short circuit
-
మూడు ప్రాణాలు బలి
మణికొండ(హైదరాబాద్): గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కిరాణా షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు, దట్టమైన పొగలు చెలరేగాయి. భవనం మొదటి, రెండో అంతస్తులకు వ్యాపించడంతో ఊపిరి ఆడక ముగ్గురు దుర్మరణం చెందిన ఘటన మణికొండ మున్సిపాలిటీ పుప్పాలగూడ పాషా కాలనీలో శుక్రవారం సాయంత్రం విషాదాన్ని నింపింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు.. పాషా కాలనీ ప్లాట్ నెంబర్ 72లో ఉస్మాన్‌ఖాన్, అతని తమ్ముడు యూసుఫ్ ఖాన్ కుటుంబాలు నివసిస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో గ్రౌండ్ ఫ్లోర్‌లోని తన కిరాణా దుకాణంలో ఉస్మాన్ ఖాన్ ఉండగా.. ఆకస్మికంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. మంటలు ఎగిసిపడి పక్కనే ఉన్న పార్కింగ్‌లో నిలిపిన రెండు కార్లకు అంటుకున్నాయి. దీంతో ఉవ్వెత్తున మంటలు చెలరేగడంతో కారులోని గ్యాస్ సిలిండర్ పేలింది. మంటలు మరింత ఉద్ధృతమై భవనంలోని మొదటి అంతస్తుకు వ్యాపించడంతో కిచెన్ గదిలోని రెండు సిలిండర్లు పెద్ద శబ్దంతో పేలిపోయాయి. దీంతో ఓ గదిలో ఇరుక్కుపోయిన ఉస్మాన్‌ఖాన్ తల్లి జమిలాఖాతమ్ (78), అతని తమ్ముడి భార్య శాహినా ఖాతమ్ (38), తమ్ముడి కూతురు సిజ్రా ఖాతమ్ (4)లు ఊపిరి ఆడకపోవడంతో గదిలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. చికిత్స నిమిత్తం వీరిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు కిందికి దూకి.. మంటల నుంచి తప్పించుకునేందుకు చుట్టుపక్కల వారు బాధితుల ఇంటి ముందు పరుపులు వేయగా.. ఉస్మాన్‌ఖాన్ తమ్ముడు యూసుఫ్‌ఖాన్, కుమారుడు మొదటి అంతస్తు నుంచి కిందికి దూకారు. దీంతో యూసుఫ్ ఖాన్ కాలు విరిగింది. గాయపడిన యూసుఫ్ ఖాన్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అగ్ని మాపక శాఖ, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫ్లాట్‌లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినా వీలు కాలేదు. అగి్నమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చిన తర్వాత పైఅంతస్తుకు వెళ్లి గోడలకు రంగులు వేసే జూల ద్వారా ఇద్దరిని సురక్షితంగా కిందికి తీసుకు వచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో 8 మంది ఉన్నారు. ఇందులో ముగ్గురు మొదటి అంతస్తు నుంచి దూకి, ఇద్దరు జూల ద్వార కిందికి వచ్చి ప్రాణాలను కాపాడుకోగా.. ఇద్దరు మహిళలు, బాలిక మృతి చెందారు. ఘటనా స్థలానికి రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, నార్సింగి ఏసీపీ రమణగౌడ్, మణికొండ మున్సిపల్ మాజీ చైర్మన్ నరేందర్ ముదిరాజ్ చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. -
షార్ట్ సర్క్యూట్‌తో రైలును పేల్చేందుకు కుట్ర?
హర్దోయ్: కోల్‌కతా నుంచి అమృత్సర్ వెళ్తున్న దుర్గియానా ఎక్స్‌ప్రెస్ ఓహెచ్ఈ వైర్‌ను బలంగా తాకడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన యూపీలోని హర్దోయ్‌లో చోటుచేసుకుంది. ఈ నేపధ్యంలో షార్ట్ సర్క్యూట్‌తో రైలును పేల్చేసేందుకు ఎవరో కుట్రపన్ని ఉంటారని రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు.ఈ రైలు బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు యూపీలోని లక్నో నుంచి బయలుదేరింది. ఉదయం ఐదు గంటలకు ఉమర్తాలి స్టేషన్ దాటిన వెంటనే ట్రాక్‌పై వేలాడుతున్న ఓహెచ్ఈ వైర్‌ను బలంగా తాగింది. వెంటనే పేలుడు సంభవించింది. దీంతో పైలట్ రైలును ఆపి ఉమ్రతాలి, దలేల్‌నగర్ స్టేషన్లకు సమాచారం అందించాడు. దీంతో అధికారులు ఆ మార్గంలో నడిచే రైళ్లను నిలిపివేశారు. దాదాపు ఆరు గంటల తర్వాత దుర్గియానా ఎక్స్‌ప్రెస్ బయలుదేరేందుకు అనుమతినిచ్చారు. ఈ ఘటన నేపధ్యంలో రాజధాని, వందే భారత్‌లతో పాటు మరికొన్ని రైళ్లను మరో మార్గంలోకి మళ్లించారు. రెండు రైళ్లను రద్దు చేశారు.ఈ ఘటన దరిమిలా దుర్గియానా ఎక్స్‌ప్రెస్ రైలు విద్యుత్ కేబుల్‌ను బలంగా తాకడమనేది సహజంగా జరిగినది కాదని రైల్వే అధికారులు భావిస్తున్నారు. సాంకేతిక లోపం కంటే ట్యాంపరింగ్‌కే ఎక్కువ అవకాశాలున్నాయని వారు అంటున్నారు. ఈ ఘటనపై రైల్వే శాఖ అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తోంది. ఇది కూడా చదవండి: దేశంలో భద్రత గుర్తింపు పొందిన తొలి కంపెనీ -
సెల్‌ఫోన్ వెలుగులో వైద్య సేవలు
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ అవుట్ పేషెంట్ విభాగంలో సోమవారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయింది. విద్యుత్ బోర్డులోని ఎంసీసీబీ స్విచ్ బోర్డు కాలిపోయింది. వర్షాల నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గుల కారణంగా స్విచ్ బోర్డు కాలిపోయినట్లు ఆస్పత్రి ఎలక్ట్రికల్ సిబ్బంది తెలిపారు. ఉదయం 11 గంటలకు విద్యుత్ సమస్య ఏర్పడి సాయంత్రం వరకు ఓపీలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరగలేదు. దీంతో ఓపీలో వైద్య సేవలకు కొంతమేర అంతరాయం ఏర్పడింది. ఫార్మాసిస్టులు సెల్‌ఫోన్ టార్చ్‌లైట్ సాయంతో మందుల సరఫరా చేయగా.. కొంత మంది జూనియర్ వైద్యులు రోగులను సెల్‌ఫోన్ వెలుతురులోనే పరీక్షించి చికిత్సలు అందించారు. బ్లడ్ టెస్ట్, ఇతర వైద్య పరీక్షలకు రోగులు ఇబ్బందిపడ్డారు. సుమారు రూ. 26 వేల ఖరీదు చేసే స్విచ్‌బోర్డును కొనుగోలు చేసి సాయంత్రానికల్లా విద్యుత్‌ను పునరుద్ధరించినట్టు సివిల్ సర్జన్ ఆర్ఎంవో డాక్టర్ బత్తుల వెంకటసతీష్‌కుమార్ చెప్పారు. -
HYD: ‘ప్యారడైజ్’ హోటల్లో మంటలు
సాక్షి,హైదరాబాద్: బిర్యానీకి పాపులర్ అయిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని ప్యారడైజ్ హోటల్లో శుక్రవారం(ఆగస్టు23) మంటలు కలకలకం రేపాయి. హోటల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా స్వల్పంగా మంటలు చెలరేగాయి.వెంటనే అప్రమత్తమైన హోటల్ సిబ్బంది కొద్ది సేపటికే మంటలను ఆర్పివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఘటన అనంతరం హోటల్ సిబ్బంది అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అగ్నిమాపక శాఖ అధికారులు హోటల్‌కు వచ్చి ప్రమాదం ఎలా జరిగిందనేదానిని పరిశీలించారు. -
చిన్నారి ప్రాణం తీసిన సెల్‌ఫోన్ ఛార్జర్
నిర్మల్ జిల్లా, కడెం మండలం కొత్త మద్దిపడగలో విషాదం చోటు చేసుకుంది. సెల్‌ఫోన్ ఛార్జర్ చిన్నారి ప్రాణం తీసింది. చిన్నారి సెల్‌ఫోన్ ఛార్జర్ కేబుల్‌తో ఆడుకుంటూ నోట్లో పెట్టుకుంది. దీంతో విద్యుత్ షాక్‌కు గురై చిన్నారి ప్రాణాలు కొల్పోయింది. ఈ విషాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
షార్ట్ సర్క్యూట్‌తో పేలిన ఫోను.. నలుగురు మృతి!
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి మోదిపురం జనతా కాలనీలోని ఓ ఇంటిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మొబైల్ ఫోన్ పేలి గదిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జనతా కాలనీలో నివాసం ఉంటున్న జానీ(41) కూలి పనులు చేసుకుంటూ, భార్య బబిత (37), నలుగురు పిల్లలు సారిక (10), నిహారిక (8), గోలు (6), కల్లు (5)లను పోషిస్తున్నాడు. శనివారం సాయంత్రం గదిలో పిల్లలు ఆడుకుంటూ, మొబైల్ ఛార్జర్‌ను ఎలక్ట్రికల్ బోర్డులో పెట్టారు. ఈ సమయంలో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పేలి మంచానికి మంటలు అంటుకున్నాయి. మంటలు చుట్టుముట్టడంలో చిన్నారులు కేకలు వేశారు. వెంటనే జానీ, బబితలు ఆ గదిలోకి వెళ్లి చిన్నారులను మంటల బారి నుంచి కాపాడారు. ఈ సమయంలో బబిత, జానీలు కూడా గాయపడ్డారు. జానీ ఇంట్లో నుంచి అరుపులు వినిపించడంతో ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. వారు పోలీసులకు విషయాన్ని తెలియజేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. బాధితులను ఆసుపత్రికి తరలించారు. చికిత్ప పొందుతూ నలుగురు చిన్నారులు మృతి చెందారు. దంపతుల పరిస్థితి విషమంగా ఉంది. బబిత పరిస్థితి మరింత విషమంగా మారడంతో ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
షార్ట్‌సర్క్యూట్‌తో చెరుకు తోట దగ్ధం
అమరచింత: పట్టణానికి చెందిన నారాయణ రెడ్డి, చంద్రన్నలకు చెందిన ఏడు ఎకరాల చెరుకు తోట షార్ట్‌సర్క్యూట్ కారణంగా దగ్ధం కాగా.. రూ.3.50 లక్షల నష్టం వాటిల్లింది. ప్రమాదవశాత్తు చెరుకుతోటలో మంటలు వ్యాపించడంతో సమీప రైతులు నీటిని పిచికారి చేసి మంటలను ఆర్పివేశారు. అప్పటికే డ్రిప్ పరికరాలు పూర్తిగా కాలిపోయాయని బాధిత రైతులు వాపోయారు. కాలిన పంటను కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం వెంటనే కటింగ్ చేసి ఫ్యాక్టరీకి తరలించాలని చెరుకు సంగం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న డిమాండ్ చేశారు. సోమ వారం కాలిన చెరుకు తోటను ఫ్యాక్టరీ సిబ్బందితో కలిసి సందర్శించారు. కార్యక్రమంలో ఫ్యాక్టరీ ఏఓ ఆశీఫ్, ఫీల్డ్‌మెన్ రాజుతో పాటు పలువురు ఉన్నారు. ప్రమాదవశాత్తు నదిలో పడి యువకుడి మృతి కొల్లాపూర్ రూరల్: మండల పరిధిలోని సోమశిల సమీపంలో ఉన్న కృష్ణానదిలో ప్రమాదవశాత్తు పడి ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం... పశ్చిమబెంగాల్లోని కోల్‌కతాకు చెందిన కౌషిక్ (22)ఏడాదిగా హైదరాబాద్‌లో ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం నూతన సంవత్సర వేడుకలను సోమశిలలో నిర్వహించేందుకు 20మంది తన స్నేహితులతో కలిసి వచ్చాడు. రాత్రి ఉత్సాహంగా వేడుకలు చేసుకొని.. రాత్రి అక్కడే బస చేశాడు. సోమవారం ఉదయం కౌషిక్ ఒక్కడే నదిలోకి స్నానం చేయడానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు నదిలో ఉన్న బురుదలో ఇరుక్కొని చనిపోయాడు. అక్కడే ఉన్న మత్స్యకారులు అలివి వలలు వేసి బయటి తీశారు. పోలీసులు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని పరిశీలించి.. కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
ఎంజీఎంలో అర్ధరాత్రి పవర్‌కట్.. రోగి మృతి
ఎంజీఎం: షార్ట్ సర్క్యూట్‌తో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఒక్కసారి ఆస్పత్రి చీకటిమయంగా మారడంతో రోగులతోపాటు వారివెంట ఉన్న బంధువులు ఆందోళనకు గురయ్యారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఓ రోగి చనిపోయాడు. అయితే ఆ రోగి వ్యాధి తీవ్రతతోనే చనిపోయినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రకటించారు. అసలేం జరిగిందంటే.. ఎంజీఎం ఆస్పత్రిలో ఏఎంసీ వార్డు వెనుకాల ఉన్న విద్యుత్ తీగలపై కోతులు చేసిన ఆగ డాలతో వైర్లు ఒక్కోటి పరస్పరం తాకాయి. షార్ట్ సర్క్యూట్ జరిగి వైర్లు కాలిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆస్పత్రిలో సాధారణ వార్డుకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినా.. జనరేటర్ ద్వారా అత్యవసర వార్డుల(ఏఎంసీ, ఐఎంసీ, ఆర్ఐసీయూ, ఎస్ఎన్సీయూ, ఎంఓటీ, ఈఓటీ)కు విద్యుత్ సరఫరా జరిగేది. కానీ జనరేటర్‌తో లింక్ ఉన్న ఉన్న విద్యుత్‌వైర్లు కూడా కాలిపోవడంతో గంటపాటు అంధకారం నెలకొంది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో మృతి: రోగి బంధువుల ఆరోపణ ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి ఏర్పడిన విద్యుత్ అంతరాయం కారణంగా ఆర్ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్న బొజ్జ భిక్షపతి(45) మృతి చెందినట్లు రోగి బంధువులు ఆరోపిస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం రాజేశ్వర్‌రావు పల్లె గ్రామానికి చెందిన భిక్షపతి ఆల్కహాల్ లివర్ సిరోసిస్ సమస్యతో శుక్రవారం తెల్లవారుజామున ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. వైద్యులు అతనికి ఆర్ఐసీయూలో వెంటిలెటర్ ద్వారా చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం రాత్రి ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో భిక్షపతికి అమర్చిన వెంటిలైటర్ నిలిచి శ్వాస తీసుకోవడం తీవ్రమైనట్లు మృతుడి బంధువులు చెబుతున్నారు. దీంతో చనిపోయాడని వాపోతున్నారు. ఈ విషయంపై ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యుత్ అంతరాయం ఏర్పడిన విషయం వాస్తవమేనని తెలిపారు. బాధితుడి మృతిచెందిన సమయంలో వెంటిలెటర్ బ్యాటరీ బ్యాకప్‌తో కొనసాగుతోందని పేర్కొన్నారు. భిక్షపతి మృతికి విద్యుత్ అంతరాయం కాదని, వ్యాధి తీవ్రతే కారణమని స్పష్టం చేశారు. -
షార్ట్ సర్క్యూట్.. రసాయనాలు '9 ప్రాణాలు బుగ్గి'
సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్: హైదరాబాద్ నాంపల్లి బజార్‌ఘాట్‌లోని బాలాజీ రెసిడెన్సీ అపార్ట్మెంట్లో సోమవారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నికీలలు ఎగసి పడటం, రసాయనాల వల్ల వెలువడిన పొగ పీల్చి అపస్మారక స్థితిలోకి చేరడం, ఆపై మంటలు అంటుకోవడంతో ఇద్దరు చిన్నారుల సహా తొమ్మిది మంది అశువులు బాసారు. మరో తొమ్మిది మందికి గాయాలు కాగా..వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. కాగా అపార్ట్మెంట్లో ఉన్న మరో 21 మందిని అగ్నిమాపకశాఖ అధికారులు కాపాడారు. ఘటనాస్థలిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, తలసాని, మహమూద్ అలీ తదితరులు సందర్శించారు. ప్రమాదంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి వచ్చిన కాంగ్రెస్ నాంపల్లి అభ్యర్థి ఫిరోజ్‌ఖాన్‌ను ఎంఐఎం కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. గ్రౌండ్ ఫ్లోర్లో హార్డ్‌వేర్ గోదాం... బజార్‌ఘాట్‌కు చెందిన రమేష్ జైశ్వాల్‌కు స్థానికంగా బాలాజీ రెసిడెన్సీ పేరుతో అపార్ట్మెంట్ ఉంది. జీ+ఫోర్‌గా నిర్మితమైన ఇందులో ప్రస్తుతం ఎనిమిది ఫ్లాట్లు ఉన్నాయి. ఆరింటిలో వేర్వేరు కుటుంబాలు, నాలుగో అంతస్తులో ఉన్న రెండింటిలో కలిపి ఒకే కుటుంబం నివస్తోంది. నగర శివార్లలో ప్లాస్టిక్ పరిశ్రమ ఉన్న రమేష్ జైశ్వాల్ నీలోఫర్ ఆస్పత్రి రోడ్డులో బాలాజీ హార్డ్‌వేర్ పేరుతో దుకాణం నిర్వహిస్తున్నాడు. తన పరిశ్రమకు, దుకాణానికి సంబంధించిన రసాయనాలు, వస్తువులను నిల్వ చేయడానికి బాలాజీ రెసిడెన్సీ గ్రౌండ్ ఫ్లోర్‌ను గోదాముగా మార్చుకున్నాడు. ఇందుకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఇందులో ఫైబర్ ఎయిర్ కూలర్ల బాడీలు తయారీకి వినియోగించే బెంజైల్ నైట్రేట్ (మిౖథెల్ బెంజిన్) టిన్నులు, గేట్లకు వాడే ప్లాస్టిక్ షీట్లు (పాలీ షీట్లు), ప్లాస్టిక్ కార్పెట్లతో పాటు వీటిని అతికించడానికి ఉపకరించే రెజిన్ రసాయనం డ్రమ్ములు నిల్వ ఉంచాడు. వీటితో పాటు ప్రింటింగ్ ప్రెస్‌లకు సరఫరా చేసే సామాగ్రిని కూడా దాచాడు. సమీపంలోని ఇంకో అపార్ట్మెంట్ వద్ద కూడా ఇలాంటిదే మరో గోదాం ఉంది. ప్లాస్టిక్ బండిళ్లు కరిగి రోడ్డు పైకి.. ఉదయం 9.15 సమయంలో గ్రౌండ్ ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ అయ్యింది. నిప్పు రవ్వలు లోపల ఉన్న పాలీ షీట్లపై పడటంతో మంటలు చెలరేగాయి. తర్వాత రసాయనాలకు సైతం అంటుకోవడంతో పెద్దయెత్తున మంటలతో పాటు పొగ, విష వాయువులు వెలువడ్డాయి. మంటల్లో పాలీ షీట్లు ఇతర ప్లాస్టిక్ బండిళ్లు కరగడంతో మంటలతో కూడిన ఆ ద్రవం బయటకు రోడ్డుపైకి సైతం ప్రవహించింది. ఆ మంటలు కాస్తా రోడ్డుపై ఉన్న వాహనాలకు అంటుకున్నాయి. రెండు, మూడు అంతస్తుల్లో ప్రాణ నష్టం మొదటి అంతçస్తులో నివసిస్తున్న కుటుంబాలు మంటలు గమనించి అప్రమత్తమై కిందికి వచ్చేశాయి. కొద్దిసేపటికే మంటలు, పొగ రెండు, మూడు, నాలుగు అంతస్తులకు వ్యాపించాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో నాలుగో అంతస్తులో ఎవరూ లేరు. రెండో అంతస్తులో నివసించే మహ్మద్ ఆజం (58), ఆయన భార్య రెహానా సుల్తానా (50), కుమారుడు హసీబ్ ఉర్ రెహ్మాన్ (32), చిన్న కుమార్తె ఫైజా సమీన్ (26), పెద్ద కుమార్తె తహోరా ఫరీన్ (35), ఈమె కుమార్తెలు తోబా (6), తరోబాలతో (13) పాటు మూడో అంతస్తులో నివసించే మహ్మద్ జకీర్ హుస్సేన్ (66), ఆయన భార్య నిఖత్ సుల్తానా (55) పొగ పీల్చడంతో అపస్మారక స్థితికి చేరుకుని మంటలు అంటుకోవడంతో మరణించారు. మరో 21 మందిని అగ్నిమాపక శాఖ అధికారులు రక్షించారు. వీరిలో కొందరికి కాలిన గాయాలయ్యాయని, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెబుతున్నారు. తల్హా (19) అనే యువతి 75 శాతం కాలిన గాయాలతో ఉస్మానియాలో చికిత్స పొందుతున్నారు. లోపలికి వెళ్ళలేకపోయిన స్థానికులు.. సెలవు దినం కావడంతో సోమవారం ఉదయం బజార్‌ఘాట్ ప్రాంతంలో పెద్దగా హడావుడి లేదు. కాగా అగ్నిప్రమాదంతో అపార్ట్‌మెంట్‌తో పాటు బయటి వాహనాలూ దగ్ధమయ్యాయి. రసాయనాల డ్రమ్ములు పగిలిపోయాయి. కరిగిన ప్లాస్టిక్ ద్రవంతో పాటు మంటలూ రోడ్డు పైకి వచ్చాయి. రసాయనాల కారణంగా తీవ్రమైన ఘాటు వాసనలు వెలువడ్డాయి. దీంతో స్థానికులు అపార్ట్మెంట్ వద్దకు వచ్చినా సహాయక చర్యలు చేపట్టలేకపోయారు. ఏడు ఫైరింజన్లతో పాటు వచ్చిన అగ్నిమాకప శాఖ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అపార్ట్మెంట్ కుడి భాగం తీవ్రంగా దెబ్బతింది. దీంతో మొత్తం భవనంలో ఎవరూ ఉండకుండా ఖాళీ చేయించారు. మంటలు ఆరిన తర్వాత కూడా డ్రమ్ముల్లోని రసాయనాలు వీధుల్లో మురిగి నీరులా ప్రవహించాయి. అగ్నిమాపక శాఖ, పోలీసు అధికారులతో పాటు స్థానికుల కాళ్ళు, వ్రస్తాలు, పాదరక్షలకు ఇవి మందమైన పొరలా అంటుకున్నాయి. మేయర్ గద్వాల విజయలక్ష్మి, నాంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి సీహెచ్ ఆనంద్‌కుమార్ గౌడ్, కాంగ్రెస్ నేతలు వి.హనుమంతరావు తదితరులు కూడా ఘటనా స్థలాన్ని సందర్శించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్, డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు, ఫైర్స్ డీజీ వై.నాగిరెడ్డి, అదనపు సీపీ విక్రమ్ సింగ్ మాన్, డీసీపీ వెంకటేశ్వర్లు సహాయ చర్యలను పర్యవేక్షించారు. ఐపీసీతో పాటు ఎక్స్‌ప్లోజివ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసిన అధికారులు పరారీలో ఉన్న అపార్ట్మెంట్ యజమాని రమేష్ జైశ్వాల్ కోసం గాలింపు చేపట్టారు. మృతదేహాలకు ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. గవర్నర్, సీఎం సంతాపం అగ్నిప్రమాదంలో 9 మంది మరణించడంపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి రెండురోజుల్లోగా నివేదిక అందజేయాలని సీఎస్‌ను గవర్నర్ ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన అత్యంత బాధాకరమని, బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలకు కనీసం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి కిషన్‌రెడ్డి, కేటీఆర్ కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, హోం మంత్రి మహమూద్ అలీ తదితరులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. నగరంలో తరచూ ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని, అక్రమంగా జనావాసాల్లో కార్ఖానాలు ఏర్పాటు చేయడమే ఇందుకు ప్రధాన కారణమని కిషన్‌రెడ్డి అన్నారు. వీటన్నింటినీ సుదూర ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని, పీఎం రిలీఫ్ ఫండ్ కింద త్వరలోనే సహాయం అందజేసే ప్రయత్నం చేస్తామని చెప్పారు. కాగా అగ్ని ప్రమాదంలో 9 మంది చనిపోవడం అత్యంత బాధాకరమని కేటీఆర్ అన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పు న ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని, ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీని వేస్తామని తెలిపారు. నగరంలో వెలిసిన ఫ్యాక్టరీలను శివారు ప్రాంతాలకు తరలించేందుకు ఆరు నెలల క్రితమే ఒక ప్రణాళిక రూపొందించామని, త్వరలోనే దీనిని అమలు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పారు. అవి ప్రభుత్వ హత్యలే.. సీపీఐ నేతలు కె.నారాయణ, అజీజ్ పాషా, చాడ వెంకట్‌రెడ్డి తదితరులు కూడా బజార్ఘాట్ను సందర్శించారు. అగ్ని ప్రమాదం కారణంగా సంభవించిన తొమ్మిది మరణాలూ ప్రభుత్వ హత్యలేనిని నారాయణ ఆరోపించారు. ప్రమాదానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. ఇలావుండగా ఘటనా స్థలంలో కాంగ్రెస్ పార్టీ నాంపల్లి అసెంబ్లీ అభ్యర్థి మహ్మద్ ఫిరోజ్ ఖాన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. కొందరు ఎంఐఎం కార్యకర్తలు ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేయడం వాగ్వాదం జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు స్వల్ప లాఠీఛార్జితో ఇరు వర్గాలకు చెదరగొట్టారు. సెలవుల్లో పుట్టింటికి వచ్చి పిల్లలతో సహా.. అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఓ మహిళా డెంటల్ డాక్టర్ ఉన్నారు. రెండో అంతస్తులో నివసించే మహ్మద్ ఆజం పెద్దకుమార్తె తహోరా ఫరీన్ తన భర్త, ఇద్దరు కుమార్తెలతో కలిసి మెహదీపట్నం ప్రాంతంలో నివసిస్తోంది. తన కుమార్తెలకు వరుస సెలవులు రావడంతో శుక్రవారం రాత్రి పుట్టింటికి వచ్చింది. సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో కుమార్తెలతో సహా మరణించింది. ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.. దాదాపు 25 ఏళ్ళుగా అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో గోదాం కొనసాగుతోంది. గత ఏడాది వాచ్మెన్ కుమార్తె అక్కడున్న రసాయనాలతో ఆడుకుంటూ అగ్ని ప్రమాదానికి గురైంది. ఆ తర్వాత అనేకసార్లు ఈ అక్రమ గోదాంపై అధికారులకు ఫిర్యాదు చేశా. కానీ వారు పట్టించుకోలేదు. రమేష్ జైస్వాల్‌కు ముందు ఆయన తండ్రి కూడా ఇలానే నిర్వహించారు. – మేరీ ప్రియ పాల్, స్థానికురాలు బతుకు‘బండి’ని కోల్పోయా... నా తండ్రి అగ్నిప్రమాదం జరిగిన అపార్ట్మెంట్ పక్కన ఉన్న ఇంటిలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారు. మేము కుటుంబంతో గ్రౌండ్ ఫ్లోర్లో నివసిస్తున్నాం. ద్విచక్ర వాహనంపై తిరుగుతూ ఫుడ్ డెలివరీ చేయడాన్ని బతుకుతెరువుగా మార్చుకున్నా. నేను ప్రతిరోజూ బైక్‌ను అపార్ట్‌మెంట్‌కు, నా యజమాని ఇంటి మధ్య ముందు భాగంలో ఉంచుతా. ఆదివారం రాత్రి కూడా అలాగే పార్క్ చేశా. సోమవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో ఆ వాహనం కాస్తా కాలిపోవడంతో బతుకుతెరువు కోల్పోయా. – కిషోర్ -
శ్రీకాకుళం: భారీ అగ్నిప్రమాదం.. రూ.6కోట్ల నష్టం!
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పాతపట్నంలోని ఓ షాపింగ్ మాల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఆంధ్రా-ఒడిశా ఫైర్ సిబ్బంది శ్రమించి.. మంటల్ని చల్లార్చారు. పాత పట్నంలోని స్నేహ షాపింగ్ మాల్లో మంటలు చెలరేగాయి. రెండు అంతస్తుల్లోని వస్త్రాలు అగ్నికి ఆహుతి కాగా.. రూ. 6 కోట్ల ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. #WATCH | Andhra Pradesh | Fire breaks out in a shopping mall in Pathapatnam, of Srikakulam district due to an electrical short circuit. Fire engines have reached the spot to put out the fire. Details awaited. pic.twitter.com/dx7GhFJNzr — ANI (@ANI) August 30, 2023 -
కస్తూర్బా పాఠశాలలో అగ్నిప్రమాదం.. ఆ ముగ్గురూ ఏమైనట్టు?
వెంకటాపురం(ఎం): కస్తూర్భా గాంధీ పాఠశాలలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో జరిగిన అగ్ని ప్రమాదంలో విద్యార్థుల దుస్తులు, పెట్టెలు కాలి బూడిదయ్యాయి. ప్రమాదం జరిగిన గదిలో విద్యార్థులు నిద్రించకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలంలోని జవహర్‌నగర్ కేజీబీవీలో సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు చోటుచేసుకుంది. కస్తూర్బాగాంధీ విద్యాలయంలో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు 280 మంది విద్యారి్థనులు చదువుతున్నారు. వారం రోజుల క్రితం కళ్ల కలక వచ్చి సుమారు 230 మంది విద్యార్థులు ఇంటికి వెళ్లారు. మిగతా వారు పాఠశాలలోనే ఉన్నారు. వారు పడుకున్న పక్క గదిలో సోమవారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. టోల్గేట్ వద్ద విధులు నిర్వహించుకుని ఇంటికి వెళుతున్న యువకులకు ఆ మంటలు కనిపించాయి. వెంటనే స్థానిక సర్పంచ్ శనిగరపు రమ భర్త రమేశ్‌కు ఫోన్లో సమాచారం ఇచి్చన యువకులు అక్కడికి చేరుకున్నారు. రమేశ్ పాఠశాలకు చేరుకుని గదిలో నిద్రిస్తున్న 44 మంది విద్యారి్థనులను కిందికి తీసుకువచ్చి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈలోగా అగ్నిమాపక సిబ్బంది వచ్చి పూర్తిగా మంటలను అదుపుచేయడంతో విద్యార్థులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కళ్లకలక వ్యాధి వచ్చి విద్యార్థులు ఇళ్లకు వెళ్లకపోతే ప్రమాదం జరిగిన గదిలో కూడా చాలామంది నిద్రించేవారని సహచార విద్యార్థులు పేర్కొన్నారు. కాగా, రాత్రి సమయంలో పాఠశాలలో విధులు నిర్వర్తించాల్సిన ఉపాధ్యాయురాలితోపాటు వాచ్‌మన్, ఏఎన్ఎం ఎవరూ విధుల్లో లేకపోవడం గమనార్హం. -
రైళ్లలో అరకొరగా ఆన్‌బోర్డు సేవలు
సాక్షి, హైదరాబాద్: రైలు బోగీల పరిశుభ్రత, ఇతర నిర్వహణకు సంబంధించిన ఆన్‌బోర్డు సేవలు సరిగా లేకపోవడం ప్రమాదాలకు దారితీస్తోంది. బోగీల్లో చెత్తా చెదారం పేరుకుపోవడం, ప్రయాణికులు తిని వదిలేసిన, పడేసిన తినుబండారాల వల్ల ఎలుకలు, బొద్దింకలు వంటివి పెరిగిపోతున్నాయి. విద్యుత్ వైర్లను ఎలుకలు కొరికేయడంతో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో ఒకట్రెండు సార్లు ఇలాంటి ఘటనలు జరిగాయి కూడా. బోగీల్లో ఎలుకలు, బొద్దింకలపై ప్రయాణికులు తరచూ ఫిర్యాదులు చేస్తూనే ఉన్నా అధికారుల్లో చలనం లేదనే విమర్శలు వస్తున్నాయి. కోవిడ్ తర్వాత ఆన్‌బోర్డు సేవలు దెబ్బతిని కోవిడ్ సమయంలో కొన్ని నెలలపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అన్ని రకాల ప్రయాణికుల సేవలకూ బ్రేక్ పడింది. తర్వాత దశలవారీగా రైళ్లన్నీ పట్టాలెక్కినా.. ఆన్ బోర్డు సేవలను అందజేసే ప్రైవేట్ సంస్థలతో పూర్తిస్థాయి ఒప్పందాలు మాత్రం కుదుర్చుకోలేదు. ఒప్పందం చేసుకున్న పలు కాంట్రాక్టు సంస్థలు సరిపడా సిబ్బందిని ఏర్పాటు చేయక బోగీల నిర్వహణ అధ్వానంగా మారుతోందని.. దీనితో కొన్ని రైళ్లలో ఆన్‌బోర్డు సేవలు సరిగా అందడం లేదని, చాలా రైళ్లలో ఇటీవలివరకు బెడ్‌రోల్స్‌ను కూడా అందజేయలేకపోయారని అధికారులు చెప్తున్నారు. తరచూ షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు గతంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఉండగానే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రెండు బోగీల్లో మంటలు వచ్చాయి. మరోసారి సికింద్రాబాద్ స్టేషన్లోనే చెన్నైకి వెళ్లే చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో కూడా షార్ట్‌సర్క్యూట్ జరిగి బోగీలు దెబ్బతిన్నాయి. నాంపల్లి స్టేషన్లో నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ ఇదే తరహా ప్రమాదానికి గురైంది. తాజాగా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లోనూ ఐదు బోగీలు కాలిపోయాయి. -
ఫలక్‌నుమా రైలు ప్రమాదానికి అదే కారణమా.. రైల్వే అధికారులు ఏం చెప్పారంటే!
సాక్షి,యాదాద్రి/బీబీనగర్: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు ఎస్–4లో షార్ట్ సర్క్యూట్‌తోనే అగ్ని ప్రమాదం జరిగిందని ఫోరెన్సిక్ నిపుణులు ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు సమాచారం. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయపల్లి– పగిడిపల్లి మధ్యన శుక్రవారం ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలుకు జరిగిన అగ్ని ప్రమాదంపై రైల్వే అధికారులు శనివారం ఉన్నత స్థాయి విచారణ చేపట్టారు. రైల్వే శాఖకు చెందిన ఎలక్ట్రానిక్ విభాగం సిబ్బంది బోగీలకు కింది భాగంలో గల బ్యాటరీలను క్షుణంగా పరిశీలించారు. బ్యాటరీల ద్వారా షార్ట్‌సర్క్యూట్ తలెత్తివుండవచ్చని అనుమానిస్తున్నారు. సిగరెట్ తాగి ప్రయాణికులు ఎవరైనా టాయిలెట్లలో పడివేయడంతో అగ్గి రాజుకుందా అన్న కోణంలో విచారణ చేయగా అలాంటి ఆనవాళ్లు లేనట్లు అధికారులు ఒక స్పష్టతకు వచ్చారు. విచారణకు సంబంధించిన పూర్తి నివేదికను సిద్ధం చేశారు. 32విభాగాల అధికారుల విచారణ ఘటనపై 32 విభాగాలకు చెందిన రైల్వే, రాష్ట్ర పోలీస్ అధికారులు విచారణ ప్రారంభించారు. బీబీనగర్ రైల్వేస్టేషన్లో ఉంచిన కాలిపోయిన బోగీలను శనివారం సుమారు 50 మంది అధికారులు పరిశీలించారు. ఎస్–4 బోగీతో పాటు కాలిపోయిన అన్ని బోగీల బ్యాటరీలను క్షుణ్ణంగా పరిశీలించారు. రిజర్వేçషన్ బోగీల్లో సెల్‌ఫోన్ చార్జింగ్ సాకెట్లలో ఏమైనా స్పార్క్ వచ్చిందా, లేక రైలు చక్రాల కింద నిప్పు రవ్వలు లేచి బోగీ అంటుకుందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. కాగా, కాలిపోయిన బోగీల్లో అధికారులకు బంగారు, వెండి ఆభరణాలు లభించాయి. అవి కాలిపోయి నల్లగా మారాయి. అలాగే లాప్టాప్, సెల్ఫోన్లు, సెల్‌ఫోన్ చార్జర్లు కాలిపోయి కన్పించాయి. -
ఫలక్‌నుమా ప్రమాదానికి కారణం ఇదే!
సాక్షి, యాదాద్రి: ఫలక్‌నుమా ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమిక అంచనా వేస్తున్నారు రైల్వే అధికారులు. ఈ మేరకు శనివారం బీబీ నగర్‌కు చేరుకున్న క్లూస్ టీం.. దగ్ధమైన బోగీలను పరిశీలించింది. సమగ్ర దర్యాప్తునకు 12 మంది అధికారులతో కూడిన బృందాన్ని దక్షిణ మధ్య రైల్వే పంపించగా .. ఈ టీం ఘటనకు సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో ఉంది. ఇదిలా ఉంటే.. ఎస్-4 కోచ్ బాత్రూమ్లో ముందుగా మంటలు చెలరేగినట్లు దర్యాప్తులో ప్రాథమికంగా తేలింది. అయితే దర్యాప్తు పూర్తి అయ్యాకే ప్రమాదం వెనక కారణాలపై స్పష్టత ఇస్తామని క్లూస్ టీం అంటోంది. హౌరా నుంచి సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్.. శుక్రవారం ఉదయం నల్లగొండ దాటి యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్యలో.. రెండు బోగీల నుంచి దట్టమైన పొగలు రావడం ప్రారంభమైంది. అది గమనించి కొందరు ప్రయాణికులు కేకలు వేయడంతో.. రైలు నిలిచిపోయింది. ఇక ప్రయాణికులంతా దిగిపోయి పెను ప్రమాదం తప్పింది. మంటలు క్రమంగా 6 బోగీలకు వ్యాపించగా.. 5 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే.. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తిట్టిపోస్తున్నారు. అయితే.. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ప్రమాద కారణాలపై సందేహాలు ఇంకా నివృత్తి కావాల్సి ఉంది. క్లూస్ టీం చెబుతున్నట్లు.. షార్ట్‌సర్క్యూటేనా, ప్రయాణికుల్లో ఎవరిదైనా నిర్లక్ష్యమా, కుట్రకోణం ఏమైనా ఉందా, రైలు నిర్వహణ సరిగా లేదా.. అనేది స్పష్టత రావాల్సి ఉంది. -
Yadadri: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. మూడు బోగీలు దగ్ధం
సాక్షి, యాదాద్రి: ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ రైలులో శుక్రవారం మంటలు చెలరేగాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మాయిపల్లి-పగిడిపల్లి మధ్య ఈ ఘటన జరిగింది. ఇప్పటివరకు కారణం ఏంటన్నది అధికారికంగా వెల్లడించలేదు. ప్రాథమికంగా షాట్ సర్క్యూట్ జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మంటలు పూర్తిగా పెరగకముందే బోగీల్లోని ప్రయాణికులను దించేయడంతో ప్రాణ నష్టం తప్పింది. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినప్పటికీ ప్రాణనష్టం జరగకపోవడం స్వల్ప ఉపశమనం. మంటల ధాటికి మూడు బోగీలు పూర్తిగా దగ్ధమైమయ్యాయి. రైలు హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద ఘటన కారణంగా ఈ రూటులో వెళ్లే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. తప్పిన పెనుముప్పు మంటలు చెలరేగడానికి కచ్చితంగా కారణం ఏంటన్నది తెలియకపోయినా.. కొందరు ప్రయాణీకులు మాత్రం రైలులో ఓ వ్యక్తి సిగరెట్ తాగుతున్నట్టు గమనించామని తెలిపారు. ఛార్జింగ్ పాయింట్ వద్ద ఓ ప్రయాణికుడు సిగరెట్ తాగుతూ కనిపించాడని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. తొలుత S4లో మంటలు వ్యాపించాయని చెప్పారు. ఉదయం 11 -11.30 గంటల మధ్య ప్రమాదం జరిగిందని, మంటలు రావడంతో ప్రయాణీకులు చైన్ లాగి రైలుని ఆపివేశారు. ప్రయాణికులు అప్రమత్తమై దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. చైన్ లాగకపోయి ఉంటే భారీ ప్రమాదం జరిగి ఉండేదని పేర్కొన్నారు. కాగా కాలిపోయిన బోగీల్లో ఎక్కువ మంది విశాఖ వాసులు ఉన్నారు. రిజర్వేషన్ లేకున్నా.. కొందరు స్లీపర్ బోగీల్లో ఎక్కినట్టు గుర్తించారు. మొత్తం మూడు బోగీలకు మంటలు వ్యాపించాయి. ఫలక్‌నుమా S4, S5, S6 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. పక్క బోగీలకు మంటలు వ్యాపించకుండా అధికారులు లింక్ తొలగించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: హైదరాబాద్‌లో ‘కేరళ స్టోరీ’ ఉదంతం.. కూతురు జాడ చెప్పాలంటూ.. -
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం
జరుగుమల్లి (సింగరాయకొండ): అర్ధరాత్రి హైవేపై ప్రయాణిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపి ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో అందరూ కిందికి దిగేశారు. బస్సు పూర్తిగా దగ్ధమైంది. బుధవారం అర్ధరాత్రి సుమారు ఒంటిగంట సమయంలో ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కె.బిట్రగుంట సమీపంలో హెచ్‌పీ పెట్రోల్ బంకు వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌కు చెందిన మోజో ట్రావెల్స్ బస్సు(స్లీపర్) 25 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి పాండిచ్చేరి వెళుతోంది. బస్సు వెనుక భాగంలో ఉన్న సిగ్నల్ లైట్స్‌కు విద్యుత్ సరఫరా చేసే వైర్లు, ఏసీ కేబుల్స్ కలిసి ఉండటంతో షార్ట్ సర్క్యూటై మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ లక్ష్మణ్.. వెంటనే బస్సును రోడ్డు మార్జిన్లో ఆపివేశాడు. ప్రయాణికులను కిందకు దించి మంటలపై బకెట్‌తో నీళ్లు చల్లి ఆర్పే ప్రయత్నం చేశా డు. అయినప్పటికీ మంటలు తగ్గకపోగా, కాసేపట్లోనే బస్సు మొత్తం వ్యాí³ంచాయి. అప్పటికే ప్రయాణికులంతా కిందకు దిగడంతో ప్రాణాపాయం తప్పింది. అగ్నిమాపకశాఖ సిబ్బంది ఫైరింజన్‌తో అక్కడకు చేరుకుని మంటలనార్పారు. అయితే బస్సులోనే ఉండిపోయిన ప్రయాణికుల లగేజీ మొత్తం కాలిపోయింది. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కట్టుబట్టలతో మిగిలిన ప్రయాణికులను ఇతర వాహనాల్లో ఎక్కించి గమ్యస్థానాలకు చేర్చారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సింగరాయకొండ సీఐ రంగనాథ్ తెలిపారు. -
రైలు బోగీలో మంటలు
ఏలూరు టూ టౌన్/ఏలూరు టౌన్: ఏలూరు పెద్ద రైల్వేస్టేషన్లో శనివారం రాత్రి రైల్వే ట్రాక్ మెషిన్ సిబ్బంది ప్రయాణించే రైలు బోగీ అగ్ని ప్రమాదానికి గురైంది. దీనిని రైల్వే లైన్ మరమ్మతుల కోసం ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే అధికారులు, అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ట్రాక్ మరమ్మతుల కోసం వినియోగించే ఈ బోగీని ఏలూరు రైల్వేస్టేషన్ ట్రాక్ నంబర్ 7లో చివర లూప్లైన్లో నిలిపి ఉంచారు. రాత్రి 7.30–8 గంటల మధ్య ఈ బోగీకి మంటలు అంటుకుని ఎగసిపడ్డాయి. అప్రమత్తమైన రైల్వే అధికారులు ఏలూరు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ రామకృష్ణ ఆధ్వర్యంలో రెండు ఫైర్ ఇంజిన్లు అక్కడకు చేరుకుని అదుపు చేశాయి. బోగీలో నిల్వ ఉంచిన 10 వరకు ఆయిల్ డ్రమ్ములను బయటకు లాగి వేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. వీటికి నిప్పు అంటుకుని ఉంటే అదుపు చేయడం కష్టమయ్యేది. ఆ బోగీలో విలువైన బ్యాటరీలు, ఎలక్ట్రికల్ వైర్లు, ట్రాక్ మరమ్మతులకు వినియోగించే సామగ్రి, కూలర్ వంటివి బయటికి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం రైల్వే ఇంజనీరింగ్ విభాగానికి చెందిన క్యాంపింగ్ కోచ్ ఫర్ ట్రాక్ మెషిన్ సిబ్బంది ప్రయాణించే ప్రత్యేక రైలు బోగీలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని ఏలూరు అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ రామకృష్ణ చెప్పారు. శనివారం విపరీతమైన వేడి ఉండటం వల్ల అందులోని వైర్లు షార్ట్ సర్క్యూట్ అయి అగ్ని ప్రమాదం జరిగిందని మీడియాకు చెప్పారు. ఈ రైలు బోగీలో రైల్వే సిబ్బందితో పాటు డీజిల్ ట్యాంకులు, యంత్ర పరికరాలు ఉంటాయన్నారు. పక్క బోగీలోనే భారీగా డీజిల్ నిల్వలు ఉన్నాయన్నారు. మంటలు వ్యాప్తి చెందక ముందే అదుపు చేశామని చెప్పారు. బోగీలోని 15 మంది సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలగలేదని వివరించారు. ఆస్తి నష్టం అంచనా వేయాల్సి ఉందన్నారు. -
తిరుపతి: టపాసుల నిల్వ కేంద్రంలో అగ్నిప్రమాదం.. ముగ్గురి మృతి
సాక్షి, తిరుపతి: జిల్లాలోని వరదయ్యపాలెం మండలంలోని ఎల్లకటవ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. టపాకాయల నిల్వ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగి ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. టపాసుల గోదాం నుంచి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఏడుకొండలు (37), నాగేంద్రబాబు (35) మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో వ్యక్తి ఆచూకీ తెలియాల్సి ఉంది. కళ్యాణ్ (22) వీరయ్య (48) అనే ఇద్దరికి తీవ్రగాయాలవ్వగా.. మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. -
బంగారు గనిలో ప్రమాదం.. 27 మంది మృతి
లిమా: దక్షిణ అమెరికా దేశం పెరూలోని ఓ బంగారు గనిలో సంభవించిన అగ్నిప్రమాదంలో 27 మంది మృతి చెందారు. ఇద్దరిని మాత్రమే రక్షించగలిగామని అధికారులు తెలిపారు. అరెక్విపా ప్రాంతంలోని ఎస్పెరాంజా గనిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఈ ఘటన చోటుచేసుకుంది. గనిలో సుమారు 100 మీటర్ల లోతులో సిబ్బంది పనిచేస్తున్న చోట మంటలు చెలరేగినట్లు సమాచారం. ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గనులు పెరూలో ఉన్నాయి. ఏటా వీటి నుంచి 100 టన్నుల బంగారాన్ని వెలికితీస్తుంటుంది. ప్రపంచంలోని బంగారం ఉత్పత్తిలో ఇది 4%. -
ఎలక్ట్రిక్ డక్ట్‌లో షార్ట్ సర్క్యూట్.. స్వప్నలోక్ అగ్నిప్రమాదానికి కారణమిదే..
సాక్షి, హైదరాబాద్/రామ్‌గోపాల్‌పేట: సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో గురువారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదానికి ఎలక్ట్రిక్ వైర్లకు సంబంధించిన డక్ట్‌లో షార్ట్ సర్క్యూటే కారణమని అగి్నమాపక శాఖ అధికారులు తేల్చారు. ఈ మంటలు ఐదో ఫ్లోర్లో బయటకు వచ్చి ఆరు, ఏడు ఆంతస్తులకు వ్యాపించినట్లుగా ఆధారాలు లభించాయి. ఈ ప్రమాదంలో మరణించిన ఆరుగురూ ఒకే కార్యాలయంలో పని చేస్తున్నారని, మంటలకు భయపడి బయటకు రాలేక ప్రాణాలు పోగొట్టుకున్నారని నిర్ధారించారు. శుక్రవారం పోలీసులు, క్లూస్‌టీమ్స్ కాంప్లెక్స్‌లో తనిఖీలు చేసి ఆధారాలు సేకరించాయి. అగి్నమాపక శాఖ డీజీ వై.నాగిరెడ్డి కూడా ఘటనా స్థలాన్ని సందర్శించారు. డక్ట్ నుంచి పైకి వ్యాప్తి.. ఎలక్ట్రిక్ వైర్ల డక్ట్‌లో మొదలైన మంటలు నాలుగో ఫ్లోర్ వరకు లోలోపలే విస్తరించాయి. ఐదో ఫ్లోర్లో డక్ట్ తెరిచి ఉండటంతో పక్కనే ఉన్న ఫ్లాట్ నం.510, 511ల్లో ఉన్న కేడియా ఇన్ఫోటెక్ లిమిటెడ్ అండ్ వికాస్ పేపర్ ఫ్లెక్సో ప్యాకింగ్ లిమిటెడ్, క్యూ నెట్–విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిలెడ్ సంస్థలకు వ్యాపించాయి. ఆరు, ఏడు అంతస్తులకూ ఎగబాకాయి. ఇది దాదాపు రాత్రి 7.15 గంటల సమయంలో చోటు చేసుకుంది. క్యూ నెట్ కార్యాలయం నుంచి ఉద్యోగులు, టెలికాలర్లు ప్రతి రోజూ సాయంత్రం 6–7 గంటల ప్రాంతంలో వెళ్లిపోతారు. ఆ తర్వాత టీమ్ లీడర్లతో పాటు కొందరు మాత్రమే ఉంటారు. గురువారం రాత్రి అగ్నిప్రమాదం జరిగే సమయానికి అందులో దయాకర్, శ్రావణ్, పవన్ (రెస్క్యూ అయ్యారు)లతో పాటు శివ, త్రివేణి, వెన్నెల, ప్రమీల, శ్రావణి, ప్రశాంత్ (అసువులు బాశారు) ఉన్నారు. రాత్రి 7.30 గంటల కు కార్యాలయంలోకి పొగ రావడాన్ని గమనించిన మొదటి ముగ్గురూ వెనుక వైపు ఉన్న కిటికీ పగులకొట్టుకుని సజ్జపైకి దిగారు. అక్కడ నుంచే తమ ఉనికిని కింద ఉన్న అగి్నమాపక, డీఆర్ఎఫ్ అధికారులకు తెలియజేసి ప్రాణాలు దక్కించుకున్నారు. భయంతో బయటకు రాలేక.. మిగిలిన ఆరుగురూ భయంతో కార్యాలయం లోపలకు వరకు వెళ్లిపోయారు. దీనికి సమీపంలో ఉన్న ఒమెగా సంస్థను నిర్వహించే సు«దీర్‌రెడ్డి ఈ విషయం గమనించారు. ధైర్యం చేసిన ఆయన క్యూనెట్ వరకు వెళ్లి అందులో ఉన్న వారిని తనతో రావాల్సిందిగా కోరారు. నలుగురు యువతులు ఆయనతో కలిసి కాస్త ముందుకు వచి్చనా.. అక్కడ దట్టమైన పొగ చూసి భయపడి మళ్లీ తమ కార్యాలయంలోకి వెళ్లిపోయారు. సు«దీర్ మాత్రం భవనం బీ బ్లాక్ ముందు వైపునకు చేరుకుని అక్కడున్న ఖాళీ ప్రదేశంలో, పొగ ప్రభావం ఏమాత్రం లేనిచోట నిలబడ్డారు. సెల్ఫోన్లో లైట్ వెలిగించడం ద్వారా సహాయక సిబ్బంది గుర్తించేలా చేసి బయటపడ్డారు. క్యూ నెట్ కార్యాలయంలో ఉన్న నలుగురు యువతుల్లో ముగ్గురు బాత్రూమ్లోకి వెళ్లి పొగ రాకూడదనే ఉద్దేశంతో తలుపు వేసుకున్నారు. మరో యువతితో పాటు ఇద్దరు యువకులు ఆ సమీపంలోని గదిలో వేర్వేరు చోట్ల ఉండిపోయారు. అలా అక్కడే ఆగిపోయిన ఆరుగురు పొగ పీల్చుకోవడం వల్లే మరణించినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. స్టెయిర్‌కేస్ గ్రిల్స్‌కు తాళం వేయడం వల్లే.. ఈ కాంప్లెక్స్‌లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు అమలు కావట్లేదని, పైపులు ఉన్నా పని చేయట్లేదని అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇటీవలే నోటీసులు జారీ చేశామన్నారు. కాంప్లెక్స్‌కు లిఫ్ట్‌లు ఉండటంతో ఐదో అంతస్తులో ఫ్లోర్‌కు, మెట్లకు మధ్య ఉన్న ఇనుప గ్రిల్స్‌ను లాక్ చేసి ఉంచడం, అక్కడ సామాను పెట్టుకోవడం కూడా ఆరుగురు మృతి చెందడానికి ఓ కారణమైందన్నారు. ఇకపై కాంప్లెక్సుల్లో గ్రిల్స్‌కు ఇలా తాళాలు వేసి ఉంటే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలన్నారు. పలు సెక్షన్ల కింద కేసు అగి్నప్రమాదంపై కాంప్లెక్స్ సూపర్వైజర్ శ్రీనివాస్ మహంకాళి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో స్వప్నలోక్ సూర్యకిరణ్ ఎస్టాబ్లి‹Ùమెంట్ అసోసియేషన్, కేడియా ఇన్ఫోటెక్ లిమిటెడ్ అండ్ వికాస్ పేపర్ ఫ్లెక్సో ప్యాకింగ్ లిమిటెడ్, క్యూ నెట్–విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిలెడ్ సంస్థలపై ఐపీసీలోని 304 పార్ట్ 2, 324, 420 సెక్షన్లతో పాటు పేలుడు పదార్థాల చట్టంలోని సెక్షన్ 9 (బి) కింద కేసు పెట్టిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆరు మృతదేహాలకు గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబీకులకు అప్పగించారు. క్యూ నెట్ వ్యవహారాలపై పూర్తిస్థాయి దర్యాప్తు స్వప్నలోక్‌లో అగ్ని ప్రమాదం క్యూ–నెట్ దందాను మరోసారి తెరపైకి తెచ్చింది. ఈ ఘటనలో చనిపోయిన ఆరుగురూ ఈ సంస్థలో పనిచేస్తున్న వారిగా తేలింది. అయితే ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకే విక్రయించడం పేరుతో క్యూ నెట్ మల్టీ లెవల్ మార్కెటింగ్‌కు తెరలేపడంపై గతంలో సీఐడీ సహా అనేక ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. ఇటీవలే మళ్లీ ఈ సంస్థ తమ కార్యకలాపాలు ప్రారంభించిందని, ప్రచారం కోసం సెలబ్రెటీలను వినియోగించుకుంటోందని ఈ స్కామ్‌ను వెలుగులోకి తెచి్చన సీనియర్ ఐపీఎస్ వీసీ సజ్జనార్ ట్వీట్ చేయడం గమనార్హం. కాగా ప్రమాదానికి సంబంధించి క్యూ నెట్‌పైనా కేసు నమోదైన నేపథ్యంలో దీని వ్యవహారాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని మహంకాళి పోలీసులను ఉన్నతాధికారులు ఆదేశించారు. పేలుడు పదార్థాల చట్టం మొదటిసారి.. స్వప్నలోక్‌లో అగ్నిప్రమాదంపై మహంకాళి పోలీసులు ఐపీసీ 420తో పాటు పేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదు చేశారు. అగి్నప్రమాదాలకు సంబంధించిన కేసుల్లో ఇలాంటి సెక్షన్లు జోడించడం ఇదే ప్రథమం. అనుమతి లేకుండా గ్యాస్ సిలిండర్లు కలిగి ఉండటం, బాణసంచా నిల్వ చేయడం, పేలుడు పదార్థాలు, రసాయనాలు దాచి ఉంచడం వంటి వాటి వల్లా ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. స్వప్నలోక్ కాంప్లెక్స్‌లోనూ ఇలాంటివి అక్రమంగా నిల్వ చేస్తే మోసం చేసినట్లే. ఈ కారణంగానే ఐపీసీ సెక్షన్ 420తో పాటు పేలుడు పదార్థాల చట్టంలోని సెక్షన్‌ను జోడించారు. ఈ కాంప్లెక్స్‌లో అనేక కార్యాలయాలతో పాటు గోదాములు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అగ్నిమాపక శాఖ, జీహెచ్ఎంసీతో పాటు క్లూస్ టీమ్ ఇచ్చే నివేదిక ఆధారంగా కేసులో తదుపరి చర్యలు తీసుకోనున్నారు. చదవండి: హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం.. -
దుకాణంలో మంటలు.. రూ.8 లక్షల నగదు.. 50 పట్టు చీరలు దగ్ధం
సాక్షి, అనంతపురం(ఉరవకొండ): విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి రూ. 8 లక్షల నగదు, ఇల్లు దగ్ధమైంది. పోలీసులు తెలిపిన మేరకు... స్థానిక 10వ వార్డులో నివాసముంటున్న చంద్రనాథ్ పట్టుచీరల వ్యాపారంతో జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఉదయం కుటుంబసభ్యులతో కలసి ఇంటికి తాళం వేసి చంద్రనాథ్ బయటకు వెళ్లాడు. ఆ సమయంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ చోటు చేసుకుని మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల వారు గమనించి, సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసింది. అప్పటికే ఇంట్లో విలువైన వస్తు సామగ్రితో పాటు వ్యాపారం కోసం ఉంచిన 50 పట్టు చీరలు, రూ.8 లక్షల నగదు కాలిపోయాయి. రూ.15 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధిత కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఘటనపై సీఐ హరినాథ్ దర్యాప్తు చేపట్టారు. -
మృత్యుపాశం.. కూలీల ట్రాక్టర్‌పై తెగిపడ్డ 11 కేవీ విద్యుత్ తీగ
రాయదుర్గం/ బొమ్మనహాళ్/ సాక్షి, అమరావతి: కాసేపట్లో ఇంటికి చేరాల్సిన వ్యవసాయ కూలీలను కరెంటు తీగ కాటేసింది. ట్రాక్టర్లో ఇళ్లకు తిరుగు పయనమవుతున్న సమయంలో వారి బతుకులు బుగ్గిపాలయ్యాయి. అప్పటి వరకు మేఘావృతమై కనిపించిన ఆకాశం.. పనులు పూర్తయ్యే సరికి చిరుజల్లులు కురిపించింది. దీంతో 11 కేవీ విద్యుత్ తీగలు షార్ట్ సర్క్యూట్‌కు గురయ్యాయి. ఓ తీగ తెగి కూలీలు వెళ్తున్న ట్రాక్టర్‌పై పడింది. అక్కడికక్కడే నలుగురు మహిళా కూలీలు మృత్యువాత పడ్డారు. మరో ఐదుగురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం దర్గా హొన్నూరు వద్ద బుధవారం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, అధికారులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. దర్గా హొన్నూరు గ్రామానికి చెందిన కమ్మూరి సుబ్బన్న అనే రైతు ఊరికి సమీపంలోని తన పొలంలో ఆముదం పంట సాగు చేశాడు. పంట దిగుబడిని తీసేందుకు బుధవారం ఉదయం 8.30 గంటలకు సొంత ట్రాక్టరులో గ్రామానికే చెందిన 14 మంది కూలీలను తీసుకుని వెళ్లాడు. వీరిలో ఎనిమిది మంది మహిళలు.. ఆరుగురు పురుషులు ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పని పూర్తయ్యింది. అదే సమయంలో వర్షం కూడా మొదలైంది. అయినా తిరుగు పయనమయ్యేందుకు సిద్ధమయ్యారు. కూలీలను ఎక్కించుకుని, ట్రాక్టర్‌ను రివర్స్ చేస్తుండగా.. పైనున్న 11 కేవీ విద్యుత్ తీగ షార్ట్‌సర్క్యూట్ కారణంగా తెగి ట్రాక్టరుపై పడింది. దీంతో వన్నక్క (52), రత్నమ్మ (40) అనే అత్తాకోడళ్లతో పాటు శంకరమ్మ (34), పార్వతి (48) అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురు మహిళా, ఇద్దరు పురుష కూలీలకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం కర్ణాటక రాష్ట్రం బళ్లారిలోని విజయనగర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్ (విమ్స్)కు తరలించారు. వీరిలో సుంకమ్మ అనే మహిళా కూలీ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తున్న రైతు సుబ్బన్న, ఐదుగురు కూలీలు సురక్షితంగా బయటపడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప, కళ్యాణదుర్గం ఆర్డీఓ నిశాంత్ కుమార్ తదితరులు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బళ్లారి ఆస్పత్రికి వెళ్లి మృతుల, క్షతగాత్రుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాద విషయాన్ని ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సీఎం జగన్ దిగ్భ్రాంతి దర్గా హొన్నూరులో విద్యుదాఘాతం ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యుదాఘాతంతో మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. (విద్యుత్ శాఖ ద్వారా రూ.5 లక్షలు, సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.5 లక్షలు) బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలని అధికారులకు ఆదేశించారు. కాగా, మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అనంతపురం జిల్లా కలెక్టర్‌కు, ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలిచ్చామన్నారు. ‘కండక్టర్’ తెగడం వల్లే ప్రమాదం ఇన్సులేటర్ ఫ్లాష్ అవ్వడంతో కండక్టర్ తెగడం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) సీఎండీ కే సంతోషరావు తెలిపారు. ఈ సంఘటనకు బాధ్యులుగా భావిస్తూ నలుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఘటనపై విచారణకు ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం నుంచి చీఫ్ జనరల్ మేనేజర్ (పి–ఎంఎం) డి.వి.చలపతి నేతృత్వంలో చీఫ్ జనరల్ మేనేజర్ (ఓ–యం) కె. గురవయ్య, విజిలెన్స్ ఇన్స్పెక్టర్ (అనంతపురం) యం. విజయ భాస్కర్ రెడ్డిలతో కమిటీని నియమించామని చెప్పారు. ఈ కమిటీని హుటాహుటిన సంఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లాల్సిందిగా ఆదేశించామన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రాథమిక సమాచారం ఆధారంగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (కళ్యాణ దుర్గం) ఎస్.మల్లికార్జున రావు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (బొమ్మనహాళ్) ఎం.కె. లక్ష్మీరెడ్డి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ప్రొటెక్షన్) హెచ్. హమీదుల్లా బేగ్, లైన్మెన్ (దర్గా హొన్నూర్) కె.బసవ రాజులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశామని సీఎండీ తెలిపారు. అనంతపురం ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ పి.నాగరాజు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఆపరేషన్స్/రాయదుర్గం) శేషాద్రి శేఖర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (యం–పి/అనంతపురం) కె. రమేష్‌ల నుంచి వివరణ కోరుతూ మెమో జారీ చేశామన్నారు. -
అగ్ని ప్రమాదానికి కుటుంబం బలి
రేణిగుంట: అగ్నిప్రమాదం ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఓ తండ్రి, ఇద్దరు పిల్లలు నిద్రలోనే అగ్నికి ఆహుతవ్వగా.. తల్లి ఏకాకిగా మారిపోయింది. తిరుపతి జిల్లా రేణిగుంటలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రేణిగుంట డీఎస్పీ రామచంద్ర తెలిపిన వివరాలు.. వైఎస్సార్ జిల్లా పాటూరుకు చెందిన డాక్టర్ ఎం.రవిశంకర్‌రెడ్డి(47), గుంటూరుకు చెందిన డాక్టర్ అనంతలక్ష్మికి సిద్దార్థ్‌రెడ్డి (14), కార్తీక (10) అనే ఇద్దరు పిల్లలున్నారు. వీరు ఏడాదిన్నర కిందట రేణిగుంటలోని బిస్మిల్లానగర్‌లో రెండంతస్తుల ఇల్లు నిర్మించుకుని.. కింద ఫ్లోర్లో క్లినిక్ నిర్వహిస్తున్నారు. రవిశంకర్‌రెడ్డి తిరుపతిలోని డీబీఆర్ ఆస్పత్రిలో రేడియాలజిస్ట్‌గా పనిచేస్తున్నాడు. రవిశంకర్‌రెడ్డి తల్లి రామసుబ్బమ్మ కూడా వీరితోనే నివసిస్తోంది. శనివారం రాత్రి మొదటి అంతస్తులోని బెడ్రూమ్లో రామసుబ్బమ్మ, 2వ అంతస్తులోని ఓ గదిలో ఇద్దరు పిల్లలతో అనంతలక్ష్మి, మరో గదిలో ఆమె భర్త రవిశంకర్‌రెడ్డి నిద్రపోయారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో 2వ అంతస్తులోని వంటగది నుంచి మంటలు వ్యాపించడాన్ని గమనించిన వాచ్మెన్ కేకలు వేస్తూ తలుపులు బాదాడు. అనంతలక్ష్మి తలుపు తీసి బయటకు రాగా.. అప్పటికే మంటలు దట్టంగా కమ్మేశాయి. దీంతో ఆమె ప్రాణభయంతో కిందకు పరుగు తీసింది. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మొదటి అంతస్తులో ఉన్న రామసుబ్బమ్మను కిటికీ అద్దాలు పగలగొట్టి.. జేసీబీ సాయంతో సురక్షితంగా తీసుకొచ్చారు. 2వ అంతస్తులో ఉన్న పిల్లలను అతికష్టం మీద బయటకు తీసుకురాగా.. అప్పటికే వారు మృతి చెందారు. మరో గదిలో నిద్రించిన డాక్టర్ రవిశంకర్‌రెడ్డి పూర్తిగా కాలిపోయి మరణించాడు. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఆయన కుమార్తె పవిత్రారెడ్డి ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతలక్ష్మిని ఎమ్మెల్యే పరామర్శించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలకు తరలించినట్లు గాజులమండ్యం పోలీసులు తెలిపారు. గ్యాస్ లీకై.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. -
Hyderabad: మలక్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: మలక్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫరహత్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది రోగులను మరో భవనంలోకి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సకాలంలో మంటలను అదుపు చేశారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. చదవండి: (పల్లెవెలుగు నుంచి ఏసీ వరకు.. అన్ని బస్సుల్లో తల్లులకు ప్రయాణం ఫ్రీ) -
ఘోర ప్రమాదం.. గాఢ నిద్రలో అగ్నికి ఆహుతైన ఏడుగురు!
ఇండోర్: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇండోర్‌లో ఓ రెండంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మరణించినట్లు ఇండోర్ కమిషనర్ హరినారాయణ చారి మిశ్రా తెలిపారు. తొమ్మిది మంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. వీళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనివారం వేకువ జామున నాలుగు, ఐదు గంటల మధ్య ఇండోర్ స్వర్ణ్ భాగ్ కాలనీలోని ఓ రెండు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. నిద్రలో ఉండగా జరిగిన ప్రమాదంతో తప్పించుకునేందుకు వీలు లేకుండా పోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మూడుగంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే షార్ట్‌సర్క్యూట్‌తోనే ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. #UPDATE | Seven people died in the fire that broke out in a two-storey building in Indore, Madhya Pradesh: Indore Police Commissioner Harinarayana Chari Mishra to ANI Latest visuals from the spot. pic.twitter.com/E6wXhytkl3 — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 7, 2022 -
భగవంతుడా ఇంత ఘోరమా.. వేకువ జామున విషాదం
హొసపేటె(బెంగళూరు): ఎంతో నెమ్మదస్తులు.. అందరితో సౌమ్యంగా మెలిగే కుటుంబం.. వైశ్య సముదాయంలో మంచి పేరు గడించిన ఆ ఇంట్లో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. దంపతుల సహా నలుగురు మృత్యువాతపడ్డారు. విజయనగర జిల్లా మరియమ్మనహళ్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉంటున్న రాఘవేంద్రశెట్టి, రాజశ్రీ దంపతుల ఇంటిలో శుక్రవారం వేకువజామున ఏసీలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి సిలిండర్ పేలి మంటలు చెలరేగి ఊపిరి ఆడక అతని కుమారుడు వెంకట ప్రశాంత్ (42), కోడలు చంద్రకళ (38), మనవడు అద్విక్ (16), మనవరాలు ప్రేరణ (14)లు మృతి చెందారు. దీంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాఘవేంద్ర శెట్టికి ఇద్దరు కుమారులు. ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు వెంకట ప్రశాంత్ స్థానికంగా కిరాణా వ్యాపారం చేస్తుండగా మరో కుమారుడు అమెరికాలో ఉన్నాడు. కుమార్తె కర్నూలులో ఉంది. వెంకట ప్రశాంత్‌కు కిరాణా వ్యాపారం ఉండటంతో మరియమ్మనహళ్లితో పాటు చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి. కడసారి చూపు కోసం వందలాదిగా జనం తరలివచ్చారు. ఎంతో మంచి కుటుంబానికి దేవుడు అన్యాయం చేశాడని విలపించారు. బంధువులు ఇంటివద్దకు చేరుకొని గుండెలు బద్దలయ్యేలా రోదించారు. కొడుకు, కోడలు, మనవడు, మనవరాలిని పోగొట్టుకొన్న రాఘవేంద్ర శెట్టి, రాజశ్రీ దంపతులను ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. చదవండి: వివాహేతర సంబంధం..భార్య, అత్త, ప్రియుడు, మరో మిత్రుడితో కలిసి.. -
అయ్యో.. చివరికి మాంసం ముద్దే మిగిలింది!
సాక్షి,కురవి(వరంగల్): విద్యుత్‌షార్ట్ సర్క్యూట్‌తో మంటలు లేచి రేకుల ఇల్లు కాలిపోయిన ఘటనలో మంచంలో నిద్రిస్తున్న వృద్ధురాలు బానోత్ బాజు(75) సజీవదహనమైంది. ఈ విషాదకర ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కంచర్లగూడెం తండాలో మంగళవారం అర్ధరాత్రి దాటాక చోటుచేసుకుంది. మృతురాలి భర్త బిచ్చా కథనం ప్రకారం.. తండాకు చెందిన బానోత్ బిచ్చా, బాజులు మంగళవారం రాత్రి భోజనం చేసిన తర్వాత తన రేకుల ఇంటిలో నిద్రించారు. బాజు ఒక మూలకు మంచం వేసుకోగా, బిచ్చా ఇంటి తలుపు ముందు మంచంపై పడుకున్నాడు. అర్ధరాత్రి 1.30గంటల నుంచి 2గంటల మధ్య విద్యుత్‌షార్ట్ సర్క్యూట్ రావడంతో నిప్పురవ్వలు ఎగిసి పడ్డాయి. రేకుల ఇంటికి కింది భాగంలో తడకలు, గడ్డిపొరకలు ఉండడంతో మంటలు చెలరేగి మంచంలో పడుకుని ఉన్న బాజుకు అంటుకున్నాయి. బాజు కేకలు వేయడంతో బిచ్చా లోనికివెళ్లి భార్యను కాపాడేందుకు యత్నించాడు. ఈ క్రమంలో బిచ్చా తలకు మంటలు అంటుకుని వెంట్రుకలు కాలిపోయాయి. బయటికి తీసుకురావడం సాధ్యంకాకపోవడంతో భయంతో బిచ్చా బయటకు పరుగులు తీశాడు. చుట్టు పక్కల జనం వచ్చి చూసే సరికి మంటలు పూర్తిగా వ్యాపించి ఇల్లు కాలిపోయింది. మంచంపై పడుకుని ఉన్న బాజు మాంసం ముద్దలా మారింది. సమాచారం అందుకున్న కురవి ఎస్సై రాణాప్రతాప్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. శవపంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం మానుకోట ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి భర్త బిచ్చా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపాడు. చదవండి: డ్రగ్స్ కేసు: తెలంగాణ సీఎస్‌కు హైకోర్టు నోటీసులు -
బోయిగూడ అగ్ని ప్రమాదం: ‘అది పేలడం వల్లే మంటలు వ్యాపించాయి’
సాక్షి, హైదరాబాద్: కార్యాలయాలు, పరిశ్రమలు, వ్యాపార సంస్థల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే మంటలు ఆర్పడానికి ఫైర్ ఎగ్ట్సింగ్విషర్స్ (మంటలు ఆర్పే పరికరం) వాడుతుంటారు. అయితే న్యూ బోయగూడలోని స్క్రాప్ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదం తీవ్రత పెరగడానికి ఇలాంటి ఫైర్ ఎగ్ట్సింగ్విషరే కారణమైందని పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్ క్లూస్ టీమ్‌తో పాటు గాంధీనగర్ పోలీసులు ఘటనాస్థలి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే క్లూస్ అధికారులు కీలక ఆధారాలను సేకరించిన పోలీసులకు అందించారు. వీటి ఆధారంగానే షార్ట్‌సర్క్యూట్ ద్వారా అగ్గి పుట్టి ఉండొచ్చని, ఫైర్ ఎగ్ట్సింగ్విషర్ కారణంగా విస్తరించిందని తేల్చారు. ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. సంబంధిత వార్త: బోయిగూడ అగ్ని ప్రమాదం: గోదాంలో ఉండేది 8 మందే.. ఆ నలుగురు ఎవరంటే! మంటలు మొదలైంది స్టెయిర్ కేస్ వద్దే... ఈ స్క్రాప్ గోదాం నుంచి బిహారీలు బస చేసిన మెజనైన్ ఫ్లోర్‌కు వెళ్లడానికి స్పెరల్ స్టెయిర్ కేస్ ఉంది. దీని పక్కనే ఓ స్విచ్‌బోర్డ్ ఉండగా, మంగళవారం రాత్రి దీని ఎదురుగా ట్రాలీ ఆటో ఆగింది. స్విచ్‌బోర్డ్ చుట్టూ వైర్లు ఉండటంతో పాటు అందులోని ఓ ఫ్యూజ్ కొట్టేసి ఉన్న అధికారులు గుర్తించారు. మిగిలిన ఫ్యూజుల్లో ఒక వైరు కాకుండా కొన్ని వైర్లను కలిపి సర్క్యూట్ ఏర్పాటు చేసినట్లు తేల్చారు. దీని ప్రకారం ఆ గోదాంలో తరచు ఫ్యూజ్ కొట్టేస్తూ ఉంటుందని నిర్ధారించారు. బుధవారం తెల్లవారుజామున జరిగిన షార్ట్‌సర్క్యూట్ కారణంగానే మంటలు అంటుకోవడంతో పాటు ఓ ఫ్యూజ్ కొట్టేసిందని భావిస్తున్నారు. అక్కడే పార్క్ చేసి ఉన్న ఆటోను పరిశీలించిన అధికారులు స్టెయిర్ కేస్ వైపు ఎక్కువగా, రెండో వైపు తక్కువగా కాలినట్లు తేల్చారు. దీని ఆధారంగానూ ఆస్టెయిర్ కేస్ వద్దే అగ్గిపుట్టినట్లు నిర్ధారిస్తున్నారు. బయటి వేడి ఎక్కువ కావడంతోనే... ఈ మంటలు సమీపంలోని స్క్రాప్‌కు అంటుకోవడంతో కాస్త విస్తరించాయి. ఆ సమీపంలోనే ఉన్న ఫైర్ ఎగ్ట్సింగ్విషర్ చుట్టూ మంటలు చేరేసరికి దాని ఉపరితల భాగం బాగా వేడెక్కింది. దీని ప్రభావంతో లోపల ఉండే వివిధ పౌడర్లు వ్యాకోచించడం, వాయువులుగా మారడం ప్రారంభమైంది. దీంతో పైన ఉన్న ఇనుప సిలిండర్‌ను పగులకొట్టకుంటూ ఆ వాయువులు బయటకు చొచ్చుకురావడంతో పేలుడు సంభవించింది. చదవండి: ఆర్ఆర్ఆర్ తొలి గెజిట్‌కు గ్రీన్‌సిగ్నల్.. 113 గ్రామాలు.. 1904 హెక్టార్లు దీని శబ్ధానికే ‘మృత్యుంజయుడు’ ప్రేమ్ లేచి సురక్షితంగా బయటపడ్డాడు. సాధారణంగా ఫైర్ ఎగ్ట్సింగ్విషర్ లోపల నుంచి కార్బన్డయాక్సైడ్ రావాలి. అయితే మంటల వేడి కారణంగా అందులోని పౌడర్లు వివిధ మార్పులు చెంది బయటకు చొచ్చుకువచ్చాయి. దీంతో అవి సమీపంలో ఉన్న మంటను గోదాం మొత్తం విస్తరించేలా చేశాయి. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన పేలుడు ఫైర్ ఎగ్ట్సింగ్విషర్కు సంబంధించిందని అధికారులు గుర్తించారు. వివిధ రకాలైన ఆధారాల సేకరణ... ఘటనాస్థలిలో అణువణువూ పరిశీలించిన పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు, క్లూస్ టీమ్ అధికారులు అనేక ఆధారాలను సేకరించారు. డీఆర్డీఓ ఆస్పత్రికి ప్రేమ్ తరలింపు గాంధీఆస్పత్రి: సికింద్రాబాద్ న్యూబోయిగూడ అగ్నిప్రమాదంలో గాయపడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు ప్రేమ్‌ను కాంచన్‌బాగ్‌లోని డీఆర్డీఓ అపోలో ఆస్పత్రికి శుక్రవారం తరలించారు. బోయిగూడ ప్రమాదంలో 11 మంది సజీవ దహనం కాగా ప్రేమ్ ఒక్కడే ప్రాణాలతో బయటపడిన సంగతి విదితమే. 20 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్న ప్రేమ్‌ను గాంధీ పాస్టిక్సర్జరీ విభాగ హెచ్ఓడీ ప్రొఫెసర్ సుబోధ్ కుమార్ నేతృత్వంలో వైద్యసేవలు అందించారు. వేడి పొగ పీల్చడంతో ఊపరితిత్తుల లోపలి భాగాలు ఇన్ఫెక్షన్కు గురైనట్లు భావించిన వైద్యులు పలుమార్లు ఎక్స్‌రేలు తీశారు. మరింత మెరుగైన వైద్యం అందించాలని భావించి డీఆర్డీఓ అపోలో ఆస్పత్రికి తరలించారు. -
షార్ట్ సర్క్యూట్‌తో ఆర్టీసీ బస్సులో అగ్ని ప్రమాదం
-
న్యూఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి
న్యూఢిల్లీ: నైరుతి ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక ద్వారక ప్రాంతంలోని సెక్టార్-8లోని హోటల్ కృష్ణలో అగ్నిప్రమాదం జరిగింది. కాగా, ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్‌గా పోలీసులు గుర్తించారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. స్థానికుల ప్రకారం, ఈరోజు (ఆదివారం) ఉదయం 8 గంటల ప్రాంతంలో హోటల్ నుంచి మంటలు చెలరేగాయి. కాసేపటికే ఆ ప్రదేశమంతా దట్టంగా పొగలు వ్యాపించాయి. దీంతో స్థానికులు పోలీసులకు, ఫైరింజన్ వారికి సమాచారం అందించారు. కాగా, రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది 8 ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. కాగా, మృతి చెందిన వారిలో ఒకరిని దీపక్‌గా గుర్తించారు. గాయపడినవారిలో ఒక మహిళ ఉన్నట్లు గుర్తించారు. వీరిని మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని దీన్‌దయాళ్ ఆసుపత్రికి తరలించారు. ఈ భవనం.. జార్ఖండ్‌లోని రాంచీకి చెందిన సిద్దార్థ్, కరుణకు చెందినదిగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
దోమల చక్రం బస్తాలకు అంటుకోవడంతో సజీవ దహనం..
-
దోమల చక్రం బస్తాలకు అంటుకోవడంతో సజీవ దహనం..
గుంటూరు: లంకెవాని దిబ్బ రొయ్యల చెరువు వద్ద పనిచేస్తున్నఒడిశాకు చెందిన ఆరుగురు కూలీలు సజీవ దహనమైన ఘటనకు షార్ట్ సర్య్కూట్ కారణం కాదని నిర్దారణ అయ్యింది. వీరంతా రాత్రి పడుకునేటప్పుడు బ్లీచింగ్ పౌడర్ బస్తాలపై దోమల చక్రం పెట్టి నిద్ర పోవడంతో అది అంటుకోవడంతోనే సజీవ దహనం అయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాయిల్ ద్వారా బ్లీచింగ్ పౌడర్ బస్తాలకు మంటలు అంటుకునే వారు మృతిచెందినట్లు స్పష్టత వచ్చింది. తొలుత ఈ ఘటనకు విద్యుత్ షాక్ కారణమని భావించారు. కానీ ఆ తర్వాత అధికారులు దోమల చక్రంతో ప్రమాదం జరిగినట్లు తేలింది. కాగా, ప్రమాద స్థలానికి బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున చేరుకుని విలపిస్తున్నారు. అయితే, సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు.. మృతదేహాలను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. కాగా, ఈ దుర్ఘటనకు సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా విచారణ చేపడతామని ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. అదేవిధంగా మృతులు ఒడిశాలోని రాయ్‌గఢ్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. చెరువు యజమాని, సూపర్వైజర్లను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ విశాల్ గున్ని పేర్కొన్నారు. -
పహడీషరీఫ్ మామిడిపల్లిలొ అగ్నిప్రమాదం
సాక్షి, రంగారెడ్డి: జిల్లాలోని పహడీషరీఫ్ మామిడిపల్లిలో గురువారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తెలంగాణ ట్రాన్స్‌కో 400 కేవీ సబ్‌స్టేషన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాగా షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. -
కోఠి మెడికల్ కాలేజ్ వద్ద అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: కోఠి మెడికల్ కాలేజ్ బస్టాప్ వద్ద ఆదివారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. కాగా బస్టాప్‌కు ఆనుకొని ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌లో షార్ట్ సర్య్కూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు తేలింది. కాగా షార్ట్ సర్క్యూట్‌తో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటల ధాటికి బస్టాప్ పక్కనే ఉన్న ఫుట్‌వేర్ షాపుతో పాటు బట్టల దుకాణం దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. లాక్డౌన్ అమల్లో ఉండడంతో ఆస్తి నష్టం తప్ప ఎలాంటి ప్రాణం నష్టం జరగలేదు. -
అబిడ్స్‌లో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్: అబిడ్స్‌లోని ట్రూప్ బజార్లో శుక్రవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక డీకే సానిటరీ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. నిత్యం రద్దీగా ఉండే ట్రూప్ బజార్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని వాహనాలను దారి మల్లిస్తున్నారు. -
నిరంతర వర్షాలు.. భారీగా తగ్గిన విద్యుత్ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో విద్యుత్ డిమాండ్ భారీగా పడిపోయింది. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు విద్యుత్ అధికారులు, ఇంజనీర్స్‌ని అప్రమత్తం చేశారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతొ విద్యుత్ డిమాండ్ 12 వేల వాట్స్ నుంచి 4300 వాట్స్‌కి పడిపోయింది. దాంతో ఓల్జేట్ పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యుత్ డిమాండ్‌లో హెచ్చుతగ్గుల నేపథ్యంలో రాత్రి నుంచి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ.. లోడ్ డిస్పాచ్ చేయిస్తున్నారు. ఇక 1500 మెగావాట్స్ హైడల్ విద్యుత్ ఉత్పత్తి యధావిధిగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా సీఎండీ ప్రభాకర రావు మాట్లాడుతూ.. ‘విద్యుత్ డిమాండ్ తగ్గడంతో థర్మల్ యూనిట్స్ అన్ని బ్యాక్ డౌన్ చేశాము. వర్షం నీరు నిల్వ ఉన్న చోట విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు, తీగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా రోడ్లపై, భవనాలపై తీగలు తెగిపడి ఉంటే వెంటనే సంస్థకు తెలియజేయగలరు. ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడినా, నీరు వచ్చిన దయచేసి ప్రజలు 1912 / 100 స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్‌తో పాటు స్థానిక విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్ చేసి తెలపండి. ఎక్కడైనా వర్షం నీరు సెల్లార్లోకి వస్తే పవర్ సప్లై ఆఫ్ చేసుకోండి. అలా అయితే షాట్ సర్క్యూట్ కాకుండా ఉంటుంది’ అని తెలిపారు. -
కరీంనగర్లో భారీ అగ్ని ప్రమాదం
-
కరీంనగర్లో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, కరీంనగర్: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదాన్ని ఇంకా మరవక ముందే రాష్ట్రంలో మరో విద్యుత్ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు.. కరీంనగర్‌లోని ఎన్పీడీసీఎల్ కార్యాలయం సమీపంలోని ఎలక్ట్రిసిటీ స్టోర్‌లో శనివారం భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. పదుల సంఖ్యలో ఉన్న కొత్త ట్రాన్స్ఫార్మర్లు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదానికి కల కారణాలు స్పష్టంగా తెలియకపోయినప్పటికీ కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకొని ఉవ్వెత్తున ఎగిసిపడిన మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. (ట్విస్ట్ : శ్రీశైలం అగ్ని ప్రమాదంలో కొత్త కోణం) ప్రమాదం గురించి తెలిసిన వెంటనే మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ శశాంక, సిపి కమలాసన్ రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి ప్రమాదంపై ఆరా తీశారు. ఎలక్ట్రిసిటీ స్టోర్ రూమ్ ప్రక్కనే ఉన్న విద్యుత్ వైర్లు తగిలి షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించారు. -
అనంత ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
-
అనంత ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
సాక్షి, అనంతపురం : అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో అర్థరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. సకాలంలో అధికారులు స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. కోవిడ్ వార్డులో పక్కనే ఉన్న రికార్డు రూమ్‌లో అర్థరాత్రి సమయంలో షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఫర్నిచర్, రికార్డులు దగ్ధం అయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఐడీ వార్డులో ఉన్న 24మంది కోవిడ్ పేషెంట్లను మరో వార్డులోకి తరలించారు. జిల్లా కలెక్టర్ సత్య యేసుబాబు, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న అనంతపురం ప్రభుత్వాసుపత్రిని ఏపీ డిప్యూటీ సిఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని బుధవారం ఉదయం పరిశీలించారు. స్టేషనరీ గదిలో మంటలు ఎలా చెలరేగాయన్న దానిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్, డీఎం అండ్ హెచ్ఓల నుంచి ఆళ్లనాని వివరాలు సేకరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ పేషెంట్లకు ఏలోటూ లేకుండా చర్యలు తీసుకోవాలని ఆళ్ల నాని తెలిపారు. ఖైదీ ఆత్మహత్య అనంతపురం : జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్బర్ బాషా లుంగీతో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి వార్డెన్లు వెంకటకృష్ణ, నవీన్‌కుమార్‌పై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. -
షార్ట్ సర్క్యూట్: తప్పిన పెను ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం : విశాఖలోని ఓ క్వారెంటైన్ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మదురవాడ సమీపంలోని కొమ్మాది శ్రీ చైతన్య వాల్మీకి కేంద్రంలో సోమవారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భారీగా కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు దగ్దం అయ్యాయి. షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగి ఉండొచ్చని యాజమాన్యం భావిస్తోంది. తాజా ప్రమాదంతో కరోనా బాధితులను మరో బ్లాక్‌కు తరలిస్తున్నారు. అయితే సకాలంలో ఫైర్ సిబ్బంది, పోలీసులు స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం చేరవేశామని నిముషాల వ్యవధిలోనే సిబ్బంది వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చిందని స్థానికులు తెలిపారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది, రోగులు ఊపిరి పీల్చుకున్నారు. -
షార్ట్ సర్క్యూట్‌తో రూ. 6 లక్షలు బుగ్గిపాలు
సాక్షి, సేలం: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో రూ. 6 లక్షల నగదు బుగ్గిపాలైంది. ఈరోడ్ జిల్లా గోపిచెట్టి పాళ్యం, భారతి వీధికి చెందిన వ్యక్తి మొహ్మద్ ఇలియాస్. ఈయన సమీపంలోని మార్కెట్ ప్రాంతంలో కిరాణా దుకాణం నడుపుతున్నాడు. ఈయనకు 13 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఎప్పటిలానే మంగళవారం ఉదయం కుమారుడిని ఇంటిలో ఉంచి భార్య, భర్త ఇద్దరూ వ్యాపారానికి వెళ్లారు. ఆ సమయంలో ఇంటి నుంచి కేకలు వినిపిండంతో స్థానికులు తలుపు తెరచి చూడగా ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. మొహ్మద్ ఇలియాస్ కుమారుడిని రక్షించారు. సమాచారం అందుకున్న గోపిచెట్టి పాళ్యం అగ్ని మాపక సిబ్బంది గంట పాటు పోరాడి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో రూ. 6 లక్షల నగదు, నగలు మొత్తం రూ. 10 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు వాపోయాడు. పోలీసుల విచారణలో ఏసీ పేలిపోయి అగ్ని ప్రమాదం సంభవించినట్టు తెలిసింది. చదవండి: ఆయనే లేకుంటే రక్తం ఏరులై పారేది.. -
మరికొద్ది గంటల్లో బర్త్‌డే వేడుకలు.. అంతలోనే
గుహవాటి : మరికొద్ది గంటల్లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాల్సిన ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్న ఘటన గుహవాటిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుహావటికి చెందిన తుషార్ శివసాగర్‌లో జియాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. కాగా తన భార్య శిల్సి గోస్వామి, పిల్లలు ఇషాన్(7), ఇవాన్(4)లతో కలిసి బైస్తాపూర్‌లో ఒక డూప్లెక్స్‌లో నివసిస్తున్నారు. కాగా గురువారం ఇవాన్ గోస్వామి పుట్టిన రోజు కావడంతో అతని బర్త్‌డే పార్టీని ఘనంగా నిర్వహించాలనుకున్నారు. శిల్పి గోస్వామి, తుషార్ తల్లి ఇంటి గ్రౌండ్ ప్లోర్లో అందుకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమవగా, ఇవాన్,ఇషాన్‌లు ఇంటి మొదటి అంతస్తులో ఆడుకుంటున్నారు. ఇంతలో మొదటి అంతస్తు మంటల్లో చిక్కుకోవడంతో శిల్పి గోస్వామి పైకి వెళ్లి చూశారు. అప్పటికే ఇద్దరు మంటల్లో కాలిపోవడం చూసి ఆపేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆమెకు కూడా మంటలంటుకున్నాయి. కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఇళ్లు మొత్తం మంటల్లో చిక్కుకోవడంతో స్థానికులు ఫైర్ స్టేషన్‌కు సమాచారమందించారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పి వారందరిని గుహవాటి మెడికల్ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి ఇవాన్, ఇషాన్‌లు చనిపోయారని వెల్లడించారు. కాగా శిల్సి గోస్వామి, తుషార్ తల్లికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని తమ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదే విషయమై గుహవాటి పోలీస్ కమిషనర్ ఎంపి గుప్తా మాట్లాడుతూ.. ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అవడంతో మొదటి అంతస్తు మంటల్లో చిక్కుకుందని తెలిపారు. కాగా తమ ప్రాథమిక విచారణలో షార్ట్ సర్క్యూట్‌తో గ్యాస్ సిలిండర్‌కు మంటలు అంటుకోవడంతో ఇళ్లు మొత్తం అంటుకుందని పేర్కొన్నారు. కాగా తుషార్‌కు ప్రమాదంపై సమాచారం ఇచ్చామని, అతను బయలుదేరినట్లు గుప్తా వెల్లడించారు. ఈ ఘటనపై అస్సాం సీఎం శరబనంద సోనోవాల్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. వెంటనే విచారణను వేగవంతం చేయాలని పోలీసులను ఆదేశించారు. -
కాలి బూడిదైన సెల్ టవర్
సాక్షి, నిజామాబాద్ : ఓ భవనంపై ఏర్పాటు చేసిన సెల్ టవర్‌లో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి దగ్ధమైన సంఘటన నిజామాబాద్‌లో శనివారం చోటుచేసుకుంది. గాజులుపేటకు చెందిన నరసింహారావు నివాసంపై సెల్ టవర్ ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం నుంచి కరెంట్ లేకపోవడంతో సిబ్బంది జనరేటర్ వేశారు. అయితే షార్ట్ సర్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సెల్‌టవర్ కోసం ఏర్పాటు చేసిన గదిలోని సామాగ్రి అగ్నికి ఆహుతి అయ్యింది. దీంతో చుట్టుపక్కల దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఒక్కసారిగా సెల్ టవర్ అంటుకోవడంతో ఇంటి యజమానితో పాటు, ఆ భవనంలో అద్దెకు ఉంటున్నవారు భయంతో పరుగులు తీశారు. మరోవైపు సెల్ టవర్ అంటుకోవడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన సెల్ టవర్‌ను తొలగించాలంటూ స్థానికులు గతంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. -
ఊరంతా షార్ట్ సర్క్యూట్
రాయపోలు(దుబ్బాక): ప్రశాంతంగా ఉన్న ఆ పల్లెలో ప్రజలకు విద్యుత్ ప్రమాదం కంటిమీద కునుకులేకుండా చేసింది. ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎర్తింగ్ లోపంతో ప్రమాదం సంభవించింది. దీని వల్ల విద్యుత్ షాక్‌తో ఓ మహిళ మృతిచెందగా, ఒక పూరిగుడిసె దగ్ధమైంది. సిద్దిపేట జిల్లా రాయపోలు మండలం ఎల్కల్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో గ్రామానికి చెందిన తాటికొండ కళవ్వ (53) సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్‌కు గురైంది. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ఆస్పత్రిలో మృతి చెందింది. ఇదిలా ఉండగా కళవ్వను తీసుకుని ఆసుపత్రికి వెళ్లిన ఆమె భర్త తాటికొండ నర్సింహులు తన కొడుకు నవీన్‌తో కలసి తిరిగి అర్ధరాత్రి సమయంలో ఇంటికి వచ్చాడు. అప్పటికే అతని కోడలు మహేశ్వరి గుడిసెలో నిద్రిస్తోంది. ఆ సమయంలో గుడిసెలో నుంచి పొగలు రావడం గమనించిన వారు వెంటనే మహేశ్వరిని బయటకు తీసుకొచ్చారు. అంతలోనే గుడిసెకు మంటలు అంటుకోవడంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే మంటలు చల్లార్చారు. అప్పటికే గుడిసె పైకప్పు కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఇంట్లోని టీవీ, ఇతర వస్తువులు కాలిపోయాయి. వీటితో పాటు నగదు కూడా కాలిపోయినట్లు బాధితులు తెలిపారు. గుడిసెలోని విద్యుత్ స్విచ్‌బోర్డు నుంచి స్పార్క్స్ వచ్చి నిప్పంటుకున్నట్టు చెబుతున్నారు. -
విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి
సాక్షి, చిత్తూరు: పొలానికి వెళ్లిన ఇద్దరు కూలీలు విద్యుదాఘాతంతో మృతి చెందారు. ఈ విషాద ఘటన జిల్లాలోని శ్రీకాళహస్తి మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని ఎల్లంపల్లి ఎస్టీ కాలనీకి చెందిన ఇద్దరు రైతు కూలీలు కృష్ణయ్య, చెంచమ్మ పొలం పనులు చేయడానికి సోమవారం వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. అయితే ఆ పొలానికి ఉన్న విద్యుత్ కంచె తగలడంతో విద్యుదాఘాతానికి గురైన కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఆ సమయంలో బాలుడు గౌతమ్ కూడా అక్కడే ఉండటంతో అతను కూడా మరణించాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. -
ఆక్సిజన్ యూనిట్లో షార్ట్ సర్క్యూట్.. పసికందు మృత్యువాత
హిందూపురం: ఆక్సిజన్ యూనిట్లో షార్ట్ సర్క్యూట్ సంభవించటంతో పుట్టిన కొన్ని గంటల్లోనే పసికందు మృత్యువాత పడిన దుర్ఘటన అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యమే దీనికి కారణమంటూ బంధువులు వైద్యులతో వాగ్వాదానికి దిగారు. వివరాలివీ.. హిందూపురం పట్టణ సమీపంలోని కొట్నూరుకు చెందిన సుహేల్ భార్య మదీన బేగంకు పురిటినొప్పులు రాగా, శనివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి సాధారణ ప్రసవం అవుతుందన్నారు. తర్వాత కొద్దిసేపటికి అత్యవసరంగా సిజేరియన్ చేయాల్సి వస్తుందని చెప్పి ఆపరేషన్ చేశారు. మగబిడ్డ పుట్టాడు. కొంత సమయం తర్వాత బిడ్డ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడంటూ కృత్రిమంగా ఆక్సిజన్ ఇవ్వాలని చిన్నపిల్లల వార్డుకు తరలించారు. ఆక్సిజన్ ఇస్తున్న సమయంలో సంబంధిత యూనిట్లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో రాత్రి 9 గంటల ప్రాంతంలో పసిబిడ్డ మృతి చెందింది. బిడ్డ చనిపోవడంతో బాధితులు వైద్యులతో వాగ్వాదానికి దిగారు. దీనిపై సూపరింటెండెంట్ కేశవులు మాట్లాడుతూ వైద్యుల నిర్లక్ష్యం ఏమీ లేదని, బిడ్డ ఆరోగ్య పరిస్థితి సరిగా లేని కారణంతోనే మృతి చెందినట్లు చెప్పారు. -
సీపీఐ ‘ఛలో డీజీపీ ఆఫీస్’.. ఇంతలో షార్ట్ సర్య్కూట్
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నిరాహార దీక్ష చేస్తున్న సీపీఐ నేత కూనంనేని సాంబశివరావును అక్రమంగా అరెస్టు చేయడం పట్ల ఆ పార్టీ నిరసన వ్యక్తం చేసింది. ఇందుకు నిరసనగా మంగళవారం డీజీపీ కార్యాలయ ముట్టడికి కార్యకర్తలకు పిలుపునిచ్చింది. ఛలో డీజీపీ కార్యాలయం పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం నేపథ్యంలో డీజీపీ ఆఫీసు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా, డీజీపీ ఛాంబర్ సమీపంలో మంగళవారం షార్ట్‌సర్య్కూట్ ప్రమాదం జరిగింది. దీంతో ఆఫీసుకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పునరుద్ధరణకు కార్యాలయ సిబ్బంది తగిన చర్యలు తీసుకుంటున్నారు. -
కుప్పం రెస్కో కార్యాలయంలో అగ్ని ప్రమాదం
సాక్షి, చిత్తూరు : చిత్తూరు జిల్లా కుప్పం రెస్కో కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గోడౌన్లో నిల్వ ఉంచిన పాత మీటర్ల వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. కాగా షాట్ సర్య్కూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. -
షైన్ ఆసుపత్రి సిబ్బంది రిమాండ్‌కు తరలింపు
సాక్షి, హైదరాబాద్ : ఎల్బీనగర్లోని షైన్ హాస్పిటల్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం ఘటనలో ఎండీ సునీల్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఆయనతో పాటు సిబ్బందిని కోర్టులో హాజరు పరిచి అక్కడి నుంచి రిమాండ్‌కు తరలించారు. విచారణలో భాగంగా పోలీసులు పలు కీలక అంశాలు వెల్లడించారు. ప్రమాదం జరిగిన నాల్గవ అంతస్తుకు అనుమతి లేదని, అగ్ని మాపక శాఖ నుంచి ఎన్వోసీ సర్టిఫికెట్‌ను కూడా తీసుకోలేదని తెలిపారు. ఆసుపత్రి యాజమాన్యం, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా పరిశీలించినట్లు పోలీసులు వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్ జరిగి ఫ్రిజ్ వద్ద పేలుడు జరిగి ఆ మంటలు మొత్తం నాలుగో అంతస్తుకు వ్యాపించినట్లు సీసీ టీవి ఫుటేజీల్లో రికార్డైంది. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న హెడ్ నర్స్ బయటకు వెళ్లడం, సిబ్బంది ఎవరు లేకపోవడంతో చిన్నారులు మంటల్లో చిక్కుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఎండీ సునీల్‌తో పాటు మరో నలుగురి సిబ్బందిపై కేసును నమోదు చేశారు. -
షార్ట్ సర్క్యూట్‌తో పేలిన టీవీ
ప్రొద్దుటూరు క్రైం : విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా టీవీ పేలిన సంఘటనలో ఎనిమిది మందికి గాయాలు అయ్యాయి. ఇంట్లో నుంచి దట్టమైన పొగలు రావడంతో వీధిలోని ప్రజలు సాయం చేసేందుకు గుమిగూడారు. అదే సమయంలో పెద్ద శబ్ధంతో టీవీ పేలడంతో శకలాలు బయటికి దూసుకొని వచ్చి మీద పడ్డాయి. నిప్పు కనికల్లా ఉన్న శకలాలు మీద పడటంతో శరీరం కాలి ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ సంఘటన ప్రొద్దుటూరులోని వసంతపేటలో గురువారం జరి గింది. వీఆర్ఏ జయరాజ్ వసంతపేటలో నివాసం ఉంటున్నారు. ఆయన భార్య మరియమ్మ రెండు రోజుల క్రితం అనంతపురం వెళ్లి గురువారం మధ్యాహ్నం ఇంటికి వచ్చారు. జయరాజ్ విధులకు వెళ్లడంతో ఆమె ఒక్కరే ఇంట్లో ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత విద్యుత్ వైర్లలో నుంచి పొగలు వ్యాపించడంతో ఇళ్లంతా పొగ కమ్ముకుంది. పొగ నిండుకొని ఊపిరాడకపోవడంతో ఆమె సొమ్మ సిల్లి పడిపోయింది. ఇంటి నుంచి పొగ రావడంతో వీధిలోని యువకులు ఇంట్లోకి వెళ్లిఆమెను బయటికి ఎత్తుకొని రాగా, ఇంకొందరు గ్యాస్ సిలిండర్‌ను తీసుకొని వచ్చారు. అప్పటికే పొగ ఎక్కువ కావడంతో లోపలికి వెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. పెద్ద శబ్ధంతో పేలిన టీవీ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగిందని తెలుసుకున్న స్థానికులు ద్ద ఎత్తున జయరాజ్ ఇంటి వద్దకు వచ్చారు. మహిళలు, చిన్న పిల్లలతో ఇంటి పరిసరాలు నిండిపోయాయి. కొద్ది సేపటి తర్వాత టీవీ పెద్ద శబ్ధంతో పేలిపోయింది. పేలిన టీవీ భాగాలు బయటికి వచ్చి పడటంతో స్మైలీ (7), షాహిరా (6), ముబారక్ (10) అనే చిన్నారులతో పాటు పవన్‌కుమార్, రాధిక, మహబూబ్‌చాన్, గాంధీ, సందీప్‌లు గాయపడ్డారు. గాయడిన వారిని జిల్లా ప్రభుత్వాసుపత్రికి, పట్టణంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. పవన్‌కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతనికి జిల్లా ఆస్పత్రిలోని బర్నింగ్ వార్డులో చికిత్సను అందిస్తున్నారు. ఊటుకూరు వీరయ్య బాలుర పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పవన్‌కుమార్ భోజనానికి ఇంటికి వస్తున్న సమమంలో ఈ ప్రమాదం జరిగింది. పాఠశాల నుంచి ఇంటికి వెళ్తుండగా..తల్లీ ఇద్దరు కుమార్తెలకు గాయాలు వసంతపేటలో నివస్తున్న మహబూబ్‌చాన్ కుమార్తెలు ముబారక్, షాహిరాలు సమీపంలోని మున్సిపల్ పాఠశాలలో 1, 5వ తరగతి చదువుతున్నారు. భోజన విరామ సమయంలో ఆమె కుమార్తెలను ఇద్దరిని ఇంటికి పిలుచుకొని వస్తూ దారిలో అగ్నిప్రమాదం జరిగిన జయరాజ్ ఇంటి వద్ద ఆగారు. అదే సమయంలో టీవీ పేలిన సంఘటనలో ఆమెతో పాటు పిల్లలిద్దరికి గాయాలు అయ్యాయి. తల్లీ, కుమార్తెలు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జయరాజ్ ఉన్న ఇంటిపై రాధిక కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇంట్లో నుంచి పొగ రావడంతో మొదటి అంతస్తులో ఉన్న రాధిక, కుమార్తె స్మైలీని తీసుకొని కిందికి వెళ్లారు. ఆమె కిందికి వెళ్లిన కొన్ని క్షణాల్లోనే ఈ సంఘటన జరిగింది. తల్లీ కూతుళ్లకు గాయాలు కావడంతో హోమస్‌పేటలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్సను అందిస్తున్నారు. శరీరం కాలడంతో చిన్నారి స్మైలీ విలపించసాగింది. బుగ్గిపాలైన సామగ్రి: అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఇంట్లోసామగ్రి పూర్తిగా కాలిపోయింది. టీవీతో పాటు ఫ్రిజ్, స్టీల్ సామగ్రి, బట్టలు, బీరువాలో ఉన్న రూ. 30 వేలు నగదు కాలి బూడిదయ్యాయి. ఏ ఒక్క వస్తువు మిగల్లేదు. కుటుంబ సభ్యులంతా కట్టుబట్టలతో మిగిలారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ ఈశ్వరరెడ్డి తెలిపారు. -
షైన్ ఆస్పత్రి ఘటనపై విచారణ వేగవంతం
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్లోని షైన్ చిల్డ్రన్ ఆస్పత్రిలో సోమవారం చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో.. మంటల్లో చిక్కుకుని గాయపడ్డ ఇద్దరు చిన్నారుల పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్ రవిందర్ నాయక్, ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్ తనిఖీలు చేపట్టి.. ఆస్పత్రి సెల్లార్‌తో సహా నాలుగు అంతస్థులని క్షుణ్ణంగా పరిశీలించారు. షైన్ హాస్పిటల్లో జరిగిన ప్రమాదంపై విచారణను వేగవంతం చేసేందుకు ఇప్పటికే క్లూస్ టీంను రంగంలోకి దించారు. ఎన్ఫోర్స్మెంట్ టీం అధికారులు ఇప్పటికే హాస్పిటల్‌కు నోటీసులు జారీ చేశారు. షైన్ చిల్డ్రన్ ఆస్పత్రిని నిర్వహిస్తున్న డాక్టర్ సునీల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రి ప్రమాదంపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీ.. ప్రభుత్వ నిబంధనలకు ప్రకారం సరైన మౌలిక సదుపాయాలు ఉన్నాయా అనే అంశాలను నివేదిక రూపంలో పొందుపర్చనుంది. అనంతరం ప్రభుత్వానికి తన రిపోర్ట్‌ను ఇవ్వనుంది. ఘటనతో అప్రమత్తమైన అధికారులు.. జంటనగరాల్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రమాద ఘటన తరువాత గతేడాదితో ఆస్పత్రి పర్మిషన్ ముగిసిందని, ఆస్పత్రిలో ప్రమాదం జరిగినపుడు తక్షణమే పాటించాల్సిన నియంత్రణ వ్యవస్థే లేదని మానవ హక్కుల కమిషన్‌కు బాలల హక్కుల సంఘం ఫిర్యాదు చేసింది. భవనం అక్రమ కట్టడమని, అధికారుల నిర్లక్షం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పిటిషన్ దాఖలు చేశారు. ఒక చిన్నారి మృతికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకొని బాధితులకు వెంటనే న్యాయం చెయ్యాలనివారు కోరారు. -
షైన్ చిల్డ్రన్స్ ఆస్పత్రిపై కేసు నమోదు
-
షైన్ చిల్డ్రన్స్ ఆస్పత్రి సీజ్
సాక్షి, హైదరాబాద్ : అగ్నిప్రమాదం నేపథ్యంలో ఎల్బీనగర్లోని షైన్ చిల్డ్రన్స్ ఆస్పత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం తెల్లవారుజామున నాలుగో అంతస్తులోని ఐసీయూలో అగ్నిప్రమాదంతో ఓ చిన్నారి మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ చిన్నారుల్లో ముగ్గురిని ఉప్పల్ శ్రద్ధ ఆస్పత్రికి తరలించినా, మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి కూడా తరలించాల్సి వచ్చింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆస్పత్రిలో మొత్తం 42మంది చిన్నారులు ఉన్నారు. అయితే ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బాధితుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరోవైపు చనిపోయిన చిన్నారి తల్లిదండ్రులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. ఫైర్ సేఫ్టీ లైసెన్స్ రెన్యూవల్ చేయకుండానే డాక్టర్ సునీల్ కుమార్ ఆస్పత్రిని నడుపుతున్నట్లు గుర్తించారు. దీంతో 304A సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు, ఆస్పత్రిని సీజ్ చేశారు. మరోవైపు వైద్యుడు సునీల్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అలాగే ఆస్పత్రి యాజమాన్యం వైఖరికి నిరసనగా, బాధితులను ఆదుకోవాలంటూ బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. ఇవాళ తెల్లవారుజామున సంఘటన జరిగినా ప్రభుత్వం ఇప్పటి వరకూ స్పందించకపోవడం దారుణమన్నారు. షైన్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు, ఏబీవీపీ కార్యకర్తలు ఎల్బీ నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి: హైదరాబాద్‌లోని షైన్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం -
షైన్ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం
హైదరాబాద్: నగరంలోని ఎల్బీ నగర్ షైన్ ఆసుపత్రిలో సోమవారం ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఐసీయులో షాట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సూర్యాపేటకు చెందిన ఐదు నెలల చిన్నారి మరణించిగా, ఆరుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రిలో మొత్తం 42మంది చిన్నారులు ఉన్నారు. కాగా, మెరుగైన చికిత్స కోసం వీరిని వివిధ ఆస్పత్రులకు తరలించారు. అనంతరం మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. ఆసుపత్రి నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల తల్లిదండ్రుల నిరసన తెలిపారు. -
తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, తిరుపతి: చిన్న బజారు వీధిలోని లలితా మెడికల్ స్టోర్‌లో మంగళవారం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో కొన్ని క్షణాల్లోనే.. లలితా మెడికల్ స్టోర్‌తో పాటు పక్కనే ఉన్న కూల్‌డ్రింక్ షాపు పూర్తిగా కాలి బూడిదగా మారాయి. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి, బతుకుజీవుడా అంటూ బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా షార్టుసర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ఫైర్ ఆఫీసర్ కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం జరిగిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ అగ్నిప్రమాదంలో 15 లక్షలమేర ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఢిల్లీ ఎయిమ్స్‌లో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, న్యూడిల్లీ : ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలోని మొదటి అంతస్తులోని ఎమర్జెన్సీ వార్డు సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 34 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పే ప్రయత్రం చేస్తున్నారు. కాగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఆస్పత్రిలో మంటలు వ్యాపించినట్లు సమాచారం. భారీస్థాయిలో మంటలు చెలరేగడంతో మొదటి అంతస్తులో చికిత్స పొందుతున్న రోగులను మరో చోటుకు తరలించారు. అయితే ఇప్పటివరకు మంటల్లో ఎవరైనా చిక్కుకున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే ఇదే ఆస్పత్రిలో బీజేపీ సీనియర్‌నేత అరుణ్ జైట్లీ చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ ప్రమాదంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారని, సహాయక చర్యలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
వైన్‌షాప్‌లో పగిలిన బీరు బాటిళ్లు
సాక్షి, సిద్దిపేట అర్బన్ : వైన్స్ షాప్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగి సీసీ కెమెరాలు, ఫ్రిజ్ దగ్ధమైంది. ఈ ఘటన శనివారం సిద్దిపేట అర్బన్ మండల పరిధిలోని ఎన్సాన్పల్లి గ్రామంలో జరిగింది. సిద్దిపేట రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్సాన్పల్లి గ్రామంలో ఉన్న లక్ష్మీనరసింహ వైన్స్ నిర్వహకుడు కొండం బాలకిషన్ గౌడ్ శుక్రవారం రాత్రి షాప్‌ను బంద్ చేసి ఇంటికి వెళ్లిపోయాడు. శనివారం ఉదయం షాప్ నుంచి పొగలు వస్తున్నాయని స్థానికులు షాప్ నిర్వహకుడికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకొని షాప్ తెరిచి చూడగా సీసీ కెమెరాల మానిటర్, ఫ్రిజ్, అందులోని మద్యం బాటిళ్లు దగ్ధమయ్యాయని గుర్తించాడు. వెంటనే ఫైర్ స్టేషన్ సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై షాప్ నిర్వహకుడు బాలకిషన్‌గౌడ్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కోటేశ్వర్రావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
26 రైళ్లను ఆపేసిన బుల్లి కీటకం!
క్రమశిక్షణకు మారుపేరైన జపాన్‌లో రైల్వే వ్యవస్థనే ఒక బుల్లి కీటకం అస్తవ్యస్తం చేసేసింది. ఏకంగా 12 వేల మంది ప్రయాణికుల్ని ఇక్కట్లు పాల్జేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే దక్షిణ జపాన్‌లో జేఆర్ క్యాషూ కంపెనీ నడిపే రైల్వే లైన్లలో కొన్నింటికి హఠాత్తుగా మే 30న విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో 26 రైళ్లు రద్దయ్యాయి. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఏకంగా 12 వేల మంది ప్రయాణికులపై ప్రభావం చూపించడంతో కంపెనీ సాంకేతిక బృందం హుటాహుటిన రంగంలోకి దిగింది. రైల్వే వ్యవస్థకు విద్యుత్ సరఫరా చేసే ఒక పరికరం పనిచెయ్యకపోవడంతో ఈ ఘోరం జరిగిందని వారికి అర్థమైంది. ఇంతకీ ఎందుకు పని చెయ్యడం లేదని ఆ పరికరాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఒక చిన్న పురుగు కారణమని తేలింది. ఎలా వెళ్లిందో ఏమో మరి గొంగళి పురుగు మాదిరిగా ఉండే అతి చిన్న కీటకం ఆ విద్యుత్ సరఫరా చేసే పరికరంలోకి దూరింది.. దీంతో ఆ పురుగు షాక్ కొట్టి చనిపోవడమే కాదు, షార్ట్ సర్క్యూట్‌కు దారి తీసింది. దీంతో విద్యుత్ సరఫరా ఆగిపోయి రైళ్లు రద్దవడంతో గందరగోళం నెలకొంది. మన దేశంలో రైలు ప్రయాణం అంటే జీవిత కాలం లేటు కానీ, జపాన్‌లో రవాణా వ్యవస్థ ఎంత క్రమ శిక్షణతో ఉంటుందంటే అక్కడ రైలు వచ్చిన టైమింగ్‌తో మన గడియారాలను సరిచేసుకోవచ్చునన్నమాట. అందుకే అంత కలకలం రేగింది. జపాన్‌లో ఇలాంటి తరహా ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని జేఆర్ క్యాషూ కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. -
చదువుకొమ్మని ఇంట్లో ఉంచి తాళం వేశారు
ముంబై : కూతురు బుద్ధిగా ఇంట్లోనే కూర్చుని బాగా చదువుకోవాలని భావించిన తల్లిదండ్రులు బయట నుంచి తలుపు గడియపెట్టి తాళం వేసి వెళ్లారు. పాపం అప్పుడు వారికి తెలియదు.. తాము చేసిన పని వల్ల తమ కూతురు అగ్నికి ఆహుతి అవుతుందని. ఈ విషాదకర సంఘటన ముంబైలో చోటు చేసుకుంది. వివరాలు.. శ్రావణి చవాన్(16) అనే బాలిక తన తల్లిదండ్రులతో కలిసి.. ముంబై దాదర్‌లోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటుంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం అనగా ఆదివారం శ్రావణి తల్లిదండ్రులు ఓ పెళ్లికి వెళ్లారు. చదువుకుంటుందనే ఉద్దేశంతో శ్రావణిని ఇంట్లోనే ఉంచి బయట నుంచి గడియ పెట్టి తాళం వేసి వెళ్లారు. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో శ్రావణి నివాసం ఉంటున్న అపార్ట్మెంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మూడవ అంతస్తులో చెలరేగిన మంటలు.. శ్రావణి ఇల్లు ఉన్న ఐదో అంతస్తు వరకూ వ్యాపించాయి. శ్రావణిని ఇంట్లో పెట్టి తాళం వేయడంతో పాపం తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. దాంతో మంటల్లో కాలిపోయింది. ప్రమాదం గురించి తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది.. సంఘటన స్థలానికి చేరుకుని.. మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో తీవ్రగాయలైన శ్రావణిని.. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మరణించింది. పోలిసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సిద్దిపేటలో భారీ అగ్నిప్రమాదం
సిద్దిపేట జోన్: సిద్దిపేట పట్టణంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు 3 గంటల పాటు మంటలు ఎగిసిపడ్డాయి. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో సుమారు రూ.40 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. బాధితులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు హామీ ఇచ్చారు. స్థానికులు, బాధితుల కథనం ప్రకారం.. సిద్దిపేట పట్టణం మెదక్ రోడ్డులో వెదురుబొంగులు, శుభకార్యాలకు అలంకరణ సామ గ్రి సరఫరాచేసే దుకాణాలు ఉన్నాయి. ఇందులో పాతకోటి రమేశ్, మహేశ్ అనే సోదరుల దుకాణం లో మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. దుకాణం చుట్టుపక్కల కూడా వెదురుబొంగులు ఉండటంతో మంట లు వ్యాప్తి చెంది పక్కనే ఉన్న ఇతర దుకాణాలకు కూడా అంటుకున్నాయి. దీంతో పెద్ద ఎత్తున అగ్ని కీలలు ఎగిసి పడ్డాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎగిసిపడిన మంటలతో మెదక్ రోడ్డు ను దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సిద్దిపేట అదనపు డీసీపీ నర్సింహారెడ్డి, ఏసీపీ రామేశ్వర్లు 3గంటలపాటు సంఘటన స్థలం వద్ద ఉండి పరిస్థితిని పర్యవేక్షించారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు వెంటనే స్పందించి పట్టణంలోని నాయకులను, అధికారుల ను అప్రమత్తం చేశారు. మంటలు వ్యాపించిన వెంటనే అందరూ రోడ్డు మీదకు పరుగులు తీయడం తో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. -
కళాశాల బస్సుకు షార్ట్ సర్క్యూట్
తూర్పుగోదావరి, మారేడుమిల్లి: ఓ కళాశాల బస్సు ఇంజిన్‌లో షార్టుసర్యూట్ కారణంగా మంటలు చెలరేగి, బస్సులో పొగలు వ్యాపించాయి. డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. రాజానగర మండలం తూర్పు గోనగూడెం ఐఎస్టీఎస్ మహిళా ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు శుక్రవారం కళాశాల బస్సులో రాజానగరం నుంచి విశాఖ జిల్లా సీలేర్కు టూర్‌కు వెళుతుండగా మారేడుమిల్లి వచ్చే సరికి బస్సు ఇంజిన్‌లో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగి బస్సులో పొగలు వ్యాపించాయి. స్థానిక వినాయక గుడి వద్దకు వచ్చే సరికి బస్సు అంతా పొగ వ్యాపించడంతో డ్రైవర్ తక్షణమే బస్సును నిలిపివేశాడు. భయందోళనకు గురైన విద్యార్థులు వెంటనే బస్సులో నుంచి బయటకు పరుగులు తీశారు. బస్సులో సుమారు 55 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. పొంగ కారణంగా ఇంజినీరింగ్ ఫస్టియర్ చెందిన సింధూ అనే విద్యార్థి స్పృహ కోల్పోయింది. సమీపంలో పోలీస్ స్టేషన్ ఉండడంతో ప్రమాదాన్ని గుర్తించిన గుర్తేడు ఎస్సై నాగేశ్వరరావు సీఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి బస్సులో మంటలు అదుపుజేశారు. స్పృహ కోల్పోయిన విద్యార్థికి ప్రథమ చికిత్స అందించడంతో కోలుకుంది. -
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ఎల్బీస్టేడియం సమీపంలో భారీ అగ్రిప్రమాదం జరిగింది. ఎల్బీ స్టేడియం ఎదురుగా ఉన్నఖాన్లతీఫ్ఖాన్(కేఎల్కే) బిల్డింగ్‌లోని ఐదో అంతస్తులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు భవనంలోని సిబ్బందిని బిల్డింగ్ నుంచి బయటకు పంపేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. ఐదో అంతస్తులో ఉన్న ఐడియా కార్యాలయంలోని ఏసీలో షార్ట్ సర్య్కూట్ సంభవించడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు ఫైర్ అధికారులు అంచనా వేస్తున్నారు. సర్వర్ రూమ్ గుండా మంటలు వ్యాపించడంతో ప్రమాద స్థాయి మరింత పెరిగిందని అధికారులు చెబుతున్నారు. మంటల్లో చిక్కుకున్న ఏడుగురిని అగ్ని మాపక సిబ్బంది రక్షించింది. భవనంలో ఉన్నవారంతా సురక్షితంగా బయటకు వచ్చేసినట్లు సమాచారం. ఐదు ఫైరింజన్లు, క్రేన్ ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
గొరుసువానిపాలెంలో భారీ అగ్నిప్రమాదం
విశాఖపట్నం, పరవాడ (పెందుర్తి): వాడచీపురుపల్లి శివారు గొరుసువానిపాలెం గ్రామ సమీపంలో గల వేస్టు క్లాత్ గొడౌన్లో మంగళవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో లక్షలాది రూపాయల విలువైన వేస్టు క్లాత్ నిల్వలు కాలి బూడిదయ్యాయి. సంక్రాంతి రోజు కావడంతో కార్మికులు గొడౌన్లో పనిచేయడానికి రాకపోవడంతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. మంగళవారం సాయంత్రం ఉన్నట్టుండీ ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగసిపడిన అగ్నికీలలు పండగ సంబరాల్లో మునిగి ఉన్న గ్రామీణ ప్రజలను భయాందోళనలకు గురిచేశాయి. అగ్ని ప్రమాదంతో ఎగిసిపడిన మంటల వల్ల ఆ ప్రదేశమంతా దట్టమైన పొగలు కమ్ముకొన్నాయి. అగ్నిప్రమాదంపై స్థానికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. కోల్‌కతా ప్రాంతానికి చెందిన అమర్, ప్రశాంత్ అనే వ్యక్తులు మూడేళ్ల క్రితం గొరుసువానిపాలెం గ్రామ సమీపంలోని ఓ లే అవుట్లో కొంత స్థలాన్ని అద్దెకు తీసుకొని వేస్టు క్లాత్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఎస్ఈజెడ్లోని బ్రాండెక్స్ పరిశ్రమ నుంచి వేస్టు క్లాత్‌ను టన్నుల లెక్కన కొనుగోలు చేసి ఇక్కడి గొడౌన్లో కూలీలతో క్లాత్‌ల రంగులను బట్టి వేరు చేయించి చెన్నై, హైదరాబాద్, తిరువూర్ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేసి విక్రయిస్తుంటారు. బూడిద చేసిన షార్ట్ సర్క్యూట్ గత మూడు నెలల నుంచి వేరు చేసిన వేస్టు క్లాత్ నిల్వలను త్వరలో ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉంచగా అగ్నికి ఆహుతయ్యాయి. మంగళవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో గొడౌన్ మీదుగా ఏర్పాటు చేసిన 11 కేవీ విద్యుత్ లైన్లో సంభవించిన షార్ట్ సర్క్యూట్ వల్ల నిప్పు రవ్వలు వేస్టు క్లాత్ నిల్వలపై పడడంతో ఒక్క సారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. మంటలకు గాలి తోడు కావడంతో మరింత ఎగసిపడి షెడ్లలోని టన్నులకొద్దీ వేస్టు క్లాత్ నిల్వ బస్తాలన్నీ కాలిబూడిదయ్యాయి. రేకుల షెడ్లు కూడా కాలిపోయాయి. రైతులకు చెందిన సరుగుడు, యూకలిప్టస్ తోటలకు మంటలు వ్యాపించడంతో నష్టం జరిగింది. సంక్రాంతి పండుగ కావడంతో కార్మికులకు సెలవు ప్రకటించడం వల్ల వారు విధులకు రాకపోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాద సమాచారాన్ని తెలుసుకొన్న ఎన్టీపీసీ, ఫార్మాసిటీ, అనకాపల్లి అగ్నిమాపక కేంద్రాల సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అర్ధరాత్రి 3 గంటల వరకు సింహాద్రి ఎన్టీపీసీ అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను పూర్తిస్థాయిలో అదుపు చేశారు. అగ్ని ప్రమాదం వల్ల తెగిపడిన విద్యుత్ వైర్ల కారణంగా పరిసర గ్రామాల ప్రజలకు తెల్లవారుజాము 3 గంటల వరకు విద్యుత్ సరఫరా లేక అంధకారంలో గడపవలసి వచ్చింది. గొడౌన్లో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల తమ ఉపాదికి గండిపడిందని గొరుసువానిపాలెం, పందివానిపాలెం, పోలిరెడ్డిపాలెం, వాడచీపురుపల్లి, పరవాడ, ఊటగెడ్డపాలెం గ్రామాలకు చెందిన మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అనధికారికంగా నిర్వహిస్తున్న ఈ గొడౌన్‌కు అగ్నిమాపక శాఖ, పంచాయతీ నుంచి అనుమతులు తీసుకోలేదని తెలిసింది. పరవాడ పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
షార్ట్ సర్క్యూట్‌తో నలుగురు మృతి
శ్రీకాళహస్తి: గ్యాస్ గీజర్ లీకేజికి విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ తోడవడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనమయ్యారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం రాజులకండ్రిగ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఈ విషాదంచోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి (34) ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య బుజ్జమ్మ అలియాస్ భాగ్యలక్ష్మి (28) ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో సెక్యూరిటీగా పని చేస్తోంది. వారికి భవ్య (6), నిఖిల్‌కుమార్‌రెడ్డి (4) సంతానం. వారు శనివారం రాత్రి రాజులకండ్రిగ లోని స్వగృహంలో నిద్రిస్తుండగా గ్యాస్ గీజర్ పైపు లీకైంది. దానికితోడు విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో నలుగురూ సజీవ దహనమయ్యారు. తెల్లవారుజామున 3.20 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీనివాసులురెడ్డి ఇంటికి సమీపంలోనే గృహప్రవేశం నిమిత్తం పలువురు గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. ఇంట్లో నుంచి మంటలు వస్తుండడాన్ని గుర్తించి వెంటనే వారు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారమిచ్చారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మరోవైపు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారికి సహకరించారు. అయితే అప్పటికే శ్రీనివాసులురెడ్డి కుటుంబానికి చెందిన నలుగురూ మృతి చెందారు. వెంటనే పోలీసులు వారి బంధువులకు సమాచారమిచ్చారు. తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో శ్రీకాళహస్తి ప్రభుత్వాస్పత్రి వైద్యులను రాజులకండ్రిగ గ్రామానికి పిలిపించి అక్కడే పోస్ట్‌మార్టం, పంచనామా కార్యక్రమాలు పూర్తి చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్పీ పి.అనిల్‌బాబు తెలిపారు. ఘటనపై పలు అనుమానాలు.. అయితే ఘటనపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదం గ్యాస్ గీజర్ లీకై ఏర్పడిందా.. లేదా కావాలనే చేసుకున్నారా అని అనుమానిస్తున్నారు. శ్రీనివాసులురెడ్డి ఇటీవల ఇంటి స్థలం కొనుగోలు చేయడంతో పాటు రూ.10 లక్షల మేర వెచ్చించి పక్కా భవనాన్ని నిర్మించారు. దాంతో వారికి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. పలుచోట్ల చీటీలు వేశారని, వాటిని కట్టడానికి నానా అగచాట్లు పడ్డారని స్థానికులు వెల్లడించారు. ఇద్దరూ సంపాదిస్తేనే ఆర్థిక కష్టాలు తీరుతాయనే ఉద్దేశంతో బుజ్జమ్మ సమీపంలోని ఓ కర్మాగారంలో సెక్యూరిటీగా చేరారు. ఉద్యోగంలో చేరిన తర్వాత శ్రీనివాసులురెడ్డికి భార్యపై అనుమానాలు మొదలయ్యాయని, మరోవైపు ఆర్థిక కష్టాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయని, దాంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు ఆ కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. -
పసి పాపలతో పరుగులు
అది వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆస్పత్రి నవజాతశిశు సంరక్షణ కేంద్రం. అందులో 23 మంది శిశువులు చికిత్స పొందుతున్నారు. గురువారం ఉదయం.. సమయం సరిగ్గా 7.50 గంటలవుతోంది. పిల్లల వార్డులోని ఏసీ నుంచి పొగలు వచ్చాయి. ఏమి జరిగిందని ఆలోచించే లోపే పొగలు గది మొత్తాన్ని కమ్ముకున్నాయి.. ఒక్కసారిగా భయంతో తల్లులు, అటెండెంట్లు పిల్లలను పొత్తిళ్లలో అదిమిపట్టుకుని ప్రాణభయంతో పరుగులు తీశారు. ఆస్పత్రి ప్రాంగణంలోకి చేరుకున్న వెంటనే పెద్ద శబ్దంతో ఏసీ పేలిపోయి మంటలు ఎగిశాయి. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎంజీఎం(వరంగల్) : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి పిల్లల వార్డులో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. చికిత్స పొందుతున్న పసిగుడ్డులను చేతపట్టుకుని తల్లులు భయంతో పరుగులు తీయడం కలకలం రేపింది. నవజాత శిశువులు చికిత్స పొందుతున్న వార్డులోని ఏసీ నుంచి పొగలు రావడంతో తల్లులు తమ చిన్నారులను పట్టుకుని పరుగులు తీశా రు. వారు బయటకు వచ్చిన తర్వాత కొద్ది నిమిషా ల్లో ఏసీ పేలి వార్డులో మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వాహనంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో ప్రమాదం.. ఎంజీఎంలోని నవజాతశిశు సంరక్షణ కేంద్రం (ఎస్ఎన్ఎస్యూ)స్టెప్‌డౌన్ వార్డులో 23 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. గురువారం ఉదయం 7.50 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ నుంచి వచ్చిన పొగలు వార్డును కమ్మేస్తోంది. విషయాన్ని గమనించిన ఆ శిశువుల తల్లులకు ఏమి చేయాలో తోచలేదు. ఒక్కసారిగా తమ చిన్నారులను పొత్తిళ్లలో అదిమి పట్టుకుని ప్రాణభయంతో ఆస్పత్రి ప్రాంగణంలోకి పరుగులు తీశారు. వెంటనే స్పందించిన సెక్యూరి టీ, వైద్యసిబ్బంది ఆస్పత్రిలో ఉన్న విలువైన పరికరాలను బయటకు తీసుకువచ్చే పనిలోపడ్డారు. ఇం తలోనే పొగలు వెలువడుతున్న ఏసీ పక్కనే ఉన్న ఆక్సిజన్ పైపు సైతం లీక్ కావడంతో ఒక్కసారిగా ఏసీ పేలిపోయి గదిలో పెద్ద ఎత్తున మంటలు వ్యా పించాయి. వైద్యసిబ్బంది అగ్నిమాపక అధికా రులకు సమాచారం అందించడగా ఫైరింజన్‌తో సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పివేశారు. చెట్ల కిందే శిశువులతో తల్లుల నిరీక్షణ.. ఈ ఘటనతో షాక్‌కు గురైన శిశువుల తల్లులు తమ పిల్లలతో ఆస్పత్రిలోని చెట్ల కింద నిరీక్షించా రు. వారిని వార్డుకు తరలించాల్సిన పరిపాలనాధికారులు గంట పాటు ఆస్పత్రి ప్రాంగణంలోకి చేరుకోలేదు. ఎంజీఎంలో ముగ్గురు ఆర్ఎంఓలతో పాటు, ఒక సూపరింటెండెంట్ స్థాయి అధికారి నిత్యం పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయితే ఘట న జరిగి గంట సమయం దాటినా అటువైపు అధి కారులెవరూ రాకపోవడంతో చిన్నారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో పిడియాట్రిక్ విభాగ వైద్యులు వచ్చి వారికి ధైర్యం చెబుతూ పక్క వార్డులోకి తరలించారు. మరోమారు మంటలంటూ పరుగులు.. ఏసీ పేలిన ఘటన అనంతరం వైద్యసిబ్బంది పరిపాలనాధికారులు అక్కడి పరిస్థితిని సమీక్షిస్తూ చిన్నారులకు చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో 9.30 గంటలకు మరో ఏసీ నుంచి పొగలు వస్తున్నాయని ఎవరో చెప్పడంతో పక్క వార్డులో చికిత్స పొందుతున్న 100 చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పిల్లలను ఎత్తుకుని బయటకు పరుగులు తీశారు. అసలు ఆస్పత్రిలో ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. వెంటనే సిబ్బంది అప్రమత్తమై ఏం జరగులేదని చెప్పడంతో వారిని వార్డులకు తరలించి చిక్సిత అందించారు. మరమ్మతుకు నోచుకోనీ పరికరాలు.. ఎంజీఎం ఆస్పత్రి ప్రధాన వార్డులో కాలంచెల్లిన పరికరాలతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తున్నది. మూడు, నాలుగు నెలల క్రితం ఏసీలకు మరమ్మతు చేసి పెద్ద ఎత్తున బిల్లులు డ్రా చేసినట్లు వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఆస్పత్రిలోని ఏఎంసీ, ఐఎంసీ, పోస్టు ఆపరేటివ్ వంటి విభాగాల్లో ఏప్పుడూ ఏసీలు సక్రమంగా పనిచేయడం లేదు. అయినా మరమ్మతుల పేరుపై బిల్లులు మాత్రం చెల్లిస్తుండం పరిపాటిగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారు. 23 మంది చిన్నారులు సురక్షితం నవజాతశిశు సంరక్షణ వార్డులో చికిత్స పొందుతున్న 23 మంది చిన్నారులకు ఏలాంటి ప్రమాదం లేదని పిడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ విజయ్‌కుమార్ తెలిపారు. వారిని వేరే వార్డులోకి తరలించి చికిత్సఅందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆస్పత్రిలోని రెండు నవజాతశిశు సంరక్షణ కేంద్రాల్లో 40 పకడలు మాత్రమే మంజూరు కాగా ప్రతి రోజు 80 నుంచి 100 మందికి పైగా చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. నవజాతశిశువులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు ఆయన వివరించారు.– డాక్టర్ విజయ్‌కుమార్, పిడియాట్రిక్ విభాగాధిపతి ప్రాణభయంతో పరుగులు పెట్టాం.. మాది ఖమ్మం జిల్లా. కామెర్ల వ్యాధితో బాధపడుతున్న నా బిడ్డ 13 రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతోంది. ఆస్పత్రిలో ఉన్న ఏసీ నుంచి పొగలు రావడంతో ప్రాణభయంతో పరుగులు పెట్టాం. బయటకు రాగానే ఏసీ పేలి మంటలు లేచాయి.– విజయలక్ష్మి, చిన్నారి తల్లి అదృష్టవశాత్తు బయటపడ్డాం.. ఏసీ నుంచి పొగలు రావడంతో చిన్నారులును ఎత్తుకుని తల్లులు బయటకు పరుగులు తీశారు. వార్మర్లను బయటకు తీసుకువస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఏసీ పేలిపోయింది. ఆ సమయంలో మంటలు ఎగిసిపడ్డాయి. నాతో పాటు హసీనా, సుచరిత సిబ్బంది బయట ఉండడంతో ప్రాణపాయస్థితి నుంచి బయటపడ్డాం.– రమ్య, స్టాఫ్‌నర్సు మేయర్, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు పరామర్శ ఎంజీఎం ఆస్పత్రి పిల్లల విభాగంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ పేలిన విషయాన్ని తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, మేయర్ నన్నపునేని నరేందర్ ఆస్పత్రికి చేరుకున్నారు. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రిలో చిక్తిత్స పొందుతున్న చిన్నారుల తల్లుల వద్దకు వెళ్లి పరామర్శించారు. వారివెంట స్థానిక కార్పొరేటర్ రిజ్వానా షమీమ్ మసూద్, టీఆర్ఎస్ నాయకులు అల్లం నాగరాజు, ఆకారపు మోహన్ తదితరులు ఉన్నారు. నూతన ఎంసీహెచ్ బ్లాక్‌ను ఉపయోగంలోకి తేవాలి ఎంజీఎం ఆస్పత్రి పిల్లల విభాగానికి మంజూరైన పడకల కంటే అందులో చికిత్స పొందే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. నిర్మాణ పనులు పూర్తయిన మాత శిశు సంరక్షణ కేంద్ర భవనాన్ని వెంటనే వినియోగంలోకి తీసుకురావాలి.– పరుశరాములు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ ప్రభుత్వానిదే బాధ్యత ఎంజీఎం ఆస్పత్రి పిడియాట్రిక్ విభాగంలో జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌కు ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలంగాణ జనసమితి యువజన విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ తిరునహరి శేషు డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగిన వార్డును పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కాలం చెల్లిన ఏసీలను వాడడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పేర్కొన్నారు. ఎంజీఎం అధికారులు రోగులకు సరైన వైద్యం అందించడంలో విఫలమవుతున్నారని ఆరోపించారు.– తిరుణహరిశేషు, టీజేఎస్ యువజన విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ -
ఎంజీఎం పిల్లల విభాగంలో షార్ట్‌సర్క్యూట్
ఎంజీఎం: వరంగల్‌లోని మహాత్మాగాంధీ మెమో రియల్ (ఎంజీఎం) ఆస్పత్రిలోని పిల్లల విభాగం లో గురువారం షార్ట్‌సర్క్యూట్ సంభవించింది. నవజాత శిశు సంరక్షణ కేంద్రంలోని ఏసీలో పొగ లు రావడాన్ని గమనించిన శిశువుల తల్లిదండ్రు లు, కుటుంబీకులు చిన్నారులను ఎత్తుకుని బయటకు పరుగులు తీశారు. ఈ విషయాన్ని గమనించిన ఎంజీఎం వైద్య సిబ్బంది వార్డులోని విలువైన వైద్యపరికరాలను బయటకు తీస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఏసీ పేలడంతో వార్డులో మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకు న్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసింది. ఈ ఘటనలో చిన్నారులకు ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో ఇటు వైద్యసిబ్బంది.. అటు వైద్యాధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఏసీ పేలిన వార్డులో చికిత్స పొందుతున్న 23 మంది నవజాత శిశువులు సురక్షితంగా ఉన్నారని ఎంజీఎం సూపరింటెండెంట్ శ్రీనివాస్, పీడియాట్రిక్ విభాగాధిపతి విజయ్‌కు మార్ తెలిపారు. వీరిని ఆస్పత్రిలోని వేరే వార్డుకు తరలించి చికిత్స అందజేస్తున్నట్లు వెల్లడించారు. -
రాజమండ్రి : గుడిసెలో భారీ పేలుడు ముగ్గురు మృతి
-
గాజువాక శ్రీకన్య కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం
గాజువాక(విశాఖ): విశాఖ జిల్లా గాజువాకలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మెయిన్రోడ్లోని శ్రీకన్య కాంప్లెక్స్‌లోని శ్రీకన్య, శ్రీకన్య హెవెన్ థియేటర్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. రెండో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగి క్షణాల్లో రెండు, మూడు అంతస్తులు దగ్ధమయ్యాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని థియేటర్ యాజమాన్యం, పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఉదయం ఆరున్నర గంటల సమయంలో థియేటర్ల నుంచి పొగలు వస్తున్నట్టు స్వీపర్ చిట్టెమ్మ నుంచి సమాచారం అందుకున్న మేనేజర్ రమణబాబు అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేసరికే రెండు థియేటర్లలోని ప్రొజెక్టర్లు, తెర (స్క్రీన్)లు, కుర్చీలు, ఏసీ యూనిట్లు, ఫర్నిచర్ కాలి బూడిదయ్యాయి. థియేటర్పైనున్న సెల్ టవర్లు దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. గాజువాక, పారిశ్రామిక ప్రాంత పరిధిలోని పెదగంట్యాడ, గాజువాక ఆటోనగర్ అగ్నిమాపక శకటాలతోపాటు, హెచ్‌పీసీఎల్, షిప్‌యార్డు, కోరమాండల్, స్టీల్‌ప్లాంట్ తదితర పరిశ్రమలకు చెందిన అగ్నిమాపక శకటాలతో రెండు గంటలపాటు శ్రమించి మంటలను విస్తరించకుండా నిలువరించారు. ఘటనలో సుమారు మూడు కోట్ల రూపాయల ఆస్తినష్టం జరిగినట్లు థియేటర్ మేనేజర్ పోలీసులకు తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే డీసీపీ ఫకీరప్ప, సౌత్ ఇన్చార్జి ఏసీపీ రంగరాజు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. -
ఫన్‌జోన్‌లో మంటలు
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: నగరంలో రంభ థియేటర్ పక్కన ఏర్పాటు చేస్తున్న ఫన్ జోన్లో మంటలు వ్యాపించాయి. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది శుక్రవారం మధ్యాహ్నం భోజనాలకు వెళ్లిన సమయంలో ఈ మంటలు వ్యాపించాయి. దాన్ని గమనించిన సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన తరలివచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ఫన్జోన్కోసం థియేటర్ పక్కన ఉన్న స్థలంలో పిల్లలు అడుకునేందుకు ఫైబర్ బొమ్మలు, ప్లాస్టిక్ పరికరాలు, కంప్యూటర్ వీడియో గేమ్‌లు ఏర్పాటు చేశారు. కంప్యూటర్ నుంచి విద్యుత్ షార్టుసర్క్యూట్ కావడంతో మంటలు వ్యాపించాయి. ఇది గమనించిన సిబ్బంది మ్యాట్నీ ఆటను రద్దు చేసి ప్రేక్షకులకు టికెట్ డబ్బులు ఇచ్చివేసి బయటకు పంపించి వేశారు. ఈ అగ్నిప్రమాదంలో సుమారు రూ. 10 లక్షల వరకూ ఆస్తినష్టం సంభవించినట్టు నిర్వాహకులు తెలిపారు. -
5 ఆర్టీసీ బస్సులు దగ్ధం
సాక్షి, వరంగల్ : నగరంలోని ఆర్టీసీ డిపోలో గురువారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదు బస్సులు దగ్ధం అయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ఆరా తీశారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని అధికారులను కోరారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది. -
షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
రాయగడ : అంబొదల గ్రామంలో ఇందిరపొడ వీధిలో కిరాణ షాపుతో ఉన్న ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. బిజయసున్నా ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున షార్ట్‌సర్క్యూట్ జరి గి అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో ఇల్లు మొత్తం మంటలు వ్యాపించాయి. ఇంటిలో వస్తు సామగ్రి ధ్వంసమయింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రాహుల్ బాగ్(35), తన కుమారుడు రణవీర్ బా గ్(4) గాయపడ్డారు. వీరు బిజయసున్నా ఇంటికి బంధువులుగా వచ్చారు. ఈ సమయంలో అగ్ని ప్రమాదం జరగడంతో వీరు గాయపడ్డారు. వీరి లో రణవీర్ బాగ్ పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను ముందుగా అంబొదల ప్రాథమిక వైద్య కేంద్రానికి తరలించగా పరిస్థితి విషమించడంతో బిసంకటక్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ రణవీ ర్‌బాగ్ పరిస్థితి మరింత విషమించగా బరంపురం తరలించినట్టు తెలిసింది. దీనిపై అంబొదల పోలీ సులు కేసు నమోదు చేసి విచారణ సాగిస్తున్నారు. ఈ ఘటన తెలుసుకున్న బిసంకటక్ ఎమ్మెల్యే జగన్నాథసారక ఘటనా స్థలానికి చేరుకొని బాధితుల ను, వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. -
అమ్మా..తింటానికి కొనుక్కుని వస్తా..
కోవూరు: ‘అమ్మా.. తింటానికి కొనుక్కుని వస్తా..’ అంటూ వెళ్లిన ఆ చిన్నారి అంతలోనే కానలోకాలకు వెళ్లిపోయింది. ఆదివారం స్కూల్ లేకపోవడంతో ఇంట్లోనే ఉన్న ఆ చిన్నారి అప్పటి వరకు సందడి చేసింది. తినుబండారాలు కొనుక్కోనేందుకు అంగడికి వెళ్లి తిరిగి వస్తుండగా విద్యుత్ తీగలు తగిలి మృతి చెందింది. ఈ విషాద ఘటన మండలంలోని చుండుగుంట ప్రాంతంలో ఆదివారం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. చుండుగుంట ప్రాంతానికి చెందిన నలు బోతు శివ, వెంకమ్మ దంపతుల కుమార్తె అఖిలప్రియ (11) ఇనమడుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. ఆదివా రం సెలవు కావడంతో ఆ చిన్నారి ఇంటి వద్దనే ఉంది. చిరుతిండి కొనుక్కుంటానని ఇంట్లో మా రం చేసి తల్లినడిగి డబ్బులు తీసుకుని దుకాణానికి వెళ్లింది. తిరిగి వస్తున్న క్రమంలో ఒక కుక్క బాలికను తరముకోవడంతో పరుగెత్తుతూ ఓ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్దకు చేరుకుంది. అక్కడ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు గమనించి అఖిలప్రియ తల్లిదండ్రులకు చెప్పడంతో హుటాహుటినా అఖిలప్రియను నెల్లూరులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లారు. అప్పటికే అఖిలప్రియ మృతి చెందిందననట్లు వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ విలపించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఏఈ కార్యాలయం ఎదుట నిరసన విద్యుదాఘాతానికి గురై బాలిక మృతి చెందిన విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అట్లూరి సుబ్రహ్మణ్యం, ఎం.చిరంజీవితో పాటు స్థానికులు కోవూరు ఏఈ కార్యాలయానికి చేరుకుని విద్యుత్ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను వేరే ప్రాంతాలకు మార్చాలని ట్రాన్స్‌కో అధికారులకు పలుమార్లు విన్నవించామన్నారు. అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో ఇలాంటా ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. -
కలలు చెదిరి.. కన్నీళ్లు మిగిలి!
విధి ఎంత బలీయమైనదో.. అమాంతంగా ఆనందాల పల్లకిలో ఊరేగించగలదు.. ఒక్క క్షణంలో జీవితంలో కోలుకోలేని విషాదాన్ని నింపనూగలదు. అందుకు ఉదాహరణే కొత్తకోటకు చెందిన ద్వారపురెడ్డి చంద్రమౌళి దీనావస్థ. ఎన్నో కష్టాలనోర్చి బీటెక్ చదివించిన తల్లిదండ్రుల ఆశలు మరికొద్ది రోజుల్లో ఫలించేవి.. గేట్‌కు సన్నద్ధం అవుతున్న సమయంలో వెతుక్కుంటూ వచ్చిన ఉద్యోగంలోనే ఆనందాలు దొరికేవి.. కొడుకు సంపాదనతో కుటుంబానికి ఒక ఆసరా దొరికేది.. అయితే ఇంతలోనే విధి కన్నెర్ర జేసింది. విద్యుదాఘాతం రూపంలో కాళ్లూచేతులు బలిగొని కుటుంబాన్నంతటినీ కన్నీటి సంద్రంలో ముంచేసింది.. ఉద్యోగం చేసుకుంటూ చేదోడుగా ఉంటాడనుకున్న కొడుకు నిస్సహాయ స్థితిలో పడి ఉంటే సహాయార్థుల కోసం ఎదురుచూస్తోంది... రావికమతం: కొద్ది రోజుల్లో ఉద్యోగంలో చేరి కన్నవారి కలలను తీరుస్తాడనుకున్న కుమారుడి ఆశలను కరెంట్ షాక్ హరించేసింది. చిరునవ్వుకు నిలువెత్తు రూపంగా ఉన్న వారసుడిని దివ్యాంగుడిగా మార్చేసి ఆ కుటుంబానికి కన్నీటినే మిగిల్చింది. కొత్తకోట గ్రామానికి చెందిన ద్వారపురెడ్డి రమణ, సత్యవతిలకు చంద్రమౌళి, ప్రసన్న ఇద్దరు పిల్లలు. బతుకు తెరువు కోసం కొన్నాళ్ల క్రితం నర్సీపట్నం వెళ్లి లక్ష్మీపురంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. చంద్రమౌళి తండ్రి రమణ ఏజెన్సీ సంతల్లో చిన్నపాటి వ్యాపారం చేస్తుండగా తల్లి సత్యవతి ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది. చంద్రమౌళి కాకినాడ కైట్‌లో ఇటీవలే బీటెక్ పూర్తి చేశాడు. గేట్‌కు సన్నద్ధం అవుతున్న తరుణంలో వచ్చిన చిన్న ఉద్యోగంలో జాయిన్ తల్లితండ్రులకు చేదోడు ఉందామనే ఆలోచనలో ఉన్నాడు. ఈ లోగా విధి ఆ కుటుంబంపై పంజా విసిరింది. విద్యుత్ ప్రమాదం రూపంలో కుటుంబంలో విషాదం నింపింది. కృత్రిమ చేతుల ఏర్పాటుకు రూ.25లక్షలు చంద్రమౌళి దైన్య స్థితిని అతని మిత్రులు సోషల్ మీడియాలో అప్డేట్ చేయడంతో బెంగళూరుకు చెందిన వైద్యుడు చేతులకు ఆపరేషన్ చేసి సరిచేస్తామని చంద్రమౌళి కుటుంబానికి హామీ ఇచ్చారు. అయితే కృత్రిమ చేతుల ఏర్పాటుకు రూ.25 లక్షల వరకూ ఖర్చవుతుందని చెప్పడంతో వారికి ఏమీ పాలుపోవడం లేదు. ప్రభుత్వం ఆదుకోవాలి ఆపరేషన్ ఖర్చుల కోసం చంద్రమౌళి మిత్రులు, బంధువులు విద్యాసంస్థల్లో విరాళాలు సేకరిస్తున్నారు. చేతనైనంత సహాయంచేసి దాతలు ఆదుకోవాలని మిత్రులు సోమిరెడ్డి అనంత్, బేరా మణికంఠ కోరుతున్నారు. రెండు కాళ్లూ చేతులూ కోల్పోయి అచేతనంగా ఉన్న చంద్రమౌళిని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉంగరం తీయబోయి.. ఇరవై రోజుల క్రితం చంద్రమౌళి, అతని చెల్లెలు ప్రసన్న మేడపై ఉండగా తన ఉంగరం చేజారి కింద ఉన్న రేకుల షెడ్డుపై పడింది. దాన్ని చంద్రమౌళి ఇనుప ఊచతో తీస్తుండగా ప్రమాదవశాత్తూ హైటెన్షన్ విద్యుత్‌వైర్లకు తగిలి అఘాతానికి గురయ్యాడు. ప్రసన్న కేకలు వేయడంతో తండ్రి రమణ పరుగున వెళ్లి అచేతనంగా పడిఉన్న చంద్రమౌళిని నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అత్యవసర వైద్యానికి విశాఖ కేజీహెచ్‌కు తరలించి ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో చికిత్స అందించారు. విద్యుత్ షాక్‌తో కాళ్లూచేతులు పూర్తిగా కాలిపోయాయి. అయితే వాటిని తొలగించకపోతే ప్రాణానికే ప్రమాదమని వైద్యులు తొలగించారు. ప్రస్తుతం రెండు కాళ్లు, చేతులూ లేక అచేతనంగా పడి ఉన్న కుమారుడిని చూసి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. 20 రోజులుగా కుటుంబ సభ్యులతో పాటు చంద్రమౌళి స్నేహితులు సైతం రాత్రులు అక్కడే ఉంటూ సహకరిస్తున్నారు. చంద్రమౌళి తండ్రి బ్యాంకు ఖాతా వివరాలు పేరు: ద్వారపురెడ్డి వెంకట రమణ అకౌంట్ నెం: 038310100129977 ఆంధ్రాబ్యాంకు శాఖ, నర్సీపట్నం ,ఐఎఫ్ఎస్సీ: ఏఎన్‌డీబీ0000383 ఫోన్ నంబర్: 94936 15162 -
జవాబు పత్రాల దగ్ధంపై విద్యార్థుల్లో ఆందోళన
-
నాలుగు సబ్జెక్టులకు మళ్లీ పరీక్షలు?
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం పరీక్షల విభాగంలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా దగ్ధమైన జవాబు పత్రాలకు సంబంధించిన సబ్జెక్టులకు తిరిగి పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని వర్సిటీ పాలక వ ర్గం అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. బీఎస్సీ సెకండ్ ఇయర్ జువాలజీ, మ్యాథమెటిక్స్ సహా మరో 2 సబ్జెక్టుల జవాబు పత్రాలు దగ్ధమైనట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు ప్రొ.శివరాజ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన బృందం బుధవారం షార్ట్‌సర్క్యూట్ జరిగిన గదిని పరిశీలించింది. అగ్నికి దగ్ధమైన పేపర్ల, ఫైర్ ఇంజన్ వదిలిన నీటి ద్వారానే ఎక్కువ నష్టం వాటిల్లినట్లు గుర్తించింది. కాలిపోయిన వాటిలో బీఎస్సీ సెకండియర్ సెమిస్టర్ జవాబు పత్రాలే ఉండటం అధికారులకు ఊరట కలిగించే అంశమే అయినా.. ఇప్పటికే ఒకసారి పరీక్ష రాసినవారు మరోసారి రాయాల్సి రావడం విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. ఉన్నత విద్యాశాఖ కమిషనర్ సహా పలువురు ఉన్నతాధికారులు ఈ ఘటనపై ఆరా తీసి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏళ్లుగా కేబుళ్లు మార్చకపోవడంతోనే.. ఓయూ పరిపాలనా భవనం సహా కాలేజీ, హాస్టల్ భవనాలన్నీ ఏళ్ల క్రితం నిర్మించినవే. ఆయా భవనాల్లో అప్పటి అవసరాలకు అనుగుణంగా విద్యుత్లైన్లను ఏర్పాటు చేశా రు. ఫ్యాన్లు, లైట్ల సామర్థ్యానికి సరిపడే కేబు ళ్లు మాత్రమే వేశారు. ఆ తర్వాత కూలర్లు, ఏసీలు, కంప్యూటర్లు వచ్చి చేరాయి. పెరిగిన విద్యుత్ వినియోగానికి తగ్గట్టు కేబుళ్ల సామర్థ్యం పెంచాల్సి ఉన్నా.. చర్యలు చేపట్టలేదు. దీంతో షార్ట్సర్క్యూట్లు చోటుచేసు కుంటున్నాయి. శతాబ్ది ఉత్సవాల సమయం లో ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. వీటిని భవనాల పునరుద్ధరణకు కాకుండా ఇతర అవసరాలకు వాడారు. కమిటీ రిపోర్టు మేరకే నిర్ణయం ఈ అగ్నిప్రమాదంపై కమిటీ విచారణ చేపట్టింది. గురువారం కల్లా నివేదిక వచ్చే అవకాశం ఉంది. ఏఏ సబ్జెక్టుల జవాబు పత్రాలు కాలిపోయాయి? ఎన్ని కాలిపోయాయి? వంటి వివరాలు తెలుస్తాయి. కమిటీ ఇచ్చే రిపోర్టు మేరకు మళ్లీ పరీక్షలు నిర్వహించే అంశాన్ని ఆలోచిస్తాం. – వీసీ, ప్రొఫెసర్ రామచంద్రం -
ఓయూలో షార్ట్ సర్క్యూట్
హైదరాబాద్: ఓయూ క్యాంపస్ పరీక్షల నియంత్రణ విభాగం జవాబు పత్రాల మూల్యాంకన (స్పాట్ వాల్యుయేషన్) కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షల జవాబు పత్రాలు కొన్ని కాలిపోగా.. మరికొన్ని ఫైరింజన్ నీటికి తడిసిపోయాయి. స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ తలెత్తగా.. సెక్యూరిటీ గార్డు అధికారులకు సమాచారం అందించాడు. అప్రమత్తమైన అధికారులు ఫైరింజన్‌ను పిలిపించి ఘోర ప్రమాదాన్ని నివారించగలిగారు. అగ్ని ప్రమాదాన్ని అరికట్టకలిగారు కాని ఫైరింజన్ నీటికి వేలాది జవాబు పత్రా లు తడిసి ముదై్ద, మూల్యాంకనానికి పనికి రాకుండా పోయాయి. కంట్రోలర్ కుమార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు వీసీ నివాసం ఎదుట ఆందోళన చేపట్టారు. చిన్న ప్రమాదమే: కంట్రోలర్ జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన అగ్ని ప్రమాదాన్ని సకాలంలో స్పందించి అరికట్టామని కంట్రోలర్ ప్రొ.కుమార్ తెలిపారు. షార్ట్ సర్క్యూట్ జరిగిన గదిలో గత నెల 28, 29, 30, 31 తేదీల్లో జరిగిన బీఎస్సీ 2వ, 4వ సెమిస్టర్ పరీక్షల జవాబు పత్రాలున్నాయ న్నారు. వాటిలో 5 శాతం మాత్రమే కాలిపోయాయన్నారు. అనుకోకుండా జరిగిన ఘట న కాబట్టి తమ తప్పిదం ఏమీ లేదన్నారు. కాగా, అగ్నిప్రమాదంపై విచారణ జరిపేందుకు క్యాంపస్‌లోని సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ.శివరాజ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించినట్టు వీసీ రామచంద్రం తెలిపారు. -
80లక్షల మినీ బస్సు దగ్ధం
షాద్‌నగర్‌రూరల్ : షాద్‌నగర్ పట్టణంలో మహరాజా దాబా వెనుక ఉన్న ఓ మెకానిక్ గ్యారేజీలో సోమవారం తెల్లవారు జామున షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో లక్షల రూపాయల ఆస్తినష్టం వాటిల్లింది. బాధితుడు, స్థానికు ల వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన వెంకటేష్ గత కొంతకాలంగా మహరాజా దాబా వెను క ఉన్న షెడ్లో వాహనాల రిపేరింగ్ గ్యారేజీని నిర్వహిస్తున్నాడు. అయితే ఎప్పటిలాగే ఆదివారం రాత్రి పనులు ముగించుకున్న అనంతరం గ్యారేజీకి తాళం వెసి వెంకటేష్ ఇంటికి వెళ్లాడు. సోమ వారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ జరిగి ఒక్కసారిగా మంటలు ఎసిగిపడ్డాయి. ప్రమాదంలో మరమ్మతుల కోసం వచ్చిన ప్రైవేట్ మినీ బస్సు దగ్ధమైంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే వచ్చి మంటలను అదు పు చేశారు. పోలీసులు ఘటన స్ధలాన్ని సందర్శిం చి వివరాలు నమోదు చేసుకున్నారు. గ్యారేజీలో వాహనాలకు సంబంధించిన విలువైన ఇంజన్లు, గేర్ బాక్సులు, ఆయిల్ పూర్తిగా కాలిపోయాయని, వాటి విలువ సుమారు రూ. 2 లక్షల వరకు ఉంటుందని బాధితుడు వాపోయారు. అత్యాధునిక మినీ బస్సు.. కొత్తూరులోని ప్యాపరస్ పోర్టు రిసార్టు నిర్వాహకులకు చెందిన మినీ బస్సును గత ఆరు నెలల క్రితం మరమ్మతుల కోసం గ్యారేజీకి తీసుకొచ్చినట్లు గ్యారేజీ నిర్వాహకుడు వెంకటేష్ తెలిపారు. మరమ్మతులు చేసినా బస్సు యజమానులు వాహనాన్ని తీసుకెళ్ల లేదని, దీంతో ఆరు నెలలుగా బస్సు గ్యారేజీలోనే ఉందన్నారు. అగ్ని ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోయిందని, బస్సు సుమారు రూ. 80లక్షల వరకు ఉండవచ్చని, బస్సుల్లో అన్ని అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయన్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ శ్రీవర్ధన్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితుడిని పరామర్శించారు. -
ఆదమరిచారు.. చిన్నారులు మసై‘పోయారు’
సాక్షి, న్యూఢిల్లీ: అమ్మా, నాన్నా..! అంటూ ఆ చిన్నారులిద్దరూ ఎగిసి పడే మంటల్లో కాలిపోతూ అరిచిన అరుపులు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించాయి. వారిని రక్షించడానికి ఇరుగుపొరుగు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఇంటి తలుపులు మూసేసి ఉండడం. అప్పటికే మంటలు అంతటా వ్యాపించడంతో పిల్లలు బయటపడే మార్గం లేకపోయింది. శుక్రవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో నానమ్మతో కలిసి నిద్రిస్తున్న అక్షర (9), శార్థక్ (7) విగత జీవులవగా.. ఆ వృద్ధురాలు ప్రాణాలతో బయటపడింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వినీత్ గార్గ్, అతని భార్య శుక్రవారం సాయంత్రం అలీపూర్‌లో ఒక పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు వెళ్లారు. ఇద్దరు పిల్లల్ని వాళ్ల నానమ్మ దగ్గరే విడిచి వెళ్లారు. వాళ్లు వెళ్లిన కొద్ది సేపటికే ఆ భవనం మొదటి అంతస్థులో అగ్ని ప్రమాదం జరిగింది. ఇరుగుపొరుగు వారు మంటల్ని గమనించి భవనంలోని వారిని అప్రమత్తం చేసేసరికే మంటలు రెండో అంతస్థుకి పాకాయి. భయంతో పెద్దావిడ ఇంట్లో విద్యుత్తు సరఫరాను నిలిపేసిందని, దీంతో ఇద్దరు పిల్లలు చీకట్లో తలో దిక్కుకు వెళ్లారని చెప్పారు. కొందరి సాయంతో ప్రాణాలతో బయటపడిన ఆమె షాక్‌కు నుంచి తేరుకుని పిల్లలు లోపలే ఉన్నారని భోరున విలపించిందని స్థానికులు పేర్కొన్నారు. కానీ, అప్పటికే సమయం మించిపోయిందనీ.. బయటపడే మార్గం లేక ఆ చిన్నారులిద్దరూ మంటలకు ఆహుతయ్యారని పోలీసులు వెల్లడించారు. ప్రమాద విషయం తెలుసుకున్న ఆ చిన్నారుల తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకునే అంతా బూడిదైపోయింది. -
రిమ్స్‌లో షార్ట్ సర్క్యూట్
ఒంగోలు సెంట్రల్: రిమ్స్ శస్త్రచికిత్సల గదిలో సోమవారం ఉదయం షార్ట్ సర్క్యూట్ అయింది. దీంతో మూడు ఏసీలు తగలబడి, శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో రోగులు భయంతో బయటకు పరుగులు తీశారు. దీంతో తాత్కాలికంగా ప్రధాన శస్త్రచికిత్స గదిని మూసేశారు. ఆర్దోపెడిక్ శస్త్రచికిత్స గదిలో కూడా పూర్తిగా పొగ అలుముకోవడంతో శస్త్రచికిత్సలను నిలిపేశారు. సిబ్బంది మంటలను ఆర్పివేశారు. సమాచారం అందుకున్న రిమ్స్ డైరక్టర్, ఇతర అధికారులు శస్త్రచికిత్సల గదుల వద్దకు చేరుకుని పరిశీలించారు. నాసిరకం వైరింగ్ గానీ, ఏసీలు గానీ వాడటం వలన అగ్నిప్రమాదం సంభవించి ఉండవచ్చని భావిస్తున్నారు. -
షార్ట్ సర్క్యూట్‌తో వ్యక్తి సజీవ దహనం
నారాయణపేట రూరల్: గాఢ నిద్రలో ఉండగా జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. గుజరాత్‌కు చెందిన నంజీలాల్ పటేల్ (62) కుటుంబం కొన్నేళ్ల కిందట మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటకు వచ్చి స్థిరపడ్డారు. పట్టణంలోని యాద్గీల్ రోడ్లో నంజీలాల్ ఫ్లైవుడ్ షాపును ఏర్పాటు చేసి వ్యాపారం చేస్తున్నాడు. రోజులాగే శనివారం కూడా షాపులో నిద్రపోయాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి దాటిన తర్వాత దుకాణంలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో గాఢనిద్రలో ఉన్న నంజీలాల్ స్పృహ తప్పి మంటల్లో కాలిపోయాడు. తెల్లవారిన తర్వాత గమనించిన స్థానికులు వారి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి దుకాణం తెరిచి చూడగా నంజీలాల్ ఎముకలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ఘటనలో రూ.6 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని ఎస్సై వెల్లడించారు. నంజీలాల్‌కు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమార్తె పెళ్లి వచ్చే నెలలో జరగనుండటం.. ఇంతలోనే తండ్రి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు -
అగ్ని ప్రమాదంలో నలుగురి మృతి
న్యూఢిల్లీ : బూట్ల ఫ్యాక్టరీలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతిచెందారు. ఈ సంఘటన ఢిల్లీలోని సుల్తాన్‌పురి రాజా పార్క్ ఫ్యాక్టరీలో ఉదయం 6.35 గంటలకు జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 12 మంది కార్మికులు ఉన్నట్లు ఢిల్లీ అగ్నిమాపకశాఖాధికారి చెప్పారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటల్లో చిక్కుకుని తీవ్రగాయాలతో నలుగురు కార్మికులు అప్పటికే చనిపోయారని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. చనిపోయిన వారిని సంజయ్ గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. మృతులను గుర్తించాల్సి ఉంది. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. -
‘జీశాట్–6ఏ’ విఫల ప్రయోగమే!
శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) షార్ నుంచి మార్చి 29న సాయంత్రం 4.56 గంటలకు ప్రయోగించిన జీశాట్–6ఏ ఉపగ్రహంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. పలు దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో జీశాట్–6ఏతో సంబంధాల పునరుద్ధరణకు ఇస్రో యత్నించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. దీంతో ఈ ఉపగ్రహ ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తల్లో నైరాశ్యం నెలకొంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో రూ.260 కోట్లతో నిర్మించి ప్రయోగించిన ఈ ఉపగ్రహం మరో అంతరిక్ష వ్యర్థంగా మిగిలిపోనుందని శాస్త్రవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. మొబైల్ టెక్నాలజీతో పాటు సమాచార రంగం బలోపేతం కోసం జీఎస్ఎల్వీ–ఎఫ్08 రాకెట్ ద్వారా జీశాట్–6ఏను 170 కి.మీ పెరిజీ (భూమికి దగ్గరగా) 35,975 కి.మీ అపోజీ (భూమికి దూరంగా) భూ బదిలీ కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహం కక్ష్యను 3 దశల్లో పెంచాలని హసన్‌లో ఉన్న ఉపగ్రహ నియంత్రణా కేంద్రం శాస్త్రవేత్తలు నిర్ణయించారు. 2,140 కిలోల బరువున్న ఈ ఉపగ్రహంలోని ఇంజిన్లను మండించి మార్చి 30, 31 తేదీల్లో జీశాట్–6ఏ కక్ష్యను రెండుసార్లు విజయవంతంగా పెంచారు. ఏప్రిల్ 1న మూడోసారి కక్ష్యను పెంచే క్రమంలో ఉపగ్రహంలోని ఎలక్ట్రిక్ వ్యవస్థలో షార్ట్ సర్క్యూట్ జరగడంతో జీశాట్–6ఏ మూగబోయింది. దీంతో ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించామన్న ఆనందం శాస్త్రవేత్తలకు రెండ్రోజులు కూడా నిలవలేదు. ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాలు సాంకేతిక కారణాలతో అంతరిక్షంలో వ్యర్థాలుగా మిగిలిపోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఇస్రో ప్రయోగించిన ఇన్శాట్–4సీ ఉపగ్రహం కూడా కక్ష్యలోకి ప్రవేశించడంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురుకావడంతో అంతరిక్ష వ్యర్థంగా మిగిలిపోయింది. అలాగే గతేడాది పంపిన ఐఆర్ఎన్ఎస్ఎస్–1 హెచ్ హీట్‌షీల్డ్ తెరుచుకోకపోవడంతో ఆ ఉపగ్రహం ప్రస్తుతం అంతరిక్షంలో చక్కర్లు కొడుతోంది. ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన డా.కె.శివన్‌కు తొలి ప్రయోగంలోనే వైఫల్యం ఎదురుకావడం గమనార్హం. -
సెల్ దుకాణంలో అగ్నిప్రమాదం
బద్వేలు అర్బన్ : స్థానిక సిద్దవటం రోడ్డులోని మసీదు కాంప్లెక్స్‌లో ఉన్న ఖలందర్ సెల్ పాయింట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. రోజూ మాదిరే శనివారం రాత్రి దుకాణం మూసివేసి వెళ్లగా.. ఆదివారం ఉదయం దుకాణంలో నుంచి దట్టమైన పొగలు వస్తుండడంతో స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని వారు సెల్పాయింట్ యజమాని షాజహాన్‌కు, అగ్నిమాపక సిబ్బందికి తెలిపారు. వెంటనే వారు అక్కడికి చేరుకుని షెట్టర్ తెరచి చూడగా దుకాణంలోని ఏసీ నుంచి మంటలు వస్తుండటాన్ని గుర్తించి సీవోటు యంత్రం ద్వారా అదుపు చేశారు. ఈ ప్రమాదంలో దుకాణంలోని సెల్ఫోన్లు, ఇతర సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో సుమారు లక్ష వరకు నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపకాధికారి ఓబులేసు తెలిపారు. -
వృద్ధురాలి సజీవ దహనం
బుచ్చిరెడ్డిపాళెం: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో చెలరేగిన మంటల కారణంగా టి.చెంచమ్మ అనే వృద్ధురాలు సజీవదహనమైన సంఘటన మండలంలోని పెనుబల్లిలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గ్రామంలోని కోవూరు కాలువ పక్కనే టి.చెంచమ్మ(82) నివాసముంటోంది. కుమారుడు సుబ్బయ్య భోజన వసతి సమకూర్చుతుడంతో కాలం గడుపుతోం ది. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల వారు బయటకు వచ్చి చూడగా కళ్లముందే గుడిసె మొత్తం తగలబడిపోయింది. గుడిసెలో ఉన్న చెంచమ్మ సజీవదహనమైంది. అక్కడి పరిసరాలను పరిశీలించగా విద్యుత్ తీగలు తెగి పడి ఉన్నాయి. విద్యుత్‌షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగిందని స్థానికులు భావిస్తున్నారు. -
అగ్ని ప్రమాదాలు.. 8మంది సజీవదహనం
సాక్షి, గాంధీనగర్: దేశంలో అగ్నిప్రమాదాలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. మొన్న ముంబైలో జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 14మంది మృతిచెందిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం చోటుచేసుకున్న రెండు అగ్నిప్రమాదాల్లో 8 మంది సజీవదహనమయ్యారు. గుజరాత్‌లోని శిబర్‌లో జరిగిన ప్రమాదంలో ముగ్గరు చిన్నారులు మృతిచెందగా.. రాజస్థాన్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో ఒకే ఫ్యామిలీకి చెందిన 5 మంది అగ్నికి ఆహుతయ్యారు. గుజరాత్ లో శుక్రవారం రాత్రి మరో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాజ్‌కోట్‌లోని ప్రాణ్‌స్లా గ్రామంలో ఓ కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు చనిపోగా.. మరో 15 మందికి గాయాలయ్యాయి. షాట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. కుటుంబం మొత్తం అగ్నికి ఆహుతి అయితే.. ఇలాంటి అగ్ని ప్రమాదమే రాజస్థాన్‌లో శనివారం ఉదయం జరిగింది. నగరంలోని విద్యానగర్‌లోని ఓ ఇంటిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక కుటుంబంలోని సభ్యులు సజీవదహనం అయ్యారు. సమాచారం తెలుసుకుని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రమాదం జరిగిన చోటుకి వెళ్లి మంటలను అదుపు చేశారు. గ్యాస్ సిలిండర్ లికేజీ వల్లనే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. -
మట్టపల్లి క్షేత్రంలో అగ్ని ప్రమాదం
మఠంపల్లి: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రధాన ఆలయానికి ముందున్న సింహద్వారం, ఆంజనేయస్వామి ఆలయం మధ్య వేసిన గుడారంలో షార్ట్ సర్క్యూట్ అయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భయాందోళనతో అర్చకులు, భక్తులు పరుగులు తీశారు. టెంట్లు, షామియానాలు పూర్తిగా కాలిపోయాయి. ఫర్నిచర్, గదులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వాటర్ ట్యాంకర్‌ను రప్పించి మంటలను ఆర్పారు. -
హిజ్రా సజీవదహనం
అనకాపల్లి టౌన్: పట్టణానికి చెందిన హిజ్రా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గాంధీనగరం 1వవీధిలో నివాసముంటున్న హిజ్రా కాలపర్తి వెంకట సూర్యనారాయణ అలియాస్ దేముడమ్మ (50) ఇంటిలో నుంచి ఆదివారం తెల్లవారుజామున ఐదుగంటల సమయంలో మంటలు రావడాన్ని గమనించిన ఇంటి యజమాని కోరిబిల్లి శంకరరావు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేస్తుండగా ఇంట్లో దేముడమ్మ మృతి చెంది ఉండడాన్ని గమనించారు. యజమాని శంకరరావుæ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డీఎస్పీ కె.వెంకటరమణ, క్రైం డీఎస్పీ అలియాస్ సాగర్ ఆధ్వర్యంలో క్లూస్, డాగ్‌స్క్వాడ్ బృందాలు వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్బృందం కొన్ని చోట్ల వేలిముద్రలను సేకరించింది. దేముడమ్మ హత్యకు గురైందా..? లేక షార్ట్‌సర్క్యూట్ కారణంగా మృతి చెందిందా? అనే విషయంపై పోలీసులు దృష్టి పెట్టారు. మృతిపై అనుమానాలు ఐదేళ్ల క్రితం అనకాపల్లి పట్టణానికి వచ్చిన దేముడమ్మకు ఎవరితోనూ ఎటువంటి తగాదాలు లేవు. తోటి హిజ్రాలతో ఎటువంటి సత్సంబంధాలు లేవని స్థానికులు చెబుతున్నారు. అయితే వెంకటేశ్వరస్వామి పూజలు ఎక్కువుగా చేస్తుండడంతో పలువురు ఆమె వద్దకు వచ్చి గ్రహస్థితిపై ఆరా తీస్తుంటారు. వారిచ్చే నగదుతో కాలం వెళ్లదీస్తుంది. వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాదం కూడా చేస్తుంటుంది. ఆరు నెలల క్రితం ఆమె ఇంటిలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. శనివారం విజయరామరాజుపేట గౌరీపరమేశ్వరుల మహోత్సవం సందడిలో చోరీకి యత్నించిన ఆగంతకులు నగదు, బంగారం దోచుకునే ప్రయత్నంలో అడ్డొచ్చిన ఆమెను హతమార్చి ఉంటారని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. షార్ట్‌సర్క్యూట్‌తోనే మృతి చెందింది తెల్లవారుజామున నిద్ర నుంచి లేచిన దేముడమ్మ ఇంట్లో లైట్ స్విచ్ ఆన్‌చేయగా మంటలు వ్యాపించి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయింది. ఆమె ఉంటున్న గదికి మంటలు వ్యాపించి మృతి చెందింది. ఇంటి యజమాని శంకరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. – విద్యాసాగర్, సీఐ -
రవీంద్ర భారతిలో అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని సాంస్కృతిక కళావేదిక రవీంద్రభారతిలో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆడిటోరియంలోని వేదిక వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్టేజ్‌పై ఉన్న స్పీకర్లు, వైర్లు, సెట్టింగ్ లైట్స్ అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
తిరుమలలోషార్ట్ సర్క్యూట్ భక్తులకు గాయాలు!
-
బస్సు డిపోలో షార్ట్‌సర్క్యూట్
- ఉరుములు, మెరుపులతో కాలిపోయిన యూపీఎస్ - పని చేయని కంప్యూటర్లు.. ఎస్ఆర్ షీట్ లేక నిలిచిన బస్సులు హుస్నాబాద్: బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ సమస్య నెలకొని యూపీఎస్ కాలిపొయింది. దీంతో బస్సులు డిపోలోనే రెస్ట్ తీసుకుంటున్నాయి. హుస్నాబాద్ బస్సు డిపోలో నాలుగు రోజులుగా షార్ట్‌సర్క్యూట్ సమస్యతో కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడుతోంది. ఆదివారం డిపో సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు చెల రేగా యి. దీంతో డిపోలో షార్ట్‌సర్క్యూట్ సమస్య తలెత్తింది. రెండు విద్యుత్ మీటర్లకుగాను ఒకటి కాలిపోయింది. మరో మీటర్‌తో కార్యకలాపాలను కొనసాగిస్తుండగా బుధవారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసి, పిడుగు పడింది. మరోసారి డిపోలో షార్ట్‌సర్క్యూట్ సమస్య తలెత్తి యూపీఎస్ కాలిపోయి కంప్యూటర్లు మొరాయించాయి. రెండేళ్లుగా మాన్యువల్ టికెట్ల పంపిణీ ప్రక్రియను నిలిపివేశారు. కంప్యూటర్లలో టికెట్ నంబర్లు, బస్సు నంబరు, డ్రైవర్, కండక్టర్ పేర్లతో కూడిన ఎస్ఆర్ షీట్ విడుదలయ్యాకే.. బస్సులు డిపోనుంచి రోడ్లకు పైకి వస్తాయి. యూపీ ఎస్ కాలిపోవడంతో ఎస్ఆర్ షీట్ జారీకాక బస్సులు నిలిచిపోయాయి. మొత్తం 53 బస్సులకుగాను బుధవారం ఉదయం 12 బస్సులు బయటకు వచ్చాయి. హైదరాబా ద్‌కు బస్సులు నడవకపోవడంతో ప్రయాణి కులు ఇబ్బందులకు గురవుతున్నారు. -
ట్రావెల్స్ బస్సులో మంటలు
-
ట్రావెల్స్ బస్సులో మంటలు
సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లాలోని హనుమంతునిపాడు మండలం వేములపాడు సమీపంలో మంగళవారం అర్ధరాత్రి పెను ప్రమాదం తప్పింది. షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కాలి బూడిదైంది. డ్రైవర్ అప్రమత్తతతో 40 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సు కడప నుంచి విజయవాడ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దగ్ధమైన బస్సు విజయవాడకు చెందిన మేఘన ట్రావెల్స్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. బస్సు ప్రమాదంతో ప్రయాణికులు అర్ధరాత్రి రోడ్డుపైనే గడపాల్సి వచ్చింది. -
కరెంట్ తీగెలు తగిలి మిర్చి లారీ దగ్ధం
-
ప్రైవేటు ట్రావెల్ బస్సు దగ్ధం
- డ్రైవర్ అప్రమత్తతతో సురక్షితంగా బయటపడిన పెళ్లి బృందం - షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం! - విశాఖ జిల్లాలో ఘటన కశింకోట (అనకాపల్లి): విశాఖ జిల్లా కశింకోట మండలంలోని పరవాడపాలెం గ్రామం వద్ద శనివారం ప్రైవేటు ట్రావెల్ బస్సు కాలిపోయింది. కారు, బస్సు డ్రైవర్ల అప్రమత్తతతో 52 మంది సురక్షితంగా బయటపడ్డారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. నష్టం సుమారు రూ.కోటికి పైగా ఉంటుదని అంచనా. హైదరాబాద్ ప్రాంతానికి చెందిన బంధు మిత్రులు అనకాపల్లిలో జరిగే వివాహానికి వెళ్లేందుకు కావేరి ట్రావెల్స్‌కు చెందిన స్కానియా బస్సులో శుక్రవారం రాత్రి బయలుదేరారు. శనివారం ఉదయం 6.15 గంటల సమయంలో కశింకోట మండలంలోని పరవాడపాలెం గ్రామం వద్ద అమలోద్భవి హోటల్ సమీపానికి వచ్చేసరికి షార్టు సర్క్యూట్ వల్ల బస్సు వెనుక ఉన్న ఇంజన్ నుంచి పొగలు రావడాన్ని అదే మార్గంలో వస్తున్న ఓ కారు డ్రైవర్ గుర్తించారు. బస్సు డ్రైవర్ కనకాల శ్రీనుకు విషయాన్ని తెలిపి అప్రమత్తం చేశాడు. దీంతో బస్సును నిలిపి తమ వద్ద ఉన్న ఫైర్ డిస్టింగ్ ఫిషర్‌తో మంటలు అదుపు చేయడానికి ప్రయత్నించాడు. అయినా ప్రయోజనం లేకపోవడంతో ప్రయాణికులను అప్రమత్తం చేసి దింపి వేశారు. దీంతో వారు సురక్షితంగా బయట పడ్డారు. బస్సు మంటల్లో చిక్కుకోవడంతో పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే బస్సు దాదాపు పూర్తిగా కాలిపోయింది. ప్రమాదం వల్ల సుమారు 3 గంటల పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సీఐ రామచంద్రరావు, ఎస్ఐ బి.మధుసూదనరావు ఘటనా స్థలానికి చేరుకొని వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. కాలిపోయిన బస్సును క్రేన్ల సహాయంతో పక్కకు తొలగించారు. -
ఆంధ్రజ్యోతి కార్యాలయంలో అగ్నిప్రమాదం
-
ఆంధ్రజ్యోతి కార్యాలయంలో అగ్నిప్రమాదం
జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో ఉన్న ఆంధ్రజ్యోతి కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. ఈ ప్రమాదంలో ఎంత మేర నష్టం సంభవించిందీ ఇంకా తెలియరాలేదు. దాదాపు రెండు గంటల నుంచి మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి. ముందుగా షార్ట్ సర్క్యూట్ కారణంగా రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి. అక్కడినుంచి మూడు, నాలుగు అంతస్తులకు కూడా మంటలు వ్యాపించాయని చెబుతున్నారు. లోపల ఉన్న సిబ్బంది తమవద్ద ఉన్న పరికరాలతో మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దాంతో వాళ్లు ప్రాణాలతో బయటపడ్డారు. నాలుగు ఫైరింజన్లు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. లోపల ఫైళ్లు కాలుతుండటంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. లోపలకు వెళ్లి మంటలను ఆర్పడం కష్టం కావడంతో బయటి నుంచే మంటలను అదుపు చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న భవనాల పైనుంచి కూడా వీటిని అదుపు చేయాలని చూస్తున్నారు. మెట్ల మీద నుంచి సిబ్బంది బయటకు వచ్చేందుకు కూడా మంటలు అడ్డుగా ఉండటంతో.. పక్క భవనాల మీదకు తీసుకెవెళ్లి అక్కడినుంచి కిందకు తీసుకొచ్చారని తెలుస్తోంది. మరికొందరిని అగ్నిమాపక సిబ్బంది నిచ్చెనల మీదుగా బయటకు తీసుకొచ్చారు. సిబ్బంది ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దాదాపుగా కార్యాలయ భవనం మొత్తం కాలిపోయిందనే అంటున్నారు. -
పోలవరం ప్రాజెక్టు వద్ద భారీ యంత్రం దగ్ధం
-
పోలవరం ప్రాజెక్టు వద్ద భారీ యంత్రం దగ్ధం
పోలవరం: పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్ట్ వద్ద శుక్రవారం ఓ భారీ యంత్రం అగ్నికి ఆహుతి అయింది. పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఉపయోగించేందుకు ఈ భారీ యంత్రం ఎస్కలేటర్‌ను రూ.75 కోట్లతో జర్మనీ నుంచి కాంట్రాక్టు సంస్థ తెప్పించింది. స్పిల్‌వే చానల్ కోసం కొండను తవ్వుతుండగా జరిగిన ఈ ప్రమాదానికి షార్టు సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. ప్రాజెక్టు అధికారులు, కాంట్రాక్టు సంస్థ యాజమాన్యం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ యంత్రం దగ్ధమవడంతో ప్రాజెక్టు పనులు నెమ్మదిస్తాయని ఆందోళన వ్యక్తమవుతోంది. రోజుకు 30వేల ఘనపుటడుగుల మట్టిరాళ్లను వెలికితీయగల సామర్థ్యం ఉన్న ఈ భారీ యంత్రాన్ని అక్కడ సిబ్బంది ‘బాహుబలి’ అని పిలుచుకుంటారు. -
మోటార్ సైకిల్ దగ్ధం
ఎర్రకాలువ సమీపంలో, శనివారం, షార్ట్ సర్క్యూట్ near red canal, saturday, short circuit టి.నరసాపురం: టి.నరసాపురం ఎర్రకాలువ సమీపంలో శనివారం వేకువజాము ఐదు గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్‌తో మోటార్ సైకిల్ దగ్ధమైంది. వివరాలిలా ఉన్నాయి.. టి.నరసాపురం మండలం ఏపుగూడెం పంచాయతీ పరిధిలోని కన్నప్పగూడెంకు చెందిన పాయం కిరణ్ మరో యువకుడు కలిసి చింతలపూడి మండలం కొమ్ముగూడెం బంధువుల ఇంటికి వెళ్లి వస్తున్నారు. మార్గమధ్యంలో ఎర్రకాలువ సమీపంలో రోడ్డుపై వ్యవసాయ మోటార్లకు వెళ్లే విద్యుత్ తీగ తెగిపడి ఉంది. దీనిని చూడకుండా కిరణ్ బైక్‌పై వెళుతుండగా విద్యుదాఘాతానికి గురై కిందపడ్డారు. వీరిద్దరికీ తృటిలో ప్రమాదం తప్పగా, బైక్ పూర్తిగా కాలిబూడిదైంది. -
టీవీ ఆన్‌చేస్తుండగా షాక్.. బాలుడి మృతి
బంట్వారం: విద్యుత్ షాక్‌తో ఓ బాలుడు మృతి చెందిన సంఘటన బంట్వారం మండలం నాగసాన్పల్లి తాండా సమీపంలోని ఎల్లమ్మ గుట్ట వద్ద మంగళవారం జరిగింది. తండాకు చెందిన మాణిబాయి ఎల్లమ్మ దేవాలయం వద్ద పూజారిగా పనిచేస్తూ అక్కడే ఉంటున్నది. ఆమె అన్న కుమారుడు పరశురాం(6) మాణిబాయి వద్ద ఉంటూ వికారాబాద్ కృష్ణవేణి స్కూల్లో పస్ట్ క్లాస్ చదువుతున్నాడు. మంగళవారం బడి నుంచి ఎల్లం గుట్టకు తిరిగి వచ్చాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో టీవీ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. మేనత్త మాణిబాయి వెంటనే వికారాబాద్ ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గంమధ్యలో మరణించాడు. బాలుడికి తల్లిదండ్రులు సుమ్మిబాయి, శంకర్, ఒక సోదరి ఉన్నారు. -
విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
భోగాపురం: విజయనగరం జిల్లా భోగాపురం మండలం కొంగవానిపాలెంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గ్రామస్తులంతా కూలీ పనులకు వెళ్లిన సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగింది. సుమారు 26 పూరిళ్లు పూర్తిగా కాలిపోయాయి. ఇళ్లలోని నగలు, నగదు, విలువైన పత్రాలు బూడిదయ్యాయి. గ్రామస్తులు కట్టుబట్టలతో మిగిలారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి ఆలస్యంగా చేరుకున్నారు. దీంతో జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయిందని బాధితులు తెలిపారు. నష్టం వివరాలు తెలియాల్సి ఉందని, దర్యాప్తు చేపట్టామని ఎస్సై తారకేశ్వరరావు తెలిపారు. -
రాజధానిలో విషాదం
- ఆగి ఉన్న కారులో మంటలు - ఇద్దరు చిన్నారులకు గాయాలు న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ కారులో మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఢిల్లీలోని సుల్తాన్‌పురి ప్రాంతంలో గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు బాలికలు(2, 3 వయస్సు) రోజు మాదిరిగానే ఇంటి బయట ఆగి ఉన్న కారులో ఆడుకుంటున్నారు. అయితే, కారులో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. చిన్నారులు కేకలు వేసినప్పటికీ ఇంట్లో ఉన్న వాళ్ల అమ్మమ్మకు వినిపించలేదు. కొద్దిసేపటి తర్వాత తీవ్రమైన పొగలు రావటంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని బాలికలను బయటకు తీశారు. అప్పటికే వారికి 50 శాతం మేర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించారు. కారు స్టీరింగ్ దిగువ భాగంలోని తీగలు షార్ట్‌సర్క్యూట్‌కు గురై మంటలు చెలరేగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
అగ్నికీలల్లో ఆరిపోయిన జ్యోతి
► కొల్లూరులో గృహం దగ్ధమైన ఘటనలో బాలిక సజీవ దహనం ► శోకసంద్రంలో కుటుంబం, బంధువులు కొల్లూరు : చిన్నారులతో ఆనందంగా ఉన్న ఆ కుటుంబంలో అగ్ని ప్రమాదం ఆరని కుంపటిని రగిల్చింది. బుడిబడి నడకలతో, వచ్చీరాని మాటలతో ఇంట్లో సంతోషాలను పంచుతున్న బాలిక ప్రమాదవశాత్తు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం తల్లిదండ్రులు, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. కొల్లూరులో సోమవారం చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో ఓ బాలిక సజీవ దహనం అవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. అప్పటివరకూ తోటి చిన్నారులతో ఆటపాటలతో గడిపిన ఆ బాలిక తమ బంధువుల ఇంట్లోకి వెళ్లి అగ్నిప్రమాదంలో చిక్కుకుని మంటలకు ఆహుతవడం కుటుంబ సభ్యులు, బంధువులను శోకసంద్రంలోకి నెట్టివేసింది. స్థానికుల కథనం మేరకు.. కొల్లూరు అంబేడ్కర్ కాలనీకి చెందిన కొలకలూరు గోపి, రజనిలకు ఇద్దరు కుమార్తెలు. విద్యుత్ పనులు చేసుకుంటూ జీవించే గోపి పని నిమిత్తం బయటకు వెళ్లగా, బాలిక తల్లి పొలం పనికి వెళ్లింది. పెద్ద కుమార్తె అయిన జ్యోతి (4) తోటి పిల్లలతో ఆడుకుంటూ తన మేనమామ అయిన చొప్పర ముసలయ్య ఇంటికి వెళ్లింది. ముసలయ్య, ఆయన భార్య శేషమ్మ సైతం పొలం పనులకు వెళ్లారు. అదే సమయంలో ఆ ఇంట్లో విద్యుత్ షార్టు సర్క్యూట్ సంభవించి తాటాకుల ఇంటికి మంటలు వ్యాపించాయి. బయటకు వచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించక బాలిక లోపలే చిక్కుకుపోయింది. ఇంట్లో బాలిక ఉన్న విషయాన్ని గమనించిన స్థానికులు శతవిధాలా చిన్నారిని కాపాడే ప్రయత్నాలు చేసినా, అప్పటికే మంటల తాకిడికి బాలిక సజీవదహనమై మసిబొగ్గుగా మారిపోయింది. ఇంటి వెనుక గోడను కూల్చి జ్యోతి మృతదేహాన్ని వెలుపలికి తీశారు. అప్పటివరకూ బాలిక తప్పించుకుని ప్రాణాలతో ఉండవచ్చునన్న ఆశతో ఎదురు చూసిన తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు తీరా మసిబొగ్గుగా మారిన బాలిక మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ ఇంటి దీపంగా బావించిన బాలిక అగ్నికి ఆహుతై చివరి చూపునకు కూడా దక్కకుండా పోవడం ఆ కుటుంబాన్ని తీరని వేదనకు గురిచేసింది. ఎంపీపీ కనగాల మధుసూదన్ ప్రసాద్, తహసీల్దార్ ఎ.శేషగిరిరావు బాలిక మృతిపై తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. -
తిరుపతి రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం
తిరుపతి అర్బన్: తిరుపతి రైల్వే స్టేషన్‌లోని మొదటి ప్లాట్‌ఫాంపై శనివారం సాయంత్రం షార్ట్ సర్క్యూట్ కావడంతో స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్లాట్‌ఫాంపై ఏర్పాటు చేసిన రిజర్వేషన్ చార్టు కంప్యూటర్ డిస్ప్లే మానిటర్లు కాలిపోయాయి. రెండు మానిటర్లు పూర్తిగా, మరొక మానిటర్ పాక్షికంగా డామేజీ అయ్యాయి. ఈ ఘటనతో సుమారు రూ.65వేల వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మొదటి ప్లాట్‌ఫాంపై ఏర్పాటై ఉన్న రిజర్వేషన్ చార్టుల డిస్ప్లే మానిటర్లలో నుంచి పొగ రావడంతో ప్రయాణికులు కేకలు పెట్టారు. కొన్ని క్షణాల్లోనే మంటలు రావడంతో భయాందోళనకు గురయ్యారు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న టీసీ చైతన్య, జనరల్ బుకింగ్ కార్యాలయం క్లర్క్ వెంకటేష్‌లు వెంటనే అగ్నిమాపక పరికరాలతో మానిటర్లపైకి పౌడర్‌ను వెదజల్లి మంటలను అదుపులోకి తెచ్చారు. ఎండాకాలం కావడంతోపాటు మానిటర్ల లోపలి కేబుల్, వైరింగ్ బాగా కరిగిపోవడంతో పొగలతోపాటు మంటలు చెలరేగేందుకు కారణమయింది. ఈ చార్టుల మానిటర్లను ప్లాట్‌ఫాంపై కాకుండా స్టేషన్‌కు వెలుపల ఏర్పాటు చేయాలని అప్పట్లోనే విన్నవించుకున్నా సంబంధిత అధికారులు పట్టించుకోలేదు. ఈ మానిటర్లు ఉన్న ప్లాట్‌ఫాంపై అర్దరాత్రి దాటాక వందల సంఖ్యలో ప్రయాణికులు నిద్రిస్తుంటారు. ఇలాంటి సమయాల్లో ఏదైనా ఘటన జరిగి ఉంటే పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉండేదని ప్రయాణికులు తెలిపారు -
ఛార్జింగ్ పెడుతూ వ్యక్తి మృతి
చిన్నశంకరంపేట(మెదక్): సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన బుధవారం జరిగింది. జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం కాజాపూర్ తండాకు చెందిన గోవింద్ అనే వ్యక్తి ఇంట్లో సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా.. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. -
తార్నాక ఫ్లైఓవర్‌పై కార్లో మంటలు
హైదరాబాద్‌సిటీ: తార్నాక ఫ్లైఓవర్‌పై వెళ్తున్న కార్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ కారును వెంటనే అక్కడే ఆపేసి బయటకు దిగేయడంతో ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగి ఉంటాయని అనుమానిస్తున్నారు. ప్రమాద సమయంలో కారు హబ్సిగూడ నుంచి మెట్టుగూడ వైపు వెళ్తోంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి కారు పూర్తిగా కాలిపోయింది. -
షార్ట్ సర్క్యూట్ తో హార్డ్‌వేర్ షాప్ దగ్ధం
శంషాబాద్ రూరల్: మండలంలోని నర్కూడలో ఉన్న ఓ హార్డ్‌వేర్ షాపులో ప్రమాదవశాత్తు మం టలు చెలరేగి మెటీరియల్ దగ్ధవైుంది. శుక్రవారం రాత్రి గ్రామంలోని జై భవాని హార్డ్‌వేర్ అండ్ ఎలక్ట్రికల్ షాపులో షార్ట్ సర్క్యూట్ తో హార్డ్‌వేర్ షాప్ దగ్ధం తో మంటలు చెలరేగాయి. దుకాణంలో ప్లాస్టిక్ మెటీరియల్ ఎక్కువగా ఉండడంతో మంటల తీవ్రత పెరిగిం ది. స్థానికులు మంటలార్పేందుకు విఫలయత్నం చేశారు. ఘటన జరిగిన గంట తర్వాత చేరుకున్న ఫైర్ ఇంజిన్ తో చాలా సేపటికి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. రూ.40లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు దుకాణం నిర్వాహకుడు తెలిపారు. -
ఆర్టీసీ బస్సులో మంటలు : తప్పిన ప్రమాదం
-
ఆర్టీసీ బస్సులో మంటలు : తప్పిన ప్రమాదం
యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆర్టీసీ బస్సుకు మంగళవారం పెనుప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న గరుడ బస్సులో ఆలేరు సమీపంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటలను గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డు పక్కన నిలిపివేశాడు. బస్సులోని ప్రయాణికులు హుటాహుటిన కిందకు దిగారు. కొద్ది నిమిషాల్లోనే బస్సుకు మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణంగా తెలుస్తోంది. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది వచ్చే సమయానికే బస్సు దగ్ధమైంది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు. -
ఊరంతా కరెంట్ షాక్
కౌడిపల్లి: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం అనంతయ్యపల్లి తండాలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇళ్లలో కరెంట్ షాక్ వస్తోంది. తండా మొత్తం విద్యుత్ సరఫరా అస్తవ్యస్తమవడంతో.. ఫ్యాన్లకు, టీవీలకు, ఇంటి గేట్లకు, రేకులకు కరెంట్ సరఫరా అవుతోంది. దీంతో గ్రామస్థులంతా భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే ఉదయం గ్రామానికి చెందిన పాండ్య అనే వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ సరఫరా సరి చేయాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు. -
షార్టు సర్క్యూట్‌తో మినీ వ్యాన్ దగ్ధం
కంకిపాడు : ఇంజన్లో షార్టు సర్క్యూట్‌తో మంటలు చెలరేగి మినీ వ్యాన్ దగ్ధమైన సంఘటన మండలంలోని ఉప్పులూరు వంతెన సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. విజయవాడ రూరల్ మండలం నిడమానూరుకు చెందిన అరవపల్లి దుర్గారావుకు మినీ వ్యాన్ ఉంది. గోసాలకు కంకరు అన్లోడ్ చేసి వ్యాన్‌లో నిడమానూరు వెళ్లేందుకు ఉప్పులూరు మీదుగా బయలుదేరాడు. వ్యాన్ ఉప్పులూరు వంతెన వద్దకు చేరుకునే క్రమంలో ఇంజను వైర్లు షార్టు సర్క్యూట్‌కు గురై మంటలు రేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో వ్యాన్ నడుపుతున్న దుర్గారావు ఒక్కసారిగా వ్యాన్ని నిలిపివేసి వాహనం దిగేశాడు. మంటలు ఆర్పే ప్రయత్నంలో ప్రధాన గ్రామంలోకి వెళ్లాడు. అప్పటికే మంటలు వ్యాన్‌ను చుట్టుముట్టడంతో అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న గన్నవరం అగ్ని మాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. కుటుంబానికి జీవనాధారమైన వ్యాన్ మంటల్లో కాలిపోవటంతో దుర్గారావు బోరున విలపించాడు. -
పేదల బతుకులు బుగ్గి
- అగ్ని ప్రమాదంలో పది గుడిసెలు దగ్ధం - కాలి బూడిదైన సామగ్రి - కట్టుబట్టలతో బయటపడిన బాధితులు - రూ.25 లక్షల ఆస్తి నష్టం - బాధిత కుటుంబాలను గౌరు వెంకటరెడ్డి పరామర్శ కల్లూరు: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో కర్నూలు నగరం 36వ వార్డులోని మేదర వీధిలో పది గుడిసెలు దగ్ధమయ్యాయి. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనతో బాధితులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. మహిళా మేదరులు ఇంటి ముంగిట పనులు చేస్తుండగా విద్యుత్ వైర్లు అంటుకొని ఒక గుడిసెలో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడ్డాయి. గాలి ఉద్ధృతంగా మిగతా గుడిసెలు కూడా అగ్ని కీలల్లో చిక్కుకున్నాయి. ఇక్కడ ఉండే వారంతా కూలీలే కావడంతో వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లారు. ఉన్న కొంది మంది మంటలను అదుపు చేయలేకపోయారు. విషయాన్ని అగ్నిమాపక సిబ్బందికి చేరవేయడంతో వారు వచ్చి మంటలను ఆర్పేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. టిప్పర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న నారాయణ ఇంట్లో 20 తులాల వెండి, 2 తులాల బంగారు ఆభరణాలు, రూ.50 వేలు నగదుతో పాటు టైలరింగ్ దుస్తులు, గృహోపకరణాలు కాలి బూడిదయ్యాయి. అలాగే బేకరిలో పనిచేస్తున్న టీఎం ఎల్లయ్య ఇంట్లో బీరువాలో ఉంచిన రూ. లక్ష నగదు బంగారు, వెండి ఆభరణాలు కాలిపోయాయి. తిమ్మప్ప ఇంట్లో 25 తులాల వెండి ఆభరణాలు, పొదుపు సంఘంలో చెల్లించాల్సిన రుణం రూ.30 వేలు, అలాగే పి.శోభ ఇంట్లో.. ఆరు తులాల బంగారు, రూ.లక్ష నగదు బూడిదయింది. పెద్ద కుమార్తె వివాహం చేయాలనే ఆలోచనతో కూడబెట్టుకున్న డబ్బు కాలిపోయిందని ఆమె కన్నీటి పర్యంతమైంది. పి.శాంతమ్మ,, యాదమ్మ,, వెంకటేష్ , పరుశరాముడు , వెంకటేష్ , సవారమ్మ , హేమలత ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. మొత్తం రూ. 25 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. వీరంతా పేదలే. అగ్ని ప్రమాదంలో దాచుకున్నదంతా కాలిపోయి వీరి బతుకులు బుగ్గయ్యాయి. బాధితకుటుంబాలకు పరామర్శ.. అగ్ని ప్రమాద సమాచారం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఘటన స్థలానికి చేరుకొని బాధిత కుటంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు 5 బియ్యం ప్యాకెట్లు, 10 కిట్ల కిరాణం సరుకులు, రూ. 10 వేలు నగదుతోపాటు దుస్తులు అందజేశారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఆయనతోపాటు వార్డు ఇన్చార్జ్ ఆంజనేయులు, నాయకులు అంజి, ఇమ్మానియేలు, శ్రీను, శ్యామ్సన్, దేవా, కుమార్, మద్ది, జంగాల సుంకన్న తదితరులు ఉన్నారు. అలాగే బీజేపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి బాధిత కుటుంబాలను పరమార్శించి ఒక్కొక్క కుటుంబానికి రూ. 2 వేలు చొప్పున ఆర్థిక సహాయం చేశారు. మాజీ మంత్రి, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఏరాసు ప్రతాప్ రెడ్డి బాధిత కుటుంబాలను పరమార్శించి ఒక్కొక్క కుటుంబానికి వెయ్యి రూపాయల చొప్పున అందజేశారు. స్థానిక నాయకురాలు పార్వతమ్మ, శివకుమార్ బాధిత కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి రూ. 3 వేల నగదు అందజేశారు. -
రంగారెడ్డి కలెక్టరేట్లో అగ్ని ప్రమాదం
► వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తుండగా చెలరేగిన మంటలు ► ప్రాణభయంతో పరుగులెట్టిన అధికారులు సాక్షి, రంగారెడ్డి జిల్లా: సమయం మధ్యాహ్నం 2.50 గంటలు. ప్రశాంతంగా కొనసాగుతున్న వ్యవసాయ శాఖ వీడియో కాన్ఫరెన్స్ .. ఇంతలో ఒక్కసారిగా ఎగిసిన మంటలు.. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే చుట్టూ దట్టంగా ఆవహించిన పొగ.. ప్రాణభయంతో అధికారులు, సిబ్బంది పరుగులు.. బుధవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో కనిపించిన ప్రమాదకర దృశ్యాలివి. స్నేహ సిల్వర్ జూబ్లీ భవనం మొదటి అంతస్తులోని వీడియో కాన్ఫరెన్స్ హాలు అగ్నికి ఆహుతైంది. ఆ సమయంలో ఆ హాలులో 30 మందికిపైగా ఉండటం గమనార్హం. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీలో మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో పైన ఉన్న ఇంటీరియర్‌కు తాకాయి. అది ముందే ఏసీ హాలు. అన్ని కిటికీలు, ప్రధాన ద్వారం మూసి ఉన్నాయి. దీంతో అసలేం కనిపించనంత స్థాయిలో పొగ కమ్ముకోవడంతో.. బిక్కుబిక్కుమంటూ సిబ్బంది గ్రౌండ్‌ఫ్లోర్‌కి పరుగులు తీశారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. ‘సాక్షి’ హెచ్చరించినా..మేల్కొనని అధికారులు కలెక్టరేట్లో ఎక్కడ పడితే అక్కడ విద్యుత్ వైర్లు తేలి కనిపిస్తున్న తీరుపై ఇటీవలే ‘సాక్షి’ఫొటో స్టోరీని ప్రచురించింది. దీన్ని హెచ్చరికగా భావించి అధికారులు మేల్కోకపోవడం గమనార్హం. -
కలెక్టరేట్లో ప్రమాదం.. ఉవ్వెత్తున మంటలు
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. కొద్ది సేపట్లోనే మంటల తీవ్రత బాగా పెరిగింది. ఆ తర్వాత అగ్నిమాపక వాహనాలు అక్కడకు చేరుకుని మంటలు ఆర్పుతున్నాయి. అయితే, ఈ ప్రమాదం వల్ల నష్టం ఏ మేరకు వాటిల్లిందన్న విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. -
షార్ట్ సర్క్యూట్‌తో చిన్నారి మృతి
ముదిగుబ్బ : మండల పరిధిలోని దొరిగిల్లు క్వార్టర్స్‌లో సోమవారం రాత్రి షార్ట్ సర్క్యూట్ ప్రమాదంలో చిన్నారి చైతన్య (3) మృతి చెందాడు. దొరిగిల్లు బీసీ క్వార్టర్స్‌లో ప్రభాకర్, నారాయణ మ్మ నివాసం ఉంటున్నారు. వారి ఇంటి వద్ద విద్యుత్‌లైను, వేపచెట్టు సమీపంలోనే ఉన్నాయి. రాత్రి తీగలు చెట్టుపై పడటంతో ఆ ఇంటికి విద్యుత్ సరఫరా అయింది. చిన్నారి చైతన్య (3) చార్జింగ్ పెట్టిన సెల్‌ను పట్టుకోవడంతో విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. ముదిగుబ్బ ఆస్పత్రికి తరలించగా చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. -
ఇల్లు దగ్ధం
భీమవరం అర్బ న్ : స్థానిక గొల్లవానితిప్ప రోడ్డులోని డేగాపురం వద్ద బుధవారం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల ఇల్లు దగ్ధమైంది. స్థానికుల కథనం ప్రకారం.. డేగాపురంలోని యనమదుర్రు కాలువగట్టుపై కుంభా దుర్గారావు 15ఏళ్లుగా కుటుంబంతో నివాసముంటున్నాడు. వివాహాలకు కల్యాణ మండపాలు డెకరేష న్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం రాత్రి ఆయన భార్య, ముగ్గురు కుమార్తెలతో ఇంట్లో నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన దుర్గారావు పిల్లలు, భార్యతో కలిసి బయటకు పరుగులు తీశారు. మంటలు ఎగిసి పడడంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. ప్రమాదంలో డెకరేష న్ వస్తువులు, ఇంట్లోని గృహోపకరణాలు, రూ. 50 వేల నగదు అగ్నికి ఆహూతయ్యాయని దుర్గారావు విలపించారు. సుమారు రూ.లక్షా 80 వేలకు పైగా ఆస్తినష్టం వాటిల్లినట్టు స్థానికులు చెబుతున్నారు. అగ్నిప్రమాద బాధితులను ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ తిరుమాని ఏడుకొండలు కోరారు. ప్రమాదంలో సుమారు రూ.లక్ష ఆస్తినష్టం సంభవించినట్టు అగ్నిమాపక అధికారి షేక్ జా న్ అహ్మద్ తెలిపారు. -
