Rahul Gandhi
-
రాజ్యాంగాన్ని అర్థం చేసుకోలేరు: ప్రధాని మోదీ
జేబుల్లో రాజ్యాంగం పెట్టుకొని తిరిగే వారికి మన దేశంలో ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు కళ్లకు కనిపించడం లేదు. మేం ముస్లిం సోదరీ మణులకు హక్కులు కల్పించడానికి ట్రిపుల్ తలాఖ్ చట్టం తెచ్చాం. – మోదీ న్యూఢిల్లీ: లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేతలు బహిరంగంగా అర్బన్ నక్సలైట్ల భాష మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. దేశంపై యుద్ధం ప్రకటించిన వ్యక్తులు మన రాజ్యాంగాన్ని, దేశ ఐక్యతను ఏనాడూ అర్థం చేసుకోలేరని అన్నారు. కొన్ని పార్టీలు (ఆమ్ ఆద్మీ పార్టీ) యువత భవిష్యత్తుకు ఆపదగా మారాయని విమర్శించారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలతో ఎంతో ప్రజాధనం ఆదా అయ్యిందని పేర్కొన్నారు. జనం సొమ్ముతో తాము అద్దాల మేడలు కట్టుకోలేదని స్పష్టంచేశారు.ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై పరోక్షంగా మండిపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం లోక్‌సభలో జరిగిన చర్చకు ప్రధాని మోదీ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల తీరును ఎండగట్టారు. పేదల గుడిసెల్లోకి వెళ్లి ఫొటో సెషన్లు పెట్టుకొని సంబరపడే కొందరు నాయకులు అదే పేదల గురించి పార్లమెంట్లో మాట్లాడడం నీరసమైన వ్యవహారంగా భావిస్తున్నారని విమర్శించారు. జేబుల్లో రాజ్యాంగం పెట్టుకొని తిరిగేవారికి మన దేశంలో ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు కళ్లకు కనిపించడం లేదని మండిపడ్డారు. ముస్లిం సోదరీమణులకు హక్కులు కల్పించడానికి ట్రిపుల్ తలాఖ్ చట్టం తీసుకొచ్చామని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... మా పాలనలోనే గరీబీ హఠావో.. తప్పుడు హామీలు ఇవ్వడం, ప్రజలను మభ్యపెట్టడం మాకు అలవాటు లేదు. అభివృద్ది చేసి చూపించడమే మాకు తెలుసు. గరీబీ హఠావో నినాదం ఐదు దశాబ్దాలపాటు వినిపించింది. కానీ, జరిగిందేమీ లేదు. మేము అధికారంలోకి వచ్చాక పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. పేదలకు 4 కోట్ల ఇళ్లు నిర్మించి ఇచ్చాం. 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించాం. కేవలం ఐదేళ్లలో 12 కోట్ల కుటుంబాలకు కుళాయి నీటి సౌకర్యం కల్పించాం. పేదల కష్టాలు ఏమిటో మాకు తెలుసు. ఎందుకంటే మేము స్వయంగా పేదరికం అనుభవించాం. నిరుపేదల అగచాట్లు, సామాన్య ప్రజల బాధలు అర్థం చేసుకోవాలంటే స్పందించే హృదయం ఉండాలి. అది కొందరు నాయకులకు లేదు. రాజ్యాంగం నిర్దేశించినట్లు నడుచుకుంటున్నాం.రాజ్యాంగమే మాకు స్ఫూర్తి. విషపూరిత రాజకీయాలను నమ్ముకోవడం లేదు. 21వ శతాబ్దం కోసం సిద్ధం కావాలంటూ పదేపదే నినదించిన ఓ ప్రధానమంత్రి(రాజీవ్ గాం«దీ) 20వ శతాబ్దపు అవసరాలను సైతం తీర్చలేకపోయారు. పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగం పేలవంగా ఉందని కొందరు వ్యక్తులు(సోనియా గాం«దీ) విమర్శించడం దారుణం. దేశ ప్రథమ పౌరురాలిని, పేద కుటుంబం నుంచి వచ్చిన ఒక మహిళను కించపర్చడం సహించరానిది. రాజకీయంగా మీరు నిరాశలో ఉండొచ్చు. అంతమాత్రాన రాష్ట్రపతిని అవమానించాలా? ఇదెక్కడి పద్ధతి? మన దేశంలో ఏదైనా ఎస్సీ లేదా ఎస్టీ కుటుంబం నుంచి ఒకేసారి ముగ్గురు ఎంపీలైన సందర్భాలు ఉన్నాయా? పేదల సంక్షేమం గురించి కొందరు మాట్లాడుతున్నారు. వారి మాటలకు, చేతలకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటోంది. అది భూమికి, ఆకాశానికి.. చీకటికి, వెలుతురు మధ్యన ఉన్నంత వ్యత్యాసం. ప్రజలకు రూ.40 లక్షల కోట్లు బదిలీ కొందరు నాయకులు(అరవింద్ కేజ్రీవాల్) వారి ఖరీదైన ఇళ్లల్లో స్టైల్‌గా ఉండే నీటి షవర్లు, వేడినీటి ఈత కొలనులు ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి పెడితే మేము ప్రతి ఇంటికీ నీరు అందించడంపై దృష్టి పెట్టాం. కొందరు ప్రజల సొమ్ముతో అద్దాల మేడ కట్టుకుంటే మేము పేదలకు ఇళ్లు ఇచ్చాం. పదేళ్ల క్రితం దాకా పత్రికల్లో కుంభకోణాలు, అవినీతిపై నిత్యం వార్తలు కనిపించేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 2014 నుంచి రూ.లక్షల కోట్లు ఆదా చేశాం. సంక్షేమ పథకాల విషయంలో 10 కోట్ల మంది నకిలీ లబ్ధిదారులను ఏరిపారేశాం. దాంతో రూ.3 లక్షల కోట్లు ఆదా చేశాం. ప్రజల డబ్బును దేశ నిర్మాణం కోసమే ఖర్చుపెడుతున్నాం. వివిధ పథకాల కింద రూ.40 లక్షల కోట్లను నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశాం. కులం గురించి మాట్లాడడం ఫ్యాషనైపోయింది మా ప్రభుత్వం ఇటీవల అద్భుతమైన బడ్జెట్ ప్రవేశపెట్టింది. మా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రూ.2 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండేది కాదు. ప్రస్తుతం ఆ పరిమితిని రూ.12 లక్షలకు పెంచాం. పేదల ఆరోగ్య సంరక్షణ కోసం ఆయుష్మాన్ భారత్ పథకం ప్రారంభించాం. కానీ, కొన్ని రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేయడం లేదు. దీనివల్ల పేదలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల సంక్షేమం కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నాం. ప్రతి రంగంలోనూ వారికి మరిన్ని అవకాశాలు కలి్పస్తున్నాం. కులం గురించి మాట్లాడడం కొందరికి ప్యాషనైపోయింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థుల కోసం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను భారీగా పెంచాం. వేలాది సీట్లు వారికి అందుబాటులోకి వచ్చాయి. మా ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీల సంఖ్య 387 నుంచి 780కి చేరింది’’ అని ప్రధాని మోదీ వివరించారు. -
రాహుల్‌పై కేసు క్రైమ్ బ్రాంచ్‌కు...
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రాంగణంలో గురువారం జరిగిన తోపులాటకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై నమోదైన కేసును ఢిల్లీ పోలీసులు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. బీజేపీ ఫిర్యాదు మేరకు రాహుల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇకపై ఈ కేసును క్రైమ్‌బ్రాంచ్ దర్యాప్తు చేస్తుందని అధికారులు శుక్రవారం వెల్లడించారు. భారత న్యాయ సంహితలోని సెక్షన్ 117, 125, 131, 351, 3(5) కింద రాహుల్‌పై పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్లో కేసు నమోదయ్యింది. తోపులాటలో గాయపడిన ఇద్దరు బీజేపీ ఎంపీల స్టేట్మెంట్ను రికార్డు చేయనున్నట్లు అధికారులు చెప్పారు. అలాగే రాహుల్ గాం«దీని పిలిపించి ప్రశ్నించనున్నట్లు తెలిపారు. పార్లమెంట్లో గురువారం జరిగిన తోపులాటకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ కోసం పార్లమెంట్ సెక్రటేరియట్‌కు లేఖ రాస్తామని వెల్లడించారు. తోపులాటలో బీజేపీ ఎంపీలు ప్రతాప్‌చంద్ర సారంగి(69), ముకేశ్ రాజ్‌పుత్(56) గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామ్మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని, కోలుకుంటున్నారని డాక్టర్లు శుక్రవారం తెలియజేశారు. -
మమతా బెనర్జీ (సీఎం) రాయని డైరీ
ప్రజాస్వామ్యం కొన్నిసార్లు నిరంకుశత్వంతో పోరాడవలసి వస్తుంది. అప్పుడేం చేయాలి? పోరాడాలి. పోరాడేందుకు ఒక్కరైనా ముందుకు రావాలి. ఆ ఒక్కరు ఎవరన్నది... నిర్ణయంతో తేలేది కాదు. నిశ్చయంతో జరిగేది. ‘‘నేనొస్తాను...’’ అన్నాను. ‘‘సీఎంగా ఉంటూనే, ‘ఇండియా’ కూటమినీ నడిపిస్తాను’’ అన్నాను.నేను ఆ మాట అన్నప్పుడు... ‘‘కూటమిని నడిపించటానికే కదా మల్లికార్జున్ ఖర్గే కూటమికి చైర్మన్‌గా ఉన్నారు, కూటమిని కవాతు చేయించటానికే కదా లోక్‌సభలో రాహుల్, రాజ్యసభలో ఖర్గే కూటమి నాయకులుగా ఉన్నారు...’’ అని కూటమిలోని సభ్యులెవరూ అనలేదు! ‘‘ఎస్, మీరు రావాలి మమతాజీ...’’ అన్నారు శరద్ పవార్.‘‘మీరొస్తే 2025లో గెలుపు మనదే...’’ అన్నారు లాలూ ప్రసాద్.‘‘మీరు రావటమే మంచిది మేడమ్...’’ అని అఖిలేశ్ యాదవ్. వారికి ధన్యవాదాలు. కృతజ్ఞతలు కూడా! కూటమిలో మహామహులు ఉన్నారు. ప్రకాష్ కారత్, అరవింద్ కేజ్రీవాల్,ఎం.కె. స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రే, హేమంత్ సోరేన్, ఫరూఖ్ అబ్దుల్లా, డి.రాజా, మెహబూబా ముఫ్తీ... వారిలో ఏ ఒక్కరూ... ‘‘కూటమికి నేను నాయకత్వం వహిస్తాను...’’ అని ముందుకు వచ్చినా నేను వారికి అడ్డుపడేది, వారితో నేను పోటీకి దిగేది ఏముంటుంది? అంతా ఒక్కటై ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కూటమిగా ఏర్పడినవాళ్లం ఒకరిని ఒకరం ఎందుకు వెనక్కు లాగుతాం?!కానీ, రాహుల్ అలా అనుకున్నట్లు లేరు! ‘‘దిగువ స్థాయి లీడర్ల మాటల్ని పట్టించుకో కండి. కూటమిలోని సమస్యల్ని పరిష్కరించే సత్తా కాంగ్రెస్‌కు ఉంది...’’ అంటున్నారు. నన్ను ‘దిగువ స్థాయి’ లీడర్ అన్నందుకు నాకేం పట్టింపు లేదు. నా రాజకీయ జీవితంలో ఇలాంటి మాటల్ని ఎన్ని వినలేదు! ముఖ్యమంత్రిని అయినంత మాత్రాన నేనేమీ ‘వెరీ ఇంపార్టెంట్ పర్సన్’ అయిపోను. నిజానికి, నేనొక ‘లెస్ ఇంపార్టెంట్ పర్సన్’ అని చెప్పుకోవటమే నాకు ఇష్టం. ‘కూటమిలోని సమస్యల్ని పరిష్కరించే సత్తా కాంగ్రెస్‌కు ఉంది...’ అని రాహుల్ అనడంలో తప్పేమీ లేదు. అయితే ఇప్పుడు పరిష్కరించవలసింది కూటమి లోపలి సమస్యలనా? లేక, కూటమి బయట ఉన్న సమస్యనా? బయటి సమస్య వల్లనే కదా, లోపలి సమస్యలు బయటికి వస్తున్నది! బీజేపీని ఓడించటానికి కూటమిగా ఒకటై పోరాడాక కూడా 2023లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవలేకపోయింది. 2024లో హరియాణా, జమ్మూకశ్మీర్, మహారాష్ట్రలలో విజయం సాధించలేకపోయింది. దీనిని కదా కాంగ్రెస్ పరిష్కరించవలసింది! నాయకుల్ని నాయకులు గౌరవించక పోయినా, పార్టీలను పార్టీలు గౌరవించాలి. రాహుల్ నన్ను దిగువ స్థాయి లీడర్ అని అనటం, తృణమూల్ కాంగ్రెస్‌ను దిగువస్థాయి పార్టీ అని అనటమే! తృణమూల్ కూడా ఒకప్పటి కాంగ్రెస్సే అనే సంగతి ఆయనకు గుర్తు లేకుండా ఉంటుందా?కూటమిని నేను నడిపిస్తాను అని నేను అంటున్నది... ఖర్గేజీ నడిపించలేక పోతున్నా రనో, రాహుల్ పరుగెత్తలేక పోతున్నారనో కాదు. కూటమి భాగస్వామిగా మోదీజీని దించే బాధ్యత నాకు మాత్రం లేదా... అని. ‘‘కూటమిని లీడ్ చేస్తాను’’ అని నేను అనగానే, అస్సాం బీజేపీ ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ నాకు శ్రేయోభిలాషిగా మారిపోయారు! ‘‘మమతాజీ! చచ్చిపడి ఉన్న కూటమికి సారథ్యం వహించి, మీరు దానిని బతికించలేరు. 2026లో మీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. వాటిపై దృష్టి పెట్టండి...’’ అని హితవు చెప్పారు. రాహుల్ అన్న మాట కంటే అదేమీ ఘాటైనది కాదు. -
అసమ్మతి... అనైక్యత...
ఆరు నెలల క్రితం లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిన ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి అనతికాలంలోనే నాలుగు రోడ్ల కూడలిలో దిక్కుతోచని పరిస్థితిలో పడినట్టు కనిపిస్తోంది. జార్ఖండ్, జమ్ము – కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుబాటలో పయనించినా, హర్యానా, మహారాష్ట్రల్లో ఎదురైన దిగ్భ్రాంతికరమైన పరాజయాలు ఇప్పుడు కూటమి భాగస్వామ్యపక్షాల మధ్య విభేదాల కుంపటిని రాజేస్తున్నాయి. హర్యానా ఎన్నికల్లో మితిమీరిన ఆత్మవిశ్వాసంతో చేజేతులా కాంగ్రెస్ ఓటమి కొనితెచ్చుకుంటే, మహారాష్ట్రలో మహావికాస్ ఆఘాడీ (ఎంవీఏ) సోదిలో లేకుండా పోవడమూ స్వయంకృతమేనన్న భావన అసమ్మతిని పెంచింది. ఖర్గే సారథ్యంలోని ‘ఇండియా’ కూటమిలో ప్రధానపాత్ర కాంగ్రెస్‌దే గనక మహారాష్ట్రలో దెబ్బతో అనూహ్యంగా నాయకత్వ మార్పు అంశం తెర మీదకొచ్చింది. సారథ్యానికి సిద్ధమంటూ మమత ముందుకు రావడంతో కథ మలుపు తిరిగింది.కూటమి ఆశించిన ఫలితాలు రావడం లేదన్న అసంతృప్తి పెరుగుతున్న పరిస్థితుల్లో అసలీ కూటమి ఏర్పాటులో కీలకపాత్ర పోషించినదే మమతా బెనర్జీ గనక ఇప్పుడీ కూటమికి ఆమే సారథ్యం వహించాలనీ, అందుకామె సిద్ధంగా ఉన్నారనీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ ముందుగా గళం విప్పారు. ఆ తర్వాత కొద్ది రోజులకే దీదీ ఓ ఇంటర్వ్యూ ఇస్తూ, ‘కూటమిని వారు నడిపించ లేకపోతే, నేనే నడిపిస్తాను’ అని కుండబద్దలు కొట్టేశారు. బెంగాల్‌ను వీడకుండా,అక్కడ నుంచే కూటమి సాఫీగా నడిచేలా చేస్తాననీ వ్యాఖ్యానించారు. దానికి కొనసాగింపుగా జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అగ్రనేత శరద్ పవార్ సైతం జాతీయ నేతగా మమత సమర్థురాలనడంతో తేనెతుట్టె కదిలింది. కూటమిలోని లుకలుకలు, కాంగ్రెస్ పట్ల ఇతర భాగస్వామ్య పక్షాల అసంతృప్తి, అసమ్మతి స్వరాలు బయటపడ్డాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), అలాగే రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ సహా పలువురు కోరస్ కలపడంతో విషయం వీథికెక్కింది. సీపీఐ సైతం సీట్ల సర్దు బాటులో వామపక్షాలకు కూటమి చోటివ్వడం లేదంటూ, కాంగ్రెస్ ఆత్మశోధన చేసుకోవాలనేశారు.నిజానికి, ఈ ఏటి లోక్‌సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమికి కొంత ఊపు వచ్చినా, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బలతో అంతా నీరుగారింది. ఆ మధ్య హర్యానాలో దెబ్బ తినడమే కాక, తాజా మహారాష్ట్ర ఎన్నికల్లో కూటమి తుడిచిపెట్టుకుపోవడం అశనిపాతమైంది. ఆశలు క్షీణించడంతో హస్తం పార్టీ సారథ్యంపై అసమ్మతి స్వరం పెరిగింది. ఆ మాటకొస్తే తృణ మూల్ చాన్నాళ్ళుగా కాంగ్రెస్‌కు దూరంగా ఉంటోంది. ఎన్నికల్లో పొత్తు పెట్టుకోలేదు సరికదా పార్లమెంట్ సమావేశాల్లోనూ అంటీముట్టని వైఖరి. ఇటీవల ఎస్పీది సైతం అదే ధోరణి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో హస్తం పార్టీతో కలవడానికి ఇష్టపడకపోగా, పార్లమెంట్లో రాహుల్ ముందుండి నడుపుతున్న అదానీ వ్యతిరేక నిరసన ప్రదర్శనల్లోనూ తృణమూల్ లానే పాలు పంచు కోవట్లేదు. ఇది చాలదన్నట్టు రానున్న ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నట్టు ఆప్ ప్రకటించింది. అభ్యర్థుల పేర్లు విడతల వారీగా విడుదల చేసేస్తూ, చర్చలకు తావు లేకుండా చేసేసింది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలనీ, ప్రతిపక్ష ఐక్యతకు చర్యలు ఆలోచించాలనీ శివ సేన (ఉద్ధవ్ బాల్‌ఠాక్రే) పేర్కొన్నదంటే వ్యవహారం ఎందాకా వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. మల్లికార్జున్ ఖర్గే సారథ్యంలోని కాంగ్రెస్ శైలిపై అసంతృప్తి బాహాటమవుతున్న వేళ... ప్రతిపక్ష కూటమి భవిష్యత్ నేత ఎవరు, భవిష్యత్ దిశ ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కూటమిని దీదీ నడిపితే అభ్యంతరం లేదంటూనే, ఈ బీజేపీ వ్యతిరేక కూటమిలో పలువురు సీని యర్ నేతలు ఉన్నందున కూర్చొని చర్చించి, ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలంటూ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఇప్పటికే సన్నాయి నొక్కులు నొక్కారు. అసలు బీజేపీయేతర ప్రతిపక్షాలన్నీ కలసి ‘ఇండియా’ కూటమిగా జట్టు కట్టినా, వాటికి సరైన సైద్ధాంతిక భూమికే కాదు... నేటికీ సమ న్వయ సంఘం, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక, భవిష్యత్ మార్గదర్శనం లాంటివేమీ లేవు. అందు కోసం గడచిన ఏణ్ణర్ధం పైగా ప్రత్యేకించి కసరత్తులు చేసిన దాఖలాలూ లేవు. నిన్నగాక మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంవీఏ గొడుగు కింద అందరూ కలసి పోటీ చేసినా... బాబ్రీ మసీదు కూల్చివేతను శివసేన (యుబీటీ) నేత ఒకరు సమర్థించడంతో యూపీలో ముస్లిమ్ ఓట్లపై ఆధార పడ్డ ఎస్పీ తాజాగా ఎంవీఏ నుంచి బయటకొచ్చేసింది. దీన్నిబట్టి ఎన్నికల కోసం కలవడమే తప్ప ‘ఇండియా’ పక్షాల మధ్య సహాయ సహకారాలే కాదు సమన్వయం కూడా లేదన్నది స్పష్టం.కాంగ్రెస్‌కు కానీ, కూటమికి కానీ సారథ్య బాధ్యతలు తీసుకోకున్నా చక్రం తిప్పడంలో ముందున్న రాహుల్ పరివారానికి ఇప్పుడిది కొత్త పరీక్ష. పార్లమెంట్లో సోనియా, రాహుల్, తాజాగా గెలిచొచ్చిన ప్రియాంక – ముగ్గురున్నా కూటమికి బలిమి చేకూరుతున్న దాఖలాలు లేవు. పెద్దన్న పాత్రలో అత్యుత్సాహం చూపుతున్న హస్తం పార్టీ కార్యకర్తలకు కానీ, ఇతర పార్టీలకు కానీ స్ఫూర్తినివ్వడంలో పదే పదే విఫలమవుతోంది. ఇకనైనా సాటిపక్షాల మాటలకు అది చెవి ఒగ్గాలి. పరస్పర గౌరవంతో అందరినీ కలుపుకొనిపోవాలి. తాజా గందరగోళంతో త్వరలోనే ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవడం ఖాయమని బీజేపీ జోస్యం చెబుతోంది. కాషాయపార్టీపై సమైక్యంగా పోరు సాగించడమే ధ్యేయంగా పురుడు పోసుకున్న ప్రతిపక్ష కూటమి ఇలా అనైక్యతా రాగం ఆలపిస్తూ పోతే చివరకు అదే జరుగుతుంది. నాయకత్వచర్చ చివరకు కూటమి ఎన్నికల అజెండాపై కారుమబ్బుల్ని కమ్మేస్తేనే కష్టం. అధికారపక్ష అంచనా తప్పు అని నిరూపించాల్సిన బాధ్యత పూర్తిగా ప్రతిపక్షాలదే! -
నేను అస్సలు ఊహించలేదు.. ‘మహా’ ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ
ఢిల్లీ : మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్ని తాను ఊహించలేదని అన్నారు కాంగ్రెస్ అగనేత రాహుల్ గాంధీ. మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార మహాయుతి కూటమి విజయం సాధించింది. మహాయుతి కూటమికి నేతృత్వం వహిస్తున్న బీజేపీ 288 స్థానాల్లో ఏకంగా 130 స్థానాల్లో విజయం సాధించింది. ఇతర మిత్ర పక్షాలతో కలిసి మెజార్టీని సాధించారు. దీంతో రెండోసారి మహాయతి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.ఈ తరుణంలో మహరాష్ట్ర ఎన్నికల ఫలితాలపై రాహుల్ ఎక్స్ వేదికగా స్పందించారు. మహరాష్ట ఫలితాల్ని నేను ఊహించలేదు. ఓటమిని అంగీకరిస్తున్నాం. ఓటమికి గల కారణాల్ని విశ్లేషిస్తామని ట్వీట్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమ పార్టీకి మద్దతిచ్చిన ఓటర్లకు, సోదరీమణులందరికీ, పార్టీ గెలుపుకోసం కృష్టి చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు’అని అన్నారు. మరోవైపు జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించారు. జార్ఖండ్‌లో ఇండియా కూటమి విజయం రాజ్యాంగంతో పాటు నీరు, అటవీ, భూమి రక్షణ విజయం’అని రాహుల్ గాంధీ ట్వీట్లో పేర్కొన్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమి విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో హేమంత్ సోరెన్ నేతృత్వం వహిస్తున్న జేఎంఎం 34 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ తర్వాతి స్థానంలో కాంగ్రెస్ నిలించింది.झारखंड के लोगों का INDIA को विशाल जनादेश देने के लिए दिल से धन्यवाद। मुख्यमंत्री हेमंत सोरेन जी, कांग्रेस और झामुमो के सभी कार्यकर्ताओं को इस विजय के लिए हार्दिक बधाई और शुभकामनाएं।प्रदेश में गठबंधन की यह जीत संविधान के साथ जल-जंगल-ज़मीन की रक्षा की जीत है।महाराष्ट्र के नतीजे…— Rahul Gandhi (@RahulGandhi) November 23, 2024 -
ఇంతకీ ఎందుకు.. ఏఐసీసీకి అంత సంతృప్తి?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ పాలన తీరు, హస్తం పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నేను కొట్టినట్లు చేస్తా.. నువ్వు ఏడ్చినట్లు చేయి అనే ఒప్పందమా?.. కుమ్మక్కు రాజకీయంలో ఇదో రహస్యమా?.. రేవంత్ - అదానీలతో వ్యాపార బంధమా? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో తెలంగాణకు కాంగ్రెస్ తరతరాల దరిద్రం అంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘రాహుల్ గాంధీ గారూ..మీరు భూసేకరణ వ్యతిరేక స్వరం వినిపిస్తే ఏం లాభం?అదానీ-అంబానీలపై విరుచుకుపడితే ఏం ప్రయోజనం?దేశవ్యాప్తంగా భూసేకరణపై మీ రణ గర్జన..తెలంగాణలో భూసేకరణను ఎందుకు అడ్డుకోలేకపోయింది?కొడంగల్ రైతుల కన్నీటికి ఎందుకు కారణభూతమైంది?అదానీ-అంబానీలపై మీ జంగ్..రామన్నపేటలో అదానీ ఫ్యాక్టరీకి ద్వారాలు ఎందుకు తెరిచింది?తెలంగాణ కాంగ్రెస్ పాలిత రాష్ట్రమే కదా! ఎందుకు అభ్యంతరం చెప్పలేదు?నేను కొట్టినట్లు చేస్తా..నువ్వు ఏడ్చినట్లు చేయి అనే ఒప్పందమా?కుమ్మక్కు రాజకీయంలో ఇదో రహస్యమా?రేవంత్-అదానీలతో వ్యాపార బంధమా?అదానీ-అంబానీలపై మీ పోరాటం ఓ బూటకంతెలంగాణకు కాంగ్రెస్ తరతరాల దరిద్రం..’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.రాహుల్ గాంధీ గారూ...మీరు భూసేకరణ వ్యతిరేక స్వరం వినిపిస్తే ఏం లాభం?అదాని - అంబానీలపై విరుచుకుపడితే ఏం ప్రయోజనం?దేశవ్యాప్తంగా భూసేకరణపై మీ రణ గర్జన...తెలంగాణలో భూసేకరణను ఎందుకు అడ్డుకోలేకపోయింది?కొడంగల్ రైతుల కన్నీటికి ఎందుకు కారణభూతమైంది?అదాని -అంబానీలపై మీ జంగ్..… pic.twitter.com/b6NuJ6MIHl— KTR (@KTRBRS) November 17, 2024ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ఏఐసీసీ సంతృప్తి చెందిందా ??!!అసలు రాష్ట్రంలో పాలన అనేది ఒకటి ఉంటే కదా..? ఇంతకంటే దిక్కుమాలిన ప్రకటన ఇంకోటి ఉంటదా..!!ఇంతకీ ఎందుకు.. ఏఐసీసీకి అంత సంతృప్తి ?తెలంగాణ రైతులకు సంకెళ్లు వేసినందుకా ?❌అమాయకులైన అన్నదాతలను జైలులో పెట్టినందుకా ??❌కొడంగల్ లో బలవంతంగా భూములు గుంజుకున్నందుకా ??❌కొనుగోలు కేంద్రాల్లో రైతులను బలిపశువులను చేస్తున్నందుకా ??❌మూసీ ప్రాజెక్టులో భాగంగా వేల ఇళ్ల కూల్చివేతకు సిద్ధమైనందుకా ??❌హైడ్రా పేరిట పేద ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నందుకా ??❌ఏడాది కావస్తున్నా గ్యారెంటీ కార్డును పాతాళంలో పాతిపెట్టినందుకా ??❌రెండు లక్షల ఉద్యోగాల హామీ అమలును గాలికి వదిలేసినందుకా ??❌తెలంగాణ ప్రగతికి బ్రేకులు వేసి.. ఆర్థికంగా దివాలా తీయిస్తున్నందుకా ??❌సంక్షేమానికి సమాధి కట్టి.. అభివృద్ధికి అడ్రస్ లేకుండా చేసినందుకా ??తెలంగాణలోని సకల రంగాలను.. సబ్బండ వర్గాలను దగా చేసినందుకా.. మొత్తంగా తెలంగాణను ఆగం చేసినందుకా.. మీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి అంతటి సంతృప్తి ??ఢిల్లీకి అందుతున్న వేల కోట్ల మూటలు చూసి మీరెంత మురిసిపోయినా.. మాటిచ్చి మోసం చేసిన ముఖ్యమంత్రిని.. గ్యారెంటీ కార్డు ఇచ్చి గారడీ చేసిన కాంగ్రెస్ పార్టీని చూసి, నాలుగు కోట్ల తెలంగాణ సమాజం మాత్రం రగిలిపోతోంది. కనికరం లేని కాంగ్రెస్ పాలనకు కర్రుగాల్చి వాతపెడుతుంది.జై తెలంగాణ అంటూ కామెంట్స్ చేశారు. -
రాహుల్ గాంధీపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్
-
రాహుల్ ఇంటిని ముట్టడిస్తాం: హరీష్‌రావు
సాక్షి, సూర్యాపేట: వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ ఇచ్చిన రుణమాఫీ హామీ ఏమైందని మాజీ మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. దసరాలోపు రైతులకు రుణమాఫీ చేయకపోతే ఢిల్లీలో రాహుల్ ఇంటి ముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తా.. దసరాలోపు రైతు బంధు పడకపోతే నిన్ను రైతులు వదలరంటూ హరీష్ హెచ్చరించారు. రేవంత్‌రెడ్డికి ప్రజలపై పట్టింపు లేదు.. రైతంటే లెక్క లేదు. దేవుళ్ల మీద ఒట్లు వేసి మాటతప్పాడు. రేవంత్ రెడ్డి మొనగాడు కాదు.. మోసగాడు. 31 కుంటి సాకులు పెట్టి రుణమాఫీ ఎగ్గొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కర్ణాటకలో ఐదు.. తెలంగాణలో ఆరు.. హర్యానాలలో ఏడు గ్యారెంటీలతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తుంది. ఒక చేతిలో రాజ్యాంగం.. మరో చేతిలో రౌడీయిజం. హెడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టి హక్కు మీకు ఎవరిచ్చారు’’ అంటూ హరీష్‌రావు ప్రశ్నించారు.జూటా మాటలు మానుకోక పోతే నిన్ను వదలం. నిన్ను అడుగుతాం.. కడుగుతాం.. అసెంబ్లీలో నిలదీస్తాం. ఒక్క బస్సు తప్ప.. మీ హామీలు అన్నీ తుస్సే.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కానీ సీఎంకి కనికరం లేదు. కేసిఆర్‌ది రైతు గుండె.. రేవంత్‌ది రాతి గుండె.. ప్రజల నుండి తిరుగుబాటు రాగానే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఏదో ఒక వివాదం సృష్టిస్తున్నారు’’ అని హరీష్‌రావు మండిపడ్డారు.ఇదీ చదవండి: తప్పని తేలితే కూల్చేస్తా.. సీఎం రేవంత్‌కి కేవీపీ లేఖ -
రాహుల్ గాంధీపై భారీ కుట్ర.. కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళనలు
-
Haryana Assembly Elections 2024: ఎన్నికల బరిలో వినేశ్ ఫొగాట్!
సాక్షి, న్యూఢిల్లీ: ఒలింపిక్ క్రీడాకారిణి, మల్లయోధురాలు వినేశ్ ఫొగాట్ రాజకీయ రంగప్రవేశం దాదాపు ఖాయమైంది. కాంగ్రెస్ తరఫున హరియాణా శాసనసభ ఎన్నికల్లో జులానా స్థానం నుంచి ఆమె పోటీచేసే అవకాశముందని కాంగ్రెస్‌లోని విశ్వసనీయ వర్గాలు బుధవారం వెల్లడించాయి. మరో ప్రముఖ మల్లయోధుడు భజరంగ్ పునియా సైతం బాద్లీ స్థానం నుంచి పోటీచేసే అవకాశముంది. ఈ ఇద్దరు రెజ్లర్లు బుధవారం కాంగ్రెస్ నేత రాహుల్‌గాం«దీతో భేటీ అయ్యారు. దీంతో హస్తం పారీ్టలో వీరిద్దరి చేరిక ఖాయమైందని వార్తలొచ్చాయి. రాహుల్‌తో వినేశ్, పునియాలు దిగిన ఫోటోను కాంగ్రెస్ తన అధికారిక ఖాతా ’ఎక్స్’లో పోస్ట్ చేసిన అనంతరం వీరి పోటీ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిద్దరి అభ్యరి్థత్వాన్ని గురు లేదా శుక్రవారం జరగబోయే కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఖరారుచేస్తారని తెలుస్తోంది. వీరిద్దరి పోటీపై గురువారం నాటికి స్పష్టత వస్తుందని హరియాణా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపక్ బాబరియా మంగళవారం పేర్కొనడం తెల్సిందే. -
ముగిసిన కాంగ్రెస్ హైకమాండ్ కీలక భేటీ
సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్ బలోపేతంపై పార్టీ హైకమాండ్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా మంగళవారం(ఆగస్టు13) ఉదయం అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులతో పార్టీ అగ్రనేతలు భేటీ అయ్యారు. సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీచీఫ్ మల్లికార్జున ఖర్గే , ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ పాల్గొని పీసీసీ చీఫ్‌లకు దిశానిర్దేశం చేశారు. రానున్న ఎన్నికలకు కాంగ్రెస్‌ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి జరుగుతున్న సమావేశం ఇదే. -
మళ్లీ ‘ఈడీ’ విచారణకు రాహుల్‌గాంధీ..?
న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మళ్లీ విచారణకు పిలిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాహుల్, సోనియాగాంధీ ప్రధానవాటాదారులుగా ఉన్న నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఈడీ ఇప్పటికే విచారణ జరుపుతోంది. ఈ కేసులో చార్జ్‌షీట్ ఫైల్ చేసేముందు ఈడీ రాహుల్‌ను విచారించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.దర్యాప్తునకు ముగింపు పలికి కేసు విచారణకు వెళ్లాల్సిఉందని, ఇందుకోసం కేసుతో సంబంధమున్న అందరినీ చివరిసారిగా విచారించాలనుకుంటున్నట్లు ఈడీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కేసులో మరో నిందితురాలిగా ఉన్న కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని ఈడీ విచారణకు పిలుస్తుందా లేదా అన్నది తెలియాల్సిఉంది. కాగా, నేషనల్హెరాల్డ్ కేసులో రాహుల్, సోనియాలను ఈడీ ఇప్పటికే విచారించిన విషయం తెలిసిందే. -
ఆ ప్రస్తావన ఎందుకు?: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: పార్లమెంట్ తొలి సెషన్ సందర్భంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ‘ఎమర్జెన్సీ’ని ప్రస్తావిస్తూ తీర్మానం చేయడాన్ని విపక్షనేత రాహుల్ గాంధీ మరోమారు తీవ్రంగా తప్పుబట్టారు. బిర్లాను గురువారం మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. రాజకీయ అంశమైన ‘ఎమర్జెన్సీ’ని ప్రస్తావించకుండా ఉండాల్సింది అన్నారు. ‘‘రాహుల్, ఇండియా కూటమి నేతలు స్పీకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నేతలంతా పార్లమెంటరీ వ్యవహారాలు మాట్లాడుకున్నారు. అందులో భాగంగానే ఎమర్జెన్సీ అంశమూ ప్రస్తావనకు వచి్చంది.రాహుల్ ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. రాజకీయ అంశాన్ని సభలో లేవనెత్తకుండా నివారిస్తే బాగుండేదన్నారు’’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ వెల్లడించారు. ఈ అంశంపై కేసీ వేణుగోపాల్ విడిగా స్పీకర్‌కు ఒక లేఖ రాశారు. ‘పార్లమెంట్ విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీసే అంశమిది. స్పీకర్‌గా మిమ్మల్ని ఎన్నుకున్న శుభతరుణంలో అర్ధశతాబ్దకాలంనాటి ఎమర్జెన్సీ అంశాన్ని మీరు సభ ముందుకు తేవడం విపక్షాలన్నింటినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. స్పీకర్ ఎన్నిక, బాధ్యతల స్వీకరణ వేళ రాజకీయాలు మాట్లాడటం పార్లమెంట్ చరిత్రలో ఇదే తొలిసారి.నూతన స్పీకర్‌గా ఎన్నికయ్యాక చేపట్టాల్సిన తొలి విధులకు ఇలాంటి చర్యలు తీవ్ర విఘాతం కల్గిస్తాయి. పార్లమెంటరీ సంప్రదాయాలను అపహాస్యం చేస్తూ సాగిన ఈ ఉదంతంపై మేం ఆందోళన చెందాం’’ అని వేణుగోపాల్ ఆ లేఖలో పేర్కొన్నారు. ‘‘1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ‘అత్యయిక స్థితి’ అమల్లోకి తెచ్చారు. చాలా మంది ప్రతిపక్ష నేతలను ప్రభుత్వం జైళ్లలో పడేసింది. మీడియాపై ఆంక్షలు విధించింది.న్యాయ వ్యవస్థపై నియంత్రణ చట్రం బిగించింది. ఎమర్జెన్సీ విధించి 49 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సభ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పరిరక్షించడంతోపాటు దాని విలువలకు కట్టుబడి ఉందని నేను హామీ ఇస్తున్నా’’ అని నూతన స్పీకర్ బిర్లా బుధవారం పేర్కొన్నారు. స్పీకర్ ఆ తీర్మానాన్ని చదువుతున్న సందర్భంలో కాంగ్రెస్ సహా విపక్ష నేతలంతా నిలబడి తీవ్ర నిరసన వ్యక్తం చేయడం తెలిసిందే. -
Parliament Special Session: విపక్షనేతగా రాహుల్: స్పీకర్
న్యూఢిల్లీ: రాహుల్‌ను లోక్‌సభలో విపక్షనేతగా గుర్తిస్తున్నట్లు నూతన స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. పదేళ్ల తర్వాత లోక్‌సభలో ప్రతిపక్షాలకు ‘విపక్షనేత’ హోదా దక్కడం విశేషం. ఈ మేరకు జూన్ 9వ తేదీ నుంచే రాహుల్‌ను విపక్షనేతగా పరిగణిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ బుధవారం ఒక నోటిఫికేషన్ జారీచేసింది. పార్లమెంట్చట్టం1977లోని రెండో సెక్షన్ ప్రకారం రాహుల్‌ను విపక్షనేతగా ప్రకటించింది. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడారు. పార్టీ చీఫ్ ఖర్గే, పార్టీ కార్యకర్తలు, నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడిగా ప్రజల ఆకాంక్షలను పార్లమెంట్లో వినిపిద్దామని పిలుపునిచ్చారు. 16వ, 17వ లోక్‌సభలో విపక్షపార్టీలకు కనీసం 10 శాతం సభ్యులబలం లేనికారణంగా ఏ పారీ్టకీ విపక్షహోదా దక్కలేదు. విపక్షనేతగా ఎన్నికవడం ద్వారా రాహుల్ తన పాతికేళ్ల రాజకీయజీవితంలో తొలిసారిగా రాజ్యాంగబద్ద పదవిని స్వీకరించారు. కేబినెట్ మంత్రి హోదాతో సమానమైన విపక్షనేత హోదాలో రాహుల్‌కు ఒక ప్రైవేట్ కార్యదర్శి, ఇద్దరు అదనపు ప్రైవేట్ కార్యదర్శులు, ఇద్దరు వ్యక్తిగత సహాయకులు, ఇక హిందీ స్టెనో, ఒక క్లర్క్, ఒక శానిటేషన్ వర్కర్, నలుగురు ప్యూన్లను కేంద్రం సమకూరుస్తుంది. 1954చట్టం 8వ సెక్షన్, 1977 చట్టాల ప్రకారం జీతభత్యాలు చెల్లిస్తుంది. లోక్‌పాల్, సీఈసీ, ఈసీ, సీబీఐ డైరెక్టర్, సీవీసీ, సీఐసీ, ఎన్‌హెచ్‌ఆర్‌సీల నియామక ప్యానెళ్లలో ఇకపై రాహుల్ సభ్యునిగా ఉండనున్నారు.రాహుల్ తొలిసారిగా 2004లో అమేథీలో విజయంతో పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు. -
‘సిద్ధూ మూసేవాలా కోడ్ ఏమిటి? కాంగ్రెస్ సీట్లతో లింక్ ఎందుకు?
దేశంలో లోక్‌సభ ఎన్నికల ఏడు దశల ఓటింగ్ ముగిసింది. మంగళవారం(జూన్ 4) ఓట్ల లెక్కింపు జరగనుంది. దీనికి ముందే ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ విజయాన్ని ప్రకటించాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ గురించి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ ‘ఇదొక ఫాంటసీ పోల్ అని వ్యాఖ్యానించారు. గాయకుడు సిద్ధూ మూసేవాలా పాటను ప్రస్తావిస్తూ ఇండియా కూటమికి 295 సీట్లు వస్తాయని అన్నారు.ఇంతకీ రాహుల్ గాంధీ సింగర్ సిద్దూవాలా ‘295’ పాటను ఎందుకు వినమన్నారు? విశ్లేషకులు తెలిపిన వివరాల ప్రకారం దీనిలో రెండు అర్థాలు ఉన్నాయి. మొదటిది కాంగ్రెస్ 295 లోక్‌సభ స్థానాలు సాధిస్తుందని, మరొకటి ఈ పాటలోని అర్థాన్ని తెలుసుకోవాలని కోరారు. మూసేవాలా పాడిన పాట ‘295’లో 295 అనేది కేవలం ఒక సంఖ్య కాదు. ఈ హిందీ పాటలోని అర్థం విషయానికి వస్తే దీనిలో మతం ప్రస్తావన ఉంది. నిజం మాట్లాడే చోట సెక్షన్ 295 విధిస్తారు. ఎవరైనా అభివృద్ధి చెందిన చోట ద్వేషం రగులుతుంది. సెక్షన్ 295 పేరుతో మతానికి సంబంధించిన నిబంధనలు పెట్టారని పాటలో పేర్కొన్నారు.ఈ పాట ప్రారంభంలో ‘అబ్బాయ్.. నువ్వు ఎందుకు నేల చూపులు చూస్తున్నావు? నువ్వు బాగా నవ్వేవాడివి కదా? ఈ రోజు మౌనం వహిస్తున్నావు? ఈ రోజు తలుపుపై ఉన్న నేమ్‌బోర్డును ఎత్తుకుపోయి, తిరుగుతున్న వారెవరో నాకు తెలుసు. వారు ఇక్కడ వారి ప్రతిభను వ్యాపింపజేయాలనుకుంటున్నారు. నువ్వు కిందపడాలని కోరుకుంటున్నారు. వారు కీర్తి కాంక్షతో రగిలిపోతున్నారు. నీ పేరుతో ముందుకు రావాలని అనుకుంటున్నారు’ అని పాటలో వినిపిస్తుంది. రాహుల్ ఈ పాట ద్వారా కాంగ్రెస్ పరిస్థితిపై మీడియాకు సమాధానమిచ్చారు.ఎగ్జిట్ పోల్ గణాంకాలు విడుదలైన తర్వాత ప్రతిపక్ష నేతలు ఈ లెక్కలను తప్పుపడుతున్నారు. దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోందని, ఎన్డీఏ ప్రభుత్వం కాదని వారు అంటున్నారు. ఎగ్జిట్ పోల్ డేటాను ఎవరూ అంగీకరించబోరని కాంగ్రెస్ నేత పవన్ ఖేదా పేర్కొన్నారు. మీడియావారు మాతో ఆఫ్ ది రికార్డ్ మాట్లాడినప్పుడు ఇండియా కూటమి పనితీరు అద్భుతంగా ఉందన్నారు. అయితే ఇప్పుడు చూస్తున్నది ఊహాజనిత మార్కెట్ అయిన షేర్ మార్కెట్ కోసం జరిగిందా? లేక బీజేపీ మరో కుట్ర పన్నుతోందా అని పవన్ ఖేదా ప్రశ్నించారు. దేశంలో బీజేపీ భక్తులు తప్ప ప్రతీ ఒక్కరూ ఈ ఎగ్జిట్ పోల్స్‌ను ఫేక్‌గా పరిగణిస్తున్నారన్నారు. -
రోడ్డు పక్క సెలూన్లో రాహుల్ షేవింగ్.. ఫొటో వైరల్!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల వేళ సోషల్ మీడియాలో పలువురు నేతల ప్రకటనలు, ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇదే కోవలో తాజాగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్హచల్ చేస్తున్నాయి. ఆ ఫొటోలలో రాహుల్ రోడ్డు పక్కనున్న ఒక సాధారణ సెలూన్లో హెయిర్ కటింగ్‌తో పాటు షేవింగ్ చేయించుకోవడం కనిపిస్తుంది.కాంగ్రెస్ తన అధికారిక హ్యాండిల్లో రాహుల్ గాంధీకి సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో షేర్ చేసింది. దానితోపాటు క్యాప్షన్‌లో 'ఎన్నికల సన్నాహాలు పూర్తయ్యాయి. అయితే జుట్టు కత్తిరించుకోవడం కూడా అవసరం. నైపుణ్యం కలిగిన యువత హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. దేశ అభివృద్ధిలో వారి భాగస్వామ్యం కావాలని డిమాండ్ చేస్తున్నాం’ అని రాసివుంది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా 18వ లోక్‌సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు నాలుగు దశల ఎన్నికలు పూర్తికాగా, ఇక మూడు దశల ఎన్నికలు మిగిలివున్నాయి. ఐదో దశ ఎన్నికలు మే 20న, ఆరో దశ ఎన్నికలు మే 25న, చివరి దశ అంటే ఏడో దశ ఎన్నికలు జూన్ ఒకటిన జరగనున్నాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. चुनाव की तैयारी पूरी है, लेकिन हेयर कटिंग भी जरूरी है।हम ऐसे ही हुनरमंद नौजवानों के हक के लिए लड़ रहे हैं, देश के विकास में इनकी हिस्सेदारी मांग रहे हैं। 📍 रायबरेली, उत्तर प्रदेश pic.twitter.com/iTfEzkDGsh— Congress (@INCIndia) May 13, 2024 -
‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
సాక్షి, వేములవాడ : కాంగ్రెస్ యువరాజు రాఫెల్ కుంభకోణం బయటపడిన నాటి నుంచి ఐదేండ్లుగా ఒక్కటే జపం చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రకటన తర్వాత ఆయన నోరు మెదపరేం అంటూ ప్రధాని మోదీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శనాస్త్రాలు సంధించారు. లోక్‌సభ ఎన్నికల తరుణంలో వేములవాడలో బీజేపీ శ్రేణులు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభలో పాల్గొన్న మోదీ.. రాహుల్ గాంధీపై ప్రశ్నల వర్షం కురిపించారు.ఎందుకు సైలెంట్ అయ్యారు ఐదేళ్లుగా ఫైవ్ ఇండస్ట్రీలిస్ట్.. ఫైవ్ ఇండస్ట్రీలిస్ట్..ఆపై అంబానీ-అదానీ అంటూ జపం చేసిన రాహుల్ గాందీ లోక్‌సభ ఎన్నికల ప్రకటనతో ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు.తెలంగాణ గడ్డమీద నుంచితెలంగాణ గడ్డమీద నుంచి రాహుల్ గాంధీని ఒకటే అడుగుతున్నా అంబానీ, అదానీల నుంచి ఎంత తీసుకున్నారు? మీ మధ్య ఒప్పందం ఏమైనా జరిగిందా? లేకపోతే ఓవర్ నైట్‌లోనే అంబానీ, అదానీలను విమర్శించడం ఎందుకు మానేశారని ప్రశ్నించారు.పదునైన అస్త్రాలను రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీ ప్రముఖ వ్యాపార వేత్తలకు లబ్ధి చేకూరుస్తున్నారంటూ ఆరోపణలు చేస్తూ వచ్చారు. అంతేకాదు బీజేపీ 22 మందిని బిలియనీర్లుగా మార్చిందని వ్యాఖ్యానించారు. అదే కాంగ్రెస్ ఈ సారి అధికారంలోకి వస్తే కోట్లాది మంది ప్రజల్ని లక్షాదికారుల్ని చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. అయితే తాజాగా, వేములవాడ సభలో పదే పదే రాహుల్ గాంధీ ఆరోపణలపై ప్రధాని మోదీ పదునైన అస్త్రాలను ఎక్కుపెట్టారు -
అమేథీపై తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్?
జాతీయ కాంగ్రెస్‌లో అమేథీ అభ్యర్థిత్వంపై గందరగోళం నెలకొంది. యూపీలోని అమేథీ నుంచి ఎవరిని ఎన్నికల బరిలో నిలపాలనేదానిపై ఢిల్లీ కాంగ్రెస్ దర్బార్‌లో సమావేశం జరిగి 72 గంటలు గడిచినా, ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. అయితే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే.. త్వరలోనే అమేథీ అభ్యర్థిని తెలియజేస్తామని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.అమేథీని గాంధీ కుటుంబానికి కంచుకోటగా పరిగణిస్తారు. అయితే 2019లో ఈ మ్యాజిక్‌ను స్మృతి ఇరానీ బద్దలు కొట్టారు. అమేథీ లోక్‌సభ స్థానం నుంచి ఇప్పటి వరకు ముగ్గురు కాంగ్రెసేతర ఎంపీలు మాత్రమే ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఓడిపోయిన తర్వాత పార్టీ ఆలోచనలో పడింది. ఇప్పుడు నామినేషన్‌కు నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండడంతో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది తెలియక స్థానిక పార్టీ నేతలు అయోమయంలో కూరుకుపోయారు. అమేథీ అభ్యర్థిని ప్రకటించనప్పటికీ కాంగ్రెస్, ఎస్పీల సమన్వయ కమిటీ సమాలోచనలు చేస్తోంది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ దీపక్ సింగ్ మాట్లాడుతూ అతి త్వరలోనే అమేథీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది వెల్లడవుతుందన్నారు. మే 3న రాష్ట్ర ఇన్చార్జి వస్తారని తెలిపారు. అప్పుడు ఇక్కడి అభ్యర్థి ఎవరనేది తెలుస్తుందని ఆయన అన్నారు.వయనాడ్ ఎన్నికల తర్వాత రాహుల్ అమేథీకి వచ్చే అవకాశం ఉందని గతంలో చర్చ జరిగింది. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఇంకా నిశ్శబ్ధం కొనసాగుతోంది. ఇదేసమయంలో ఖర్గే చేసిన ప్రకటన ఇంకేదో సూచిస్తోందని రాజకీయ నిపుణులు అంటున్నారు. మరోవైపు బీజేపీపై ఆగ్రహంతో ఉన్న వరుణ్.. అమేథీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. -
సెంటిమెంట్.. కొత్త ఉత్తేజం..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో నిర్వహించిన జనజాతర సభ ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇక్కడ్నుంచే ప్రచారభేరి నిర్వహించి, అధికారంలోకి వచ్చిందని.. లోక్‌సభ ఎన్నికల్లోనూ కలసి వస్తుందన్న సెంటిమెంట్ కనిపించింది. ఈ సభకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. సాయంత్రం 5 గంటల సమయానికి సభా ప్రాంగణం కిక్కిరిసింది. ముఖ్య అతిథి రాహుల్, ఇతర కీలక నేతల రాక ఆలస్యమైనా.. మంత్రులు, ఇతర నేతలు ప్రసంగిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. రాహుల్ సభా వేదిక వద్దకు చేరుకున్నాక.. సీనియర్ నేతలు వీహెచ్, జగ్గారెడ్డి, చిన్నారెడ్డి, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పలువురు మహిళా నేతలు ఆయన వద్దకు వెళ్లి మాట్లాడారు. అనంతరం రాహుల్ ర్యాంప్‌పై నడుస్తూ అభివాదం చేశారు. తర్వాత ప్రసంగించారు. ఈ సమయంలో కార్యకర్తల నినాదాలతో సభాస్థలి మార్మోగిపోయింది. రాహుల్ రాక ఆలస్యం..: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం సాయంత్రం 6:15 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ తదితరులు స్వాగతం పలికారు. రాహుల్ వారితో కలసి నేరుగా నోవాటెల్ హోటల్‌కు వెళ్లారు. కాసేపు వారితో భేటీ అయ్యారు. తర్వాత సాయంత్రం 7:15 గంటల సమయంలో తుక్కుగూడ సభావేదిక వద్దకు చేరుకున్నారు. సభ అనంతరం 8:30 గంటల సమయంలో శంషాబాద్‌కు వెళ్లి, ఢిల్లీకి తిరుగు ప్రయాణం అయ్యారు. సభ తర్వాత సీఎం రేవంత్, మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు నోవాటెల్ హోటల్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా సభ జరిగిన తీరు, లోక్‌సభ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌పై చర్చించినట్టు సమాచారం. న్యాయపత్రం విడుదల.. ‘ప్రత్యేక హామీలు’ వాయిదా జన జాతర సభ వేదికగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోను తెలుగులో ‘న్యాయ పత్రం’పేరిట విడుదల చేశారు. ‘మార్పు కోసం హస్తం’పేరుతో ఐదు గ్యారంటీల పత్రాన్ని కూడా విడుదల చేశారు. అయితే.. ఈ సభలోనే తెలంగాణ కోసం 23 హామీలతో రూపొందించిన ప్రత్యేక హామీలను కూడా ప్రకటించాల్సి ఉన్నా.. చివరి నిమిషంలో వాయిదా వేశారు. ఈ హామీలను త్వరలోనే తెలంగాణ ప్రజల ముందుంచుతామని టీపీసీసీ వర్గాలు తెలిపాయి. తెల్లం వెంకట్రావు రాకపై చర్చ! జన జాతర సభ వేదికపై భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కనిపించడం చర్చకు దారితీసింది. ఆయన ఇంకా కాంగ్రెస్‌లో చేరకపోయినా.. సభా వేదికపై కూర్చోవడం గమనార్హం. ఆయనతోపాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆసీనులయ్యారు. వెంకట్రావు, ప్రసాదరెడ్డిలను పలువురు కాంగ్రెస్ నేతలు కలసి అభినందిస్తూ కనిపించారు. -
Tukkuguda: ప్రతి మహిళ ఖాతాలో రూ.లక్షవేస్తాం: రాహుల్ గాంధీ
తుక్కుగూడ జన జాతర సభ.. రాహుల్ గాంధీ ప్రసంగం ముఖ్యాంశాలు కొన్ని రోజుల కిందటే ఇక్కడే తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశా కొన్ని నెలల క్రితం తెలంగాణకు చేసిన వాగ్ధానం గుర్తుంది మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాం తెలంగాణలో హామీలు నెరవేర్చినట్లు దేశంలోనూ మాట నిలబెట్టుకుంటాం దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు రూ.లక్ష జీతంతో ఉద్యోగాలు కల్పిస్తాం ఐదు న్యాయసూత్రాలు భారతీయుల ఆత్మ యువతకు శిక్షణా కార్యక్రమాలు పెట్టబోతున్నాం ఏం చేయగలమో అదే మేనిఫెస్టోలో పెట్టాం మోదీ అధికారంలోకి వచ్చాక దేశ ప్రజలు నిరుపేదలయ్యారు తెలంగాణలో 30 వేల ఉద్యోగాలిచ్చాం మరో 50 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం రూ.500కు గ్యాస్ ఇచ్చాం 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ఇచ్చాం దేశ ప్రజల మనసులోని మాటే మా మేనిఫెస్టో నారీ న్యాయ్ కింద ప్రతి మహిళ ఖాతాలోకి రూ.లక్ష వేస్తాం .. నారీ న్యాయ్‌తో దేశ ముఖ చిత్రం మారబోతోంది ప్రతి మహిళ ఖాతాలోకి రూ.లక్ష నగదు జమ చేస్తాం పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పిస్తాం దేశంలో నిత్యం 30 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మేం అధికారంలోకి రాగానే రైతుల రుణాలు మాఫీ చేస్తాం ధనవంతులకు మోదీ రూ.16 లక్షల కోట్లు మాఫీ చేశారు రైతులకు మాత్రం మోదీ రూపాయి కూడా మాఫీ చేయలేదు స్వామినాథన్ ఫార్ములా ప్రకారం రైతులకు మద్దతు ధర ఇస్తాం దేశంలో 50 శాతం మంది వెనుకబడిన వర్గాలే బడుగుల జానాభా 50 శాతం ఉంటే 5 శాతం ఉన్నవారి దగ్గరే అధికారం ఉంది కార్మికులకు కనీస వేతనాలు కల్పిస్తాం కేసీఆర్ ఫోన్లు ట్యాప్ చేయించారు... గతంలో ఉన్న సీఎం ప్రభుత్వాన్ని ఎలా నడిపించారో మీకు తెలుసు వేల మంది ఫోన్లను కేసీఆర్ ట్యాప్ చేయించాడు ఇంటెలిజెన్స్, పోలీసు వ్యవస్థను కేసీఆర్ దుర్వినియోగం చేశాడు రాత్రి పూట ఫోన్ చేసి డబ్బులు వసూలు చేశారు ప్రభుత్వం మారగానే డేటా మొత్తం ధ్వంసం చేశారు తెలంగాణలో కాంగ్రెస్ పని మొదలు పెట్టింది.. నిజం మీ ముందుంది కేసీఆర్ ఏం చేశారో మోదీరు అదే చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ ఏం చేశారో ఢిల్లీలో మోదీ అదే చేస్తున్నారు తెలంగాణలో బీజేపీ బీ టీమ్‌ను ఓడించాం ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం ఎలక్టోరల్ బాండ్స్ ఈడీ ఎక్స్టార్షన్ డైరెక్టరేట్‌గా మారింది ఒక రోజు సీబీఐ ఒక కంపెనీకి ఝలక్ ఇస్తుంది అదే కంపెనీ మరుసటి రోజు ఎన్నికల బాండ్లు కొంటుంది బీజేపీ దగ్గర డబ్బుంది.. మా దగ్గర ప్రేముంది.. బీజేపీ దగ్గర డబ్బుంది.. మా దగ్గర మీ ప్రేముంది బీజేపీ అనే అతిపెద్ద వాషింగ్‌మెషిన్ నడుస్తోంది బీజేపీకి డబ్బు ఇచ్చిన కంపెనీలకే కాంట్రాక్టులు దక్కాయి బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తోంది మేము రాజ్యాంగాన్ని రద్దు చేయం మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు న్యాయం చేశాం మా మేనిఫెస్టో దేశ ముఖ చిత్రాన్ని మార్చబోతోంది కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేశారు రైతులు, వెనుకబడిన వారికి మరో 5 హామీలు ఇచ్చాం ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగురబోతోంది: సీఎం రేవంత్‌రెడ్డి జాతికి 5 గ్యారెంటీలను రాహుల్ అంకితం చేశారు జాతీయ ఎన్నికల మేనిఫెస్టోను తెలంగాణ గడ్డ మీద నుంచి విడుదల చేయడం సంతోషం బీఆర్ఎస్ను ఓడించినట్లే దేశంలో బీజేపీని ఓడించాలి గత ప్రభుత్వం కేసులు పెట్టినా కాంగ్రెస్ శ్రేణులు వెనక్కి తగ్గలేదు బీఆర్ఎస్ను తుక్కుతక్కుగా ఓడించిన ఉత్సాహం తుక్కుగూడలో కనిపిస్తోంది ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగురబోతోంది ఉద్యోగాలివ్వనందుకు బీజేపీకి ఓటు వేయాలా తెలంగాణలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నాం పదేళ్లలో దేశానికి బీజేపీ ఏం చేసింది పదేళ్లలో ఎన్ని ఉద్యోగాలిచ్చారో చెప్పాలి కేసీఆర్‌కు చర్లపల్లిలో చిప్పకూడు తినిపిస్తా .. రేవంత్ మాజీ ముఖ్యమంత్రి భాష సరిగా లేదు పదేళ్ల పాలనలో తెలంగాణను పీడించారు కేసీఆర్ మాట్లాడుతున్న మాటలకు లుంగీ లాగి చర్లపల్లిలతో చిప్పకూడు తినిపిస్తా కేసీఆర్‌కు జైలులో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం జైలులో ఉండొచ్చు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు నేను జానారెడ్డిని కాదు.. ఊరుకోవడానికి పదేళ్లలో కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎన్ని పదేళ్లలో వందేళ్ల విధ్వంసాన్ని సృష్టించారు లక్షలాది ఇందిరమ్మ ఇళ్లు కట్టించే బాధ్యత నాది మేం హామీలు నెరవేరిస్తే 14 లోక్‌సభ సీట్లు గెలిపించండి ఢిల్లీ నుంచి నిధులు తెచ్చుకోవాలంటే 14 మంది ఎంపీలను గెలిపించాలి కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టో రిలీజ్ చేసిన రాహుల్‌గాంధీ తుక్కుగూడ జనజాతర సభలో కాంగ్రెస్ మేనిఫెస్టో ఆవిష్కరించిన రాహుల్ తెలంగాణకు సంబంధించి మేనిఫెస్టోలో 23 అంశాలు న్యాయపత్రం పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టో 5 గ్యారెంటీల పత్రం పేరుతో మేనిఫెస్టో విడుదల భట్టి విక్రమార్క కామెంట్స్.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 6 గ్యారెంటీలు ప్రకటించాం కేసీఆర్ పాలనలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలిస్తున్నాం 200 యూనిట్ల విద్యుత్ జీరో బిల్లులిస్తున్నాం జనజాతర సభకు చేరుకున్న రాహుల్‌గాంధీ తుక్కుగూడ జనజాతర సభకు చేరుకున్న రాహుల్‌గాంధీ రాహుల్‌గాంధీ వెంట పలువురు కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ మేనిఫెస్టో విడుదల చేయనున్న రాహుల్‌గాంధీ కేసీఆర్ మాట, యాస అదుపులో ఉంచుకుని మాట్లాడాలి : మంత్రి పొన్నం పదేళ్లు సీఎంగా చేసిన వ్యక్తికి ఎలా మాట్లాడాలో తెలియడం లేదు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాహుల్‌గాంధీ కాసేపట్లో తుక్కుగూడ కాంగ్రెస్ జనజాతర సభ సభ కోసం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాహుల్ గాంధీ ఘనస్వాగతం పలికిన సీఎం రేవంత్, భట్టి, దీపాదాస్ మున్షీ జాతీయ మేనిఫెస్టో విడుదల చేయనున్న రాహుల్‌గాంధీ తెలంగాణకు ఇచ్చే హామీలు వివరించనున్న రాహుల్ మళ్లీ సమర శంఖం కాంగ్రెస్ తెలంగాణ నుంచి లోక్‌సభ ఎన్నికల సమర శంఖాన్ని పూరించేందుకు సిద్ధమైంది. శనివారం సాయంత్రం హైదరాబాద్ నగర శివార్లలోని రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జన జాతర పేరిట నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ దీనికి వేదిక కానుంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సభ వేదికగా పార్టీ మేనిఫెస్టోను తెలుగులో విడుదల చేయనున్నారు. దీంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన హామీలను కూడా ప్రకటించనున్నారు. మరోవైపు ఈ సభలోగానీ, అంతకుముందుగానీ కాంగ్రెస్ పెద్దల సమక్షంలో బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన పలువురు ముఖ్య నేతలు పార్టీలో చేరుతారని అంటున్నారు. ఇందులో ముగ్గురి నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. తుక్కుగూడ సభ ప్రారంభానికి ముందు నోవాటెల్ హోటల్లో రాహుల్ సమక్షంలో ఈ చేరికలు జరగొచ్చని.. తర్వాత వారు సభలో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. చేరేది ఎవరన్నదానిపై మాత్రం గోప్యత పాటిస్తున్నారు. టీపీసీసీ జన జాతర సభకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేపట్టింది. 70 ఎకరాల్లో సభా ప్రాంగణం, 550 ఎకరాల్లో పార్కింగ్ సిద్ధం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీపీసీసీ ఇదే ప్రాంగణంలో సభ నిర్వహించి.. సోనియా గాం«దీతో ఆరు గ్యారంటీలను ప్రకటింపజేసింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల శంఖారావానికి కూడా ఇదే ప్రాంగణాన్ని ఎంచుకోవడం గమనార్హం. ఇక ఎండలు మండిపోతున్న నేపథ్యంలో సభకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, మంచినీటి కొరత రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. పార్లమెంటు స్థానాల వారీ ఇన్చార్జులు, అసెంబ్లీ సమన్వయకర్తల సమన్వయంతో.. సభకు 10లక్షల మందికిపైగా తరలి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని కా>ంగ్రెస్ వర్గాలు తెలిపాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించడంతోపాటు.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలన విజయాలను ప్రజలకు వివరించనున్నారు. తెలంగాణకు ప్రత్యేక హామీలు తుక్కుగూడ సభలో కాంగ్రెస్ జాతీయ స్థాయి మేనిఫెస్టో ‘పాంచ్ న్యాయ్’ను తెలుగులో విడుదల చేయనుంది. దీనితోపాటు రాహుల్ గాంధీ తెలంగాణకు ప్రత్యేక హామీలను ఇవ్వనున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీలో కలిపిన ఐదు భద్రాచలం సమీప గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేస్తామని.. విభజన చట్టం హామీలన్నీ అమలు చేస్తామని హామీ ఇవ్వనున్నట్టు సమాచారం. ఐటీఐఆర్ వంటి ఉపాధి ప్రాజెక్టును కేటాయిస్తామనే హామీ కూడా ఉంటుందని తెలిసింది. చేరికలపై గోప్యత జన జాతర సభ సందర్భంగా బీఆర్ఎస్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ చేరికల అంశాన్ని టీపీసీసీ గోప్యంగా ఉంచుతోంది. పార్టీ ముఖ్య నేతతోపాటు ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఓ నాయకుడికి మాత్రమే దీనిపై స్పష్టత ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చేరే అవకాశం ఉందని.. నోవాటెల్ హోటల్లో రాహుల్ గాం«దీని ఎంపీ కె.కేశవరావు కలుస్తారని మాత్రం పేర్కొంటున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌లో చేరేవారు వీరే అంటూ కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పేర్లు ప్రచారం అవుతున్నాయి. కాలేరు వెంకటేశ్, కోవ లక్ష్మి, కాలె యాదయ్య, బండారి లక్ష్మారెడ్డి, గంగుల కమలాకర్, టి.ప్రకాశ్‌గౌడ్, మాణిక్‌రావు, డి.సు«దీర్‌రెడ్డి, అరికెపూడి గాం«దీ, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్ ఈ జాబితాలో ఉన్నట్టు చెప్తున్నారు. కానీ వీరిలో ఎందరు చేరుతారు, ఎవరు చేరుతారన్నది స్పష్టత లేదు. దీనిపై టీపీసీసీ ముఖ్య నాయకుడొకరు మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్కు చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడమైతే ఖాయమే. అన్ని సన్నివేశాలను వెండితెరపై చూడాల్సిందే..’’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. శంషాబాద్ నుంచి నోవాటెల్‌కు.. తర్వాత సభకు.. రాహుల్ గాంధీ శనివారం సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నోవాటెల్ హోటల్‌కు వస్తారు. కొంతసేపు పార్టీ నేతలతో భేటీ అయ్యాక.. తుక్కుగూడ సభకు చేరుకుంటారు. సభ ముగిశాక రాత్రి 7 గంటల సమయంలో శంషాబాద్ మీదుగా తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు. -
6న కాంగ్రెస్‌లోకి భద్రాచలం ఎమ్మెల్యే?
ఇల్లెందు: భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి పలుమార్లు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ఆయన గత నెల 12న మణుగూరులో కాంగ్రెస్ ఆధ్వర్యాన జరిగిన సభకు సైతం హాజరయ్యారు. మంగళవారం ఇల్లెందులో జరిగిన మహబూబాబాద్ లోక్‌సభ స్థాయి కాంగ్రెస్ సమావేశంలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలసి వెంకట్రావు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైనట్లు సమాచారం. ఈ నెల 6న తుక్కుగూడలో జరిగే సభలో రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. దీనిపై వెంకట్రావును వివరణ కోరగా త్వరలో వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. వ్యవస్థలను కేసీఆర్ నాశనం చేశారు: తుమ్మల ఇల్లెందు సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ పదేళ్ల పాలనలో వ్యవస్థలన్నీ దుర్వి నియోగం చేశారని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా గత ఎన్నికల సందర్భంగా సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరతామని, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కొనసాగిస్తూ కొత్తవి కూడా అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో 7,145 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ప్రతి గింజనూ కొంటామన్నారు. ఇప్పటికే 92.36 శాతం రైతుబంధు పంపిణీ పూర్తి చేశామని, పంటల బీమా పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. -
ఏటా 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైంది?..బీజేపీపై రాహుల్ ఆగ్రహం
ఉద్యోగాల రూప కల్పన విషయంలో బీజేపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశ యువత ఇదే విషయంపై తమని ప్రశ్నిస్తోందని అన్నారు. ఎన్నికల ముందు యువతకు చేసిన వాగ్ధానం ‘యువ న్యాయ్’ ద్వారా ఉపాధి విప్లవానికి కాంగ్రెస్ శ్రీకారం చుట్టిందని ఆయన హామీ ఇచ్చారు. ‘ప్రధాని మోదీ జీ యువతకు ఉపాధి కోసం మీ వద్ద ఏదైనా ప్రణాళికలు ఉన్నాయా? అనే ప్రశ్న ప్రతి యువతీ యువకుల్లో ఉంది. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని అబద్ధం ఎందుకు చెప్పారు’ అని ప్రశ్నించారు. 'యువ న్యాయ్ ఆధ్వర్యంలో ఉపాధి విప్లవం చేపట్టాలని కాంగ్రెస్ సంకల్పించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం, చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ‘పెహ్లీ నౌక్రి పక్కీ’ పథకాన్ని అమలు చేయడం ద్వారా పేపర్ లీకేజీలు కాకుండా చూస్తామని రాహుల్ గాంధీ ఎక్స్.కామ్‌లో పోస్ట్ చేశారు. -
కాంగ్రెస్‌కు ఓటు వేయలేని స్థితిలో రాహుల్, సోనియా?
ఈ టైటిల్ చూసి ఏవేవో ఊహలకు వెళ్లకండి. ఓటు వేసే విషయంలో వారిపై ఎటువంటి నిర్బంధం లేదు. అయితే ఇక్కడొక ట్విస్ట్ ఉంది. అదేమిటో, వారితో పాటు ప్రియాంకా గాంధీ కూడా కాంగ్రెస్‌కు ఓటు వేయలేని పరిస్థితిలో ఎందుకు ఉన్నారో, దీనికి గల కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఢిల్లీలో ఆసక్తిగా మారనున్న రాజకీయ సమీకరణాలను మనం చూడబోతున్నాం. ‘ఇండియా కూటమి’ ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీతో సీట్లను పంచుకున్నప్పుడు, గాంధీ కుటుంబానికి చెందిన ఈ ముగ్గురు నేతల ఓట్లు కాంగ్రెస్‌కు పడే అవకాశాలు లేవని ఎవరూ ఊహించివుండరు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన ఓటర్లు. అయినా వారు ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో వారి సొంత పార్టీకి ఓటు వేసుకోలేరు. ‘ఆప్’తో పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న న్యూఢిల్లీ స్థానాన్ని అరవింద్ కేజ్రీవాల్ పార్టీకి అప్పగించింది. న్యూఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, తూర్పు ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ స్థానాల్లో ‘ఆప్’ పోటీ చేయనుండగా, కాంగ్రెస్ చాందినీ చౌక్, ఈశాన్య ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీలో పోటీ చేస్తోంది. న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ రాజకీయాలకు నెలవుగా ఉండేది. అయితే 2014లో మోదీ వేవ్ ఇక్కడి అన్ని సమీకరణలను తుడిచిపెట్టేసింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి గాంధీ కుటుంబ సభ్యులు తమ సొంత పార్టీకి ఓటు వేయలేని పరిస్థితి ఏర్పటడం బహుశా ఇదే తొలిసారి. నిజానికి కాంగ్రెస్ పార్టీ తనకు తగ్గుతున్న మద్దతు కారణంగా, యూపీ, ఢిల్లీతో సహా అనేక రాష్ట్రాల్లో ఇతర పార్టీలతో చేతులు కలపవలసి వచ్చింది. 1952- 2009 మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ న్యూఢిల్లీ స్థానాన్ని ఏడు సార్లు గెలుచుకుంది. బీజేపీకి చెందిన మీనాక్షి లేఖి ఇక్కడి నుంచి వరుసగా రెండుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ న్యూఢిల్లీ స్థానం నుండి గెలిచి పార్లమెంటుకు చేరుకున్నారు. కాంగ్రెస్ నేతలైన సోనియా, రాహుల్, ప్రియాంకల ఇళ్లు న్యూఢిల్లీ ఏరియాలోనే ఉండటంతో వారికి ఇక్కడే ఓటు హక్కు ఉంది. మరోవైపు ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ శుక్లా కూడా న్యూఢిల్లీ ఓటర్లే. దీంతో వీరు కూడా కాంగ్రెస్‌కు ఓటు వేయలేని స్థితిలో ఉన్నారు. -
సాగురైతుల అభివృద్దే లక్ష్యం: రాహుల్ గాంధీ
నాసిక్: రైతుల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా విపక్షాల ‘ఇండియా’ కూటమి పనిచేస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ ప్రకటించారు. తమ కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే చేపట్టబోయే రైతు సంక్షేమ కార్యక్రమా లను రాహుల్ వివరించారు. గురువారం మహారాష్ట్రలో చాంద్‌వడ్‌లో రైతుర్యాలీలో ప్రసంగించారు. ‘‘ రైతన్నల ప్రయోజనాలే మాకు పరమావధి. వ్యవసాయాన్ని జీఎస్టీ పరిధి నుంచి తొలగిస్తాం. పంట బీమా పథకంలో సంస్కరణలు తెచ్చి రైతు అనుకూల విధానాలను ప్రవేశపెడతాం’ అని అన్నారు. -
నీటి పాట్లు.. పెళ్లికి అగచాట్లు
బనశంకరి: బెంగళూరు నగరంలో వేసవి నీటి కొరత ప్రజలను పీడిస్తోంది. అలాగే యువకులు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు కూడా దొరకడం లేదు. నరేంద్ర అనే యువకుడు తన స్నేహితునికి పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరకడం లేదని సోమవారం ఎక్స్‌లో బాధ వెళ్లబోసుకున్నాడు. ఇందుకు నీటి సమస్యే కారణమని చెప్పాడు. తన పోస్టును కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి ట్యాగ్ చేశాడు. రాహుల్‌గాంధీ గారు.. దయచేసి మీరు బెంగళూరులో నీటి సమస్యను పరిష్కరించాలి. ఐటీ ఉద్యోగం చేస్తున్న నా స్నేహితుడు వధువు కోసం ఎంతగానో గాలించినా ప్రయోజనం లేదు. ఐటీ సిటీలో నీటి సమస్య వల్ల అమ్మాయిలు పెళ్లికి ఒప్పుకోవడం లేదని నా స్నేహితుడు బాధపడినట్లు తెలిపాడు. మొత్తం మీద ఈ ఎండాకాలం సిలికాన్ సిటీకి చుక్కలు చూపిస్తోంది. గత నెలరోజుల నుంచి బెంగళూరులో నీటి కొరత తీవ్రరూపం దాల్చింది. నీటి బొట్టుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నీటిని సరఫరా చేయడానికి ప్రభుత్వం, బెంగళూరు జలమండలి శ్రమిస్తున్నాయి. లక్ష బోర్లు ఎండిపోయాయి. నగరంలో 257 ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. -
భారత్ జోడో న్యాయ యాత్రకు అఖిలేష్ దూరం?
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సారధ్యంలో ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతున్న భారత్‌జోడో న్యాయ యాత్రలో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్ఫీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పాల్గొనడం లేదని సమాచారం. లోక్‌సభ ఎన్నికల సీట్ల కేటాయింపు విషయంలో ఒప్పందం కుదరకపోవడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. అయితే ఈ రెండు పార్టీల మధ్య సీట్ల విషయంలో సోమవారం తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే రాయ్‌బరేలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ న్యాయ యాత్రలో అఖిలేష్ పాల్గొంటారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆహ్వానాన్నిఅఖిలేష్ అంగీకరించి, అమేథీ లేదా రాయ్ బరేలీలో జరిగే న్యాయ యాత్రలో పాల్గొంటానని స్వయంగా ప్రకటించారు. రాహుల్ యాత్ర సోమవారం అమేథీలో, మంగళవారం రాయ్‌బరేలీలో ఉండనుంది. సోమవారం అఖిలేష్ అమేథీకి వెళ్లడం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాయ్‌బరేలీలో జరిగే న్యాయ యాత్రలో ఆయన పాల్గొనవచ్చని, అయితే దీనిపై స్పష్టత లేనందున ఎలాంటి సన్నాహాలు చేయడం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. -
రాహుల్, ప్రియాంక మధ్య విబేధాలు? బీజేపీ సందేహం వెనుక ఏముంది?
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా శుక్రవారం ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో పాల్గొనలేకపోయారు. తాను యాత్రకు గైర్హాజరు కావడం వెనుక అనారోగ్యమే కారణమని, ఆరోగ్యం మెరుగుపడిన వెంటనే ఈ ప్రయాణంలో భాగమవుతానని ప్రియాంక తెలిపారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న ఈ యాత్ర ప్రారంభమై 34 రోజులు దాటింది. ఈ నేపధ్యంలో ప్రియాంకా గాంధీ తొలిసారిగా దీనిలో పాల్గొనబోతున్నారనే ప్రకటన వెలువడింది. అయితే ఇంతలోనే ఆమె ఈ యాత్రకు గైర్హాజరు కావడంపై బీజేపీ సందేహం వ్యక్తం చేసింది. అన్నాచెల్లెళ్ల మధ్య బేధాభిప్రాయాలే దీనికి కారణమని బీజేపీ ఆరోపించింది. ప్రియాంక గాంధీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో చేసిన పోస్ట్‌లో తాను అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నానని, అందుకే ఆసుపత్రిలో చేరినట్లు తెలియజేశారు. ఆమె తన పోస్ట్‌లో ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ఉత్తరప్రదేశ్‌కు ఎప్పుడు చేరుకుంటుందానని నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అయితే అనారోగ్యం కారణంగా నేను ఈరోజే ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. నా ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడిన వెంటనే, నేను ఆ ప్రయాణంలో భాగమవుతాను. చందౌలీ-బనారస్‌లో జరిగే ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో పాల్గొనబోయే నేతలకు, కార్యకర్తలకు, నా ప్రియమైన సోదరునికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు. सबको अपने स्वास्थ्य का ख़्याल रखना चाहिए। जब यात्रा 2.0 शुरू हुई तब भी प्रियंका वाडरा वहाँ से नदारद थीं, और आज जब राहुल की यात्रा उत्तर प्रदेश पहुँची है, तब भी प्रियंका वहाँ नहीं रहेंगी। पार्टी पर मिल्कियत के लिए भाई-बहन के बीच ना पटने वाली ये खाई अब सर्वविदित है। pic.twitter.com/26KaPOBeYY — Amit Malviya (@amitmalviya) February 16, 2024 మరోవైపు డీహైడ్రేషన్, వికారం కారణంగా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా ప్రియాంక గాంధీ తన ఆరోగ్య వివరాల గురించి చేసిన ట్వీట్‌కు బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ స్పందించారు. ప్రియాంక గాంధీ పోస్ట్‌పై ఆయన వ్యాఖ్యానిస్తూ ‘ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. యాత్ర 2.0 ప్రారంభమైనప్పుడు కూడా ప్రియాంక వాద్రా కనిపించలేదు. రాహుల్ యాత్ర ఉత్తరప్రదేశ్ చేరుకున్నప్పుడు కూడా ప్రియాంక హాజరుకావడం లేదు. పార్టీ నాయకత్వం కోసం అన్నాచెల్లెళ్ల మధ్య ఏర్పడిన ఈ పూడ్చలేని అగాధం ఇప్పుడు అందరికీ తెలుస్తోంది’ అని పేర్కొన్నారు. ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ యాత్ర 2024, జనవరి 14న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో మణిపూర్ నుంచి ప్రారంభమైంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం మార్చి 20 లేదా 21న ముంబైలో ముగియనుంది. అయితే మార్చి మొదటి పక్షంలోనే ముంబైలో ఈ యాత్ర ముగుస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ యాత్ర శుక్రవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించింది. ఇది తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల గుండా వెళుతూ, ఫిబ్రవరి 16 నుండి 21 తేదీల మధ్య రాయ్‌బరేలీ అమేథీల గుండా ముందుకు వెళుతుంది. ఫిబ్రవరి 22, 23లలో యాత్రకు విశ్రాంతినివ్వనున్నారు. ఈ యాత్ర పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో ఫిబ్రవరి 24, 25 తేదీలలో తిరిగి ప్రారంభం కానుంది. -
జార్ఖండ్‌లో భారత్ జోడో న్యాయ యాత్ర రద్దు
రాహుల్ గాంధీ రెండో దశ భారత్ జోడో న్యాయ యాత్ర బుధవారం జార్ఖండ్‌లో ప్రారంభం కావాల్సి ఉండగా, ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమం కారణంగా రద్దయ్యింది. రైతు ఉద్యమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీ వెళ్లారని, అందుకే ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి. పంజాబ్ రైతులు తమ డిమాండ్లు నెరవేరేందుకు ఢిల్లీలో నిరసనలు చేపడుతున్నారు. కాగా బుధవారం రాహుల్ గాంధీ ఛత్తీస్‌గఢ్‌లోని గర్వా జిల్లా నుంచి జార్ఖండ్‌లో అడుగుపెట్టాల్సి ఉంది. అయితే రైతుల ఆందోళన దృష్ట్యా జార్ఖండ్‌లో భారత్ జోడో న్యాయ యాత్ర కార్యక్రమాన్ని రద్దు చేశామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సోనాల్ శాంతి తెలిపారు. రైతుల ఆందోళన అనంతరం ఈ యాత్రను పునఃప్రారంభిస్తామని తెలిపారు. -
జార్ఖండ్ ప్రభుత్వంపై... బీజేపీ కుట్ర: రాహుల్
డియోహర్(జార్ఖండ్): జార్ఖండ్‌లో ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా శనివారం జార్ఖండ్‌లోని గొడ్డాలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. అనంతరం దేవగఢ్‌లో ప్రఖ్యాత బైద్యనాథ్ ఆలయంలో రుద్రాభిషేకం చేశారు. స్థానిక ర్యాలీలో మాట్లాడారు. ‘‘యువత ఉద్యోగాలు కోరుతుంటే ప్రధాని మోదీ మాత్రం దేశంలో నిరుద్యోగమనే వ్యాధిని వ్యాప్తి చేస్తున్నారు. ఈ వ్యాధి సోకిన యువత భవిష్యత్తును నాశనం చేసుకుంటోంది’’ అని రాహుల్ అన్నారు. దేశంలో గిరిజన, దళిత, వెనుకబడిన వర్గాల ప్రజల సంఖ్యను కచ్చితంగా తేల్చేందుకు కులగణన అవసరం ఎంతో ఉందని ఆయన చెప్పారు. దేశంలో అన్యాయాలకు గురవుతున్న వారిలో ఈ వర్గాల ప్రజల సంఖ్య పెరుగుతూ పోతోందని తెలిపారు. -
అనైక్యతా కూటమి
వచ్చే ఎన్నికల్లో అధికార బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా ఐక్యంగా ప్రతిఘటిస్తామని 28 పార్టీల కలగూరగంప ‘ఇండియా’ కూటమి ఆది నుంచి చెబుతోంది. కానీ, ఎన్నికలు ముంచుకొస్తుంటే, కూటమి బీటలు వారుతోంది. అంతటా అనైక్యతా రాగాలే వినిపిస్తున్నాయి. పశ్చిమబెంగాల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని ఆ రాష్ట్ర సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం తేల్చేశారు. ‘ఆప్’ నేత – పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ సైతం తమ రాష్ట్రంలోనూ అంతే అని కుండబద్దలు కొట్టారు. జేడీ(యూ) అధినేత – బిహార్ సీఎం నితీశ్ కుమార్ పైకి ఏమీ చెప్పకున్నా, లోలోపల కుతకుతలాడుతున్నట్టు కనిపిస్తూనే ఉంది. వెరసి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో’ అని తిరుగుతుంటే, ముందుగా ‘ఇండియా(కూటమి) జోడో’ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. రాహుల్ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ బెంగాల్లోకి ప్రవేశించడానికి ఒక రోజు ముందే మమత షాక్ ఇచ్చారు. బెంగాల్లో హస్తం బలం పుంజుకుంటే, అది తనకు తలనొప్పి అవుతుందని మమతకు తెలుసు. అందుకే, కలసికట్టుగా పోటీ చేసినా... రాష్ట్రంలో నిరుడు కాంగ్రెస్ నెగ్గిన 2 లోక్‌సభా స్థానాలనే ఆ పార్టీకి కేటాయిస్తామన్నది తృణమూల్ ప్రతిపాదన. దూకుడు ప్రదర్శిస్తున్న స్థానిక హస్తం నేతలు అందుకు ససేమిరా అంటున్నారు. ముఖ్యంగా రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్, కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేత అధీర్ రంజన్ చౌధురి నిత్యం మమతపై చేస్తున్న విమర్శలు చివరకు ఇక్కడకు తెచ్చాయి. కాంగ్రెస్ పెద్దలు నష్టనివారణకు ప్రయత్నిస్తున్నా రాజీ లేదని దీదీ కొట్టిపారే శారు. కూటమిలో కొనసాగుతామంటూనే, ఎన్నికలయ్యాక కాంగ్రెస్ బలాన్ని బట్టి మిగతావి మాట్లా డదామని ఆమె చెబుతున్న మాటలు కంటితుడుపుకే తప్ప, బీజేపీపై కలసికట్టు పోరుకు పనికిరావు. మరోపక్క ‘ఇండియా’ కూటమి ఏర్పాటులో కీలక పాత్రధారి, జేడీ (యూ) అధినేత, బిహార్ సీఎం అయిన నితీశ్ కుమార్ వ్యవహారశైలి సైతం అనుమానాస్పదంగానే ఉంది. కూటమిలో తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన అసంతృప్తితో ఉన్నారు. మోదీతో రామ్ రామ్ చెప్పి, ప్రతిపక్ష కూటమిలో చేరిన ఆయన తీరా ఇప్పుడు మళ్ళీ అధికార ఎన్డీఏ కూటమికే తిరిగి వచ్చేస్తారని ఊహాగానం. బిహార్‌లో ఉమ్మడి పాలన సాగిస్తున్న ఆర్జేడీ – జేడీయూల మధ్య కొన్నాళ్ళుగా సఖ్యత లేదు. ప్లేటు ఫిరాయించడంలో పేరొందిన నితీశ్ గతంలో బీజేపీకి కటీఫ్ చెప్పి, ఆర్జేడీతో కలసి ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కానీ, ఇటీవల తననే గద్దె దింపాలని చూసిన ఆర్జేడీ మీద గుర్రుగా ఉన్నారు. ఆ పార్టీని పక్కకు నెట్టి, మళ్ళీ కమలనాథులతో నితీశ్ చేతులు కలిపే సూచనలున్నట్టు పుకారు. బిహార్‌లో జేడీయూ, ఆర్జేడీ నేతలు ఎవరికి వారు గురువారం కీలక భేటీలు జరపడం, ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కిన తీరు చూస్తుంటే... ఆ రెండు పార్టీల ప్రేమకథ ముగిసినట్టే ఉంది. మరి, రాజకీయ చాణక్యుడు నితీశ్ రానున్న రోజుల్లో ఏం చేస్తారో చూడాలి. విచిత్రమేమిటంటే, మాటలే తప్ప చేతల్లో కూటమి అడుగు ముందుకు పడట్లేదు. సెప్టెంబర్‌లో అనుకున్న సీట్ల సర్దుబాటు వ్యవహారం డిసెంబర్‌కి వాయిదా పడి, జనవరి ముగిసిపోతున్నా అతీగతీ లేకుండా పడివుంది. అన్ని పార్టీలూ కలసి సమష్టి ప్రతిపక్ష ర్యాలీ భోపాల్‌లో చేయాలనుకున్నా అది కార్యరూపం దాల్చలేదు. నెలలు గడుస్తున్నా ఉమ్మడి మేనిఫెస్టో ఊసే లేదు. లౌకికవాద, రాజ్యాంగబద్ధ పాలన కోసం పోరాటం అని చెబుతున్నా... బీజేపీ వ్యతిరేకత, మోడీని గద్దె దింపడమనే లక్ష్యం మినహా తగిన సమష్టి సైద్ధాంతిక భూమికను సిద్ధం చేసుకోవడంలో ప్రతిపక్ష కూటమి విఫలమైంది. వివిధ రాష్ట్రాల్లో తమ బలాబలాలు తెలుసు గనక, పార్టీలు తమలో తాము పోరాడే కన్నా బీజేపీపై బాణం ఎక్కుపెడితే ప్రయోజనం. ఒకటి రెండు సీట్లకై పంపిణీలో కలహించుకొనే కన్నా పెద్ద లక్ష్యం కోసం విశాల హృదయంతో త్యాగాలకు సిద్ధపడితేనే లక్ష్యం చేరువవుతుంది. బెంగాల్లో తృణమూల్, పంజాబ్, ఢిల్లీల్లో ఆప్ లేకుండా కూటమికి ప్రాసంగికత ఏముంది? వాస్తవాల్ని గుర్తించి కాంగ్రెస్ తన వైఖరి మార్చుకోవాలి. పెద్దమనిషిగా కాక, అందరికీ పెద్దన్నగా వ్యవహరించాలనుకోవడంతోనే అసలు ఇబ్బంది. అలాగే, ‘యాత్ర’లతో రాహుల్ ఇమేజ్ పెరగ వచ్చేమో కానీ, ప్రతిపక్ష కూటమికి జరిగే ప్రయోజనమేమిటో తక్షణం చెప్పలేం. మణిపుర్ నుంచి ముంబయ్ దాకా 100 లోక్‌సభా స్థానాల మీదుగా సాగి, మార్చి 20న యాత్ర ముగియనుంది. అన్ని పార్టీలనూ ఒక తాటిపై నడిపి, సమన్వయం సాధించాల్సిన ఎన్నికల వేళ రాహుల్ దూరంగా యాత్రలో ఉంటే ఎలా? కనీసం అన్ని పార్టీలతో కలిసైనా యాత్ర చేయాల్సింది. ప్రభుత్వానికి వ్యతి రేకంగా ప్రతిపక్షాల్ని కూడగట్టడంలో 1977లో జేపీ, 1989లో వీపీ సింగ్, ఆ తరువాత యూపీఏ కాలంలో అందరి సమన్వయానికి సోనియా లాంటి వారు కృషి చేశారు. ప్రస్తుతం యాత్రతో రాహుల్, పార్టీ పునరుజ్జీవనంతో ఖర్గే బిజీ. మరి, కూటమి మెడలో ఐక్యత గంట కట్టేదెవరు? మొత్తానికి, ఎన్నికలు సమీపిస్తున్న వేళ మోదీ రోడ్‌షోలు, ప్రచారగీతాలతో సింహనాదం చేస్తుంటే, ప్రతిపక్షాలు వేటికవి స్వలాభం చూసుకుంటూ విభేదాల బాట పట్టడం విడ్డూరం. సమావేశాలతో హంగామా రేపుతూ మొదలైన ప్రతిపక్ష కూటమి తీరా ఆట ఆడకుండానే ‘వాక్ ఓవర్’తో మోదీకి విజయం కట్టబెడుతోందని అనిపిస్తోంది. 28 కత్తులు ఒకే ఒరలో ఇమడడం కష్టమే. కానీ, అన్ని పార్టీ లకూ ఒకే లక్ష్యం ఉంటే, అసాధ్యం కాకపోవచ్చు. నిష్క్రియాపరత్వంతో, సొంత లాభం కోసం సాటి పార్టీల కాళ్ళు నరికే పనిలో ఉంటే లాభం లేదు. ఢిల్లీలో పాగా వేయాలంటే, సమయం మించిపోక ముందే కళ్ళు తెరవాలి. కూటమిది ఆరంభ శూరత్వం కాదని నిరూపించాలి. కలహాలు మాని కార్యా చరణకు దిగాలి. లేదంటే తర్వాతేం చేసినా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే అవుతుంది. -
పాతిక కేసులు పెట్టుకోండి: రాహుల్
బార్పేట(అస్సాం): అస్సాంలో హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ తనపై మోపిన కేసులకు భయపడేది లేదని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. నాగాలాండ్ నుంచి అస్సాంలోని గువాహటిలోకి భారత్ జోడో న్యాయ్ యాత్ర అడుగుపెట్టకుండా పోలీసులు అడ్డుకున్నపుడు జరిగిన ఘర్షణలకు రాహుల్ కారకుడంటూ హిమంత సర్కార్ కేసులు పెట్టడం తెల్సిందే. అస్సాంలో ఏడురోజుల యాత్ర బర్పెటా జిల్లా కేంద్రంలో బుధవారం ప్రారంభించిన సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన తొలి బహిరంగ సభలో సీఎంపై రాహుల్ విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘ కేసులు పెట్టి నన్ను బయపెట్టొచ్చన్న ఐడియా హిమంతకు ఎందుకు వచి్చందో నాకైతే తెలీదు. మీరు(హిమంత, పోలీసులు) ఎన్ని కేసులు పెడతారో పెట్టండి. మరో పాతిక తప్పుడు కేసులు బనాయించండి. నేను అస్సలు భయపడను. బీజేపీ–ఆర్ఎస్ఎస్ నన్ను భయపెట్టలేవు’’ అని అన్నారు. హిమంతను అతిపెద్ద అవినీతి సీఎంగా అభివరి్ణంచారు. ‘‘ మీరు ఆయనతో మాట్లాడుతుంటే ఆలోపు మీ భూమి కొట్టేస్తారు. మీరు వక్కపలుకులు నమిలినంత తేలిగ్గా ఆయన సుపారీ బిజినెస్ కానచ్చేస్తారు. మీ జేబులో డబ్బు నొక్కేస్తారు. ఏకంగా కజిరంగా నేషనల్ పార్క్ స్థలాలనే సీఎం ఆక్రమించారు. సీఎంతో జాగ్రత్త’ అని జనాన్ని అప్రమత్తం చేశారు. ఎన్నికలయ్యాక లోపలేస్తాం: సీఎం మంగళవారం నాటి ఘర్షణలకు సంబంధించిన కేసులో రాహుల్‌ను లోక్‌సభ ఎన్నికల తర్వాత అరెస్ట్ చేస్తామని సీఎం హిమంత చెప్పారు. -
కాంగ్రెస్‌కు పరీక్షా కాలం
2024 ను ఎన్నికల సంవత్సరంగానే అభివర్ణించాలి. వరుస గెలుపులతో బిజెపి చాలా బలంగా ఉంది. అన్నీ కలిసొస్తే హ్యాట్రిక్ కొట్టే అవకాశాలు వున్నాయి. నరేంద్రమోదీ ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి కాగల అవకాశాలను కొట్టి పారేయలేం. మోదీని దించడమే ధ్యేయంగా ప్రతిపక్ష పార్టీలన్నీ 'ఇండియా కూటమి'గా ఏర్పడ్డాయి. కానీ,ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదు. ఇక ముందు ముందు పనిచేస్తారేమో చూడాలి. విపక్ష పార్టీలలో ప్రధాన పక్షంగా వున్న కాంగ్రెస్ ఇంకా రాటుదేలాల్సిన స్థితిలోనే వుంది.2024 లో అధికారంలోకి రాకపోతే, కాంగ్రెస్ మరింతగాకునారిల్లి పోవచ్చు. ఇండియా కూటమిలోని మిగిలిన పార్టీల కంటే కాంగ్రెస్‌కే ఇది పరీక్షాకాలం. ప్రస్తుతం దేశంలో హిమాచల్ ప్రదేశ్,కర్ణాటక, తెలంగాణ తప్ప, కాంగ్రెస్ ఎక్కడా అధికారంలో లేదు.బిజెపి చాలా రాష్ట్రాలలో అధికారంలో వుంది. మిగిలిన రాష్ట్రాలు వివిధ ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో వున్నాయి. అధికారంలో వున్న ప్రాంతీయ పార్టీలు చాలా వరకూ బలంగానే వున్నాయి.అధికారంలో లేకపోయినా, కొన్ని ప్రాంతీయ పార్టీలు బలంగానే వున్నాయి. అధికారంలోకి వచ్చినా రాకపోయినా బలపడాల్సిన చారిత్రక అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది.ప్రస్తుతం,జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా ఉనికిలో ఉన్నప్పటికీ, ఈ బలం సరిపోదు. రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర రాహుల్ ఇమేజ్ ను పెంచడానికే ఎక్కువ భాగం ఉపయోగపడింది తప్ప, పార్టీ ప్రతిష్ఠను కాపాడడానికి, గెలుపును అందించడానికి పూర్తిస్థాయిలో ఉపయోగపడలేదని చెప్పవచ్చు. కర్ణాటక,తెలంగాణలో అధికారం చేపట్టినప్పటికీ, అది కేవలం జోడో యాత్ర ప్రభావంతో జరిగింది కాదు. కర్ణాటకలో బిజెపి,తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీపై వచ్చిన ప్రజావ్యతిరేకత కాంగ్రెస్ గెలుపుకు కలిసొచ్చింది.ప్రస్తుతం దక్షిణాదిలో రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా,ఉత్తరాదిలో కాంగ్రెస్ ఉనికిని కోల్పోయింది ( హిమాచల్ ప్రదేశ్ మినహా). తాజాగా జరిగిన మధ్యప్రదేశ్,రాజస్థాన్,ఛత్తీస్గడ్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం కావడమే కాక,రాజస్థాన్, ఛత్తీస్గడ్ లో వున్న అధికారాన్ని కూడా కోల్పోయింది. మల్లికార్జున ఖర్గే పార్టీ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మిశ్రమ ఫలితాలు నమోదయ్యాయి.కొన్ని రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది, కొన్ని రాష్ట్రాల్లో సంపాయించింది. బిజెపికి వ్యతిరేకంగా కూటమి కట్టడం వరకూ కొంత విజయం సాధించింది.ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరన్న విషయం ఇంకా గందరగోళంగానే వుంది. ముందు గెలుపు - ఆ తర్వాతే ప్రధాని అభ్యర్థి ఎంపిక అనడం కొంత బాగానే వుంది.కానీ, కాంగ్రెస్ లో అగ్రనాయకుడుగా వున్న రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదార్ధం ( మెటీరియల్ ) కాదా! అనే సందేహానికి అవకాశం ఇచ్చినట్లయింది. జనవరి 14నుంచి రాహుల్ గాంధీ మళ్ళీ యాత్ర మొదలు పెడుతున్నారు.జోడో యాత్ర బదులు 'న్యాయ యాత్ర' అని మార్చారు. కేవలం పాదయాత్ర కాకుండా, రకరకాల రూపాలలో ఈ యాత్ర ఉంటుందని ప్రకటించారు. 1885 లో కాంగ్రెస్ ఏర్పడింది. ఆ తర్వాత అది రకరకాల రూపాలు తీసుకున్నా,జాతీయ కాంగ్రెస్ పార్టీగానే కొనసాగుతోంది. 138 సంవత్సరాలు పూర్తి చేసుకొని, 139 లో అడుగుపెట్టింది.1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికలలో 1984 లో అత్యధికంగా 414 లోక్ సభ స్థానాలను గెలుచుకుంది. ఇప్పుడు అత్యల్పంగా 48 స్థానాలతో బండిని వెళ్ళతీస్తోంది. ఈ 40 ఏళ్లలో కాంగ్రెస్ చెందిన పతనానికి ఇది పెద్ద ఉదాహరణ. 1984లో అంత మెజారిటీ రావడానికి ఇందిరాగాంధీ హత్య నుంచి ఉత్పన్నమైన భావోద్వేగాలు ప్రధాన కారణం. మిగిలిన పార్టీల సహకారంతో పివి నరసింహారావు, మన్ మోహన్ సింగ్ కాలంలో కేంద్రంలో అధికారంలో వుంది. ముఖ్యంగా,మన్ మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా 10ఏళ్ళ పాలనలో నిలబడింది.1991 నుంచి 1996 వరకూ సాగిన పీవీ నరసింహారావు ఐదేళ్ల పాలన చారిత్రత్మకం. దేశాన్ని ఆర్ధికంగా మలుపుతిప్పిన పాలన అది.మన్ మోహన్ సింగ్ పదేళ్లు పాలనలో ఉన్నప్పటికీ, చెప్పుకో తగిన ప్రగతి లేకపోగా, అవినీతి రాజ్యమేలింది. ముఖ్యంగా రెండో తఫా ఇదేళ్ల పాలన అత్యంత బలహీనం,అవినీతిమయం. విసిగిపోయిన ప్రజలు కాంగ్రెస్‌ను గద్దె దింపి, బిజెపికి అధికారాన్ని కట్టబెట్టారు.ప్రధానిగా నరేంద్రమోదీ తిరుగులేని నాయకుడుగా అవతరించాడు.ఈ పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతినడమే కాక, పార్టీ నుంచి బలమైన నాయకత్వాన్ని కూడా అందించలేకపోయింది. పార్టీ అగ్రనేతల మధ్య అంతర్గత కలహాలు కూడా పెరిగాయి. పార్టీని బాహాటంగానే విమర్శించే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ ప్రజలను సమ్మోహనపరచడంలో, పార్టీని బలోపేతం చేయడంలో విఫలమయ్యారు. పార్టీ ఓడిపోయిన ప్రతిసారీ రాహుల్ గాంధీ కాడి పడేయ్యడం చాలా చెడ్డపేరు మూటగట్టింది.ఇదిగో! జోడో యాత్ర తర్వాత రాహుల్ గ్రాఫ్ కొంత పెరిగింది.ఇంకా పెరగాల్సిన అవసరం వుంది. ఇప్పటి వరకూ వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పొత్తులు పెట్టుకోవడంలో కాంగ్రెస్ ఘోరమైన తప్పటడుగులు వేసింది.పశ్చిమ బెంగాల్ మొదలుకొని,తాజాగా మధ్యప్రదేశ్ వరకూ అనేక ఉదాహరణలు చెప్పవచ్చు. రేపు జరుగబోయే సాధారణ ఎన్నికల్లో కూడా ఇవే తప్పులు చేస్తే,కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ సోదిలో లేకుండా పోయింది.జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ బలంగా అవతరించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా గిడుగు రుద్రరాజు వున్నారు.అతను ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకొని వున్నారు. మొన్నటి దాకా ఒరిస్సా ఐన్ ఛార్జిగా కూడా పనిచేశారు. పగ్గాలు మార్చి వైఎస్ షర్మిలకు ఇస్తారనే ప్రచారం మాత్రం జరుగుతోంది.పగ్గాలు మారినంత మాత్రాన పార్టీ పెద్దగా బలపడే అవకాశాలు ఇప్పుడప్పుడే లేవు.ముందుగా ఇండియా కూటమి ఐక్యతలో బలం పెరగాలి. క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతం కావాలి.రాహుల్ గాంధీ, ప్రియాంక నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరగాలి. ఇవ్వన్నీ జరిగితేనే కాంగ్రెస్ కు భవిష్యత్తు ఉంటుంది.లేకపోతే ఉనికికే ప్రమాదమవుతుంది. మొత్తంగా,2024 కాంగ్రెస్ కు పెద్ద పరీక్షా సమయం. - మాశర్మ, సీనియర్ జర్నలిస్టు -
'ఆరెంజ్ మార్మాలాడే' రెసిపీ చేసిన సోనియా, రాహుల్!
ఈ రోజుతో 2023 ముగిసిపోనుంది. కొత్త ఏడాదికి స్వాగతం పలకనున్న నేపథ్యంలో ఈ ఏడాది చివరి ఆదివారాన్ని ఆరెంజ్ మార్మలాడే(ప్రిజర్వ్డ్ ఫ్రూట్ జామ్) అనే రెసీపీ ప్రీపరేషన్తో గడిపారు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత సోనియా గాంధీ ఆమె కుమారుడు రాహుల్. ఈ వంటకం రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ వాద్రాకు ఇష్టమైనదట. అందుకు సంబంధించిన వీడియోని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర లోగోతో కూడిన తన యూట్యూబ్ ఛానెల్ పోస్ట్ చేశారు. ఆ వీడియోలో.. సోనియా, రాహుల్ ఇద్దరు కలిసి కిచెన్ గార్డెన్‌లోకి వెళ్లి పండ్లను తెచ్చి ఒక బుట్టలో వేసుకుని వస్తారు. ఈ రెసిపీ కోసం పూర్తిగా పండినవే కోయాలని సోనియా చెప్పగా, రాహుల్ నవ్వుతూ.. అవే ఎందుకు కోయాలంటూ చిలిపిగా ప్రశ్నించారు. ఆ తర్వాత ఇద్దరు వంటగదిలోకి వచ్చి వాటిని శుభ్రం చేసి నారింజ జ్యూస్ తీశారు. ఆ జ్యూస్‌ని, చక్కెరని అల్యూమినియం పోసి స్టవ్‌పై ఉంచి ఉడికించారు. రాహుల్ ఆ మిశ్రమాన్ని కలుపుతూ అమ్మా బీజేపీ వాళ్లు ఈ జామ్ కావాలంటే..వాళ్లకు కూడా ఇద్దామా! అని సరదాగా అన్నారు రాహుల్. అందుకు ప్రతిగా సోనియా మనపైకే తిరిగి విసిరేస్తారు అని నవ్వుతూ సెటైర్ వేశారు. మంచిది అప్పుడు ఆ జామ్ మొత్తం మనకే సొంతం అని రాహుల్ అనడంతో ఇరువురి ముఖాల్లో పెద్దగా నవ్వులు విరిశాయి. ఈ సందర్భంగా సోనియా గాంధీ దశాబ్దాల క్రితం భారతీయ వంటకాలకు తాను అలవాటు పడటానికి ఎల ఆ కష్టపడ్డానో వివరించారు. ముఖ్యంగా భారతీయ రుచుల్లో మిరపకాయలకు అడ్జెట్ అవ్వడానికి చాలా టైం పట్టిందని సోనియా చెప్పుకొచ్చారు. ఇక ఈలోగా మార్మాలాడే రెసీపీ తయారవ్వడంతో ఆ మిశ్రమాన్ని గాజు సీసాల్లో తల్లి కొడుకులు ఇరువురు సర్ధి వాటి మూతలతో క్లోజ్ చేసి పైన ఒక లవ్ సింబల్ ఆకారంలోని కార్డుని ఉంచారు. ఆ కార్డుపై ప్రేమతో మీ సోనియా, రాహుల్ అని రాశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. (చదవండి: రోబొటిక్ పెట్ని ఆవిష్కరించిన 12 ఏళ్ల చిన్నారి! పెంపు జంతువులకు ప్రత్యామ్నాయంగా..) -
ఆ పదుగురు... 2023లో రాజకీయాలన్నీ వీరి చుట్టూనే!
కొత్త సంవత్సరం 2024 కొద్దిరోజుల్లో ప్రవేశించబోతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల సంవత్సరం. ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు ఎవరి చేతికి నాయకత్వాన్ని అప్పగిస్తారో వేచి చూడాలి. అయితే 2023లో దేశంలోని ఏ నేతలు ముఖ్యాంశాలలో కనిపించారో.. వారిలో ఆ ‘పదుగురు’ నేతలెవరో ఇప్పుడు తెలుసుకుందాం. నరేంద్ర మోదీ ప్రధాని నరేంద్ర మోదీ విశేష ప్రజాదరణతో ముందుకు సాగుతున్నారు. ఈ ఏడాది జీ-20 సదస్సు న్యూఢిల్లీలో నిర్వహించారు. దీనిలో మోదీకి ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఈ ఏడాది చివర్లో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగురవేసింది. దీనికి ప్రధాని మోదీ ప్రజాకర్షక నాయకత్వమే కారణమని బీజేపీ చెబుతోంది. మార్నింగ్ కన్సల్ట్ అప్రూవల్ రేటింగ్‌లో నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన భారత పర్యటనను జనవరి 2023లో ముగించారు. సెప్టెంబరు 2022లో ప్రారంభమైన రాహుల్ పాదయాత్ర శ్రీనగర్‌లో ముగిసింది. ఈ పర్యటన అనుభవాన్ని రాహుల్ పార్లమెంట్ సమావేశాల్లో అందరితో పంచుకున్నారు. మరోవైపు రాహుల్ ఈ ఏడాది పార్లమెంటు సభ్యత్వాన్ని. కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఆ తరువాత కోర్టు నుండి ఉపశమనం పొందారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ ఓటమిపాలు కాగా, తెలంగాణలో విజయం సాధించింది. నితీష్ కుమార్ 2005 నుంచి బీహార్‌లో అధికారంలో ఉన్న నితీష్ కుమార్ ఈ ఏడాది కూడా హెడ్‌లైన్స్‌లో నిలిచారు. ఒక్కోసారి ఎన్డీఏ, మరికొన్నిసార్లు మహాకూటమి.. ఎప్పటికప్పుడు మిత్రపక్షంగా మారుతుండటంతో ఆయన రాజకీయ ఇమేజ్ దెబ్బతింటోంది. నితీష్ కుమార్.. బీహార్‌లో కుల గణన నిర్వహించి చర్చల్లో నిలిచారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు కులగణన దిశగా ఆలోచించేలా చేశారు. యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ ఏడాది వార్తల్లో నిలిచారు. 2023 ఫిబ్రవరిలో ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఉమేష్ పాల్ హత్య అసెంబ్లీలో చర్చకు వచ్చింది. ఉమేష్ పాల్ హత్య కేసులో మాఫియా అతిక్ అహ్మద్ పేరు బయటకు వచ్చింది. ఈ మాఫియాను అంతమొందించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో హామీనిచ్చారు. ఈ క్రమంలో యోగి ప్రభుత్వం అతిక్, అతని అనుచరులపై ఉచ్చు బిగించింది. ఉమేష్ పాల్ హత్యకేసులో ప్రమేయం ఉన్న అతిక్ కుమారుడు పోలీసుల ఎన్ కౌంటర్లో హతమయ్యాడు. ఆ తర్వాత అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ కూడా వైద్య పరీక్షల కోసం పోలీసు కస్టడీలో ఉండగా కాల్పులకు బలయ్యారు. అజిత్ పవార్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు అజిత్ పవార్ తన రాజకీయ గురువు, మామ అయిన శరద్ పవార్‌పై తిరుగుబాటు చేసి, ఎన్డీఏలో చేరి మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం అయ్యారు. అంతే కాదు ఎన్సీపీ పార్టీపై కేసు వేశారు. 2019లో కూడా అజిత్ పవార్ తిరుగుబాటు చేసి, బీజేపీతో చేతులు కలిపారు. ఆ సమయంలో దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటికీ తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు లభించలేదు. మహువా మోయిత్రా ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి బహుమతులు స్వీకరించి, పార్లమెంటు వెబ్సైట్ యూజర్ ఐడి,పాస్‌వర్డ్‌ను అతనితో పంచుకున్నందుకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా డిసెంబర్ 8న లోక్‌సభ నుండి బహిష్కరణకు గురయ్యారు. లోక్‌సభ ఎథిక్స్ కమిటీ నివేదిక సిఫార్సు మేరకు ఆమె పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేశారు. దీనిపై పార్లమెంట్లో దుమారం చెలరేగింది. ఆమె ఈ విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్‌లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన ప్రభుత్వం ప్రారంభించిన లాడ్లీ లక్ష్మి పథకం ఎంతో ప్రజాదరణ పొందింది. రాష్ట్ర నాయకత్వాన్ని కొత్త వ్యక్తికి అప్పగించాలని పార్టీ నిర్ణయించడంతో శివరాజ్ తన సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. పార్టీ తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నెరవేరుస్తానని ఆయన స్పష్టం చేశారు. మోహన్ యాదవ్ మోహన్ యాదవ్ గతంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ బంపర్ విజయం సాధించడంతో మోహన్ యాదవ్ శాసనసభా పక్ష సమావేశంలో నాయకునిగా ఎన్నికయ్యారు. శివరాజ్ స్థానంలో ఆయన ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. భజన్‌లాల్ శర్మ రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన శాసనసభా పక్ష సమావేశం తర్వాత భజన్‌లాల్ శర్మ పేరు అంతటా మారుమోగింది. ఆ సమావేశంలో ఆయనను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఆయన తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పలువురు సీనియర్ నేతల సమక్షంలో పార్టీ ఆయనను సీఎంగా ఎన్నుకుంది. డిసెంబర్ 15న ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. విష్ణుదేవ్ సాయి ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ.. విష్ణుదేవ్ సాయిని సీఎం చేసింది. శాసనసభా పక్ష సమావేశంలో ఆయనను నాయకునిగా ఎన్నుకున్నారు. విష్ణుదేవ్ సాయి గిరిజన నేతగా గుర్తింపు పొందారు. ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనులు అధికంగా ఉన్నారు. అందుకే విష్ణుదేవ్ సాయిని బీజేపీ.. సీఎంగా ఎన్నిక చేసింది. ఇది కూడా చదవండి: టాప్-5 డైట్ ప్లాన్స్... 2023లో ఇలా బరువు తగ్గారట! -
రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారు: మంత్రి ఉత్తమ్
సాక్షి, న్యూఢిల్లీ: గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మభ్య పెట్టి, వాస్తవాలను దాచి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిందని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కు మార్రెడ్డి విమర్శించారు. కొత్తగా రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.67 వేల కోట్లుగా ఉన్న అప్పులను తొమ్మిదిన్నరేళ్లలో ఏకంగా రూ.4.50 లక్షల కోట్లకు పెంచేశారని ధ్వజమెత్తారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యుత్ కొను గోళ్లకు సంబంధించి రూ.81 వేల కోట్లు, పౌర సర ఫరాల శాఖకు సంబంధించి రూ.56 వేల కోట్లు అప్పులున్నాయని తేలిందని, ఇరిగేషన్‌కు సంబంధించి రూ.10 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని ఉత్తమ్ తెలిపారు. ఇరిగేషన్, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, మేడిగడ్డ కుంగిన ఘటనలపై విచారణ జరుగుతుందని, విచారణను జాతీయ సంస్థలతో చేయించాలా లేక రాష్ట్ర సంస్థలతోనా? అన్నది ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయిస్తామని మంత్రి చెప్పారు. మేడిగడ్డ డిజైన్, నిర్వహణ లోపాలకు ఎవరు బాధ్యులన్నది తేలుస్తామన్నారు. సోనియా, రాహుల్‌తో భేటీ హుజూర్నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన నేపథ్యంలో ఉత్తమ్ బుధవారం తన ఎంపీ పదవికి రాజీ నామా చేశారు. స్పీకర్ ఓంబిర్లాను కలిసి రాజీ నామా పత్రం అందజేశారు. అనంతరం తన సతీమణి, ఎమ్మెల్యే పద్మావతితో కలిసి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతో భేటీ అయ్యారు. తనకు మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. -
కాంగ్రెస్ ఉండగా మనీ హేస్ట్ ఎందుకు?
న్యూఢిల్లీ: జార్ఖండ్‌లో కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహూకు చెందిన ప్రదేశాల్లో ఐటీ సోదాల్లో వందల కోట్ల నగదు బయటపడిందన్న కథనాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం కాంగ్రెస్ పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇందుకు తన సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్’ను వేదికగా చేసుకున్నారు. బ్యాంకుల దోపిడీ కథతో ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన వెబ్ సిరీస్ ‘మనీ హేస్ట్’ను ఇటీవల బయటపడిన రూ.351 కోట్ల ఉదంతంతో పోలుస్తూ కాంగ్రెస్‌ను విమర్శించారు. ‘‘ దేశంలో కాంగ్రెస్ ఉండగా మళ్లీ మనీ హేస్ట్ అవసరమా ?. 70 ఏళ్లుగా కాంగ్రెస్ దోపిడీ(హేస్ట్) జరుగుతోంది. ఇంకా కొనసాగుతోంది కూడా’’ అని మోదీ ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు. ‘‘ కాంగ్రెస్ ప్రాయోజిత మనీ హేస్ట్ ’’ అంటూ మనీ హేస్ట్ వెబ్‌సిరీస్ టైటిల్ సాంగ్‌తో ఉన్న ఒక వీడియోను బీజేపీ తాజాగా ఎక్స్‌లో పోస్ట్చేసింది. కాంగ్రెస్ ఎంపీ ధీరీజ్ సాహూ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు కలసి దిగిన ఒక ఫొటోకు మనీ హేస్ట్ పాటను జతకలుపుతూ బీజేపీ విడుదలచేసిన ఆ వీడియోను మోదీ షేర్చేశారు. మోదీతోపాటు బీజేపీ నేతలూ కాంగ్రెస్‌పై విమర్శల ధాటి పెంచారు. ఈ మేరకు బీజేపీ నేతలు కిరెణ్ రిజిజు, సంగీత సింగ్‌దేవ్, రామేశ్వర్ తేలి, నిశిత్ ప్రామాణిక్ మీడియాతో మాట్లాడారు. ‘అవినీతిపై ఉక్కుపాదం మోపుతూ మోదీ సర్కార్ చేస్తున్నయుద్ధం ధాటికి తట్టుకోలేకే విపక్షాలు ‘ఇండియా’ కూటమిగా ఒక్కతాటి మీదకొచ్చి నిల్చున్నాయి’’ అని కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు వ్యాఖ్యానించారు. ‘‘ రూ.351 కోట్లు బట్టబయలైన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహూ ప్రదేశం ఒక్కటే కాదు. ఇలాంటివి చాలా ఉన్నాయి. కాంగ్రెస్ నేతలపైనే కాదు బిహార్, పశ్చిమబెంగాల్, రాజస్తాన్, ఢిల్లీల్లోనూ విపక్ష పార్టీల నేతలపై చాలా అవినీతి కేసులున్నాయి. కాంగ్రెస్ నడుపుతున్న ఈ అవినీతి దుకాణాలన్నీ మూసేస్తాం. వీరిపై మోదీ సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటుంది’’ అని అన్నారు. మీ మనీ హేస్ట్ సంగతేంటి: కాంగ్రెస్ కాంగ్రెస్ దోపిడీ అంటూ మోదీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ వెంటనే స్పందించింది. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని ఉద్దేశిస్తూ.. ‘ ఆఫ్‌షోర్ ఫండ్ల ద్వారా భారీ లబ్ది పొందిన తైవాన్ వ్యాపారి చాంగ్ చుంగ్ లింగ్‌తో గౌతమ్ అదానీకి ఉన్న సంబంధాలేంటి? ఆస్తిపాస్తులులేని గౌతమ్ అదానీ ఒక్కసారిగా ప్రపంచ కుబేరుడెలా అయ్యాడు? అదానీ గ్రూప్ అసాధారణ సంపద వృద్దికి సాయపడిందెవరు?. మోదీజీ.. 1947 నుంచి దేశం ఎన్నడూ చూడని అతిపెద్ద మనీ హేస్ట్ గురించి మీరు వివరణ ఇవ్వాలని యావద్దేశం ఎదురుచూస్తోంది’’ అంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. పటిష్ట ఏఐ నిబంధనలు ప్రపంచవ్యాప్తంగా విస్తృతస్థాయిలో వినియోగంలోకి వచ్చిన కృత్రిమ మేధ(ఏఐ)పై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ఏఐ ఉగ్రవాదుల చేతిలో పడకుండా అంతర్జాతీయంగా పటిష్ట నిబంధనలు అవసరమని నొక్కిచెప్పారు. ఢిల్లీలో ‘గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(జీపీఏఐ) ’ సదస్సులో ప్రధాని ప్రసంగించారు. ‘‘డీప్‌ఫేక్, సైబర్ సెక్యూరిటీ, డేటా చోరీలు పెచ్చరిల్లుతున్నందున ఏఐ పరిజ్ఞానం ఉగ్రవాదుల చేతికి చిక్కితే అత్యంత ప్రమాదకం. ఏఐతో పనిచేసే ఆయుధాలు ఉగ్రసంస్థల చేతికొస్తే ప్రపంచ భద్రతకే ప్రమాదం. దీన్ని అడ్డుకోవాలంటే ఏఐ సాంకేతికత నైతిక వినియోగంపై అంతర్జాతీయ ఉమ్మడి ప్రణాళిక అవసరం. దేశాలన్నీ సమష్టిగా పటిష్ట నిబంధనావళిని రూపొందించుకోవాలి’’ అని పిలుపునిచ్చారు. ‘‘దేశాల మధ్య అంతర్జాతీయ ఒప్పందాలున్నట్లే ఈ నూతన సాంకేతికత నైతిక వినియోగం విషయంలోనూ ప్రపంచస్థాయి మార్గదర్శకాలు, నిబంధనలు ఉండాలి. నిబంధనల చట్రాన్ని వీలైనంత త్వరగా అమల్లోకి తేవాలి. ఏఐ పరిజ్ఞానాన్ని సంతరించుకున్న పరికరాలు, ఆయుధాల పరిశోధన, అభివృద్ధి, పరీక్ష, తయారీలపై ప్రోటోకాల్‌ను అమల్లోకి తేవాలి. ఈ అంశంలో భారత్ తనవంతు బాధ్యత నెరవేర్చేందుకు సదా సిద్ధంగా ఉంది’’ అని మోదీ ప్రకటించారు. -
చరిత్ర తెలియక ఊరకే తిరగరాస్తున్నారు
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ)బిల్లు, జమ్మూకశ్మీర్ రిజర్వేషన్(సవరణ)బిల్లులపై చర్చ సందర్భంగా మాజీ ప్రధాని నెహ్రూపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపణలు గుప్పించడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ జమ్మూకశ్మీర్‌లోకి పూర్తిగా భారత బలగాలు వెళ్లేలోపే కాల్పుల విరమణకు నెహ్రూ ఆదేశాలిచ్చారు. అనవసరంగా కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లారు. నెహ్రూ చారిత్రక తప్పిదాల కారణంగానే కశ్మీర్ సమస్య అపరిష్కృతంగా తయారై అక్కడి ప్రజలు కష్టాలపాలయ్యారు’’ అని సోమవారం రాజ్యసభలో ఆరోపణలుచేయడం తెల్సిందే. దీనిపై మంగళవారం రాహుల్ పార్లమెంట్ ప్రాంగణంలో ఘాటుగా స్పందించారు. ‘‘ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఈ దేశం కోసం తన జీవితం మొత్తాన్నీ ధారపోశారు. స్వాత్రంత్య్ర పోరాటంలో చాలా సంవత్సరాలు జైలు జీవితం గడిపారు. ఇంకా ఇలాంటి చరిత్ర అంతా అమిత్ షాకు తెలీదనుకుంటా. అందుకే పదేపదే చరిత్రను తిరగరాస్తున్నారు. ఇదంతా అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే. కుల గణన వంటి సమస్యల సంగతేంటి? అసలు ప్రజాధనం ఎవరి చేతుల్లోకి వెళ్తోంది?. ఈ అంశాలను బీజేపీ అస్సలు చర్చకు స్వీకరించదు. భయంతో పారిపోతోంది. బీసీలను పట్టించుకోవట్లేదు’ అని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఓబీసీల ప్రాధాన్యం పెరగాలి గిరిజన వ్యక్తిని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా, ఓబీసీ నేతను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రకటించిందికదా ? అన్న మీడియా ప్రశ్నకు రాహుల్ బదులిచ్చారు. ‘‘మేం కూడా ఛత్తీస్‌గఢ్‌లో ఓబీసీ నేతను ముఖ్యమంత్రిని చేశాం. వాళ్లు కూడా మధ్యప్రదేశ్‌లో ఓబీసీ నేతను సీఎంగానే చేశారు. బీసీలకు ఒకే ఒక్క కీలక పదవి ఇస్తే సరిపోదు. ఇక్కడ పదవి ముఖ్యం కాదు. మరింత మంది ఓబీసీలకు ప్రాధాన్యత దక్కాలి. వారి ప్రాతినిధ్యం మరింత పెరగాలి. మోదీ సర్కార్ ప్రధానాంశాలను పక్కనబెట్టి ప్రజల దృష్టికి మరల్చుతోంది’’ అని రాహుల్ ఆరోపించారు. -
ప్రమాణ స్వీకారానికి సోనియా, రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక, ఇతర కీలక నేతలు తరలిరానున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు ప్రియాంక, 10:30 గంటలకు సోనియా, రాహుల్‌లు హైదరాబాద్‌కు చేరుకుంటారని గాం«దీభవన్ వర్గాలు తెలిపాయి. వారు విమానాశ్రయం నుంచి నేరుగా తాజ్‌కృష్ణా హోటల్‌కు వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకున్నాక ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారని వెల్లడించాయి. స్వయంగా ఆహ్వానించిన రేవంత్ సీఎల్పీ నేతగా ఎన్నికైన తర్వాత మంగళవారం రాత్రి ఢిల్లీ వెళ్లిన రేవంత్ బుధవారం అంతా బిజిబిజీగా గడిపారు. పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఖర్గేలతో.. సోనియా, రాహుల్, ప్రియాంకాగాందీ, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, హరియాణా ఎంపీ దీపేందర్‌సింగ్ తదితరులతో విడివిడిగా భేటీ అయ్యారు. గురువారం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని వారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. అంతకుముందు ఉదయమే ఏపీలోని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు యమునా బ్లాక్‌లోని రేవంత్ నివాసానికి వచ్చి కలిశారు. వారు ఇరవై నిమిషాల పాటు ఏకాంతంగా చర్చించుకున్నారు. చర్చల విషయాన్ని బయటికి వెల్లడించలేదు. పార్లమెంట్లో అభినందనల వెల్లువ కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీల తర్వాత రేవంత్ పార్లమెంట్‌కు వెళ్లారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. అక్కడి నుంచి లోక్‌సభలోకి వెళ్లిన రేవంత్‌కు వివిధ పార్టీల ఎంపీలు శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్, బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ చాంబర్‌కు వెళ్లగా.. టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, రామ్మోహన్నాయుడు, ఎంపీ రఘురామకృష్ణ రాజు, వైఎస్ఆర్సీపీ ఎంపీలు నిరంజన్‌రెడ్డి, శ్రీధర్, ఇతర పార్టీల ఎంపీలు రేవంత్‌ను అభినందించారు. స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా ఆ ఎంపీలందరినీ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని రేవంత్ ఆహ్వానించారు. పార్లమెంటుకు వెళ్లిన సమయంలో రేవంత్ తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తారని భావించినా చేయలేదు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక.. ఢిల్లీకి వచ్చి ఎంపీ పదవికి రాజీనామా చేస్తారని తెలిసింది. ప్రజా ప్రభుత్వం వస్తోందంటూ ఖర్గే, రాహుల్ ట్వీట్లు బుధవారం ఢిల్లీలో రేవంత్‌రెడ్డి తమను కలిసిన ఫొటోలను ఖర్గే, రాహుల్ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం వస్తోందని పేర్కొన్నారు. ప్రజా తెలంగాణ కోసం కాంగ్రెస్ నాయకులంతా సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తాము హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామని ఖర్గే పేర్కొనగా.. రేవంత్ నాయకత్వంలో వాగ్దానాలన్నీ నెరవేర్చుతామని రాహుల్ తెలిపారు. రేవంత్‌కు ఘన స్వాగతం అధిష్టానం పెద్దలను కలసిన అనంతరం రేవంత్ బుధవారం రాత్రి 10:20 గంటల సమయంలో ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు సీఎస్, డీజీపీ, ఇతర అధికారులు, కాంగ్రెస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి రేవంత్ నేరుగా హోటల్ ఎల్లాకు చేరుకున్నారు. మీ ఆశీస్సులతోనే ప్రజా ప్రభుత్వం నా ప్రమాణ స్వీకారానికి అందరూ రండి: రేవంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: సీఎంగా తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని సీఎల్పి నేత ఎనుముల రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. ‘‘తెలంగాణ ప్రజలకు అభినందనలు. విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, సోనియాగాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మనందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్య, పారదర్శక పాలన అందించేందుకు.. బలహీన వర్గాలు, దళిత, గిరిజన, మైనార్టీ, రైతు, మహిళ, యువత సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు.. మీ అందరి ఆశీస్సులతో 2023 డిసెంబర్ 7న మధ్యాహ్నం 1:04 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రజా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతోంది. ఈ మహోత్సవానికి రావాల్సిందిగా మీ అందరికీ ఇదే ఆహ్వా నం..’’అంటూ బుధవారం బహిరంగ ఆహ్వాన లేఖను విడుదల చేశారు. కేసీఆర్, చంద్రబాబులకు పిలుపు! రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా పలువురు జాతీయ నాయకులు, సీఎంలు, మాజీ సీఎంలకు టీపీసీసీ నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. మాజీ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబులను రేవంత్ ఆహ్వానించారని గాందీభవన్ వర్గాల సమాచారం. వీరితోపాటు ‘ఇండియా’కూటమిలోని 8 మంది సీఎంలు, కాంగ్రెస్‌కు చెందిన 51 మంది ఎంపీలకూ ఆహ్వానం పంపినట్టు తెలిసింది. రాష్ట్ర కాంగ్రెస్‌లోని పలువురు సన్నిహిత నేతలు, సీనియర్ నాయకులకు రేవంత్ స్వయంగా ఫోన్లు చేసి రావాలని కోరారని.. తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, ప్రజాసంఘాల నాయకులనూ ఆహ్వానించామని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి. -
సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేను ఆహ్వానించిన రేవంత్
-
రేపు రేవంత్ తో పాటు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం
-
రాహుల్, ప్రియాంక పర్యటించిన చోట్ల
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేతల ఎన్నికల ప్రచారం ఆ పార్టీ అభ్యర్థులకు మిశ్రమ ఫలితాన్నిచ్చింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన స్థానాల్లో కొన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలవగా, మరికొన్ని చోట్ల పరాజయం పాలయ్యారు. ఈ ఏడాది అక్టోబర్18న తన సోదరి ప్రియాంకతో కలిసి వరంగల్ జిల్లాకు వచ్చిన రాహుల్ ప్రచారం నిర్వహించిన ములుగు, వరంగల్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. రాహుల్ వెళ్లిన భూపాలపల్లి, వరంగల్ ఈస్ట్, కొల్లాపూర్, కల్వకుర్తి, జడ్చర్ల, షాద్‌నగర్, బోధన్, వేములవాడ స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక, ఆయనతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెళ్లినప్పటికీ సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఓటమి పాలు కావడం గమనార్హం. ప్రియాంక వెళ్లిన కొడంగల్, ఖానాపూర్, పాలేరు, ఖమ్మం, మధిర స్థానాల్లో గెలవగా, జహీరాబాద్, మల్కాజ్గిరి స్థానాల్లో పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. రాహుల్ వెళ్లిన కామారెడ్డి, ఆదిలాబాద్‌లోనూ పార్టీ అభ్యర్థి ఓడిపోగా, ఆంధోల్‌లో విజయం సాధించారు. జీహెచ్ఎంసీ పరిధిలో రాహుల్ ప్రచారం చేసిన జూబ్లీహిల్స్, నాంపల్లి, మల్కాజ్గిరి స్థానాల్లో అభ్యర్థులు ఓడిపోయారు. ఖర్గే హాజరైన నల్లగొండలో కోమటిరెడ్డి భారీ మెజార్టీతో గెలవగా, ఆలంపూర్లో సంపత్‌కుమార్ పెద్ద తేడాతో ఓటమి పాలయ్యారు. గతంలో సోనియాగాంధీ సభ నిర్వహించిన తుక్కుగూడలో పార్టీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి (ఇబ్రహీంపట్నం) భారీ మెజార్టీతో విజయం సాధించడం గమనార్హం -
‘ప్రజల తెలంగాణ’ కల నిజం చేస్తాం
సాక్షి, కామారెడ్డి/సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘ప్రజల తెలంగాణ కల సాకారం కాబోతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ భారీ మెజారిటీతో అధికారంలోకి రాబోతోంది. తొలి మంత్రిమండలి సమావేశంలోనే ఆరు గ్యారంటీలను చట్టబద్ధం చేసి అమలు చేస్తాం’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ ఎన్నికలు దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో సంపదను అంతా ఒకే కుటుంబం అనుభవిస్తోందని, రీడిజైన్ పేరుతో ఒక్క ప్రాజెక్టుతోనే రూ.లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఈ మధ్య తాను మేడిగడ్డకు వెళ్లి చూడగా పునాదులు పగిలిపోయి, డ్యాం లోపలికి కుంగిపోయి కనిపించిందన్నారు. కాళేశ్వరం కట్టింది నీళ్ల కోసం కాదని, దోచుకోవడం కోసమేనన్నారు. ధరణి పోర్టల్ ద్వారా లక్షలాది మంది రైతుల భూములను తమవారికి ధారాదత్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం కామారెడ్డి, సంగారెడ్డి, ఆందోల్‌లో నిర్వహించిన సభల్లో రాహుల్ ప్రసంగించారు. ఆదాయం వచ్చే ల్యాండ్, లిక్కర్, ఇరిగేషన్, ఇసుక లాంటి శాఖలన్నీ తమ చేతుల్లో పెట్టుకుని, ఇష్టారీతిన దోచుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 8 లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, దీనికి ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. ప్రధాని మోదీకి లోక్‌సభలో అవసరం ఉన్నప్పుడల్లా అండగా నిలవడం వల్లే కేసీఆర్‌పై సీబీఐ, ఈడీ లాంటి కేసులు నమోదు కాలేదని చెప్పారు. ఒకవేళ కేసీఆర్ మద్దతు ఇవ్వకపోయి ఉంటే సీఎం కురీ్చకీ ఎసరొచ్చేదని రాహుల్ దుయ్యబట్టారు. తొలి సమావేశంలోనే... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ప్రతినెలా బ్యాంకు ఖాతాలో రూ. 2,500 జమ చేస్తామని, బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా నెలకు రూ.5 వేల మేరకు ప్రయోజనం కల్పిస్తామని, గ్యాస్ సిలిండర్‌ను రూ.ఐదు వందలకు ఇస్తామని, రైతులకు రైతుభరోసా ద్వారా ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని, అలాగే రైతు కూలీలకు ఏటా రూ.12వేలు అందిస్తామని తెలిపారు. రైతులకు 24 గంటలపాటు ఉచితంగా కరెంటు ఇస్తామని, ఇళ్లు లేనివారందరికీ రూ.5 లక్షలు ఇచ్చి సొంతింటి కల నిజం చేస్తామని చెప్పారు. తెలంగాణ కోసం ప్రాణాలొదిలిన అమరుల కుటుంబాలకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగాల కోసం ఎంతో మంది రూ.లక్షలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకుంటున్నారని, తాను వాళ్ల దగ్గరకు వెళ్లి మాట్లాడానని రాహుల్ చెప్పారు. విద్యాభరోసా కార్డులను ఇచ్చి, వారి ఉన్నత చదువులు, కోచింగ్ కోసం రూ.5 లక్షలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగాల కోసం పరీక్షలు రాసిన విద్యార్థులు ఇంటికి చేరేలోపు పరీక్ష పత్రాలు లీకైనట్టు తెలిసి గుండెలు బాదుకోవలసిన పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. అవినీతి సొమ్ము ప్రజల ఖాతాల్లోకి.. తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్, ఆయన కుటుంబం దోచుకున్న అవినీతి సొమ్మునంతా కక్కిస్తామని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. కక్కించిన ఈ సొమ్మును నిరుపేదల ఖాతాల్లో వేస్తామని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలన్నీ ఒక్కటేనన్నారు. బీజేపీతో కాంగ్రెస్ పోరాడిన ప్రతి ఎన్నికల్లో ఎంఐఎం తమ అభ్యర్థులను బరిలోకి దించి బీజేపీకి సహకరిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌కు నష్టం చేసేలా అస్సాం, గోవా, రాజస్తాన్ ఎన్నికలో ఎంఐఎం వ్యవహరించిందని గుర్తుచేశారు. బీజేపీతో పోరాడుతున్నందుకు తనపై 24 కేసులు నమోదు చేశారని, తన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేసి, తన నివాసాన్ని కూడా లాక్కున్నారని ధ్వజమెత్తారు. దేశంలో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్న మోదీ సర్కానూ వదిలిపెట్టేది లేదన్నారు. విద్వేషాల బజార్లో ప్రేమ అనే దుకాణం తెరిచిన కాంగ్రెస్‌కు మద్దతు పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, నిజామాబాద్ అర్బన్, బాన్సువాడ, ఎల్లారెడ్డి అభ్యర్థులు షబ్బీర్‌అలీ, ఏనుగు రవీందర్‌రెడ్డి, కె.మదన్మోహన్ పాల్గొన్నారు. కామారెడ్డి ప్రజల తీర్పు చరిత్రలో నిలిచిపోతుంది ‘ప్రజల రక్తానికి మరిగిన పులిని వేటాడేందుకు వేటగాన్ని రంగంలోకి దింపుతారు. అట్లనే తెలంగాణ సంపదను దోచుకుంటున్న కేసీఆర్‌ను రాజకీయంగా బొందపెట్టేందుకే నన్ను ఇక్కడికి పంపారు. కామారెడ్డి ప్రజలు ఇచ్చే తీర్పు చరిత్రలో నిలిచిపోతుంది. దేశం మొత్తం మీవైపే చూస్తోంది’ అని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగిన విజయభేరి సభలో ఆయన మాట్లాడారు. నలభై ఏళ్లుగా ఎన్నో పదవులు అనుభవించినప్పుడు గుర్తుకురాని అమ్మ, అమ్మమ్మ ఊరు కేసీఆర్‌కు ఇప్పుడు గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. గల్ఫ్ కార్మీకుల కష్టాలను కేసీఆర్ ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఇక్కడి భూముల మీద కన్నేసి కామారెడ్డికి వచ్చారని, కేసీఆర్‌ను ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని రేవంత్‌రెడ్డి ప్రజలను కోరారు. -
ప్రియాంక గాంధీపైనా చర్యలు తీసుకోండి..
Rajasthan Elections 2023: రాజస్థాన్‌లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రాపై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ శనివారం కేంద్ర ఎన్నికల కమిషన్‌కి లేఖ రాసింది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల రోజున ప్రియాంక గాంధీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్) లో చేసిన పోస్ట్‌తో ఎన్నికల మార్గదర్శకాలను ఉల్లంఘించారని పార్టీ ఆరోపించింది. దీనికి ముందు కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీపైన కూడా బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపిస్తూ చర్యలు తీసుకోవాలని కోరింది. కాగా ప్రియాంక గాంధీపై ఈసీకి చేసిన ఫిర్యాదులో ఆమె తన ‘ఎక్స్’ ఖాతాలో చేసిన పోస్టు రాజస్థాన్ పోలింగ్ రోజున ఓటర్లను ఉచితాలతో ప్రలోభపెట్టే ఉద్దేశపూర్వక చర్య అని బీజేపీ పేర్కొంది. ప్రియాంక గాంధీ పదవిని తొలగించి, ఆమె ఖాతాను సస్పెండ్ చేసేలా ఆదేశించాలని, క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందిగా రాజస్థాన్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్‌కు సూచించాలని విజ్ఞప్తి చేసింది. -
విజయానికి ఏడు హామీలు
రాజస్థాన్‌లో గత 30 ఏళ్లలో అధికార పార్టీ నెగ్గిన దాఖలా లేదు. ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రభుత్వం మారుతూ వస్తోంది. ఈసారి మాత్రం వరుసగా రెండో విజయంతో చరిత్రను తిరగరాసేందుకు సీఎం అశోక్ గహ్లోత్ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఈ విషయంలో ‘ఏడు హామీ’లపై బాగా ఆశలు పెట్టుకున్నారు. ఆ పథకాలు తనను కచ్చితంగా గట్టెక్కిస్తాయని నమ్ముతున్నారు...! రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పర్వం క్లైమాక్స్‌కు చేరుతోంది. అధికార కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. పోలింగ్‌కు మరో మూడు రోజులే ఉంది. గురువారం సాయంత్రంతో ప్రచారానికి కూడా తెర పడనుంది. ఈ నేపథ్యంలో ప్రచారాన్ని సీఎం గహ్లోత్ టాప్ గేర్‌లోకి తీసుకెళ్లారు. కాంగ్రెస్ తరఫున అంతా తానై వ్యవహరిస్తున్నారు. రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. ఈ రెండు రోజుల్లో వీలైనన్ని అసెంబ్లీ స్థానాలను కవర్ చేయనున్నారు. ముఖ్యంగా మహిళలకు రూ.10 వేల భృతి మొదలుకుని రూ.25 లక్షల వైద్య సాయం దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న, అందించబోయే పథకాలను ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి ప్రచార సభలోనూ అవి ప్రధానంగా ప్రస్తావనకు వచ్చేలా జాగ్రత్త పడుతున్నారు. జీవన్మరణ సమస్య! 72 ఏళ్ల గహ్లోత్‌కు ఒకరకంగా ఈ అసెంబ్లీ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. గత అసెంబ్లీ ఎన్నికల విజయంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ యువ నేత సచిన్ పైలట్‌ను ఈసారి ఆయన పూర్తిగా పక్కన పెట్టారు. కనుక ఫలితాలు ఏ మాత్రం వికటించినా గహ్లోత్ రాజకీయ జీవితానికి తెర పడవచ్చన్న అభిప్రాయముంది. అందుకే కొద్ది రోజులుగా ఆయన దూకుడు పెంచారు. రోజుకు కనీసం నాలుగైదు సభల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఒక్క రోజు ఏకంగా 800 కిలోమీటర్లు పర్యటిస్తున్నారు! తన ఓబీసీ సామాజిక వర్గ మూలాలను కూడా సమయానుకూలంగా ప్రస్తావిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ప్రచార సభలోనూ ప్రధాని మోదీపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఆయన ప్రసంగాల్లో కాంగ్రెస్ పథకాలనే యథాతథంగా కాపీ కొడుతున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు. తమ ఏడు హామీలకు పోటీగా బీజేపీ తెరపైకి తెచ్చిన ‘మోదీ హామీ’లను ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తూ, అవన్నీ కాంగ్రెస్ హామీలకు నకళ్లేనని పదేపదే చెబుతున్నారు. ‘‘ఇది బీజేపీకి బాగా మైనస్‌గా మారుతోంది. ఈసారి కచ్చితంగా గెలుపు కాంగ్రెస్‌దే. ఓటర్లు ఈ మేరకు నిర్ణయించుకున్నారు కూడా’’ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రోజూ క్రమం తప్పకుండా స్వీయ ప్రచార వీడియోలను కూడా విడుదల చేస్తూ, అవి వీలైనంత మందికి చేరేలా జ్రాగత్తలు తీసుకుంటున్నారు గహ్లోత్. అధిష్టానం అనుగ్రహం కోసం... రాష్ట్రస్థాయిలో గెలుపు కోసం శాయశక్తులా ప్రయత్నాలు చేస్తూనే, అధిష్టానంతో సంబంధాలను కూడా సరిదిద్దుకునే పనిలో పడ్డారు గహ్లోత్. గతేడాది కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగాల్సిందిగా సోనియా ఆదేశించినా ఆయన బేఖాతరు చేయడం తెలిసిందే. దీనిపై గాంధీ కుటుంబం గుర్రుగా ఉన్న నేపథ్యంలో, వీలు దొరికినప్పుడల్లా సోనియా, రాహుల్, ప్రియాంకలను ఆయన ఆకాశానికెత్తుతూ వస్తున్నారు. రాష్ట్ర ప్రచార పర్వమంతా రాహుల్, ప్రియాంక కనుసన్నల్లోనే జరుగుతోందని పదేపదే చెప్పుకొస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఏడు హామీలు... 1. కుటుంబ పెద్ద అయిన మహిళకు ఏటా రూ.10,000 భృతి 2. ప్రభుత్వ కాలేజీలో చేరే ప్రతి విద్యార్థికి ల్యాప్‌టాప్ లేదా ట్యాబ్ 3. చిరంజీవి ఆరోగ్య బీమా పథకం ద్వారా రూ.25 లక్షల దాకా వైద్య సాయం. ఇందులో భాగంగా రూ.15 లక్షల ప్రమాద బీమా 4. అందరికీ ఉచితంగా ఇంగ్లిష్ మీడియం విద్య 5. రాష్ట్రంలో కోటి కుటుంబాలకు రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ 6. పాత పెన్షన్ పథకానికి చట్టబద్ధత 7. రైతుల నుంచి రూ.2కు కిలో చొప్పున పేడ కొనుగోలు -
కేసీఆర్‌ను ఓడించేందుకు దండుగా నేతలు
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణకు ఉన్న ఒకే ఒక్క గొంతు కేసీఆర్. ఆయన గొంతు నులిమి ఓడించడా నికి చాలా మంది నాయకులు వస్తున్నరు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, సామంతు లు, మాజీ మంత్రులు దిగుతున్నరు. కాంగ్రెస్ నుంచి రాహుల్, ప్రియాంక, ఖర్గే, సిద్ధరామయ్య దండు కట్టి తెలంగాణకు క్యూ కడుతున్నరు. కేసీఆర్ బొండిగ పిసికేందుకు ఎంత మంది వస్తున్నా మేము భయపడం. మేము తెలంగాణ ప్రజలనే నమ్ముకు న్నం. సింహం సింగిల్‌గా వస్తుంది. తెలంగాణ గొంతు కేసీఆర్‌ను ఖతం చేసేందుకు ఢిల్లీ దొరలు ఒక్కటై దాడి చేస్తే కాపాడుకొనే బాధ్యత తెలంగాణ ప్రజలపైనే ఉంది’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె. తారక రామారావు అన్నారు. తెలంగాణ భవన్లో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన విద్యార్థి నేత కురువ విజయ్‌కుమార్, పాలకుర్తి, ముధోల్ కాంగ్రెస్ నేతలు తిరుపతిరెడ్డి, కిరణ్ వాంగ్మోరేతోపాటు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో హైదరాబాద్, జనగామ, పాలకుర్తికి చెందిన పలువురు నేతలు మంగళవారం కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘ఇక్కడ నాయకత్వం లేనట్లు చేతకాని, చేవచచ్చిన కాంగ్రెస్, బీజేపీ పక్క రాష్ట్రాల నుంచి నాయకులను తెచ్చుకుంటున్నాయి. తెలంగా ణ గొంతు కేసీఆర్ ఉండగా మనకు ఇతరుల అవస రం ఏముంది? తెలంగాణ కథకు స్క్రీన్ ప్లే, దర్శక త్వం కేసీఆర్. మన సినిమా బ్లాక్ బస్టర్. కానీ కాంగ్రెస్, బీజేపీకి కన్నడ నిర్మాతలు, ఢిల్లీ దర్శకులు, గుజరాత్ నటులు అని వారి సినిమా డిజాస్టర్‌గా నిలుస్తుంది’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్ రాష్ట్రాన్ని ప్లాట్లు చేసి అమ్మేస్తాడు ‘ఐదేళ్ల క్రితం ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికి జైలుకు వెళ్లిన రేవంత్‌రెడ్డి అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని ప్లాట్లు చేసి అమ్మేస్తాడు. తొమ్మిదిన్నరేళ్లుగా కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ది దిశగా నడుపుతున్నారు. తెలంగాణలోని ప్రతి వర్గానికీ కేసీఆర్ మంచి చేశారు తప్ప నష్టం చేయలేదు. విద్యుత్, సాగునీరు, తాగునీరుతో అన్ని రంగాల్లో సమృద్దిని సాధిస్తోంది. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా 14లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. పాలమూరులో నిండు చెరువులు, పచ్చని పైరులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌కు 11 మార్లు తెలంగాణ ప్రజలు అధికారం, అవకాశం ఇచ్చినా సాగునీరు, తాగునీరు, కరెంటు ఇవ్వలేదు. కాంగ్రెస్ పాలనలో కరెంటు, ఎరువులు, విత్తనాల కోసం రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మూడు కరెంటు చాలని రేవంత్, రైతుబంధు దుబారా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు. తెలంగాణలో మూడోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో అమలు చేస్తాం’ అని కేటీఆర్ ప్రకటించారు. సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి, దాసోజు శ్రవణ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, రాకేశ్, ధర్మేందర్, తుంగబాలు, స్వామి తదితరులు పాల్గొన్నారు. -
దొరల తెలంగాణ - ప్రజల తెలంగాణకు మధ్య జరిగే ఎన్నికలు ఇవి
సాక్షి, కొల్లాపూర్ : దొరల తెలంగాణ - ప్రజల తెలంగాణకు మధ్య తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొల్లాపూర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలమూరు ప్రజాభేరి సభ జరిగింది. ఈ సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా..‘దొరల తెలంగాణలో ఏం జరుగుతోందో ప్రజలు నిత్యం గమనిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అతిపెద్ద మోసం. బీఆర్ఎస్ కట్టిన బ్యారేజ్ కుంగి పోయింది. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్ట్‌లను చూడండి’ అని రాహుల్ గాంధీ కోరారు. ఉద్యమం చేసింది.. దొరల తెలంగాణ కోసం కాదు 'ప్రజా తెలంగాణ కోసం కలలుగన్నాం.. దొరల తెలంగాణ కోసం కాదు. ప్రజల కలలుగన్న తెలంగాణ సాకారం కాబోతోంది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ సర్కారు 6 గ్యారంటీలను అమలు చేస్తుంది.' అని రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ, ఎంఐఎంకి వేస్తే బీఆర్ఎస్కి ఓటు వేసినట్లే 'బీజేపీ, బీఆర్ఎస్ , ఎంఐఎం ఒకటే. బీజేపీ సర్కారు ఉభయ సభల్లో ప్రవేశపెట్టే బిల్లులకు బీఆర్ఎస్ మద్దతిస్తుంది. ఈడీ , విజిలెన్స్, సీబీఐ కేసులు కాంగ్రెస్ లీడర్ల మీద తప్ప బీఆర్ఎస్ లీడర్ల మీద ఉండవు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బీజేపీ గెలిపించేందుకే ఎంఐఎం ప్రయత్నిస్తుంది. బీజేపీ, ఎంఐఎంకి వేస్తే బీఆర్ఎస్కి ఓటు వేసినట్లే' అని రాహుల్ పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ప్రజా బలం 'డబ్బులు , మీడియా, అధికారం బీఆర్ఎస్కు ఉంటే కాంగ్రెస్‌కు ప్రజా బలం ఉంది. భయపెట్టాలని చూసినా భయపడకండి . ప్రజల ప్రభుత్వం నిర్మాణానికి ప్రజలతో కలసి కృషి చేయాలి. మన బంధం రాజకీయ బంధం కాదు.. కుటుంబ బంధం. అత్యవసర పరిస్థితిలో తెలంగాణ ప్రజల మద్దతు ఇందిరాగాంధీకి అండగా నిలిచింది' అని రాహల్ గుర్తు చేశారు. -
18న కొండగట్టుకు రాహుల్, ప్రియాంక ముడుపుగట్టు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పుణ్యక్షేత్రం కొండగట్టు నుంచి కాంగ్రెస్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనుంది. ఈనెల 18న జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకాగాందీలు హాజరవనున్నారు. రాహుల్, ప్రియాంకాగాందీలు కొండగట్టుపై తొలుత అంజన్నకు పూజలు చేసి అక్కడ పార్టీకి విజయం సాధించాలని ముడుపు కడతారని, అనంతరం అక్కడ సిద్ధంగా ఉంచిన ప్రచార రథాలకు పూజలు చేయిస్తారు. పూజల అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ చేపట్టే బస్సు యాత్ర ప్రారంభమవుతుందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. రాహుల్, ప్రియాంకల పర్యటనను ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, జగిత్యాల పోలీసులు కూడా ధ్రువీకరించారు. అయితే తమకు ఇంకా అధికారిక షెడ్యూలు మాత్రం అందాల్సి ఉందన్నారు. కాగా, బీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న పాత కరీంనగర్లో కాంగ్రెస్‌కు కేవలం ఒక్క సీటే ఉంది. అలాంటి కంచుకోటను బద్దలు కొట్టేందుకు, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి బస్సుయాత్ర మొదలుపెట్టాలని నిర్ణయించినట్లు సీనియర్ పార్టీ నేత ఒకరు చెప్పారు. -
దసరా తర్వాతే బస్సు యాత్ర!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కలసి నిర్వహించ తలపెట్టిన బస్సుయాత్రకు బ్రేకులు పడ్డాయి. ఈ యాత్రను ముందుగా అనుకు న్నట్టు ఈ నెల 15 నుంచి కాకుండా దసరా పండుగ తర్వాత ప్రారంభించాలని పీసీసీ నేతలు నిర్ణయించారు. ఎన్నికల ప్రచారం ముగిసేదాకా బస్సు యాత్రను కొనసాగించడం ద్వారా అప్పటివరకు పార్టీ కేడర్‌లో ఉత్సాహాన్ని కొనసాగించవచ్చన్న వ్యూహంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు అభ్యర్థుల ఖరారు ప్రక్రియ ఓ కొలిక్కిరాకపోవడంతో అసమ్మతి బెడద నుంచి బయటపడేందుకే యాత్రను వాయిదా వేసినట్టు పలువురు నేతలు పేర్కొంటున్నారు. రెండు ప్రతిపాదనలు వాస్తవానికి ఈనెల 15వ తేదీ నుంచి రోజుకు మూడు నియోజకవర్గాల చొప్పున అన్ని జిల్లాలను చుట్టివచ్చేలా బస్సుయాత్ర చేపట్టాలని కాంగ్రెస్ సూత్రప్రాయంగా నిర్ణయించింది. రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో చర్చించి దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని భావించింది. ఈ మేరకు పీఏసీలో బస్సుయాత్రపై చర్చించిన నేతలు రెండు ప్రతిపాదనలు చేశారు. ఈ నెల 15 నుంచి 22 వరకు యాత్ర చేయాలని.. లేదంటే దసరా తర్వాతి నుంచి ఎన్నికలదాకా నిర్వహించాలని.. ఈ రెండింటిలో జాతీయ నాయకత్వం సూచన మేరకు ఏదో ఒక షెడ్యూల్‌ను ఖరారు చేయాలని మంగళవారం జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఇదే విషయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మీడియాకూ చెప్పారు. ఇందులో రెండో ప్రతిపాదనకే అధిష్టానం మొగ్గు చూపిందని, దసరా తర్వాతే యాత్రకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని తెలిసింది. ఐక్యంగా ఉన్నామని చాటేందుకే.. బస్సు యాత్ర వాయిదా వెనుక పలు కారణాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అభ్యర్థుల ప్రకటన ఈ నెల 16న లేదా 18న ఉండే అవకాశముంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు తేలకుండానే క్షేత్రస్థాయికి వెళ్లి ప్రయోజనం ఉండదన్న ఆలోచన వచ్చినట్టు తెలిసింది. అంతేగాకుండా ఈనెల 15 నుంచి ప్రారంభిస్తే యాత్ర మధ్యలో ఉండగానే అభ్య ర్థులను ప్రకటించాల్సి ఉంటుందని, టికెట్లు రాని వారి అసమ్మతి ప్రభావం యాత్రపై పడుతుందన్న భావన వ్యక్తమైనట్టు సమాచారం. ఈ మేరకు గొడవల మధ్య యాత్ర నిర్వహించడం ద్వారా ప్రయోజనం ఉండదనే భావనకు అధిష్టానం వచ్చినట్టు గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు దసరా తర్వాత యాత్ర చేపట్టడం ద్వారా.. ఆ సమయంలో సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే వంటి అగ్రనేతలు హాజరయ్యేలా షెడ్యూల్ రూపొందించి.. ఎన్నికల ప్రచారానికి ఊపు తేవచ్చనే ప్రణా ళికతో వాయిదాకే మొగ్గుచూపినట్టు వివరిస్తు న్నాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలంతా ఐక్యంగా ఉన్నారని ప్రజల్లో భావన కలిగించే ఉద్దేశమూ దెబ్బ తినదన్న ఆలోచన చేసినట్టు పేర్కొంటున్నాయి. -
ఓ వైపు గాంధీ.. మరోవైపు గాడ్సే: రాహుల్ గాంధీ
భోపాల్: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే లోక్‌సభ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య జరిగే యుద్ధంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అభివర్ణించారు. ఒక వైపు మహాత్మాగాంధీ, మరోవైపు ఆయనని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే మధ్య ఎన్నికల పోరు జరగనుందన్నారు. తాము అధికారంలోకి వస్తే ఓబీసీల సంఖ్య తెలుసుకోవడానికి కులగణన చేపడతామని చెప్పారు. ఈ డిసెంబర్లో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌లోని షాజపూర్‌లో జన ఆక్రోశ్ ర్యాలీలో రాహుల్ గాంధీ శనివారం పాల్గొన్నారు. ‘‘ఈ సారి ఎన్నికల పోరు రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, మరోవైపు బీజేపీ, ఆరెస్సెస్, ఒక వైపు మహాత్మాగాంధీ మరోవైపు గాడ్సేలు నిలిచి పోరాడతారు. ప్రేమ, సోదరభావం ద్వేషానికి మధ్య ఈ పోరాటం ఉంటుంది’’ అని రాహుల్ చెప్పారు. బీజేపీ ప్రజలకి ఏం ఇస్తే వారు అదే తిరిగి ఇస్తారని, ఇన్నాళ్లూ బీజేపీ వారిలో విద్వేషం నింపిందని, ఇప్పుడు ప్రజలే బీజేపీని ద్వేషిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. ఈ దేశంలో ఆరెస్సెస్‌కు చెందిన కొందరు కేంద్ర ప్రభుత్వ అధికారులే చట్టాలు చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని, బీజేపీ ప్రజాప్రతినిధులకి ఎలాంటి పాత్ర లేదని అన్నారు. ఆరెస్సెస్ చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం ఆడుతోందని రాహుల్ ఆరోపించారు. అవినీతి కేంద్రంగా ఎంపీ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కుల ప్రాతిపదికన జనాభా గణన చేపడతామని రాహుల్ మరోసారి స్పష్టం చేశారు. ఇతర వెనుకబడిన కులాల (ఓబీసీ) సంఖ్యను తెలుసుకోవడానికే కుల గణన చేపడతామన్నారు. అవినీతికి మధ్యప్రదేశ్ కేంద్రంగా మారిందని రాహుల్ ఆరోపించారు. బీజేపీ హయాంలో గత 18 ఏళ్లలో 18 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రాహుల్ చెప్పారు. -
మొన్న రైల్వే కూలీ.. నేడు ప్యాసింజర్.. సర్ప్రైజ్ చేసిన రాహుల్ గాంధీ
రాయ్‌పూర్: దేశంలో ఈ ఏడాది చివరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. మరోవైపు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఫుల్ జోష్‌లో ఉన్నారు. దేశవ్యాప్తంగా ప్రజల్లోకి దూసుకెళ్తూ వినూత్నంగా ముందుకు సాగుతున్నారు. తాజాగా ప్యాసింజర్ రైలులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు రాహుల్ గాంధీ. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా పార్టీ నేతలతో కలిసి రైలులో ప్రయాణించారు. సాధారణ వ్యక్తిలా ట్రైన్లో ప్రయాణిస్తూ అందరినీ పలకరించారు. కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ నుంచి రాయ్‌పూర్ వరకు ఇంటర్ సిటీ రైల్లో ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా పలువురు రాహుల్‌తో ఫొటోలు దిగేందుకు, ఆటోగ్రాఫ్ తీసుకునేందుకు ఎగబడ్డారు. మరోవైపు, ఇటీవలే రాహుల్ గాంధీ రైల్వే కూలీ అవతారమెత్తిన విషయం తెలిసిందే. Rahul Gandhi Did It Again#RahulGandhi's simplicity is revealed again and again. Today's Train Journey is touching Four points. First, #RahulGandhi realizes how far the standard of #IndianRailways has Fallen in the last 10 years. Second, #RahulGandhi interacted with the… pic.twitter.com/9HSYzptmwC — তন্ময় l T͞anmoy l (@tanmoyofc) September 25, 2023 ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లో ఎర్రని చొక్కా ధరించి నెత్తిన లగేజ్ పెట్టుకుని మోశారు. రైల్వే కూలీలు ధరించి బ్యాడ్జీ ధరించి అచ్చం కూలీలాగే కనిపించి అభిమానులను అలరించారు. రైల్వే కూలీల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. రాహుల్ చిరునవ్వులు చిందుతూ రైల్వే కూలీలా మూటలు మోస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Congress leader Rahul Gandhi meets railway porters at Anand Vihar ISBT in Delhi, wears porter dress and badge... pic.twitter.com/Pzwouwx2Wn — Saurabh Raj (@sraj57454) September 21, 2023 ఇక, అంతకుముందు ఛత్తీస్‌గఢ్‌లో నిర్వహించిన గృహ నిర్మాణాలకు సంబంధించిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుల గణన నిర్వహించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గడిచిన కొన్ని నెలల్లో రాష్ట్రంలో 2,600 రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసిందని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. #WATCH | Delhi: Congress MP Rahul Gandhi visits Anand Vihar ISBT, speaks with the porters and also wears their uniform and carries the load pic.twitter.com/6rtpMnUmVc — ANI (@ANI) September 21, 2023 ఇది కూడా చదవండి: భారత్‌ను ముక్కలు చేసేందుకు ప్లాన్.. కశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా.. -
TS Election 2023: ప్రతి ఇంటిలోనా సోనియా బొమ్మ! : గాయకుడు నైనాల రమేష్
సాక్షి, రంగారెడ్డి: తుక్కుగూడ వేదికగా ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విజయభేరి బహిరంగ సభ విజయవంతమైంది. సభాస్థలితో పాటు ఓఆర్ఆర్, సర్వీసు రోడ్లన్నీ జనంతో నిండిపోయాయి. రోడ్లపై ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాలకు సీడబ్ల్యూసీ సభ్యులతో కూడిన బృందం సభాస్థలికి చేరుకుంది. ఆ తర్వాత కొద్ది సేపటికే సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే చేరుకున్నారు. ఈ సమయంలో వేదికపై ఆసీనులైన పార్టీ ముఖ్యులతో పాటు వివిధ గ్యాలరీల్లో కూర్చొన్న కార్యకర్తలు, నాయకులు సీట్లో నుంచి పైకి లేచి నిటారుగా నిలబడి ‘జై సోనియా’ అంటూ అభివాదం చేశారు. నిజానికి సభకు ప్రియాంక గాంధీ కూడా హాజరవుతారని అంతా ఆశించారు. ఆమె గైర్హాజరవడంతో అభిమానులు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. మహిళల కోసం మహాలక్ష్మి పథకాన్ని సోనియాగాంధీ ప్రకటించగా, రైతు భరోసా పథకాన్ని జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. అభయహస్తం, చేయూత వంటి పథకాలను రాహుల్ గాంధీ ప్రకటించారు. ఒక్కోనేత ఒక్కో పథకాన్ని ప్రకటించడం సభికులను విశేషంగా ఆకట్టుకుంది. సభా వేదికపై సోనియా 20 నిమిషాలే ఉన్నారు. ఐదు నిమిషాల్లోనే తన ప్రసంగాన్ని ముగించారు. ఆమె వెళ్లిపోయిన తర్వాత మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి, తెలంగాణకు ఏం చేసిందో వివరించారు. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏయే వర్గాలకు.. ఏంఏం చేయబోతోందో స్పష్టం చేశారు. చివరగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. ముఖ్య నేతల ప్రసంగాలు కేడర్‌లో జోష్‌ను నింపాయి. జన సమీకరణలో పోటీపడిన నేతలు.. జన సమీకరణ విషయంలో నేతలు పోటీపడ్డారు. సభ నిర్వహిస్తున్న మహేశ్వరం నియోజకవర్గం నుంచి భారీగా జన సమీకరణ చేశారు. డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి దేప భాస్కర్‌రెడ్డి భారీగా జనాన్ని తరలించారు. చేవెళ్ల నేతలు సైతం ఈ విషయంలో పోటీ పడ్డారు. మహబూబ్‌నగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మెదక్ జిల్లాల నుంచి భారీగా జనం తరలివచ్చారు. సభ కు హాజరైన వారిలో ఎక్కువగా యువతే కన్పించారు. వీరిలో విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు ఎక్కువగా ఉన్నారు. ముఖ్య నేతల దృష్టిలో పడేందుకు జిల్లా నేతలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీసీసీలు యత్నించారు. ఇందు కోసం తుక్కుగూడ–శ్రీశైలం జాతీయ రహదారి నుంచి సభాస్థలికి చేరుకునే మార్గంలో భారీ స్వాగత ద్వారాలు, ఫెక్సీలు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి సభకు భారీగా జనం తరలిరావడం, వెనుక ఉన్న బారీకేడ్లలో కుర్చీలు ఖాళీ లేక మీడియా గ్యాలరీలోకి చొచ్చుకు రావడం కొంత గందరగోళానికి దారితీసింది. వీరిని నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారు. దీంతో మీడియా ప్రతినిధులు సైతం ఇబ్బంది పడాల్సి వచ్చింది. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు.. ‘ప్రతి ఇంటిలోనా సోనియా బొమ్మ ఉండాలి.. అదే ఇంటిపై కాంగ్రెస్ జెండా ఎగరాలి’ అంటూ ప్రముఖ గాయకుడు నైనాల రమేష్ కళాకారుల బృందం ప్రదర్శించిన కళారూపాలు సభికులను విశేషంగా అలరించాయి. ఆగదు..ఆగదు.. ఈ ఆకలిపోరు ఆగదు.., మూడు రంగుల జెండాపెట్టి..సింగమోలే కదిలినాడు మన రాహుల్‌గాంధీ.. నిగ్గదీసి అడిగే మొనగాడు పాటకు సభికులంతా ఒక్కసారిగా కుర్చీల్లోనుంచి పైకి లేచి డ్యాన్స్ చేశారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే సీతక్క, పీసీసీ మాజీ అధ్యక్షుడు హన్మంత రావు, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఖర్గే ప్రసంగాన్ని భట్టి తెలుగులోకి అనువదించగా, సోనియా, రాహుల్ గాంధీ ప్రసంగాలను ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అనువదించారు. సభకు హాజరైన సామాన్య కార్యకర్తలు సైతం కళాకారులతో కలిసి నృత్యం చేయడం వారిలోమరింత జోష్ నింపినట్లైంది. ఆ నాలుగు గంటలు ట్రా‘ఫికర్’.. తుక్కుగూడకు వచ్చి వెళ్లే ప్రధాన మార్గాలు సహా ఓఆర్ఆర్పై కూడా భారీగా ట్రాఫిక్ జాం అయింది. సభకు వచ్చిన కార్యకర్తలు, నాయకుల వాహనాలతో పాటు సాధారణ ప్రయాణికుల వాహనాలు కూడా ఈ ట్రాఫిక్‌లో నిలిచిపోయాయి. సాయంత్రం నాలుగు నుంచి రాత్రి పది గంటల వరకు ఇదే పరిస్థితి. ఇటు ఆదిబట్ల మొదలు.. అటు శంషాబాద్ వరకు.. పహడీషరీఫ్ మొదలు.. మహేశ్వరం కమాన్ వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వచ్చిన వాహనాలను క్రమ పద్ధతిలో పార్కింగ్ చేయకపోవడం, వచ్చిపోయే వాహనాలను ఇతర మార్గాల్లో మళ్లించకపోవడంతో సాధారణ ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. సుమారు నాలుగు గంటల పాటు వాహనదారులు ట్రాఫిక్‌లోనే గడపాల్సి వచ్చింది. -
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ కార్డు స్కీంలు ఇవే..
Updates.. 19: 20PM తుక్కుగూడలో కాంగ్రెస్ విజయభేరీ సభ కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ కార్డు స్కీంలు ఇవే.. 1. మహాలక్ష్మి పథకం కింద రూ. 2,500, రూ. 500లకే మహిళలకు గ్యాస్ పిలిండర్, టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం 2. రైతుభరోసా కింద రూ. 15 వేల పెట్టబడి సాయం, వ్యవసాయ కూలీలకు రూ. 12 వేల సాయం, వరి పంటకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్ 3. గృహ అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ 4. గృహ నిర్మాణానికి రూ. 5లక్షల సాయం 5. విద్యార్థులకు రూ. 5లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ 6. వృద్ధులకు నెలకు రూ. 4వేల చొప్పున పెన్షన్, రూ. 10 లక్షల వరకూ రాజీవ్ ఆరోగ్యశ్రీ భీమా 18.02 PM ► తుక్కుగూడలో జరుగుతున్న విజయ భేరీ సభ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. సభాప్రాంగణానికి కాంగ్రెస్ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, పార్టీ అధ్యక్షుడు ఖర్గే చేరుకున్నారు. ►తాజ్‌కృష్ణలో రెండో రోజు సీడబ్ల్యూసీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ► సోనియా గాంధీ ప్రకటించబోయే 6 గ్యారెంటీ స్కీంలు ఇవే.. 1. రూ.500లకే వంటగ్యాస్ సిలిండర్. 2. ఏక కాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ. 3. రెండు లక్షల ప్రభుత్వ ఉధ్యోగాల భర్తీ. 4. దలిత, గిరిజనులకు 12 లక్షల ఆర్థిక సహాయం. 5. ఇందిరమ్మ ఇళ్ళకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం. 6. మహిళా సాధికారతకు ప్రత్యేక నిధి. ► కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. పార్టీలో క్రమశిక్షణను పాటించాలి. సొంత పార్టీ నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దు. పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఎవరూ వ్యవహరించకూడదు. ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిపై రివ్యూ. 5 రాష్ట్రాల పీసీసీ అధ్యక్షుల నుంచి నివేదిక. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో ఏఐసీసీ నేతల ప్రచారంపై త్వరలోనే షెడ్యూల్ ప్రకటిస్తాం. ► హోటల్ తాజ్‌కృష్ణలో టీపీసీసీ చీఫ్ రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రెస్ తరపున జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సీడబ్ల్యూసీ సమావేశాలు ఇక్కడ ఏర్పాటు చేయడం తెలంగాణకు ఎంతో కీలకం. బీఆర్ఎస్, ఎంఐఎం బీజేపీకి పరోక్ష మద్దతుదారులు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన విధానాలపై నిన్న సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చించాం. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఇవాళ జరిగే సమావేశంలో చర్చిస్తాం. సాయంత్రం జరిగే విజయభేరిలో సోనియాగాంధీ గ్యారంటీలను ప్రకటిస్తారు. బోయిన్ పల్లి రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్‌కు సభలోనే శంఖుస్థాపన చేస్తారు. తెలంగాణ ఇస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్టే.. ఇవాళ విజయభేరిలో ఇవ్వబోయే గ్యారంటీలను కాంగ్రెస్ అమలు చేస్తుంది. అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో పథకాలు అన్నీ అమలు చేసేలా గ్యారెంటీ ఇవ్వబోతున్నాం. సాయంత్రం తుక్కుగూడలో జరిగే విజయభేరి సభకు లక్షలాదిగా తరలిరావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ► డీకే శివకుమార్ మాట్లాడుతూ.. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే ఈ సమావేశం ఎజెండా. విద్వేష రాజకీయాలను దేశం నుంచి పాలద్రోలడమే కాంగ్రెస్ లక్ష్యం. సరైన ఎజెండా చెప్పకుండా పార్లమెంట్ ప్రత్యేక సోషన్ పెడుతున్నారు. ► కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిక. ► నగరంలోని తాజ్‌కృష్ణ వేదికగా కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్నాయి. రెండో రోజు సమావేశాలు ఆదివారం ఉదయం 10:30 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ► ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు పాల్గొననున్నారు. ► తొలిరోజు సమావేశంలో 14 జాతీయ అంశాలపై తీర్మానం. ► ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వేదికగా ఆదివారం సాయంత్రం నిర్వహించతలపెట్టిన కాంగ్రెస్ విజయభేరి సభకు సర్వం సిద్ధమైంది. ప్యాబ్‌సిటీ సమీపంలోని వంద ఎకరాల విస్తీర్ణంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ► కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సహా యువనేత రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ సహా సీడబ్ల్యూసీ ముఖ్యులు, అన్ని రాష్ట్రాలకు చెందిన పీసీసీ అధ్యక్షులు, డీసీసీలు, అనుబంధ సంఘాల నేతలు హాజరు కానున్నారు. రెయిన్ ఫ్రూప్ టెంట్లు.. భారీ వర్షానికి సైతం నేతలు తడవకుండా ఉండేందుకు రెయిన్ ఫ్రూప్ టెంట్లను వేశారు. నేతల ప్రసంగాలు స్పష్టంగా విన్పించేందుకు సభాస్థలికి నాలుగు వైపులా భారీ ఎల్ఈడీ స్క్రీన్లు, లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేశారు. ►సభా ప్రాంగణం చుట్టూ పెద్ద సంఖ్యలో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. ►స్వాగత తోరణాలు, భారీ కటౌట్లు, ఫ్లెక్సీల ఏర్పాటులో ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల కాంగ్రెస్ నేతలు పోటీపడ్డారు. ►సీడబ్ల్యూసీ ముఖ్య నేతల కోసం ప్రధాన వేదికను కేటాయించారు. పీసీసీలు, మాజీ మంత్రులు, ఎంపీల కోసం ఒకటి.. డీసీసీలు, అనుబంధ సంఘాల నేతలు, కళాకారుల కోసం మరో స్టేజీని కేటాయించారు. ►ఈ మూడు వేదికలపై సుమారు 250 మంది ఆసీనులు కానున్నారు. సభకు వచ్చే ముఖ్య నేతల వాహనాలను ప్రధాన వేదిక వెనుక భాగంలోనే పార్కింగ్ చేయించనున్నారు. భారీ బందోబస్తు.. తుక్కుగూడకు వచ్చి వెళ్లే నాలుగు ప్రధాన రహదారులపై భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముగ్గురు డీసీపీలు, ఐదుగురు అదనపు డీసీపీలు, ఎనిమిది మంది డీఎస్పీలు, 27 మంది సీఐలు, 61 మంది మంది ఎస్ఐలు, 600 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వహించనున్నారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ► ఆదివారం సాయంత్రం 5 గంటలకు తాజ్‌కృష్ణ హోటల్ నుంచి బయలుదేరే ముఖ్య నేతల వాహనాలు శంషాబాద్ నుంచి ఓఆర్ఆర్ మీదుగా తుక్కుగూడకు చేరుకుంటాయి. అటు నుంచి ర్యాలీగా ప్రధాన వేదిక వెనుకభాగంలోని ప్యాబ్‌సిటీ నుంచి సభా ప్రాంగణానికి అనుమతించనున్నారు. మిగిలిన వాహనాలను ప్రధాన రహదారి నుంచి అనుమతిస్తారు. -
Chandrababu : చేతులు కలపడమే తరువాయి.?
చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు ప్రయాణంలో స్పష్టత వస్తున్నట్టు సంకేతాలందుతున్నాయి. ఇక తన ప్రయాణం కాంగ్రెస్‌తోనే కొనసాగించాలని బాబు నిర్ణయించుకున్నట్టు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. బీజేపీతో ఇప్పటికే పూర్తిగా తెగతెంపులు చేసుకున్న చంద్రబాబు.. ప్రధాని మోదీని, హోంమంత్రి అమిత్‌షాను టార్గెట్ చేసుకుని 2019లో చేసిన యాంటీ బీజేపీ క్యాంపెయిన్ ఇంకా ప్రజల మదిలో చెదిరిపోలేదు. గత నాలుగున్నరేళ్లుగా పైకి బీజేపీతో దగ్గరవుదామని ప్రయత్నిస్తున్నా.. లోలోన మాత్రం కాంగ్రెస్‌తో నడుపుతున్న రాయబారాలు బహిర్గతమవుతున్నాయి. సీన్ 1 : 2019 ఎన్నికలు - జాతీయ రాజకీయాలు ఎన్నికల్లో యాంటీ బీజేపీ స్టాండ్ తీసుకున్న చంద్రబాబు.. దేశవ్యాప్తంగా విపక్షాలను ఏకం చేసే పనిలో పడ్డారు. ఉదయం తూర్పున బెంగాల్లో మమతో ఒక భేటీ జరిగితే, మధ్యాహ్నానికల్లా ముంబైలో శరద్ పవార్‌తో మరో భేటీ నిర్వహించారు. ఢిల్లీలో కేజ్రీవాల్‌ను కలిస్తే.. అంతే వేగంగా కేరళలో కమ్యూనిస్టులతో భేటీ అయ్యారు. చంద్రబాబు స్పీడ్ చూసి నేషనల్ మీడియా కూడా అవాక్కయిన సందర్భాలు 2019లో ఎన్నో ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులయితే సరే సరి. రాహుల్‌తో 10 జన్‌పథ్‌లో నిర్వహించిన మీటింగ్‌కు ఎల్లో మీడియా ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అంతెందుకు కర్ణాటకలో కుమారస్వామి ప్రమాణస్వీకారంలో సభ మీద రాహుల్‌తో చట్టాపట్టాల్ వేసుకున్నవి కూడా ఇంకా ఇప్పుడే చూసినట్టు ఉంది. (కర్ణాటక రాజకీయాల సందర్భంగా చంద్రబాబు తిప్పిన యూపీఏ చక్రం) సీన్ 2 : 2019 ఫలితాలు - తదనంతర పరిణామాలు ఎన్నికలు ముగిసాయి. ప్రజా తీర్పు వెల్లడయింది. సైకిల్ కొట్టుకుపోయింది. చంద్రబాబులో నిర్వేదం ఏర్పడింది. ఇంతా చేసినా.. ప్రజలెందుకు తరిమికొట్టారన్న ఆత్మవిమర్శ మాత్రం చేసుకోలేకపోయారు. తనను ఓడించి ప్రజలు ద్రోహం చేశారంటూ నిందించడం మొదలెట్టారు. అదే సెల్ఫ్ డబ్బా.. ఈ రోడ్డు నేనేశా.. ఈ భవనం నేను కట్టా.. ఈ కాలువ నేను తవ్వించా.. ఎంత సేపు నేను అనే సోత్కర్ష నుంచి బయటకు రాలేకపోయారు. చివరికి భ్రమలనే నిజమనే స్థాయికి చేరిపోయారు. ఈ సమయంలో ఎల్లో మీడియా వల్ల ఆయనకు నిజంగానే అన్యాయం జరిగింది. ఉదాహారణకు హైటెక్ సిటీకి శంకుస్థాపన చేసింది కాంగ్రెస్ హయాంలో అని తెలిసినా.. చంద్రబాబే .. చంద్రబాబే అని ప్రచారం చేసి అదే నిజమని ప్రజల్ని నమ్మించే స్థాయికి చేరారు. అంతెందుకు హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్టును దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మిస్తే.. ఆ క్రెడిట్ చంద్రబాబుకు ఇచ్చేశారు. ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తే.. పెద్దలా గద్దలా అంటూ ఈనాడులో విమర్శలు చేసి... ఇప్పుడు జన జీవన నాడిగా మారిన తర్వాత చంద్రబాబుకు క్రెడిట్ ఇస్తున్నారు. ఇలా మారని భ్రమలతో ఆయన వ్యక్తిత్వ పరంగా మరింత దిగజారారు. (జపాన్ సహకారంతో టెక్నాలజీ పార్కును శంకుస్థాపన చేస్తున్న నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, ఆ సందర్భంగా మీడియాలో వచ్చిన వార్తలు) (శంషాబాద్ ఎయిర్‌పోర్టును, PV నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించి పూర్తి చేసిన డా.వైఎస్సార్) సీన్ 3 : పార్టీ నిర్మాణంలో ఎన్నో లోపాలు తానొక విజనరీ నాయకుడినని, విజన్ 2020 తర్వాత విజన్ 2047 తెచ్చానని చెప్పుకునే చంద్రబాబు.. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో తెలుగుదేశం పార్టీని ఒక నిష్క్రియాత్మకమైన వ్యవస్థగా మార్చారు. ఏ పార్టీలోనయినా పిరమిడ్ లెవల్ ఉంటుంది. అంటే ఒక నాయకుడి తర్వాత అంతటి బాధ్యతలు నిర్వహించగలిగే సత్తా ఉన్నా ఇద్దరో, ముగ్గురో ఉంటారు. మేనేజ్మెంట్ పాఠాలను వల్లె వేసే చంద్రబాబుకు ఈ విషయాలన్నీ తెలియవని కాదు. తెలుగుదేశం పార్టీలో తీసుకునే ఏ నిర్ణయమైనా చంద్రబాబుకు తప్ప మూడో కంటికి తెలియదు. తన వారసుడిగా లోకేష్‌ను ప్రొజెక్ట్ చేయాలని చూసినా.. ఎమ్మెల్యేగా గెలవలేని ప్రతిభాసామర్థ్యాలు లోకేష్‌వి. ఇక పవన్‌కళ్యాణ్‌కు ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా.. ఏ ఎజెండాలో సక్సెస్ అయిన దాఖలాలు లేవు. (తన పొలిటికల్ పార్ట్నర్ పవన్‌కళ్యాణ్‌తో చంద్రబాబు ) సీన్ 4 : కిం కర్తవ్యం.. కాంగ్రెసే శరణ్యం ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబుకు ఉన్న ఏకైక మార్గం కాంగ్రెస్. అందుకే తన శిష్యుడు రేవంత్ రెడ్డిని నమ్ముకున్నారు. చంద్రబాబును కాపాడేందుకు ఇప్పటికే రేవంత్‌రెడ్డి రాయబారం నడుపుతున్నారు. బాబును కాపాడేందుకు ఏం చేయాలన్న దానిపై రేవంత్‌రెడ్డి కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించి ‘ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సమగ్ర కథనాన్ని ప్రచురించింది. తాను అరెస్ట్ అవుతానంటూ చెప్పుకొచ్చిన చంద్రబాబుతో డీకే శివకుమార్‌తో రేవంత్ ఫోన్ చేయించినట్టు కథనంలో పేర్కొంది. బాబు తరఫున ఏసీబీ కోర్టులో వాదించిన న్యాయవాది సిద్దార్థ్ లూథ్రాకు డీకేతో మంచి సంబంధాలున్నాయి. డీకేకు ఆయన అన్ని విషయాల్లో తోడుగా ఉంటారు. డీకే సిఫారసుతోనే బాబు కేసులో లూథ్రా రంగంలోకి దిగారు. అయితే కేసు పక్కాగా ఉండడం, ఆధారాలు బలంగా ఉండడంతో లూథ్రా కాస్తా నిర్వేదంలో పడిపోయారు. (చంద్రబాబును రక్షించేందుకు బెంగళూరులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో రేవంత్ మంతనాలు) సీన్ 5 : ఇండియా కూటమి వైపు సైకిల్ తాజా పరిణామాలతో రేపో, మాపో ఇండియా కూటమి దిశగా సైకిల్ వెళ్తోందని తేలిపోయింది. ఇంతవరకు ఏ ఎన్నికల్లోనూ ఒంటరిగా అధికారంలోకి వచ్చిన చరిత్ర చంద్రబాబుకు లేదు. ఇప్పుడు కూడా పవన్‌తో పొత్తు ప్రకటించేశారు. బీజేపీ ఈ పరిణామాలపై గుర్రుగా ఉంది. ఇక మిగిలింది కాంగ్రెస్. రాహుల్‌తో తనకు చక్కటి సమన్వయం, అంతకు మించిన పరిచయం ఉన్నాయి. అంతా అనుకున్నట్టు జరిగితే.. కాంగ్రెస్ నుంచి ఓ స్టెప్పు ముందుకు పడవచ్చు. జైల్లో ఉన్న చంద్రబాబును ములాఖత్‌లో రాహుల్‌గాంధీ కలవొచ్చు. లేదా తన ప్రతినిధిగా డీకే శివకుమార్ గానీ, కపిల్‌సిబల్‌ను కానీ పంపించవచ్చు. ఇటు ఢిల్లీలో కూడా లోకేష్ ఓ చీకటి వేళ ఒకరిద్దరు కాంగ్రెస్ అగ్రనాయకులతో భేటీ కావొచ్చు. ఇప్పటికే రఘురామకృష్ణరాజుతో కలిసి ఈ ప్రయత్నాల్లో ఉన్నారు. (ఢిల్లీలో రఘురామకృష్ణరాజుతో కలిసి ఎడతెగని ప్రయత్నాలు చేస్తోన్న లోకేష్) సీన్ 6 : కథ సశేషం.. మిగిలింది ఉత్కంఠభరితం ఎన్నికలు వడివడిగా వస్తున్నాయి. పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. రంగులు మార్చడంలో ఊసరవెల్లిని మించిన చరిత్ర చంద్రబాబుది. ఇదీ వైఎస్సార్సిపి మొదటి నుంచి చెబుతున్న విషయం. ఇప్పుడు పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి కూడా ఇదే విషయాన్ని పంచుకున్నారు. ఈ రాజకీయ ముఖచిత్రం త్వరలోనే సుస్పష్టంగా ఆవిష్కృతం కానుంది. దానికి ప్రజలే సాక్షి. Only the I.N.D.I.A. Alliance members are supporting Sri. Chandrababu @ncbn through phone calls to his son. This proves that TDP is part of the I.N.D.I.A. Alliance and that they have the same strategy, come together for power and loot the State while you can. TDP is incapable of… — Vijayasai Reddy V (@VSReddy_MP) September 16, 2023 -
లోక్ సభలో రాహుల్ గాంధీపై బండి సంజయ్ సెటైర్లు
-
ఎంపీగా లోక్‌సభలోకి రాహుల్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ దాదాపు నాలుగు నెలల తర్వాత లోక్‌సభలో ఎంపీ హోదాలో అడుగుపెట్టారు. పరువు నష్టం కేసులో రెండేళ్లు జైలు శిక్ష పడడం వల్ల కోల్పోయిన లోక్‌సభ సభ్యత్వం సుప్రీంకోర్టు ఉత్తర్వులతో తిరిగివచి్చంది. రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సమాచారం తెలిసిన అనంతరం రాహుల్ పార్లమెంట్‌కు చేరుకున్నారు. తొలుత గాంధీజీ విగ్రహం వద్ద నివాళులరి్పంచి మధ్యాహ్నం ఎంపీగా లోక్‌సభలోకి అడుగుపెట్టారు. ఆయన వచ్చిన కొద్దిసేపటికే సభ వాయిదా పడింది. పార్లమెంట్ ప్రాంగణంలో రాహుల్‌కు కాంగ్రెస్, ఇతర విపక్షాల ఎంపీలు సాదర స్వాగతం పలికారు. మిఠాయిలు పంచుకున్నారు. మొత్తానికి రాహుల్ రాక సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో పండుగ వాతావరణం కనిపించింది. కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై త్వరలో పార్లమెంట్లో చర్చ, ఓటింగ్ జరుగనున్న నేపథ్యంలో రాహుల్ మళ్లీ ఎంపీగా సభకు రావడం తమకు లాభిస్తుందని కాంగ్రెస్‌తోపాటు విపక్ష ‘ఇండియా’ కూటమి ఆశాభావం వ్యక్తం చేసింది. రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. ‘ఇండియా’ కూటమిలో హర్షం రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించడాన్ని స్వాగతిస్తున్నామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. కేరళలోని వయనాడ్ నియోజకవర్గంతోపాటు దేశ ప్రజలకు ఇదొక ఊర ట అని పేర్కొన్నారు. బీజేపీ, మోదీ ప్రభుత్వం పరిపాలనపై దృష్టి పెట్టకుండా ప్రతతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకొని వేధిస్తున్నాయని మండిపడ్డారు. రాహుల్ రాక పట్ల విపక్ష ‘ఇండియా’ కూటమిలోని పలు పార్టీల అగ్రనేతలు హర్షం వ్యక్తం చేశారు. రాహుల్ దోష విముక్తుడు కాలేదు: బీజేపీ రాహుల్ గాంధీ దోషం నుంచి ఇంకా పూర్తిగా విముక్తుడు కాలేదని బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ పేర్కొన్నారు. పరువు నష్టం కేసులో రాహుల్‌కు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు కేవలం స్టే మాత్రమే ఇచి్చందని గుర్తుచేశారు. కేసు గుజరాత్ కోర్టులో పెండింగ్‌లో ఉందని చెప్పారు. రాహుల్ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టిందని సుశీల్ కుమార్ మోదీ వివరించారు. ఆయన మళ్లీ లోక్‌సభకు వచి్చనప్పటికీ ప్రజలకు గానీ, కాంగ్రెస్ పార్టీకి గానీ ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు. అవిశ్వాసంపై నేడు చర్చ కేందంప్రై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం లోక్‌సభలో చర్చ ప్రారంభం కానుంది. రెండు రోజులపాటు చర్చ జరుగుతుందని అంచనా. అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చర్చకు సమాధానమిస్తారు. -
కాంగ్రెస్ విజయం తర్వాత రాహుల్ గాంధీ ఫస్ట్ రియాక్షన్
-
జనగర్జనలో వైఎస్ అభిమానులు
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మంలో జరిగిన తెలంగాణ జన గర్జన సభకు లక్షలాదిగా కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు. వీరిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అభిమానులు సైతం పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌లో చేరుతుండటంతో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలానికి చెందిన పలు వురు వైఎస్సార్, పొంగులేటి చిత్రాలతోపాటు జై జగన్ అనే నినాదం రాసి ఉన్న జెండాలను పట్టుకుని సందడి చేశారు. -
రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి
సాక్షి, ఖమ్మం: రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేరారు. కాంగ్రెస్ కండువా కప్పిన రాహుల్.. పార్టీలోకి ఆహ్వానించారు. పొంగులేటితో పాటు పిడమర్తి రవి, అరికెల నర్సారెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, కనకయ్య, డీవీ రావు, పాపిరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. పార్టీలోకి చేరిక అనంతరం జన గర్జన సభలో పొంగిలేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు. మోసపూరిత హామీలతో రెండుసార్లు కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. రైతు రుణమాఫీ హామీని కేసీఆర్ నెరవేర్చలేదు. తెలంగాణ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే’’ అని పొంగులేటి అన్నారు. ‘‘రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం. రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. సీఎం కేసీఆర్ కేవలం మాటలకే పరిమితమయ్యారు. తెలంగాణలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రజల ఆకాంక్షల మేరకే కాంగ్రెస్ పార్టీలోకి చేరాం. బీఆర్ఎస్ను బంగాళాఖాతంలో వేయాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యం’’ అని పొంగులేటి పేర్కొన్నారు. చదవండి: బండి సంజయ్‌పై హైకమాండ్‌కు ఫిర్యాదు చేసిందెవరు? -
రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్ధి అయితే మద్దతివ్వం
న్యూఢిల్లీ: ఇటీవల బీహార్‌లో జరిగిన విపక్షాల సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ఆర్డినెన్స్ పై స్పందించిన విధానం నచ్చక బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన అరవింద్ కేజ్రీవాల్ తాజాగా మరో షాక్ ఇచ్చారు. విపక్షాలు తమ నాయకుడిగా రాహుల్ గాంధీని ఎంచుకుంటే మాత్రం తాము మద్దతిచ్చేది లేదని తేల్చి చెప్పేశారు ఆప్ నేత ప్రియాంక కక్కర్. ట్విట్టర్ వేదికగా ప్రియాంక కక్కర్ స్పందిస్తూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ మద్దతివ్వకుంటే వారి నేతృత్వంలోని విపక్షాలతో మేము భాగస్వామ్యులము కాలేము. దేశం బాగుపడాలంటే మొదట కాంగ్రెస్ మరోసారి రాహుల్ గాంధీని నాయకుడిగా నిలబెట్టి విపక్షాలను కూడా అతడికి మద్దతివ్వమని అడగకూడదు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఇది రాజ్యాంగాన్ని పరిరక్షించడం కంటే కూడా చాలా ముఖ్యమైన విషయమని రాశారు. అనుకుందొక్కటి.. అయినదొక్కటి.. బీహార్ వేదికగా జరిగిన విపక్షాల సమావేశంలో ఢిల్లీలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ మద్దతిస్తుందని కోటి ఆశలతో వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ కు దానిపై కూలంకషంగా చర్చించి గాని నిర్ణయం తీసుకోలేమని రాహుల్ చెప్పిన సమాధానం రుచించలేదు. సమావేశం అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడకుండా ఢిల్లీ పయనమైన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ తమకు మద్దతివ్వకుంటే వారితో కలిసి ప్రయాణించడం కష్టమని సందేశం పంపించారు. ఈ సమావేశానికి ఆప్ తరపున ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్, ఎంపీ సంజయ్ సింగ్, రాఘవ్ చడ్డా కూడా హాజరయ్యారు. సమావేశంలో అరవింద్ కేజ్రీవాల్ రాహుల్ గాంధీని విభేధాలన్నిటినీ పక్కన పెట్టేసి కలిసి నడుద్దామని అభ్యర్ధించగా రాహుల్ మాత్రం ఆర్డినెన్స్ పై చర్చించడానికి ఒక పద్ధతుంటుందని తేలికగా చెప్పారు. దీంతో కాంగ్రెస్ పార్టీపై ఆప్ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆర్టికల్ 370 రద్దుకు మీరు మద్దతిచ్చినప్పుడు కూడా మేము ఇలాగే బాధపడ్డామని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. अगर देश बचाना है तो सबसे पहले कांग्रेस को बोल देना चाहिए की वो तीसरी बार भी Rahul Gandhi पर दाव नहीं लगायेंगे और समूचे विपक्ष पर ये दबाव नहीं डालेंगे। देश हित में ये संविधान बचाने से भी ऊपर है। — Priyanka Kakkar (@PKakkar_) June 24, 2023 ఇది కూడా చదవండి: మరో ప్రమాదం.. లూప్ లైన్లో ఉన్న రైలును ఢీకొన్న గూడ్స్ -
ఇదేం ప్రేమ.. రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఇటీవల కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ యూఎస్ పర్యటనలో భాగంగా నిర్వహించిన మొహబ్బత్ కీ దుకాన్ కార్యక్రమంలో ప్రస్తుత ముస్లింల పరిస్థితి 80వ దశకంలో దళితులను పోలి ఉందని చేసిన వ్యాఖ్యలతో మొదలు, అదేపనిగా బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పర్యటనను కొనసాగిస్తున్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ నీ ప్రేమంతా రాజకీయాలు చేయడం మీదే ఉంది తప్ప దేశం మీద కొంచెమైనా లేదు.. ఇదేం ప్రేమ.." అంటూ ఎద్దేవా చేశారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. ఇదేం ప్రేమ.. స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. ప్రేమతత్త్వం గురించి మాట్లాడేటప్పుడు అందులో సిక్కుల హత్యల గురించి మాట్లాడారా? ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు మీ హయాంలో జరిగిన రాజస్థాన్ మహిళల కిడ్నాపుల గురించి మాట్లాడారా? హిందువుల జీవన విధానం అస్తవ్యస్తం చేయడం కూడా మీ ప్రేమలో భాగమేనా? దాని గురించి మాట్లాడరేం? భారత దేశం ఎదుగుదలను సహించలేని వారితో చేతులు కలపడం, మన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా బయటవారి మద్దతు కోరడం ఇవన్నీ మీ ప్రేమలో భాగమేనా? నీ దేశంపై కాకుండా కేవలం నీ రాజకీయ ప్రయోజనాల కోసం ఒలకబోసే ప్రేమ.. ఇదేమి ప్రేమ? అంటూ ప్రశ్నించారు. ప్రేమ పేరుతో ద్వేషం పెంచుతున్నారు.. పది రోజుల యూఎస్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ లను టార్గెట్ చేస్తూ అనేక ప్రశ్నలు లేవనెత్తారు. ఈ వ్యాఖ్యలకు ప్రతిగా బీజేపీ నాయకులు ఒక్కొకరుగా రాహుల్ గాంధీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. పరాయి గడ్డ మీద ప్రేమ పేరుతో దేశంపై ద్వేషాన్ని పెంచుతున్నారని వ్యాఖ్యలు చేస్తున్నారు. #WATCH | Union Minister Smriti Irani speaks on Rahul Gandhi's "Mohabbat ki dukan" remark; says, "...When you talk about 'Mohabbat', does that include the killing of Sikhs? When you talk about 'Mohabbat', does that include the kidnapping of women in Rajasthan? When you talk about… pic.twitter.com/Rjx1Xebqme — ANI (@ANI) June 8, 2023 ఇది కూడా చదవండి: రెండు దేశాలకు మంచిది కాదు.. భారత విదేశాంగ శాఖ -
సార్వత్రిక ఎన్నికపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు..!
-
ప్రారంభోత్సవమా? పట్టాభిషేకమా?
న్యూఢిల్లీ: పార్లమెంట్ అనేది ప్రజల గొంతుక అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవాన్ని పట్టాభిషేక కార్యక్రమంలా నిర్వహించారని ఆక్షేపించారు. ఈ మేరకు రాహుల్ ట్వీట్ చేశారు. ప్రజస్వామ్యం మనగలిగేది భవనాల్లో కాదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేశారు. ప్రజల గొంతుకల్లో ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందని తెలిపారు. ప్రజాస్వామ్యం, జాతీయవాదం, ఆడశిశువుల సంరక్షణపై బీజేపీ–ఆర్ఎస్ఎస్ పాలకులు చెబుతున్న మాటల్లోని డొల్లతనం బయటపడిందన్నారు. పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవం సందర్భంగా మహిళా రెజ్లర్లపై దాడి చేయడం దారుణమని విమర్శించారు. పార్లమెంట్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పుడు అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను దూరంగా ఉంచారని, ఇప్పుడు ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును దూరం పెట్టారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మండిపడ్డారు. ఎన్నికల రాజకీయాల కోసం దళితులను, గిరిజనులను పావులుగా వాడుకోవడం ప్రధాని మోదీకి అలవాటేనని దుయ్యబట్టారు. చరిత్రాత్మక సందర్భానికి రాష్ట్రపతిని దూరం పెట్టడం ఏమిటని నిలదీశారు. ఇదిలా ఉండగా, రాహుల్ గాంధీ ట్వీట్‌పై బీజేపీ ఎంపీ సుశీల్‌కుమార్ సింగ్ స్పందించారు. నరేంద్ర మోదీకి దేశ ప్రజలు రెండుసార్లు అధికారం కట్టబెట్టడాన్ని రాహుల్ గాంధీ జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే మోదీపై అసూయ పెంచుకున్నారని విమర్శించారు. భారీ ప్రచార కార్యక్రమం.. పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించిన తీరుపై వామపక్షాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ కార్యక్రమం చక్రవర్తి పట్టాభిషేక మహోత్సవంలా ఉందని వ్యాఖ్యానించాయి. దేశ ప్రజలను భాగస్వాములుగా చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. ‘న్యూ ఇండియా’అనే ప్రకటనతో భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రతిపక్ష పార్టీలు ఎవరూ లేకుండానే పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన మోదీ ప్రభుత్వం దీనిని భారీ ప్రచార కార్యక్రమంగా మార్చుకుందని సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి ట్వీట్ చేశారు. ఒక వైపు సెంగోల్‌కు పూజలు చేసిన మోదీ ప్రభుత్వం మరోవైపు రెజ్లర్లపై లాఠీలను ఝళిపించిందని సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వమ్ ఆరోపించారు. మున్ముందు నిరంకుశ ఫాసిస్ట్ విధానాలు సాగుతాయనేందుకు ఈ ఘటనలే నిదర్శనమన్నారు. చక్రవర్తి పట్టాభిషేకం మాదిరిగా పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవం జరుగుతుండగానే మహిళా రెజ్లర్లు, మహిళా పంచాయత్‌కు వచ్చిన మహిళలపై పోలీసు జులుం సాగింది. ఇది ప్రజాస్వామ్యం, రాజ్యాంగ స్ఫూర్తిపై నిరంకుశ దాడి’అని సీపీఐ ఎంఎల్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య పేర్కొన్నారు. मैं भारत की आवाज़ के लिए लड़ रहा हूं। मैं हर कीमत चुकाने को तैयार हूं। — Rahul Gandhi (@RahulGandhi) March 24, 2023 తిరోగమనానికి నిదర్శనం: పవార్ పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ వివిధ మతసంబంధ పూజలు చేయడంపై ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశం వెనక్కి వెళుతోందనటానికి ఇవే నిదర్శమన్నారు. ‘మన సమాజంలో శాస్త్రీయ దృక్పథం పెంపొందాలని భారత ప్రథమ ప్రధాని నెహ్రూ ఆకాంక్షించారు. కొత్త పార్లమెంట్ భవన సముదాయం ప్రారంభం సందర్భంగా నిర్వహించిన మతాచారాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి’అని పవార్ పుణేలో మీడియాతో పేర్కొన్నారు. మన దేశం కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్తున్నట్లు భయం కలుగుతోందన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని కూడా ఆహ్వానించకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాలు రాష్ట్రపతి ప్రసంగంతోనే ప్రారంభమవుతున్నప్పుడు వారిని ఆహ్వానించకపోవడమేంటన్నారు. ‘పార్లమెంట్ నూతన భవనం ప్రారంభానికి నాకు ఆహ్వానం పంపిందీ లేనిదీ తెలియదు. ఒక వేళ ఢిల్లీలోని నా కార్యాలయానికి ఆహ్వానం వచ్చి ఉంటుందేమో తెలియదు’అని వ్యాఖ్యానించారు. శవపేటికలా పార్లమెంట్ భవనం: ఆర్జేడీ వివాదాస్పద ట్వీట్ బిహార్‌లోని అధికార పార్టీ రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ )పార్లమెంట్ నూతన భవనాన్ని శవపేటికతో పోల్చింది. పార్లమెంట్ కొత్త భవనం శవపేటిక మాదిరిగా త్రిభుజాకారంలో ఉందంటూ బిహార్ అధికార ఆర్జేడీ ఆదివారం ట్వీట్ చేసింది. దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఆర్జేడీని శవపేటికలోనే సమాధి చేస్తారంటూ వ్యాఖ్యానించింది. ‘ఆర్జేడీ అథమ స్థితికి దిగజారింది. త్రికోణానికి భారతీయ వ్యవస్థలో ఎంతో ప్రాధాన్యం ఉంది. శవపేటిక షట్కోణంగా గానీ బహుభుజిగా కానీ ఉంటుందని తెలుసుకోవాలి’అని పేర్కొంది. అయితే, ఆర్జేడీ తన వ్యాఖ్యలను సమర్థించుకుంది. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టింది. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని గానీ, రాజ్యసభాధ్యక్షుడైన ఉపరాష్ట్రపతిని గానీ పిలవలేదు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి జరగవు’అంటూ ఆ పార్టీ ట్వీట్ చేసింది. ఇదీ చదవండి:త్వరలో ఎంపీల సీట్లు పెరుగుతాయి: ప్రధాని మోదీ -
ఢిల్లీ లో రాహుల్ గాంధీ ని ఇల్లు ఖాళీచేయిస్తే
-
నూతన పార్లమెంట్ భవనాన్ని ఎవరు ప్రారంభించాలి...
-
రేపు మంచిర్యాలలో భారీ బహిరంగ సభకు సన్నాహకాలు
-
రాహుల్ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాహుల్ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. అదానీ ఇష్యూని డైవర్ట్ చేయడానికే రాహుల్‌పై అనర్హత వేటు వేశారు. అవసరమైతే ఎంపీలంతా మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని కోమటిరెడ్డి అన్నారు. రాహుల్‌పై అనర్హత వేటుకు నిరసనగా గాంధీభవన్‌లో ఆదివారం.. కాంగ్రెస్ నేతలు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ, ‘‘రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన పరిస్థితి కంటతడి పెట్టేలా ఉంది.. ప్రధాన మంత్రి అయ్యే అవకాశం వచ్చినా రాహుల్ వదులుకున్నారన్నారు. అదానీ గురించి రాహుల్ ఎప్పుడు మాట్లాడారో.. అప్పటి నుంచి కుట్ర చేశారు. ఆగమేఘాల మీద పరువు నష్టం కేసు లో శిక్ష పడేలా చేశారు’’ అని కోమటిరెడ్డి ఆరోపించారు. రాహుల్ పై అనర్హత వేటు ఎత్తేసే వరకు పోరాటం ఉధృతం చేయాలన్నారు. ఇందిరా గాంధీ పై వేటు వేస్తే ఏం జరిగిందో..ఇప్పుడు అదే జరుగుతుంది’’ ఎంపీ కోమటిరెడ్డి అన్నారు. చదవండి: కాంగ్రెస్‌లో చేరిన డి.శ్రీనివాస్ -
భారత వ్యతిరేకి రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ లండన్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత వ్యతిరేక టూల్కిట్లో రాహుల్ శాశ్వత భాగస్వామిగా మారాడని ధ్వజమెత్తారు. భారత్‌కు బద్ధవ్యతిరేకి అయిన జార్జి సోరోస్ భాషలోనే రాహుల్ మాట్లాడాడని మండిపడ్డాడు. మన దేశానికి వ్యతిరేకంగా విదేశీ శక్తులు పెద్ద కుట్ర పన్నుతున్నాయని, ఇందులో కాంగ్రెస్‌తోపాటు సోకాల్డ్ వామపక్ష ఉదారవాదులు కూడా భాగమేనని ఆరోపించారు. దేశాన్ని ద్వేషించే కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్ భాషను వాడుతున్నారని విమర్శించారు. ఈ మేరకు నడ్డా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని విదేశీ శక్తులను కోరిన రాహుల్ గాంధీ దేశ సార్వభౌమత్వంపై దాడి చేశారని, ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భారత్‌లో జోక్యం చేసుకోవాలంటూ అమెరికా, యూరప్ దేశాలను కోరడం కంటే సిగ్గుచేటు మరొకటి ఉండదన్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని రాహుల్ ఇంకా అర్థం చేసుకోలేదని, ప్రజలపై ఆయనకు విశ్వాసం లేదని విమర్శించారు. భారత్‌ను ఆర్థికంగా, వ్యూహాత్మకంగా దెబ్బకొట్టడాన్ని విదేశీ కుట్రదారులు పనిగా పెట్టుకున్నారని, రాహుల్ గాంధీ సైతం వారితో చేతులు కలిపాడని దుయ్యబట్టారు. విదేశీ గడ్డపై ఆయన చేసిన పనిని స్వతంత్ర భారతదేశంలో గతంలో ఏ నాయకుడూ చేయలేదని నడ్డా వెల్లడించారు. రాహుల్ ధోరణి దేశంలో ప్రతి ఒక్కరి మనసులను గాయపర్చిందని చెప్పారు. భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తులు దేశంలో బలహీన ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నాయని ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పుడల్లా దేశ వ్యతిరేక ముఠాలు చురుగ్గా మారుతున్నాయని, భారత్‌ను అప్రతిష్ట పాలు చేయడమే లక్ష్యంగా టూల్‌కిట్‌తో ముందుకొస్తున్నాయని జేపీ నడ్డా ఆక్షేపించారు. భారత్‌లో దృఢమైన ప్రజాస్వామ్యం, నిర్ణయాత్మక ప్రభుత్వం ఉన్నాయని, దుష్టశక్తుల ఆటలు సాగవని హెచ్చరించారు. రాహుల్ వ్యాఖ్యలు జాతివ్యతిరేకం కాదు : శశిథరూర్ తమ నేత రాహుల్ గాంధీ బ్రిటన్‌లో చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి జాతి వ్యతిరేకత లేదని ఆ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ అన్నారు. భారత ప్రజాస్వామ్యంలోకి విదేశీ శక్తుల్ని రాహుల్ ఎందుకు రానిస్తారని ప్రశ్నించారు. శుక్రవారం ఇండియా టుడే సదస్సులో శశిథరూర్ రాహుల్ వ్యాఖ్యలు పార్లమెంటు కార్యకలాపాలను స్తంభింపజేసేటంత ప్రధానమైనవా ఆలోచిస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు. దేశంలో ఎన్నో ప్రజా సమస్యల్ని గాలికొదిలేసిన బీజేపీ రాహుల్ నుంచి క్షమాపణ కోరుతూ రాజకీయం చేయడం విడ్డూరమన్నారు. -
ఫ్రూఫ్ అవసరం లేదు! దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై రాహుల్ వివరణ
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. అవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలని, వాటితో కాంగ్రెస్ పార్టీ విభేదిస్తుందని తేల్చి చెప్పారు. తాము దిగ్విజయ్ సింగ్ అభిప్రాయాల కంటే పార్టీ అభిప్రాయాలకే ప్రాధాన్యత ఇస్తామని కరాఖండీగా చెప్పారు. తాను ఈ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నానని చెప్పారు. అయినా సాయుధ దళాలు ఒక పనిని చాల అనుహ్యంగా చేయగలవు, వారి సామర్థ్యం గురించి కూడా తనకు తెలుసనని అన్నారు. దీనికి ఆర్మీ ఎలాంటి ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదంటూ దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కారణంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్‌పై విమర్శలు రావడంతో రాహుల్ ఈ విధంగా వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా, దిగ్విజయ్ సింగ్ మాటిమాటికి సర్జికల్ స్ట్రైక్ జరిగింది ఇంతమందిని చంపాం అంటూ కేంద్రం కబుర్లు చెబుతోందే గానీ వాటికి ఆధారాలు చూపించలేకపోయిందంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో బీజేపీ పెద్ద ఎత్తున కాంగ్రెస్‌పై విరుచుకుపడింది. రాహుల్ సూచన మేరకే దిగ్విజయ్ సింగ్ అలా విషపూరిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు చేసింది. ఆర్మీపై గట్టి విశ్వాసం ఉండాలని, అది రాజకీయాలకు అతీతమైనదంటూ తిట్టిపోసింది బీజేపి. అయినా పదేపదే సర్జికల్ స్ట్రైక్ గరించి పూఫ్ అడుగుతున్నారు, అసలు ఆర్మీపై మీకు నమ్మకమే లేదనేది స్పష్టమవుతోందని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా అన్నారు. అయినా కాంగ్రెస్‌కి ఇలా భాద్యతరహితమైన ప్రకటనలు ఇవ్వడం పరిపాటిగా మారిందంటూ మండిపడ్డారు. భారత సైన్యానికి వ్యతిరేకంగా మాట్లాడితే సహించేదే లేదని గట్టి వార్నింగ్ ఇచ్చారు. రాహుల్, దిగ్విజయ్‌లకు నరేంద్ర మోదీ పట్ల ఉన్న ద్వేషం కళ్లకు కట్టినట్లు అర్థమవుతోందని బాటియా దుయ్యబట్టారు. (చదవండి: వాటికి ప్రూఫ్ ఏంటి?: దిగ్విజయ్ సింగ్ షాకింగ్ వ్యాఖ్యలు) -
ఎంత బెదిరించినా లాభం లేదు.. మాస్క్ పెట్టుకోనైనా..
ఎంద బెదిరించినా లాభం లేదు.. మాస్క్ పెట్టుకోనైనా కశ్మీర్ దాకా పాదయాత్ర చేస్తారట ప్రతిపక్షనాయకుడు! -
సమానత్వానికి సరికొత్త మాధ్యమం
ప్రభుత్వ రంగంలో ప్రాంతీయ భాషా మాధ్యమాన్ని మార్పు చేయాలని తన భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ అనడం దేశవ్యాప్తంగా చర్చను రేకెత్తిస్తుంది. గ్రామస్థాయి వ్యవసాయ, చేతివృత్తుల సమాజాలకు చెందిన పిల్లలు తప్పనిసరై స్థానిక భాషల్లోనే చదువుకోవడం వల్ల అంతర్జాతీయ అవకాశాలకు దూరంగా ఉండిపోతున్నారు. సంపన్నులు మాత్రమే అన్ని అవకాశాలను పొందగలిగే తరహా కొత్త భారతీయ వర్గ వ్యవస్థను ఇంగ్లిష్ విద్య అనుమతించకూడదు. భావజాలపరమైన నేతలందరూ ఈ విషయంలో విద్యా కపటత్వంతో వ్యవహరించారు. పేద, ధనిక పిల్లలందరూ ఒకే భాషా (ఇంగ్లిష్) విద్యను కలిగి ఉండాలని స్పష్టమైన వైఖరిని తీసుకోకుంటే మానవ సమానత్వం అనే లక్ష్యాన్ని భారతదేశం సాధించలేదు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాజ స్థాన్లోని ఆల్వర్లో ర్యాలీని ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ ఇలా చెప్పారు. ‘‘పాఠశాలల్లో ఇంగ్లిష్ బోధనను బీజేపీ నేతలు కోరుకోరు. కానీ ఆ పార్టీ నేతలందరి పిల్లలూ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలకే వెళతారు. వాస్తవానికి పేద రైతులు, కూలీల పిల్లలు ఇంగ్లిష్ నేర్చుకోవాలనీ, పెద్ద కలలు కనాలనీ, వ్యవ సాయ పొలాల నుంచి బయటకు వెళ్లి జాతీయ వార్తల్లోకి వెళ్లాలనీ వారు కోరుకోవడం లేదు. ’’ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం ప్రారంభించిన తర్వాత తెలంగాణ కూడా ఆ నమూనాను అనుసరించింది. భారత్ జోడో యాత్రలో భాగంగా మొదట దక్షిణ భారతదేశం నుంచి నడక ప్రారంభించిన రాహుల్ గాంధీ తర్వాత ఉత్తర భారత దేశంలో యాత్ర కొనసాగిం చారు. ఆ తర్వాత రాజస్థాన్‌లో ఇటీవలే పై ప్రకటన చేశారు. ఢిల్లీ నుంచి, ఆర్ఎస్ఎస్–బీజేపీ విధానంగా హిందీని ముందుకు నెట్టాలని ప్రయత్నిస్తున్న నరేంద్రమోదీ, అమిత్ షాలకు వ్యతిరేకంగా ఒక జాతీయ నాయకుడు తొలిసారిగా స్థిరమైన వైఖరి తీసుకున్నారు. ఒకే దేశం, ఒకే భాష అనే ఆర్ఎస్ఎస్–బీజేపీ విధానంలో భాగంగానే వీరిద్దరూ పాఠశాల నుంచి విశ్వవిద్యాలయ విద్య దాకా ప్రభుత్వ రంగంలో హిందీ భాషను ముందుకు నెడుతున్నారు. అదే సమ యంలో ప్రపంచ స్థాయి ఇంగ్లిష్ మీడియం విద్యను ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలకు వదిలేస్తున్నారు. గ్రామస్థాయి వ్యవ సాయ, చేతివృత్తుల సమాజాలకు చెందిన పిల్లలు తప్పనిసరిగా స్థానిక భాషల్లోనే చదువుకోవడం వల్ల అంతర్జాతీయ అవకాశాలకు దూరంగా ఉండిపోతున్నారు. పేద వ్యవసాయ కార్మికులు, కూలీల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవాలని రాహుల్ గాంధీ ఆ ర్యాలీలో చెప్పారు. రాజస్థాన్ ప్రభుత్వం కూడా మరిన్ని ఇంగ్లిష్ మీడియం స్కూళ్లను తెరవాలనీ, అప్పుడే పేద పిల్లలు పెద్ద కలలు కనగలరనీ అన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు దేశవ్యాప్తంగా సమాన భాష, నాణ్యమైన స్కూల్ విద్యపై జాతీయ చర్చను రేకెత్తి స్తుంది. బీజేపీ, కమ్యూనిస్టు నాయకులను ఇది వణికిస్తుంది. ఆర్ఎస్ఎస్–బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు అందరికీ సమాన మాధ్యమ విద్యను ఎన్నటికీ అమలుచేయవు. ఇక కమ్యూనిస్టులు పశ్చిమ బెంగాల్లో దాన్ని అమలు చేయలేదు. ఇప్పుడు కేరళలో కూడా అమలు చేయడం లేదు. ఆర్ఎస్ఎస్–బీజేపీలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, మెడిసిన్, ఇంజినీ రింగ్ సహా ఉన్నత విద్యాసంస్థలను హిందీ మాధ్యమంలోకి మార్చేస్తు న్నాయి. అంటే పేదలకు స్పష్టమైన హిందీ దిశని ఇది చూపిస్తుంది. నెహ్రూ హయాం నుండి అమలవుతూ వస్తున్న – ప్రైవేట్ రంగంలో ఇంగ్లిష్ మీడియం, ప్రభుత్వ రంగంలో ప్రాంతీయ భాషా మాధ్యమాన్ని మార్పు చేయాలని రాహుల్ గాంధీ ఇప్పుడు కోరు కుంటున్నారు. బ్రిటిష్ వారి నుంచి అప్పుడే స్వాతంత్య్రం సాధిం చడం, మత ఘర్షణల వాతావరణంలో ఇంగ్లిష్ వర్సెస్ హిందీని జాతీయ భాషా విధానంగా చేపట్టిన కాలంలో నెహ్రూ తొలి ప్రధానిగా గందరగోళంలో ఉండేవారు. కానీ అంబేడ్కర్ ఆ కాలంలోనే ఇంగ్లిష్ మాధ్యమ విద్యను కోరుకున్నారు. అయితే ఆయన ప్రవేశపెట్టిన తీర్మానం రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ వల్ల ఒక్క ఓటు తేడాతో ఓడిపోయింది. కానీ అదే సమయంలో ప్రైవేట్ రంగంలో ఇంగ్లిష్ మీడియంను అలాగే ఉంచేశారు. అదే విధానాన్ని ఆర్ఎస్ఎస్–బీజేపీ నేతలు, కమ్యూనిస్టు నేతలు పాటించారు. భావజాలపరమైన నేతలం దరూ భాషకు సంబంధించిన ఈ విద్యా కపటత్వంతో ఉత్పాదక వర్గాల పిల్లలను పేలవమైన ప్రాంతీయ భాషా విద్యతో కూడిన ఆధునిక బానిసత్వ పరిస్థితుల్లో ఉంచేశారు. 2019లో ఏపీలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టడం ద్వారా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా ఆ విద్యాపరమైన కపటత్వంపై దాడి చేశారు. ఆర్ఎస్ఎస్, బీజేపీల హిందీ విధానాన్ని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యకు సంబంధించి స్పష్ట మైన వైఖరిని తీసుకున్నారు. కాబట్టే పార్టీ మేనిఫెస్టోలోనూ, 2024లో జరగబోయే జాతీయ ఎన్నికల ప్రచార కార్యక్రమంలోనూ నూతన విద్యా విధానాన్ని చొప్పించడానికి సంబంధించిన విధివిధానాలపై కృషి చేయవలసిందిగా జాతీయ నాయకత్వం అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ యూనిట్లను ఆదేశించింది. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు ప్రభుత్వ రంగ విద్యా విధానంలో, ప్రస్తుత హిందీ మీడియంలో చదువుతున్న శూద్ర, దళిత, ఆదివాసీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లో అఖిలేశ్ యాదవ్, బిహార్‌లో నితీశ్ కుమార్, తేజస్విని యాదవ్, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నేతలు, ఇంకా ప్రాంతీయ పార్టీల నేతలు... ప్రత్యేకించి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంకు సంబంధించి తమదైన విద్యా విధానంతో ముందుకు రావలసి ఉంది. ఈ ప్రాంతీయ పార్టీలు చాలావరకు తమ కుటుంబాల్లోని పిల్లలను ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో చేరుస్తూనే, మరోవైపు హిందీ భాషా దురహంకారంలో కూరుకుపోయి ఉంటున్నాయి. నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం స్కూల్, కాలేజీ విద్యపై ఈ ప్రాంతీయ పార్టీలు రాష్ట్ర బడ్జెట్లో హేతుపూర్వకమైన మొత్తంలో కూడా ఖర్చుపెట్టడం లేదు. రాజకీయ పార్టీలతోపాటు దేశంలో అనేక ప్రభుత్వేతర, పార్టీయే తర సంస్థలు ఉంటున్నాయి. ఇలాంటి సంస్థల్లోని కీలక సభ్యులందరూ తమ పిల్లలను ప్రైవేట్ మీడియం పాఠశాలల్లో చదివిస్తుంటారు. కానీ ప్రాంతీయ భాషా ప్రభుత్వ పాఠశాలల గురించి మౌనం పాటిస్తుం టారు. పేద, ధనిక పిల్లలందరూ ఒకే భాషా (ఇంగ్లిష్) విద్యనూ, రెండో భాషగా తమ మాతృభాషనూ పొందే హక్కును కలిగి ఉండా లని రాజకీయ పార్టీలు, పౌర సమాజంలోని కీలక శక్తులు ఒక స్పష్ట మైన వైఖరిని తీసుకోకుంటే మానవ సమానత్వం అనే లక్ష్యాన్ని భారతదేశం సాధించలేదు. ప్రపంచంతో మాట్లాడగల హక్కు, ప్రపంచం అందించే ప్రతి అవ కాశాన్ని పొందే హక్కు... దేశంలోని ఏ కుటుంబంలో లేదా కులంలో పుట్టినా సరే... పిల్లలందరికీ హక్కుగా ఉండాలి. సంపన్నులు అన్ని అవకాశాలు పొందుతూ, అన్ని విజ్ఞాన నిర్మాణాలను పొందగలిగే తరహా కొత్త భారతీయ వర్గ వ్యవస్థను ఇంగ్లిష్ విద్య అనుమతించ కూడదు. వర్గ వ్యవస్థను రద్దు చేయడానికి ప్రజలను సమీకరించే కమ్యూనిస్టు నేతలు ఇన్ని సంవత్సరాలుగా విద్యా సమానత్వం విష యంలో కపటధారుల్లాగా కొనసాగటానికి బదులుగా ఈ అంశాన్ని చేపట్టాల్సి ఉంటుంది. ఆర్ఎస్ఎస్–బీజేపీ నేతలు ఈ సమస్య విషయంలో రాహుల్ గాంధీని ఏమాత్రం ఎదుర్కోలేరు. ఎందుకంటే వీరందరూ తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియం ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీ ల్లోనే చేర్పించారని ఆయన స్పష్టంగా చెప్పారు. గడ్డం తీసుకోకుండా, పొడవాటి గడ్డంతో కనిపిస్తున్న రాహుల్ గాంధీ ఒక మునిలాగా కాకుండా విద్యలో సమానత్వాన్ని వ్యాపింపజేయడానికి సిద్ధమవు తున్న పేద రైతులా కనిపిస్తున్నారు. ఆధునిక ప్రజాస్వామ్య దేశంలో ప్రేమను, శాంతిని, సమైక్య జీవితాన్ని పంచిపెట్టాలంటే ఆత్మన్యూ నతా భావం, ఆత్మాధిక్యతా భావం లేకుండా ప్రతి ఒక్కరూ మాట్లాడు కునే భాషను కలిగి ఉండటం మొట్టమొదటి అవసరంగా ఉంటుంది. రాహుల్ సాగిస్తున్న భారత్ జోడో యాత్ర– భవిష్యత్తులో పిల్లలం దరికీ అందుబాటులో ఉండే జాతీయ భాషగా ఇంగ్లిష్‌ను స్వీకరించేలా ప్రతి ఒక్కరినీ కలుపుతుందని ఆశిద్దాం! ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
భారత్ జోడో యాత్ర @ 100 రోజులు: మోదీ మౌనం వెనక ఉద్దేశమేంటి?
జైపూర్: భారత్ దక్షిణ కొన నుంచి ఒక్క అడుగుతో మొదలైన కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర వడివడిగా ముందుకు సాగుతూ శుక్రవారం 100 రోజులు పూర్తిచేసుకోనుంది. కన్యాకుమారినుంచి కశ్మీర్‌దాకా సాగే 3,500 కిలోమీటర్ల పొడవునా సాగే ఈ యాత్రలో రాహుల్‌కు మద్దతుగా అన్ని వర్గాల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. అయితే ఈ ప్రజాదరణ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓటుబ్యాంక్‌ను పెంచుతుందో లేదోనని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ తరుణంలో ఇటీవల ముగిసిన గుజరాత్, హిమాచల్ శాసనసభ ఎన్నికలు పార్టీకి మిశ్రమ ఫలితాలను ఇచ్చాయి. అయితే, యాత్ర ఫలితం వచ్చే ఏడాది కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలిసే అవకాశముంది. దీర్ఘకాలంలో చూస్తే యాత్ర.. పార్టీకి పూర్వవైభవాన్ని తెస్తుందని ఒకప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత సంజయ్ ఝా విశ్లేషించారు. ‘ ప్రజలతో మమేకమవుతూ కాంగ్రెస్ మరోసారి క్షేత్రస్థాయిలో బలపడుతోంది. తన ఇమేజ్‌పై బీజేపీ కురిపిస్తున్న నకిలీ, తప్పుడు కథనాలను పటాపంచలు చేస్తూ కొత్త రాజకీయ బ్రాండ్‌గా రాహుల్‌గాంధీ ఎదుగుతున్నారు’ అని ఆయన అన్నారు. కాగా, యాత్రలో రాహుల్ ఆహార్యం, విమర్శలపై కాంగ్రెస్, బీజేపీ వాగ్భాణాలు సంధించుకున్నాయి. నెరిసిన గడ్డంతో ఇరాన్ నియంత సద్దాం హుస్సేన్‌లా ఉన్నాడంటూ రాహుల్‌పై బీజేపీ నేత, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించడం, వివాదాస్పద క్రైస్తవ బోధకుడితో రాహుల్ భేటీ, పాదయాత్రకు కోట్లాది మంది ప్రజానీకం మద్దతు వంటి భిన్న అంశాలతో పాదయాత్ర ముందుకుసాగుతోంది. మోదీ మౌనం వెనక ఉద్దేశమేంటి? దౌసా: చైనా సైనికుల చొరబాటు యత్నంపై చర్చించకుండా మోదీ సర్కార్ తప్పించుకుంటోందని కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగం చీఫ్ పవన్ ఖేరా ఆరోపించారు. రాజస్తాన్‌లో భారత్ జోడో యాత్రలో పాల్గొన్న సందర్భంగా దౌసాలో మీడియాతో మాట్లాడారు. ‘చైనా అంశంలో ప్రధాని మోదీ మౌనం వెనుక ఉద్దేశమేంటి? ఒకవేళ మాట్లాడాల్సి వస్తే చైనాకు క్లీన్చిట్ ఇస్తారు. మోదీ గుజరాత్‌కు సీఎంగా ఉన్న కాలంలో అక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో చైనా మాండరీన్ భాషను ప్రవేశపెట్టాలనుకున్నారు. భారత సార్వభౌమత్వానికి భంగం కలిగేలా జమ్మూకశ్మీర్ సరిహద్దు జిల్లాల్లో స్మార్ట్‌మీటర్లు బిగించే బాధ్యత మోదీ ఒక చైనా కంపెనీకి కట్టబెట్టారు. గుజరాత్లో స్థానిక సంస్థలను కాదని చైనా కంపెనీలకు భూమి కేటాయించారు. పీఎం కేర్స్ ఫండ్‌కు చైనా కంపెనీలు విరాళాలు పంపాయి. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిందే ’ అని అన్నారు. -
భారత్ జోడో యాత్రలో రాహుల్ రన్నింగ్
-
తెలంగాణలోకి ప్రవేశించిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర
-
ఖతం.. టాటా.. వీడ్కోలు..!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి పునఃర్వైభవం తీసుకొచ్చేందుకు భారత్ జోడో యాత్ర పేరిట దేశవ్యాప్త పాదయాత్ర చేపడుతున్నారు రాహుల్ గాంధీ. యాత్ర మొదలైనప్పుటి నుంచి రాహుల్‌పై విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ.. తాజాగా ఓ యానిమేటెడ్ ఫన్నీ వీడియోను విడుదల చేసింది. అందుకు కాంగ్రెస్ సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. భారత్ జోడో యాత్ర లక్ష్యంగా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతల వీడియోను అధికార బీజేపీ విడుదల చేసింది. దానికి కౌంటర్‌గా ఎన్నికల హామీలను నెరవేర్చటంలో ప్రధాని మోదీ విఫలమైనట్లు సూచిస్తూ కాంగ్రెస్ మరో వీడియోను షేర్ చేసింది. బీజేపీ అధికారిక ట్విటర్ ఖాతాలో విడుదల చేసిన వీడియోలో.. కాంగ్రెస్‌లో కొద్ది రోజులుగా నేతలు పార్టీకి రాజీనామాలు చేస్తున్న తీరును వివరించింది. ముఖ్యంగా జమ్ముకశ్మీర్‌లో నేతల రాజీనామాలు, రాజస్థాన్‌లో ఎమ్మెల్యేల తిరుగుబాటును సూచిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. సుమారు 2 నిమిషాలు ఉన్న ఈ వీడియోలో.. సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీని ఓదార్చుతున్నట్లు చూపించారు. ఈ సందర్భంగా.. ‘ అమ్మా చెడ్డ రోజులు ఎందుకు అంతం కావు? ఇది ముగిసింది, టాటా.. వీడ్కోలు..’ అంటూ సోనియాను రాహుల్ అడిగినట్లు పేర్కొంది. मम्मी ये दुःख खतम काहे नहीं होता है? खतम…टाटा…गुडबाय! pic.twitter.com/J4tFqQgPOQ — BJP (@BJP4India) October 16, 2022 కాంగ్రెస్ కౌంటర్ వీడియో.. బీజేపీ వీడియో విడుదల చేసిన కొన్ని గంటల్లోనే కాంగ్రెస్ కౌంటర్ అటాక్ చేసింది. ప్రజలు గ్యాస్ సిలిండర్, పెట్రోల్ ధరల పెరుగుదల, నిరుద్యోగిత వంటి వాటిపై ప్రశ్నిస్తుంటే ప్రధాని మోదీ అక్కడి నుంచి దూరంగా పరిగెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు అందులో చూపించింది కాంగ్రెస్. దుష్మాన్ సినిమాలోని ‘వాదా తేరా వాదా’ పాట వస్తుండగా మోదీ పరుగులు పెట్టినట్లు పేర్కొంది. दौड़ा दौड़ा भागा भागा सा.. pic.twitter.com/xYXLY5dWdf — Congress (@INCIndia) October 16, 2022 ఇదీ చదవండి: Himachal Pradesh Election 2022: మంచుకొండల్లో ఎన్నికల వేడి -
Bharat Jodo Yatra: కన్నడ భాషపై దాడి చేస్తే ప్రతిఘటిస్తాం
సాక్షి, బళ్లారి/చిత్రదుర్గ: కర్ణాటక ప్రజలపై, కన్నడ భాషపై దాడి చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని బీజేపీ, ఆర్ఎస్ఎస్ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా ఆయన గురువారం కర్నాటకలోని మొళకాల్మూరులో పాదయాత్ర నిర్వహించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్రల్లో భాగంగానే కన్నడ భాషపై దాడి జరుగుతోందని మండిపడ్డారు. కన్నడ ప్రజల, భాష జోలికి రావొద్దన్నారు. అవి ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు సూచించారు. రాహుల్ యాత్ర శుక్రవారం ఉదయం బళ్లారి జిల్లాలోకి ప్రవేశించనుంది. -
.. పార్టీని కొత్తగా మార్చలేకపోయినా కనీసం ఆయన మారుతుండంటే హ్యాపీనే సార్!!
.. పార్టీని కొత్తగా మార్చలేకపోయినా కనీసం ఆయన మారుతుండంటే హ్యాపీనే సార్!! -
Bharat Jodo Yatra: ఖర్గే, థరూర్ ప్రజాదరణ ఉన్న నాయకులు
తురువెకెరే: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న మల్లికార్జున ఖర్గే, శశి థరూర్.. ఇద్దరూ ప్రజల్లో మంచి ఆదరణ, హోదా ఉన్న నాయకులేనని పార్టీ నేత రాహుల్ గాంధీ చెప్పారు. అధ్యక్షుడిగా ఎన్నికైన వారిని గాంధీ కుటుంబం రిమోట్ కంట్రోల్‌తో ఆడించడం ఖాయమంటూ విమర్శలు చేయడం దారుణమని, అది వారిని అవమానించడమే అవుతుందని అన్నారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీతో పాలనతో దేశ ప్రజలు విసుగెత్తిపోయారని పేర్కొన్నారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, ఆర్థిక అసమానతలు జనాన్ని కుంగదీస్తున్నాయని వాపోయారు. అందుకే భారత్ జోడో యాత్రలో లక్షలాది మంది పాల్గొంటున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడు గాంధీ కుటుంబం చెప్పినట్టల్లా ఆడాల్సిందేనంటూ కొందరు చేస్తున్న విమర్శలను రాహుల్ తిప్పికొట్టారు. పార్టీ అధ్యక్ష ఎన్నికలో మీరు ఎందుకు పోటీ చేయడం లేదని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. అందుకు గల కారణాలను 2019లోనే తన రాజీనామా లేఖలో తెలియజేశానని అన్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజలతో మమేకం కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు వివరించారు. ఈ విధానం మన దేశ చరిత్ర, సంస్కృతిని వక్రీకరించేలా ఉందన్నారు. విద్యను కేంద్రీకృతం చేయడం కాదు, వికేంద్రీకరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మన దేశ చరిత్ర, సంప్రదాయాలు, భాషలను ప్రతిబింబించే విద్యా విధానం కావాలన్నారు. దేశంలో విద్వేషాలు, హింసను రెచ్చగొట్టేవారిపై పోరాటం సాగిస్తున్నామని తెలిపారు. అధికారం కోసం కాదు తుమకూరు: భారత్ జోడో పాదయాత్ర 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం కోసం కాదని రాహుల్ చెప్పారు. మతం పేరుతో దేశాన్ని చీల్చడానికి బీజేపీ సాగిస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టడానికి, ఆ పార్టీ అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికే యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏనాడూ ఒక కులం, ఒక మతం కోసం పని చేయలేదని, దేశంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిందని రాహుల్ చెప్పారు. తనను పనికిరానివాడు అని చిత్రీకరించడానికి బీజేపీ నాయకులు రూ.కోట్లు ఖర్చు చేసి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కానీ, తానేంటో ప్రజలకు తెలుసని అన్నారు. శనివారం రాహుల్ దాదాపు 25 కిలోమీటర్ల దూరం నడిచారు. పెద్దసంఖ్యలో జనం పాల్గొన్నారు. -
తల్లి షూ లేస్ కట్టిన రాహుల్ గాంధీ
-
కాంగ్రెస్ ‘సామాజిక అస్త్రం’.. రాజ్యాంగ పరిరక్షణ కవాతు ప్రణాళిక
సాక్షి, హైదరాబాద్: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు అదనంగా రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షణ కవాతు (సంవిధాన్ బచావో మార్చ్) నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలను తమవైపు తిప్పుకోవడమే లక్ష్యంగా 2 వారాలపాటు కవాతు నిర్వహించనుంది. దీనిపై చర్చించేందుకు వచ్చే నెల 4న కాంగ్రెస్ ముఖ్య నాయకులు దిగ్విజయ్‌సింగ్, జైరాం రమేశ్ హైదరాబాద్ రానున్నారు. నవంబర్ 3వ వారం తర్వాత.. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర అక్టోబర్ నెలాఖరులో రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 24న నారాయణపేట జిల్లా నుంచి తెలంగాణ లోకి రావాల్సిన యాత్ర 3–4 రోజులు ఆల స్యం కావొచ్చని గాంధీ భవన్ వర్గాలు చెబు తున్నాయి. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1లోగా ఏదో ఒకరోజు తెలంగాణలోకి యాత్ర వస్తుందని తెలుస్తోంది. రాష్ట్రంలో ఈ యాత్ర కనీసం 13 రోజులపాటు జరగ నుంది. అంటే నవంబర్ మూడో వారం వరకు రాహుల్ యాత్ర రాష్ట్రంలో జరగనుండగా ఆ తర్వాత 75 కి.మీ. రాజ్యాంగ పరి రక్షణ కవాతు ప్రారంభించాలని టీపీసీసీ నేతలు యోచిస్తున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో నూ ఇలాంటి యాత్రలు చేపడుతున్నారని, అయితే తెలంగాణలో మాత్రం ఇతర రాష్ట్రా లకు భిన్నంగా కవాతు నిర్వహించాలనేది రాష్ట్ర కాంగ్రెస్ నేతల ఆలోచనగా కనిపిస్తోంది. ఇందుకోసం టీపీసీసీకి అనుబంధంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్, వృత్తి దారులు, కిసాన్, ఫిషర్మెన్ సెల్‌లను భాగ స్వాములను చేస్తూ యాత్ర నిర్వహిస్తామని టీపీసీసీ నేతలు చెబుతున్నారు. అన్యాయాన్ని వివరించడమే లక్ష్యంగా.. కాంగ్రెస్ హయాంలో ఆయా వర్గాలకు ఇచ్చి న ప్రాధాన్యం గురించి చెప్పడంతోపాటు బీజేపీ, టీఆర్ఎస్ల హయాంలో ఆయా వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని వివ రించడమే లక్ష్యంగా యాత్ర సాగుతుందని, భారత్ జోడో యాత్రకు ఎంత ప్రాధాన్య మి చ్చామో సామాజిక కవాతుకూ అంతే ప్రాధా న్యమిస్తామని టీపీసీసీ ముఖ్యనేత ఒకరు వెల్లడించారు. కవాతు ఏర్పాట్లపై చర్చించేందుకు పార్టీ ముఖ్య నాయకులు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేశ్ వచ్చే నెల 4న హైదరా బాద్‌కు రానున్నారు. ఈ సమావేశానికి హాజ రుకావాలంటూ పార్టీ అనుబంధ విభాగాల చైర్మన్లకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సెల్‌లకు ఏఐసీసీ సమన్వయకర్త కొప్పుల రాజు లేఖలు కూడా రాశారు. ఈ సమావేశంలోనే కవాతు ఎక్కడ ప్రారంభించి, ఎక్కడ ముగించాలి, ముగింపు సందర్భంగా నిర్వ హించే బహిరంగ సభకు ఎవరిని ఆహ్వానించాలన్న దానిపై స్పష్టత రానుంది. -
ప్రధాని మోదీకి షాక్.. బీజేపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు
బీజేపీలో అసంతృప్తి నెలకొందా?. సీనియర్ నేతలు బీజేపీ అధిష్టానం వైఖరిని తప్పుబడుతున్నారా? ఇటీవలి కాలంలో వారు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. బీజేపీ నిర్ణయాలపై ఎప్పుడూ బాణం ఎక్కుపెట్టే వరుణ్ గాంధీ సరసన మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కూడా చేరిపోయినట్టు తెలుస్తోంది. ఉప రాష్ట్రపతి పదవి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అయితే, గవర్నర్ సత్యపాల్ మాలిక్ మీడియాతో మాట్లాడుతూ.. నేను జమ్మూ కశ్మీర్‌కు గవర్నర్‌గా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకపోయి ఉంటే ఉప రాష్ట్రపతిని అయ్యేవాడినని అన్నారు. ఉప రాష్ట్రపతి పదవి నాకే ఇస్తున్నారనే సూచనలు అంతకు ముందే నాకు తెలిశాయి అని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే తనకు నచ్చిన విషయంపై మాట్లాడకుండా ఉండలేనని చెప్పారు. కాగా, సత్యపాల్ మాలిక్ జమ్మూ కశ్మీర్ గవర్నర్‌గా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించారు. దీంతో బీజేపీ అధిష్టానం మాలిక్‌పై ఫోకస్ పెట్టింది. అనంతరం, మాలిక్‌ను మేఘాలయ గవర్నర్‌గా బదిలీ చేసింది. ఇక, తాజాగా కూడా సత్యపాల్ మాలిక్ కేంద్రంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశంలో జరుగుతున్న ఈడీ రైడ్లపై స్పందించారు. ఈడీ రైడ్లు ఎక్కువగా ప్రతిపక్ష నేతలపైనే జరుగుతున్నాయి. నిజానికి బీజేపీ నేతలపైనా ఈ దాడులు జరగాలి. ఎందుకంటే.. ఈడీ రైడ్లు జరపాల్సిన స్థితిలో బీజేపీ నేతలు కూడా ఉన్నారని బాంబు పేల్చారు. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భారత్ జోడో యాత్రను సత్యపాల్ మాలిక్ ప్రశంసించారు. ఈ సమయంలోనే యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించారు. రాహుల్ గాంధీ తన పార్టీ కోసం మంచి పని చేస్తున్నాడని పేర్కొన్నారు. అలాగే.. రైతుల సమస్యలపై కూడా మాలిక్ స్పందించారు. రైతులకే తన మద్దతు ప్రకటిస్తున్నట్టు స్పష్టం చేశారు. కనీస మద్దతు ధరను కేంద్రం అమలు చేయకపోతే.. తానే రైతులకు మద్దతుగా ఆందోళనలు చేపడతానని వ్యాఖ్యలు చేశారు. 'Will be made VP if...': Satya Pal Malik says people hinted at elevation; lauds Rahul Gandhi over Bharat Jodo Yatra. Too obvious, people are not foolish. https://t.co/6KitK8gDkW— Happy Musings (@sanjivesethi1) September 11, 2022 -
మోదీ సూట్ Vs రాహుల్ టీ షర్ట్.. పీక్స్‌కు సోషల్ మీడియా వార్!
దేశంలో పొలిటికల్‌గా మునుపటి పూర్వవైభవం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే భారత్ జోడో యాత్రను ప్రారంభించింది. ఈ యాత్రలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. కాగా, యాత్ర సందర్భంగా రాహుల్ ధరించిన టీ షర్టును బీజేపీ ఫోకస్ చేసిన దాని ధర ప్రస్తావించింది. దీంతో, కాంగ్రెస్.. ప్రధాని మోదీ ధరించే సూట్‌ను టార్గెట్ చేసి ధరను చెప్పడం పొలిటికల్‌గా హాట్ టాపిక్‌గా మారింది. అయితే, కాంగ్రెస్ తలపెట్టిన భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ ధరించిన టీ షర్ట్ ధర విషయంలో బీజేపీ-కాంగ్రెస్ మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల వార్ నడుస్తోంది. పాదయాత్రలో రాహుల్ గాంధీ తెలుపు రంగు టీ షర్ట్ ధరించారు. కాగా, ఆ టీ షర్ట్ బర్బెర్రీ బ్రాండ్‌కు చెందినది అని.. టీ షర్ట్ ధర రూ.41,000 అంటూ బీజేపీ ట్విట్టర్ వేదికగా పేర్కొంది. ఈ సందర్భంగా రాహుల్ ఫొటోకు ‘భారత్ దేఖో’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో, బీజేపీకి కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ ధరించిన సూటు ధరను తెర మీదకు తీసుకువచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా.. భారత్ జోడో యాత్ర సందర్భంగా వస్తున్న ప్రజా స్పందనను చూసి బీజేపీ నేతలు భయపడుతున్నారా? అంటూ కౌంటర్ ఇచ్చింది. డ్రెస్సుల గురించి కాదు.. దేశంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడండి. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం గురించి మాట్లాడండి అంటూ వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలోనే మనం బట్టల గురించే మాట్లాడుకోవాల్సి వస్తే ప్రధాని మోదీ సూట్ల గురించి మాట్లాడాలి. మోదీ ధరించిన రూ.10 లక్షల సూటు, రూ.1.5 లక్షల కళ్లద్దాల గురించి కూడా మాట్లాడుకుందామా అంటూ రివర్స్ దాడికి దిగింది. దీంతో, అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ వార్ నడుస్తోంది. -
తండ్రి స్మారకం వద్ద రాహుల్ గాంధీ నివాళులు
-
మోదీజీ.. సిగ్గనిపించడం లేదా?: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: అత్యాచార ఘటనల్లో దోషులకు అధికార బీజేపీ అండగా నిలుస్తోందని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. మహిళల పట్ల బీజేపీ వైఖరి ఏమిటో సులభంగా అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఇలాంటి రాజకీయాలు చూస్తే మీకు సిగ్గనిపించడం లేదా? అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సూటిగా ప్రశ్నించారు. ఉన్నావో, హథ్రాస్, కథువా తదితర సంఘటనల్లో నేరస్తులకు బీజేపీ మద్దతు ఇచ్చిందని గుర్తుచేశారు. గుజరాత్లో బిల్కిస్ బానోపై అత్యాచారానికి పాల్పడినవారిని జైలు నుంచి విడుదల చేశారని ఆక్షేపించారు రాహుల్ గాంధీ. ఈ మేరకు గురువారం ట్వీట్ చేశారు. బిల్కిస్ బానోపై గ్యాంగ్‌రేప్ కేసులో దోషులైన 11 మందిని జైలు నుంచి విడుదల చేయడాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం సైతం తప్పుపట్టారు. उन्नाव- भाजपा MLA को बचाने का काम कठुआ- बलात्कारियों के समर्थन में रैली हाथरस- बलात्कारियों के पक्ष में सरकार गुजरात- बलात्कारियों की रिहाई और सम्मान! अपराधियों का समर्थन महिलाओं के प्रति भाजपा की ओछी मानसिकता को दर्शाता है। ऐसी राजनीति पर शर्मिंदगी नहीं होती, प्रधानमंत्री जी? — Rahul Gandhi (@RahulGandhi) August 18, 2022 ఇదీ చదవండి: నమ్మకం పోయింది.. జీవితాంతం భయంతో మనశ్శాంతి లేకుండా బతకాల్సిందేనా?: దోషుల విడుదలపై బిల్కిస్ ఆవేదన -
హస్తినలో హైటెన్షన్.. పోలీసుల అదుపులో ప్రియాంక, రాహుల్
సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన ప్రదర్శనలకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని నివాస ముట్టడితో పాటు పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ వైపు ర్యాలీగా వెళ్లాలని కాంగ్రెస్ నేతలు భావించారు. ఈలోపు నిరసనలకు దిగిన రాహుల్, ప్రియాంకతో పాటు పలువురు ముఖ్యనేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనల్లో భాగంగా పార్లమెంటు నుంచి విజయ్ చౌక్ రోడ్డులో రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీగా వెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులు భావించాయి. అయితే పారామిలిటరీ, పోలీసు బలగాలు ఆ మార్గాన్ని బ్లాక్ చేశాయి. ఎవరూ ముందుకు వెళ్లకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశాయి. ఈ క్రమంలోనే రాష్ట్రపతి భవన్ మార్గంలో వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. నిరసనల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడించాలని కాంగ్రెస్ భావించింది. तानाशाह कहां तुम रोक पाओगे- जनता की आवाज उठाने से, जनता के लिए तानाशाही हुकूमत से भिड़ जाने से। ये नारीशक्ति है। तानाशाही हुकूमत की चूलों को भी हिला सकती है।।#महंगाई_पर_हल्ला_बोल pic.twitter.com/OTOcGNthjj — Congress (@INCIndia) August 5, 2022 నిరసనలకు ముందు ఢిల్లీ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు రాహుల్ గాంధీ. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు. దేశంలో ప్రస్తుత నియంత పాలన నడుస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యం కనుమరుగైందని, ఆర్ఎస్ఎస్ దేశాన్ని నియంత్రిస్తోందని ఆరోపించారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం సహా ఇతర అంశాలపై కేంద్రానికి వ్యతిరేకంగా శుక్రవారం దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది కాంగ్రెస్. అన్ని రాష్ట్రాల్లోని నాయకులు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వంటి నేతలు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. చదవండి: అదంతా ఓ జ్ఞాపకం.. ఆ నలుగురి నియంతృత్వంలో దేశం: రాహుల్ ఫైర్ -
సోనియా నోటి వెంట రాహుల్ సమాధానాలు!
సాక్షి,న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని మూడు రోజులు విచారించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అయితే అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆమె రాహుల్ గాంధీ చెప్పిన సమాధానాలనే చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. విచారణలో భాగంగా మొదటి రెండు రోజులు సోనియాను అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్(ఏజేఎల్), యంగ్ ఇండియా లావాదేవీలకు సంబంధించిన ప్రశ్నలనే అధికారులు అడిగినట్లు తెలుస్తోంది. అయితే ఆ లావాదేవీలన్నింటినీ కాంగ్రెస్ దివంగత నేత మోతీలాల్ వోరానే చూసుకున్నట్లు సోనియా బదులిచ్చారని సమాచారం. కాంగ్రెస్ పార్టీకి అత్యధిక కాలం కోశాధికారిగా పనిచేసిన మోతీలాల్ వోరా 2020లో కన్నుముశారు. అంతకుమందు రాహుల్ గాంధీ కూడా ఈడీ విచారణలో ఇదే సమాధానం చెప్పినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, పవన్ కుమార్ బన్సాల్ కూడా ఈడీ విచారణలో ఇదే సమాధానం చెప్పారని తెలిపాయి. అలాగే యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించి ఈడీ అధికారులు గతంలో రాహుల్‌ను ప్రశ్నించగా.. అధి లాభాపేక్ష లేని సంస్థ అని దాని నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఆయన సమాధానం చెప్పినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు సోనియా గాంధీ నోటి వెంట కూడా ఇవే సమాధానాలు వచ్చినట్లు పేర్కొన్నాయి. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో రాహుల్ గాంధీని జూన్‌లో 50 గంటలపాటు ప్రశ్నించారు ఈడీ అధికారులు. ఇప్పుడు సోనియా గాంధీని మూడు రోజుల పాటు 10 గంటలకుపైగా విచారించారు. ఈమె కూడా జూన్‌లోనే విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికి కరోనా కారణంగా అధికారులను సమయం కోరడంతో వారు అంగీకరించారు. చదవండి: శివసేన నుంచి మరో సీఎం వస్తారు.. బీజేపీ మాట తప్పడం వల్లే ఎంవీఏ పుట్టింది -
గాంధీల గొప్పేంటి ?
-
నేడు ఈడీ విచారణకు సోనియా గాంధీ
-
'మహా' కాంగ్రెస్‌పై రాహుల్ అసంతృప్తి! అసలేం జరుగుతోంది?
ముంబై: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మహారాష్ట్రలో పార్టీ పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు ఓ పరిశీలకుడిని నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే సోనియా గాంధీతో సమావేశమైన రోజే పార్టీ అదిష్ఠానం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రాష్ట్రంలో మహావికాస్ అఘాడీ ప్రభుత్వం పడిపోయిన తర్వాత పటోలే సోనియాను కలవడం ఇదే తొలిసారి. ఈ భేటీలో రాహుల్ గాంధీ, ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. గురువారం జరిగిన ఈ సమావేశం అనంతరం నానా పటోలే ట్వీట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి, దళిత నేత చంద్రకాంత్ హండోరే ఓడిపోవడంపై అధిష్ఠానం ఆగ్రహంగా ఉందని పేర్కొన్నారు. ఆయన ఓటమికి కారణమైన నేతలు, ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. క్రాస్ ఓటింగ్ అనుమానాలు చంద్రకాంత్ పాటిల్ ఓటమిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ హెచ్‌కే పాటిల్‌ను మాజీ సీఎం పృథ్విరాజ్ చవాన్ బుధవారం అడిగారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు అనుమానాలున్నాయి. ఈ వ్యవహరంపై మాజీ మంత్రి అసీం ఖాన్.. రాహుల్ గాంధీని కలిసి వివరించారు. పార్టీలో ఈ పరిణామాలపై రాహుల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యేల డుమ్మాపై ఆగ్రహం సీఎం ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కొన్న సోమవారం రోజు 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు గైర్హాజరు కావడంపై ఏఐసీసీ షాక్ అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ విప్ జారీ చేసినా వీరంతా రాకపోవడంపై అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ రోజు సభకు హాజరుకాని వారిలో మాజీ సీఎం అశోక్ చవాన్, మాజీ మంత్రి విజయ్ వడెట్టీవార్ వంటి ముఖ్య నేతలు ఉన్నారు. ముంబైలో ఉండి కూడా విశ్వాస పరీక్ష జరిగే కీలక సమయంలో వీరు సభకు రాకపోవడం తీవ్రమైన విషయమని పార్టీ సీనియర్ నేత ఒకరు అన్నారు. అంతేకాదు ఉద్ధవ్ థాక్రే చివరి క్యాబినెట్ సమావేశంలో ఔరంగాబాద్, ఒస్మానాబాద్ జిల్లాల పేర్లు మార్చాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు కాంగ్రెస్ మంత్రులు అభ్యంతరం చెప్పకపోవడంపైనా పార్టీ అధిష్ఠానం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్సీపీతోనే మహావికాస్ అఘాడీ(శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ) ప్రభుత్వం కూలిపోయిన తర్వాత నానా పటోలే సోనియాను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. సీఎం షిండే తిరుగుబాటుతో శివసేనలో చీలిక ఏర్పడి ఉద్ధవ్ థాక్రే వర్గం బలహీనపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2014 ముందు నుంచి మిత్రపక్షంగా ఉన్న ఎన్సీపీతోనే ముందుకు సాగాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: అన్నాడీఎంకేలో వర్గపోరు.. నేనే అధినేత్రిని, మీడియాతో శశికళ వ్యాఖ్యలు -
రాహుల్ గాంధీ విచారణ.. ఈడీపై సెటైరికల్ పంచ్ వేసిన అఖిలేశ్ యాదవ్
లక్నో: కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయినప్పుడల్లా విపక్షాలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరీక్షలో పాస్ కావాల్సి ఉంటుందని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఎద్దేవాచేశారు. ఈడీ అంటే ఎగ్జామినేషన్ ఇన్ డెమాక్రసీ అని కొత్త భాష్యం చెప్పారు. ‘విపక్షాలు తప్పకుండా ఈడీ పరీక్ష పాస్ అవ్వాల్సిందే. పరీక్షకు విపక్షాలు సిద్ధమైతే మౌఖిక పరీక్ష అయినా, రాత పరీక్ష అయినా భయముండదు’ అని అన్నారు. రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో అఖిలేశ్ పైవిధంగా ట్వీట్‌చేశారు. -
ఢిల్లీలో టెన్షన్.. కాంగ్రెస్ కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధింపు
దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నేడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కార్యాలయానికి హజరుకానున్న నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కాగా, నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ ఈడీ ఎదుట హాజరవుతున్న సందర్బంగా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. వందల సంఖ్యలో పోలీసులు అక్కడి చేరుకున్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ కార్యకర్తలు.. 'నేను సావర్కర్‌ని కాదు, రాహుల్ గాంధీని' అంటూ నినాదాలు చేశారు. కాగా, రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి దర్యాప్తు సంస్థ కార్యాలయం వరకు కాలినడకన ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించారు. దీంతో, ఢిల్లీ పోలీసులు అక్బర్ రోడ్‌లోని కాంగ్రెస్ కార్యాలయం వద్ద 144 సెక్షన్‌ను విధించారు. అయితే రాజధానిలో మతపరమైన ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఢిల్లీ పోలీసులు ర్యాలీకి అనుమతించలేదు. దీంతో నిరసరకారులు పెద్ద ఎత్తున్న నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లే దారిలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను, బారికేడ్లను ఏర్పాటు చేశారు. బుల్డోజర్లు ఒక్కటే మిస్ అయ్యాయని సెటైరికల్ కామెంట్స్ చేశారు. మైనారిటీ మతాన్ని ఆచరించే వ్యక్తులను, ఇండ్లను ధ్వంసం చేసే పనిలో బుల్డోజర్లు బిజీగా ఉండి ఉంటాయని ఘాటుగా స్పందించారు. కాగా, నుపూర్ శర్మ.. మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జూన్ 10న ప్రయాగ్‌రాజ్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నిరసనకు కారణమైన ప్రధాన వ్యక్తి ఇంటిని ప్రయాగరాజ్ డెవలప్మెంట్ అథారిటీ (పీడీఏ) కూల్చివేసిన నేపధ్యంలో కార్తీ చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక, రాహుల్ గాంధీపై ఆరోపణల నేపథ్యంలో మధ్యప్రదేశ్, అసోం, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కేరళలో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు తెలిపారు. మరోవైపు.. ఇదే కేసులో జూన్ 23న విచారణకు హాజరు కావాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. श्री @RahulGandhi नेताओं और कार्यकर्ताओं के साथ जातें हुए#IndiaWithRahulGandhi pic.twitter.com/KLqA3G0FdM — Delhi Congress (@INCDelhi) June 13, 2022 ఇది కూడా చదవండి: నేషనల్ హెరాల్డ్ కేసేంటి?.. అసలేం జరిగింది? -
నేషనల్ హెరాల్డ్ కేసేంటి?.. ఈ ప్రశ్నలకు బదులేది?
ఒకపక్క దేశమంతా 75 ఏళ్ల స్వాతంత్య్ర సంబురాలు జరుగుతుంటే మరోపక్క స్వాతంత్య్రోద్యమంలో కీలకపాత్ర పోషించిన కాంగ్రెస్ నేషనల్ హెరాల్డ్ కుంభకోణం వివాదంలో నిండా మునిగి తేలుతోంది. ఈ ఉదంతంలో వేల కోట్ల ఆస్తులను కాంగ్రెస్ అగ్రనాయకత్వం కారుచౌకగా కొట్టేసిన వైనం ఆ పార్టీ అక్రమార్జనకు పరాకాష్ట. ఏమిటీ నేషనల్ హెరాల్డ్? ♦స్వాతంత్య్రోద్యమ సమయంలో ప్రజలకు దేశీయ వాణి వినిపించాలన్న ఉద్దేశంతో నెహ్రూ సహా పలువురు జాతీయ నాయకులు రూ.5 లక్షల మూలధనంతో 1938లో నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించారు. ♦1937 నవంబర్ 20న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) అనే అన్ లిస్టెడ్ కంపెనీని ఆరంభించారు. దాదాపు 5వేల మంది స్వాతంత్య్ర సమరయోధులు ఇందులో వాటాదారులు. ♦రూ.5 లక్షల మూలధనాన్ని 2 వేల ప్రిఫరెన్షియల్ షేర్లుగా, 30 వేల ఈక్విటీ షేర్లుగా విభజించారు. ఒక్కో ప్రిఫరెన్షియల్ ముఖ విలువ రూ.100, ఈక్విటీ షేరు విలువ రూ.10గా నిర్ణయించారు. వేల కోట్ల ఆస్తులు.. రూ.90 కోట్ల నష్టాలు ♦ఏజేఎల్ నిబంధనల ప్రకారం కంపెనీ ఏ ఒక్కరికీ సొంతం కాదు. వార్తా పత్రిక నిర్వహణ తప్ప ఇతర వ్యాపారాల్లో వేలు పెట్టకూడదు. ♦ఇంగ్లిష్‌లో నేషనల్ హెరాల్డ్, ఉర్దూలో ఖౌమీ ఆవాజ్, హిందీలో నవ్‌జీవన్ పత్రికలను ఏజేఎల్ 2008 దాకా ప్రచురించింది. ♦స్వాతంత్య్రానంతరం పత్రికకు ఆదరణ తగ్గుతూ వచ్చింది. దాంతో ఏజేఎల్ ఆదాయం తగ్గుతూ వచ్చి చివరకు నష్టాల్లో మునిగింది. మరోవైపు కంపెనీ వాటాదారులు 2010 నాటికి 1,057కు తగ్గిపోయారు. ♦అయితే స్వాతంత్రోద్యమకాలంలో ఉన్న ఆదరణ కారణంగా ఏజేఎల్‌కు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో భారీగా స్థిరాస్తులు సమకూరాయి. ♦ఈ ఆస్తుల విలువ స్వాతంత్రానంతరం భారీగా పెరిగింది. పత్రికలను మూసేసేనాటికి దాదాపు రూ.5వేల కోట్లకు చేరింది. ఇదే సమయంలో కంపెనీ నికర నష్టం రూ.90 కోట్లకు చేరింది. ♦వేల కోట్ల ఆస్తులున్న ఏ సంస్థా రూ.90 కోట్ల నష్టాలకు కంపెనీని అమ్ముకోవడం, రుణం తీసుకోవడం జరగదు. కానీ ఇక్కడే కాంగ్రెస్ మాయ మొదలైంది. తెరపైకి యంగ్ ఇండియన్ ♦2010 నవంబర్‌లో కేవలం రూ.5 లక్షల మూలధనంతో యంగ్ ఇండియన్ అనే ప్రైవేట్ కంపెనీ పుట్టుకొచి్చంది. ♦దీనికి 2010 డిసెంబర్లో రాహుల్‌గాంధీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 2011 జనవరిలో సోనియా కూడా డైరెక్టర్ బోర్డులో సభ్యురాలయ్యారు. ♦కంపెనీలో 76 శాతం వాటాలు సోనియా, రాహుల్ సొంతం. మిగతా 24 శాతం వాటాలూ కాంగ్రెస్ నేతలు వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్ పేరిటే ఉన్నాయి. ♦కాంగ్రెస్ నుంచి రూ.90 కోట్ల వడ్డీ లేని రుణం తీసుకునేందుకు 2011 ఫిబ్రవరిలో ఏజేఎల్ అంగీకరించింది. ♦తర్వాత సదరు రూ.90 కోట్ల రికవరీ హక్కులను కేవలం రూ.50 లక్షలకు కాంగ్రెస్ నుం చి యంగ్ ఇండియన్ కొనుగోలు చేసింది. రికవరీ ముసుగులో ఏజేఎల్ షేర్లు దాని పరమయ్యాయి. స్వామి ఫిర్యాదుతో... ♦ఏజేఎల్, యంగ్ ఇండియన్ ఒప్పందంపై సుబ్రమణ్యస్వామి 2012లో ఢిల్లీ కోర్టులో ఫిర్యాదు చేశారు. ♦కేసు కొట్టేయాలన్న సోనియా తదితరుల అభ్యర్థనను 2014లో కింది కోర్టు, 2015లో ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చాయి. ♦సోనియా, రాహుల్, వోరా, ఆస్కార్ తదితరులు కింది కోర్టులో హాజరవాలని హైకోర్టు ఆదేశించింది. ♦2016లో సుప్రీంకోర్టును ఆశ్రయించగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచి్చంది. ♦ఈ వ్యవహారంపై 2014లో ఈడీ దృష్టి సారించింది. 2019లో దాదాపు రూ.64 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. ఇలా వేలాది కోట్ల నేషనల్ హెరాల్డ్ ఆస్తులను కాంగ్రెస్ అధినాయకత్వం పథకం ప్రకారం చేజిక్కించుకుందన్న వైనం స్పష్టంగా కళ్లముందు కనిపిస్తున్నా ఆ పార్టీ బుకాయిస్తూనే ఉంది. నిజాయతీ నిరూపించుకునే ప్రయత్నాలు చేయకుండా ఇదంతా బీజేపీ కక్ష సాధింపు అంటూ ఆరోపిస్తోంది. పత్రిక పునరుద్ధరణకు రుణమిచ్చామని చెప్పిన కాంగ్రెస్, దాని రికవరీ హక్కులను యంగ్ ఇండియన్‌కు కారుచౌకగా రూ.50 లక్షలకే ఎందుకు కట్టబెట్టిందీ చెప్పలేదు. ఔరా.. వోరా! ♦యంగ్ ఇండియన్ తరఫున రికవరీ హక్కుల కొనుగోలుకు ప్రతిపాదించిందీ, కాంగ్రెస్ కోశాధికారి హోదాలో అందుకు అంగీకరించిందీ, ఏజేఎల్ ఎండీగా ఒప్పందంపై సంతకం చేసిందీ వోరాయే. తన త్రిపాత్రాభినయంతో ఈ మొత్తం ఉదంతాన్ని రక్తి కట్టించారు. ♦చివరకు రూ.50 లక్షలతో అటు రూ.90 కోట్ల అప్పు మాయమైంది. ఇటు వేలాది కోట్ల ఏజేఎల్ ఆస్తులు రాహుల్, సోనియాలకు దక్కాయి. ♦ఈ వ్యవహారంలో భారీగా మోసపోయింది ఏజేఎల్ వాటాదారులే! కొత్త ఒప్పందాలతో వీరి వాటాలన్నీ కలిపి ఒక్క శాతానికే పరిమితమయ్యాయి. ఈ ప్రశ్నలకు బదులేది? ♦రూ.5 వేల కోట్ల ఆస్తులున్న కంపెనీ రూ.90 కోట్ల నష్టాలను తీర్చేందుకు రుణమెందుకు తీసుకుంది? ♦ తన ఆస్తుల్లో ఏదో ఒకదాన్ని విక్రయించో, తాకట్టు పెట్టో రూ.90 కోట్లు ఎందుకు చెల్లించలేదు? ♦రూ.90 కోట్ల రుణ రికవరీ హక్కులను యంగ్ ఇండియన్‌కు కేవలం రూ.50 లక్షలకు ఎలా ఇచ్చారు? ♦యంగ్ ఇండియన్‌కు ఏదో ఒక ఆస్తి కట్టబెట్టే బదులు ఏకంగా ఏజేఎల్ షేర్లను ఎందుకు కేటాయించారు? ♦కేవలం వోరా సంతకాలతో వేలాది కోట్ల ఆస్తులున్న ఏజేఎల్ ఎలా యంగ్ ఇండియన్ పరం ఎలా అయింది? ♦ఈ కుంభకోణంతో సంబం ధం లేకపోతే ఈ వ్యవహారాన్ని సోనియా, రాహుల్ ఎందుకు సమర్థించారు? -
కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపాటు... టీఆర్ఎస్పై విమర్శలు
సాక్షి ఖమ్మం: ప్రజా సమస్యల పరిష్కారం కొరకు సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క చేపడుతున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం మండలం అంకమ్మ దేవాలయం నుంచి పునః ప్రారంభించిన సంగతి తెసిందే. ఈ క్రమంలో ఇనగాలి గ్రామంలోని రాజుదేవరపాడులో ప్రజలను పలకరిస్తూ... వారి వ్యక్తిగత సమస్యలు వింటూ.. భట్టి విక్రమార్క పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..."కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పట్ల అవలంభిస్తున్న తీరుని తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీల పై ఈడీ దాడులు నిర్వహించి అక్రమ కేసులు పెడితే సహించేది లేదంటూ బీజేపీ పై మండిపడ్డారు. అంతేకాదు ఈ నెల 13న అన్ని ఈడీ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తుందని హెచ్చరించారు కూడా. అలాగే తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అరాచకపాలన సాగిస్తోదంటూ విరుచుకుపడ్డారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పంచి ఇచ్చిన భూములను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం లాగేసుకుంటుందంటూ ఆరోపణలు గుప్పించారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని" అన్నారు. (చదవండి: ఒకరికి పబ్‌లు తప్పా ఏం తెల్వదు.. ఇంకొకరు విచిత్రమైన మనిషి: కేటీఆర్) -
తప్పనిసరి తంతు కావొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న చింతన్ శిబిర్ తప్పనిసరి తంతుగా మారటానికి వీల్లేదని కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ స్పష్టం చేశారు. ఎన్నికల సవాళ్లను, సైద్ధాంతిక సవాళ్లను దీటుగా ఎదుర్కొనేలా పార్టీ తిరిగి జవసత్వాలు కూడదీసుకోవాలి. అట్టడుగు స్థాయి నుంచి పటిష్టంగా పునర్నిర్మాణం జరగాలి. చింతన్ శిబిర్ అందుకు వేదిక కావాలి. పార్టీపరంగా చేపట్టాల్సిన చర్యలతో పాటు చేయాల్సిన మార్పుచేర్పులు తదితరాలను ప్రతి ఒక్కరూ నిర్మొహమాటంగా వెల్లడించాలి. కష్టకాలాన్ని దాటింటి పార్టీని అమేయ శక్తిగా మార్చాలి. మీరంతా చిత్తశుద్ధితో శాయశక్తులా కృషి చేస్తేనే అది సాధ్యం’’ అని సీనియర్ నేతలకు సూచించారు. కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక విభాగమైన వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం సోమవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగింది. రెండు గంటల పాటు జరిగిన భేటీలో సీనియర్లను ఉద్దేశించి సోనియా మాట్లాడారు. ఒక్క రోజులోనే సమస్యలన్నింటినీ పరిష్కరించే మంత్రదండమేదీ లేదని, క్రమశిక్షణ, నిస్వార్థంగా కష్టించే గుణం, సమష్టి కృషి ద్వారానే ఏదైనా సాధ్యమని ఉద్బోధించారు. ‘‘మనలో ప్రతి ఒక్కరి జీవితాలకూ కాంగ్రెస్ పార్టీయే జీవనాధారం. ఇంతకాలంగా మనందరి బాగోగులూ చూసుకుంటూ వచ్చిన పార్టీ రుణాన్ని తీర్చుకోవాల్సిన సమయమిది. కష్టకాలంలో ఉన్న పార్టీని తిరిగి బలోపేతమైన శక్తిగా నిలబెట్టాలి’’ అని పిలుపునిచ్చారు. స్వీయ విమర్శ ఉండాలి గానీ... రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో 13 నుంచి 15 దాకా జరిగే చింతన్ శిబిర్‌లో 422 మంది సభ్యులు పాల్గొంటారని సోనియా వివరించారు ‘‘పార్టీ వేదికలపై స్వీయ విమర్శ అవసరమే. కానీ అది ఆత్మవిశ్వాసాన్ని, స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉండకూడదు. సవాళ్లన్నింటినీ కలసికట్టుగా అధిగమిద్దాం’’ అని పిలుపునిచ్చారు. ఇదంతా జరగాలంటే చింతన్ శిబిర్ నామ్ కే వాస్తే ప్రహసనంలా మారకూడదన్నారు. చింతన్ శిబిర్‌లో తీర్మానాలకు సీడబ్ల్యూసీ అంగీకారం అనంతరం మే 15న ‘ఉదయ్‌పూర్ నవ్ సంకల్ప్’ పేరుతో ఆమోదం లభిస్తుందని వివరించారు. సభ్యుల్లో 21 శాతం మహిళలు సీడబ్య్లూసీ భేటీ వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సుర్జేవాలా మీడియాకు వివరించారు. ‘‘చింతన్ శిబిర్‌లో పాల్గొనే 422 మంది సభ్యుల్లో సగం మంది 50 ఏళ్లలోపువారే. మహిళలు 21 శాతం’’ అని చెప్పారు. హాజరవని ప్రియాంక, మన్మోహన్ సీడబ్ల్యూసీ భేటీకి ప్రియాంక గాంధీ, మన్మోహన్ సింగ్ హాజరవలేదు. ఆజాద్, ఆనంద్ శర్మ, భూపేంద్ర సింగ్ హుడా, కేసీ వేణుగోపాల్, ఖర్గే, ముకుల్ వాస్నిక్, అంబికా సోని, అధిర్ రంజన్, అశోక్ గెహ్లాట్, భూపేశ్ బఘేల్ పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: చిక్కుల్లో నవనీత్ కౌర్ దంపతులు.. బెయిల్ రద్దయ్యే చాన్స్! కారణం ఏంటంటే.. -
వారు తిష్ట వేసినా ఫలితం ఉండదు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘తెలంగాణ రాష్ట్రం రాజకీయ ప్రయోగశాల కాదు. ఢిల్లీ నుంచి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీలాంటి వాళ్లు వచ్చి ఇక్కడే తిష్ట వేసినా ఫలి తం ఉండదు’అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణ అడ్డాలో ఎవరి ఆటలు సాగవన్నారు. శుక్రవారం నిజామాబాద్‌లో ఆయన ఆర్అండ్బీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అబద్ధాలతో నిం దిస్తే ప్రజల అభిప్రాయం మారదన్నారు. అపరిపక్వ రాష్ట్ర బీజేపీ నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్‌తో నడ్డా వీధిరౌడీలాగా మాట్లాడారని దునుమాడారు. కేం ద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే కేసీఆర్‌కు అవార్డులు ఇస్తే, నడ్డా మాత్రం అవినీతి టీఆర్ఎస్ ప్రభు త్వం అంటూ విమర్శలు చేయడం చోద్యంగా ఉందన్నారు. సిగ్గు, శరం ఉంటే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేసి నిరూపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నడ్డాకు సిగ్గుంటే 2014లో మోదీ ఇచ్చిన హామీ మేరకు పాలమూరు ఎత్తిపోతలను చేపట్టాలన్నారు. బండి సంజయ్ మాటలు డబ్బాలో రాళ్లేసినట్లు ఉంటాయని ఎద్దేవా చేశారు. సీఎంను ఏక వచనంతో మాట్లాడుతున్న ఎంపీ అర్వింద్ పసుపు బోర్డు తెస్తా నని బాండ్ రాసిచ్చి రైతులను మోసం చేశారన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ నిన్నటిదాకా సోనియా, రాహుల్‌ను బూతులు తిట్టి మళ్లీ అక్కడే రాజకీయ ఆశ్రయం పొందారని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌లో రేవంత్ రుడాలి (చనిపోయినప్పుడు ఏడ్చేందుకు వచ్చే అద్దె మనుషులు) పాత్ర పోషిస్తున్నారన్నారు. వరంగల్ డిక్లరేషన్ కాంగ్రెస్‌కు చావు డిక్లరేషన్ అవుతుంద న్నారు. కేంద్రం మెడలు వంచి తెలంగాణ ప్రజలు రాష్ట్రం సాధించుకున్నారన్నారు. ‘2018 ఎన్నికల్లో రూ. 2 లక్షల రుణమాఫీ హామీ కాంగ్రెస్ ఇచ్చింది.. అయినా ప్రజలు తిరస్కరించారు.. ఇప్పుడదే పాత పాట పాడుతోంది’ అని విమర్శించారు. సమావేశంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు గణేశ్‌గుప్తా, జీవన్‌రెడ్డి, జాజాల సురేందర్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, రాజేశ్వర్ పాల్గొన్నారు. -
ఓయూలో రాహుల్ హీట్
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు వేసవి ఎండలతో వాతావరణం వేడెక్కుతుండగా.. మరోవైపు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పొలిటికల్ హీట్ రగులుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో ఓయూలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమానికి వైస్ చాన్స్‌లర్ నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే ఓయూలోని పరిపాలన కార్యాలయంపై కొంతమంది దాడులకు పాల్పడటంతో కేసుల నమోదు, అరెస్టులు, రిమాండ్ వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. కొన్నాళ్లుగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కొన్ని పరిణామాలు చోటుచేసుకున్నాయి. వీసీ రవీందర్ ఏడాది క్రితం బాధ్యతలు చేపట్టిన తర్వాత సంస్కరణల దిశగా అడుగులేశారు. పీహెచ్‌డీల కాలవ్యవధిని నిక్కచ్చిగా అమలు చేయాలనే ఉద్దేశంతో పాటు క్యాంపస్ పరిధిలో భద్రత ఏర్పాట్లలో కొత్త వ్యక్తుల నియామకం, హాస్టళ్ళపై నిరంతర నిఘా వంటి చర్యలపై విద్యార్థుల నుంచి వ్యతిరేకత కన్పిస్తోంది. దీనికి తోడుగా రాహుల్ గాంధీ అంశం తెరమీదికి రావడంతో ఉద్రిక్తతలకు దారి తీసింది. వివాదానికి కారణమేంటి? రాహుల్ ముఖాముఖి వివాదంపై విభిన్న వాదనలు విన్పిస్తున్నాయి. చారిత్రక నేపథ్యం ఉన్న ఓయూకి జాతీయ నాయకులను అనుమతిస్తే వర్సిటీకి మరింత బలం చేకూరుతుందని విద్యార్థులు చెబుతుండగా.. విద్య, రాజకీయాలను వేర్వేరుగా చూడటం సరికాదని కాలేజీ రాజకీయ విభాగం అధ్యాపకుడు ఒకరు వ్యాఖ్యానించారు. అనేక సందర్భాల్లో రాజకీయ ప్రముఖులను ఆహ్వానించడం సాధారణమేనన్నారు. రాహుల్ ముఖాముఖిని ఈ కోణంలోనే చూస్తే వివాదం ఉండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఓయూ క్యాంపస్‌లోకి రాజకీయ కార్యకలాపాలను అనుమతించవద్దనే నిర్ణయం తీసుకున్నామని వీసీ రవీందర్ అంటుండగా.. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే ఈ విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారని ఓయూ విద్యార్థి నిరుద్యోగ ఫ్రంట్ చైర్మన్ చనగాని దయాకర్ చెబుతుండడం గమనార్హం. (చదవండి: ఓయూ రగడ.. ఆగని అరెస్టులు) -
Telangana: రాహుల్ టూర్ అనుమతిపై నిర్ణయం వీసీదే: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఓయూ పర్యటనపై దాఖలైన హౌజ్ మోషన్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు సోమవారం విచారించింది. రాహుల్ టూర్ అనుమతిపై నిర్ణయాన్ని వీసీకే హైకోర్టు వదిలేసింది. దరఖాస్తును పరిశీలించాలని వీసీకి హైకోర్టు ఆదేశించింది. పిటిషన్‌పై విచారణను హైకోర్టు ముగించింది. చదవండి👉: రాహుల్ రాకపై కాక! కాగా, రాహుల్‌గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ సందర్శన వ్యవహారం మరింత ముదురుతోంది. రాజకీయాలకు అతీతంగా రాహుల్ ఓయూకి వస్తారంటూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, వీహెచ్ ఓయూ వీసీని కలిసి అనుమతి కోరినా.. రాజకీయ సభలకు అనుమతి లేదంటూ తిరస్కరించడంతో కాంగ్రెస్ అనుబంధ విభాగాలు ఆందోళనకు దిగాయి. ఓయూ విద్యార్థి నేతలు ఆదివారం మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి యత్నించారు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ వైస్ చాన్స్‌లర్ (వీసీ) చాంబర్ ముందు చీరలు, గాజులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు. ఈ విద్యార్థి నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడం, వారిని పరామర్శించేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. -
రాహుల్ రాకపై కాక!
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ సందర్శన వ్యవహారం మరింత ముదురుతోంది. రాజకీయాలకు అతీతంగా రాహుల్ ఓయూకి వస్తారంటూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, వీహెచ్ ఓయూ వీసీని కలిసి అనుమతి కోరినా.. రాజకీయ సభలకు అనుమతి లేదంటూ తిరస్కరించడంతో కాంగ్రెస్ అనుబంధ విభాగాలు ఆందోళనకు దిగాయి. ఓయూ విద్యార్థి నేతలు ఆదివారం మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి యత్నించారు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ వైస్ చాన్స్‌లర్ (వీసీ) చాంబర్ ముందు చీరలు, గాజులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు. ఈ విద్యార్థి నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడం, వారిని పరామర్శించేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వర్సిటీ, పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓయూలో రాహుల్ పర్యటనకు అనుమతించాల్సిందిగా వీసీ ని సోమవారం మరోమారు కలవాలని నిర్ణయించారు. రెండు చోట్ల నిరసనలతో.. రాహుల్ ఓయూ పర్యటనకు అనుమతి నిరాకరించడాన్ని తప్పుబడుతూ ఓయూ నిరుద్యోగ జేఏసీ నేత కె.మానవతా రాయ్, నాయకులు చెనగాని దయాకర్, లోకేశ్‌యాదవ్, మరికొందరు నేతలు బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌ను ముట్టడించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్ కు తరలించారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి అక్కడికి చేరుకుని వారిని పరామర్శించారు. మరోవైపు ఎన్ఎస్యూఐ రాష్ట అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు వీసీ చాంబర్ వద్ద ఆందోళనకు దిగారు. గులాబీ రంగు చీర, జాకెట్, గాజులు, పూలు తీసుకొచ్చి వీసీ రవిందర్కు అందజేస్తామంటూ నిరసన చేపట్టారు. కార్యాలయం తలుపులను í మూసేయడంతో అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసులు వెంకట్‌తో పాటు ఇతర నేతలను అరెస్టు చేశారు. ఎన్ఎస్ యూఐ నేతలను పరామర్శించేందుకు జగ్గారెడ్డి బయలుదేరుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నియంత రాజ్యంలో ఉన్నామా? ఓయూలో రాహుల్ సమావేశానికి అనుమతివ్వకపోవడం, జగ్గారెడ్డి అరెస్టుపై కాంగ్రెస్ వర్గాలు భగ్గుమన్నాయి. వర్సిటీ అధికారులు టీఆర్ఎస్కు గులాముల్లా పనిచేస్తున్నారని మం డిపడ్డాయి. టీఆర్ఎస్ నేతలు ఆర్ట్స్ కాలేజీ ఎదుట సభలు పెట్టినా పట్టించుకోని అధికారులు.. ఇతర సంఘాల కార్యక్రమాలకు అనుమతించకపోవడం దారుణమన్నాయి. ► విద్యార్థి నేతలను పరామర్శించేందుకు వెళ్తున్న జగ్గారెడ్డి అరెస్టు చేయడం దారుణమని.. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామో, నియంత రాజ్యంలో ఉన్నామో అర్థం కావడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఉస్మానియాకు వస్తానంటే అడ్డుకోవడం ఎందుకని నిలదీశారు. ► జగ్గారెడ్డి, వెంకట్, విద్యార్థి నేతల అరెస్టు సరికాదని టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చిన సోనియా కుటుంబానికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. ► రాహుల్ సమావేశానికి అనుమతి ఇవ్వకపోవడం దురదృష్టకరమని, రాష్ట్రంలో వాక్ స్వాతంత్య్రాన్ని హరిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. ► జగ్గారెడ్డి, విద్యార్థి నేతల అరెస్టును టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, మాజీ ఎంపీ మల్లురవి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య తదితరులు ఖండించారు. ► ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వీహెచ్, మధుయాష్కీ, గీతారెడ్డి తదితరులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జగ్గారెడ్డి, విద్యార్థి నేతలకు సంఘీభావాన్ని ప్రకటించారు. ► నేడు కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం బల్మూరి వెంకట్, ఇతర నేతల అరెస్టులకు నిరసనగా సోమ వారం రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేయాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. నేడు మళ్లీ ఓయూకు కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే జగ్గారెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధి బృందం సోమవారం మరోమారు ఉస్మానియా వర్సిటీకి వెళ్లి రాహుల్ పర్యటనకు అనుమతించాలని కోరనుంది. ఆదివారం బంజారాహిల్స్ పీఎస్ నుంచి బయటికి వచ్చాక జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉస్మానియా విద్యార్థుల బలిదానాలపైనే టీఆర్ఎస్ నేతలు సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అయ్యారని.. కానీ ప్రస్తుత పరిణామాలను చూసి అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయన్నారు. రాహుల్ పర్యటనకు అనుమతి కోసం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఓయూ వీసీని కలుస్తామని చెప్పారు. పార్టీ జెండాలు, కండువాలు లేకుండా రాహుల్‌తో పాటు ముగ్గురు ఎంపీలు, ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ మాత్రమే ఓయూకు వస్తామని చెప్తామని.. వీసీ అనుమతివ్వకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ప్రభుత్వం అడ్డుకోవాలని చూసినా రాహుల్‌ను ఓయూకు తీసుకెళ్లి తీరుతామన్నారు. -
రాహుల్ రాకతో ’సీన్’ మారాల్సిందే
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ వచ్చే నెల 6న హాజరుకానున్న వరంగల్ ‘రైతు సంఘర్షణ సభ’ను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సభతో రాష్ట్రంలో రాజకీయ అంచనాల్లో మార్పు రావాలనే లక్ష్యంతో భారీ ఎత్తున జనాన్ని సమీకరించి పార్టీ సత్తా చాటేందుకు టీపీసీసీ నాయకత్వం ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలను టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ మూడు జిల్లాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి జనసమీకరణ చేయాలని, వరంగల్ ఆర్ట్స్ కళాశాలలో జరగనున్న సభకు ఐదు లక్షలకు తగ్గకుండా సమీకరించాలనే లక్ష్యంతో ఆ పార్టీ నేతలు ముందుకెళ్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర పార్టీ కీలక నేతలు క్షేత్రస్థాయికి వెళ్లి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో సమీక్షలు రాహుల్ సభను ఎట్టి పరిస్థితుల్లో విజయవంతం చేయాలనే వ్యూహంతో ఉన్న పార్టీ ఇందుకోసం క్షేత్రస్థాయిలో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా మంగళవారం సూర్యాపేట, ఖమ్మం జిల్లా నేతలతో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి భేటీ అయ్యారు. కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో బుధవారం సమీక్ష సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో జనసమీకరణకు సంబంధించిన అంశాలపైనే దృష్టి పెడుతున్నారని సమాచారం. ఇక, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా క్షేత్రస్థాయికి వెళ్లనున్నారు. ఈనెల 22న మధుయాష్కీతో కలిసి వీరు వరంగల్ వెళ్లనున్నారు. అక్కడ ఆర్ట్స్ కళాశాలలో రాహుల్ సభాస్థలి పరిశీలన అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో భేటీ కానున్నారు. అంతకుముందు రోజు రేవంత్ ఖమ్మం వెళ్లి పార్టీ నేతలతో సమావేశమవుతారు. ఈనెల 23న గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ రోజున మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశానికి టీపీసీసీ కార్యవర్గం, పీఏసీ సభ్యులు, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలతోపాటు అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల కోఆర్డినేటర్లు హాజరు కానున్నారు. ఈ భేటీలో రాహుల్ సభ పూర్తి స్థాయి షెడ్యూల్ ఖరారవుతుందని తెలిసింది. మొత్తం మీద రాహుల్ రాకతో రాష్ట్రంలో సీన్ మారాల్సిందేనని, రాష్ట్రంలో కాంగ్రెస్ పునాదులు ఎంత బలంగా ఉన్నాయో ఈ సభతో నిరూపిస్తామని పార్టీ నేతలు చెబుతుండటం గమనార్హం. -
ఏప్రిల్ నెలంతా కాంగ్రెస్ ఉద్యమాలు
సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్ల అంశంపై ఏప్రిల్ నెలంతా ఉద్యమాలు చేయాలని, ఏప్రిల్ చివరి వారంలో వరంగల్ కేంద్రంగా రైతు బహిరంగ సభ నిర్వహించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కార్యవర్గం నిర్ణయించింది. ఈ బహిరంగ సభకు ఎంపీ రాహుల్ గాంధీని ఆహ్వానించి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టాలని తీర్మానించింది. టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం జూమ్ యాప్‌లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది. నల్లగొం డ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసకృష్ణన్, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చై ర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మహే శ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, గీతారెడ్డిలతో పాటు పార్టీ సీనియర్ ఉపాధ్యక్షులు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలు, వివిధ చార్జీ ల పెంపు, ధాన్యం కొనుగోళ్లు, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ, పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వాల మోసాన్ని ఎండగట్టాలి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ బిల్లులను అడ్డగోలుగా పెంచారని, ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని విమర్శించారు. ఈ రెండు అంశాలపై క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేపట్టాలని, సీనియర్ నేతలంతా జిల్లాల్లో విస్తృతంగా పర్యటిం చి ప్రజలు, రైతాంగానికి ఈ విషయాలను తెలియజెప్పాలని సూచించారు. ఏఐసీసీ ప్రకటించిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ గ్యాస్ సిలెండర్లకు దండలు వేయడంతో పాటు డప్పులు కొట్టి నిరసనలు తెలపాలని కోరారు. వచ్చే నెల 7వ తేదీన సివిల్ సప్లయిస్ భవన్, విద్యుత్ సౌధల వద్ద భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. శ్రీధర్‌బాబు నేతృత్వంలో కమిటీ ధాన్యం కొనుగోళ్ల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడంలో భాగంగా ఉద్యమ కార్యాచరణ రూపొందించేందుకు మాజీ పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నేతృత్వంలో పలువురు సీనియర్లతో కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశం నిర్ణయించింది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్సాగర్లను పరిరక్షించే జీవో 111 విషయంలో సీఎం కేసీఆర్ అస్పష్ట ప్రకటన చేసిన నేపథ్యంలో. ఈ ప్రకటన ఫలితాలు, ఆయా గ్రామాల ప్రజలపై పడే ప్రభావం తదితర అంశాలను అధ్యయనం చేసేందుకు పర్యావరణ అంశాలపై అవగాహన ఉన్న మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, దాసోజు శ్రావణ్‌లతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇలావుండగా పార్టీ సభ్యత్వ నమోదు విషయంలో మంచి కృషి చేసి 40 లక్షల పైచిలుకు డిజిటల్ సభ్యత్వాలను చేర్పించిన రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు, ఎన్‌రోలర్స్‌ను టీపీసీసీ కార్యవర్గం అభినందించింది. -
ఆయుష్మాన్ భారత్‌పై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే ఆయుష్మాన్ భారత్‌పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఎంతో హైప్ చేసిందని.. కానీ, ఆ పథకం కింద కోవిడ్ రోగులకు మాత్రం ఉచితంగా వైద్యం అందించలేదని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, కరోనా సమయంలో కోవిడ్ రోగులు, ప్రజల విషయంలో కేంద్రం అశ్రద్ధ చూపిందని మండిపడ్డారు. ఇక, కోవిడ్ రోగులను, కోవిడ్ వర్కర్లను, దేశ ప్రజలను నరేంద్ర మోదీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వ్యాఖ్యానించారు. మరోవైపు.. కోవిడ్ సమయంలో బాధితులకు ఉచిత వైద్యం అందలేదని, పేదలకు కనీస ఆదాయం కూడా రావడంలేదని అన్నారు. చిన్న, సూక్ష్మ పరిశ్రమలను బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ రాహుల్ ట్విట్టర్ వేదికగా ఫైరయ్యారు. COVID पीड़ितों का इलाज मुफ़्त में करवाया? - नहीं ग़रीबों और श्रमिकों को न्यूनतम आय मिली? - नहीं छोटे उद्योगों को डूबने से बचाया? - नहीं The PM does not CARE! pic.twitter.com/68J08eQKyk — Rahul Gandhi (@RahulGandhi) March 24, 2022 -
ప్రస్తుతానికి సోనియానే!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలయ్యేవరకు సోనియా గాంధీనే పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగనున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం నాలుగున్నర గంటల పాటు వాడీవేడీగా జరిగింది. సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఐదు రాష్ట్రాల ఫలితాలపై సమీక్ష జరిపారు. పార్టీ ప్రయోజనాల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమేనని సమావేశంలో సోనియా చెప్పారు. సోనియా నాయకత్వంపై కమిటీ పూర్తి విశ్వాసాన్ని ప్రకటించింది. రాబోయే ఎన్నికల్లో రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేలా, పార్టీని బలోపేతం చేసేలా తక్షణ మార్పులకు శ్రీకారం చుట్టాలని ఆమెను కోరింది. రాహుల్ పార్టీ నాయకత్వం వహించాలన్నది ప్రతిఒక్క కార్యకర్త కోరికని, అయితే సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నందున వీటిలోనే కొత్త అధ్యక్షుడిని నిర్ణయిస్తామని పార్టీ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా చెప్పారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల అనంతరం పార్టీలో చింతన్ శిబిర్ నిర్వహిస్తామని, పార్టీని బలోపేతం చేసేందుకు అధ్యక్షురాలు తక్షణ చర్యలు చేపడతారని పార్టీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పారు. ఈ శిబిరాన్ని రాజస్థాన్‌లో నిర్వహించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సూచించారు. పార్టీ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ సీడబ్ల్యూసీ ముందు ప్రస్తావించగా, వారి ప్రతిపాదనను సభ్యులు ఏకగ్రీవంగా తిరస్కరించారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఫలితాలు తీవ్ర ఆందోళనకరం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయానికి దారి తీసిన కారణాలపై సీడబ్ల్యూసీ చర్చించిందని, గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్ సహా పలువురు సీనియర్ నేతలు సూచనలు చేశారని సూర్జేవాలా పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్టీకి ‘తీవ్ర ఆందోళన కలిగించేవి’లా ఉన్నాయన్న అంశాన్ని సీడబ్ల్యూసీ ఆమోదించింది. కాంగ్రెస్ తన వ్యూహంలో లోపాల కారణంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను సమర్థవంతంగా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్ళలేకపోయినట్లు అంగీకరించారు. వీటితో పాటు పంజాబ్‌లో అధికార వ్యతిరేకతను అధిగమించలేకపోయిందని, పార్టీ అంతర్గత కలహాలు కొంప ముంచాయని సీడబ్ల్యూసీ అంగీకరించింది. అదే సమయంలో శక్తివంతమైన ప్రతిపక్షంగా కొనసాగుతామని ప్రజలకు హామీ ఇచ్చింది. ఈ ఏడాదితో పాటు, 2023, 2024లో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలతో పాటు సార్వత్రిక ఎన్నికల సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సిద్ధమవుతుందని సీడబ్ల్యూసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా, రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ భగేల్, అజయ్ మాకెన్, సల్మాన్ ఖుర్షీద్, హరీష్ రావత్, మల్లికార్జున్ ఖర్గే, అంబికా సోనీ, చిదంబరం, గులాంనబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్ సహా ప్రముఖ నేతలు పాల్గొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కరోనా కారణంగా ఏకే ఆంటోని హాజరుకాలేదు. మీరే దిక్కు పార్టీ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని సోనియా ప్రకటించారు. సమావేశంలో అసమ్మతి నేతలు సహా అందరి అభిప్రాయాలను ఆమె తెలుసుకున్నారు. అయితే సంస్థాగత ఎన్నికల వరకు సోనియా నాయకత్వం కొనసాగించాలని ప్రతి సభ్యుడు కోరారని సూర్జేవాలా చెప్పారు. ఆగస్టు 21– సెప్టెంబర్ 20 మధ్య కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందన్నారు. కాంగ్రెస్‌ను బలహీనపరిచేందుకు బీజేపీ– ఆర్ఎస్ఎస్ గాంధీ కుటుంబంపై బురద జల్లుతున్నాయని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. పార్టీని బలోపేతం చేసే మార్గాలపై రాహుల్ సూచనలిచ్చారన్నారు. పార్టీ ఓటమికి కారణాలను సభ్యులు విశ్లేషించినట్లు తెలిపారు. సమావేశానికి జీ 23 కూటమికి చెందిన ఆజాద్, ఆనంద్ శర్మ, ముకుల్ వాస్నిక్ మాత్రమే హాజరయ్యారు. పార్టీ బలోపేతానికి తాము కూడా కృషి చేస్తామని, తమకు ప్రత్యేక కూటమి ఏదీ లేదని, జీ23 అనేది మీడియా సృష్టని వీరు వివరణ ఇచ్చినట్లు సమాచారం. సమావేశానికి ముందు రాహుల్‌ను అధ్యక్షుడిగా చేయాలంటూ పలువురు కార్యకర్తలు, నాయకులు నినాదాలిచ్చారు. పార్టీ ఐక్యంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీనే బాధ్యతలు స్వీకరించాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గహ్లోత్ అన్నారు. గత మూడు దశాబ్దాలుగా గాంధీ కుటుంబం నుంచి ఎవరూ ప్రధాని, కేంద్ర మంత్రికాలేకపోయారని, కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఐక్యతకు గాంధీ కుటుంబం కీలకమని నాయకులు అర్థం చేసుకోవాలని గహ్లోత్ పేర్కొన్నారు. యాక్టివ్‌గా అసమ్మతి గ్రూప్ ఆదివారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశానికి కంటే ముందే, కాంగ్రెస్‌లోని అసంతప్తి వర్గానికి చెందిన సీనియర్ నేతలు శుక్రవారం గులాం నబీ ఆజాద్ నివాసంలో భేటీ అయి భవిష్యత్తు వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశానికి ఆనంద్ శర్మ, కపిల్ సిబల్, మనీష్ తివారీ వంటి ప్రముఖులు హాజరైనట్లు సమాచారం. సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్నప్పటికీ పార్టీ అన్ని నిర్ణయాలు కేసీ వేణుగోపాల్, అజయ్ మాకెన్, రణదీప్ సూర్జేవాలాలు తీసుకుంటున్నారని జీ23 లోని నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవి వీడినప్పటికీ, తెర వెనుక నుంచి ఆయనే పార్టీని నడిపిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. తామంతా పార్టీ శ్రేయోభిలాషులమే కానీ శత్రువులం కాదు అని ఈ నేతలు పలుమార్లు స్పష్టం చేశారు. -
అందుకే పన్నులను పెంచలేదు: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం కేంద్ర బడ్జెట్-2022ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దాదాపు గంటన్నరపాటు బడ్జెట్ ప్రసంగం కొనసాగింది. అయితే పార్లమెంట్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం నిర్మలా సీతారామన్ మీడియాతో చర్చించారు. ఈ సమావేశంలో క్రిప్టో, టాక్స్, డిజిటల్ రూపీ తదిరత అంశాలపై మరింత వివరణ ఇచ్చారు. అందుకే పెంచలేదు..! కోవిడ్-19 నేపథ్యంలో ప్రజలపై అదనంగా పన్నుల భారం పెంచే ఉద్ధేశ్యం ప్రభుత్వానికి లేదని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.గత ఏడాది మాదిరిగానే ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిశానిర్దేశంలో పన్నులను పెంచలేదని తెలిపారు. ఈ సంక్షోభ సమయంలో ప్రజల నుంచి ప్రభుత్వం ఒక్క పైసా కూడా సంపాదించాలని కోరుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ బడ్జెట్ గత ఏడాది బడ్జెట్‌కు సంపూర్ణ ఎజెండా కొనసాగుతోందని అభిప్రాయపడ్డారు. ఉద్యోగాలపై ప్రభావం..! కోవిడ్-19 రాకతో ఉద్యోగాలపై భారీ ప్రభావమే చూపిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అయితే ఉద్యోగాల విషయంలో ఊరటను కల్పిస్తూ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు. రాహుల్ గాంధీకి చురకలు..! పార్లమెంట్లో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్ నాయకుడు, పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ స్పందించారు. మోదీ ప్రభుత్వం ‘జీరో సమ్’ బడ్జెట్ ప్రకటించిందని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను నిర్మలా సీతారామన్ తిప్పికొట్టారు. బడ్జెట్‌ను సరిగ్గా అర్థం చేసుకోనే ప్రయత్నం చేయాలని రాహుల్‌కు హితవు పలికారు. చదవండి: వచ్చే వందేళ్ల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది: ప్రధాని మోదీ -
హుజూరాబాద్ ఓటమి పై కాంగ్రెస్ హై కమాండ్ సీరియస్
-
రఫెల్ డీల్ ముడుపుల ఆరోపణలు
-
మ్యాగజైన్ స్టోరీ 29 September 2021
-
సీఎం పదవికి రొటేషన్ ఫార్ములా ఏదీ లేదు
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ శుక్రవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌తో ఢిల్లీలో మరోసారి భేటీ అయ్యారు. తర్వాత బఘేల్ మీడియాతో మాట్లాడారు. పార్టీకి చెందిన మొత్తం 70 మంది ఎమ్మెల్యేలు తన వెంటే ఉన్నారన్నారు. రాష్ట్రానికి వచ్చి పరిస్థితిని స్వయంగా చూడాలని రాహుల్‌ను కోరినట్లు తెలిపారు. మంత్రి సింగ్ దేవ్ వాదిస్తున్నట్లుగా రొటేషన్ ఫార్ములా అంటూ ఏదీ లేదని బఘేల్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 2018లో కాంగ్రెస్ అధికారం చేపట్టాక ముఖ్యమంత్రి పదవిని రెండున్నరేళ్ల తర్వాత రొటేషన్ పద్ధతిలో చేపట్టేందుకు తనకు హామీ ఇచ్చారని, దాని ప్రకారమే సీఎం పీఠం తనకు ఇవ్వాలని సింగ్‌దేవ్ వాదిస్తున్నారు. -
కోటి మంది సబ్స్క్రైబర్లతో రికార్డు సృష్టించిన కుకింగ్ చానెల్
యూట్యూబ్.. వినోదానికే కాక ఉపాధికి నయా అడ్డాగా నిలుస్తుంది. పేరుతో పాటు డబ్బులు సంపాదించుకోవాలనుకునే వారి మొదటి ప్రాధాన్యం యూట్యూబ్‌గా మారింది. ఒక్కసారి క్లిక్ అయితే చాలు.. సబ్స్క్రైబర్లు.. వ్యూస్.. ఆదాయం వాటంతట అవే వస్తాయి. ఇక యూట్యూబ్‌లో చానెల్ ప్రారంభించడానికి గొప్ప గొప్ప డిగ్రీలు అక్కర్లేదు.. మనలో టాలెంట్ చాలు. ఈ వ్యాఖ్యలను నిజం చేశారు తమిళనాడుకు చెందిన రైతులు. వారు ప్రారంభించిన కుకింగ్ వీడియో చానెల్ నేడు కోటి మంది సబ్స్క్రైబర్లతో రికార్డు సృష్టించింది. ఆ వివరాలు.. చెన్నై: తమిళనాడుకు చెందిన విలేజ్ కుకింగ్ చానెల్ గత మూడేళ్లుగా తెగ ఫేమస్ అవుతుంది. ఈ క్రమంలో తాజాగా సదరు చానెల్ ఓ రికార్డు సృష్టించింది. తమిళనాడులో మొదటి సారి కోటి మంది సబ్స్క్రైబర్లను సంపాదించిన చానెల్‌గా గుర్తింపు పొందింది. ఆ వివరాలు.. తమిళనాడు పుడుక్కొట్టై జిల్లా చిన్న వీరమంగళం గ్రామానికి చెందిన ఎం పెరియతంబి అనే వృద్ధుడు గతంలో వంట మాస్టర్‌గా పని చేసేవారు. ఈ క్రమంలో పెరియతంబి, ఆయన మనవలు కలిసి కొన్నెళ్ల క్రితం యూట్యూబ్‌లో ‘‘విలేజ్ కుకింగ్’’ పేరిట ఓ చానెల్ ప్రారంభించారు. పెరియతంబి చేత సంప్రదాయ వంటలు చేయించి.. ఆ వీడియోలని యూట్యూబ్‌లో అప్లోడ్ చేసేవారు. ఇక వీరు చేసే వంట కూడా మాములగా ఉండదు. 200-300 వందల మందికి సరిపడేలా భారీ వంట చేస్తారు. వీడియో పోస్ట్ చేసిన తర్వాత తాము వండిన పదార్థాలను సమీపంలోని అనాథాశ్రమాలు, వృద్ధాశ్రామల్లో వారికి పెడతారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ వీరిని కలిశారు. వీరితో పాటు వంట చేసి.. అక్కడే కూర్చోని భోజనం కూడా చేశారు. దాంతో ఈ చానెల్ పేరు దేశవ్యాప్తంగా అందరికి తెలిసింది. అప్పటివరకు వారానికి 10 వేలుగా ఉన్న సబ్స్క్రైబర్ల సంఖ్య రాహుల్ గాంధీ వీరి వీడియోలో కనిపించిన తర్వాత 40-50 వేలకు పెరిగింది. ఇక రాహుల్ గాంధీ కనిపించిన వీడియో ఏకంగా 26 మిలియన్ల వ్యూస్ సంపాదించింది. తాజాగా సబ్స్క్రైబర్ల సంఖ్య కోటికి చేరడంతో యూట్యూబ్ నుంచి వీరికి డైమండ్ ప్లే బటన్ లభించింది. దీని అన్బాక్సింగ్ సందర్భంగా ఈ యూట్యూబర్స్ మాట్లాడుతూ.. ‘‘మాకు కేవలం ఆరు నెలలు మాత్రమే వ్యవసాయ పని ఉండేది. మిగతా ఆరు నెలలు ఖాళీగా ఉండే వాళ్లం. దాంతో ఇలా కుకింగ్ యూట్యూబ్ చానెల్ ప్రారంభించాలని భావించాం. కానీ మా చానెల్ ఇంత పాపులర్ అవుతుందని మేం కలలో కూడా అనుకోలేదు’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఇక వీరు యూట్యూబ్ వ్యూస్ ద్వారా నెలకు 7 లక్షల రూపాయల యాడ్ రెవిన్యూ సంపాదిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం వీరు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ని సీఎంపీఆర్ఎఫ్ నిధికి 10 లక్షల రూపాయల చెక్ అందచేశారు. -
అర్థంలేని ముచ్చట్లతో కొవిడ్‌తో పోరాడలేం - రాహుల్‌గాంధీ
న్యూఢిల్లీ : అర్థంపర్థం లేని ముచ్చట్లలో కొవిడ్‌తో పోరాడలేమన్నారు కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ. కొవిడ్‌పై విజయం సాధించాలంటే అంకిత భావం, అర్థవంతమైన ప్రణాళికలు అవసరమన్నారు. అంతేకాని ప్రధాని పదవిలో ఉండి మన్ కీ బాత్ పేరుతో అక్కరకు రాని ముచ్చట్లు చెప్పడం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి పనికి రాని మాటలతో కొవిడ్‌తో పోరాడలేమని రాహుల్‌గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మన్ కీ బాత్ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతీ నెల చివరి ఆదివారం మన్ కీ బాత్ పేరుతో రేడియోలో ప్రసంగిస్తున్నారు నరేంద్ర మోదీ. ఇప్పటి వరకు 77 సార్లు మన్ కీ బాత్ ద్వారా ఆయన ప్రసంగించారు. మన్ కీ బాత్‌లో వివిధ అంశాలపై ప్రధాని మోదీ ప్రసంగిస్తుంటారు. ఈసారి టౌటే, యాస్ తుపానులతో పాటు కొవిడ్ సందర్భంగా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది చేసిన సేవలను ఆయన కొనియాడారు. కాంగ్రెస్ విమర్శలు ప్రధాని నరేంద్ర మోదీ అసమర్థత కారణంగానే దేశంలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు వచ్చాయని ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ముప్పేట దాడి చేస్తున్నారు. సరైన వ్యాక్సిన్ ప్రణాళిక ఉండి ఉంటే దేశం కరోనా సెకండ్‌వేవ్ లాంటి గడ్డు పరిస్థితిని చూసి ఉండేది కాదని విమర్శలు ఎక్కు పెట్టారు. తాజాగా మన్ కీ బాత్‌పై కూడా విమర్శలు మొదలుపెట్టారు కాంగ్రెసఖ్ నేతలు. -
మోదీజీ కనిపించరేం.. ఎక్కడున్నారు?: రాహుల్
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలమయ్యిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఇక దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్కడా కంటికి కనిపించడం లేదని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కొందరు మానవతావాదులు కరోనా బాధితులకు ఎనలేని సేవలు అందిస్తున్నారని కొనియాడారు. పీఎం కేర్స్ ఫండ్ కింద అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న వెంటిలేటర్ల గురించి రాహుల్ గాంధీ ప్రశ్నించారు. పీఎం కేర్స్ వెంటిలేటర్లు, ప్రధాని మోదీ మధ్య పోలికలు ఉన్నాయన్నారు. ఆ వెంటిలేటర్లు, మోదీ బాధ్యతలను నిర్వర్తించడం లేదని ఎద్దేవా చేశారు. పీఎం కేర్స్ వెంటిలేటర్లు, ప్రధాని మోదీ ఎక్కడా కనిపించడం లేదని విమర్శించారు. -
కరోనా విలయం: ‘టీకా ఉత్సవ్’ వ్యాఖ్యలపై రాహుల్ మండిపాటు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరత పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా దేశంలో వ్యాక్సిన్ కొరత చాలా తీవ్రంగా ఉందన్నారు. కనుక ఈ సమయంలో విదేశాలకు వ్యాక్సిన్ల ఎగుమతి ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ప్రధాని వ్యాక్సినేషన్‌ను ‘టీకా ఉత్సవ్’ పేరిట జరపడానికి ఇది వేడుక కాదని రాహుల్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్నిరాష్ట్రాలకు ఎలాంటి పక్షపాతం లేకుండా సహాయం చేయాలి. మనమందరం కలిసి ఈ మహమ్మారితో పోరాడి ఓడించాలని సూచించారు. ‘టీకా ఉత్సవ్’ నిర్వహించే ప్రధాని ముందుగా వాటి కొరత లేకుండా చూడాలని రాహుల్ కోరారు. కొన్ని రాష్ట్రాలు వ్యాక్సిన్ల కొరతతో ఇబ్బంది పడతోంది, కనుక ఆయా రాష్ట్రాల డిమాండుకు సరిపడా టీకా సరఫరా చేయాలని ఆయన సూచించారు. बढ़ते कोरोना संकट में वैक्सीन की कमी एक अतिगंभीर समस्या है, ‘उत्सव’ नहीं- अपने देशवासियों को ख़तरे में डालकर वैक्सीन एक्सपोर्ट क्या सही है? केंद्र सरकार सभी राज्यों को बिना पक्षपात के मदद करे। हम सबको मिलकर इस महामारी को हराना होगा। — Rahul Gandhi (@RahulGandhi) April 9, 2021 ( చదవండి: కరోనా కట్టడికి ఐదంచెల వ్యూహం ) -
రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు...!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హార్వర్డ్ కెనడీ స్కూల్ ప్రొఫెసర్ నికోలస్ బర్న్స్‌తో జరిగిన వర్చువల్ సమావేశంలో ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ఈ సమావేశంలో పలు అంశాలపై రాహుల్ గాంధీ చర్చించారు. ప్రొఫెసర్ నికోలస్ ‘మీరు ఒక వేళ భారత్‌కు ప్రధానమంత్రి ఐతే ఏం చేస్తార’ని రాహుల్ గాంధీని అడిగారు. రాహుల్ సమాధానమిస్తూ.. తాను భారత ప్రధాని అయితే దేశంలో ఉద్యోగ కల్పనపైనే ఎక్కువగా దృష్టి సారిస్తా. అభివృద్ధి అనేది దేశానికి అవసరమైనప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. దేశంలో నిరుద్యోగం ఎక్కువగా పెరిగిపోయింది. అసలు వృద్ధికి, ఉద్యోగ కల్పనకు సంబంధం లేకుండా అభివృద్ధి ఉంది. చైనాలో ఉద్యోగ కల్పన లాంటి సమస్యలు లేవు. ఆ దేశంలో ఉద్యోగాలు ఇవ్వలేమని చెప్పే చైనా నేతను ఎప్పుడు కలవలేదు. వృద్ధి రేటు 9 శాతం ఉండడం కంటే దానికి తగ్గట్లుగా ఉద్యోగాల కల్పన జరగడం ముఖ్యం. అసలు ఉద్యోగాల కల్పన లేని వృద్ధి రేటు ఎందుకు పనికిరాదు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం నాశనం చేస్తోంది. ఎన్నికల్లో పోటీ చేయాలంటే దేశంలో మౌలిక వ్యవస్థలు ఉండాలి. ఆ వ్యవస్థలకు న్యాయ వ్యవస్థ నుంచి రక్షణ ఉండాలి. అంతేకాకుండా ప్రజాస్వామ్య దేశంలో మీడియా స్వేచ్ఛ కల్పించాలి. దేశంలో జాతీయ మీడియా తమ స్థాయిని మరిచిపోయింది. అందుకే ఎన్నికల్లో పోటీ చేయాలంటే పటిష్ఠమైన సంస్థాగత నిర్మాణాలు అవసరం. బీజేపీ ప్రదర్శిస్తోన్న వైఖరీ దేశ ప్రజలను అసంతృప్తికి గురి చేస్తోంది’’ అని అన్నారు. LIVE: My interaction with Ambassador Nicholas Burns from Harvard Kennedy School. https://t.co/KZUkRnLlDg — Rahul Gandhi (@RahulGandhi) April 2, 2021 చదవండి: నా పేరు మోదీ కాదు.. నేను అబద్దాలు చెప్పడానికి రాలేదు -
మోదీకి చురక: పెట్రోల్ ధరలపై బావమరుదుల భగ్గు
న్యూఢిల్లీ: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ వయనాడ్‌లో భారీ ట్రాక్టర్ ర్యాలీ చేపట్టగా.. ఆయన బావ (ప్రియాంకగాంధీ భర్త) రాబర్ట్ వాద్రా సైకిల్ తొక్కుతూ నిరసన వ్యక్తం చేశారు. అడ్డూఅదుపు లేకుండా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ ధరలు పెరగడంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ నిరసనల్లో భాగంగా సోమవారం బావబామరుదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బామ్మర్దికి పోటీగా బావా వాద్రా సైకిల్‌పై వేగంగా వెళ్తూ కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని సుజన్‌సింగ్ పార్క్ నుంచి తన కార్యాలయం సుఖ్‌దేవ్ విహార్ ఆఫీస్ వరకు సైకిల్‌పై వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏసీ కార్ల నుంచి బయటకు వచ్చి ప్రజల సమస్యలు చూడాలి’ అని పరోక్షంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చురకలంటించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ‘యూపీఏ హయాంలో పెట్రోల్ ధరలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మోదీ ఇప్పుడు ఏం చెబుతారు’ అని ప్రశ్నించారు. ఏదైనా సమస్యలు తలెత్తితే ఎప్పుడు ఇతరులపై బురద జల్లడం మోదీకి అలవాటే’ అని ఎద్దేవా చేశారు. సూటుబూటు వేసుకుని సైకిల్‌పై రావడం అందరినీ ఆకట్టుకుంది. ఒకవిధంగా రాహుల్ కన్నా రాబర్ట్‌కే ఎక్కువ గుర్తింపు వచ్చింది. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్‌లో పర్యటించారు. వ్యవసాయ చట్టాల రద్దుతో పాటు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై నిరసన వ్యక్తం చేశారు. ‘ప్రపంచమంతా రైతుల సమస్యలపై స్పందిస్తుంటే మోదీ ప్రభుత్వం మాత్రం కళ్లుండి చూడలేకపోతుంది’ అని తెలిపారు. వెంటనే కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘22 మంది ప్రజల జేబులు ఖాళీ చేస్తూ తమ స్నేహితుల జేబులు నింపుతున్నట్లు’ అభివర్ణించారు. ధరల పెంపుతో ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బీజేపీ పెట్రోల్ దోపిడీ’ అని కొత్తగా హ్యాష్‌ట్యాగ్ క్రియేట్ చేసి ట్వీట్ చేశారు. पेट्रोल पम्प पर गाड़ी में तेल डालते समय जब आपकी नज़र तेज़ी से बढ़ते मीटर पर पड़े, तब ये ज़रूर याद रखिएगा कि कच्चे तेल का दाम बढ़ा नहीं, बल्कि कम हुआ है। पेट्रोल 100 रुपय/लीटर है। आपकी जेब ख़ाली करके ‘मित्रों’ को देने का महान काम मोदी सरकार मुफ़्त में कर रही है!#FuelLootByBJP — Rahul Gandhi (@RahulGandhi) February 22, 2021 చదవండి: కట్టెలు, మట్టి పొయ్యితో అసెంబ్లీకి చదవండి: నాగాలాండ్‌లో అరుదైన దృశ్యం.. 58 ఏళ్ల తర్వాత -
కాంగ్రెస్ పార్టీ కీలక తీర్మానం
న్యూఢిల్లీ: ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని తక్షణమే జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేయాలనీ కీలక తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని ఢిల్లీ కాంగ్రెస్ నేడు సాయంత్రం ఏకగ్రీవంగా ఆమోదించింది. రాహుల్ గాంధీ నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంటుంది అని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీ నియంతృత్వ పరిపాలను ఎదుర్కోవాలంటే రాహుల్ గాంధీ నాయకత్వమే సరైనదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, ఇదే సమయంలో మరో రెండు తీర్మానాలను కూడా ఢిల్లీ కాంగ్రెస్ నేతలు చేశారు.(చదవండి: ఎమ్మెల్యే ఇంటిపై దాడి.. బీజేపీపై కేటీఆర్ ఆగ్రహం) రైతు ఉద్యమంలో భాగంగా గణతంత్ర దినోత్సవం రోజున చోటు చేసుకున్న ఘర్షణలకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు జగదీష్ టైట్లర్, రమేష్ కుమార్, కృష్ణ తీత్, నరేంద్ర నాథ్, యోగానంద్ శాస్త్రి కిరణ్ వాలియా హరూన్ సహా ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేతలందరూ హాజరయ్యారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరమైన ఓటమిని చవిచూసిన తర్వాత పార్టీ చీఫ్ పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. అనేక సార్లు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించాలని పార్టీ శ్రేణులు కోరుకున్నప్పటికీ తను నాయకత్వాన్ని చేపట్టలేదు. ఆయన రాజీనామా చేసినప్పటి నుంచి తాత్కాలిక చీఫ్ గా ఆయన తల్లి సోనియా గాంధీ భాద్యతలు వహిస్తున్నారు. ఈ పదవిని ఎక్కువకాలం చేపట్టడానికి తనకు ఆసక్తి లేదని సోనియా గాంధీ గతంలో స్పష్టం చేశారు. -
ధరల దెబ్బతో అమాంతం పెరిగిన ‘జీడీపీ’ : రాహుల్
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరగడంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజలు ద్రవ్యోల్బణంతో బాధపడుతుంటే పన్నులు వసూలు చేయడంలో మోదీ ప్రభుత్వం బిజీగా ఉందని పేర్కొన్నాడు. ఇంధన ధరల పెరుగుదలతో జీడీపీ (గ్యాస్-డీజిల్-పెట్రోల్) భారీగా వృద్ధిని కనబరిచిందని సెటైర్లు వేశారు. ఈమేరకు రాహుల్ ఆదివారం ట్వీట్ చేశారు. కాగా, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్న విషయం తెలిసిందే. గడిచిన వారంలో నాలుగోసారి రేట్లు పెంచిన తరువాత దేశంలో శనివారం పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.(చదవండి: ఫ్యాక్ట్ చెక్: ఫిబ్రవరి 1 నుంచి సాధారణ రైళ్లు) मोदी जी ने ‘GDP’ यानी गैस-डीज़ल-पेट्रोल के दामों में ज़बरदस्त विकास कर दिखाया है! जनता महँगाई से त्रस्त, मोदी सरकार टैक्स वसूली में मस्त। pic.twitter.com/FsiG8ECajk — Rahul Gandhi (@RahulGandhi) January 24, 2021 పెట్రోల్ ప్రస్తుతం ఢిల్లీలో లీటరుకు రూ.85.70, ముంబైలో రూ.92,28గా ఉంది. అలాగే డీజిల్ రేట్లు కూడా ఆకాశానికి చేరుకున్నాయి. దేశ రాజధానిలో ఢిల్లీలో ఒక లీటరు డీజిల్ ధర రూ.75,88 ఉండగా ముంబైలో లీటరుకు రూ.82,66గా ఉంది. ఈ వారంలో లీటరుకు రూ.1పైగా పెరిగింది. అలాగే హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ.89.15, డీజిల్ ధర రూ.82.80గా ఉంది. చమురు ధరల పెరుగుదలకు ప్రధాన కారణం సౌదీ చమురు ఉత్పత్తిని తగ్గించడమే అని కారణమని కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. కరోనా వైరస్ కారణంగా, చమురు ఉత్పత్తి చేసే అనేక దేశాలు ఉత్పత్తిని నిలిపివేసాయి లేదా తగ్గించాయి. డిమాండ్, సరఫరాలో అసమతుల్యత కారణంగా ఇంధన ధరలు పెరుగుతున్నాయి అని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. -
మాజీ సీఎం కన్నుమూత
గాంధీనగర్: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి మాధవ్ సిన్హ్ సోలంకి (94) కన్నుమూశారు. గాంధీనగర్‌లోని తన నివాసంలో శనివారం ఉదయం ఆయన మృతిచెందారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న సోలంకి పార్టీలో ఎన్నో పదవులు అలంకరించారు. ఆయన మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహూల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. గుజరాత్ రాజకీయాల్లో చెరగని ముద్ర న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. 1976లో మాధవ్ సిన్హ్ కొంతకాలం ముఖ్యమంత్రిగా పని చేశారు. అనంతరం (క్షత్రియా, హరిజన, ఆదివాసీ, ముస్లిం) కూటమిని ఏర్పాటుచేసి 1980లో అధికారంలోకి వచ్చేలా చేశారు. 1981లో సీఎంగా ఎన్నికయ్యారు. సీఎంగా సోలంకి సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు. 1985లో రాజీనామా చేసినప్పటికీ తర్వాత జరిగిన ఎన్నికల్లో 182 అసెంబ్లీ స్థానాలకు గాను 149 గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చారు. ఈ విధంగా ఆయన గుజరాత్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. దేశం గొప్ప నాయకుడిని కోల్పోయింది. నూతన గుజరాత్‌ను రూపుదిద్దడంలో సోలంకి పాత్ర కీలకమని గుర్తుచేశారు. - రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రపతి దశాబ్దాలపాటు గుజరాత్ రాజకీయాల్లో మాధవ్ సిన్హ్ కీలక పాత్ర పోషించారని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. సోలంకి బలీయమైన నాయకుడని తెలిపారు. సమాజానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా సోలంకి కుమారుడు భరత్‌తో మాట్లాడాను. - నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి ఆయన మృతి దిగ్భ్రాంతి కలిగించింది. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న నాయకుడు, ప్రజలకు సామాజిక న్యాయం అందించారు. - రాహూల్ గాంధీ -
కాంగ్రెస్‌లో రచ్చకెక్కిన రగడ..
