అతివలకు అండగా... | Advanced training in sewing work | Sakshi
Sakshi News home page

అతివలకు అండగా...

Published Tue, Jan 6 2015 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 7:15 PM

అతివలకు అండగా...

అతివలకు అండగా...

కుట్టు పనిలో అధునాతన శిక్షణ
కేంద్ర ప్రభుత్వం అండదండలు
ఉచిత సేవలందిస్తున్న అలీప్ సంస్థ
శిక్షణ... అనంతరం ఉపాధి

 
మహిళలు కొంగు బిగిస్తున్నారు... గరిటె తిప్పిన చేతితోనే అద్భుతాలు సృష్టిస్తున్నారు... వారిలో కళా నైపుణ్యానికి కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ మరింత చేయూతనిస్తోంది. ప్రభుత్వ అండదండలతో అలీప్ సంస్థ కుట్టు పనిలో, జూట్ వస్తువుల తయారీలో అధునాతన శిక్షణను ఉచితంగా అందిస్తోంది. ఉపాధి మార్గాలనుకూడా చూపుతోంది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని అతివలు మరింత ముందడుగేయాలని కోరుతోంది.
 
విశాఖపట్నం  చొరవ, పట్టుదల ఉన్న మహిళలకు ఆకాశమే హద్దు. సంకల్పం ఉండాలే గానీ సాధించలేనిది ఏదీ లేదు. అతి తక్కువ ఖర్చుతో స్వయం ఉపాధిని కల్పించుకునే విధంగా వారిని తీర్చిదిద్దాలనే సదుద్దేశంతో అలీప్ సంస్థ నడుం బిగించింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో ముందుకు సాగుతున్న ఈ సంస్థను ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించారు. రాష్ట్ర విభజన అనంతరం ఈ సంస్థ తమ శాఖను ఆంధ్రప్రదేశ్‌లో మొదటిగా విశాఖ నగరంలో ప్రారంభించింది. సీతమ్మధార ప్రాంతంలో ఉన్న ఈ సంస్థ కార్యాలయంలో కుట్టు పనిలో, జూట్ వస్తువుల తయారీలో అధునాతన శిక్షణ అందిస్తున్నారు.
 
జూట్ వస్తువులు

ఆధునికులను సైతం ఆకట్టుకునేలా జూట్ వస్తువులు చూడముచ్చటగా ఉంటున్నాయి. అటువంటి వస్తువులను ఎలా తయారు చేస్తారో.. నేర్చుకుంటే బాగుణ్ను అనే ఆలోచన కలుగుంది. కానీ వాటిని నేర్చుకోవాలంటే తయారు చేసే సామగ్రి కావాలి. నేర్పించే శిక్షకులు ఉండాలి. అన్నింటికి మించి ఆర్థిక స్థోమత కలగాలి.. ఇన్ని ఆలోచనల మధ్య అద్భుతమైన జూట్ వస్తువుల తయారీని నేర్చుకోవాలనే ఉద్దేశాన్ని చాలామంది మానుకుంటున్నారు. ఉచితంగా ఈ కోరికను తీర్చేందుకు అలీప్ సంస్థ ముందుకు వచ్చింది. సామగ్రిని  ఉచితంగా అందుబాటులో ఉంచడమే కాక, నిష్ణాతులైన ఉపాధ్యాయులచే శిక్షణ కల్పిస్తున్నారు. అంతేకాకుండా శిక్షణానంతరం ధ్రువ పత్రాన్ని కూడా అందజేస్తున్నారు. ఇంటిలో ఉపయోగించే కూరగాయల సంచులు, టేబుల్ కవర్‌లు, చేతి సంచులు, గోడకు తగిలించే సంచులు, డోర్ కర్టెన్లు వంటి వస్తువులెన్నింటినో మహిళలు స్వయంగా తయారు చేసుకొని ఉపాధి, ఉద్యోగం పొందవచ్చు.

మగ్గం నేయడం..

అధునాతన సౌకర్యాలతో రూపొందించిన పరికరాల సా యంతో వస్త్రాలను అతి వేగంగా తయారు చేస్తున్నారు. కానీ మన్నికలో అవి తీసికట్టే. ఒకప్పుడు మగ్గాలపై దుస్తులు నేసేవారు. అవి తరతరాలు చూసేవి. మగ్గంపై దుస్తులను తయారు చేసే విధానంలో కూడా అలీప్ సంస్థ శిక్షణ కల్పిస్తుంది. ఆర్యా వర్క్ నేర్పడం కోసం నిపుణుడైన అధ్యాపకుడిని కూడా ఏర్పాటు చేసింది.
 
టైలరింగ్‌లో అధునాతన శిక్షణ


 ఒకప్పుడు బట్టలు కుట్టాలంటే మెషీన్‌ను కాళ్లతో తొక్కేవారు. కానీ కాలానుగుణంగా పరికరాలు మారాయి. పరిజ్ఞానం పె రిగింది. ఆధునిక పద్ధతిలో దుస్తులు తయారవుతున్నాయి. దీనికి తగినట్లుగా అలీప్ సంస్థ శిక్షణ కల్పిస్తుంది. అత్యధిక వ్య యం కలిగిన మెషినరీని ఏర్పాటు చేసి నిష్ణాతులైన ఉపాధ్యాయులతో టైలరింగ్‌లో శిక్షణ కల్పిస్తుంది. అంతేకాకుండా శిక్షణ అనంతరం ధ్రువీకరణ పత్రంతోపాటు ఉపాధిని కూడా సంస్థ చూపిస్తుంది.
 
 మహిళలు సద్వినియోగపరచుకోవాలి..


 సంస్థ కల్పిస్తున్న అవకాశాన్ని మహిళలు సద్వినియోగపరచుకోవాలి.. కేవలం భర్త సంపాదనపైన ఆధారపడకుండా మహిళలు తమ స్వయం ఉపాధిని పెంపొందించుకోవాలి. సమాజంలో మగవారితో సమానంగా ముందుకు సాగాలి. కేవలం ఖాళీగా టీవీల ముందు కూర్చొని కాలాన్ని వృధా చేసే బదులు సంస్థలో చేరి ఉచితంగా శిక్షణ పొందండి. ఇక్కడ శిక్షణ పొందిన అనేకమంది వివిధ పరిశ్రమలలో ఉపాధిని పొంది ఉన్నత స్థాయిలో ఉండటమే కాకుండా, తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మా వద్దకు వస్తున్న వారిలో ఎక్కువమంది కుటుంబ బాధ్యత మోస్తున్న మహిళలే.    

     -సునీత, మేనేజరు, అలీప్ సీతమ్మధార శాఖ
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement