పెట్రో షాక్ | ap govt rise to VAT on petrol | Sakshi
Sakshi News home page

పెట్రో షాక్

Published Sat, Feb 7 2015 12:21 AM | Last Updated on Tue, May 29 2018 4:18 PM

పెట్రో షాక్ - Sakshi

పెట్రో షాక్

 పెట్రో భారం  రూ. 1.68కోట్లు  (నెలకు)
డీజిల్ భారం రూ.67.20కోట్లు (నెలకు
)

‘పెట్రో’ చార్జీల పెంపుతో జనం విలవిల
విద్యుత్ వినియోగదారులపై పడనున్న రూ.480 కోట్ల భారం
పెట్రో,డీజిల్ వినియోగదారులపై రూ.826.16కోట్ల మోత
పెల్లుబికుతున్న ప్రజాగ్రహం
ఉపసంహరించుకోవాలంటూ వైఎస్సార్‌సీపీతో సహా  విపక్షాల డిమాండ్

 
సగటు జీవిపై సర్కార్ భారీవడ్డనకు పూనుకుంది. ఎడాపెడాచార్జీల మోత మోగి స్తుంది. ఒక వైపు విద్యుత్‌చార్జీలు..మరొక వైపు పెట్రోల్‌పై వ్యాట్ భారం వడ్డిస్తూ ఖజానాను  నింపుకునేందుకు సిద్దమైంది.
 
విశాఖఫట్నం : జిల్లాలో 11 లక్షల విద్యుత్ కనెక్షన్లున్నాయి. వీటిలో 8.27లక్షలమంది గృహ వినియోగదారులున్నారు. వీటిలో 0-100 యూనిట్లు వాడే వారు 5.03లక్షల మంది,101యూనిట్లు ఆపైనవాడే గృహ వినియోగ దారులు 3.24 లక్షల మంది ఉన్నారు. వందయూనిట్ల వినియోగించే వినియోగదారులు నెలకు 2.85కోట్ల యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. దీని వల్ల రూ.5.50కోట్లఆదాయం వస్తుంది. 101 యూనిట్లకు మించి విద్యుత్ వినియోగించే వినియోగదారులు నెలకు 6.4కోట్ల యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. దీని వల్ల రూ.25కోట్ల ఆదాయం వస్తుంది. ఎల్‌టీ సర్వీసులు కలిగిన వారి నుంచి 65కోట్ల ఆదాయం వస్తుంటే, హెచ్‌టీ సర్వీసులున్న వారి నుంచి రూ.170కోట్ల ఆదాయం వస్తుంది. ఈ విధంగా నెలకు విశాఖ సర్కిల్‌కు రూ.235 కోట్ల  ఆదాయం వస్తుంది. ఏప్రిల్-1 నుంచి విద్యుత్ చార్జీల ప్రకారం కేటగిరి వారీగా 10 నుంచి 15 శాతం చార్జీలు పెంచాలని ప్రతిపాదించారు.ఈ లెక్కన జిల్లా ప్రజలపై నెలకు రూ.40 కోట్ల వరకు భారం పడుతుంది.

కేంద్రం పెట్రోల్, డీజిల్‌ధరలను తగ్గిస్తుంటే ఆ మేరకు పన్నులభారం తగ్గించాల్సిన రాష్ర్ట సర్కార్ ఇదే అదనుగా వ్యాట్ భారం మోపింది. లీటర్‌కు రూ.4ల చొప్పున భారం వేయడంతో జిల్లాలో పెట్రోల్,డీజిల్ వినియోగదారులపై ఏటా రూ.826.16కోట్ల భారం పడుతుంది. సిటీలో 65వేల లీటర్ల పెట్రోల్, 5,500 కిలో లీటర్లు( 55 లక్షల) లీటర్ల డీజిల్ వినియోగిస్తుంటే, గ్రామీణ ప్రాంతంలో రోజుకు 85వేల లీటర్ల పెట్రోల్, లక్ష లీటర్ల డీజిల్ వినియోగిస్తుంటారు. మూడు రోజుల క్రితం తగ్గించిన ధరలకనుగుణంగా జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.60.46లు, డీజిల్ రూ.49.27లకు చేరడంతో వినియోగదారులు ఊరటచెందారు. ఇంతలోనే వారి ఆనందం ఆవిరైపోయేలా రాష్ర్ట సర్కార్ పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.4ల వ్యాట్‌భారం మోపింది. ఈ భారంతో పెట్రోల్ వినియోగదారులపై నెలకు రూ.1.68కోట్లు, ఏడాదికి రూ.20.16కోట్ల భారం పడుతుంటే, డీజిల్ వినియోగదారులపై నెలకు రూ. 67.20 కోట్లు, ఏడాదికి రూ.806కోట్ల మేర భారం పడుతుంది. ఈలెక్కన సరాసరిన జిల్లాలోని పెట్రోల్ డీజిల్ వినియోగదారులపై ఏకంగా రూ.826కోట్ల ఆరం పడుతుంది.

విద్యుత్ చార్జీలతో పాటు పెట్రోల్, డీజిల్‌పై మోపిన వ్యాట్ భారం నుంచి కష్టాల్లో ఉన్న విశాఖ వాసులకు మినహాయించాల్సింది పోయి ఈ విధంగా భారం మోపడం సరికాదని సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్ధిక లోటుసాకుతో అడ్డగోలుగా భారం మోపడం పట్ల వైఎస్సార్ సీపీతో సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు ఏక పక్షంగా ప్రభుత్వంతీసుకున్న నిర్ణయంపై మండిపడుతున్నారు. పెంచిన చార్జీలను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నారు. చార్జీలు తగ్గించకుంటే సామాన్యుల తరపున పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు ఆయా పార్టీల నేతలు సిద్ధమవుతున్నారు.
 


 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement