వడదెబ్బకు 14 మంది మృతి | 14 people died of sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బకు 14 మంది మృతి

Published Sat, May 30 2015 12:15 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

14 people died of sunstroke

నెట్‌వర్క్ : జిల్లాలో శుక్రవారం వీచిన వడగాడ్పులకు మొత్తం 14 మంది మృతి చెందారు. గుంటూరులో 42.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆయా మండలాల నుంచి అందిన సమాచారం మేరకు మృతుల వివరాలు ఇలా ఉన్నాయి. నరసరావుపేట వెంకటరెడ్డినగర్‌కు చెందిన చింతా మోహన్‌బాబు (54) నాదెండ్ల మండలం బుక్కాపురం గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.
 
 ఎండలకు  అస్వస్థతకు గురై మృతిచెందారు. రొంపిచర్ల మండలం అన్నారంలో యర్రగడ్డు నాగరాజు(30), సంతగుడిపాడులో గడిపిటి పెదగోపయ్య(54) మృతి చెందారు. కర్లపాలె ం మండలం ఎంవీ రాజుపాలెంలో గంపాల రామస్వామిరెడ్డి(48), మండల కేంద్రం చెరుకుపల్లిలో కోనేటి సంజీవరావు (19), ఇదే మండలం నడింపల్లికి చెందిన కొమ్మూరి మారుతిదేవి (35), వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడులో జొన్నలగడ్డ సుబ్బమ్మ (75), పెదనందిపాడు మండలం వరగానిలో కొరివి సంసోను (54), కాకుమాను మండలం తెలగాయపాలెం ఎస్సీ కాలనీలో కట్టా సుగుణమ్మ (80) వడగాడ్పులకు  మృతిచెందారు.
 
  మేడి కొండూరు  మండలం వెలవర్తిగ్రామం ఎస్సీ కాలనీలో జొన్నకూటి దాసు(60), వినుకొండ పట్టణం సీతయ్యనగర్‌లో ఎన్. సిద్ధయ్య (60), దాచేపల్లి మండలం తక్కెళ్లపాడులో జక్కా హనుమయ్య(80)వడదెబ్బకు మృతి చెందారు. అలాగే అమరావతిలో పులిపాటి కంచి వరదయ్య (75), పెదకూరపాడు మండలం 75 త్యాళ్లూరులో గోగులపాటి పాములు (65) వడగాడ్పులకు గురై మృతి చెందారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement