పంటభూములు ఇవ్వం | Agricultuer lands | Sakshi
Sakshi News home page

పంటభూములు ఇవ్వం

Published Thu, Apr 23 2015 3:46 AM | Last Updated on Sun, Sep 3 2017 12:41 AM

Agricultuer lands

 దగదర్తి: మండలంలోని దామవరం సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు రెవెన్యూ అధికారులు ప్రతిపాదించిన భూములకు సంబంధించి బుధవారం నుంచి సర్వేకు శ్రీకారం చుట్టా రు. ఈ సందర్భంగా మొదటిరోజు దగదర్తి, వెలుపోడు గ్రామాల సమీపంలోని భూములను సర్వే చేశారు. ఈ నేపథ్యంలో సర్వేను రైతులు అడ్డుకున్నారు. తమ భూములు ఇచ్చేదిలేదని తెగేసి చెప్పా రు. ఈ సందర్భంగా దగదర్తి రైతులు వెంకయ్య, వెంకటేశ్వర్లు, వెంకమ్మలు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పంటలు పండించుకుని జీవనం సాగిస్తు న్న సన్నకారు రైతుల భూములను విమానాశ్ర యం పేరుతో లాక్కుంటే ఊరుకునేది లేదన్నారు. ఎక్కువ మంది రైతులకు ఎకరా, అర ఎకరా భూమి ఉందని, ఆకాస్త భూమి ప్రభుత్వం తీసుకుంటే జీవనం ఎలాగ గడపాలని ఆరోపించారు.
 
 ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే..
 అనంతరం రైతులతో అధికారులు మాట్లాడటంతో వారు చల్లబడ్డారు. తర్వాత సర్వే చేశారు. కావలి డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేర కు దగదర్తి, వెలుపోడు, సున్నపుబట్టి, దామవరం సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు రెవెన్యూ అధికారులు ప్రతిపాదించిన భూముల్లో సర్వే నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మొదటి రోజు దాదాపు 75 ఎకరాలకు సంబంధించి సర్వే చేపట్టామన్నారు. సర్వే నంబర్లు ఆధారంగా భూమిపై ఉన్న రైతులను గుర్తించామన్నారు. సర్వే అనంతరం రెవెన్యూ అధికారులు అసలైన రైతులను పట్టాలు ఆధారంగా ఎంపిక చేస్తారన్నారు. వెలుపోడు నుం చి వరుసగా సర్వే చేపడుతున్నామని చెప్పారు.
 
  సర్వే చేపట్టే భూములు వివరాలు
 వెలుపోడులో పట్టా 95.45, డీఫారం 174.08, ప్రభుత్వభూమి 88.35 ఎకరాలు ఉన్నాయన్నారు. అలాగే దగదర్తిలో ప్రభుత్వ భూమి 25.62, అటవీభూమి 445.44 ఎకరాలు, (కొత్తపల్లి కౌరుగుంట) సున్నపుబట్టిలో పట్టా 20.96, డీఫారం 5.70, సీజెఎఫ్‌ఎస్ 303.45, ప్రభుత్వ భూమి 24.17, అటవీభూమి 163.60 ఎకరాలు, దామవరంలో పట్టా 272.30, డీఫారం 242.98, సీజెఎఫ్‌ఎస్ 181.85, ప్రభుత్వ భూమి 442.89 ఎకరాలు వెరసి మొత్తం 2,486.84 ఎకరాలకు సర్వే పట్టనున్నట్లు తెలిపారు. సర్వేయర్లు కామేశ్వరరావు, సూర్య నారాయణలు సిబ్బంది పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement