పవన్ కల్యాణ్కు విగ్రహం
తన అరాధ్య దైవం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ విగ్రహన్నిఏర్పాటు చేయాలని ఆయన అభిమాని భావించారు. అనుకున్నదే తడువుగా పవన్ కల్యాణ్ విగ్రహం తయారీకి ఆర్డర్ ఇచ్చారు. ఏడున్నర అడుగుల ఎత్తులో ఆ విగ్రహాం తయారై... తుది మెరుగులు దిద్దుకుంటోంది.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన చందు మోహన్కు పవన్ కల్యాణ్ అంతే విపరీతమైన అభిమానం. అంతేకాదు ఆయనను స్ఫూర్తిగా తీసుకున్నారు. అన్యాయం జరిగితే వెంటనే ప్రశ్నించాలన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు తనలో కదలికను తీసుకు వచ్చిందని... ఈ నేపథ్యంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ఈ విగ్రహాం ద్వారా పవన్ సందేశం మరింత సులువుగా జనంలోకి వెళ్తుందని మోహన్ అభిప్రాయపడ్డారు. ఏడున్నర అడుగుల ఎత్తు గల ఈ విగ్రహాన్ని బంకమట్టితో తయారు చేయించి... ఇత్తడి పూతతో మెరుగులు దిద్దుతున్నట్లు తెలిపారు. ఈ విగ్రహాన్ని పవన్ కల్యాణ్తో ఆవిష్కరించాలని భావిస్తున్నట్టు చెప్పారు. త్వరలో పవన్ కల్యాణ్ను కలసి ఆహ్వానిస్తానని మోహన్ వెల్లడించారు.