పీసీసీ అంచనా.. ఎన్నికలకు ముందస్తు కసరత్తు
జనవరి నుంచి జిల్లాల్లో నాయకుల పర్యటనలు
హైదరాబాద్: పార్టీని ప్రక్షాళన చేసేందుకు కాంగ్రెస్ నాయకులు సిద్ధమవుతున్నారు. పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు వీలుగా జనవరి నుంచి నాయకులు జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించారు. ఇప్పటికే తమ పార్టీని వీడనున్న దాదాపు 30 మంది ఎమ్మెల్యేలను పీసీసీ గుర్తించింది. వీరిలో కొందరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి, మరికొందరు టీడీపీలోకి వెళ్తారని, తెలంగాణ ప్రాంత నేతలైతే టీఆర్ఎస్ వైపు కూడా వెళ్లొచ్చని అంచనా వేస్తోంది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఏఐసీసీ బృందం ముందుగా ఓ సర్వే చేపట్టనుంది. ఇక పార్టీని విడిచిపెట్టి వెళ్తారనుకుంటున్న ఎమ్మెల్యేలలో అత్యధికంగా కర్నూలు జిల్లాకు చెందినవారు నలుగురు, విశాఖకు చెందిన నలుగురు, తర్వాత.. శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అనంతపురం జిల్లాల నుంచి ఇద్దరేసి, కడప, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల నుంచి ఒక్కో ఎమ్మెల్యే ఉన్నారని పీసీసీ అంచనా వేసినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్కు 30 మంది ఎమ్మెల్యేల గుడ్బై!!
Published Sat, Dec 28 2013 1:49 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement