హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలతో పాటు, తాజా రాజకీయాలపై చర్చ జరిగినట్లు సమాచారం. కాగా తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని గవర్నర్కు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఛత్తీస్‌గఢ్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న కేసీఆర్ సోమవారం రాత్రి నేరుగా రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్‌తో భేటీ అయ్యారు. కృష్ణా రివర్ బోర్డు తీర్పు, అసెంబ్లీ సమావేశాలు, ఛత్తీస్‌గఢ్ పర్యటన, కరెంటు, నదీజలాలపై ఈ మధ్య చోటుచేసుకున్న పరిణామాలు, వాటికి సంబంధించిన రికార్డులు, జీవోలు వంటివి గవర్నర్‌కు వివరించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
గవర్నర్తో చంద్రబాబు నాయుడు భేటీ
Published Tue, Nov 4 2014 9:26 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement