బాబును అడ్డుకున్న తెలంగాణవాదులు | Chandrababu Naidu faces Telangana fury in Damaracharla | Sakshi
Sakshi News home page

బాబును అడ్డుకున్న తెలంగాణవాదులు

Published Fri, Nov 1 2013 12:43 PM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

బాబును అడ్డుకున్న తెలంగాణవాదులు - Sakshi

బాబును అడ్డుకున్న తెలంగాణవాదులు

నల్గొండ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు తెలంగాణ సెగ తగిలింది. రాష్ట్ర విభజన విషయంలో రెండుకళ్ల సిద్ధాంతం అనుసరిస్తున్న ఆయనకు తెలంగాణవాదులు నల్లజెండాలతో నిరసన తెలిపారు. నల్గొండ జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబునాయుడును శుక్రవారం దామరచెర్ల వద్ద నిరసనకారులు అడ్డుకున్నారు. బాబు కాన్వాయ్కు అడ్డుపడి ....జై తెలంగాణ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

జిల్లాలోని వరద బాధిత ప్రాంతాల్లో బాబు పర్యటించి పంట నష్టపోయిన రైతులను పరామర్శిస్తారు. గురువారం రాత్రి గుంటూరు నుంచి జిల్లాలోని వాడపల్లికి చేరుకున్న ఆయన స్థానిక ఇండియా సిమెంట్స్ కంపెనీ అతిథి గృహంలో రాత్రి బసచేశారు.  దామరచర్ల మండలంలోని తాళ్లవీరప్పగూడెంలో రైతులను బాబు కలుస్తారు.

అక్కడి నుంచి మిర్యాలగూడ మండలం ఏడుకొండల తండాలో పర్యటిస్తారు. జేఎస్‌ఆర్ ఫంక్షన్‌హాల్ భోజనం అనంతరం వేములపల్లి మండలంలోని బుగ్గబావితండాలో పంట నష్టం తెలుసుకుంటారు. తిప్పర్తి మండలంలోని మామిడాల గ్రామంలో వరద బాధితులతో మాట్లాడుతారు. ఆ తర్వాత నేరుగా కట్టంగూరు చేరుకుంటారు. అక్కడ జరిగిన పంట నష్టం వివరాలు రైతులను అడిగి తెలుకుంటారు. మరోవైపు చంద్రబాబు పర్యటించే ఆయా మండలాల్లో తెలంగాణవాదుల నుంచి నిరసనలు వ్యక్తం కాకుండా టీడీపీ నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement