ఆయువు తీసిన అన్నంముద్ద | 8-month boy dies, as rice lump chokes windpipe | Sakshi
Sakshi News home page

ఆయువు తీసిన అన్నంముద్ద

Published Tue, Oct 29 2013 5:48 AM | Last Updated on Sat, Sep 2 2017 12:06 AM

8-month boy dies, as rice lump chokes windpipe

ధర్మపురి, న్యూస్‌లైన్: ప్రేమతో తినిపించిన గోరుముద్దలు బాలుడి నిండుప్రాణం తీశాయి. అప్పటివరకు తల్లిదండ్రుల ఒడిలో అల్లారుముద్దుగా ఆటలాడుకొన్న ఆ చిన్నారికి క్షణాల్లో నూరేళ్లు నిండాయి. కరీంనగర్ జిల్లా ధర్మపురిలోని తోట్లవాడకు చెందిన రాచకొండ శ్రీనివాస్-మనీష దంపతులకు కుమారులు మణిశేఖర్(5), శ్రీహర్షత్(8నెలలు) సంతానం. ఎప్పటిలాగే ఆదివారం సాయంత్రం శ్రీహర్షత్‌కు గోరుముద్దలు తినిపిస్తుండగా, గొంతులో ముద్ద అడ్డుపడి బాలుడికి ఊపిరాడలేదు. దీంతో తల్లిదండ్రులు హుటాహుటిన కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికి బాలుడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలుడి ఊపిరితిత్తుల్లోకి ముద్ద వెళ్లి ఊపిరాడక మృతిచెంది ఉంటాడని వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement