చింతమనేనిపై కేసు నమోదు
దేవరపల్లి(పశ్చిమగోదావరి): విధి నిర్వాహణలో ఉన్న పోలీసులపై చేయిచేసుకున్న ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్సై జె. పాపారావు పై ఎమ్మెల్యే దాడి చేశారంటూ ఫిర్యాదు చేశారు.
దేవరపల్లి గ్రామంలో జరుగుతున్న అమ్మవారి జాతర సందర్భంగా ట్రాఫిక్ మళ్లిస్తుండగా.. అక్కడికి చేరుకున్న చింతమనేని దుర్భాషలాడుతూ దాడి చేశారని పేర్కొన్నారు. దీంతో ఆయనపై 323, 353, 506 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.