సాక్షి, హైదరాబాద్: పీసీసీ చీఫ్ ఎంపికపై కాంగ్రెస్‌లో రగడ రచ్చకెక్కింది. సీనియర్ల అసంతృప్తితో కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచనలో పడింది. దూకుడుగా ఉండే వ్యక్తికే టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని హైకమాండ్ భావిస్తోంది. పీసీసీ ఎన్నికపై తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దంటూ సోనియా గాంధీ, రాహుల్, ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. తెలంగాణలో బీజేపీకి ఎమ్మెల్యేలుగా గెలిచే నేతలు లేకపోవడంతో రాజకీయంగా ఎదగడానికి ఆ పార్టీ ప్లాన్ చేస్తోందని లేఖలో పేర్కొన్నారు. టీఆర్ఎస్-ఎంఐఎం పార్టీలను పరోక్షంగా బీజేపీ వాడుకుంటుందని లేఖలో జగ్గారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. (చదవండి: షబ్బీర్ అలీకి కీలక పదవి!?) ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఫిబ్రవరి, మార్చిలో రానున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు జాగ్రత్త పడాల్సిన అవసరముందని పేర్కొంటూ.. జానారెడ్డి నాయకత్వంలోనే ముందుకు వెళ్లాలని లేఖలో ఆయన సూచించారు. పీసీసీ ఎన్నిక విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దన్నారు. సీనియర్ నాయకుల్లో ఏకాభిప్రాయం వచ్చే వరకు పీసీసీ చీఫ్ ఎన్నిక ప్రక్రియ ఆపాలని కోరారు. సాగర్ ఉప ఎన్నిక వరకు పీసీసీ ఉత్తమ్ కుమార్‌రెడ్డినే కొనసాగించాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. (చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతికి చెక్) -
జీ–23 నేతలతో సోనియా భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పార్టీ నాయకులతో శనివారం తన నివాసంలో భేటీ అయ్యారు. పార్టీలో సమూల మార్పులు జరగాలని ఆగస్టులో లేఖ రాసి, అసమ్మతిని బహిర్గతం చేసిన జీ–23లోని కీలక నేతలను ఈ సమావేశానికి ఆహ్వానించారు. పార్టీలోని అంతర్గత సమస్యలను పరిష్కరించాలని, ఆగస్టులో సోనియాకు రాసిన లేఖలో అసమ్మతివాదులు అంచనా వేసినట్లు రాష్ట్ర, స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్‌కు తీవ్రమైన నష్టం జరిగిన నేపథ్యంలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ చేసిన విజ్ఞప్తి మేరకు సోనియాగాంధీ శనివారం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సమావేశంలో రాహుల్, ప్రియాంక గాంధీ, ఏకే ఆంటోనీ, గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, హుడా, మనీష్ తివారీ, పవన్ కుమార్ బన్సల్, రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, అంబికా సోని, శశిథరూర్ తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో నేతల అభిప్రాయాలను సోనియా అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి సమావేశాలు మరిన్ని జరుగుతాయని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ అధ్యక్ష పదవిపై చర్చించలేదు? ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు, రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. అయితే ఎప్పటినుంచో చర్చల్లో ఉన్న పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించిన చర్చ ఏదీ జరగలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని, నాయకత్వ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని సోనియా గాంధీ సమావేశంలో స్పష్టం చేశారు. ఏకే ఆంటోనీ, హరీష్ రావత్ వంటి కొందరు సీనియర్లు మాత్రం రాహుల్ గాంధీనే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని కోరారని తెలిసింది. అయితే ఈ అంశాన్ని చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయలేదని రాహుల్ వ్యాఖ్యానించారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఎన్నికల బాధ్యులపై మాటల దాడి గుజరాత్ ఉప ఎన్నికలు, భిహార్ ఎన్నికలకు బాధ్యులుగా ఉన్న రాజీవ్ సతవ్, రణదీప్ సింగ్ సుర్జేవాలాపై కొందరు నేతలు పరోక్షంగా మాటల దాడి చేశారని తెలిసింది. పార్టీలోని 99.9% నేతలు రాహుల్‌నే పార్టీ అధ్యక్షుడిగా కావాలని కోరుకుంటున్నారని సుర్జేవాలా చేసిన ప్రకటనపైనా అభ్యంతరం వ్యక్తం చేశారని వినికిడి. -
ఉచిత వ్యాక్సిన్‌పై ప్రధాని వైఖరి ఏంటి?: రాహుల్
సాక్షి, ఢిల్లీ: దేశంలో ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ అందించటం గురించి కేంద్రం ఎప్పుడూ మాట్లాడలేదంటూ ఆరోగ్యశాఖ కార్యదర్శి చేసిన ప్రకటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో 95.3 లక్షల మంది ప్రజలను ప్రభావితం చేసిన కోవిడ్-19 మహమ్మారి వ్యాక్సిన్‌కు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేతలు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారని ఆయన తెలిపారు. ‘ప్రధాని ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందిస్తామన్నారు. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మేనిఫెస్టోను విడుదల చేస్తూ ఎన్డీఏ అదికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా టీకా అందిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు, వ్యాక్సిన్ అందరికీ ఇస్తామని ఎన్నడూ చెప్పలేదని కేంద్ర ప్రభుత్వం అంటోంది. ఇంతకీ ప్రధాని వైఖరి ఏంటి’? అని రాహుల్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. కాగా వైరస్ వ్యాప్తిని విచ్ఛిన్నం చేస్తే దేశంలోని మొత్తం జనాభాకు వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం లేదని మంగళవారం కేంద్రం వెల్లడించింది. అలాగే దేశంలోని ప్రజలందరికీ వ్యాక్సిన్ అందిస్తామని ఎన్నడూ చెప్పలేదని ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ కోసం పనిచేస్తున్న మూడు ముఖ్యమైన ఫార్మా సంస్థలను ప్రధాని మోదీ సందర్శించిన మూడు రోజుల తరువాత భూషణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. " భారత పౌరులందరికి వ్యాక్సిన్ అందించే ప్రయత్నంలో భాగంగా సన్నాహాలు, సవాళ్లు, రోడ్‌మ్యాప్ రూపొందించడం" ఈ పర్యటన ముఖ్య ఉద్ధేశ్యమని ప్రధాని కార్యాలయం తెలిపింది. కానీ ఉచిత వ్యాక్సిన్ హామీని ఎన్నికల్లో బీజేపీ ఉపయోగించుకొని ఇప్పుడు విరమించుకుందని ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
ఢిల్లీ రైతుల ఆందోళనలు - తాజా పరిణామాలు..!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వ్యవసాయంలో నూతనంగా తీసుకొచ్చిన బిల్లులకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీలో చేస్తున్న ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం రైతు సంఘాలు, ప్రభుత్వం మధ్య జరిగిన సమావేశం ఓ కొలిక్కి రాలేదు. దీనిపై కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ, రైతు సంఘాలతో చర్చించామని అన్నారు. డిసెంబరులో జరిగే నాల్గవ రౌండ్ సమావేశంలో వాటిని చేపట్టేలా చర్యలు తీసుకుంటామని బుధవారం దీనికి సంబంధించిన విషయాలను ప్రభుత్వంతో పంచుకోవాలని ఆందోళన చేస్తున్న రైతులను కోరారు. రైతుల నిరసన: తాజా పరిణామాలు వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రభుత్వంపై దాడి చేస్తూనే ఉన్నారు. దీనిపై ఆయన ట్విటర్ లో మాట్లాడుతూ.. ఈ చట్టాలు రైతుల ఆదాయం పెంచడానికి అని చెప్పారని కానీ దీని వల్ల రైతుల ఆదాయం సగానికి సగం తగ్గుతుందని ఆరోపించారు. ఈ ప్రభుత్వం అబద్దాల, దోపిడి ప్రభుత్వం అని దుయ్యబట్టారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఆందోళన చేస్తున్న తాజా పరిస్థితులపై చర్చించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పియూష్ గోయల్ ఒక సమావేశం నిర్వహించారు. ఆందోళన కొనసాగుతుండగా, ఢిల్లీ పోలీసులు దేశ రాజధాని సరిహద్దులను అడ్డుకున్నారు, భారీ పోలీసు మోహరింపుతో ఎంట్రీ పాయింట్లను మూసివేశారు. ఆందోళన సమయంలో రైతులను నియంత్రించడానికి కాంక్రీట్ అడ్డంకులు, బారికేడ్లను ఉంచారు. దేశ రాజధానిలో జరిగిన నిరసనల వెనుక ప్రతిపక్ష నాయకుల హస్తం ఉందని కేంద్ర మంత్రి వికె సింగ్ మంగళవారం ఆరోపించారు. చిత్రాల్లో చాలా మంది రైతులు రైతులుగా కనిపించలేదని, ప్రతి పక్షపార్టీ కార్యకర్తల్లా కనిపించారని ఆరోపించారు. బిజెపికి మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్ (ఎస్ఎడి) వ్యవసాయ బిల్లులపై ప్రభుత్వంపై దాడి చేస్తూనే ఉంది.రైతుల గురించి బీజేపీ తక్కువ అంచనా వేసిందని కానీ ఇప్పుడు అర్థం అవుతుందని అని సీనియర్ అకాలీ నాయకులు ఎస్ బల్విందర్ సింగ్ భుందర్ అన్నారు. ఆందోళన చేస్తున్న రైతులకు ఢిల్లీ మంత్రి కైలాష్ గెహ్లోట్, ఆప్ నాయకుడు అతిషి మద్దతు తెలిపారు. రైతులు చేసిన అన్ని డిమాండ్లను కేంద్రం అంగీకరించాలని అన్నారు. "ఎంఎస్పి హామీని చట్టం పరిధిలో ఉంచాలి. స్వామినాథన్ కమిటీ సిఫారసులను అంగీకరిస్తామని, ఎంఎస్పిని ఒకటిన్నర రెట్లు పెంచుతామని హామీ ఇచ్చిన ప్రభుత్వం దానిని చట్టబద్ధంగా తొలగించింది" అని అతిషి చెప్పారు. గత పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వం క్లియర్ చేసిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ చట్టాలు రైతులను శక్తివంతం చేస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు సహా ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చినప్పటికీ, చట్టాలను వెనక్కి తీసుకురావాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. -
తప్పంతా నాదే.. బలంలేని చోట పోటీకి దిగాం
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో బిహార్ ఎన్నికల ఫలితాల ఎపిసోడ్ చివరి అంకానికి చేరినట్లు కనపడుతోంది. తాజాగా రాజ్యసభ సభ్యుడు బిహార్ కాంగ్రెస్ సీనియర్ నేత అఖిలేష్ ప్రసాద్ తెర ముందుకొచ్చారు. తన వల్లే పార్టీ రాష్ట్రంలో పరాజయం పాలైందని ఒప్పుకున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలను ఆయన నిర్వర్తించారు. ఓటమి గల కారణాలను వివరించేందుకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరారు. గత 20 ఏళ్లలో ప్రత్యర్థులు గెలుస్తున్న సీట్లను తమకు కేటాయించడం వల్లే ఈ పరాజయం పొందామని, దానికి పూర్తి బాధ్యత తనదేనని అన్నారు. పూర్తి స్థాయిలో అధ్యయనం చేయకుండా తమకు బలంలేని చోట పోటీకి దిగామని, పరాజయంపై రాహుల్ గాంధీతో చర్చిస్తానని అన్నారు. వ్యూహాత్మకంగా బలహీనంగా ఉన్న చోట సరిచేయాలని అధినేతతో చెప్తానని అన్నారు. బ్లాక్, జిల్లా స్థాయిలో పార్టీ చాలా బలహీనంగా ఉందని ఆయన అంగీకరించారు. ఏ రాష్ట్ర ఎన్నికల్లో అయిన గెలవాలంటే పార్టీలో భారీ సంస్కరణలు అమలు చేయాలని అన్నారు. ఇంతకు ముందే కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్.. పార్టీని అనుభవజ్ఞులైన రాజకీయ నాయకుల చేతిలో పెట్టాలని పరోక్షంగా రాహుల్‌ని ఉద్ధేశించి బహిరంగంగా విమర్శించారు. కాంగ్రెస్ నానాటికీ బలహీన పడుతుందని, వ్యవస్థాగతంగా మార్పులు చేయాలని మరో సీనియర్ నేత చిదంబరం సూచించారు. అంతేకాకుండా బిహార్‌లో సీట్ల ఎంపికలో సరిగా వ్యవహరించలేదని, ప్రతిపక్షాలు గత 20 ఏళ్లలో గెలుస్తున్న 25 సీట్లను అంటగట్టారని అన్నారు. అన్ని స్థానాల్లో కాకుండా 45 సీట్లలో పోటీకి నిలిపితే బాగుండేదని చిదంబరం అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన అఖిలేష్ ప్రసాద్ స్పందిస్తూ.. తనకు కపిల్ సిబల్ అంటే చాలా గౌరవమని అన్నారు. పరాజయంపై బహిరంగంగా మాట్లాడకుండా ఉండాల్పిందని అన్నారు. బిహార్‌లో కొన్ని సీట్లలో పోటీ చేసి ఉంటే విజయానికి దగ్గరలో ఉండేదన్న వ్యాఖ్యలపై మిత్రపక్షాల నుంచి కాంగ్రెస్ విమర్శలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉప ఎన్నికల్లోనూ పరాజయం తరువాత ఇవి తీవ్రమయ్యాయి. (చదవండి: కాంగ్రెస్ పార్టీపై చిదంబరం ఘాటు వ్యాఖ్యలు) -
కాంగ్రెస్ పార్టీని వదిలిపోండి.
న్యూఢిల్లీ: సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ మాటలు కాంగ్రెస్ పార్టీలో మంటలు రేపుతున్నాయి. పార్టీకి పూర్వవైభవం రావాలంటే నాయకత్వ మార్పు అవసరమన్న సిబల్పై లోక్‌సభ కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సిబల్‌కు అంత ప్రగతిశీల భావాలు ఉంటే కాంగ్రెస్ పార్టీని వీడి పోవచ్చని, లేదంటే వేరే పార్టీలో చేరవచ్చని సూచించారు. పార్టీలో ఉంటూ కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడుస్తున్నారని, విశ్వసనీయతను దెబ్బ తీస్తున్నారని విమర్శించారు. సోనియా గాంధీ, రాహూల్ గాంధీ సీనియర్లకు స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పే అవకాశం ఇచ్చారని, అయినప్పటికి బహిరంగంగా చెప్పటం మంచి సాంప్రదాయం కాదని హితవు పలికారు. సరైన వేదికపై తమ సూచనలు చెప్పే అవకాశం ఉన్నప్పటికీ పార్టీని ప్రజల్లో చులకన అయ్యేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. బిహార్ ఎన్నికల సమయంలో ఈ నాయకులు ఎక్కడ ఉన్నారని చౌదరి ప్రశ్నించారు. "అటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీని పునరుద్ధరించడం పట్ల అంత తపన ఉంటే, వారు తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి. బిహార్ ఎన్నికల సందర్భంగా వారు పార్టీ గెలుపు కోసం పనిచేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారా" అని ఆయన అడిగారు. సోమవారం, కపిల్ సిబల్ ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, కాంగ్రెస్ క్షీణించిందని, ఆత్మపరిశీలన చేసుకునే సమయం సైతం లేదని సొంత పార్టీపై విమర్శలు సంధించడం తెలిసిందే. (చదవండి: కాంగ్రెస్‌ను ప్రత్యామ్నాయ శక్తిగా గుర్తించడం లేదు) -
ఇది నిజం! ఇదే నిజం!!: రాహుల్ గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కారణంగా హస్టల్ యాజమాన్యం బలవంతంగా ఖాళీ చేయించడంతో మనస్తాపానికి గురైన షాద్‌నగర్ డిగ్రీ విద్యార్థిని ఐశ్వర్య ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఐశ్వర్య కుటుంబానికి తన సంతాపం తెలిపారు. బీజేపీ అనాలోచితంగా విధించిన లాక్డౌన్ దేశవ్యాప్తంగా ఎన్నో కుటుంబాలను నాశనం చేసిందని మండి పడ్డారు. ఈ మేరకు ఆయన హిందీలో ట్వీట్ చేశారు. "ఈ విచారకరమైన క్షణంలో విద్యార్థి ఐశ్వర్య కుటుంబ సభ్యులకు నా సంతాపం తెలియజేస్తున్నాను. బీజేపీ అనాలోచితంగా చేసిన నోట్ల రద్దు, లాక్డౌన్ దేశవ్యాప్తంగా ఎన్నో కుటుంబాలను నాశనం చేసింది. ఇది నిజం” అని రాహుల్ ట్వీట్ చేశారు. (చదవండి: స్కూల్ ఫీజుకు బదులుగా కొబ్బరి బొండాలు..!) ఈ అత్యంత విచారకరమైన సమయంలో ఈ విద్యార్థిని కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సంతాపం తెలుపుతున్నాను. ఉద్దేశ పూర్వకంగా చేసిన నోట్ల రద్దు మరియు లాక్డౌన్ ద్వారా, బీజేపి ప్రభుత్వం లెక్కలేనన్ని కుటుంబాలను నాశనం చేసింది. ఇది నిజం! ఇదే నిజం!! pic.twitter.com/mSszEES6ha — Rahul Gandhi (@RahulGandhi) November 9, 2020 షాద్‌నగర్‌కు చెందిన ఐశ్వర్య ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. కరోనా కారణంగా కాలేజీ యాజమాన్యం హాస్టల్ ఖాళీ చేయించింది. ఈ క్రమంలో షాద్‌నగర్ వచ్చిన ఐశ్వర్య ఆదివారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబానికి భారం కాకుడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సూసైడ్ నోట్లో తెలిపింది. ఇప్పటికే తన చదువు కోసం తల్లిదండ్రులు ఇంటిని తనఖా పెట్టారన్నది. చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండే ఐశ్వర్య యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్కాలర్షిప్ కింద బీఎస్సీ (హన్స్) గణితం చదవడానికి ఎల్‌ఎస్‌ఆర్‌లో చేరింది. ఇక ఈ ఏడాది మార్చి నుంచి స్కాలర్షిప్ రాకపోవడంతో పుస్తకాలు, హస్టల్ ఫీజు వంటి ఇతర ఖర్చులకు ఇబ్బంది తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకుంది. -
నేడు బిహార్‌లో రెండో దశ ఎన్నికలు
పట్నా: బిహార్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మహామహులు బరిలో నిలిచిన ఈ రెండో దశను బిహార్ ఎన్నికల్లో కీలక దశగా భావిస్తున్నారు. అధికార ఎన్డీయే అభ్యర్థుల కోసం ప్రధాని మోదీ, సీఎం నితీశ్‌సహా కీలక నేతలు, విపక్ష మహా కూటమి కోసం కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్‌గాంధీ, ఆర్జేడీ ముఖ్య నేత తేజస్వీ సహా ముఖ్యమైన నాయకులు ప్రచారం నిర్వహించారు. 17 జిల్లాల్లో విస్తరించిన మొత్తం 94 అసెంబ్లీ స్థానాలకు నేడు(మంగళవారం) ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో 1.35 కోట్ల మహిళా ఓటర్లు సహా మొత్తం 2.85 కోట్ల మంది ఓటర్లు సుమారు 1500 అభ్యర్థుల భవితను నిర్దేశించనున్నారు. ఈ రెండో దశ ఎన్నికల బరిలో ఉన్నవారిలో ఆర్జేడీ నేత, విపక్ష కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్, ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఉన్నారు. శత్రుఘ్న సిన్హా కుమారుడు లవ్ సిన్హా కాంగ్రెస్ తరఫున బంకీపూర్ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ జిల్లా నలందలోని ఏడు స్థానాలకు కూడా నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. నలంద జిల్లాలో జేడీయూ బలంగా ఉంది. రెండోదశ ఎన్నికలు జరుగుతున్న 94 సీట్లలో విపక్ష కూటమి తరఫున 56 స్థానాల్లో ఆర్జేడీ, 24 స్థానాల్లో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నాలుగు స్థానాల చొప్పున, సీపీఐఎంఎల్ మరికొన్ని స్థానాల్లో పోటీలో ఉన్నాయి. అధికార ఎన్డీయే నుంచి బీజేపీ 46 స్థానాల్లో, జేడీయూ 43 సీట్లలో, వీఐపీ 5 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఎల్జేపీ 52 సీట్లలో అభ్యర్థులను నిలిపింది. మధ్యప్రదేశ్ ఉప ఎన్నికలు కీలకం నేడు 10 రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికలపై అందరి దృష్టి ఉంది. సీఎం చౌహాన్‌కు సవాలుగా మారిన ఎన్నికలివి. కాంగ్రెస్‌కు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో కమల్ సర్కారు కూలడం తెల్సిందే. ఆ 25 మంది ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. గుజరాత్(8), కర్నాటక(2), చత్తీస్‌గఢ్(1), ఉత్తర ప్రదేశ్(7), జార్ఖండ్(2), నాగాలాండ్(2), హరియాణా(1), ఒడిశా(2), తెలంగాణ(1)ల్లోనూ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. -
సోనియా రాజీనామా : సీడబ్ల్యూసీ భేటీలో ట్విస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగాలని ఆ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. సోమవారం ఏడు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన సమావేశంలో సోనియానే పార్టీ తాత్కాలిక చీఫ్‌గా కొనసాగాలని సీనియర్ నేతలు మన్మోహన్ సింగ్, ఏకే ఆంటోనీలు కోరారు. పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని 23 మంది పార్టీ సీనియర్ నేతలు సోనియా గాంధీకి లేఖరాసిన నేపథ్యంలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం వాడివేడిగా సాగింది. సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలిగా మరికొన్ని నెలల పాటు కొనసాగుతారని సీడబ్ల్యూసీ భేటీ అనంతరం పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈరోజే సత్వర నిర్ణయం వెలువడుతుందని ఆశించరాదని, పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు, ఎంపికకు సమయం పడుతుందని తెలిపాయి. పార్టీ నూతన అధ్యక్షుడి ఎంపిక పూర్తయ్యే వరకూ అధ్యక్ష పదవిలో కొనసాగాలని సోనియాను తాము కోరామని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరికొన్ని నెలలపాటు పార్టీ తాత్కాలిక చీఫ్‌గా ఆమె కొనసాగుతారని పేర్కొన్నాయి. ఆరు నెలల్లో తదుపరి పార్టీ అధ్యక్షుడి ఎన్నిక పూర్తవుతుందని తెలిపాయి. ఇక అంతకుముందు సీడబ్ల్యూసీ సమావేశంలో సీనియర్ నేతల తీరుపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేయడం కాంగ్రెస్‌లో కలకలం రేపింది. నాయకత్వ మార్పుపై బీజేపీ ప్రోద్బలంతోనే సీనియర్లు లేఖ రాశారన్న రాహుల్ వ్యాఖ్యలపై కపిల్ సిబల్, ఆజాద్ వంటి సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సీనియర్ నేతలను అనునయించేందుకు స్వయంగా రాహుల్ వివరణ ఇచ్చారు. తాను సీనియర్లపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. మరోవైపు పార్టీ నాయకత్వపై సోనియా గాంధీకి లేఖ రాసిన వారిపై పార్టీ రాజ్యాంగానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ నేత అంబికా సోనీ కోరగా, తాము పార్టీ పరిధికి లోబడే ఆయా అంశాలను లేవనెత్తామని గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ పేర్కొన్నారు. ఇది క్రమశిక్షణ ఉల్లంఘనే అని భావిస్తే తమపై చర్యలు చేపట్టవచ్చని అన్నారు. కాగా పార్టీ యువనేతలతో పాటు పలువురు సీనియర్ నేతలు, పార్టీ ముఖ్యమంత్రులు తాజా పరిణామాల నేపథ్యంలో గాంధీ కుటుంబానికి బాసటగా నిలిచారు. చదవండి : సీడబ్ల్యూసీ భేటీలో ప్రకంపనలు -
‘అప్పుడు వాజ్‌పేయిని, అడ్వాణీని విమర్శించలేదు’
న్యూఢిల్లీ: దాదాపు 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. 2019 ఎన్నికల తర్వాత పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. యువ నాయకులంతా సీనియర్ల మీద గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలో గురువారం సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో యువ నాయకులు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీద విమర్శలు కురిపించారు. ఆయన ప్రభుత్వ నిర్ణయాల వల్లనే గత ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలయ్యిందని ఆరోపించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శశి థరూర్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ, ముంబై మాజీ కాంగ్రెస్ చీఫ్ మిలింద్ డియోరా మన్మోహన్ సింగ్‌కు మద్దతుగా నిలిచారు. యువ నాయకులంతా కావాలనే.. హానికరమైన విధానంలో మన్మోహన్పై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. (రాహుల్ సేనపై దృష్టి) ఈ క్రమంలో మనీష్ తివారీ ‘బీజేపీ కూడా 2004-2014 వరకు అధికారంలో లేదు. కానీ ఒక్క నాయకుడు కూడా వాజ్‌పేయిని గానీ, అడ్వాణీని కానీ విమర్శించలేదు. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్‌లో కొందరు మన్మోహన్ సింగ్ మీద అనవసర ఆరోపణలు చేస్తున్నారు’ అని ట్విట్ చేశారు. శశి థరూర్ కూడా మన్మోహన్‌కు మద్దతు తెలిపారు. ఈ మేరకు ఆయన ‘నేను మనీష్ తివారీ, మిలింద్ డియోరాలతో ఏకీభవిస్తున్నాను. యూపీఏ పదేళ్ల పాలన గురించి కావాలనే హానికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మన అపజయాల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కాంగ్రెస్‌కు పూర్వ వైభవాన్ని తీసుకురావాలంటే ఎంతో కృషి చేయాలి. అంతేకానీ సైద్ధాంతికపరంగా మనం విభేదించే వారితో చేతులు కలిపి ఇలా విమర్శలు చేయడం మంచిది కాదు’ అంటూ ట్వీట్ చేశారు. (నెహ్రూకు ఠాగూర్ రాసిన లేఖ చూశారా!) I agree with @ManishTewari & @milinddeora. UPA's transformative ten years were distorted & traduced by a motivated & malicious narrative. There's plenty to learn from our defeats & much to be done to revive @INCIndia. But not by playing into the hands of our ideological enemies. https://t.co/Ui6WUlBl3F — Shashi Tharoor (@ShashiTharoor) August 1, 2020 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత రాహుల్ గాంధీ ఏకంగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఎంతమంది ఎన్ని రకాలుగా నచ్చజేప్పే ప్రయత్నం చేసినా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు జ్యోతిరాధిత్య సింధియా.. పార్టీ నుంచి వెళ్లిపోయి బీజేపీలో చేరారు. తాజాగా రాజస్తాన్‌లో సచిన్ పైలట్ తిరుగుబాటు చేశారు. సీనియర్లు తమకు అవకాశం ఇవ్వడం లేదని.. గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయని.. గుర్తింపు దక్కడం లేదని.. అందుకే పార్టీ నుంచి వెళ్లి పోతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం సోనియా గాంధీ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. (కొత్త సారథి కావలెను) దీనిలో గత యూపీఏ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వారితో పాటు.. రాహుల్ గాంధీ టీం పాల్గొన్నారు. మన్మోహన్ సింగ్ నాయకత్వం వల్లనే గత ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలయ్యిందని యువ నాయకులు ఆరోపించారు. రాహుల్ గాంధీ తిరిగి పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరారు. ఈ క్రమంలో యువ నాయకులు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులపై తీవ్ర విమర్శలు చేశారు. ఆర్థిక మాంద్యం, కరోనా వైరస్‌పై కేంద్ర వైఖరి, చైనాతో వివాదం వంటి అంశాల్లో మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడంలో వీరంతా విఫలమయ్యారని ఆరోపించారు. సీనియర్ నాయకులు ప్రధానిపై చేసే దాడి చాలా బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ తరుణంలో పార్టీలో మరింత ఆత్మ పరిశీలన, సంప్రదింపులు, చర్చలు ఉండాలని యువ నాయకులు కోరారు. -
‘అసత్యాలు ప్రచారం చేస్తున్నారు’
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిపై పాలక బీజేపీ వాస్తవాలను దాచి అసత్యాలు ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. కరోనా మరణాలు, జీడీపీ, చైనాతో ప్రతిష్టంభన వంటి అంశాలపై బీజేపీ వాస్తవాలను కప్పిపుచ్చుతోందని దుయ్యబట్టారు. టెస్టింగ్‌లను తగ్గిస్తూ, మరణాలపై తప్పుడు వివరాలను ఇస్తున్నారని, నూతన పద్ధతిలో జీడీపీని లెక్కిస్తున్నారని కాంగ్రెస్ నేత పేర్కొన్నారు. చైనా దూకుడుపైనా ప్రభుత్వం అసత్యాలు చెబుతోందని ఆరోపించారు. కీలకాంశాలపై పాలకులు భ్రమల్లో విహరిస్తే భారత్ భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఎదురవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లో మొత్తం కేసుల శాతం, పదిలక్షల మందిలో మరణాల సంఖ్య తక్కువగా ఉండటంపై సందేహం వ్యక్తం చేసిన ఓ వెబ్సైట్ కథనాన్ని రాహుల్ తన ట్వీట్‌తో పాటు పోస్ట్ చేశారు. చైనాతో సరిహద్దు వివాదంలోనూ భారత్ తీరు సరిగ్గాలేదని, దీనికి భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కోవిడ్-19, లడఖ్ ప్రతిష్టంభన, వలస కార్మికుల దుస్ధితి, ఆర్థిక సంక్షోభం సహా పలు అంశాలపై బీజేపీ ప్రభుత్వంపై గత కొద్దివారాలుగా రాహుల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. చదవండి : సాయుధులుగానే ఉన్నారు -
‘మోదీ సత్తా తెలిపిన మూడీస్’
సాక్షి, న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థను సత్వర వృద్ధి దిశగా నడిపిస్తామని సీఐఐ 125వ వార్షికోత్సవాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొంటే ఆర్థిక వ్యవస్థను ప్రభుత్వం నీరుగార్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. ఆర్థిక వ్యవస్ధను ప్రధాని నరేంద్ర మోదీ నడినిస్తున్న తీరు తీసికట్టుగా ఉందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ పెదవివిరిచిందని రాహుల్ ప్రస్తావించారు. పేదలకు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఎలాంటి సాయం లేకపోవడంతో మున్ముందు విపత్కర పరిస్ధితులు నెలకొంటాయని రాహుల్ ట్వీట్ చేశారు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువైంది. చదవండి : ఆ బాలికపై దాడి అమానుషం : రాహుల్ -
‘కరోనా కట్టడిలో విఫలం’
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరగడం పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. మహమ్మారిని నియంత్రించే క్రమంలో సన్నద్ధతకు మనకు తగినంత సమయం ఉన్నా సరిగ్గా వ్యవహరించడంలో అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ఇది చాలా బాధాకరమని, కరోనాను పూర్తిగా కట్టడి చేసే అవకాశం ఉన్నా, సీరియస్‌గా తీసుకుని సన్నద్ధమవడంలో విఫలమయ్యామని రాహుల్ మంగళవారం ట్వీట్ చేశారు. వైద్య సిబ్బందికి తగిన భద్రత కల్పించడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం ప్రజలకు చప్పట్లు కొట్టాలని పిలుపు ఇచ్చిందన్న ఓ వైద్యుడి ట్వీట్‌ను రాహుల్ ప్రస్తావించారు. మరోవైపు భారత్‌లో కరోనా వైరస్ కేసులు 500 దాటగా మృతుల సంఖ్య పదికి పెరిగింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భారత్‌లో దాదాపు 20కిపైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈనెల 31 వరకూ లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ట్రైన్లు, విమానాల రాకపోకలు సహా అంతరాష్ట్ర రవాణా పూర్తిగా నిలిచిపోయింది. ఇక ప్రాణాంతక వైరస్ వ్యాప్తితో అత్యవసర పరిస్థితి నెలకొన్న క్రమంలో భవన నిర్మాణ రంగ కార్మికులతో పాటు అసంఘటితరంగ కార్మికులను ఆదుకునేందుకు వారికి నగదు సాయం సహా పలు తక్షణ చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. చదవండి : ‘కరోనా వైరస్ ఓ సునామీ’ -
‘ఆయనను ఎప్పుడూ అగౌరవపరచలేదు’
న్యూఢిల్లీ: దోషులుగా తేలిన చట్టసభల సభ్యులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో విభేదిస్తూ నాటి యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం విషయం తెలిసిందే. అయితే ఆనాటి సంఘటన మాజీ ప్రధాని మన్మోహన్‌కు ఇబ్బందికర పరిస్థితిని తీసువచ్చిందని మాజీ ప్రణాళికా సంఘం అధ్యక్షుడు అహ్లూవాలియా ఇటీవల వెల్లడించారు. ఈ విషయంపై కాంగ్రెస్ ముఖ్య ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా స్పందించారు. 2013 నాటి ఆర్డినెన్స్ సమయంలో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, రాహుల్ గాంధీకి మధ్య ఏం జరిగిందో తెలియదు.. గానీ, మన్మోహన్‌ను.. రాహుల్ గాంధీ ఒక మార్గదర్శి, గురువుగా భావించేవారని తెలిపారు. కాంగ్రెస్‌పార్టీ కూడా ఏనాడు మన్మోహన్ సింగ్‌ను అగౌరవపరచలేదని అయన స్పష్టం చేశారు. (ప్రశాంత్‌కిశోర్‌కు జడ్ కేటగిరీ భద్రత !) కాగా, అన్ని పార్టీలు దోషులుగా తేలినవారిని చట్టసభల్లోకి అనుమతించాలని చేసే చట్టానికి ఆమోదం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో రాజకీయాలను శుభ్రపరిచి.. పార్టీ స్థాయిని పెంచే నాయుకుడిగా రాహుల్ ప్రవర్తించారని సుర్జేవాలా తెలిపారు. ‘ఆర్డినెన్స్ కాగితాల్ని చింపడం సమస్య కాదు. స్వచ్ఛమైన రాజకీయాల్లో నేరస్తులు ఉండాలా.. వద్దా.. అనేది సమస్య’ అని ఆయన అన్నారు. ఈ ఘటన తర్వాత సుప్రీంకోర్టు ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు వారిపై ఉన్న కేసులను బహిరంగపరచాలని అన్నిపార్టీలకు ఆదేశాలు జారీ చేసిందని సుర్జేవాలా గుర్తు చేశారు. -
రాహుల్, ప్రియాంకలను ఆపేశారు
న్యూఢిల్లీ/కోల్‌కతా/బిజ్నోర్/మీరట్: ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో గత వారం ‘పౌర’ ఆందోళనల్లో మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీలను మీరట్ పోలీసులు అడ్డుకున్నారు. ‘మీరట్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండటంతో నిషేధాజ్ఞలు విధించాం. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరిగినా బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపాం. దీంతో వారే వెనక్కి వెళ్లిపోయారు’ అని పోలీసులు తెలిపారు. ‘సంబంధిత ఉత్తర్వులను చూపాలని పోలీసులను అడిగాం. అవేమీ చూపకుండా వారు మమ్మల్ని వెనక్కి వెళ్లాలన్నారు’ అని రాహుల్, ప్రియాంక మీడియాతో అన్నారు. ‘పౌర’ చట్టంపై ఏకమైన విద్యార్థి సంఘాలు పౌరసత్వ చట్ట సవరణతోపాటు, కేంద్రం చేపట్టదలచిన జాతీయ పౌర పట్టిక, జనాభా పట్టిక సవరణలకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న 70 యువ, విద్యార్థి సంఘాలు ఏకమయ్యాయి. నేషనల్ యంగ్ ఇండియా కో ఆర్డినేషన్ అండ్ కాంపెయిన్ (వైఐఎన్‌సీసీ) ఛత్రం కింద ఈ సంఘాలు మంగళవారం ఏకమయ్యాయి. 71వ గణతంత్ర దినోత్సవాలకు ముందుగానే కేంద్రం పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కు తీసుకోవాలని వైఐఎన్‌సీసీ సభ్యుడు సాయి బాలాజీ డిమాండ్ చేశారు. అతడు మా కాల్పుల్లోనే చనిపోయాడు ‘పౌర’ ఆందోళనల సందర్భంగా ఒక యువకుడి మృతికి తామే కారణమని ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ పోలీసులు అంగీకరించారు. బిజ్నోర్‌లోని నహ్తౌర్లో హింసాత్మకంగా మారిన ఆందోళనలను అదుపు చేసేందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందని ఎస్పీ విశ్వజీత్ శ్రీవాస్తవ మంగళవారం వెల్లడించారు. కాగా, ఎన్నార్సీపై ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా చేస్తున్న ప్రకటనలు పొంతనలేకుండా ఉన్నాయని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. బెంగాల్ గవర్నర్‌కు చుక్కెదురు బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధంఖర్ మరోసారి భంగపాటుకు గురయ్యారు. కోల్‌కతాలో జాదవ్‌పూర్ వర్సిటీ స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు బయలుదేరిన ఆయన్ను ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఎన్నార్సీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న టీఎంసీ అనుబంధ విద్యార్థి సంఘం కార్యకర్తలు ఆయన వాహనం వర్సిటీలోకి ప్రవేశించకుండా మెయిన్ గేట్ వద్దే రోడ్డుపై బైఠాయించారు. గో బ్యాక్ అని నినాదాలు చేసుకుంటూ, నల్ల జెండాలు ప్రదర్శించారు. దీంతో యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ అయిన సురంజన్ దాస్‌కు గవర్నర్ ఫోన్ చేశారు. ఆందోళనకారులను శాంతింప జేయాలని సురంజన్‌ను కోరారు. ఫలితం లేకపోవడంతో గవర్నర్ వెనుదిరిగారు. ఈ సందర్భంగా ధంకర్ మమత ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు. -
రాహుల్ రేప్‌లను ఆహ్వానిస్తున్నారు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు చేసిన ‘రేప్ ఇన్ ఇండియా’ వ్యాఖ్యలపై లోక్‌సభ దద్దరిల్లింది. యావత్ భారతదేశాన్ని, ఆర్థిక ప్రగతిని కించపరిచేలా ఆయన వ్యాఖ్యానించారంటూ సభలో నిరసనలు ఉవ్వెత్తున ఎగిశాయి. రాహుల్ రేప్‌లను ఆహ్వానిస్తున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపిస్తే, పార్లమెంటులో కొనసాగే నైతిక హక్కు రాహుల్‌కి లేదని మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. గురువారం జార్ఖండ్ ఎన్నికల ప్రచారరాహుల్ గాంధీ ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ మేకిన్ ఇండియా చేస్తామని హామీ ఇచ్చారు. కానీ నేడు దేశవ్యాప్తంగా జరుగుతున్న అత్యాచారాలు చూస్తుంటే భారత్ ‘రేప్ ఇన్ ఇండియా’గా మారుతోందని అన్నారు. శుక్రవారం ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే 2001 డిసెంబర్ 13న పార్లమెంటుపై జరిగిన దాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పించారు. అనంతరం బీజేపీ మహిళా ఎంపీలు రాహుల్ వ్యాఖ్యల్ని నిరసిస్తూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. స్పీకర్ ఓం బిర్లా రెండు సార్లు సభని వాయిదా వేసినా పరిస్థితి చక్కబడలేదు. దీంతో ఆయన సభని నిరవధికంగా వాయిదా వేశారు. శుక్రవారంతో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసిపోయాయి. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సభలో రాహుల్‌ని గట్టిగా నిలదీశారు. రాహుల్ వ్యాఖ్యలు చూస్తే దేశంలో మహిళలపై అత్యాచారం చేయాలని పిలుపునిస్తున్నట్టుగా ఉందన్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్మృతి ఇరానీకి మద్దతు నిలిచారు. రాహుల్‌కు మద్దతుగా కనిమొళి.. బీజేపీ సభ్యులు సభలో తీవ్రంగా దాడి చేయడంతో రాహుల్‌కు ఎంపీ కనిమొళి మద్దతు పలికారు. లోక్‌సభలో రాహుల్ గాంధీ మాట్లాడడానికి స్పీకర్ అనుమతించకపోవడంతో ఆయన పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడారు. బీజేపీ తన వ్యాఖ్యల్ని వక్రీకరించిందని తాను క్షమాపణ చెప్పనని అన్నారు. ఈసీకి బీజేపీ ఫిర్యాదు రాహుల్ అత్యాచార వ్యాఖ్యల్ని నిరసిస్తూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నేతృత్వంలో బీజేపీ మహిళా ఎంపీలు కేంద్ర ఎన్నిక సంఘాన్ని సంప్రదించారు. రాహుల్ అత్యాచారాన్ని ఒక రాజకీయ ఆయుధంగా వాడుకుంటున్నారని ఎంపీలు ఫిర్యాదు చేశారు. వీలైనంత మేర ఆయనకు కఠిన శిక్ష విధించాలని ఈసీని కోరారు. చట్టబద్ధమైన పక్రియలన్నీ పూర్తయ్యాక తాము తప్పకుండా న్యాయం చేస్తామని ఎన్నికల సంఘం అధికారులు హామీ ఇచ్చినట్టు ఇరానీ వెల్లడించారు. -
చిదంబరాన్ని కలిసిన రాహుల్, ప్రియాంక
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రాలు బుధవారం ఉదయం మాజీ ఆర్ధిక మంత్రి పి. చిదంబరంను కలిశారు. చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. గత సోమవారం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, మనీష్ తివారీలు ఆయనను కలిశారు. కాగా, అధికారంలో ఉన్నప్పుడు ముడుపుల కుంభకోణం, మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారంటూ అభియోగాలు వచ్చిన నేపథ్యంలో సీబీఐ ఆగస్టు 21న చిదంబరంను అరెస్ట్ చేసింది. అనంతరం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసినా ఈడీ కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. అప్పటి నుంచి ఆయన తీహార్ జైలులో విచారణ ఖైదీగా ఉంటున్నారు. -
ఏఐసీసీ కార్యాలయం ఎదుట బీజేపీ నిరసన
న్యూఢిల్లీ: వివాదాస్పదమైన రాఫెల్ కేసులో ఎలాంటి అవకతవకలు జరగలేదని సుప్రీంకోర్టు... కేంద్ర ప్రభుత్వానికి క్లీన్చిట్ ఇచ్చిన నేపథ్యంలో.. శుక్రవారం బీజేపీ కార్యకర్తలు న్యూఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంలో ప్రధాని మోదీనుద్దేశించి చౌకీదార్ చోర్ హై (కాపలదారుడే దొంగ) అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. Delhi: BJP holds a protest outside All India Congress Committee (AICC) office, demanding an apology from Rahul Gandhi over his remarks on #Rafale verdict. pic.twitter.com/GkxTb264Ns — ANI (@ANI) November 15, 2019 -
‘ఉద్యోగాలు కోరితే చుక్కలు చూపుతున్నారు’
ముంబై : నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర సర్కార్ వాస్తవ అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. యువత ఉద్యోగాలు కోరుతుంటే ప్రభుత్వం చంద్రుడిని చూడాలని చెబుతోందని ఇటీవల ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2ను ఉటంకిస్తూ రాహుల్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కీలకాంశాల నుంచి ప్రజల దృష్టి మరల్చుతున్నారని ఆక్షేపించారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో జరిగిన భేటీలో డోక్లాం ప్రతిష్టంభన గురించి ప్రస్తావించారా అని ప్రధాని మోదీని ప్రశ్నించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ ఆదివారం లాతూర్ జిల్లాలో జరిగిన ర్యాలీలో మాట్లాడారు. 2017లో చైనా దళాలు భారత భూభాగంలో ప్రవేశించడాన్ని ప్రస్తావిస్తూ ఇది మేకిన్ ఇండియా కాదని మేకిన్ చైనా అని ఎద్దేవా చేశారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలను ప్రస్తావించకుండా బీజేపీ నేతలు మూన్‌మిషన్, ఆర్టికల్ 370 అంటూ దాటవేస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతులు, నిరుద్యోగులు సమస్యలతో సతమతమవుతుంటే 15 మంది సంపన్నులకు చెందిన రూ 5.5 లక్షల కోట్ల రుణాలను మోదీ ప్రభుత్వం మాఫీ చేసిందని ఆరోపించారు. నోట్ల రద్దుతో ఎవరికి లాభం చేకూరిందని రాహుల్ ప్రశ్నించారు. నోట్ల రద్దు ఎవరికీ మేలు చేయకుంటే తనను ఉరి తీయాలని మోదీ అన్నారని కానీ ఆ నిర్ణయం ఎవరికీ ప్రయోజనం కలిగించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. నీరవ్ మోదీ వంటి వారు దేశాన్ని వీడి పరారయ్యారని చెప్పుకొచ్చారు. చంద్రుడిపైకి రాకెట్ పంపితే మహారాష్ట్రలోని ప్రజల పొట్టలో అది తిండి నింపలేదని వ్యంగ్యంగా అన్నారు. పేదల జేబుల్లో డబ్బును కొల్లగొట్టి పెద్దలకు పంచేందుకే నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాల వెనుక ఉద్దేశమని మోదీ సర్కార్‌పై ధ్వజమెత్తారు. -
విచారణకు హాజరైన రాహుల్‌గాంధీ
-
కన్నీటిపర్యంతమైన ముఖ్యమంత్రి బఘేల్
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కన్నీటి పర్యంతమయ్యారు. తన స్థానంలో ఛత్తీస్‌గఢ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (సీపీసీసీ) అధ్యక్ష పదవిని మోహన్ మార్కమ్ చేపడుతున్న సందర్భంగా ఆయన గత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. సీపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిన బఘేల్ పార్టీని ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆయన ముఖ్యమంత్రి పదవిని చేపట్టడంతో ఆయన వారసుడిగా సీపీసీసీ పదవిలో మార్కమ్‌ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఆయన పదవీ స్వీకార కార్యక్రమం శనివారం రాయ్‌పూర్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన బఘేల్.. గత ఐదేళ్లుగా తనతో కలిసి పనిచేసిన పార్టీ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తన నాయకత్వంలో పార్టీకి సహకరించిన వారిని గుర్తుచేసుకున్నారు. ‘2013లో ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిన తరువాత రాహుల్ గాంధీ సీపీసీసీ అధ్యక్షుడిగా నన్ను నియమించారు. 2014 లోక్‌సభ ఎన్నికల ఘోరపరాజయం అనంతరం పార్టీ నాయకులు ప్రారంభించిన పోరాటం ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలోకి వచ్చే వరకు కొనసాగింది' అని బఘేల్ పేర్కొన్నారు. సీపీసీపీ నూతన అధ్యక్షుడు మోహన్ మార్కమ్ కష్టపడి పనిచేసే వ్యక్తి, నిరాడంబరంగా ఉంటూ అందరితో కలిసిపోతారని ఆయన ప్రశంసించారు. ఈ నెల 28న సీపీసీసీ అధ్యక్షుడిగా మోహన్ మార్కమ్‌ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. -
రాగా తంత్రమా ? నమో మంత్రమా ?
రాజస్తాన్‌లో ప్రధాని మోదీ గాలి వీస్తోందా ? 2014 ఎన్నికల మాదిరిగా ప్రభంజనం సృష్టించకపోయినా భారీగానే సీట్లు కొల్లగొడతారా ? గత అసెంబ్లీ ఎన్నికల్లో వసుంధరా రాజెపై వ్యతిరేకతతో రాణిగారి కోటను కూలగొట్టిన ఓటర్లు ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలనేసరికి మళ్లీ నమో మంత్రమే జపిస్తారా ? పాక్‌కు సరిహద్దు రాష్ట్రంలో దేశభక్తే ఉప్పొంగుతుందా ? స్థానిక సమస్యలనే ఎన్నికల అస్త్రంగా మలచుకున్న కాంగ్రెస్ తంత్రం నెగ్గుతుందా ? మొత్తం 25 స్థానాలకు గాను 13 సీట్లలో నాలుగోదశలో పోలింగ్ జరిగింది. మిగిలిన పన్నెండు సీట్లలో మే 6న పోలింగ్ జరగబోతోంది. ఈ దశలో ఉన్న కీలక నియోజకవర్గాల్లో పరిస్థితులేంటి ? రాజస్తాన్ ప్రజల మొగ్గు ఎటు ? ఓట్లు, సీట్లు లెక్కలు ఏం చెబుతున్నాయ్ ? 2014 ఎన్నికల్లో మోదీ ప్రభంజనంతో బీజేపీ 25కి 25 సీట్లు క్లీన్ స్వీప్ చేసింది. ఓట్లు కూడా ఇంచుమించుగా 56 శాతం వచ్చాయి. కానీ అయిదేళ్లలో పరిస్థితుల్లో భారీగా మార్పులు వచ్చాయి. ప్రధానంగా వసుంధరా రాజెపై వ్యతిరేకత, కొన్ని కొత్త పార్టీలు పుట్టుకొచ్చి భారీగా ఓట్లను చీల్చడం, కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ హామీతో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. 38.8శాతం మాత్రమే ఓట్లతో 73 స్థానాలను దక్కించుకుంది. అలాగని కాంగ్రెస్ పార్టీ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేదు. రాజేపై నెలకొన్న వ్యతిరేకతకి భారీగా సీట్లు, ఓట్లు కొల్లగొట్టాలి. కానీ 39.3 శాతం ఓట్లతో 100 స్థానాల్లో మాత్రమే గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రెండు ప్రధాన పార్టీల మధ్య ఓట్లలో తేడా కేవలం 0.5శాతం మాత్రమే. అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని కొత్త పార్టీలు పుట్టుకొచ్చి ఓట్లను భారీగా చీల్చాయి. కొత్త పార్టీలే 9 శాతం ఓటు షేర్‌తో 12 స్థానాల్లో గెలుపొందాయి. బీజేపీకి గుడ్‌బై కొట్టేసి కొత్త పార్టీ పెట్టిన రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ) హనుమాన్ బేనీవాల్ 2.4శాతం ఓట్లతో మూడు అసెంబ్లీ స్థానాలను సాధించడం విశేషంగా చెప్పుకోవాలి. అసెంబ్లీ ఎన్నికలు వేరు, లోక్‌సభ ఎన్నికలు వేరు అన్న చైతన్యం ఈ మధ్య ఓటర్లలో బాగా పెరుగుతోంది. అదే ఈ సారి బీజేపీకి కలిసి వస్తుందని ఎన్నికల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జాతీయత వర్సస్ స్థానికత పాకిస్థాన్‌కు సరిహద్దు రాష్ట్రం కావడంతో రాజస్తాన్‌లో బీజేపీ ప్రధానంగా సర్జికల్ స్ట్రయిక్స్, దేశభక్తినే ప్రచార అస్త్రాలుగా మార్చుకుంది. జై జవాన్, జైకిసాన్, జై విజ్ఞాన్ అన్న నినాదంతో ప్రచారం చేస్తోంది. ఈ రాష్ట్రం నుంచి యువకులు ఎక్కువగా సైన్యంలో చేరుతూ ఉండడంతో పుల్వామా దాడులు, అభినందన్‌ని వెనక్కి తీసుకురావడం వంటి అంశాలతో సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ ఇచ్చిన రుణమాఫీ అమలు సరిగా జరగకపోవడం కూడా బీజేపీకి కలిసివస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ స్థానిక సమస్యలపై దృష్టి పెడుతూ ప్రచారం చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్లు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరించారు. సీఎం పదవికి పోటీ ఉండడంతో కలిసికట్టుగా పనిచెయ్యలేదు. కానీ ఈ సారి ఉమ్మడిగా వ్యూహాలు రచించారు. కాంగ్రెస్ పార్టీ కనీస ఆదాయ పథకం (న్యాయ్) సరిగ్గా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విఫలమైనప్పటికీ, గ్రామీణ సంక్షోభం, రైతు సమస్యలనే ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ఉంటే అభివృద్ధి పరుగులు పెడుతుందని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అల్వార్, అజ్మీర్ పరిస్థితులు మారుతున్నాయా ? రాజస్తాన్ లోక్‌సభ ఎన్నికల్లో ఈ సారి అందరి దృష్టి అల్వార్, అజ్మీర్ నియోజకవర్గాలపైనే ఉంది. గత లోక్‌సభ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసిన బీజేపీ ఆ తర్వాత తన హవాను నిలబెట్టుకోలేక 2018 జనవరిలో జరిగిన ఉప ఎన్నికల్లో ఈ రెండు స్థానాలను కోల్పోయింది. ఎవరికీ అందుబాటులో ఉండకుండా, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్న నాటి బీజేపీ సీఎం వసుంధర రాజె వ్యవహారశైలిపై నెలకొన్న అసంతృప్తి సెగలు ఉప ఎన్నికల్లోనే తగిలాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అల్వార్, అజ్మీర్‌ల నుంచి బీజేపీ తరఫున నెగ్గిన చాంద్‌నాథ్, సన్వర్‌లాల్ జాట్ మృతి చెందడంతో ఈ రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైన రఘుశర్మ అజ్మీర్ నుంచి 84 వేల ఓట్ల తేడాతో, కరణ్ సింగ్ యాదవ్ అల్వార్ నుంచి ఇంచుమించుగా 2 లక్షల ఓట్ల మెజార్టీతో నెగ్గారు. ఈ సారి ఈ స్థానాల్లో గెలుపు ఎవరిదన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు మళ్లీ పరిస్థితులు మారుతున్నాయని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ హవా పనిచేస్తుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అభ్యర్థుల్ని మార్చేసిన కాంగ్రెస్ అల్వార్, అజ్మీర్ ఈ రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల్లో నెగ్గిన అభ్యర్థుల్ని మార్చేసింది. అజ్మీర్‌లో రఘుశర్మని తప్పించిన కాంగ్రెస్ పార్టీ కొత్త ముఖమైన రిజు ఝున్‌ఝున్‌వాలాకు టికెట్ ఇచ్చింది. ఆయన స్థానికుడు కాకపోవడంతో కొంత వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, 2014 ఎన్నికల్లో సన్వర్‌లాల్ చేతిలో ఓటమిపాలైన సచిన్‌పైలట్ మద్దతు కలిగిన ఝన్‌ఝన్‌వాలా పైలట్‌కున్న పాపులారిటీనే నమ్ముకున్నారు. ఇక బీజేపీ తరపున స్థానిక వ్యాపారవేత్త, కశింగఢ్ ఎమ్మెల్యే భగీరథ్ చౌ«ధరీ పోటీ చేస్తున్నారు. లోకల్ అభ్యర్థి కావడం ఆయనకు కలిసివస్తోంది. ఇక అల్వార్ మూకదాడులతో దేశవ్యాప్తంగా వార్తల్లోకెక్కిన ప్రాంతం. హరియాణాకు చెందిన పాలవ్యాపారి పెహ్లూఖాన్‌ను హిందూ మతోన్మాదులు కొట్టి చంపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నియోజకవర్గంలో యాదవుల ఓట్లే కీలకం. ఆ తర్వాత మియో ముస్లింలు కూడా గణనీయ సంఖ్యలోనే ఉన్నారు. గోసంరక్షణ పేరిట జరిగిన మూక దాడుల ప్రభావం ఉప ఎన్నికల్లో బీజేపీపై పడింది. అయినప్పటికీ ఈ సారి కూడా మతపరమైన విభజననే ఆ పార్టీ నమ్ముకుంది. గత ఎన్నికల్లో నెగ్గి మృతిచెందిన చాంద్‌నాథ్ శిష్యుడు, బాబా బాలక్‌నాథ్‌ను బరిలోకి దింపింది. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున భన్వర్ జితేంద్ర సింగ్ ఆయనకి గట్టిపోటీయే ఇస్తున్నారు. బీఎస్పీ ముస్లిం సామాజికవర్గానికి చెందిన ఇమ్రాన్‌ఖాన్‌కు టికెట్ ఇవ్వడంతో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ ఓట్లు చీలిపోయి బీజేపీకి లాభం చేకూరే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు దౌసా లోక్‌సభ ఎంపీ హరీశ్ మీనా బీజేపీకి గుడ్ బై కొట్టేసి కాంగ్రెస్ శిబిరానికి చేరుకోవడం కమలనాథులకి ఎదురు దెబ్బే. పింక్ సిటీ జైపూర్‌లో ఒక మహిళా అభ్యర్థికి 48 ఏళ్ల తర్వాత పోటీ చేసే అవకాశం రావడం ఈసారి ఎన్నికల్లో ప్రత్యేకత. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రామ్‌చరణ్ బొహ్రా ఏకంగా 5.40 లక్షల ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ నేత మహేశ్ జోషిని మట్టికరిపించారు. క్లీన్ ఇమేజ్ కలిగిన బొహ్రాకు కార్యకర్తల్లో కూడా మంచి ఆదరణ ఉంది. . పార్లమెంటు సమావేశాల్లో కూడా చురుగ్గా పాల్గొన్నారు. 110 చర్చల్లో పాల్గొన్ని 312 ప్రశ్నలు వేశారు.అయితే నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదన్న విమర్శలూ ఉన్నాయి. అలాంటి గట్టి అభ్యర్థిని ఢీకొనడానికి ఏరికోరి ఒక మహిళకు సీటు ఇవ్వాలని నిర్ణయించిన కాంగ్రెస్ నగర మాజీ మేయర్ జ్యోతి ఖండేల్వాల్ను బరిలో దింపింది. దీంతో ఇక్కడ హోరాహోరి పోరు నెలకొంది. చివరిసారిగా1971లోజైపూర్ మాజీ మహారాణి గాయత్రిదేవి స్వతంత్రపార్టీ తరఫున ఎన్నికయ్యారు. బ్రాహ్మణులు, రాజపుత్రుల ఓట్లే ఇక్కడ కీలకం.రాజస్థాన్‌లోని జైపూర్ (రూరల్) నియోజకవర్గంలో ఇద్దరు క్రీడాకారుల మధ్య పోరాటానికి తెరలేచింది. బీజేపీ ఎంపీ, కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ గురితప్పని షూటర్. 2014లో మోదీ హవాతో రాథోడ్ జయపూర్ రూరల్ నుంచి సులభంగా నెగ్గారు. ఆ వెంటనే మంత్రి పదవి వరించింది. కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణ పూనియా డిస్కస్ త్రోలో అంతర్జాతీయంగా భారత కీర్తిపతాకను రెపపలాడించారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అయిదేళ్లలో సీన్ మారిపోయింది. వసుంధర రాజెకి వ్యతిరేక పవవాలు వీయడంతో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పూనియా సదూల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి నెగ్గారు. ఇప్పటికే కేంద్ర క్రీడా మంత్రిగా రాథోడ్ మంచిపేరే సంపాదించుకున్నారు. ఆయనపై పోటీకి నిలబడడమే ఒక సాహసం. అలాంటి సాహసాన్ని ఒక క్రీడాకారిణి చేయడంతో కృష్ణ పూనియాపై కూడా అంచనాలు పెరిగాయి. బీజేపీ, ఆరెస్సెస్ అండదండలు, మోదీ ఇమేజ్ రాథోడ్‌కు కలిసి వస్తే, జాట్ సామాజిక వర్గానికి చెందిన పూనియాకు కులసమీకరణలు అనుకూలం. రాథోడ్‌ని ఎదుర్కోవడానికి చేతికి గ్లౌజులు ధరించి సిద్ధంగా ఉన్నానంటూ పంచ్ డైలాగ్‌లతో పూనియా ప్రచారంలో ఆకట్టుకుంటున్నారు. ‘‘నేను రైతు బిడ్డని. నాకు గ్రామీణుల పడే బాధలేంటో తెలుసు. క్రీడల్లో కూడా నేను గ్రామీణ ప్రాంతాల్లో యువత ఆడే డిస్కస్ త్రోనే ఎంచుకున్నా. ఏసీ హాళ్లలో కూర్చొని ఆటలాడే గేమ్స్ నాకు తెలీవు‘‘అని రాథోడ్ పైకి మాటల తూటాలు పేల్చారు.. మరోవైపు గత అయిదేళ్లలో నియోజకవర్గానికి తాను ఎంత చేస్తున్నారో చెబుతున్న రాథోఢ్ యువతరం ఓట్లపై ఆశలు పెట్టుకున్నారు. బికనీర్ అన్నదమ్ముల సవాల్ బికనీర్ నియోజకవర్గం (ఎస్సీ రిజర్వ్డ్) బీజేపీకికంచుకోట. గత 15 ఏళ్లుగా ఈ సీటు బీజేపీకే దక్కుతోంది. 2004లో బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర ప్రాతినిధ్యం వహించిన స్థానం. ఈ సారి ఒక మాజీ ఐఎఎస్ మాజీ ఐపీఎస్ మధ్య ఉత్కంఠభరిత పోరాటానికి తెరలేచింది. వీళ్లిద్దరూ బంధువులు కూడా కావడం విశేషం. గత రెండు దఫాలుగా బీజేపీకిచెందిన అర్జున్ రామ్ మేఘవాల్ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాజీ ఐఎఎస్ అధికారి, కేంద్ర మంత్రి అయిన అర్జున్ రామ్‌కు నియోజకవర్గంలో మంచిపేరు ఉంది. చేనేత కుటుంబానికి చెందిన ఆయన కష్టపడిచదువుకొని ఐఎఎస్ అయ్యారు. చురు జిల్లాకు కలెక్టర్‌గా పని చేసిన అర్జున్‌రామ్ 2009లో రాజకీయాల్లోకి వచ్చారు. ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా భూ వివాదం కేసు ఆయన పర్యవేక్షణలోనే సాగింది. నీటివనరులు, గంగాప్రక్షాళన శాఖ సహాయ మంత్రిగా ఉన్న అర్జున్‌రామ్ ఇప్పటికీ పార్లమెంటుకి సైకిల్‌పై వచ్చే అతి కొద్ది మంది ఎంపీల్లో ఒకరు. ఈయనపై పోటీకి కాంగ్రెస్ పార్టీ ఆయన పిన్ని కుమారుడు ఐపీఎస్అధికారి అయిన మదన్‌గోపాల్‌ను రంగంలోకి దింపింది. ‘‘అర్జున్‌రామ్ మా పెద్దమ్మ కొడుకు. నా కన్నా పెద్దవాడు. కానీ మా ఇద్దరి భావజాలంలో చాలా తేడాలున్నాయి. నేనుఎన్నికల్లో పోటీపడడం . అయినా దీనిని సవాల్‌గా తీసుకున్నా‘అని మదన్ అంటున్నారు. జాట్లు ఆధిక్యం కలిగినబికనీర్లో ముస్లింలు, రాజపుత్రులు కూడా గణనీయమైన సంఖ్యలోనే ఉన్నారు. మే6న పోలింగ్ జరిగే స్థానాలు(మొత్తం – 12) ►గంగానగర్, బికనీర్, చురు, ఝున్ఝునూ, సీకర్, ►జైపూర్ (రూరల్), జైపూర్, అల్వార్, భరత్పూర్, ►కరౌలీ–ధోల్పూర్, దౌసా, నాగౌర్ ►‘‘ఉప ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే ఓటు వేశాను. ఎందుకంటే ఆ ఓటు ప్రధానిని ఎన్నుకోవడానికి కాదు. కేవలం వసుంధరా రాజెను ఇంటికి పంపించడానికే. మా లక్ష్యం నెరవేరింది. మోదీపై మాకు ఎప్పుడూ వ్యతిరేకత లేదు’’ – జితేంద్ర చౌదరి, ధర్మపుర గ్రామస్తుడు ►‘‘అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన రుణమాఫీ హామీ అమలు అధికారంలోకి వచ్చిన పదిరోజుల్లో జరగకపోతే పదకొండో రోజునే సీఎంను మారుస్తానని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పదే పదే చెప్పారు. మా రుణాలు మాఫీ కూడా కాలేదు. ఆయన సీఎంనూ మార్చలేదు. ఇక కాంగ్రెస్‌కి మేమెందుకు ఓటు వేయాలి‘‘ – బుద్ధరామ్ జాట్, అల్వార్ రైతు ►‘‘మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అని మోదీ చెప్పారు. గుజరాత్ మోడల్ అంటూ ఊదరగొట్టారు. కానీ గత అయిదేళ్లలో మాకు ఒక్క రోజు కూడా పని దొరకలేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాతే గ్రామాల్లో పనులు జరుగుతున్నాయి’’ – రాహుల్ మీనా, గమ్రీ గ్రామస్తుడు ►‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యాంగాన్నే మార్చాలని చూస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారు. ఎస్సీ, ఎస్టీ చట్టాలను మార్చేసి, ఆదివాసీలను అటవీ ప్రాంతాల నుంచి ఖాళీ చేయిస్తారు. సుప్రీం తీర్పుల్ని కూడా ఆయన లెక్కచేసే పరిస్థితి ఉండదు’’ – కన్నయ్యలాల్ భుజ్, ఆదివాసీ యువకుడు -
మీకు ప్రచారనిధులు ఎక్కడివి?
ఆగ్రా/మహువా: టీవీ చానెళ్లలో 30 సెకన్ల ప్రకటనకు లక్షలాది రూపాయలు ఖర్చవుతుండగా ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ చేసుకుంటున్న భారీ ప్రచారానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. స్నేహితుడు అనిల్ అంబానీకి లాభం కలిగేలా రఫేల్ ఒప్పందం షరతులను ప్రధాని మోదీ మార్చారని ఆరోపించారు. సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ సిక్రి, గుజరాత్‌లోని మహువాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్ మాట్లాడారు. ‘ఎక్కడ చూసినా నరేంద్ర మోదీ ప్రచారమే కనిపిస్తోంది. టీవీల్లో 30 సెకన్ల ప్రకటన, పత్రికల్లో చిన్న ప్రకటనకు లక్షల్లో ఖర్చవుతోంది. ఈ డబ్బంతా మోదీకి ఎవరిస్తున్నారు? కచ్చితంగా అది మోదీ జేబులో డబ్బు మాత్రం కాదు’ అని పేర్కొన్నారు. ప్రజల సొమ్మును నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, లలిత్ మోదీ, విజయ్ మాల్యా వంటి పరారైన నేరగాళ్లకు ప్రధాని మోదీ దోచిపెట్టారని ఆరోపించారు. ‘ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగాలు, ప్రతి బ్యాంకు అకౌంట్లో రూ.15 లక్షలు.. అంటూ ప్రజలను మోసం చేసి మోదీ అధికారంలోకి వచ్చారన్నారు. తాము మాత్రం చేయగలిగిందే చెబుతామన్నారు. న్యాయ్ పథకం ద్వారా ప్రతి నిరుపేద మహిళ బ్యాంకు అకౌంట్లో ఏడాదికి రూ.72 వేలు జమ చేస్తామన్నారు. ‘ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడకుండా న్యాయ్‌కు అవసరమైన నిధులను సమకూరుస్తాం. మధ్య తరగతిపై భారం వేయం. పన్ను భారం పెంచం. అనిల్ అంబానీ, నీరవ్ మోదీ వంటి వారి నుంచి వీటిని రాబడతాం’ అని రాహుల్ వివరించారు. రఫేల్ డీల్ విషయంలో ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు వివరణ కోరిన నేపథ్యంలో రాహుల్ కాస్త వెనక్కి తగ్గారు. రూ.30 వేల కోట్ల మేర తన మిత్రుడు, పారిశ్రామిక వేత్త అయిన అనిల్ అంబానీకి అనుకూలంగా ప్రధాని మోదీ రఫేల్ ఒప్పందం షరతులను మార్చారని రాహుల్ ఆరోపించారు. యూపీఏ హయాంలో కుదిరిని ఒప్పందంలో 126 ఫైటర్ జెట్లను కొనుగోలు చేయాల్సి ఉంది. కానీ, మోదీ ఈ ఒప్పందాన్ని 36 ఫైటర్ జెట్లకే పరిమితం చేస్తూ, అత్యధిక ధర చెల్లించేలా మార్చారు. ఎలాంటి అనుభవం లేని అనిల్ అంబానీ సంస్థకు రూ.30 వేల కోట్లు లబ్ధి చేకూర్చారు. దీనిపై దర్యాప్తు చేస్తామని చెప్పగానే సీబీఐ డైరెక్టర్‌ను రాత్రికి రాత్రే ప్రభుత్వం మార్చేసింది’ అని ఆరోపించారు. -
రోడ్‌షోలో అపశృతి : సాయం చేసిన రాహుల్
సాక్షి, వాయనాడ్ : అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రోడ్‌షోలో అపశృతి దొర్లింది. కేరళలోని వాయనాడ్ లోకసభ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం రాహుల్ రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బారికేడ్ విరిగిపడటంతో అక్కడున్న జర్నలిస్టులు స్వల్పంగా గాయపడ్డారు. అయితే గాయపడిన ముగ్గురు జర్నలిస్టులను ఆసుపత్రికి తరలించే క్రమంలో రాహుల్ గాంధీకి వారికి సహాయం అందించారు. వారిని అంబులెన్స్‌లో తరలించేందుకు చురుగ్గా కదిలి వారికి సాయం చేశారు. దీంతో మరోసారి కాంగ్రెస్ శ్రేణులలో ఉత్సాహాన్ని నింపడంతో పాటు అక్కడున్న వారినందరినీ ఆకట్టుకున్నారు. నామినేషన దాఖలు చేసిన అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడుతూ భారతదేశం ఒకటేనన్న సందేశాన్నిచ్చేందుకే తాను కేరళ వచ్చానన్నారు. ముఖ్యంగా అటు దక్షిణ భారతదేశం, ఇటు ఉత్తర భారతదేశం నుంచి కూడా పోటీ చేయాలని తాను నిర్ణయించుకున్నానని తెలిపారు. మరోవైపు తన సోదరుడు, నిజమైన స్నేహితుడు, రాహుల్ గాంధీ అత్యంత ధైర్యవంతుడైన వ్యక్తి అనీ, అతణ్ని ఆశీర్వదించాలని ప్రజలను కోరుతూ ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. కాగా తన సోదరి, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఇతర ప్రముఖ రాష్ట్ర పార్టీ నాయకులతో కలిసి రాహుల్ గాంధీ వాయనాడ్‌లో గురువారం తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు వీరికి ఘన స్వాగతం పలికారు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని అమేధీ లోక్‌సభ స్థానం నుంచి కూడా రాహుల్ గాంధీ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. -
స్టార్‌వార్ 2.0 !
సాక్షి, మహబూబ్‌నగర్ : లోక్‌సభ ఎన్నికలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన ఘట్టం ముగిసింది. గురువారం ఉపసంహరణ పర్వం ముగిసిన తర్వాత లోక్‌సభ బరిలో ఎంత మంది ఉంటారనేది తేలనుంది. ఎన్నికలకు రెండు వారాలు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించేందుకు ప్రధాన పార్టీ నేతలు తమతమ అగ్రనేతలను ఇప్పటికే ఆహ్వానించారు. వీరిలో ఇప్పటికే పలువురు అధినేతల పర్యటనలు ఖరారయ్యాయి. ఈ నెల 29న పాలమూరు, నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానాలకు సంబంధించి మహబూబ్‌నగర్ శివారులోని అమిస్తాపూర్–భూత్పూర్ మధ్య వద్ద బీజేపీ బహిరంగ సభకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరుకానున్న ఈ సభను విజయవంతం చేసేందుకు కమలనాథులు అన్ని శక్తిలొస్తున్నారు. రెండు లోక్‌సభ స్థానాల నుంచి రెండు లక్షల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీ పాలమూరుకు రావడం ఇది మూడోసారి. గత పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2014లో తొలిసారిగా మహబూబ్‌నగర్‌కు వచ్చిన ఆయన.. గత నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం రెండోసారి వచ్చారు. మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ ఈ నెల 31న వనపర్తి, మహబూబ్‌నగర్‌లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు గులాబీ శ్రేణులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇటు ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ సైతం ఏప్రిల్ ఒకటో తేదీన వనపర్తిలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. స్ధానిక కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి మల్లురవికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు. వచ్చే నెల ఏడో తేదీన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాలమూరు లోక్‌సభ పరిధిలోని మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్‌లలో బహిరంగసభలో పాల్గొంటారు. ఇదిలా ఉంటే.. ఇంకొందరి ముఖ్యనేతల ప్రచారానికి అన్ని పార్టీల్లో కసరత్తు జరుగుతోంది. వచ్చే నెల 7, 8 తేదీల్లో రాహుల్ లేదా ప్రియాంక గాంధీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రుల జిల్లా పర్యటనకు ఆయా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ముఖ్యంగా పాలమూరు అసెంబ్లీ సెగ్మెంట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు ఈ స్థానంలో పాగా వేసేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక మొదలు.. గెలుపు వరకు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే ప్రచారాలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించిన అభ్యర్థులు పోటాపోటీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. రానున్న రోజుల్లో రాజకీయం మరింతగా వేడెక్కనుంది. ఏ గూటికి ఎవరెవరో? ఎన్నికల వేళ మారుతోన్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఏ పార్టీలో ఎప్పుడు ఎవరు చేరుతారోననే చర్చ జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే వలసల హిట్‌లిస్టులో ఉన్న పాలమూరు సిట్టింగ్ ఎంపీ జితేందర్‌రెడ్డి టీఆర్ఎస్ను వీడి, బుధవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ క్రమంలో ఇంకెంతమంది ఇతర పార్టీల నుంచి బీజేపీ గూటికి చేరుతారోననే ఉత్కంఠ నెలకొంది. అయితే.. మహబూబ్‌నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ముఖ్య అనుచరుడిగా ఉన్న దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ డోకూరు పవన్‌కుమార్‌రెడ్డితో పాటు నారాయణపేటకు చెందిన కాంగ్రెస్ నాయకుడు శివకుమార్‌రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల్లో షాద్‌నగర్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన వీరపల్లి శంకర్ బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. -
లౌకికవాద పార్టీలు కాంగ్రెస్‌కు మద్దతివ్వాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 స్థానాల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండా పోటీ చేస్తున్న తమకు లౌకికవాద పార్టీ లు మద్దతు పలకాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా విజ్ఞప్తి చేశారు. తెలంగాణ జనసమితి, తెలుగుదేశం, సీపీఐ, సీపీఎంలు కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం సహకరించాలని కోరారు. ఆదివారం గాంధీభవన్‌లో కుంతియా విలేకరులతో మాట్లాడారు. సామాజికన్యాయం కోసం తాము పోటీ చేస్తున్నామని, లౌకికవాద పార్టీలు పోటీలో లేని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతివ్వాలని కోరారు. కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీకి ఓటమి భయం పట్టుకుందన్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాహుల్ నేతృత్వంలో 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడాన్ని చూసి మోదీకే భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. మాజీమంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని, స్వాతంత్య్రం తెచ్చింది.. తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీయేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ మనుగడ అగమ్యగోచరం మాజీఎంపీ రాపోలు ఆనందభాస్కర్ హైదరాబాద్: కాంగ్రెస్ అధినాయకత్వంలో విచక్షణ కరువైందని, ఆ పార్టీ మనుగడ అగమ్యగోచరంగా మారిందని అందుకే పార్టీ వీడుతున్నానని మాజీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ అన్నారు. తాను ఏ పార్టీలో చేరతానో ఇప్పుడే చెప్పలేనన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ 1995లో తెలంగాణ ప్రత్యేక సాధన ఉద్యమంలో తాను కీలకపాత్ర పోషించానని, తర్వాత రాజ్యసభ సభ్యునిగా ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను పార్లమెంట్లో వినిపించానన్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సైద్ధాంతిక వైరుధ్యం తనను కలిచివేసిందన్నారు. అందుకే తాను కాంగ్రెస్ లోని అధినాయకత్వంతో విభేదించాల్సిన పరి స్థితి వచ్చిందన్నారు. సబ్బండ జాతుల ప్రయోజనం, తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి, భారత జాతి సంరక్షణకోసం ప్రజలతో మమేకమయ్యేందుకు నిర్ణయించుకున్నట్లు వివరించారు. -
ఇవి పీఎంను నిర్ణయించే ఎన్నికలు
సాక్షి, మేడ్చల్ జిల్లా: ఈ ఎన్నికలు ముఖ్య మంత్రి కుర్చీ కోసం కాదని, ప్రధానమంత్రిని నిర్ణయించేందుకు జరుగుతున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మేడ్చల్ కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేయటానికి ముందు స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లా డారు. తాను పోటీలో ఉన్నానంటే సీఎం కేసీ ఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నా రు. ఈ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంటుందని, ఉప ప్రాంతీయ పార్టీల మధ్య కాదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ఏఐసీసీ అధినేత రాహుగాంధీ ప్రధాని అవుతారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసినవారిని గాలికి వదిలేసి, నమ్ముకున్నవారిని నట్టేట ముంచి ఎన్నికల్లో రూ.100 కోట్లు ఖర్చు చేసేవారికే కేసీఆర్ టికెట్లు కేటాయించారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, సుఖేందర్‌రెడ్డి, సీతారాంనాయక్, వివేక్‌లకు టికెట్లు ఇవ్వకపోవడంతో వారి పరిస్థితి దిక్కుతోచకుండా ఉందని, వారిప్పుడు బావిలో దూకాలా.. అని అన్నారు. మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి టీఆర్ఎస్ టికెట్‌ను మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డికి వేలంపాటలో కేటాయించారని, ఇలాంటి వాళ్లు ప్రజాసమస్యలపై ఎలా మాట్లాడగలరని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం ఉంటేనే ప్రజాసమస్యలు పరిష్కారం అవుతాయని, తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా కేసీఆర్ బలహీనపరుస్తున్నారని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నా రని ధ్వజమెత్తారు. ఆనాడు ప్రతిపక్షం ఉండొ ద్దని చంద్రబాబు అనుకుంటే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉండేవారా... రాజశేఖర్‌రెడ్డి వద్దనుకుంటే.. చంద్రశేఖర్‌రావు ఉండేవారా... ఇందిరాగాంధీ అనుకుంటే.. వాజ్‌పేయి, అద్వానీ లాం టి వారు ఉండేవారా.. అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. సభలో మాజీ ఎమ్మెల్యేలు కె.లక్ష్మారెడ్డి, కూన శ్రీశైలంగౌడ్, నేతలు తోటకూరి జంగయ్యయాదవ్, ఉద్దమర్రి నర్సింహారెడ్డి, నందికంటి శ్రీధర్, మల్లేశ్‌గౌడ్ పాల్గొన్నారు. అనంతరం మేడ్చల్ కలెక్టరేట్ వరకు రేవంత్ పార్టీ శ్రేణులతో భారీర్యాలీగా బయలుదేరి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎంవీరెడ్డికి నామినేషన్ పత్రాలు అందజేశారు. నా గెలుపుకు సహకరించండి: రేవంత్ సాక్షి, హైదరాబాద్: మల్కాజ్గిరి లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. తన గెలుపుకు సహకరించాలని ప్రజాగాయకుడు గద్దర్‌ను కోరారు. ఆయన విజ్ఞప్తికి గద్దర్ కూడా సానుకూలంగా స్పందించారు. రేవంత్‌రెడ్డి శుక్రవారం ఉదయం గద్దర్‌ను ఆయన నివాసంలో కలిశారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. మోదీ, కేసీఆర్‌ల రాచరిక పాలనకు చరమగీతం పాడాలని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గద్దరన్న ఆశీస్సులు తీసుకున్నానని చెప్పారు. ప్రశ్నించే గొంతు లేకపోతే పేదలకు న్యాయం జరగదని, రాష్ట్రంలో అంబేడ్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా పరిపాలన సాగుతోందని వ్యాఖ్యానించారు. సీపీఐ, టీజేఎస్, గద్దర్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, ప్రజాస్వామ్యవాదులు, మేధావుల అండతో ఎన్నికల్లో విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
ప్రశ్నించడం మా హక్కు: అఖిలేష్ యాదవ్
లక్నో: బీజేపీ భారత ఆర్మీలా వ్యవహరించడం మానాలని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ శుక్రవారం మండిపడ్డారు. ఆర్మీని అవమానిస్తున్నాయని ప్రధాని మోదీ ప్రతిపక్ష పార్టీలపై ఎదురుదాడికి దిగిన నేపథ్యంలో అఖిలేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మోదీ ప్రభుత్వం ఆర్మీలా వ్యవహరిస్తోంది. రాజకీయ నాయకులను ప్రశ్నించడం ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు. తమనెవరూ ప్రశ్నించొద్దని భావించే ప్రభుత్వాలు ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదకరమైనవ’’ని మోదీకి ఘాటుగా జవాబిచ్చారు. ఇదిలా ఉండగా.. ‘‘పుల్వామా లాంటి దాడులు కాంగ్రెస్ హయాంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ ప్రభుత్వంలో కూడా పలుమార్లు జరిగాయి. 2008లో ముంబైలో ఉగ్రదాడి జరిగినప్పుడు అప్పటి యూపీఏ ప్రభుత్వం పాక్‌పై సైనిక యుద్ధ విమానాలను పంపింది. కానీ కొందరు ఉగ్రవాదులు చేసిన పనికి మొత్తం పాకిస్తాన్‌పై దాడి చేయడాన్ని సరైన చర్యగా తాను భావించలేద’’ని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సలహాదారు శ్యామ్ పిట్రోడా ఇటీవల చేసిన వ్యాఖ్యలకు జవాబుగా మోదీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది. ‘కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలు అందరికీ తెలిసినవే. ఉగ్రవాదులకు దీటుగా కాంగ్రెస్ ఎప్పుడూ బదులివ్వలేదు. కానీ ఇది నూతన భారతదేశం. మేం టెర్రరిస్టులకు వారి భాషలో వారికి అర్థమయ్యేలా సరైన జవాబులు ఇవ్వగలమని పరోక్షంగా ప్రతి దాడులు చేస్తామ’ని మోదీ విరుచుకుపడ్డారు. -
కీలక సెగ్మెంట్స్: ఈ విషయాలు మీకు తెలుసా!
వారణాసి పార్లమెంట్ నియోజక వర్గం: కాంగ్రెస్, కమలం పోటాపోటీ ఉత్తర ప్రదేశ్‌లోని 80 లోక్‌సభ నియోజకవర్గాల్లో కీలకమైనది వారణాసి.ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు (రోహనియా, వారణాసి నార్త్, వారణాసి సౌత్,వారణాసి కంటోన్మెంట్, సేవాపురి)ఉన్నాయి.పవిత్ర పుణ్యక్షేత్రం కాశీనే వారణాసి అని కూడా పిలుస్తారు. జిల్లా కేంద్రమైన వారణాసి జనరల్ నియోజకవర్గం.1952 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఏడు సార్లు, బీజేపీ ఆరు సార్లు గెలిచింది.సీపీఎం, జనతాదళ్,భారతీయ లోక్‌దళ్ ఒక్కోసారి విజయం సాధించాయి.2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి నరేంద్ర మోదీ, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అరవింద్ కేజ్రీవాల్‌పై 3.71 లక్షల ఓట్ల ఆధిక్యతతో గెలిచారు.ఈ ఎన్నికల్లో నోటాకు రెండు వేలకుపైగా ఓట్లు వచ్చాయి. అమేథి పార్లమెంట్ నియోజక వర్గం: గాంధీ–నెహ్రూ కుటుంబ అడ్డా ఉత్తరప్రదేశ్‌లో మరో కీలక లోక్‌సభ నియోజకవర్గం అమేథీ. 1967లో ఇది ఏర్పాటైంది. దీని పరిధిలో ఐదు శాసన సభ నియోజకవర్గాలు (తిలోయి, సలాన్, జగ్దీశ్పూర్, గౌరీగంజ్, అమేథీ) ఉన్నాయి. నియోజకవర్గం ఏర్పాటు నుంచీ కాంగ్రెస్‌కు కంచుకో టగా నిలుస్తోంది. గాంధీ–నెహ్రూ కుటుంబానికి చెందిన సంజ య్గాంధీ (1980), రాజీవ్‌గాంధీ (1981), సోనియాగాంధీ (1999) ఇక్కడ నుంచి గెలిచారు. సోనియా తర్వాత ఆమె కుమారుడు రాహుల్‌గాంధీ ప్రస్తుతం ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2004 నుంచి ఆయన వరుసగా మూడు సార్లు ఇక్కడ నుంచి గెలిచారు. అయితే, 1977 ఎన్నికల్లో జనతా పార్టీ, 1998 ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ గెలిచాయి. గత ఎన్నికల్లో (2014) రాహుల్ గాంధీ, బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీపై 1.07 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. రాయ్‌బరేలి పార్లమెంట్ నియోజక వర్గం: కాంగ్రెస్‌కు కంచుకోట కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తల్లి సోనియాగాంధీ ప్రాతి నిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ ఉత్తరప్రదేశ్‌లో ఉంది. జనరల్ కేటగిరీకి చెందిన ఈ లోక్‌సభ నియోజకవర్గంలో ఐదు అసెంబ్లీ స్థానాలు (బచరవాన్, హర్చంద్పూర్, రాయ్‌బరేలీ, సరేని, ఉం ఛర్) ఉన్నాయి. 1952 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ 16 సార్లు, బీజేపీ రెండుసార్లు, జనతా పార్టీ ఒకసారి గెలిచాయి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఈ నియోజకవర్గం నుంచి రెండు సార్లు (1967,71) వరుసగా గెలిచారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ, అజయ్ అగర్వాల్ (బీజేపీ)ను 3,52,713 ఓట్ల తేడాతో ఓడించారు. 1999 నుంచి సోనియా ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
అహ్మదాబాద్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ
-
అజిత్ దోవల్‌పై ఆరోపణలు తోసిపుచ్చిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ : జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను 1999లో భారత్ విడుదల చేయడంలో ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాత్ర గురించి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసిన నేపథ్యంలో మసూద్ అజర్‌ను అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వం విడుదల చేసిన వ్యవహారంలో అజిత్ దోవల్‌కు ఎలాంటి ప్రమేయం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 1999లో ఇంటెలిజెన్స్ బ్యూరోలో సీనియర్ అధికారిగా ఉన్న అజిత్ దోవల్.. మసూద్ అజర్ విడుదలపై సంప్రదింపులు జరిపేందుకు కాందహార్‌కు వెళ్లిన నలుగురు సభ్యులతో కూడిన కమిటీలో ఒకరు. అజర్ విడుదలను దోవల్ అప్పట్లో వ్యతిరేకించారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కాగా కాందహార్‌లో విడుదల చేసిన ముగ్గురు ఉగ్రవాదుల వెంట అజిత్ దోవల్ ఉన్న ఫోటోలను కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడిపై ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించిన రాహుల్ ఈ దాడిలో 40 మంది జవాన్ల ప్రాణాలు కోల్పోయాయని, వారిని హత్య చేసిన మసూద్ అజర్‌ను ఎవరు విడుదల చేశారో వారి కుటుంబాలకు ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మసూద్ అజర్‌తో పాటు ముగ్గురు ఉగ్రవాదులను పాకిస్తాన్‌కు అప్పగించేందుకు కాందహార్‌లో అజిత్ దోవల్ నెరిపిన ఒప్పందం గురించి కూడా వారికి చెప్పాలని రాహుల్ నిలదీశారు. -
కాంగ్రెస్‌లో జోష్
సాక్షి, శంషాబాద్: కనీస ఆదాయ వాగ్దాన సభ విజయవంతం కావడంతో జిల్లా కాంగ్రెస్ నేతల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. సభను సక్సెస్ చేయడానికి కాంగ్రెస్ నేతలు మూడు రోజులుగా శంషాబాద్ క్లాసిక్ త్రీ కన్వెన్షన్‌లో ఏర్పాట్లు చేశారు. చేవెళ్ల, మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున పార్టీ శ్రేణులను తరలించారు. తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ల, ఎల్బీనగర్, మహేశ్వరం నుంచి కార్యకర్తలు మధ్యాహ్నం 3 గంటల నుంచే వేదిక వద్దకు చేరుకున్నారు. శంషాబాద్ పట్టణంలో ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్దఎత్తున హోర్డింగ్‌లు, స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. సభావేదికపై రాహుల్ ప్రసంగానికి పార్టీ శ్రేణుల నుంచి మంచి స్పందన కనిపించింది. కార్యకర్తలు శ్రద్ధగా వింటూ పెద్దఎత్తున కరతాళ ధ్వనులు చేశారు. కనీస ఆదాయం పథకాన్ని ప్రతి ఒక్కరికి వర్తింపజేస్తామన్న ఆయన హామీపై పెద్దఎత్తున హర్షం వ్యక్తం చేశారు. వీఐపీలకు తిప్పలు వేదికకు ఎదురుగా ఉన్న స్థలంలో వీఐపీలకు కోసం ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేశారు. వీఐపీ పాస్ ఉన్న వారు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించినా పోలీసులు వారిని అడ్డుకున్నారు. పాస్‌లు ఉన్నా వీఐపీ గ్యాలరీకి అనుమతించకపోవడంతో పలువురు పార్టీ నాయకులు వారి నేతల వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. దీంతో వీఐపీ పాస్‌లు ఉన్నవారిని అనుమతించాలంటూ మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్, పీసీసీ అధికార ప్రతినిధి రాచమల్ల సిద్దేశ్వర్ మైకుల్లో పోలీసులకు పదేపదే సూచించారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని మాజీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం మీద సభ సక్సెస్ కావడంతో పార్టీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. వారిలో కొత్త ఉత్సాహం వచ్చింది. వచ్చే ఎన్నికల్లో విజయం తమదేననే ధీమాతో కనిపించారు. -
మోదీకి రాహుల్ చురకలు
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ ఒప్పందంలో ప్రధాని నరేంద్ర మోదీని విచారించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. రఫేల్ ఒప్పందంలో ప్రధాని మోదీ బైపాస్ సర్జరీ చేశారు. అనిల్ అంబానీకి ప్రయోజనం చేకూర్చేలా ఒప్పందంలో జాప్యం చేశారని రాహుల్ వ్యాఖ్యానించారు. 2016లో నోట్ల రద్దు తర్వాత లక్షలాది ఉద్యోగాలు గల్లంతైన తరహాలో రఫేల్ ఒప్పందానికి సంబంధించిన ఫైళ్లు మాయమయ్యాయని రాహుల్ ఎద్దేవా చేశారు. రఫేల్ ఒప్పందానికి సంబంధించి కీలక పత్రాలు చోరీ అయ్యాయని సుప్రీం కోర్టులో ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో రాహుల్ వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. ‘ఈ రోజుల్లో అన్నీ అదృశ్యమవుతున్నాయి..రెండు కోట్ల మంది ఉద్యోగాలు కనుమరుగయ్యాయి..ప్రజలందరి ఖాతాల్లో రూ 15 లక్షలు జమచేస్తానన్న హామీ మాయామైంది...వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కనుమరుగైంది..ఇప్పుడు రఫేల్ ఫైళ్లు మాయమయ్యా’యని రాహుల్ పేర్కొన్నారు. -
కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ ఎంపీ
లక్నో: సార్వత్రిక ఎన్నికల ముందు కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎంపీ సావిత్రి బాయి పూలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో అధికార బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన సావిత్రి.. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆమెతో పాటు ఎస్పీ మాజీ ఎంపీ రాకేష్ సచాన్ కూడా కాంగ్రెస్ గూటికి చేరారు. బీజేపీ పాలనలో రాజ్యాంగం ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉందని, దాని పరిరక్షణ కోసం కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు పూలే తెలిపారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. కాగా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో యూపీలో మరిన్ని సీట్లు సాధించడమే లక్ష్యంగా ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రియాంక కృషి చేస్తున్నారు. దానిలో భాగంగానే చేరికలపై దృష్టిసారించారు. సావిత్రిబాయి పూలే 2000 సంవత్సరంలో బీజేపీలో చేరి 2002, 2007, 2012 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించారు. బహ్రైచ్ నియోజకవర్గం నుంచి 2014 సాధారణ ఎన్నికల్లో పోటీచేసి లోక్‌సభకు ఎంపికయ్యారు. -
కదనరంగంలోకి ప్రియాంక
లక్నో: దివంగత ప్రధాని ఇందిరా గాంధీ మనవరాలు, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీ సోమవారం లక్నోలో అశేష అభిమాన జన సందోహం మధ్య తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతానికి పార్టీ ఇన్చార్జ్గా గత నెలలో ఆమె నియమితులైన అనం తరం తొలిసారిగా ఉత్తరప్రదేశ్‌కు వచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు, తన అన్న రాహుల్ గాంధీ, యూపీ పశ్చిమ ప్రాంత పార్టీ ఇన్–చార్జ్ జ్యోతిరాదిత్య సింధియాతో కలిసి ఢిల్లీ నుంచి ఆమె లక్నో చేరుకున్నారు. వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు ప్రియాంకకు బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి లక్నోలోని పార్టీ కార్యాలయం వరకు రాహుల్, ప్రియాంక, సింధియాలు కలిసి 25 కి.మీ.పాటు రోడ్ షో నిర్వహించారు. వీరి వాహనాలకు పార్టీ శ్రేణులు బ్రహ్మరథం పట్టాయి. దారి పొడవునా వాహనాలపై రోజా, బంతిపూలు చల్లడం సహా ఈ రోడ్‌షోకు కార్యకర్తలు ఘనంగా ఏర్పాట్లు చేశా రు. ప్రియాంకను చూసేందుకు, ఆమెను తమ ఫోన్లతో ఫొటోలు తీసేందుకు దారి పొడవునా జనం ఒకర్నొకరు తోసుకుంటూ ఎగబడ్డారు. ‘రండి. మనమందరం కలిసి కొత్త భవిష్యత్తును నిర్మిద్దాం. కొత్త రకం రాజకీయాలు చేద్దాం. ఇంతటి అభిమానం చూపుతున్న మీకందరికీ ధన్యవాదాలు’ అంటూ ప్రియాంక తన అభిమానులు, పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ రోడ్ షోతో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినట్లేనని తెలుస్తోంది. తమ కుటుంబ సభ్యులు పోటీ చేసే అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గాల బయట ప్రియాంక రోడ్ షోలు, ర్యాలీల్లో పాల్గొనడం ఇదే తొలిసారి. దుర్గామాతగా ప్రియాంక ఫొటో ప్రియాంకకు స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. లక్నో నగరం మొత్తం పార్టీ జెండాలు, ప్రియాంక ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలతో పండుగ వాతావరణాన్ని తలపించింది. సోమవారం ఉదయం నుంచే రోడ్ షో ఏర్పాట్లకు తుది మెరుగులు దిద్దుతూ కార్యకర్తలు బిజీగా గడిపారు. రోడ్లపై వెళ్తున్నవారికి ఆహార పొట్లాలు, టీ, మంచి నీళ్లు అందించారు. లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేసి దేశ భక్తి గీతాలు పెట్టారు. కొన్ని పోస్టర్లలో ప్రియాంకను సింహంపై కూర్చోబెట్టి దుర్గా మాతతో పోల్చారు. ఆమె దేవి అవతారమని వాటిపై రాశారు. మరికొందరు తన నానమ్మ ఇందిరా గాంధీతో ప్రియాంకను పోలుస్తూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. కొందరు కార్యకర్తలు ‘ప్రియాంక సేన’ అని రాసి, ఆమె ఫొటోను ముద్రించిన గులాబీ రంగు టీ షర్టులను ధరించారు. మూడ్రోజులు సమావేశాలు మంగళ, బుధ, గురువారాల్లో ప్రియాంక, సింధియాలు లక్నోలోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించనున్నారు. యూపీసీసీ అధికార ప్రతినిధి రాజీవ్ బక్షి మాట్లాడుతూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక ఆగమనం పార్టీ తన పట్టును తిరిగి సాధించేందుకు ఉపకరిస్తుందనీ, కార్యకర్తలకు ఎంతో ఉత్సాహాన్నిస్తోందని తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ప్రియాకం ఆశా కిరణంగా మారారు. కాంగ్రెస్ పార్టీని, ప్రత్యేకించి తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో పార్టీని పునరుత్తేజం చేసే బాధ్యతలను ఆమె భుజాలకెత్తుకున్నారు. ఈ ప్రాంతంలో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లకు మంచి పట్టుంది. ట్విట్టర్ ఖాతా తెరిచిన ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాక తన తొలి రోడ్ షో జరిగిన రోజునే ప్రియాంక సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్లోనూ ఖాతా తెరిచారు. ఖాతా తెరిచిన 10 గంటల్లోనే ఆమెను లక్ష మంది ఫాలో అయ్యారు. ‘ప్రియాంక గాంధీ వాద్రా ఇప్పుడు ట్విట్టర్లో కూడా ఉన్నారు. ఃpటజీy్చnజ్చుజ్చnఛీజిజీ ఖాతాను మీరు అనుసరించొచ్చు’ అంటూ కాంగ్రెస్ పార్టీ ఓ ట్వీట్ చేసింది. ప్రియాంక తొలి రోజు ఏ ట్వీట్ చేయకుండా కేవలం తన అన్న రాహుల్, సింధియా, సచిన్ పైలట్ తదితర ఏడుగురిని ఆమె ఫాలో అయ్యారు. 2014 ఎన్నికల సమయంలో బీజేపీకి సామాజిక మాధ్యమాల్లో భారీ ప్రచారం లభించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి పాలైంది. తర్వాతి కాలంలో పాఠాలు నేర్చుకుని సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా వ్యవహరిస్తోంది. యూపీలో అధికారమే లక్ష్యం: రాహుల్ దేశ రాజకీయాలకు కేంద్ర బిందువు ఉత్తరప్రదేశ్‌లో అధికార పగ్గాలు చేపట్టడమే తమ లక్ష్యమని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ముందుండి పోరాడుతుందని చెప్పారు. ‘దేశానికి ఉత్తరప్రదేశ్ గుండెలాంటిది. ఈ రాష్ట్రంలో మా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటయ్యేదాకా ప్రియాంక, జ్యోతిరాదిత్య విశ్రమించబోరని ప్రకటించారు. అందరికీ న్యాయం చేకూర్చే ప్రభుత్వాన్ని ప్రజలకు అందించడమే వారి బాధ్యత’అని అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఇకపై కీలకంగా వ్యవహరించనుందని తెలిపారు. ‘మా దృష్టంతా ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలపైనే ఉందన్నది సుస్పష్టం. దీంతోపాటు ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నదే మా లక్ష్యం’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యేదాకా విశ్రమించం. రైతులు, యువజనులు, పేదలకు న్యాయం చేస్తాం’ అని భరోసా ఇచ్చారు. దేశంలో అవినీతి, రైతు సమస్యలు, నిరుద్యోగం.. ఇలా అనేక సమస్యలపై కాంగ్రెస్ పోరాడుతుందని రాహుల్ తెలిపారు. ‘కాపలాదారే దొంగ (చౌకీదార్ చోర్ హై) అంటూ ర్యాలీకి హాజరైన వారితో నినాదాలు చేయించారు. ప్రియాంక ఉత్తమ భార్య, తల్లి ప్రియాంక గాంధీ ఉత్తమ భార్య, ఉత్తమ తల్లి అనీ, ఇప్పుడు ఆమెను తాము దేశ ప్రజలకు అప్పగిస్తున్నామని ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా అన్నారు. ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. కక్షలతో కూడిన ప్రమాదకరమైన రాజకీయ వాతావరణంలో అప్రమత్తంగా ఉండాలని ఆమెను కోరారు. పార్టీలో బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ప్రియాంక జనంలోకి వెళ్లిన సందర్భంగా వాద్రా ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టారు. ‘ఉత్తరప్రదేశ్‌లో పనిచేస్తూ దేశ ప్రజలకు సేవలందించబోతున్న నీకు నా అభినందనలు. నువ్వు నాకు ఉత్తమ స్నేహితురాలిగా, ఉత్తమ భార్యగా, మన పిల్లలకు ఉత్తమ తల్లిగా ఉంటున్నావు’ అని వాద్రా ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.