విజయవాడలో ఆరోగ్యమిత్రల ధర్నా
విజయవాడ (కృష్ణా జిల్లా) : ఆరోగ్యమిత్రలను విధుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. సోమవారం ఆరోగ్యమిత్ర ఉద్యోగులు రోడ్డెక్కారు. ఉపాధి కోల్పోయినవారు ప్రభుత్వానికి, చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ధర్నా నిర్వహించారు. రంగంలోకి దిగిన పోలీసులు ధర్నా చేస్తున్న ఆరోగ్య మిత్రలను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, వారికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు వారిని బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.