బస్సు ప్రమాదంపై చిరంజీవి, బాలకృష్ణ దిగ్భ్రాంతి | Chiranjeevi, Balakrishna express their condolence on anantapur bus accident | Sakshi
Sakshi News home page

బస్సు ప్రమాదంపై చిరంజీవి, బాలకృష్ణ దిగ్భ్రాంతి

Published Wed, Jan 7 2015 1:27 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

బస్సు ప్రమాదంపై చిరంజీవి, బాలకృష్ణ దిగ్భ్రాంతి - Sakshi

బస్సు ప్రమాదంపై చిరంజీవి, బాలకృష్ణ దిగ్భ్రాంతి

అనంతపురం: అనంతపురం జిల్లాలో పల్లె వెలుగు బస్సు ఘోర ప్రమాద ఘటనపై కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి బుధవారం హైదరాబాద్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన ఒక్కొక్కరికి రూ. 15 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. అలాగే ఈ ప్రమాదంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు హరికృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మడకశిర నుంచి పెనుగొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సు బుధవారం ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి.. లోయలో పడింది. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మెరుగైన వైద్య చికిత్స కోసం బెంగళూరు తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement