ఈవీఎం గొడౌన్‌లో కంటైనర్ల నుంచి దించుతున్న వీవీ ప్యాట్ యూనిట్ బాక్సులు
ఆరిలోవ(విశాఖతూర్పు): ఎన్నికలు సమీపిస్తుండటంతో జిల్లా అధికారులు ఓటింగ్ యంత్రాల సేకరణలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా రెవెన్యూ అధికారులు బెంగుళూరు నుంచి ఈవీ ఎంలు, వీవీ ప్యాట్ యూనిట్లు, కంట్రోల్ యూని ట్లను తీసుకొస్తున్నారు. రెండు రోజుల క్రితం ఇక్కడికి 12,967 ఈవీఎంలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వాటితో పాటు ఆదివారం బెంగుళూరు నుంచి 10 కంటైనర్లలో 10,180 వీవీ ప్యాట్ యూ నిట్లను తీసుకొచ్చారు.
రూరల్ తహసీల్దారు కార్యాలయం పక్కనే ఉన్న ఓటింగ్ యంత్రాల భద్రతా గొడౌన్‌లో భద్రపరిచారు. వాటిని ఇక్కడ రూరల్ డిప్యూటీ తహసీల్దారు రవిశంకర్, రెవెన్యూ సిబ్బంది సమక్షంలో పోలీస్ బందోబస్తు నడుమ కంటైనర్ల నుంచి గొడౌన్‌కు తరలించారు. వీటితో పాటు ఇక్కడ మరో 10,130 కంట్రోల్ యూనిట్స్ తీసుకొచ్చామని డీటీ తెలిపారు. వీటిని భద్రపరిచే గొడౌన్ వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment