ఏటీఎంలో కాలిన రూ.2వేల నోటు | Burnt note In ATM Mition West godavari | Sakshi
Sakshi News home page

ఏటీఎంలో కాలిన రూ.2వేల నోటు

Published Thu, Dec 7 2017 11:31 AM | Last Updated on Thu, Dec 7 2017 11:31 AM

Burnt note In ATM Mition West godavari - Sakshi

తణుకుటౌన్‌: తమకు వచ్చిన నోట్లను పదేపదే సరిచూసుకునే బ్యాంకు సిబ్బంది ఏటీఎంలో కాలిన రూ.2వేల నోటును పెట్టేశారు. ఈ నోటు పట్టణంలోని ఓ  ప్రైవేటు బీఈడీ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకుడు బోడపాటి సత్యనారాయణకు మంగళవారం సాయంత్రం  వచ్చింది. ఆయన రూ.15,000 ఉపసంహరణ చేయగా, అందులో ఓ రెండువేల నోటు కాలిపోయి ఉంది.

దీనిని బ్యాంకు అధికారులకు చూపించగా, తర్వాత మారుస్తామని చెప్పినట్టు సత్యనారాయణ వెల్లడించారు. సామాన్యుల నుంచి పెన్ను గీతలు, మరకలు ఉన్న నోట్లనే తీసుకోని బ్యాంకు అధికారులు ఇలా ఏటీఎంలలో కాలిన నోట్లు పెట్టడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement