పగాకు ....
పొగాకు రైతులకు ఈ సీజన్‌లో మిగిలింది అప్పులే..
బ్యారెన్‌కు రూ.2లక్షల వరకు నష్టం
తిరిగి విధుల్లో చేరిన బోర్డు చైర్మన్
గుంటూరు పొగాకు రైతులకు ఈ సీజను అప్పులనే మిగిల్చింది. ఏ రైతును కదిలించినా బ్యారెన్‌కు లక్ష నుంచి రెండు లక్షల రూపాయల అప్పులే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ బాధను తట్టుకోలేక ఇప్పటికే 11 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా, ఇద్దరు గుండె ఆగి మృతి చెందారు. ఈఏడాది మార్చి11న ప్రారంభమైన పొగాకు వేలం ఒకటి రెండు రోజుల్లో పూర్తికానుంది.
సెప్టెంబరు 31 వరకు రాష్ట్రంలోని పొగాకు వేలం కేంద్రాల్లో 189.96 మిలియన్ కేజీల పొగాకు అమ్మకాలు జరిగాయి. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని పొగాకు అమ్మకాలు పూర్తికాగా, ఉభయ గోదావరి జిల్లాల్లో మరో వారం రోజులు జరగనున్నాయి.