పెళ్లి వేడుకలో విషాదం | 2 died due to current shock in guntur district | Sakshi
Sakshi News home page

పెళ్లి వేడుకలో విషాదం

Published Mon, Jun 26 2017 11:30 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

2 died due to current shock in guntur district

పిడుగురాళ్ల: గుంటూరుజిల్లా పిడుగురాళ్ల మండలంలో ఓ వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. పిడుగురాళ్ల మండలం జానపాడులో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు దుర్మరణం చెందారు. వివాహ వేడుకలో బ్యానర్‌ కడుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. పెళ్లి కొడుకు తండ్రి ఇజ్రాయిల్‌(40), మరో బాలుడు అనిల్‌కుమార్‌(18) మృతిచెందారు.
 
ఫ్లెక్సీ కడుతుండగా గాలి రావడంతో అది వెనుక ఉన్న విద్యుత్‌ తీగలపై పడింది. బ్యానర్‌ను పట్టుకున్న ఐదుగురిలో ఇద్దరు మృతిచెందారు. గాయపడిన ముగ్గురికి పిడుగురాళ్లలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తారు. సోమవారం రాత్రి వివాహం జరగాల్సిన ఆ ఇంట విషాదం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement