రొళ్ల: కళ్లు కనిపించని 20 ఏళ్ల ఓ అభాగ్యురాలిపై కామాంధుడు కన్నేశారు. ఎవరులేని సమయంలో ఆమెపై అత్యాచారయత్నం చేశారు. ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రొళ్ల ఏఎస్‌ఐ జగన్నాథ్‌నాయక్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని ఎల్‌కే పల్లివడ్రహట్టి గ్రామంలో నివాసం ఉంటున్న రంగప్ప అనే యువకుడు, అదే గ్రామానికి చెందిన రెండు కళ్లు కనిపించని, అంగవైకల్యం కలిగిన యువతిపై గురువారం ఆమె ఇంట్లో ఎవ రూ లేని సమయంలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భయంతో ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారు కనుగొని నిందితుని పట్టుకునేందుకు యత్నించారు. నిందితుడు తప్పించుకుని పారిపోయాడు. ఈ దుశ్చర్యపై శుక్రవారం సాయంత్రం బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.