Minor Girl
-
పెళ్లి పేరుతో నమ్మించి గర్భవతిని చేశాడు
ఖమ్మం: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మైనర్ బాలికను గర్భవతిని చేశాడని, నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేయాలని ఎర్రుపాలెం మండలం భీమవరం గ్రామానికి చెందిన పలువురు డిమాండ్ చేశారు. బాలిక బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గ్రామంలోని దళిత కాలనీకి చెందిన బాలిక, అదే గ్రామానికి చెందిన ముల్లంగి జమలయ్య అనే యువకుడు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని బాలికకు మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడు. ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి కాగా, ఖమ్మం, విజయవాడలోని ఆస్పత్రులకు తీసుకెళ్లి అబార్షన్‌కు ప్రయత్నించాడని, ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని వారు ఆరోపించారు. దీంతో ఈనెల 21న తాము ఎర్రుపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు పట్టించుకోలేదని, 22వ తేదీన ఖమ్మంలో సీపీని కలిసినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఆదివారం గ్రామస్తులతో కలిసి మళ్లీ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఆందోళన చేశారు. ఆ తర్వాత మధిర – విజయవాడ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. అయినా పోలీసులు స్పందించకపోవడంతో బాలిక స్టేషన్ పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే ఆమె సోదరుడు ట్యాంక్ ఎక్కి నచ్చజెప్పినా బాలిక కిందకు దిగకపోవడంతో ఎస్ఐ పి.వెంకటేష్, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. దీంతో గ్రామస్తులు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు బాలికకు న్యాయం చేస్తామని, నిందితుడిపై కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చిన ఎస్ఐ ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల సాయంతో బాలికను కిందకు తీసుకొచ్చారు. కాగా, స్టడీ సర్టిఫికెట్లో ఉన్న వయసు ప్రకారం ఆమె మైనర్ కాదని ఎస్ఐ చెబుతుండగా, ఆధార్ కార్డు, ఆస్పత్రి రికార్డులు తమ వద్ద ఉన్నాయని, వాటి ప్రకారం అమ్మాయి మైనరేనని బంధువులు అంటున్నారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని చెబుతున్నారు. కేసు నమోదు కాకుండా ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులు, మాజీ ప్రజాప్రతినిధి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. -
అమ్మా.. నీ తప్పుకు నన్ను చంపేశావా?
‘అమ్మా.. ఇంకో మూడు నెలలైతే లోకం చూసేవాడిని కదమ్మా.. ఎందుకమ్మ ఇంత పనిచేశావు. నీ కడుపులో నన్ము మోయలేకపోయావా.. ఆరు నెలలుగా నీ కడుపులో హాయిగా పెరుగుతున్నా.. నీవు మింగిన మాత్రలకు నాకు ఊపిరి ఆడడం లేదమ్మా.. లోకం చూపించి అనాథాశ్రమంలో పడేసినా బాగుండేది.. తెల్లవారేసరికే నా ఊపిరి తీశావేంటమ్మా.. నీవు చేసిన తప్పుకు నన్ను బలి ఇచ్చావా..’ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని గురుజ వాగులో పడేసిన పిండానికి మాటలు వస్తే ఇలాగే ప్రశ్నించేదేమో. క్షణికావేశంలో చేసిన తప్పుకు గర్భం దాల్చిన ఓ యువతి.. బయటి ప్రపంచానికి ఆ విషయం తెలియకుండా ఉండేందుకు ఆరు నెలల గర్భంలోనే పిండాన్ని చంపేశారు. ఈ హృదయ విదారక సంఘటన గురుజ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... మంగళవారం ఉదయం గ్రామ శివారులోని వాగు ప్రాంతానికి బహిర్భూమికి వెళ్లిన కొందరు గ్రామస్తులకు మృత శిశువు కనిపించింది. పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై మహేందర్ సంఘటనా స్థలానికి చేరుకొని శిశువు మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. స్థానికులు అందించిన వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని వెంటనే దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఓ యువతి, ఇద్దరు యువకులతోపాటు ఆర్ఎంపీని అదుపులోని తీసుకున్నట్లు తెలిసింది. పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన ఓ యువతి.. ఆరు నెలల గర్భాన్ని తీయించుకునేందుకు ఆర్ఎంపీని ఆశ్రయించినట్లు సమాచారం. మంగళవారం రాత్రి గ్రామంలో తిరిగిన సదరు ఆర్ఎంపీ ప్రాణాపాయమని తెలిసినా.. ఆరు నెలల గర్భాన్ని తొలగించారు. ఆ పిండాన్ని ఇలా వాగులో పడేసి ఉంటారని ప్రచారం జరుగుతోంది. దర్యాప్తు పూర్తి కానందున పూర్తి వివరాలు బుధవారం అందిస్తామని సీఐ భీమేష్ తెలిపారు. మృత శిశువును పరీక్షించిన వైద్యులు మగ శిశువుగా నిర్ధారించారు. పిండం వయస్సు సుమారు 6 నెలలు దాటి ఉండవచ్చని సమాచారం. -
చెల్లెలితో అన్న శారీరక సంబంధం
యశవంతపుర(కర్ణాటక): చెల్లెలితో అన్న శారీరకంగా కలవటంతో( sister) బిడ్డకు జన్మనిచ్చిన ఘటన ఉత్తర కన్నడ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ముండగోడ తాలూకా కుందర్గి గ్రామంలో ఈ ఘటన జరిగింది. అదే గ్రామానికి చెందిన 19 సంవత్సరాల వయసున్న యువకుడు 10వ తరగతి చదువుతున్న చెల్లెలు యల్లాపురలోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో యువకుడు తన చెల్లిని రెచ్చగొట్టి శారీరకంగా కలిసినట్లు పోలీసు విచారణలో బయట పడింది. అన్నతో 9 నెలల క్రితం శారీరకంగా కలిసినట్లు బాధితురాలు వైద్యులకు సమాచారం ఇచ్చింది. బడికి వెళుతున్న కూతురు ఒక్కసారిగా ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. జన్మనిచ్చిన శిశువులో ఆరోగ్య సమస్యలు ఉన్న కారణంగా మెరుగైన చికిత్స కోసం కారవార జిల్లా ఆస్పత్రికి తరలించారు. 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యయశవంతపుర: పదో తరగతి చదువుతున్న విద్యార్థిని అత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరకన్నడ జిల్లా కారవారలో జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతూ బాలికల హాస్టల్లో ఉంటున్న విద్యార్థిని అక్కడే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తండ్రి లేని కారణంగా బాలిక బాలమందిరంలో చదువుకుంటోంది. ఆమె గదిలో ఒక్కరే ఉన్నప్పుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలాన్ని కారవార పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. -
దేవుడా.. ఎవరిదీ పాపం?
రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు.. బండపని చేసుకుంటూ పొట్టపోసుకునే బడుగులు.. ఏ పూటకు ఆ పూట కూలి తెచ్చుకుని జీవనం సాగించే నిరుపేదలు.. అష్టకష్టాలు పడుతున్నా తమ నలుగురు పిల్లలను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. అందులో ఓ ఆడబిడ్డకు పెళ్లి చేశారు. మరో అమ్మాయిని పదోతరగతి, అబ్బాయిని ఏడోతరగతి, మూడో కుమార్తెను రెండో తరగతి చదివిస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ కూలి పనులు చేసుకుంటూ సాఫీగానే సంసారం నెట్టుకొస్తున్నారు. ఇంతలో ఆ పేద కుటుంబంపై పిడుగు పడింది. వారి జీవితాలను అల్లకల్లోలం చేసేసింది.పలమనేరు : మండలంలోని టి. వడ్డూరు గ్రామంలో బండపని చేసుకుని బతికే దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్దమ్మాయికి పెళ్లి చేశారు. మిగిలినవారు తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. ఈ క్రమంలో రెండో బిడ్డకు కడుపు ముందుకొస్తోందని టీచర్లు చెప్పడంతో ఆందోళన చెందారు. కామెర్ల వల్ల అలా జరిగిందేమో అని పట్టించుకోలేదు. తర్వాత బాలికకు కడుపునొప్పి అసలు విషయం తెలిసింది. ఆ బిడ్డ గర్భం దాల్చిందని తెలిసి బంగారుపాళెంలోని సోదరి ఇంటికి పంపేశారు. అక్కడే ఓ ప్రైవేట్ వైద్యుడికి చూపించారు. అయితే ఆ అమ్మాయికి ఫిట్స్ రావడంతో మూడురోజుల క్రితం చిత్తూరులోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సిజరేయన్ చేసి శిశువును బయటకి తీశారు. ఉన్నట్టుండి తల్లీబిడ్డల పరిస్థితి విషమంగా మారడంతో అక్కడి వైద్యులు తిరుపతికి రెఫర్ చేశారు. అక్కడ చికిత్సపొందుతూ ఆ బాలిక మృతిచెందింది. ఆ శిశువు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.కారణం ఆ ముగ్గురే..తన అక్క మృతికి ముగ్గురు యువకులు కారణమని చెల్లెలు వెల్లడించింది. తమ బంధువైన ఓ మహిళ కారణంగా తమ ఇంటికి తల్లిదండ్రులు లేని సమయంలో యువకులు వచ్చేవారని తెలిపింది. తరచూ బిరియానీ, ఇతర తినబండారాలను అక్కకు ఇచ్చేవారని వివరించింది.గ్రామంలో నిరసనలుఇలా ఉండగా తిరుపతి నుంచి బాలిక మృతదేహం ఆంబులెన్స్‌లో రాగానే గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. బాలిక మరణానికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ ధర్నాకు దిగారు. బాధితులకు న్యాయం చేస్తామని, దోషులను కఠినంగా శిక్షిస్తామని పలమనేరు సీఐ నరసింహరాజు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.కఠినంగా శిక్షించాలిమైనర్ బాలికపై లైంగిక దాడి చేసి గర్భం దాల్చేలా చేసి, ఆమె మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. తొమ్మిదినెలలు తన కడుపులో బిడ్డను మోస్తున్నా ఏ డాక్టరైనా ఎందుకు గుర్తించలేదు. ఇది వైద్యులు నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం. గతంలోనూ ఈ గ్రామంలో ఇలాంటి ఘటనలు జరిగాయి. అప్పట్లో నిందితులను కఠినంగా శిక్షించి ఉంటే ఇప్పుడు ఇలాంటివి జరిగేవి కావు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలి.– భువనేశ్వరి, ఐద్వా జిల్లా కన్వీనర్ -
ప్రియుడి కోసం ఇల్లు వదిలి..పోలీసుల చేతిలో..!
చెన్నై:ప్రియుడిని వెతుక్కుంటూ బయలుదేరిన ఓ 13 ఏళ్ల బాలిక పోలీసుల చేతిలోనే లైంగికదాడికి గురైంది. కాపాడాల్సిన పోలీసే ఆ బాలిక జీవితాన్ని సర్వనాశనం చేశారు. ఈ దారుణ ఘటన తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఇటీవల జరిగింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పిన బాయ్‌ఫ్రెండ్ మాటలు నమ్మి ఓ బాలిక ఇంటి నుంచి పారిపోయి బయటికి వచ్చింది. రాత్రి వేళ కావడంతో రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై నిద్రపోయింది. ఇంతలో అక్కడికి వచ్చిన ట్రాఫిక్ పోలీసు రామన్ సాయం చేస్తానని బాలికను జీపు ఎక్కించుకున్నాడు. వాహనంలోనే బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అక్కడి నుంచి ట్రాఫిక్ పోలీసుల బూత్‌కు తీసుకెళ్లి బాలికపై మరోసారి లైంగిక దాడి చేశాడు.రామన్ నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాలిక ఇంటికి చేరింది.అయితే తనకు ఇంట్లో వేరే సంబంధాలు చూస్తున్నారని తెలుసుకున్న బాలిక ఇంటి నుంచి మళ్లీ పారిపోయింది బాలిక.ఈసారి తన బాయ్‌ఫ్రెండ్‌ను కలిసింది. ఇద్దరు కలిసి ఒక చోట సహజీవనం మొదలు పెట్టారు. ఇంతలో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు బాలిక ఆచూకీ కనిపెట్టారు. బాలికను విచారించగా ట్రాఫిక్ పోలీసు రామన్ బాగోతం బయటపడింది. దీనికి తోడు బాయ్‌ఫ్రెండ్ కూడా తనపై లైంగికదాడి చేశాడని బాలిక పోలీసులకు తెలిపింది. -
అప్పు తీర్చలేదని.. రాక్షస వివాహం!
యశవంతపుర: ఓ మహిళ అప్పు తీర్చలేదని ఆమె కూతురిని బలవంతంగా ఎత్తుకెళ్లారు. ఆమెను తన కొడుక్కి పెళ్లి చేశాడో వడ్డీ వ్యాపారి. బెళగావి నగరంలోని తళకవాడి పోలీసుస్టేషన్ పరిధిలో ఈ రాక్షస వివాహ ఘటన జరిగింది. వివరాలు.. ఒక మహిళ రూ.50 వేలును అప్పుగా తీసుకొంది. ఆమె సరిగ్గా వడ్డీని చెల్లించలేదు. దీంతో బంగారు ముక్కెరను లాక్కున్నాడు. ఆమె కూతురిని అపహరించి తన కుమారునికి వివాహం చేశాడు. అతడు బాలికపై బలవంతంగా లైంగికక్రియకు పాల్పడ్డాడు. న్యాయం చేయాలంటూ బాలిక శుక్రవారం బెళగావి తళకవాడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీస్ కమిషనర్ యడా మార్టిన్ ఆదేశాలతో భర్త, అతని తల్లిదండ్రులు సహా మరికొందరిపై కేసు నమోదుచేసి బాలికను రక్షించారు. ఇప్పటివరకు ఇద్దరిని అరెస్టు చేశారు. బాలిక చదువుకునేలా సాయం చేస్తామని కమిషనర్ తెలిపారు. -
వాడో వికృత జీవి, చచ్చేదాకా జైల్లోనే!
అమాయకులైన మైనర్బాలికలను మభ్యపెట్టి అత్యంత అమానుషంగా అత్యాచారాలకు పాల్పడుతున్న వైనానికి అద్దం పట్టిన ఘటన ఇది. అంతేకాదు సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులను నమ్మడం, ప్రయాణాల్లో అపరిచితుల మాటలకు మోసపోవడం వల్ల జరిగే అనర్థాలకు నిదర్శనం కూడా. అసలు స్టోరీ ఏంటంటే..! వివరాలు ఇలా ఉన్నాయిఅది 2021, అక్టోబరు 18.. ఒక టీనేజ్ బాలికను మాయ చేసి, నీచాతి నీచంగా అత్యాచారానికి పాల్పడిన ఘటనకు మౌన సాక్ష్యంగా నిలిచిన రాత్రి అది. ఈ కేసులో నేరస్తుడు పేరు 35 ఏళ్ల మహమ్మద్ సాదిక్ ఖత్రీ. ఏడు నెలలకు తనతో షేర్ చాట్‌లో మాట్లాడుతున్న స్నేహితుడిని కలవడానికి ముంబై బయలుదేరింది 16 ఏళ్ల బాధిత బాలిక. వల్సాద్‌లోని పార్డి తాలూకాలో నివసిస్తుంది . మహారాష్ట్రలోని భివాండికి చెందిన అబ్బాయితో షేర్‌చాట్‌లో పరిచయమైంది. ఇద్దరూ ఏడు నెలల పాటు మాట్లాడుకున్నారు. తనను కలవాలని పట్టుబట్టడంతో ముంబైకి బయలుదేరింది. ఇక్కడే అమాయకంగా, బెరుకు బెరుకుగా కనిపించిన ఆ ‘లేడిపిల్ల’ పై కన్నేశాడు సాదిక్. ఆమెతో మాట కలిపి మాయ చేశాడు. బాలికను నమ్మించాడు.వసాయ్ రైలు స్టేషన్లో ఆగినప్పుడు, అతను ఆమెను బలవంతంగా రైలు నుండి దింపేశాడు. ముంబైకి తాను దగ్గరుండి తీసుకెడతానంటూ హామీ ఇచ్చాడు. వెనుకా ముందూ ఆలోంచకుండా అతగాడిని నమ్మడమే ఆమె జీవితంలో తీరని బాధను మిగిల్చింది. ఖత్రీ బాలికను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడు. సెక్స్ ఉద్దీపన మాత్రలు వేసుకొని మరీ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఐదు గంటల్లో మూడుసార్లు అత్యాచారం చేశాడు. ఆ తరువాత బాలికను అక్కడే వదిలేసి పారి పోయాడు. చివరకు ఆమె తన బంధువుకు సమాచారం ఇవ్వడంతో విషయం పోలీసులదాకా వెళ్లింది. ఫిర్యాదు అందిన వెంటనే నవ్సారి రూరల్ పోలీసులు అక్టోబర్ 24న ఖత్ర్ అరెస్టు చేశారు. ఆ సమయంలో అతని దగ్గర సిల్డెనాఫిల్ డ్రగ్స్ దొరికాయి. అతని దుస్తులపై రక్తపు మరకలను పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఘటనా స్థలంలో పోలీసులు ఫోరెన్సిక్ బృందం బాలిక జుట్టుతో పాటు ,హెయిర్‌పిన్ తదితర కీలక సాక్ష్యాలను కూడా సేకరించింది. దీంతో ప్రాసిక్యూషన్ సాదిక్‌ను నేరస్తుడిగా తేల్చింది. తన కామాన్ని నెరవేర్చుకోవడానికి ఈ కేసు నిస్సహాయులను లేదా మైనర్లను వేటాడే వికృత మనస్తత్వాన్ని ప్రదర్శించిన వైనమని విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. సాదిక్‌కు చివరి శ్వాసదాకా జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. ఇలాంటి కేసుల (మైనర్ బాలికపై అత్యాచారం కేసు) విచారణ సందర్భంగా న్యాయస్థానం శిక్షాస్మృతిలో మెతక వైఖరిని అవలంబించకూడదని కోర్టు పేర్కొంది. అంతేకాదు బాధితురాలు తరచూ తల్లిదండ్రులకు, పోలీసులకు, న్యాయవాదులకు, కోర్టుకు తాను పడిన శారీరక బాధను, కష్టాన్ని అనేకసార్లు వివరించవలసి వస్తుంది, ఇది ఆమెకు తీవ్ర మనోవేదనకు గురిచేస్తుందని కూడా, సున్నితంగా వ్యవహరించాలని కూడా కోర్టు సూచించింది. సమాజంలో మైనర్లపై లైంగిక వేధింపుల కేసులు పెరుగు తున్నప్పుడు, బాధితుల బాధను, ఆవేదనను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. -
మైనర్ బాలికపై దారుణం..
-
ప్రేమికుడే కాలయముడు!
మియాపూర్: మైనర్ అమ్మాయిని ఇన్‌స్ట్రాగాంలో పరిచయం చేసుకుని హత్యచేసి మృతదేహాన్ని నిర్మానుష్య ప్రాంతంలో పడేసిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు నిందితులిని మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ సోమవారం కేసు వివరాలను తెలిపారు. అశోక్ కుటుంబం మియాపూర్‌లోని టేకు నర్సింహనగర్లో నివాసముంటోంది. చిన్న కుమార్తె(17) గత నెల 20వ తేదీ నుంచి కనిపించడం లేదని బాలిక తల్లి మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉప్పుగూడకు చెందిన విఘ్నేష్ అలియాస్ చింటు(22)పై అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఉప్పుగూడకు చెందిన విఘ్నేష్‌ను మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా బాలికను నగరంలోని ఫలక్‌నుమా దేవాలయంలో పరిచయం చేసుకుని ఇన్‌స్టాలో చాటింగ్ చేసుకునేవారని చెప్పాడు. ఈ క్రమంలో వారు ప్రేమించుకున్నారు. దీంతో అమ్మాయి గత నెల ఇంటినుంచి వెళ్లిపోయింది. విఘ్నేష్ ఆ బాలికను మీర్పేట్లోని స్నేహితులు సాకేత్, కళ్యాణిల గదిలో ఉంచాడు. అమ్మాయి తరచూ పెళ్లిచేసుకోమని ఒత్తిడి చేయడంతో ఈ నెల 8న పెళ్లిచేసుకున్నట్లు దండలు మార్చుకుని ఫోటోలుదిగి అమ్మాయి తల్లిదండ్రులకు పంపించాడు. అనంతరం బాలికను హత్యచేయాలనే పథకం పన్నాడు. 8న విఘ్నేష్.. అమ్మాయి గొంతు నులిమి మొఖంపై దిండుపెట్టి ఊపిరాడకుండా చేసి హత్యచేశాడు. అదేరోజు అర్ధరాత్రి సాకేత్, కళ్యాణిలతో కలిసి మృతదేహాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. సాకేత్.. బాలిక మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై తీసుకువెళ్లి ఉప్పుగూడ దగ్గరలోని పారిశ్రామిక వాడలోని నిర్మానుష్య ప్రాంతంలో పడేసి చెత్తాచెదారం కప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. విఘ్నేష్ తనకేమి తెలియనట్లు అమ్మాయి తల్లిదండ్రులకు కాల్ చేసి అమ్మాయి మీ దగ్గరకు వస్తుందని చెప్పి ఇక్కడి నుండి వెళ్లిందని, వచి్చందా అని అడిగాడు. అనుమానించిన తల్లిదండ్రులు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విఘ్నేష్‌ను విచారించగా నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. పారిశ్రామిక వాడకు వెళ్లి చూడగా మృతదేహం కుళ్లిపోయి గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పెళ్లిచేసుకోవాలని తరచూ ఒత్తిడి చేయడంతోనే హత్యచేసినట్లు తెలిపారు. హత్యచేసిన విఘ్నేష్, అతనికి సహకరించిన సాకేత్, కళ్యాణిలను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. -
మరో బాలికపై అఘాయిత్యం!
సాక్షి టాస్క్‌ఫోర్స్, తిరుపతి: తిరుపతి జిల్లాలో మూడున్నరేళ్ల బాలికపై హత్యాచార ఘటనను మరువకముందే.. సోమవారం మరో బాలికపై దారుణం చోటుచేసుకుంది. గాయాల పాలై ముళ్లపొదల్లో అపస్మారక స్థితిలో మూలుగుతున్న బాలికను గుర్తించిన తండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలిక తండ్రి కథనం ప్రకారం.. తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలం యల్లమంద దళితవాడకు చెందిన 14 ఏళ్ల బాలిక సమీపంలోని జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. ఎప్పటిలా సోమవారం పాఠశాలకు వెళ్లింది. సాయంత్రం అవుతున్నా.. ఇంటికి రాకపోవటంతో బాలిక తండ్రి కంగారుపడి పాఠశాలకు వెళ్లాడు. బాలిక పాఠశాలలో లేకపోవటంతో వెతకటం ప్రారంభించాడు. గ్రామానికి సమీపంలోని ముళ్లపొదల్లోంచి మూలుగు వినిపించడంతో లోనికి వెళ్లి చూశాడు. బాలిక తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలో ఉండటాన్ని చూసి చలించిపోయాడు. అక్కడే సపర్యలు చేసి ఏం జరిగిందని బాలికను ఆరా తీశాడు.పొట్టపై తన్ని.. చాకుతో దాడిపాఠశాల ముగిసిన తరువాత బాలిక నడచుకుంటూ ఇంటికి బయలుదేరింది. వెనుకవైపు నుంచి పల్సర్ బైక్‌పై మాస్క్‌లు ధరించి వచ్చిన ఇద్దరు దుండగులు బాలికను అడ్డగించారు. వెంటతెచ్చుకున్న మత్తు మాత్రలను నీళ్లలో కలిపి తాగమని బాలికను బలవంతం చేశారు. అందుకు నిరాకరించడంతో ఇద్దరు దుండగులు కాలితో ఆమె పొట్టపై తన్నారు. ఆపై చాకుతో దాడిచేసి బలవంతంగా మత్తు మందు కలిపిన నీటిని తాగించారు. అనంతరం ఎవరికో వీడియో కాల్చేసి.. ఈ అమ్మాయేనా? కాదా? అని అడిగి తెలుసుకున్నారు. తరువాత ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్టు చెబుతున్నారు. మత్తు మందు తాగించాక గంటకుపైగా బాలిక స్పృహలో లేదు. స్థానికుల సహాయంతో బాలికను ఆమె తండ్రి యల్లమంద పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం బాలికను పోలీసులు జీపులో పీలేరు ప్రభుత్వాస్పపత్రికి తరలించారు. తండ్రిని సర్పంచ్ ఓబులేసు, వైఎస్సార్సీపీ నాయకుడు నాగార్జునరెడ్డి కారులో తీసుకుని పోలీసు వాహనాన్ని వెంబడించారు.కేసులో అనేక సందిగ్ధాలు: ఎస్పీ కార్యాలయంయర్రావారిపాలెం మండలం యల్లమంద గ్రామంలో బాలికపై అత్యాచారం జరిగినట్టు ప్రచారం ప్రచారం చేస్తున్నారని.. దీనిపై యర్రావారిపాలెం పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారని తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయం సోమవారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొంది. విచారణలో అనేక సందిగ్ధాలు వ్యక్తం అవుతున్నాయని తెలిపింది. అయితే, విచారణ పూర్తికాకముందే కొంతమంది సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని, వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని, కేసు నమోదు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ ప్రకటనలో పేర్కొంది.ఆ దుండగుల్ని ఉరి తీయాలిబాలికపై చాకుతో దాడిచేసి.. మత్తు మందు కలిపిన నీళ్లు తాగించి దారుణానికి ఒడిగట్టిన ఇద్దరు నిందితులను గుర్తించి అరెస్ట్ చేయాలని బాలిక తండ్రి కోరారు. నిందితులిద్దరినీ పట్టుకుని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. అలా చేస్తేనే తమకు న్యాయం జరుగుతుందని చెప్పారు.దోషులను శిక్షించే వరకు వదలం: చెవిరెడ్డిమైనర్ బాలికపై దారుణం జరిగిందన్న సమాచారం అందుకున్న చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హుటాహుటిన యల్లమంద దళితవాడకు చేరుకున్నారు. అనంతరం బాలిక చికిత్స పొందుతున్న ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాలికకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను కోరారు. దారుణ ఘటనకు కారుకులైన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దోషులను శిక్షించే వరకు వదిలేది లేదని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. -
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైంది: ఆర్కేరోజా
సాక్షి,తిరుపతిజిల్లా: రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు,చిన్నారులపై దారుణాలు ఎక్కువగా జరుగుతున్నాయని మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. ఎంఆర్పురంలో హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబాన్ని శనివారం(నవంబర్ 2) పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తిరుపతి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డితో కలిసి రోజా పరామర్శించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ‘ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. నిందితుడు గంజాయి,మద్యం మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టాడు. రాష్ట్రంలో గంజాయి మత్తులో పెట్రేగి పోతున్నారు. బాధిత కుటుంబానికి వెంటనే రూ.20 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి. గత ప్రభుత్వం లో తీసుకు వచ్చిన దిశ యాప్‌ను పటిష్టం చేయాలి’అని రోజా డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: మూడేళ్ల చిన్నారిపై హత్యాచారం -
AP: మూడేళ్ల చిన్నారిపై హత్యాచారం
సాక్షి,తిరుపతి: తిరుపతి జిల్లాలో మూడేళ్ల చిన్నారి హత్యాచారం ఘటన సంచలనం రేపింది. వడమాలపేట మండలం ఏఎంపురంలో శుక్రవారం(నవంబర్ 1) సాయంత్రం ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ ‘ఏఎం పురంలో ఇంటి దగ్గర ఉన్న చిన్నారిని చాక్లెట్లు కొనిస్తాను అని మాయమాటలు చెప్పి సుశాంత్ అనే అబ్బాయి తీసుకుని వెళ్ళాడు. నిందితుడు సుశాంత్ చాలా నమ్మకంగా ఆడించినట్లు నటించి చిన్నారిని తీసుకు వెళ్లి అత్యాచారం చేసి హత్య చేశాడు. చట్ట పరంగా నిందితుడికి కఠినంగా శిక్ష పడేలా చూస్తాం’అని తెలిపారు. కాగా, శుక్రవారం సాయంత్రం తాము ఇంటి నుంచి పనిమీద బయటికి వెళ్లి వచ్చేసరికి పాప కనిపించలేదని తల్లదండ్రులు మమత,మధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సుశాంత్ అనే అతను తాము బయటికి వెళ్లేటపుడు పాపతో ఆడుకుంటున్నాడని పోలీసులకు వారు చెప్పారు. దీంతో పోలీసులు సుశాంత్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. పాప మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పుత్తూరు ఆస్పత్రిలో పాప మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఇదీ చదవండి: బాలికపై గ్యాంగ్‌రేప్ -
బాలికపై గ్యాంగ్‌రేప్: వికారాబాద్ జిల్లా
దోమ: మాయమాటలతో ఓ బాలికను లోబర్చుకున్న ఓ యువకుడు, నలుగురు మైనర్లు ఆమెపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డారు. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఎస్ఐ ఆనంద్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం...వికారాబాద్ జిల్లా దోమ మండలంలోని ఓ గ్రామంలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక(13)తో అదే ఊరికి చెందిన సంతోష్ సన్నిహితంగా ఉండేవాడు. ఈ చనువును అవకాశంగా తీసుకొని ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు.ఈ విషయం సంతోష్ స్నేహితులైన నలుగురు మైనర్లకు తెలియగా, బాలికను బ్లాక్మెయిల్ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డారు. విషయం బయటకు చెప్పొద్దని హెచ్చరించడంతో వీరి అఘాయిత్యాలను ఆరు నెలలుగా మౌనంగా ఆ బాలిక భరిస్తోంది. ఈ క్రమంలో గత నెల 28వ తేదీన పాఠశాల నుంచి ఇంటికి వెళుతున్న బాలికను సంతోష్ తన ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే నలుగురు మిత్రులు అక్కడకు చేరుకున్నారు. అంతా కలిసి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు.సాయంత్రం వరకే స్కూల్ నుంచి రావాల్సిన బాలిక రాత్రి ఆలస్యంగా ఇంటికి రాగా, తల్లి నిలదీయడంతో బోరున విలపించింది. జరిగిన విషయాన్ని తల్లికి వివరించింది. దీంతో వెంటనే పీఎస్‌కు వెళ్లిన బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురిని పరిగిలోని డీఎస్పీ కార్యాలయానికి తరలించగా, నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చారు. బాలికను సఖి సెంటర్‌కు తరలించి, వైద్య పరీక్షలు చేయించారు. ప్రస్తుతం బాలిక రెండు నెలల గర్భిణి అని వైద్యులు నిర్ధారించారు.గంజాయి మత్తు కారణమా?గ్రామాల్లో గంజాయి విచ్చలవిడిగా లభిస్తోందని, ఈ మత్తులోనే వారు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొందని స్థానికులు చెబుతున్నారు. నగరం నుంచి గ్రామాలకు గంజాయి సరఫరా అవుతోందని, దీనికి బానిసలుగా మారిన యువత విచక్షణ కోల్పోయి వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. -
డాక్టర్ లేరు.. వైద్య పరికరాలూ లేవంట!
నరసరావుపేట టౌన్ : పల్నాడు జిల్లాలో ఓ మైనర్ బాలిక కేసులో వైద్యుల నిర్లక్ష్యం, ప్రభుత్వ అసమర్థత వెలుగుచూసింది. కిడ్నాప్‌కు గురైన బాలికకు వైద్య పరీక్షల నిర్వహణలో ఓ ఏరియా ఆస్పత్రి డొల్లతనం బట్టబయలైంది. బాధితురాలిని రాత్రి 11 గంటల ప్రాంతంలో తీసుకొస్తే.. డాక్టర్ 12.30కు తీరిగ్గా వచ్చారు. పైగా.. పరీక్షల నిర్వహణకు అవసరమైన పరికరాలు ఆస్పత్రిలో లేవని.. వాటిని బయట నుంచి తెచ్చుకోమని స్లిప్పై రాసివ్వడంపై వివాదాస్పదమవుతోంది. వివరాలివీ.. నరసరావుపేట పట్టణానికి చెందిన పదహారేళ్ల మైనర్ బాలికను వినుకొండ పట్టణానికి చెందిన వెంకటేష్ ప్రేమ పేరుతో వంచించి గత సోమవారం ఇంటి నుంచి బలవంతంగా తీసుకెళ్లాడు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో వన్‌టౌన్ పోలీసులు మంగళవారం కిడ్నాప్, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వినుకొండలో బాలికను గుర్తించిన పోలీసులు ఆమెను నరసరావుపేటకు తీసుకొచ్చారు. రెండ్రోజులపాటు బాలికను నిందితుడు తన వద్దే నిర్బంధించడంతో పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం బాలికను రాత్రి 11గంటలకు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.కానీ, ఆ సమయంలో వైద్యపరీక్షలు చేసేందుకు నైట్‌డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేరు. రాత్రి 12.30 గంటలకు తీరుబడిగా వచ్చిన డాక్టర్ తమ వద్ద మెడికల్ పరీక్షలకు అవసరమైన వైద్య పరికరాలు, లిక్విడ్స్, గ్లౌజులు అందుబాటులో లేవని చెప్పారు. పరీక్షలు నిర్వహించాలంటే బయట నుంచి వాటిని తెచ్చుకోవాలంటూ బాధితులకు స్లిప్ రాసి ఇచ్చారు.కానీ, అప్పటికే అర్థరాత్రి దాటడంతో మెడికల్ షాపులు మూసేశారు. దీంతో.. బాధితురాలికి సకాలంలో చేయాల్సిన వైద్య పరీక్షలు నిలిచిపోగా.. బుధవారం ఉదయం వైద్య పరికరాలు తీసుకురావడంతో దాదాపు 12 గంటల తర్వాత బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. బంధువుల ఆందోళన..ప్రభుత్వాసుపత్రిలో సౌకర్యాలు, వైద్యులు అందుబాటులో లేకపోవడంపై బాధితురాలి బంధువులు ఆందోళనకు దిగారు. పరీక్షల నిర్వహణలో తీవ్ర జాప్యం జరగడంతో సాక్ష్యాలు చెదిరిపోయి కేసు నీరుగారిపోతుందేమోనని వారు ఆవేదన చెందుతున్నారు. పరీక్షలకు అవసరమైన కనీస పరికరాలు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని ఏరియా ఆసుపత్రిలో లేకపోవటంపట్ల వారు మండిపడ్డారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్యూటీ డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
తల్లిపై కన్నేసి.. చిన్నారిని చంపి...
సుభాష్‌నగర్: బాలికను కిడ్నాప్ చేసి హత్యకు పాల్పడిన కేసులో నిందితుడి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. బుధవారం సూరారం పోలీస్ స్టేషన్లో మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. అదిలాబాద్ పాటగూడకు చెందిన సుమ భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఇద్దరు కుమార్తెలతో సహా నగరానికి వలస వచ్చి స్థానిక జీవన్ జ్యోతినగర్‌లో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ప్రభాకర్‌తో గత కొంతకాలంగా సహజీవనం చేస్తుంది. అదే జిల్లాకు చెందిన తిరుపతి కూడా జీవన్ జ్యోతినగర్లోనే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో అతడికి ప్రభాకర్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో తరచూ ప్రభాకర్ ఇంటికి వచ్చే తిరుపతి అతడితో కలిసి మద్యం తాగుతూ, పిల్లలతో చనువుగా ఉండేవాడు. ఈ క్రమంలో సుమపై కన్నేసిన తిరుపతి, ఇద్దరు పిల్లలతో పాటు ప్రభాకర్‌ను అంతమందించి ఆమెను లోబర్చుకోవాలని పథకం వేశాడు. ఇందులో భాగంగా ఈ నెల 12న మధ్యాహ్నం సుమ పెద్ద కూతురు జోత్స్నను (7) హత్య చేసేందుకు బయటికి తీసుకెళ్లిన తిరుపతి అవకాశం దొరక్క ఇంటికి తీసుకువచ్చాడు. మళ్లీ సాయంత్రం చిన్నారిని తీసుకెళ్లిన అతను బాసరగడి గ్రామ సమీపంలోని చెట్ల పొదల్లో కత్తితో పొడిచి హత్య చేశాడు. బాలిక మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టి, గోనె సంచీలో మూట కట్టి తిరిగి ఇంటికి వచ్చాడు. ఏమీ తెలియనట్లు ప్రభాకర్‌తో కలిసి జ్యోత్స్న ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు నటించారు. బాధితుల ఫిర్యాదు మేరకు సూరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నాలుగు బృందాలుగా ఏర్పడి సీసీ కెమెరాలు పరిశీలించగా తిరుపతి సదరు బాలికను తీసుకెళ్లినట్లు నిర్ధారించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకిస్తూ బాలికను హత్య చేసిన ప్రదేశాన్ని చూపించాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. నిందితుడిని పట్టుకోవడానికి కృషి చేసిన సిబ్బందికి రివార్డు అందజేసినట్లు ఏసీపీ పేర్కొన్నారు. -
బాలికపై అత్యాచార యత్నం
శ్రీకాళహస్తి : తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని సంత మైదానం వద్ద శనివారం ఐదేళ్ల బాలికపై అత్యాచార యత్నానికి ఒడిగట్టిన గుర్తుతెలియని యువకుడిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. స్థానికుల కథనం మేరకు.. సంతమైదానం సమీప ప్రాంతానికి చెందిన ఐదేళ్ల బాలికను గుర్తుతెలియని యువకుడు స్కూటర్ పై తీసుకొచ్చి నిర్మాణంలో ఉన్న ఇంటి మిద్దెపైకి బలవంతంగా ఎత్తుకెళ్లాడు. అటుగా వెళ్తున్న సుబ్బలక్ష్మి అనే యువతి అతని వాలకంపై అనుమానంతో గమనించింది. ఆపై విషయాన్ని స్థానికులకు చెప్పింది. దీంతో స్థానికులు మిద్దెపైకి వెళ్లి బాలికపై అఘాయిత్యం చేయబోతున్న యువకుడిని పట్టుకుని కరెంట్ స్తంభానికి కట్టేసి చితకబాదారు. అనంతరం ఒకటో పట్టణ పోలీసులకు అప్పగించారు. పోలీసులు యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశారు. -
దోషులకు ఉరిశిక్ష విధించాలి: సీఎం మమత
కోల్‌కతా: కుల్తాలీ బాలిక హత్యాచారం కేసును పోక్సో చట్టం కింద నమోదు చేయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోలీసులను ఆదేశించారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో దోషులకు మూడు నెలల్లో ఉరిశిక్ష విధించాలని పోలీసులను కోరారు. శనివారం దక్షిణ 24 పరగణాల జిల్లా కుల్తాలీలోని ఓ కాలువలో పదేళ్ల బాలిక శవమై కనిపించిన విషయం తెలిసిందే. ‘నేరానికి రంగు, కులం, మతం లేదు. పోక్సో చట్టం కింద కుల్తాలీ కేసు నమోదు చేసి మూడు నెలల్లోగా దోషులకు ఉరిశిక్ష పడేలా చూడాలని పోలీసులను కోరుతున్నా. ఏదైనా నేరం నేరమే. దానికి మతం లేదా కులం లేదు. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అత్యాచారం కేసుల్లో దర్యాప్తు జరగుతున్న సమయంలో మీడియా విచారణ చేయటం ఆపివేయాలి’ అని అన్నారు.మరోవైపు.. బాలిక హత్యాచారంపై ఆదివారం దక్షిణ 24 పరగణాలలో నిరసనలు చెలరేగాయి. బాధ్యులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని బీజేపీ నిరసనలకు దిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్, అగ్నిమిత్ర పాల్ నిరసనల్లో పాల్గొన్నారు.ఈ కేసుకు సంబంధించి ఓ అనుమానితుడిని పశ్చిమ బెంగాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నామని పోలిసులు తెలిపారు. సౌత్ 24 పరగణాల పోలీసు సూపరింటెండెంట్ పలాష్ చంద్ర ధాలీ మీడియాతో మాట్లాడారు. ‘‘బాలిక ట్యూషన్ నుంచి తిరిగి వస్తుండగా సాయంత్రం తప్పిపోయింది. రాత్రి 8 గంటల వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. శనివారం(నిన్న) విచారణ ప్రారంభించాం. విచారణ తర్వాత ఈ రోజు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం. బాలికను తానే హత్య చేశానని నిందితుడు చెప్పాడు. ప్రభుత్వం ఇటువంటి కేసులపై చాలా సీరియస్‌గా ఉంది. ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది’’ అని తెలిపారు. అయితే... ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాలిక అత్త ఆరోపణలు చేశారు. బాధితురాలి శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నాయని, అవయవాలు విరిగిపోయాయని అన్నారామె. నిందితులకు శిక్ష విధించాలని ఆమె డిమాండ్ చేశారు.చదవండి: వైద్యురాలి ఉదంతం మరవకముందే.. బెంగాల్లో మరో దారుణం -
వైద్యురాలి ఉదంతం మరవకముందే.. బెంగాల్లో మరో దారుణం
కోల్‌కతా: కోల్‌కతా ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచార ఘటనకు మరువకముందే బెంగాల్లో మరో దారుణం వెలుగుచూసింది. వైద్యురాలి ఘటనపై సీఎం మమతా బెనర్జీ. బెంగాల్ ప్రభుత్వంపై ఇప్పటికీ విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. కోచింగ్ క్లాస్‌కు వెళ్లిన 11 ఏళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం కలకలం రేపుతోంది.బాలికను కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారని అనుమానాలు రావడంతో స్థానికుల నుంచి ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. ఘటనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాస్ జిల్లాలో ఈ ఘోరం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. 11 ఏళ్ల బాలిక కోచింగ్ క్లాస్‌కు హాజరయ్యేందుకు శుక్రవారం ఇంటి నుంచి వెళ్లింది. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక కోసం గాలిస్తున్న క్రమంలో శనివారం తెల్లవారుజామున 3.30 గంటల సంమయంలో ఓ పొలంలో ఆమె మృతదేహం లభ్యమైంది. ఒంటినిండా గాయాలు ఉండటంతో కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. వాటి ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అనుమానిస్తున్న మోస్తకిన్ సర్దార్ అనే 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ఆగ్రహించిన గ్రామస్థులు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. నిందితుడిపైవ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కర్రలతో పోలీసుస్టేషన్‌పై దాడి చేసి, అవుట్ పోస్ట్‌కు నిప్పుపెట్టారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భద్రతా బృందాలను మోహరించారు.కాగా బాలికను అత్యాచారం చేసి చంపేసి ఉంటారని బీజేపీ ఆరోపిస్తోంది. ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా బెంగాల్ ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే మరో అమాయక బాలిక ప్రాణాలు కోల్పోయిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి మమతాబెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
బాలికను వేధించాడని.. రైల్వే ఉద్యోగిపై ప్రయాణికుల దాష్టీకం
న్యూఢిల్లీ: రైలులో మైనర్ బాలికను లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో బాధితురాలి కుటుంబ సభ్యులు, ఇతర ప్రయాణికులు రైల్వే ఉద్యోగిని కొట్టి చంపారు. ఈ ఘటన హమ్సఫర్ఎక్స్ప్రెస్ రైలులో గురువారం వెలుగుచూసింది. వివరాలు.. బిహార్‌లోని సివాన్కుచెందిన కుటుంబం బుధవారం న్యూఢిల్లీకి వెళ్తున్న హమ్ సఫర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. రైలులోని థర్డ్ ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తున్నారు.అయితే రాత్రి 11.30 గంటలల సమయంలో సమయంలో అయితే అదే కోచ్‌లో ప్రయాణిస్తున్న గ్రూప్ డీ రైల్వే ఉద్యోగి ప్రశాంత్ కుమార్ .. కుటుంబంలోని 11 ఏళ్ల భాలికను తన సీటు వద్ద కూర్చొబెట్టుకున్నాడు. తర్వాత బాలిక తల్లి వాష్‌రూమ్‌కు వెళ్లగా.. చిన్నారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడుమహిళ వాష్‌రూమ్ నుంచి తిరిగి రాగానే, బాలిక తల్లి వద్దకు పరిగెత్తి, ఆమెను పట్టుకొని ఏడవడం ప్రారంభించింది. తల్లిని వాష్‌రూమ్‌కి తీసుకెళ్లి జరిగిన విషయం చెప్పింది. దీంతో రైల్వే ఉద్యోగి ప్రశాంత్ కుమార్ ప్రవర్తనపై ఆ మహిళ తన భర్త, మామతోపాటు కోచ్‌లోని ఇతర ప్రయాణికులకు చెప్పింది. రైలు లక్నోలోని ఐష్బాగ్ జంక్షన్‌కు చేరుకోవడంతోదీంతో అతడ్ని ఆ కోచ్ డోర్ వద్దకు తీసుకెళ్లారు. కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు, ఇతర ప్రయాణికులు కదులుతున్న రైలులోనే గంటన్నరపాటు నిందితుడిని కొట్టారు.అనంతరం రైలు ఉదయం 4.35 నిమిషాలకు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ సెంట్రల్ చేరుకోగా.. నిందితుడుని రైల్వే పోలీసు అధికారులు అప్పగించారు. బాలికను వేధించినట్లు అతడిపై ఫిర్యాదు చేశారు. తీవ్రంగా గాయపడిని ప్రశాంత్ కుమార్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడిది బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలోని సమస్త్‌పూర్ గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు.అయితే బాలిక కుటుంబం, ఇతర ప్రయాణికులు కుట్రతో ప్రశాంత్ కుమార్‌ను హత్య చేసినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అనకాపల్లిలో మైనర్‌పై అత్యాచారం
అనకాపల్లి: మైనర్ బాలిక(14)పై అత్యాచారం చేసి, గర్భవతిని చేసిన ఇంటర్ విద్యార్థిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ తేజేశ్వరరావు బుధవారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాలు. వి.మాడుగుల మండలం కింతలివల్లాపురం గ్రామానికి చెందిన కుటుంబం పనుల నిమిత్తం అనకాపల్లి మండలం ఊడేరు గ్రామానికి వలస వచ్చారు. అదే గ్రామానికి చెందిన 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థి బాలికపై అత్యాచారం చేశాడు. ప్రస్తుతం 5వ నెల గర్భవతి. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తేజేశ్వరరావు తెలిపారు. -
US: అమ్మాయి అనుకుని చాటింగ్.. భారత విద్యార్థికి 12 ఏళ్ల జైలు
న్యూయార్క్: ఉన్నత చదువులు చదవడానికి అమెరికా వెళ్లి బుద్ధి వక్రీకరించి 12 ఏళ్ల జైలు శిక్షకు గురయ్యాడు ఓ భారత విద్యార్థి. స్టూడెంట్ వీసా మీద అమెరికా వెళ్లిన ఉపేంద్ర ఆడూరు(32) భారత విద్యార్థి సోషల్ మీడియాలో 13 ఏళ్ల బాలిక అనుకుని ఓ వ్యక్తితో చాటింగ్ మొదలుపెట్టాడు. తన లైంగిక వాంఛ తీర్చుకునేందుకు మభ్యపెట్టే విధంగా సందేశాలు పంపాడు. అంతటితో ఆగకుండా ఆ ఖాతాకు అశ్లీల చిత్రాల మెసేజ్‌లు కూడా పెట్టాడు. ఏకంగా ఓ రోజు టైమ్ ఫిక్స్ చేసుకుని ఆ బాలికను కలవడానికి వెళ్లాడు. ఇక్కడే అతడికి ఎదురైంది పెద్ద ట్విస్టు. ఉపేంద్ర అనుకున్నట్లు ఆ ఖాతా 13 ఏళ్ల బాలికది కాదు.మైనర్ల మీద లైంగికనేరాలకు పాల్పడే వారిని వలపన్ని పట్టుకునేందుకు ఓ ప్రైవేట్ డిటెక్టివ్ క్రియేట్ చేసిన నకిలీ ఖాతా. ఉపేంద్ర బాలికను కలిసేందుకు మీటింగ్ స్పాట్‌కు వెళ్లగానే పోలీసులు పట్టుకున్నారు. అతడి ఫోన్ లాక్కుని అందులోని అశ్లీల వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారమంతా 2022 సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 6 మధ్యలో జరిగింది. ఈ కేసులో ఉపేంద్రకు 12 ఏళ్ల జైలు శిక్షతో పాటు రిలీజ్ అయిన తర్వాత మరో 10 ఏళ్లు పోలీసుల పర్యవేక్షణలో ఉండాలని కోర్టు తీర్పిచ్చింది. -
దళితుడి లాకప్‌డెత్?
సాక్షి, నంద్యాల : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ముచ్చుమర్రి మైనర్ బాలిక హత్యాచారం కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసుల అదుపులో ఉన్న అనుమానితుల్లో ఒక దళిత వ్యక్తి శనివారం లాకప్‌డెత్‌కు గురైనట్లు తెలుస్తోంది. విచక్షణారహితంగా కొట్టడంతో పాటు థర్డ్ డిగ్రీ ఉపయోగించడంవల్లే అతని ప్రాణాలు పోయినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. అంతకుముందు.. మైనర్ బాలిక హత్యాచారం ఘటనతో సంబంధం ఉన్న అనుమానంతో పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారిచ్చిన సమాచారంతో గురువారం సాయంత్రం మరో ఆరుగురిని నందికొట్కూరు, ముచ్చుమర్రి ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. వీరిని మొదట జూపాడు బంగ్లా పోలీస్‌స్టేషన్‌కు తరలించి అక్కడ రెండు గంటల పాటు విచారించినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసుల దెబ్బలు తాళలేక నిందితులు అరిచిన అరుపులు తమకు వినిపించాయని వారంటున్నారు.అయితే, ఈ విచారణలో నలుగురు వ్యక్తులకు ఈ ఘటనతో సంబంధంలేదని తేలడంతో వారిని వదిలేసి అంబటి హుస్సేన్ అలియాస్ యోహాన్ (36), అంబటి ప్రభుదాస్‌ను తమదైన శైలిలో గట్టిగా విచారించారు. వీరిద్దరినీ మిడుతూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి శుక్రవారం అంతా విపరీతంగా కొట్టినట్లు సమాచారం. ఆ తర్వాత నంద్యాల పట్టణంలోని సీసీఎస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే, హుస్సేన్ మిడుతూరులో మృతిచెందితే నంద్యాల సీసీఎస్‌కు తరలించి ఆ తర్వాత ఆసుపత్రికి తరలించారా? లేక సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో మృతిచెందిన తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లారా అన్న దానిపై స్పష్టతలేదు.బంధువులతో రాజీ..ఇక హుస్సేన్ చనిపోయాడన్న సమాచారం తెలుసుకున్న బంధువులు శనివారం ఉదయాన్నే ముచ్చుమర్రి, నందికొట్కూరు నుంచి నంద్యాలకు బయల్దేరారు. మార్గమధ్యంలోనే పోలీసులు వీరిని అడ్డుకుని రహస్య ప్రాంతానికి తరలించారు. అక్కడ లాకప్‌డెత్ విషయంలో రాజీకి ప్రయత్నించినట్లు సమాచారం. వీరితో సంతకం చేయించుకున్న తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. అప్పటివరకు క్యాజువ్యాలిటీలోనే ఉ.6 నుంచి సా.4 వరకు మృతదేహాన్ని ఉంచారు. ఆయాసంతో చనిపోయాడంట..ఇక బాధితులతో రాజీ ప్రయత్నం సఫలం కావడంతో జిల్లా ఎస్పీ కార్యాలయం శనివారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. హుస్సేన్‌ను అదుపులోకి తీసుకుని నందికొట్కూర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్తుండగా నిందితుడు పోలీస్ వాహనం నుంచి దూకి పారిపోయే ప్రయత్నం చేశాడని తెలిపారు. అప్రమత్తమైన పోలీసులు హుస్సేన్‌ను పట్టుకోవడంతో తనకు ఆయాసంగా ఉందని, గుండెనొప్పిగా ఉన్నట్లు పోలీసులకు తెలిపాడని.. దీంతో పోలీసులు అతన్ని నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. (నిజానికి.. దగ్గర్లోని నందికొట్కూరు ఆస్పత్రికి తరలించకుండా 60 కి.మీ దూరంలోని నంద్యాలకు తరలించారు.) డాక్టర్లు పరిశీలించి చనిపోయినట్లు నిర్ధారించారని ఆ ప్రకటనలో తెలిపారు. అలాగే, మిడుతూరు పోలీస్‌స్టేషన్‌లో ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ కార్యాలయం ఆ ప్రకటనలో తెలిపింది.నోట్లో గుడ్డలు కుక్కి మరీ..నిజానికి.. హుస్సేన్, ప్రభుదాస్ ఇద్దరూ అన్నదమ్ములు. మైనర్ బాలిక హత్యాచారం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితులలో ఒక బాలుడికి వీరు మేనమామ అవుతారని గ్రామస్తులు చెబుతున్నారు. ఘటన జరిగిన తర్వాత నిందితుల్లో ఒకరైన పదో తరగతి బాలుడు ఇచ్చిన సమాచారం మేరకు మృతదేహాన్ని మాయం చేయడంలో హుస్సేన్ ప్రధాన పాత్ర పోషించాడని పోలీసుల విచారణలో తేలినట్లు విశ్వసనీయ సమాచారం.దీంతో మృతదేహం ఎక్కడ వేశారు.. ఆ సమయంలో ఎవరెవరున్నారు అన్న కోణంలో విచారణ సాగింది. ఈ సందర్భంగా మృతుడిని విచక్షణారహితంగా కొట్టినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. హుస్సేన్ రెండు చేతులు, వేళ్లు, కాళ్లు ఉబ్బిపోయి కనిపిస్తున్నాయి. డొక్క, వీపు భాగంలో గట్టిగా కొట్టిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొట్టే సమయంలో బాధితుడు అరవకుండా నోట్లో గుడ్డ పేలికలు పెట్టినట్లు తెలుస్తోంది. చనిపోయిన తర్వాత మృతుడి నోరు తెరుచుకుని ఉండడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది.రాజీ కుదిర్చిన టీడీపీ నేత?.. గుట్టుగా అంత్యక్రియలుమరోవైపు.. లాకప్‌డెత్ కేసులో నియోజకవర్గానికి చెందిన టీడీపీ ప్రజా ప్రతినిధి తండ్రి రాజీ కుదిర్చినట్లు సమాచారం. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సాయం చేయడంతో పాటు కుటుంబంలో ఇద్దరికి ఉద్యోగాలిస్తామని చెప్పి రాజీచేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.ఆ నేత ఇచ్చిన హామీ మేరకు హుస్సేన్ మృతిపై బంధువులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని సమాచారం. ఇదిలా ఉంటే.. హుస్సేన్ మృతదేహాన్ని పోలీస్ ఎస్కార్ట్ సాయంతో అంబులెన్స్ ద్వారా రాత్రి ఎనిమిది గంటల సమయంలో నంద్యాల నుంచి పాత ముచ్చుమర్రికి తరలించి అక్కడి శ్మశాన వాటికలో ఉంచారు. కుటుంబ సభ్యులను మాత్రమే అక్కడికి అనుమతిచ్చి అంత్యక్రియలు గుట్టుగా పూర్తిచేయించారు. మృతుడికి తల్లి, ముగ్గురు సోదరులు, ఇద్దరు అక్కలు ఉన్నారు. తాళం వేసి పోస్టుమార్టం?మరోవైపు.. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో హుస్సేన్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో ప్రొ. డాక్టర్ రాజశేఖర్ దీనిని పూర్తిచేశారు. ఈ గదికి లోపల వైపు తాళం వేసి మరీ ఈ ప్రక్రియను చేపట్టారు. ఇతర సిబ్బంది, మీడియా ప్రతినిధులు ఎవరూ అటువైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోస్టుమార్టం ప్రక్రియను వీడియో రికార్డ్ చేశారు. లాకప్‌డెత్ కానప్పుడు తాళంవేసి రహస్యంగా పోస్ట్‌మార్టం చేయించాల్సిన అవసరమేంటని బంధువులు ప్రశ్నిస్తున్నారు. అధికారం అండతో కేసును లాకప్‌డెత్ కాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.మిడుతూరు నుంచి నంద్యాల సీసీఎస్‌కు అక్కడి నుంచి ఆస్పత్రికి..ఇక పోలీసులు కొట్టిన దెబ్బలు తట్టుకోలేక శనివారం తెల్లవారుజామున హుస్సేన్ మృతిచెందినట్లు తెలిసింది. కానీ, ప్రభుదాస్ ఎలా ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడనే సమాచారం తెలీకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. అంతకుముందు.. హుస్సేన్‌ను హుటాహుటిన నంద్యాల సర్వజన ఆస్పత్రిలోని క్యాజువల్ వార్డుకు తరలించారు. పోలీసులు రోగుల సహాయకులను అక్కడ నుంచి పంపించేసి వార్డులోకి ఎవరూ వెళ్లకుండా కాపలా ఉన్నారు.హుస్సేన్‌ను మిడుతూరు నుంచి నంద్యాల సీసీఎస్ స్టేషన్‌కు అక్కడి నుంచి ప్రభుత్వాస్పత్రికి ఉదయం 5–6 గంటల సమయంలో తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి నంద్యాల డీఎస్పీ రవీంద్రనాథ్‌రెడ్డితో పాటు ఆరుగురు సీఐలు, నలుగురు ఎస్ఐలు దాదాపు 30 మంది కానిస్టేబుళ్లు ఆస్పత్రిని తమ ఆధీనంలో ఉంచుకున్నారు. మీడియా సిబ్బంది ఎవరూ ఆసుపత్రిలోకి రాకుండా అడ్డుకున్నారు. అయినా, మృతుడి ఫొటోలు మీడియాకు లభ్యం కావడంతో వాటిని పోలీసులే దగ్గరుండి మరీ తొలగించారు.విచారణలో సస్పెండ్ అయిన పోలీసులు?మైనర్ బాలిక హత్యాచారం ఘటనలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు రావడంతో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, మరో సబ్ ఇన్స్పెక్టర్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కేసులో మొదటి నుంచి వీరు ఉండడంతో సస్పెండ్ అయిన తర్వాత కూడా వీరు పోలీసు విచారణలో పాల్గొన్నట్లు అత్యంత శ్వసనీయంగా తెలిసింది. అనుమానితులను అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణ చేసే సమయంలో వీరిద్దరూ సంఘటన స్థలంలోనే ఉన్నట్లు సమాచారం. -
తీరిక లేదా అనితమ్మా!?
సాక్షి, అనకాపల్లి: సొంత జిల్లాలో బాలికను ఒక దుండగుడు పాశవికంగా కత్తితో పొడిచి చంపినా.. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితకు పట్టడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించకపోవడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. ప్రధానంగా బాలిక మృతదేహం ఆస్పత్రిలో ఉన్న సమయంలో పక్కనే జరిగిన ఒక సన్మాన కార్యక్రమానికి హాజరైన ఆమె బాలిక కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేయకపోవడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమవుతోంది. రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంలో ఈనెల 6వ తేదీ సాయంత్రం 9వ తరగతి చదువుతున్న బద్ది దర్శిని (14) అనే బాలికను బోడాబత్తుల సురేష్ కత్తితో దాడిచేసి దారుణంగా హత్యచేసిన విషయం తెలిసిందే. ఘటన జరిగి నాలుగు రోజులైనా ఇప్పటివరకు నిందితుడి ఆచూకీ లేదు. మైనర్ బాలిక హత్యకేసు విషయంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబానికి ఎటువంటి భరోసా దక్కలేదు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో బాలిక హత్య కేసుపట్ల హోంమంత్రి కనీసం దృష్టిసారించకపోగా.. బాధిత కుటుంబానికి ధైర్యం కూడా చెప్పకపోవడంపట్ల గ్రామస్తులు దుమ్మెత్తిపోస్తున్నారు. దొరకని నిందితుని ఆచూకీ..ఘటన జరిగి నాలుగు రోజులైనా నిందితుడి ఆచూకీ దొరకలేదు. నిజానికి.. నిందితుడు సురేష్ ఒక నేరానికి సంబంధించి జైలుకెళ్లి బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ నేపథ్యంలో అతడిపై పోలీసులు నిఘా పెట్టకపోవడం కూడా ఈ హత్యకు దారితీసిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బెయిల్ మీద వచ్చాక బస్సులో ఒకరోజు బాధితురాలి వెంటపడ్డాడని.. ఈ విషయం వెంటనే పోలీసుల దృష్టికి బాలిక తండ్రి వెంకటరమణ తీసుకువెళ్లినా పట్టించుకోలేదని చెబుతున్నారు.ఈ విషయమై మంత్రి అనితను మీడియా సమావేశంలో ఒక విలేకరి ప్రశ్నించగా.. అదే నిజమైతే సదరు పోలీసు అధికారిపై చర్యలు తీసుకుంటామని చెప్పి ఆ విషయాన్ని విస్మరించారని స్థానికులు గుర్తుచేస్తున్నారు. ఇదిలా ఉంటే.. నిందితుడు ఆచూకీ తెలిపిన వారికి రూ.50 వేలు నగదు బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించి అతని ఫొటోలు విడుదల చేశారు. -
గంజాయి అలవాటు చేసి మరీ గ్యాంగ్ రేప్
మేడ్చల్, సాక్షి: నగరంలో ఘోరం జరిగింది. మైనర్ బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాచిగూడకు చెందిన మైనర్‌కు సదరు యువకులు గంజాయి అలవాటు చేశారు. ఆ మత్తులో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే బాలిక భయంతో ఈ ఘోరాన్ని ఎవరికీ చెప్పడకుండా ఉండిపోయింది. ఈలోపు శరీరంలో మార్పులు రావడంతో బాధితురాలిని, తల్లి నిలదీసింది. దీంతో జరిగిన ఘోరాన్ని బాలిక తల్లికి వివరించింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కాచిగూడ పోలీసులు.. ఆ కేసును నేరెడ్‌మెట్‌కు బదిలీ చేశారు. పరారీలో ఉన్న యువకుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. -
భార్యకు గర్భం.. భర్తకు జైలు
మైసూరు: మైసూరు జిల్లాలోని హెచ్డి కోటె తాలూకాలోని బూదనూరు హాడి గ్రామానికి చెందిన నాగేష్ (25) అనే యువకుడు ఆదే గామానికి చెందిన మైనర్ బాలికను పెళ్ళి చేసుకున్నాడు, బాలిక ఇటీవల గర్భం దాల్చడంతో విషయం పోలీసులకు చేరి భర్తపై పోక్సో కేసు పెట్టారు. ఏడాది క్రితం అదే గ్రామానికి చెందిన బాలిక (16)తో నాగేష్కు కుటుంబ సభ్యులు పెళ్లి చేశారు. బాలిక గర్భవతి కావడంతో అన్నూరు పిహెచ్సీలో వైద్య పరీక్షల కోసం వెళ్లింది. వైద్యురాలు బాలికకు ఇంకా మైనారిటీ తీరలేదని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 18 ఏళ్లు నిండాకుండా పెళ్లి చేయడం, గర్భవతిని చేయడం చట్ట విరుద్ధం కాబట్టి, పోలీసులు నాగేష్‌ను పోక్సో కేసులో అరెస్టు చేసి జైలుకు తరలించారు. -
యడ్యూరప్పకు హైకోర్టులో ఊరట
బెంగళూరు: మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్పకు శుక్రవారం హైకోర్టులో ఊరట లభించింది. యడ్యూరప్పను అరెస్టు చేయవద్దని కర్నాటక హైకోర్టు సీఐడీ పోలీసులను ఆదేశించింది. పోస్కో చట్టం కింద నమోదైన కేసును విచారిస్తున్న సీఐడీ ఎదుట ఈనెల 17న హాజరుకావాలని బీజేపీ సీనియర్ నేత, 81 ఏళ్ల యడ్యూరప్పను హైకోర్టు ఆదేశించింది. -
మైనర్‌ను గర్భవతిని చేసి నిమ్స్‌లో వదిలేశాడు!
లక్డీకాపూల్ (హైదరాబాద్): నల్లగొండ జిల్లాకు చెందిన ఓ యువకుడు.. మాయమాటలు చెప్పి ఓ మైనర్ బాలికను లోబర్చుకున్నాడు.. ఆమె గర్భం దాల్చడంతో గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్‌లోని ‘నిమ్స్ (నిజాం వైద్య విజ్ఞాన సంస్థ)’ఆస్పత్రికి తీసుకువచ్చాడు.. తనకు పరిచయం ఉన్న ఓ ఉద్యోగి సాయంతో నిమ్స్ అధికారిని కలిశాడు.. ఆ అధికారి సహకారంతో మైనర్ గర్భిణిని నిమ్స్ ఆస్పత్రిలో అడ్మిట్ చేయించాడు. కానీ ఈ విషయం బయటికి లీకైంది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగి సమగ్ర దర్యాప్తు చేపట్టారు. మూడు రోజులుగా ఆస్పత్రిలో.. నల్లగొండ జిల్లా నకిరేకల్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక (16 ఏళ్లు) కడుపులో నొప్పితో బాధపడుతోందని చెప్తూ.. ఒక యువకుడు మూడు రోజుల క్రితం నిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. అప్పటికే ఆమె నాలుగు నెలల గర్భవతి అని, ఆమెను వదిలించుకోవాలనే ఉద్దేశంతోనే తీసుకువచ్చాడని సమాచారం. ఈ విషయం వెలుగులోకి రాకుండా ఉంచేందుకు నిమ్స్‌లో తనకు తెలిసినవారితో కలసి ప్రయత్నించాడ ని తెలిసింది.వైద్యులు బాలికకు వైద్య పరీక్షలు చేసినప్పుడు.. ఆమె గర్భవతి అని గుర్తించినా, కప్పిపుచ్చే ప్రయ త్నం జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానికి ఆమెకు చికిత్స ఏదీ అవసరం లేకున్నా.. ఆశ్రయం ఇచ్చే ఉద్దేశంతో మిలీనియం బ్లాక్ రూమ్ నంబర్ 322లో ఇన్‌పేషెంట్‌గా చేర్చుకున్నట్టు తెలిసింది. వారు ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ విషయం బయటికి పొక్కింది. విషయం సీరియస్‌గా మారుతోందని గుర్తించిన నిమ్స్ వర్గాలు.. బుధవారం బాలికను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి చేతులు దులుపుకొనేందుకు ప్రయత్నించాయని సమాచారం. అయితే పోలీసులు నిమ్స్‌కు చేరుకుని బాలికను నల్లగొండకు తరలించినట్టు ప్రచారం జరుగుతోంది. బాలికను మోసం చేసిన సదరు యువకుడు ఆమెకు బావ అవుతాడని ఓవైపు.. ఓ మాజీ ప్రజాప్రతినిధి కుమారుడే కారణమని మరోవైపు ప్రచారం జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు ఈ వ్యవహా రంపై మౌనం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.మెడికో లీగల్ కేసు కిందే వైద్యం చేశాంసదరు బాలిక కడుపులో నొప్పితో బాధపడుతూ నిమ్స్‌కు వచ్చింది. ఆమెకు వైద్య పరీక్షలు చేయించిన తర్వాతే గర్భవతి అని తేలింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాం. మెడికో లీగల్ కేసు (ఎంఎల్సీ)గా పరిగణించే, ఆ తరహాలో నమోదు చేశాకే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. – ప్రొఫెసర్ నగరి బీరప్ప, నిమ్స్ డైరెక్టర్ -
మైనర్ బాలిక చేరదీత
అడ్డగుట్ట: ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన మైనర్ బాలికను ఆర్పీఎఫ్ పోలీసులు చేరదీసి హోంకు తరలించిన ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన మేరకు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శనివారం అనుమానాస్పదంగా కుమారి(16) అనే బాలిక సంచరిస్తోంది. ఈ క్రమంలో ఆరీ్పఎఫ్ పోలీసులు ఆమెను విచారించగా ఇంటి నుంచి పారిపోయి వచ్చినట్లు చెప్పింది. దీంతో సదరు బాలికను చేరదీసిన ఆర్పీఎఫ్ పోలీసులు ఆఫ్జల్‌గంజ్‌లోని ఎస్ఆర్డీ హోం కు తరలించారు. -
Bengaluru: యడ్యూరప్పపై లైంగిక దాడి కేసు.. మాజీ సీఎం రియాక్షన్ ఇదే..
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్పపై లైంగికదాడి కేసు నమోదైంది. తన కూతురిపై యడ్యూరప్ప లైంగికదాడి చేశారని ఓ 17 ఏళ్ల బాలిక తల్లి బెంగళూరులోని సదాశివనగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. పోక్సో చట్టం కింద యడ్యూరప్పపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక కేసులో సాయం అడిగేందుకు ఫిబ్రవరి 2న యడ్యూరప్ప ఇంటికి వెళ్లినపుడు తన కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో బాలిక తల్లి పేర్కొన్నట్లు సమాచారం. యడ్యూరప్ప ఇప్పటికి మూడుసార్లు కర్ణాటక సీఎంగా పనిచేశారు. 2021లో యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేశారు. ఇంటికి వస్తే సాయం చేశాను.. పోలీసులు కేసు పెట్టారు.. తనపై లైంగిక దాడి కేసు నమోదవడంపై యడ్యూరప్ప స్పందించారు. ఒక మహిళ కూతురిని తీసుకొని ఫిబ్రవరి 2వ తేదీన తన ఇంటికి వచ్చిన మాట నిజమేనని చెప్పారు. ఆమెకు ఒక కేసు విషయంలో సాయం అవసరమైతే పోలీస్ కమిషనర్‌కు స్వయంగా ఫోన్ చేశానని చెప్పారు. అయితే ఆ తర్వాత అనూహ్యంగా ఆమె తనకు వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించిందన్నారు. తర్వాత పోలీసులు తనపై పోలీసులు కేసు నమోదు చేశారని, ఈ కేసు వెనుక రాజకీయ కారణాలున్నాయా లేదా అనేది చెప్పలేనన్నారు. ఏం జరుగుతుందో చూద్దామన్నారు. ఇదీ చదవండి.. అవినీతి నిర్మూళనే మా సిద్ధాంతం.. మోదీ -
పరీక్షకు వచ్చిన విద్యార్థినిపై యాసిడ్ దాడి!
కర్ణాటకలోని మంగళూరులో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. నగరంలోని కడబా ప్రాంతంలో 17 ఏళ్ల మైనర్ బాలికపై ఓ యువకుడు యాసిడ్ దాడి చేశాడు. బాధితురాలు స్థానిక పాఠశాలలో 12వ తరగతి చదువుతోంది. ఆ బాలిక సోమవారం ఉదయం పరీక్ష రాసేందుకు పరీక్షా కేంద్రానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పరీక్షా కేంద్రం వద్ద కాపుగాసిన 23 ఏళ్ల అబిన్ ఆమెపై యాసిడ్ విసిరాడు. దీనిని గమనించిన అక్కడున్నవారు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అబిన్ కేరళకు చెందినవాడని, ఎంబీఏ చదువుకున్నాడని తెలిపారు. అతనికి బాధితురాలితో గతంలో పరిచయం ఉంది. నిందితుడు అబిన్ బాధితురాలు కేరళలో ఒకే ప్రాంతంలో ఉండేవారని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం బాధితురాలికి వైద్యులు చికిత్సనందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
ఉజ్జయిని కేసు: నిందితుడు తప్పించుకునే ప్రయత్నం
భోపాల్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉజ్జయిని బాలిక రేప్ కేసులో నిందితుడు భరత్ సోనిని ఇదివరకే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆధారాలు సేకరించేందుకు సంఘటన స్థలానికి నిందితుడిని తీసుకుని వెళ్లగా అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడని అప్రమత్తమై పోలీసులు అతడిని పట్టుకున్నట్లు ఎస్పీ సచిన్ శర్మ తెలిపారు. సచిన్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కేసులో బాలిక దుస్తులతోపాటు ఇతర ఆధారాలను సేకరించే క్రమంలో నిందితుడిని సంఘటనా స్థలానికి తీసుకెళ్లగా అదే అదనుగా భావించి నిందితుడు పారిపోయే ప్రయత్నం చేశాడని ఈ ప్రయత్నంలో అతడి సిమెంట్ రోడ్డుపై పడిపోవాడంతో మోకాళ్ళకు, కాళ్లకు గాయాలు కూడా అయ్యాయన్నారు. సర్జరీ తర్వాత ప్రస్తుతం బాలిక ఆరోగ్యం కుదుటపడినా కూడా ఆమె ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉందని తెలిపారు. ఉజ్జయిని ఘోరానికి సంబంధించిన దృశ్యాలు బయటకు రాగానే అప్రమత్తమైన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అక్కడి ఆటో డ్రైవర్లను విచారించి భరత్ సోనీని నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్‌లో అత్యాచారానికి గురైన పదిహేనేళ్ల బాలిక దుస్తులు లేకుండా రక్తం కార్చుకుంటూ దయనీయ స్థితిలో ఉజ్జయిని వీధుల్లో సాయం కోరుతూ తిరిగిన వీడియో బయటకు రావడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. కనిపించిన వారందరినీ సాయమడుగుతూ చివరికి ఆ బాలిక ఒక ఆశ్రమం ఎదుట స్పృహ తప్పి పడిపోగా ఆశ్రమవాసులు ఆమెను ఆస్పత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. #WATCH | Ujjain minor rape case: Ujjain SP Sachin Sharma says, "There is an accused in the rape case. There is another auto driver against whom a case will be registered for not informing the police about the incident. When we were taking (the accused) for recreation of the crime… pic.twitter.com/6x3AggXxqq — ANI (@ANI) September 28, 2023 ఇది కూడా చదవండి: బస్సులోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి -
అమానవీయం.. అత్యాచార బాధితురాలి పట్ల కర్కశంగా..
సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ఇంటా.. బయటా నిత్యం ఏదో ఒకచోట వేధింపులు ఎదురవుతూనే ఉన్నాయి. చిన్నారుల నుంచి పండు ముసలి వరకు ఎవరిని వదిలిపెట్టడం లేదు. దాడులు, వేధింపులు, అఘాయిత్యాలు, అత్యాచారాలతో మృగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన మహిళలపై నేరాలూ తగ్గడం లేదు, దుర్మార్గుల ప్రవర్తనలో ఎలాంటి మార్పు రావడం లేదు. తాజాగా మధ్య ప్రదేశ్‌లో సభ్య సమాజం తలదించుకునే ఘటన ఒకటి వెలుగుచూసింది. మైనర్(12) కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత పాశవికంగా అఘాయిత్యానికి ఒడిగట్టారు. అత్యాచార బాధితురాలు ఒంటిపై గాయాలతో, ప్రతి ఇంటికి వెళ్తూ సాయం కోసం అర్తించే దృశ్యాలు సోషల్ మీడియాలో కలవరం రేపుతున్నాయి. అర్థ నగ్నంగా, రక్తస్రావంతో బాలిక బాధపడుతూ కనిపిస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ దారుణ ఘటన ఉజ్జయిని సమీపంలోని బాద్నగర్ రహదారిపై చోటుచేసుకుంది. ఈ దిగ్బ్రాంతికర దృశ్యాలు రోడ్డుపై ఉన్న సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి. షాక్‌కు గురిచేస్తోన్న ఈ వీడియోలో 12 ఏళ్ల వయసున్న ఓ బాలిక ఒంటిపై ఓ క్లాత్‌తో వీధుల్లో తిరుగుతూ కనిపిస్తుంది. రోడ్డు మీద ప్రజలు ఆమెను చూస్తూ ఉన్నారే తప్ప సాయం చేసేందుకు మాత్రం ముందుకు రాకపోవడం మరింత సిగ్గుచేటు. సహాయం కోసం ఓ వ్యక్తిని సంప్రదించగా అతను బాలికను వెళ్లిపోమ్మంటూ నెట్టేయడం వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. చివరకి బాధితురాలు ఓ ఆశ్రమానికి చేరుకుంది. అక్కడ ఓ పూజారి ఆమెను చూశారు. ఆమెపై టవల్ కప్పి జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు జరిపిన పరీక్షల్లో బాలికపై త్యాచారం జరిగినట్లు నిర్ధారించారు. బాలిక ఒంటిపై తీవ్ర గాయాలుండంతో మెరుగైన చికిత్స కోసం ఇండోర్ తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు దీనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను వీలైనంత త్వరగా గుర్తించి చర్యలు తీసుకుంటామని ఉజ్జయిని పోలీస్ చీఫ్ సచిన్ శర్మ తెలిపారు. బాలిక ఎక్కడ అఘాయిత్యం జరిగిందో ఇంకా తెలియరాలేదని, దీనిపై విచారణ జరిపి త్వరలోనే వివరాలు వెల్లడిస్తామన్నారు. ప్రస్తుతానికి బాధితురాలి వివరాలు కూడా తెలియలేదని అయితే ఆమె మాటలు చూస్తుంటే ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కి చెందినట్లు తెలుస్తుందన్నారు. ఈ భయానక సంఘటన మధ్యప్రదేశ్‌లో మహిళలపై జరుగుతున్న ఘోరాలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. 2019 నుంచి 2021 మధ్య మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో అత్యధికంగా మహిళలు, బాలికల అదృశ్యం కేసులు నమోదయ్యాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం 2021లో మధ్యప్రదేశ్‌లోనే ఎక్కువ అత్యాచార ఘటనలు (6,462) నమోదయ్యాయి. వాటిలో 50 శాతానికి పైగా నేరాలు మైనర్లపైనే జరిగాయి. అంటే సగటున రోజుకు 18 అత్యాచారాలునమోదవుతున్నాయి. -
మైనర్ బాలికను కిడ్నాప్ చేసి పెళ్లి.. హయత్‌నగర్‌లో వదిలి
మిర్యాలగూడ టౌన్: మైనర్ బాలికను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న యువకుడితో పాటు అతడికి సహకరించిన మరో ముగ్గురిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మిర్యాలగూడ రూరల్ సీఐ ముత్తినేని సత్యనారాయణ విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం రుద్రారం గ్రామానికి చెందిన బాలిక ఈ నెల 22వ తేదీన ఇంటి నుంచి పాఠశాలకు వెళ్తున్నానని చెప్పి కనిపించకుండా పోయిందని కుటుంబ సభ్యులు మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి గ్రామానికి చెందిన చరణ్‌దీప్ తన తమ్ముడు శరత్‌తో పాటు అతడి మిత్రులు అంజి, మహేష్ కలిసి బాలికను బైక్‌పై ఎక్కించుకొని అడవిదేవులపల్లి మండల సమీపంలో ఆంధ్రప్రదేశ్‌లోని సత్రశాలకు తీసుకెళ్లారు. అక్కడ బాలికను చరణ్‌దీప్ వివాహం చేసుకున్నాడు. బాలికపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. దీంతో భయపడిన బాలిక నాన్న దగ్గరికి వెళ్తానని అనడంతో రంగారెడ్డి జిల్లా పరిధిలోని హయత్‌నగర్‌లో వదిలివేశారు. హయత్‌నగర్ బస్టాండ్ వద్ద బాలికను తల్లిదండ్రులు, పోలీసులు గుర్తించి ఇంటికి తీసుకొచ్చారు. బాలికను తీసుకెళ్లిన నలుగురు యువకులపై పోక్సో, నిర్భయ, అత్యాచారం, కిడ్నాప్ కేసులు నమెదు చేశారు. పరారీలో ఉన్న నలుగురు యువకులు మిర్యాలగూడ పట్టణ సమీపంలోని అవంతీపురంలో ఉన్నట్లు తెలుసుకున్న మిర్యాలగూడ రూరల్ పోలీసులు మంగళవారం వారిని అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ చేశారు. నిందితులను పట్టుకున్న కానిస్టేబుల్ నాగయ్య, హోంగార్డు గోపిని సీఐ అభినందించారు. విలేకరుల సమావేశంలో మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ దోరేపల్లి నర్సింహులు తదితరులున్నారు. -
తల్లి చూస్తుండగానే.. వికృత చేష్టలు
ఢిల్లీ: మరోసారి ఢిల్లీ మెట్రో రైలు వార్తల్లో నిలిచింది. ఈసారి అతి జుగుప్సాకరమైన ఘటన వెలుగు చూసింది. తల్లితో రైలులో ప్రయాణిస్తున్న ఓ మైనర్ బాలికపై ఓ వ్యక్తి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. అది గమనించిన ఆ తల్లి కూతురితో సహా కిందకు దిగిపోగా.. సదరు నీచుడ్ని మెట్రో సిబ్బందికి అప్పగించారు తోటి ప్రయాణికులు. బుధవారం ఢిల్లీ మెట్రో రైలు రెడ్ లైన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. రక్షాబంధన్ కావడంతో నిన్న సాయంత్రం అంతా మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఈ క్రమంలో.. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో రెడ్ లైన్లో ప్రయాణిస్తున్న రైలులో ఓ ప్రయాణికుడు.. ఆ తోపులాటలో పక్కనే ఉన్న బాలికను చూస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. అతన్ని గమనించిన ఆమె తల్లి అప్రమత్తమైంది. ఈ లోపు పక్కనే ఉన్న ప్రయాణికులు అతన్ని గమనించి.. నిలదీయసాగారు. దీంతో ఆందోళనకు లోనైన ఆ తల్లి ఆ కూతురిని తీసుకుని సీలంపూర్ స్టేషన్లో దిగిపోయింది. అయితే.. పక్కనే ఉన్న ప్రయాణికులు మాత్రం అతన్ని పట్టుకుని షాహ్దరా స్టేషన్లో మెట్రో అధికారులకు అప్పగించారు. ఆపై స్టేషన్ సిబ్బంది ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. ఆ కామాంధుడి స్వస్థలం పశ్చిమ బెంగాల్ అని, పని కోసం ఢిల్లీకి వచ్చినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఇదీ చదవండి: వీడు అన్న కాదు.. కామపిశాచి! -
నాడు మైనర్ బాలిక..నేడు మేజర్
అనకాపల్లిటౌన్ : రెండేళ్ల క్రితం ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన కేసులో నిందితుడిని పట్టుకుని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచినట్టు డీఎస్పీ బి.సుబ్బరాజు చెప్పారు. తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసుకు సంబంధించి ఆయన తెలిపిన వివరాలివి. మండలంలో తగరంపూడి గ్రామానికి చెందిన మైనర్ బాలిక 2021 జూలై 13న రాత్రి నుంచి కనిపించడం లేదంటూ ఆమె తండ్రి నడిగట్ల శ్రీను ఫిర్యాదు మేరకు అదే నెల 15న గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు అందింది. అస్సాం రాష్ట్రం గౌహతి నుంచి ఎలుసూరి ప్రసాద్‌బాబు అనే వ్యక్తి తగరంపూడిలో తన స్నేహితుని ఇంటికి వచ్చాడు. స్నేహితుడి ద్వారా పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్న ఓ మైనర్ బాలిక పరిచయం కావడంతో ఆమెను లోబర్చుకున్న ప్రసాద్‌బాబు అస్సాంకు తీసుకెళ్లిపోయాడు. దీనిపై ఫిర్యాదు అందడంతో నిందితుడి కోసం రెండేళ్లుగా కోల్కత్తా, ఒడిశా, తెలంగాణతో పాటు విశాఖపట్నం పలు ప్రాంతాల్లో గాలించారు. ఎట్టకేలకు ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ సమీపంలో ఒక మారుమూల గ్రామంలో మైనర్ బాలికతో కలిసి ప్రసాద్‌బాబు ఉన్నట్టు తెలుసుకున్న ఐటీ కోర్ బృందం ఈ నెల 25న అతడిని భువనేశ్వర్ చందక పోలీస్‌స్టేషన్‌లో హాజరుపరిచి అక్కడ నుంచి అనకాపల్లికి తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. మైనర్ బాలిక ప్రస్తుతం మేజర్ కావడంతో చైల్డ్ వెల్ఫేర్ అధికారుల సహకారంతో వైద్యపరీక్షలకు తరలించి కోర్టులో హాజరుపర్చడం జరుగుతుందని చెప్పారు. నిందితుడిని ఈనెల 25న భువనేశ్వర్‌లో అరెస్టు చేసినట్టు డీఎస్పీ చెప్పారు. ప్రసాద్‌బాబుకు గతంలో వివాహమై ఒక పాప ఉంది. అతని తల్లిదండ్రులు గౌహతిలో ప్రభుత్వాస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. అక్కడికి కొద్ది దూరంలో కోడలు కూడా నివసిస్తోంది. నిందితుడ్ని శనివారం కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించినట్టు డీఎస్పీ చెప్పారు. ఈ సమావేశంలో గ్రామీణ సీఐ ఎ.రవికుమార్, ఎస్ఐ సీహెచ్. నర్సింగరావు, అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ హెచ్‌సీ ఎస్.వి.రామకృష్ణ, రూరల్ కానిస్టేబుళ్లు పి.నరేంద్రకుమార్, ఎం.నరేష్, ఐటీకోర్ సిబ్బంది మూర్తి, దిలీప్, గ్రామీణ హెచ్‌సీ జె.రమేష్ పాల్గొన్నారు. -
ఢిల్లీలో ప్రభుత్వాధికారి నిర్వాకం.. స్నేహితుడి కుమార్తెను..
న్యూఢిల్లీ: మహిళలు, పిల్లలను సంరక్షించాల్సిన బాధ్యత గల పదవిలో ఉండి పశువులా వ్యవహరించాడొక కామాంధుడు.ఢిల్లీ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఒక అధికారి తన స్నేహితుడి టీనేజీ కూతురిపై ఎన్నో నెలలుగా అత్యాచారం చేస్తూ చివరికి పట్టుబడ్డాడు. అతనికి సహకరించినందుకు ఆతడి భార్య పైన కూడా కేసు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. ఢిల్లీ ప్రభుత్వంలో మహిళా శిశు సంక్షేమాభివృద్ధి శాఖలో పనిచేస్తున్న ఒక సీనియర్ అధికారి తన స్నేహితుడు 2020లో మరణించడంతో అతడి మైనర్ కుమార్తె(14)ను తన ఇంటికి తీసుకొచ్చాడు. అప్పటి నుండి ఆ బాలిక వారితోనే కలిసి ఉంటోంది. ఈ వ్యవధిలో ప్రభుత్వాధికారి ఆ అమ్మాయిపై అనేక మార్లు అత్యాచారం చేసినట్లు మధ్యలో తాను గర్భం దాల్చగా అతడి భార్య, కుమారుడు కొన్ని మందులిచ్చి గర్భాన్ని తొలగించారని బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టీనేజీ అమ్మాయి ప్రస్తుతం చికిత్స తీసుకుంటోందని ఆమె నుండి ఇంకా స్టేట్మెంట్ తీసుకోవాల్సి ఉందని అన్నారు. ప్రభుత్వాధికారిపై పోక్సో చట్టం తోపాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, నిందితుడికి సహకరించినందుకు అధికారి భార్యపైన కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: ఐదేళ్ల బాలుడిపై అమానుషం.. ఎత్తి నేలకేసి కొట్టి.. -
మధ్యప్రదేశ్ బాలిక మృతి.. కేసులో మరో మలుపు! ఇంతకీ ఏం జరిగింది ?
కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన పెద్దపల్లి జిల్లాలో మధ్యప్రదేశ్ బాలిక కేసు మరో మలుపు తిరిగింది. ఆగస్టు 14వ తేదీ రాత్రి బాలికపై సామూహిక లైంగికదాడి జరిగిందని, దాంతో అమ్మాయి అనారోగ్యం పాలై, మరణించిందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా బాలిక ఒంటిపై గాయాలున్న మాట వాస్తవమే గానీ, లైంగికదాడి జరిగినట్లుగా పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదన్న విషయం సంచలనం రేపుతోంది. ఈ దుర్ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే రామగుండం పోలీసులు స్పందించారు. గోదావరిఖని, పెద్దపల్లి ఏసీపీలు, పెద్దపల్లి డీసీపీలతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన సీపీ రెమా రాజేశ్వరి కేసును స్వయంగా పర్యవేక్షించారు. అసలు అనారోగ్యంతో ఉన్న బాలికను గుట్టుచప్పుడు కాకుండా ఎందుకు తరలించాల్సి వచ్చింది? వీరికి వాహనం ఎవరు సమకూర్చారు? తనపై కొందరు లైంగికదాడి జరిపారు.. అంటూ బాలిక చెబుతున్న ఆడియోలో వాస్తవమెంత? తదితర విషయాలపై దాదాపు 48 గంటల సుదీర్ఘ సాంకేతిక, శాసీ్త్రయ దర్యాప్తు తర్వాత రామగుండం పోలీసులు నిర్ధారణకు వచ్చారని తెలిసింది. ఇంట్లో వారే కొట్టారా? విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా అప్పన్నపేట శివారులోని అక్కాబావల వద్దకు మధ్యప్రదేశ్ నుంచి బాలిక వచ్చింది. ఆమె మరణానికి ముందు ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. ఇవి ఎవ రు చేశారు? అన్నదానిపై స్పష్టత లేదు. బాలికను కుటుంబసభ్యులు లేదా తెలిసినవారే తీవ్రంగా కొట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆరోజు తనను తీవ్రంగా కొట్టడంపై బాలిక మనస్తాపానికి గురైంది. అది తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసుకోవాలనుకుందేమోనని అనుమానిస్తున్నారు. బాలిక చివరిసారిగా కనిపించిన పరిస్థితులు ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఆమె ఆగస్టు 14 మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఇంట్లో లేదు. ఆ సమయంలో ఏం చేసింది? అన్నదాని పై పోలీసులు సీసీ ఫుటేజీ ద్వారా అణువణువూ క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో బాలిక పురుగుల మందు షాపుల ముందు, రాత్రి 8 గంటల ప్రాంతంలో సమీపంలోని ఓ చెరువు వద్ద కూడా కనిపించిందని సమాచారం. అర్ధరాత్రి చెరువు వద్ద ఏం చేస్తున్నావని కొందరు మందలించడంతో అక్కడి నుంచి బస్టాండ్ వైపు వెళ్లినట్లు తెలిసింది. ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది కాబట్టే.. ఈ రెండు ప్రాంతాల్లో కనిపించిందని పోలీసులు భావిస్తున్నారు. ఇంటి నుంచి బస్టాండ్ వద్దకు బాలిక సంచరించిన ప్రాంతాల్లో మొత్తం 15 మంది ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. రాత్రి 11 తర్వాత ఇంటికి చేరిన బాలిక.. అస్వస్థతకు గురైంది. వెంటనే బాలిక బంధువులు కారు మాట్లాడుకొని, ఆమెను హుటాహుటిన మధ్యప్రదేశ్‌లోని బాల్ఘాట్ జిల్లా కజ్రీ గ్రామానికి తరలించారు. మార్గమధ్యలో వాంతులు చేసుకుంది. విషయం తెలుసుకున్న రామగుండం పోలీసులు అక్కడి ఎస్పీని సంప్రదించారు. తొలుత బాలిక మరణించిన విషయాన్ని ధ్రువీకరించుకున్నాక అంత్యక్రియలు జరపకుండా ఆపగలిగారు. అంత్యక్రియలు ఆపేది లేదంటూ ఆమె బంధువులు వాదనకు దిగారు. ఎంతో శ్రమిస్తే గానీ.. వారు దారికి రాలేదు. ఎట్టకేలకు బాలిక మృతదేహానికి అక్కడ స్థానిక ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, తిరిగి సెకండ్ ఒపీనియన్ కోసం గాంధీ ఆస్పత్రికి మరోసారి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. గాయపరిచింది ఎవరు? బాలిక ఒంటిపై గాయాలున్నాయి తప్పితే, లైంగికదాడి జరిగినట్లుగా ఎలాంటి ఆనవాళ్లు లేవని తెలిసింది. మరి ఆమెను మరణించేంత స్థాయిలో గాయపరిచింది ఎవరు? అసలు ఆగస్టు 14 మధ్యాహ్నం ఏం జరిగింది? బాలిక ఎవరితో ఘర్షణ పడింది? ఆమైపై ఎవరు దాడి చేసి ఉంటారు? అన్న విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సామూహిక లైంగికదాడి జరిగిందని ప్రచారం కావడం, అందులోనూ బాధితురాలు మైనర్ కావడంతో విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. అన్ని బృందాల పోలీసులు అత్యంత గోప్యత పాటిస్తున్నారు. ఇంతవరకూ దర్యాప్తు పురోగతిలో ఏ విషయాన్ని మీడియాతో పంచుకోలేదు. ఈ క్రమంలోనే అమ్మాయి మాట్లాడిందని చెబుతున్న ఆడియో విడుదల చేసిన వారిని అదుపులోకి తీసుకొని, ప్రశ్నించినట్లు తెలిసింది. వారు చెప్పే సమాధానాలు పొంతన లేకుండా ఉన్నాయని సమాచారం. గాంధీ ఆస్పత్రి నుంచి నివేదిక వస్తేగానీ.. పోలీసులు ఈ విషయంలో ఎలాంటి ప్రకటన చేసేలా లేరు. ఆ నివేదికలో ఏం ఉంటుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. -
మానవమృగం.. శిక్ష అనుభవించినా బుద్ధి మారలేదు..
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని సాట్నాకు చెందిన ఓ దుర్మార్గుడు రాకేష్ వర్మ(35) చేసిన నేరమే మళ్ళీ చేసి తానొక మానవ మృగాన్నని నిరూపించుకుని కటకటాల పాలయ్యాడు. గతంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నేరానికి జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చి మళ్ళీ మరో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను స్థానికంగా ఒక ఆసుపత్రిలో చేర్పించగా ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని చెబుతున్నాయి ఆసుపత్రి వర్గాలు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహేంద్ర సింగ్ చోహాన్ తెలిపిన వివరాల ప్రకారం సాట్నా జిల్లాలోని కృష్ణా నగర్లో నివాసముండే రాకేష్ వర్మ పన్నెండేళ్ల క్రితం నాలుగున్నరేళ్ల వయసున్న మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. ఆ నేరానికి అతడికి పదేళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఏడు సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించిన రాకేష్ వర్మ ఏడాదిన్నర క్రితమే జైల్లో సత్ప్రవర్తన కింద విడుదలయ్యాడు. బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో జగత్ దేవ్ తాలిబ్ ప్రాంతం నుండి ఓ మైనర్ బాలికను లాలిస్తున్నట్లు నటించి అపహరించుకుపోయాడు. మాకు విషయం తెలిసిన తర్వాత గాలింపు చేపట్టగా బాలిక రేప్ కు గురైందని గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ప్రాధమిక చికిత్స అనంతరం మైనర్ బాలికను రేవాకు తరలించగా బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు అక్కడి వైద్యులు. ఇది కూడా చదవండి: స్పా ముసుగులో వ్యభిచారం.. -
ఛీ..ఛీ.. విమానంలో వికృత చేష్టలు.. ఇండో అమెరికన్ వైద్యుని అరెస్టు..
విమానంలో బాలిక ఎదుట అసభ్యంగా ప్రవర్తించిన భారత సంతతి వైద్యుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితునికి పక్కసీటులో కూర్చున్న బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిపై అభియోగాలు మోపారు. గత ఏడాది మేలో ఈ ఘటన జరగగా.. అనేక విచారణల తర్వాత అరెస్టు చేశారు. సుదీప్త మొహంతీ(33) అమెరికాలోని బోస్టన్‌లో ఇంటర్నల్ మెడిసిన్, ప్రైమరీ కేర్ విభాగంలో వైద్యునిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో గత ఏడాది మే నెలలో స్నేహితురాలితో కలిసి బోస్టన్‌కు విమానంలో వెళుతున్నారు. కాగా పక్క సీటులో 14 ఏళ్ల మైనర్ బాలిక కూర్చుంది. ఆ బాలిక తన నానమ్మ తాతయ్యలతో ప్రయాణిస్తోంది. మొహంతీ పక్కనే బాలిక ఉండగా.. అసభ్య చేష్టలకు పాల్పడ్డాడు. ఇది గమనించిన బాలిక పక్క సీటులోకి వెళ్లిపోయింది. విమానం దిగగానే తన నానమ్మ, తాతయ్యలతో పాటు విమాన సిబ్బందికి తెలిపింది. బాలిక ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న పోలీసులు.. మొహంతీపై కేసు నమోదు చేశారు. అనంతరం న్యాయస్థానం ముందు ప్రాథమికంగా హాజరుపరిచారు. అప్పుడు ఆంక్షలను విధిస్తూ విడుదల చేశారు. విమానంలో అసభ్య చేష్టలకు పాల్పడితే అమెరికా శాసనం ప్రకారం అతనికి 90 రోజుల వరకు జైలు శిక్షతో పాటు 5000 అమెరికా డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉంది. ఇదీ చదవండి: అమానవీయం: చికెన్ ఇవ్వలేదని.. చెప్పులతో దళితునిపై దాడి.. -
80 అడుగుల టవర్ ఎక్కి హైడ్రామా.. ప్చ్.. చివరికి..
రాయపూర్: ప్రేమికుడిపై అలిగి కోపంతో ప్రియురాలు 80 అడుగుల ఎత్తైన హై టెన్షన్ పవర్ లైన్ ఎక్కిన సంఘటన గౌరెలా పెండ్ర మార్వాహి జిల్లాలో చోటు చేసుకుంది. కోపంతో టవర్ ఎక్కుతున్న ప్రేయసిని బుజ్జగించేందుకు ఆమెను అనుసరిస్తూ ప్రియుడు కూడా అదే టవర్ పైకి ఎక్కాడు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇద్దరినీ ఎలాంటి హాని కలగకుండా కిందికి దించారు. ఛత్తీస్‌గఢ్‌లోని గౌరెలా పెండ్ర మార్వాహి జిల్లాలో ఒక ప్రేమజంట పెద్ద సాసహం చేసి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఫోన్లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో కోపగించిన ప్రియురాలు దగ్గర్లోని 80 అడుగుల హైటెన్షన్ పవర్ లైన్ ఎక్కి దూకాలని నిర్ణయించుకుంది. అనుకుందే తడవు చకచకా 80 అడుగుల హైటెన్షన్ టవర్ ఎక్కేసింది. ప్రేమించిన అమ్మాయి టవర్ ఎక్కి ఎక్కడ అఘాయిత్యం చేసుకుంటుందోనని కంగారుపడిన ప్రియుడు అంతే వేగంగా పరుగు లంఘించుకుని తాను కూడా టవర్ ఎక్కుతూ కనిపించాడు. స్థానికులు ఈ దృశ్యాలను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తులు విషయాన్ని చేరవేడంతో ఆ ప్రేమ జంట తల్లిదండ్రులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు వచ్చి గంటల పాటు శ్రమించి ఎలాగోలా వారిద్దరినీ క్షేమంగా కిందకి దించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ అమ్మాయి మైనర్ అని వారిద్దరి మధ్య తగువు తలెత్తడంతో ఈ సాహసానికి ఒడిగట్టారన్నారు. వారిపైన కేసు నమోదు చేయలేదు కానీ మందలించి పంపినట్టు తెలిపారు. ఈ చోద్యాన్ని చూడటానికి వచ్చిన వారెవరో మొత్తం సన్నివేశాన్ని చక్కగా మొబైల్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. We have been building transmission towers from ages. This is the first time I have seen someone climb them to commit suicide upset with her lover. Good news, the boyfriend followed her up and convinced her to climb down. All iz well #Chhattisgarh #today pic.twitter.com/3MRpbZ8RJI — Harsh Goenka (@hvgoenka) August 6, 2023 ఇది కూడా చదవండి: రాహుల్ గాంధీపై అనర్హత వేటు: లోక్‌సభ స్పీకర్ కీలక నిర్ణయం -
ఆ మైనర్ అమాయకురాలేం కాదు
ముంబై: గత సంవత్సరం డిసెంబర్ నుంచి ఒక అబ్బాయితో శారీరక బంధం కొనసాగిస్తున్న ఈ మైనర్ బాలిక అమాయకురాలేం కాదని బాంబే హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ‘ సమ్మతి శృంగారంతోనే ఈ టీనేజీ అమ్మాయి గర్భం దాల్చింది. నిజంగా∙ఈ 17 ఏళ్ల బాలికకు గర్భం ఇష్టంలేదని భావిస్తే గర్భంవచ్చిందని నిర్ధారించుకున్న వెంటనే గర్భవిచ్ఛిత్తి కోసం దరఖాస్తు చేసుకొని ఉండాల్సింది’ అని బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ 26వ తేదీన వెలువర్చిన ఉత్తర్వులో వ్యాఖ్యానించింది. ‘ఈమెకు ఈ నెలాఖరుకల్లా 18 ఏళ్లు నిండుతాయి. కొన్ని నెలలుగా ‘ఫ్రెండ్’తో అమ్మాయి శారీరక బంధం కొనసాగిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో స్వయంగా తనే ప్రెగ్నెన్సీ కిట్ తెచ్చుకుని పరీక్షించుకుంది. సంబంధిత కేసు వివరాలు పరిశీలిస్తే బాధిత మైనర్ అమాయకురాలేం కాదని అర్థమవుతోంది’ అని జస్టిస్ రవీంద్ర, జస్టిస్ వైజీ ఖోబ్రగడేల బెంచ్ అభిప్రాయపడింది. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్సెన్(పోక్సో) చట్ట నిబంధనల ప్రకారం చూస్తే తాను చైల్డ్నని, గర్భవిచ్ఛిత్తికి అనుమతి ఇవ్వాలంటూ తల్లి ద్వారా ఈ అమ్మాయి హైకోర్టులో పిటిషన్ వేసింది. ‘వైద్యపరంగా గర్భవిచ్ఛిత్తి చట్టం’ ప్రకారం 20 వారాలుదాటిన సందర్భాల్లో గర్భవిచ్ఛిత్తికి అనుమతి తప్పనిసరి. ప్రాణానికి హాని, తల్లి లేదా బిడ్డ ఆరోగ్యం విషమంగా మారొచ్చనే సందర్భాల్లోనే గర్భవిచ్ఛిత్తికి అనుమతిని ఇస్తారు. ‘ మరో 15 వారాల్లో డెలివరీ అనగా ఇప్పుడు గర్భవిచ్ఛిత్తి చేసినా బిడ్డ ప్రాణాలతోనే జన్మిస్తుంది. కానీ బ్రతికే అవకాశాలు తగ్గుతాయి. ఈ పరిస్థితుల్లో అబార్షన్‌కు అనుమతి ఇవ్వబోం. పుట్టాక ఎవరికైనా దత్తత ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. ఆమెకు ఆ స్వేచ్ఛ ఉంది’ అని ధర్మాసనం స్పష్టంచేసింది. -
మైనర్ బాలికలనూ విడిచిపెట్టడం లేదు
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ వేధింపుల పర్వంపై వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మండిపడ్డారు. వావివరసలు లేకుండా సొంత కుటుంబ సభ్యులనే కాకుండా ప్రజలను, తన సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు, చదువుకుంటున్న మైనర్ బాలికలను కూడా వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గద్దలు, డేగలు కోడి పిల్లల్ని తన్నుకుపోవడానికి పైనుంచి గురి చూసినట్లే నారాయణ అమాయక అబలలపై కన్నేసి వారిని ఖతం చేస్తున్నారని ఆరోపించారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ప్రకాశం జిల్లాలో కట్టిన ఫ్లెక్సీల్లో ‘అసలోడు వచ్చే వరకే కొసరోడికి పండుగ’ అని రాసి ఉందన్నారు. ‘అసలోడు .. కొసరోడు’.. ఇందులో అంతరార్థం ఏమిటో చంద్రబాబు అధికారికంగా స్పష్టత ఇవ్వాలని కోరారు. కొసరోడు అంటే ఆ జిల్లాలో యువగళం చేస్తున్న చినబాబు కాదు కదా? అని ప్రశ్నించారు. ప్రజలకు వచ్చిన సందేహాన్నే తాను కూడా ప్రస్తావిస్తున్నానని విజయసాయిరెడ్డి తెలిపారు. ఈవెంట్ మేనేజ్మెంట్లో చంద్రబాబును మించిన వారెవరూ ఉండరని ఎద్దేవా చేశారు. ప్రతి కార్యక్రమానికి ఏదో ఒక ఆకర్షణను జత చేసి జనాన్ని మొబిలైజ్ చేయడం ఆయనకు మొదటి నుంచీ అలవాటేనన్నారు. చినబాబు యువగళం యాత్రకు గ్లామర్ అద్దేందుకు టీవీ యాంకర్‌ను హైదరాబాద్ నుంచి రప్పించడం ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి ఇక నుంచి సినీనటుల సందడి మొదలవుతుందనేది అర్థమవుతోందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. -
కిడ్నాపైన బాలిక సమయస్ఫూర్తి.. తెలివిగా సమాచారం అందించి..
వాషింగ్టన్: అపాయంలో ఉండగా ఉపాయం తట్టాలే కానీ ఎంతటి అగాధాన్నైనా జయించవచ్చని నిరూపించింది అమెరికాలోని ఓ మైనర్ బాలిక. కాలిఫోర్నియాలో కిడ్నాప్‌కు గురైన ఒక మైనర్ బాలిక అగంతకుడు లేని సమయం చూసి బాలిక చాకచక్యంగా వ్యవహరించి చుట్టుపక్కల వారికి తాను ప్రమాదంలో ఉన్న విషయం తెలిసేలా సందేశాన్నిచ్చి కిడ్నాపర్ చెర నుంచి బయటపడింది. కిడ్నాప్ జరిగిందిలా.. టెక్సాస్‌కు చెందిన స్టీవెన్ రాబర్ట్ సబలాన్(61) జులై 6న సాన్ ఆంటోనియోలో తన ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తోన్న 13 ఏళ్ల బాలికను గన్ చూపించి బెదిరించి కార్ ఎక్కించుకున్నాడు. అక్కడి నుండి 1400 మైళ్ళు ప్రయాణించి కాలిఫోర్నియా వరకు తీసుకుని వెళ్ళాడు. మార్గమధ్యలో బాలికపై లైంగిక వేధింపులకు కూడా పాల్పడ్డాడు. కిడ్నాపర్ దొరికిందిలా.. లాంగ్ బీచ్ చేరిన తర్వాత అక్కడ బాలికలను బట్టలు విప్పి ఇవ్వమని అడిగి వాటిని తీసుకుని ఒక లాండ్రీ షాపులోకి వెళ్ళాడు సబలాన్. అదే సమయంలో పార్కింగ్ స్థలంలో ఉన్నవారికి తాను ప్రమాదంలో ఉన్నానని చెబుతూ ఒక కాగితం మీద "హెల్ప్ మీ" అని రాసి చూపించింది. అది గమనించిన అక్కడి వారు వెంటనే పోలీసులకు సమాచారమందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని బాలికను రక్షించారు. కటకటాల పాలు.. లాంగ్ బీచ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాన్ ఆంటోనియోకి చెందిన మైనర్ బాలిక తన ఇంట్లో వారికి చెప్పకుండా తన స్నేహితురాలిని కలుసుకునేందుకు బయటకు వచ్చిందని అదే సమయంలో సబలాన్ తుపాకీ చూపించి ఆమెను కిడ్నాప్ చేశాడని తెలిపారు. కారు నెంబరు ప్లేటు ఆధారంగా చూస్తే సబలాన్ మీద అప్పటికే టెక్సాస్‌లో దొంగతనం అభియోయోగం మోపబడిందని అన్నారు. తాజాగా అతడిపై కిడ్నాప్, మైనర్ బాలికపై వేధింపులు రెండు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు లాంగ్ బీచ్ పోలీసులు. ఇది కూడా చదవండి: భార్యను హత్య చేశాడు.. కానీ కోర్టు నిర్దోషని తెలిపింది -
షాకింగ్ వీడియో.. మహిళా పైలట్‌ను జుట్టు పట్టుకొని లాక్కొచ్చి..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మహిళా పైలట్‌తోపాటు ఆమె భర్తపై కొంతమంది వ్యక్తులు నడిరోడ్డుపై చితకబాదారు. 10 ఏళ్ల మైనర్ బాలికను ఇంట్లో పనిలో పెట్టుకోవడమే కాకుండా ఆమెను చిత్రహింసలకు గురిచేస్తున్నారనే ఆరోపణలతో దాడికి పాల్పడ్డారు. పైలట్ యూనిఫాంలో ఉన్న మహిళ, ఆమె భర్తను ఇంట్లో నుంచి బయటకు ఈడ్చుకెళ్లి మరీ కొట్టారు. ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో బుధవారం ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. దాడికి సంబంధించిన షాకింగ్ దృశ్యాలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కాగా పైలట్ దంపతులు గత రెండు నెలల క్రితం ఓ మైనర్ బాలికను ఇంట్లో పనిలో పెట్టుకున్నారు. అంతేగాక ఆమెను వేధిస్తూ దారుణంగా కొట్టేవారు. ఈ విషయం తాజాగా బాలిక బంధువుకు తెలియడంతో ఆమె మిగతా బంధువులను, ఇరుగుపొరుగు వారిని పైలట్ నివాసం వద్దకు తీసుకొచ్చి వాగ్వాదానికి దిగారు. గొడవ పెరిగడంతో మహిళ జుట్టు పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు లాకొచ్చి కొట్టారు. ఆమె భర్తపై కూడా దాడి చేశారు. తనను క్షమించాలని మహిళా పైలట్ వేడుకున్నా వినిపించుకోకుండా చితకబాదారు.చివరికి విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పైలట్ జంటను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మైనర్ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించామని, ఆమె ముఖం, కళ్ల మీద దాడి చేసిన గాయాలు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. బాలిక తన బంధువు ద్వారా ఉద్యోగంలో చేరిందని, ఆమె కూడా సమీపంలోని ఇంట్లో పని చేస్తుందని పేర్కొన్నారు. కాగా నిందితురాలైన మహిళా ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌లో పైలట్‌గా పనిచేస్తున్నట్లు, తన భర్త మరో ప్రైవేటు విమానయాన సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. చదవండి: తండ్రితో గొడవ.. పిల్లలను చంపడానికి కారుతో గుద్దించేశాడు.. #WATCH | A woman pilot and her husband, also an airline staff, were thrashed by a mob in Delhi's Dwarka for allegedly employing a 10-year-old girl as a domestic help and torturing her. The girl has been medically examined. Case registered u/s 323,324,342 IPC and Child Labour… pic.twitter.com/qlpH0HuO0z — ANI (@ANI) July 19, 2023 -
పోక్సో చట్టం దుర్వినియోగం.. బాంబే హైకోర్టు కీలక తీర్పు
ముంబై: పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొని తర్వాత మనస్పర్థలు చోటుచేసుకున్నాయని పోక్సో చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేయడం పెద్ద తలనొప్పిగా మారిందని తెలిపింది బాంబే హైకోర్టు. ఇదే క్రమంలో 17 ఏళ్ల బాలికతో శృంగారంలో పాల్గొన్న కేసులో నుండి ఓ యువకుడికి విముక్తి కలిగించింది. హైకోర్టు ఏం చెప్పింది? ప్రస్తుత ఐపీసీ చట్టం ప్రకారం 20 ఏళ్ల వ్యక్తి ఒకరు, 17 ఏళ్ల 364 రోజుల వయసున్న బాలికతో ఆమె ఇష్టంతో శృంగారంలో పాల్గొంటే నేరంగా పరిగణించి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. దీనివలన చట్టాలను దుర్వినియోగం చేసేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోందని వ్యాఖ్యానించింది బాంబే హైకోర్టు. కోర్టు తెలిపిన వివరాల ప్రకారం శృంగార సంబంధాన్ని ఇష్టపూర్వకంగా కొనసాగించిన తర్వాత కేసులు నమోదు చేయడం క్రిమినల్ న్యాయ వ్యవస్థకు భారంగా మారింది. చట్టం, న్యాయవ్యవస్థ ఇటువంటి కేసుల్లో బాధితుడికి మద్దతుగా నిలవలేకపోతున్నాయి. యువతి సమ్మతంతోనే శృంగారం జరిగితే మాత్రం నిందితుడిని నిర్దోషిగా విడుదల చెయ్యాలని 31 పేజీల తీర్పులో తెలిపింది. పోక్సో చట్టం ఉద్దేశ్యమేంటీ? మైనర్లను లైంగిక వేధింపుల నుండి రక్షించేందుకే POCSO చట్టం రూపొందించబడింది. నిజంగా బాలిక ఇష్టానికి వ్యతిరేకంగా శృంగారానికి పాల్పడితే ఆ వ్యక్తి ని ఈ చట్టం కింద విచారించడం తప్పులేదు. అలాంటివి కాని కేసుల్లో నియంత్రణ అవసరమని తెలిపింది న్యాయస్థానం. ఈ అంశాన్ని పార్లమెంటు కూడా సీరియస్‌గా పరిగణించాలని సూచించింది. చట్టం దుర్వినియోగం అవుతోందా? కౌమార దశలో ఉన్నవారిపై ఈ తరహా చట్టాలు అమలు చేయడం ద్వారా వారి లైంగిక స్వేచ్ఛను దెబ్బతీసినట్టవుతుంది. అత్యధిక కేసుల్లో బాలికలు పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొని తర్వాత ప్లేటు ఫిరాయించడంతో మగవారే ఎక్కువగా శిక్షించబడుతున్నారని పేర్కొంది. పరస్పర అంగీకారంతో శృంగారం చేస్తే అది రేప్ కింద కూడా పరిగణించకూడదని తెలిపింది. మగవాళ్లకే చిక్కులా? చట్టం దృష్టిలో మైనర్ బాలికలు శృంగారానికి అంగీకరించినా అది లెక్కలోకి రాదు. అదే సమయంలో యువకులకు మాత్రమే ఇది చిక్కుల్ని కొనితెచ్చిపెడుతోంది. ఇటీవల 17.5 ఏళ్ల వయసున్న ఓ బాలిక విషయంలో ఇలాగే పోక్సో చట్టాన్ని దుర్వినియోగం చేయాలని చూసిన ఘటనలో జస్టిస్ భారతి డాంగ్రే నేతృత్వంలో బాంబే హైకోర్టు ఈ సంచలన తీర్పునిచ్చింది. ఇది కూడా చదవండి: పిల్లలకు పని చెప్పి హాయిగా కునుకు తీసిన హెడ్ మాస్టర్.. -
సీరియల్స్, సినిమాల్లో నటించాలనే కోరిక.. ఫ్రెండ్ ఇంట్లో పూజ ఉందని చెప్పి..
సాక్షి, హైదరాబాద్: బాలిక మిస్సింగ్ కేసును గంటల వ్యవధిలోనే మధురానగర్ పోలీసులు పరిష్కరించారు. వివరాలివీ... రహమత్‌నగర్‌లో నివాసం ఉండే డి.సంతోషి కుమార్తె బుధవారం ఉదయం స్నేహితురాలు ఇంట్లో పూజ ఉందని చెప్పి వెళ్లింది. గురువారం వరకు కూడా తిరిగి రాలేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు గురువారం రాత్రి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైనర్ అయినందున పోలీసులు బాలికను కనిపెట్టే విషయంలో అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. ఫోన్ ఆధారంగా యాదాద్రిలో ఉన్నట్టు గుర్తించారు. శుక్రవారం ఉదయం ఆ బాలిక యాదాద్రిలో తనకు తెలిసిన లక్ష్మీ అనే మహిళతో కలిసి తిరుగుతుండగా ఎస్ఐ నరేందర్, సిబ్బంది వెళ్లి పట్టుకున్నారు. బాలికను విచారించగా సీరియల్స్, సినిమాలలో నటించాలని కోరిక ఉందని, అప్పుడప్పుడు కొన్ని సీరియల్స్‌లో చిన్న క్యారెక్టర్స్‌లో కూడా నటించినట్టు పేర్కొంది. ఈ క్రమంలో లక్ష్మీ అనే మహిళ సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పడంతో యాదాద్రికి వచ్చినట్టు పోలీసులకు తెలిపింది. పోలీసులు బాలికను మధురానగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. -
బలవంతగా ఫోటోలు తీసి, బట్టలు తొలగించమని.. స్టేషన్లో ఎస్ఐ వికృత చేష్టలు
గువాహటి: పోలీసులను రక్షక భటులని అంటారు. అయితే కొందరు మాత్రం రక్షించాల్సింది పక్కన పట్టి భక్షిస్తున్నారు. ఓ కేసు విషయమై స్టేషన్లోకి తీసుకువచ్చిన బాలికపై కన్నేశాడు ఓ అధికారి. ఏకంగా పోలీస్‌స్టేషన్‌లోనే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. చివరికి బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ దారుణ ఘటన అస్సాంలోని ఘోగ్రాపర్ పోలీస్ స్టేషన్ చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 21న బాల్య వివాహాల కేసులో మైనర్ బాలికను, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలిక తన ప్రియుడితో కలిసి పారిపోయిందని ఫిర్యాదు రావడంతో, పోలీసులు పట్టుకుని ఘోగ్రాపర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఘోగ్రాపర్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జి అధికారి.. స్టేషన్లో బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు ఆమె అభ్యంతరకరమైన ఫోటోలు తీశాడు. దీంతో ఆ బాలిక.. ‘స్టేషన్లో ఆ అధికారి నన్ను బెదిరించాడు, బట్టలు తొలగించమని బెదిరించాడు. ఎస్ఐ నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. బలవంతంగా నా ఫోటోలు తీశాడు. ’ అని ఫిర్యాదు చేసింది. ఈ దారుణమైన ఘటన వెలుగులోకి రావడంతో అస్సాం డీజీపీ ఈ కేసుపై స్పందించారు. అస్సాం డీజీపీ జీపీ సింగ్ కేసు వివరాలను శుక్రవారం మీడియాకు వెల్లడించారు. అస్సాంలోని నల్బరీ జిల్లాలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో జూన్ 21న 17 ఏళ్ల బాలిక ఫిర్యాదు ఇవ్వడానికి రాగా, సబ్ ఇన్స్పెక్టర్ బిమన్ రాయ్ లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఈ ఘటనపై విచారణ జరిపి ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేసినట్టు డీజీపీ తెలిపారు. ప్రస్తుతం నిందితుడు రాయ్ పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. అతని ఆచూకీ గురించి నల్బారి జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌కు ఎవరైనా సమాచారం అందిస్తే తగిన రివార్డ్ ఉంటుంది" అని రాయ్ ఫోటోతో ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా.. మైనర్లను స్టేట్ హోమ్‌లో కాకుండా పోలీస్ స్టేషన్లో ఉంచడం పోలీసుల తప్పిదమేనని నల్బరీ జిల్లా ఎస్పీ అంగీకరించారు. "మైనర్ల విషయంలో, కొన్ని సూచనలు ఇప్పటికే అమలులో ఉన్నాయి, వాటిని అందరు పోలీసు సిబ్బంది పాటించాలి. మైనర్లను పోలీస్ స్టేషన్లో ఉంచకూడదు" అని, వారిపై కఠినమైన చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం స్టేట్‌హోమ్‌లో ఉంచిన బాలిక వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారని ఆయన చెప్పారు. చదవండి: వివాహేతర సంబంధం... ప్రసన్న తలపై రాడ్డుతో విచక్షణారహితంగా 8 సార్లు బాది... -
బాలికపై బీఆర్ఎస్ నాయకుడి అత్యాచారం.. ఎమ్మెల్యే రియాక్షన్ ఇదే..
బోధన్‌టౌన్(బోధన్): నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శక్కర్‌నగర్ కాలనీకి చెందిన 13 ఏళ్ల బాలికపై అదే కాలనీకి చెందిన బీఆర్ఎస్ నాయకుడు కొత్తపల్లి రవీందర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శక్కర్‌నగర్ కాలనీలో నివాసం ఉంటున్న మైనర్ బాలికకు తండ్రి లేకపోవడంతోపాటు తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం రవీందర్ ఆ బాలికను వారి ఇంటి సమీపంలోని తన మేకల షెడ్డులోకి లాక్కెళ్లి కాళ్లు, చేతులు బంధించి నోట్లో గుడ్డలు కుక్కి, అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు. కాగా, బాలిక ఈ విషయాన్ని మంగళవారం బంధువులతో తెలిపింది. వారు రవీందర్ సోదరుడైన బీఆర్ఎస్ బోధన్ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ రాధాకృష్ణ ఇంటికి వెళ్లి ప్రశ్నించారు. దీంతో రవీందర్‌తో పాటు రాధాకృష్ణ.. విషయం బయటకు చెబితే చంపేస్తామని బాధితులను బెదిరించారు. అత్యాచారం విషయం బుధవారం బయటకు పొక్కడంతో పోలీసులు వెంటనే రవీందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రవీందర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రేమ్‌కుమార్ తెలిపారు. నిందితుడి సోదరుడు రాధాకృష్ణపై కూడా కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కఠినంగా శిక్షించాలి: ఎమ్మెల్యే షకీల్ బాలికపై అత్యాచారం జరిగిన విషయం తెలియటంతో ఎమ్మెల్యే షకీల్ దంపతులు బాధితురాలి ఇంటికి వెళ్లి పరామర్శించారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు. నిందితుడు రవీందర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని, అతని సోదరుడు రాధాకృష్ణను కూడా ఫ్లోర్‌లీడర్ పదవి నుంచి సస్పెండ్ చేస్తున్నామని ఎమ్మెల్యే ప్రకటించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఇది కూడా చదవండి: నర్సింగ్ విద్యార్థి కావ్య ఆత్మహత్య.. కారణం ఏంటి? -
పూర్ణానంద స్వామి చేష్టలు బయట పెట్టిన మైనర్ బాలిక
-
బాలికపై రెండేళ్లుగా స్వామీజీ అత్యాచారం!
(విశాఖ తూర్పు): అనాథ మైనర్ బాలికకు(15) అశ్రయం కల్పించిన నిర్వాహకుడే రెండేళ్లుగా లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘటన అసల్యంగా వెలుగులోకి వచ్చింది. చైల్డ్ వేల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గొలనుగొండకు చెందిన బాలిక తల్లిదండ్రులు చనిపోవడంతో సమీపంలో ఉండే ఒక మహిళ బాలికను ప్రభుత్వ హాస్టల్లో ఉంచి చదివించేది. ఆ మహిళా అధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా ఉండటంతో బాలికను గత రెండేళ్ల క్రితం విశాఖలోని వెంకోజీపాలెం జాతీయ రహదారిని ఆనుకొని జ్ఞానానంద, రామానంద ఆశ్రమం (సాధు మఠం) చేర్పించింది. ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానంద సరస్వతి స్వామీజీ బాలికతో పాటు మరో 13 మంది మైనర్ బాలికలతో పశువుల నిర్వహణ పనులు చేయిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఈ క్రమంలో భయంతో అశ్రమం నుంచి వెళ్లిపోతానని ఏడవటంతో బాలిక కాళ్లకు గొలుసులు కట్టి పనులు చేయిస్తుండేవాడు. ఈనెల 12న స్నానానికి వెళ్లేందుకు గొలుసులు తీయడంతో అక్కడ పనిచేసే ఒక మహిళ సహకారంతో బాలిక బయటకు పారిపోయి ఆటోలో రైల్వేస్టేషన్ వెళ్లి తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కింది. రైలులో విశాఖ నుంచి విజయవాడ వస్తున్న ఒక కుటుంబం బాలికను చూసి వివరాలు అడిగి తెలుసుకుంది. తమతో పాటు కంకిపాడు తీసుకువెళ్లి కొన్ని రోజులు వాళ్ల ఇంట్లోనే ఉంచి సోమవారం కంకిపాడు పోలీసుల సహకారంతో విజయవాడలోని సీడబ్ల్యూసీ సభ్యులకు అప్పగించింది. వారు బాలికకు కౌన్సెలింగ్ నిర్వహించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలికపై జరుగుతున్న వరుస లైంగిక దాడులు తెలుసుకుని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అశ్రమం పేరుతో మైనర్ బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులపై బాలిక చేత దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించారు. విజయవాడ పోలీసుల సమాచారం మేరకు ఎంవీపీ పోలీసులు రంగంలోకి దిగారు. ఆశ్రమానికి చేరుకొని కీచక స్వామీజీని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటనపై ఎంవీపీ సీఐ మాట్లాడుతూ విజయవాడలో జీరో ఎఫ్ఐఆర్ నమోదైందని, దీంతో పూర్తిస్థాయిలో దర్యాప్తు ప్రారంభించామని వెల్లడించారు. అయితే స్వామీజీని అదుపులోకి తీసుకోవడంపై ఆయన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. బాలిక మిస్సింగ్‌పై ఫిర్యాదు అసలు విషయాన్ని పక్కనపెట్టి సాధు ఆశ్రమం స్వామీజీ ఎంవీపీ పోలీసులను బోల్తాకొట్టించారు. ఏమీ తెలియనట్లు సాధు ఆశ్రమం నుంచి బాలిక అదృశ్యమైనట్లు ఈనెల 15న ఎంవీపీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆశ్రమం వద్ద గల సీసీ కెమెరాలు పరిశీలించినా బాలిక వివరాలు తెలియరాలేదు. -
Hyderabad: శిశువును బండకేసి బాదిన ‘మైనర్’ తండ్రి
రహమత్‌నగర్(బోరబండ): పరిపక్వత లేని వయస్సు, చదువుకునేటప్పుడు ఏర్పడ్డ ఆకర్షణ ఆ మైనర్లను ఒకటి చేసింది. అది కాస్తా పెళ్లికి దారి తీసింది. తెలిసీతెలియని వయస్సులో వారు ఓ బిడ్డకు సైతం జన్మనిచ్చారు. తమ సుఖాలకు అడ్డువస్తున్నదనే అక్కసుతో కన్న తండ్రి తమ పేగుబంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే పలుమార్లు శిశువును చంపాలని యత్నించాడు. జరిగిన ఘోరాన్ని సదరు బాలిక తమ కుటుంబ సభ్యులకు తెలిపింది. వారంతా పోలీసులను ఆశ్రయించడంతో విషయంవెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన మైనర్ బాలుడు, మైనర్ బాలిక ఇంటర్ మీడియట్ చదువుతున్నారు. వీరు ఎనిమిదో తరగతి నుండే ఒకనొకరు ఇష్ట పడ్డారు. పదవ తరగతి చివరి పరీక్ష పూర్తి కాగానే యాదగిరిగుట్టలో ఇరువురు వివాహం చేసుకున్నారు. ఆ తరువాత బోరబండ డివిజన్ ఓ ప్రాంతంలో కాపురం పెట్టారు. 2022లో వీరికి ఓ పాప పుట్టింది. తన దాంపత్య జీవితానికి అడ్డంకిగా మారుతున్నదని సదరు తండ్రి పసి గుడ్డుపై పలు మార్లు హత్యయత్నం చేశాడు. ఈ క్రమంలో మే 4న తిరిగి బిడ్డను బండకేసి బాదాడు. ఈ ఘటనలో శిశువుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘోరాన్ని చూసి తట్టుకోలేక బాలిక విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. వారంతా కలిసి శుక్రవారం బోరబండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. -
బాలికకు గ్రోత్ హార్మోన్ కేసులో కీలక మలుపు
విజయనగరం: జిల్లాలో ఇటీవల వెలుగు చూసిన బాలిక గ్రోత్ హార్మోన్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. తన తల్లి తనను శారీరకంగా, మానసికంగా వేధించేదని.. ఇంటికి వచ్చిన వారితో సన్నిహితంగా ఉండమని, తనకు హార్మోన్ టాబ్లెట్లు ఇచ్చి శరీరం పెరిగేలా చేసిందని.. తనను చదువుకోనివ్వకుండా టార్చర్ చేసేదని.. ఒక మైనర్ బాలిక చైల్డ్ లైన్‌కు ఫిర్యాదు చేసింది. అయితే.. ఈ ఫిర్యాదులో వాస్తవం లేదని ఆమె తల్లి చెబుతోంది. దీనికి సంబంధించి బాధిత బాలిక తల్లి ఒక వీడియోను బయపెట్టింది. తన కుమార్తెకు ఎటువంటి గ్రోత్ హార్మోన్స్, స్టెరాయిడ్స్ వంటివి ఇవ్వలేదని బాలిక తల్లి వాదిసఓతంది. తన కుమార్తెను మెడికల్ టెస్టులకు అనుమతించి వాస్తవాలు విచారించాలని తల్లి డిమాండ్ చేస్తోంది. తన కుటుంబానికి సన్నిహితుడైన అయి వ్యక్తి బాలికను ట్రాప్ చేశాడని ఆమె ఆరోపిస్తోంది. టెన్త్‌లో మెరిట్ స్టూడెంట్ అయిన తన బిడ్డకు దెయ్యం పట్టిందని భూత వైద్యం పేరిట పాస్టర్ అభిషేక్ పాల్, దేవరాజ్‌లు పలుమార్లు లైంగిక దాడి చేశారని చెబుతోంది. వారి అఘాయిత్యం చేసిన వీడియో బయటకు వస్తుందనే కారణంతో బాలికతో చైల్డ్ లైన్‌కు తప్పుడు ఫిర్యాడు చేయించారని పేర్కొంది. మైనర్ బాలికపై అభిషేక్ పాల్ అనే వ్యక్తి మరో వ్యక్తి చేసిన భౌతిక దాడి దృశ్యాలు సుమోటోగా తీసుకున్న బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసల అప్పారావు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిలో భాగంఆ వారి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని వీడియోలను పరిశీలించే పనిలో పడ్డారు పోలీసులు. అదే సమయంలో అభిషేక్ పాల్, దేవరాజ్‌లను పోలీసులు విచారిస్తున్నారు. కాగా, 15 ఏళ్ల కుమార్తెను వ్యభిచార కూపంలోకి దింపాలని, అనంతరం సినీ, టీవీ రంగంలోకి పంపించాలంటూ హార్మోన్ ఇంజెక్షన్లు, స్టెరాయిడ్స్‌ను తల్లే వాడించినట్లు ఇటీవల ఒక వార్త సంచలన సృష్టించింది. ఆ బాలిక శరీర భాగాలు విపరీతంగా పెరిగేలా.. యుక్తవయసు అమ్మాయిలా కనిపించేలా చేసేందుకు హార్మోన్ ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లను వాడించినట్లు బాధిత బాలిక ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది. తాజాగా ఈ కేసులో కొత్త కోణం వెలుగు చూడటంతో ఆ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. తల్లి ఘాతుకం.. బాలిక శరీర భాగాలు పెరిగేందుకు ఇంజెక్షన్లు, టాబ్లెట్లు -
ఫిలింనగర్లో దారుణం...
ఫిలింనగర్: ఫిలింనగర్లో దారుణం చోటుచేసుకొంది. మైనర్ బాలికను ఓ యువకుడు ప్రేమపేరుతో లోబర్చుకోగా...ఆ బాలిక గర్భం దాల్చింది. శనివారం తెల్లవారుజామున ఆ బాలిక మగశిశువుకు జన్మనిచ్చింది. ఏం చేయాలో తోచని ఆ శిశువును ఇంటిముందు రోడ్డుపై వదిలేసింది. హృదయ విదారకమైన ఈ ఘటన ఫిలింనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళితే.. ఫిలింనగర్‌లోని పద్మాలయ అంబేడ్కర్ నగర్ బస్తీలో నివసించే మైనర్ బాలిక (17) శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తన ఇంట్లో మగ శిశువుకు జన్మనిచ్చింది. ఇందుకు తల్లి సహకరించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత 3.14 గంటల ప్రాంతంలో బస్తీ నిద్రిస్తున్న సమయంలో నవజాత శిశువును పొత్తిళ్లలో పెట్టుకొని రోడ్డుపై వదిలేసి ఇంట్లోకి వెళ్లిపోయింది. కొద్ది సేపటి తరువాత గుక్కపెట్టి ఏడుస్తున్న చిన్నారి రోదనలు విన్న ఎదురింటి మహిళ బయటకు వచ్చి చూడగా చిన్నారి ఏడుస్తూ కనిపించింది. చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసింది. చిన్నారి ఎవరై ఉంటారని ఆరా తీస్తుండగా స్థానిక బస్తీ నేత సుధాకర్‌రెడ్డి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు 108 అంబులెన్స్‌లో చిన్నారిని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. చిన్నారి ఆరోగ్యంగానే ఉందని, వైద్యం అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ చిన్నారిని ఎవరు వదిలేసి వెళ్లారు అన్న కోణంలో పోలీసులు ఇక్కడి సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఓ బాలిక చిన్నారిని ఎత్తుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇంటి ముందు వదిలేసి తిరిగి వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఆరా తీస్తే అక్కడే నివసిస్తున్న బాలికగా స్థానికులు గుర్తించారు. ఎందుకిలా చేశావని అడిగితే ప్రేమించిన యువకుడితో గర్భం దాల్చిన విషయాన్ని, పెళ్లికి పెద్దలు అంగీకరించకుండా గొడవలు జరుగుతున్న పరిణామాలను పోలీసుల దృష్టికి తీసుకొచ్చింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బాలస్వామి (24) అనే జేసీబీ డ్రైవర్‌తో ప్రేమ ఏర్పడిందని, కొద్ది రోజులు కలిసి తిరిగామని, ఈ నేపథ్యంలోనే గర్భం దాల్చినట్లు పోలీసులకు బాలిక ఫిర్యాదు చేసింది. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడమే కాకుండా, రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతుండటంతో తాను గర్భం దాల్చిన విషయాన్ని దాచిపెట్టాల్సి వచ్చిందని బాధితురాలు పేర్కొంది. ఈ మేరకు ఫిలింనగర్ పోలీసులు బాలస్వామిపై పోక్సో చట్టం, ఐపీసీ 376 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ బాలిక ఖరీదు.. రూ.13 లక్షలు?
సాక్షి, వరంగల్: ప్రేమపేరుతో నమ్మించి.. ఆపై వంచించిన నిందితుడిపై బాలిక ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదైంది. ఆ కేసును నీరుగార్చేందుకు మధ్యవర్తులుగా వ్యవహరించిన పెద్దలు గద్దలుగా మారారు. రూ.13 లక్షలు బాధితురాలి కుటుంబానికి ఇచ్చేలా తీర్మానం చేసి.. భారీగానే నొక్కేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీస్ అధికారి సమక్షంలోనే ఈ సెటిల్మెంట్ జరిగిందన్న విషయం నర్సంపేటలో చర్చనీయాంశమైంది. బాధితురాలిపై ఒత్తిడి పెరగడంతో.. ఆమె వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్‌ను కలిసి న్యాయం చేయాలని కోరినట్టు సమాచారం. నర్సంపేట పట్టణానికి చెందిన ఓ యువకుడు.. పట్టణానికి సమీపంలో ఉండే ఓ తండాకు చెందిన 16 ఏళ్ల బాలికను ప్రేమిస్తున్నానని నమ్మించాడు. బాలిక తల్లిదండ్రులు ఉపాధి కోసం హైదరాబాద్‌లో ఉంటుండడంతో ఈమె తరచూ వస్తూ, వెళ్తుండేది. ఈ క్రమంలోనే ప్రేమపేరుతో ఆమెకు దగ్గరైన యువకుడు హైదరాబాద్‌కు వెళ్లి మరీ కొంతకాలం కలిసి ఉన్నాడు. ఆ తర్వాత మొహం చాటేయడంతో.. బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2022 ఆగస్టు 14న యువకునిపై పోక్సో కేసు నమోదైంది. అరెస్టయిన యువకుడు జైలుకెళ్లి బెయిల్‌పై బయటకొచ్చాడు. తర్వాత అబ్బాయి బంధువులు, అమ్మాయి బంధువులతో కేసు సెటిల్మెంట్కు ప్రయత్నాలు చేశారు. రూ.13 లక్షలు ఇచ్చేలా నిర్ణయించి.. ముందు రూ.5 లక్షలు, కేసు కాంప్రమైజ్ అయ్యాక మిగిలిన రూ.8 లక్షలు ఇచ్చేలా తీర్మానం రాశారు. బాలిక కుటుంబానికి రూ.2 లక్షలు ఇచ్చి, మిగిలిన మొత్తాన్ని పెద్దలే నొక్కేసినట్టు తెలు స్తోంది. ఈ వ్యవహారమంతా ఓ పోలీసు అధికారి సమక్షంలోనే జరిగిందని సమాచారం. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న బా లిక.. న్యాయం కోసం కమిషనర్‌ను ఆశ్రయించినట్టు సమాచారం. చదవండి: ఒక్క రోజులో సినిమా, ఇంధన కొరతకు చెక్.. ఏఐతో ఏదైనా సాధ్యమే! -
తల్లి ఘాతుకం.. బాలిక శరీర భాగాలు పెరిగేందుకు ఇంజెక్షన్లు, టాబ్లెట్లు
విజయనగరం (క్రైమ్): ఆ బాలిక తల్లి దారి తప్పింది. పెళ్లయిన కొన్నేళ్లకే మొదటి భర్తకు విడాకులిచ్చింది. ఆ తరువాత సబ్ ఇంజనీర్‌ను వివాహం చేసుకుంది. కొంతకాలానికి అతనితోనూ తెగతెంపులు చేసుకుని వ్యభిచారం ప్రారంభించింది. చివరకు తన 15 ఏళ్ల కుమార్తెను కూడా వ్యభిచార కూపంలోకి దింపాలని, అనంతరం సినీ, టీవీ రంగంలోకి పంపించాలని భావించింది. ఆ బాలిక శరీర భాగాలు విపరీతంగా పెరిగేలా.. యుక్తవయసు అమ్మాయిలా కనిపించేలా చేసేందుకు హార్మోన్ ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లను వాడించడం మొదలుపెట్టింది. తల్లి చేష్టలను భరించలేక బాధిత బాలిక 1098 నంబర్‌కు ఫోన్‌చేసి చైల్డ్ లైన్‌ను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. నవోదయ పాఠశాలలో చదువుతున్న ఓ బాలిక ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసి అత్యుత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది. ఆ బాలిక విజయనగరంలో ఉంటున్న తల్లి దగ్గరకు ఇటీవల వచ్చింది. తెలియని వ్యక్తులు తరచూ ఇంటికి రావడం.. తల్లి తనముందే వారితో వ్యభిచరించడాన్ని భరించలేక.. తల్లితో విభేదించింది. బాలికను కూడా తన మాదిరిగానే ఇంటికి వచ్చే వ్యక్తులతో చనువుగా ఉండాలని తల్లి ఒత్తిడి చేయడాన్ని తట్టుకోలేకపోయింది. శరీర భాగాలు పెరిగేందుకు ఇచ్చే ఇంజెక్షన్లు, టాబ్లెట్ల వల్ల అనారోగ్యానికి గురయింది. ఈ పరిస్థితుల్లో తల్లి ఒత్తిడిని తట్టుకోలేక గురువారం రాత్రి చైల్డ్‌లైన్ 1098కి కాల్ చేసి రక్షణ కోరింది. రంగంలోకి దిగిన చైల్డ్‌లైన్ సభ్యులు, దిశ పోలీసులు ఆ బాలికను దిశ స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ జరిపారు. బాలిక నుంచి ఫిర్యాదు తీసుకున్నాక అదేరోజు రాత్రి స్వధార్ హోమ్‌కు తరలించారు. అనంతరం విశాఖలోని ప్రభుత్వ బాలికల పునరావాస కేంద్రంలో చేర్పించారు. బాలిక సంక్షేమం చూడాలంటూ పునరావాస కేంద్రం సూపరింటెండెంట్‌కు రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు సూచించారు. ఈ విషయాన్ని విజయనగరం ఎస్పీ ఎం.దీపిక దృష్టికి తీసుకువెళ్లారు. బాలిక తల్లిని అదుపులోకి తీసుకుని చిల్డ్రన్స్ కోర్టులో విచారణ జరిపారు. -
చేసిందే చెడ్డ పని పైగా ఆత్మహత్యాయత్నం
భారత మహిళా క్రికెటర్ స్నేహ్ రానా కోచ్ నరేంద్ర షాపై లైగింక వేధింపుల కేసు నమోదు అయింది. ఒక అమ్మాయిని వేధిస్తున్నట్టు ఆడియో ఆధారం లభించడంతో అతడిపై ఉత్తరాఖండ్ పోలీసులు పోక్సో(POCSO Act) చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆడియో లీక్ విషయం తెలియగానే నరేంద్ర ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నరేంద్ర షా డెహ్రాడూన్‌లో క్రికెట్ అకాడమీ నిర్వహిస్తున్నాడు. మోలి జిల్లాకు చెందిన మైనర్ యువతి చదువుకుంటూనే నరేంద్ర షా క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటోంది. కొన్నాళ్లుగా నరేంద్ర సదరు యువతితో అసభ్యంగా ప్రవర్తించేవాడు. మైనర్‌తో నరేంద్ర షా ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడిన ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. ఆ ఆడియో వైరల్ కావడంతో అతడిపై పోక్సో చట్టం, ఐపీసీ సెక్షన్ 506తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు బుక్ చేశామని నెహ్రూ కాలనీ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ లోకేంద్ర బహుగుణ తెలిపాడు. అంతేకాదు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును ముమ్మరం చేశామని ఆయన వెల్లడించాడు. ఆడియో లీకేజీతో తన పరువు పోయిందని నరేంద్ర ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం స్నేహ్ రానాకు కోచ్‌గా ఉన్న నరేంద్ర షా ఉత్తరాఖండ్ క్రికెట్ సంఘం మాజీ సభ్యుడు. నరేంద్రపై పోక్సో కేసు నమోదైనట్లు తెలుసుకున్న ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ అతడిని పదవి నుంచి తొలగించింది. టీమిండియా మహిళా క్రికెట్లో ఆల్‌రౌండర్‌గా సేవలందిస్తున్న స్నేహ్ రానా ఇటీవలే వుమెన్స్ ఐపీఎల్ తొలి సీజన్ ఆడింది. గుజరాత్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆమె రెగ్యులర్ కెప్టెన్ బెత్ మూనీ గాయంతో టోర్నీకి దూరమవడంతో జట్టును నడిపించింది. కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించిన గుజరాత్ ప్లే ఆఫ్స్‌కు చేరలేదు. టేబుల్ టాపర్స్ ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్లో అడుగుపెట్టాయి. ఉత్కంఠ రేపిన టైటిల్ పోరులో ముంబై 7 వికెట్ల తేడాతో ఢిల్లీపై గెలుపొందింది. నాట్ స్కీవర్ బ్రంట్ అర్ధ శతకంతో చెలరేగడంతో ఆ జట్టు తొలి సీజన్ చాంపియన్‌గా అవతరించింది. చదవండి: Kedar Jadhav: తండ్రి మిస్సింగ్ కేసులో క్రికెటర్‌కు ఊరట 'నెట్ బౌలర్‌గా ఆఫర్.. బోర్డు పరీక్షలను స్కిప్ చేశా' -
లవ్ ఫెయిల్.. ప్రేమించిన యువతి కావాలని రెండేళ్లుగా..
సాక్షి, హైదరాబాద్: అప్పట్లో అతడి వయస్సు 17 సంవత్సరాలు. మైనర్ వయస్సులోనే ఓ మైనర్ (బాలిక)ను ప్రేమించాడు. బాలిక దక్కలేదని రెండేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో ఇంటిపై మూడు రోజుల క్రితం బిల్డింగ్‌పై నుంచి కిందకు దూకాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ పవన్ తెలిపిన వివరాల ప్రకారం.. షాపూర్‌నగర్ న్యూఎన్ఎల్బీ నగర్‌కు చెందిన జగన్కుమార్కు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలు కాగా ఒక అబ్బాయి మణికళ్యాణ్(19). మణికళ్యాణ్ ఇంటర్ మొదటి సంవత్సరం చదివే క్రమంలో అదే కాలనీకి చెందిన ఓ బాలికను ప్రేమించాడు. ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో బాలిక తల్లిదండ్రులు ఆమెను తీసుకుని వారి సొంతప్రాంతం కర్ణాటకకు వెళ్లారు. దీంతో అప్పటి నుంచి మణికళ్యాణ్ మద్యానికి బానిసయ్యాడు. రాత్రిపూట మద్యం సేవించి ఇంటికొచ్చి ప్రేమించిన అమ్మాయి కావాలంటూ గొడవపడేవాడు. ఈనెల 13వ తేదీన మద్యం సేవించి ఇంటికి వచ్చిన మణికళ్యాణ్ రాత్రి 12గంటల సమయంలో బిల్డింగ్‌పై నుంచి కిందకు దుకాడు. తీవ్ర గాయాల అవ్వడంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మణికళ్యాణ్ను ఓప్రైవేట్ అస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మణికళ్యాణ్ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియుడితో ఉండగా వాట్సాప్‌కి మెసేజ్.. కోపంగా ఇంటికి వెళ్లి
సాక్షి, హైదరాబాద్(జగద్గిరిగుట్ట): 15 ఏళ్ల వయసులోనే ప్రేమలో మునిగిన ఓ బాలిక.. ప్రేమికుడికి వాట్సాప్‌లో వేరే యువతి పంపిన మెసేజ్ చూసి మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ సైదులు కథనం ప్రకారం... శ్రీనివాస నగర్లో నివాసం ఉండే సూర్య ప్రభకు భర్త లేడు. కూతురితో కలిసి ఉంటుంది. సోమయ్య నగర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలిక స్థానికంగా ఉండే సాయితేజతో ప్రేమలో పడింది. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం జగద్గిరిగుట్టలో వీరిద్దరు కలుసుకున్నారు. అదే సమయంలో సాయితేజకు వాట్సాప్‌లో వచ్చిన మెసేజ్ ఇద్దరి మధ్య గొడవకు దారి తీసింది. నాతో ఉంటూ వేరే అమ్మాయితో ప్రేమలో ఉన్నావు అంటూ అలిగి ఇంటికి వెళ్లి బాలిక సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో సాయంత్రం వచ్చి చూసేసరికి అప్పటికే మృతి చెంది ఉంది. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన స్థలానికి వెళ్లిన సీఐ సైదులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. చదవండి: ప్రీతి కేసు ఎటువైపు? ఇంకెన్ని రోజులు? టాక్సికాలజీ రిపోర్టులో నెగెటివ్ వల్లే.. -
యూట్యూబ్ చూస్తూ ఇంట్లోనే డెలివరీ చేసుకున్న బాలిక.. తల్లి రావడంతో
ముంబై: సోషల్‌మీడియా పరిచయాలు ఊహించని ప్రమాదంలో పడేయడంతో పాటు పలు ఇబ్బందులకు గురి చేసిన ఘటనలు చూస్తునే ఉన్నాం. తెలిసిన వాళ్లే మోసం చేస్తున్న రోజులివి, అలాంటిది కొందరు ఆన్లైన్ స్నేహాలను నమ్మి ఘోరంగా మోసపోతున్నారు. ప్రత్యేకంగా యువత కాలక్షేపం కోసం నెట్టింట్లోకి వెళ్లి బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు. ఈ తరహాలోనే 15 ఏళ్ల బాలిక ఇంటర్నెట్లో పరిచయమైన వ్యక్తని నమ్మి గర్భం దాల్చింది. కుటుంబ సభ్యులకు తెలియకుండా యూట్యూబ్‌లో చూస్తూ ఇంట్లోనే సొంతంగా డెలివరీ చేసుకొంది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటు చేసుకుంది. యూట్యూబ్ చూసి... పోలీసుల వివరాల ప్రకారం..నాగ్‌పూర్‌లోని అంబజారీ ప్రాంతానికి చెందిన బాలికకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తితో పరిచయమైంది. కొన్ని రోజుల తర్వాత వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ క్రమంలో సదరు వ్యక్తి బాలికకు లైంగికంగా దగ్గరవ్వడంతో ఆమె గర్భం దాల్చింది. ఆ విషయాన్ని బాలిక ఇంట్లో కూడా చెప్పలేదు. ఓ దశలో పొట్ట పెద్దగా ఉందని బాలిక తల్లి ప్రశ్నించగా.. తనకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అందుకే కడుపు ఉబ్బందని అబద్దం చెప్పింది. అలా బాలిక గర్భవతినన్న విషయాన్ని తన తల్లి నుండి దాచి పెట్టగలిగింది. అనంతరం డెలివరీ ఎలా చేసుకోవాలో యూట్యూబ్ వీడియోలను చూసి తెలుసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆ పసికందును గొంతునులిమి చంపేసి ఇంట్లోనే ఓ బాక్స్‌లో దాచిపెట్టింది. తల్లి ఇంటికి తిరిగి రాగానే బాలిక తీవ్ర అనారోగ్యంతో నీరసంగా కనిపించింది. దీంతో బాలికను గట్టిగా నిలదీయగా విషయాన్ని మొత్తం తల్లికి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, శిశువు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. -
మైనర్ బాలికకు పబ్లిక్ గా తాళి కట్టిన యువకుడు
-
నల్లగొండ జిల్లాలో దారుణం.. కామాంధుల అకృత్యానికి బాలిక బలి
సాక్షి, నల్లగొండ: కామాంధుల అకృత్యానికి ఓ బాలిక బలైన దారుణ ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పదో తరగతి చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన బాలిక సంక్రాంతి పండుగకు ఈ నెల 13న పీఏపల్లి మండలంలో ఉంటున్న అమ్మమ్మ ఇంటికి వచ్చింది. తిరిగి మంగళవారం హైదరాబాద్‌కు వెళ్లేందుకు బయల్దేరింది. పెద్ద అడిశర్లపల్లి మండలం వడ్డెరిగూడేనికి చెందిన యువకులు నరేశ్, శివ, దిలీప్లో కారులో అంగడిపేట క్రాస్‌రోడ్డు వద్దకు వెళ్తుండగా పరిచయస్తులే కావడంతో అక్కడి వరకు వస్తానని బాలిక వారి కారు ఎక్కింది. క్రాస్‌రోడ్డు వద్ద కారు దిగిన బాలిక హైదరాబాద్ వెళ్లేందుకు బస్సు కోసం ఎదురుచూస్తుండగా బస్టాప్ ఎదురుగానే నరేశ్‌కు వస్త్ర దుకాణం ఉంది. ఎండలో బస్సు కోసం చూస్తున్న బాలికను అతను తన వస్త్ర దుకాణంలోకి పిలిచాడు. అప్పటికే మిగిలిన ఇద్దరు యువకులూ అదే దుకాణంలోనే ఉన్నారు. కొంత సమయం తర్వాత బాలిక స్పృహ తప్పిపోయిందని ముగ్గురు యువకులూ స్థానిక డాక్టరుకు చూపించగా దేవరకొండకు తీసుకెళ్లాలని సూచించారు. వెంటనే వారు అక్కడికి తరలించగా బాలిక అప్పటికే మృతిచెందిందని డాక్టర్లు నిర్ధారించారు. దీంతో నరేశ్, శివ, దిలీప్‌లు పరారయ్యేందుకు యత్నించగా స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించగా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దేవరకొండ డీఎస్పీ నాగేశ్వర్రావు మృతదేహాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. ముగ్గురు యువకులూ బాలికపై అత్యాచారం చేయడంతోనే తీవ్ర రక్తస్రావంతో మృతిచెందిందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. కాగా, తన కూతురును అఘాయిత్యం చేసి హత్య చేశారంటూ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: పనికోసం నమ్మి వెళ్తే.. ‘బీమా’ ప్లాన్‌లో శవమయ్యాడు.. పాపం ఆ డ్రైవర్! -
జిలేబీ బాబాకు 14 ఏళ్ల జైలు
చండీగఢ్: తనను తాను దేవుడిగా ప్రచారం చేసుకుంటూ అరాచకాలు సాగించిన జిలేబీ బాబా అలియాస్ అమర్‌వీర్ అలియాస్ బిల్లూ అలియాస్ అమర్‌పురి (63) పాపం పండింది. 100 మందికిపైగా మహిళలపై అత్యాచారం చేసి, వీడియోలు తీసినట్లు అతడిపై ఆరోపణలున్నాయి. ఓ బాలికపై రెండు సార్లు అత్యాచారం చేసిన కేసులో పోక్సో చట్టం సెక్షన్ 6 కింద అతనికి 14 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు హరియాణాలోని ఫతేహాబాద్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు అదనపు జిల్లా జడ్జి బల్వంత్‌సింగ్ బుధవారం ప్రకటించారు. జిలేబీ బాబాను హరియాణా పోలీసులు 2018లో అరెస్టు చేశారు. అతడి ఫోన్లో 120కి పైగా అశ్లీల వీడియో క్లిప్పింగ్‌లను గుర్తించారు. జిలేబీ బాబా హరియాణాలోని తోహన్ పట్టణంలో బాబా బాలక్‌నాథ్ మందిరం అధినేతగా ప్రాచుర్యం పొందాడు. మహిళలకు మాదకద్రవ్యాలిచ్చి అత్యాచారం చేయడం, ఆ దురాగతాన్ని వీడియోలో చిత్రీకరించడం, వాటిని చూపి బ్లాక్మెయిల్ చేసి బాధితుల నుంచి డబ్బులు గుంజడం అతని స్టైల్. -
మైనర్ బాలిక కేసులో అక్రమ అరెస్టులు
-
ఇన్‌స్టాలో మైనర్‌తో పరిచయం.. యువకుడిపై దాడి.. ట్విస్ట్ ఏంటంటే!
సాక్షి, బెంగళూరు: సోషల్ మీడియాలో పరిచయమైన 17 ఏళ్ల బాలికతో సన్నిహితంగా ఉంటున్నాడని ఓ యువుకుడిపై కొంతమంది యువకులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. బస్టాండ్‌లో మైనర్‌తో మాట్లాడుతుండగా గుంపుగా వచ్చిన యువకులు అతడ్ని కిడ్నాప్ చేసి దారుణంగా చితకబాదారు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. దక్షిణ కన్నడ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. సుబ్రమణ్యలోని కల్లుగుండకి చెందిన హఫీద్ అనే 20 ఏళ్ల యువకుడికి ఏడాది కిత్రం ఓ మైనర్ బాలికతో(17) ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైంది. చాటింగ్ ప్రారంభించడంతో వీరి మధ్య స్నేహం ఏర్పడింది. తరుచూ బస్టాప్‌లో కలిసి మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో ఎప్పటిలాగే జనవరి 5వ తేదీన సుబ్రమణ్య బస్‌స్టాండ్‌లో యువకుడు అమ్మాయితో మాట్లాడుతుండగా అకస్మాత్తుగా వచ్చిన యువకుల గుంపు అతన్ని కిడ్నాప్ చేశారు. జీపులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. యువకుడిపై మూకుమ్మడిగా దాడి చేశారు. బాలిక జోలికి రావొద్దని, మరోసారి ఆమోను చూడటం, మాట్లాడటం చేయవద్దని కత్తితో బెదిరించారు. ఈ ఘటనలో భాధితుడి తలకు బలమైన గాయాలు కావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై స్పందించిన పోలీసులు ఈ ఘటనలో రెండు ఎఫ్ఐఆర్లు ఫైల్ చేశారు. యువకుడిపై దాడి చేసినందకు 12 మందిపై కేసు నమోదు చేయడంతోపాటు.. బాధిత బాలుడిపై కూడా కేసు నమోదైంది. ఈ సంఘటన జరిగిన మరుసటి రోజు తన కూతురిని వేధింపులకు గురి చేశాడని బాలిక తండ్రి హఫీద్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. చదవండి: Crime News: దా.. బండెక్కు! అన్నాడు.. -
ఏ దిక్కూలేక తాత ఇంటికి చేరింది.. మృగాళ్లలా మారి ఆరుగురు..
మేం.. విడిపోతున్నామనే పేరుతో తల్లిదండ్రులు వదిలేశారు. ఏ దిక్కూలేని ఆ పసితల్లి దీనంగా తాత ఇంటికి చేరింది. ఒక్కపూట బువ్వకోసం ఇంటి చాకిరీ మొత్తం చేసింది. ఆ బిడ్డను చూసి జాలిపడాల్సిన లోకం పట్టించుకోలేదు. దిక్కూమొక్కులేదని తెలియడంతో అయినా వారే ఆ చిన్నారి పాలిట రాబందులుగా మారారు. కర్కశంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. కాటికి కాళ్లు చాపిన తాత.. తండ్రి తర్వాత తండ్రిగా భావించే బాబాయిలు, వరసకు సోదరులైన ఇద్దరు యువకులు తోడేళ్లుగా మారి అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంతటి బాధను పంటి బిగువన భరించిన ఆ 13 ఏళ్ల బాలిక టీచర్ల సాయంతో ఆ కీచకులను కటకటాలపాలు జేసింది. సాక్షి, అన్నానగర్: కంచే చేను మేసిందన్న చందంగా.. అయినా వారే ఓ ఆడబిడ్డ పాలిట జంతువుల్లా ప్రవర్తించారు. సభ్య సమాజం తలదించుకునేలా మృగాలను తలపించారు. వివరాలు.. మైలాపూర్ ప్రాంతానికి చెందిన ఓ జంట వివాహం అనంతరం కొన్నేళ్లకు విడిపోయింది. దీంతో వీరి కుమార్తె (13) అనాథగా మారింది. నా అనేవాళ్లు లేక తాతయ్య ఇంటికి చేరింది. అక్కడే స్థానిక పాఠశాలలో చదువుకుంటోంది. అయితే ఆ బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాల్సిన కుటుంబ సభ్యులే 2016, 2017లో పలుమార్లు బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని బాలిక పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులకు తెలియజేసింది. దీంతో పాఠశాల యాజమాన్యం జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఫిర్యాదు చేసింది. చివరికి ఈ అకృత్యంపై మైలాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మృగాలకు తగిన శాస్తి.. ఈ కేసు విచారణ సమయంలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. బాలికపై ఏకంగా ఆరుగురు కుటుంబ సభ్యులు నెలల తరబడి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. దీంతో బలాత్కారం చేసిన ఆమె తాత, ముగ్గురు బాబాయిలు (తాత కొడుకులు), చిన్నాన కుమారులు ఇద్దరు (బాలిక సోదరులు) సహా ఆరుగురిపై పోక్సో కేసు నమోదైంది. అనంతరం వారిని అరెస్టు చేశారు. ఈనేపథ్యంలో చెన్నైలోని పోక్సో కేసులను విచారిస్తున్న ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాజలక్ష్మి ముందుకు మంగళవారం ఈ కేసు విచారణకు వచ్చింది. కాగా నేరం రుజువు కావడంతో బాలిక తాత, ముగ్గురు బాబాయిలకు యావజ్జీవ శిక్ష, తలా రూ. లక్ష జరిమానా, బాలిక సోదరుల్లో ఒకరికి 10 ఏళ్ల జైలుశిక్ష, మరొకరికి ఐదేళ్ల జైలుశిక్ష, తలా రూ.5,000 జరిమానా విధించారు. అలాగే బాధిత బాలికకు తమిళనాడు ప్రభుత్వం తరపున రూ. 10 లక్షలు పరిహారం ఇవ్వాలని కూడా న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ఇక సమాజంలో ఏ ఆదరణ లేని బాలికల పరిస్థితి దుర్భరంగా ఉందని, తన..మన అనే భేదం లేకుండా ఇష్టారాజ్యంగా మానవ మృగాలు రెచ్చిపోతున్నాయని న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. అబలల ఆక్రందనలను ప్రభుత్వాలు పట్టించుకోవాలని, ఇలాంటి విషయాల్లో పోలీసులు సైతం కఠినంగా వ్యవహరించాలని సూచించారు. నిందితులపై ఎలాంటి కనికరం చూపాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. -
మైనర్‌పై సామూహిక అత్యాచారం.. 12 గంటలపాటు నిర్బంధించి..
మహిళలపై అరాచకాలు పెరిగిపోతున్నాయి. రోజురోజుకీ కామాంధులు రెచ్చిపోతున్నారు. యువతులు, మహిళలే కాకుండా పసిపిలల్లపై సైతం లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలో సభ్య సమాజం లదించుకునే ఘటన చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికపై కొంతమంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 12 గంటలపాటు బాలికను నిర్భంధించి అత్యంత దారుణంగా అఘాయిత్యానికి ఒడిగట్టారు. పాల్ఘర్ జిల్లాలోని ఓ గ్రామంలో శుక్రవారం ఈ ఘోరం జరిగింది. పాల్ఘర్ జిల్లా రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 16 ఏళ్ల మైనర్ బాలికపై 8 మంది వ్యక్తులు అత్యాచారం చేశారు. డిసెంబర్ 16న(శుక్రవారం) కొందరు వ్యక్తులు బాలికను కిడ్నాప్ చేసి మహిమ్ గ్రామంలోని ఖాళీగా ఉన్న బంగ్లాలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టారు. అంతేగాక అక్కడి నుంచి సముద్ర తీరానికి తీసుకెళ్లి అక్కడి పొదల్లో మళ్లీ లైంగిక దాడికి పాల్పడ్డారు. మొత్తం 12 గంటలపాటు (శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు) బాలికను నిర్బంధించి ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. చివరికి ఎలాగోలా వారి చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదు మేరకు సత్పతి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ దారుణానికి పాల్పడిన ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారిపై ఐపీసీలోని పలు సెక్షన్లతోపాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. చదవండి: అమానుష ఘటన.. అపార్ట్మెంట్ వద్ద పసికందును వదిలేసిన వ్యక్తులు -
Crime: ప్రాణం తీసిన పక్కింటి కుర్రాడి ప్రేమ
పక్కింటి కుర్రాడు.. అదీ వేరే వర్గానికి చెందిన వ్యక్తితో ప్రేమ వ్యవహారం నడిపిస్తోందని తెలిసి ‘వద్దని’ చెల్లెలిని వారించాడు ఆ అన్న. అయినా ఆమె వినలేదు. అతనితో మాటలు కొనసాగిస్తూనే వచ్చింది. ఈ క్రమంలో వాళ్లిద్దరూ మరింత చనువుగా ఉండడం చూసి రగిలిపోయాడు ఆ అన్న. అతనిలో కోపం కట్టలు తెంచుకుని.. ఆమెను అతి దారుణంగా హతమార్చాడు. ఉత్తర ప్రదేశ్ గోండాలో పరువు హత్య కలకలం సృష్టించింది. 16 ఏళ్ల టీనేజర్‌ను ఆమె సోదరుడే అత్యంత పైశాచికంగా హతమార్చాడు. మూడు నెలల కిందట పక్కింటి కుర్రాడితో వాట్సాప్ ఛాటింగ్ చేస్తూ ఆమె అన్న కంటపడింది. దీంతో ఆమెను చితకబాది.. అతనికి దూరంగా ఉండాలని వారించాడు. అయినా ఆమె వినలేదు. ఈసారి ఏకంగా ఫోన్లో మాట్లాడుతూ దొరికిపోవడంతో.. ఆమెతో గొడవకు దిగాడు. ఏం చేస్తావో చేస్కో అంటూ తెగేసి చెప్పేసరికి ఆ అన్నలో కోపం కట్టలు తెంచుకుంది. ఆ వెంటనే ఇద్దరూ చనువుగా మాట్లాడుకుంటూ అతని కంటపడ్డారు. గురువారం రాత్రి ఓ పదునైన ఆయుధంతో ఆమెపై దాడి చేసి చంపేశాడు. ఆపై కాట్రా బజార్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పరువు హత్య కోణంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే మూడేళ్ల కిందట నిందితుడి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తల్లి సోదరితో కలిసి దామోదర్ గ్రామంలోకూలీ పనులు చేసుకుంటూ స్థిరపడ్డాడు. అయితే వేరే వర్గానికి చెందిన కుర్రాడితో తన చెల్లెలు చనువుగా ఉండడాన్ని తట్టుకోలేకపోయాడు. ఇదీ చదవండి: అశ్లీల సైట్లు చూసే అత్యాచారం చేశారట! -
చిన్నాన్న కాదు కామాంధుడు
బెంగళూరు: మైనర్ బాలిక(17)పై చిన్నాన్న అత్యాచారం చేసి గర్భవతి చేసిన ఘటన దక్షిణకన్నడ జిల్లా మంగళూరులో జరిగింది. 9వ తరగతి వరకు చదివి బాలిక బడి మానేసింది. మూడేళ్ల నుంచి చిన్నాన్న, చిన్నమ్మల వద్ద ఉంటుంది. ఇటీవల ఆశా కార్యకర్త గ్రామానికి వచ్చినప్పుడు బాలిక కడుపుతో ఉన్న విషయం చూసింది. విచారించగా చిన్నాన్న లైంగిక దాడి చేశాడని తెలిపింది. ఫిబ్రవరి నెలలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడని బాలిక పోలీసుల విచారణలో తెలిపింది. కామాంధున్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. చదవండి: (బెంగళూరులో ఘోరం.. తమ్ముని భార్య వేధిస్తోందని..) -
నెల్లూరు: బాలిక గొంతుకోసిన ఘటనలో కామాంధుడి అరెస్ట్
సాక్షి, నెల్లూరు: పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం నక్కల కాలనీలో బాలిక గొంతుకోసి, యాసిడ్ పోసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని నాగరాజుగా గుర్తించిన పోలీసులు.. బాధితురాలికి దగ్గరి బంధువు అయ్యి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. కాగా ఇంట్లో ఎవరూలేని సమయంలో 14ఏళ్ల బాలికపై నాగరాజు అనే వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను బాలిక నోరు, ముఖంపై పోశాడు. అనంతరం కత్తితో గొంతు కోసి అక్కడ నుంచి పరారయ్యాడు. బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని ఆమెను హుటాహుటిన జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. చదవండి: విషాదం.. కొడుకును నడుముకు కట్టుకుని.. చెరువులో దూకిన తల్లి మంత్రి పరామర్శ చెముడుగుంటలో దుండగుడి చేతిలో గాయపడి నెల్లూరులోని అపోలో వైద్యశాలలో చికిత్స పొందుతున్న మైనర్‌ను వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పరామర్శించారు. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పు చేసిన వారికి శిక్ష తప్పదన్నారు. ఆడబిడ్డలపై కన్నెత్తి చూడాలంటేనే భయపడేలా బాలికపై దారుణానికి ఒడిగట్టిన నిందితుడిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాలికకు సొంత ఖర్చులతో మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. అవసరమైతే చెన్నైకు తరలిస్తామన్నారు. చిన్నారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా అధికారుల పరామర్శ దుండగుడి చేతిలో గాయపడిన మైనర్‌ను జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఎస్పీ సీహెచ్ విజయారావు, నెల్లూరు కమిషనర్ హరిత, ఆర్డీఓ మలోలా, డీఎస్పీ హరనాథరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి తదితరులు పరామర్శించారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో మాట్లాడి బాలికకు మెరుగైన వైద్యం అందిం చేందుకు అపోలోకు తరలించామని గిరిధర్‌రెడ్డి తెలిపారు. -
బాలికపై మేనమామ నాగరాజు అత్యాచారయత్నం
-
పదో తరగతి బాలికపై జిమ్ ట్రైనర్ అత్యాచారం
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి బాలికపై అత్యాచారానికి పాల్పడిన జిమ్ ట్రైనర్‌పై జీడిమెట్ల పోలీసులు అత్యాచారం, ఫోక్సో చట్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. సీఐ ఎం.పవన్ వివరాల ప్రకారం.. గాజులరామారం డివిజన్ నెహ్రూనగర్‌కు చెందిన విశ్వక్(23) జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. కాగా అదే ప్రాంతానికి చెందిన పదో తరగతి చదువుతున్న మైనర్ బాలిక(14)తో చనువుగా ఉండేవాడు. ఈ క్రమంలో విశ్వక్ సదరు బాలికతో ఉన్న చనువుతో బాలికను గత నెల 29వ తేదీన ఇంటి నుంచి బయటకు తీసుకువెళ్లాడు. బాలిక రాత్రైనా ఇంటికి రాకపోవడంతో బాలిక కనబడటం లేదని బాలిక తండ్రి అదేరోజు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కాగా విశ్వక్ శుక్రవారం బాలికను ఇంటి వద్ద వదిలివెళ్లిపోయాడు. ఇంట్లోకి వెళ్లిన బాలికను తల్లిదండ్రులు నిలదీయడంతో విశ్వక్ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు జరిగిన విషయం తల్లిదండ్రులకు తెలిపింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని శుక్రవారం అదుపులోకి తీసుకుని శనివారం రిమాండ్‌కు తరలించారు. చదవండి: ఎంత పని చేశావు తల్లీ! తన కొడుకుకంటే ఎక్కువ మార్కులు వచ్చాయని.. -
మైనర్ హత్యాచారంలో వీడిన మిస్టరీ, తల్లి ప్రియుడే..
ఢిల్లీ: వివాహేతర సంబంధం ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో చిన్నారిపై అపహరించి.. ఆపై కిరాతకంగా ఆమెపై హత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కిరాతకుడు. రాజధానిలో సంచలనం సృష్టించిన మైనర్ హత్యాచార కేసులో మిస్టరీ.. రెండు వారాలకు వీడింది. బాధితురాలి తల్లి ప్రియుడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడనే నిజం విస్మయానికి గురి చేస్తోంది. దర్యాగంజ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి భార్య, నలుగురు పిల్లలతో జీవిస్తున్నాడు. ఆగస్టు ఐదవ తేదీ ఉదయం పోలీసులను ఆశ్రయించాడు అతను. తెల్లారి చూసేసరికి తన ఎనిమిదేళ్ల కూతురు కనిపించలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. చుట్టుపక్కల వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. దీంతో కిడ్నాప్ కేసు నమోదు చేసుకుని.. బాలిక కోసం గాలింపు చేపట్టారు. ఫలితం లేకపోవడంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే చివరకు ఈ కేసు విషాదంగా ముగిసింది. ఆగస్టు 18న యమునా ఖాదర్ ప్రాంతంలో గాయాలతో గుర్తుపట్టలేని స్థితిలో బాలిక మృతదేహం లభించింది. పోస్ట్ మార్టం ప్రకారం.. మైనర్‌పై అత్యాచారానికి పాల్పడి, ఆపై హత్య చేసినట్లు నిర్ధారించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడంతో డీసీసీ శ్వేతా చౌహాన్ నేతృత్వంలో యాభై మంది బృందం దర్యాప్తు చేపట్టింది. సీసీ టీవీ ఫుటేజీలోనూ ఫలితం లేకపోవడంతో.. సుమారు 200 మందిని ఇంటరాగేట్ చేశారు. ఇదిలా ఉంటే.. మాంసం కొట్టులో పని చేసే రిజ్వాన్ అలియాస్ బాద్షా అనే వ్యక్తి తరచూ బాధిత బాలికకు చాక్లెట్ కొనిస్తాడని సమాచారం పోలీసులకు అందింది. రిజ్వాన్ ఇరవై ఏళ్ల కిందట బీహార్ నుంచి ఢిల్లీకి వలస వచ్చాడు. మాంసం దుకాణాల్లో పని చేస్తూ.. మద్యం, గంజాయికి బానిసై తిరుగుతుంటాడు. ఈ క్రమంలో రిజ్వాన్ గురించి సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని దొరకబుచ్చుకుని.. తమదైన శైలిలో ప్రశ్నించే సరికి విస్తూపోయే నిజం వెలుగు చూసింది. బాధితురాలి తల్లితో రిజ్వాన్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో బాలిక చూడడంతో ఎక్కడ తన తండ్రికి విషయం చెబుతుందో అని ఇద్దరూ భయపడ్డారు. ఆమె అడ్డు తొలగించుకోవాలని యత్నించారని.. ఈ క్రమంలోనే నేరానికి రిజ్వాన్ పాల్పడ్డాడని డీసీపీ శ్వేతా చౌహాన్ కేసు వివరాలను వెల్లడించారు. నిద్రిస్తున్న బాలికను ఎత్తుకెళ్లి.. గంజాయి మత్తులో ఆమెపై అత్యాచారానికి పాల్పడఇ, ఆపై పదునైన ఆయుధంతో గొంతు కోసి.. ముఖాన్ని చెక్కేశాడని డీసీపీ తెలిపారు. నేరానికి పాల్పడ్డ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఇదీ చదవండి: మోడ్రన్ రాబిన్ హుడ్.. దోచుకోవడం-పంచడం! -
ప్రేమ పేరుతో మైనర్ బాలికకు వంచన!
అచ్యుతాపురం(అనకాపల్లి): అచ్యుతాపురం మండలంలోని పూడిమడకలో మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు. పేద కుటుంబానికి చెందిన బాలిక కుటుంబీకులు పెద్దల సహకారంతో న్యాయం చేయాలని కోరుతున్నారు. గ్రామానికి చెందిన కొందరు పెద్దలు సదరు బాలికకు, యువకునికి పెళ్లి చేయాలని చర్చలు జరుపుతున్నారు. ఈ విషయమై గ్రామ పెద్దల సూచనల మేరకు అచ్యుతాపురం పోలీసులు కేసు నమోదు చేయలేదు. -
షాకింగ్ ఘటన: ప్రియుడి హెచ్ఐవీ రక్తాన్ని ఎక్కించుకుంది
దిస్పూర్: ప్రేమంటే గుడ్డిదేకాదు.. ఎడ్డిదని నిరూపించిన ఘటనలు చాలానే చూసి ఉంటాం. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే ప్రేమ కథ.. కాస్త కొత్తదే. ప్రేమలో ఉన్నవాళ్లు స్థిమితంగా ఉండరని, వాళ్ల ఆలోచనలు కూడా అంతే ఎక్స్ట్రీమ్గా ఉంటుందని నిరూపించిన ఘటన ఇది. ప్రియుడికి హెచ్ఐవీ ఉంది. ఆ విషయంలో ఆమెకు తెలిసింది. తెలిసింది ఏంటీ.. తెలిసే ప్రేమించింది కూడా. ఇంతలో పెద్దలు వాళ్ల ప్రేమకు అడ్డుతగిలారు. ఓ హెచ్ఐవీ రోగిని చేసుకోవడం ఏంటని చెడామడా వాయించారు ఆ అమ్మాయిని. కానీ, తన ప్రేమలో ఎంత నిజాయితీ ఉందో నిరూపించుకునేందుకు ఎవరూ దిగని చేష్టలకు దిగిందామె. అస్సాం సువాల్కుచీకి చెందిన ఓ టీనేజర్‌కి సత్దోలా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో మూడేళ్ల కిందట ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యింది. ఈ మూడేళ్లలో వాళ్ల స్నేహం.. ప్రేమగా ఎదిగింది. కలిసి జీవిద్దాం అనుకుని ఫిక్స్ అయిపోయారు. ప్రియుడికి హెచ్ఐవీ ఉందని తెలిసి కూడా ఆమె జీవించడానికి ఒప్పుకుంది. ఈ క్రమంలో పెద్దలకు విషయం చెబితే.. ఆమెను చితకబాదారు. ఇద్దరు రెండుమూడుసార్లు ఇంటి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు కూడా. కానీ, ఈ పెద్దోలున్నారే.. లాక్కొచ్చి ఇంట్లో పడేశారు. బాధితురాలు.. (గతంలో వెళ్లిపోయినప్పుడు ప్రెస్మీట్లో) ఇక లాభం లేదనుకుని తన ట్రూ లవ్‌ను నిరూపించుకునేందుకు పెద్ద సాహసమే చేసింది. ప్రియుడి హెచ్ఐవీ రక్తాన్ని ఓ సిరంజీ ద్వారా సేకరించి తన నరాల్లోకి ఎక్కించుకుంది ఆమె. ప్రాణాలకు తెగించి ఆమె చేసిన షాకింగ్ పని.. స్థానికంగా అందరినీ విస్మయానికి గురి చేసింది. ప్రస్తుతం ఆమెను ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందిస్తున్నారు. బాధితురాలిని(15) అబ్జర్వేషన్లో ఉంచామని, బ్లడ్ రిపోర్టులు రావాల్సి ఉందని వైద్యులు చెప్తున్నారు. మరోవైపు ప్రేమ పేరుతో మైనర్లో ముగ్గులోకి దించిన నేరానికి సదరు యువకుడిని హజో పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. ఇదీ చదవండి: చిలిపి దొంగలు.. ఏం చేస్తారో తెలిస్తే షాకవుతారు! -
ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య
సాక్షి, ముంబై: ఏడేళ్ల బాలికపై ఆత్యాచారం, హత్య చేసిన నిందితుడు తేజస్ దల్వీ (24)ని పుణే జిల్లా పోలీసులు 24 గంటల్లో అరెస్టు చేశారు. సాక్షాధారాలు నష్టం చేసేందుకు ప్రయత్నించిన తేజస్ తల్లి సుజాత దల్వీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తర్వాత స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నిందితున్ని ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ కోఠార్ణే గ్రామస్తులు శుక్రవారం ఆందోళనకు దిగారు. దీంతో గ్రామంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో అదనంగా పోలీసు బలగాలను మోహరించాల్సి వచ్చింది. పుణే జిల్లా మావళ్ తాలూకా కోఠార్ణే గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలిక ఈనెల రెండో తేదీ నుంచి అదృశ్యమైంది. అంతటా గాలించినప్పటికీ బాలిక ఆచూకీ లభించలేదు. చివరకు బాలిక తండ్రి స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అంతటా గాలించగా.. చివరకు బుధవారం గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాల వెనకాల నగ్నస్థితిలో ఉన్న బాలిక మృతదేహం లభించింది. ఈ వార్త దావానలంలా ఊరంతా పాకింది. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు గుమిగూడారు. పోలీసులు వెంటనే శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టులో బాలికపై అత్యాచారం జరిగినట్లు నివేదిక వచ్చింది. గ్రామస్తుల ఆగ్రహాన్ని చూసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి 24 గంటల్లోనే కామాంధుడు తేజస్ దల్వీని అరెస్టు చేసినట్లు సీనియర్ ఇన్స్పెక్టర్ అశోక్ శేల్కే వెల్లడించారు. అనంతరం చేపట్టిన విచారణలో తేజస్ నేరాన్ని అంగీకరించాడు. నిందితుడు బాలిక ఉంటున్న పక్కింట్లోనే నివాసముంటున్నట్లు తెలిసింది. నిందితున్ని అరెస్టు చేసినట్లు తెలియగానే మావళ్ తాలూకా హద్దులో ఉన్న గ్రామాల ప్రజలందరూ కోఠార్ణే గ్రామానికి తరలివచ్చారు. చదవండి: నా చావుకు కారణం వారే.. పిన్ని వాయిస్ రికార్డ్ బయట పెట్టడంతో.. అంతటితో ఊరుకోకుండా నిందితున్ని ఉరి తీయాలంటూ విద్యార్థులు, మహిళా సంఘాలు, స్థానికులు మోర్చా నిర్వహించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మహిళా కమిషన్ వద్ద నిరసన వ్యక్తంచేశారు. ఈ కేసు విచారణ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా జరిపించి నిందితున్ని వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేశారు. -
తమిళనాడులో మరో విద్యార్థిని ఆత్మహత్య.. రెండు వారాల్లో మూడో ఘటన
సాక్షి, చెన్నై: తమిళనాడులో విద్యార్థినుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. జూలై 13న కల్లకురిచ్చి జిల్లాలో 17 ఏళ్ల విద్యార్థిని హాస్టల్ భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. నిన్నటికి నిన్న (సోమవారం) తిరువళ్లూరులోని ప్రభుత్వ పాఠశాల హాస్టల్ గదిలో 12వ తరగతి విద్యార్థిని ఉరేసుకొని విగత జీవిగా కనిపించింది. ఇక ఈ ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే తాజాగా మరో మైనర్ విద్యార్థిని అసువులు బాసింది. కడలూరు జిల్లాలో 12వ విద్యార్థినిని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. రెండు వారాల్లో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇది మూడోసారి.. బాధితురాలి నుంచి నాలుగు పేజీల సుసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేశారు. అందులో తను ఐఏఎస్ కావాలన్న తల్లిదండ్రుల కోరికను నెరవేర్చలేకపోతున్నాని వాపోయింది. కాగా విద్యార్థిని తల్లిదండ్రులు వ్యవసాయ దారులు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే మృతురాలికి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా.. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా పోలీసు అధికారి శక్తి గణేషన్ తెలిపారు. చదవండి: తమిళనాడులో ఘోరం.. విద్యార్థిని ఆత్మహత్య.. 10 రోజుల్లో రెండో ఘటన ఇదిలా ఉండగా తొలుత కాళ్లకురిచ్చి జిల్లా చిన్న సేలం సమీపంలోని కన్నియమూరు గ్రామంలో ఓ ప్రైవేటు ఇంటర్నేషనల్ స్కూల్లో ప్లస్-2 చదువుతున్న శ్రీమతి (17) అనే బాలిక హాస్టల్ భవనం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆ విద్యార్థిని బంధువులు, స్థానిక ప్రజలు నిరసన తెలిపారు. స్కూల్‌పై దాడిచేశారు. ఈ వ్యవహారం కోర్టుకు కూడా వెళ్లింది. దీంతో విద్యా సంస్థల్లో జరగుతున్న మరణాలపై సెంట్రల్ బ్యూరో సీఐడీతో విచారణ జరిపించాలని మద్రాస్ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సోమవారం విద్యార్థిని ఆత్మహత్య కేసు దర్యాప్తును పోలీసులు సెంట్రల్ బ్యూరో సీఐడీకి బదిలీ చేశారు. ఇదే కాక జూలై 13న కళ్లకురిచ్చి జిల్లాల్లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని కేసు కూడా విచారణ జరుపుతోంది. రాష్ట్రంలో విద్యార్ధినిల ఆత్మహత్యలపై సీఎంస్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థినులు ఆత్మహత్య ఆలోచనలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. పరీక్షలను విజయాలుగా మార్చుకోవాలని సూచించారు. విద్యార్థులపై లైంగిక, మానసిక, శారీరక వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
జూబ్లీహిల్స్ మైనర్ ఆత్యాచార కేసులో విచారణ పూర్తి
-
హైదరాబాద్‌లో దారుణం.. 17 బాలికపై ఇద్దరు యువకుల అఘాయిత్యం
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. చత్రినకా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పగూడలో 17 ఏళ్ల మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. గతంలో అలి అనే యువకుడితో బాలికకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంలో బాగంగా ఉప్పుగూడలో అలి సదరు బాలికను ఇంటికి పిలిచాడు. అనంతరం తన మిత్రుడు ఆర్బాస్‌తో కలిసి అలి బాలికపై లైంగిక దాడి చేశారు. బాధిత బాలిక కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు నిందితులు అలి, అర్బాస్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కమెడియన్ లైంగిక వేధింపులు.. 50 ఏళ్ల తర్వాత తీర్పు..
Comedian Bill Cosby Found Guilty Sexually Assaulting In 1975: ఎంతటి ప్రముఖులైన చేసిన నేరానికి శిక్ష అనుభవించక తప్పదని మరో సంఘటన నిరూపించింది. ఓ ప్రముఖ కమెడియన్ 1975లో చేసిన నేరం సుమారు 50 ఏళ్ల తర్వాత రుజువైంది. 5 దశాబ్దాల క్రితం అమెరికన్ కమెడియన్ బిల్ కాస్బీ ప్లేబాయ్ మాన్షన్‌లో ఓ మైనర్ బాలికను లైంగికంగా వేధించాడు. కొన్ని ఏళ్ల తర్వాత ఆమె బిల్‌పై కేసు పెట్టింది. తర్వాత విచారించిన కాలిఫోర్నియాలోని జ్యూరీ తాజాగా మంగళవారం (జూన్ 21, 2022) తీర్పునిచ్చింది. హాస్య నటుడు బిల్ కాస్బీ నేరం చేసినట్లు నిర్ధారించింది. అంతేకాకుండా బాధితురాలు జూడీ హుత్కు 5 లక్షల డాలర్లు నష్టపరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. 1975లో 36 ఏళ్ల వయసున్న బిల్ కాస్బీ 16 సంవత్సరాల జూడీ హుత్ను లైంగికంగా వేధించాడు. ఓ సినిమా సెట్లో జరిగిన ఈ ఘటనలో జూడీతోపాటు ఆమె స్నేహితురాలు డొన్నా శామ్యూల్ సన్ (17) కూడా బాధితురాలైంది. చదవండి: బుల్లితెర నటి ఆత్మహత్య.. అతడే కారణమని తండ్రి ఆరోపణ ప్రస్తుతం 84 ఏళ్ల వయసున్న బిల్ కాస్బీపై పలువురు మహిళలు లైంగిక ఆరోపణలతో కేసులు వేశారు. ఈ క్రమంలోనే బిల్‌కు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. కాగా 'అమెరికాస్ డాడ్'గా పిలవబడే బిల్ కాస్బీ 2018లో కూడా ఒక క్రిమినల్ కేసులో జైలుపాలయ్యాడు. తర్వాత పలు కారణాల వల్ల నేరం రద్దు కావడంతో గతేడాది విడుదల అయ్యాడు. చదవండి: సినిమా సెట్లో ఇద్దరు నటులు మృతి.. ఆరుగురికి గాయాలు -
మైనర్ బాలిక కిడ్నాప్.. ఆపై గ్యాంగ్ రేప్
-
ఆలస్యంగా వెలుగులోకి.. తల్లితో గొడవపడి బయటికి వెళ్లిన బాలికపై
సాక్షి, హైదరాబాద్: మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. స్టేషన్ పరిధిలో నివాసం ఉండే 14 ఏళ్ల మైనర్ బాలిక ఈ నెల 17న రాత్రి తల్లితో గొడవపడి బయటికి వెళ్లింది. బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ముగ్గురు నలుగురు యువకులు మీ తల్లి దగ్గరకు తీసుకెళుతామంటూ నమ్మించారు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. తప్పించుకున్న బాలిక శనివారం సాయంత్రం ఇంటికి చేరుకుంది. ఎక్కడికి వెళ్లావని బాలికను నిలదీయడంతో అసలు విషయాన్ని తెలిపింది. బాధితురాలి తల్లి చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నేడు (మంగళవారం) రిమాండ్‌కు తరలించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. చదవండి: చుక్కలు చూపించింది! పెళ్లి చేసుకున్న నెలకే గెంటేసి.... -
వింత ఆచారం.. వరుణుడి కరుణ కోసం అమ్మాయిని అబ్బాయిగా అలంకరించి..
సాక్షి,బళారి: వరుణ దేవుడి కరుణ కోసం విజయపుర జిల్లాలో చిన్నారులకు వివాహాలు జరిపిస్తున్నారు. జిల్లాలోని ముద్దేబిహాల్ తాలూకా సాలతవాడ పట్టణంలో కారుపౌర్ణిమ తర్వాత చిన్నారులకు పెళ్లి జరిపించే సంప్రదాయం కొనసాగుతోంది. అయితే అబ్బాయి, అమ్మాయికి పెళ్లి చేస్తున్నారనుకుంటే పొరపాటు. ఇక్కడ అమ్మాయిని అబ్బాయిగా అలంకరించి, మరొక అమ్మాయితో పెళ్లి జరిపిస్తారు. 14 సంవత్సరాలు లోపు అమ్మాయిలతో ఈ తంతు పూర్తి చేస్తారు. పెళ్లి జరిపించడంతో పాటు విందు, దేవాలయాలు సందర్శన చేస్తారు. సంప్రదాయబద్దంగా 18 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల సకాలంలో వర్షాలు కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని, శాంతి నెలకొంటుందని వారి నమ్మకం. చదవండి: తండ్రీకొడుకుల అరుదైన ఫొటో.. సోషల్ మీడియాలో వైరల్ -
మైనర్ బాలికపై వేధింపులు.. తండ్రి మందలించడంతో..
సాక్షి, హైదరాబాద్: మైనర్ బాలికను వేధిస్తున్న యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శేరిలింగంపల్లి పరిధిలోని పాపిరెడ్డి కాలనీలోని ఓ మైనర్ బాలిక(16)ను స్థానికంగా ఉండే నాగేశ్వర్రావు కుమారుడు అరవింద్ (21) ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ విషయం బాలిక ఇంట్లో తెలియడంతో బాలిక తండ్రి అరవింద్‌ను మందలించారు. ఇదిలా ఉండగా ఈ నెల 2న బాలిక తండ్రి ద్విచక్ర వాహననంతోపాటు మరో రెండు వాహనాలు దగ్ధమయ్యాయి. ఓ ఇంటికి అమర్చిన ఏసీ ఔట్ డోర్ కంప్రెషర్ కూడా కాలిపోయింది. దీనికి కారణం అరవిందేనని స్థానికులు చితకబాదారు. ఈనెల 9న బాలికను అరవింద్ వే«ధిస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న చందానగర్ పోలీసులు 14న అరవింద్‌ను విచారణ కోసం పిలిచారు. తనపై వారు దాడిచేశారని ఫిర్యాదు చేశాడు. దీంతో బుధవారం చందానగర్ పోలీస్ స్టేషన్ ముందు బాలిక కుటుంబసభ్యులు ధర్నాకు దిగారు.చివరకు చందానగర్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సీఐ క్యాస్ట్రో తెలిపారు. చదవండి: 'నా పిల్లలకు తల్లిని లేకుండా చేశావ్.. నిన్ను చంపి నా భార్యను తీసుకెళ్తా' -
జూబ్లీహిల్స్ పబ్ కేసు: ప్లాన్ ప్రకారమే ఆ వాహనం వినియోగించాం.. కానీ..
సాక్షి,బంజారాహిల్స్(హైదరాబాద్): జూబ్లీహిల్స్‌లో విదేశీబాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు మైనర్ల పోలీసు కస్టడీ మంగళవారం ముగిసింది. ఈ నెల 9న వీరిని నాలుగు రోజుల కస్టడీకి న్యాయమూర్తి అనుమతించిన విషయం తెలిసిందే. అంతకుముందే ఏ1 నిందితుడు సాదుద్దీన్ మాలిక్‌ను కస్టడీకి తీసుకోగా సోమవారమే ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. గత నాలుగు రోజులుగా బంజారాహిల్స్ ఏసీపీ ఎం.సుదర్శన్ కస్టడీలో ఉన్న మైనర్లను వేర్వేరుగా, ఒకేచోట కూర్చోబెట్టి విచారించారు. అత్యాచారం ఎక్కడ జరిగింది, ఇందుకు ఉసిగొల్పింది ఎవరు అనే విషయాలపై ఆరా తీయగా, జూబ్లీహిల్స్‌లోని ఓ గుడి వెనుకాల నిర్మానుష్య ప్రదేశంలో అత్యాచారం జరిపినట్లు చెప్పారు. ఒకేచోట అందరం కలిసి అత్యాచారానికి పాల్పడినట్లుగా వెల్లడించారు. నిందితుల్లో ఓ ఎమ్మెల్యే కొడుకుతోపాటు వక్ఫ్‌బోర్డ్ చైర్మన్ కొడుకు, సంగారెడ్డి మున్సిపాలిటీ కో–ఆప్షన్ మెంబర్ కొడుకు ఉండగా ఆ రోజు అధికారిక వాహనాన్ని ఎవరు తీసుకు రమ్మన్నారని పోలీసులు ప్రశ్నించారు. ప్రభుత్వ వాహనం అని రాసి ఉన్న ఇన్నోవా కారును పథకం ప్రకారమే తీసుకొచ్చామని, ఈ కారుకు బ్లాక్ ఫిలింఉండటమే కాకుండా గవర్నమెంట్ వెహికిల్ అని ఉంటే ఎవరూ టచ్ చేయరన్న ఉద్దేశంతో దీన్ని ఎంపిక చేసుకున్నామని వెల్లడించారు. ముందస్తు పథకంలో భాగంగానే కండోమ్ ప్యాకెట్లు కూడా తీసుకొచ్చినట్లు విచారణలో చెప్పారు. ఫోరెన్సిక్ విభాగం అధికారులు కారును తనిఖీ చేసినప్పుడు కండోమ్‌లు దొరికిన విషయం తెలిసిందే. కస్టడీలో భాగంగా ఆదివారం మైనర్లందరినీ సీన్ ఆఫ్ రీకన్‌స్ట్రక్షన్‌కు తీసుకెళ్లారు. పోలీసు కస్టడీలో మైనర్లందరూ కూడబలుక్కున్నట్లుగా ఒకే సమాధానం చెప్పారు. పోలీసు కస్టడీ ముగియగానే మంగళవారం సాయంత్రం ఈ ఐదుగురు మైనర్లను జువనైల్ హోంకు తరలించారు. కార్ల యజమానులపై కేసులు: ఈ ఘటనలో మైనర్లు నడిపిన కార్లకు సంబంధించి కేసుల నమోదుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. బంజారాహిల్స్‌లో నివసించే ఓ ఎమ్మెల్యే కుమార్తెకు చెందిన బెంజ్ కారును ఆమె కుమారుడు నడిపాడు. అలాగే ఇన్నోవా డ్రైవర్ని బంజారాహిల్స్‌లోని కాన్సు బేకరీ వద్ద దించి ఆ వాహనాన్ని మరో మైనర్ నడిపాడు. ఈ ఉదంతాల్లో మైనర్లతో పాటు వారికి వాహనాలిచ్చిన వారిపైనా కేసులు నమోదు చేయనున్నారు. చదవండి: Hyderabad: హెరిటేజ్ పాల లారీ బీభత్సం.. చెల్లెల్ని బైక్‌పై తీసుకొస్తుండగా -
జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ కేసు: అత్యాచార ఉద్ధేశంతోనే పబ్‌కు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ మైనర్ బాలిక అత్యాచార కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కేసులో తవ్వేకొద్దీ అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. నిందితులు పబ్‌లోకి ఎంటర్ అయ్యే ముందే ఇన్నోవా, బెంజ్ కారులో పోలీసులు కండోమ్ ప్యాకెట్లను తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కండోమ్ ప్యాకెట్లు తెచ్చినట్లు నిందితులు పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. రేప్ ఇంటెన్షన్‌తోనే పబ్‌కు వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ కస్టడీ ముగిసింది. కాసేపట్లో అతన్ని నాంపల్లి కోర్టులో హాజరుపర్చనున్నారు. అత్యాచార కేసులో మైనర్లతోపాటు సాదుద్దీన్ మాలిక్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు విచారించారు. ఈ కేసులో కస్టడీకి తీసుకున్న ఎమ్మెల్యే కుమారుడు, వక్ఫ్‌బోర్డ్ చైర్మన్ కుమారుడు, పొరుగు జిల్లా కార్పొరేటర్ కుమారుడు సహా ఐదుగురు మైనర్లతో పోలీసులు ఆదివారం క్రైమ్‌సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. పబ్, కాన్సూ బేకరీ, రోడ్ నంబర్ 44లోని పవర్‌స్టేషన్, తిరిగి పబ్ మధ్య వారిని తిప్పుతూ ప్రశ్నించారు. ఘటన జరిగిన రోజు పబ్ నుంచి ఎవరెవరు, ఏ కారులో వెళ్లారు? ఆ రోజు బాధిత బాలిక ఏ కారులో కూర్చుంది? తిరిగి వచ్చే క్రమంలో ఎలా వచ్చారు? ఏయే ప్రాంతాల్లో ఆమెపై అత్యాచారం చేశారన్న వివరాలను సేకరించి రికార్డు చేశారు. సంబంధిత వార్త: జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ కేసులో దర్యాప్తు ముమ్మరం అయితే సోమవారం మరోసారి అయిదుగురు మైనర్లను పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. జువైనల్ హోమ్ నుంచి జూబ్లీహిల్స్ పీఎస్‌కు తరలించనున్నారు. సాదుద్దీన్ మాలిక్ రెచ్చగొట్టడం వల్లే తాము బాలికపై అత్యాచారం చేశామంటూ మైనర్లు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ముందుగా ఎమ్మెల్యే కుమారుడే బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని సాదుద్దీన్ పోలీసులకు తెలిపాడు. -
అత్యాచార నిందితులకు లైంగిక సామర్థ్య పరీక్షలు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ లైంగికదాడి ఘటనలోని నిందితులకు లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ పోలీసులు శనివారం ఉదయం సైదాబాద్ జువెనైల్ హోం నుంచి ఐదుగురు మైనర్లను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మరో నిందితుడు సాదుద్దీన్ మాలిక్‌ను జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులోని ఆరుగురు నిందితులు ప్రస్తుతం పోలీసుకస్టడీలో ఉన్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య మూడు ప్రైవేట్ కార్లలో మైనర్లను ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరి ముఖానికి మాస్క్‌లు వేసి ఒక్కొక్కరిని ఫోరెన్సిక్ విభాగానికి తరలించారు. వీరందరికి డాక్టర్ సుధాకర్ నేతృత్వంలో రెండుగంటలపాటు లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఐదుగురు మైనర్లను జువెనైల్ హోంకు, సాదుద్దీన్ మాలిక్‌ను జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా, సైదాబాద్ జువెనైల్ హోంలో ఉన్న నిందితులను మొదటిరోజైన శుక్రవారం ఉత్తర్వు కాపీలు ఆలస్యంగా అందటంతో పోలీసులు కస్టడీకి తీసుకోలేకపోయారు. -
బాబాయ్ అంటే భయం.. అదే అలుసుగా తీసుకుని మూడు రోజులుగా..
సాక్షి,నాగోలు(హైదరాబాద్): మీ బాబాయ్‌కి చెప్పి కొట్టిస్తానని బెదిరించి ఓ ఆటో డ్రైవర్ బాలికపై లైంగికదాడికి పాల్పడిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. ఎన్టీఆర్నగర్కు చెందిన బాలిక(09) తల్లితో కలిసి నివాసం ఉంటుంది. వారి ఎదురింట్లో ఉంటున్న షేక్ సలీమ్ (30) ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తరుచు గొడవ పడుతుండటంతో కొద్ది రోజుల క్రితం అతడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ముడు నెలలుగా ఒంటరిగా ఉంటున్న సలీమ్ ఇంటి ఎదురుగా ఉన్న బాలికపై కన్నేసిన అతను మూడు రోజులుగా పలు మార్లు ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. సదరు బాలికకు ఆమె బాబాయ్ అంటే భయం ఉండడంతో ఈ విషయం బయట చెప్తే మీ బాబాయ్‌కి చెప్పి కొట్టిస్తానని బెదిరించడం ఆమె మిన్నకుంది. గురువారం బాధితురాలు సలీమ్ ఇంట్లో వెళ్లికి రావడాన్ని గుర్తించిన పక్క ఉండే మరో ఆమె తల్లి దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఆమె బాలికను నిలదీయడంతో రోజులుగా సలీమ్ తనపై అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు చెప్పింది. దీంతో ఆమె స్థానికుల సహాయంతో సలీమ్‌ను పట్టుకుని అతడిని చితకబాది ఎల్బీనగర్ పోలీసులకు అప్పచెప్పారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం వనస్థలిపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు షేక్ సలీమ్‌ను ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం అతడిని కోర్టులో హాజరుపరిచారు. చదవండి: తప్పుడు వాంగ్మూలం ఇవ్వలేదనే?.. గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద మృతిపై సందేహాలు -
ట్రాప్ చేసింది ప్రజాప్రతినిధుల కుమారులే!
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: రొమేనియా బాలికపై జరిగిన అఘాయిత్యానికి సంబంధించి ప్రజాప్రతినిధుల కుమారులే కీలక సూత్రధారులని నిందితుడు సాదుద్దీన్ పోలీసుల విచారణలో వెల్లడించినట్టు తెలిసింది. పబ్ దగ్గర మాటలు కలిపింది, కారులో అసభ్య ప్రవర్తన మొదలుపెట్టింది వారేనని పేర్కొన్నట్టు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సాదుద్దీన్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు గురువారం కస్టడీలోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఘటనకు సంబంధించిన కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మరోవైప ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లను నాలుగు రోజుల కస్టడీకి అనుమతిస్తూ జువెనైల్ జస్టిస్ కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పోలీసులు వారిని శుక్రవారం నుంచి తమ కస్టడీలో విచారించనున్నారు. రెండు నెలలుగా పరిచయం వెస్ట్‌జోన్ అదనపు డీసీపీ ఇక్బాల్ సిద్ధిఖీ, బంజారాహిల్స్ ఏసీపీ మంత్రి సుదర్శన్ నేతృత్వంలోని బృందాలు సాదుద్దీన్‌ను విచారిస్తున్నాయి. ఈ సందర్భంగా పోలీసులు మైనర్లతో పరిచయం సహా మొత్తం ఘటన వివరాలను రాబట్టడంపై దృష్టిపెట్టారు. పోలీసువర్గాల సమాచారం మేరకు.. ఐదుగురు మైనర్లతో తనకు దాదాపు రెండు నెలల పరిచయమైందని సాదుద్దీన్ చెప్పాడు. ఘటన జరిగిన రోజున తాను వక్ఫ్‌బోర్డు చైర్మన్ కుమారుడితో కలిసి ఇన్నోవా కారులో పబ్‌కు వచ్చానని.. కారును డ్రైవర్ జమీల్ నడిపాడని వివరించాడు. ఓ స్నేహితుడితో కలిసి అమ్నీషియా పబ్‌కు వచ్చిన బాలికను మొదట వక్ఫ్‌బోర్డు చైర్మన్ కుమారుడు పరిచయం చేసుకున్నాడని.. పొరుగు జిల్లాకు చెందిన కార్పొరేటర్ కుమారుడు ఆమెతో మాటలు కలిపాడని, తర్వాత తానూ అక్కడికి వెళ్లానని వివరించాడు. తానేంటో హోదా చెప్తూ.. కాసేపటికి ఆరుగురం ఆమె వద్దకు వెళ్లి మాట్లాడటం మొదలెట్టామని.. దీంతో విసుగు చెందిన బాలిక పబ్ నుంచి బయటికి వెళ్లడంతో వెనకే వెళ్లామని సాదుద్దీన్ వివరించాడు. పబ్ బయట ఎమ్మెల్యే కుమారుడు ఆమెతో మాటలు కలిపాడని.. తన హోదా, ఇతర అంశాలు చెప్తూ ట్రాప్ చేసి, ఇంటి వద్ద దింపుతానంటూ బెంజ్ కారులో ఎక్కించుకున్నాడని తెలిపాడు. బెంజ్ కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఆమెతో అసభ్య ప్రవర్తన మొదలుపెట్టినది ఎమ్మెల్యే కుమారుడేనని, తర్వాత ఒకరొకరుగా బెంజ్‌కారులో ఉన్న నలుగురూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారని సాదుద్దీన్ చెప్పాడు. ఆ సమయంలో తాను వెనుక ఉన్న ఇన్నోవాలో ఉన్నానని పేర్కొన్నాడు. బాలిక ఇల్లు బంజారాహిల్స్‌లోని కాన్సూ బేకరీ సమీపంలోనే ఉందని చెప్పిందని.. అటుగా వెళ్తూనే తమ కారును కాన్సూ బేకరీ పార్కింగ్‌లోకి తీసుకువెళ్లామని వివరించాడు. అక్కడ కార్పొరేటర్ కుమారుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలెట్టాడని తెలిపాడు. వాంగ్మూలాలను సరిచూస్తూ.. సాదుద్దీన్‌ను విచారిస్తున్న పోలీసులు అతడిని అరెస్టు చేసినప్పుడు ఇచ్చిన ఎనిమిది పేజీల వాంగ్మూలాన్ని.. తర్వాత పట్టుబడిన మైనర్లు ఇచ్చిన వాంగ్మూలాలను సరిపోలుస్తూ దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన రోజున వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫీడ్‌ను సాదుద్దీన్కు చూపిస్తూ కొన్ని అంశాలపై స్పష్టతకు వస్తున్నారు. కాన్సూ బేకరీ దగ్గర బాలిక ఇన్నోవాలోకి ఎక్కిన తర్వాత అప్పటివరకు ముందు సీట్లో ఉన్న సాదుద్దీన్ వెనుక సీట్లోకి మారాడని గుర్తించారు. అంతకన్నా ముందే బాలిక బెంజ్ కారులో ఉండగానే ఆమె సెల్‌ఫోన్, కళ్లజోడును ఎమ్మెల్యే కుమారుడు లాక్కున్నాడని.. అవి తిరిగి ఇవ్వాలంటే ఇన్నోవా కారులో ఎక్కాలని బెదిరించాడని సాదుద్దీన్ వెల్లడించాడు. బాధితురాలితో గుర్తింపు పరేడ్ కోసం ఈ కేసులో నిందితులుగా ఉన్న వారి నుంచి రక్త నమూనాల సేకరణ, బాధితురాలి ద్వారా టెస్ట్ ఐడెంటిఫికేషన్ (టీఐ) పరేడ్ నిర్వహణకు అనుమతి కోరుతూ పోలీసులు ఆయా కోర్టుల్లో పిటిషన్లు వేశారు. న్యాయమూర్తి సమక్షంలో జైలులో జరిగే టీఐ పెరేడ్, వాహనాలతోపాటు వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన నమూనాల విశ్లేషణ, డీఎన్ఏ పరీక్షలు వంటివి నేర నిరూపణలో కీలకం కానున్నాయి. ఘటన సమయంలో నిందితులు ధరించిన దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పగలు ఠాణాలో.. రాత్రికి హోమ్‌లో.. గ్యాంగ్ రేప్ కేసులో ఐదుగురు మైనర్లను నాలుగు రోజులపాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ జువైనల్ కోర్టు గురువారం నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి పోలీసులు వారిని విచారించనున్నారు. చట్టప్రకారం వారిని పగటిపూట ఠాణాలో విచారిస్తూ.. రాత్రివేళల్లో జువైనల్ హోమ్‌కే తరలించనున్నారు. ఇప్పటికే సాదుద్దీన్ పోలీసు కస్టడీలో ఉండటంతో శుక్రవారం నుంచి ఆరుగురినీ కలిపి విచారించాలని నిర్ణయించారు. ఇక ఢిల్లీ నిర్భయ కేసు విచారణను ప్రస్తావిస్తూ.. ఈ కేసులోనూ మైనర్లుగా ఉన్న వారిని మేజర్లుగా పరిగణిస్తూ ట్రయల్ నిర్వహించేందుకు పోలీసులు అనుమతి కోరనున్నారు. -
Hyderabad: హైదరాబాద్‌లో మరో దారుణం
సాక్షి, చిలకలగూడ (హైదరాబాద్): ఒకరు ఇన్స్టాగ్రామ్ ద్వారా మైనర్ బాలికకు వల వేశాడు.. మరొకరు ప్రేమ, పెళ్లి పేరిట మాయమాటలు చెప్పి నమ్మించాడు.. ఇద్దరూ వేర్వేరుగా అక్కాచెల్లెళ్లపై లైంగికదాడికి పాల్పడ్డారు. చివరికి బాలికల ఫిర్యాదుతో కటకటాల పాలయ్యారు. హైదరాబాద్‌లోని చిలకలగూడ ఠాణా పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలను గోపాలపురం ఏసీపీ సుధీర్, చిలకలగూడ సీఐ నరేశ్ మీడియాకు వెల్లడించారు. మెల్లగా వల వేసి.. ఏపీలోని కర్నూల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కుటుంబంతో హైదరాబాద్‌కు వలస వచ్చారు. కొంతకాలంగా బౌద్ధనగర్ డివిజన్ అంబర్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు మైనర్ కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్ద కుమార్తెకు కొద్దినెలల క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా అంబర్‌పేట లాల్‌బాగ్‌కు చెందిన మహ్మద్ నవాజ్ (21) పరిచయమయ్యాడు. చాటింగ్, ఫోన్లు చేస్తూ స్నేహం పెంచుకున్నాడు. కొద్దిరోజులుగా బాలికను లోబర్చుకుని లైంగికదాడికి పాల్పడటం మొదలుపెట్టాడు. ఇక అంబర్‌పేటకే చెందిన మహ్మద్ ఇంతియాజ్ అహ్మద్ (23) కొద్దికాలం క్రితం చిన్న కుమార్తెను పరిచయం చేసుకున్నాడు. మెల్లగా మాటలు కలిపి.. ప్రేమ, పెళ్లి పేరుతో వల వేశాడు. కొద్ది నెలలుగా ఆమెపై లైంగికదాడికి పాల్పడుతూ వచ్చాడు. ఇటీవలే బాలికల తల్లితండ్రులకు ఈ విషయం తెలిసింది. తల్లిదండ్రులు ధైర్యం చెప్పడంతో బాలికలు ఈ నెల 8న వేర్వేరుగా చిలకలగూడ ఠాణాలో ఫిర్యాదు చేశారు. దీనితో పోలీసులు ఐపీసీలోని అత్యాచారం సెక్షన్లు, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇద్దరూ పాత నేరస్తులే.. ఇద్దరు మైనర్లపై లైంగికదాడికి పాల్పడిన నిందితులు పాత నేరస్తులని పోలీసులు తెలిపారు. ఆటో నడిపే మహ్మద్ నవాజ్‌పై మలక్‌పేట, అంబర్‌పేట ఠాణాల్లో ఆరు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని.. పీడీ యాక్టు కింద అరెస్టై జైలుకు వెళ్లొచ్చాడని వెల్లడించారు. ఇక వృత్తి రీత్యా ప్లంబర్ అయిన మరో నిందితుడు మహ్మద్ ఇంతియాజ్ అహ్మద్‌పై చిక్కడపల్లి, బేగంపేట, నల్లకుంట, చిలకలగూడ, ముషీరాబాద్, పంజాగుట్ట, కాచిగూడ ఠాణాల పరిధిలో 23 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని.. అతనూ పీడీయాక్టు కింద జైలుకు వెళ్లొచ్చాడని వివరించారు. చదవండి: (Amnesia Pub: జూబ్లీహిల్స్ అత్యాచార కేసులో పోలీసుల సంచలన నిర్ణయం) -
వీడియోలు బయటకు, రఘునందన్‌పై కేసు.. ఎమ్మెల్యే రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించి తనపై కేసులు పెడితే లీగల్‌గా ఎదుర్కొంటానని బీజేపీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్ రావు తెలిపారు. నోటీసులు ఇచ్చినా, పోలీసులు అరెస్ట్ చేసేం దుకు వచ్చినా సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. పార్టీ కార్యాల యంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. న్యాయం జరిగే దాకా బాధితురాలి పక్షాన పోరాడతానని స్పష్టం చేశారు. ఈ కేసులో కాంగ్రెస్ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారో అర్థం కావడం లేద న్నారు. అమ్నీషియా పబ్ మైనర్ అమ్మాయి కేసులో కాంగ్రెస్ నేతల పిల్లలు కూడా ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేశారు. అత్యాచార ఘటనలో నిందితులకు శిక్ష పడే వరకు బండి సంజయ్ నేతృత్వంలో పోరాడుతామని పేర్కొన్నారు. సంబంధిత వార్త: Amnesia Pub Case: ఎమ్మెల్యే రఘునందర్‌రావుపై కేసు నమోదు -
ఇన్‌స్టాలో పరిచయం.. మద్యం తాగించి అఘాయిత్యం
సాక్షి, హైదరాబాద్/రసూల్‌పుర: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన బాలికతో ప్రేమాయణం సాగించిన ఓ వ్యక్తి లాడ్జికి పిలిచి, మద్యం తాగించి అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా తన ఇద్దరు స్నేహి తులతోనూ అఘాయిత్యం చేయిం చాడు. ఈ వీడియోలు తన వద్ద ఉన్నాయని భయపెట్టి మళ్లీ ఓయో రూమ్‌కు రప్పించి దారుణానికి పాల్పడ్డాడు. మానసిక వైద్యుడి కౌన్సెలింగ్ ద్వారా విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు కార్ఖానా పోలీ సులకు ఫిర్యాదు చేశారు. సామూహిక అత్యాచారం కేసు నమోదు చేసిన అధికా రులు నిందితులపై చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో అత్యాచారం జరిగిన హోటల్, లాడ్జి యజమానులనూ నిందితులుగా చేర్చారు. ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో వలవేసి... కార్ఖానా పోలీస్‌స్టేషన్ పరిధిలో నివసించే పదో తరగతి విద్యార్థిని(బాలిక)కి సైదా బాద్‌కు చెందిన పదో తరగతి విద్యార్థితో (మైనర్) కొన్నాళ్ల క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైంది. కొన్ని రోజులు ఆమెతో చాటింగ్ చేసిన ఇతను ప్రేమ పేరుతో బాలికను ముగ్గులోకి దింపాడు. ఈ క్రమంలో మార్చి నెలల్లో కలుద్దామంటూ ప్రతిపాదించాడు. ఇతడి మాటలు నమ్మిన బాలిక అంగీకరించింది. కొత్తపేటలోని సింధూర హోటల్లో రూమ్ బుక్ చేసిన బాలుడు.. ఆమెను అందులోకి తీసుకువెళ్లాడు. బాలికతో మద్యం తాగించి మత్తులో ఉండగా అత్యాచారం చేశాడు. తర్వాత తన స్నేహితుడైన వనస్థలిపురానికి ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థితో (మైనర్) పాటు డిగ్రీ చదువుతున్న రిషిత్‌ను (19) పిలిపించాడు. స్పృహలేని స్థితిలో ఉన్న బాలికపై వీరిద్దరూ సైతం అత్యాచారం చేశారు. ఆపై బాలికను ఆమె ఇంటి సమీపంలో దింపి వచ్చారు. వీడియోలు ఉన్నాయంటూ మరోసారి రెండు రోజుల తర్వాత టెన్త్ విద్యార్థి బాలికకు మళ్లీ ఫోన్ చేశాడు. ఆ రోజు జరిగినదంతా తన స్నేహితులు వీడియో రికార్డు చేశారని చెప్పి భయపెట్టాడు. అవి డిలీట్ చేయడానికి ఇద్దరం కలిసి మాట్లాడ దామని చెప్పి ఎల్బీనగర్కు రప్పించాడు. అక్కడి ఓయో రాజ్‌స్టే లాడ్డిలో రూమ్ బుక్ చేసి బాలికను తీసుకువెళ్లాడు. అక్కడ మరో సారి ఆమెకు మద్యం తాగించి అత్యాచారం చేశాడు. మరో ఇద్దరు స్నేహితులైన బీఈఎల్‌కు చెందిన బీఫార్మసీ విద్యార్థి సాయి చైతన్య (20), బీబీఏ విద్యార్థి శౌర్యలను (20) అక్కడకు పిలిచాడు. మద్యం మత్తులో ఉన్న బాలికపై వీళ్లూ అత్యాచారానికి పాల్పడ్డారు. మరుసటి రోజు తెల్లవారుజామున బాలికను ఆమె ఇంటి సమీపంలో వదిలి వచ్చారు. ఈ ఉదంతం మార్చి 3న చోటు చేసుకుంది. మానసిక వైద్యుడి కౌన్సెలింగ్‌తో... రెండుసార్లు సామూహిక అత్యాచారానికి గురైన బాలిక తీవ్ర షాక్‌కు లోనైంది. అర్ధరాత్రి దాటే వరకు బయట ఉండి వచ్చిన ఆమెను తల్లిదండ్రులు మందలించడంతో ముభావంగా ఉంటూ తరచూ భయ పడుతోంది. బాలికలో వచ్చిన మార్పుల్ని గమనించిన తల్లిదండ్రులు ఓ మానసిక వైద్యుడి వద్దకు తీసుకువెళ్లారు. కొన్ని రోజుల పాటు ఆయన కౌన్సెలింగ్ చేయడంతో నోరు విప్పిన బాలిక తనపై జరిగిన అఘాయి త్యాలను బయటపెట్టింది. బాలిక తండ్రి గత నెల 30న కార్ఖానా ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నిందితులుగా ఆ ఇద్దరూ సైతం... ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఇన్స్పెక్టర్ బి.రవీందర్ నేతృత్వంలోని బృందం ఇద్దరు మైనర్ల సహా ముగ్గురు నిందితులను ఈ నెల 1న పట్టుకున్నారు. మరుసటి రోజు మేజర్లను జైలుకు, మైనర్లను జువెనైల్ హోమ్‌కు తరలించారు. బాలికను తీసుకెళ్ల డానికి వినియోగించిన రిషిత్ కారును స్వాధీనం చేసుకున్నారు. అలాగే సింధూర హోటల్ యజమాని రాహుల్, ఓయో రాజ్ స్టే యజమాని హరీశ్‌ను కూడా నిందితు లుగా చేర్చారు. ఈ అత్యాచారాలను పరో క్షంగా ప్రేరేపించినట్లు వారిపై ఆరోపణలు నమోదు చేశామని ఇన్స్పెక్టర్ తెలిపారు. చదవండి: బంధువుతో వివాహేతర సంబంధం.. దీని గురించి మాట్లాడేందుకు భర్త వెళ్లి.. -
Amnesia Pub Case: ఎమ్మెల్యే రఘునందర్‌రావుపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఫోటోలు, వీడియోలు బహిర్గతం చేయడంపై ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 228(a) సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. చదవండి: (అన్యాయం జరిగితే ఆత్మహత్యే.. ఎంపీ కేశినేని నానిని హెచ్చరించిన నాగయ్య) -
పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి.. ఇంటికి తీసుకెళ్లి
సాక్షి, హైదరాబాద్: మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి లైంగిక దాడిచేసిన ఓ యువకుడిని కాలాపత్తర్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ సుదర్శన్ వివరాల ప్రకారం.. కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక(16) చార్మినార్‌లోని ఓ వస్త్ర దుకాణంలో సేల్స్ గర్ల్. లంగర్‌హౌజ్ మొఘల్‌నగర్ రింగ్ రోడ్డు ప్రాంతానికి చెందిన మహ్మద్ సుఫియాన్(21) అక్కడే ఈవెంట్ మేనేజర్. గతనెల 30న బాలికను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి లంగర్‌హౌజ్‌లోని తన ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడిచేశాడు. అనంతరం 31వ తేదీన వస్త్ర దుకాణం వద్ద బాలికను వదిలిపెట్టి ఫోన్ నంబర్ ఇచ్చాడు. ఆదివారం మధ్యాహ్నం బాలికకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆరా తీశారు. దీంతో బాలిక లైంగికదాడి విషయాన్ని చెప్పింది. దీంతో తల్లి కాలాపత్తర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కిడ్నాప్, లైంగికదాడి కేసులను నమోదు చేసి మహ్మద్ సుఫియాన్‌ను అరెస్ట్ చేశారు. చదవండి: ఆటో డ్రైవర్ నకిలీ పోలీస్‌గా.. అత్యాచార, చోరీ కేసులున్నాయంటూ -
మరో దారుణం.. ఇంటి దగ్గర దింపేస్తామంటూ 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడి
చార్మినార్/గౌలిపుర: రొమేనియా బాలిక కేసుపై తీవ్ర చర్చ జరుగుతుండగానే.. హైదరాబాద్‌లో మరో బాలికపై కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచి్చంది. రోడ్డు పక్కన వెళ్తున్న 12 ఏళ్ల బాలికను ఇంటిదగ్గర దింపుతామంటూ ట్రాప్ చేసిన ఓ క్యాబ్ డ్రైవర్, అతడి స్నేహితుడు కలిసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ కేసులో నిందితులు కిషన్‌బాగ్ ప్రాంతానికి చెందిన క్యాబ్ డ్రైవర్ షేక్ కలీం అలీ, మహ్మద్ లుక్మన్ అహ్మద్ యజ్దానీలను శుక్రవారమే అరెస్టు చేసినా.. జూబ్లీహిల్స్ కేసుపై ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో విషయాన్ని గోప్యంగా ఉంచారు. కానీ ఈ విషయం మీడియాకు లీక్ కావడంతో ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. తల్లిదండ్రులను చూద్దామని వెళ్తుండగా.. హైదరాబాద్‌లో పహాడీ షరీఫ్ సమీపంలోని షాహిన్‌నగర్ ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల బాలిక.. సుల్తాన్‌షాహీలోని తన మేనమామ ఇంట్లో ఉంటోంది. తల్లిదండ్రులను చూడాలనిపించడంతో గత మంగళవారం (మే 31న) సాయంత్రం 6 గంటలకు సుల్తాన్‌షాహీ నుంచి కాలినడకన బయలుదేరింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో పహాడీ షరీఫ్ కమాన్ వద్దకు చేరుకుంది. ఆ సమయంలో అటుగా కారులో వెళ్తున్న క్యాబ్‌డ్రైవర్ షేక్ కలీం అలీ ఈ బాలికను గమనించి ఆగాడు. ఎక్కడికి వెళ్తున్నావంటూ మాట కలిపాడు. షాహిన్‌నగర్‌లో ఉన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలని, డబ్బులు లేకపోవడంతో నడుచుకుంటూ వెళ్తున్నానని ఆమె చెప్పింది. దీనిని ఆసరాగా తీసుకున్న కలీం.. డబ్బులు లేకపోయినా ఫర్వాలేదు, ఇంటివద్ద దింపేస్తానంటూ బాలికను తన క్యాబ్ ఎక్కించుకున్నాడు. ముర్గీచౌక్ ప్రాంతంలో పని ఉందని, అది చూసుకున్నాక దింపేస్తానని చెప్పాడు. రాత్రి 10గంటల దాకా బాలికను వివిధ ప్రాంతాల్లో తిప్పి.. తన స్నేహితుడైన మహ్మద్ లుక్మన్ అహ్మద్ యజ్దానీకి ఫోన్ చేశాడు. యజ్దానీ ఇంటికి తీసుకెళ్లి.. పాతబస్తీలోని డెక్కన్ ప్యాలెస్ వద్దకు వచి్చన యజ్దానీ వీరి కారు ఎక్కాడు. ఇద్దరూ కలిసి బాలికను కుందుర్గ్‌లోని యజ్దానీ ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడే బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తీవ్రంగా ఏడుస్తుండటంతో భయపడిన కలీం.. అర్ధరాత్రి తర్వాత ఆమెను కారులో సుల్తాన్‌షాహీ వద్ద విడిచిపెట్టి వెళ్లిపోయాడు. మరోవైపు రాత్రి 12.15 గంటల సమయంలో బాలిక బంధువులు ఆమె కనిపించడం లేదంటూ మొఘల్‌పుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. గస్తీ సిబ్బందికి తారసపడటంతో.. గస్తీ బృందం బుధవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో సుల్తాన్‌షాహీ వద్ద బాలికను గుర్తించి ఠాణాకు తీసుకువచ్చింది. తర్వాత బాలికను భరోసా కేంద్రానికి తరలించారు. అక్కడ వాంగ్మూలం నమోదు చేసిన అధికారులు.. సామూహిక అత్యాచారం జరిగిన విషయం గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసులో అత్యాచారం సెక్షన్లను చేర్చి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. కలీం ఫోన్ నంబర్ ఆధారంగా.. బాలికను క్యాబ్‌లో తీసుకువెళ్తున్న సమయంలోనే కలీం ఆమెకు తన ఫోన్ నంబర్ చెప్పాడు. బాలిక ఆ నంబర్ చెప్పడంతో పోలీసులు కాల్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీనితో సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు, సాంకేతిక ఆధారాలను బట్టి దర్యాప్తు చేసిన పోలీసులు శుక్రవారం నిందితులను పట్టుకుని కోర్టులో హాజరుపర్చారు. విషయం బయటికి రాకుండా.. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు కుందుర్గ్‌లోని యజ్దానీ ఇంటికి బాలికను తీసుకువెళ్లి ఆధారాలు సేకరించారు. భరోసా కేంద్రంలో ఆమె వాంగ్మూలం నమోదు చేయడంతోపాటు వైద్య పరీక్షలు చేయించారు. రొమేనియా బాలికపై అత్యాచారం ఘటనపై హడావుడి జరుగుతుండటంతో.. ఈ గ్యాంగ్‌రేప్ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. ఆదివారం ఈ విషయం మీడియాకు లీక్ కావడంతో పత్రికా ప్రకటన విడుదల చేశారు. -
తెలంగాణలో మహిళలకు రక్షణ కరువైంది
తల్లాడ: రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు రక్షణ కరువైం దని.. హైదరాబాద్‌లో బాలి కపై అత్యాచారం ఘటనే ఇం దుకు ఉదాహరణ అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల అన్నారు. ఆమె చేస్తున్న ప్రజా ప్రస్థానం పాదయాత్ర శనివా రం ఖమ్మం జిల్లా తల్లాడ, ఏన్కూరు మండలాల్లో కొన సాగింది. తల్లాడ మండలం అన్నారుగూడెంలో ఆమె పాదయాత్ర 1,100 కిలోమీటర్లకు చేరుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో చేపట్టిన రైతు గోస దీక్షలో మాట్లాడారు. బాలికపై అత్యాచారం కేసులో హోంమంత్రి మనవడు, వక్ఫ్‌బోర్డు చైర్మన్ కుమారుడు, ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు ఉన్నారని తెలియడంతోనే వివరాలు బయటకు రాకుండా చూశారని ఆరోపించారు. ఘటన జరిగాక కొద్ది రోజులకు కేటీఆర్.. దోషులను శిక్షించాలని ట్వీట్ చేయడంతో ప్రభుత్వ పెద్దలకు మహిళలపై ఎంత గౌరవం ఉందో అర్థమవుతోందన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
సీబీఐ విచారణ చేయాల్సిందే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో బాలికపై అత్యాచార ఘటన దారుణమని, రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పా యని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని, పూర్తిస్థాయి విచారణను సీబీఐకి అప్పగిం చాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ అను బంధ ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిం చేందుకు ప్రయత్నించారు. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు నిష్పక్షపాతంగా లేదని మండిపడ్డారు. బాధితురాలికి న్యాయం జరిగేవరకు పోరాడుతామని ప్రకటించారు. సర్కారు తీరుతో డ్రగ్, పబ్ కల్చర్ టీఆర్ఎస్కు భజన చేసే వారికి పబ్‌ల అను మతి ఇస్తున్నారని.. పబ్ లైసెన్సులను ని యంత్రించకపోవడం వల్లనే రాష్ట్రంలో దారు ణ ఘటనలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎమ్మెల్యే డి.శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన మీడియా తో మాట్లాడారు. పబ్‌లోకి మైనర్లను ఎలా అనుమతించారని నిలదీశారు. డ్రగ్స్‌ను నియంత్రించలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ఈ ఘటనకు బాధ్యత వహించాలన్నారు. ‘మద్యాన్ని ఆదాయవనరుగా ప్రభుత్వం చూడటం వల్లనే రాష్ట్రంలో నేరాల రేటు పెరుగుతోంది. బాలిక తల్లిదండ్రులు ధైర్యం గా ఫిర్యాదు చేసినా.. పోలీసుశాఖ ఎందుకు భయపడుతుందో అర్థం కావడం లేదు’ అని పేర్కొన్నారు. కాగా.. నేరాల నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని శ్రీధర్‌బాబు మండిపడ్డారు. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డవారిని కఠినంగా శిక్షించడం ద్వారా ప్రజలకు ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం కలిగేలా చూడాలని పేర్కొన్నారు. డీజీపీ కార్యాలయ ముట్టడికి యత్నం రొమేనియా బాలికపై రేప్ ఘటనను నిర సిస్తూ, దోషులను కఠినంగా శిక్షించాలంటూ కాంగ్రెస్ అనుబంధ సంఘాలు ఎన్ఎస్ యూఐ, యూత్, మహిళా కాంగ్రెస్‌ల ఆధ్వ ర్యంలో శనివారం డీజీపీ కార్యాలయ ముట్ట డి చేపట్టారు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్య క్షుడు బల్మూరి వెంకట్, హైదరాబాద్ యువ జన కాంగ్రెస్ కమిటీ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుల నేతృత్వంలో నేతలు, కార్యకర్తలు డీజీపీ కార్యాలయం వైపు దూసుకువచ్చారు. పోలీసులు ఆందోళ నకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు అనంతరం వెంకట్, సునీతారావు మీడియా తో మాట్లాడారు. బాలికపై అత్యాచారం విష యంలో రాజకీయ డ్రామా నడుస్తోందని వెంకట్ మండిపడ్డారు. రాష్ట్రంలో షీటీమ్స్ ఏం చేస్తున్నాయని సునీతారావు ప్రశ్నించా రు. పోలీసులకు గాజులు, చీరలు పంపిస్తా మని, వాటిని వేసుకుని ఇంట్లో కూర్చోవాల న్నారు. మరోవైపు యూత్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు శనివారం రాత్రి అమ్నీషియా పబ్ వద్ద ధర్నాకు దిగారు. పబ్‌ను సీజ్ చేయాలంటూ ఆందోళన చేశారు. -
ఎమ్మెల్యే తనయుడిని తప్పించారా..?
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: ‘ఆ పిల్ల చూడు మస్తుగ ఉంది’ అంటూ ఓ బాలికను కామెంట్ చేసిన వెస్ట్‌మారేడ్‌పల్లికి చెందిన కె.వెంకట్రామిరెడ్డిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. నాంపల్లి చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు 2019 జూలై 25న అతడికి 14 నెలల కఠిన కారాగార శిక్ష విధించింది. అలాంటిది.. రొమేనియా బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన హైదరాబాద్ నగరానికి చెందిన ఎమ్మెల్యే కుమారుడిని మాత్రం పోలీసులు వదిలేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జూబ్లీహిల్స్‌లో ఉన్న అమ్నీషియా పబ్ నుంచి బెంజ్ కారు (టీఎస్ 09 ఎఫ్ఎల్ 6460)లో రొమేనియన్ బాలికను ఎక్కించుకుని.. బంజారాహిల్స్‌లోని కాన్‌సీయూ బేకరీకి తీసుకెళ్తున్న సమయంలోనే సదరు ఎమ్మెల్యే కుమారుడు ఆమెతో అభ్యంతరకరంగా ప్రవర్తించినట్టుగా ఉన్న వీడియోలు శనివారం వెలుగుచూశాయి. పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలు, ఇతర అంశాల ద్వారా ఈ విషయాన్ని గుర్తించినా.. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో అతడిని తప్పించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు సామూహిక అత్యాచారం కేసులో మిగతా ముగ్గురినీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. రేప్ జరిగిన ఇన్నోవా కారును గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. బెంజ్ కారులో ఆమెతో పాటు నలుగురు! బంజారాహిల్స్‌లో నివాసం ఉండే రొమేనియా దేశానికి చెందిన బాలికకు అమ్నీషియా పబ్‌లోనే సాదుద్దీన్ మాలిక్, ఉమేర్‌ఖాన్, వక్ఫ్ బోర్డు చైర్మన్ మసీవుల్లాఖాన్ కుమారుడు సహా ముగ్గురు మైనర్లతో పరిచయమైంది. అక్కడే వీరితోపాటు సదరు ఎమ్మెల్యే కుమారుడు ఉన్నట్టు సమాచారం. పబ్‌లో పార్టీని నాన్ ఆల్కహాలిక్ లంచ్‌గా బుక్ చేసుకున్నప్పటికీ వీరు మాత్రం తమతో తెచ్చుకున్న మద్యం తాగినట్టు తెలుస్తోంది. వారు బాలికతో పబ్ బయటికి వచ్చి కొద్దిసేపు మాట్లాడుకున్నారు. తర్వాత నలుగురు కలిసి తమ బెంజ్ కారులో బాలికను ఎక్కించుకుని కాన్‌సీయూ బేకరీ వద్దకు తీసుకొచ్చారు. మరో ఇద్దరు ఇన్నోవా కారులో అనుసరించారు. ‘అసలు కేసు’లో అతడూ నిందితుడే.. రెండు వాహనాలు బేకరీ వద్దకు చేరుకునే లోపు మార్గమధ్యలోనే వెనుక సీటులో కూర్చున్న ఎమ్మెల్యే కుమారుడు సదరు బాలికతో అభ్యంతరకరంగా ప్రవర్తించినట్టుగా ఉన్న వీడియోలు బయటికి వచ్చాయి. గత నెల 31న బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన అసలు కేసు కూడా ఇలా అభ్యంతరకర, అసభ్య ప్రవర్తనకు సంబంధించినదే. పోక్సో చట్టం కింద నమోదైన ఆ కేసులో ఎమ్మెల్యే కుమారుడూ నిందితుడే. తర్వాత వెలుగులోకి వచ్చిన అంశాలతో కేసులో సామూహిక అత్యాచారం సెక్షన్‌ను జోడించారు. ఇక మిగతా నిందితులు బేకరీ వద్ద నుంచి బాలికను ఇన్నోవా కారులో తీసుకువెళ్తున్న సమయంలో ఎమ్మెల్యే కుమారుడు కూడా వారితో వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. కానీ ఓ ఫోన్‌కాల్ రావడంతో బెంజ్ కారులో అక్కడి నుంచి వెళ్లిపోయాడని.. ఈ లెక్కన అతడికీ అత్యాచారం చేయాలనే ఉద్దేశం ఉందనేది స్పష్టమవుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీసీ టీవీ ఫుటేజీల్లో అతడి కదలికలు కనిపించినా పోలీసులు మాత్రం వదిలిపెట్టేశారన్న ప్రచారం జరుగుతోంది. తప్పించుకునేందుకు అతి తెలివి! కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురిలో సాదుద్దీన్‌తోపాటు వక్ఫ్‌బోర్డు చైర్మన్ కుమారుడిని శుక్రవారమే అదుపులోకి తీసుకున్నారు. శనివారం మరో మైనర్‌ను పట్టుకున్నారు. వారిని న్యాయస్థానంలో హాజరుపర్చి.. సాదుద్దీన్‌ను జైలుకు, మైనర్లను జువైనల్ హోమ్‌కు తరలించారు. అయితే పరారీలో ఉన్న ఉమేర్, మరో మైనర్ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి అతి తెలివి ప్రదర్శించారు. ఓ వ్యక్తికి తమ సెల్ఫోన్లు ఇచ్చి గోవా పంపారు. టవర్ లోకేషన్ ద్వారా తాము గోవాలో ఉన్నట్టు భావించి పోలీసులు అక్కడికి వెళ్లి వెతుకుతారని.. ఇక్కడ తాము తప్పించుకోవచ్చని భావించారు. కానీ సాంకేతిక ఆధారాల మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు తమను తప్పుదోవ పట్టిస్తున్న విషయాన్ని గుర్తించారు. ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా గాలించి వారిని తమిళనాడు, కర్ణాటకల్లో పట్టుకుని.. హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. కార్పొరేట్ స్కూల్ విద్యార్థుల పార్టీ! ఇక అమ్నీషియా పబ్‌లో జరిగిన పార్టీ ఓ కార్పొరేట్ స్కూల్‌కు సంబంధించిన ఇంటర్ (10 ప్లస్ టూ) విద్యార్థుల ఫేర్వెల్ పార్టీగా తెలుస్తోంది. దీనికోసం నిసాన్, ఆదిత్య, ఇషాన్ అనే విద్యార్థులు రూ.2 లక్షలు చెల్లించి పబ్‌ను బుక్ చేసినట్టు సమాచారం. వారి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. విద్యార్థులు పార్టీ కోసం పబ్‌ను ఎంచుకోవడం, దానికి స్కూల్ యాజమాన్యం అంగీకరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కారులో ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించి.. ఈ నేరంలో నిందితులు రెండు కార్లు వినియోగించారు. అమ్నీషియా పబ్ నుంచి బేకరీ వరకు బాలికను బెంజ్ కారులో తీసుకువచ్చారు. అక్కడ నుంచి ఇన్నోవా కారులో తీసుకువెళ్లి పెద్దమ్మ గుడి చుట్టుపక్కల రెండు ప్రాంతాల్లో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకచోట సాదుద్దీన్, మరో మైనర్.. రెండో ప్రాంతంలో ఉమేర్, మిగతా ఇద్దరు మైనర్లు ఆమెపై అత్యాచారం చేశారు. ఎమ్మెల్యే కుమారుడు వినియోగించిన బెంజ్ కారు వారి సమీప బంధువు పేరిట ఉంది. సీసీ ఫుటేజీల ద్వారా ఆ కారును గుర్తించిన పోలీసులు.. మూడు రోజుల క్రితమే స్టేషన్‌ను రప్పించి సీజ్ చేశారు. ఇక ఇన్నోవా కారును వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కొన్నారని.. ఇంకా రిజిస్ట్రేషన్ నంబర్ రాని ఆ కారుపై ప్రభుత్వ వాహనం అని రాసి ఉందని తెలిసింది. ఈ కేసులో కీలకమైన ఈ కారును నిందితులు జడ్చర్ల సమీపంలో దాచారు. పోలీసులు శనివారం ఆ కారును రికవరీ చేసి.. ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో పలు నమూనాలు, ఆధారాలు సేకరించారు. వీటితోపాటు నిందితుల నుంచి తీసుకున్న శాంపిల్స్‌ను డీఎన్ఏ పరీక్షలకు పంపనున్నారు. పోలీసులు కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌ను, దానిపై రాసి ఉన్న ప్రభుత్వ వాహనం అనే స్టిక్కర్‌ను తొలగించినట్టు తెలిసింది. వీడియోలు బయటికి రావడంతో.. రొమేనియన్ బాలికపై అత్యాచారం ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పటికే దర్యాప్తులో పోలీసుల తీరుపై అనేక విమర్శలు వచ్చాయి. మరోవైపు శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు.. ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను విడుదల చేశారు. దీనితో పోలీసులు అవాక్కయ్యారు. నిందితుల ఫోన్లలో ఉన్న వాటిని పోలీసులు ఎవరైనా లీక్ చేశారా? లేక నిందితులే తమ స్నేహితులు లేదా వ్యక్తిగత సోషల్ మీడియా గ్రూపుల్లో పోస్టు చేశారా? అనేది ఆరా తీస్తున్నారు. ఈ పరిణామంతో శనివారం మధ్యాహ్నం నిఘా విభాగం అధికారులు జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్‌కు చేరుకుని పోలీసులతో సమావేశమయ్యారు. -
బాలికపై సామూహిక అత్యాచారం, ఆనంద్ మహీంద్రా ఆగ్రహం!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో బాలికపై ‘పలుకుబడి’ ఉన్న కుటుంబాల యువకులు అత్యాచారానికి పాల్పడ్డారన్న వార్తలపై మహీంద్రా గ్రూపు చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా స్పందించారు. ‘‘ఆ యువకులు ఎవరో నాకు తెలియదు. కానీ వార్తల్లో వారిని ఉద్దేశించిన ప్రస్తావన సరికాదని నా అభిప్రాయం. ఆ యువకులు ‘పలుకుబడి’ ఉన్న కుటుంబాల వారు కాదు.. సంస్కృతి, మానవతా విలువలు లేని, సరైన పెంపకం తెలియని ‘దిగువ స్థాయి’ కుటుంబాల వారు అనడం సరైనది. బాలికకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా..’’ అని ట్విట్టర్లో ట్వీట్ చేశారు. I don’t know these boys but may I suggest that the headline is inappropriate? These boys are not from ‘influential’ families but from ‘poor’ families. Families that are ‘poor’ in culture, upbringing & human values. May justice be delivered. https://t.co/Z22kok8cp1 — anand mahindra (@anandmahindra) June 3, 2022 -
బాలికపై సామూహిక అత్యాచారం
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: రాష్ట్ర రాజధాని నడిబొడ్డున కారులో ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. పబ్ నుంచి ఇంట్లో దింపేస్తామంటూ కారు ఎక్కించుకున్న ఐదుగురు దుండగులు.. నిర్మానుష్యమైన గల్లీల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆందోళనకు లోనైన బాలిక ముభావంగా ఉండటం చూసి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం.. పోలీసులు లోతుగా ఆరా తీయడంతో ఈ దారుణం బయటపడింది. నిందితుల్లో రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ మసీవుల్లాఖాన్ కుమారుడు, మరో ఇద్దరు మైనర్లుకాగా.. పుప్పాలగూడకు చెందిన సాదుద్దీన్ మాలిక్ (18), బంజారాహిల్స్‌కు చెందిన ఉమేర్‌ఖాన్ ఉన్నారు. వీరిలో సాదుద్దీన్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. మసీవుల్లాఖాన్ కుమారుడి ఆచూకీ గుర్తించారు. అతడు మైనర్ కావడంతో శనివారం ఉదయం తదుపరి చర్యలు తీసుకోనున్నారు. అప్పటివరకు అతడిపై ప్రత్యేక బృందంతో నిఘా వేసి ఉంచారు. ఇక ఉమేర్ ఖాన్, మరో ఇద్దరు మైనర్ల కోసం గాలిస్తున్నారు. వీరిలో సంగారెడ్డికి చెందిన ఓ కార్పోరేటర్ కుమారుడు కూడా ఉన్నట్టు సమాచారం. ఏం జరిగింది? మే 28న కొందరు విద్యార్థులు జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్‌లో పార్టీ చేసుకున్నారు. కొందరు స్నేహితులూ ఆ పార్టీకి వచ్చారు. ఈ క్రమంలోనే తన స్నేహితుడితో కలిసి బాలిక పబ్‌కు వెళ్లింది. పబ్‌లో ఐదుగురు వ్యక్తులు ఆ బాలికతో మాటలు కలిపారు. ఆమెపై అఘాయిత్యానికి ప్లాన్ వేసుకున్నారు. ఇంటి దగ్గర దింపుతా మంటూ కారు ఎక్కించుకున్నారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి ప్రాంతంలోని గల్లీల్లోకి తీసుకెళ్లి.. ఒకరి తర్వాత ఒకరుగా అత్యాచారానికి పాల్పడ్డారు. తిరిగి పబ్ వద్ద వదిలేసి వెళ్లారు. ఇంటికి వెళ్లిన బాలిక ముభావంగా ఉండటంతో తల్లిదండ్రులు నిలదీశారు. తనను కొందరు వేధించారని చెప్పడంతో 31న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట వేధింపుల కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలికను ‘భరోసా’ కేంద్రానికి తీసుకెళ్లారు. మహిళా అధికారులు, నిపుణులు సేకరించిన వాంగ్మూలం, వైద్య పరీక్షల్లో ఆమెపై అత్యాచారం జరిగినట్టుగా తేలింది. దీంతో రేప్ సెక్షన్లను నమోదు చేసిన పోలీసులు.. నిందితుల్లో ఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లుగా గుర్తించారు. ఒకరిని అరెస్టు చేసి మరొకరిపై నిఘా పెట్టారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. కాలేజీ పార్టీకని వెళ్లి.. బంజారాహిల్స్‌లో నివాసముండే రొమేనియా దేశానికి చెందిన బాలిక (17) ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న హాదీ అనే యువకుడితో బాలిక కుటుంబానికి పరిచయం ఉంది. అతడు చదువుకుంటున్న ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని అమ్నీషియా ఇన్సోమియా పబ్‌లో ఫ్రెషర్స్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. దానికి తనతోపాటు రమ్మని హాదీ బాలికను ఆహ్వానించాడు. గత నెల 28న మధ్యాహ్నం 1.30 గంటలకు హాదీతోపాటు సూరజ్ అనే స్నేహితుడితో కలిసి బాలిక అమ్నీషియా పబ్‌కు వెళ్లింది. ఇది నాన్ ఆల్కహాలిక్, నాన్ స్మోకింగ్ పార్టీగా విద్యార్థులు ఇన్‌స్ట్రాగామ్‌లో ప్రచారం చేసుకున్నారు. మొత్తం 150 మంది వరకు వస్తారంటూ కాలేజీ నుంచి లెటర్ తీసుకువచ్చినప్పటికీ 182 మంది వచ్చారు. వీరిలో సదరు కాలేజీ విద్యార్థుల స్నేహితులు కూడా ఉన్నారు. రొమేనియన్ బాలిక స్నేహితులతో కలిసి సాయంత్రం 5.30 గంటల దాకా పబ్‌లో గడిపింది. ఈ సమయంలో ఆమెకు సాదుద్దీన్, ఉమేర్‌ఖాన్, మిగతా ముగ్గురు మైనర్లు (మసీవుల్లాఖాన్ కుమారుడు సహా)తో పరిచయమైంది. అయితే ఈ ఐదుగురూ పబ్‌కు తమ వెంట తెచ్చుకున్న మద్యం తాగినట్టు సమాచారం. పార్టీ ముగిశాక హాదీ బిల్లు చెల్లించే పనిలో ఉండగా.. సాదుద్దీన్, ఉమేర్, మిగతా ముగ్గురు తాము ఇంటివద్ద దింపుతామంటూ ఆ బాలికను బయటికి తీసుకువచ్చారు. అప్పటికే ఆ బాలికపై అఘాయిత్యానికి పథకం వేసుకున్నారు. పథకం ప్రకారం కారులో ఎక్కించుకుని.. పబ్ బయట కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత ముగ్గురు ఎరుపు రంగు బెంజ్ కారులో బాలికను ఎక్కించుకుని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని కాన్‌సీయూ బేకరీకి తీసుకొచ్చారు. మిగతా ఇద్దరు ఇన్నోవా కారులో వారిని అనుసరించారు. అందరూ బేకరీలో దాదాపు 20 నిమిషాలపాటు ఉన్నారు. తర్వాత బెంజ్ కారును అక్కడే వదిలేశారు. ఐదుగురూ ఇన్నోవా కారులో బాలికను ఎక్కించుకున్నారు. బాలికను ఇంటివద్ద దింపుతామంటూ.. పెద్దమ్మ గుడి సమీపంలోని గల్లీల్లో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. కారు అద్దాలన్నీ మూసేసి.. ఒకరి తర్వాత ఒకరుగా కారులోనే అత్యాచారానికి పాల్పడ్డారు. దాదాపు గంటసేపటి తర్వాత ఆమెను తీసుకుని బయలుదేరారు. రాత్రి 7.30 గంటల సమయంలో అమ్నీషియా పబ్ వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఆ సమయంలో పబ్‌లోకి వెళ్లిన బాలిక.. తన జాకెట్ మర్చిపోయానంటూ సెక్యూరిటీ సిబ్బందికి చెప్పి తీసుకువెళ్లింది. అయితే.. ఇంటికి వెళ్లిన బాలిక ఆందోళనతో రెండు రోజుల పాటు ఎవరితోనూ మాట్లాడకుండా ముభావంగా ఉండిపోయింది. దీనితో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు గట్టిగా ప్రశ్నించడంతో.. తనతో ఐదుగురు అసభ్యంగా ప్రవర్తించారని చెప్పింది. ఈ మేరకు బాలిక తండ్రి గత నెల 31న సాయంత్రం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐపీసీ సెక్షన్లు 354, 323, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక వాంగ్మూలం, వైద్య పరీక్షలతో.. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు బాలికను భరోసా కేంద్రానికి పంపించారు. వైద్య పరీక్షల సందర్భంగా, మహిళా అధికారులు, నిపుణులు వాంగ్మూలాన్ని సేకరించిన సమయంలో.. తనపై అత్యాచారం జరిగిందనే విషయాన్ని బాలిక బయటపెట్టింది. దీని ఆధారంగా పోలీసులు.. కేసును మార్చి ఐపీసీ 376 (డి), పోక్సో యాక్ట్‌లోని కొన్ని సెక్షన్లను జోడించారు. బాలికను మెరుగైన వైద్య పరీక్షల కోసం నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అమ్నీషియా పబ్, ఇతర ప్రాంతాల్లో సీసీ కెమెరా ఫుటేజీని సేకరించి.. బాలికతోపాటు ఉన్నవారు ఎవరనేది ఆరా తీశారు. పబ్ నుంచి బంజారాహిల్స్‌లోని బేకరీ దాకా రెండు వాహనాలు రావడం, బేకరీ వద్ద సుమారు 20 నిమిషాలు ఆగడం, ఐదుగురు యువకులతో కలిసి బాలిక కారు బయలుదేరడం వంటివన్నీ పరిశీలించారు. సాదుద్దీన్, ఉమేర్‌ఖాన్, మసీవుల్లాఖాన్ కుమారుడు సహా ఐదుగురిని నిందితులుగా గుర్తించారు. వారు ఏ దారిలో ప్రయాణించారు, ఎక్కడ కారు ఆపి లైంగిక దాడికి పాల్పడ్డారనేది గుర్తించేందుకు.. నిందితుల ఫోన్‌కాల్స్, టవర్ లొకేషన్, బాలిక ఫోన్ లొకేషన్ల ఆధారంగా విచారణ చేస్తున్నారు. ఓ ఎమ్మెల్యే కుమారుడిపై అనుమానాలు! అమ్నీషియా పబ్ నుంచి బాలికతో కలిసి బయలుదేరిన వారిలో హైదరాబాద్ నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాలికపై అఘాయిత్యానికి పాల్పడే ప్లాన్‌లో అతనూ భాగమేనని.. అయితే బేకరీ వద్ద బాలికను కారు ఎక్కించుకునే సమయంలో ఓ ఫోన్‌కాల్ రావడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడని సమాచారం. ఈ విషయంపై పోలీసులు స్పందించడం లేదు. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో మౌనం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ మీడియా సంస్థ యజమాని కుమారుడి సమాచారంతో అమ్నీషియా పబ్‌లో పార్టీకి హాజరైనవారిలో చాలామందికి ఒకరితో ఒకరికి పెద్దగా పరిచయం లేదు. అంతా ఇన్‌స్ట్రాగామ్ ద్వారా స్నేహితులైన వారు కావడంతో నిందితులను గుర్తించడం కష్టమైం దని పోలీసువర్గాలు చెప్తున్నాయి. సాంకేతిక ఆధారాలను బట్టి దర్యాప్తు చేసిన అధికారులు.. నిందితులు 29న (అఘాయిత్యానికి పాల్పడిన తర్వాతి రోజు) మాసబ్‌ట్యాంక్ ప్రాంతానికి చెందిన ఓ మీడియా సంస్థ కార్యాలయానికి వెళ్లి, దాని యజమాని కుమారుడిని కలిసినట్టు గుర్తించారు. అతడిని ప్రశ్నించగా.. ఐదుగురు నిందితులు తనవద్దకు వచ్చి అఘాయిత్యం విషయం చెప్పారని వెల్లడించినట్టు తెలిసింది. కానీ తాను సహకరించబోనని వారికి స్పష్టం చేసినట్టుగా వివరణ ఇచ్చినట్టు సమాచారం. అయితే పోలీసులు ఈ మీడియా యజమాని కుమారుడి సాయంతోనే నిందితులను గుర్తించినట్టు తెలిసింది. హోంమంత్రి మనవడికి సంబంధం లేదు రొమేనియన్ బాలికపై అత్యాచారం కేసులో హోంమంత్రి మనవడికి ఎలాంటి సంబంధం లేదు. వక్ఫ్‌బోర్డు చైర్మన్ కుమారుడి పాత్రపై ఆధారాలు లభించాయి. అతడి ఆచూకీ కనిపెట్టినా రాత్రివేళ మైనర్లపై చర్యలు తీసుకోవడానికి చట్టం అంగీకరించదు. అతడిపై ప్రత్యేక బృందంతో నిఘా ఉంచాం. శనివారం చర్యలు తీసుకుంటాం. ఈ కేసును ఏసీపీ స్థాయి అధికారి నేతృత్వంలో దర్యాప్తు చేస్తున్నాం. మిగతా ముగ్గురు నిందితులను 48 గంటల్లో పట్టుకుంటాం. బాలిక పూర్తిగా కోలుకున్నాక ఆమెతో కోర్టులో వాంగ్మూలం నమోదు చేయిస్తాం. మరెవరి పాత్ర అయినా ఉన్నట్టు తెలిస్తే చర్యలు తీసుకుంటాం. ఎంతవారైనా వదిలి పెట్టేది లేదు. ఓ ఎమ్మెల్యే కుమారుడి పాత్రపై ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అత్యాచారం చేసిన సమయంలో వీడియో తీసినట్టుగానీ, దాన్ని చూపిస్తామని బెదిరించినట్టుగానీ ఎలాంటి ఆధారాలూ లభించలేదు. – జోయల్ డెవిస్, హైదరాబాద్ వెస్ట్‌జోన్ డీసీపీ -
పబ్‌కు వచ్చిన బాలికపై సామూహిక అత్యాచారం.. అసలేం జరిగింది?
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా పబ్ వ్యవహారంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. పబ్, బేకరీతోపాటు పలు ప్రాంతాల్లో సీసీఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. బాలికపై అత్యాచారం జరిగింది వాస్తవమేనని పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ కేసులో మొత్తం నాలుగు బృందాలను రంగంలోకి దింపినట్లు తెలిపారు. నలుగురు నిందితులు మైనర్లేనని వారిపై పోక్సో, నిర్భయ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులు గోవాకు పరారయ్యారని సమాచారం అందిందని, గోవాలో రెండు బృందాలుగా పోలీసులు జల్లెడ పడుతున్నారని పేర్కొన్నారు. బాలికను పబ్‌కు తీసుకెళ్లిన హదీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంజ్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హాదీని బురిడి కొట్టించి బాలురు బాలికను తీసుకెళ్లారని, రెండు గంటలపాటు బాలికపై మైనర్ బాలురు అత్యాచారానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. అత్యాచారం చేసి మరో కారులో పబ్ వద్ద బాలికను వదిలివెళ్లారన్నారు. ఈ కేసులో ఎవరి ప్రమేయం ఉన్న విచారణలో తేలుతుందని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సంబంధిత వార్త: ఆమ్నేషియా పబ్ కేసు.. జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద ఉద్రిక్తత లిక్కర్ పార్టీ జరగలేదు. అమ్నేషియా పబ్‌లో లిక్కర్ పార్టీ జరగలేదని, పబ్‌లో న్యూసెన్స్ జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు. పబ్ నుంచి బాలిక స్నేహితులతో బయట వెళ్ళిన తరువాత బెంజ్ కారులోనే అఘాయిత్యానికి పాల్పడ్డారని అన్నారు. బాలిక తనపై జరిగిన అఘాయిత్యం గురించి తండ్రికి చెప్పడంతో బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఆయన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. బాలిక స్టేట్మెంట్ ఆమ్నేషియా పబ్ వ్యవహారంలో బాధిత బాలిక.. తనపై అత్యాచారం జరిగిందంటూ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది. ‘మే 28న సా.5 గంటలకి గుర్తుతెలియని యువకులు నన్ను బలవంతంగా కారులో తీసుకెళ్లారు. ఆమ్నేషియా పబ్‌లో మేం పార్టీ చేసుకున్నాం, పార్టీలో కొందరు యువకులు నన్ను బెంజ్ కారులో బలవంతంగా తీసుకెళ్లారు. బెంజ్ కారులో నాపై అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రి 7 గంటలకు పబ్ దగ్గర తనను వదిలిపెట్టారు. నా మెడ వద్ద గాయాలైన విషయాన్ని మా నాన్న గమనించారు. నాపై జరిగిన అఘాయిత్యం గురించి ఆయనకు చెప్పాను. దీంతో ఆయన జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు’ అని పేర్కొంది. అసలేం జరిగింది? కాగా గత నెల 28న బంజారాహిల్స్ రోడ్ నెం. 14లో నివసించే బాలిక (16) ఓ పార్టీకి హాజరయ్యేందుకు తన ఇంటి సమీపంలో ఉండే హాదీతో కలిసి ఆయన బెంజ్ కారులో (టీఎస్ 09 ఎఫ్ఎల్ 6460)లో అమ్నేషియా పబ్‌కు వెళ్లింది. సాయంత్రం 5 గంటల వరకు అక్కడే పార్టీ చేసుకున్నారు. అనంతరం పబ్ నుంచి బాలిక బయటకు వచ్చింది. బాలికను బలవంతంగా బెంజ్ కారులో తీసుకెళ్లి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో ఓ బేకరీ దగ్గరకు వెళ్లి ఆహారం కొనుగోలు చేశారు. అనంతరం కారును నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. కార్లోనే బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తరువాత 7.30 నిమిషాల సమయంలో పబ్ వద్ద వదిలేసి వెళ్లారు. అనంతరం బాలిక ఫోన్ చేయడంతో తండ్రి వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. ఇది కూడా చదవండి: Amnesia Pub Case: ‘హోంమంత్రి పీఏ.. అమ్మాయిని లోపలికి పంపాడు’ నిందితుల్లో ప్రజాప్రతినిధుల పిల్లలు ఇదిలా ఉండగా అత్యాచార నిందితుల్లో ప్రజాప్రతినిధుల పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. హోమంత్రి మనవడు, ఎమ్మెల్యే కొడుకు, వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు, ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు పాత్ర ఉన్నట్లు పలు అరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటి వరకైతే దీనిపై పోలీసులు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. -
బాలిక ప్రాణం తీసిన ఇన్స్టాగ్రాం.. అసభ్య మెసేజ్‌లు పోస్టు చేస్తూ.
సాక్షి, ఆదిలాబాద్: ఇన్స్టాగ్రాం నకిలీ ఐడీ ఓ బాలిక ప్రాణం తీసింది. గుర్తు తెలియని వ్యక్తులు బాలిక పేరిట ఇన్స్టాగ్రాం ఐడీ క్రియేట్ చేసి అశ్లీల చిత్రాలు, మెస్సేజ్‌లు చేస్తుండడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యా దు చేయడంతో ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇచ్చోడ మండలంలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన ముస్లె సాక్షి(17) గత ఏడాది పదో తరగతి పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటోంది. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటోంది. ఇటీవల ఆమె పేరు, ఫొటోతో గుర్తు తెలియని వ్యక్తులు ఇన్స్టాగ్రాం ఫేక్ ఐడీ క్రియేట్ చేశారు. అశ్లీల చిత్రాలు, అసభ్య మెసేజ్‌లు పోస్టు చేస్తున్నారు. గుర్తించిన సాక్షి కు టుంబ సభ్యులకు తెలిపింది. అయినా పోస్టులు కొనసాగుతుండడంతో మనస్తాపం చెంది మే 29న ఇంట్లోనే పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు హైదరాబాద్‌కు రెఫర్ చేయగా.. ఆదిలాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత నెల 30న చనిపోయింది. మృతురాలి తల్లి యశోదాబాయి బుధవారం ఇచ్చోడ పోలీ సులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఫేక్ ఐడీ క్రియేట్ చేసినవారి కోసం ఆరా తీస్తున్నారు. -
బంజారాహిల్స్: బాలికను కారులో తీసుకెళ్లి అసభ్యకర ప్రవర్తన
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని ఒక పబ్‌కి వెళ్లిన బాలికను కారులో తీసుకెళ్లి కొందరు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్ చెందిన ఒక బాలిక(17) జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని అమ్నేషియ ఇన్సోనియా పబ్‌కు స్నేహితులు ఇచ్చిన పార్టీకి గత నెల 28న హాజరైంది. అదే రోజు సాయంత్రం 5.30 గంటల సమయంలో ఒక బెంజి, ఇన్నోవా కార్లలో వచ్చిన కొందరు యువకులు ఆ బాలికను తీసుకెళ్లారు. ఆ తరువాత రెండు గంటల తరువాత బాలిక తిరిగి వచ్చింది. అయితే.. బాలికతో అసభ్యంగా ప్రవర్తించారని బాలిక తండ్రి బుధవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తె మెడపై చిన్న గాయం అయ్యిందని, సంఘటన జరిగిన సమయం నుంచి షాక్‌లో ఉందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఆయన ఫిర్యాదు చేయగా పోలీసులు పొక్సో కింద కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. చదవండి: అదృశ్యమైన బాలికను నాలుగు నెలలు గదిలో బంధించి.. -
తన ప్రేమను తిరస్కరించిందని...కర్కశంగా కత్తితో పొడిచి ఆ తర్వాత...
ఇటీవల యువతీ యువకులు ప్రేమ కోసం చనిపోవడం లేదా తమ ప్రేమను ఒప్పుకోవడం లేదని చంపేయడం వంటి దారుణాలకు ఒడిగడ్డుతున్నారు. చదువకుకునే వయసులో కలిగే ప్రేమలకు, ఆకర్షణలకు లొంగిపోయి బంగారంలాంటి భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు. అదే కోవకు చెందినవాడు తమిళనాడుకు చెందిన ఒక యువకుడు. చక్కగా తన మానాన తాను చదుకుంటున్న ఒక బాలికను ప్రేమ పేరుతో ఆ యువకుడి వెంటపడి వేధించాడు. చివరికి జైల్లో పెట్టించినా మారకపోగా ఆ బాలికను చంపేందుకు యత్నించాడు. వివరాల్లోకెళ్తే...తమిళనాడులోని తిరుచ్చిలో 16 ఏళ్ల బాలిక పరీక్షలు అయిపోయాయని తన బంధువుల ఇంటికి ఆనందంగా వెళ్తోంది. ఇంతలో కేశవన్ అనే వ్యక్తి వచ్చి ఆమె వెళ్తున్న దారిలో అడ్డగించి అడ్డుకుని తన ప్రేమను అంగీకరించమంటూ వేధించాడు. ఆమె నిరాకరించడంతో కోపంగా కత్తితో 14 సార్లు కిరాతకంగా పొడిచి పారిపోయాడు. స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఐతే ఈ కేశవన్ పై ఆ బాలిక గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు పోలీసులు కేశవన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇటీవలే బెయిల్ పై విడుదలై వచ్చి మరీ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ ఘటనపై కరూర్ కాంగ్రెస్ ఎంపీ జోతిమణి స్పందిచడమే కాకుండా నిందుతుడి పై కఠిన చర్యలు తీసుకోవల్సిందిగా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ)ని కోరారు. ఈ మేరకు పోలీసులు కేశవన్ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు కూడా. అయితే కేశవన్ మణప్పరై సమీపంలో రైలు పట్టాలపై శవమై కనిపించాడు. మృతదేహం వద్ద ఉన్న వస్తువులు, కేశవ తండ్రి ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా చనిపోయిన వ్యక్తిని కేశవన్ పోలీసులు నిర్థారించారు. (చదవండి: ప్రియునితో సహజీవనం.. వారిమధ్య ఏం జరిగిందో గానీ..) -
ములుగు జిల్లాలో దారుణం..సొంత చిన్నాన్న కూతురిపైనే అత్యాచారం
-
ములుగు జిల్లాలో దారుణం.. బాలికపై వరుసకు సోదరుడు లైంగికదాడి
సాక్షి, ములుగు(వరంగల్): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గుర్రేవులలో దారుణం జరిగింది. వావివరసలు మరిచి ఓ కామాంధుడు సొంత చిన్నాన్న కూతురిపైనే దారుణానికి ఒడిగట్టాడు. మైనర్ అని చూడకుండా లైంగిక దాడికి పాల్పడ్డాడు. పైగా ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. భయంతో బాలిక ఎవరికి చెప్పలేదు. అయితే కడుపునొప్పితో బాధపడుతున్న బాలికను ఆస్పత్రికి తీసుకెళితే గర్భవతిగా వైద్యులు ధ్రువీకరించారు. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న నిందితుడు పరారయ్యాడు.కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: రెండ్రోజుల్లో యువకుడు పెళ్లి.. పత్రికలు పంచుతూ -
లైంగిక దాడికి యత్నించిన యువకునికి 3 ఏళ్ల జైలు
విశాఖ లీగల్: బాలికపై లైంగిక దాడికి యత్నించిన యువకునికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.100 జరిమాన విధిస్తూ విశాఖలోని పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి మంగళవారం తీర్పు చెప్పారు. జరిమాన చెల్లించని పక్షంలో అదనంగా నెల రోజులు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని పేర్కొన్నారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కరణం కృష్ణ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి..తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం కోటపాడుకి చెందిన నిందితుడు ఏడిద క్రాంతి (33) విశాఖలోని బుచ్చిరాజుపాలెంలోని బంధువుల ఇంట్లో ఉంటూ ఓ సమోసా తయారీ కంపెనీలో కూలీగా పనిచేస్తున్నాడు. బాధితురాలు (10) ఎన్ఏడీ దగ్గర గాంధీనగర్ పోలీస్ కాలనీ నివాసి. నిందితుడు పనిచేసే ప్రాంతంలో బాలిక స్నేహితులతో సైకిల్ తొక్కేది. బాలిక కదలికలను కనిపెట్టిన నిందితుడు 2020 అక్టోబర్ 26న ఆమెకు మాయమాటలు చెప్పి సమీపంలోని రైల్వేట్రాక్ దగ్గరకు తీసుకువెళ్లాడు. సైకిల్‌పై వెళుతున్న బాలికను తాకుతూ లైంగిక దాడికి యత్నించగా భయకంపితురాలైన ఆమె కేకలు వేసింది. పక్కనే ఉన్న ఓ యువకుడు వచ్చి బాలికను రక్షించాడు. నిందితుడు పరారయ్యాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం నేరాభియోగ పత్రాన్ని దాఖలు చేశారు. కేసు విచారణ జరిపిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో పై విధంగా నిందితుడికి శిక్ష విధించారు. -
ఇంటి ముందు ఆడుకుంటుంటే.. చాక్లెట్ ఇస్తానని లోపలికి తీసుకెళ్లి..
హోసూరు(బెంగళూరు): అభం శుభం తెలియని మూడేళ్ల చిన్నారిపై భవన నిర్మాణ కార్మికుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. డెంకణీకోటకు చెందిన శామ్రాజ్(44) హోసూరు శాంతి నగర్లో నివాసముంటూ భవన నిర్మాణ పనులకు వెళ్లేవాడు. అదే ప్రాంతంలో ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని చాక్లెట్ ఆశచూపి లోపలికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు హొసూరు పట్టణ పోలీసులు శామ్రాజ్ను అరెస్ట్ చేసి పోక్సో కేసు నమోదు చేశారు. కిలేడీల చేతివాటం హోసూరు: హొసూరు–బాగలూరు రోడ్డులో దోపిడీకి పాల్పడిన చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని బాపునగర్‌కు చెందిన జ్యోతి(30), సబీన(25), జ్యోతి(32) అనే దొంగలను హడ్కో పోలీసులు అరెస్ట్ చేశారు. హొసూరులోని అణ్ణా నగర్‌కు చెందిన ఉమామహేశ్వరి అనే మహిళ హొసూరు–బాగలూరు రోడ్డులో బస్టాప్ వద్ద బస్సు కోసం వేచి ఉండగా నిందితులు ఆమెతో మాటలు కలిపి పర్సు లాక్కొని ఉడాయించారు. బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమై దొంగలను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. చదవండి: NEET PG Exam 2022: నీట్ పీజీ వాయిదా కుదరదు: సుప్రీంకోర్టు -
బాలికపై ఏడాదిగా లైంగిక దాడి.. గర్భం దాల్చడంతో
సాక్షి, దుబ్బాక: బాలికపై ఓ యువకుడు ఏడాదిగా అత్యాచారం చేస్తున్నాడు. బాలిక గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు సిద్దిపేట జిల్లా రాయపోలు మండలం ఎల్కల్‌కు చెందిన యువకుడు (27) ఇంటర్ వరకు చదివి జులాయిగా తిరుగుతున్నాడు. వారి ఇంటి ఎదురుగా ఉండే పదో తరగతి చదువుతున్న బాలిక (15)ను మభ్యపెట్టి ఏడాదిగా అత్యాచారం చేస్తున్నాడు. భయంతో ఆ బాలిక ఇంట్లో ఎవరికీ విషయం చెప్పలేదు. నాలుగు రోజులుగా కడుపునొప్పితో బాధపడుతోంది. కుటుంబ సభ్యులు తూప్రాన్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్యపరీక్షలు డాక్టర్లు గర్భవతి అని తల్లిదండ్రులకు చెప్పారు. ఆరా తీయగా ఏడాదికి పైగా తనపై ఇంటి ఎదురుగా ఉన్న యువకుడు లైంగికదాడికి పాల్పడుతున్నట్లు బాలిక వివరించింది. దీంతో గ్రామపెద్దల సాయంతో తల్లిదండ్రులు గురువారం బేగంపేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాసుత్రికి తరలించారు. -
పెళ్లికి వెళ్లిన బాలికకు మాయమాటలు చెప్పి..
మైసూరు(బెంగళూరు): పెళ్లికి వచ్చిన వ్యక్తి కళ్యాణ మండపంలోని బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. ఈ ఘటన మైసూరులో జరిగింది. మండ్య జిల్లాలోని బేళూరుకి చెందిన ప్రతాప్ అనే వ్యక్తి మైసూరు గోకులం లేఔట్లో కళ్యాణ మండపానికి బంధువుల పెళ్ళికి వచ్చాడు. అదే పెళ్లికి వచ్చిన ఒక బాలికపై కన్నేశాడు. ఆమెకు మాటలు చెప్పి కిడ్నాప్ చేసి తీసుకెళ్లి మండ్య సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్టర్ పెళ్లి చేసుకొన్నాడు. ఇంతలో బాలిక తల్లిదండ్రులు వివి పురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వారు గాలించి ఇద్దరినీ తీసుకొచ్చారు. బాలికను మైసూరులోని బాల మందిరానికి తరలించారు. నిందితున్ని అరెస్టు చేశారు. కాగా, మైనర్‌తో పెళ్లిని రిజిస్ట్రార్ ఆఫీసు అధికారులు ఎలా అనుమతించారన్నది తేలాల్సి ఉంది. మరో ఘటనలో.. ఇద్దరు విద్యార్థుల దుర్మరణం బనశంకరి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందిన ఘటన కెంగేరి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. బెంగళూరు నగరంలోని రామయ్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి సుముఖ్ (22), పీఈఎస్ కళాశాల విద్యార్థిని లీనా నాయుడు (19) గురువారం సాయంత్రం కారులో నైస్‌రోడ్డు వైపు వేగంగా వెళ్తుండగా కారు అదుపుతప్పి మినీ బస్సును ఢీకొట్టి బోల్తాపడింది. వెనుకనే వస్తున్న మరో కూడా బోల్తా పడింది. కారులో ఉన్న ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా, బస్సు డ్రైవర్‌కు రెండు కాళ్లు విరిగిపోయాయి. మరో కారులో ఉన్న ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదవండి: బిర్యానీతో కలిపి నగలు మింగేశాడు -
హైదరాబాద్: కార్పొరేటర్ తనయుడి నిర్వాకం.. ప్రేమించాలంటూ బాలికకు..
సాక్షి, హైదరాబాద్: ప్రేమించాలంటూ ఓ బాలికను వేధిస్తున్న కార్పొరేటర్ తనయుడిపై మీర్‌పేట పోలీసులు పోక్సో, నిర్భయ కేసులు కేసు నమోదు చేశారు. సీఐ మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. జిల్లెలగూడ మల్రెడ్డి రంగారెడ్డి కాలనీకి చెందిన కార్పొరేటర్ కుమారుడు, మీర్‌పేట బీజేవైఎం అధ్యక్షుడు బచ్చనమోని ముఖేష్‌యాదవ్ స్థానికంగా నివసించే ఓ బాలిక (15)ను ప్రేమించాలంటూ కొంత కాలంగా వేధిస్తున్నాడు. తరచూ మెసేజ్‌లు పంపుతూ, ఫోన్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం బాలిక సమీపంలోని కిరాణాషాప్‌నకు వెళ్తుండగా ముఖేష్‌యాదవ్ వెంబడించి ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ముఖేష్‌యాదవ్‌పై పోక్సో, నిర్భయ చట్టాల కింద కేసులు నమోదు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. ముఖేష్‌పై మరో కేసు కూడా నమోదైందని, విచారణ జరుగుతోందని సీఐ తెలిపారు. చదవండి: అబ్దుల్లాపూర్ మెట్లో దారుణం.. జంట మృతదేహాల కలకలం -
పనికోసం ఇంటికొస్తే వ్యభిచారం చేయించారు..
సాక్షి, గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): పనికోసం ఇంటికి వచ్చిన మైనర్ బాలికతో వ్యభిచారం చేయించిన కేసులో భవానీపురం పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో విజయవాడ చిట్టినగర్ సొరంగం ప్రాంతానికి చెందిన వేముల భాగ్యలక్ష్మి, కబేళా సెంటర్‌కు చెందిన వేముల భార్గవి, వేముల గోపి, పమిడి ముక్కల మండలం తాడంకి గ్రామానికి చెందిన చలపాటి శ్రీనివాసరావు, గుంటూరు చంద్రమౌళి నగర్‌కు చెందిన పోపూరి వెంకట రవికుమార్‌లను అరెస్ట్ చేసినట్లు సీఐ మహీంద్ర తెలిపారు. వీరిని రిమాండ్‌కు తరలించామన్నారు. చదవండి: (Hyderabad: అద్దె ఇల్లు చూసేందుకు వచ్చి... ఇంట్లోనే సన్నిహితంగా) -
విద్యార్థినితో మాట్లాడాలని గదిలోకి పిలిపించుకుని..
కెలమంగలం(బెంగళూరు): ఏడో తరగతి విద్యార్థినిపై పాఠశాల హెచ్ఎం లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి బంధువులు హెచ్ఎంకు దేహశుద్ధి చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. అంచెట్టి సమీపంలోని కొప్పగరై ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో డెంకణీకోటకు చెందిన లారెన్స్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. 7వ తరగతి విద్యార్థినిని గురువారం మాట్లాడాలని ఒక గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. బాలిక తప్పించుకొని ఇంటికి వెళ్లి ఇకపై పాఠశాలకు వెళ్లనని తల్లిదండ్రులతో మొరపెట్టుకొంది. బాలిక బంధువులు పాఠశాల వద్దకు చేరుకొని ప్రధానోపాధ్యాయుడిపై దాడి చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు డెంకణీకోట మహిళా పోలీసులు లారెన్స్‌ను అరెస్ట్ చేసి హోసూరు జైలుకు తరలించారు. సదరు హెచ్ఎంను సస్పెండ్ చేస్తూ డెంకణీకోట విద్యా జిల్లా అధికారి అన్బళగన్ ఆదేశాలు జారీ చేశారు. మరో ఘటనలో.. డాప్ పేరుతో దోపిడీ యశవంతపుర: కోరమంగలలో ఒక సంస్థలో కారు డ్రైవర్‌గా పని చేస్తున్న దినేశ్ గురువారం రాత్రి 12 గంటల సమయంలో విధులు ముగించుకొని వీరభద్రేశ్వరనగరకు వెళ్లడానికి నాయండహళ్లి సర్కిల్లో వేచి ఉన్నాడు. డ్రాప్ చేస్తామని కొందరు వ్యక్తులు అతన్ని కారులో ఎక్కించుకొని కత్తి చూపించి రూ.3వేల నగదు లాక్కొని అతన్ని మధ్యలోనే వదిలేసి వెళ్లారు. కొద్ది దూరం వెళ్లాక కారు డివైడర్‌ను ఢీకొంది. దీంతో వాహనాన్ని వదలి ఉడాయించారు. గిరి నగర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
ఇన్‌స్టాగ్రామ్‌లో మైనర్‌కు ‘ఐ లవ్ యూ’ మెసేజ్
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్లో పరిచయమైన మైనర్‌కు ‘ఐ లవ్ యూ’ అంటూ మెసేజ్ పెట్టిన యువకుడు కటకటాల్లోకి చేరాడు. ఛత్తీస్‌గఢ్‌లోని సుపేలా బిలాయ్ ప్రాంతానికి చెందిన శివ సెహగల్ (21) విద్యార్థి. ఇతడికి కొన్ని రోజుల క్రితం నగరానికి చెందిన పదో తరగతి విద్యార్థిని ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైంది. కొన్నాళ్లు చాటింగ్ చేసిన శివ ఆ బాలికకు ‘ఐ లవ్ యూ’ అంటూ సందేశం పంపాడు. ఇది బాలిక తల్లిదండ్రుల దృష్టిలో పడింది. దీంతో వారు సిటీ సైబర్‌క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ అభిలాష్ పోక్సో, ఐటీ యాక్ట్‌ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. నిందితుడైన శివ సుపేలా బిలాయ్‌లో ఉన్నట్లు గుర్తించిన ప్రత్యేక బృందం అతడిని అరెస్టు చేసి గురువారం సిటీకి తీసుకొచ్చింది. స్థానిక కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. కాగా.. సదరు బాలిక శివను ఏం చేయొద్దని, అతడు చాలా మంచివాడని తల్లిదండ్రులతో వాదిస్తుండటం గమనార్హం. -
కన్నతండ్రి అఘాయిత్యం.. అపరకాళిగా మారిన తల్లి
సాక్షి, చిలకలూరిపేట (పల్నాడు): కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే అభం శుభం తెలియని ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పాపం చేసింది కట్టుకున్న వాడైనా సహించేది లేదని జరిగిన దారుణాన్ని లోకానికి తెలిపి, పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారా మాతృత్వపు ఔన్నత్యాన్ని చాటుకుంది ఆ కన్నతల్లి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడిలో జరిగిన దారుణ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బొప్పూడి గ్రామానికి చెందిన నూర్‌బాషా ఆదాం షఫీకి 2016లో నాదెండ్ల మండలం అమీన్ సాహెబ్‌పాలేనికి చెందిన హుస్సేన్‌బీతో వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల పాప, మూడేళ్ల బాబు ఉన్నారు. షఫీ బొప్పూడిలో కుటుంబంతో నివాసం ఉంటూ చిలకలూరిపేట పట్టణం కళామందిర్ సెంటర్లోని ఓ దుకాణంలో పని చేస్తున్నాడు. రాత్రిపూట పాప తండ్రి వద్ద, చిన్నవాడైన బాబు తల్లి వద్ద నిద్రిస్తారు. ఇటీవల పాపను స్కూల్‌కు పంపే క్రమంలో తల్లి చిన్నారికి స్నానం చేయిస్తుండగా, తనకు జననాంగాల వద్ద నొప్పిగా ఉందని రాత్రి సమయాల్లో తండ్రి పక్కన పడుకోబెట్టవద్దని ఏడుస్తూ చెప్పింది. చదవండి: (Anakapalle: అనకాపల్లి స్వాతి కేసులో కొత్త ట్విస్ట్) వారం రోజుల్లో ఇదే విషయాన్ని పలుమార్లు తల్లికి చెప్పడంతో అనుమానించిన ఆమె భర్త ప్రవర్తనపై కన్నేసింది. ఆదివారం రాత్రి భోజనం తర్వాత భర్త షఫీ బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. తిరిగి రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో హుస్సేన్‌బీ నిద్రపోతున్నట్లు నటించింది. సెల్‌ఫోన్ లైట్ వేసి భార్య నిద్రపోతున్నట్లు భావించి కుమార్తె పక్క చేరాడు. సెల్ఫోన్లో నీలి చిత్రాలు చూస్తూ కన్న కూతురుపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భర్త దారుణం పసిగట్టిన హుస్సేన్‌బీ వెంటనే అపరకాళిగా మారింది. భర్తను నిలదీయడంతో బంధువులకు సమాచారం అందించింది. దీంతోపాటు చిలకలూరిపేట రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. చదవండి: (ఎస్ఐ పోస్టుల స్కాం: పరీక్ష టైంలో ఫోన్లో మాట్లాడారా?) -
మైనర్‌తో ప్రేమ, పెళ్లి.. నెల నుంచే బాలికను వేధిస్తూ
సాక్షి, అమీర్‌పేట: ప్రేమ పేరిట బాలిక వెంటపడి, పెళ్లి చేసుకుని వేధిస్తున్న యువకుడిపై ఎస్ఆర్నగర్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్‌లో నివాసముంటున్న 16 ఏళ్ల మైనర్ బాలిక 2017లో వేసవి సెలవుల్లో ఎల్లారెడ్డిగూడలో తాత, అమ్మమ్మ ఇంటికి వచ్చినప్పుడు స్థానికంగా ఉండే ఎరోళ్ల వివేక్ అనే యువకుడు పరిచయమయ్యాడు. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లికి పెద్దలు అంగీకరించరనే అనుమానంతో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న బాలికను గతేడాది నవంబర్ 8న వెంట తీసుకుని వెళ్లి 12న యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నాడు. తిరిగి వచ్చి ఎల్లారెడ్డిగూడలో కాపురం పెట్టాడు. 5 నెలల నుంచి బాలికను వేధిస్తూ చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. దీంతో బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు తెలుపడంతో బుధవారం ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైనర్‌ను పెళ్లి చేసుకోవడంతో పాటు వేధింపులకు పాల్పడిన వివేక్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
బాలికపై స్నేహితుడు లైంగికదాడి.. అది చూసి మరో ముగ్గురు..
సాక్షి, బెంగళూరు(బాగేపల్లి): మైనర్ బాలికపై ఆమె స్నేహితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని చూసిన మరో ముగ్గురు యువకులు వారిద్దరిని బెదిరించి ఆ మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి ప్రయత్నించారు. వివరాలు.. సోమవారం పదో తరగతి పరీక్ష రాసి స్నేహితునితో కలసి బాలిక గ్రామానికి వస్తోంది. గ్రామ సమీపంలోకి రాగానే బాలికపై ఆ స్నేహితుడు అత్యాచారం చేశాడు. వీరిని వెనుక నుంచి వెంబడిస్తూ వచ్చిన ముగ్గురు యువకులు బాలికను, ఆమె స్నేహితున్ని పట్టుకున్నారు. మీ తతంగాన్ని వీడియో తీశామని తాము చెప్పినట్లు వినాలని బెదిరించారు. ఈ సమయంలో వారి మధ్య గొడవ జరిగింది. ముగ్గురు యువకులు బాలికపై అత్యాచార యత్నానికి ప్రయత్నించారు. ఇంతలో స్నేహితుడు పక్కనే ఉన్న గ్రామంలోకి వెళ్లి గ్రామస్తులను పిలుచుకుని వచ్చాడు. గ్రామస్తులను చూసిన ఆ ముగ్గురు యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. బాలికను ఆస్పత్రిలో చేర్పించారు. బాగేపల్లి పోలీసులు బాలిక స్నేహితునితో పాటు పరారీలో ఉన్న ముగ్గురు యువకులను అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. చదవండి: (అక్రమ సంబంధం మోజులో... భర్త దారుణ హత్య) -
పన్నెండేళ్ల బాలికపై అన్న వరస అయ్యే యువకుడి అఘాయిత్యం
సాక్షి, నెల్లూరు(కొడవలూరు): పన్నెండేళ్ల బాలికపై అన్న వరస అయ్యే యువకుడి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఫలితంగా ఆ బాలిక గర్భం దాల్చింది. సభ్య సమాజం సిగ్గు పడేలా ఉన్న ఈ ఘటన మండలం తలమంచి ఎస్సీ కాలనీలో సోమవారం వెలుగుచూసింది. కోవూరు సీఐ కె.రామకృష్ణారెడ్డి సమాచారం మేరకు.. ఆ కాలనీకి చెందిన ఈశ్వరయ్యకు ఇద్దరు కుమారులున్నారు. అయితే ఈశ్వరయ్యను భార్య వదిలేసి వెళ్లిపోవడంతో మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఆయనతో సహజీవనం చేస్తున్న మహిళకు మొదటి భర్తకు జన్మించిన పన్నెండేళ్ల కుమార్తెతో పాటు మరో కుమారుడున్నారు. ఈశ్వరయ్య ఇద్దరు కుమారులు, ఆ మహిళ ఇద్దరు పిల్లలు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఈశ్వరయ్యతో సహజీవనం చేస్తున్న మహిళ కుమార్తె (12)పై ఈశ్వరయ్య పెద్ద కుమారుడు (19) కొంత కాలంగా అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. గిరిజనులు కావడంతో మౌనంగా ఉండిపోయారు. అయితే ఆ బాలికకు 9 నెలలు నిండాయి. దీంతో కాన్పు నిమిత్తం ఆ బాలికను నెల్లూరు ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. అంత చిన్న వయస్సులో బాలిక గర్భం దాల్చడంతో అనుమానం వచ్చిన వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారించిన సీఐ రామకృష్ణారెడ్డి ఈశ్వరయ్య పెద్ద కుమారుడు (19)పై అత్యాచారం, ఫోక్సో కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. చదవండి: (హోంగార్డు హత్య.. మద్యం మత్తులో యువకుల దాష్టీకం) -
మైనర్ బాలికపై అఘాయిత్యం... పరువుపోతుందని..
సాక్షి, మేడ్చల్/మేడ్చల్ రూరల్: ఓ ఆటో డ్రైవర్ మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడిన సంఘటన గౌడవెళ్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నిజాంపేట్ ప్రాంతానికి చెందిన వెంకటేష్, గౌడవెళ్లి గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. సదరు మహిళ ఇంటి సమీపంలో ఉంటున్న బాలిక(15)తో అతడికి ఏర్పడింది. మార్చి 31న ఆటోలో గౌడవెళ్లికి వచ్చిన వెంకటేష్ స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న బాలికను ఆటోలో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఏప్రిల్ 1న బాధితురాలి స్నేహితురాళ్లు సదరు బా లిక ఒక్కతే ఆటోలో వెళ్లిన విషయం క్లాస్ టీచర్ దృష్టికి తీసుకెళ్లారు. టీచర్ బాధితురాలిని పిలిచి ఆరా తీయగా వెంకటేష్ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు చె ప్పింది. దీంతో టీచర్ బాధితురాలి తల్లిదండ్రులను పిలిపించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించింది..అయితే వారు పరువు ఎక్కడ పోతుందనే కారణంతో ఫిర్యాదు చేయలేదు. సోమవారం పాఠశాలకు వెళ్లిన బాలిక ద్వారా విష యం తెలుసుకున్న టీచర్ తల్లిదండ్రులపై ఒత్తిడి తేవడంతో వారు సోమవారం సాయంత్రం మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. (చదవండి: పోలీసునంటూ బెదిరింపులు...నిర్మానుష్య ప్రాంతాల్లో ఉండే జంటలే టార్గెట్) -
Hyderabad: కోర్టు అనుమతితో మైనర్ బాలికకు గర్భస్రావం
సాక్షి, హైదరాబాద్(బంజారాహిల్స్): పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన బాలిక.. తన భవిష్యత్ నిమిత్తం గర్భస్రావానికి ఆదేశించాలంటూ హైకోర్టును ఆశ్రయించింది. మానవతా దృక్పథంతో స్పందించిన న్యాయస్థానం సదరు బాలిక గర్భస్రావానికి అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఖమ్మం జిల్లాకు చెందిన యువకుడి (25)కి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. వీరిని వదిలేసి అతను నగరానికి వచ్చాడు. బంజారాహిల్స్‌లోని ఓ బస్తీలో తన దూరపు బంధువుతో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో 8 వ తరగతి చదువుతున్న ఆమె కూతురిపై కన్నేశాడు. మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. బాలిక తల్లి ఈ విషయాన్ని కనిపెట్టి కూతురితో కలిసి వెస్ట్‌జోన్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించింది. రెండు వారాల క్రితం పోలీసులు పోక్సో చట్టం కింద నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బాలిక మైనర్ కావడం, గర్భం కూడా దాల్చడంతో భవిష్యత్‌లో ఎదురయ్యే పరిణామాలను దృష్టిలో పెట్టుకొని గర్భస్రావం చేయించుకోవడానికి అనుమతి కోరుతూ అత్యున్నత న్యాయస్థానాన్ని తల్లిదండ్రులతో కలిసి ఆశ్రయించింది. నాలుగు రోజుల క్రితం హైకోర్టు ఆ బాలిక గర్భస్రావానికి అనుమతినిస్తూ నిలోఫర్ ఆస్పత్రి వైద్యులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రెండు రోజుల క్రితం వైద్యులు మైనర్ బాలికకు గర్భస్రావం చేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: (Hyderabad: ప్రయాణికులకు మెట్రో రైలు బంపర్ ఆఫర్) -
బాలికకు మాయమాటలు చెప్పి బైక్‌పై ఎక్కించుకుని..
సాక్షి,నరసాపురం(పశ్చిమ గోదావరి ): 14 ఏళ్ల బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నరసాపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని సోమ వారం అరెస్ట్ చేశారు. టౌన్ ఎస్సై సుధాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన బాలిక 9వతరగతి చదువుతోంది. యలమంచిలికి చెందిన 25 ఏళ్ల యువకుడు బాలిక ఇంటికి దగ్గరలోనే టైల్స్ పనికి వెళ్లేవాడు. ఆదివారం బాలికకు మాయమాటలు చెప్పి బైక్‌పై ఎక్కించుకుని దిండి సమీపంలోని ఓ భవనంలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అదే బైక్‌పై ఇంటి వద్ద దింపి.. ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. బాలిక నీరసంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆరాతీసి పోలీసులను ఆశ్రయించారు. యువకుడిపై పోక్సో చట్టం మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. చదవండి: ‘అమ్మా.. అమ్మా’ అని కేక వేసే లోగానే దారుణం జరిగిపోయింది -
వికారాబాద్ లో దారుణం..విద్యార్థినిపై అత్యాచారం
-
విద్యార్థిని హత్యాచార ఘటన.. ఆదివారం రాత్రి పార్టీ చేసుకున్న నిందితులు?
సాక్షి, వికారాబాద్: జిల్లాలోని పూడురు మండలం అంగడి చిట్టంపల్లిలో 16 ఏళ్ల బాలిక అత్యాచారం, హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. సోమవారం ఉదయం 5.30 నిమిషాల ప్రాంతంలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఇంట్లో నుంచి బయటకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఇంటి నుంచి 500 మీటర్ల నిర్మానుష్య ప్రాంతంలో శవమై కనిపించిందన్నారు. నిర్మానుష్య ప్రాంతంలో బాలిక దుస్తులు చెల్లా చెదురుగా పడి ఉండటంతో అత్యాచారం చేసి హత్య చేసినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే బాలిక అరుపులు కూడా ఎవరికీ వినిపించలేదని స్థానికులు చెబుతున్నారు. మద్యం మత్తులో సామూహిక అత్యాచారం? కాగా ఈ కేసులో ఇదే గ్రామంలో ఉండే ముగ్గురు యువకులపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా నివాసముండే మహేందర్ అలియాస్ నాని అనే యువకుడిపై బాలిక తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్న క్రమంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. నానితో పాటు అశోక్ అనే మరో యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే నాని నివాసంలో ఆదివారం రాత్రి పార్టీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పార్టీలో తెల్లవారుజామున వరకు మద్యం సేవించి మద్యం సేవిస్తూ ఉన్నారని, మద్యం మత్తులోనే యువకులు బాలికపై సామూహిక అత్యాచారం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సంబంధిత వార్త: వికారాబాద్‌లో విద్యార్థినిపై అత్యాచారం, ఆపై హత్య ఇదిలా ఉండగా హత్యకు గురైన మైనర్ బాలిక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యింది. పరిగి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బాలిక మృతదేహాన్ని చిట్టంపల్లి గ్రామానికి తీసుకొని వచ్చి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. దోషులను కఠినంగా శిక్షించి, తమకు న్యాయం చేయాలని బాధితురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న మహేందర్ అలియాస్‌నాని పాత్రపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్న క్రమంలో ఆయన తండ్రి లక్ష్మయ్య వాదన మరో విధంగా ఉంది. చదవండి: తండ్రి కళ్లెదుటే ఘోరం.. ప్రేమతో కొనిచ్చిన స్పోర్ట్స్ బైక్ మీదే ప్రాణం పోయింది నా కొడుకు అమాయకుడు తన కొడుకు అమాయకుడని తెలిపారు. బాలిక ఇంటికి అప్పుడప్పుడు వెళ్తుండే వాడని, అవసరం ఉన్నపుడు సహాయం కోసం వాళ్ళు పిలుస్తారని పేర్కొన్నారు. ఆ అమ్మాయికి తన కొడుక్కి పరిచయం ఉందని తెలిపిన లక్క్ష్మయ్య.. అయితే వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలిసిందన్నారు. కానీ ఈ విషయం తనకు ముందు తెలీదన్నారు. ఉదయం సంఘటన జరిగినపుడు కొడుకు తమ ఇంట్లోనే ఉన్నాడని, రాత్రి ఇంట్లో ఫంక్షన్ జరిగిందన్నారు. తన కొడుకు గొడవలు పడే మనిషి కాదని, ఇలాంటి తప్పుడు పనులు చేయడని తెలిపారు. తప్పు ఎవరు చేసినా వాళ్ళకి ఉరిశిక్ష పడాలని తెలిపారు. -
Crime News: తాత ఉసురు తీసిన అత్యాచార ఆరోపణలు
ఢిల్లీ: పుట్టిన ఊరును కన్నతల్లిగా భావించిన ఆ పెద్దాయన.. ఊరి జనాల సాక్షిగా పడ్డ నిందను భరించలేకపోయాడు. భయపడొద్దని, నిజం నిగ్గుతేలుతుందని ఇంట్లో వాళ్లు ఎంత ధైర్యం నింపినా ఫలితం లేకుండా పోయింది. పరువు పోయిందని, అరెస్ట్ చేస్తారనే ఆందోళన రెట్టింపు అయ్యింది. ఫలితం.. ఆ తాత ప్రాణం తీసింది. ఢిల్లీ గురుగ్రామ్ పరిధిలోని ఓ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలోని 88 ఏళ్ల లాల్‌సింగ్‌పై అత్యాచార ఆరోపణలు, అదీ ఓ మైనర్‌పై కావడంతో కేసు నమోదు అయ్యింది. ఈ కేసుకు సంబంధించి పోక్సో చట్టం ప్రకారం పోలీసులు ఎఫ్ఐఆర్ సైతం నమోదు చేశారు. దీంతో ఆ వృద్ధుడు కలత చెందాడు. రోజంతా పచ్చి మంచి నీళ్లు ముట్టకుండా ఏడుస్తూనే ఉన్నాడు. చివరకు.. పరువు పోయిందనే బాధతో గురవారం మధ్యాహ్నాం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ దొరకలేదని, కేసు నమోదు అయ్యిందన్న బాధతోనే లాల్‌సింగ్ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని స్టేషన్ హెడ్ వినీత్ కుమార్ భావిస్తున్నాడు. ఇక ఈ కేసులో కేసు పెట్టిన మహిళ(మైనర్ తల్లి) పోలీసులకు మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం అయ్యాయి. తన కూతురిపై లాల్‌సింగ్ గత కొన్నాళ్లుగా అఘాయిత్యానికి పాల్పడుతున్నాడని, బయటకు చెబితే చంపేస్తానని బెదిరిస్తున్నాడంటూ కేసు పెట్టింది ఆమె. అయితే లాల్ సింగ్ గత కొన్నిరోజులు ఆరోగ్యం బాగోలేక కూతురి దగ్గరికి వెళ్లాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు.. ఆమెను గట్టిగా నిలదీయగా, లాల్‌సింగ్ కుటుంబంపై పాత గొడవల దృష్ట్యా కోపంతోనే కేసు పెట్టినట్లు ఒప్పుకుంది. పోయిన ప్రాణం ఎలాగూ తిరిగి రాదు కాబట్టి లాల్‌సింగ్ కుటుంబం.. ఆ మహిళను క్షమించి వదిలేసినట్లు తెలుస్తోంది. -
మైనర్‌ను మభ్యపెట్టి షికార్లు! ఆపై..
నిజామాబాద్: బాలికపై లైంగికదాడికి పాల్పడిన యువకుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్ష విధిస్తూ బుధవారం నిజామాబాద్ రెండవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి (ప్రత్యేక పోక్సోకోర్టు) సీహెచ్ పంచాక్షరి తీర్పు చెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలానికి చెందిన భరషవార్ ఉమేష్ అదే మండలానికి చెందిన ఇంటర్ చదివే ఓ బాలికను నమ్మించి 12 ఫిబ్రవరి 2016న కాలేజీ నుంచి తన ఆటోలో తీసుకెళ్లాడు. రాత్రి అయినా కూతురు ఇంటికి రాకపోవటంతో బాలిక తండ్రి తెలిసిన బంధువులు, ప్రాంతాలలో వెతికినా ఆచూకి లభ్యంకాలేదు. అనంతరం గ్రామంలోని ఆటో డ్రైవర్ కనిపించక పోవటంతో అతనిపై అనుమానం కలిగి 13న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఉమేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. బాలికను బాన్సువాడకు తీసుకెళ్లి సినిమా చూపించి, అనంతరం బాసర, కరీంనగర్ ప్రాంతాలలో తిప్పి లైంగికదాడికి పాల్పడినట్లు విచారణలో తేలింది. ప్రాథమిక విచారణ చేపట్టిన అప్పటి బోధన్ ఏసీపీ వెంకటేశ్వర్లు అభియోగ పత్రాలను కోర్టులో సమర్పించారు. నేర విచారణలో భాగంగా 12 మంది సాక్ష్యాలను ప్రత్యేక పోక్సోకోర్టు నమోదు చేసింది. 16 సంవత్సరాల బాలికను అపహరించి లైంగిక దాడి చేశాడని నిర్ధారిస్తూ, ఉమేష్‌పై నేరారోపణలు రుజువైనట్లు ప్రకటిస్తూ అపహరణ నేరానికి మూడు సంవత్సరాల కఠిన కారాగార జైలుశిక్ష, రూ. 5వేల జరిమానా, పోక్సోకోర్టు చట్ట ప్రకారం లైంగిక దాడి నిరూపణ కావటంతో 20 ఏళ్ల కఠిన జైలుశిక్ష, రూ. 2వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఎస్సీ,ఎస్టీ అత్యాచారాల చట్టం ప్రకారం మరో మూడేళ్ల సాధారణ జైలుశిక్ష అ నుభవించాలని, రూ.2వేలు జరిమానా చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. జరిమానా చెల్లించకుంటే అదనంగా ప్రతి నేరానికి ఆరునెలల జైలుశిక్ష అనుభవించాలని ఆదేశించారు. ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అనుభవించాలని జడ్జి పేర్కొన్నారు. బాధితురాలికి జిల్లా న్యాయసేవాధికార సంస్థ రూ. 2లక్షల పరిహారం అందజేయాలని తీర్పులో సిఫార్సు చేశారు. -
వీధి కుక్కతో పెళ్లి.. ఇదేం ఆచారం రా బాబు!
భువనేశ్వర్: పూర్వకాలంలో ఆచారాలు పేరుతో కొన్ని అనాగరిక కార్యక్రమాలు జరిగేవి. మారుతున్న కాలంతో పాటు చాలావరకు మూఢనమ్మకాలు, అనాగరిక కార్యక్రమాల నంచి ప్రజలు బయటపడ్డారు. అయితే కొన్ని ఆచారాలు మాత్రం అక్కడో ఇక్కడో గ్రామల్లో ఇంకా కనిపిస్తునే ఉన్నాయి. తాజాగా ఈ తరహా ఆచారం ఒకటి ఒడిశాలోని కరగోలాలో వెలుగు చూసింది. ఆ గ్రామస్తులు ఏకంగా ఓ చిన్నారికి వీధికుక్కతో పెళ్లి జరిపించారు. దీని వెనుక కారణం కూడా ఉందని చెప్తున్నారు. బాలికకు పాలదంతాలు మొదట దవడ భాగంలో వచ్చాయని, అది అశుభానికి గుర్తుగా భావించి వివాహం చేశామాని పెద్దలు చెప్పారు. వారు ఈ ప్రత్యేకమైన ఆచారాన్ని నిర్వహించకపోతే, భవిష్యత్తులో అది పిల్లలకి ప్రమాదకరం అని కూడా నమ్ముతారు. అందుకే ఆ చిన్నారికి కుక్కతో పెళ్లి చేశామన్నారు. పాలదంతాలు దవడ భాగంలో వచ్చిన ప్రతీ ఒక్కరికీ ఇలానే చేస్తామని చెపారు. అయితే పేరుకి ఇది ఆచారమే అయినప్పటికీ స్థానికుల మధ్య పూర్తి అలంకరణ, హంగామ, విందుతో వివాహం జరుగుతుంది. అవగాహన లేకపోవడంతో ఈ సంప్రదాయం ఏళ్ల తరబడి కొనసాగుతోందని చెప్పాలి. -
ప్రేమపేరుతో ట్రాప్.. లాడ్జికి తీసుకెళ్లి.. మద్యం తాగించి
మంగళగిరి(గుంటూరు జిల్లా): ప్రేమ పేరుతో మైనర్(16)ను ట్రాప్ చేసి వ్యభిచార కూపంలోకి దించబోయారు. బాలిక చాకచక్యంగా తప్పించుకుని డయల్ 100కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సత్వరమే స్పందించి విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను మంగళగిరి డీఎస్పీ రాంబాబు మంగళవారం విలేకరులకు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్టకు చెందిన కంసాని రాజేష్ వివాహం చేసుకుని గుంటూరు జిల్లా మంగళగిరిలోని కొత్తపేటలో నివాసముంటున్నాడు. కొద్ది రోజులుగా రాజేష్ మంగళగిరిలోని పార్కు రోడ్డులో ఓ బాలికకు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌లో యువతి పరిచయం.. స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి గత నెల 22న రాత్రి రాజేష్ తన బంధువులు అవినాష్, వినోద్ సహాయంతో బాలికను కారులో యాదగిరిగుట్ట తీసుకువెళ్లి ఓ లాడ్జిలో ఉంచాడు. అక్కడ మద్యం తాగించి బాలికను అవినాష్ లోబర్చుకున్నాడు. రాజేష్ బంధువు సిరి వ్యభిచారం నిర్వహిస్తుండగా బాలికను ఆ కూపంలోకి దించాలని చూశారు. దీన్ని గ్రహించిన బాలిక తప్పించుకుని డయల్ 100కు ఫోన్ చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు బృందాలుగా ఏర్పడి రాజేష్, అవినాష్, వినోద్, సిరిని అరెస్ట్ చేసి బాలికను రక్షించారు. బాలిక కనిపించకుండా పోయిన రోజునే ఆమె తల్లిదండ్రులు మంగళగిరిలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ చెప్పారు. నిందితులను అరెస్ట్ చేసిన సిబ్బందికి అర్బన్ ఎస్పీ రివార్డు ప్రకటించారు. సమావేశంలో సీఐ భూషణం, ఎస్ఐలు నారాయణ, మహేంద్ర పాల్గొన్నారు. -
ఇంట్లో అలిగి బస్టాండ్‌కు వెళ్లిన మైనర్.. నలుగురు నమ్మించి తీసుకెళ్లి..
కేజీఎఫ్: బంగారుపేట తాలూకాలో శనివారం దారుణం చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలికపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాలు... తన పుట్టిన రోజు నాడు కూడా కొత్త దుస్తులు కొనివ్వలేదని అలిగి తాలూకాలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఆటోలో బంగారు పేటకు చేరుకుంది. బస్టాండ్ వద్ద ఉండగా ఆనంద్‌కుమార్, కాంతరాజు, ప్రవీణ్, వేణు అనే యువకులు బాలికకు పని ఇప్పిస్తామని నమ్మించి కామసముద్రం ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడి ఉడాయించారు. దారిన వెళ్తున్న కొందరు బాలిక పరిస్థితిని చూసి బంగారుపేట ఆస్పత్రిలో చేర్పించారు. తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గంటల వ్యవధిలోనే నలుగురు నిందితులను అరెస్ట్ చేసి పోక్సో కేసు నమోదు చేశారు. -
జీడిమెట్లలో బాలిక అనుమానాస్పద మృతి
సాక్షి, హైదరాబాద్: జీడిమెట్లలో ఓ బాలిక అనుమానాస్పద మృతి చెందిండం కలకలం రేపుతోంది. సుభాష్ నగర్‌కు చెందిన 17 ఏళ్ల బాలిక సోమవారం రాత్రి ఇంట్లో నుంచి ఆదృశ్యమైంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బాలిక ఆచూకీ కోసం వెతుకుతుండగా మంగళవారం తెల్లవారుజామున బాలిక మృతుహదేహం లభ్యమమైంది. జీడిమెట్ల పైప్ లైన్ రోడ్డులోని నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో రక్తపు మడుగుల్లో బాలిక మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాలికను హత్య చేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డాగ్ స్వాడ్, క్లూస్ టీంతో తనిఖీలు చేపట్టారు. అనుమానితులను, భవన నిర్మాణ కార్మికులు, స్థానికులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. -
బాలికపై లైంగికదాడికి యత్నం.. రైల్వే ఉద్యోగి అరెస్ట్!
సాక్షి, కృష్ణా: ఒకటో తరగతి చదువుతున్న బాలికపై ఓ రైల్వే ఉద్యోగి లైంగిక దాడికి యత్నించిన ఘటన సత్యనారాయణపురం రైల్వే క్వార్టర్స్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్యనారాయణపురం రైల్వే క్వార్టర్స్‌లో నివసించే రైల్వే ఉద్యోగికి భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పెద్ద కుమార్తె(11) స్థానికంగా ఉండే స్కూల్లో ఐదో తరగతి చదువుతుండగా రెండో కుమార్తె(8) ఒకటో తరగతి చదువుతోంది. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఆన్లైన్ తరగతులకు హాజరైన తర్వాత రెండో కుమార్తె బయటకు వచ్చి ఆడుకుంటుండగా అక్కడే విధులు నిర్వర్తిస్తున్న రైల్వే స్వీపర్ వెంకయ్య(53) బాలికకు మాయమాటలు చెప్పి పక్కనే శిథిలావస్థలో ఉన్న రైల్వే క్వార్టర్స్‌లోకి తీసుకువెళ్లాడు. ఆపై బాలిక ఒంటిపై చేతులు వేసి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో భయాందోళనకు గురైన బాలిక ఏడుస్తూ కేకలు వేస్తుండగా, అప్పటికే బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, స్థానికులు చుట్టు పక్కల వెతుకుతున్నారు. ఈ క్రమంలో పాడుపడిన క్వార్టర్స్ నుంచి బాలిక ఏడుపులు వినిపిండచంతో హుటాహుటిన అక్కడకు వెళ్లి చూడగా.. వెంకయ్య బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ కనిపించాడు. దీంతో తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయిన స్థానికులు అతనికి దేహశుద్ధి చేశారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో అతను వారి నుంచి తప్పించుకుని పారిపోయాడు.ఈ ఘటనపై తల్లిదండ్రులు మంగళవారం సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న వెంకయ్యను సెల్‌ఫోన్ సిగ్నల్ ద్వారా అరెస్టు చేసి, పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అనంతపురం జిల్లాలో దారుణానికి యత్నించిన టీడీపీ కార్యకర్త
-
టీడీపీ వర్గీయుల మరో వికృతక్రీడ.. ఒడిశా బాలికపై అత్యాచారం, హత్య?
సాక్షి, ఆత్మకూరు (నెల్లూరు): టీడీపీ వర్గీయుల వికృత క్రీడకు మరో బాలిక బలైపోయింది. విజయవాడలో ఓ టీడీపీ నాయకుడి దాష్టీకానికి ఆత్మహత్యకు పాల్పడిన బాలిక ఉదంతం మరువక మునుపే జిల్లాలోని చేజర్ల మండలం పుట్టుపల్లి పంచాయతీ కొట్టాలు గ్రామంలో స్థానిక టీడీపీ నాయకుడికి చెందిన ఇటుక బట్టీలో ఈ దారుణ ఘటన జరిగింది. ఇటుక బట్టీల వద్ద పనిచేయడానికి వచ్చిన ఓ కుటుంబంలోని బాలిక (17) అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఈ ఘటనపై స్థానికంగా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలిక మృతి సమాచారం బయటకు పొక్కకుండా గుట్టుచప్పుడు కాకుండా శవదహనం చేయడం స్థానికంగా వ్యక్తమవుతున్న అనుమానాలకు బలం చేకూరుతోంది. సేకరించిన విశ్వసనీయ సమాచారం మేరకు.. కొట్టాలు గ్రామంలో స్థానిక మాజీ సర్పంచ్, టీడీపీ నేత ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నారు. ఒడిశాకు చెందిన పలువురు కూలీలు కొన్ని నెలలుగా ఇక్కడ పని చేస్తున్నారు. అయితే మృతి చెందిన బాలిక ఇక్కడ మేనమామ, బాబాయిలతో కలిసి ఉంటుంది. తల్లిదండ్రులు సికింద్రాబాద్‌లో ఉంటూ అక్కడి ఇటుక బట్టీల వద్ద పనిచేస్తున్నారు. క్రమంలో బుధవారం తెల్లవారుజామున ఓ బాలిక (17) అనారోగ్యానికి గురైందంటూ తొలుత ఆత్మకూరు, అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ విషయం బయటకు పొక్కకుండా ఇటుక బట్టీల నిర్వాహకుడు వైద్యం చేయించాడు. అయితే శుక్రవారం రాత్రి ఆ బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మెడికో లీగల్ కేసు (ఎంఎల్సీ) అయినప్పటికీ ఎలాంటి ఫిర్యాదు లేకుండా ఆ టీడీపీ నేత జాగ్రత్త పడినట్లు సమాచారం. ఫిర్యాదు చేస్తే పోస్టుమార్టం రిపోర్టులో అసలు విషయాలు బట్టబయలు అవుతాయనే ఉద్దేశంతో బాలిక బంధువులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. బాధితుల సంప్రదాయాలకు భిన్నంగా నెల్లూరు బోడిగాడితోటలో శనివారం బాలిక మృతదేహానికి దహన సంస్కారాలు చేయించారు. ఆనవాళ్లు లేకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకోవడంలో సదరు టీడీపీ నేత సఫలీకృతుడయ్యారని స్థానికులు చెబుతున్నారు. అసలు ఏం జరిగింది.. బాలిక అందంగా ఉంటుంది. దీంతో అక్కడే పని చేసే స్థానిక యవకులు బాలికపై కన్నేసినట్లు సమాచారం. బాలికపై లైంగికదాడికి పలుమార్లు విఫలయత్నం చేశారు. బుధవారం రాత్రి కొందరు బాలికపై అఘాయిత్యానికి పాల్పడడంతో ప్రతిఘటనలో గాయపడినట్లు గ్రామంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బాలిక గాయపడి, చనిపోయేంత వరకూ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. శనివారం సాయంత్రం తల్లిదండ్రులు సికింద్రాబాద్ నుంచి నెల్లూరుకు చేరుకున్నారు. ఆ తర్వాత హడావుడిగా వారి సంప్రదాయాలకు భిన్నంగా దహనక్రియలు చేయడం అనుమానాలకు బలం చేకూర్చుతోంది. ఆదివారం బాలిక తండ్రికి ఇటుక బట్టీ యజమాని రూ.30 వేలు నగదు ఇచ్చినట్లు సమాచారం. బాలిక మృతిపై ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు వెళ్లడంతో ఆదివారం గ్రామానికి చేరుకుని మొక్కుబడిగా విచారణ జరిపారు. బాలికకు ఫిట్స్‌తో మృతి చెందిందని జిల్లా లేబర్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు ప్రకటించారు. పోలీస్ కేసు కూడా లేదు.. బాలిక గాయపడితే పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. వాస్తవానికి ఇది మెడికో లీగల్ కేసు. పోలీసులు ఈ వ్యవహారంపై అనుమానాస్పద మృతిగా తొలుత కేసు నమోదు చేయాల్సి ఉంది. పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉన్నా ఈ ప్రక్రియలు జరగలేదు. బాధితులు ఒడిశా వాసులు కావడంతో వారి తరఫున పట్టించుకునే నాథుడు లేకపోవడంతో సదరు టీడీపీ నేత అందరి నోర్లను నోట్లతో నొక్కినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనపై ప్రచారం జరగడం ఐసీడీఎస్, కార్మికశాఖ, పోలీసులు బాధితులు నివాసం ఉండే ప్రాంతానికి చేరుకుని విచారణ చేపట్టి చేతులు దులుపుకున్నారు. బాధితులు ఒడిశా వాసులు కావడంతో వారిని భయపెట్టి ఎలాంటి విషయాలు బయటకు పొక్కకుండా సదరు టీడీపీ నేత జాగ్రత్త పడినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. బాలిక తండ్రి లోచన్ మాంజీని మీడియా ప్రతినిధులు అడిగితే.. తన కుమార్తె అనారోగ్యంతో చనిపోయిందంటూ సమాధానం ఇచ్చారు. ఈ విషయమై లోతుగా విచారణ జరిపితే మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. -
కన్నబిడ్డలాంటి ఆమెపై అకృత్యం
శివమొగ్గ: భార్య చెల్లెలు.. పైగా మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. శివమొగ్గ జిల్లాలోని కుంసి పరిధిలో చోటుచేసుకున్న దారుణ ఘటనలోకి వెళ్తే.. సదరు బాధితురాలు.. అక్క-బావ ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది. ఈ క్రమంలో కన్నబిడ్డలా చూసుకోవాల్సిన ఆ బాలికను.. కామంతో చూడడం మొదలుపెట్టాడు. భార్య కళ్లు గప్పి మాయమాటలు చెప్పి ఆ బాలికపై లైంగికవాంఛలు తీర్చుకుంటూ వచ్చాడు. బాలికకు అనారోగ్యంగా ఉండటంతో అక్క చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లగా బాలిక ఏడు నెలల గర్భిణి అని వైద్యులు తెలిపారు. బాలికకు 18 ఏళ్లు నిండాయని చెప్పి గొడవ లేకుండా ఇంటికి తీసుకొచ్చారు. బాలికకు నొప్పులు రాగా మెగ్గాన్ ఆస్పత్రిలో చేర్పించారు. 7 నెలలకే ప్రసవం కాగా బిడ్డ మృతి చెందింది. విషయం పోలీసుల దృష్టికి రావడంతో.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరె స్టు చేశారు కుంసి పోలీసులు. తీర్థహళ్లిలో మరో కేసు: తీర్థహళ్ళి పట్టణంలో మరో పోక్సో కేసు నమోదైంది. తాపీ పని చేయడానికి వచ్చిన యువకుడు స్థానిక బాలికతో పరిచయం పెంచుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితున్ని అరెస్టు చేశారు. -
ఇంటికొచ్చిన భార్య చెల్లెలిని లోబర్చుకుని.. ఏడు నెలలకే..
శివమొగ్గ: భార్య చెల్లెలు అయిన మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘరానా బావను జిల్లాలోని కుంసి పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరె స్టు చేశారు. అక్క–బావ ఇంట్లో ఉంటూ చదువుకుంటున్న బాలికను బావ కన్నబిడ్డలా చూసుకోవడానికి బదులు కన్నేశాడు. మాయమాటలు చెప్పి లైంగికవాంఛలు తీర్చుకుంటూ ఉన్నాడు. ఇటీవల బాలికకు అనారోగ్యంగా ఉండటంతో అక్క చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లగా బాలిక ఏడు నెలల గర్భిణి అని వైద్యులు తెలిపారు. బాలికకు 18 ఏళ్లు నిండాయని చెప్పి గొడవ లేకుండా ఇంటికి తీసుకొచ్చారు. బాలికకు నొప్పులు రాగా మెగ్గాన్ ఆస్పత్రిలో చేర్పించారు. 7 నెలలకే ప్రసవం కాగా బిడ్డ మృతి చెందింది. పోలీసులు బావను కటకటాల్లోకి తరలించారు. తీర్థహళ్లిలో మరో కేసు: తీర్థహళ్ళి పట్టణంలో మరో పోక్సో కేసు నమోదైంది. తాపీ పని చేయడానికి వచ్చిన యువకుడు స్థానిక బాలికతో పరిచయం పెంచుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితున్ని అరెస్టు చేశారు. -
బాలిక ఆత్మహత్య ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది: వాసిరెడ్డి పద్మ
సాక్షి, విజయవాడ: టీడీపీ నేత వినోద్ జైన్ వేధింపులతో విజయవాడలో బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. 'ఈ ఘటన జరగడం దురదృష్టకరం. బాలిక ఆత్మహత్య ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. టీడీపీ నేత వేధింపులే కారణమని బాలిక తన సూసైడ్ నోట్లో రాసింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. పోలీసుల విచారణలో అన్నీ విషయాలు తెలుస్తాయి. ఘటనకు కారణమైన నిందితులను వదిలిపెట్టే ప్రసక్తేలేదు’ అని వాసిరెడ్డి పద్మ అన్నారు. చదవండి: (విజయవాడ: టీడీపీ నేత వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య) -
బాలికను వంచించి.. గర్భవతిని చేసిన ఆటో డ్రైవర్..
సాక్షి, బుక్కరాయసముద్రం (అనంతపురం): పాఠశాలకు తన ఆటోలో వచ్చే బాలికపై ఓ ఆటో డ్రైవర్ కన్నేశాడు. మాయ మాయమాటలు చెప్పి మచ్చిక చేసుకున్నాడు. గర్భం దాల్చిన ఆ బాలిక మృతశిశువుకు జన్మనిచ్చింది. బుక్కరాయసముద్రం పోలీసులు తెలిపిన వివరాల మేరకు... మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక అనంతపురం నగరంలోని ఓ పాఠశాలలో చదువుకుంటోంది. రేకులకుంట గ్రామానికి చెందిన రామాంజనేయులు ఆటోలో పాఠశాలకు వెళ్లి వచ్చేది. అప్పటికే పెళ్లయి ఇద్దరు సంతానమున్న రామాంజనేయులు బాలికతో పరిచయం పెంచుకున్నాడు. మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. చదవండి: (అర్ధరాత్రి పార్టీ.. మద్యం మత్తులో చిందులు.. నటులపై కేసు) పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చగా... విషయం ఎవరికైనా చెబితే చంపుతానంటూ బెదిరించాడు. అంతేకాకుండా అబార్షన్ అయ్యేందుకు మాత్రలు ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ నెల 28న బాలిక అనారోగ్యానికి గురి కావడంతో తల్లి అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తుండగా...మార్గమధ్యంలో మృత శిశువుకు జన్మనిచ్చింది. దీంతో జరిగిన విషయాన్ని తల్లికి బాధితురాలు వివరించింది. అనంతరం బాలికను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా... విషయం తెలుసుకున్న పోలీసులు రామాంజనేయులుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కఠిన చర్యలు తీసుకుంటాం బాలిక ప్రసవం కేసును సీరియస్‌గా పరిగణించాం. ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఆదేశాల మేరకు నిందితునిపై కఠిన చర్యలు తీసుకుంటాం. పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. త్వరలో నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపుతాం. – ప్రసాదరెడ్డి, అనంతపురం డీఎస్పీ -
మైనర్‌తో వృద్ధుడి అసభ్య ప్రవర్తన..
సాక్షి, ఖమ్మం అర్బన్: టేకులపల్లి పరిధి డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రాంగణం సమీపంలో ఓ వృద్ధుడు ఐదో తరగతి చదువుతున్న బాలికతో అసభ్యంగా ప్రవర్తించడంతో స్థానికులు దేహశుద్ధి చేశారు. బాధిత బాలిక తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. పదేళ్ల బాలిక తన తమ్ముడితో కలిసి గురువారం ఇళ్ల సమీపంలో రేగిపండ్ల కోసం వెళ్లగా అరటిపండ్లు విక్రయించే 53ఏళ్ల వీరమల్ల వెంకన్న ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. కౌగిలించుకుని అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో చిన్నారి గట్టిగా కేకలు వేయగా వదిలేయడంతో పరుగున ఇంటికి చేరుకుని విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. కోపోద్రిక్తుడైన తండ్రి స్థానికులతో కలిసి డబుల్ బెడ్రూం బ్లాక్‌లో ఉన్న అతడి ఇంటికి వెళ్లి కొట్టి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ట్లు ఖానాపురం హవేలీ ఠాణా సీఐ జే.రామకృష్ణ తెలిపారు. -
స్కూల్లో ఉన్న విద్యార్థినిని బలవంతంగా బైక్‌పై తీసుకెళ్లి లైంగిక దాడి
జైపూర్: గతంలో ఒంటరిగా ఉన్న మహిళలలు, బాలికలపై వేధింపులు పాల్పడిన ఘటనలు చూశాం. అయితే ఇటీవల సమాజంలో జరుగుతున్న కొన్ని ఘటనలను చూస్తే జనం మధ్యలో ఉన్న బాలికలకు వేధింపులు తప్పట్లేదు. తాజాగా 9వ తరగతి విద్యార్థిని పాఠశాల నుంచి కిడ్నాప్ చేసి ఆపై ఆమెపై లైంగిక దాడి చేశాడు 12 తరగతి విద్యార్ధి. ఈ దారుణమైన ఘటన రాజస్థాన్‌లోని దుంగార్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. బిచివారా గ్రామంలోని ఓ పాఠశాలలోని జనవరి 24న భోజన విరామ సమయంలో తొమ్మిదో తరగతి విద్యార్థి బయటకు రాగానే అదే పాఠశాలలో చదువుతున్న 12వ తరగతి విద్యార్థి ఆ బాలికను బలవంతంగా తన మోటార్ బైక్‌పై ఎక్కించుకుని వెళ్లిపోయాడు. ప్రధాన నిందితుడు, అంఝరా నివాసి, మైనర్‌ను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి గంటల తరబడి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సాయంత్రం ఆ బాలికను ఆమె ఇంటి వెలుపల పడేసి అక్కడ నుంచి పారిపోయాడు. బాలిక తన కుటుంబ సభ్యులకు జరిగిన దారుణాన్ని తెలియజేసింది. దీంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ప్రధాన నిందితుడిని, అదే పాఠశాలలో చదువుతున్న అతని స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలికి తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. -
తల్లికి అనారోగ్యం.. మందులు ఇప్పిస్తానని చెప్పి బాలికపై లైంగిక దాడి
న్యూఢిల్లీ: తల్లికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మందుల కోసం సహాయం కోరిన బాలికపై ఓ పొరుగు వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఈ దారుణం జనవరి 22న చోటు చేసుకోగా మరుసటి రోజు కేసు నమోదైంది. వివరాల ప్రకారం.. ఢిల్లీలోని పాండవ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బాలిక తల్లి అస్వస్థతకు గురైంది. ఆ సమయంలో బాలిక తండ్రి కూడా ఇంట్లో లేడు. దీంత ఆ బాలిక తల్లికి మందుల కోసం ఆ ప్రాంతాంలోనే నివసిస్తున్న అరుణ్ అనే వ్యక్తిని సహాయం చేయాలని కోరింది. అందుకు అంగీకరించిన అరుణ్ బాలికకు మందులు ఇప్పిస్తానని చెప్పి ఆ ప్రాంతం నుంచి దూరంగా తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేగాక, ఈ విషయం బయటకు తెలిస్తే ఆమెను చంపేస్తానని బెదిరించి అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ( చదవండి: ఒక్క క్షణం ఆలోచించి ఉంటే.. ఈ విషాదం ఉండేది కాదు! ) -
ఆడుకుందామని పిలిచి.. మైనర్‌బాలికపై సామూహిక లైంగిక దాడి
న్యూఢిల్లీ: మహిళలు, బాలికలపై జరుగుతున్న లైంగికిదాడులకు అడ్డుకట్టకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా అవి ఆశించినంత స్థాయిలో ఫలితాలని ఇవ్వడం లేదనే చెప్పాలి. ఇటీవల జరుగుతున్న ఘటనల్లో.. కొన్ని వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలు కూడా నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇద్దరు మైనర్లు ఎనిమిదేళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఈశాన్య ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మైనర్ బాలిక తన ఇంటి బయట ఆడుకుంటుండగా, అదే ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల బాలుడు ఆమెతో మాటలు కలిపి ఆడుకుందామని బాలికను ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఘటనా స్థలానికి మరో బాలుడు కూడా చేరుకున్నాడు. అనంతరం వార్దిదరు ఆ బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి వారు అక్కడ నుంచి పారిపోయారు. బాధితురాలు సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చినప్పుడు, ఆమె తన కడుపు, ప్రైవేట్ భాగాలలో నొప్పి గురించి తన తల్లికి ఫిర్యాదు చేసి, తరువాత జరిగిన సంఘటన గురించి ఆమెకు చెప్పింది. ( చదవండి: ఒక్క క్షణం ఆలోచించి ఉంటే.. ఈ విషాదం ఉండేది కాదు! ) దీంతో బాధితురాలి తల్లి ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు మైనర్ బాలురను అదుపులోకి తీసుకుని జువైనల్ హోంకు తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉన్నందున, ఆమెను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఆమెకు శస్త్రచికిత్స అందించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. -
ఆరు నెలలుగా బాలికపై లైంగిక దాడి.. ఒంటిపై పంటిగాట్లు గుర్తించి..
పంజగుట్ట (హైదరబాద్): మైనర్‌బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పంజగుట్ట పోలీసులు తెలిపిన మేరకు.. జహీరాబాద్‌కు చెందిన మహ్మ ద్ మోహిజ్ (20)ఎమ్ఎస్ మక్తాలో నివాసం ఉండే అక్క ఇంట్లో ఉంటూ జూబ్లీహిల్స్‌లో వెల్డింగ్ వర్క్ చేస్తుంటాడు. ఇతడు అద్దెకు ఉండే ఇంట్లోనే, మరో కుటుంబం అద్దెకుంటోంది. వారి కూతురు (13)ను గత ఆరు నెలలుగా బిల్డింగ్‌పైకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. మంగళవారం బాలిక ఒంటిపై పంటిగాట్లు ఉన్న విషయం కుటుంబసభ్యులు గమనించారు. మహ్మద్ మోహిజ్ చేసే పైశాచికం గూర్చి బాలిక చెప్పింది. దీంతో కుటుంబసభ్యులు మోహిజ్‌ను పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. చదవండి: (కీచక హెచ్ఎం.. విద్యార్థినితో రాసలీలలు.. వీడియోలు వైరల్) -
మైనర్ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ దృశ్యాలు ఇంటర్నెట్లో..
శివమొగ్గ (కర్ణాటక): మైనర్ విద్యార్థినిపై అత్యాచారం చేసి ఆ దృశ్యాలను ఇంటర్నెట్లో పోస్టు చేసిన దుండగులను హొసనగర పోలీసులు అరెస్టు చేశారు. వారంబళ్లికి చెందిన సునీల్, ఆయనూరు గ్రామానికి చెందిన సంతోష్‌లు మైనర్ బాలికపై అత్యాచారం చేశారు. సచిన్, సుబ్బ, రఘు అనే వ్యక్తులు వారికి సహకరించారు. ఈ ఐదు మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు సునీల్, సంతోష్‌లు సదరు మైనర్ బాలికకు పరిచయస్తులు. ఇటీవల హొసనగర పట్టణంలోని బస్టాండ్‌లో ఊరికి వెళ్లేందుకు బాలిక వేచిచూస్తోంది. ఈ సమయంలో కారులో వచ్చిన నిందితులు ఇంట్లో దింపుతామని నమ్మించి కారులో తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. వీడియోలు తీసి పోస్ట్ చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు మృగాళ్లను అరెస్టు చేశారు. పసిమొగ్గపై కిరాతకం యశవంతపుర: చిన్నారిపై దారుణం చోటుచేసుకుంది. నందిని లేఔట్ పోలీసుస్టేషన్ పరిధిలో బాలిక (8) తల్లి పనికి వెళ్లిన సమయంలో శనివారం రాత్రి 7 గంటలప్పుడు పక్క ఇంటిలో ఉండే యువకుడు అత్యాచారం చేశాడు. తల్లి ఇంటికి వచ్చిన తరువాత బాలిక విషయం చెప్పగా, నందినిలేఔట్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దుండగుడు పరారీలో ఉన్నాడు. చదవండి: (ఇంటర్ విద్యార్థినితో పరిచయం పెంచుకొని.. పలుమార్లు అత్యాచారం) -
ఇంటర్ విద్యార్థినితో పరిచయం పెంచుకొని.. పలుమార్లు అత్యాచారం.
తిరువొత్తియూరు (చెన్నై): కృష్ణగిరి జిల్లా పోచంపల్లి సమీపంలో వివాహం చేసుకుంటానని నమ్మించి బాలికను గర్భిణిని చేసిన ఓ కళాశాల విద్యార్థిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వివరాలు.. కృష్ణగిరి జిల్లా పోచంపల్లి సమీపంలోని 17 ఏళ్ల బాలిక ప్లస్‌టూ చదువుతోంది. అదే ప్రాంతంలో పాపనూరుకు చెందిన ప్రవీణ్‌కుమార్ (19) కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో ప్రవీణ్‌కుమార్ విద్యార్థినితో పరిచయం పెంచుకుని సన్నిహితంగా మెలిగాడు. దీంతో ఆ బాలిక ఎనిమిది నెలల గర్భిణి అయ్యింది. అయితే బాధితురాలిని వివాహం చేసుకోవడానికి ఆ విద్యార్థి తిరస్కరించాడు. తరువాత ఆమెను బెదిరించినట్లు తేలింది. దీంతో బాధితురాలు బర్గూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ అముద కేసు నమోదు చేసి ప్రవీణ్‌కుమార్‌ను ఆదివారం ఫోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. చదవండి: (తన పేరు మార్పుపై సీఎం స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు) -
విద్యుత్ బిల్లు కట్టేందుకు వెళ్లి మైనర్‌పై అఘాయిత్యం
సాక్షి, గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని అప్పయ్యపల్లి గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మైనర్ బాలికపై కరెంట్ బిల్లు కొడుతానని వెళ్లిన కాంట్రాక్టు ఉద్యోగి కింద పనిచేసే మరో యువకుడు శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారయత్నం చేయబోయాడు. ఇది గమనించిన బాలిక సోదరుడు అతనిపై తిరగబడడంతో అక్కడి నుంచి జారుకున్నాడు. బాధిత బాలిక విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో విద్యుత్ బిల్లులు కొట్టేందుకు కాంట్రాక్టు ప్రాతిపదికగా పనిచేస్తున్న వ్యక్తికి ఫోన్ చేసి సదరు వ్యక్తి తమ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని అతన్ని పిలిపిస్తే మాట్లాడుతామని చెప్పడంతో శనివారం ఉదయం సదరు కాంట్రాక్టు ఉద్యోగి నిందితుడు గుర్రం కిషోర్‌ను (26) తీసుకుని అప్పయ్యపల్లి గ్రామానికి వెళ్లాడు. చదవండి: (బస్సు, ఆటో ఢీ : అత్త, అల్లుడి దుర్మరణం) నిందితుడిని చూసిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కోపోద్రిక్తులై దాడి చేశారు. దీంతో నిందితుడు ప్రాణభయంతో స్థానిక ఉపసర్పంచ్ సదయ్య ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకోవడంతో మండిపడిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి డాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీస్‌లు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. -
అన్నా.. అని వేడినా కనికరించలేదు.. సోదరిని, తల్లిని సైతం వీడియో తీసి..
సాక్షి, నక్కపల్లి (విశాఖపట్నం): అన్నయ్యా అని పిలిచినా కనికరించలేదు.. కాళ్లావేళ్లా పడ్డా వదిలిపెట్టలేదు.. నోరెత్తితే చంపేస్తానని కత్తితో బెదిరించాడు.. అన్నయ్యను కాదు, మామయ్యను అవుతానంటూ లైంగిక దాడి చేశాడు.. ఈ దారుణ ఘటన గురువారం రాత్రి నక్కపల్లి మండలం రాజయ్యపేటలో జరిగింది. 11 ఏళ్ల మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన గొడ్డు నాగేశు (22) అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. బాధిత బాలిక పాఠశాల నుంచి ఇంటికి వచ్చేసరికి వంట చెరకు కోసం ఆమె సోదరి పక్కనే ఉన్న జీడితోటకు వెళ్లింది. ఆమెకు సహాయపడేందుకు బాధితురాలు కూడా తోటకు బయలుదేరింది. ఈ విషయం గమనించిన నిందితుడు ఆమె వెంట వెళ్లి ఈ అఘాయిత్యం చేశాడు. బాలికను వీడియో తీసి ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని కత్తితో బెదిరించాడు. అంతేకాకుండా బాధితురాలి సోదరిని, తల్లిని సైతం వీడియో తీసి తన మొబైల్‌కు పంపించాలని చెప్పాడు. అలా ఆ బాలికను నాలుగు గంటలపాటు చిత్రహింసలకు గురిచేశాక రాత్రి 9 గంటల సమయంలో తనే ఇంటి వద్ద వదిలివెళ్లాడు. చదవండి: (మూడురోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి.. ప్రేమజంట..) తమ చిన్న కుమార్తె కనిపించలేదని కంగారుగా వెతుకుతున్న తల్లిదండ్రులు.. ఎట్టకేలకు ఇంటికి చేరడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆమె చెప్పిన విషయం విని వారి గుండెలు బద్దలైపోయాయి. వెంటనే బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు శుక్రవారం పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. నిందితుడిపై పోక్సో చట్టం సెక్షన్ 5 (ఎం), (హెచ్), ఆర్డబ్ల్యూ 6, సెక్షన్ 12 కింద, ఐపీసీ 376 (ఎఫ్), 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని సీఐ నారాయణరావు తెలిపారు. చదవండి: (విషాదం: సరిగ్గా చదవడం లేదని మందలిస్తే..) రాత్రి స్టేషన్‌కు వెళితే పొద్దున్న రమ్మన్నారు: బాధితుల ఆవేదన తమ కుమార్తెకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు గురువారం రాత్రి పోలీస్‌స్టేషన్‌కు వెళితే వారు పొద్దున్న రమ్మన్నారని, వెంటనే స్పందించలేదని బాధిత తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై సీఐ నారాయణరావును వివరణ కోరగా రాత్రి స్టేషన్‌కు వచ్చిన సంగతి తనకు ఉదయం తెలిసిందని, రాతపూర్వక ఫిర్యాదుతో రాకపోవడంతో ఉదయం రమ్మని నక్కపల్లి స్టేషన్ సిబ్బంది చెప్పి ఉండవచ్చన్నారు. తనకు సమాచారం తెలిసిన వెంటనే నిందితుడు ఉద్యోగం చేస్తున్న ప్రాంతానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నామన్నారు. -
రెండేళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. కేకలు వేయడంతో..
సాక్షి హయత్‌నగర్: అభం శుభం ఎరుగని రెండేళ్ళ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన మేరు.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన గుల్షన్ సహాని (26) పెయింటింగ్ పనులు చేస్తూ హయత్‌నగర్‌లో నివాసముంటున్నాడు. ఈ నెల 12న సమీపంలో నివసించే ఓ రెండేళ్ళ బాలికతో అతను అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక కేకలు వేయడంతో గుర్తించిన కుటుంబ సభ్యులు నిందితున్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బస్సు ఢీకొని రిటైర్డ్ ఉద్యోగి మృతి నాగోలు: ఆర్టీసీ బస్సు ఢీకొని రిటైడ్డ్ ఉద్యోగి మృతి చెందిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఎల్బీనగర్ చిత్రలేవుట్ కాలనీలో నివాసం ఉండే కజ్జం మల్లయ్య(76) రిటైర్డ్ ఉద్యోగి. బుధవారం సాయంత్రం శివగంగ కాలనీ నుంచి ఎల్బీనగర్ చౌరస్తా వైపు పల్సర్ బైక్‌పై తిరిగి వస్తున్నాడు. సిరీస్ రోడ్డు ఎస్బీఐ ఏటీఎం వద్ద యూటర్న్ తీసుకుంటుండగా వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు బైక్‌ను వెనుక వైపు నుంచి ఢీకొట్టాడు. దీంతో మల్లయ్య తీవ్ర గాయాలు కావడంతో అపస్మారక స్ధితికి చేరుకున్నాడు. స్థానికులు చికిత్స నిమిత్తం కామినేని హాస్పిటల్‌కు తరలించగా, వైద్యులు పరీక్షించి మల్లయ్య మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎల్బీనరగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అల్వాల్‌లో ప్రత్యక్షం.. ఉప్పల్‌లో అదృశ్యం -
వార్డెన్ నిర్వాకం.. హస్టల్ గదులను శుభ్రం చేయాలని బాలికకు వేధింపులు
చెన్నై: తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. ఒక హస్టల్ వార్డెన్ బాలికపట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తించింది. బాలికను హస్టల్లోని గదులను శుభ్రంచేయాల్సిందిగా వేధించింది. దీంతో మనస్తాపానికి గురైన సదరు బాలిక.. విషంతాగి ఆత్మహత్యకు పాల్పడింది. గత జనవరి 9న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. 17 ఏళ్ల బాలిక తంజావురు జిల్లాలోని మిఛేల్పట్టి గ్రామంలోని ప్రభుత్వ హస్టల్ ఉంటూ చదువుకుంటుంది. ఈ క్రమంలో బాలికను హస్టల్ వార్డెన్ సగయమేరీ గదులను శుభ్రం చేయాల్సిందిగా ఆదేశించింది. అంతటితో ఆగకుండా బాలికపట్ల క్రూరంగా ప్రవర్తించింది. దీంతో బాలిక పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. బాలికను మెరుగైన వైద్యం కోసం తంజావురు ఆసుపత్రికి తరలించారు. ఆమెను అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందించారు. కాగా, జనవరి 18న బాలిక వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. వార్డెన్ ప్రతిరోజు తరగతి గదులను శుభ్రం చేయాల్సిందిగా తనను వేధిస్తుండేదని తెలిపింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు హస్టల్వార్డెన్పై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక చికిత్స పొందుతు జనవరి 19న మృతి చెందింది. బాలిక మృతికి హస్టల్ వార్డెన్ వేధింపులే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో హస్టల్ వార్డెన్‌పై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: ప్రేయసి కోసం కిడ్నీ దానం చేసిన ప్రియుడు.. ట్విస్ట్ ఏంటంటే -
బయోగ్యాస్ ప్లాంట్‌లో పుర్రెలు, పిండాల ఎముకలు
మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఆవరణలో కనీసం 11 పుర్రెలు 54 పిండాల ఎముకలను పోలీసులు వెలికి తీశారు. ఈ మేరకు పోలీసులు అక్రమ అబార్షన్ కేసును విచారిస్తున్నప్పుడు ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని తెలిపారు. దీంతో ఆ ప్రైవేట్ ఆస్పత్రికి చెందిన వైద్యుడు డాక్టర్ రేఖా కదమ్, నర్సుని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...13 ఏళ్ల బాలికకు బలవంతంగా అబార్షన్ చేయించుకోమని బాలికతో సంబంధం పెట్టుకున్న మైనర్ బాలుడి తల్లిదండ్రులు ఒత్తిడి తీసుకు వచ్చారు. ఈక్రమంలో ఆ బాలుడి తల్లిదండ్రులు ఆ బాలికను అబార్షన్ చేయించుకోకపోతే నీ పరువు తీస్తామని బెదిరించారు. అంతేకాదు ఆమెకు అబార్షన్ చేయించేందుకు వైద్యులకు డబ్బులు కూడా ఇచ్చారు. ఒక బాలికకు బలవంతంగా అబార్షన్ చేస్తున్నారంటూ ఫిర్యాదు రావడంతో దర్యాప్తు చేయడం ప్రారంభించాం. అప్పుడు ఆర్వీ తహసీల్‌లోని కదమ్ ఆసుపత్రి ఆవరణలో ఉన్న బయోగ్యాస్ ప్లాంట్‌ను తనీఖీ చేస్తుండగా పిండాలు, ఎముకలు బయటపడ్డాయి. దీంతో ఆ మైనర్ బాలుడి తల్లితండ్రులను, వైద్యుడిని, నర్సుని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశాం అని పోలీసులు తెలిపారు. (చదవండి: ఏంటా దూకుడు!... బ్రేక్ వేసుండకపోతే పరిస్థితి....) -
దివ్యాంగ బాలికపై లైంగిక దాడి.. ఫ్లైఓవర్ పై తీసుకెళ్ళి..
జైపూర్: రోజురోజుకీ మహిళలు, బాలికలపై లైంగిక దాడులు పేరుగుతునే ఉన్నాయి. వీటిని అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకున్న అవి ఫలితాల్ని ఇవ్వడం లేదు. తాజాగా.. నిర్మానుష్య ప్రదేశంలో ఓ దివ్యాంగ బాలిక అపస్మారక స్థితిలో పడినట్లు పోలీసులకి సమాచారం అందింది. వెంటనే బాలికను చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించగా ఆమెపై అత్యాచారం జరిగినట్లు తెలిసింది. ఈ ఘటన రాజస్థాన్ అల్వార్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్వార్ ప్రాంతంలోని ఓ ఫ్లైఓవర్ పై అపస్మారక స్థితిలో ఉన్న దివ్యాంగ బాలికను కొందరు గుర్తించి పోలీసులకి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను మెరుగైన చికిత్స కోసం జైపూర్‌కు తరలించారు. బాలికకు చికిత్స చేసిన వైద్యులు ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యలు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం దర్యాప్తు ప్రారంభించారు. -
హైదరాబాద్‌లో దారుణం.. 72 ఏళ్ల వృద్ధుడు 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడి.. ఆపై
సాక్షి హైదరాబాద్: 72 ఏళ్ల వృద్ధుడు 13 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సుజాత లా పబ్లిషింగ్ హౌస్ రచయిత అయిన గాదె వీరారెడ్డి (72) బర్కత్‌పురలోని గోకుల్ధామ్ అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్నాడు. 2010లో అతడి ఇంట్లో బాధితురాలి తల్లి పని మనిషిగా పని చేసేది. 2017లో ఆమెను బడంగ్‌పేటలోని తన ఓపెన్ ప్లాట్‌కు వాచ్‌మెన్‌గా నియమించుకున్నాడు. ఆ తర్వాత బాధితురాలి తల్లి, ఆమె మేనమామ ఇద్దరు కలిసి మీర్‌పేట పీఎస్ పరిధిలో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. అప్పటి నుంచి వారు అక్కడే ఉండేవాళ్లు. ఇంటి పనులు మానేసి జీవనోపాధి కోసం టైలరింగ్ చేస్తుండేది. ఈ నేపథ్యంలో నిందితుడు వీరారెడ్డి తన న్యాయ పుస్తకాలను భద్రపరిచేందుకు సంచులు కావాలన్న నెపంతో తరచూ బాధితురాలి ఇంటికి వెళ్తుండేవాడు. గతేడాది డిసెంబర్లో బాధితురాలి తల్లి కుమార్తెను ఇంట్లో వదిలి సొంతూరికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని విషయం తెలుసుకున్న వీరారెడ్డి అక్రమంగా చొరబడి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఊరి నుంచి తిరిగొచ్చిన తల్లికి బాధితురాలు విషయం చెప్పడంతో ఆమె మీర్‌పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడు వీరారెడ్డి కేసు ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో మీ పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుంటానని బాధితురాలి తల్లిని బెదిరించాడు. తనను వేధిస్తున్నారని పేర్కొంటూ నాన్–జ్యూడీషియల్ స్టాంప్ పేపర్లపై వివరాలు రాసి బాధితురాలి తల్లి, ఆమె మేనమామకు వాట్సాప్ ద్వారా పంపించాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. అతడి నుంచి రెండు నాన్ జ్యూడీషియల్ స్టాంప్ పేపర్లు, స్కూటర్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. -
కోడిని కొనే నెపంతో ఇంట్లోకి ప్రవేశించి మైనర్ బాలికపై లైంగికదాడి
సాక్షి,శృంగవరపుకోట రూరల్(విజయనగరం): ఎస్.కోట మండలంలో కోడిని కొనే నెపంతో ఇంట్లో చొరబడిన ఓ దుండగుడు 10వ తరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడికి బుధవారం రాత్రి పాల్పడ్డాడు. దీంతో అదే రోజు రాత్రి గ్రామపెద్దలతో కలిసి బాలిక తల్లిదండ్రులు ఎస్.కోట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సంఘటనకు సంబంధించి గురువారం తెలిసిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఒక గ్రామానికి చెందిన రైతు దగ్గర ఓ వ్యక్తి రైతరికం కోసం చేరాడు. భార్య, 10వ తరగతి చదువుతున్న కూతురితో కలిసి ఉంటున్న ఆ వ్యక్తి కోళ్లను పెంచి అమ్ముతూ ఉంటాడు. అయితే రైతరికం చేస్తున్న వ్యక్తి..కుమార్తెను ఇంటి వద్దనే ఉంచి భార్యతో కలిసి పనిమీద శృంగవరపుకోట పట్టణానికి బుధవారం వచ్చారు. అదే సమయంలో గంట్యాడ మండలం, బోనంగి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కోళ్ల కోసం వచ్చి బేరమాడే పనిలో ఉంటూనే బాలికను మంచినీళ్లు ఇమ్మని అడిగాడు. ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకున్న ఆ వ్యక్తి నీళ్లు తెచ్చేందుకు ఇంట్లోకి వెళ్లిన బాలికపై లైంగికదాడికి ఒడిగట్టాడు. ఆ సమయంలో బాలిక పెద్దగా కేకలు వేసినప్పటికీ వారిల్లు ఊరికి దూరంగా ఉండడంతో ఎవరికీ వినిపించలేదు. బాలికపై లైంగికదాడికి పాల్పడిన దుండగుడు అనంతరం పారిపోయాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు బాలిక జరిగిన ఘోరం చెప్పగా గ్రామపెద్దలతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు లైంగికదాడికి పాల్పడిన నిందితుడిని గురువారం వేకువజామున అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కాగా ఈ కేసు విషయమై సీఐ సింహాద్రినాయుడితో మాట్లాడగా త్వరలోనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించనున్నట్లు స్పష్టం చేశారు.