అన్ని అనుకూలిస్తే గుంటూరులోనే ఎయిమ్స్: కామినేని
అన్ని అనుకూలిస్తే గుంటూరులోనే ఎయిమ్స్: కామినేని
Published Sun, Jul 6 2014 9:57 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
గుంటూరు: పరిస్థితులన్ని అనుకూలిస్తే ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఇనిస్టిట్యూట్‌ను గుంటూరులోనే ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు.
త్వరలో రాష్ట్రంలోని వైద్య కాలేజీల నుంచి టెలి మెడిసిన్ విధానాన్ని ప్రవేశపెడతామని మంత్రి శ్రీనివాస్ అన్నారు. విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం నిబంధనల్ని ఉల్లంఘిస్తోందన్నారు.
కేంద్ర ప్రభుత్వాలు రూపొందించిన చట్టాలను బేఖాతరు చేస్తోందని.. ఆర్టికల్ 371 బి ని తెలంగాణ ప్రభుత్వం ధిక్కరిస్తోందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న పద్దతి సరైంది కాదని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.
Advertisement