుదారుల ఆధార్, రేషన్ కార్డు నంబర్లతో సరిపోల్చుతున్నారు. మరొక పక్క జీవీఎంసీ, వుడా, హౌసింగ్ శాఖల్లో ఉన్న హౌసింగ్ లబ్ధిదారులతో పాటు ఏపీఈపీడీసీఎల్ల్లో ఇళ్ల కనెక్షన్లతో బేరీజు వేస్తున్నారు. పూర్తిస్థాయిలో పరిశీలన గతంలో ఎప్పుడైనా సరే కుటుంబంలో ఎవరిపేరిటైనా సరే ఇంటి స్థలం, ఇంటిరుణం, గ్రూప్ హౌసింగ్ పొంది ఉంటే అటువంటి వారు హౌసింగ్ ఫర్ ఆల్‌కు అనర్హులే. ఈ లెక్కన దరఖాస్తు చేసున్న వారిలో సగానికి పైగా అనర్హుల జాబితాలో చేరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని అధికార టీడీపీ నేతలు వసూళ్లు సాగిస్తున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు రూ.100 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నారు. మరొక పక్క డబుల్ బెడ్రూమ్ హౌస్,గ్రూప్‌హౌస్..ఇళ్ల రుణం మంజూరు చేయిస్తామంటూ కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు..నేతలు తమ అనుచరుల ద్వారా రూ.10వేల నుంచి పాతిక వేల చొప్పున 30 శాతం మంది దరఖాస్తుదారుల నుంచి వసూలు చేసినట్టు తెలుస్తోంది. వసూళ్లపై నివేదిక? ఇప్పటికే వసూళ్ల దందా రూ.60 కోట్లు దాటి నట్టు ఇంటిలిజెన్స్ వర్గాలు లెక్కతేల్చినట్టు సమాచారం. ఈ మేరకు సర్కార్‌కు నివేదిక కూడా ఇచ్చినట్టు ఓ అధికారి సాక్షికి వివరించారు. ఇటీవలే అంగన్ వాడీ పోస్టుల అమ్మకాల విషయంలో కూడా ఇదే రీతిలో ఇంటిలిజెన్స్ వర్గాలు ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఎంపిక కమిటీలో ఎమ్మెల్యేలను పక్కనపెట్టడం తెలిసిందే. మరో 10 రోజులు గడువు ఉండడంతో దరఖాస్తుల సంఖ్య లక్షన్నర దాటే అవకాశాలు కన్పిస్తున్నాయి. వడపోత నంతరం జనవరి మొదటి వారంలో అర్హుల జాబితాలను ప్రకటించనున్నారు. -
హైదరాబాద్ మహిళకు ఐసిస్‌తో సంబంధాలు!
న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన మహిళకు ఉగ్రవాద సంస్థ ఐసిస్‌తో సంబంధాలున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అరెస్టయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ మొహమ్మద్ సిరాజుద్దీన్‌తో సంబంధముందని భావిస్తున్న ఆ మహిళపై నిఘా వర్గాలు దృష్టి పెట్టాయి. ‘ఆమె.. ఆన్లైన్లో ఐసిస్ సానుభూతిపరులతో నిత్యం సంభాషిస్తున్నట్లు తెలుస్తోంది. కుటుంబసభ్యుల సాయంతో ఆమెను ఆ ప్రభావం నుంచి తప్పించడానికి కృషి చేస్తున్నామని’ ఓ అధికారి ఒకరు తెలిపారు. -
సిరియాలో ఏపీ వాసి మృతి
- ఐఎస్ఐఎస్ లో చేరినట్లు నిఘా వర్గాల వెల్లడి - రేపల్లెకు చెందిన తుల్ఫిజుర్ రెహ్మాన్ మరణంపై అనేక అనుమానాలు సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు తెలంగాణకే పరిమితమైన అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ (ఐసిస్) ఛాయలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కూ విస్తరించాయా..? కువైట్‌లో ఉద్యోగం చేస్తున్న మచిలీపట్నం వాసి ఐసిస్‌లో చేరి సిరియాలో జరిగిన దాడుల్లో మరణించినట్లు వెలుగులోకి రావడంతో కేంద్ర, రాష్ట్రాల నిఘా వర్గాలు ఇదే కోణంలో దర్యాప్తు చేస్తున్నాయి. అతడు ఆన్లైన్ ద్వారా ఐసిస్‌కు ఆకర్షితుడైనట్లు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ప్రాథమిక ఆధారాలు సేకరించాయి. ఇతడి సంబంధీకులు హైదరాబాద్‌లో ఉంటున్న నేపథ్యంలో పూర్తి వివరాలు సేకరించడానికి కేంద్ర నిఘా వర్గాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం... గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన తుల్ఫిజుర్ రెహ్మాన్ మచిలీపట్నంలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. కొన్నేళ్ళ కిందట ఉద్యోగ నిమిత్తం కువైట్ వెళ్ళగా... ఇతడి కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. దాదాపు ఏడాది కాలంగా అతనికి కుటుంబంతో సంబంధాలు తెగిపోయినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఐసిస్ కార్యకలాపాలు విస్తరిస్తుండటంతో కేంద్ర నిఘా వర్గాలు నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్టీఆర్వో) సహకారంతో ఆన్‌లైన్‌పై నిఘా ఉంచుతోంది. భారత్‌లో ఉంటున్న ప్రవాస భారతీయుల్లో అనుమానాస్పదమైన వారి ఆన్లైన్, సోషల్ మీడియా కార్యకలాపాలపై నిఘా ఉంచుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్నాళ్ళ క్రితం కువైట్‌లో ఉంటున్న రెహ్మాన్ ఆన్లైన్లో ఐసిస్‌కు సంబంధించిన వెబ్సైట్లు వీక్షిస్తున్నట్లు, ఫేస్బుక్ ద్వారానూ సంప్రదింపులు జరుపుతున్నట్లు గుర్తించాయి. కొన్నాళ్ళ కిందట కువైట్‌లో ఉద్యోగం మానేసి సిరియా వెళ్ళిపోయిన రెహ్మాన్ ఐసిస్‌లో చేరినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించాయి. ఈ కోణంలో ఆరా తీస్తుండగానే సిరియాలో జరిగిన దాడుల్లో రెహ్మాన్ చనిపోయినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో ఏపీ, తెలంగాణ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను అప్రమత్తం చేశాయి. రెహ్మాన్ వ్యవహారంపై లోతుగా ఆరా తీస్తున్న వర్గాలు ఈ ఉదంతం నేపథ్యంలో మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ, ఏలూరుల్లో ఐసిస్ కార్యకలాపాలపై డేగకన్ను వేశాయి. ‘రెహ్మాన్ ఉదంతం నిరుడే జరిగినట్లు తెలుస్తోంది. గుర్తించడంలో మాత్రం ఆలస్యమైంది’ అని నిఘా విభాగ అధికారి ‘సాక్షి’తో చెప్పారు. ఇప్పటికే తెలంగాణలో ఆదిలాబాద్‌కు చెందిన ఆతిఫ్ ఐసిస్‌లో చేరి సిరియాలో చనిపోయిన విషయం తెలిసిందే. -
ఐసిస్‌లో భారతీయుల పరిస్థితి దారుణం
న్యూఢిల్లీ: ఆసియా దేశాల్లో ముఖ్యంగా భారత్‌లో పాగా వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న భయంకర ఉగ్రవాద సంస్థ ఐసిస్‌లో 23 మంది భారతీయులు చేరినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఇందులో ఆరుగురు వివిధ సందర్భాల్లో మానవబాంబులుగా, ప్రత్యర్థుల దాడుల్లో హతమయ్యారు. చనిపోయిన వారిలో అతిఫ్ వసీమ్ మహమ్మద్ (తెలంగాణ, ఆదిలాబాద్), ఉమర్ సుభాన్ (బెంగళూరు), ఫైజ్ మసూద్ (బెంగళూరు), మౌలానా సుల్తాన్ అమర్ (భత్కల్, కర్ణాటక), ఫారూఖీ టంకీ (థానే, మహారాష్ట్ర), మహమ్మద్ సజ్జద్ (ఆజంగఢ్, యూపీ) ఉన్నారు. నిఘా వివరాల ప్రకారం.. ఐసిస్ ఆర్మీలో చేరేందుకు ఆసియన్ దేశాల నుంచి వెళ్లిన వారి జీవితాలు దుర్భరంగా ఉంటాయని, కిందిస్థాయిలోనే వీరిని వాడుకుంటారని వెల్లడైంది. ఆసియా దేశాల వారిలో పోరాడేతత్వం తక్కువని , అందుకే వీరిని మానవబాంబులుగానే వినియోగించుకుంటారని తెలిసింది. ట్యునీషియా, పాలస్తీనా, సౌదీ, ఇరాక్, సిరియానుంచి వచ్చిన వారిని ఐసిస్‌లో ఉన్నత స్థానాల్లో నియమిస్తూ భారత్, పాక్, బంగ్లాదేశ్ దేశస్తులను కిందిస్థాయిలో చేర్చుకుంటున్నారు. ఇంటర్నెట్ వలవేసి చేర్చుకుంటున్న వారిలో వీరే ఎక్కువ. అసలైన ఇస్లాం వీరికి తెలియదని అవమానపరుస్తూ నీచంగా చూస్తారు. వీరిరికిచ్చే ఆయుధాలు అధునాతనమైనవి కావు. అయినా వీరిని యుద్ధానికి పంపిస్తారు. సిరియా యుద్ధంలో చనిపోతున్న వారిలో వీరే ఎక్కువ. పారిపోకుండా ఉండేందుకు వీళ్ల పాస్‌పోర్టులు కాల్చేస్తారు. భారత్, పాక్‌లలో ఉండే ముస్లింలు అసలైన ముస్లింలు కారని, ఒక్కసారి జిహాద్లో చేరిన తర్వాత పారిపోయేందుకు ప్రయత్నిస్తే.. వారిని ‘జిన్’ (దెయ్యం) వెంటాడుతుందని భయపెడుతున్నారని రిపోర్టులు వెల్లడించాయి. దీంతో ఐసిస్‌లో చేరిన వారంతా మింగలేక కక్కలేక భయంతో మగ్గిపోతున్నారని తెలిపాయి. -
ఐఎస్‌డబ్ల్యూ, సీఐడీలకు ప్రోత్సాహకాలు
సాక్షి, హైదరాబాద్: పోలీసు విభాగంలో లూప్‌లైన్లుగా భావించే ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్(ఐఎస్‌డబ్ల్యూ), నేర పరిశోధన విభాగం(సీఐడీ)లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ(ఐఐటీఏ)లో గురువారం జరిగిన 15వ బ్యాచ్ పోలీసు జాగి లాల పాసింగ్ ఔట్ పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘సీఐడీ, ఐఎస్‌డబ్ల్యూ సిబ్బందికి వారి జీతంలో 25 శాతం అదనంగా ప్రత్యేక ప్రోత్సాహకం అందిస్తాం. ‘డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల’లో పోలీసు సిబ్బందికి 10 శాతం కోటా ఇవ్వనున్నాం. ఐఐటీఏలో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలు, విభాగాల జాగిలాలకూ శిక్షణ ఇస్తున్నారు. దీన్ని దేశంలోనే ఉత్తమ అకాడమీగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తుంది’ అని అన్నారు. ఐఐటీఏలో తమ జాగిలాలకు శిక్షణ ఇవ్వాల్సిందిగా వివిధ రాష్ట్రాలతో పాటు కేంద్ర విభాగాలూ కోరటం గర్వించదగిన పరిణామమని డీజీపీ అనురాగ్ శర్మ అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో నిఘా విభాగం చీఫ్ బి.శివధర్‌రెడ్డి, హైదరాబాద్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి, సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఐఎస్‌డబ్ల్యూ ఐజీ మహేష్ మురళీధర్ భగవత్‌లతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్తగా నిర్మించిన ఐఐటీఏ పరిపాలనా భవనాన్ని హోం మంత్రి ప్రారంభించారు. కాగా వింగ్స్ వారీగా శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జాగిలాల హ్యాండ్లర్లకు హోం మంత్రి చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందించారు. -
చెలరేగుతున్న చైన్‌స్నాచర్స్
నెల్లూరు (క్రైమ్) : పోలీసుల నిఘా వైఫల్యం.. మహిళల ఏమరపాటుతో జిల్లాలో చైన్‌స్నాచర్లు చెలరేగిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఒంటరిగా నడిచి వెళ్తున్న మహిళలను.. మరి కొన్ని చోట్ల పలానా వారి అడ్రసు కావాలంటూ అడుగుతూ మహిళల మెడల్లో బంగారు చైన్లను తెంచుకెళ్తున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగిన రోజు వాహనాల తనిఖీలతో పోలీసులు సరిపెడుతుండటంతో చైన్‌స్నాచర్స్ పేట్రేగిపోతున్నారు. నిఘా నిస్తేజం.. రికవరీలు లేవు.. నెల్లూరు నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో చైన్‌స్నాచర్లు హల్చల్ చేస్తున్నారు. ప్రధానంగా నగరంలో ప్రతి రోజు ఏదో ఒక పోలీసుస్టేషన్ పరిధిలో మహిళల మెడల్లోని బంగారు గొలుసులు, తాళిబొట్లు తెంపుకెళుతున్నారు. కొందరు పాతనేరస్తులతో పాటు, జల్సాలకు అలవాటు పడిన యువకులు ముఠాలుగా ఏర్పడి ఈ తరహా చోరీలకు పాల్పడుతున్నట్లు సమాచారం. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్ జిల్లాలో తిష్టవేసి దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉందని పోలీసు నిఘా వర్గాలు సైతం హెచ్చరించాయి. అయినా జిల్లా పోలీస్ యంత్రాంగం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోంది. ఏడాది కాలంలో 150కు పైగా చైన్‌స్నాచింగ్‌లు జరిగినట్లు పోలీసు రికార్డుల్లో కేసులు నమోదు అయ్యాయి. రికార్డులకెక్కని ఘటనలు ఇంకెన్నో ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 86కు పైగా చైన్‌స్నాచింగ్‌లు జరిగాయి. నేరాలను నియంత్రించాల్సిన నిఘా విభాగం నిస్తేజంగా మారింది. దీంతో దోపిడీలు, దొంగతనాలు అధికమవుతున్నాయి. వీటిని నియంత్రించడంలో నగర పోలీసులు విఫలమైయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి పోలీసుస్టేషన్లో క్రైం సిబ్బంది, బ్లూకోట్స్, రక్షక్ పోలీసులు, సీసీఎస్ బృందాలున్నా ప్రయోజనం శూన్యంగా మారింది. నిఘా ముమ్మరం చేశాం : నగర డీఎస్పీ ఎస్ మగ్బుల్ చైన్‌స్నాచర్ల కోసం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. ఈ తరహా నేరాలకు పాల్పడేవారంతా యువకులు, కొత్త నేరస్తులే. వారిలో జల్సాలకు అలవాటుపడిన విద్యార్థులు, యువకులు ఉన్నారు. హైస్పీడ్ బైక్‌ల్లో శివారు ప్రాంతాలు, కళాశాలలు, జనసంచారం తక్కువగా ఉండే కాలనీల్లో తిరుగుతూ చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. ఎవరికైనా అనుమానమొచ్చినా, నంబరు ప్లేటు లేని మోటారుసైకిళ్లపై అనుమానాస్పదంగా తిరుగుతుంటే వెంటనే డయల్ 100కు, స్థానిక పోలీసుస్టేషన్‌కు సమాచారం అందించాలి. మచ్చుకు కొన్ని.. ► సంగం మండలానికి చెందిన ఓ యువకుడు తన స్నేహితురాలిని బైక్‌పై ఎక్కించుకుని వస్తుండగా పొట్టేపాళెం సమీపంలో దుండుగులు ఆ యువతిని బెదిరించి ఆమె మెడలోని బంగారు గొలుసును దోచుకెళ్లారు. ►నెల్లూరు నగరంలోని జెడ్పీ కాలనీలో ఆగస్టు 24న రాధ అనే వృద్ధురాలిని బెదిరించి ఆమె మెడలోని నాలుగు సవర్ల బంగారు గొలుసును దోపిడీ చేశారు. ► నాయుడుపేటలో ఆగస్టు 26న ఓజిలి మండలం చిలమానుచేనుకు చెందిన మంజుల అనే అంగన్వాడీ మెడలోని నాలుగుసవర్ల బంగారు గొలుసును దుండగులు లాక్కెళ్లారు. అంగన్వాడీ కార్యకర్తలు పలువురు వెళ్తుండగా ఈ సంఘటన జరగడం విశేషం. ► ఈ నెల 3న నెల్లూరులోని యనమాలవారిదిన్నెకు చెందిన వసంత అనే మహిళ పాలబూత్‌లో పాలు పోసి వెళ్తుండగా బంగ్లాతోట సమీపంలో రెండున్నర సవర్ల చైన్ లాక్కెళ్లారు. ► తాజాగా శుక్రవారం నెల్లూరు నగరంలోని భక్తవత్సలనగర్‌లో ఓ చిరునామా అడుగుతూ వచ్చిన ఇద్దరు దుండగులు జషింతమ్మ అనే మహిళ మెడలోని ఎనిమిది సవర్ల బంగారు చైన్లు లాక్కెళ్లారు. -
పోలీసు దొంగ..!
- విగ్రహాల కేసులో ఓ ఇంటెలిజెన్స్ పోలీస్‌ను అదుపులోకి తీసుకున్న పొలీసులు - ఇంట్లోనే విగ్రహాలు అమ్ముతూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన వైనం - పోలీసుల అదుపులో మరో నలుగురు విగ్రహాల దొంగలు కదిరి: ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుంటే అదుపు చేయాల్సిన పోలీసే పలు విగ్రహాల చోరీ కేసుల్లో నిందితుడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆలయాల్లో చోరీ చేసిన విగ్రహాలను ఆ పోలీస్ తన ఇంట్లో అమ్ముతూ రెండురోజుల క్రితం సీసీఎస్ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. జిల్లాలో ఎక్కడైనా మతపరమైన శాంతి భద్రతలకు విఘాతం కల్గుతుందనే సమాచారం ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీ దృష్టికి చేరవేయడానికి కౌంటర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. ఇందులో పనిచేసే పోలీసులు సివిల్ డ్రెస్‌లోనే ఉంటారు. నిత్యం ప్రజలతో మమేకమై తిరుగుతుంటారు. ఈ విభాగంలో పని చేసే ఓ పోలీస్ జిల్లా కేంద్రంలోని కొవ్వూరు నగర్లో కాపురముంటున్నారు. ఇటీవల కాలంలో పలు ఆలయాల్లో విలువైన విగ్రహాల చోరీ అయ్యాయి. దీన్ని జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు సీరియస్‌గా తీసుకున్నా రు. దీని వెనుక ఎంతటి వ్యక్తులున్నా సరే వదిలిపెట్టకండని అన్ని పోలీస్ సబ్ డివిజన్లలో పనిచేసే డీఎస్పీలను ఆదేశించారు. రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు జిల్లా వ్యాప్తంగా సంచరించి ఇద్దరు విగ్రహాల దొంగలను అదుపులోకి తీసుకుని విచారిస్తే కౌంటర్ ఇంటెలిజె న్సీలో పని చేసే ఆ పోలీస్ పేరు వారు చెప్పారు. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. ఈ విషయం వెంటనే ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ఆ పోలీస్‌పై నిఘా ఉంచారు. రెండు రోజుల క్రితం ఆ పోలీస్ తన ఇంట్లో ఎంతో విలువైన సీతారామలక్ష్మణులతో పాటు ఆంజనేయుడి విగ్రహాలను అమ్ముతుంటే సీసీఎస్ పోలీ సులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అతడిని విచారిస్తే తనకెలాంటి సంబంధం లేదని, తన బంధువులు ఒకరిద్దరు విగ్రహాల చోరీలలో సిద్ధహస్తులని, వారు తీసుకొచ్చిన విగ్రహాలు తన ఇంట్లో దాచి విక్రయించేవారని చెప్పినట్లు సమాచారం. అయితే ఆయన దగ్గర విగ్రహాల చోరీలకు సంబంధించిన కీలక విషయాలు రాబట్టినట్లు తెలిసింది. రాయచోటి రోడ్డులో ఓ బావిలో కూడా కొన్ని విగ్రహాలు దాచారని, వాటికోసం నేడో, రేపో సీసీఎస్ పోలీసులు కదిరికి రానున్నారని విశ్వసనీయ సమాచారం. సీసీఎస్ పోలీ సులు అదుపులోకి తీసుకున్న ఆ కౌంటర్ ఇంటిలిజెన్స్ పోలీస్ ఇటీవల పలు మార్లు కదిరిలో సంచరించారు. అదే సమయంలోనే మరకత మహాలక్ష్మి ఆలయంలో చోరీ జరిగింది. ఆ కేసులో కూడా ఇతని హస్తం ఉండవచ్చని అనుమానిస్తున్నారు. -
ఉగ్రదాడిపై లోక్‌సభ ఖండన
నిఘా సమాచారంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది: కాంగ్రెస్ న్యూఢిల్లీ: గురుదాస్‌పూర్‌లో ఉగ్రవాదుల దాడిని లోక్‌సభ తీవ్రంగా ఖండించింది. పార్టీలకతీతంగా సభ్యులందరూ దాడిని గర్హించారు. దేశానికి ముప్పుగా కొనసాగుతున్న ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు ప్రభుత్వం తన శక్తినంతటినీ వినియోగించాలని కోరారు. సోమవారం ఒకవైపు గురుదాస్‌పూర్‌లో ఉగ్రవాదులతో భద్రతాదళాల ఎదురు కాల్పులు కొనసాగుతుండగానే.. లోక్‌సభలో జీరో అవర్‌లో కాంగ్రెస్, లెఫ్ట్, ఎన్సీపీ, టీఎంసీ, ఎస్పీ, ఆర్జేడీ, జేడీయూ, టీఆర్ఎస్ సభ్యులు వివిధ అంశాలపై ఆందోళన కొనసాగిస్తున్న సమయంలోనే.. అకాలీదళ్, బీజేపీ, సీపీఎం, బీజేడీ సభ్యులు ఉగ్రదాడిని ఖండిస్తూ మాట్లాడారు. అనంతరం.. కాంగ్రెస్ నేత ఖర్గే మాట్లాడుతూ.. ఉగ్రవాద దాడిని ఖండిస్తూనే కేంద్ర ప్రభుత్వ నిఘా వైఫల్యముందన్నారు. మంత్రి వెంకయ్య తీవ్రంగా స్పందిస్తూ.. ‘ఇది చాలా తీవ్ర విషయం. జాతీయ అంశం. ఎదురుకాల్పులు జరుగుతుండగా ప్రభుత్వాన్ని తప్పుపట్టాలని ప్రయత్నించటం సరికాదు. ఇది పైచేయి సాధించే సమయం కాదు. ఈ విషయంలో సభ ముక్తకంఠం వినిపించాలి’ అని ఉద్ఘాటించారు. ‘జనం చనిపోతున్నారు. దేశ ప్రజలు చూస్తున్నారు. వాళ్లు నాటకాన్ని (సభలో) చూస్తున్నారు’ అని ప్రేమ్‌సింగ్(అకాళీ) అన్నారు. దాడి జరిగే అవకాశముందన్న సమాచారం ఉన్నపుడు పంజాబ్ సరిహద్దును ఎందుకు మూసివేయలేదని అకాలీదళ్.. ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తన నియోజకవర్గమైన గురుదాస్‌పూర్‌లో జరిగిన దాడి దిగ్భ్రాంతి కలిగిస్తోందని ఎంపీ వినోద్‌ఖన్నా పేర్కొన్నారు. -
నిఘా నీడలో పుష్కరాలు
సాక్షి, రాజమండ్రి: కోటి మంది స్నానమాచరిస్తారని అంచనావేస్తున్న గోదావరి పుష్కరాలు నిఘా నీడలో జరగనున్నాయి. కొన్నేళ్ల క్రితం నుంచి ఉగ్రవాదులు ఇలాంటి జనసమ్మర్థ కార్యక్రమాల్లో పేట్రేగుతున్న నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఎలాంటి అసాంఘిక శక్తులకు ఆస్కారం ఇవ్వకుండా భద్రతాపరమైన ఏర్పాట్లను పక్కాగా చేపడుతోంది. ఈ నెల 14 నుంచి పుష్కర స్నానాలు ఆచరించే ఉభయ గోదావరి జిల్లాల్లోని ఘాట్లలో, కూడళ్లలో మొత్తం 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటిలో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 171 సీసీ కెమెరాలను రాజమండ్రిలో రిలయన్స్ జియో ఏర్పాటు చేసింది. వీటిని సుమారు 33 కిలోమీటర్ల పొడవైన ఆప్టిక్ ఫైబర్‌తో పోలీసు కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసింది. పుష్కరాలు పూర్తయ్యే వరకూ వీటిని ఆ సంస్థ నిపుణులే పర్యవేక్షిస్తారు. ఇక ఇరు జిల్లాల్లోని అన్ని సీసీ కెమెరాల్లో బంధించే దృశ్యాలను వీక్షించేందుకు రాజమండ్రి పోలీసు గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లో 12 నుంచి 16 అంగుళాల ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. వీటి సాయంతో ఘాట్లు, ట్రాఫిక్ కూడళ్లు, పార్కింగ్ ప్రాంతాలు, పుష్కర్ నగర్లలో పరిస్థితిపై పోలీసులు నిత్యం నిఘా ఉంచడానికి అవకాశం కలుగుతుంది. అనుమానాస్పదంగా ఎవరైనా సంచరిస్తే స్క్రీన్‌పై దృశ్యాన్ని జూమ్ చేసి చూస్తారు. అలాగే ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు ఎక్కడ తలెత్తినా సిబ్బందిని అప్రమత్తం చేయడానికీ సీసీ కెమెరాలు సహాయపడనున్నాయి. పోలీసుల మోహరింపు... పుష్కరాలు ప్రశాంతంగా ముగిసేలా, ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పోలీసు శాఖ సన్నద్ధమైంది. ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 28 వేల మంది పోలీసులను మోహరించనుంది. అత్యంత ముఖ్యమైన వ్యక్తులు (వీఐపీలు) సందర్శించే అవకాశమున్న రాజమండ్రిలోనే 15 మంది ఎస్పీ స్థాయి అధికారులు, 30 మంది ఏఎస్పీలు, 90 మంది డీఎస్పీలు బందోబస్తును పర్యవేక్షించనున్నారు. అలాగే ఎలాంటి తొక్కిసలాటలు చోటుచేసుకోకుండా ఘాట్లకు వెళ్లే మార్గంలో బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. బారికేడ్లు ఇంత ఇరుగ్గానా... బారికేడ్ల మధ్య వెడల్పు రెండు మూడు అడుగులు మాత్రమే ఉండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడతారని స్థానిక నాయకులు విమర్శిస్తున్నారు. తిరుపతికి, గోదావరి పుష్కరాలకు చాలా వ్యత్యాసం ఉందని అభిప్రాయపడుతున్నారు. తిరుపతిలో భక్తులంతా ఒక్కచోటే వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారని, అక్కడ రద్దీని నియంత్రించడానికి ఇరుకైన బారికేడ్లు సమంజసమేనని చెబుతున్నారు. గోదావరి పుష్కరాలకు మాత్రం విశాలమైన ఘాట్లలో ఎక్కడైనా స్నానం ఆచరించవచ్చని, అలాంటప్పుడు తిరుపతి మాదిరి బారికేడ్లు సరికాదని విమర్శిస్తున్నారు. -
ఎవరి మెడకో!
హుజూరాబాద్ నగరపంచాయతీ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ నివేదిక! ♦ ‘సాక్షి’ వరుస కథనాలతో అధికారుల్లో ఆందోళన ♦ సెలవుపై వెళ్లిన కమిషనర్ అబిద్ అదేబాటలో మేనేజర్? ♦ ఇన్చార్జి కమిషనర్‌గా ఎన్వీ నాగేంద్రబాబు ♦ బిల్లులు సర్ధుకునే పనిలో కౌన్సిలర్లు? హుజూరాబాద్ నగర పంచాయతీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటిదాకా కమిషనర్‌గా పనిచేసిన మహ్మద్ అబీద్ ఉన్నట్టుండి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. నగర పంచాయతీలో అక్రమాలపై ‘సాక్షి’లో వచ్చిన వరుస కథనాలు పాలకవర్గాన్ని, అధికారులను కుదిపేశారుు. అవినీతి, అక్రమాలపై ఇంటెలిజెన్స్, స్పెషల్‌బ్రాంచ్ అధికారులు ఆరా తీసి ఉన్నతాధికారులకు నివేదిక అందించినట్లు తెలిసింది. మరోవైపు కలెక్టర్ నీతూప్రసాద్ సైతం అంతర్గత విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ఫలితంగా పలువురు అధికారుల్లో ఆందోళన మొదలు కాగా, వీలైనంత త్వరగా బిల్లులు దక్కించుకునే పనిలో కౌన్సిలర్లు ఉన్నారు. సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : హుజూరాబాద్ నగర పంచాయతీ పరిధిలో పలు అక్రమాలు జరుగుతున్నట్లు ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. అభివృద్ధి పనులకు టెండర్లలో సింహభాగం సింగిల్ టెండర్లు దాఖలు కావడం, అందులోనూ చాలా వరకు ఎక్సెస్ వేయడం, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందని, మోడల్ చెరువులోని చెట్లను నరికి విక్రయించారనే అంశాలను ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఇంటెలిజెన్స్ నివేదికతోపాటు అంతర్గత విచారణ నేపథ్యంలో నగర పంచాయతీ కమిషనర్ సయ్యద్ అబిద్ నాలుగు నెలల పాటు దీర్ఘకాలిక సెలవుపెట్టి వెళ్లిపోయూరు. ఆయన స్థానంలో గద్వాల మున్సిపాలిటీలో రెవెన్యూ అధికారి(ఆర్వో)గా పనిచేస్తున్న ఎన్వీ నాగేంద్రబాబు బదిలీపై హుజూరాబాద్ నగర పంచాయతీ ఇన్చార్జి కమిషనర్‌గా నియమితులయ్యారు. ‘దీర్ఘకాలిక సెలవు’ ఆంతర్యమేంటో? ‘సాక్షి’లో వచ్చిన కథనాల నేపథ్యంలో కమిషనర్ అబిద్‌కు నగర పంచాయతీ చైర్మన్ వి.విజయ్‌కుమార్ రెండు నోటీసులు జారీ చేశారు. ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్లకు బదులు వివరణలో బాక్స్ టెండర్లని ఎలా పేర్కొన్నారని, దీనివల్ల కౌన్సిల్ విలువ తగ్గిపోతోందనేది మొదటి నోటీసులోని సారాంశం. మరో నోటీసులో ‘కమిషనర్ స్థానికంగా నివాసం ఉండటం లేదు. నాన్ ట్యాక్స్ కలెక్షన్లు జరగడం లేదు. సంక్షేమ పథకాల అమలులో పర్యవేక్షణ లోపం ంటోంది. మొక్కుబడిగా వార్డు సందర్శన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మ్యుటేషన్, జన్మదిన పత్రాలు, అనుమతుల జారీలో జాప్యం జరుగుతోంది. పారిశుధ్య సిబ్బందిపై పర్యవేక్షణ లేదు’ అని పేర్కొంటూ ఈ ప్రశ్నలన్నింటికీ మూడు రోజుల్లో వివరణ ఇవ్వడంతోపాటు పనితీరు మార్చుకున్నట్లు రుజువు చేయాలని ఆదేశించారు. దీంతో ఈ అవినీతి, అక్రమాల వ్యవహారం తన మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోననే ఆందోళనతో కమిషనర్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లినట్లు తెలిసింది. బిల్లులెలా? ప్రస్తుతం నగర పంచాయతీలో బిల్లుల చెల్లింపు సమస్య పాలకవర్గాన్ని వేధిస్తోంది. బిల్లుల చెల్లింపు జరగాలంటే కమిషనర్ తప్పనిసరిగా ఉండాలి. ఆయన దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో చెక్ పవర్‌ను మేనేజర్‌కు దఖలు పరుస్తూ తీర్మానించారు. మేనేజర్ సైతం ఈ వ్యవహారం తన మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోననే ఆందోళనతో సెలవుపై వెళ్లినట్లు తెలిసింది. కమిషనర్ లేకపోవడం, మేనేజర్ సెలవుపై వెళ్లడంతో బిల్లుల చెల్లింపులు ఆగిపోయూరుు. దీంతో ఆందోళన చెందిన కొందరు పాలకవర్గ సభ్యులు ఇన్చార్జి కమిషనర్‌ను నియమించాలని ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో గద్వాల మున్సిపాలిటీలో రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న ఎన్వీ నాగేంద్రబాబును హుజూరాబాద్ నగరపంచాయతీ ఇన్చార్జి కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అవినీతి ఆరోపణల నేపథ్యంలో కొత్తగా బాధ్యతలు స్వీకరించే కమిషనర్ ఎలా స్పందిస్తారనే చర్చ జరుగుతోంది. మరోవైపు అభివృద్ధి పనుల టెండర్లను కాంట్రాక్టర్ల ముసుగులో దక్కించుకున్న కొందరు కౌన్సిలర్లు నాణ్యత ప్రమాణాలను పాటించకుండానే తొందరగా పనులు పూర్తి చేసే పనిలో పడ్డారు. ఆయా పనులకు అవసరమైన నీటిని మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయిస్తూ పనులు జరుపుతున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. మరోవైపు కౌన్సిలర్లే ప్రత్యక్షంగా పనులు చేస్తున్నప్పటికీ నాసిరకంగా ఉన్నాయనే ఆరోపణలు వస్తుండటంతో ఈ వ్యవహారం తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోననే భయం కాంట్రాక్టర్లను వెంటాడుతోంది. -
ఫోన్ ట్యాప్ అవుతున్నా మీకు తెలియలేదా?
-
ఫోన్ ట్యాప్ అవుతున్నా మీకు తెలియలేదా?
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు పోలీసు అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడినట్లు సమాచారం. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కేబినెట్ సమావేశానికి డీజీపీ రాముడు, ఇంటెలిజెన్స్ చీఫ్ అనూరాధ తదితరులు కూడా హాజరయ్యారు. ఇందులో ప్రధానంగా ఓటుకు నోటు వ్యవహారం మీదే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఫోన్ ట్యాప్ అవుతున్నా కూడా ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు దాన్ని గుర్తించడంలో విఫలం అయ్యారంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ విభాగాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని,అందులో తన అనుంగు అనుయాయులను నియమించుకోవాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. అలాగే.. తన ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి లేదని, ఇది చట్టరీత్యా చెల్లదని కేబినెట్లో తీర్మానం చేయాలని కూడా చంద్రబాబు భావిస్తున్నారు. సమావేశం ముగిసిన తర్వాత మంగళవారం సాయంత్రం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. అక్కడ ఆయన బీజేపీ సీనియర్ నాయకుడు అద్వానీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లతో భేటీ అయ్యే అవకాశం ఉంది. గవర్నర్ నరసింహన్ బుధవారం బయల్దేరి ఢిల్లీ వెళ్తుండటంతో, ముందే వెళ్లాలని.. గవర్నర్ అధికారాలపై కేంద్రంతో చర్చించాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
ఎస్సారెస్పీకి భారీ భద్రత
బాల్కొండ: ఉత్తర తెలంగాణ జిల్లాల వర ప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు భారీ భద్రత ఏర్పాటు చేస్తామని ఎస్పీఎఫ్(స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్) కమాండెంట్ మాధవరావు అన్నారు. శుక్రవారం ప్రాజెక్ట్ భద్రత ఏర్పాట్లను ఇంటెలిజెన్స్ డీఎస్పీ పద్మనాభ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఆనకట్ట ఎంత పొడువు ఉంది, ప్రాజెక్ట్ నిర్మాణ క్రమం, ప్రాజెక్ట్‌కు రక్షణ గురించి ఎస్ఈ శ్యాంసుందర్‌ను అడిగారు. భద్రత కోసం డ్యాంపై గుర్తించిన 8 పాయింట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్సారెస్పీకి తీవ్రవాదుల నుంచి ముప్పు ఉందని 2007లోనే ఇంటెలిజెన్సీ విభాగాలు హెచ్చరించాయని, అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్ట్‌లకు భారీ భద్రత కల్పించాలని నిర్ణయించిందని చెప్పారు. నాగార్జున సాగార్, శ్రీశైలం ప్రాజెక్ట్‌ల మాదిరిగా ఎస్సారెస్పీకీ భద్రత ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకు అవసరమైన నివేదికలను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. ఆయన వెంట ప్రాజెక్ట్ ఈఈ రామారావు, డ్యాం డిప్యూటీ ఈఈ మొయినొద్దీన్ఖాన్, ఆర్మూర్ డీఎస్పీ ఆకుల రాంరెడ్డి, డ్యాం ఏఈ బోజదాసు, ఆర్మూర్ రూరల్ సీఐ నరసింహ స్వామి, బాల్కొండ ఎస్సై సురేశ్ ఉన్నారు. -
ఐఓటీ నెట్వర్క్స్ హ్యాకింగ్‌పై సైబర్ క్రిమినల్స్ గురి!
సైబర్ సెక్యూరిటీ సంస్థ వెబ్సెన్స్ హెచ్చరిక న్యూఢిల్లీ: ‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్’ (ఐఓటీ) నెట్వర్క్స్ హ్యాకింగ్‌కు సైబర్ క్రిమినల్స్ రెడీగా ఉన్నారని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ వెబ్సెన్స్ హెచ్చరించింది. దీని కోసం వారు పలు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారని తెలిపింది. మానవుల ప్రమేయం లేకుండా కేవలం ఐపీ అనుసంధానంతో తమలో తాము మాట్లాడగలిగే (సమాచార మార్పిడి) పరికరాల సాంకేతిక వ్యవస్థనే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) అని పిలుస్తారు. ఈ వ్యవస్థలో ఇంటెలిజెన్స్ సిస్టమ్స్, నెట్వ ర్క్ పరికరాలు, కనెక్టివిటీ సేవలు, డాటా సమగ్రత వంటివి కూడా ఉంటాయి. ‘ఐఓ టీ వృద్ధి చెందుతున్న మార్కెట్. ఇది కంపెనీలకు ఒక భారీ వ్యాపార అవకాశం. అలాగే దీనికి సైబర్ క్రిమినల్స్ నుంచి చాలా ప్రమాదం పొంచి ఉంది’ అని వెబ్సెన్స్ రీజినల్ డెరైక్టర్ (ఇండియా, సార్క్) సురేంద్ర సింగ్ అన్నారు. ఐటీ వినియోగంలో భారత్ బ్యాక్: డబ్ల్యూఈఎఫ్ జెనీవా: అధునాతన ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీలను (ఐసీటీ) సామాజిక, ఆర్థిక ప్రయోజనాల కోసం సమర్ధంగా ఉపయోగించుకోవడంలో భారత్ అంతకంతకూ విఫలమవుతోంది. ఇందుకు సంబంధించి ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 143 దేశాలతో రూపొందించిన అంతర్జాతీయ నెట్వర్క్డ్ రెడీనెస్ ఇండెక్స్ (ఎన్ఆర్ఐ)లో ఆరు స్థానాలు దిగజారి 89వ స్థానానికి పడిపోయింది. 2013లో 68వ స్థానంలో ఉన్న భారత్, గతేడాది 83వ ర్యాంకుకు దిగజారింది. -
ముంబైపై మరో ఉగ్రదాడికి కుట్ర?
-
ముంబైపై మరో ఉగ్రదాడికి కుట్ర?
దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంపై మరో ఉగ్రదాడికి లష్కరే తాయిబా కుట్ర పన్నుతోందా? ఈసారి కూడా హోటళ్లు, రైల్వే స్టేషన్లను లక్ష్యంగా చేసుకుంటోందా? నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం ఈ విషయాన్ని నిర్ధారిస్తోంది. సముద్రమార్గం గుండా ఉగ్రవాదులు చొరబడొచ్చని ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరిస్తోంది. 26/11 తరహా దాడులు జరిగే ప్రమాదం ఉందని సమాచారం. ప్రధానంగా ముంబై రైళ్లలో హై ఎలర్ట్ ప్రకటించారు. 8-10 మంది ఉగ్రవాదులు చొరబడొచ్చన్నది నిఘా వర్గాల హెచ్చరికల సారాంశం. ఈ నేపథ్యంలో ముంబై నగర వ్యాప్తంగా హై ఎలర్ట్ ప్రకటించారు. ఇంతకుముందు 2011 నవంబర్ 26వ తేదీన ఉగ్రవాదులు దాడి చేసి భారీ ప్రాణనష్టాన్ని కలిగించిన విషయం తెలిసిందే. మరోసారి ఈ తరహా దాడులు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. రెండు రోజుల క్రితమే జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ కూడా జైలు నుంచి విడుదల కావడంతో.. ఇప్పుడు మరో దాడికి కుట్ర పన్నే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు. -
దుమారం
సాక్షి ప్రతినిది, నిజామాబాద్ :నిజామాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు దుమారం రేపుతున్నాయి. చినికి చినికి చివరకు గాలివానగా మారిన ఈ వివాదంపై ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్వర్గాలు పంపిన నివేదికలు కలకలం సృష్టిస్తున్నా యి. అట్టహాసంగా ప్రారంభించిన అక్రమకట్టడాల కూల్చివేతలను అర్ధంతరంగా ఆపేయడం వెనక లక్షల రూపాయ లు చేతులు మారాయన్న ప్రచారం అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పం దించిన నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అక్రమ క ట్టడాల కూల్చివేతల వెనుక ‘డీల్’పై ఆరా తీయడం చర్చనీయాంశంగా మారింది. నగర పాలక సంస్థ పాలకవర్గం ఏర్పడిన ఏడాదిలోనే అక్రమ కట్టడాలకు సంబంధిం చి వచ్చిన ఆరోపణలను ఆమె తీవ్రంగా పరిగణించినట్లు తెలి సింది. నాలుగైదు రోజుల క్రితం నగర మేయర్ ఆకుల సుజాత, శ్రీశైలం దంపతులను హైదరాబాద్‌కు పిలి పించుకుని మాట్లాడినట్లు అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. అక్రమ కట్టడాల కూల్చివేతలను అర్ధంతరంగా నిలిపివేస్తే ప్రజలకు ఏమని సంకేతాలు ఇచ్చినట్లని ఆమె తీవ్రంగానే మందలించినట్లు సమాచారం. పార్టీకి, ప్రభుత్వానికి మచ్చతెచ్చే విధంగా వ్యవహరిస్తే ఎవరికైనా తీవ్ర పరి ణామాలుంటాయని, ఆరోగ్యశాఖలో అక్రమాలు జరిగితే డిప్యూటీ సీఎంను సైతం తప్పించిన సంఘటనను ఆమె ఉదహరించినట్లు తెలిసింది. నగరపాలక సంస్థ పీఠం కోసం చేసిన ఖర్చులను రాబట్టుకోవడ ం పేరిట భారీ వసూళ్లు జరిగాయన్న ప్రచారంపై ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదికలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించినట్టు తెలి సింది. భవిష్యత్‌లో ఇలాంటి ఆరోపణలు వస్తే పదవి నుంచి తప్పిం చేందుకు వెనకాడబోమన్నట్లు తెలిసింది. అసలు గుట్టుపై ‘ఇంటెలిజెన్స్’ ఆరా నిజామాబాద్‌లో అక్రమ కట్టడాల గుర్తింపు, కూల్చివేతలు ఆరంభశూరత్వంగా మారాయంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. అక్ర మ నిర్మాణాలపై దృష్టి సారించిన పాలకవర్గం, అధికారులు కొంతకాలం స్పెషల్‌డ్రైవ్ చేశారు. 115 భవనాలను అక్రమంగా నిర్మించారంటూ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఖలీల్వాడీలోని ఆస్పత్రుల అక్రమ భవనాలకు కూడా గత అక్టోబర్‌లో నోటీసులు ఇచ్చారు. అయినా ఫలితం లేకపోవడంతో నవంబర్ 23న అక్రమ కట్టడాల కూల్చివేతలను మొదలెట్టారు. నాలుగైదు రోజులు కూల్చివేతలను ముమ్మరంగా సాగించిన కార్పొరేషన్ అధికారులు ఆ తర్వాత అకస్మాత్తుగా ఆపేశారు. ఈ వ్యవహారంలో డబ్బులు చేతులు మారాయన్న ప్రచారం జరిగింది. ఎక్కడ నలుగురు కలిసినా ఇదే చర్చ జరిగింది. చివరకు ఈ ముడుపుల భాగోతంపై ఇంటెలిజెన్స్ అధికారులు ప్రభుత్వానికి ఓ నివేదిక ను సమర్పించడం చర్చనీయాంశంగా మారింది. పాలకవర్గంపై ప్రధానంగా ఈ ఆరోపణలు వచ్చాయి. మేయర్ ఎంపికను చివరివరకు సస్పెన్స్‌లో పెట్టిన టీఆర్ఎస్ ఆ ఖరు నిముషంలో అనూహ్యంగా ఆకుల సుజాత పేరును ప్రకటించింది. వీరి ఎంపికకు కీలకంగా వ్యవహరించిన ఇద్దరు ప్రజాప్రతినిధులపైనా ‘ముడుపుల’ ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఎంపీ కవిత సీరియస్‌గా స్పందించారని తెలుస్తోంది. అన్నీ అక్రమ నిర్మాణాలే నగరపాలక సంస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ఇటీవలే గ్రూప్-1 అధికారి వాసం వెంకటేశ్వర్లును కమిషనర్‌గా నియమించింది. ఐఏఎస్ అధికారిని నియమించాలని ప్రయత్నించినా, కొరత కారణంగా నిజాయితీ గల అధికారిగా పేరున్న వెం కటేశ్వర్లును నియమిం చారు. వరంగల్, హైదరాబాద్ తదితర ప్రాం తాలలో నిక్కచ్చిగా పని చేసిన పేరున్న ఆయన విధులలో చేరిన మరు క్షణం నుంచే నగరంలో ని పలు ప్రాంతాలలో పర్యటించారు. పాలనను గాడిలో పెట్టడంపై ఆయన దృష్టి సారించారు. ఖలీల్‌వాడీ, వినాయక్‌నగర్, గంగాస్థాన్ ప్రాంతాలలో అపార్టుమెంట్లు, నూతన కట్టడాల జోరు పెరిగింది. నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా నిర్మించ డం వంటి కొనసాగాయి. గత అక్టోబర్‌లో వినాయక్‌నగర్‌లోని అశోక అపార్టుమెంట్లో నలుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. అధికారులు దానిని సీజ్ చేసినా, తిరిగి నాలుగు రోజుల తరువాత నిర్మాణ పనులు కొనసాగాయి. నగరంలో సెల్లార్లు లేకుండా నిర్మాణాలు వెలిసాయి. వినాయకనగర్‌లోని ఓ టీవీ షోరూం భవనానికి సెల్లార్ కూడా వ్యాపార సముదాయంగా మారింది. బస్టాండ్ వద్ద ఓ కాంప్లెక్స్‌కు సెల్లార్లో సైతం వ్యాపార సముదాయాలు కొనసాగుతున్నాయి. సెట్‌బ్యాక్ లేకుండా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. బస్వా గార్డెన్ సమీపంలో మూడు అపార్టుమెంట్లు, గంగాస్థాన్ , వినాయక్‌నగర్ ప్రాంతంలో విచ్చలవిడిగా అపార్టమెంట్లు పెరిగిపోతు న్నాయి. ఇలా అనేక చోట్ల నిబంధనలు ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాలపై ఇప్పటికైనా నగరపాలక సంస్థ స్పందించాలని పలువురు కోరుతున్నారు. -
‘మెప్మా’లో తనిఖీలు
ఖమ్మంసిటీ: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో బినామీ రుణాల బాగోతం వ్యవహారం రాష్ట్రస్థాయిలోనే ఓ కుదుపు కుదిపింది. మెప్మా సిబ్బంది, బ్యాంకు అధికారులు కలిసి చేసిన నిర్వాకం ఆ సంస్థకే మాయని మచ్చగా మిగిలింది. మెప్మాలో జరిగిన అవినీతిలో తెరవెనుక ఉన్న బాస్‌పై గత మూడు రోజులుగా ఇంటెలిజెన్స్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి కమ్యూనిటీ ఆర్గనైజర్, రీసోర్స్ పర్సన్లు బినామీ గ్రూపులతో రుణాల మంజూరు చేసిన అగ్రిమెంట్లను పరిశీలించారు. ఒక గ్రూపునకు రుణాలు ఇవ్వాలంటే ఎవరెవరి సంతకాలు చేయాల్సి ఉంటుందో.. వాటి వివరాలను పీడీ వేణుమనోహర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆ అగ్రిమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. గతంలోనే వీరిపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదని పీడీని ఇంటెలిజెన్స్ అధికారులు ప్రశ్నించారు. సంవత్సరం క్రితమే ఇలాంటి బినామీ గ్రూపుల వ్యవహారం బయటకు వచ్చినప్పటికీ నగరంలోని బ్యాంకు మేనేజర్‌తో సమావేశం ఏర్పాటు చేసి ఆయా బ్యాంకులలోని గ్రూపుల వివరాలను, రుణం చెల్లించని గ్రూపుల వివరాలను ఎందుకు సేకరించలేకపోయారని అడిగారు. బ్యాంకు ఓ గ్రూపునకు రుణం మంజూరు చేసిన తర్వాత ప్రతినెలా మెప్మాకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని, అయితే సంవత్సరాలు గడిచినా సమాచారం రాకపోవడం వెనుక కారణమేంటని ఆరా తీశారు. రుణాల మంజూరులో అవకతవకలు జరగకుండా గ్రూపులు అన్నింటినీ రెండు సంవత్సరాల క్రితమే ఆన్లైన్ చేసినప్పటికీ ఈ గ్రూపులు ఆన్లైన్లో ఎందుకు రాలేదని కూడా పీడీని అడిగి తెలుసుకున్నారు. కొన్ని పత్రాలను వారితోపాటు తీసుకెళ్లారు. జిల్లా కలెక్టర్ సైతం దీనిపై నివేదిక కోరినట్లు సమాచారం. తెరవెనుక బాస్‌పై ఆరా.. మెప్మాలోని తెరవెనుక బాస్‌కు సంబంధించి ఆస్తులు, ఉద్యోగంలో చేరిననాటినుంచి ఇప్పటి వరకు ఏమైనా రిమార్కులు ఉన్నాయా..? అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. గతంలో ‘సాక్షి’లో వచ్చిన షాడో కమిషనర్ అనే వార్తపై కూడా ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. మెప్మా కార్యాలయంలో ఆ ఉద్యోగి బాసిజాన్ని గురించి సైతం ఆరా తీస్తున్నారు. -
‘నిఘా’ నీడలో నాయకులు
-
‘నిఘా’ నీడలో నాయకులు
నిఘా విభాగం నిరంతర నిఘాతో నేతల హడల్ ఉక్కిరిబిక్కిరవుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు వారి నీడను కూడా నమ్మలేని స్థితిలో నాయకులు అన్ని వ్యవహారాలపై ఎప్పటికప్పుడు సీఎంకు నివేదికలు ఇప్పటికే పలువురిని హెచ్చరించిన కేసీఆర్ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న మంత్రులు సీఎంతో సమావేశమై రాగానే ఫోన్లు స్విచాఫ్ మీడియా ముందుకు వచ్చేందుకే జంకుతున్న వైనం సాక్షి, హైదరాబాద్: మంత్రుల వ్యవహారశైలిపై నిరంతర నిఘా కొనసాగుతున్నట్లు వస్తున్న కథనాలతో అమాత్యులెవరికీ కంటి మీద కునుకుండటం లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ప్రజా ప్రతినిధులపై ఇంటెలిజెన్స్ నిఘా వేసినట్లు ఇటీవలి ఘటనలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. దీంతో అధికార పార్టీ నేతలంతా బిక్కుబిక్కుమంటూ వ్యవహరిస్తున్నారు. వైద్య, ఆరోగ్య మంత్రిగా రాజయ్య వ్యవహరించిన తీరుపై నిఘా విభాగం ప్రభుత్వానికి వరుసగా నివేదికలు ఇచ్చినట్లు సమాచారం. ఆయన తీసుకున్న నిర్ణయాలు, జరిపిన సంప్రదింపులు, వైద్య శాఖలో అవినీతి వ్యవహారాలకు సంబంధించి నిఘా విభాగం గత ఆరు మాసాల్లో అరడజను నివేదికలు ఇచ్చింది. అవినీతి ఆరోపణల కంటే ఆయన వ్యవహారశైలిపైనే నిఘా విభాగం ఎక్కువ నివేదికలిచ్చినట్టు సమాచారం. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఓ వ్యవహారంలో ఆయన ప్రమేయాన్ని ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలిసింది. అంతే కాకుండా రాష్ట్ర మంత్రులకు సంబంధించి వారు తీసుకుంటున్న నిర్ణయాలు, వ్యవహారశైలిపైనా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి నివేదికలు అందుతున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. దీంతో మంత్రులు తమ నీడను తామే నమ్మడం లేదని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. అందరిమీదా నిఘా ఉందనే ప్రచారం జరుగుతుండటంతో ప్రైవేట్ కార్యక్రమాలకు సైతం మంత్రులు దూరంగా ఉంటున్నారు. అన్ని వ్యవహారాలపైనా నివేదికలు ఈ నెల 25న ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయిన సందర్భంలో తన దృష్టికి వచ్చిన అనేక అంశాలను కేసీఆర్ బయటపెట్టడంతో మంత్రులు తమపై నిఘా ఉన్నట్లు గుర్తించారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు, వ్యక్తిగత వ్యాపారాలు, శాఖల్లో జరుగుతున్న వ్యవహారాలు, ముఖ్యంగా బదిలీలు, డిప్యుటేషన్లు, కాంట్రాక్టులు తదితర అంశాలపై నిఘా పెట్టినట్లు సమాచారం. పార్టీ నేతలు ఎవరెవరు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఉన్నారన్న దానిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు సమాచారం. ‘‘వైద్య, ఆరోగ్య శాఖలో పారామెడికల్ సిబ్బంది నియామక ఏజెన్సీల వ్యవహారం, ఆసుపత్రుల్లో యంత్ర పరికరాల కొనుగోళ్లు, 108 వాహనాల కొనుగోలుకు పర్సెంటేజీలు మాట్లాడుకోవడం వంటి అంశాలు నిఘా నివేదికలతోనే వెల్లడయ్యాయి. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు’’ అని ఒక మంత్రి వ్యాఖ్యానించారు. నల్లగొండ జిల్లాలో తన తల్లికి పదోన్నతి రాదని తెలిసి మొత్తం ప్రక్రియనే నిలిపివేసిన ఓ ఎమ్మెల్యే వ్యవహారంపైనా ఇంటలిజెన్స్ నివేదిక ఇచ్చినట్లు తెలియడంతో ఎమ్మెల్యేల్లోనూ గుబులు మొదలైంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన రాష్ట్ర వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు అధికార వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని కూడా ఇంటెలిజెన్స్ ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చిందట. ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు వ్యవహారంపైనా కేసీఆర్‌కు నివేదికలు అందాయి. మంచిర్యాల నియోజకవర్గం పరిధిలోని నస్పూర్‌లో సర్వే నంబర్ 46లోని ఆరెకరాల సీలింగ్ భూమి, మరో పది ఎకరాల ప్రభుత్వ భూమిని సదరు ఎమ్మెల్యే బినామీ పేర్లతో సొంతం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే మరోచోట 102 ఎకరాల భూమిలో పట్టాలు మార్చినందుకు ఏకంగా 25 శాతం కమీషన్ చేతులు మారిందని కూడా ఇంటెలిజెన్స్ రిపోర్టులు అందినట్లు చెబుతున్నారు. నాయకులందరిపైనా నిఘా విభాగం నుంచి నివేదికలు తెప్పించుకుంటున్న ప్రభుత్వం, ఈ వైనాన్ని వ్యూహాత్మకంగా ప్రచారంలో కూడా పెడుతోంది. దీంతో ఒకరకమైన అభద్రతాభావం ప్రజాప్రతినిధుల్లో నెలకొంది. సీఎం సమావేశం తర్వాత ఫోన్లు స్విచాఫ్ ఆయా శాఖలకు సంబంధించి సీఎం ఆధ్వర్యంలో సమీక్షలు జరిగిన తర్వాత మంత్రులు ఆ వివరాలను మీడియాకు చెప్పడం పరిపాటి. కానీ, ఇటీవల మంత్రులు నోరు విప్పడం లేదు. సీఎం సమావేశాల నుంచి బయటకు రాగానే తమ ఫోన్లు స్విచాఫ్ చేసుకుంటున్నా రు. వారి శాఖలో ఏం జరుగుతుందో చెప్పేం దుకు కూడా కొందరు మంత్రులు మందుకు రావడం లేదు. ముఖ్యంగా మీడియాతో మా ట్లాడితే ఇబ్బందులు వస్తాయని వారు భయపడుతున్నారు. ఇక కుటుంబ సభ్యులు, బంధువులను సచివాలయంలో తమ పేషీల దరిదాపులకు రానీయడం లేదు. ‘మా అబ్బాయి ఏదో పని మీద సచివాలయం వచ్చాడు. మంచిది కాదని వారించి వెంటనే అతన్ని కిందనుంచే వెనక్కి వెళ్లమని చెప్పా’ అని ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన ఓ మంత్రి చెప్పారు. మొత్తం మీద నిఘా విభాగం నీడ తమను వెంటాడుతుందేమోనన్న అనుమానంతో మంత్రులు, ఇతర నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చిటికెలో సీఎంకు సమాచారం దక్షిణ తెలంగాణ జిల్లాలకు చెందిన ఓ మంత్రి ఇటీవల తన సన్నిహితులతో కలిసి విదేశాలకు వెళ్లాలని అనుకున్నారట. ఈ విషయం ముందే ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలిసింది. తనకు అత్యంత సన్నిహితులైన వారితో పంచుకున్న విషయం కూడా బయటకు ఎలా పొక్కిందో తెలియక ఆయన అయోమయానికి లోనయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఇతర మంత్రులు ఆత్మరక్షణలో పడిపోయారు. తెలంగాణ మంత్రివర్గంలో అవకాశం దక్కిన వారిలో సీనియర్లు కొందరే. మెజారిటీ మంత్రులంతా తొలిసారి అవకాశం దక్కిన వారే. రంగారెడ్డి జిల్లా పరిధిలోని మదీనగూడ సర్వే నంబర్ 60లోని స్థలంలో ప్రహరీగోడను మున్సిపల్ అధికారులు ఇటీవల కూల్చివేశారు. ఎందుకని ప్రశ్నించిన వారికి, ‘మంత్రిని అడగండి’ అని సిబ్బంది సమాధానమిచ్చారు. ఈ విషయాన్ని నిఘా విభాగం వెంటనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లింది. జిల్లాలోని మరికొన్ని చోట్ల కూడా భూ కబ్జాలపై ఒకరిద్దరు ప్రజాప్రతినిధులపై ఆరోపణలు వచ్చాయి. ‘కాగ్నా’ నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తూ వ్యాపారం చేస్తున్న కొందరు వ్యక్తులు మంత్రి అనుచరులేనన్న ఆరోపణలతో ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. తనమీద నిఘా విభాగం ఇలాంటి నివేదికలను ముఖ్యమంత్రికి ఇచ్చినట్టు బయటికి పొక్కడంతో సదరు మంత్రి ఇబ్బందిగా ఫీలయ్యారు. -
ఉగ్రమూకలు రెచ్చిపోవచ్చు!.
జమ్మూ, ముంబైలో అప్రమత్తంగా ఉండండి: నిఘా వర్గాలు న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన నేపథ్యంలో దేశంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. అప్రమత్తంగా ఉండాలంటూ అన్ని రాష్ట్రాలకు సూచించాయి. ముఖ్యంగా బిహార్, ఉత్తరప్రదేశ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలతోపాటు ముంబై పోలీసులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. 2000లో నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్‌కు వచ్చిన సమయంలో లష్కరే తోయిబా ముష్కరులు కశ్మీర్‌లోని చిత్తిసింగ్‌పురా గ్రామంలో 36 మందిని ఊచకోత కోశారు. ఇప్పుడు కూడా అలా దాడులకు తెగబడే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ముంబైలో సిద్ధివినాయక ఆలయం, తాజ్ ప్యాలెస్ హోటల్, గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ఉన్నతాధికారులకు నిఘా వర్గాలు సూచించాయి. ఇక ఢిల్లీని భద్రతా బలగాలు శత్రు దుర్భేద్యంగా మార్చేస్తున్నాయి. అమెరికా నిఘా వర్గాలతో కలసి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నాయి. ఒబామా ప్రయాణించే మార్గాల్లో అమెరికా నిఘా వర్గాలు ఇప్పటికే క్షుణ్ణంగా పరిశీలించాయి. -
‘వైద్య’ అక్రమార్కులపై వేటు
* ‘సాక్షి’ కథనంతో ప్రభుత్వం చర్యలు * రూ. 2 కోట్లు చేతులు మారినట్లు ఇంటెలిజెన్స్ నివేదికతో కదలిక * ఆరోగ్య శాఖ డెరైక్టర్ సాంబశివరావు, ఎన్హెచ్ఎం ఏవో శ్రీనివాసరెడ్డిపై వేటు * బాధ్యతల నుంచి తొలగించిన సర్కారు * వైద్య మంత్రి పేషీలోని ఓఎస్డీలపైనా చర్య సాక్షి, హైదరాబాద్: ‘అంగట్లో డాక్టర్ పోస్టులు’ శీర్షికతో ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా నియమించిన ఔట్సోర్సింగ్ ఏజెన్సీలను వెంటనే రద్దు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో అందుకు కారకులైన నలుగురు ఉన్నతాధికారులపై గురువారం వేటుపడింది. సదరు ఏజెన్సీలకు అనుమతినిస్తూ అంతర్గత ఉత్తర్వులు ఇచ్చిన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డెరైక్టర్ సాంబశివరావును బాధ్యతల నుంచి తొలగించింది. ఆ శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్‌కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సాంబశివరావును సస్పెండ్ చేసినట్లు వార్తలు వచ్చినా ప్రభుత్వం ధ్రువీకరించలేదు. జాతీయ ఆరోగ్య మిషన్ పరిపాలనాధికారి(ఏవో) శ్రీనివాసరెడ్డినీ ఆ బాధ్యతల నుంచి తొలగించింది. వైద్య, పారామెడికల్ పోస్టులను అమ్ముకుంటున్న ఔట్సోర్సింగ్ ఏజెన్సీలకు అనుమతిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అలాగే వైద్య మంత్రి రాజయ్య పేషీలోని ఓఎస్డీలు డాక్టర్ సంపత్, డాక్టర్ గంగాధర్‌ను కూడా బాధ్యతల నుంచి తొలగించినట్లు తెలిసింది. అయితే మంత్రి కార్యాలయవర్గాలు మాత్రం దీనిని ధ్రువీకరించడం లేదు. ఎన్హెచ్ఎం మంజూరు చేసిన 1500 వైద్య సిబ్బంది పోస్టుల్లో నియామకాలు చేపట్టేందుకు కొన్ని ఔట్సోర్సింగ్ ఏజెన్సీలకు సాంబశివరావు అనుమతించారు. అయితే ఇందుకు ప్రభుత్వంలోని కీలక నేతతో పాటు కొందరు ఉన్నతాధికారులు సదరు ఏజెన్సీల నుంచి లంచం తీసుకున్నారన్న విషయాన్ని ‘సాక్షి’ బయటపెట్టింది. దీనిపై విచారణ జరిపిన నిఘా వర్గాలు.. రూ. రెండు కోట్లు చేతులు మారినట్లు స్పష్టం చేశాయి. ఈ నివేదిక ఆధారంగానే తాజాగా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఓఎస్డీలు కూడా అతిగా వ్యవహరిస్తున్నారని, విభాగాధిపతులు, అధికారులతో సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో వారిని తొలగించినట్లు సమాచారం. మార్గదర్శకాలు ఖరారు... ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఔట్సోర్సింగ్ వైద్య, పారామెడికల్ పోస్టుల నియామకానికి సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేశారు. ఆ ప్రకారం జిల్లా ఆరోగ్య సంస్థల(డీహెచ్సీ) ద్వారానే పోస్టులను నింపాలి. తప్పనిసరిగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి. అభ్యర్థి స్థానికుడై ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటర్వ్యూలు నిర్వహించకూడదు. మెరిట్ ఆధారంగా అభ్యర్థుల నియామకం జరగాలి. ఇద్దరు అభ్యర్థులకు ఒకే విధమైన మార్కులుంటే వారి పుట్టిన రోజును ఆధారం చేసుకోవాలి. పుట్టిన రోజులు కూడా ఒకే తేదీగా ఉంటే... వారి మండలాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఔట్సోర్సింగ్ ఏజెన్సీల అర్హతలు, వాటి అనుభవాన్ని ఆధారం చేసుకోవాలి. కలెక్టర్ ఆధ్వర్యంలోని డీహెచ్ఎస్ల నిపుణుల కమిటీ ఆ ఏజెన్సీలను ఆమోదించాలి. ఈ మార్గదర్శకాలను సీఎంకు పంపిస్తామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ‘సాక్షి’కి చెప్పారు. సీఎం ఆమోదం లభించాక జిల్లాస్థాయిలో నోటిఫికేషన్ జారీచేసి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల నియామకం చేపడతారు. అనంతరం పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలుకానుంది. -
ముంబై హై అలర్ట్
ముంబై: ముంబై నగరంలోని సిద్ధి వినాయక ఆలయంపై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడులు జరిపేందుకు కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం అందడంతో ముంబైలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ అలయంతోపాటు దేశంలోని పలు లక్ష్యాలపై జనవరి 28వ తేదీలోగా దాడులు జరిపేందుకు పాకిస్థాన్‌కు చెందిన జమాత్ ఉద్ దవా, లష్కరే తోయిబా, జైష్ ఏ మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ టైస్టు సంస్థలు భారత్‌కు నాలుగు వేర్వేరు బృందాలను పంపించాయంటూ భారత్ ఇంటెలిజెన్స్ బ్యూరో మహారాష్ట్ర పోలీసులతోపాటు ముంబై పోలీసులను అప్రమత్తం చేశాయి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్‌కు వస్తున్న నేపథ్యంలో ఈ సమాచారంతో ఉలిక్కి పడిన భారత్ భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. మహారాష్ట్రలో సిద్ధి వినాయక ఆలయమే ఉగ్రవాదుల ప్రధాన టార్గెట్ అని తెల్సినట్టు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు తెలియజేశాయి. -
సంఘ విద్రోహుల నీడ!
శ్రీకాకుళం క్రైం: జిల్లా కేంద్రంలోకి సంఘ విద్రోహ శక్తులు చొరబడ్డా యా?.. దాడులు, అరాచకాలకు పన్నా గం పన్నుతున్నాయా??.. పోలీసు అధికారులకు ఇంటెలిజెన్స్ విభాగం చేసిన హెచ్చరికలు దీనికి అవుననే సమాధానం చెబుతున్నాయి. దీంతో అప్రమత్తమైన ఎస్పీ ఏఎస్ ఖాన్ పట్టణంలో కార్డన్ సెర్చ్ నిర్వహించాలని ఆదేశించారు. ఆ మేరకు శ్రీకాకుళం డీఎస్పీ భార్గవరావ్నాయుడు ఆధ్వర్యంలో పట్టణ సీఐ అప్పలనాయుడు, ఎస్సైలు భాస్కరరావు, రవి కుమార్, పోలీసు, ఏఆర్ సిబ్బందితో రంగంలోకి దిగి కార్డన్ సెర్చ్ చేపట్టారు. పట్టణంలోకి ప్రవేశించిన సంఘ విద్రోహ శక్తులు కలెక్టరేట్ సమీపంలోని వాంబే కాలనీలో షెల్టర్ పొందారన్న ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఆ కాలనీని జల్లెడ పట్టారు. కాలనీలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరి గురించి ఆరా తీశారు. అనుమానితులను రకరకాలుగా ప్రశ్నించి వివరాలు రాబట్టా రు. ఒకేసారి పెద్దసంఖ్యలో పోలీసు లు రావడం.. ఇంటింటికీ వెళ్లడం స్థాని కులను భయాందోళనకు గురి చేసింది. ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. కాలనీ మొత్తాన్ని కలియది రిగిన పోలీసులకు అనుమానితులెవరూ కనిపించలేదు. దాంతో కాలనీ వాసులకు పలు సూచనలు చేశారు. అపరిచితులు తిరుగుతున్న ట్టు తెలిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు. ఇళ్లు అద్దెకిచ్చినప్పు డు అవతలి వ్యక్తుల వివరాలు పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. దీనిపై సీఐ అప్పలనాయుడు వద్ద ప్రస్తావించగా సంక్రాంతి నేపథ్యంలో దొం గల ముఠాలు, పెద్ద నేరగాళ్లు వచ్చి ఉంటారన్న అనుమానంతో కార్డన్ సెర్చ్ జరిపామన్నారు. ఇక నుంచి ఇతర ప్రాంతాల్లోనూ అప్పుడప్పుడూ కార్డన్ సెర్చ్ నిర్వహిస్తామన్నారు. -
పోలీసు పహారాలో రాజధాని
భద్రతా వలయంలో రాజధాని గ్రామాలు శరవేగంగా కదులుతున్న సీఆర్డీఏ చీమ చిటుక్కుమన్నా ముందే తెలిసిపోయేలా ఏర్పాట్లు సంక్రాంతిలోగా పనిముగించే యోచన రాజధాని గ్రామాలు పోలీసు పహారాలోకి వెళ్లిపోయాయి. సీఆర్డీఏ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసింది. అధికారుల బృందానికి పోలీసులు పటిష్టరక్షణ కల్పిస్తున్నారు. మఫ్టీలో అన్ని గ్రామాలనూ జల్లెడ పడుతున్న ఇంటలిజెన్స్ సిబ్బంది ఎప్పటికప్పుడు స్థానికుల కదలికలను ఉన్నతాధికారులకు చేరవేస్తున్నారు. గుంటూరు సిటీ : రాజధానిపై సర్వాధికారాలు గల సీఆర్డీఏ అధికారికంగా భూ సేకరణ ప్రక్రియను ప్రారంభించడంతో రాష్ట్ర నూతన రాజధాని ప్రాంతంలో మరో కీలకమైన అంకానికి తెర లేచింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తుళ్లూరులో నూతన సంవత్సర వేడుకలు జరుపుకొన్న మరుసటి రోజు శుక్రవారం ఈ ఘట్టం మొదలైంది. రాజధాని పరిధిలో ఉన్న 29 గ్రామాలు పోలీసు భద్రతా వలయంలో చేరిపోయాయి. అణువణువూ నిఘా నీడన ఒదిగిపోయాయి. అక్కడ చీమ చిటుక్కుమన్నా సీఆర్డీఏకు ముందే తెలిసేలా ఏర్పాట్లు జరిగాయి. సేకరణ ప్రక్రియ ప్రారంభించడానికి ముందే హైకోర్టులో కేవియట్ దాఖలు చేయడంతో దీనిపై ఎవరు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలన్నా, ముందుగా ప్రభుత్వానికి నోటీసు పంపాల్సి ఉంటుంది. ఈ రకంగా కూడా భూ సేకరణకు ఎవరెవరు వ్యతిరేకంగా ఉన్నారో ముందుగానే తెలుసుకునే వెసులుబాటు సీఆర్డీఏకు చిక్కింది. నూతన సంవత్సరం ఆరంభంలో రాజధాని ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న నేలపాడు నుంచి మొదలైన భూ సేకరణను వీలైనంత త్వరగా ముగించాలన్న యోచనలో సీఆర్డీఏ ఉంది. ఈ మేరకు తన అడుగులను వేగవంతం చేసింది. తుళ్లూరులో నూతన సంవత్సర వేడుకలకు హాజరైన సీఎం చంద్రబాబు కూడా సంక్రాంతిలోగా భూములు ఇవ్వాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో భూసేకరణకు ఎలాంటి అవరోధాలూ ఎదురవకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వయంగా రంగంలో దిగిన రూరల్ ఎస్పీ రామకృష్ణ ప్రత్యేక బలగాలను రాజధాని ప్రాంతమంతటా మోహరించారు. వంద మందికి పైగా పోలీసులతో కూడిన 16 ప్రత్యేక బృందాలను సీఆర్డీఏకు రక్షణ వలయం ఏర్పాటు చేశారు. ఇక మఫ్టీలో అన్ని గ్రామాలనూ జల్లెడ పడుతున్న ఇంటలిజెన్స్ సిబ్బంది ఎప్పటికప్పుడు గ్రామస్తుల కదలికలను నిశితంగా గమనిస్తున్నారు. ఈ వివరాలను అప్పటికప్పుడే ఉన్నతాధికారులకు జేరవేస్తున్నారు. దీంతో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా వాటిని మొగ్గలోనే అణిచివేసే వీలు చిక్కింది. ఖాకీల నీడన కాలం వెళ్లదీస్తున్న రాజధాని ప్రాంతంలో ఇంకా భూమి ఇవ్వడానికి నిరాకరిస్తున్న రైతుల్లో కొంత అయోమయ వాతావరణం నెలకొంది. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని గందరగోళం ఏర్పడింది. ఇస్తే ఏమవుతుంది? ఇవ్వకుంటే ఏమవుతుంది? అన్న శషభిషల మధ్య ఏం చేయాలో దిక్కుతోచని దుస్థితిలోకి అనివార్యంగా జారిపోయారు. అయితే భూ సేకరణ అధికారికంగా ప్రారంభించగానే పైకి అంతా స్తబ్దుగా ఉన్నట్లు కనిపిస్తున్నా... ఏ గ్రామంలో చూసినా దీనిపైనే ఎడతెగని చర్చ జరుగుతూనే ఉంది. మరో వైపు భూ సేకరణ మినహా మిగిలిన అంశాలతో తనకు సంబంధం లేదన్నట్లుగా సీఆర్డీఏ తన పనిని చకచకా చేసుకుంటూ ముందుకు పోతోంది. -
ప్రభుత్వ వైద్యులపై ఇంటెలిజన్స్ కన్ను!
సాక్షి, గుంటూరు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల పనితీరుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ మేరకు వైద్యుల హాజరు, ఆస్పత్రుల్లో ఎంతసేపు ఉంటున్నారు, ప్రైవేటుగా ఆస్పత్రులు నిర్వహిస్తున్నారా, ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారా..? అనే అంశాలపై ఇంటెలిజన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కుక్కకాటు బాధితునికి వైద్యచికిత్స అందకపోవటంపై దుమారం రేగటంతో అప్రమత్తమైన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో పరిస్థితి.. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ విధుల్లో ఉండాల్సిన ప్రభుత్వ వైద్యుల్లో ఎక్కువమంది మధ్యాహ్నానికే ప్రైవేటు వైద్యశాలలకు చెక్కేస్తున్నారు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో అప్పటి కలెక్టర్ సురేశ్‌కుమార్ గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో వైద్యుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ హాజరు పట్టీల తనిఖీ, మధ్యాహ్నం ఆస్పత్రి నుంచి వెళ్తున్న వైద్యులను గేటు వద్ద ఆపి హెచ్చరించడం వంటి చర్యలు తీసుకున్నా పెద్దగా ఫలితం దక్కలేదు. అప్పట్లో ప్రారంభించిన బయోమెట్రిక్ విధానం తూతూమంత్రంగా అమలవుతోంది. ఇక జిల్లాలోని సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చాలామంది వైద్యులు జిల్లా కేంద్రం నుంచి వెళ్ళివస్తున్నా రు. వారంలో రెండు మూడు రోజులు విధులకు డుమ్మా కొడుతున్నారు. దీనిపై ఫిర్యాదులు వచ్చినా ఇన్నాళ్లూ పట్టించుకోలేదు.ఉద్యోగులకూ అందని ఉచిత వైద్యసేవలు.. ప్రభుత్వ హెల్త్‌కార్డులున్న ఉద్యోగులకు ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సేవలందించాలని ప్రభుత్వం ఆదేశించింది. వీరికోసం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రత్యేక ఓపీ ఏర్పాటు చేయూలని సూచించింది. అయితే మధ్యాహ్నానికే చెక్కేస్తున్న ప్రభుత్వ వైద్యులు దీన్ని పట్టించుకోవటం లేదు. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. వైద్యుల జాబితా సిద్ధం! .. సొంతంగా ఆస్పత్రులు నిర్వహిస్తున్న, కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యుల జాబితాను పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఇంటెలిజన్స్ అధికారులు ఈ పనిలో ఉన్నట్టు సమాచారం. ఇందులోభాగంగా జీజీహెచ్, గుంటూరు వైద్యకళాశాలలకు వెళ్లి ప్రభుత్వ వైద్యుల జాబితాను తీసుకున్నారని తెలిసింది. -
పేట్రేగిన దొంగలు
సాక్షి, గుంటూరు/వట్టిచెరుకూరు/విద్యానగర్: జిల్లాలో ఎన్నడూ లేని విధంగా దోపిడీ దొంగలు లరేగిపోతున్నారు. ఇనుపరాడ్లతో దాడులకు పాల్పడుతున్నారు. గ్రామ శివారులో ఉన్న ఇళ్లు,పెట్రోలు బంకులే లక్ష్యంగా బీభత్సం సృష్టిస్తున్నారు. అర్బన్ జిల్లా పరిధిలో దోపిడీ దొంగల ముఠాలు సంచరిస్తున్నట్టు గత నెల 19న నిఘా వర్గాలు చేసిన హెచ్చరికలు నిజమవుతున్నాయి. దోపిడీకి యత్నించే సమయంలో అడ్డుకునేవారిపై కత్తులు, రాడ్లతో దాడులు చేయడానికి కూడా ముఠాలు వెనకాడబోవని నిఘా వర్గాలు చెప్పిన మాటలు అక్షరాలా జరుగుతున్నాయి. ఈ హెచ్చరికలకు పోలీసు ఉన్నతాధికారులు సైతం స్పందించిన దాఖలాలు లేవనడానికి జిల్లాలో వరసగా జరుగుతున్న దొంగతనాలు, దోపిడీలే సాక్ష్యాలు.. నిఘా వర్గాలు హెచ్చరించిన పది రోజుల్లోనే రెండు దోపిడీలు జరగడం పోలీస్ అధికారుల పనితీరును శంకిస్తోంది. వట్టి చెరుకూరు శివారులో ఉన్న పెట్రోలు బంకు(ఆగ్రో అండ్ ఆయిల్ ఫిలింగ్ స్టేషన్)పై గుర్తుతెలియని దుండగులు దాడిచేసి, అందులో పనిచేస్తున్న ముగ్గురు యువకులను తీవ్రంగా గాయపరచి రూ. ఆరువేల నగదు దోచుకెళ్లారు. వట్టిచెరుకూరు నెహ్రూనగర్‌కు చెందిన కారుమూరి చిన్నబాబు, రెంటచింతల మండలం పాల్వారుు గ్రామానికి చెందిన దాదిబత్తిన మణికంఠ, గాలి సత్యనారాయణ సాయంత్రం విధులు నిర్వర్తిస్తున్నారు. రాత్రి 11గంటల వరకూ వచ్చిన కలెక్షన్ మొత్తాన్ని యజమానికి ఇచ్చేసి, రాత్రి మేనేజర్ రూమ్‌లో పడుకున్నారు. వేకువజామున కొందరు దుండగులు వచ్చి పెట్రోలుకావాలని అడిగారు. తలుపు తెరచిన యువకులపై ఇనుపరాడ్లతో దాడిచేసి విచక్షణారహితంగా కొట్టి వారి వద్ద ఉన్న దాదాపు రూ. ఆరువేల రూపాయలు అపహరించుకుపోయూరు. వెళ్తూ వెళ్తూ బయట గడిపెట్టారు. ఉదయం 5గంటల ప్రాంతంలో పెట్రోలు కోసం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ రవి రాగా గది నుంచి రక్తపు మరకలతో ఉన్న చెయ్యి ఎత్తి బాధితుడు సైగ చేశాడు. రవి దగ్గరకు వెళ్లి చూసి పరిస్థితిని అర్థం చేసుకుని గ్రామానికి చెందిన వల్లూరి గోపాలకృష్ణ అనే వ్యక్తికి విషయం చెప్పాడు. వెంటనే ఆయన బంక్ మేనేజర్ శివకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న బంకు ఓనర్ శ్రీనివాస రెడి అక్కడకు చేరుకుని రక్తపుమడుగులో ఉన్న యువకులను 108 ద్వారా గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను పరీక్షించిన వైద్యులు ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని 48 గంటలు గడిస్తే గానీ చెప్పలేమని తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఎస్సై ప్రసాద్ రెడ్డి అందించిన సమాచారంతో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. వరికోత మెషిన్వద్ద ఆగిన జాగిలాలు పోలీసు జాగిలాలు వచ్చి పెట్రోలు బంకునుంచి ఎదురుగా ఉన్న వరికోత మెషిన్వద్దకు చేరుకుని, అక్కడినుంచి గ్రామంలోని ఎలిమెంటరీ స్కూల్ సమీపంలోగల వరికోత మెషిన్ డ్రైవర్ సేవిక్, క్లీనర్ భూటాసింగ్ ఉండే గదివద్ద తచ్చాడారుు. పంజాబ్ నుంచి వరికోత మెషిన్ నిర్వహణకు ఇద్దరిని స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి తీసుకువచ్చారు. ఆ వచ్చిన ఇద్దరిపైనే పోలీసులు అనుమానిస్తున్నారు. వరికోత మెషిన్ యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. సంఘటన స్థలాన్ని అర్బన్ ఎస్పీ రాజేష్ కుమార్, సౌత్ జోన్ డీయస్పీ నరసింహ, సీఐ శ్రీనివాసరావు చేరుకుని పరిశీలించారు. పోలీసుల అలసత్వం వల్లే దోపిడీలు జిల్లాలో చోరీలు, చైన్ స్నాచింగ్‌లు, దోపిడీలు, దొంగతనాలు వరసగా జరుగుతున్నా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడం లేదని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. గత నెల 21న గోరంట్ల గ్రామంలో ఊరి బయట ఉన్న ఓ గృహంలోకి ప్రవేశించిన దోపిడీ దొంగలు పని మనిషిని కట్టి పడేసి యథేచ్ఛగా ఇల్లు దోచుకున్నారు. సుమారు రూ. 30 లక్షల విలువ చేసే సొత్తుతోపాటు నగదును దర్జాగా కారులో తీసుకెళ్లారు. అయితే ఈ సంఘటనలో ఎవరిపైనా దాడి చేయకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. బదిలీలపై చూపుతున్న శ్రద్ధ విధులపై చూపించడం లేదని, దీంతో పోలీసు శాఖ నిద్రావస్థలోకి వెళ్లిందని వ్యాఖ్యానిస్తున్నారు. వరసగా సంఘటనలతో పెట్రోలు బంకులు, వైన్స్‌లు, రెస్టారెంట్లు, ఊరికి దూరంగా ఉండే గృహాల్లో ఉండే వారు భయాందోళనకు గురవుతున్నారు. -
విచారణ షురూ!
కరీంనగర్ క్రైం : జిల్లా కేంద్రంలోని ఐఎంఎల్ డిపోలో హమాలీల నియామకం కోసం పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసిన వ్యవహారంపై విచారణ మొదలైంది. వసూళ్ల వ్యవహారంపై ‘హమాలీ సొమ్ము హాంఫట్’ శీర్షికన ‘సాక్షి'లో శనివారం కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ విషయమై ఇంటెలిజెన్స్ వర్గాలు ఆదివారం హమాలీలను కలిశాయి. హమాలీల నియామకానికి డబ్బులు ఎవరు వసూలు చేశారు? అందులో ఎవరికెంత ముట్టజెప్పారనే అంశంపై వివరాలు సేకరించాయి. ఈ సందర్భంగా కొందరు హమాలీలు తమకు తెలిసిన అన్ని విషయాలను ఇంటెలిజెన్స్ వర్గాల ముందుంచినట్లు తెలిసింది. మరోవైపు ఈ మొత్తం వ్యవహారం, ఐఎంఎల్ డిపోలో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ జిల్లా జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్‌కు లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన ఎక్సైజ్ కమిషనర్ శనివారం సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. కమిషనర్ ఆదేశాల మేరకు శనివారం రాష్ట్ర ఎక్సైజ్ విజిలెన్స్ అధికారులు జిల్లాకు చేరుకున్నారని సమాచారం. పూర్తి స్థాయిలో విచారణ జరిగి కమిషనర్‌కు వీరు సమగ్ర నివేదిక అందించనున్నట్లు తెలిసింది. పనిచేయని సూత్రధారి ఫోన్ హమాలీలుగా 26 మందిని డిపోలో చేర్పించడానికి వారి నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన కీలకమైన సూత్రధారి ఫోన్ రెండు రోజుల నుంచి పనిచేయడం లేదని తెలిసింది. దీంతో డబ్బులు ఇచ్చిన పలువురు హమాలీలు అందోళనలో పడిపోయారు. శనివారం ఉదయం నుంచి సదరు సూత్రధారి కోసం ఆరా తీసినా ఎలాంటి సమాచారం లభ్యం కాకపోవడంతో వారు తలలు పట్టుకుంటున్నారు. సదరు సూత్రధారి గతంలో పలు చోట్ల ఇలాంటి దందాలు నడిపించాడని తెలిసిన ఎక్సైజ్ అధికారులు అతడు పనిచేసిన చోట జరిగిన దందాలపై దృష్టి సారించారని సమాచారం. ఈ దందాలో డిపోకు చెందిన ఇద్దరు అధికారుల పాత్రపై కూడా విచారణ వేగవంతం చేశారు. సదరు అధికారులపై కొంతకాలంగా ఆరోపణలొస్తున్నాయని, మద్యం దుకాణదారుల నుంచి మామూళ్ల రూపంలో లక్షలాది రూపాయలు వసూలు చేయడం, ఇవ్వని వారిని ఇబ్బందులు పెట్డడంతో సిద్ధహస్తులని పలువురు మద్యం వ్యాపారులు పేర్కొంటున్నారు. విచారణ కోరిన మాట వాస్తవమే : జేసీ ఐఎంఎల్ డిపోలో జరుగుతున్న పరిణామాలు, హమాలీల నుంచి డబ్బులు వసూలు తదితర అంశాలపై సమగ్రంగా విచారణ జరిపించాలని రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ నదీం అహ్మద్‌కు లేఖ రాసిన మాట వాస్తవమేనని జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. ఎక్సైజ్ కమిషనర్ నుంచి వచ్చే అదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని జేసీ తెలిపారు. భయాందోళనలో హమాలీలు హమాలీల నియామకం వెనుక కోట్ల రూపాయలు చేతులు మారిన విషయం వెలుగులోకి రావడం... దీనిపై విచారణ మొదలు కావడంతో ఏళ్ల తరబడి పనిచేస్తున్న హమాలీల్లో ఆందోళన మొదలైంది. ఈ వ్యవహారంలో ప్రమేయం లేనప్పటికీ రాజకీయ నాయకులు, కొందరు అధికారులవల్ల తాము ఇబ్బందుల్లో పడాల్సి వస్తోందని హమాలీలు వాపోతున్నారు. హమాలీలకు న్యాయం చేయండి : సీఐటీయూ ఈ వ్యవహారంపై అధికారులు జోక్యం చేసుకుని విచారణ జరిపి హమాలీలకు న్యాయం చేయాలని ఏపీబీసీఎల్ ఐఎంఎల్ హమాలీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రాగం సురేందర్ శనివారం ఒక ప్రకటనలో అధికారులను కోరారు. ఈ వ్యవహారంపై పత్రికల్లో వస్తున్న కథనాల నేపథ్యంలో హమాలీ కుటుంబాలు భయందోళనలో ఉన్నాయని అవేదన వ్యక్తం చేశారు. హమాలీల్లో ఎవరికైనా దెబ్బలు తగిలినా, ప్రమాదాలు జరిగినా వారి స్థానంలో కుటుంబసభ్యులకు పనిచేసే అవకాశం తమ సంఘం తరఫున కల్పిస్తామన్నారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా అధికారుల ఆదేశాల మేరకు కైకిలి కింద ఇతరులను పనిలోకి తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. బ్రేకేజీ పేరిట దందా! కరీంనగర్ క్రైం : జిల్లా కేంద్రంలోని మద్యం డిపో తరచూ ఆదినుంచి వివాదాలకు కేంద్రంగా మారిందనే విమర్శలున్నాయి. తాజాగా హమాలీల నుంచి కోట్లాది రూపాయలు దండుకుని వారిని చేర్చుకునే ప్రయత్నం బయటకు పొక్కడంతో ఒక్కసారిగా డిపోపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. దీంతో కొన్నేళ్లుగా ఇక్కడ జరుగుతున్న దందాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని సమాచారం. అన్లోడింగ్ సమయంలో స్టాక్ బ్రేకేజీ పేరిట మరో దందా సాగిస్తున్నారని తెలిసింది. జిల్లాలోని వైన్స్‌లు, బార్లకు ఐఎంఎల్ డిపో నుంచి మద్యం సరఫరా అవుతుంది. స్టాక్ కోసం డిపోకు వెళ్తే మామూళ్లు ఇవ్వనిదే పని జరగడం లేదనే ఆరోపణలున్నాయి. మామూళ్లకు నిరాకరిస్తే సవాలక్ష కారణాలు చూపుతూ రాత్రి వరకు డిపో వద్దే ఉంచుకోవడం... లేదా మరునాడు రావాలని చెప్తుంటారని పలువురు పేర్కొంటున్నారు. పగిలిన సీసాలు, ఇన్వాయిస్ నంబర్లకు బదులు ఇతర నంబర్లున్న మద్యం పెట్టెలు ఇస్తున్నారని వాపోతున్నారు. లారీలో వచ్చిన మద్యాన్ని దింపేప్పుడు మద్యం సీసాలు పగిలిపోకున్నా బ్రేకేజీ పేరిట ప్రతీ లారీకి 6 నుంచి 8 పెట్టెలు పక్కన పెడుతున్నారని, దీనికి ఒప్పుకుంటేనే లారీలను గోదాంలోకి రానిస్తున్నారని, లేకుంటే వారాల తరబడి బయటే వేచి ఉండేలా చేస్తున్నారని లారీల వారు, మద్యం కంపెనీలవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిస్టిలరీ నుంచి డిపోకు వస్తున్న వాటిలో ఒకటి, రెండు బాటిళ్లు పగిలితే 10 నుంచి 12 పెట్టెల వరకు సీసాలు పగిలినట్లు లెక్కలు రాస్తున్నట్లు సమాచారం. దీనిపై నిఘా లేకపోవడంతో అక్రమాలకు అంతే లేకుండా పోయిందని, ఇలా వందలాది పెట్టెలు ఇతర వైన్స్‌లకు బయట విక్రయిస్తున్నారని తెలిసింది. లారీలోని మద్యం దింపేందుకు ఒక్కో లారీకి రూ.వెయ్యి వరకు వసూలు చేస్తారని తెలిసింది. ఎక్కువగా అమ్ముడుపోని మద్యం అమ్మేందుకు ఆయా కంపెనీల ప్రతినిధులతో మిలాఖత్ అయి రెగ్యులర్ బ్రాండ్లు అందుబాటులో ఉంచడం లేదని ఆయా రకం మద్యం స్టాక్ లేదని చూపుతూ ఒప్పందం చేసుకున్న మద్యాన్ని వైన్స్‌లకు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో వేలాది రూపాయలు చేతులు మారుతున్నట్లు సమాచారం. ఈ అక్రమాలపై సమగ్ర విచారణ చేయిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని పలువురు పేర్కొంటున్నారు. -
పోలీస్ ఆపరేషన్ లో 13మంది జిహాదీల అరెస్ట్
వియన్నా: తీవ్రవాద సంస్థలు తమ కార్యకలాపాల కోసం యువకులకు జిహాదీలో చేరేలా ప్రేరేపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తీవ్రవాద చర్యలను అడ్డుకునేందుకు పోలీసు యంత్రాంగం పెద్దఎత్తునా ఆపరేషన్‌ను మొదలుపెట్టింది. ఆస్ట్రియాలో జిహాదీలుగా అనుమానించిన 13మందిని ఆస్ట్రియన్ పోలీసు అధికారులు అరెస్ట్ చేశారు. సిరియా సరిహద్దు ప్రాంతంలో తీవ్రవాద సంస్థల వద్ద యువకులు జిహాదీ శిక్షణ తీసుకుంటున్నారనే అనుమానంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. జిహాదీలుగా అనుమానించిన 16మందిని లక్ష్యంగా పోలీసులు ఈ అపరేషన్‌ను మొదలుపెట్టారు. దీనిలో భాగంగా అనుమానిత ప్రాంతాల్లోని ఇళ్లలో సోదాలు జరిపారు. ఈ ఆపరేషన్‌లో దాదాపు 900 మంది పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సూచించిన దానిప్రకారం.. అనేకమంది యువకులు జిహాదీలో చేరుతున్నట్టు సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు జరిపారు. సోదాలు చేసిన ఇళ్లలో ఉగ్రవాదుల సంబంధిత వస్తువులతోపాటు డేటా స్టోరేజ్ డివైజ్‌లు, నగదు, బ్రెస్ నక్లెస్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
నిజమే... అది అవినీతి జైలే!
* గుడివాడ సబ్‌జైలులో తవ్విన కొద్దీ అవినీతి * ఇంటెలిజెన్స్ అధికారుల ఆరా * సాక్షి కథనంతో మరిన్ని వాస్తవాలు గుడివాడ : గుడివాడ సబ్‌జైలులో కొంత మంది జైలు అధికారుల అవినీతి తవ్విన కొద్దీ బయట పడుతోంది. అక్కడ జరుగుతున్న అవినీతి బాగోతంపై ‘గుడివాడ సబ్‌జైలులో అవినీతి కంపు’ శీర్షికన శనివారం ఓ కథనం ప్రచురితమయ్యింది. దీంతో డబ్బు కోసం జైలు సిబ్బంది తమను వేధించిన తీరుపై మరికొంతమంది బాధితులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. చిన్నపని నుంచి పెద్ద పని వరకు అధికారులు నోటికొచ్చినంత అడిగి తీసుకుంటున్నారనే ఆరోపణలకు మరింత బలం చేకూరుతోంది. బెయిల్ రావడం ఆలస్యమయిందని ... జైలు నిబంధనల ప్రకారం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపే బెయిల్ వచ్చిన వారిని బయటకు పంపేందుకు అనుమతి ఉంది. కానీ రేషన్ డీలర్ల వ్యవహారంలో రెండో బ్యాచ్‌లో అరెస్టు అయ్యి జైలుకు వెళ్లిన వారిలో 12 మందికి రెండో రోజు సాయంత్రం 6.30 గంటల తరువాత బెయిల్ మంజూరయింది. దీంతో సూర్యాస్తమయం అయింది కాబట్టి బయటకు పంపలేమన్నారు. అయితే ఇందుకోసం రూ.60వేలు లంచంగా ఇస్తే రాత్రి 9.30 గంటల సమయంలో బయటకు పంపారని విశ్వసనీయ సమాచారం. మజ్జిగ ప్యాకెట్ పంపడానికి రూ.వెయ్యి... జైలులో ఉన్న రేషన్ డీలర్లలో ఒకరు అనారోగ్యం కారణంగా మజ్జిగ ప్యాకెట్ కావాలని చెప్పడంతో వారి కుటుంబ సభ్యులు ఒక మజ్జిగ ప్యాకెట్‌ను ఫలానా వారికి ఇవ్వాలని జైలు సిబ్బందిని అడిగారు. దీంతో ఒక మజ్జిగ ప్యాకెట్‌కు రూ.వెయ్యి అవుతుందని చెప్పగా గుడ్లు తేలేసిన కుటుంబ సభ్యులు ‘మా నాన్న మజ్జిగ తాగకపోయినా ఫర్వాలేదుగానీ అంత డబ్బు ఇవ్వలేమని వెనుతిరిగి వెళ్లిపోయారని చెబుతున్నారు. ములాఖత్ ఉంటే పంట పండినట్లే.... జైలులో ఉన్న నిందితులు, ముద్దాయిల కోసం కుటుంబ సభ్యులు స్నేహితులు వస్తుంటారు. అయితే జైలులో ఉన్న వ్యక్తికి వారానికి ఒకరితో మాత్రమే ములాఖత్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అధికారులు అనధికారికంగా లంచాలు దండుకుంటూ రోజుకు పదుల కొద్దీ ములాఖత్‌లు ఇస్తుంటారని చెబుతున్నారు. ఒక్కో సారికి రూ.300 చొప్పున సమర్పించుకుంటేనే అవకాశం ఉంటుందని బాధితులు చెబుతున్నారు. అయితే నిబంధనలకు విరుద్ధం కాబట్టి రికార్డుల్లో మాత్రం కలసిన వారి పేర్లు ఉండవని తెలుస్తోంది. ఇంటిలిజెన్స్ వర్గాలు ఆరా.... గుడివాడ సబ్‌జైలులో జరుగుతున్న అవినీతి బాగోతంపై ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. జైలులో వెలుగు చూస్తున్న అవినీతి అంశాలపై శనివారం ఉదయం నుంచి ఇంటెలిజన్స్ పోలీసులు పలు మార్గాల్లో ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. అవినీతిపై గుడివాడకు చెందిన సామాజిక కార్యకర్త జిల్లా జైలు అధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇప్పటికైనా జైలులో అవినీతిని నిర్మూలించే దిశగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. -
మాల్స్‌లో నిఘా
కేంద్ర నిఘావర్గాల హెచ్చరికతో నగరంలోని మాల్స్, మల్టీప్లెక్స్, థియేటర్లు, హోటళ్లలో భద్రతను కట్టుదిట్టం చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. రద్దీ ప్రాంతాలపై తీవ్రవాదులు గురి పెట్టారన్న సంకేతాలున్నాయి. దీంతో శనివారం మాల్స్, మల్టీప్లెక్స్ యాజమాన్యాలతో పోలీసులు చర్చించారు. చేపట్టాల్సిన భద్రత ఏర్పాట్లను వివరించారు. సాక్షి, చెన్నై: మహానగరంలో ఇటీవల మాల్స్, మల్టీప్లెక్స్‌ల సంస్కృతి పెరిగింది. ఓ వైపు షాపింగ్ మరో వైపు సినిమా స్క్రీన్స్ వీటిలో ఉండడంతో జనం అటు వైపుగానే మొగ్గు చూపుతున్నారు. నగరంలో, శివారుల్లో కూడా ఈ మాల్స్, మల్టీప్లెక్స్‌ల సంఖ్య పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో జన సంచారం అత్యధికంగా ఇక్కడే ఉండడంతో, తీవ్ర వాదులు వాటిపై గురి పెట్టినట్టు సంకేతాలు వెలువడ్డాయి. రెండు రోజుల క్రితం నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్‌కు, శుక్రవారం సీబీఐ కార్యాలయానికి వచ్చిన బాంబు బెదిరింపులకు తోడుగా జన సంచారం అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో కుట్రలకు వ్యూహ రచన జరిగినట్టుగా నగర పోలీసు యంత్రాంగానికి సమాచారం అందింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. జన సంచారం అధికంగా ఉండే, అన్ని మాల్స్, మల్టీప్లెక్స్, థియేటర్లు, రెస్టారెంట్లు, హోటళ్లలో భద్రతను కట్టుదిట్టం చేయాలని కమిషనర్ జార్జ్ ఆదేశాలు జారీ చేశారు. నిఘా కట్టుదిట్టం : నగరంలోని అన్ని మాల్స్, మల్టీప్లెక్స్‌లలో, థియేటర్లలో ప్రస్తుతం కల్పించిన భద్రతను, అక్కడున్న ఏర్పాట్లను తెలుసుకునేందుకు పోలీసు యంత్రాంగం నిర్ణయించింది. ఓ వైపు భద్రత కట్టుదిట్టానికి చర్యలు తీసుకుంటూనే, ఆయా మాల్స్, మల్టీప్లెక్స్‌ల ప్రతినిధులతో సమావేశానికి పిలుపునిచ్చింది. దీంతో మధ్యాహ్నం కమిషనరేట్‌లో అదనపు కమిషనర్ (దక్షిణం) అభయ్‌కుమార్ నేతృత్వంలో సమావేశం జరిగింది. ఆయూ ప్రాంతాల్లో ఉన్న భద్రతా ఏర్పాట్లను ఆరా తీశారు. ఇక మీదట చేపట్టాల్సిన భద్రతా చర్యలను వివరించారు. ప్రతి మాల్లోని అన్ని ప్రవేశ మార్గాల్లో ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది సంఖ్యను పెంచాలని, మెటల్ డిటెక్టర్ల సంఖ్యను పెంచాలని, ఆ పరిసరాల్లో సీసీ కెమెరాలు మరిన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. కంట్రోల్ రూం ద్వారా ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల్లోని దృశ్యాలు పరిశీలించాలని, 24 గంటల్లో నమోదైన దృశ్యాల్ని మరో మారు పరిశీలించి ఏదేని అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవడం లేదా, పోలీసుల సాయం కోరేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. మాల్స్‌లోని అన్ని దుకాణాల్లోను నిఘా నేత్రాలు తప్పని సరి అని, ప్రతి వినియోగ దారుడిని క్షుణ్ణంగా తనిఖీలు చేసినానంతరం లోనికి అనుమతించాలని సూచించారు. పార్కింగ్ స్టాండ్లలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రతి వాహనాన్ని తనిఖీలు చేసినానంతరం లోనికి అనుమతించాలని ఆదేశించారు. తాము జరిపే తనిఖీల్లో ఏదేని భద్రతా లోపాలు ఉంటే సంబంధిత మాల్స్, థియేటర్లపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. నగరంలోని రెస్టారెంట్లు, స్టార్ హోటళ్ల ప్రతినిధులతో మంగళవారం సమావేశానికి నిర్ణయించారు. -
సాగర్‌డ్యాంను సందర్శించిన ఇంటెలిజెన్స్ బృందం
నాగార్జునసాగర్: దేశంలో ఉగ్రవాదుల దాడుల హెచ్చరికల నేపథ్యంలో సోమవారం ఇంటెలిజెన్స్ బృందం నాగార్జునసాగర్ డ్యాం ను సందర్శించింది. బృందం సభ్యులు మొదట గార్డ్‌రూములు, కాపలా ఉండే గార్డుల సంఖ్యను, సీసీ కెమెరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. డ్యాం భద్రతపై ఆరా తీశారు. గ్యాలరీలలోకి దిగి ఆయాప్రాంతాలను సందర్శించారు. ఎస్పీఎఫ్ సిబ్బందికి కావాల్సిన భద్రత సామగ్రిని, గార్డుల సంఖ్యను పెంచాలని ప్రాజెక్టు అధికారులకు సూచించినట్లు తెలిసింది. సందర్శించిన వారిలో ఇంటెలిజెన్స్ డీఎస్పీ లక్ష్మినారాయణరెడ్డి బృందం వెంట డ్యాం ఈఈ విష్ణుప్రసాద్, ఎస్పీఎఫ్ అధికారులు ఉన్నారు. -
చీపురుపల్లి లొల్లిపై బాబు ఆరా!
సాక్షి ప్రతినిధి, విజయనగరం :చీపురుపల్లి టీడీపీ వ్యవహారంపై ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆరాతీస్తున్నారు. అక్కడేం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఇంటెలిజెన్స్ అధికారులకు ప్రత్యేక ఆదేశాలిచ్చారు. ఇప్పుడదే పనిలో ఆ అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే పలు నివేదికలు ఇచ్చారు. పా ర్టీలో అంతర్గత కుమ్మలాటలెక్కువయ్యాని, క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య సత్సంబంధాల్లేవని, మంత్రి మృణాళిని స్థానిక నేతలను ఏమాత్రం పట్టిం చుకోవడం లేదన్న ఆరోపణలను సైతం ఇంటెలిజెన్స్ అధికారులు చంద్రబాబుకు నివేదించినట్టు తెలిసింది. చీపురుపల్లి నియోజక వర్గ పరిస్థితి దా రుణంగా ఉందని, చక్కదిద్దకపోతే రచ్చకెక్కే అవకాశం ఉందని భావించిన చంద్రబాబు ఆ బాధ్యతలను ఓ మంత్రికి అప్పగించినట్టు తెలిసింది. చీపురుపల్లిలో పార్టీ వర్గాలను మంత్రి మృణాళిని పట్టించుకోవడం లేదని ఆ పార్టీలో కొందరు నాయకులు బాహాటం గా వ్యాఖ్యానిస్తున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవమివ్వడం లేదని, మండల స్థాయిలో జరిగే అధికారిక కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదని, అధికారుల తో జరిగే సమీక్షలు, సమావేశాలకు స్థానిక సంస్థల ప్రతినిధులను పాల్గోనివ్వడం లేదన్న విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. మండలాల వారీగా నాయకులు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకుని మం త్రి మృణాళిని తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి మృణాళిని విషయం అటుంచితే మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు వ్యవహారం ఆ పార్టీ నేతలకు మరింత మింగుడు పడడం లేదు. తరుచూ పార్టీని తిట్టిపోసి బయటికెళ్లి వస్తున్న గద్దే అంతా తానై అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని చాలా మంది మధన పడుతున్నారు. కష్టపడి పనిచేసిన నాయకులను పక్కన పెట్టి ఆయనకే ప్రాధాన్యం ఇస్తున్నారని, దీని వెనుక అధిష్టానం వద్ద ఉన్న లాబీయింగే కారణమని ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా ఎన్నికల ముందు వరకు పార్టీ పెద్ద దిక్కుగా ఉన్న కె.త్రిమూర్తులరాజును దాదాపు విస్మరించారని, ఆయనకు ఏమాత్రం విలువ లేకుండా చేసేశారని ఆయన వర్గీయులు తీవ్ర అసంతృప్తి చేస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో పార్టీ నాయకులు మూడు గ్రూపులగా విడిపోయి ఆరోపణలు చేసుకుంటున్నారు. మండలాల వారీగా గ్రూపులు ఇక, మండలాల వారీగా నాయకులు గ్రూపులు కట్టి పనిచేస్తున్నారు. చీపురుపల్లిలో జెడ్పీటీసీ మీసాల వరహాలనాయుడు, ఎంపీపీ మధ్య విభేదాల చోటు చేసుకున్నాయి. మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల విషయంలో చెలరేగిన మనస్పర్థలు చివరికి ఆధిపత్య పోరుకు దారితీసింది. ఎంపీపీ భర్త, మండల పార్టీ అధ్యక్షుడు రౌతు కామునాయుడు తన సత్తా ఏంటో చూపించేందుకు మీసాల వరహాలనాయుడు అనుచరుడైన కర్రోతు రమణను ఏకంగా పార్టీన నుంచి బహిష్కరించేందుకు సిద్ధమయ్యారు. ఆ ఒక్క మండలంలోనే కాదు దాదాపు అన్ని మండలాల్లోనూ ఇదే తరహా బేదాభిప్రాయాలు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి గందరగోళంగా తయారైంది. ఇంతజరుగుతున్నా మంత్రి ఏమాత్రం పట్టించుకోవడం లేదని, కనీసం కూర్చోపెట్టి మాట్లాడే పరిస్థితి లేదని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ పరిస్థితిని చక్కదిద్దే పనిని ఓ మంత్రికి అప్పగించినట్టు తెలిసింది. -
మదురైలో ‘మర్డర్లు’!
మదురై నగరంలో 24 గంటల్లో ఐదుగురు హత్యకు గురికావడం అక్కడి ప్రజల్లో భయాందోళన రెకెత్తించింది. మృతుల్లో ఇద్దరు డీఎంకే నాయకులు ఉన్నారు. మరో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు. ఈ హత్యల పర్వంతో పోలీసు యంత్రాంగం పరుగులు తీసింది. ఐదు ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దించింది. సాక్షి, చెన్నై: మదురై నగరంపై తీవ్ర వాదులు గురిపెట్టినట్టు ఇటీవల ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీంతో అక్కడి పోలీసులు అప్రమత్తమయ్యారు. మీనాక్షి అమ్మవారి ఆలయ పరిసరాల్ని నిఘా నీడలోకి తెచ్చారు. నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అయినా నగరంలో సాగుతున్న దోపిడీలు, దొంగ తనాలు, హత్యల పర్వం స్థానికుల్ని భయాందోళనలో పడేస్తున్నాయి. శుక్రవారం 24 గంటల వ్యవధిలో నగరంలో ఐదుగురు దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది. హత్యల పర్వం: శుక్రవారం వేకువ జామున నగరం పరిధిలోని పుదుమేడు పరిసరాల్లో ఓ వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. ఉదయాన్నే వచ్చిన ఫోన్‌కాల్‌తో అక్కడికి నగర పోలీసు యంత్రాంగం పరుగులు తీసింది. మృతుడు ఆ ప్రాంతానికి చెందిన డీఎంకే నాయకుడు ముత్తు పాండియన్‌గా గుర్తించారు. ఇటీవల కుటుంబ తగాదాలతో ముత్తుపాండియన్ భార్య పూర్ణిమ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు ప్రతీకరంగానే ముత్తుపాండియన్ హతమార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇదిఆవుండగా తల్లకులంలో మరో హత్యాకాండ చోటుచేసుకుంది. రవికుమార్, రామకృష్ణ, కరుప్పయ్య వ్యాపారులు. అక్కడి ఓ ప్రాంతంలో మాటామంతిలో మునిగి ఉన్నారు. ఆ సమయంలో అటు వైపుగా వచ్చిన ఓ ముఠా వీరంగం సృష్టించింది. కరుప్పయ్యను టార్గెట్‌చేసి కత్తులు, కొడవళ్లతో నరికి చంపింది. మృతుడు కరుప్పయ్య డీఎంకే స్థానిక నాయకుడు. సమాచారం అందుకున్న నగర పోలీసులు ఉరకలు తీశారు. విచారణలో రియల్ ఎస్టేట్ వ్యవహారం కరుప్పయ్య హత్యకు కారణంగా భావించారు. ఒకే చోట ముగ్గురు: మదురై పోలీసుల్ని సాయంత్రం నాలుగు గంటల సమయంలో మరో ఘటన పరుగులు తీయించింది. ఒకే చోట ముగ్గురిని ఓ ముఠా కడతేర్చడం కలకలం రేపింది. మీనాంబికానగర్లో తమ ఇంట్లో టీవీ చూస్తున్న స్నేక్ నాగరాజు, కరుప్పురాజ, మణికార్తిక్ దారుణ హత్యకు గురయ్యారు. టీవీ చూస్తున్న సమయంలో అటువైపుగా పది మందితో కూడిన ఓ ముఠా వారిపై దాడి చేసింది. ఎలాంటి చడీచప్పుడూ లేకుండా ఈ ముగ్గుర్నీ హతమార్చిన ఆ ముఠా నడుచుకుంటూ సాఫీగా ఉడాయించింది. -
భద్రత కరువు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఇటీవల జరిగిన ఎన్నికలలో ఓటమి చెంది ‘మాజీ’లయిన జిల్లా నాయకులకు కొత్త తలనొప్పి వచ్చి పడింది. వారికి ఉన్న భద్రతను తొలగించాలని రాష్ట్రస్థాయిలో ఉండే ‘భద్రతా సమీక్ష కమిటీ’ ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పుడు జిల్లాలో వారికి గన్మెన్లను తొలగించారు. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం జిల్లాలో మొత్తం 30 మందికి పైగా మాజీ ప్రజాప్రతినిధుల భద్రతను తొలగించినట్టు సమాచారం. దీంతో వీరంతా ఇప్పుడు తమ భద్రతను పునరుద్ధరించుకునే పనిలో పడ్డారు. భద్రత ఏర్పాటు చేయాలంటూ ఆయా పార్టీలకు చెందిన రాష్ట్ర స్థాయి నేతలతో జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు సిఫారసులు చేయించుకుంటున్నారు. వారే స్వయంగా లేఖలు రాసి తమ భద్రతను పునరుద్ధరించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో వీరి విజ్ఞప్తులను పరిశీలించిన జిల్లా పోలీసు యంత్రాంగం ఎవరెవరికి భద్రత ఉంచాలనే అంశంపై ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చినట్టు సమాచారం. ఓడిపోయిన వారికి ‘నో’ గతంలో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉండి ఇటీవలి ఎన్నికలలో ఓడిపోయిన నేతలందరికీ దాదాపు భద్రత తొలగించారు. వీరితో పాటు రాజకీయాలతో సంబంధమున్న మరికొందరి ప్రముఖుల భద్రతను కూడా తీసేశారు. ఇలా తీసేసిన వారిలో మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు డాక్టర్లు, విద్యాసంస్థల అధిపతులు, ఇతర ప్రముఖులు ఉన్నట్టు సమాచారం. వీరితో పాటు మాజీ మంత్రులుగా పనిచేసి, ఇప్పుడు ఓడిపోయిన వారు, గెలిచినా ఎమ్మెల్యేలుగా మిగిలిపోయిన వారికి కూడా భ ద్రత త గ్గించేశారు. గతంలో మంత్రిగా పనిచేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ఓ ప్రజాప్రతినిధికి మాత్రం గతంలో ఉన్న భద్రతనే కొనసాగిస్తున్నట్టు పోలీసు వర్గాలు చెపుతున్నాయి. ఇక, మిగిలిన మాజీలందరికీ భద్రతను తొలగించారు. అటు కేంద్రంలో, ఇటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ, టీడీపీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా నాయకులు కూడా ఇందులో ఉన్నారు. దీంతో వీరంతా తమ భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ ఆయా పార్టీల రాష్ట్ర స్థాయి నేతలతో జిల్లా పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తాము భద్రత లేకుండా ఎందుకు తిరగాలని, తమకు వెంటనే భద్రత ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కొందరు మాజీలు పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. ఈ పరిస్థితుల్లో ఆయా నేతల వారీగా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్రస్థాయి ఇంటెలిజెన్స్ విభాగానికి నివేదిక పంపారు. ఈ నివేదికలో ఎవరికి భద్రత అవసరమో లేదో తెలియజేస్తూ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నివేదికను ఇంటెలిజెన్స్ పరిశీలించిన తర్వాతే.. తొలగించిన మాజీలకు మళ్లీ భద్రత పునరుద్ధరించాలా వద్దా అనే దానిపై జిల్లా పోలీసు యంత్రాంగం నిర్ణయం తీసుకోనుంది. -
‘ఇంటెలిజెన్స్’ బలోపేతం !
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లాలో ఇంటెలిజెన్స్ విభాగాన్ని బలోపేతం చేసేదిశగా రాష్ర్ట ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఇప్పటికే డీఎస్పీ పోస్టును కేటాయించిన సర్కార్ కొద్దిరోజుల్లో ఎస్పీ పోస్టు కేటాయించే దిశగా అడుగులు వేస్తోంది. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగానికి కొత్తగా ఎస్పీ పోస్టు రానుంది. ఈ మేరకు అధికారులు ఇప్పటికే ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటివరకు ఇక్కడ కేవలం డీఎస్పీ పోస్టే ప్రధానంగా కార్యాలయం నడుస్తోంది. సీఐతో పాటు ఎస్ఐలు ఇతర సిబ్బంది సమాచార సేకరణలో ఉన్నారు. అయితే ఉత్తరాంధ్రలో విశాఖ తరువాత శ్రీకాకుళానికి ప్రాధాన్యం పెరుగుతుండడం, రాష్ట్ర విభజన తరువాత ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరిగే అవకాశం ఉండడం, రాజకీయ, రాజకీయేతర శక్తులపై నిఘా అవసరం కావడంతో ఇంటెలిజెన్స్ విభాగాన్ని బలోపేతం చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది. ఏపీ రాష్ట్రం ఏర్పడిన తరువాత జిల్లాలు ప్రత్యేకం కావడం, శ్రీకాకుళానికి కొత్తగా మరో రెండు నియోజకవర్గాలు వచ్చే అవకాశం ఉండడం కూడా ఈ అంశానికి బలం చేకూరుతోంది. అలాగే విశాఖతో పోల్చిచూస్తే ఇక్కడి అవసరాల్ని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడే ఎందుకు? ఇంటెలిజెన్స్ విభాగం కూడా ప్రభుత్వానికి నిఘా సంస్థలా పనిచేస్తోంది. వివిధ విభాగాల్లో జరుగుతున్న పనులు, రాజకీయ నేతల ప్రసంగాలు, ముఖ్య నాయకుల భద్రతపైనా ఇక్కడి ఇంటెలిజెన్స్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. కేవలం ప్రభుత్వం అడిగే వివరాలే కాకుండా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు నిఘా కార్యకలాపాలన్నీ నివేదికల రూపంలో ప్రభుత్వానికి అందజేయాల్సిన బాధ్యత ఇక్కడి సిబ్బందిపై ఉంది. అయితే ఇటీవల మాజీ మంత్రి ధర్మానకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని తగ్గించడం, ఈ విషయమై ఆయన పోలీస్‌శాఖకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మావోయిస్టులతో చర్చలు జరిగిన సమయంలో ధర్మాన కూడా ఆ చర్చల్లో పాల్గొనడం జరిగింది. ఈ నేపథ్యంలో తనకు భద్రత అవసరం అని కూడా కోరారు. ఇందుకు అనుగుణంగా కొన్నాళ్ల క్రితం ఆయన ఇంటి పరిసరాల్లో అనుమానితులు సంచరించడంపైనా ధర్మాన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదిచ్చారు. అయితే జిల్లాలో ఇలాంటి సంఘటనలే కాకుండా అనేకానేక అంశాలపై పూర్తిస్థాయిలో విచారణ జరపడం, రహస్యంగా ప్రభుత్వానికి నివేదిక పంపించాల్సిన బాధ్యత ఇంటెలిజెన్స్ విభాగంపైనే ఉంది. ఈ నేపథ్యంలో ధర్మానకు సంబంధించి జిల్లా పోలీసులు సమాచారం సేకరించినా, ఏ క్షణమైనా అప్రమత్తం కావాల్సిన అవసరం ఈ విభాగానికి అవసరం. దీంతో ప్రస్తుతం ఉన్న డీఎస్పీ పోస్టును బలోపేతం చేసి కొత్తగా ఎస్పీ పోస్టుకు పెంచే ఆలోచనలో అధికారులు ఉన్నారు. అంతే కాకుండా కొత్తగా ఎస్పీ పోస్టు వస్తే ఇంటెలిజెన్స్ విభాగాన్ని రూరల్, అర్బన్ విభాగాలుగా కూడా విభజించే అవకాశం ఉందని సిబ్బంది చెబుతున్నారు. శ్రీకాకుళంలోని ఈ విభాగం ప్రస్తుతం అద్దె భవనంలో నడుస్తోంది. వాహనాలు, సిబ్బంది ప్రస్తుతం సరిపడినంతగానే ఉన్నా భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంది. గతంలో ఇక్కడ పనిచేసిన డీఎస్పీ రమణమూర్తి కొన్నాళ్ల క్రితం రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం ముఖ్య కార్యాలయంలో రిపోర్ట్ చేశారు. అనంతరం ఇక్కడి సీఐనే ఇన్చార్జిగా చేశారు. కొత్తగా ఎస్పీ పోస్టు వస్తే ఎస్పీతో పాటు డీఎస్పీల్నీ ఇక్కడ నియమించాల్సిన అవసరం ఉందని సిబ్బంది చెబుతున్నారు. విశాఖ మాదిరే? ఇప్పటివరకూ రీజినల్ ఇంటెలిజెన్స్ అధికారి (ఆర్ఐవో)గా విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాలకు విశాఖ కేంద్రంగానే అధికారి పనిచేస్తున్నారు. విశాఖలో నగర పోలీస్ కమిషనరేట్‌ను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని కూడా అధికారులు గుర్తించారు. పోలీస్ కమిషనర్ (ఐజీ స్థాయి) పోస్టులో అదనపు డీజీ స్థాయికి పెంచనున్నారు. సీపీ పోస్టుకు జవసత్వాలు చూపించి అదనపు డీజీ స్థాయి పోస్టు వస్తుంది కాబట్టి అక్కడి ఇంటెలిజెన్స్ విభాగ పోస్టునూ ఎస్పీ స్థాయికి (ప్రస్తుతం అదనపు ఎస్పీ పోస్టు ఉంది) కూడా పెంచాలన్నది ఓ ఆలోచన. అదే విధంగా శ్రీకాకుళం జిల్లాలో ఎస్పీయే పూర్తిస్థాయి పోలీస్ అధికారిగా పనిచేస్తున్నారు. దీంతో ఇక్కడి ఇంటెలిజెన్స్ విభాగంలోనూ ఎస్పీ స్థాయి పోస్టు ఉంటే ఇద్దరి మధ్య అవినాభావ సంబంధంతో పాటు ప్రభుత్వ యంత్రాంగంపై నిఘా, రాజకీయ, రాజకీయేతర శక్తులపై విచారణ చేయించేందుకు, పలు సమాచార నివేదికలు సంపాదించేందుకు సులువుగా ఉంటుందనేది అధికారుల అభిప్రాయంగా కనిపిస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు పోస్టు పెంపు, భద్రతా బలగాలపై నివేదికలందించడం వీలయ్యే పని కాదని కూడా అధికారులు చెబుతున్నారు. ఎప్పుడో జరిగే పెద్ద పెద్ద సంఘటనల కోసం ప్రస్తుతం ఇంటెలిజెన్స్ విభాగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం ఉన్న డీఎస్పీ అధికారి సమన్వయంతోనే సిబ్బంది పనిచేస్తే సరిపోతుందని కూడా అధికారులు చెబుతున్నారు. ధర్మాన విషయంలో కూడా స్థానిక శాంతిభద్రతల పోలీసులే ప్రభుత్వానికి నివేదిక పంపించి ఉంటారని, తమకేమీ అధికారికంగా సమాచారం అందలేదని ఇంటెలిజెన్స్ సిబ్బంది చెబుతున్నారు. -
జేబులు నింపినఎన్నికలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కొందరు మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు ఎం పీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ‘కాసుల’ వర్షం కురిపించాయి. ఏప్రిల్ 6, 11 తేదీల్లో జిల్లాలోని 584 ఎం పీటీసీ, 36 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికల నిర్వహణకోసం ఒక్కో మండలానికి పోలింగ్ స్టేషన్ల సంఖ్యను బట్టి రూ.4.98 లక్షల నుంచి రూ.14.99 లక్షలు విడుదల కాగా, ఇందులో నుంచి మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వాహన వినియోగానికి ఖర్చు చేసేందుకు ఉన్నతాధికారులు అనుమతించారు. ఇది కొందరు ఎంపీడీవోలకు వరంగా మారింది. ఎన్నికల విధుల నిమిత్తం వచ్చిన అధికారులతో పాటు జిల్లాలోని కొందరి ఎంపీడీవోల కన్ను ఈ నిధులపై పడింది. ఇంకేముంది. ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేకంగా మంజూరైన నిధులతో పాటు మండల పరిషత్ ఖజానాకు చిల్లు పెట్టారు. అటు ఎన్నికల నిధులతో పాటు మండల పరిషత్ నిధుల నుంచి నెలకు రూ.24 వేల చొప్పున మార్చి, ఏప్రిల్, మే నెలల్లో బిల్లులు లేపడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల కోడ్‌లో భాగంగా జిల్లాకు వచ్చిన ఎంపీడీవోల్లో కొందరితో పాటు జిల్లాలోనే పనిచేసే మరికొందరు రూ.లక్షల్లో ప్రజాధనం దుర్వినియోగం చేసిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాజాగా బయటపడిన అక్రమ బాగోతం పంచాయతీరాజ్ శాఖలో కలకలం రేపుతోంది. జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో 36 మండలాలుంటే, 1768 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ స్టేషన్ పరిధిలో ఎన్నికల నిర్వహణ కోసం రూ. 16 వేల నుంచి రూ.19 వేల వరకు నిధులు మంజూరు చేశారు. ఈ లెక్కన ఒక్కో మండలానికి రూ.4.98 లక్షల నుంచి రూ.14.99 లక్షల వరకు నిధులు విడుదల కాగా, జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం రూ.2.92 కోట్ల వరకు ఖర్చయినట్లు రికార్డులు చెబుతున్నాయి. అత్యల్పంగా కమ్మర్‌పల్లికి రూ.4,97,640 విడుదల కాగా, అత్యధికంగా రూ.14,99,180 ఎన్నికల నిర్వహణ నిధులు విడుదలయ్యాయి. మొత్తంగా 36 మండలాల్లో ఎన్నికల నిర్వహణకు రూ.2.92 కోట్లు మం జూరయ్యాయి. అయితే ఈ నిధుల నుంచి అత్యధికంగా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వాహన వినియోగంపై ఖర్చు చూపిన కొందరు ఎంపీడీవోలు మండల పరిషత్‌ల నిధుల నుంచి ఒక్కో మండలంలో రూ.65 వేల నుంచి రూ.72 వేల వరకు నిధులను వాహనాల పేరిట డ్రా చేశారు. ఈ వ్యవహారంపై ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో పని చేసే కొందరు అధికారులు, సిబ్బంది ద్వారానే బయటపడటం కలకలం రేపుతోంది. ఎన్నికల నిర్వహణ కోసం విడుదలైన నిధులతో పాటు మండల పరిషత్ నిధుల నుంచి భారీగా స్వాహా చేసిన కొందరు ఎంపీడీల వ్యవహారం వివాదాస్పదం అవుతోంది. ఇంటలిజెన్స్ ఆరా.. వాహనాల వినియోగం పేరిట నిధుల స్వాహా కలకలం రేపుతుండగా.. ఈ వ్యవహారంపై ఆరా తీసేందుకు ఇంటలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగడం పంచాయతీరాజ్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల నిర్వహణ కోసం కమ్మర్పల్లి, నాగిరెడ్డిపేట, రెంజల్, ఎడపల్లి, నిజామాబాద్, జక్రాన్‌పల్లి మండలాలకు రూ.4.50 లక్షల నుంచి రూ.5.25 లక్షల వరకు విడుదల కాగా, బోధన్, బాల్కొండ, ఆర్మూరు, డిచ్పల్లి, నం ది పేట, నిజాంసాగర్‌లకు రూ.10 లక్షల నుంచి రూ.14.99 లక్షలు వచ్చాయి. మిగతా మండలాలకు రూ.5.50 లక్షల నుంచి రూ.9.50 లక్షల వరకు ఎన్నికల నిధులు వచ్చాయి. అయితే ఈ ఎన్నికల నిధులకు తోడు మండల పరిషత్ నిధులను కాజేసిన అధికారుల వివరాలను ఆరా తీసేందుకు తాజాగా ఇంటలిజెన్స్ రంగంలోకి దిగి కలకలం రేపుతోంది. మండల పరిషత్‌ల సాధారణ నిధి నుంచి వాహన వినియోగం కోసం డ్రా చేస్తే తప్పకుండా లాగ్‌బుక్ నిర్వహించాలి. ఏ వాహనాన్ని వినియోగించారు, ఏయే రోజు ఎక్కడికి, ఎంత దూరం వెళ్లారు, ఎంత చమురు ఖర్చయ్యిం ది, ఆ నెలలో ఖర్చయిన మొత్తం, ఆ వాహనానికి సంబంధించిన వివరా లు సమర్పించాల్సి ఉంది. అయితే కనీసం లాగ్ బుక్‌లు లేకుండా వాహన వినియోగం నిధులు భారీగా లాగించేసిన కొందరు అక్రమార్క ఎంపీడీవోలపై ఇంటలిజెన్స్ ఆరా తీస్తుస్తోంది. త్వరలోనే నిందితుల బండారం బట్టబయలు కానుంది. -
వద్దు బాబోయ్... ఈ సూపర్ పోలీస్
బదిలీ వద్దంటూ నాయకుల చుట్టూ ఎస్సైల ప్రదక్షిణలు రాయికల్ : సాధారణంగా మంచి పోస్టింగ్ కోసం ఎస్సైలు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల చుట్టూ తిరగడం సహజం. కానీ ఇప్పుడు తమను ఉన్న చోటు నుంచి బదిలీ చేయవద్దని యువ ఎస్సైలు నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. దీనికి కారణం ప్రభుత్వ సూపర్ పోలీస్ నిర్ణయం. రాష్ట్రంలోని ముఖ్య నగరాల్లో జరుగుతున్న నేరాలను నియంత్రించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సూపర్ పోలీస్ వ్యవస్థను రూపొందిస్తోంది. దీని కోసం ప్రతి జిల్లా నుంచి 20 మంది యువ ఎస్సైలను ఎంపిక చేసి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. అయితే జిల్లాలో కొందరు పోలీసులు వెళ్లేందుకు సుముఖంగా లేరు. సూపర్ పోలీస్ వ్యవస్థలోకి ఎక్కువగా 2012 బ్యాచ్‌కు చెందిన ఎస్సైలను తీసుకునే అవకాశం ఉండడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఆరు నెలల క్రితమే ఎస్సైలుగా బాధ్యతలు చేపట్టిన వారు పనిచేస్తున్న ప్రాంతాలపై ఇప్పుడిప్పుడే పట్టు సాధిస్తున్నారు. ఆయా ప్రాంతాల ప్రజల మనోగతాన్ని తెలుసుకుని సులువుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తమను బదిలీ చేస్తే అన్ని రకాలుగా ఇబ్బందులు పడతామంటున్నారు. బదిలీ చేయవద్దని మంత్రులను కలుస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలతో హోంమంత్రికి సిఫారసులు చేయిస్తున్నారు. ఎస్సైలపై ఇంటలిజెన్స్ ఆరా జిల్లాలోని 68 పోలీస్స్టేషన్లలో 37 మంది 2012 బ్యాచ్‌కు చెందిన ఎస్సైలు ఆరునెలల క్రితం పోస్టింగ్ తీసుకున్నారు. వారి పనితీరుపై జిల్లా ఎస్పీ ఇంటలిజెన్స్ అధికారులతో ఆరా తీస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వారి పనితీరు ఆధారంగానే సూపర్ పోలీస్ వ్యవస్థలోకి తీసుకోనున్నారు. ఈనేపథ్యంలో బదిలీని ఆపాలని ఎస్సైలు చేస్తున్న ప్రయత్నం ఏమేరకు సఫలమవుతుందో చూడాలి. -
విదేశీ విమానాశ్రయాల్లో అమెరికా తనిఖీలు
సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు తదితర పరికరాల సోదాపై ప్రత్యేక దృష్టి వాషింగ్టన్: విమానాశ్రయాల్లో తనిఖీని కూడా తప్పించుకోగలిగే సరికొత్త బాంబులను సిరియా, యెమెన్ దేశాల ఇస్లామ్ మిలిటెంట్లు తయారుచేస్తున్నారన్న ఇంటెలిజెన్స్ సమాచారం నేపథ్యంలో అమెరికా మరింత అప్రమత్తమైంది. అమెరికాకు నేరుగా విమాన సదుపాయం ఉన్న వివిధ దేశాల్లోని విమానాశ్రయాల్లో భద్రతను పెంచేందుకు మరిన్ని చర్యలు తీసుకుంది. పవర్ ఆన్చేయని సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను విమానాల్లో అనుమతించబోమని, సదరు ఎలెక్ట్రానిక్ పరికరాలు కలిగిఉంటే, విమానం ఎక్కే ముందుగా మరింత నిశితంగా తనిఖీలకు సిద్ధపడాలని అమెరికా స్పష్టంచేసింది. తమతో తీసుకెళ్లే ఎలక్ట్రానిక్ పరికరాలు పనిచేస్తున్నవేనని, అవి పేలుడు వస్తువులు కాదని రుజువు చేసుకునేందుకు వీలుగా, ప్రయాణికులు వాటిని ఆన్‌చేసి ఉంచవలసిందిగా విదేశాల విమానాశ్రయాల్లోని తనిఖీ అధికారులు కోరతారని అమెరికా రవాణా భద్రతా శాఖ పరిపాలనా విభాగం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. చార్జింగ్లేని ఎలక్ట్రానిక్ పరికరాలతో విమానంలో ప్రయాణానికి అనుమతించబోమని కూడా స్పష్టంచేసింది. -
అనుమతి లేని స్కూళ్లపై చర్యలు
నిజామాబాద్ అర్బన్ : జిల్లాలో అనుమతి లేని పాఠశాలలపై విద్యాశాఖ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. కొన్ని రోజులుగా విద్యార్థి సంఘాల నుంచి తీవ్రమైన ఆరోపణలు రావడం, నిరసనలు తలెత్తడంతో జిల్లా అధికారులు వీటిపై చర్య లు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో విద్యాశాఖ నడుంబిగించింది. అనుమతి లేని 17 పాఠశాలలపై నోటీసులు జారీచేసి సీజ్ చేయాలని ఇదివరకే జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీని వాసాచారి ఆదేశించారు. అంతేగాక ఎంఈఓ లు ఇచ్చిన నివేదికలపై డీఈఓ స్వ యంగా తనిఖీలు చేస్తున్నారు. శుక్రవారం ఆర్మూర్ మండలం ఆలూరు, ఇతర నాలుగు గ్రామాల్లో డీఈఓ పాఠశాలలను తనిఖీ చేశా రు. ఆర్మూర్ పట్టణంలో డీఈఓ తనిఖీలు చేయగా, మూడు పాఠశాలలకు గుర్తింపు లేద ని తేలింది. కానీ ఇదివరకే ఆర్మూర్ మండలంలో అనుమతిలేని పాఠశాలలు లేవని ఎంఈఓ వి ద్యాశాఖ అధికారికి నివేదిక ఇచ్చారు. కానీ డీఈఓ పరిశీలనలో అనుమతిలేని పాఠశాలలు వెలుగులోకి వచ్చాయి. దీంతో స్థానిక విద్యాధికారి బాగోతం బ యటపడింది. తప్పుడు నివేదిక సమర్పించినందుకు ఎంఈఓపై డీఈఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసా రి ఇలాంటి పొరపాట్లు జరగకూడదని హెచ్చరించా రు. ఆర్మూర్ మండలంలో పూర్తిస్థాయి పరిశీలన జరి పి, అనుమతి లేని పాఠశాలల వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. ఆరాతీసిన ఇంటెలిజెన్స్.. జిల్లాలో 53 పాఠశాలలకు ఎలాంటి గుర్తింపు లేదని ఇంటెలిజెన్స్ శాఖ అధికారులు డీఈఓకు నివేదిక ఇచ్చారు. జిల్లాలో కొన్నేళ్లుగా పలు పాఠశాలలలు అనుమతి లే కుండా కొనసాగుతున్నాయని నివేదికలో పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా 53 పాఠశాలలను పూర్తిస్థాయి పరిశీలన జరిపి, అనుమతి ఉందా లేదా అనేది తేల్చి నివేదిక ఇవ్వాలని సంబంధిత ఎంఈఓలను డీఈఓ ఆదేశించారు. ఈ నివేదిక అందగానే అనుమతి లేని పాఠశాలలను మూసివేయనున్నట్లు డీఈఓ తెలిపారు. అనుమతి లేకుండా కొనసాగే పాఠశాలలను ఎట్టి పరిస్థితుల్లో ఊపేక్షించేది లేదని ఆయన పేర్కొన్నారు. సంబంధిత పాఠశాలల విద్యార్థులను సమీప పాఠశాలల్లో చేర్పిస్తామన్నారు. జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న పాఠశాలలు అనుమతి లేని పాఠశాలలను మూసివేయాలని రెం డు రోజుల క్రితం జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ జిల్లాకేంద్రంలో ఏడు పాఠశాలలు యధావిధిగా కొనసాగుతున్నాయి. ఎం ఈఓకు ఆదేశాలు జారీ చేసినా, ఇటువైపు వెళ్లకపోవ డం గమనార్హం. గుర్తింపులేకున్నా పాఠశాలల్లో వి ద్యాబోధన చేపడుతున్నారు. ఇంతేగాక మరో 12 పాఠశాలలు ఎలాంటి గుర్తింపు లేకుండా కొనసాగుతున్నప్పటికీ వీటిని ఆ జాబితాలో మాత్రం చేర్చలేదు. -
మూడో కన్ను మూసుకుందా?
అంతటా దర్శనమిస్తున్న నిఘా నేత్రాలు పనిచేసేవి కొన్నే అందులోనూ స్పష్టత కరవు పాతబస్తీలో నిరుపయోగంగా సీసీ కెమెరాలు చార్మినార్: పాతబస్తీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా లు సత్ఫలితాలివ్వడం లేదు. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో కొన్ని మాత్రమే పనిచేస్తున్నాయి. ఆ ఫుటేజీ ల్లోనూ దృశ్యాలు స్పష్టంగా కన్పించడం లేదు. ఇక కూడళ్లలో ఏర్పాటు చేసినవి మొక్కుబడిగా అన్నట్టుగా మారాయి. ఆదివారం మక్కా మసీదు వద్ద డీఆర్డీఓ రీజనల్ డెరైక్టర్‌పై దాడి జరిగిన నేపథ్యంలో సీసీ కెమెరాల పని తీరు తెరపైకి వచ్చింది. చార్మినార్ పరిసరాల్లో.. దక్షిణ మండలంలోని చార్మినార్, హుస్సేనీఆలం, మొఘల్‌పురా, మీర్‌చౌక్ ఠాణాల పరిధిలోని శాలిబండ పిస్తాహౌస్ నుంచి మదీనా చౌరస్తా వరకు గల ప్రధాన రోడ్డులో లాఅండ్ ఆర్డర్ పోలీసులు ఏర్పాటు చేసిన 16 కెమెరాల్లో 13 మాత్రమే పని చేస్తున్నాయి. చార్మినార్ కట్ట డం నలువైపులా (లాడ్‌బజార్ వైపు, మక్కా మసీ దు, సర్దార్ మహాల్, చార్‌కమాన్ వైపు) ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల దిశ సక్రమంగా లేదనే విషయం ఆదివారం మక్కా మసీదు వద్ద ఒడిశా డీఆర్డీఓ ఆర్డీ సత్యపతిపై జరిగిన దాడి నేపథ్యంలో స్పష్టమైంది. దాడి దృశ్యాలు వీటిలో నమోదైనా.. స్పష్టంగా లేకపోవడంతో పోలీసులకు నిరాశే మిగి లింది. నిజానికి అవాంఛనీయ ఘటనలు జరిగినపుడు సీసీ కెమెరాల ఫుటేజీలే కీలకంగా మారుతాయి. కేసుల పురోగతికి ఇవే ఆధారమవుతాయి. చార్మినార్ కట్టడంలో పని చేయని సీసీ కెమెరాలు.. చార్మినార్ కట్టడంపై బిగించిన 4 సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. చార్మినార్‌ను సందర్శించడానికి వచ్చే పర్యాటకుల రక్షణతోపాటు అసాంఘిక శక్తుల కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతూ నిఘా ఉంచడానికి ఏర్పాటు చేసిన వీటిలో ఏ ఒక్కటీ పూర్తి స్థాయిలో పని చేయకపోవడం గమనార్హం. -
హైదరాబాద్ పేలుళ్లలో థామస్ పాత్ర?
పేలుడు పదార్థం సరఫరా చేసినట్లు అనుమానం హర్యానాలో పట్టుకున్న మంగుళూరు పోలీసులు వివరాలు ఆరా తీస్తున్న దర్యాప్తు అధికారులు సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలోని మంగుళూరు ప్రాంతంలోని కర్కలా పోలీసులు హర్యానాలో అరెస్టు చేసిన బిజ్జూ థామస్‌కు నగరంలో జరిగిన రెండు జంట పేలుళ్లలో పాత్ర ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ రెండింటికీ అవసరమైన పేలుడు పదార్థం అతడే సరఫరా చేసినట్లు భావిస్తున్నారు. ఇప్పటి వరకు థామస్ పేరు నేరుగా ఏ కేసులోనూ ప్రస్తావించకపోయినా... కొన్ని ఆధారాలను బట్టి ఈ అనుమానాలు వ్యక్తం చేస్తున్న దర్యాప్తు అధికారులు అక్కడి పోలీసులతో సంప్రదింపులు జరుపుతూ వివరాలు ఆరా తీస్తున్నారు. థామస్ ఫ్రమ్ కేరళ... కేరళకు చెందిన బిజ్జు థామస్ కొన్నేళ్ల క్రితమే కర్ణాటకకు వలస వచ్చి కర్కలా ప్రాంతంలో స్థిరపడ్డాడు. తమిళనాడు నుంచి వలసవచ్చిన వీరమణితో కలిసి అమ్మోనియం నైట్రేట్ స్లర్రీ వంటి పేలుడు పదార్థాల విక్రయ వ్యాపారం చేస్తున్నాడు. వీరి లైసెన్స్ నిబంధనల ప్రకారం కేవలం 500 కేజీల పేలుడు పదార్థాన్ని మాత్రమే నిల్వ చేసుకుని విక్రయించాల్సి ఉంది. అయితే మార్చి ఆఖరి వారంలో నిఘా వర్గాల ద్వారా సమాచారం అందుకున్న కర్కలా పోలీసులు అక్కడి కోటి చిన్నయ్య థీమ్ పార్క్ సమీపంతో పాటు శివారు గ్రామాలైన నర్కే, దుర్గాల్లో ఉన్న వీరి గోదాములపై దాడులు చేశారు. అక్కడ ఏకంగా 62 టన్నుల పేలుడు పదార్థం, 50,350 డిటోనేటర్లు, 19,250 ఫ్యూజ్ వైర్లు స్వాధీనం కావడంతో కేసు నమోదు చేసి బిజ్జు, వీరమణి కోసం వేట ప్రారంభించారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న థామస్‌ను హర్యానాలోని గుర్గావ్లో పట్టుకుని బుధవారం ఉడిపి కోర్టులో హాజరుపరిచారు. వీరమణి కోసం రెండు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. అక్రమ విక్రయాల్లో దిట్టలు... కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఉన్న అనేక క్వారీలు, విద్యుత్ ప్రాజెక్టులకు అక్రమంగా పేలుడు పదార్థాలకు విక్రయిస్తున్నారని ఈ ద్వయంపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో థామస్, వీరమణిలపై పేలుడు పదార్థాల అక్రమ రవాణా, నిల్వల ఆరోపణల పైనే కేసులు నమోదు చేసిన కర్కలా పోలీసులు ఉగ్రవాదం కోణంతో పాటు మావోయిస్టులకు సహకారం తదితర కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌లో 2007 ఆగస్టు 25న జరిగిన లుంబినీ పార్క్, గోకుల్‌చాట్ పేలుళ్లతో పాటు గత ఏడాది ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ-1 మిర్చ్ సెంటర్, 107 బస్టాపుల్లో జరిగిన జంట పేలుళ్ల కేసుల్లోనూ థామస్ పాత్రను దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో తల దాచుకున్న ఐఎం మాస్టర్‌మైండ్ రియాజ్ భత్కల్ గతంలో మంగుళూరులో సివిల్ ఇంజనీర్‌గా నిర్మాణ రంగంలో పని చేయడంతో వీరితో పరిచయాలు ఏర్పడి ఉంచవచ్చని అంచనా వేస్తున్నారు. ఆ రెండుసార్లూ మంగుళూరు నుంచే... నగరంలో ఐఎం ఉగ్రవాదులు సృష్టించిన రెండు విధ్వంసాలకూ అవసరమైన పేలుడు పదార్థాలు మంగుళూరు నుంచే సిటీకి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే బిజ్జు, వీరమణి వీటిని అందించినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. 2007లో పేలుళ్లకు కొన్ని రోజుల ముందు కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సులో సాక్షాత్తు ఐఎం మాస్టర్ మైండ్ రియాజ్ భత్కలే మంగుళూరు నుంచి పేలుడు పదార్థాలతో కూడిన బాంబుల్ని పంపాడు. 2013 నాటి దిల్సుఖ్నగర్ పేలుళ్లకు పాకిస్థాన్‌లో ఉన్న రియాజ్ భత్కల్ ఆదేశాల మేరకు మరో ఉగ్రవాది అసదుల్లా అక్తర్‌కు మంగుళూరులోని యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద ఓ గుర్తుతెలియని వ్యక్తి ట్రాలీ బ్యాగ్‌లో అమ్మోనియం నైట్రేట్ అందించాడు. ఈ అంశాలను బేరీజు వేస్తున్న నిఘా వర్గాలు బిజ్జు, వీరమణి పాత్రల్ని అనుమానిస్తున్నారు. మరోపక్క ఇటీవల ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేసిన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులు తెహసీన్ అక్తర్, వఖాస్ (వీరిద్దరూ దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో నిందితులు) ఇచ్చిన సమాచారం మేరకు బిజ్జు స్థావరాలపై దాడులు జరిగినట్లు తెలుస్తోంది. బిజ్జు విచారణ కోసం రాష్ట్ర నిఘా వర్గాలతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులూ కర్ణాటక చేరుకున్నారు. ఇతడి పాత్ర నిర్థారణైతే రెండు జంట పేలుళ్ల కేసుల్లో ప్రిజనర్స్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్‌పై తీసుకురావాలని నిర్ణయించారు. -
ఆ విమానం హిందూమహాసముద్రంలోనే కూలిందా?
పది రోజులకు పైగా కనిపించకుండా పోయిన మలేషియన్ ఎయిర్‌లైన్స్ విమానం హిందూ మహాసముద్రంలో ఉందన్న తాజా వాదన ఒకటి తెరమీదకు వచ్చింది. 239 మందితో కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు బయల్దేరిన ఈ విమానంలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్న విషయం తెలిసిందే. వీరి క్షేమ సమాచారం ఏదీ ఇంతవరకు అందకపోవడంతో ప్రయాణికుల బంధుమిత్రులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఈనెల 8వ తేదీన బయల్దేరిన ఈ విమానం ఇప్పుడు బహుశా హిందూ మహా సముద్రంలో దక్షిణ దిశగా ఉండొచ్చని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న మలేషియన్ అధికార వర్గాలు ఇప్పుడు భావిస్తున్నాయి. అది దక్షిణ దిశగానే వెళ్లిందని, ఇండోనేసియాకు దక్షిణ దిశ నుంచి ఆస్ట్రేలియాకు పశ్చిమదిశగా హిందూ మహాసముద్రంలో కూలిపోయి ఉండొచ్చని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఆసియా వైపు వెళ్తే మాత్రం అత్యంత శక్తిమంతమైన భారత్, చైనా రాడార్ల దృష్టిని కన్నుగప్పి ప్రయాణం చేసే అవకాశం లేనే లేదని దర్యాప్తు అధికారులు గట్టిగా చెబుతున్నారు. చైనా సరిహద్దుల్లో అత్యంత శక్తిమంతమైన సైనిక రాడార్లున్నాయి. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ చైనా ఆధీనంలో ఇవి పనిచేస్తాయి. అలాగే, భారత్-పాకిస్థాన్ మధ్య సరిహద్దు కూడా అత్యంత సున్నితమైనది కావడంతో అక్కడ సైతం సైనిక పర్యవేక్షణ చాలా పటిష్ఠంగా ఉంటుంది. ఇటువైపు నుంచి ఒక జెట్ విమానం వెళ్లడం, దాన్ని ఏ దేశం వాళ్లూ గుర్తించలేకపోవడం అనేది అసాధ్యమేనని ఇంటెలిజెన్స్ మాజీ అధికారి ఒకరు స్పష్టం చేశారు. పైపెచ్చు, విమానం నుంచి ఏ సిగ్నల్ వెళ్లినా.. దాన్ని కచ్చితంగా గుర్తించే పరిజ్ఞానం ఉందని, అందువల్ల అది హిందూ మహాసముద్రంలో కూలిపోయే ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. -
నక్సల్స్‌పై పెరిగిన నిఘా
-
నక్సల్స్‌పై పెరిగిన నిఘా
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఉనికి చాటుకోవడానికి మావోయిస్టుల వ్యూహ రచన అప్రమత్తమైన రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం.. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నిఘా అధికారులతో తాజా పరిస్థితిపై సమీక్ష.. నిరంతర కో-ఆర్డినేషన్ సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో తమ ఉనికిని చాటుకోవడానికి మావోయిస్టులు వ్యూహ రచన చేశారనే సమాచారంతో రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం అప్రమత్తమైంది. ఇటీవల ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కుసుమ జిల్లాలో 16 మందిని కాల్చి చంపిన మావోయిస్టుల చర్యను దృష్టిలో ఉంచుకుని మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎన్నికల్లో నక్సల్స్ విధ్వంసకాండకు పాల్పడకుండా చేసేందుకు అవసరమైన వ్యూహాలను పోలీసు అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా నక్సల్ కార్యకలాపాలు అధికంగా ఉన్న సరిహద్దు రాష్ట్రాలు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలకు చెందిన ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులతో రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడి తాజా పరిస్థితిని సమీక్షించారు. వారితో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ఆంధ్రా-ఒడిశా, ఆంధ్రా-ఛత్తీస్‌గఢ్, ఆంధ్రా-మహారాష్ట్ర సరిహద్దుల్లో మావోయిస్టు దళాల కదలికలపై నిఘా పెంచారు. దళాలనేగాక స్పెషల్ యాక్షన్ టీమ్‌లను మావోయిస్టులు రంగంలోకి దింపే ప్రమాదం ఉందని కూడా నిఘా వర్గాలకు సమాచారం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇటు తెలంగాణ, అటు ఉత్తరాంధ్రలలో ఆయా జిల్లాల ఎస్పీలను అధికారులు అప్రమత్తం చేశారని తెలిసింది. ముఖ్యంగా ఆంధ్రా, ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీ, ఇటు తెలంగాణ రాష్ట్ర కమిటీలను చురుకుగా పనిచేయించడం ద్వారా రెండు ప్రాంతాల్లోతమ ఉనికిని చాటుకోవడానికి మావోయిస్టు నాయకత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు నిఘా అధికారులకు సమాచారం ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకుని సరిహద్దుల్లోని ప్రభావిత రాష్ట్రాల పోలీసు యంత్రాంగాలతో కలిసి కట్టుగా పని చేయాలని మరోవైపు కేంద్ర హోంశాఖ సైతం పై మూడు రాష్ట్రాలతో పాటు రాష్ట్రానికి సూచించినట్లు తెలిసింది. -
మావోయిస్టులపై జాయింట్ యాక్షన్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా పేట్రేగిపోతున్న మావోయిస్టు కార్యక్రమాలను అణిచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల యాంటీ నక్సల్ విభాగాలతో కలిసి సంయుక్త కార్యాచరణకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ విభాగాల సమన్వయ బాధ్యతను ఆంధ్ర-చత్తీస్‌గఢ్‌కు చెందింన ఇంటెలిజెన్స్ అధికారులకు అప్పగించాలని భావిస్తోంది. చత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో రెండు రోజుల కిందట మావోయిస్టులు విరుచుకుపడి సీఆర్పీఎప్ జవాన్లతో సహా మొత్తం 16 మందిని హతమార్చిన విషయం తెలిసిందే. అంతకుముందు అదే ప్రాంతంలో కాంగ్రెస్ నేత మహేంద్రకర్మతో సహా 36 మందిని మట్టుపెట్టారు. మావోయిస్టులపై ప్రతీకారం తీర్చుకుంటామని ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రకటించారు. ఈ మేరకు ఒకవైపు సీఆర్పీఎఫ్లోని యాంటీ నక్సల్స్ విభాగం కోబ్రా దళాలతో కూంబింగ్ ఆపరేషన్లను కొనసాగిస్తూనే, మరోవైపు తొమ్మిది నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలమధ్య మరింత సమన్వయాన్ని సాధించి మావోయిస్టులను అణిచివేసే ఆపరేషన్లను నిరంతరం కొనసాగించేందుకు హోం శాఖ సంసిద్ధమైంది. ఇందులో భాగంగానే చత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ర్ట, బీహార్, జార్ఖండ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలన్నీ ఒకే తాటిపైకి వచ్చి, సమాచారాన్ని పరస్పరం పంచుకుంటూ మావోయిస్టులను నిరోధించేలా వ్యూహరచన చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభావిత రాష్ట్రాల నిఘా అధికారులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి చర్చించారని తెలిసింది. ముఖ్యంగా యాంటీ నక్సలైట్ ఇంటెలిజెన్స్విభాగాలకు అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలను సమకూర్చేందుకు హోంశాఖ సిద్ధమవుతోంది. ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి ఇజ్రాయిల్ అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం జరపడానికి త్వరలోనే నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల నిఘా అధికారులను అక్కడకు పంపించే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
భారతీయులే లక్ష్యంగా ఆస్ట్రేలియాలో దాడులు
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడులు పెరిగిపోతున్నాయి. స్వదేశాన్ని వదిలి చదువుకోసం వచ్చిన భారతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. మనిరాజ్విందర్ సింగ్ అనే భారత విద్యార్థిపై ఆదివారం జరిగిన దాడితో సంబంధమున్న ముఠాలోని సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడికి పాల్పడిన వారిలో ఆస్ట్రేలియాకు చెందిన 17ఏళ్ల యువకుడు సీదెన్హాంను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆ యువకుడు బెయిల్ కోరుతూ చిల్డ్రన్స్ కోర్టును అశ్రయించాడు. విచారణకు స్వీకరించిన కోర్టు నిందితుడు ఉద్దేశపూర్వకంగానే భారతీయులపై దాడికి పాల్పడినట్టు అభిప్రాయపడింది. దీంతో అతడికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్టు కోర్టు వెల్లడించింది. మెల్బోర్న్లోని బిర్రాంగ్ మర్ పార్క్ సమీపంలోని ప్రిన్సెస్ బ్రిడ్జ్ వద్ద కూర్చుని ఇద్దరు స్నేహితులతో సంభాషిస్తున్న మనిరాజ్విందర్ సింగ్‌పై ఆదివారం ఎనిమిది మంది సభ్యుల బృందం దాడి చేసిన సంగతి తెలిసిందే. మనిరాజ్విందర్ సింగ్ ఇంకా కోమాలో ఉన్నాడని, కానీ, ఎలాంటి ప్రమాదం లేదని అతడి సోదరుడు యద్వేంధర్ సింగ్ తెలిపాడు. ప్రస్తుతం భారత్‌లో ఉన్న మనిరాజ్విందర్ సింగ్ తల్లిదండ్రులు మెల్బోర్న్ రప్పించేందుకు కావాల్సిన వీసా ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నట్టు మెల్బోర్న్ అధికారులు తెలిపారు.