ఇల్లు దగ్ధం
భీమవరం అర్బ న్ : స్థానిక గొల్లవానితిప్ప రోడ్డులోని డేగాపురం వద్ద బుధవారం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల ఇల్లు దగ్ధమైంది. స్థానికుల కథనం ప్రకారం.. డేగాపురంలోని యనమదుర్రు కాలువగట్టుపై కుంభా దుర్గారావు 15ఏళ్లుగా కుటుంబంతో నివాసముంటున్నాడు. వివాహాలకు కల్యాణ మండపాలు డెకరేష న్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం రాత్రి ఆయన భార్య, ముగ్గురు కుమార్తెలతో ఇంట్లో నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన దుర్గారావు పిల్లలు, భార్యతో కలిసి బయటకు పరుగులు తీశారు. మంటలు ఎగిసి పడడంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. ప్రమాదంలో డెకరేష న్ వస్తువులు, ఇంట్లోని గృహోపకరణాలు, రూ. 50 వేల నగదు అగ్నికి ఆహూతయ్యాయని దుర్గారావు విలపించారు. సుమారు రూ.లక్షా 80 వేలకు పైగా ఆస్తినష్టం వాటిల్లినట్టు స్థానికులు చెబుతున్నారు. అగ్నిప్రమాద బాధితులను ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ తిరుమాని ఏడుకొండలు కోరారు. ప్రమాదంలో సుమారు రూ.లక్ష ఆస్తినష్టం సంభవించినట్టు అగ్నిమాపక అధికారి షేక్ జా న్ అహ్మద్ తెలిపారు. ∙ -
షార్ట్ సర్క్యూట్‌తో షావల్ యంత్రం దగ్ధం
టేకులపల్లి: ఓపెన్ కాస్ట్లో మంగళవారం రాత్రి సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఓపెన్ కాస్ట్లో బొగ్గు తీసి లారీలో లోడ్ చేసే షావల్ యంత్రంలో మంటలు చెలరేగి యంత్రం పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలోని కొయ్యగూడెంలోని ఓపెన్ కాస్ట్లో చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ షావల్ యంత్ర ఆపరేటర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని స్థానికులు చెబుతున్నారు. -
కిలిగిరిలో భారీ అగ్ని ప్రమాదం
-
కలిగిరిలో భారీ అగ్ని ప్రమాదం
కిలిగిరి: నెల్లూరు జిల్లా కలిగిరిలో నేటి వేకువజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి 10 షాపులు దగ్ధమయ్యాయి. ప్రమాదం సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేలోపే షాపులు కాలిపోయి భారీ నష్టం సంభవించింది. వీటి విలువ దాదాపు రూ.10 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. -
రబ్బర్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి: జిల్లాలోని చేవెళ్ల మండలం చనువెల్లిలోని ఓ ఫ్యాక్టరీలో శుక్రవారం వేకువజామున అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక కోహినూరి ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయి. నిర్వాహకుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. కోట్లలో ఆస్తి నష్టం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.ఆస్తి నష్టం కోట్లలో ఉంటుందని సమాచారం. -
పాఠశాలలో అగ్నిప్రమాదం
మర్కుక్: సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి ప్రాథమిక పాఠశాలలో షార్ట్ సర్క్యూట్ అయింది. స్కూల్ వంటగదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, చుట్టుపక్కల మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
కారులో పొగలు..తప్పిన ప్రమాదం
హైదరాబాద్: దిల్సుఖ్నగర్ పరిధిలోని రాజీవ్ చౌక్ వద్ద ఏపీ 09సీక్యూ 3294 అనే నంబర్ గల వోక్స్వ్యాగన్ కారు ఇంజిన్ నుంచి ఒక్కసారిగా పొగలు వెలువడ్డాయి. పొగలకు కారులో ఉన్న 70 ఏళ్ల వృద్ధుడు ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. స్థానికులు వెంటనే అప్రమత్తమై వృద్ధుడిని రక్షించడంతో ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ వల్లే పొగలు వచ్చి ఉండవచ్చునని భావిస్తున్నారు. -
షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
అనంతపురం సెంట్రల్ : షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు వ్యాపించి ఇల్లు దగ్ధమైంది. వివరాల్లోకెళితే.. నెల్లూరుకు చెందిన భాస్కర్ అనంతపురంలోని సాయినగర్ మెయిన్ రోడ్డులో నివాసం ఉంటున్నాడు. పానీపూరి వ్యాపారం చేసుకుని జీవనం సాగించేవాడు. శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో షార్ట్‌సర్క్యూట్ కావడంతో మంటలు వ్యాపించాయి. టీవీతో పాటు దుస్తులు, సామాన్లు కాలిపోయాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న ఫైర్‌స్టేషన్ ఆఫీసర్ కె.పి.లింగమయ్య, సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. కాస్త ఆలస్యమై ఉంటే పక్కనున్న ఇళ్లకు మంటలు వ్యాపించే ప్రమాదం ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదంలో లక్ష రూపాయల దాకా నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. -
షార్ట్‌సర్క్యూట్: లారీలో మంటలు
గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం మండలం భార్గవీనగర్ వద్ద 16 వ నెంబర్ జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. నవతా ట్రాన్స్పోర్ట్కు చెందిన లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు లారీ డ్రైవర్ తెలిపారు. లారీలో ఉన్న సగం సరుకు కాలిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మేడ్చల్‌లో భారీ అగ్నిప్రమాదం
మేడ్చల్: మేడ్చల్‌లోని ఓ ఫ్రిజ్‌ల తయారీ కంపెనీలో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న రాక్వెల్ రిఫ్రిజిరేషన్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో లక్షల్లో ఆస్తి నష్టం సంభవించిందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి మంటలను అదుపులోకి తెస్తున్నారు. మంటల్లో పలువురు కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కుత్బుల్లాపూర్‌లో అగ్నిప్రమాదం
హైదరాబాద్: నగరంలోని కుత్బుల్లాపూర్ నందనగర్లోనో ఓ ఇంట్లో శనివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కాలనీలోని ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న సామాగ్రి దగ్ధమైంది. సుమారు రూ.3 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు సమాచారం. -
బద్వేలు ఎస్బీఐలో అగ్నిప్రమాదం
-
బద్వేలు ఎస్బీఐలో అగ్నిప్రమాదం
బద్వేలు: వైఎస్ఆర్ జిల్లా బద్వేలు పట్టణంలో స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచిలో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ రోజు ఉదయం బ్యాంకు తెరిచేసరికి లోపల షార్టు సర్క్యూట్ జరిగి దట్టమైన పొగ అలుముకుంది. బ్యాంకు సిబ్బంది వెంటనే బయటకు పరుగులు తీశారు. నోట్ల మార్పిడి కోసం బయట క్యూలో ఉన్న ఖాతాదారులు కూడా భయంతో పరుగులు తీశారు. బ్యాంకు అధికారులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా వారు వచ్చి మంటలను అదుపు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సర్వజనాస్పత్రిలో షార్ట్‌సర్క్యూట్
అనంతపురం మెడికల్ : అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో గురువారం సాయంత్రం షార్ట్‌సర్క్యూట్ జరగడంతో రోగులు బెంబేలెత్తారు. కాన్పుల వార్డులో సిజేరియ¯ŒS చేసిన తర్వాత బాలింతలను ఉంచే గదిలో ఉన్న స్విచ్‌బోర్డులో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీంతో వారికి తోడుగా గదిలోనే ఉన్న బంధువులు భయాందోâýæనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలియక బయటకు పరుగుతీశారు. అప్పటికే వార్డులో ఐదుగురు బాలింతలు ఉన్నారు. అంతలోనే సెక్యూరిటీ సిబ్బంది వచ్చి కరెంట్ సరఫరా నిలుపుదల చేశారు. విషయం తెలుసుకున్న ఆర్ఎంఓ వైవీ రావు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిపై ఆరా తీశారు. బాలింతలను మరో వార్డుకు తరలించారు. కాగా ఆస్పత్రిలో వైరింగ్ వ్యవస్థ సరిగా లేకపోవడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. -
షార్ట్ సర్క్యూట్‌తో లారీ దగ్ధం
చక్రాయపేట : మండలంలోని కల్లూరుపల్లె గ్రామం చెట్టోళ్లపల్లె అటవీ ప్రాంతంలో ఆగి ఉన్న లారీలో షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు వ్యాపించాయి. డ్రైవర్ అప్రమత్తమై ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందజేశారు. సిబ్బంది సంఘటనా ప్రదేశానికి చేరుకుని మంటలు ఆర్పేలోపే లారీలో చాలా భాగం దగ్ధమైంది. కార్యక్రమంలో ఫైర్‌స్టేషన్ ఎస్ఐ గాబ్రేల్, కానిస్టేబుళ్లు ఎస్.వెంకటరమణ, కె.రాంబాబు, నరసయ్య తదితరులు పాల్గొన్నారు. -
షార్ట్ సర్క్యూట్‌తో ఆప్టికల్ షాపు దగ్ధం
హిందూపురం అర్బన్ : పట్టణంలోని మెయిన్ బజారులో ఉన్న ఆప్టికల్ షాపు శుక్రవారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో పూర్తిగా దగ్ధమైపోయింది. గంట తర్వాత షాపులో నుంచి పొగలు వస్తుండటంతో స్థానికులు గమనించి షాపు నిర్వాహకుడు ఉమర్‌కు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకునే లోపు వస్తువులన్నీ కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. అప్పటికే షాపులో అద్దాలు, ప్లాస్టిక్ వస్తువులు, ఇతర వస్తువులన్నీ కాలిపోవడంతో రూ.5లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు. -
విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో రైతు మృతి
సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా ఘటన సంగం : సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌కు గురై ఓ రైతు మృతి చెందిన సంఘటన సంగం మండలంలోని సిద్దీపురం పంచాయతీ మజారా అనసూయనగర్‌లో సోమవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు అనసూయనగర్కు చెందిన అప్పగుంట ఆంజనేయులు (30) రైతు స్థానికంగా తన పొలంలో వేరుశనగ పంట సాగుచేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం పొలంలోకి వెళ్లి రాత్రి ఇంటికి వచ్చారు. పొలంలో పనిచేసి అలసిపోయిన ఆంజనేయులు ఇంట్లో సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టాలని భార్య ఆమనికి చెప్పాడు. తాను పనిచేస్తున్నానని, మీరే వెళ్లే చార్జింగ్ పెట్టాలని ఆమె భర్తకు చెప్పింది. దీంతో ఆంజనేయులు సెల్‌ఫోన్ చార్జింగ్‌లో పెట్టగా ఒక్కసారిగా విద్యుత్ షార్ట్‌సర్కూ్యట్ అయి చార్జర్ పేలిపోయింది. ఆంజనేయులు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. పెద్దగా శబ్ధం రావడంతో వెంటనే వచ్చిన భార్య ఆమని కిందపడి ఉన్న భర్తను చూసి కేకలు వేసింది. కుటుంబసభ్యులు, స్థానికులు వచ్చి చూసేసరికి ఆంజనేయులు మృతి చెంది ఉన్నాడు. కుటుంబ పెద్ద మృతి చెందడంతో భార్య, బిడ్డల రోదనలు మిన్నంటాయి. ఆంజనేయులుకు గతంలో వివాహమై భార్య మృతి చెందగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండో భార్య ఆమనికి సైతం ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త మృతితో నలుగురు చిన్నారులు అనాథలయ్యారు. మంగళవారం సమాచారం అందుకున్న సంగం ఎస్సై వేణు ఆంజనేయులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అందచేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
షార్ట్ సర్క్యూట్‌తో సెల్ టవర్ దగ్ధం
మామిడికుదురు : జాతీయ రహదారి పక్కన మామిడికుదురులోని ఏటీఎం సమీపంలో భవనంపై ఉన్న సెల్ టవర్ ఆదివారం అర్థరాత్రి దగ్ధమైంది. టవర్ అంతా మంటలు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అసలు ఏం జరిగిందో తెలియక అటూ ఇటూ పరుగులు తీశారు. షార్ట్సరŠూక్యట్ వల్ల ఈ సంఘటన జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. టవర్ పైభాగంలో అంటుకున్న మంటలు క్రమేపీ కిందవరకూ వ్యాపించాయని స్థానికులు పేర్కొన్నారు. ఈ టవర్ ద్వారా ఐడియా, ఎయిల్టెల్, వొడాఫో¯ŒS వినియోగదారులకు సేవలందుతున్నాయి. సెల్‌టవర్ కాలిపోవడంతో ఆయా సెల్ఫోన్లకు సిగ్నల్స్ అందక వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
షార్ట్‌సర్క్యూట్‌తో రెండిళ్లు దగ్ధం
నాలుగు కుటుంబాలు నిరాశ్రయం∙ రూ.4 లక్షల ఆస్తినష్టం గొల్లప్రోలు : చేబ్రోలులోని పల్లపువీధిలో శనివారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో రూ.4 లక్షల ఆస్తినష్టం ఏర్పడి, నాలుగు కుటుంబాలు నిరాశ్రయాలయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పక్క పక్క నున్న రెండు ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. పాలపర్తి రామన్నదొర, అతడి కుమారుడు దుర్గాబాబు నివాసం ఉంటోన్న ఇల్లు మొత్తం కాలిపోయింది. ఇంటిలో ఉన్న టీవీ, ఫ్యాను, ఎలక్టిక్రల్ గృహోపకరణాలు, బియ్యం, దుస్తులు బూడిదయ్యాయి. ముందు రోజు బ్యాంకు నుంచి తీసుకొచ్చిన డ్వాక్రా రుణం రూ.30 వేలు, అప్పు తీర్చేందుకు దాచి ఉంచిన రూ.20 వేలు మొత్తం రూ.50 వేలు కాలి బూడిదయ్యాయి. వీటితో పాటు ఇంటికాగితాలు, ఆధార్, రేష¯ŒSకార్డులు కూడా కాలిపోయాయి. కట్టుబట్టలతో మిగిలామని, రెక్కాడితేకానీ డొక్కాడని తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు. మరో ఇంటి ప్రమాదంలో... చుట్టలు చుట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న లింగం చిన్నయ్యదొర, అతడి కుమారుడు సూర్యప్రకాష్ ఉంటున్న ఇల్లు కూడా పూర్తిగా కాలిపోయింది. బ్యాంకులో నుంచి తీసుకొచ్చిన డ్వాక్రా రుణం రూ.50 వేలు, కూతురికి కొత్త దుస్తులు కొందామని దాచుకున్న రూ.20 వేలు కాలిపోయాయి. ఎలక్టిక్రల్, గృహోపకరణాలు, దుస్తులు, బూడిదయ్యాయి.వారు కట్టుబట్టలతో మిగిలారు. పేలిన గ్యాస్ సిలిండర్... అగ్నిమంటలకు చిన్నయ్యదొర ఇంటిలో ఉన్న సిలండర్ భారీ శబ్ధంతో పేలిపోయింది. పేలుడు దాటీకి సిలండర్లోని ఇనుప భాగాలు సుమారు వంద అడుగులు దూరంలో ఎగిసిపడ్డాయి. పేలుడు శబ్ధానికి గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న వారు బయటకు పరుగులు తీశారు. పిఠాపురం నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోపు ఇళ్లు మొత్తం కాలిపోయాయి. -
షార్ట్‌సర్క్యూట్‌తో గ్రాసం దగ్ధం
లేపాక్షి : వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి షార్ట్‌సర్క్యూట్ జరగడంతో ట్రాక్టర్లో తీసుకెళుతున్న మొక్కజొన్న సొప్ప దగ్ధమైంది. ట్రాలీ కూడా పాక్షికంగా దెబ్బతింది. వివరాల్లోకెళితే... లేపాక్షి గ్రామపంచాయతీలోని గలిబిపల్లికి చెందిన రైతు అంజనరెడ్డి పాడి పశువుల కోసం మొక్కజొన్న సొప్పను ఇతరుల వద్ద రూ.5వేలకు కొనుగోలు చేశాడు. ఈ సొప్పను శుక్రవారం మధ్యాహ్నం శ్రీనివాసులుకు చెందిన ట్రాక్టర్లో వేసుకుని ఇంటికి బయల్దేరాడు. తక్కువ ఎత్తులో వేలాడుతున్న విద్యుత్ తీగలను సొప్ప లోడుతో వెళుతున్న ట్రాక్టర్ తాకింది. దీంతో తీగలు ఒకటికొకటి తగులుకుని షార్ట్‌సర్క్యూట్ జరిగి నిప్పురవ్వలు సొప్పపై పడ్డాయి. అంతే క్షణాల్లో మంటలు వ్యాపించాయి. డ్రైవర్ వెంటనే అప్రమత్తమై ఇంజిన్ నుంచి ట్రాలీని వేరుచేయడంతో పెను ప్రమాదం తప్పింది. ట్రాలీతోపాటు మొక్కజొన్న సొప్ప కాలిపోయాయి. దాదాపు రూ.60వేల నష్టం వాటిల్లిందని ట్రాక్టర్ యజమాని శ్రీనివాసులు వాపోయాడు. విద్యుత్ వైర్లు కిందకు వేలాడుతుండడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని గ్రామస్తులు తెలిపారు. -
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు..
-తప్పిన ప్రమాదం విజయవాడ షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన విజయవాడ నగరంలోని చిట్టినగర్ వద్ద చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన కారులోని ప్రయాణికులు కారులో దిగేయడంతో ప్రమాదం తప్పింది. ఆ తర్వాత కారు అగ్నికి ఆహుతి అయింది. ప్రమాదసమయంలో కారులో ఐదుగురు ఉన్నారు. -
వరంగల్‌లో భారీ అగ్ని ప్రమాదం
శివనగర్‌లోని టీసీఐ ట్రాన్స్‌పోర్ట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి ప్రమాదం జరిగినట్లు ప్రాధమిక సమాచారం. ఈ ఘటనతో సుమారు రూ. కోటి ఆస్తినష్టం సంభవించినట్టు అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. -
అకస్మాత్తుగా మంటలు.. స్కార్పియో దగ్ధం
-
అకస్మాత్తుగా మంటలు.. స్కార్పియో దగ్ధం
వంగుటూరు(పశ్చిమగోదావరి జిల్లా): అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఓ స్కార్పియో కారు దగ్ధమైంది. ఈ సంఘటన వంగుటూరు మండలం నాచుగుంటలో మంగళవారం చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన ఓ కుటుంబం నెల్లూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారులో నుంచి పొగలు రావడం గమనించి అందులో ఉన్నవారు కిందగి దిగారు. అనంతరం కొద్దిసేపటికే మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమై ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
కోట్లలో నష్టం.. హైదర్‌నగర్‌లో ఘటన
హైదరాబాద్: షార్ట్ సర్క్యూట్‌తో నగరంలోని ఓ షాపింగ్‌మాల్‌లో మంటలు ఎగసిపడి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్‌నగర్‌లో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. బల్కంపేటకు చెందిన అశోక్ పాటిల్ కేపీహెచ్‌బీ లోని ధర్మారెడ్డి కాలనీలో శారదా సెలక్షన్స పేరుతో క్లాత్ షోరూంను నడుపుతున్నాడు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో షాపింగ్‌మాల్‌లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దీన్ని గమనించిన సెక్యూరిటీ గార్డు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేయగా, అప్పటికే సుమారు రెండున్నర కోట్ల విలువైన దుస్తులు దగ్ధమైనట్లు నిర్వాహకుడు పోలీసులకు తెలిపాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం
హైదరాబాద్ : కూకట్పల్లి హైదర్‌నగర్‌లో ఆదివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. షార్క్ సర్క్యూట్ కారణంగా బట్టల దుకాణంలో మంటలు చెలరేగాయి. ఆ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.... వెంటనే మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం సంభవించిందని దుకాణం యజమాని తెలిపారు. -
ఒకే రోజు రెండు అగ్ని ప్రమాదాలు
సుల్తాన్‌బజార్: నగరంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఒకే రోజు రెండు రెడీమేడ్ దుస్తుల దుకాణాల్లో అగ్నిప్రమాదాలు సంభవించడంతో రూ. లక్షల్లో ఆస్తినష్టం వాటిల్లింది. సుల్తాన్ బజార్, బోయిన్ పల్లిలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో దుకాణాలకు నిప్పంటుకుని దసరా పండుగకు తీసుకువచ్చిన రెడీమేడ్ వస్త్రాలు అగ్నికి అహుతయ్యాయి. వివరాల్లోకి వెళితే..ముసారాంబాగ్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్ సుల్తాన్ బజార్ జైన్‌మందిర్ సమీపంలో న్యూ స్వప్న ట్రేడర్స్ పేరుతో రెడీమేడ్ దుఖానం నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి దుకాణానికి తాళాలు వేసి ఇంటికి వెళ్లిన ప్రవీణ్‌కుమార్‌కు తెల్లవారుజామున షాపునకు నిప్పంటుకున్నట్లు స్థానికులు ఫోన్‌ద్వారా సమాచారం అందించారు. దీంతో అతను హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. సుల్తాన్ బజార్ పోలీసుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ దసరా పండుగ నేపథ్యంలో రూ. 1.5 కోట్ల స్టాక్ తెచ్చామని, సుమారు రూ. 60 లక్షల నుంచి రూ. 70 లక్షలు ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలిపాడు. సుల్తాన్ బజార్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు బోయిన్పల్లి ‘డెనిమ్’ షోరూమ్‌లో.. కంటోన్మెంట్: బోయిన్పల్లి ఫిలిప్స్ గోడౌన్ బ్రిడ్జి సమీపంలోని ఓ బట్టల దుకాణంలో మంగళవారం ఉదయం మంటలు చెలరేగి భారీ ఆస్తినష్టం వాటిల్లింది. వివరాల్లోకి వెళితే ప్రముఖ వస్త్రవ్యాపార సంస్థ ‘డెనిమ్’ బోయిన్పల్లి ప్రాంతంలో సంస్థ ప్రధాన కార్యాలయంతో పా టు కింది అంతస్తులో షోరూం నిర్వహిస్తోంది. మంగళవారం తెల్లవారుజామున దుకాణానికి నిపకపంటుకోవడంతో దుస్తులు కాలిబూడిదయ్యాయి, పై అంతస్తులోని కార్యాయంలో ఫర్నిచర్, ఫైళ్లు దగ్దమైనట్లు సమాచారం. షార్ట్సర్యూటే కారణమా? డెనిమ్ షోరూములో అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నా పూర్తి వివరాలు తెలియరాలేదు. ఫిలిప్స్ బ్రిడ్జి సమీపంలోని ఈ భవనం మీదుగా విద్యుత్ హైటెన్షన్ లైన్లు వెళ్తున్నాయి. ఇటవల బ్రిడ్జి విస్తరణ పనుల్లో భాగంగా పాత వంతెన కూల్చేసి విద్యుత్, మంచినీటి పైపులైన్ల తరలింపు పనులు చేపట్టడంతో షాపు ముందు వైర్లు బయటికి కనిపిస్తున్నాయి. మంగళవారం ఉదయం వర్షం కురియడంతో షార్ట్ర్క్యూట్ సంభవించి మంటలు చెలరేగి ఉండవచ్చునని అంచనా. -
రైస్‌మిల్లులో అగ్నిప్రమాదం
రూ.6 లక్షల వరకు నష్టం కొరుటూరు (ఇందుకూరుపేట): షార్ట్ సర్క్యూట్ కారణంగా రైస్‌మిల్లులో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని కొరుటూరులో ఉన్న ఆంజనేయస్వామి రైస్‌మిల్లు గోడౌన్లో ధాన్యాన్ని నిల్వ చేసి ఉన్నారు. గోడౌన్ గురువారం నుంచి పొగలు రావడంతో పని చేస్తున్న కూలీలు గమనించారు. తలుపులు తీసి చూసే సరికి మంటలు చెలరేగుతున్నాయి. వెంటనే చుట్టుపక్కల వాళ్లు మంటలు ఆర్పేందకు ప్రయత్నించారు. అప్పటికే మంటలు ఎగబాకి సుమారు 800 బస్తాల ధాన్యం కాలిపోయింది. రూ.6 లక్షల మేర నష్టం వాటిల్లిందని రైస్‌మిల్లు యజమాని ఆంజనేయలు తెలిపారు. -
వికారాబాద్‌లో షార్ట్‌సర్క్యూట్..
రూ.5 లక్షల ఆస్తి నష్టం వికారాబాద్ రూరల్: రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్తగడిలో మంగళవారం షార్ట్‌సర్క్యూట్ జరిగి ఆస్తినష్టం సంభవించింది. సుమారు 30 ఇళ్లల్లో ఈ ప్రమాదం కారణంగా ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయాయి. వెంకట్‌రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో భారీగా ఆస్తినష్టం సంభవించింది. టీవీ, రిఫ్రిజిరేటర్‌తో పాటు పలు విలువైన వస్తువులు బూడిదపాలయ్యాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద కాలనీలో రూ.5 లక్షల విలువ చేసే ఎల క్ట్రానిక్స్, ఫర్నిచర్ బూడిదైంది. -
కోకో తోటలో మంటలు
రాయన్నపాలెం (పెదవేగి రూరల్): పెదవేగి మండలం రాయన్నపాలెంలో విద్యుదాఘాతంతో కోకో తోటలు మంటలు చెలరేగాయి. ఎకరన్నర పొలం కాలిబూడిదయ్యింది. అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. రాయన్నపాలెం గ్రామానికి చెందిన కూచిపూడి వెంకట భాస్కరరావు కోకో పొలం మీదుగా 11 కేవీ విద్యుత్ తీగల లైన్ ఉంది. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో విద్యుత్ తీగల నుంచి నిప్పులు చెలరేగి మంటలు వ్యాపించాయి. దీంతో కోకో చెట్లు కాలిపోయాయి. స్థానికులు, ఏలూరు అగ్నిమాపక సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టినా ఫలితం లేదు. ప్రమాదంలో రూ.25 వేలు విలువైన డ్రిప్పులు, రూ.75 వేల పంట నష్టం వాటిల్లినట్టు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. మంటలను వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది నియంత్రించారు. -
షార్ట్ సర్క్యూట్‌తో దుకాణాల దగ్ధం
సూళ్లూరుపేట: పట్టణంలోని కూరగాయల మార్కెట్‌కు ఎదురుగా ఉన్న శేషాద్రి జనరల్ స్టోర్స్‌లో శనివారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎనిమిది షాపులు కలిగిన కాంప్లెక్స్ దగ్ధమైంది. శేషాద్రి జనరల్ స్టోర్స్ యజమాని రాత్రి 10 గంటలకు షాపు మూసేసి ఇంటికి వచ్చేశాడు. ఆ షాపులోపల మంటలు అంటుకుని వాసన రావడంతో చుట్టుపక్కల వారు వెళ్లి చూశారు. షాపులోని దట్టమైన పొగ వస్తున్నట్లు గుర్తించారు. వెంటనే షాపు యజమానికి తెలియజేశారు. షాపు డోర్ తెరవడంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. విద్యుత్, అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. విద్యుత్‌శాఖ వారు విద్యుత్ సరఫరాను అపేశారు. అగ్నిమాపక యంత్రంతో నీళ్లు పట్టినా మంటలు అదుపులోకి రాలేదు. దీంతో షార్ కేంద్రానికి ఫోన్ చేసి మరో యంత్రాన్ని తీసుకొచ్చారు. అలాగే నాయుడుపేటకు కూడా సమాచారం అందించి మరో ఫైరింజన్కూడా తీసుకొచ్చినా మంటలు అదుపులోకి రాలేదు. శనివారం అర్ధరాత్రి వరకు మంటలు అదుపులోకి రాలేదు. ఎనిమిది షాపుల్లో సరుకులన్నీ కాలి బూడిదయ్యాయి. భారీగా నష్టం వాటిల్లినట్టు తెలిసింది. -
షార్ట్‌సర్క్యూట్‌తో ల్యాండ్రి దగ్ధం
– భారీగా ఆస్తి నష్టం ఆత్మకూరురూరల్ : విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ సంభవించడంతో ల్యాండ్రి దగ్ధమైన సంఘటనలో విలువైన దుస్తులతో పాటు పట్టు చీరలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ సంఘటన ఆత్మకూరులో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బాధితులు, పోలీసుల సమాచారం మేరకు... పట్టణంలోని బీఎస్ఆర్ సెంటర్లో ఆర్.గురవయ్య 20 ఏళ్లుగా ల్యాండ్రి షాపు నిర్వహిస్తున్నాడు. చిరపరిచితుడు కావడంతో ల్యాండ్రిలో అధిక మంది ఉద్యోగులు, ఎల్‌ఆర్‌పల్లి, జేఆర్‌పేటలోని గృహస్తులు దుస్తులు ఇస్తుంటారు. శ్రావణమాసం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో 1000కి పైగా పట్టు చీరలు రోలింగ్, ఇస్త్రీ కోసం ఇచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ సంభవించడంతో దుకాణం అగ్నికి ఆహుతైంది. రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఆత్మకూరు పోలీసులు 1.30 గంటల సమయంలో దుకాణం నుంచి మంటలు వస్తుండడాన్ని గమనించి గురవయ్యకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఆత్మకూరు అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో దుకాణంలో ఉన్న విలువైన వస్త్రాలు, పట్టుచీరలు అగ్నికి ఆహుతి కావడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితుడు గురవయ్య వాపోతున్నాడు. -
షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్: నగరంలోని చందానగర్ గంగారం వద్ద ఉన్న సెంట్రో షాపింగ్ మాల్ లో శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. కొన్ని నిమిషాల్లోపే మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ వెలువడింది. దీంతో షోరూమ్ లోని వస్తువులన్నీ దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.